పెరిగింది 2 శాతమే | only 2 percent voters increased in general elections | Sakshi

పెరిగింది 2 శాతమే

Published Fri, May 2 2014 1:36 AM | Last Updated on Mon, Sep 17 2018 6:08 PM

only 2 percent voters increased in general elections

మోర్తాడ్/కలెక్టరేట్, న్యూస్‌లైన్:  ఈ సాధారణ ఎన్నికల్లో జిల్లాలో పోలింగ్ శాతం స్వల్పంగా పెరిగింది. 2009 ఎన్నికల్లో 70.75 శాతం నమోదు కాగా, ఈసారి 72.12 నమోదైంది. పోలింగ్ శాతాన్ని 90కి పెంచాలనే ఎన్నికల సంఘం ఆదేశాల మేరకు, ఆ దిశగా జిల్లా అధికార యంత్రాం గం తీవ్రంగా కృషిచేసింది.అయినప్పటికీ గతంలో మాదిరిగానే పోలింగ్ శాతం నమోదు కావడంతో అధికారులకు మింగుడుపడటం లేదు.ఎన్నడూ లేనివిధంగా పెద్ద ఎత్తున ప్రచారం చే శారు.

 అయినా 2009 సాధారణ ఎన్నికలతో పోల్చితే ఈ ఎన్నికల్లో కేవలం రెండు శాతం పోలింగ్ మాత్రమే పెరిగింది. మునుపటికంటే ఇప్పటి ఎన్నికల్లో ఓటర్ల సంఖ్య భారీగా పెరిగింది. కాని పోలింగ్ శాతంలో మాత్రం మార్పు రాకపోవడం అధికారులను విస్మయానికి గురిచేస్తోంది.పోలింగ్ సమయాన్ని ఎన్నికల కమిషన్ ఈసారి పెంచింది. గతంలో ఉదయం ఏడు గంటల నుంచి సాయంత్రం ఐదు గంటల వరకు పోలింగ్ జరిగేది. కాని ఈసారి గంట సమయం పెంచి సాయంత్రం ఆరు గంటల వరకు కొనసాగించింది. అయినా ఓటింగ్ శాతం మాత్రం పెరగలేదు.

 ప్రచారం చేసినా...
 పోలింగ్ శాతం పెంచడానికి అధికారులు ఓటరు చైతన్య కార్యక్రమాలు చేపట్టారు. ఓటు హక్కు ఆవశ్యకతను వివరిస్తూ పెద్ద ఎత్తున ప్రచారం నిర్వహించా రు.పోలింగ్ శాతాన్ని 90కి పెంచాలని ఎన్నికల కమిషన్ జిల్లా కలెక్టర్‌లను ఆదేశించింది. దీంతో పోలింగ్ తేదీని వివరిస్తూ, ఓటు హక్కును వినియోగించుకో వాలని కోరుతూ ప్రధాన ప్రాంతాలలో పెద్దపెద్ద ఫ్లెక్సీలను ఏర్పాటు చేశారు. వాల్ రైటింగ్, కరపత్రా లు, టీవీ, దినపత్రికల్లో భారీగా ప్రకటనలు వేశారు. ప్రచార వాహనాలు ఏర్పాటు చేసి ఊరువాడా ఊదరగొట్టారు.

 బీఎల్‌వోల ద్వారా పోల్ చిట్టీలను పంపిణీ చేశారు. పోల్ చిట్టీలు అందని వారికి పోలింగ్ కేంద్రా ల వద్దనే అందించే ఏర్పాట్లు చేశారు. మధ్యాహ్నం వరకు ఓటు హక్కు వినియోగించుకోని వారి వివరాలను బీఎల్‌వోలు సేకరించి, ఓటర్లను పోలింగ్  కేంద్రాలకు రప్పించే ఏర్పాట్లు చేశారు. అభ్యర్థుల ప్రచారాన్ని తలపించేలా అధికారులు  ప్రచారం నిర్వహించారు.  ఇంత చేసినా స్వల్పంగానే పోలింగ్ శాతం పెరిగింది.

 జిల్లాలో...
 తొమ్మిది నియోజకవర్గాల్లో 2009 ఎన్నికల్లో 16,63,721 మంది ఓటర్లు ఉండేవారు. ప్రస్తుత సాధారణ  ఎన్నికల్లో ఆ సంఖ్య 18,53,288కు చేరిం ది. ఐదేళ్లలో ఓటర్ల సంఖ్య 1,89,567 పెరిగింది. 2009 ఎన్నికల్లో 11,72,092 మంది ఓటు హక్కును వినియోగించుకున్నారు. ఈ ఎన్నికల్లో 13,26,220 మంది మాత్రమే ఓటు హక్కును వినియోగించుకున్నారు. గతంలో కంటే ఓటర్ల సంఖ్య పెరిగినా... పోలింగ్ ఒక్క శాతమే పెరిగింది. గత ఎన్నికల్లో  70.75 శాతం పోలింగ్ నమోదైతే, ఈసారి 72.12 శాతం పోలింగ్ నమోదైంది. ఈ ఎన్నికల్లో 90 శాతం అంటే 16,67,960 మంది ఓటు హక్కును వినియోగించుకుంటారని అధికారులు అంచనా వేశారు. అధికారులు అంచనా వేసిన దానికంటే 3,41,740 మంది తక్కువగా ఓటు హక్కును వినియోగించుకున్నారు.

 ఎల్లారెడ్డిలో అత్యధికం.. అర్బన్‌లో అత్యల్పం...
 జిల్లాలోని నియోజకవర్గాల్లో పోలింగ్ శాతాన్ని పరిశీలిస్తే ఎల్లారెడ్డి నియోజకవర్గంలో అత్యధికంగా 78.74 శాతం పోలింగ్ నమోదైంది. నిజామాబాద్ అర్బన్ నియోజకవర్గంలో అత్యల్పంగా  52.30 పోలింగ్ శాతం నమోదైంది. జిల్లాకేంద్ర స్థానం, ఎక్కువ మంది విద్యావంతులు ఉండే అర్బన్ నియోజకవర్గంలో పోలింగ్ శాతం తగ్గడంపై ప్రజాస్వామ్యవాదులు విచారం వ్యక్తం చేస్తున్నారు. వెనుకబడిన జుక్కల్ నియోజకవర్గంలో కూడా 78 శాతం పోలింగ్ నమోదు కావడం విశేషం. మిగిలిన ఆరు నియోజకవర్గాల్లో 70 శాతంకు పైగా పోలింగ్ నమోదైంది.

 కారణాలు ఇవేనా...?
 పోలింగ్ శాతం పెరగక పోవడానికి పలు కారణాలు ఉన్నాయని పరిశీలకులు చెబుతున్నారు. ఓటర్ల జాబి తాల్లో ఒక్కొక్కరికి రెండేసి ఓట్లు ఉండటం, కొందరికి తమ సొంత గ్రామంలో, తాత్కాలికంగా నివాసం ఉంటున్న ప్రాంతాల్లో ఓటు హక్కు ఉండటం వల్ల ఒకేచోట ఓటు హక్కును వినియోగించుకునే వీలు ఉంది. దీంతో ఒక చోట ఓటు హక్కు వినియోగించుకోక పోవడంతో పోలింగ్ శాతం పెరగక పోవడంపై ప్రభావం చూపిందని అభిప్రాయం వ్యక్తం చేస్తున్నా రు. ఓటరు జాబితాలో పేర్లు ఉండి స్థానికంగా నివాసం ఉండని వారి పేర్లను నాన్ అవెలబిలిటీ, ఆప్‌సెంట్ జాబితాలో చేర్చాల్సి ఉంది.

ఒకవేళ ఓటరు తన వద్ద ఉన్న ఆధారాల ను తీసుకువస్తే ఎన్‌వోబీ జాబితాలో ఉన్న వారికి ఓటు వేసే వీలును కల్పించాలని అధికారులు నిర్ణయం తీసుకున్నారు. ఈ ఎన్నికల్లోనే ఎన్‌వోబీ జాబితాను ప్రత్యేకంగా తయారు చేశారు. కాగా ఎన్‌వోబీ జాబితాలో ఎక్కువ మంది పేర్లను చేర్చలేదు. స్థానికంగా నివాసం ఉండకున్నా... సాధారణ ఓటరు జాబితాలోనే పేర్లు ఉండటంతో పోలింగ్ శాతంలో తేడాలకు ప్రధాన కారణం అయ్యిందని పరిశీలకులు చెబుతున్నారు. అలాగే మండుతున్న ఎండలు, పాలకుల తీరుపై విసుగు ఒక కారణంగా బావిస్తున్నారు. ఈసీ, అధికారయంత్రాం గం ఇన్ని చర్యలు తీసుకున్నా పోలింగ్ శాతం పెరగక పోవడం వారిని నిరాశకు గురిచేసింది.

 నిజామాబాద్ ఎంపీ స్థానంలో 68.41
 నిజామాబాద్ పార్లమెంట్ స్థానానికి 68.41 శాతం పోలింగ్ నమోదైంది. నిజామాబాద్ పార్లమెంట్ పరిధిలో ఆర్మూర్, బోధన్, నిజామాబాద్ అర్బన్, నిజామాబాద్ రూరల్, బాల్కొండ, కోరుట్ల,జగిత్యా ల నియోజకవర్గాలు ఉన్నాయి. దీని పరిధిలో మొత్తం 14,95,957 మంది ఓటర్లు ఉండగా, 10,23,522 మంది ఓట్లు పోలయ్యాయి.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

Photos

View all
Advertisement