ఓ వ్యక్తి అడ్డుగా రావడంతో.. సాఫ్ట్‌వేర్‌ ఉద్యోగి ఒక్కసారిగా.. | - | Sakshi
Sakshi News home page

ఓ వ్యక్తి అడ్డుగా రావడంతో.. సాఫ్ట్‌వేర్‌ ఉద్యోగి ఒక్కసారిగా..

Published Thu, Oct 19 2023 1:40 AM | Last Updated on Thu, Oct 19 2023 11:15 AM

- - Sakshi

సాక్షి, కరీంనగర్‌: హైదరాబాద్‌లో జరిగిన రోడ్డు ప్రమాదంలో ఓ సాఫ్ట్‌వేర్‌ ఉద్యోగి మృతిచెందాడు. దీంతో అతని స్వగ్రామం కరీంనగర్‌ మండలంలోని మొగ్ధుంపూర్‌లో విషాదం నెలకొంది. గ్రామస్తుల వివరాల ప్రకారం.. మొగ్ధుంపూర్‌కు చెందిన సీహెచ్‌.రాజిరెడ్డి–ఊర్మిళ దంపతులకు ఇద్దరు కూతుళ్లు, ఒక కుమారుడు ఉన్నారు. రాజిరెడ్డి ప్రస్తుతం రాజన్న సిరిసిల్ల జిల్లా వీర్నపల్లి పోలీస్‌స్టేషన్‌లో ఏఎస్సైగా పని చేస్తున్నారు. ఇద్దరు కూతుళ్లకు వివాహాలు కాగా కుమారుడు సఖేందర్‌రెడ్డి(26) హైదరాబాద్‌లో సాఫ్ట్‌వేర్‌ ఉద్యోగిగా పని చేస్తున్నాడు.

వనస్థలిపురంలోని తన సోదరి సంయుక్త ఇంట్లో ఉంటూ విధులకు హాజరవుతున్నాడు. ఈ క్రమంలో బుధవారం ఉదయం 5.30 గంటలకు బైక్‌పై పని నిమిత్తం బయటకు వెళ్లాడు. ఓ వ్యక్తి అడ్డుగా రావడంతో అతన్ని తప్పించే క్రమంలో కిందపడి, తీవ్రంగా గాయపడ్డాడు. స్థానికులు వెంటనే ఓ ప్రైవేట్‌ ఆస్పత్రికి తరలించగా చికిత్స పొందుతూ మృతిచెందాడు. చేతికి అందివచ్చిన కొడుకు ప్రమాదంలో మృతిచెందడంతో అతని తల్లిదండ్రులు, అక్కలు కన్నీరుమున్నీరుగా విలపించారు. అది చూసి, స్థానికులు కంటతడి పెట్టారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement