The right to vote
-
ఐఈడీ కన్నా ఓటర్ ఐడీ గొప్పది: మోదీ
అహ్మదాబాద్: ఉగ్రవాదుల ఐఈడీ (ఆధునీకరించిన పేలుడు పరికరం) కన్నా ఓటర్ ఐడీ (గుర్తింపు కార్డు) శక్తిమంతమైనదని మోదీ అన్నారు. అహ్మదాబాద్‌లో మోదీ తన ఓటు హక్కును వినియోగించుకున్నారు. ‘ఒకవైపు ఐఈడీ ఉగ్రవాదుల ఆయుధమైతే , మరోవైపు ఓటరు ఐడీ ప్రజాస్వామ్య ఆయుధం. ఐఈడీ కన్నా ఓటరు ఐడీ శక్తిమంతమైనదని విశ్వసిస్తున్నా’ అని అన్నారు. బీజేపీ అధ్యక్షుడు అమిత్ షా మోదీకి తోడుగా పోలింగ్ బూత్ వరకు వచ్చారు. మోదీ గాంధీనగర్‌లోని రాజ్‌భవన్‌లో సోమవారం బసచేసి, ఉదయం ఓటు వేయడానికి ముందు ఇంటికెళ్లి తల్లిని కలిశారు. తల్లి హీరాబా నుంచి శాలువా, కొబ్బరికాయ, స్వీట్లు స్వీకరించారు. తల్లి పాదాలకు నమస్కరించి, ఆశీర్వాదం తీసుకుని ఓటు వేసేందుకు వచ్చారు. అనంతరం హీరాబా కూడా గాంధీనగర్ సమీపలోని రైసన్ గ్రామంలో ఓటు వేశారు. గుజరాత్లో మొత్తం 26 లోక్‌సభ స్థానాలుండగా, అన్ని చోట్లా మంగళవారం పోలింగ్ ముగిసింది. పీఎం పదవినే మమత కొనేవారు పీఎం పదవికి వేలం కానీ నిర్వహించేలా ఉండుంటే పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ ఆ పదవిని నారద, Ô >రద కుంభకోణాల్లో సంపాదించిన డబ్బుతో కొనేవారని మోదీ ఎద్దేవా చేశారు. ఆ డబ్బులతో మమత పీఎం పదవి కొనలేకపోయినందుకు తాను ఆమెపై జాలి పడుతున్నానన్నారు. బెంగాల్లో బలవంతపు వసూళ్లకు మమత పాల్పడుతున్నారని ఆరోపిస్తూ, ఆమె ప్రధాని అయితే దేశం మొత్తాన్నీ వదలరని అన్నారు. బెంగాల్‌లోని అసన్సోల్లో మోదీ మంగళవారం ప్రచారం చేశారు. -
ఎలక్షన్ డ్యూటీ సర్టిఫికెట్తో ఓటేయొచ్చు
సాక్షి, హైదరాబాద్: ఎన్నికల విధుల్లో పాల్గొనే అధికారులు, సిబ్బంది ఇకపై ఎలక్షన్ డ్యూటీ సర్టిఫికెట్ (ఈడీసీ)తో నియోజకవర్గంలోని ఏ పోలింగ్ కేంద్రం నుంచైనా ఓటు హక్కును వినియోగించుకునే అవకాశం పొందనున్నారు. ఓటు కలిగి ఉన్న నియోజకవర్గంలోనే ఎన్నికల విధులు నిర్వహించేవారికి ఈ సర్టిఫికెట్ జారీ చేస్తారు. వారు ఆ నియోజకవర్గంలోని ఏ పోలింగ్ కేంద్రంలోనైనా ఓటేసే అవకాశం పొందనున్నారు. ఏప్రిల్ 11న రాష్ట్రంలో జరగనున్న లోక్‌సభ సాధారణ ఎన్నికల నిర్వహణ విధుల్లో పాలుపంచుకోనున్న 2.8 లక్షల మంది అధికారులు, సిబ్బందిలో అధిక శాతం ఈడీసీ ద్వారా ఓటు హక్కును వినియోగించుకునే సదుపాయాన్ని పొందబోతున్నారని రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి (సీఈవో) రజత్‌కుమార్ తెలిపారు. ఓటు ఉన్న నియోజకవర్గం కాకుండా వేరే ప్రాంతంలో పనిచేసే ఎన్నికల అధికారులు, సిబ్బందికి పోస్టల్ బ్యాలెట్ ద్వారా ఓటేసే అవకాశం కల్పిస్తామన్నారు. ఈడీసీ, పోస్టల్ బ్యాలెట్ల జారీ ప్రక్రియను అత్యంత పారదర్శకంగా నిర్వహించేందుకు ‘పీబీ సాఫ్ట్’అనే సాఫ్ట్వేర్ రూపొందించామన్నారు. ఎన్నికల విధుల్లో ఉన్న వారందరూ వారికి సంబంధించిన 12/12ఏ ఫారంను తప్పుల్లేకుండా నింపి, ఎన్నికల విధి నిర్వహణ వివరాలను జతపరిచి వారం రోజుల్లోగా సంబంధిత జిల్లా కలెక్టర్‌ను కలవాలని సీఈవో సూచించారు. ఈ పత్రాల ఆధారంగా అందరూ శిక్షణ కార్యక్రమాలకు హజరు కావొచ్చని తెలిపారు. సహాయక సిబ్బందికి సైతం.. లోక్‌సభ ఎన్నికల నిర్వహణకు ప్రిసైడింగ్ అధికారులు, సహాయ ప్రిసైడింగ్ అధికారులు, ఇతర పోలింగ్ అధికారులు, సూక్ష్మ పరిశీలకులుగా దాదాపు 1.8 లక్షల మందికి ఎన్నికల బాధ్యతలు అప్పగించారు. వెబ్ కాస్టర్లు, వీడియోగ్రాఫర్లు, డ్రైవర్లు, క్లీనర్లు ఇలా మరో లక్ష మందికి పైగా ఎన్నికల విధుల్లో ఉంటారు. వీరందరికి కూడా ఈడీసీ/ పోస్టల్ బ్యాలెట్ ద్వారా లోక్‌సభ ఎన్నికల్లో ఓటేసే సదుపాయం కల్పించేందుకు ఎన్నికల సంఘం చర్యలు తీసుకుంటోంది. -
మోదీజీ.. ఐపీఎల్ ఆటగాళ్లకు ఆ అవకాశం కల్పించండి
సాక్షి, హైదరాబాద్: రాబోయే లోక్‌సభ ఎన్నికల్లో ప్రజలంతా ఓటుహక్కు వినియోగించుకునేలా అవగాహన పెంచాలని పలు రంగాల ప్రముఖులకు ప్రధాని నరేంద్ర మోదీ పిలుపునిచ్చిన విషయం తెలిసిందే. రాజకీయ, సినీ, క్రీడా, సామాజిక, వినోద రంగాల ప్రముఖులను ట్యాగ్ చేస్తూ ప్రధాని వరస ట్వీట్లతో పాటు ప్రత్యేక బ్లాగ్ రాశారు. మోదీ ట్వీట్‌పై ఇప్పటికే పలువురు సెలబ్రిటీలు స్పందించి తమ వంతుగా తప్పకుండా కృషి చేస్తామని హామీ ఇచ్చారు. తాజాగా టీమిండియా సీనియర్ స్పిన్నర్, కింగ్స్ పంజాబ్ సారథి రవిచంద్రన్ అశ్విన్ స్పందించారు. దేశంలోని ప్రతీ ఒక్కరూ ఓటు హక్కు వినియోగించుకోవాలని కోరారు. ప్రజాస్వామ్యంలో ఓటు హక్కు వినియోగించుకోవడం అందిరి బాధ్యత అని.. సరైన నాయకుడిని ఎన్నుకొని దేశాభివృద్ధిలో భాగం కావాలని ట్విటర్ వేదికగా ఓటర్లకు విజ్ఞప్తి చేశారు. అంతేకాకుండా ఐపీఎల్లో క్రికెట్ మ్యాచ్‌లు ఆడుతుండటంతో తమకు దేశంలో ఎక్కడైనా ఓటు వేసే అవకాశం కల్పించాలని అశ్విన్ కోరారు. ఈ మేరకు ట్విటర్ వేదికగా ప్రధాని మోదీకి విజ్ఞప్తి చేశారు. ఐపీఎల్ సందర్భంగా తమ రాష్ర్టాల్లో ఎన్నికలు జరిగే సమయంలో తాము అక్కడే ఉండొచ్చు.. ఉండకపోవచ్చని, దీంతో తాము ఓటు వేసే అవకాశం కోల్పోతున్నామని అశ్విన్ ఆవేదన వ్యక్తం చేశారు. ఎన్నికల నిబందనలు సవరించి ఐపీఎల్ ఆటగాళ్లు ఎక్కడైనా ఓటు వేసే అవకాశం కల్పించాలని మోదీకి అశ్విన్ ట్వీట్ చేశారు. -
ఓటొచ్చిన వేళా విశేషం
ఆకాశంలో సగమైనా అన్నింటా వెలివేతే! అన్ని అవరోధాలనూ అధిగమించి, ప్రతి అడ్డంకినీ ప్రతిఘటించి, చివరకు ఇంటా బయటా అన్నీ తానై నిలిచి, రణానికీ సైతం సిద్ధపడి, విశాల ప్రపంచాన్ని శాసిస్తోన్న మహిళల చరిత్ర అంతా నిరాకరణే. ఇక రాజకీయ హక్కుల సంగతి సరేసరి. అసలు ప్రపంచ ప్రజల ప్రజాస్వామిక హక్కు అయిన ఓటు హక్కు మగువ చేతికి రావడానికే శతాబ్దాలు పట్టింది. ‘మాటలు కాదు చేతలు కావాలి’ (డీడ్స్ నాట్ వర్డ్స్).. ఇది ఈనాటి ఎన్నికల నినాదం కాదు. 1913లోనే అంటే.. నూటా ఆరు సంవత్సరాల క్రితమే స్త్రీలు పురుషులతో సమానంగా స్త్రీలకూ ఓటు వేసే హక్కు కావాలంటూ బ్రిటన్ వీధుల్లో కదం తొక్కిన మహిళల రాజకీయ రణన్నినాదం. శాంతి ప్రదర్శనలూ, నిరసనలూ, ధర్నాలతో దిగిరాని నాటి బ్రిటిష్ పాలకులను హడలెత్తించిన మహిళల మహోద్యమమది. తపాలా కార్యాలయాలు తగలబెట్టారు. పోలీసు స్టేషన్లపై రాళ్ల వర్షం కురిపించారు. పాలకుల కార్యాలయాలనూ చుట్టుముట్టారు. సమాచార వ్యవస్థని ధ్వంసం చేశారు. టెలిఫోన్ వైర్లు తెంపేశారు. దీనికి నాయకత్వం వహించిన మహిళ ఎమ్మలీన్ పంఖస్ట్. ఈ మహిళోద్యమంతో బెంబేలెత్తిన పోలీసులు స్త్రీలను ఇళ్లల్లోనుంచి వీధుల్లోకి లాక్కొచ్చారు. అరెస్టుల పాల్జేశారు. ఓటు అడిగినందుకు వారిని మట్టిలో దొర్లించి, గుర్రాలతో తొక్కించారు. రక్తసిక్తమైన గాయాలతో ఆ పోరాటంలో ఎమిలీ డెవిసన్ అనే మహిళ ప్రాణాలు కోల్పోయారు. అయినా చలించలేదా స్త్రీలు. జైల్లోనే నిరశన దీక్షకు పూనారు. ముద్దముట్టబోమని శపథం చేసారు. ఇచ్చిన హామీలను నిలబెట్టుకోకుండా మహిళల ఓటు హక్కుని నిర్లక్ష్యం చేసినందుకు, మాయమాటలు చెప్పి మహిళలను తరాల తరబడి వంచించినందుకు వందేళ్ల క్రితమే స్త్రీల రాజకీయ చైతన్యాన్ని చవిచూసిన బ్రిటన్ కథ ఇది. అయితే ఇది ఒక్కటే కాదు. ఆనాటికే అనేక దేశాల్లో స్త్రీలు ఓటు హక్కుకోసం ఉద్యమాలు జరుగుతూ ఉన్నాయి. సరిగ్గా 170 ఏళ్ల క్రితం స్త్రీల ఓటుహక్కు నిరాకరణకు వ్యతిరేకంగా ఉద్యమం ప్రారంభమైంది. దాని పునాదులు అమెరికాలోనే ఉన్నా ఆ తరువాత భారతీయ మహిళలు ‘ఓటు మా హక్కు’ అనే నినాదాన్ని అందిపుచ్చుకున్నారు. ప్రాచీన గ్రీస్, రోమన్ రిపబ్లిక్ తో సహా 18వ శతాబ్దాంతంలో ఆవిష్కృతమైన ప్రజాస్వామ్య దేశాలెన్నో మహిళలకు ఓటు హక్కుని నిరాకరించాయి. 1832లో యునైటెడ్ కింగ్డమ్ మహిళల ఓటుహక్కు నిరాకరణ వారసత్వాన్ని కొనసాగించింది. అయితే తొలిసారిగా బ్రిటన్‌లోనూ, అమెరికాలోనూ 19 వ శతాబ్దంలో మహిళల ఓటు హక్కు చర్చనీయాంశంగా మారింది. ఓటు మహిళల ఉద్యమంగా మారింది. అయితే ఏ దేశాల్లో అయితే ఈ ఉద్యమం జరిగిందో ఆ దేశాలు తొలుత మహిళలకు ఓటు హక్కు ప్రసాదిం^è కపోవడం విచారకరం. ప్రపంచవ్యాప్తంగా ఎక్కడా మహిళల హక్కులు ఏవీ మానవహక్కుల్లో భాగం కాలేదు. ఆమాటకొస్తే ఈరోజుకీ అదే పరిస్థితి కొనసాగుతోంది. విముక్తితో పాటే ఓటూ! రెండవ ప్రపంచ యుద్ధానంతరం అనేక పోరాటాల తరువాత మహిళలు ఓటు హక్కుని సాధించుకోగలిగారు. బ్రిటిష్ పాలననుంచి మన దేశం స్వాతంత్య్రం సాధించుకున్న తరువాత అతిపెద్ద ప్రజాస్వామ్య దేశంగా తనదైన రాజ్యాంగాన్ని రూపొందించుకునే సమయంలోనే స్త్రీలకు ఓటు హక్కుని రాజ్యాంగబద్దం చేసింది. భారత స్వతంత్య్ర సంగ్రామంలోనే స్త్రీల హక్కుల కోసం ఎలుగెత్తి చాటిన మహిళ సరోజినీ నాయుడు. నైటింగేల్ ఆఫ్ ఇండియాగా పిలుచుకునే సరోజినీ నాయుడు.. అనీబిసెంట్‌తో కలిసి 1917లో వుమెన్స్ ఇండియా అసోసియేషన్ స్థాపించారు. అదే సంవత్సరం స్త్రీలకు ఓటు హక్కుని ఆమోదించాలని ఆనాటి స్టేట్ సెక్రటరీ ఎడ్విన్ మాంటెగ్కి వినతిపత్రం సమర్పించిన బృందానికి సరోజినీ నాయుడు నాయకత్వం వహించారు. మన దేశంలో స్త్రీల ఓటు హక్కు కోసం 1900 సంవత్సరంలోనే ఉద్యమం ప్రారంభం అయినా బ్రిటిష్ పరిపాలనలో ఉన్నప్పుడు 1947కి పూర్వం పురుషులకి కానీ, మహిళలకి కానీ సార్వత్రిక ఓటు హక్కు లేదు. విద్య, వ్యాపారాలూ, ఆస్తిపాస్తులూ ఉన్నవారికే ఓటు హక్కు ఉండేది. బ్రిటిష్ పాలన నుంచి విముక్తి పొందిన తరువాత 1950లో మన దేశంలో పురుషులతో సమానంగా స్త్రీలకు ఓటు హక్కుని ఆమోదించారు. 1950లో భారత రాజ్యాంగంలో పొందుపరిచిన సార్వజనీన ఓటు హక్కు ద్వారా స్త్రీ పురుషులకు ఇద్దరికీ ఓటు హక్కు సాధ్యమయ్యింది. మహిళలకు ఓటేసిన శతాబ్దం ప్రపంచంలో తొలిసారిగా మహిళలకు ఓటు వేసే అవకాశం వచ్చింది 20 శతాబ్దంలోనే. ఒక్క 1893లో మాత్రం న్యూజిలాండ్ జాతీయ ఎన్నికల్లో మహిళ తొలిసారిగా తన ఓటు హక్కుని వినియోగించుకుంది. ఆ తరువాత 1902లో ఆస్ట్రేలియా, 1906లో ఫిన్లాండ్, 1913లో నార్వే మహిళలకు ఓటు హక్కు ఇచ్చాయి. స్వీడన్‌లోనూ, అమెరికాలోని స్థానిక ఎన్నికల్లో మహిళలు కూడా ఓటింగ్‌లో పాల్గొన్నారు. 1914–39 సంవత్సరాల మధ్య కాలంలో మరో 28 దేశాల్లో నేషనల్ ఎలక్షన్స్‌లో స్త్రీలు ఓటు హక్కుని వినియోగించుకున్నారు. అందులో సోవియట్ రష్యా కూడా ఒకటి. రెండవ ప్రపంచ యుద్ధానంతరం ఫ్రాన్స్, ఇటలీ, రొమేనియా, యుగోస్లేవియా, చైనా దేశాలు స్త్రీల ఓటు హక్కుని ఆమోదించాయి. మన తరువాత ఆరేళ్లకు పాకిస్తాన్లో 1956లో మహిళలకు ఓటు హక్కు వచ్చింది. ఇక ప్రపంచంలో మహిళల ఓటు హక్కుని ఆమోదించిన దేశాల సంఖ్య 100 కు చేరడానికి మరో దశాబ్దకాలం పట్టింది. 1971లో స్విట్జర్లాండ్ పాక్షికంగా స్త్రీలకు ఓటు వేసే అవకాశాన్నిచ్చింది. 1973లో సిరియా పూర్తిస్థాయిలో స్త్రీల ఓటు హక్కుని ఆమోదించింది. అయితే అనేక అరబ్ దేశాల్లోనూ, పర్షియన్ గల్ఫ్ దేశాల్లోనూ, సౌదీ అరేబియాలాంటి అనేక సాంప్రదాయ వాద దేశాల్లోనూ చాలా కాలం మహిళల ఓటు హక్కు నిరాకరణకు గురయ్యింది. తొలిసారిగా 2015లో సౌదీలో మహిళల ఓటు హక్కును ఆమోదించారు. తొలిసారి అక్కడి మహిళలు మున్సిపల్ ఎన్నికల్లో ఓటు వేసారు. మహిళల రాజకీయ హక్కులపై జరిగిన యునైటెడ్ నేషన్స్ కన్వెన్షన్‌లో ఎటువంటి వివక్షకూ అవకాశం లేకుండా పురుషులతో సమానంగా స్త్రీలకు సైతం ఓటు హక్కు ఉండాలని 1952లో జరిగిన తీర్మానం కూడా ఈ మార్పుకు తోడ్పడింది. – అత్తలూరి అరుణ పేద మహిళల కోసంక్లారా ఓటు పోరాటం స్త్రీ పురుష సమానత్వం కోసం, ప్రపంచ స్త్రీల హక్కుల కోసం ఎలుగెత్తిన జర్మనీకి చెందిన సోషలిస్టు, కమ్యూనిస్టు క్లారా జెట్కిన్. స్త్రీ విముక్తి పోరాటాలెన్నింటికో నాయకత్వం వహించిన క్లారాజెట్కిన్ శ్రామిక మహిళల పోరాటదినంగా అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని జరుపుకోవాలని తొలిసారి ప్రకటించిన పోరాటయోధురాలు. యూరప్ సంపన్న వర్గ మహిళలు, నాటి ఫెమినిస్టులు ఆస్తి ప్రాతిపదికగా ఇచ్చే స్త్రీల ఓటు హక్కుని ఆమోదించారు. అయితే రెక్కలు తప్ప ఆస్తులు లేని కార్మిక వర్గ స్త్రీల ఓటు హక్కుని గురించి మాట్లాడకపోతే ఈ ఉద్యమానికి అర్థం లేదని క్లారా వాదించారు. అందుకే ఆస్తిపాస్తులతో సంబంధం లేకుండా అందరు స్త్రీలతో పాటు పేద కార్మికవర్గ స్త్రీలకు సైతం ఓటు హక్కు కోసం క్లారా గళమెత్తారు. -
22న ‘మండలి’ ఓటర్లకు ప్రత్యేక సెలవు
సాక్షి, హైదరాబాద్: మెదక్–నిజామాబాద్–ఆదిలాబాద్–కరీంనగర్ పట్టభద్రులు/ఉపాధ్యాయ శాసన మండలి నియోజకవర్గాలతో పాటు వరంగల్–ఖమ్మం–నల్లగొండ ఉపాధ్యాయ శాసన మండలి నియోజకవర్గానికి ఈ నెల 22న ఎన్నికల్లో ఓటేయనున్న ఓటర్లకు ప్రత్యేక సాధారణ సెలవును మంజూరు చేస్తూ రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి (సీఈఓ) రజత్‌కుమార్ బుధవారం ఉత్తర్వులు జారీ చేశారు. శాసనమండలి ఓటు హక్కు కలిగిన కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు ఈ సెలవు వర్తిస్తుందని తెలిపారు. అదే విధంగా పట్టభద్రుల శాసనమండలి నియోజకవర్గాల్లో ఓటు హక్కు కలిగిన ప్రైవేటు ఉద్యోగులు పోలింగ్ రోజు ఓటు వేసేందుకు వీలుగా విధి నిర్వహణలో ప్రత్యేక సడలింపులు కల్పించాలని ప్రైవేటు సంస్థల యాజమాన్యాలకు విజ్ఞప్తి చేశారు. ఓటు వేసి ప్రైవేటు ఉద్యోగులు ఆలస్యంగా విధులకు వచ్చినా అనుమతించాలని, అవసరమైతే వారి షిఫ్టుల సమయాన్ని సర్దుబాటు చేయాలని కోరారు. మండలి ఎన్నికలు జరగనున్న 25 జిల్లాల్లో ఈ ఉత్తర్వుల అమలుకు చర్యలు తీసుకోవాలని ఆయా జిల్లాల ఎన్నికల అధికారులను ఆదేశించారు. 21, 22న సెలవు ప్రకటించండి: సీఎస్ పోలింగ్ కేంద్రాలు ఏర్పాటు చేసిన కార్యాలయాలు, సంస్థల ఉద్యోగులకు పోలింగ్‌కు ముందు రోజు 21న, పోలింగ్ రోజు 22న స్థానిక సెలవును ప్రకటించాలని రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎస్కే జోషి ఆదేశించారు. కౌంటింగ్ కేంద్రాలు ఏర్పాటు చేసే కార్యాలయాలు, సంస్థల ఉద్యోగులకు కౌంటింగ్ నిర్వహించే 26న స్థానిక సెలవు ప్రకటించాలని కోరారు. దివ్యాంగులకు మినహాయింపు.. లోక్‌సభ ఎన్నికల విధుల నుంచి దివ్యాంగ ఉద్యోగులను నియమించకుండా చర్యలు తీసుకోవాలని కేంద్ర ఎన్నికల సంఘం ఆదేశించింది. ఎన్నికల సిబ్బంది నియామకం విషయంలో ఈ మేరకు చర్యలు తీసుకోవాలని కోరింది. -
శతాబ్దానికొక్క అవకాశం!
న్యూఢిల్లీ: ఓటు హక్కు వినియోగించుకోవడం పవిత్ర కార్యం, శతాబ్దంలో ఒక్కసారి మాత్రమే దక్కే అరుదైన అవకాశంగా భావించండి అని రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ ప్రజలకు పిలుపునిచ్చారు. దేశానికి ఇది పరీక్షా సమయమన్న రాష్ట్రపతి.. ఇప్పుడు వేసే ఓటు ఈ శతాబ్దంలో దేశం గతిని నిర్ణయిస్తుందన్నారు. పేదలకు రిజర్వేషన్ల కల్పన గాంధీ కలల సాకారం దిశగా పడిన అడుగుగా ఆయన అభివర్ణించారు. 70వ గణతంత్ర దినోత్సవం సందర్భంగా శుక్రవారం ఆయన జాతినుద్దేశించి ప్రసంగించారు. ‘వైవిధ్యం, ప్రజాస్వామ్యం, అభివృద్ధి అనే మూడు అంశాలపై ఆధారపడిన భిన్నత్వంలో ఏకత్వ భావనను స్వీకరించనిదే దేశాభివృద్ధి పరిపూర్ణం కాదు. ఈ దేశం మనది, మన అందరిదీ. మన వైవిధ్యం, ప్రజాస్వామ్యం, అభివృద్ధి ప్రపంచానికి ఆదర్శం. ఇవి విడదీయరానివి. ఈ మూడూ మనకు అత్యవసరం’ అని రాష్ట్రపతి అన్నారు. ఓటర్లకు విన్నపం మరో నాలుగు నెలల్లో జరగనున్న సాధారణ ఎన్నికలను ప్రస్తావిస్తూ ఆయన..‘21వ శతాబ్దంలో పుట్టిన పౌరులు మొదటి సారిగా ఓటు హక్కు వినియోగించుకునే అవకాశం లోక్‌సభ ఎన్నికల్లో దక్కనుంది. భారతీయుల ఆకాంక్షలకు, విభిన్నతకు నిదర్శనం ఈ ఎన్నికలు. అర్హులైన ఓటర్లందరికీ నా విన్నపం ఒక్కటే.. పోలింగ్ బూత్‌కు వెళ్లి ఓటేయండి’ అని ప్రజలకు ముఖ్యంగా యువతకు పిలుపునిచ్చారు. ‘ఈ ఎన్నికలు తరానికి ఒక్కసారి వచ్చే ఎన్నికలు మాత్రమే కాదు..ఈ శతాబ్దానికి ఏకైక ఎన్నికలుగా భావించండి. ప్రజాస్వామ్య ఆదర్శాలు, ఆలోచనలను ఆచరణలోకి తెచ్చేవి ఈ ఎన్నికలు. ప్రజల ఆకాంక్షలను నెరవేర్చే ప్రయాణంలో, దేశ అభివృద్ధిలో ఇవి ఒక మైలురాయి మాత్రమే’ అని అన్నారు. ప్రజలందరికీ సమాన అవకాశాలు ‘పేద కుటుంబాలకు చెందిన ప్రతిభావంతులైన విద్యార్థులకు ప్రత్యేక సౌకర్యం కల్పించేందుకు ఇటీవల చేపట్టిన రాజ్యాంగ సవరణ గాంధీజీ కలలు, భారతీయుల కలల సాకారం వైపునకు పడిన మరో అడుగు’ అని అన్నారు. ప్రతి చిన్నారి, ప్రతి మహిళకు సమాన అవకాశాలు, సమాన పరిస్థితులు కల్పించడమే మన సమాజం లింగ సమానత్వం సాధించిందనేందుకు సరైన సూచిక’ అని తెలిపారు. మన రాజ్యాంగానికి, డాక్టర్ బీఆర్ అంబేడ్కర్‌కు గౌరవసూచికగా ఈ ఏడాది దేశం ఘనంగా రాజ్యాంగ దినోత్సవం జరుపుకోనుంది’ అని పేర్కొన్నారు. -
అనర్హులకు ఓటు కల్పించిందెవరు..?
కేంద్ర ఎన్నికల సంఘాన్ని ప్రశ్నించిన ఉమ్మడి హైకోర్టు హైదరాబాద్: ఎమ్మెల్సీ ఎన్నికల ఓట్ల నమోదు ప్రక్రియలో అనర్హుల దరఖాస్తులను ఆమోదించి, వారికి ఓటు హక్కు కల్పించిన అధికారులపై ఏం చర్యలు తీసుకున్నారో వివరించాలని కేంద్ర ఎన్నికల కమిషన్‌ను ఉమ్మడి హైకోర్టు గురువారం ఆదేశించింది. దరఖాస్తులను పరిశీలించి ఓటు హక్కు కల్పించిన అధికారుల వివరాలను, ఆ దరఖాస్తులను పునఃపరిశీలన చేసిన అధికారుల వివరాలను తమ ముందుంచాలని స్పష్టం చేసింది. ఓట్ల నమోదు ప్రక్రియ, ఆ సందర్భంగా చోటు చేసుకున్న అక్రమాల వ్యవహారాన్ని తామే స్వయంగా పర్యవేక్షిస్తామని తేల్చి చెప్పింది. ఈ మొత్తం వ్యవహారానికి సంబంధించిన పూర్తి వివరాలను తమ ముందుంచాలంటూ తదుపరి విచారణను ఈ నెల 21కి వాయిదా వేసింది. ఈ మేరకు తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ రమేశ్ రంగనాథన్, న్యాయమూర్తి జస్టిస్ షమీమ్ అక్తర్‌లతో కూడిన ధర్మాసనం ఉత్తర్వులిచ్చింది. వైఎస్సార్, కర్నూలు, అనంతపురం జిల్లాలు.. చిత్తూరు, నెల్లూరు, ప్రకాశం జిల్లాల ఉపాధ్యాయ, పట్టభద్రుల నియోజకవర్గాల ఓటర్ల జాబితాలో అనర్హులకు స్థానం కల్పించడాన్ని సవాలు చేస్తూ అనంతపురం జిల్లాకు చెందిన జి.ఓబులు హైకోర్టులో పిటిషన్ దాఖలు చేసిన విషయం తెలిసిందే. ఈ వ్యాజ్యంపై గురువారం జస్టిస్ రమేశ్ రంగనాథన్ నేతృత్వంలోని ధర్మాసనం మరోసారి విచారణ చేపట్టింది. -
రెండు విడతల్లో 71 .63 శాతం పోలింగ్
బెంగళూరు: రాష్ట్రంలో రెండు విడతల్లో ఈనెల 13, ఈనెల 20వ తేదీల్లో జరిగిన జెడ్పీ, టీపీ ఎన్నికల్లో 71.63 శాతం ఓటింగ్ నమోదైంది. రాష్ట్రంలో 30 జిల్లాలు ఉండగా ఇందులోని 1,083 జిల్లా, 3,884 తాలూకా పంచాయతీ క్షేత్రాలకు రెండు దశలో ఎన్నికలు జరిగిన విషయం తెలిసిందే. ఈనెల 13న జరిగిన మొదట దశ ఎన్నికల్లో 1,46,31,858 మంది ఓటర్లు ఉండగా ఇందులో 1,08,50,742 మంది ఓటు హక్కును వినియోగించుకున్నారు. దీంతో మొదటి దశలో 73.94 శాతం ఓటింగ్ నమోదైంది. ఇక ఈనెల 20న జరిగిన రెండో దశలో 1,46,88,853 ఓటర్లకు గాను 1,01,81,719 మంది మత్రమే (69.32) ఓటు హక్కును వినియోగించుకున్నారు. దీంతో మొదటి దశతో పోలిస్తే రెండోదశలో తక్కువ ఓటింగ్ నమోదైంది. మొత్తంగా 29364288 మందికిగాను 21032461 మంది ఓటు హక్కు వినియోగించుకోవడంతో 71.63 శాతం ఓటింగ్ నమోదైంది. -
ఓటర్లలో చైతన్యం పెంచే దిశగా...
జాగృతి కార్యక్రమాలను {పారంభించిన బీబీఎంపీ బెంగళూరు : బీబీఎంపీ ఎన్నికల్లో ప్రతి ఓటరు తప్పని సరిగా తన ఓటు హక్కును వినియోగించుకునేలా బీబీఎంపీ అధికారులు ప్రయత్నాలు ప్రారంభించారు. ఇందులో భాగంగానే ఓటు హక్కు వినియోగం పై ప్రజల్లో చైతన్యం కల్పించే దిశగా వీధి నాటికలు తదితర కార్యక్రమాల రూపకల్పనకు శ్రీకారం చుట్టారు. ఈ వీధి నాటికల కార్యక్రమాన్ని బీబీఎంపీ కమిషనర్ కుమార్ నాయక్ బుధవారమిక్కడ లాంఛనంగా ప్రారంభించారు. నగరంలోనీ బీబీఎంపీ ప్రధాన కార్యాలయం వద్ద నిర్వహించిన కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. ఇప్పటి వరకు బీబీఎంపీ ఎన్నికల్లో 50శాతానికి మించి పోలింగ్ జరగలేదని అన్నారు. అందుకే ఈ ఎన్నికల్లో పోలింగ్ శాతాన్ని పంచేందుకు గాను వీధి నాటికలు వంటి అనేక జాగృ కార్యక్రమాలను నిర్వహించనున్నట్లు చెప్పారు. ఈనెల 22న జరగనున్న ఎన్నికలో 60శాతానికి పైగా పోలింగ్‌ను సాధించే దిశగా ప్రణాళికలు రచిస్తున్నట్లు కుమార్ నాయక్ వెల్లడించారు. ఇక ఓటర్లలో జాగృని పెంపొందించే దిశగా ఏర్పాటు చేసిన ఈ వీధి నాటికల బృదాలు నగరంలో ఆరు రోజుల పాటు వీధి నాటికలు ప్రదర్శించనున్నాయని చెప్పారు. అంతేకాక ఓటర్లలో చైతన్యాన్ని పెంపొందించే దిశగా ఇప్పటికే వాహనాలతో మొబైల్ ప్రచారాన్ని సైతం చేపట్టిన విషయాన్ని కుమార్ నాయక్ గుర్తు చేశారు. ఇక ఎన్నికల ప్రక్రియ ఇప్పటికి సగం వరకు పూర్తైదని అన్నారు. నామినేషన్ల ఉప సంహరణకు గురువారం చివరి రోజు కాగా, శుక్రవారం నుంచి నగరంలో ఎన్నికల వేడి మరింత పెరిగే అవకాశాలున్నాయని పేర్కొన్నారు. కాగా, ఎన్నికలు పూర్తి పారదర్శకంగా, శాంతి భద్రతల నడుమ నిర్వహించేందుకు గాను అన్ని ఏర్పాట్లు పూర్తి చేసినట్లు చెప్పారు. నగరంలోని ప్రజలందరూ చాలా బాధ్యతాయుతమైన వ్యక్తులని, వారంతా తమ ఓటు హక్కును తప్పక వినియోగించుకుంటారని కుమార్ నాయక్ ఆశాభావం వ్యక్తం చేశారు. -
ఈ దశలో జోక్యం చేసుకోలేం
-
ఎమ్మెల్యేలకు ఎమ్మెల్సీ ఎన్నికల సూచనలు
హైదరాబాద్: ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఓటు హక్కును ఎలా వినియోగించుకోవాలో వివరిస్తూ రిటర్నింగ్ అధికారిగా వ్యవహరిస్తున్న శాసనసభ కార్యదర్శి రాజా సదారాం ఎమ్మెల్యేలకు పలు సూచనలు చేశారు. ఈ మేరకు వివరాలతో కూడిన పత్రాలను గురువారం ఎమ్మెల్యేలకు పంపిణీ చేశారు. బ్యాలెట్ పేపర్లో ఊదా రంగు స్కెచ్ పెన్నునే వాడాలని, అభ్యర్థి పేరు ఎదుట ప్రాధాన్య సంఖ్య వేయాలని స్పష్టం చేశారు. సంతకాలు చేయకూడదని, వేలిముద్రలు వేయకూడదని, ఎటువంటి గుర్తులు పెట్టకూడదని పేర్కొన్నారు. నోటా అవకాశాన్ని వినియోగించుకోవచ్చని తెలిపారు. ప్రతి ఎమ్మెల్యే తమ గుర్తింపు కార్డులను వెంట తెచ్చుకోవాలని సూచించారు. -
ఈ దశలో జోక్యం చేసుకోలేం
పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యేల ఓటుహక్కుపై హైకోర్టు ఝ ఎటువంటి ఉత్తర్వులూ ఇవ్వలేమని స్పష్టీకరణ అనుబంధ పిటిషన్లు దాఖలు చేసిన టీడీపీ, కాంగ్రెస్ ఝ తదుపరి విచారణ జూన్ 2కి వాయిదా హైదరాబాద్: పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యేలు జూన్ 1న జరగనున్న ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఓటు హక్కు వినియోగించుకునే విషయంలో జోక్యానికి హైకోర్టు నిరాకరించింది. ఈ వ్యవహారంలో ప్రస్తుత దశలో ఎటువంటి ఉత్తర్వులు జారీ చేయలేమని తేల్చి చెప్పింది. ఈ మేరకు న్యాయమూర్తులు జస్టిస్ ఎ.రామలింగేశ్వరరావు, జస్టిస్ టి.సునీల్ చౌదరితో కూడిన ధర్మాసనం గురువారం ఉత్తర్వులు జారీ చేసింది. తదుపరి విచారణను జూన్ 2కు వాయిదా వేసింది. టీఆర్ఎస్లోకి ఫిరాయించిన తమ పార్టీ ఎమ్మెల్యేలు తలసాని శ్రీనివాస యాదవ్, తీగల కృష్ణారెడ్డి, చల్లా ధర్మారెడ్డిలను ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఓటుహక్కు వినియోగించుకోకుండా నియంత్రించాలంటూ తెలంగాణ టీడీపీ శాసనసభాపక్ష నేత ఎర్రబెల్లి దయాకరరావు గురువారం హైకోర్టులో లంచ్‌మోషన్ రూపంలో అనుబంధ పిటిషన్ దాఖలు చేశారు. ఇదేవిధంగా కాంగ్రెస్ నుంచి టీఆర్ఎస్లో చేరిన తమ పార్టీ ఎమ్మెల్యేలు కాలె యాదయ్య, రెడ్యానాయక్, విఠల్‌రెడ్డి, కనకయ్యలను సైతం ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఓటుహక్కు వినియోగించుకోకుండా నియంత్రించాలంటూ కాంగ్రెస్ విప్ సంపత్‌కుమార్ సైతం లంచ్ మోషన్ పిటిషన్ దాఖలు చేశారు. ఈ రెండు వ్యాజ్యాలను జస్టిస్ ఎ.రామలింగేశ్వరరావు నేతృత్వంలోని వేసవి సెలవుల ప్రత్యేక ధర్మాసనం విచారించింది. పార్టీ ఫిరాయింపులపై స్పీకర్‌కు ఫిర్యాదు చేశామని, ఆయన స్పందించకపోవడంతో హైకోర్టును ఆశ్రయించామని పిటిషనర్లు తెలిపారు. తమ పిటిషన్లపై విచారణ జరిపిన సింగిల్ జడ్జి, విచారణార్హత లేదంటూ కొట్టేశారని, దీంతో తాము ధర్మాసనం ముందు అప్పీళ్లు దాఖలు చేశామని, అవి ప్రస్తుతం పెండింగ్‌లో ఉన్నాయని వివరించారు. పార్టీ ఫిరాయించిన వారికి ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఓటుహక్కు కల్పిస్తూ ఓటర్ల జాబితా రూపొందించడం నిబంధనలకు విరుద్ధమన్నారు. ధర్మాసనం స్పందిస్తూ, ఎన్నికల ప్రక్రియ ప్రారంభమయ్యాక ఎన్నికల అంశంలో జోక్యం చేసుకోవడానికి వీల్లేదని స్పష్టం చేసింది. ప్రస్తుత దశలో పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యేలను ఓటుహక్కు వినియోగించుకోకుండా నియంత్రించలేమంది. దీనికి పిటిషనర్లు స్పందిస్తూ.. పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యేలు వినియోగించుకునే ఓటుహక్కుకు సంబంధించి తమ అప్పీళ్లపై కోర్టు వెలువరించే తుది తీర్పునకు లోబడి ఉండాలనైనా ఉత్తర్వులు ఇవ్వాలని కోరారు. ధర్మాసనం అందుకు సైతం నిరాకరిస్తూ, ప్రాథమికంగా తాము సంతృప్తి చెందకుండా ఎటువంటి ఉత్తర్వులు జారీ చేయలేమని తేల్చి చెప్పింది. -
ఓటేద్దాం రండి!
సాక్షి, హన్మకొండ : వరంగల్, ఖమ్మం, నల్లగొండ పట్టభద్రుల శాసన మండలి ఎన్నికకు అధికార యంత్రాంగం సిద్ధమైంది. ఆదివారం ఉదయం 8:00 గంటల నుంచి సాయంత్రం 4:00 గంటల వరకు పోలింగ్ ఉంటుంది. బరిలో 22 మంది అభ్యర్థులు నిలవగా, జిల్లాలో పట్టభద్రుల ఓట్లు 1,04,364 ఉన్నారుు. వీరిలో పురుషులు 76,873, మహిళా ఓటర్లు 27,487 కాగా ఇతర కేటగిరీలో నలుగురు ఓటర్లు ఉన్నారు. వీరు 144 పోలింగ్ కేంద్రాల్లో తమ ఓటు హక్కును వినియోగించుకోనున్నారు. ఇందులో జిల్లా వ్యాప్తంగా 99 కేంద్రాలు ఏర్పాటు చేయగా, 1000 మంది కంటే ఎక్కువ ఓటర్లు ఉన్న ప్రాంతాలను దృష్టిలో పెట్టుకుని మరో 45 చోట్ల అదనపు పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేశారు. పోలింగ్ ప్రక్రియలో పారదర్శకత పాటించేందుకు వెబ్‌కాస్టింగ్‌ను ఏర్పాటు చేశారు. ఐదు చోట్ల అనువైన పరిస్థితి లేదు. ఏర్పాట్లు పూర్తి ఎన్నికల నిర్వాహణలో పీవోలు, ఏపీవోలు, ఇతర పోలింగ్ సిబ్బందితో కలిపి 1000 మంది వరకు ప్రభుత్వ సిబ్బంది పోలింగ్ విధుల్లో పాల్గొంటున్నారు. ఆదివారం ఉదయం నుంచి పోలింగ్ జరుగనున్న దృష్ట్యా శనివారం సాయంత్రానికే ఎన్నికల సామగ్రిని ఆయా పోలింగ్ కేంద్రాలకు తరలించారు. ఇందుకోసం హన్మకొండలోని కాకతీయ డిగ్రీ కాలేజీ, నర్సంపేట, మహబూబాబాద్, ములుగు, జనగామ ఆర్డీవో కార్యాలయాల్లో ప్రత్యేక ఎన్నికల సామగ్రి పంపిణీ కేంద్రాలు ఏర్పాటు చేశారు. ఈసారి పోలింగ్ సమయంలో కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు సూక్ష్మ పరిశీలకులుగా, పోలింగ్ పార్టీ సభ్యులుగా వ్యవహరించనున్నారు. వీరు అవసరాన్ని బట్టి పోలింగ్ సరళి, ఇతర సమాచారాలను నేరుగా జిల్లా ఎన్నికల అధికారి, రాష్ట్ర ఎన్నికల కమిషన్లకు సమాచారం ఇస్తారు. జిల్లాలో తొమ్మిది పోలింగ్ కేంద్రాలు మినహా మిగతా అన్నింటిలో 1000 లోపు ఓటర్లు ఉండేలా ఏర్పాట్లు చేశారు. పోలింగ్ కేంద్రంలో కూడా ఆలస్యం కాకుండా 800లోపు ఓట్లు ఉన్నట్లయితే రెండు ఓటింగ్ కంపార్టుమెంట్లు, ఆపైన ఓటర్లు ఉన్నట్లయితే మూడు ఓటింగ్ కంపార్ట్మెంట్లు ఏర్పాటు చేశారు. అదేవిధంగా బ్యాలెట్ బ్యాక్స్‌లు కూడా ఒక్కో బూత్‌లో రెండుకన్నా తక్కువ కాకుండా చర్యలు తీసుకున్నారు. పోలింగ్ ప్రాంతాన్ని 27 రూట్లు, 27 జోన్లుగా విభజించారు. వాటికి ప్రత్యేక ఇన్చార్జీలను నియమించారు. పోలింగ్ పూర్తరుున వెంటనే బ్యాలెట్ బాక్సులను డివిజన్ ప్రధాన కేంద్రాలు చేరుస్తారు. అన్ని బాక్సులు వచ్చినతర్వాత కట్టుదిట్టమైన భద్రత నడుమ నల్గొండకు తరలిస్తారు. స్థానికులనే ఏజెంట్లుగా నియమించుకోవాలి.. నియోజకర్గ పరిధిలోని వ్యక్తినే పోలింగ్ ఏజెంట్‌గా నియమించుకోవాలి. ఏజెంటుగా నియమితులైన వారు ఉదయం 7:00 గంటల వరకు పోలింగ్ కేంద్రాలను చేరుకోవాలని జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ వాకాటి కరుణ స్పష్టమైన ఆదేశాలు జారీ చేశారు. అన్ని రాజకీయ పార్టీల ప్రతినిధులతో ఆమె శనివారం కలెక్టర్ కార్యాలయంలో సమావేశం ఏర్పాటు చేసి ఎన్నికల తీరు తెన్నులపై సమీక్ష నిర్వహించారు. ఎన్నికల సందర్భంగా ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేసినట్లు ఎస్పీ అంబర్ కిశోర్ ఝా తెలిపారు. ఎమ్మెల్సీ ఎన్నికలకు భారీ బందోబస్తు వరంగల్ క్రైం : ఎమ్మెల్సీ ఎన్నికలను పురస్కరించుకుని జిల్లాలోని పలు పోలింగ్ కేంద్రాల వద్ద పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. ఈ మేరకు అర్బన్ పరిధిలో ఒక అదనపు ఎస్పీ, ఆరుగురు డీఎస్పీలు, 20 మంది సీఐలు, 35 మంది ఎస్సైలు, 400 కానిస్టేబుళ్లతో పాటు ఒక కంపెనీ సీఐఎస్ఎఫ్ బలగా లు పో లింగ్ నిర్వహణలో సేవలందించనున్నాయి. కాగా, రూరల్ పరిధిలో 20 మంది సీఐలు, 56 మంది ఎస్సై లు, 83 మంది ఏఎస్సైలు, హెడ్‌కానిస్టేబుళ్లు, 300 కానిస్టేబుళ్లు, 67 మహిళా కానిస్టేబు ళ్లు, హోంగార్డులు, 100 మంది కానిస్టేబుళ్లు, 34 మంది ఏఆర్ కానిస్టేబుళ్లు, ఒక కంపెనీ సీఐఎస్ఎఫ్ బలగాలను బందోబస్తు కోసం నియమించారు. -
సర్వం సిద్ధం
గుంటూరు ఎడ్యుకేషన్ : గుంటూరు-కృష్ణా శాసనమండలి ఉపాధ్యాయ నియోజకవర్గ ఎన్నికలకు జిల్లా అధికార యంత్రాగం ఏర్పాట్లను పూర్తి చేసింది. బ్యాలెట్ విధానంలో జరగనున్న ఎన్నికలకు జిల్లా నలుమూలలా ఏర్పాటు చేసిన 59 పోలింగ్ కేంద్రాల పరిధిలో సర్వం సిద్ధం చేశారు. జిల్లాలో ఓటు హక్కు కలిగిన 9,169 మంది ఓటర్లు ఆదివారం ఉదయం 8.00 గంటల నుంచి సాయంత్రం 4.00 గంటల వరకూ తమ ఓటు హక్కును వినియోగించుకోవచ్చు. ఓటు హక్కు కలిగిన వారిలో ప్రభుత్వ, ఎయిడెడ్ ఉన్నత పాఠశాలల ప్రధానోపాధ్యాయులు, ఉపాధ్యాయులు, జూనియర్, డిగ్రీ, పాలిటెక్నిక్ కళాశాలల అధ్యాపకులు, యూనివర్సిటీ అధ్యాపకులు, మెడికల్ కళాశాలలో ప్రొఫెసర్లు ఉన్నారు. ఎన్నికల్లో ఎటువంటి అవకతవలకు ఆస్కారం లేకుండా అధికార యంత్రాంగం ముందస్తు ఏర్పాట్లు చేసింది. గుంటూరు-కృష్ణా ఉపాధ్యాయ నియోజకవర్గ పరిధిలో మొత్తం 18,931 మంది ఓటర్లుండగా మొత్తం 110 పోలింగ్ కేంద్రాలు ఏర్పాటు చేశారు. వీటిలో గుంటూరు జిల్లాలోని 9,169 మంది ఓటర్లు కోసం 59, కృష్ణా జిల్లాలోని 9,762 మంది ఓటర్లు కోసం 51 పోలింగ్ కేంద్రాలు ఏర్పాటు చేశారు. జిల్లా వ్యాప్తంగా 57 మండలాల పరిధిలో ప్రతి మండల కేంద్రంలో ఒక పోలింగ్ కేంద్రాన్ని ఏర్పాటు చేయగా, గుంటూరు నగర పరిధిలోని ఓటర్ల కోసం మార్కెట్ సెంటర్లోని హిందూ కళాశాలలో మూడు పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేశారు. జిల్లా నలుమూలల ఏర్పాటు చేసిన పరీక్షా కేంద్రాల్లో పోలింగ్ నిర్వహణకు అవసరమైన సామగ్రిని శనివారం జిల్లా కేంద్రంలో సాంబశివపేటలోని సెయింట్ మహిళా బీఈడీ కళాశాల నుంచి జిల్లా రెవెన్యూ అధికారి కె. నాగబాబు పర్యవేక్షణలో పోలింగ్ సామగ్రిని తరలించారు. పోలింగ్ ముగిశార జిల్లా వ్యాప్తంగా పోలైన ఓట్లతో కూడిన బ్యాలెట్ బ్యాక్సులను జిల్లా కేంద్రంలోని సెయింట్ జోసఫ్ మహిళా బీఈడీ కళాశాలలో ఏర్పాటు చేసిన స్ట్రాంగ్ రూమ్‌లో భద్రపరచనున్నారు. ఈనెల 25న ఓట్ల లెక్కింపు చేపట్టి అదే రోజు ఫలితాలను ప్రకటిస్తారు. -
ఓటు హక్కు వినియోగంతోనే లక్ష్య సిద్ధి
‘ఓటు కోసం నడక’లో డీఆర్వో నాగబాబు గుంటూరు ఈస్ట్: ప్రతి ఒక్కరూ నిర్భయంగా, స్వేచ్ఛాయుత వాతావరణంలో ఓటు హక్కు వినియోగించుకున్నప్పుడే ప్రజాస్వామ్యం విజయవంతం అవుతుందని డీఆర్వో నాగబాబు అన్నారు. జాతీయ ఓటరు దినోత్సవం పురస్కరించుకుని ఆదివారం ఁఓటు కోసం నడక* నిర్వహించారు. గుంటూరు తూర్పు ఎమ్మెల్యే షేక్ మొహమ్మద్ ముస్తఫా, అదనపు ఎస్పీలు రామాంజనేయులు, భాస్కరరావు, ఆర్డీవో భాస్కర్ నాయుడు, ఎస్బీ డీఎస్పీ రామాంజనేయులు, పలు శాఖల జిల్లా అధికారులు, పాఠశాలలు, కళాశాలల విద్యార్థులు, సిబ్బంది ఉత్సాహంగా పాల్గొన్నారు. ఆర్డీవో నాగబాబు జెండా ఊపి ప్రారంభించిన నడక పోలీసు పరేడ్ గ్రౌండ్ నుంచి పాత బస్టాండ్ సెంటర్లోని ఉర్దూ పాఠశాల వరకు సాగింది. పలు నినాదాలతో కూడిన ప్లకార్డులను దారిపొడవునా ప్రదర్శించారు. ఓటు హక్కు విలువను తెలియజేస్తూ నినాదాలు చేశారు. ఈ సందర్భంగా డీఆర్వో నాగబాబు మాట్లాడుతూ ఓటరు నమోదు ప్రక్రియ నిరంతరం కొనసాగుతుందని చెప్పారు. 18 ఏళ్లు నిండినవారందరూ నమోదు చేసుకోవాలని పిలుపునిచ్చారు. ఎమ్మెల్యే ముస్తఫా మాట్లాడుతూ ప్రపంచంలోనే పెద్దదైన మన ప్రజాస్వామ్యంలో ఎన్నికల ప్రక్రియ పెద్ద పండుగని అన్నారు. ప్రతి ఒక్కరూ ఎన్నికల్లో ఓటు వేసి దేశ భవిష్యత్తును గొప్పగా మార్చాలని కోరారు. ఆర్డీవో భాస్కర్ నాయకుడు మాట్లాడుతూ దేశంలోని ఎన్నికల ప్రక్రియ భిన్నత్వంలో ఏకత్వం సాధిస్తుందని చెప్పారు. -
ఓటుతోనే దేశానికి దిశానిర్దేశం
ఎమ్మెల్యే మోదుగుల పాతగుంటూరు: దేశానికి దిశానిర్దేశం చేసేది ఓటు హక్కేనని గుంటూరు పశ్చిమ నియోజకవర్గ ఎమ్మెల్యే మోదుగుల వేణుగోపాల్‌రెడ్డి అన్నారు. ఆదివారం స్థానిక జిల్లా పరిషత్ సమాదేశ మందిరంలో జిల్లా రెవెన్యూ యంత్రాంగం నిర్వహించిన జాతీయ ఓటర్ల దినోత్సవ కార్యక్రమంలో ఆయన ముఖ్యఅతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ఓటును ఆభరణంలా కాకుండా ఆయుధంలా చూడాలని చెప్పారు. ఓటర్ల నమోదు నిరంతర ప్రక్రియగా మారటం యువతకు సదవకాశమన్నారు. ఎమ్మెల్సీ కె.ఎస్.లక్ష్మణరావు మాట్లాడుతూ ఓటు హక్కు వినియోగంపై ప్రజల్లో చైతన్యం రావలసిన అవసరం ఉందన్నారు. డీఆర్వో కె.నాగబాబు మాట్లాడుతూ 18 ఏళ్లు నిండినవారు ఆన్లైన్ ద్వారా లేదా తహశీల్దార్, బూత్ స్థారుు అధికారి ద్వారా ఓటరుగా నమోదుకావచ్చని వివరించారు. ఈ సందర్భంగా కొత్త ఓటర్లకు ఎమ్మెల్యే మోదుగుల గుర్తింపు కార్డులను అందజేశారు. వివిధ అంశాల్లో నిర్వహించిన జిల్లా స్థాయి పోటీల్లో విజేతలుగా నిలిచిన విద్యార్థులకు సర్టిఫికెట్లను అందజేశారు. కార్యక్రమంలో అదనపు జేసీ వెంకటేశ్వరరావు, గుంటూరు ఆర్డీవో భాస్కర నాయుడు, కలెక్టరేట్ పరిపాలనాధికారి ప్రసాద్, చాంబర్ ఆఫ్ కామర్స్ అధ్యక్షుడు ఆతుకూరి ఆంజనేయులు, కాంగ్రెస్ నేత అడివి ఆంజనేయులు, అవగాహన సంస్థ ప్రతినిధి కొండా శివరామిరెడ్డి తదితరులు పాల్గొన్నారు. -
ఓటుహక్కును కాలరాస్తారా?
హోటళ్లు, క్యాంటీన్లు, కార్పొరేట్ కార్యాలయాలపై బీఎంసీ చర్యలు సాక్షి, ముంబై: పోలింగ్ రోజు కూడా సెలవు ఇవ్వకుండా సిబ్బందితో పనిచేయించి, వారి ఓటుహక్కు కాలరాసిన హోటళ్లు, షాపింగ్ మాల్స్, క్యాంటీన్లు, కార్పొరేట్ కార్యాలయాలు ఇలా 280 సంస్థల నిర్వాహకులపై చర్యలు తీసుకునేందుకు బీఎంసీ రంగం సిద్ధం చేసింది. శాసన సభ ఎన్నికలను దృష్టిలో ఉంచుకుని ఓటర్లందరూ తమ ఓటు హక్కును తప్పకుండా వినియోగించుకోవాలనే ఉద్దేశంతో ఎన్నికల సంఘం బుధవారం పెయిడ్ లీవ్‌గా ప్రకటించింది. అలా వీలుకానిపక్షంలో రెండు గంటలు రాయితీ లేదా ఆఫ్ డే లీవ్ ఇవ్వాలని ఆదేశించింది. అయినప్పటికీ నగరంలోని హోటళ్లు, క్యాంటీన్లు, షాపులు, కొన్ని కార్పొరేట్ కార్యాలయాలు తెరిచే ఉన్నాయి. దీని కారణంగా అందులో పనిచేసే కార్మికులు, ఇతర సిబ్బంది ఓటు హక్కును వినియోగించుకోలేకపోయారు. ఇలాంటి సంస్థలపై దృష్టి సారించేందుకు బీఎంసీ ప్రత్యేకంగా నగరంలో నాలుగు బృందాలను ఏర్పాటు చేసింది. బుధవారం ఉదయం నుంచి సాయంత్రం వరకు ఈ బృందాలకు 82 ఫిర్యాదులు వచ్చాయి. వీరిచ్చిన ఫిర్యాదులపై ఆధారపడకుండా అదనపు కమిషనర్ వికాస్ ఖర్గే, డిప్యూటీ కమిషనర్ రాజేంద్ర బలే నేతృత్వంలో బీఎంసీలోని షాప్స్ అండ్ ఎస్టాబ్లిష్ డిపార్ట్మెంట్, కార్మికశాఖ కమిషనర్ కార్యాలయానికి చెందిన అధికారులు సంయుక్తంగా 2,706 సంస్థలపై నిఘా పెట్టారు. అందులో 2,426 సంస్థల్లో కార్మికులకు రెండు గంటలు లేదా సగం రోజు సెలవు ఇచ్చినట్లు గుర్తించారు. దీంతో ఈ యాజమాన్యాలపై ఎలాంటి చర్యలు తీసుకోలేదని షాప్స్ అండ్ ఎస్టాబ్లిష్ విభాగానికి చెందిన చీఫ్ ఇన్స్పెక్టర్ ఎ.డి.గోసావి చెప్పారు. చర్యలు తీసుకున్న 280 సంస్థల్లో 83 షాపులు, 186 కార్పొరేట్ సంస్థల కార్యాలయాలు, 11 క్యాంటీన్లు ఉన్నాయి. ఇందులో పనిచేస్తున్న కార్మికులు, ఇతర సిబ్బందికి ఉదయం నుంచి ఎన్నికలు ముగిసే వరకు ఓటు వేసేందుకు ఎలాంటి సౌకర్యం కల్పించలేదని స్పష్టమైంది. దీంతో ఆయా సంస్థల నిర్వాహకులపై చర్యలు తీసుకుంటామని చెప్పారు. -
జర జాగ్రత్త..!
ముంబై: లోక్‌సభ ఎన్నికల పోలింగ్‌కు ఇంకా మూడు రోజుల గడువు మాత్రమే ఉంది. దీంతో ఆయా పార్టీల అభ్యర్థులు తమ ప్రచారాన్ని ముమ్మరం చేశారు. ఓటర్లను ఆకట్టుకునేందుకు రకరకాల వ్యూహాల్లో ప్రచారం చేస్తున్నారు. తమ అభ్యర్థిని గెలిపించాలనే అభిప్రాయంతో పార్టీల కార్యకర్తలు కూడా ప్రచార జోరును పెంచారు. అయితే అభ్యర్థిగానీ, ఆయన మద్దతుదారులుగానీ పోలింగ్ రోజున అప్రమత్తంగా లేకపోతే ఇన్నిరోజుల శ్రమ అంతా వృథా అవుతుంది. ఒకవేళ గెలిచే అకాశమున్నా కార్యకర్తలు చేసే చిన్న చిన్న పోరపాట్లు అభ్యర్థుల విజయావకాశాలను దెబ్బతీసే ఆస్కారముంది. అందుకే పోలింగ్ రోజున అభ్యర్థులు, కార్యకర్తలు ఎలా మెలగాలి? ఏం చేస్తే తప్పుల్లో చిక్కుకుంటారనే విషయంలో అవగాహనను కలిగి ఉండాలి. ఆయా విషయాలపై కథనం... పోలింగ్ స్టేషన్లో.. పోలింగ్ స్టేషన్లో ఎన్నికల ప్రిసైడింగ్ అధికారి, అసిస్టెంట్ పీవోలు, సిబ్బంది అయా పార్టీలు, స్వతంత్ర అభ్యర్థుల ఏజెంట్లు మాత్రమే ఉంటారు. మిగిలిన వారిని లోపలికి రానివ్వరు. ఓటు వేయడానికి వచ్చిన వారికి అనుమతి ఉంటుంది. ఐదుగురు చొప్పున పోలింగ్ కేంద్రంలోకి అనుమతి ఇస్తారు. పోలింగ్ సమయం ముగిసే సరికి పోలింగ్ కేంద్రంలో ఓటర్లు ఉంటే వారికి ఓటు వేసేందుకు అనుమతి ఇస్తారు. గొడవ పడ్డారో అంతే సంగతులు.. ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థులకు ఎంతో సహనం అవసరం. ప్రత్యర్థులు రెచ్చగొట్టారని వివాదాలకు దిగితే ఇబ్బందే. గొలుపోటములు ఎలా ఉన్నా ప్రశాంతంగా లేకుంటే చిక్కులు తప్పవు. ప్రత్యర్థులు ఏదైనా రెచ్చగొడితే సంబంధిత అధికారుల దృష్టికి తీసుకుని వెళ్లాలి. గుర్తింపు కార్డు తప్పనిసరి ఓటు హక్కు ఉన్న వారు ఏదైనా గుర్తింపు కార్డు తీసుకుని పోలింగ్ కేంద్రాలకు వెళ్లాలి. రేషన్ కార్డు, ఆధార్ కార్డు, డ్రైవింగ్ లెసైన్స్, పాస్కార్డు, నివాస ధృవీకరణ పత్రం, పట్టాదారు పాసు పుస్తకం, విద్యార్హతల మెమో కార్డు తీసుకుని వెళ్లే గుర్తింపుతో వెంటనే ఓటు వేయడానికి వీలు ఉంటుంది. ఓటర్లను తరలించడం నేరం పోలింగ్ రోజున ఓటర్లను పోలింగ్ కేంద్రాలకు వాహనాల్లో తరలించడం కూడా ఎన్నికల నియమావళి ప్రకారం నేరమే. పోలింగ్ రోజున దూర ప్రాంతాల్లో ఉన్న ఓటర్లను ఆటోలు, కార్లు, ద్విచక్రవాహనాలపై తరలించి తమకు అనుకూలంగా ఓటు వేయించుకునే ప్రయత్నాలు చేయడం నేరం. ఓటర్లు స్వేచ్ఛగా ఓటు హక్కును వినియోగించుకునేలా వారు స్వచ్ఛందంగానే రావాల్సి ఉంటుంది. వారిని ఎటువంటి ప్రలోభాలకు గురిచేసినా ఎన్నికల కోడ్ ఉల్లంఘన కిందకే వస్తుంది. వాటిపై కేసులు కూడా నమోదు చేస్తారు. మహిళలు, పురుషులకు వేర్వేరు లైన్లు మహిళలు, పురుష ఓటర్లుకు వేర్వేరుగా ఓటు వేయడానికి లైన్లు ఏర్పాటు చేస్తారు. ఒక్కొక్క పోలింగ్ కేంద్రంలో ఓటర్ల సంఖ్యకు అనుగుణంగా పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేస్తారు. నిఘా నేత్రాలుంటాయ్.. ఎన్నికల సమయంలో అభ్యర్థులపై నిఘా ఉంటుంది. ఎన్నికల విధులు నిర్వర్తించే సిబ్బంది నిఘాను దృష్టిలో పెట్టుకుని అభ్యర్థులు జాగ్రత్తగా ఉండాలి. పోలింగ్ రోజున ఓటర్లను తరలిం చడం, మద్యం, డబ్బులు పంపిణీ చేయడం తదితర ప్రలోభాలపై నాఘా ఉంటుంది. ఇటువంటి విషయాల్లో ఆధారాలు ఉంటే కేసలు కూడా నమోదు చేస్తారు. అభ్యర్థులు ఇందుకు సంబంధించిన నియమ నిబంధనలను అతిక్రమిస్తే కఠిన చర్యలు తప్పవు. అధికారులతో అప్రమత్తం.. ఎన్నికల విధుల్లో ఉండే అధికారులతో అభ్యర్థులు, వారి అనుచరులు జాగ్రత్తగా ఉండాలి. అధికారులతో దురుసుగా వ్యవహరించకూడదు. ఓటు వేయకుండా ఓటర్లను అడ్డుకోవడం వంటి చర్యలు చేయకూడదు. ఇటువంటివి చేస్తే కేసుల్లో చిక్కుకుం టారు. అటువంటి వారిని పోలీసులు బైండోవర్ చేస్తారు. అంతే కాకుండా కేసులు నమోదయ్యి, విచారణలో నేర నిర్థారణ జరిగితే జైలు, జరిమానా తప్పదు. పార్టీ కండువాలకు అనుమతిలేదు అభ్యర్థులు పార్టీ, ఎన్నికల గుర్తుల బ్యాడ్జీలు ధరించి పోలింగ్ కేంద్రాల్లోకి వెళ్లకూడదు. కండువాలు, బ్యాడ్జీలతో లోనికి వస్తే ఎన్నికల నియామవళిని అతిక్రమించినట్లు భావించి, అధికారులు చర్యలు తీసుకుంటారు. పోలింగ్ ఏజెంట్లకు పాస్‌లు జారీ చేస్తారు. ఆ పాస్‌ల ఆధారంగా పోలింగ్ కేంద్రాల్లోకి అనుమతి ఉంటుంది. 200 మీటర్ల దూరంలోనే ప్రచారం పోలింగ్ కేంద్రం సమీపంలో ప్రచారం చేయడానికి వీలులేదు. పోలింగ్ కేంద్రానికి 200 మీటర్ల దూరంలో మాత్రమే అభ్యర్థి ప్రచారానికి అనుమతి ఉంటుంది. వంద మీటర్ల వరకు ఉండే లక్ష్మణ రేఖ దాటి లోపలికి వస్తే పోలీసులు కేసు నమోదు చేస్తారు. రూ.250 జరిమానా కూడా విధించవచ్చు. -
75% ఓటింగే లక్ష్యం
పింప్రి, న్యూస్‌లైన్: పుణే జిల్లాలో ఓటింగ్ శాతం పెంచేందుకు ఎన్నికల సంఘం కసరత్తు చేస్తోంది. ఈసారి ఓటింగ్‌ను 75 శాతానికి పెంచాలని లక్ష్యంగా పెట్టుకుంది. ఇందుకోసం జిల్లాలో ఎన్నికల సంఘం ఆధ్వర్యంలో వివిధ స్వచ్ఛంధ సంస్థలు ఓటు హక్కు గురించి ప్రజల్లో అవగాహనకల్పిస్తున్నారు. సైకిల్ ర్యాలీలు, ప్రచార రథాలతో ఓటు విలువను తెలియజేయడం, మారథాన్ వంటి కార్యక్రమాలను నిర్వహిస్తున్నారు. ఇందులో భాగంగా ‘ఓట్ ఎక్స్‌ప్రెస్’ మినీబస్‌ను కూడా ప్రాంభించారు. పింప్రి, చించ్వడ్, బోసిరి అసెంబ్లీ నియోజక వర్గాలలో తిరిగి ప్రజల్లో ఈ వాహనం జనజాగృతి కల్పించనుంది. చించ్వడ్ ఎన్నికల అధికారి భానుదాస్ గైక్వాడ్ ఓట్ ఎక్స్‌ప్రెస్‌కు సోమవారం పచ్చాజెండా ఊపి ప్రారంభించారు. ఇదిలా వుండగా 2009 అసెంబ్లీ ఎన్నికల్లో పుణే జిల్లాలో కేవలం 54.44 శాతం ఓటింగ్ మాత్రమే నమోదైంది. 2014 లోక్‌సభ ఎన్నికల్లో 57.42 శాతం ఓటింగ్ నమోదైంది. గతంతో పోలిస్తే కేవలం మూడు శాతం మాత్రమే పెరిగింది. దీంతో ఎన్నికల సంఘం ఈసారి ఓటింగ్‌ను 75 శాతానికి పెంచాలని లక్ష్యంగా పెట్టుకుంది. ఇందుకు గాను కసరత్తు చేస్తోంది. మరోపక్క జిల్లాలో రాజకీయ పార్టీల ప్రచారాలు హోరెత్తిస్తున్నాయి. వివిధ పార్టీల అభ్యర్థులు, స్వతంత్య్ర అభ్యర్థులు పాదయాత్రలు నిర్వహిస్తున్నారు. వీధి సభలు, బహిరంగ సభలు ఏర్పాటు చేస్తున్నారు. వివిధ పార్టీల ప్రచార డిజిటల్ స్క్రీన్ల రథాలు కూడా ఆకట్టుకుంటున్నాయి. జిల్లాలో ప్రతి నియోజకవర్గంలో వివిధ రాజకీయ పార్టీలు పోటీపడి ఎన్నికల ప్రచారాన్ని హోరెత్తిస్తుండడంతో ఎన్నికల కురుక్షేత్రం మహా సంగ్రామాన్ని తలపిస్తోంది. దీనికి తోడుగా ఓటింగ్ శాతం పెంచేందుకు ఎన్నికల సంఘం ఓట్ ఎక్స్‌ప్రెస్‌ను ప్రారంభించడంతో ఎన్నికల సందడి మరింత రసవత్తరంగా మారింది. ఈ ఎక్స్‌ప్రెస్ ప్రచార కార్యక్రమంలో ప్రవీణ్ లడకత్, నోడల్ ఆఫీసర్ యశ్వంత్ మన్కేడ్కర్, అన్నా బోదడే, శరద్ మాన్కర్, ప్రకాష్బన్, షబ్బీర్షేఖ్, అనిల్ పాసల్కర్ తదితర అధికారులు పాల్గొన్నారు. -
పదవులు...పడిగాపులు
ఎన్నికల సంఘం ప్రకటన కోసం నేతల ఎదురుతెన్నులు సాక్షిప్రతినిధి, నల్లగొండ: మున్సిపల్, ప్రాదేశిక ఎన్నికల ఫలితాలు వెలువడి నెలరోజులు కావస్తోంది.. ఈ రెండు ఎన్నికల తర్వాత జరిగిన సార్వత్రిక ఎన్నికల ఫలితాలు వెలువడడం, ప్రభుత్వం ఏర్పాటు కావడం, మంత్రి పదవులు పొందడం చకచకా జరిగిపోయింది. కానీ, మున్సిపల్ చైర్మన్, వైస్‌చైర్మన్, ఎంపీపీ, వైస్ ఎంపీపీ, జెడ్పీ, జెడ్పీ వైస్.... ఇంకా కోఆప్షన్ పదవుల భర్తీ జరగాల్సి ఉంది. ఇప్పుడు అందరి ఎదురుచూపులూ.. ఈ ఎన్నికల ప్రకటన కోసమే.. మరోవైపు ముఖ్య పదవులు ఆశిస్తున్న వారి దుంప తెగుతోంది. వీరి ఖర్చులు తడిసిమోపెడు అవుతున్నాయి. మున్సిపల్, ప్రాదేశిక ఫలితాలు వెలువడి నెలరోజులు కావొస్తున్నా ఇంకా ఎన్నిక జరగలేదు. రాష్ట్రపతి పాలన రద్దయ్యి, కొత్త ప్రభుత్వమూ కొలువుదీరింది. వెంటనే మున్సిపల్, మండల, జిల్లా పరిషత్‌లకు ఎన్నిక ఉంటుందని గతంలోనే రాష్ట్ర ఎన్నికల సంఘం ప్రకటించింది. ప్రభుత్వం ఏర్పడి ఐదురోజులు దాటింది. 9వ తేదీ నుంచి నాలుగురోజుల పాటు శాసనసభ సమావేశాలు కూడా జరగనున్నాయి. కానీ, ఇంతవరకు తమ ఎన్నికకు సంబంధించి ఎలాంటి ప్రకటనా వెలువడక పోవడంతో పదవులు ఆశిస్తున్న గెలుపు వీరులు ఎదురుచూపులతో విసిగిపోతున్నారు. మున్సిపల్ ఎన్నికలు మార్చి30వ తేదీన జరగగా, మే 12వ తేదీన ఫలితాలు వెలువడ్డాయి. ఇక, ఎంపీటీసీ, జెడ్పీటీసీ స్థానాలకు ఏప్రిల్ నెలలో 6, 11 తేదీల్లో రెండు విడతలుగా ఎన్నికలు జరిగాయి. కాగా, మే 13వ తేదీన ఫలితాలు వెలువడ్డాయి. ఎన్నిక జరిగిన నాటి నుంచి ఫలితాల కోసం నెల రోజులు, ఫలితాలు వచ్చిన నాటి నుంచి ఇప్పటి వరకు దాదాపు నెల రోజుల వెరసి రెండు నెలల పాటు వీరు పడిగాపులు గాయాల్సి వచ్చింది. మధ్యలో సార్వత్రిక ఎన్నికలు కూడా రావడంతో ఈ ఆలస్యం జరిగిందని భావించినా, మున్సిపల్, ప్రాదేశిక ఎన్నికల్లో ఎమ్మెల్యేలు, ఎంపీలు సైతం ఓటు హక్కు వినియోగించుకోవాల్సి ఉన్నందున మున్సిపల్ ైచె ర్మన్, వైస్‌చైర్మన్, ఎంపీపీ, వైస్‌ఎంపీపీ పదవులకు ఎన్నికలు జరపలేదు. అదే మాదిరిగా జిల్లా పరిషత్ చైర్మన్, వైస్‌చైర్మన్ పదవులకూ ఎన్నిక జరగలేదు. మొత్తంగా ఇప్పుడు 134 పదవులు ఎన్నిక ద్వారా భర్తీ కావాల్సి ఉంది. అటు మండల, జిల్లా పరిషత్‌తో పాటు మున్సిపాలిటీల్లోనూ కోఆప్షన్ సభ్యుల ఎన్నికా పెండింగులోనే ఉంది. ఈ పదవులు ఆశిస్తున్న వారంతా ఎప్పుడెప్పుడు ప్రకటన వెలువడుతుందా అని ఎదురు చూస్తున్నారు. ఇప్పటికే ఎంపీలు ప్రమాణ స్వీకారం కూడా చేశారు. ఇక, ఎమ్మెల్యేలు ఈ నెల 9న జరిగే తొలి శాసనసభా సమావేశాల్లో ప్రమాణం చేయనున్నారు. కనీసం ఈ నాలుగు రోజుల సెషన్ పూర్తయ్యే నాటికైనా ప్రకటన వెలువడుతుందా, ఇంకా ఆలస్యం చేస్తారా అన్న ఆందోళన వీరిలో ఉంది. ఈ ఎన్నికలకు సంబంధించి ప్రకటన ఎప్పుడు వెలువడుతుందా అని అంతా ఆశగా చూడడంతో పాటు ఇన్నాళ్లూ క్యాంపుల్లో ఉన్నవారు, రాష్ట్రంతో పాటు, ఇతర రాష్ట్రాలనూ చుట్టిన వారు ఇప్పుడిప్పుడే సొంత గూళ్లకు చేరుకుంటున్నారు. -
నాలుగు లక్షల మంది నోటా నొక్కారు
సాక్షి, ముంబై: తొలిసారిగా వినియోగంలోకి వచ్చిన ‘నన్ ఆఫ్ ది ఎబౌ’ (నోటా) మీటా బటన్‌ను లక్షలాది మంది వినియోగించుకున్నారు. ఎన్నికల సంఘం అందించిన వివరాల మేరకు రాష్ట్రవ్యాప్తంగా మొత్తం 4,23,180 మంది ఓటర్లు ఈ నోటా మీటాను వినియోగించుకున్నారు. రాజకీయ నేతలపై ఉన్న అసంతృప్తిని చూపించారు. రాష్ట్రంలోని 48 లోక్‌సభ నియోజకవర్గాలలో అత్యధికంగా 24,488 మంది గడ్చిరోలి-చిమూర్ లోక్‌సభ నియోజకవర్గంలో నోటామీటాను వినియోగించి తమ అసంతృప్తిని వెళ్లగక్కారు. అత్యల్పంగా బీడ్ పార్లమెంట్ నియోజకవర్గంలో కేవలం 2,323 మంది ఓటర్లు ఈ మీటాను వినియోగించుకున్నారు. అయితే దాదాపు అన్ని నియోజకవర్గాల్లో అనేక మంది ప్రజలు ఈ మీటా కారణంగా ఓటు హక్కు వినియోగించుకున్నారని తెలుస్తోంది. గతంలో ఈ మీటా అందుబాటులోకి రాకముందు అభ్యర్థులపై అసంతృప్తిగా ఉండే వీరు ఎవరికో ఒకరికి ఓటు వేయాల్సి వస్తుందనే ఉద్దేశంతో ఓటు హక్కు వినియోగించడమే మానేశారు. అయితే ఈ మీటా అందుబాటులోకి రావడంతో వీరు కూడా ఓటు హక్కు వినియోగించుకునేందుకు వీలుపడింది. నాలుగు నియోజకవర్గాల్లో 20వేలమందికిపైగా ఓటర్లు ఈ మీటాను వినియోగించుకున్నారు. 13 నియోజకవర్గాల్లో 10 వేల నుంచి 20 వేల వరకు ఓటర్లు నోటా బటన్‌ను నొక్కారు. ఎన్సీపీ అధ్యక్షుడు శరద్ పవార్ కుమార్తె పోటీ చేసిన పవార్ కుటుంబీకులకు పెట్టనికోటగా ఉన్న బారామతి లోక్‌సభ నియోజకవర్గంలో కూడా 14,216 మంది ఈ నోటా మీటాను నొక్కారు. కేంద్ర హోంశాఖ మంత్రి సుశీల్‌కుమార్ షిండే పోటీ చేసిన షోలాపూర్‌లో 13,778 మంది ఓటర్లు నోటా నొక్కి తమ అసంతృప్తిని వెళ్లగక్కారు. -
ఐదోసారి హరీష్‌కే జై
సిద్దిపేట జోన్, న్యూస్‌లైన్: తెలంగాణ ఉద్యమానికి పురిటిగడ్డగా పేరొందిన సిద్దిపేట ప్రజలు మరోసారి తాజా మాజీ ఎమ్మెల్యే తన్నీరు హరీష్‌రావుకే జై కొట్టారు. ఈ సార్వత్రిక ఎన్నికల్లో సిద్దిపేట నియోజకవర్గం నుంచి పోటీ చేసిన హరీష్‌రావు మరోసారి భారీ మెజార్టీతో విజయం సాధించారు. హరీష్‌రావుకు 1,08,699 ఓట్లు రాగా, ఆయనకు 93,328 ఓట్ల మెజార్టీ దక్కగా, ప్రత్యర్థులందరి డిపాజిట్లు గల్లంతయ్యాయి. దీంతో హరీష్‌రావు ఐదోసారి సిద్దిపేట నుంచి గెలిచి రికార్డు సృష్టించారు. సంగారెడ్డిలోని ఎంఎన్ఆర్ కళాశాలలో శుక్రవారం జరిగిన సిద్దిపేట నియోజకవర్గ ఓట్ల లెక్కింపులో ఆద్యంతం టీఆర్ఎస్ హవానే కొనసాగింది. ఏప్రిల్ 30న జరిగిన సార్వత్రి ఎన్నికల్లో సిద్దిపేట నియోజకవర్గంలోని మూడు మండలాలకు చెందిన లక్షా 50 వేల మంది ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకోగా, వీటిలో అత్యధికంగా టీఆర్ఎస్కే దక్కాయి. పెరిగిన మెజార్టీ 2004 ఉప ఎన్నికల్లో సిద్దిపేట నుంచి రాజకీయ ఆరంగేట్రం చేసిన హరీష్‌రావుకు అప్పట్లోనే 24,827 ఓట్ల మెజార్టీ వచ్చింది. ఉద్యమ నేపథ్యంలో జరిగిన ఎన్నికలన్నింటిలోనూ ఆయన తన మెజార్టీని మరింత పెంచుకుంటూ పోయారు. ఈ క్రమంలోనే 2008లో 58,935 ఓట్ల మెజార్టీ, 2009 జమిలి ఎన్నికల్లో 64,014 ఓట్ల మెజార్టీని సాధించారు. ఇక 2010లో జరిగిన ఉప ఎన్నికల్లో హరీష్‌రావు 95,858 ఓట్ల మెజార్టీని సాధించి రాష్ట్రస్థాయిలో రికార్డు సొంతం చేసుకున్నారు. ఇక ప్రస్తుత ఎన్నికల్లోనూ హరీష్‌రావు 93,328 ఓట్ల మెజార్టీ సాధించారు. అందరూ ఔట్! సిద్దిపేట అసెంబ్లీ స్థానం నుంచి హరీష్ రికార్డు మెజార్టీ సాధించగా, ఇక్కడ బీఎస్పీ తరఫున పోటీ చేసిన కర్రొల్ల బాబుకు 5,035 ఓట్లు, కాంగ్రెస్ అభ్యర్థి తాడూరి శ్రీనివాస్‌గౌడ్‌కు 15,371, బీజేపీ అభ్యర్థి విద్యాసాగర్‌కు 13,003, వైఎస్సార్సీపీ అభ్యర్థి తడక జగదీశ్వర్‌కు 555, రిపబ్లిక్ పార్టీ అభ్యర్థి కమలాకర్‌కు 1,140, లోక్‌సత్తా అభ్యర్థి తుమ్మలపల్లి శ్రీనివాస్‌కు 627 ఓట్లు పోలయ్యాయి. స్వతంత్ర అభ్యర్థులుగా బరిలో దిగిన బత్తుల చంద్రంకు 3,774 ఓట్లు, నర్సింహారెడ్డికి 615, ఉడుత మల్లేశంకు 245, బాల్‌రాజ్‌కు 592 ఓట్లు వచ్చాయి. సిద్దిపేట నియోజకవర్గంలో పోలైన ఓట్లలో 1,658 ఓట్లు నోటా కింద నమోదు కావడం విశేషం. పోస్టల్‌బ్యాలెట్ లూ టీఆర్ఎస్కే పోస్టల్ బ్యాలెట్లలోనూ అధికశాతం టీఆర్ఎస్కే అనుకూలంగా వచ్చాయి. పోస్టల్ బ్యాలెట్లలో టీఆర్ఎస్ అభ్యర్థి హరీష్‌రావుకు 790 ఓట్లు రాగా, కాంగ్రెస్ అభ్యర్థి శ్రీనివాస్‌గౌడ్‌కు 26, బీజేపీ అభ్యర్థి విద్యాసాగర్‌కు 77 ఓట్లు వచ్చాయి. కౌంటింగ్ ప్రక్రియ ఉదయం 8 గంటలకు ప్రారంభమైనప్పటికీ సిద్దిపేట నియోజకవర్గానికి సంబంధించిన లెక్కింపు, ఫలితాల వెల్లడిలో కొంత జాప్యం చోటు చేసుకుంది. దీంతో మధ్యాహ్నం 3 గంటల వరకు సిద్దిపేట నియోజకవర్గ ఫలితాలపై స్పష్టత రాలేదు. హరీష్‌రావు తరఫున టీఆర్ఎస్ ప్రతినిధి దేవునూరి రవీందర్ రిటర్నింగ్ అధికారి చేతుల మీదుగా ధృవీకరణ పత్రాన్ని అందుకున్నారు. హరీష్‌రావు విజయాన్ని అధికారికంగా ప్రకటించగానే స్థానిక కౌంటింగ్ కేంద్రం బయట నియోజకవర్గానికి చెందిన నాయకులు సంబరాలు జరుపుకున్నారు. -
జోగిపేట నగర పంచాయతీకి తొలి మహిళా చైర్మన్ ఎవరో!
జోగిపేట, న్యూస్‌లైన్: జోగిపేట నగర పంచాయతీకి మొదటి సారి జరుగుతున్న ఎన్నికల్లో ఎవరు మొట్ట మొదటి చైర్మన్ (మహిళ) అవుతారో సోమవారం చేపట్టనున్న ఓట్ల లెక్కింపులో తేలనుంది. జోగిపేట నగర పంచాయతీ చైర్మన్ పదవిని బీసీ మహిళకు రిజర్వు చేశారు. దీంతో 20 వార్డులకు గాను 107 మంది అభ్యర్థులు రంగంలో ఉన్నారు. ఇందులో 40 మంది మహిళలు పోటీ చేస్తున్నారు. వీరిలో 1,4,5,8,9.10,13,14,16,19 వార్డులను మహిళలకు కేటాయించారు. అయితే జనరల్ స్థానాల్లో కూడా మహిళలను పోటీలోకి దింపారు. ఈ ఎన్నికల్లో మొత్తం 16,047 ఓట్లకుగాను 13,031 మంది ఓటు హక్కును వినియోగించుకున్నారు. 6556 మంది పురుషులు, 6475 మంది మహిళలు ఓటు హక్కు వినియోగించుకోగా మొత్తం 81.21 శాతం ఓట్లు పోలయ్యాయి. ఈ ఎన్నికల్లో కాంగ్రెస్ తరఫున 20, టీఆర్ఎస్ తరఫున 19, టీడీపీ తరఫున 17 మంది, సీపీఎం తరఫున ఒకరు, బీజేపీ తరఫున ఐదుగురు పోటీలో ఉన్నారు. 50 శాతానికి పైగా అభ్యర్థులు యువకులే ఉండడం విశేషం. ైచె ర్మన్ పదవికి టీఆర్ఎస్, కాంగ్రెస్‌లో పోటీ ఉన్నాయి. ఇరు పార్టీలు కూడా చైర్మన్ పదవిని దక్కించుకునేందుకు ప్రయత్నాలు చేస్తున్నాయి. పార్టీలు మారిన అభ్యర్థులు నగర పంచాయతీ ఎన్నికల్లో కౌన్సిలర్లుగా పోటీ చేసిన అభ్యర్థులు సార్వత్రిక ఎన్నికలకు వచ్చే సరికి పార్టీలు మారి పోయారు. ఈ విషయం స్థానికంగా చర్చనీయాంశమైంది. చైర్మన్ ఎన్నికలో వారు ఎవరికి సహకరిస్తారనేది స్థానికంగా చర్చనీయాంశమైంది. టీడీపీ తరఫున పోటీ చేసిన వారు కాంగ్రెస్, టీఆర్ఎస్, బీజేపీ తరఫున పోటీ చేసిన వారు కాంగ్రెస్, టీఆర్ఎస్ తరఫున పోటీ చేసిన ఒకరిద్దరు కాంగ్రెస్ వైపు మొగ్గు చూపినట్లు సమాచారం. ఇందులో మరి కొందరు బహిరంగంగా తాము పోటీ చేసిన పార్టీకి కాకుండా వేరే పార్టీకి మద్దతు తెలిపారు. చైర్మన్ రేసులో.. జోగిపేట నగర పంచాయతీ చైర్మన్ రేసులో కాంగ్రెస్ తరఫున సురేందర్‌గౌడ్, హెచ్.నారాయణ గౌడ్, హెచ్.రామాగౌడ్, డాకూరి జోగినాథ్ సతీమణులు, టీఆర్ఎస్ తరఫున పోటీ చేసిన పట్లూరి రజని శివప్రకాశ్ చైర్మన్ పదవి రేసులో ఉన్నారు. మాజీ వార్డు సభ్యుడు ప్రవీణ్‌కుమార్ కూడా చైర్మన్ పదవిని ఆశిస్తూ టీడీపీ తరఫున భార్యతో పాటు ఆయన కూడా 10,11 వార్డుల్లో పోటీ చేశారు. అయితే ఆయన సార్వత్రిక ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి మద్దతుఇచ్చారు. ఎన్నికల ఫలితాల అనంతరం ఆయన ఏ నిర్ణయం తీసుకుంటారో వేచిచూడాల్సి ఉంది. నేడు సంగారెడ్డిలో ఓట్ల లెక్కింపు జోగిపేట నగర పంచాయతీ ఎన్నికలకు సంబంధించి సంగారెడ్డిలోని దుర్గాబాయి మహిళా శిశు వికాస కేంద్రంలోని మొదటి అంతస్తులో ఎన్నికల లెక్కింపును నిర్వహించనున్నారు. ఎన్నికల్లో పోటీ చేసిన అభ్యర్థులు ఉదయం 7 గంటల వరకు కేంద్రాలకు చేరుకోవాలని అధికారులు సూచించారు. ఏజెంట్ పాస్‌లను ఇది వరకే అభ్యర్థులకు జారీ చేసినట్లు కమిషనర్ జి.విజయలక్ష్మి తెలిపారు. -
బద్ధకస్తులు.. 5,66,412
సాక్షి, అనంతపురం డెస్క్ : ఒకే ఒక్క జ్ఞాన కిరణం అజ్ఞాన తిమిరాలను పటాపంచలు చేస్తుంది. మనం వేసే ఓటు అసమర్థులు అందలమెక్కకుండా అడ్డుకుంటుంది. అభివృద్ధికి తారక మంత్రమై కోటి కాంతులు విరజిమ్ముతుంది. ఐదేళ్ల ప్రగతికి పసిడి బాటలు పరుస్తుంది. మనసున్న మారాజులను గెలిపిస్తే మన భవిష్యత్ ఉజ్వలంగా ఉంటుంది. అలాంటి తరుణంలో చాలా మంది నిర్లక్ష్యం వహించారు. వజ్రాయుధం వంటి ఓటు హక్కును సద్వినియోగం చేసుకోలేకపోయారు. పోలింగ్ కేంద్రానికి వెళ్లి గంటల తరబడి క్యూలో నిల్చొని ఏం ఓటేద్దాంలే అనుకున్నారో లేక మనం ఓటేస్తేనే వాళ్లు గెలుస్తారా? అని అనుకున్నారో.. ఎన్నికల రోజు వచ్చిన సెలవును కుటుంబ సభ్యులతో కలిసి హాయిగా గడుపుతూ సద్వినియోగం చేసుకుందామనుకున్నారో.. మొత్తానికి జిల్లా వ్యాప్తంగా 5,66,412 మంది తమ అమూల్యమైన ఓటు హక్కును వినియోగించుకోలేదు. రాష్ట్ర విభజన నిర్ణయం తర్వాత అత్యంత ప్రతిష్టాత్మకంగా జరిగిన ఎన్నికల్లో నిర్లిప్తత ప్రదర్శించారు. ముందు నుంచి ఓటింగ్ శాతం పెంచేందుకు ఎన్నికల సంఘం చర్యలు తీసుకున్నా ఫలితం లేకపోయింది. జిల్లాలో ఈ సార్వత్రిక ఎన్నికల్లో 80.04 శాతం పోలింగ్ నమోదైంది. అనంతపురం అర్బన్ నియోజకవర్గంలో అత్యధికంగా 1,00,324 మంది ఓటర్లు ఓటు వేయలేదు. అత్యల్పంగా ఉరవకొండ నియోజకవర్గంలో 28,348 మంది తమ ఓటు హక్కును సద్వినియోగం చేసుకోలేదు. గ్రామీణుల్లో చైతన్యం ఉట్టిపడగా.. పట్టణ, నగరవాసుల్లో మాత్రం నిర్లక్ష్యం స్పష్టంగా కన్పించింది. పల్లె బాటపట్టిన ఓటర్లు! జిల్లాలోని గ్రామీణ ప్రాంతాల్లో నివాసముంటున్న చాలా మంది బతుకుదెరువు కోసం పట్టణ, నగరానికి వలస వచ్చి స్థిరపడ్డారు. ఇలాంటి వారు ఓటర్లుగా స్వగ్రామాలతో పాటు నివాసముంటున్న ప్రాంతాల్లో కూడా నమోదు చేయించుకున్నట్లు తెలుస్తోంది. ఈ క్రమంలో సార్వత్రిక ఎన్నికల పోలింగ్ రోజున చాలా మంది తమ స్వగ్రామాలకు వెళ్లి ఓటు వేసినట్లు స్పష్టమవుతోంది. ఈ కారణంగానే పట్టణ, నగరాల్లో ఓటింగ్ శాతం తగ్గినట్లు తెలుస్తోంది. ఇక వేసవి సెలవులు ఉండడంతో కుటుంబ సభ్యులతో కలిసి విహారయాత్రలు, ఇతర జిల్లాల్లోని బంధువుల ఇళ్లకు వెళ్లిన వారు తిరిగి రాకపోవడం, పూర్తి స్థాయిలో ఓటర్ స్లిప్పులు పంపిణీ చేయకపోవడం పోలింగ్ శాతంపై ప్రభావం చూపినట్లు స్పష్టమవుతోంది. -
వైఎస్ఆర్సీపీకే సహకారం
అనంతపురం అగ్రికల్చర్, న్యూస్‌లైన్ : జిల్లా సహకార మార్కెటింగ్ సొసైటీ (డీసీఎంఎస్) డెరైక్టర్ ఎన్నికల్లో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ మద్దతుదారులు విజయభేరి మోగించారు. టీడీపీ మద్దతుదారులు ఓటమి పాలయ్యారు. కాంగ్రెస్ పార్టీ అడ్రస్ పూర్తిగా గల్లంతైంది. వివరాలు.. డీసీఎంఎస్‌లో కేటగిరీ-ఏ కింద ఆరు డెరైక్టర్ స్థానాలున్నాయి. ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులు లేక రెండు స్థానాలు ఖాళీ పడ్డాయి. మిగిలిన నాలుగు స్థానాలకు శనివారం స్థానిక ప్రభుత్వ జూనియర్ కళాశాల ప్రాంగణంలో గట్టి పోలీస్ బందోబస్తు మధ్య పోలింగ్ నిర్వహించారు. ఇందులో మూడు ఓపెన్ కేటగిరీ (ఓసీ)స్థానాలకు ఏడుగురు అభ్యర్థులు బరిలోకి దిగారు. వీరి ముగ్గురు వైఎస్సార్సీపీ తరఫున, నలుగురు టీడీపీ మద్దతుతో పోటీ చేశారు. ఒక బీసీ డెరైక్టర్ స్థానానికి ఇరు పార్టీల తరఫున ఒక్కొక్కరు చొప్పున పోటీ చేశారు. ఈ ఎన్నికల్లో 112 మంది ప్రాథమిక వ్యవసాయ సహకార పరపతి సంఘాల (పీఏసీఎస్) అధ్యక్షులకు ఓటు హక్కు కల్పించారు. ఉదయం ఏడు నుంచి మధ్యాహ్నం రెండు వరకు పోలింగ్ జరిగింది. 112 మందిలో 109 మంది ఓటు హక్కు వినియోగించుకున్నారు. జూటూరు సొసైటీ అధ్యక్షుడు జేసీ ప్రభాకర్‌రెడ్డితో పాటు మరో ఇద్దరు ఓటింగ్‌కు హాజరు కాలేదు. ప్రతి ఒక్కరూ రెండు బ్యాలెట్లపై స్వస్తిక్ మార్కుతో ఓటేసే పద్ధతి పెట్టారు. ఓసీ డెరైక్టర్ల బ్యాలెట్ పత్రంలో ముగ్గురికి, బీసీ డెరైక్టర్ బ్యాలెట్ పత్రంలో ఒకరికి ఓటు వేయాల్సి ఉండగా... ఐదుగురు అధ్యక్షులు ఓసీ బ్యాలెట్ పత్రంలో ముగ్గురి కన్నా ఎక్కువ మందికి ఓటు వేశారు. దీంతో వాటిని చెల్లని ఓట్లుగా పరిగణించారు. మధ్యాహ్నం 2 గంటలకు పోలింగ్ ముగిసింది. మూడు గంటల నుంచి ఓట్ల లెక్కింపు చేపట్టారు. బీసీ డెరైక్టర్ స్థానం నుంచి వైఎస్సార్సీపీ మద్దతుదారుడు బోయ మల్లికార్జున 19 ఓట్ల మెజార్టీతో గెలుపొందారు. ఆయనకు 64 ఓట్లు లభించగా, టీడీపీ మద్దతుదారుడు బీగం శంకరనాయుడుకు 45 ఓట్లు మాత్రమే వచ్చాయి. ఓసీ డెరైక్టర్ స్థానాల నుంచి టి.జగదీశ్వర్‌రెడ్డి (68 ఓట్లు), జీవీ రమణారెడ్డి (66), పి.జయరామిరెడ్డి (63) విజయం సాధించారు. టీడీపీ మద్దతుదారులు జి.రాజగోపాలరెడ్డికి 40 ఓట్లు, జి.సురేష్‌కు 39, పి.బాలకృష్ణకు 31 ఓట్లు మాత్రమే వచ్చాయి. మరో అభ్యర్థి ఎన్.రంగనాథ్రెడ్డికి ఒక ఓటు మాత్రమే పడడం గమనార్హం. డెరైక్టర్లుగా గెలిచిన వారికి ఎన్నికల అధికారి ఈ.అరుణకుమారి, డీఎల్సీఓ కుమార్‌రాజా, సుధీంద్ర తదితరులు డిక్లరేషన్ పత్రాలు అందజేశారు. రాయదుర్గం అసెంబ్లీ వైఎస్సార్సీపీ అభ్యర్థి, తాజా మాజీ ఎమ్మెల్యే కాపు రామచంద్రారెడ్డి కౌంటింగ్ హాలుకు చేరుకుని గెలిచిన వైఎస్సార్సీపీ మద్దతుదారులను అభినందించారు. కాగా, పోలింగ్ సందర్భంగా వైఎస్సార్సీపీకి చెందిన పలువురు ముఖ్య నేతలు ప్రభుత్వ జూనియర్ కళాశాల వద్దకు చేరుకున్నారు. అనంతపురం ఎంపీ అభ్యర్థి అనంత వెంకటరామిరెడ్డి, ఎమ్మెల్యే అభ్యర్థులు మాలగుండ్ల శంకరనారాయణ, తోపుదుర్తి ప్రకాష్‌రెడ్డి, నాయకులు తోపుదుర్తి ఆత్మారామిరెడ్డి, తోపుదుర్తి భాస్కర్‌రెడ్డి, డీసీసీబీ చైర్మన్ అభ్యర్థి లింగాల శివశంకర్‌రెడ్డి, వైస్ చైర్మన్ అభ్యర్థి అనందరంగారెడ్డి, ఆకులేడు రామచంద్రారెడ్డి తదితరులు ఉదయం తొమ్మిది నుంచి మధ్యాహ్నం పన్నెండు వరకు పోలింగ్ కేంద్రం వద్దే ఉన్నారు. ఉరవకొండ టీడీపీ అభ్యర్థి పయ్యావుల కేశవ్ పది నిమిషాలు ఉండి వెళ్లిపోయారు. కాగా, కేటగిరి-బి కింద ఉన్న నాలుగు స్థానాల్లో మూడింటిలో వైఎస్ఆర్సీపీ మద్దతుదారులు, మరో స్థానంలో ఏ పార్టీ మద్దతులేని వ్యక్తి ఇదివరకే ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. అభ్యర్థులు లేక మిగిలిపోయిన రెండు డెరైక్టర్ స్థానాలను కోఆప్షన్ పద్దతిలో ఎంపిక చేస్తారు. దీంతో మొత్తం 10 డెరైక్టర్ స్థానాల్లో ఇప్పటికే ఏడింటిని కైవసం చేసుకున్న వైఎస్ఆర్సీపీ మద్దతుదారులు ఆదివారం నిర్వహించే చైర్మన్, వైస్ చైర్మన్ ఎన్నికలో విజయకేతనం ఎగుర వేయడం లాంఛనమే. డీసీసీబీ చైర్మన్, వైస్ చైర్మన్ల ఎన్నిక కూడా ఆదివారమే జరగనుంది. -
పోస్టల్ బ్యాలెట్ గందరగోళం
ఇబ్రహీంపట్నం రూరల్, న్యూస్‌లైన్ : ఎన్నికల విధులు నిర్వహించి పోస్టల్ బ్యాలెట్ ద్వారా ఓటుహక్కు వినియోగించుకున్న ఉద్యోగస్తులకు మళ్లీ ఓటేయాలంటూ శనివారం పోస్టల్ బ్యాలెట్ పత్రాలు పోలింగ్ బూత్‌లకు రావడంతో గందరగోళానికి గురయ్యారు. భువనగిరి పార్లమెంట్ స్థానానికి గత నెల 30వ తేదీన ఎన్నిక జరగ్గా వేర్వేరు ప్రాంతాల్లో ఎన్నికల విధులు నిర్వహించిన ఉద్యోగులు పోస్టల్ బ్యాలెట్ ద్వారా ఓట్లు వేశారు. అయితే మళ్లీ ఓట్లు వేయాలంటూ అధికారులు పోస్టల్ బ్యాలెట్ పత్రాలు పంపించడంతో ఉద్యోగస్తులు విస్తుపోయారు. పోస్టల్ బ్యాలెట్ ద్వారా ఓటుహక్కు వినియోగించుకొని పది రోజులవుతుంటే మళ్లీ ఓటేయాలనడం విడ్డూరంగా ఉందన్నారు. జిల్లాలోని వేర్వేరు ప్రాంతాల్లో పనిచేసే ఉద్యోగస్తులు తమ బ్యాలెట్ పత్రాలు బూత్‌ల వద్దకు వచ్చాయని తెలుసుకుని శనివారం సొంతూళ్లకు చేరుకొని తహసీల్దార్ కార్యాలయం వద్ద క్యూ కట్టారు. అయితే ఓటేయాలంటే గెజిటెడ్ సంతకం కావాలి, ఐడెంటిటీ కార్డులు ఉండాలనే నిబంధనలు పెట్టడంతో చాలామంది ఇబ్బందులు ఎదుర్కొన్నారు. ఓటేసినా మళ్లీ ఈ లొల్లి ఏంటని పలువురు గొణుక్కున్నారు. ఈ విషయంపై రిటర్నింగ్ అధికారి విఠల్‌ను వివరణ కోరగా... స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేసిన వ్యక్తికి సంబంధించిన వివరాలు బ్యాలెట్ పేపర్లో తప్పుగా ముద్రించడంతో భువనగిరి పార్లమెంట్ పరిధిలోని పలు అసెంబ్లీ నియోజకవర్గాల్లో ఈ సమస్య వచ్చిందన్నారు. ఈ నెల 14 సాయంత్రం లోపు పోస్టల్ బ్యాలెట్లను తమకు అందజేయాలని ఉద్యోగస్తులకు సూచించారు. -
ఓటుకు రాష్ట్రపతి దూరం
న్యూఢిల్లీ: రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ తన ఓటు హక్కును వినియోగించుకోకూడదని నిర్ణరుుంచుకున్నారు. ప్రస్తుత ఎన్నికల పోరాటంలో తటస్థతను వ్యక్తం చేసే ఉద్దేశంతో ఆయన ఈ నిర్ణయం తీసుకున్నారు. వాస్తవానికి పోస్టల్ బ్యాలెట్ ద్వారా ఓటు వేసేందుకు ప్రణబ్ అన్ని ఏర్పాట్లూ చేసుకున్నారు. అలా చేస్తే ఆ విధంగా ఓటు వేసిన మొదటి ప్రథమ పౌరుడిగా ఆయన రికార్డులకెక్కేవారు. కానీ చివరకు ఓటు వేయకూడదనే ప్రణ బ్ నిర్ణరుుంచుకున్నారు. తద్వారా తన పూర్వీకులు అనుసరించిన సంప్రదాయూ న్ని ఆయన కొనసాగించనున్నారు.ఈ మేరకు రాష్ట్రపతి మీడియూ కార్యదర్శి వేణు రాజమణి శుక్రవారం ప్రకటన విడుదల చేశారు. సోమవారం ఎన్నికలు జరగనున్న దక్షిణ కోల్‌కతా స్థానంలోని 160 రస్బెహారీలో ప్రణబ్ ఓటరుగా ఉన్నారు. -
‘తెలుగునాడు’గా మార్చాలి : లగడపాటి
విజయవాడ, న్యూస్‌లైన్ : కొత్తగా ఏర్పడే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి తెలుగునాడుగా పేరు మార్చాలని దీని కోసం అసెంబ్లీలో కొత్త ప్రభుత్వం తీర్మానం చేయాలని విజయవాడ మాజీ ఎంపీ లగడపాటి రాజగోపాల్ కోరారు. మొగల్రాజపురంలోని జనశిక్షణ సంస్థాన్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన పోలింగ్ కేంద్రంలో బుధవారం ఆయన ఓటు హక్కు వినియోగించుకున్నారు. అనంతరం విలేకరులతో మాట్లాడుతూ.. కొత్తగా ఏర్పడనున్న ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి రూ.10వేల కోట్ల లోటు బడ్జెట్ ఉంటున్న నేపథ్యంలో కొత్త ప్రభుత్వం కేంద్రం నుంచి నిధులు రాబట్టి రాష్ట్రాన్ని అభివృద్ధి పథంలో నడిపించాలన్నారు. హైదరాబాద్‌లో ఉన్న రెండు రాష్ట్ర ప్రభుత్వాలు సమన్వయంతో పనిచేయాలన్నారు. ఈ ఎన్నికల్లో గెలుపొందిన పార్టీ కొత్త రాష్ట్రంలోనే ప్రమాణస్వీకారం చేయాలని కోరారు. ఎంత త్వరగా కొత్త రాజధాని ఏర్పాటు జరిగితే అంతే వేగంగా మన రాష్ట్రం అభివృద్ధి చెందుతుందన్నారు. హైదరాబాద్‌లో ఉన్న సీమాంధ్ర ప్రాంత ఉద్యోగులు వీలైనంత త్వరగా కొత్త రాష్ట్రానికి వెళ్లిపోవాలనే ఉద్దేశంతో ఉన్నారని తెలిపారు. జేఎస్పీతో సంబంధం లేదు.. జైసమైక్యాంధ్ర పార్టీతో తనకు ఎటువంటి సంబంధం లేదని లగడపాటి స్పష్టం చేశారు. జై సమైక్యాంధ్ర ఉద్యమం అనేది ప్రజల్లోని ఐక్యత అని, పార్టీతో సంబంధం ఉండదని చెప్పారు. మళ్లీ క్రియాశీలక రాజకీయాల్లోకి ఎప్పుడు వస్తున్నారని మీడియా ప్రతినిధులు అడిగిన ప్రశ్నకు సమాధానం చెపుతూ.. తనకు పునర్జన్మ మీద నమ్మకం లేదని, మళ్లీ రాజకీయాల్లోకి వస్తానని తాను భావించటం లేదన్నారు. రాజకీయ భవిష్యత్తును దృష్టిలో ఉంచుకుని గానీ, ఒక పార్టీలోకి వెళ్లాలనే ఉద్దేశంతో గానీ తాను సర్వే ఫలితాలు ప్రకటించటం లేదన్నారు. కొందరు తన పేరు ఉపయోగించుకుని దొంగ సర్వేలు చేస్తున్నారని, దీంతో తాను సర్వేలు చేయటం ప్రస్తుతానికి నిలిపివేశానని చెప్పారు. గెలుపోటములపై పోలింగ్ శాతం ప్రభావం న్నికల్లో ట్రెండ్ అనేది పోలింగ్ సరళిని ఆధారంగా మారుతుందన్నారు. పోలింగ్ శాతం ఒక్కో నియోజకవర్గంలో ఒక్కో ట్రెండ్‌ను సృష్టిస్తుందన్నారు. పోలింగ్ మొత్తం పూర్తయిన తరువాత ఏ పార్టీ అధికారంలోకి వస్తుందనే అంశంపై తాను ఒక అభిప్రాయానికి వస్తానన్నారు. ఓటర్లలో చైతన్యం పెరిగిందన్నారు. ఈ నెల 12వ తేదీన వెలువడే మున్సిపల్ ఎన్నికల ఫలితాలకు దగ్గరగానే ఇంచుమించు అసెంబ్లీ ఫలితాలు ఉంటాయని జోస్యం చెప్పారు. -
వాలంటీర్లకు అందని పోస్టల్ బ్యాలెట్లు
మోర్తాడ్, న్యూస్‌లైన్ : పోస్టల్ బ్యాలెట్ ద్వారా ఓటు హక్కును వినియోగించుకునేందుకు గడువు సమీపిస్తున్నా సాధారణ ఎన్నికల్లో విధులు నిర్వహిం చిన వాలంటీర్లకు మా త్రం ఇంకా పోస్టల్ బ్యాలెట్లు అందలేవు. ఇటీవల ముగిసిన సాధారణ ఎన్నికల్లో సుమారు ఏడు వందల మంది ఎన్సీసీ, ఎన్ఎస్ఎస్ వాలంటీర్లు సేవలందించారు. జిల్లా వ్యాప్తంగా తొమ్మిది నియోజకవర్గాల్లోని 2054 పోలింగ్ బూత్‌లలో ఓటర్లు, పోలిం గ్ సిబ్బందికి మధ్య వారధిగా పని చేశారు. ఓటు వేయడానికి వచ్చే వృద్ధులు, వికలాంగులకు ఓటు వేయడానికి వాలంటీర్లు సహకరించారు. పోలీసులు భద్రత చర్యలు చేపడితే, వాలంటీర్లు ఓటర్లకు సహాయసహ కారాలు అందించారు. వాలంటీర్లు డిగ్రీ చదువుతున్నవారు కావడంతో అందరికి ఓటు హక్కు ఉంది. పోలింగ్ విధులు నిర్వహించిన ఉద్యోగులకు పోస్టల్ బ్యాలెట్ సౌకర్యం ఉండటంతో వారు తమ ఓటు హక్కును పోస్టల్ ద్వారానే వినియోగించుకుంటున్నారు. అయితే ఈ సారి తొలిసారిగా ఎన్సీసీ, ఎన్ఎస్ఎస్ వాలంటీర్లను ఎన్నికల విధులకు వినియోగించుకున్నారు. పోలింగ్ విధులను నిర్వహించిన వాలంటీర్లకు కూడా పోస్టల్ బ్యాలెట్ సౌకర్యాన్ని కల్పిస్తామని అధికారులు ప్రకటించారు. దీంతో గడచిన నెలలోనే వాలంటీర్లు పోస్టల్ బ్యాలెట్ల కోసం దరఖాస్తు చేసుకున్నారు. ఉద్యోగులకు మాత్రం పోస్టల్ బ్యాలెట్లు తపాల శాఖ ద్వారా అందాయి. వారు సంబంధిత తహ శీల్దార్ కార్యాలయంలోని బ్యాలెట్ బాక్సులో తమ ఓట్లు వేశారు. ఈనెల 16వ తేదీన కౌంటింగ్ నిర్వహించనున్న దృష్ట్యా అంతకు ఒక రోజు ముందుగా పోస్టల్ బ్యాలెట్‌ను వినియోగించుకునే వీలు ఉంది. ఇప్పటివరకు వాలంటీర్లు, కొందరు ఉద్యోగులకు ఇంకా పోస్టల్ బ్యాలెట్లు అందలేవు. గడువు సమీపిస్తున్నా పోస్టల్ బ్యాలెట్లు అందక పోవడంతో ఓటు హక్కును వినియోగించుకుంటామా లేదా అనేది సంశయంగా మారింది. ఇప్పటికైనా అధికారులు స్పందించి పోస్టల్ బ్యాలెట్లను తొందరగా సరఫరా చేయాలని వాలంటీర్లు కోరుతున్నారు. ఎల్లారెడ్డి రూరల్ : సిబ్బంది నిర్లక్ష్యం వల్ల పలువురు ఉద్యోగుల పోస్టల్ బ్యాలెట్లు తిరిగి ఆర్వో కార్యాలయానికి చేరాయి. మండలంలోని పలువురు ప్రభుత్వ ఉద్యోగులు పోస్టల్ బ్యాలెట్ కోసం దరఖాస్తు చేసుకున్నారు. విధులు నిర్వహిస్తున్న వారిలో 1451 మంది పోస్టల్ బ్యాలెట్ కోసం దరఖాస్తు చేసుకున్నారు. వీరిలో 750 మంది తమ ఓటు హక్కును ఇప్పటికే వినియోగించుకున్నారు. మిగతా వారు ఈనెల 16వ తేదీ ఉదయం 8 గంటల వరకు తమ ఓటు హక్కును ప్రభుత్వ ఉద్యోగులు వినియోగించుకునే అవకాశం ఉంది. కాగా పలువురు ప్రభుత్వ ఉద్యోగుల చిరునామాలు కంప్యూటర్లో తప్పుగా నమోదు చేయడంతో వారికి పోస్టల్ బ్యాలెట్లు అందలేదని సమాచారం. మండలంలోని 30, 40 మంది ప్రభుత్వ ఉద్యోగుల పోస్టల్ బ్యాలెట్లు తిరిగి ఆర్వో కార్యాలయానికి చేరినట్లు తెలిసింది. మండలంలోని ఓ ప్రభుత్వ ఉద్యోగి అల్మాజీపూర్ చిరునామా ఇవ్వగా సిబ్బంది ఆజామ్పూర్ గ్రామంగా కంప్యూటర్లో నమోదు చేశారు. అలాగే తిమ్మారెడ్డి గ్రామానికి గానూ తిమ్మారెడ్డిపూర్గా నమోదైంది. దీంతో పోస్టల్ సిబ్బంది చిరునామా తప్పుగా ఉందని, తిరిగి వాటిని ఆర్వో కార్యాలయానికి పంపించివేసినట్లు సమాచారం. -
సొంత ఊళ్లకు పయనం
సాక్షి, సిటీబ్యూరో : సొంత ఊళ్లలో ఓటు హక్కును వినియోగించుకొనేందుకు మూడు రోజులుగా సీమాంధ్రకు తరలివెళ్తున్న ప్రయాణికుల రద్దీ మంగళవారం తారాస్థాయికి చేరుకుంది. బుధవారం ఎన్నికలు కావడంతో నగరవాసులు భారీ సంఖ్యలో బయలుదేరారు. దీంతో నగరంలోని రైల్వేస్టేషన్లు, బస్స్టేషన్లు కిటకిటలాడాయి. సికింద్రాబాద్ రైల్వేస్టేషన్లో ప్రయాణికుల రద్దీని నియంత్రించేందుకు ప్రత్యేకంగా బందోబస్తును ఏర్పాటు చేశారు. బస్సులు, రైళ్లలోనే కాకుండా లక్షలాది మంది ప్రజలు సొంత వాహనాలు, ట్యాక్సీల్లో బయలుదేరి వెళ్లారు. మూడు రోజులుగా చార్జీలు రెట్టింపు చేసిన ప్రైవేట్ ఆపరేటర్లు మంగళవారం కూడా దోపిడీ కొనసాగించారు. అయితే పోటీలో ఉన్న అభ్యర్థులే ప్రయాణ చార్జీలను భరిస్తుండడంతో ప్రయాణికులు చార్జీలు రెట్టింపయినా లెక్క చేయకుండా బయలుదేరారు. మంగళవారం ఒక్క రోజే సుమారు ఐదు లక్షల మంది బయలుదేరినట్లు అంచనా. కిక్కిరిసిన ఎంజీబీఎస్ ... మహాత్మాగాంధీ బస్‌స్టేషన్ ప్రయాణికులతో కిక్కిరిసింది. రోజూ నడిచే 850 దూరప్రాంత బస్సులతో పాటు, మంగళవారం మరో 700 బస్సులను అదనంగా ఏర్పాటు చేశారు. విశాఖ, విజయవాడ, గుంటూరు, ఒంగోలు, కర్నూలు, కడప, నె ల్లూరు, తిరుపతి తదితర ప్రాంతాలకు ప్రయాణికులు బయలుదేరి వెళ్లారు. ప్రైవేట్ బస్సులు సైతం కిటకిటలాడాయి. కూకట్‌పల్లిహౌసింగ్‌బోర్డు, అమీర్‌పేట్, లక్డీకాపూల్, కోఠి, అబిడ్స్, దిల్సుఖ్నగర్, వనస్థలిపురం, తదితర ప్రాంతాల నుంచి ప్రైవేట్ బస్సులు బయలుదేరాయి. ప్రయాణికుల ధర్నా.. సికింద్రాబాద్ నుంచి రాష్ట్రవ్యాప్తంగా పలు ప్రాంతాలకు వెళ్లే ప్రధాన ఎక్స్‌ప్రెస్‌ల వద్ద గందరగోళం నెలకొంది. వెయిటింగ్ లిస్టు ప్రయాణికులు, రిజర్వేషన్ నిర్ధరణకాని వాళ్లు, జనరల్ బోగీ ప్రయాణికుల నుంచి తీవ్రమైన ఒత్తిడి రావడంతో వారిని స్లీపర్‌క్లాస్ బోగీల్లోకి అనుమతించారు. దీంతో అప్పటికే స్లీపర్‌క్లాస్‌లో రిజర్వేషన్లు చేసుకున్న ప్రయాణికులు ఆందోళనకు గురయ్యారు. సాధారణ ప్రయాణికులంతా బోగీల్లోకి ఎక్కేయగా రిజర్వేషన్ ప్రయాణికులు ప్లాట్‌ఫామ్‌పైనే ఉండిపోవలసి వచ్చింది. విశాఖకు వెళ్లవలసిన జన్మభూమి ఎక్స్‌ప్రెస్‌లో ఇలాంటి పరిస్థితే చోటుచేసుకుంది. కొంతమంది టీసీలు ప్రయాణికుల వద్ద అదనపు డబ్బులు తీసుకొని ఎస్-6 బోగీలోకి సాధారణ ప్రయాణికులను ఎక్కించడంతో 30 మందికి పైగా రిజర్వేషన్ ప్రయాణికులు స్టేషన్ మేనేజర్ కార్యాలయం వద్ద ధర్నాకు దిగారు. దీంతో మరో రైలులో వారిని విశాఖకు పంపించేందుకు అధికారులు ఏర్పాట్లు చేశారు. ఎంజీబీఎస్ వద్ద ప్రయాణికుల అభిప్రాయాలు.. ఓటు వేసేందుకు వచ్చా.. నేను మహారాష్ట్ర ఉద్దిర్లో వ్యాపారం చేస్తున్నా. ఎన్నికల్లో ఓటు వేసేందుకు వ్యాపారాన్ని మానుకుని మా స్వస్థలమైన చిత్తూరు జిల్లా కలకడ మండలం, కోన గ్రామానికి వెళ్తున్నా. - నాగస్వామి నాయక్ బంధువులతో కలిసి.. పదేళ్ల క్రితం రాజమండ్రి నుంచి నగరానికి వచ్చి రంగారెడ్డి జిల్లా యమన్నగర్లో చిరు వ్యాపారం చేసుకుంటూ జీవిస్తున్నాం. ఎన్నికల్లో ఓటు వేసేందుకు మా బంధువులతో కలిసి రాజమండ్రికి వెళ్తున్నా. - ఎండపల్లి వీరవేణి పనిమానేసి వెళ్తున్నా.. కొన్నేళ్ల క్రితం నగరానికి వచ్చి శంషాబాద్‌లో భవన నిర్మాణ కాంట్రాక్టర్‌గా పనిచేస్తున్నా. మా స్వస్థలమైన కావలి (నెల్లూరు జిల్లా) లో ఓటు వేసేందుకు పనిమానేసి వెళ్తున్నా. - శ్రీనివాస్, శంషాబాద్ -
ఓటు వేయడం బాధ్యత
ఒంగోలు కలెక్టరేట్/సెంట్రల్, న్యూస్‌లైన్ : ఓటర్లంతా ఓటు వేయడాన్ని బాధ్యతగా భావించాలని జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ విజయకుమార్ సూచించారు. రాజ్యాంగం కల్పించిన ఓటు హక్కును అర్హులంతా వినియోగించుకోవాలని, నూరుశాతం ఓటింగ్ జరిపి సమర్థులైన పాలకులను ఎన్నుకోవాలని పిలుపునిచ్చారు. స్వీప్ ఆధ్వర్యంలో స్థానిక చర్చిసెంటర్లో పొదుపు సంఘాల సభ్యులతో శనివారం ఓటుహక్కుపై చైతన్య కార్యక్రమం నిర్వహించారు. ముందుగా పొదుపు సంఘాల మహిళలు స్థానిక మున్సిపల్ కార్పొరేషన్ కార్యాలయం నుంచి ప్రదర్శనగా బయలుదేరి చర్చి సెంటర్‌కు చేరుకున్నారు. జిల్లా ఎన్నికల అధికారి విజయకుమార్ వారిచేత ఓటరు ప్రతిజ్ఞ చేయించారు. అనంతరం పొదుపు సంఘాల సభ్యులంతా మానవహారంగా ఏర్పడి ఎలాంటి ప్రలోభాలకు లొంగకుండా ఓటుహక్కు వినియోగించుకోవాలంటూ నినాదాలు చేశారు. నగరంలోని వీధుల్లో ర్యాలీ చేపట్టారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ ఈ నెల 7వ తేదీ సార్వత్రిక ఎన్నికల్లో జిల్లాలోని ఓటర్లంతా ఓటుహక్కు వినియోగించుకోవాలని కోరారు. ఓటు హక్కుపై ఓటర్లలో చైతన్యం కోసం జిల్లావ్యాప్తంగా గ్రామస్థాయిలో కూడా అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నామన్నారు. ప్రజాస్వామ్య దేశంలో ప్రజలతో ఎన్నుకోబడిన ప్రభుత్వాలే పాలన సాగించాలన్నారు. అలాంటి పరిపాలన కోసం అర్హులంతా ఓటువేసి ప్రపంచ వ్యాప్తంగా దేశానికి వన్నె తీసుకురావాలని విజయకుమార్ కోరారు. కార్యక్రమంలో స్వీప్ నోడల్ అధికారి, స్టెప్ సీఈఓ బీ రవి, ఒంగోలు ఆర్డీవో ఎంఎస్ మురళి, ఒంగోలు మున్సిపల్ కార్పొరేషన్ కమిషనర్ సీహెచ్ విజయలక్ష్మి, సాంఘిక సంక్షేమశాఖ డిప్యూటీ డెరైక్టర్ సరస్వతి, మెప్మా పీడీ కమలకుమారి పాల్గొన్నారు. -
‘దుబ్బాక’లో ఒక ఓటు గల్లంతు!
దుబ్బాక,న్యూస్‌లైన్: దుబ్బాక నియోజకవర్గంలో గత నెల 30న జరిగిన పొలింగ్‌లో శాసనసభ అభ్యర్థికి, లోక్‌సభ అభ్యర్థికి సమానంగా ఓట్లు పోలు కాలేదు. ఈవీఎం పద్ధతి అమలులోకి వచ్చిన తర్వాత పార్లమెంట్‌కు, శాసనసభకు సమానంగా ఓట్లు పోలవుతున్నాయి. ఈ ఎన్నికల్లో మాత్రం నియోజకవర్గంలో శాసనసభకు పొలైన ఓట్ల కంటే లోక్‌సభకు ఒక ఓటు తక్కువగా పోలవడం విచిత్రం. అభ్యర్థులు ఓటరుకు నచ్చని పక్షంలో నోటా అవకాశం ఉంది. అయినప్పటికీ దుబ్బాకలో ఒక ఓటు శాసనసభకు వేసి, మరో ఓటు లోక్‌సభ అభ్యర్థికి వేయకపోవడం అధికారులకు సైతం అంతుచిక్కడం లేదు. ఆ ఓటు వినియోగించుకోనిది కూడా ఓ మహిళ ఓటరు కావడం విశేషం. నియోజకవర్గంలో మొత్తం 1,86,445 మంది ఓటర్లున్నారు. ఇందులో మహిళలు 94,165 మంది, పురుషులు 92,273 మంది, ఇతరులు 07 ఓటర్లున్నారు. ఇందులో నియోజకవర్గంలో పొలైన ఓట్లలో 77,407 మంది మహిళలు, 76,450 మంది పురుషులు మొత్తం 1,53,857 ఓట్లు పోలయ్యాయి. ఇందులో శాసనసభకు 1,53,857 ఓట్లు పోల్ కాగా...పార్లమెంట్‌కు 1,53,856 ఓట్లు పోలయ్యాయి. నియోజకవర్గంలోని దుబ్బాక పట్టణంలోని 34వ పొలింగ్ కేంద్రంలో ఒక మహిళ శాసన సభకు ఓటు వేసి, లోక్‌సభ అభ్యర్థికి ఓటు వరేయలేదని అధికారులు తెలిపారు. దుబ్బాకలోని 34వ పొలింగ్ కేంద్రంలో 1023 మంది ఓటర్లున్నారు. ఇందులో 529 మంది మహిళా ఓటర్లు, 494 మంది పురుషులు ఉన్నారు. ఈ పొలింగ్ కేంద్రంలో 1023 మంది ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. అయితే వీరిలో 369 మంది పురుషులు, 415 మంది మహిళలు శాసన సభ అభ్యర్థులకు ఓటు వేశారు. ఇకపోతే లోక్‌సభ అభ్యర్థులకు 369 మంది పురుషులు ఓటు వేశారు. 414 మంది మహిళా ఓటర్లు ఓటు వేశారు. వీరిలో ఒక మహిళ ఓటు తక్కువగా నమోదైంది. ఇలా చాల అరుదుగా జరుగుతుందని అధికారులు చెబుతున్నారు. ఓటరుకు అభ్యర్థి నచ్చకుంటే నోటాకు ఓటు వేసే అవకాశం ఉంటుంది. పార్లమెంటరీ నియోజకవర్గం అభ్యర్థికి ఒక ఓటు త క్కువగా నమోదు కావడం చర్చనీయంశంగా మారింది. పొలింగ్ కేంద్రంలో మొదట లోక్‌సభకే ఓటు వేయాల్సి ఉంటుంది. ఆనంతరం శాసనసభకు ఓటు వేయాలి. మరి ఈ పొలింగ్కేంద్రంలో మొదట పార్లమెంటరీ నియోజకవర్గం అభ్యర్థికి ఓటు వేయకుండా నేరుగా ఎమ్మెల్యే అభ్యర్థికి ఓటు వేసి వెళ్లిపోయి ఉండవచ్చని అనుమనాలు వ్యక్తమవుతున్నాయి. ఆ ఓటు ఏ అభ్యర్థికి పడేదో కాని, ఆ అభ్యర్థి ఒక ఓటును నష్టపోవాల్సి వచ్చిందని విశ్లేషకులు భావిస్తున్నారు. -
పెరిగింది 2 శాతమే
మోర్తాడ్/కలెక్టరేట్, న్యూస్‌లైన్: ఈ సాధారణ ఎన్నికల్లో జిల్లాలో పోలింగ్ శాతం స్వల్పంగా పెరిగింది. 2009 ఎన్నికల్లో 70.75 శాతం నమోదు కాగా, ఈసారి 72.12 నమోదైంది. పోలింగ్ శాతాన్ని 90కి పెంచాలనే ఎన్నికల సంఘం ఆదేశాల మేరకు, ఆ దిశగా జిల్లా అధికార యంత్రాం గం తీవ్రంగా కృషిచేసింది.అయినప్పటికీ గతంలో మాదిరిగానే పోలింగ్ శాతం నమోదు కావడంతో అధికారులకు మింగుడుపడటం లేదు.ఎన్నడూ లేనివిధంగా పెద్ద ఎత్తున ప్రచారం చే శారు. అయినా 2009 సాధారణ ఎన్నికలతో పోల్చితే ఈ ఎన్నికల్లో కేవలం రెండు శాతం పోలింగ్ మాత్రమే పెరిగింది. మునుపటికంటే ఇప్పటి ఎన్నికల్లో ఓటర్ల సంఖ్య భారీగా పెరిగింది. కాని పోలింగ్ శాతంలో మాత్రం మార్పు రాకపోవడం అధికారులను విస్మయానికి గురిచేస్తోంది.పోలింగ్ సమయాన్ని ఎన్నికల కమిషన్ ఈసారి పెంచింది. గతంలో ఉదయం ఏడు గంటల నుంచి సాయంత్రం ఐదు గంటల వరకు పోలింగ్ జరిగేది. కాని ఈసారి గంట సమయం పెంచి సాయంత్రం ఆరు గంటల వరకు కొనసాగించింది. అయినా ఓటింగ్ శాతం మాత్రం పెరగలేదు. ప్రచారం చేసినా... పోలింగ్ శాతం పెంచడానికి అధికారులు ఓటరు చైతన్య కార్యక్రమాలు చేపట్టారు. ఓటు హక్కు ఆవశ్యకతను వివరిస్తూ పెద్ద ఎత్తున ప్రచారం నిర్వహించా రు.పోలింగ్ శాతాన్ని 90కి పెంచాలని ఎన్నికల కమిషన్ జిల్లా కలెక్టర్లను ఆదేశించింది. దీంతో పోలింగ్ తేదీని వివరిస్తూ, ఓటు హక్కును వినియోగించుకో వాలని కోరుతూ ప్రధాన ప్రాంతాలలో పెద్దపెద్ద ఫ్లెక్సీలను ఏర్పాటు చేశారు. వాల్ రైటింగ్, కరపత్రా లు, టీవీ, దినపత్రికల్లో భారీగా ప్రకటనలు వేశారు. ప్రచార వాహనాలు ఏర్పాటు చేసి ఊరువాడా ఊదరగొట్టారు. బీఎల్వోల ద్వారా పోల్ చిట్టీలను పంపిణీ చేశారు. పోల్ చిట్టీలు అందని వారికి పోలింగ్ కేంద్రా ల వద్దనే అందించే ఏర్పాట్లు చేశారు. మధ్యాహ్నం వరకు ఓటు హక్కు వినియోగించుకోని వారి వివరాలను బీఎల్వోలు సేకరించి, ఓటర్లను పోలింగ్ కేంద్రాలకు రప్పించే ఏర్పాట్లు చేశారు. అభ్యర్థుల ప్రచారాన్ని తలపించేలా అధికారులు ప్రచారం నిర్వహించారు. ఇంత చేసినా స్వల్పంగానే పోలింగ్ శాతం పెరిగింది. జిల్లాలో... తొమ్మిది నియోజకవర్గాల్లో 2009 ఎన్నికల్లో 16,63,721 మంది ఓటర్లు ఉండేవారు. ప్రస్తుత సాధారణ ఎన్నికల్లో ఆ సంఖ్య 18,53,288కు చేరిం ది. ఐదేళ్లలో ఓటర్ల సంఖ్య 1,89,567 పెరిగింది. 2009 ఎన్నికల్లో 11,72,092 మంది ఓటు హక్కును వినియోగించుకున్నారు. ఈ ఎన్నికల్లో 13,26,220 మంది మాత్రమే ఓటు హక్కును వినియోగించుకున్నారు. గతంలో కంటే ఓటర్ల సంఖ్య పెరిగినా... పోలింగ్ ఒక్క శాతమే పెరిగింది. గత ఎన్నికల్లో 70.75 శాతం పోలింగ్ నమోదైతే, ఈసారి 72.12 శాతం పోలింగ్ నమోదైంది. ఈ ఎన్నికల్లో 90 శాతం అంటే 16,67,960 మంది ఓటు హక్కును వినియోగించుకుంటారని అధికారులు అంచనా వేశారు. అధికారులు అంచనా వేసిన దానికంటే 3,41,740 మంది తక్కువగా ఓటు హక్కును వినియోగించుకున్నారు. ఎల్లారెడ్డిలో అత్యధికం.. అర్బన్‌లో అత్యల్పం... జిల్లాలోని నియోజకవర్గాల్లో పోలింగ్ శాతాన్ని పరిశీలిస్తే ఎల్లారెడ్డి నియోజకవర్గంలో అత్యధికంగా 78.74 శాతం పోలింగ్ నమోదైంది. నిజామాబాద్ అర్బన్ నియోజకవర్గంలో అత్యల్పంగా 52.30 పోలింగ్ శాతం నమోదైంది. జిల్లాకేంద్ర స్థానం, ఎక్కువ మంది విద్యావంతులు ఉండే అర్బన్ నియోజకవర్గంలో పోలింగ్ శాతం తగ్గడంపై ప్రజాస్వామ్యవాదులు విచారం వ్యక్తం చేస్తున్నారు. వెనుకబడిన జుక్కల్ నియోజకవర్గంలో కూడా 78 శాతం పోలింగ్ నమోదు కావడం విశేషం. మిగిలిన ఆరు నియోజకవర్గాల్లో 70 శాతంకు పైగా పోలింగ్ నమోదైంది. కారణాలు ఇవేనా...? పోలింగ్ శాతం పెరగక పోవడానికి పలు కారణాలు ఉన్నాయని పరిశీలకులు చెబుతున్నారు. ఓటర్ల జాబి తాల్లో ఒక్కొక్కరికి రెండేసి ఓట్లు ఉండటం, కొందరికి తమ సొంత గ్రామంలో, తాత్కాలికంగా నివాసం ఉంటున్న ప్రాంతాల్లో ఓటు హక్కు ఉండటం వల్ల ఒకేచోట ఓటు హక్కును వినియోగించుకునే వీలు ఉంది. దీంతో ఒక చోట ఓటు హక్కు వినియోగించుకోక పోవడంతో పోలింగ్ శాతం పెరగక పోవడంపై ప్రభావం చూపిందని అభిప్రాయం వ్యక్తం చేస్తున్నా రు. ఓటరు జాబితాలో పేర్లు ఉండి స్థానికంగా నివాసం ఉండని వారి పేర్లను నాన్ అవెలబిలిటీ, ఆప్సెంట్ జాబితాలో చేర్చాల్సి ఉంది. ఒకవేళ ఓటరు తన వద్ద ఉన్న ఆధారాల ను తీసుకువస్తే ఎన్‌వోబీ జాబితాలో ఉన్న వారికి ఓటు వేసే వీలును కల్పించాలని అధికారులు నిర్ణయం తీసుకున్నారు. ఈ ఎన్నికల్లోనే ఎన్‌వోబీ జాబితాను ప్రత్యేకంగా తయారు చేశారు. కాగా ఎన్‌వోబీ జాబితాలో ఎక్కువ మంది పేర్లను చేర్చలేదు. స్థానికంగా నివాసం ఉండకున్నా... సాధారణ ఓటరు జాబితాలోనే పేర్లు ఉండటంతో పోలింగ్ శాతంలో తేడాలకు ప్రధాన కారణం అయ్యిందని పరిశీలకులు చెబుతున్నారు. అలాగే మండుతున్న ఎండలు, పాలకుల తీరుపై విసుగు ఒక కారణంగా బావిస్తున్నారు. ఈసీ, అధికారయంత్రాం గం ఇన్ని చర్యలు తీసుకున్నా పోలింగ్ శాతం పెరగక పోవడం వారిని నిరాశకు గురిచేసింది. నిజామాబాద్ ఎంపీ స్థానంలో 68.41 నిజామాబాద్ పార్లమెంట్ స్థానానికి 68.41 శాతం పోలింగ్ నమోదైంది. నిజామాబాద్ పార్లమెంట్ పరిధిలో ఆర్మూర్, బోధన్, నిజామాబాద్ అర్బన్, నిజామాబాద్ రూరల్, బాల్కొండ, కోరుట్ల,జగిత్యా ల నియోజకవర్గాలు ఉన్నాయి. దీని పరిధిలో మొత్తం 14,95,957 మంది ఓటర్లు ఉండగా, 10,23,522 మంది ఓట్లు పోలయ్యాయి. -
ఓటెత్తని ఉద్యమగడ్డ
సిద్దిపేట జోన్, న్యూస్‌లైన్: ఉద్యమాల పురిటిగడ్డ సిద్దిపేటలో ఎన్నికల వేళ జనచైతన్యం కరువైంది. ప్రతి ఒక్కరూ ఓటు వేయాలంటూ నెలరోజులుగా అధికారులు ఊరూవాడా ప్రచారం చేసినా అనుకున్న లక్ష్యం మాత్రం నెరవేరలేదు. స్థానిక సంస్థల ఎన్నికల్లో రెట్టించిన ఉత్సాహంతో ఓటెత్తిన ఓటర్లు సార్వత్రిక సమరంలో విజేతను ఎంపిక చేసేందుకు మాత్రం ఉత్సాహం చూపలేదు. దీంతో సిద్దిపేటలో ఓటింగ్ శాతం పడిపోయింది. కేవలం నెలరోజుల్లోనే 12 శాతం పోలింగ్ శాతం తగ్గడం చూస్తుంటే ఓటుహక్కుపై ప్రజలను మరింత చైతన్యం చేయాల్సిన అవసరం ఉందని స్పష్టమవుతోంది. సిద్దిపేట నియోజకవర్గ పరిధిలో 1,01,271 మంది మహిళలు, 1,01,071 మంది పురుషులు మొత్తంగా 2,02,359 మంది ఓటర్లు ఉన్నారు. వీరిలో 1,50,141 మంది సార్వత్రిక ఎన్నికల్లో తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. విస్తృతంగా చైతన్య కార్యక్రమాలు నిర్వహించడంతోపాటు ఓటరు పండుగ పేరుతో జిల్లా యంత్రాంగం ప్రోత్సాహకాలను ప్రకటించినప్పటికి, సార్వత్రిక పోరుకు 52,218 మంది ఓటర్లు దూరంగా ఉన్నారు. మరోవైపు ఓటు హక్కును వినియోగించుకున్నవారిలో మహిళలే అత్యధికంగా ఉన్నారు. పోలింగ్ సరళిని విశ్లేషిస్తే సిద్దిపేట నియోజకవర్గంలో 74.20 శాతం పోలింగ్ నమోదైంది. స్థానిక సంస్థల్లో ఉత్సాహం... గత నెలలో జరిగిన స్థానిక సంస్థల ఎన్నికల్లో సిద్దిపేట నియోజకవర్గం పరిధిలో 82 శాతం పోలింగ్ శాతం నమోదు కాగా, అప్పట్లో సుమారు 80 శాతం మంది మహిళలు తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. నియోజకవర్గంలోనే అత్యధికం సిద్దిపేట మండలం పుల్లూర్ గ్రామ మధిర బండచెర్లపల్లి 20 నంబరు పోలింగ్ కేంద్రంలో 96.34 శాతం పోలింగ్ నమోదు కాగా, అత్యల్పంగా సిద్దిపేట పట్టణంలోని మెరిడియన్ పాఠశాలలో ఏర్పాటు చేసిన 141/ఎ పోలింగ్ కేంద్రంలో 41.90 శాతం పోలింగ్ నమోదైంది. టీఆర్ఎస్ అధినేత కేసీఆర్ స్వగ్రామం చింతమడకలో సగటున 83 శాతం పోలింగ్ నమోదైంది. సార్వత్రికంలో నిరుత్సాహం.. సిద్దిపేట నియోజకవర్గ పరిధిలో సిద్దిపేట, నంగునూరు, చిన్నకోడూరుతో పాటు అర్బన్ ప్రాంతంలోని 243 కేంద్రాల్లో బుధవారం పోలింగ్ జరిగింది. ఇప్పటికే అధికారులు ఓటు హక్కుపై విస్తృత ప్రచారం నిర్వహించారు. మరోవైపు జిల్లా కలెక్టర్ ఒక అడుగు ముందుకు వేసి అత్యధికంగా పోలింగ్ శాతం నమోదు కోసం అనేక ప్రోత్సాహకాలు ప్రకటించారు. ఓటువేసిన వారికి పెట్రోల్, డిజిల్, నిత్యవసర కొనుగోళ్లలో రాయితీని ప్రకటించారు. అదే విధంగా 95 శాతం పోలింగ్ నమోదైన ప్రాంతానికి రూ. 2 లక్షల నజరానాను ఇస్తామన్నారు. అయితే సిద్దిపేటలో మాత్రం ఆశించిన స్థాయిలో స్పందన రాలేదనే చెప్పాలి. సిద్దిపేట పట్టణం ఝలక్.. మెరుగైన పోలింగ్ శాతం నమోదుతో భారీ మెజార్టీ వస్తుందనే నేతల అలోచనలకు, అంచనాలకు సిద్దిపేట పట్టణం ఝలక్ ఇచ్చింది. పోలింగ్ ప్రక్రియ రికార్డుల ప్రకారం నియోజకవర్గంలో అత్యల్పంగా సిద్దిపేట పట్టణంలో పోలింగ్ నమోదు కావడం విశేషం. మిగతా మూడు మండలాల్లో 80శాతంపైగా పోలింగ్ నమోదు కాగా, పట్టణంలో అంచనాలకు భిన్నంగా 63.42 శాతం మాత్రమే పోలింగ్ నమోదైంది. సిద్దిపేట అర్బన్‌లో ఏర్పాటు చేసిన 91 పోలింగ్ కేంద్రాల్లో 87,451మంది ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకోవాల్సి ఉండగా, బుధవారం జరిగిన పోలింగ్‌లో కేవలం 55,463మంది మాత్రమే తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. వీరిలో పురుషులు 27,899 మంది కాగా, మహిళలు 27, 564 మంది ఉన్నారు. అదే విధంగా సిద్దిపేట మండల పరిధిలో 44,135 మంది ఓటర్లకు గాను 36, 143 మంది ఓటు హక్కును వినియోగించుకున్నారు. దీంతో ఇక్కడ 81.89 శాతం పోలింగ్ నమోదైంది. మరోవైపు చిన్నకోడూరు మండలంలో 40,985 ఓట్లకు గాను 34,073 ఓట్లు పోలయ్యాయి. మండలంలో 83.14 శాతం నమోదైంది. నంగునూరు మండల పరిధిలో 29,788 ఓట్లకు గాను 24,462 ఓట్లు పడ గా, పోలింగ్ శాతం 82.12 శాతంగా నమోదైంది. -
మా హక్కును కాలరాశారు..
ముంబై: ఇటీవల నగరంలో జరిగిన లోక్‌సభ ఎన్నికల నేపథ్యంలో సుమారు రెండు లక్షలమంది ఓటర్ల పేర్ల గల్లంతుపై బోంబే హైకోర్టులో గురువారం ప్రజాప్రయోజన వ్యాజ్యం దాఖలైంది. యాక్షన్ ఫర్ గుడ్ గవర్నెన్స్ అండ్ నెట్వర్కింగ్ ఇన్ ఇండియా(అగ్ని), బ్రైట్‌లైట్ అనే రెండు స్వచ్ఛంద సంస్థలు సంయుక్తంగా వేసిన పిల్‌ను ఈ నెల ఆరున విచారణకు స్వీకరిస్తున్నట్లు ప్రధాన న్యాయమూర్తి మోహిత్ షా నేతృత్వంలోని బెంచ్ తెలిపింది. ఓటర్ల లిస్టులో పేర్ల గల్లంతును సవాలు చేస్తూ ఇప్పటికే ఒక పిల్ దాఖలైన విషయం తెలిసిందే. పుణే ఓటర్లు దాఖలు చేసిన ఈ పిల్ ప్రస్తుతం హైకోర్టులో పెండింగ్‌లో ఉంది. ఇదిలా ఉండగా, లోక్‌సభ ఎన్నికల సమయంలో కేంద్ర ఎన్నికల సంఘం అధికార వెబ్సైట్లో పెట్టిన ముంబై నగర, శివారు ప్రాంతాల ఓటర్ల జాబితాలో 2,10,213 మంది ఓటర్ల పేర్లు తొలగింపబడినట్లు వెల్లడైంది. తొలగించిన వారిలో చాలామంది చనిపోయారని, మరికొంత మంది ముంబైను వీడి బయటకు వెళ్లిపోయినట్లు అందులో పేర్కొన్నారు. దీనిపై స్వచ్ఛంద సంస్థలు స్పందించాయి. పేర్లు గల్లంతైన వారిలో సుమారు 6,500 మంది తమ పేర్లను అక్రమంగా తొలగించారని ఆరోపిస్తూ స్వచ్ఛంద సంస్థల ద్వారా కోర్టులో పిల్ దాఖలు చేశారు. వారిలో చాలామంది 2009 లోక్‌సభ ఎన్నికల్లోనే కాక, 2011లో జరిగిన స్థానిక ఎన్నికల్లోనూ తమ ఓటుహక్కు వినియోగించుకున్నారన్నారు. భారతీయ పౌరుల ప్రాథమిక హక్కు అయిన ఓటును వినియోగించుకోకుండా తమను అడ్డుకున్నారని వారు కోర్టును ఆశ్రయించారు. బాధితుల పేర్లను తొలగించే విషయంలో ఎన్నికల అధికారులు నియమనిబంధనలను పాటించలేదని వారు వాదించారు. ఓటర్ల లిస్టునుంచి పేర్లు తొలగించే ముందు ఎన్నికల అధికారులు సదరు వ్యక్తికి సమాచారం ఇవ్వాల్సి ఉంటుందన్నారు. అయితే తమకు ఎటువంటి సమాచారం ఇవ్వకుండా తమ ఇష్టానుసారం పేర్లు తొలగించారని బాధితులు తమ పిటిషన్లో వాపోయారు. ఎన్నికల అధికారుల ఈ చర్య వల్ల తాము లోక్‌సభ ఎన్నికల్లో ఓటుహక్కును వినియోగించుకోలేకపోయామని, బాధ్యులైన అధికారులపై తగిన చర్యలు తీసుకోవాలని వారు డిమాండ్ చేశారు. అలాగే నగరంలో గల్లంతైన 2,10,123 ఓట్లు అభ్యర్థుల జయాపజయాలపై ప్రభావం చూపే అవకాశముందని పేర్కొన్నారు. కాబట్టి తిరిగి వారిని ఓటుహక్కు వినియోగించుకునేలా కోర్టు ఆదేశించాలని కోరారు. ఓటర్ల లిస్టులో పేర్ల తొలగింపు సమయంలో ఎన్నికల అధికారులు నియమ నిబంధనలను పాటించారా లేదా అనే విషయాన్ని ధ్రువీకరించేందుకు ప్రత్యేక దర్యాప్తు బృందాన్ని నియమించి విచారణ జరిపించాలని పిటిషన్లో డిమాండ్ చేశారు. ఓటర్ల లిస్టు నుంచి గల్లంతైన వారిలో అర్హుల పేర్లను తిరిగి ఓటర్ల లిస్టులో చేర్చాలని, వారు వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో తమ ఓటుహక్కు వినియోగించుకునేలా చర్యలు తీసుకోవాలని వారు కోర్టును కోరారు. -
ఓటేశారు..
సాక్షి ప్రతినిధి, ఆదిలాబాద్ : జిల్లాలో సార్వత్రిక ఎన్నికలు బుధవారం చెదురుమదురు ఘటనలు మినహా ప్రశాంతంగా ముగిశాయి. రెండు లోక్‌సభ, పది అసెంబ్లీ స్థానాలకు ఎన్నికలు జరిగాయి. ఓటు హక్కు వినియోగంపై ఎన్నికల సంఘం, స్వచ్ఛంద సంస్థలు పెద్ద ఎత్తున ఓటుపై ప్రచారం సాగించడంతో ఓటర్లలో అవగాహన పెరిగింది. ఫలితంగా ఓటర్లు పెద్ద సంఖ్యలో ఓటు హక్కును వినియోగించుకున్నారు. 2009లో 74.56 శాతం పోలింగ్ నమోదు కాగా ఈసారి 77.90 శాతం నమోదైంది. అంటే దాదాపు 3.30 శాతం పెరిగింది. ఎండ తక్కువగా ఉండటం కూడా పోలింగ్ పెరగడానికి కారణంగా చెప్పవచ్చు. ఉదయం ఏడు గంటల నుంచే ఓటర్లు పోలింగ్ కేంద్రాల వద్ద బారులు తీరారు. అన్ని కేంద్రాల వద్ద ఓటర్ల సందడి నెలకొంది. దస్నాపూర్ పోలింగ్ కేంద్రంలో కలెక్టర్ అహ్మద్‌బాబు, తన కుటుంబ సభ్యులతో కలిసి ఓటు హక్కును వినియోగించుకున్నారు. జాయింట్ కలెక్టర్ లక్ష్మీకాంతం కూడా ఇదే పోలింగ్ కేంద్రంలో ఓటు వేశారు. కాగా, ఈవీఎంల మొరాయించడంతో వందలాది కేంద్రాల్లో ఆలస్యంగా పోలింగ్ ప్రారంభమైంది. సరిచేసేందుకు అధికారుల ఉరుకులు పరుగులు పెట్టారు. దీంతో ఓటర్ల పడిగాపులు కాశారు. పలు కేంద్రాల్లో ఓట్లు గల్లంతు కావడంతో ఓటర్లు ఆందోళనకుఆందోళనకు దిగారు. పోలింగ్ సరళి ఉదయం ఏడు గంటలకు ప్రారంభమైన పోలింగ్ మధ్యాహ్నం 12 గంటల వరకు ఉధృతంగా సాగింది. తర్వాత మూడు గంటలు మందకొడిగా సాగింది. మళ్లీ సాయంత్రం ఊపందుకుంది. పోలింగ్ సమయం ముగిసేలోపు పోలింగ్ కేంద్రాల్లోకి వచ్చిన ఓటర్లకు స్లిప్పులు పంపిణీ చేసి, ఓటు హక్కును వినియోగించుకునే అవకాశం కల్పించారు. మొదటి గంటలో 6.91 శాతం పోలింగ్ నమోదైంది. ఉదయం 9 గంటల వరకు 14.28 శాతం, 10 గంటలకు 23.19 శాతం, 11 గంటలకు 31.69 శాతం, మధ్యాహ్నం ఒంటి గంటకు 53 శాతం, 3 గంటల వరకు 62 శాతం, ఆరు గంటల వరకు 77.90 శాతం పోలింగ్ నమోదైనట్లు ఎన్నికల అధికారులు ప్రకటించారు. జిల్లాలో నాలుగు నియోజకవర్గాలు సిర్పూర్, చెన్నూర్, ఆసిఫాబాద్, ఖనాపూర్లలో సాయంత్రం ఐదు గంటలకు పోలింగ్ ముగిసింది. పోలింగ్ కేంద్రాల అధికారులు సరైన సదుపాయాలు కల్పించక పోవడంతో ఓటర్లు ఇబ్బందులు పడ్డారు. కొన్ని కేంద్రాల్లో టెంట్లు లేకపోవడంతో ఎండలో క్యూలో నిలబడాల్సి వచ్చింది. కొన్నిచోట్ల మంచినీరు అందుబాటులో లేకపోవడంతో ఇబ్బందులు పడ్డారు. చెట్ల నీడను ఆశ్రయించాల్సి వచ్చింది. చెదురుమదురు ఘటనలు పోలింగ్ సందర్భంగా జిల్లాలో పలుచోట్ల చెదురుమదురు ఘటనలు చోటు చేసుకున్నాయి. మామడ మండలం నల్దుర్తిలో పోలింగ్ కేంద్రం వద్ద టెంటు తొలగింపు విషయంలో టీఆర్ఎస్ కార్యకర్తలకు, పోలీసులకు మధ్య గొడవ ఉద్రిక్తతకు దారితీసింది. పోలీసుల తీరును నిరసిస్తూ టీఆర్ఎస్ కార్యకర్తలు పోలీసుల వాహన అద్దాలను ధ్వంసం చేశారు. ఆసిఫాబాద్ మండలం రౌటసంకెపల్లి గ్రామ పంచాయతీలోని వట్టివాగు ప్రాజెక్టు పునరావాస కేంద్రంలోని సుమారు 450 మంది ఓటర్లు తమ సమస్యలను పట్టించుకోవడం లేదని ఓటింగ్‌ను బహిష్కరించారు. అధికారులు అక్కడికి చేరుకుని వారితో చర్చించడంతో మధ్యాహ్నం నుంచి ఆ గ్రామస్తులు ఓటేశారు. మావోయిస్టు ప్రభావిత ప్రాంతమైన వేమనపల్లి మండలం ప్రాణహిత నదీ పరివాహక ప్రాంతంలో పోలీసులు భారీ బందోబస్తును ఏర్పాటు చేశారు. ఛత్తీస్‌గఢ్ సరిహద్దులోని అటవీ ప్రాంతాల్లో కూంబింగ్ నిర్వహించారు. జిల్లా ఉన్నతాధికారులు పోలిం గ్ సరళిని ఎప్పటికప్పుడు పరిశీలించారు. కలెక్టర్ అహ్మద్‌బాబు పలు కేంద్రాలను సందర్శిం చారు. జేసీ లక్ష్మీకాంతం మంచిర్యాల నియోజకవర్గంలో పోలింగ్ తీరును పరిశీలించారు. ఈవీఎంలలో అభ్యర్థుల భవితవ్యం ఓటర్ల నాడిని తమలో బంధించుకున్న ఈవీఎంలు అభ్యర్థుల రాజకీయ భవిష్యత్తును తేల్చనున్నాయి. అసెంబ్లీ, పార్లమెంట్ ఈవీఎంలను స్ట్రాంగ్ రూంలలో అధికారులు భద్రపరిచారు. జిల్లా కేంద్రంలోని ఏపీ ట్రైబల్ వెల్ఫేర్ రెసిడెన్షియల్ జూనియర్ కాలేజీ(బాయ్స్)లో సిర్పూర్, ఆసిఫాబాద్, ముథోల్, ఆదిలాబాద్, మంచిర్యాల నియోజకవర్గాల ఈవీఎంలు భద్రపరిచారు. ఏపీఎస్డబ్ల్యుఆర్జేసీ(గర్ల్స్)లో ఖానాపూర్, చెన్నూరు, బెల్లంపల్లి, నిర్మల్ నియోజకవర్గాల ఈవీఎంలు భద్రపరిచారు. ఓటరన్న వ్యక్తపరిచిన తీర్పు ఈ నెల 16న వెలవడనుంది. ఫలితాలపై అభ్యర్థులు, నాయకుల ఉత్కంఠ నెలకొంది. -
ఓటింగ్ అంతంతే!
సాక్షి, రంగారెడ్డి జిల్లా: చెదురుమదురు ఘటనలు మినహా సార్వత్రిక ఎన్నికల పోలింగ్ ప్రశాంతంగా ముగిసింది. జిల్లాలో ఎక్కడా అవాంఛనీయ ఘటనలు చోటుచేసుకోలేదు. మొత్తం 14 శాసనసభ, రెండు లోక్‌సభ నియోజకవర్గాల పరిధిలో బుధవారం ఉదయం 7గంటలకు పోలింగ్ ప్రక్రియ ప్రారంభించారు. అయితే ఈవీఎంలు మొరాయించడంతో పలు పోలింగ్ కేంద్రాల్లో ఓటింగ్ ప్రక్రియలో అంతరాయం ఏర్పడింది. దీంతో ఓటుహక్కు వినియోగించుకునేందుకు పోలింగ్ కేంద్రాలకు వచ్చిన ఓటర్లు గంటల తరబడి నిరీక్షించాల్సి వచ్చింది. అధికారులు వెంటనే తేరుకుని సాంకేతిక నిపుణులను రంగంలోకి దింపి సమస్యలను పరిష్కరించారు. జిల్లాలో 53,48,927 మంది ఓటర్లుండగా.. బుధవారం నాటి పోలింగ్ ప్రక్రియలో కేవలం 32 లక్షల మంది మాత్రమే ఓటు హక్కును వినియోగించుకున్నారు. మొత్తంగా జిల్లాలో 60 శాతం ఓటింగ్ నమోదైందని అధికారుల ప్రాథమిక గణాంకాలు చెబుతున్నాయి. ఈవీఎంలు మెరాయించడంతో ఓటింగ్ ప్రక్రియ స్తబ్ధుగా సాగింది. దీంతో సాయంత్రం ఆరు గంటలకు పోలింగ్ ముగిసినప్పటికీ ఓటర్లు మాత్రం పోలింగ్ కేంద్రాల్లో బారులు తీరారు. ఈ నేపథ్యంలో రాత్రి పొద్దుపోయేవరకు పోలింగ్ సాగింది. అధికారుల తుది గణాంకాలు కొలిక్కి వస్తే పోలింగ్ శాతంలో కొంత మార్పు రావచ్చు. కనిపించని జోరు.. సార్వత్రిక పోలింగ్ జిల్లాలో మందకొడిగా సాగింది. ఈసారి పోలింగ్ శాతం పెంచేందుకు కేంద్ర ఎన్నికల సంఘం విస్తృత ప్రచారం చేయడంతోపాటు గంటపాటు పోలింగ్ సమయాన్ని పెంచింది. అంతేకాకుండా ప్రత్యేక ప్రకటనలు, కళాజాతలతో క్షేత్రస్థాయిలో ఓటు హక్కు వినియోగించుకోవాలంటూ భారీ కార్యక్రమాలనే చేపట్టింది. అంతేకాకుంగా ఎన్నికల సంఘం ప్రత్యేకంగా రంగారెడ్డి జిల్లాను ఎంపికచేసి ఓటింగ్ శాతాన్ని పెంచేందుకు స్వీప్ పేరిట సరికొత్త కార్యక్రమానికి శ్రీకారం చేట్టింది. ఈనేపథ్యంలో కొత్తగా ఓటు హక్కు కోసం లక్షలాది మంది దరఖాస్తు చేసుకొని ఓటరుగా నమోదయ్యారు. కానీ బుధవారం నాటి సార్వత్రిక పోలింగ్‌లో మాత్రం ఆ జోరు కనిపించలేదు. ఫలితంగా జిల్లాలో ఓటింగ్ సమయం ముగిసేనాటికి 60శాతం మాత్రమే పోలింగ్ నమోదైంది. 2009 సాధారణ ఎన్నికల్లో జిల్లాలో 58.16శాతం పోలింగ్ నమోదు కాగా ఈసారి ఓటింగ్ కాస్త పుంజెకుందని తెలుస్తోంది. పోలింగ్ సాగిందిలా.. ఉదయం ఏడు గంటలకు పోలింగ్ ప్రారంభం కాగా, 9గంటల ప్రాంతంలో 12.5% పోలింగ్ నమోదైంది. ఆ తర్వాత రెండు గంటల అనంతరం 11గంటల ప్రాంతంలో పోలింగ్ శాతం 26%కు చేరింది. ఒంటి గంట ప్రాంతంలో పోలింగ్ 39.6%, మధ్యాహ్నం 3గంటలకు 50.4%, సాయంత్రం 5గంటలకు 56.7% నమోదైంది. పోలింగ్ ముగిసే సమయానికి సుమారు 60శాతం నమోదైనట్లు కలెక్టర్ బీ.శ్రీధర్ ఒక ప్రకటనలో తెలిపారు. 7.30 వరకు పోలింగ్.. తాండూరు మండలం నారాయణపూర్ గ్రామంలో రాత్రి 7.30 గంటల వరకు పోలింగ్ కొనసాగింది. సాయంత్రం ఆరు గంటల సమయంలో జనం ఒక్కసారిగా పోలింగ్ స్టేషన్‌కు తరలివచ్చి క్యూలో నిల్చోవడంతో వారందరికీ ఓటువేసే అవకాశం కల్పించారు. దీంతో ఆ గ్రామంలో పోలింగ్ ప్రక్రియ ఆలస్యంగా ముగిసింది. -
ఓటు యంత్రాల్లో... అభ్యర్థుల భవితవ్యం
సాక్షి, సంగారెడ్డి: సార్వత్రిక ఎన్నికలు ముగిశాయి. మెదక్, జహీరాబాద్ లోక్‌సభతో పాటు జిల్లాలోని 10 అసెంబ్లీ నియోజకవర్గాలకు బుధవారం నిర్వహించిన పోలింగ్‌లో ఓటర్లు ఉత్సాహంగా తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. అభ్యర్థుల భవితవ్యం ఎలక్ట్రానిక్ ఓటింగ్ యంత్రాల్లో(ఈవీఎం) నిక్షిప్తమైంది. మే 16వ తేదీన కౌటింగ్ నిర్వహించి అదే రోజు ఫలితాలను వెల్లడించనున్నారు. దీంతో అభ్యర్థులు అప్పటివరకు ఉత్కంఠగా నిరీక్షించక తప్పని పరిస్థితి నెలకొంది. జిల్లావ్యాప్తంగా 2,678 పోలింగ్ కేంద్రాల్లో ఎన్నికల నిర్వహణ కోసం వినియోగించిన 6 వేల ఈవీఎం యంత్రాలను స్ట్రాంగ్ రూంలకు తరలించి భద్రపరుస్తున్నారు. ఈవీఎంలను భద్రపరిచేందుకు మూడు ప్రైవేటు విద్యాలయాల్లో స్ట్రాంగ్ రూంలను ఏర్పాటు చేశారు. ఈ స్ట్రాంగ్ రూంల చుట్టూ మూడంచెల భద్రత వ్యవస్థ ఏర్పాటు చేశారు. వీటి పరిసర ప్రాంతాల్లో వ్యక్తుల కదలికలను గుర్తించేందుకు సీసీ కెమెరాలను బిగించారు. స్ట్రాంగ్ రూముల కిటికీలకు సైతం సీలు వేశారు. జహీరాబాద్ లోక్‌సభ పరిధిలోని జహీరాబాద్, నారాయణఖేడ్, అందోల్ అసెంబ్లీ నియోజకవర్గాల ఈవీఎంలను సంగారెడ్డి మండలం కాశీపూర్‌లోని డీవీఆర్ ఇంజనీరింగ్ కళాశాలలో ఏర్పాటు చేసిన స్ట్రాంగ్ రూంలో భద్రపరిచారు. మెదక్ లోక్‌సభ పరిధిలోని గజ్వేల్, సిద్దిపేట, దుబ్బాక అసెంబ్లీ నియోజకవర్గాల ఈవీఎంలను సంగారెడ్డి మండలం ఫసల్వాదిలోని ఎంఎన్ఆర్ వైద్య కళాశాల భవనంలోని స్ట్రాంగ్ రూంలో ఉంచారు. మెదక్, నర్సాపూర్, సంగారెడ్డి, పటాన్చెరు అసెంబ్లీ నియోజకవర్గాల ఈవీఎంలను పటాన్చెరు మండలం రుద్రారం పరిధిలో గీతం యూనివర్సిటీలో ఏర్పాటు చేసిన స్ట్రాంగ్ రూంలో భద్రపరిచారు. -
ఓటరు కార్డు లేకున్నా.. ఓటు వేయవచ్చు
ఖమ్మం కలెక్టరేట్, న్యూస్‌లైన్: అర్హులైన ప్రతీ ఒక్కరు ఓటు హక్కు వినియోగించుకునేందుకు ప్రత్యే కార్యక్రమం చేపడుతున్నట్లు జేసీ కడవేరు సురేంద్రమోహన్ పేర్కొన్నారు. మంగళవారం ఆయన విలేకరులతో మాట్లాడారు. రాష్ట్ర ఎన్నికల సంఘం ఆదేశాల మేరకు ప్రతీ ఒక్కరు ఓటు హక్కు వినియోగించుకునేలా ప్రచారం చేస్తున్నామని, ఓటర్లను చైతన్య పరిచేందుకు ప్రత్యేక కార్యక్రమాలు ఏర్పాటు చేశామని అన్నారు. పోలింగ్ రోజు ఉదయం ఆరు గంటల నుంచి సాయంత్రం ఆరుగంటల వరకు ఓటు హక్కు వినియోగించుకునేలా ఆటోల ద్వారా ప్రచారం చేపడుతున్నామని అన్నారు. ఎన్నికల సంఘం మంజూరు చేసిన ఓటరు గుర్తింపు కార్డు లేకపోయినా ఓటరు జాబితాలో పేరుంటే వారందరు ఓటు వేసేందుకు వీలుగా తగిన ఏర్పాట్లు చేస్తున్నామని అన్నారు. వారు ఓటు వేసేందుకు 13 రకాల గుర్తింపు కార్డులను ఎంపిక చేశారని, వీటిల్లో ఏ ఒక్కటి ఉన్నా ఓటు హక్కు వినియోగించుకోవచ్చని అన్నారు. ఈ కార్డులు, ధ్రువపత్రాలు 2009 ఫిబ్రవరి 28వ తేదీ నాటికి నిర్ధారించి జారీ చేసినవై ఉండాలని పేర్కొన్నారు. ఓటు హక్కు ఉండి కార్డు లేనివారు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని అన్నారు. ఎన్నికల సంఘం గుర్తించి కార్డుల వివరాలిలా ఉన్నాయి. డ్రైవింగ్ లెసైన్స్ పాస్‌పోర్టు ఇన్‌కం ట్యాక్స్ గుర్తింపు ఉద్యోగులకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు, పబ్లిక్ సెక్టార్ అండర్ టేకింగ్, లోకల్‌బాడీలు, పబ్లిక్‌లిమిటెడ్ కంపెనీలు జారీ చేసిన ఫొటో గుర్తింపు కార్డులు పబ్లిక్ సెక్టార్ బ్యాంక్‌లు, పోస్టాఫీస్ జారీ చేసిన ఫొటోలతో ఉన్న పాస్‌పుస్తకాలు, కిసాన్పాస్ పుస్తకాలు ఫొటోలతో కూడిన భూమి పట్టాలు, రిజిస్ట్రేషన్ పత్రాల వంటి ఆస్తి డాక్యుమెంట్లు సంబంధిత అధికారులు జారీ చేసిన ఎస్సీ, బీసీ, ఓబీసీ సర్టిఫికెట్లు ఫొటోలతో జారీ అయిన మాజీ సైనికుల పింఛన్ పుస్తకాలు, పెన్షన్ డాక్యుమెంట్ ఆర్డర్, ఎక్స్ సర్వీస్ మెన్విడో, డిపెండెంట్ సర్టిఫికెట్, వృద్ధాప్యపు, వితంతు పింఛన్ ఆర్డర్ స్వాతంత్య్ర సమరయోధుల ఫొటోలతో కూడిన గుర్తింపుకార్డులు ఆయుధలెసైన్స్ ఫొటోలతో ఉన్న వికలాంగుల సర్టిఫికెట్ జాతీయ ఉపాధి హామీ పథకం కింద జారీ చేసిన ఫొటోగురింపుకార్డు మినిస్ట్రీ ఆఫ్ లేబర్ స్కీం కింద జారీ చేసిన ఫొటోతో కూడిన ఆరోగ్య బీమా పథకం స్మార్టు కార్డులు అనుమతించనున్నారు. -
పరిశ్రమలకు 24 గంటల సెలవు ప్రకటించాలి
కలెక్టరేట్, న్యూస్‌లైన్: సార్వత్రిక ఎన్నికల్లో కార్మికులు తమ ఓటు హక్కు వినియోగించుకునేలా చర్యలు తీసుకోవాలని, ఎన్నికల రోజున అన్ని షిఫ్ట్‌లకు వేతనంతో కూడిన సెలవు ప్రకటించాలని సదాశివపేటకు చెందిన ఎంఆర్ఎఫ్ కార్మికులు కోరారు. మంగళవారం వారు కలెక్టరేట్‌కు భారీగా తరలివచ్చారు. ఎన్నికల కమిషన్ ఉత్తర్వులు ఉల్లంఘించిన పరిశ్రమల యాజమాన్యాలపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తూ సీఐటీయూ ఆధ్వర్యంలో జేసీ శరత్‌కు వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా కార్మికులు మాట్లాడుతూ జిల్లాలోని ఎంఆర్ఎఫ్, తొషిబా, కిర్బీ, పెన్నార్ పరిశ్రమలు 24 గంటల సెలవును ప్రకటించలేదన్నారు. ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికల్లో అన్ని షిఫ్ట్‌లకు వేతనంతో కూడిన సెలవును ప్రకటించిన విషయాన్ని వారు అధికారుల దృష్టికి తెచ్చారు. జిల్లాలోని చాలా ప్రాంతాల్లో యాజమాన్యాలు 24 గంటలు సెలవు ప్రకటించగా కార్మికులు ఎక్కువగా ఉన్న ఎంఆర్ఎఫ్ పరిశ్రమలో నైట్‌షిఫ్ట్ నిర్వహించడంపై ఆందోళన వ్యక్తం చేశారు. సుదూర ప్రాంతాలకు వెళ్లి ఓటుహక్కు వినియోగించుకుని తిరిగి విధులకు ఎలా హాజరవుతామని వారు పేర్కొన్నారు. బుధవారం కార్మికులంతా ఓటు వేసేందుకు వీలుగా అన్ని షిఫ్ట్‌ల్లో 24 గంటల పని, కార్మికులకు వేతనంతో కూడిన సెలవు అమలు చేసేలా చర్యలు తీసుకుంటామని జేసీ హామీ ఇచ్చినట్టు కార్మికులు తెలిపారు. కలెక్టర్ ఆదేశాల మేరకు డిప్యూటీ లేబర్ కమిషనర్ కోటేశ్వర్రావు, ఎంఆర్ఎఫ్, తొషిబా, కిర్బీ తదితర పరిశ్రమలకు ఉత్తర్వులు జారీ చేశారని వారు పేర్కొన్నారు. ఆదేశాలను ఉల్లంఘించే యాజమాన్యాలపై చర్యలు తీసుకుంటామని జేసీ హెచ్చరించినట్టు వారు తెలిపారు. జేసీని కలిసిన వారిలో సీఐటీయూ ఇండస్ట్రీయల్ జిల్లా కార్యదర్శి మాణిక్యం, నాయకులు సంతోష్‌కుమార్, హరికృష్ణ, శ్రీకాంత్, అశోక్, శ్రీనివాస్‌రెడ్డి, కృష్ణారావు, ఆయా పరిశ్రమల కార్మికులు తదితరులు ఉన్నారు. -
రీపోలింగ్‌లో 48.94 శాతం ఓటింగ్
సాక్షి, ముంబై: రాష్ట్రంలోని మూడు లోక్‌సభ స్థానాల్లోని నాలుగు పోలింగ్ కేంద్రాల్లో ఆదివారం జరిగిన రీపోలింగ్‌లో సరాసరి 48.94 శాతం ఓటింగ్ నమోదైంది. ఆదివారం సెలవు రోజైనా ఎక్కువ మంది ఓటు హక్కు వినియోగించుకోలేదు. గత గురువారం (తుది దశ) రోజున నమోదైన పోలింగ్ శాతం కంటే ఆదివారం మరింత తగ్గడం ఇటు ఈసీ అధికారులతో పాటు అభ్యర్థుల్లో ఆందోళన కలిగిస్తోంది. పశ్చిమ మలాడ్‌లోని పోలింగ్ కేంద్రం నంబర్ 242, చార్కోప్లోని పోలింగ్ కేంద్రం నంబర్ 243, చాందివలిలోని పోలింగ్ బూత్ నంబర్ 160, అహ్మద్‌నగర్‌లోని శ్రీగోండ పోలింగ్ కేంద్రం నంబర్ 305లో ఓటర్లు ఓటుహక్కు వినియోగించుకున్నారు. ముంబైలోని మూడు పోలింగ్ కేంద్రాలలో 2,517 మంది ఓటర్లుండగా, కేవలం 1,232 మంది ఓటేశారు. వీరిలో 668 మంది పురుషులు, 564 మంది మహిళా ఓటర్లు ఉన్నారు. ఈ మూడు పోలింగ్ కేంద్రాల్లో గత గురువారం జరిగిన పోలింగ్‌లో సరాసరి 62.13 శాతం నమోదైంది. అయితే ఆదివారం జరిగిన రీపోలింగ్‌లో 48.94 శాతం న మోదు కావడం ఆందోళన కలిగిస్తోంది. 1,154 మంది ఓటర్లున్న శ్రీగోండాలో పోలింగ్ బూత్‌లో 735 మంది మాత్రమే తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. ఇక్కడ 63.77 శాతం నమోదైంది. పోలింగ్ శాతం తేడాలతో అభ్యర్థుల్లో ఆయోమయం ఠాణే: పోలింగ్ రోజున ప్రకటించిన ఓటింగ్ శాతం, అంకెలు...తాజాగా ఎన్నికల సంఘం ప్రకటించిన లెక్కలకు భారీగా వ్యత్యాసం ఉండటం అభ్యర్థుల్లో ఆయోమయాన్ని సృష్టిస్తోంది. ఈ నెల 24న అన్ని నియోజకవర్గాల్లో 49.48 పోలింగ్ శాతం నమోదైందని ఈసీ ప్రకటించింది. పాల్ఘర్లో 60 శాతం, భివండీలో 45 శాతం, కళ్యాణ్‌లో 41 శాతం, ఠాణేలో 53 పోలింగ్ శాతమని తెలిపింది. 72,68,061 మంది ఓటర్లు ఉండగా, 35,96,237 మంది మాత్రమే ఓటు హక్కు వినియోగించుకున్నారని ప్రకటించింది. అయితే తాజాగా ఈసీ సోమవారం విడుదల చేసిన ప్రకటనలో 51.71 శాతం ఓటింగ్ నమోదైందని పేర్కొంది. పాల్ఘర్లో 63.49, భివండీలో 51.62, కళ్యాణ్‌లో 43.06 పోలింగ్ శాతం నమోదైందని వెల్లడించింది. పోలింగ్ శాతంలో పెరుగుదల అర్ధం చేసుకోవచ్చని, అయితే కొన్ని స్థానాల్లో తగ్గడం మాత్రం తీవ్రంగా పరిగణించాలని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు. ఠాణేలోమాత్రం 44.757 ఓట్లు తగ్గడం పోటీల్లో ఉన్న నేతల్లో ఆందోళన కలిగిస్తోంది. ‘ఠాణే పోలింగ్ కేంద్రంలో రీ పోలింగ్ నిర్వహించాలి’ ఠాణే: నగరంలోని మజివాడ పోలింగ్ కేంద్రంలో రీపోలింగ్ నిర్వహించాలని ఎన్సీపీ డిమాండ్ చేసింది. ఇక్కడ మొత్తం 1300 మంది ఓటర్లుంటే కేవలం ఐదుగురిని మత్రమే ఓటు హక్కు వినియోగించుకునేందుకు అధికారులు అనుమతిచ్చారని పోలింగ్ ఏజెంట్, ఎన్సీపీ కార్యకర్త ఆశోక్ పోహేకర్ అన్నారు. మిగతావారి పేర్లు ఓటరు జాబితాలో కనిపించలేదని తెలిపారు. రెండు పోలింగ్ కేంద్రాలు 338(ఏ), 341 (ఏ) కలపడం వల్ల ఓటర్ల జాబితాలో కొందరి పేర్లను తొలగించారని వివరించారు. అనేక మంది ఓటు వేసేందుకు దూరమయ్యారని, అందువల్ల ఇక్కడ రీపోలింగ్ కచ్చితంగా నిర్వహించాలని రాష్ట్ర ఎన్నికల అధికారిని కోరామన్నారు. -
రీపోలింగ్ జరపాల్సిందే
ముంబై/నాగపూర్: రాష్ట్రవ్యాప్తంగా లక్షలాదిమంది పేర్లు ఓటర్ల జాబితానుంచి గల్లంతు కావడంపై ఆగ్రహావేశాలు వెల్లువెత్తుతున్నాయి. వీరిలో ఖండాంతర ఖ్యాతిగాంచిన పలువురు ప్రముఖుల పేర్లు సైతం ఉండటం గమనార్హం. లోక్‌సభ ఎన్నికల సమయంలో రాష్ట్రవ్యాప్తంగా సుమారు 60 లక్షల ఓటర్ల పేర్లు గల్లంతు కావడంతో 48 లోక్‌సభ స్థానాలకూ తిరిగి పోలింగ్ నిర్వహించాలని విదర్భ జన్ ఆందోళన్ సమితి డిమాండ్ చేసింది. రాష్ట్రంలో 60 లక్షల మంది ఓటర్లు తమ ఓటుహక్కు కోల్పోవడంపై ఎన్నికల కమిషనర్ హెచ్.ఎస్.బ్రహ్మ రాష్ట్ర ప్రజలకు క్షమాపణ చెప్పడంపై సమితి చీఫ్ కిషోర్ తివారీ స్పందించారు. ‘అధికారుల క్షమాపణలతో నష్టం పూడుకుపోదు.. దేశ పౌరుల ప్రాథమిక హక్కును హరించిన ఎన్నికల అధికారులు, సిబ్బందిపై తగిన చర్యలు తీసుకోవడమే కాకుండా అన్ని లోక్‌సభ స్థానాల్లో మళ్లీ ఎన్నికలు నిర్వహించాల్సిందే’నని తివారీ డిమాండ్ చేశారు. ‘ఎన్నికల సంఘం చేసిన తప్పిదం 2014 ఎన్నికల ఫలితాలను ప్రభావితం చేయడం ఖాయమని ఆయన వ్యాఖ్యానించారు. రాష్ట్రంలో సుమారు 60 లక్షల మందికి పైగా ఓటర్ల పేర్లు ఓటర్ల జాబితాల్లో గల్లంతయ్యాయని ఏప్రిల్ 19వ తేదీన మీడియాలో కథనాలు వెలువడిన సంగతి తెలిసిందే. దీనిపై ఎన్నికల సంఘం రాష్ట్ర ప్రజలను క్షమాపణలు కోరింది. కాగా దీనిపై ముఖ్యమంత్రి పృథ్వీరాజ్ చవాన్ మాట్లాడుతూ ఈ విషయాన్ని అంత తేలికగా తీసుకోబోమని, ముఖ్య ఎన్నికల కమిషనర్ వి.సి. సంపత్‌కు ఓట్ల గల్లంతుపై ఫిర్యాదు చేస్తామని చెప్పారు. అయితే తర్వాత ఆయన స్వరం మార్చారు. ఓటర్ల పేర్లు జాబితాల్లో గల్లంతుపై పరోక్షంగా ప్రజలనే తప్పుబట్టారు. ఓటర్లు ముందుగానే ఓటర్ల లిస్టులో తమ పేర్లు ఉన్నాయో లేదో సరిచూసుకుని ఉంటే ఈ సమస్య వచ్చి ఉండేది కాదన్నారు. ‘ప్రజలు తమ రైలు, విమాన ప్రయాణ సమయంలో టికెట్ పరిస్థితిపై తప్పకుండా ఆరా తీస్తుంటారు. అలాంటిది ఓటర్ల జాబితాలో పేర్లు ఉన్నాయో లేదో చెక్ చేసుకోవడంలో మాత్రం నిర్లక్ష్యం వహిస్తున్నారు..’ అని వ్యాఖ్యానించారు. ఎన్నికల జాబితా నుంచి పేర్లు గల్లంతైన వారిలో హెచ్డీఎఫ్సీ చైర్మన్ దీపక్ పరేఖ్, ప్రముఖ న్యాయవాది రామ్ జెత్మలానీ, ముంబై స్టాక్ ఎక్ఛ్సేంజ్ చైర్మన్ అశిష్‌కుమార్ చౌహాన్, అద్మన్ భరత్ దభోల్కర్, నటులు అమోల్ పాలేకర్, అతుల్ కుల్కర్ణి వంటి ప్రముఖులతో పాటు లక్షలాది మంది పేర్లు ఉండటం గమనార్హం. వీరి పేర్లను త్వరలో జరగనున్న మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలకు ముందే జాబితాలో చేరుస్తామని బ్రహ్మ హామీ ఇచ్చారు. కాగా తివారీ మాట్లాడుతూ..‘ ఓటర్ల జాబితాలో పేర్ల గల్లంతుపై ఏప్రిల్ 19న కథనాలు వెలువడిన వెంటనే బ్రహ్మ తగిన చర్యలు తీసుకుని ఉండి ఉంటే ఏప్రిల్ 24వ తేదీన జరిగిన చివరి విడత పోలింగ్‌లో సుమారు 20 లక్షలమంది తమ ఓటుహక్కును వినియోగించుకునే అవకాశం కలిగి ఉండేది..’ అని వ్యాఖ్యానించారు. ఇదిలా ఉండగా, రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు దేవేంద్ర ఫడ్నవిస్ మాట్లాడుతూ..‘ ఎన్నికల సిబ్బంది నిర్లక్ష్యం పలు ఇబ్బందులకు కారణమవుతోంది. ఎన్నికల సమయంలో ఓటర్ల పేర్ల నమోదు సమయంలో ప్రైవేట్ బీపీఓలతో పనులు చేయించుకుంటున్నారన్నారు. వారు డబ్బుకు అమ్ముడుపోయి కొన్ని పార్టీలకు అనుకూలంగా పనిచేయడానికి వెనుకాడటంలేదని పలు ఆరోపణలు ఉన్నాయన్నారు. ఈ విషయమై తాము చాలాసార్లు కేంద్ర ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేసినా ఫలితం కనిపించడంలేదని వాపోయారు. ఈసీపై కేసు పెడతాం ఓటర్ల జబితాలో నుంచి పేర్లు గల్లంతైనందుకు నైతిక బాధ్యత వహిస్తూ ఎన్నికల కమిషనర్ హెచ్.ఎం.బ్రహ్మపై కేసు పెడతామని పలువురు హెచ్చరించారు. అందరూ ఓటు హక్కు తప్పకుండా వినియోగించుకోవాలని అనేక జనజాగృతి కార్యక్రమాలు చేపట్టింది. ఓటర్లను జాగృతపరిచేందుకు ఎన్నికల కమిషన్ ప్రత్యేకంగా హెల్ప్ లైన్ నంబర్ ప్రవేశపెట్టింది. అయితే జాబితా తయారీలో లోపం వల్ల ఈ లోక్‌సభ ఎన్నికల్లో అనేక మంది ఓటర్ల పేర్లు గల్లంతు కావడంతో ఓటు హక్కును వినియోగించుకోలేకపోయారు. నగర పరిధిలో సుమారు 21 వేల మంది ఓటర్ల పేర్లు గల్లంతైనట్లు బీజేపీ నాయకుడు కిరీట్ సోమయ్య, ఆమ్ఆద్మీ పార్టీ నాయకురాలు మీరా సన్యాల్ ఆరోపించారు. ఎన్నికల కమిషన్ నిర్లక్ష్యాన్ని నిరసిస్తూ కోర్టులో పిల్ దాఖలు చేయనున్నట్లు మాటుంగాకు చెందిన ఉమేష్ పంచమాటియా అన్నారు. ఎన్నికల కమిషన్‌పై పోలీసు స్టేషన్లో కేసు నమోదు చేస్తామని హెచ్చరించారు. ఓట్ల గల్లంతుపై అఖిలపక్షం ముంబై: రాష్ట్రంలో ఓటర్ల జాబితా నుంచి లక్షలాది మంది పేర్లు గల్లంతుపై అఖిలపక్ష నాయకులతో సమావేశం ఏర్పాటుచేయాలని మహారాష్ట్ర ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ(ఎంపీసీసీ) డిమాండ్ చేసింది. ఈ మేరకు శుక్రవారం ఎంపీసీసీ అధ్యక్షుడు మాణిక్‌రావ్ ఠాక్రే మాట్లాడుతూ ఇటువంటి పరిస్థితి వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో ఎదురు కాకుండా చూడాల్సిన బాధ్యత ఈసీపైనే ఉందని చెప్పారు. ఒకవైపు ఓటర్లకు పోలింగ్‌పై అవగాహన కల్పిస్తూనే మరోవైపు వారి పేర్లను జాబితాల నుంచి తొలగించడం సమర్థనీయం కాదన్నారు. -
ఓటు హక్కు ప్రాధాన్యం గుర్తించాలి
గుంటూరు ఎడ్యుకేషన్, న్యూస్‌లైన్:ఓటు హక్కు ప్రాధాన్యం గుర్తించి ప్రతి ఒక్కరూ స్వేచ్ఛ ఓటు హక్కు వినియోగించుకోవాలని కలెక్టర్ ఎస్.సురేశ్‌కుమార్ సూచించారు. అమరావతిరోడ్డులో నగరాలులోని నవీన విద్యాలయంలో సోమవారం ఓటర్ల అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ జెడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికల్లో నగరాల్లో 65 శాతం మంది ప్రజలే ఓటింగ్‌లో పాల్గొన్నారని, గ్రామీణ ప్రాంతాల్లో 80 శాతం పోలింగ్ నమోదు కాగా, నగరానికి చేరువలో ఉన్నా ఇక్కడ తక్కువ స్థాయిలో పోలింగ్ నమోదు కావడం విచారకరమని తెలిపారు. ప్రజాస్వామ్యం పరిఢవిల్లాలంటే ప్రతి ఒక్కరూ ఓటింగ్ లో పాల్గొనాలన్నారు. ఎన్నికల్లో పోటీ చేస్తున్న అభ్యర్థుల్లో ఎవ్వరూ నచ్చని పక్షంలో దానిని వ్యక్తపరిచేందుకు కేంద్ర ఎన్నికల సంఘం ఈవీఎంలపై ప్రత్యేక బటన్ కేటాయించిన విషయాన్ని గుర్తుచేశారు. సాధారణ ఎన్నికలకు వారం రోజుల ముందుగానే బూత్ స్థాయి అధికారులు ఇంటిం టికీ తిరిగి ఓటర్లకు స్లిప్పులు అందజేయాలని ఆదేశించారు. పోలింగ్ జరిగే రోజున వచ్చే వారికి పోలింగ్ కేంద్రం వద్ద స్లిప్పులు అందజేయాలన్నారు. నగరాలులోని బూత్ స్థాయి అధికారి ఓ బూత్‌లో 1200 మంది ఓటర్లు ఉండగా, వారిలో 200 మంది వేసవి సెలవుల కారణంగా వివిధ ప్రాంతాలకు వెళ్లారని కలెక్టర్ దృష్టికి తెచ్చారు. కలెక్టర్ మాట్లాడుతూ వారి పూర్తి వివరాలు సేకరించి, ఓటు వేసేందుకు వచ్చిన సమయంలో తగిన ధ్రువీకరణ పత్రాలను పరిశీలించాలని సూచించారు. సదస్సుకు హాజరైన బూత్ స్థాయి అధికారులు, మహిళా సంఘాల ప్రతినిధులు, రిటైర్డు ఉద్యోగులతో ప్రతిజ్ఞ చేయించారు. అనంతరం గుంటూరు చౌత్రా సెంట ర్లోని చలమయ్య జూనియర్ కళాశాలలో అవగాహన సదస్సులో కలెక్టర్ మాట్లాడారు. ఆయా కార్యక్రమాల్లో డీఆర్వో కె. నాగబాబు, ఆర్డీవో బి.రామమూర్తి, నగరపాలక సంస్థ కమిషనర్ పి.నాగవేణి పాల్గొన్నారు. లాడ్జి సెంటర్లో ... పటిష్ట రాజ్యాంగ రూపకల్పనతో దేశానికి సార్వభౌమాధికారం కల్పించిన అంబేద్కర్ స్ఫూర్తితో సమ సమాజ స్థాపనకు నడుం బిగించాలని జిల్లా కలెక్టర్ ఎస్.సురేశ్‌కుమార్ పిలుపునిచ్చారు. భారతరత్న డాక్టర్ బీఆర్ అంబేద్కర్ జయంతి సందర్భంగా సోమవారం లాడ్జి సెంటర్లోని ఆయన విగ్రహానికి కలెక్టర్ పూలమాల వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ సమాజంలో పౌరులందరికీ సమాన హక్కులు దక్కాలని ఆశించిన అంబేద్కర్ ఆశయాలు అనుసరణీయమన్నారు. కార్యక్రమంలో డీఆర్వో కె. నాగబాబు, ఆర్డీవో బి.రామమూర్తి పాల్గొని అంబేద్కర్‌కు నివాళులర్పించారు. -
పాపం మోటార్‌మెన్ 150 మంది ఓటుకు దూరం
సాక్షి, ముంబై: ఓటు ఎంతో విలువైందని, దానిని ప్రతి ఒక్కరూ వినియోగించుకోవాలని స్వయంగా ప్రభుత్వమే టీవీ, దినపత్రికలు, ఎఫ్.ఎం.రేడియోలలో ప్రకటనలతోపాటు రహదారులపై ప్లెక్సీలు, బ్యానర్ల ద్వారా కోరుతోంది. ఇదే విషయమై ఎన్నికల కమిషన్ దేశంలోని అనేక ప్రాంతాల్లో అవగాహన కార్యక్రమాలు నిర్వహించిన విషయం తెలిసిందే. అయితే ఎంతో బాగా ప్రచారంచేసినా 75 లక్షల మంది ముంబైకర్లకు సేవలందిస్తున్న లోకల్ రైళ్ల మోటర్మెన్లలో 150 మందికి ఆ అవకాశం చేజారిపోనుంది. ఇందుకు కారణం ఆ రోజు కూడా వారు విధి నిర్వహణలో ఉండాల్సి రావడమే. రాష్ట్రంలో ఈ నెల 24న మూడో విడత ఎన్నికలు జరగనున్నాయి. సెంట్రల్ రైల్వే పరిధిలో 600, పశ్చిమ రైల్వేమార్గంలో 410 మోటర్మెన్లు విధులు నిర్వహిస్తున్నారు. అయితే ఎన్నికల రోజునకూడా వారిలో కొందరు విధి నిర్వహణలో ఉండకతప్పడం లేదు. ఈ కారణంగా దాదాపు 150 మంది తమ ఓటు హక్కుకు దూరం కానున్నారు. సెంట్ర ల్ రైల్వే మార్గంలో లోకల్ ైరె ళ్లు ప్రతిరోజూ సుమారు 1,600, పశ్చిమ మార్గంలో దాదాపు 1,100పైగా ట్రిప్పులు తిరుగుతాయి. లోక్‌సభ ఎన్నికల రోజున మోటార్మెన్లంతా తమ ఓటు హక్కు వినియోగించుకునేలా టైమ్‌టేబుల్ రూపొందించేందుకు సంబంధిత అధికారులు ఎంతగానో ప్రయత్నించారు. అయితే అది ఆచరణ సాధ్యం కాలేదు. వీరంతా తమ ఓటు హక్కును వినియోగిచుకునేలా షెడ్యూల్లో మార్పులుచేస్తే రైళ్ల ట్రిప్పులను తగ్గించాల్సి ఉంటుంది. అయితే అది ఆచరణ సాధ్యం కాదని తేలిపోయింది. ఇదే పరిస్థితి శాసనసభ ఎన్నికల సమయంలో కూడా ఎదురుకానుంది. ఈ అంశంపై రాష్ట్ర ఎన్నికల సంఘంతో చర్చలు జరుపుతున్నారు. వారు ఓటు హక్కు వినియోగించుకునేవిధంగా ప్రత్యామ్నాయ మార్గాలను అన్వేషించాల్సిందిగా డిమాండ్ చేయనున్నారు. ప్రస్తుతం ఎన్నికల పనులకు దూరప్రాంతాలకు వెళ్లిన వివిధ ప్రభుత్వ శాఖల ఉద్యోగులకు పోస్టల్ బ్యాలెట్ పద్ధతిలో ఓటు హక్కు వినియోగించుకునే సౌకర్యం ఉంది. అయితే లోకల్ రైళ్ల మోటర్మెన్లకు ఈ సౌకర్యం లేకపోవడంతో ఇక ఓటుపై ఆశ వదులుకోవల్సిందేనా అనే సందేహం వ్యక్తమవుతోంది. -
ఓటే ఆయుధం
మారేడుమిల్లి, న్యూస్‌లైన్ : ప్రజాస్వామ్యానికి ఓటే ఆయుధమని కలెక్టర్ నీతూ ప్రసాద్ పేర్కొన్నారు. ఓటు హక్కును సద్వినియోగపరుచుకుని అభివృద్ధికి తోడ్పాటునందించే నాయకులను ఎన్నుకోవాలని గిరిజనులకు ఆమె సూచించారు. కలెక్టర్ నీతూప్రసాద్ గురువారం మారేడుమిల్లి మండలంలో పర్యటించారు. తొలుత ఆమె స్థానిక జెడ్పీ హైస్కూలులో ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికల పోలింగ్ సామగ్రిని పంపిణీ చేశారు. మారేడుమిల్లిలోని పోలింగ్ కేంద్రాల్లో ఫర్నిచర్, తాగునీటి ఏర్పాట్లు, విద్యుత్‌సరఫరా, వెబ్ సౌకర్యాలను పరిశీలించారు. అనంతరం మారేడుమిల్లి మండలం బంద గ్రామంలో ఓటు వేసేలా ప్రజలను చైతన్య పరచేందుకు ఓటర్లకు అవగాహన ర్యాలీ నిర్వహించారు. సార్వత్రిక ఎన్నికలకు బంద గ్రామంలో పోలింగ్ బూత్‌లను నూతనంగా ఏర్పాటు చేసినట్టు ఆమె తెలియజేశారు. సాధారణంగా వెయ్యిమంది ఓటర్లు ఉన్నచోట ఎన్నికల సంఘం పోలింగ్ కేంద్రాన్ని కేటాయిస్తుందన్నారు. అయితే గిరిజన ప్రాంతాల్లో దూరభారాలను పరిగణనలోకి తీసుకొని 400 మంది ఓటర్లు ఉన్నప్పటికీ పోలింగ్‌కేంద్రం ఏర్పాటు చేశామన్నారు. ఈవీఎంలపై గిరిజనులకు అవగాహన కల్పించాలని ఆదేశించారు. గుడిసే గ్రామంలో ఉపాధి హామీ పథకంలో చేపట్టిన రోడ్డు పనులను కలెక్టర్ పరిశీలించారు. ఐటీడీఏ పీఓ గంధం చంద్రుడు, ఆర్డీవో శంకరవరప్రసాద్, గిరిజన సంక్షేమ శాఖ డీడీ మణికుమార్, ఈఈ నాగేశ్వరరావు, తహశీల్దారు సుబ్బారావు, రెవెన్యూ, ఉపాధ్యాయ సిబ్బంది పాల్గొన్నారు. -
నేడు పరిషత్ తుది పోరు
సాక్షి, నెల్లూరు జిల్లాలో పరిషత్ ఎన్నికల రెండో విడత పోరు శుక్రవారం జరగనుంది. మొత్తం 25 జెడ్పీటీసీ స్థానాలకు, 311 ఎంపీటీసీ స్థానాలకు జరగనున్న ఈ ఎన్నికల్లో 7,83,654 మంది తమ ఓటు హక్కును వినియోగించుకోనున్నారు. వీరిలో పురుషులు 3,87,068 మంది, స్త్రీలు 3,96,583 మంది, ఇతరులు ముగ్గురు ఉన్నారు. ఈ నెల 6న తొలివిడత ఎన్నికల్లో భాగంగా 21 జెడ్పీటీసీ, 258 ఎంపీటీసీలకు ఎన్నికలు జరిగిన విషయం తెలిసిందే. శుక్రవారం జరగనున్న మలివిడత ఎన్నికల్లో మొత్తం 25 జెడ్పీటీసీ స్థానాలకు సంబంధించి 100 మంది, 311 ఎంపీటీసీ స్థానాలకు 883 మంది అభ్యర్థులు బరిలో ఉండగా 1,062 పోలింగ్ కేంద్రాల్లో ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకోనున్నారు. ఇప్పటికే ఎన్నికలు జరగనున్న 25 మండలాల్లో 112 అతి సమస్యాత్మక గ్రామాలు, 207 సమస్యాత్మక గ్రామాలుగా అధికారులు గుర్తించారు. ఈ గ్రామాలపై జిల్లా అధికార యంత్రాంగం ప్రత్యేక దృష్టి సారించింది. ఎన్నికల విధులు నిర్వహించే అధికారులు, సిబ్బందికి ఇప్పటికే ఎలాంటి ఇబ్బందికర పరిస్థితులు ఎదురైతే వాటిని ఏ విధంగా చక్కబెట్టాలనే విషయమై ప్రత్యేకంగా శిక్షణ ఇచ్చారు. ముఖ్యంగా ప్రిసైడింగ్ అధికారులకు జిల్లా పాలనాధికారి ఎన్.శ్రీకాంత్ పదేపదే జాగ్రత్తలు చెప్పడంతో పాటు స్పష్టమైన ఆదేశాలు జారీ చేశారు. ఆయా ప్రాంతాల్లో వెబ్‌కెమెరాలు, వీడియోగ్రాఫర్లను ఏర్పాటు చేసి అన్ని అంశాలను చిత్రీకరించే విధంగా చర్యలు చేపట్టారు. ఈ ఎన్నికలకు సంబంధించి 5,848 మంది ప్రిసైడింగ్, పోలింగ్ అధికారులు విధులను నిర్వర్తించనున్నారు. ఎన్నికల విధుల్లో పాల్గొనే అధికారులు, సిబ్బంది ఇప్పటికే అవసరమయ్యే బ్యాలెట్ బాక్సులు, ఇతర సామాగ్రితో పాటు పోలింగ్ కేంద్రాల వద్దకు చేరుకున్నారు. గతానుభవాలను దృష్టిలో ఉంచుకుని శుక్రవారం జరగనున్న ఎన్నికల్లో ఎలాంటి చిన్న ఇబ్బంది కూడా తలెత్తకుండా సజావుగా, ప్రశాంత వాతావరణంలో నిర్వహించేందుకు అధికార యంత్రాంగం ప్రత్యేకంగా చర్యలు చేపట్టింది. కౌంటిగ్ కేంద్రాలు ఇవే : 25 జెడ్పీటీసీ స్థా నాలకు జరిగే ఎన్నికలకు సంబంధించి నెల్లూరులోని డీకే మహిళా కళాశాల, గూడూరులోని ఆదిశంకర ఇంజనీరింగ్ కళాశాల, నాయుడుపేటలోని నారాయణ జూని యర్ కళాశాలలో ఓట్ల లెక్కింపునకు చర్యలు చేపట్టారు. చేజర్ల, కలువాయి, ఇందుకూరుపేట, నెల్లూరు, తోటపల్లిగూడూరు, ముత్తుకూరు, వెంకటాచలం, పొదలకూరు, రాపూరు మండలాలకు సంబంధించిన బ్యాలెట్ బాక్సులను నెల్లూరులోని డీకే ప్రభుత్వ మహిళా కళాశాలకు చేర్చడంతో పాటు అక్కడే నిర్ణయించిన తేదీన ఓట్ల లెక్కింపు జరుగుతుంది. మనుబోలు, గూడూరు, చిల్లకూరు, చిట్టమూరు, కోట, వాకాడు, సైదాపురం, డక్కిలి, వెంకటగిరి, బాలాయపల్లి, మండలాలకు సంబంధించి గూడూరులోని ఆదిశంకర ఇంజనీరింగ్ కళాశాలలో ఓట్ల లెక్కింపు జరుగుతుంది. ఓజిలి, నాయుడుపేట, పెళ్లకూరు, దొరవారిసత్రం, సూళ్లూరుపేట, తడ మండలాలకు సంబంధించి నాయుడుపేటలోని నారాయణ జూనియర్ కళాశాలలో ఓట్ల లెక్కింపు జరుగుతుంది. -
దేశాన్ని ప్రేమిస్తే ఓటేయండి
సార్వత్రిక ఎన్నికలు దగ్గర పడుతుండడంతో రాజకీయ వాతావరణం వేడెక్కుతోంది. గెలుపు కోసం రాజకీయ నాయకులు ఎత్తులు పై ఎత్తులు వేస్తున్నారు. ఈ ఎన్నికల్లో సినిమా వాళ్ల పాత్ర అధికంగానే ఉంది. కొందరు ప్రత్యక్షంగాను, మరి కొందరు పరోక్షంగానూ రాజకీయాల్లో మమేకం అవుతున్నారు. ఇలాంటి పరిస్థితిలో నటుడు మాధవన్ రాజకీయ వ్యాఖ్యలు చేయడం ఆసక్తిగా మారింది. తానే పార్టీ గురించి మాట్లాడడం లేదంటూనే ఓటు హక్కును ఉపయోగించుకోండంటూ ప్రకటనలు చేయడంతో ఆయన ఆలోచనా ధోరణి ఏమిటి అన్న ఆరా తీసే పనిలో కొందరు నిమగ్నమయ్యారు. ఇంతకీ నటుడు మాధవన్ ఏమన్నారంటే రానున్న పార్లమెంటు ఎన్నికలు చాలా ముఖ్యమైనవి. కాబట్టి ప్రతి పౌరుడు తమ ఓటు హక్కును సద్వినియోగం చేసుకోవాలని కోరుకుంటున్నాను. ఇది సగటు మనిషి బాధ్యత. అయితే నేనే రాజకీయ పార్టీ గురించి ప్రస్తావించడం లేదు. ‘‘దేశాన్ని ప్రేమించే వారైతే ఓటేయండి. మీ ఓటు ఈ దేశ తలరాతను మారుస్తుంద’’ని మాధవన్ వ్యాఖ్యానించారు. -
ఓటింగ్ శాతం పెంచేందుకు సహకరించాలి
విజయవాడ సిటీ, న్యూస్‌లైన్ : విద్యార్థుల తల్లిదండ్రులు అందరూ ఓటు హక్కు వినియోగించుకుని ఓటింగ్ శాతం పెంచేలా సిస్టమేటిక్ ఓటర్ ఎడ్యుకేషన్ అండ్ ఎలక్ట్రోరల్ పార్టిసిపేషన్(స్వీప్) చేపడుతున్న కార్యక్రమానికి విద్యాశాఖ అధికారుల సహకారం అవసరమని కలెక్టర్ ఎం.రఘునందన్‌రావు సూచించారు. జిల్లాలోని డీవైఈవోలు, ఎంఈవోలతో మంగళవారం తన క్యాంపు కార్యాలయంలో కలెక్టర్ సమావేశం నిర్వహిం చారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గత ఎన్నికల్లో జిల్లా వ్యాప్తంగా 80 శాతం పోలింగ్ జరిగిందని, గ్రామీణ ప్రాంతాల్లో 85 శాతానికి పైగా, నగరం, పట్టణ ప్రాంతాల్లో 69 శాతం నమోదైందని వివరించారు. సాధారణ ఎన్నికలలో జిల్లాలో పోలింగ్ శాతాన్ని గణనీయంగా పెంచటానికి, ఓటర్లను చైతన్యపరచేందుకు 2010 నుంచి స్వీప్ ద్వారా పలు కార్యక్రమాలు నిర్వహిస్తున్నామన్నారు. విద్యార్థులకు సంకల్ప పత్రాలను అందజేసి ఎన్నికల్లో ఎటువంటి ప్రలోభాలకు లొంగకుండా తప్పనిసరిగా ఓటు వేస్తామని వారి తల్లిదండ్రులతో వాటిపై సంతకాలు చేరుుంచి తిరిగి అధికారులకు అందజేసే విధంగా విద్యా శాఖ అధికారులు చర్యలు తీసుకోవాలని కలెక్టర్ ఆదేశించారు. ఈ సమావేశంలో ఆర్ఐవో వెంకటరామయ్య, డీఈవో డి.దేవానందరెడ్డి, స్వీప్ నోడల్ అధికారి టి.దామోదర్‌నాయుడు తదితరులు పాల్గొన్నారు. మాస్టర్ ట్రైనర్లకు శిక్షణ విజయవాడ సిటీ : ‘ప్రశ్నించండి.. వాటికి సమాధానాలు పొందండి.. సందేహాలతో శిక్షణ కార్యక్రమం నుంచి వెళ్లకండి..’ అని మాస్టర్ ట్రైనర్లకు జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ ఎం.రఘునందన్‌రావు సూచించారు. సార్వత్రిక ఎన్నికల నిర్వహణపై రిటర్నింగ్ అధికారులు, 112 మంది మాస్టర్ ట్రైనర్లకు మంగళవారం స్థానిక మున్సిపల్ కార్పొరేషన్ కార్యాలయంలో శిక్షణ ఇచ్చారు. కలెక్టర్ మాట్లాడుతూ మే 7న జరిగే సార్వత్రిక ఎన్నికల విధుల్లో పాల్గొనే పోలింగ్ సిబ్బందికి క్షేత్రస్థారుులో వచ్చే సందేహాలను నివృత్తి చేయడంలో మాస్టర్ ట్రైనర్లు కీలకపాత్ర వహించాల్సి ఉంటుందన్నారు. పీవో డైరీ రూపొందించడం, ఫారం17సీ పూర్తి చేయడం, ఈవీఎంల సీలింగ్ విధానాలను వివరించారు. పోలింగ్ సమయాన్ని ఉదయం 7 నుంచి సాయంత్రం 6 గంటల వరకు పొడిగించారని తెలిపారు. అనంతరం మాస్టర్ ట్రైనర్ల సందేహాలను జారుుంట్ కలెక్టర్ జె.మురళి, నగరపాలక సంస్థ కమిషనర్ సి.హరికిరణ్, ఏజేసీ బి.ఎల్.చెన్నకేశవరావు నివృత్తి చేశారు. డ్వామా పీడీ అనిల్‌కుమార్, రాష్ట్ర మాస్టర్ ట్రైనింగ్ ఫెసిలిటేటర్ పి.మురళి, డీఈవో దేవానందరెడ్డి, ఆర్డీవోలు, రిటర్నింగ్ అధికారులు పాల్గొన్నారు. -
నామినేషన్ల స్వీకరణకు రెడీ అవ్వండి
ఏలూరు, న్యూస్‌లైన్ : అసెంబ్లీ, పార్లమెంట్ ఎన్నికలకు సంబంధించి జిల్లాలో ఈనెల 12వ తేదీ నుంచి నామినేషన్ల ప్రక్రియ చేపట్టేందుకు రిటర్నింగ్, నోడల్ అధికారులు సిద్ధం కావాలని జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ సిద్ధార్థజైన్ ఆదేశించారు. నామినేషన్ల ప్రక్రియపై నియోజకవర్గాల రిటర్నింగ్, నోడల్ అధికారులతో సోమవారం ఆయన సమావేశమయ్యూరు. నామినేష న్ల స్వీకరణకు అవసరమైన ముందస్తు చర్యలను 10వ తేదీ నాటికి పూర్తి చేయాలని కోరారు. రిటర్నింగ్ అధికారి కార్యాలయ పరిధిలో 100 మీటర్ల వరకు ప్రత్యేక బారికేడింగ్ చేరుుంచాలన్నారు. నామినేషన్ల ప్రక్రియకు సంబంధించిన సమాచారాన్ని నోటీస్ బోర్డుల్లో అందుబాటులో ఉంచాలన్నారు. పనిదినాల్లో ఉదయం 11నుంచి మధ్యాహ్నం 3గంటల వరకూ నామినేషన్ల స్వీకరణ ఉంటుందనే విషయాన్ని తెలియజేయాలన్నారు. ఎన్నికలను సమర్థవంతంగా నిర్వహించేందుకు ప్రణాళిక రూపొందించుకోవాలని సూచించారు. ఎవరైనా బాధ్యతా రాహిత్యంగా వ్యవహరిస్తే వేటు తప్పదని హెచ్చరించారు. కొత్త ఓటర్ల దరఖాస్తులను పరిష్కరించాలని ఆదేశం ఓటు హక్కు నమోదు కోసం కొత్తగా వచ్చిన దరఖాస్తులన్నిటినీ ఈనెల 9వ తేదీలోగా పరిష్కరించాలని కలెక్టర్ ఆదేశించారు. ఆన్లైన్లో వచ్చిన దరఖాస్తులను పరిష్కరించేందుకు ప్రత్యేకంగా సిబ్బందిని ఏర్పాటు చేయాలన్నారు. కొత్తగా నమోదైన ఓటర్లకు ఎపిక్ ఫొటో ఓటరు గుర్తింపు కార్డులను ఉచి తంగా అందించేందుకు అన్నిచర్యలు తీసుకున్నామని చెప్పారు. ఇందుకోసం జిల్లాకు 2 లక్షల కార్డులు వచ్చాయని, వీటిని త్వరితగతిన సంబంధిత ఓటర్లకు అందించేందుకు ఏర్పాట్లు చేయూలని ఆదేశించారు. నూతన ఓటర్లలో ఎవరికైనా ఫొటో ఓటరు గుర్తింపు కార్డు అందకపోతే కలెక్టరేట్లోని టోల్‌ఫ్రీ నంబర్ 1800-425-1365కు ఫోన్ చేయూలని సూచించారు. పోలింగ్ శాతం బాగుంది జెడ్పీటీసీ, ఎంపీటీసీ తొలి విడత ఎన్నికలను సజావుగా నిర్వహించామని, ఇందుకు అధికారులు, సిబ్బంది బాగా సహకరించారని కలెక్టర్ పేర్కొన్నారు. గత ఎన్నికల్లో 74 శాతం పోలింగ్ నమోదు కాగా, ఈ విడత ఎన్నికల్లో 84.58 శాతం పోలింగ్ నమోదు కావడం విశేషమని చెప్పారు. ఎన్నికల విధులు నిర్వర్తించే ప్రతి ఒక్కరూ పోస్టల్ బ్యాలెట్‌ను వినియోగించుకోవాలని కోరారు. తొలుత జారుుంట్ కలెక్టర్ టి.బాబూరావునాయుడు ఎన్నికల నిర్వహణలో పాటించాల్సిన విధివిధానాలను పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ ద్వారా రిటర్నింగ్ అధికారులకు వివరించారు. అదనపు జాయింట్ కలెక్టర్ నరసింగరావు, తదితరులు పాల్గొన్నారు. -
తొలివిడత ప్రాదేశిక పోరు
సాక్షి, ఒంగోలు: తొలివిడత ప్రాదేశిక పోరు రసవత్తరంగా ముగిసింది. జిల్లా వ్యాప్తంగా ఆరు నియోజకవర్గాల పరిధిలోని 28 మండలాల్లో ఆదివారం జరిగిన ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికల్లో మహిళలు, వృద్ధులు, యువత, రైతులు ఓటుహక్కు వినియోగించుకునేందుకు పోటీపడ్డారు. ఫలితంగా.. ఇటీవల జరిగిన మున్సిపల్ ఎన్నికల కంటే అధికంగా ఓట్లు పోలయ్యాయి. ఓటింగ్ శాతం పెరగడం ప్రధానంగా మహిళలు అధికసంఖ్యలో పోలింగ్‌లో పాల్గొనడం గ్రామాల్లో వైఎస్సార్ కాంగ్రెస్‌కు ఆదరణ అధికంగా ఉండటంతో తొలివిడత ప్రాదేశిక ఎన్నికల్లో ‘ఫ్యాన్’ గాలి స్పీడు స్పష్టంగా కనిపించిందని రాజకీయ పరిశీలకులు విశే ్లషిస్తున్నారు. ఎన్నికలు జరిగిన నియోజకవర్గాల్లో అత్యధిక జెడ్పీటీసీ స్థానాలు వైఎస్సార్ సీపీ గెలుచుకునే అవకాశం కనిపిస్తోందని అంచనా వేస్తున్నారు.ఒకట్రెండు చోట్ల మాత్రం టీడీపీ గట్టి పోటీనివ్వగలిగిందని చెబుతున్నారు. నియోజకవర్గాలవారీగా నమోదైన ఓటింగ్ సరళిని పరిశీలిస్తే జిల్లాలోని చీరాల, పర్చూరు, అద్దంకి, యర్రగొండపాలెం, మార్కాపురం, గిద్దలూరు నియోజకవర్గాల్లోని 28 జెడ్పీటీసీ, 395 ఎంపీటీసీ స్థానాలకు పోలింగ్ జరగ్గా సగటు పోలింగ్ శాతం 82.68గా నమోదైంది. దివంగత వైఎస్ రాజశేఖరరెడ్డి ప్రవేశపెట్టిన సంక్షేమాభివృద్ధి పథకాలతో పల్లెల్లో సింహభాగం ప్రజలు లబ్ధిపొందారు. ప్రధానంగా రైతులు, రైతుకూలీ వర్గాలకు వైఎస్ దన్నుగా నిలిచారు. ఆయన చేపట్టిన సంక్షేమాభివృద్ధి పథకాలను సమర్థంగా అమలు చేయగల సత్తా ఒక్క వైఎస్సార్ కాంగ్రెస్ అధినేత జగన్మోహన్రెడ్డికి మాత్రమే ఉందని ప్రజలు విశ్వసిస్తున్నారు. ఇది ఇప్పటికే సహకార, పంచాయతీ ఎన్నికల్లో స్పష్టమైంది. ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికల్లోనూ ప్రజలు ఇదేరీతిగా తీర్పునిచ్చివుంటారని రాజకీయవర్గాలు విశ్లేషిస్తున్నాయి. అద్దంకిలో అత్యధికం..కొమరోలులో అత్యల్పం.. సార్వత్రిక ఎన్నికలకు ముందుగా వచ్చిన ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికల్లో తమతీర్పు ద్వారా పార్టీలపట్ల విశ్వసనీయత తెలిపేందుకు పల్లెజనం ఎదురుచూశారు. ఈమేరకు పోలింగ్ ప్రారంభం నుంచి చివరి వరకు ఓటర్లు పోలింగ్ కేంద్రాల వద్ద క్యూలైన్ల్లో గంటల తరబడి నిలబడి మరీ తమ ఓటుహక్కు వినియోగించుకున్నారు.అద్దంకిలో అత్యధికంగా 91.96 శాతం పోలింగ్ జరగ్గా, అత్యల్పంగాకొమరోలు మండలంలో 69.31 శాతం నమోదైంది.యద్దనపూడి, బల్లికురవ, పెద్దారవీడు మండలాల్లో 90 శాతానికిపైగా పోలింగ్ జరిగింది. చీరాల, పర్చూరు, కారంచేడు, చినగంజాం, జె.పంగులూరు, సంతమాగులూరు, కొరిశపాడు, యర్రగొండపాలెం, దోర్నాల, త్రిపురాంతకం, మార్కాపురం, కొనకనమిట్ల, తర్లుపాడు, పొదిలి, అర్థవీడు తదితర మండలాల్లో మాత్రం 80 శాతానికిపైగా పోలింగ్ నమోదైంది.ఈ మండలాలన్నింటిలో మహిళా ఓటింగ్ శాతం అధికంగా నమోదైంది. ప్రధానంగా గ్రామాల్లోని ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీవర్గాల సాలిడ్ ఓటుబ్యాంకు వైఎస్సార్ కాంగ్రెస్‌కు అను కూలంగా మొగ్గు చూపినట్లు టీడీపీ, కాంగ్రెస్ వర్గాలే బహిరంగంగా అంగీకరిస్తున్నాయి. జెడ్పీచైర్మన్ కైవసం ఖాయం.. తొలివిడత ప్రాదేశిక ఎన్నికల్లో 28 జెడ్పీటీసీ స్థానాలకు ఎన్నికలు జరగ్గా మొత్తం 111 మంది అభ్యర్థులు పోటీపడ్డారు. జెడ్పీ చైర్మన్ స్థానం ఓసీ జనరల్‌కు రిజర్వుకాగా వైఎస్సార్ కాంగ్రెస్ మాత్రం బీసీ నేతకు కేటాయించి ఆ వర్గ ప్రజలపై తనకు వున్న ప్రేమను చాటుకుంది. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ విడుదల చేసిన ఎన్నికల అజెండాపై రైతు, మహిళా వర్గాల్లో ఆశాభావం పెరిగింది.మరోవైపు క్షేత్రస్థాయిలో కాంగ్రెస్ మనుగడ పూర్తిగా అంధకారంగా మారడం,పలు మండలాల్లో టీడీపీ నేతల మధ్య సమన్వయం లోపించడంతో మేజర్ ఓటుబ్యాంకు సామాజిక వర్గాలన్నీ వైఎస్సార్ కాంగ్రెస్‌కు అనుకూలంగా మారాయని రాజకీయ పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. ఇదే ప్రభావం మలివిడత ప్రాదేశిక పోరులోనూ ఉంటుందని కచ్చితంగా జెడ్పీ చైర్మన్ పదవిని తమపార్టీ కైవసం చేసుకుంటుందనే ధీమా వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీవర్గాల్లో కనిపిస్తోంది. -
స్థానిక ఎన్నికల తొలిదశ పోలింగ్
ఒంగోలు, న్యూస్‌లైన్, స్థానిక ఎన్నికల తొలిదశ పోలింగ్ ఆదివారం జరగనుంది. జిల్లాలోని మొత్తం 56 మండలాలకు 28 మండలాల్లో 385 ఎంపీటీసీ, 28 జెడ్పీటీసీ స్థానాలకు ఎన్నికలు జరుగుతున్నాయి. ఎంపీటీసీ బరిలో మొత్తం 1056 మంది, జెడ్పీటీసీ బరిలో మొత్తం 111 మంది అభ్యర్థులు పోటీలో వున్నారు. 10,21,189 మంది ఓటర్లు తమ ఓటు హక్కు వినియోగించుకోనున్నారు. ఉదయం ఏడు గంటల నుంచి సాయంత్రం ఐదు గంటల వరకు పోలింగ్ నిర్వహిస్తారు. ఈమేరకు అవసరమైన అన్ని ఏర్పాట్లను అధికార యంత్రాంగం పూర్తి చేసింది. తొలి దశ కింద చీరాల, పర్చూరు, అద్దంకి, మార్కాపురం, గిద్దలూరు, వై.పాలెం నియోజకవర్గాలలోని 28 మండలాల్లో ఎన్నికలు జరుగుతున్నాయి. ఎంపీటీసీ బరిలో వైఎస్సార్సీపీ తరఫున 389, బీఎస్పీ 6, బీజేపీ 4, సీపీఐ 12, సీపీఎం 12, కాంగ్రెస్ 25, టీడీపీ 382, స్వతంత్రులు 226తోపాటు మొత్తం 1056 మంది అభ్యర్థులు పోటీలో ఉన్నారు. జెడ్పీటీసీ బరిలో వైఎస్సార్సీపీ తరఫున 28, బీఎస్పీ 2, బీజేపీ 2, సీపీఐ 1, సీపీఎం 2, కాంగ్రెస్ 8, టీడీపీ 27, లోక్‌సత్తా 1, స్వతంత్రులు 40 మందితో కలిపి మొత్తం 111 మంది బరిలో ఉన్నారు. అభివృద్ధి ప్రదాతకు పట్టం కట్టేందుకు సిద్ధం... జిల్లాలో తొలిదశ ప్రాదేశిక ఎన్నికలు జరుగుతున్న 28 మండలాల్లో అభివృద్ధి ప్రదాతకే పట్టం కట్టేందుకు ఓటర్లు సంసిద్ధులయ్యారు. రాష్ట్ర విభజనతో సంక్షోభానికి కారకులైన వారికి బుద్ధి చెప్పేందుకు సిద్ధంగా ఉన్నారు. 2001లో టీడీపీ అధికారంలో ఉన్న సమయంలో 15 జెడ్పీటీసీ స్థానాలను కాంగ్రెస్ పార్టీ కైవసం చేసుకుంది. 2004లో మహానేత డాక్టర్ వైఎస్ రాజశేఖరరెడ్డి అధికారంలోవున్న సమయంలో కాంగ్రెస్‌పై ఈ ప్రాంత ప్రజలు ఎనలేని ఆదరణ కనబరిచారు. 28 స్థానాల్లో 25 జెడ్పీటీసీ స్థానాలను కాంగ్రెస్ కైవసం చేసుకోగా కేవలం 3 స్థానాలు మాత్రమే టీడీపీకి దక్కాయి. ప్రస్తుతం పరిస్థితి మారింది.సమైక్యాంధ్ర ఉద్యమంలో జిల్లా ప్రజలు వైఎస్సార్ సీపీ వెన్నంటి నడిచారు.విభజనకు వ్యతిరేకంగా నినదించారు. ఆందోళనలు చేపట్టారు.ఇతర పార్టీల నేతలు మొక్కుబడి దీక్షల పేరుతో కాలక్షేపం చేశారు. జనం తోడుగా గొంతు విప్పలేకపోయారు. ఉద్యోగ, కార్మిక, కర్షక, శ్రామిక, ఉపాధ్యాయ రంగాల్లోని వారిలో అత్యధిక శాతం సమైక్యాంధ్రకు మద్దతుగా వైఎస్సార్ సీపీతో కలిసి పోరాడారు. తమతో కలిసి వస్తేనే భవిష్యత్తని, లేకుంటే రాజకీయ సమాధి కాక తప్పదని హెచ్చరించారు. పదవిపై ఉన్న వ్యామోహంతో కొందరు నేతలు వ్యవహరించిన తీరు జనం మదిలో భగ్గుమంటోంది. సీమాంధ్ర ప్రజల ఆకాంక్షలను పట్టించుకోని నాయకులను ఎట్టి పరిస్థితుల్లో వదిలేది లేదని..ఈ ఎన్నికల్లో వారికి సరైన గుణపాఠం చెబుతామని ఓటర్లు స్పష్టం చేస్తున్నారు.ఓటర్లను ఎలాగైనా తమవైపు తిప్పుకునేందుకు కొన్ని రాజకీయ పార్టీల నాయకులు కుల రాజకీయాలకు తెరలేపారు. డబ్బు, మద్యం యథేచ్ఛగా పంపిణీ చేస్తున్నారు.ఎవరెన్ని ప్రలోభాలు పెట్టినా..అభివృద్ధి చేసేది ఎవరో, అభివృద్ధి చేస్తామంటూ మోసపూరిత ప్రకటనలిచ్చేదెవరో తమకు స్పష్టంగా తెలుసని, తమ తీర్పు ద్వారా అభివృద్ధి ప్రదాతలకు పట్టం కడతామని చెబుతున్నారు. -
రెండో ఓటేస్తే క్రిమినల్ చర్యలు
సాక్షి, గుంటూరు: ఓటరు జాబితాలో డబుల్ ఎంట్రీల కారణంగా మున్సిపల్ ఎన్నికల్లో ఓటు హక్కు వినియోగించుకున్న ఓటర్లు ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికల్లో ఓటు వేసే ప్రయత్నం చేస్తే క్రిమినల్ కేసులు నమోదు చేస్తామని జిల్లా కలెక్టరు ఎస్.సురేశ్‌కుమార్ హెచ్చరించారు. తమ వద్ద మున్సిపల్ ఎన్నికల్లో ఓటు వినియోగించుకున్న వారి సంతకాలతో కూడిన జాబితా ఉందని, ఒకవేళ స్థానిక ఎన్నికల్లో ఓటు వేసేందుకు వస్తే ఇట్టే గుర్తిస్తామని స్పష్టం చేశారు. మున్సిపల్ ఎన్నికల్లో ఓటు హక్కు ఉండి వినియోగించుకోకుంటే స్థానిక ఎన్నికల్లో వినియోగించుకోవచ్చన్నారు. శుక్రవారం ఉదయం స్థానిక జిల్లా పరిషత్ సమావేశ మందిరంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో కలెక్టరు మాట్లాడారు. తొలి విడతగా 29 మండలాల్లో పోలింగ్.. ఈనెల 6వ తేదీ (ఆదివారం) తొలి విడతగా తెనాలి, నరసరావుపేట డివిజన్లలో జరగనున్న ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికల నిర్వహణకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేసినట్లు తెలిపారు. ఎన్నికల సంఘం అనుమతి మేరకు మొదటి విడతలో జిల్లాలోని 29 మండలాల్లో నిర్వహిస్తున్నామని, ఇక్కడున్న 470 ఎంపీటీసీ స్థానాలకు గాను 15 ఏకగ్రీవమైనందున 455 చోట్ల ఎన్నికలు జరుగుతున్నాయన్నారు. అలాగే 29 జడ్పీటీసీలకు ఎన్నికలు నిర్వహించనున్నామని పేర్కొన్నారు. 29 జడ్పీటీసీ స్థానాలకు గాను 103 మంది, 455 ఎంపీటీసీ స్థానాలకు గాను 1,192 మంది అభ్యర్థులు బరిలో ఉన్నట్లు చెప్పారు. ఈ రెండు డివిజన్లలో మొత్తం 12,02,929 మంది ఓటర్లు తమ ఓటు హక్కు వినియోగించుకోనున్నారని కలెక్టరు తెలిపారు. రెండు డివిజన్లలో 909 ప్రాంతాలలో 1,618 పోలింగ్ స్టేషన్లు ఉన్నాయన్నారు. ఇందులో 363 అత్యంత సమస్యాత్మక ప్రాంతాలలో 667 పోలింగ్ స్టేషన్లు ఉన్నాయని, సమస్యాత్మక కేంద్రాలుగా గుర్తించిన 288 ప్రాంతాల్లో 533 పోలింగ్స్టేషన్లు, నక్సల్స్ ప్రభావితం కలిగిన 44 ప్రాంతాలలో63 పోలింగ్స్టేషన్లు ఉన్నాయని కలెక్టర్ వివరించారు. 214ప్రాంతాల్లో 355 పోలింగ్ కేంద్రాలున్నాయని తెలిపారు. సమస్యాత్మక, అతిసమస్యాత్మక ప్రాంతాలుగా గుర్తించిన పోలింగ్ స్టేషన్ల వద్ద అదనంగా పోలిసు బలగాలు ఏర్పాటు చేస్తున్నామన్నారు. నేటి సాయంత్రం 5 గంటల వరకు ప్రచారానికి ఓకే.. 123 ప్రాంతాలలో వెబ్‌కాస్టింగ్, 182 చోట్ల వీడియోగ్రఫీ, 412 చోట్ల సూక్ష్మ పరిశీలకులను ఏర్పాటు చేశామని కలెక్టర్ చెప్పారు. మొదటి విడత ఎన్నికల నిర్వహణ కోసం 1,618 పోలింగ్ స్టేషన్లకు 3,323 బ్యాలెట్ బాక్సులు పంపిణీ చేయనున్నట్లు పేర్కొన్నారు. ఎన్నికల నిర్వహణపై ప్రిసైడింగ్, అసిస్టెంట్ ప్రిసైడింగ్ అధికారులు 3,588 మంది, ఓపివోలు 5,353 మందిని కేటాయించినట్లు చెప్పారు. 150 రూట్లను, 72 జోన్లుగా విభజించి సెక్టొరల్ జోనల్ అధికారులను నియమించినట్లు చెప్పారు. సుమారు 288 వాహనాలు, బస్సులు, 72 కార్లు, జీపులు వినియోగిస్తున్నట్లు కలెక్టర్ చెప్పారు. సాధారణంగా ప్రైవేటు వాహనాలు, బస్సులు వినియోగించుకునే అవకాశం ఉండదని, ఈ ఎన్నికలకు మాత్రం అనుమతి లభించిందన్నారు. శుక్రవారం సాయంత్రం 5 గంటల వరకు మాత్రమే అభ్యర్థులు ప్రచారం చేసుకునే అవకాశముందన్నారు. 22,940 మందిపై బైండోవర్ కేసులు జిల్లాలో ఇప్పటి వరకు 263 బెల్టుషాపులు మూయించడంతోపాటు 255 మందిని అరెస్టు చేశామని కలెక్టరు వివరించారు. 22,940 మందిపై బైండోవర్ కేసులు నమోదు చేశామన్నారు. రూ.5,00,13,800 నగదు, 297 గ్రాముల బంగారం, 31 కేజీల వెండిని సీజ్ చేశామని, 311 లెసైన్స్గల ఆయుధాలు స్వాధీన ం చేసుకున్నామని తెలిపారు. జిల్లా స్థాయిలో ఏఎస్డీ (ఆబ్సెంటీ, షిఫ్ట్డ్, డెత్) ఓటర్ల జాబితా రూపొందించామని, ఈ జాబితాలో ఉన్న ఓటర్లు గుర్తింపు కార్డుతో పాటు నివాస ధ్రువపత్రం, ఫొటో గుర్తింపు కార్డు ఏదైనా తీసుకురావాల్సి ఉంటుందని సూచించారు. ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికలకు సంబంధించి ఎటువంటి సమాచారం పొందాలన్నా జిల్లా పరిషత్ కార్యాలయంలోని కంట్రోల్ రూం నంబర్లు 0863-2234756, 2234082 అందుబాటులో ఉంటాయని వివరించారు. సమావేశంలో జేసీ వివేక్‌యాదవ్, జడ్పీ సీఈవో బి.సుబ్బారావు తదితరులు పాల్గొన్నారు. -
జాతాతో ఓటర్లలో చైతన్యం: కలెక్టర్
రాయచూరు రూరల్, న్యూస్‌లైన్ :లోక్‌సభ ఎన్నికల్లో ప్రతి ఒక్కరూ ఓటు హక్కు వినియోగించుకునేలా జాతా ద్వారా చైతన్యం తెస్తున్నటు జిల్లా ఎన్నికల అధికారి నాగరాజ్ తెలిపారు.అధికార యంత్రాంగం మంగళవారం ఏర్పాటు చేసిన జాతాను స్థానిక మార్కెట్ యార్డు పోలీస్ స్టేషన్ వద్ద ఆయన జెండా ఊపి ప్రారంభించారు.అనంతరం జాతా వివిధ ప్రాంతాల మీదుగా సాగుతూ ఓటర్లను చైతన్య పరిచింది. అంతకు ముందు ఓటు హక్కు వినియోగంపై ప్రమాణం చేయించారు.ఎస్పీ నాగరాజ్ మాట్లాడుతూ ఎన్నికలను ప్రశాంతంగా నిర్వహించేందుకు రెండు కేఎస్ఆర్పీ , 10 డీపీఆర్ బలగాలతోపాటూ 540 మంది సివిల్ పోలీస్, 847 మంది హోంగార్డ్ను నియమించినట్లు చెప్పారు. సీఐఎస్ఎఫ్ అధికారి సంజీవకుమార్, ఏఎస్పీ అశోక్, డీఎస్పీ మడివాళ, చంద్రశేఖర్, ఆలీబాబా, బసవరాజ, బేబీ వాలేకర్, సరళ, సురేష్, నదాఫ్, దాదావలి, నాగరాజ అయ్యనగౌడ పాల్గొన్నారు. -
‘పుర’ పోరు ప్రశాంతం
సాక్షి, హన్మకొండ : చెదురుమదురు ఘటనలు మినహా... జిల్లావ్యాప్తంగా మునిసిపల్ ఎన్నికల పోలింగ్ ప్రశాంతంగా ముగిసింది. జిల్లాలోని మహబూబాబాద్, జనగామ మునిసిపాలిటీలతోపాటు భూపాలపల్లి, నర్సంపేట, పరకాల నగర పంచాయతీల్లో ఆదివారం పోలింగ్ ప్రక్రియ నిర్వహించారు. మొత్తంగా 78.69 శాతం ఓటర్లు ఓటు హక్కు వినియోగించుకున్నట్లు ఎన్నికల అధికారులు వెల్లడించారు. అత్యధికంగా నర్సంపేటలో 85.52 శాతం పోలింగ్ జరగగా... అత్యల్పంగా భూపాలపల్లిలో 70.55 శాతం నమోదైంది. జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ జి.కిషన్‌తోపాటు జాయింట్ కలెక్టర్ పాసుమిబసు, డీఐజీ కాంతారావు, రూరల్ ఎస్పీ కాళిదాసు పోలింగ్ సరళిని ప్రత్యక్షంగా పర్యవేక్షించారు. సాయంత్రం ఐదు గంటల తర్వాత కూడా ఓటర్లు బారులుదీరడంతో నర్సంపేటలో ఏడు గంటల వరకు... జనగామలో రాత్రి తొమ్మిది గంటల వరకు పోలింగ్ ప్రక్రియ కొనసాగింది. ఆలస్యంగా ప్రారంభం పోలింగ్ కేంద్రాల్లో ఎలక్ట్రానిక్ ఓటింగ్ మెషిన్ మొరాయించడంతో పరకాలలోని 19వ వార్డులో గంట ఆల స్యంగా ఓటింగ్ ప్రారంభమైంది. అదేవిధంగా... భూపాలపల్లి పదో వార్డులో 15 నిమిషాలపాటు ఆలస్యమైంది. జనగామలోని 18, 28వ వార్డుల్లో ఈవీఎం వినియోగంపై ఓటర్లకు అవగాహన లేక ఇబ్బంది పడ్డా రు. దీంతో అధికారులు మాక్పోలింగ్తో వారికి అవగాహన కల్పించారు. ఈ నేపథ్యంలో ఉదయం ఏడు గంట లకు ప్రారంభం కావాల్సిన పోలింగ్ అరగంట ఆలస్యం గా మొదలైంది. మరోవైపు ఇదే పట్టణంలోని 21 వార్డులో పోలింగ్ ఏజెంట్ అభ్యంతరం చెప్పడంతో అధికారులు 61 మందిని ఓటేసేందుకు అనుమతించలేదు. వారు పోలింగ్ కేంద్రంలో ఆందోళనకు దిగడంతో అధికారులు మరోసారి రికార్డులు పరిశీలించారు. వారు అదే వార్డు ఓటర్లు అని తేలడంతో ఓటేసేందుకు అనుమతించగా... వివాదం సద్దుమణిగింది. ఐదు గంటల తర్వాత కూడా క్యూ వేసవి కావడంతో ఎక్కువ మంది ఓటర్లు సాయంత్రం మూడు గంటల తర్వాత పోలింగ్ కేంద్రాలకు తరలివచ్చారు. పోలింగ్ కేంద్రాల వద్ద సాయంత్రం ఐదు గం టల వరకు క్యూలో ఉన్న వారిని మాత్రమే ఓటేసేందు కు అనుమతించారు. జనగామ మునిసిపాలిటీ పరిధిలో పరిశీలిస్లే ఐదు వార్డుల్లో సాయంత్రం ఐదు గంటల త ర్వాత కూడా పోలింగ్ కొనసాగింది. 24, 28వ వార్డుల్లో సాయంత్రం 6:30 గంటల వరకు... 11, 12వ వార్డుల్లో రాత్రి ఎనిమిది గంటల వరకు... తొమ్మిదో వార్డులో తొమ్మిది గంటల వరకు పోలింగ్ జరిగింది. 1,400 మంది ఓటర్లు దాటిన పోలింగ్ బూత్‌లలో స్త్రీ, పురుషులకు వేర్వేరు ఈవీఎంలు ఏర్పాటు చేయకపోవడంతో ఓటింగ్ ప్రక్రియ ఆలస్యమైనట్లు తెలుస్తోంది. సాయంత్రం వేళ పలు పోలింగ్ కేంద్రాల్లో సరైన వెలుతురు లేకపోవడంతో ఓటర్లు ఇబ్బందులు పడ్డారు. పరకాల 12వ వార్డులో 5.30 గంటల వరకు, నర్సంపేట 4, 5, 13వ వార్డుల్లో ఏడు గంటల వరకు పోలింగ్ కొనసాగింది. మహబూబాబాద్, భూపాలపల్లిలో సాయంత్రం ఐదు గంటల వరకు పోలింగ్ ముగిసింది. పరకాలలో కౌన్సిలర్ అభ్యర్థి ఆత్మహత్యాయత్నం పరకాల నగర పంచాయతీ పరిధిలోని 20వ వార్డులో స్వతంత్ర అభ్యర్థిగా బరిలో ఉన్న మంద రాంచందర్‌కు ఎన్నికల అధికారులు మొదట గ్యాస్ పొయ్యి గుర్తు కేటాయించారు. పోలింగ్ బూత్ బయట డిస్ప్లేలో గ్యా స్పొయ్యికి బదులు సిలిండర్ గుర్తు ఉండడంతో ఆయ న అవాక్కయ్యారు. తనపై కుట్రతోనే గుర్తు మార్చారని అధికారులపై ఆగ్రహం వ్యక్తం చేశారు. న్యాయం చేయకపోతే.. ఇక్కడే చచ్చిపోతానని పురుగుల మందు డబ్బాతో పోలింగ్ కేంద్రానికి వచ్చారు. వెంటనే స్పం దించిన ఎన్నికల అధికారులు గ్యాస్ పొయ్యి గుర్తును ఏర్పాటు చేశారు. మానుకోటలో వడదెబ్బతో వృద్ధురాలి మృతి మహబూబాబాద్‌లో వేల్పుల సత్యంనగర్కు చెందిన వృద్ధురాలు పోతరాజు పిచ్చమ్మ (86) రెండో వార్డుకు సంబంధించి గుమ్ముడూరు ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలలో ఏర్పాటు చేసిన పోలింగ్ కేంద్రానికి ఓటేసేందుకు ఉదయం 11 గంటలకు వచ్చింది. ఓటేసిన తర్వాత తిరిగి ఇంటికి వెళ్లిన కాసేపటికే అస్వస్థతకు గురై మృతి చెందింది. వడదెబ్బ వల్లే మృతి చెందినట్లుగా కుటుం బీ కులు తెలిపారు. అదేవిధంగా పరకాల ఒకటో వార్డులో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా పోటీ చేసిన మడికొండ సంపత్‌కుమార్ తల్లి సంతోషమ్మ ఆదివారం తెల్లవారుజామున గుండెపోటుతో మృతిచెందింది. దీంతో ఈ వార్డు లో విషాదఛాయలు అలుముకున్నాయి. పది మంది అరెస్ట్ పోలింగ్ సందర్భంగా ఓటర్లకు డబ్బులు పంచుతూ.. ప్రలోభాలకు గురిచేస్తున్న పదిమందిని పోలీసులు అ రెస్టు చేశారు. మహబూబాబాద్ 11వ వార్డులో వంగ సీతయ్య, నాలుగో వార్డులో బోడ సేవ్యా, ఐదో వార్డు లో రేణికుంట్ల శంకర్ డబ్బులు పంపిణీ చేస్తూ పోలీసులకు చిక్కారు. నర్సంపేటలో స్వత్రంత అభ్యర్థి తరఫున డబ్బులు పంచుతున్న తిరుపతిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఇదే పట్టణంలో పోలింగ్‌బూత్ సమీపంలో ప్రచారం చేస్తున్న బండి ప్రవీణ్, రుద్ర ఓంప్రకాశ్, కె.శ్రీనివాస్‌ను అరెస్ట్ చేసినట్లు పోలీసులు తెలిపారు. పరకాలలో తమ అభ్యర్థికే ఓటు వేయాలని ఓటర్లకు డబ్బులు పంపిణీ చేస్తున్న పోరండ్ల సంతోష్, బొచ్చు వెంకట్, వి.సారయ్యను పోలీసులు అరెస్టు చేశారు. భూపాలపల్లిలో టీఆర్ఎస్ అభ్యర్థులకు బీ ఫారమ్‌లు జారీ చేసిన ఆ పార్టీ నేత మధుసూధనాచారికి నిబంధనలకు విరుద్ధంగా ఏజెంటు పాసు ఇచ్చారంటూ ప్రత్యర్థి పార్టీలు అభ్యంతరం వ్యక్తం చేశాయి. ఈ అంశంపై విచారణ జరిపిస్తామని ఆర్డీఓ హామీ ఇచ్చారు. -
మున్సిపోల్స్‌లో కొత్త ఉత్సాహం
ఇచ్ఛాపురం/ పలాస/ఆమదాలవలస/పాలకొండ : యువతీయువకులు మున్సిపల్ ఎన్నికల్లో తమ సామాజిక బాధ్యతను సంపూర్ణంగా నిర్వర్తించారు. తొలిసారి ఓటు హక్కును సద్వినియోగం చేసుకున్నారు. 18 నుంచి 20 ఏళ్ల మధ్య యువతీయువకులు ఓటు వేసేందుకు ఉదయం 8 గంటలకే ఇచ్ఛాపురం, పలాస, ఆమదాలవలస మున్సిపాలిటీలతో పాటు పాలకొండ నగర పంచాయతీలోని పలు పోలింగ్ కేంద్రాలకు చేరుకున్నారు. తమకు నచ్చిన వారికి ఓటు వేసి పోలింగ్ కేంద్రాల నుంచి ఆనందంగా బయటకు వచ్చారు. చరిత్రను తిరిగిరాస్తామన్న ధీమా వ్యక్తం చేశారు. అక్కడే కాసేపు నిల్చొని ఓటుహక్కుపై స్థానికులకు అవగాహన కల్పించారు. ఈ సారి ఎన్నికల్లో యువతీయువకులు అధిక సంఖ్యలో ఓటు హక్కును వినియోగించడంతో ఫలితాలు ఊహించని రీతిలో వస్తాయని, సమర్థులకే పట్టం కట్టే అవకాశం ఉందన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. ప్రత్యేక వాహనాల్లో... వృద్ధులు, వికలాంగులను పోలింగ్ కేంద్రాలకు తెచ్చేందుకు అభ్యర్థులు నానా పాట్లు పడ్డారు. వీరి కోసం ప్రత్యేక వాహనాలు ఏర్పాటు చేశారు. కొన్ని చోట్ల వికలాంగుల ఓట్లను అధికారుల సాయంతో బంధువులు వేశారు. సూరీడు మండుతున్నా... ఆదివారం భానుడు తన ప్రతాపాన్ని చూపాడు. ఉష్ణోగ్రత సుమారు 39 నుంచి 40 డిగ్రీల వరకు నమోదయ్యింది. ప్రచంఢ భానుని ప్రతాపాన్ని సైతం లెక్కచేయకుండా ఓటర్లు తమ హక్కును వినియోగించుకునేందుకు పోలింగ్ కేంద్రాలకు పెద్ద ఎత్తున చేరుకున్నారు. కొన్ని చోట్ల వృద్ధులు ఎండను తట్టుకోలేక వరండాలపై సేదతీరారు. బంధువుల సహాయంతో ఓటు హక్కును వినియోగించుకున్నారు. కొందరు అభ్యర్థులు తమ ఓటర్లకు ఎటువంటి ఇబ్బందులు లేకుండా వాహనాల సదుపాయం చేసి మరీ ఓట్లు వేయించేలా చేశారు.మరికొన్ని కేంద్రాల్లో అభ్యర్థులే నేరుగా తాగునీటి ప్యాకెట్లు పంపిణీ చేశారు. 90 ఏళ్లకు పైగా వయసున్నవారు కూడా ఓటు హక్కును సద్వినియోగం చేసుకున్నారు. -
తీరిన చివరి కోరిక
చిలకలూరిపేట, ఓటు హక్కు వినియోగించుకొన్న ఓ వృద్ధురాలు కొద్దినిమిషాల వ్యవధిలోనే మరణించిన ఘటన గుంటూరు జిల్లా చిలకలూరిపేటలో ఆదివారం జరిగింది. బంధువులు తెలిపిన వివరాల ప్రకారం.. 12వ వార్డుకు చెందిన షేక్ మౌలాబీ(75) కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతోంది. మున్సిపల్ ఎన్నికల పోలింగ్ సందర్భంగా తాను ఓటు వేయాలని అభ్యర్థించటంతో బంధువులు వార్డు పరిధిలో శ్రీశారద ప్రాథమిక పాఠశాలకు తీసుకువెళ్లారు. ఓటు వేసి ఇంటికి వచ్చిన మౌలాబీ కొద్ది సేపటికే మృతి చెందింది. దీంతో ఆమె ఆఖరి కోరిక తీరినట్టయింది -
పోటెత్తిన ఓటు
హయత్‌నగర్/పెద్దఅంబర్‌పేట,సరూర్‌నగర్,న్యూస్‌లైన్: మున్సిపల్ ఎన్నికల్లో ఓటరు శివమెత్తాడు. రాష్ట్రవ్యాప్తంగా జరిగిన మున్సిపల్ ఎన్నికల్లో భాగంగా నగరశివారులోని పెద్దఅంబర్‌పేట,బడంగ్‌పేట,ఇబ్రహీంపట్నం మూడు నగర పంచాయతీలకు ఆదివారం జరిగిన పోలింగ్ చెదురుముదురు ఘటనలు మినహా ప్రశాంతంగా ముగిసింది. మొదటిసారి నగర పంచాయతీలుగా మారిన ఈ మూడింటిలోనూ భారీగా పోలింగ్‌శాతం నమోదైంది. ఆదివారం కావడంతో ఓటర్లు బారులు తీరి ఓటు హక్కు వినియోగించుకున్నారు. ఇబ్రహీంపట్నం పంచాయతీలో 86.37శాతం,పెద్దఅంబర్‌పేట పంచాయతీలో 81 శాతం, బడంగ్‌పేట పంచాయతీలో 67.47 శాతం పోలింగ్ నమోదైంది. దాదాపు మూడేళ్ల తర్వాత పురపాలక ఎన్నికలు జరుగుతుండడంతో ఓటర్లు ఓటువేయగానికి ఉత్సాహంతో ముందుకొచ్చారు. ఎండలు మండుతున్నప్పటికీ లెక్కచేయకుండా హుషారుగా పోలింగ్ కేంద్రాలకు చేరుకున్నారు. పోలింగ్ మొదలైన తొలి రెండుగంటల్లోనే 18.25శాతం నమోదైంది. ఇబ్రహీంపట్నం నగర పంచాయతీలో అధికంగా 86.37శాతం నమోదు కాగా, బడంగ్‌పేటలో తక్కువగా 67.47 శాతం నమోదైంది. సమయం ముగిసినా లైన్లో ఉన్నవారికి ఓటు వేసే అవకాశం కల్పించారు. ఎన్నికల ప్రక్రియను రంగారెడ్డి జాయింట్ కలెక్టర్ చంపాలాల్, ఆర్డీవో యాదగిరిరెడ్డి, సైబరాబాద్ జాయింట్ కమిషనర్ గంగాధర్, ఎల్బీనగర్ డీసీపీ విశ్వప్రసాద్, ఏసీపీ ఆనందభాస్కర్లు పరిశీలించారు. స్ట్రాంగ్ రూమ్‌లకు తరలింపు : పోలింగ్ ప్రక్రియ ముగియడంతో ఈవీఎంలను స్ట్రాంగ్‌రూమ్‌లకు తరలించారు. ఓట్ల లెక్కింపు వరకు అక్కడే అభ్రద పర్చనున్నారు. పెద్దఅంబర్‌పేటకు సంబంధించి కుంట్లూరు జడ్పీహెచ్ఎస్, బడంగ్‌పేటకు సంబంధించి స్థానిక మహిళా పాలిటెక్నిక్ కళాశాల, ఇబ్రహీంపట్నం నగర పంచాయతీ కార్యాలయాల్లో ఓట్ల లెక్కింపు చేపట్టనున్నారు. ఆసక్తి కనబరిచిన యువ ఓటర్లు : మొదటిసారిగా ఓటు హక్కు వచ్చిన చాలామంది యువతీయువకులు ఈ ఎన్నికల్లో ఓటు హక్కును వినియోగించుకున్నారు. మొదటిసారి ఓటు వేయడం ఆనందంగా ఉందని పలువురు తెలిపారు. -
పోలింగ్ నేడే
సాక్షి, రంగారెడ్డి జిల్లా : మున్సిపల్ ఎన్నికల పోలింగ్‌కు సర్వం సిద్ధమైంది. జిల్లాలోని వికారాబాద్, తాండూ రు, ఇబ్రహీంపట్నం, పెద్దంఅంబర్‌పేట, బడంగ్‌పేట మున్సిపాలిటీలు/నగర పంచాయతీల పరిధిలో ఆదివారం ఉదయం 7గంటలకు పోలింగ్ ప్రక్రియ ప్రారంభం కానుంది. సాయంత్రం 5గంటల వరకు పోలింగ్ కొనసాగనుంది. ఇందుకు సంబంధించి జిల్లా యం త్రాంగం అన్ని ఏర్పాట్లు పూర్తి చేసింది. ఈ మున్సిపాలిటీల పరిధిలో 119 వార్డులకు ఎన్నికలు జరుగనున్నాయి. ఇందుకోసం 193 పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేశారు. ప్రతి పోలింగ్ కేంద్రానికి ఒక ఈవీఎం చొప్పున 193 ఈవీఎంలను కేంద్రాలకు చేర వేశారు. అయితే సాంకేతిక సమస్య తలెత్తకుండా ముందు జాగ్రత్తగా 20శాతం అంటే 37 ఈవీఎంలు అద నంగా అందుబాటు లో ఉంచారు. పోలిం గ్ ప్రక్రియ కోసం 1,004 మంది సిబ్బం దిని నియమించగా.. వారు శనివారం సా యంత్రానికి ఆయా కేంద్రాలకు చేరుకున్నారు. బరిలో 663 మంది.. జిల్లాలోని ఐదు మున్సిపాలిటీల్లో 663 మంది బరిలో నిలిచారు. ఇందులో వికారాబాద్ మున్సిపాలిటీ పరిధిలో 121 మంది, తాండూ రు మున్సిపాలిటీలో 177, ఇబ్రహీంపట్నంలో 125, పెద్ద అంబర్‌పేటలో 89, బడంగ్పేట్లో 151 మంది అభ్యర్థులు పోటీ పడుతున్నారు. ఈ ఐదు మున్సిపాలిటీల పరిధిలో 1,98,895 మంది ఓటు హక్కును వినియోగించుకుని 119 మంది కౌన్సిలర్లను ఎన్నుకోనున్నారు. కొనసాగుతున్న ప్రలోభాలపర్వం.. ఎన్నికల ప్రచారం ముగిసినప్పటికీ.. అంతర్గతంగా అభ్యర్థులు ప్రచారపర్వాన్ని కొనసాగిస్తున్నారు. ఓటర్లను బుట్టలో వేసుకోవడానికి ప్రలోభాలను ఎరవేస్తున్నారు. అభ్యర్థులను ఫోన్లలో సంప్రదిస్తూ.. ఇంటికి వెళ్లి మరీ ఓటు వేయాలంటూ ప్రాధేయపడుతున్నారు. -
‘గుర్తింపు’ లేకున్నా ఓటు వేయవచ్చు
నరసన్నపేట రూరల్, న్యూస్‌లైన్: ఓటు ఉన్న వారిందరూ ఓటు హక్కును సక్రమంగా ఉపయోగించుకునేలా ఎన్నికల సంఘం దృష్టి సారించింది. ఈ నెల 30న జరగనున్న మున్సిపల్ ఎన్నికల్లోనూ, ఏప్రిల్ లో జరగనున్న పరిషత్ ఎన్నికలు, మే నెల ఏడో తేదీన జరగనున్న సార్వత్రిక ఎన్నికల్లో కూడా ప్రతి ఒక్కరూ ఓటు హక్కును వినియోగించుకునేందుకు చర్యలు తీసుకుంటుంది. ఎన్నికల సంఘం మంజూరు చేసిన ఓటు గుర్తింపు కార్డు లేక పోయినా ఓటరు జాబితాలో పేరు ఉంటే వారందరూ ఓటు వేసేందుకు వీలుగా తగిన ఏర్పాట్లు చేస్తుంది. ఇందులో భాగంగా 13 గుర్తింపు కార్డులను ఎంపిక చేసి ఏ ఒక్కటి ఉన్నా ఓటు హక్కు వినియోగించుకోవచ్చని.. ఈ మేరకు ఓటర్లకు చైతన్యం కల్గించమని ఆదేశించింది. దీంతో ఓటు ఉండీ గుర్తింపు కార్డు లేకపోతే ఓటర్లు ఆందోళన చెందనవసరం లేదు. ఈ కారణంతో ఓటు హక్కు వినియోగించుకోలేమని నిరాశ పడాల్సిన అవసరం లేదు. జాబితాలో ఓటు హక్కు ఉంటే చాలు. ఓటరు గుర్తింపు కార్డు లేకపోయినా ఓటు వేసేందుకు అవకాశం ఉంది. ఎన్నికల సంఘం ప్రకటించిన 13 కార్డుల్లో ఏ ఒకటి ఉన్నా ఓటు హక్కు సద్వినియోగం చేసుకోవచ్చు. -
4 వరకు ఓటరుకార్డుల జారీ
న్యూఢిల్లీ: కొత్త ఓటు హక్కు కోసం దరఖాస్తు చేసుకున్న వాళ్లంతా సంబంధిత జిల్లా ఎన్నికల కార్యాలయాల్లో వచ్చే నెల 4 వరకు ఓటరుకార్డులు పొందవచ్చు. ఢిల్లీ ఎన్నికల సంఘం ప్రధానాధికారి విజయ్‌దేవ్ మంగళవారం విలేకరుల సమావేశంలో ఈ మేరకు ప్రకటించారు. ఈ ఏడాది జనవరి 31 తరువాత రాష్ట్రవ్యాప్తంగా 6.45 లక్షల మంది ఓటరుకార్డుల కోసం దరఖాస్తులు సమర్పించారని తెలిపారు. ఢిల్లీ ఓటర్ల సంఖ్య 1.27 కోట్లు కాగా, వీరిలో కొత్తగా ఓటు హక్కు పొందిన వారి సంఖ్య లక్ష దాకా ఉంటుందని విజయ్ అన్నారు. ఢిల్లీలోని మొత్తం 11,763 పోలింగ్ స్టేషన్లలో 407 కేంద్రాలను సమస్యాత్మకమైనవాటిగా గుర్తించామని వెల్లడించారు. 90 పోలింగ్ స్టేషన్లను అత్యంత సమస్యాత్మకమైనవాటిగా గుర్తించినట్టు ప్రకటించారు. వీటిలో భారీగా భద్రతా బలగాలను మోహరిస్తామని తెలిపారు. నామినేషన్ల పరిశీలన తరువాత మొత్తం 156 మంది ఢిల్లీలోని ఏడు లోక్‌సభ స్థానాల నుంచి పోటీ చేస్తున్నట్టు తేలిందని సీఈఓ వివరించారు. ఈ నెల 26 వరకు నామినేషన్లను ఉపసంహరించుకోవచ్చన్నారు. తగిన పత్రాలు సమర్పించకపోవడంతో 51 మంది నామినేషన్లను తిరస్కరించినట్టు ప్రకటించారు. న్యూఢిల్లీ స్థానానికి అత్యధికంగా 29 మంది, వాయవ్యఢిల్లీ సీటుకు అత్యల్పంగా 15 నామినేషన్లు దాఖలయ్యాయని విజయ్‌దేవ్ ఈ సందర్భంగా విశదీకరించారు. -
శతశాతం పోలింగ్‌కు కృషి
విజయనగరం కలెక్టరేట్,న్యూస్‌లైన్ : ప్రజాస్వామ్యంలోవిలువైన ఓటు హక్కును ప్రతి పౌరుడూ వినియోగించుకునే విధంగా జిల్లా యంత్రాంగం చర్యలు తీసుకుంది. రాజకీయాలపై విసుగు చెంది కొందరు..మనకెందుకు లే అని నిర్లిప్తతతో మరికొందరు ఎన్నికల సమయంలో ఓటుహక్కు వినియోగించుకోని విషయం విదితమే. అయితే ప్రతి సారీ ఓటుహక్కు వినియోగించుకోని వారి శాతం పెరుగుతుండడంతో అటువంటి వారికి ఈ ప్రక్రియలో భాగస్వామ్యం కల్పించాలని ఎన్నికల కమిషన్ దృష్టిసారించింది. దీనిలోభాగంగా ఓటుహక్కు కలిగిన ప్రతి పౌరుడు ఆ హక్కును వినియోగించుకునే విధంగా అవగాహన కార్యక్రమాలు రూపొందిం చాలని అధికారులను ఆదేశించింది. అందులో భాగంగా ఈ కార్యక్రమానికి జిల్లా, డివిజన్, మండలస్థాయిల్లో ప్ర త్యేక కమిటీలు రూపొందించారు. ఈ కమిటీలకు పలు శాఖలకు చెందిన అధికారులను భాగస్వాములను చేశారు. కమిటీ చైర్మన్‌గా కలెక్టర్... శతశాతం ఓటింగ్ కోసం ఏర్పాటైన(స్వీప్) కమిటీ చైర్మన్‌గా కలెక్టర్ కాంతిలాల్ దండే వ్యవహరిస్తారు. వైస్ చైర్మన్‌గా జాయింట్ కలెక్టర్బి.రామారావు,నోడల్ అదికారిగా స్పెషల్ డిప్యూ టీ కలెక్టర్ ఎస్.వి.లక్ష్మణమూర్తి నియామకమయ్యారు. మొత్తం పర్యవేక్షణ బాధ్యతలను ఈయన చూస్తారు. అలాగే విజయనగరం డివిజన్లో ఆర్డీఓ జె.వెంకటరావు,పార్వతీపురం డివిజన్‌కు సబ్‌కలెక్టర్ శ్వేతామహంతి నియమితులయ్యారు. గిరిజన ప్రాంతా ల్లో కమిటీల పర్యవేక్షణ బాధ్యతలను ఐటీడీఏ పీఓ రజిత్‌కుమార్ సైనీ చూస్తారు. నియోజకవర్గస్థాయిలో రిట ర్నింగ్ అధికారులు, మండలస్థాయిలో తహశీల్దార్లు, ఎంపీడీఓలు బాధ్యతలు స్వీకరిస్తారు. జిల్లావ్యాప్తంగా ఉన్న 34 మండలాల పరిధిలో 9 అసెంబ్లీ నియోజకవర్గాలు ఉన్నాయి. వీటిలో ఉన్న 16,86,017 మందిఓటర్లు ఓటు హక్కు ను వినియోగించుకునే విధంగా ప్రచారకార్యక్రమాలు నిర్వహిస్తారు. ఇందుకోసం గ్రామాల్లో, విద్యాసంస్థల్లో, కర్మాగారాలు ఉన్న ప్రదేశాల్లో సదస్సులు నిర్వహించనున్నారు. కమిటీలు గురు వారం నుంచే తమ కార్యక్రమాలను అమలు చేశాయి. -
బదిలీ అయినా ఓటు హక్కు!
వరంగల్ కార్పొరేషన్ కమిషనర్‌గా 2008 ఆగస్టు 4 నుంచి 2009 జూలై 20వ తేదీ వరకు శివకోటిప్రసాద్, 2011 నవంబర్ 1 నుంచి 2013 అక్టోబర్ వరకు వివేక్‌యాదవ్ పనిచేశారు. వివేక్‌యాదవ్ ఇక్కడ నుంచి గుం టూరు జేసీగా బదిలీపై వెళ్లి కొన్ని నెలలే అవుతున్నా శివకోటి ప్రసాద్ వెళ్లి ఐదేళ్లు పూర్తికావొస్తుంది. అయినప్పటికీ వారికి ఇంకా వరంగల్ నగరంలో ఓటు హక్కు ఉంది. హన్మకొండ పబ్లిక్ గార్డెన్స సమీపంలోని కమిషనర్ క్యాంప్ ఆఫీస్ ఇంటి నంబర్ 6-1-1పై వివేక్యావ్-రోలీయాదవ్ దంపతులతో పాటు శివకోటిప్రసాద్-సాయినిర్మల దంపతులకు ఓటు హక్కు నమోదై ఉంది. సర్వే చేశారా.. నకిలీ ఓట్లతో పాటు స్థానికంగా నివాసముండని వారి పేర్లను ఓటర్ల జాబితా నుంచి తొలగించాల్సి ఉంది. కొందరు స్వచ్ఛందంగా ఓటుహక్కు తొలగించుకున్నా.. మరికొందరి పేర్లను సిబ్బంది సర్వే చేసి తొలగించాలి. ఇలాంటి ప్రక్రియ నగరంలో పలుమార్లు జరిగింది. అయినా బదిలీపై వెళ్లిన అధికారుల పేర్లనే తొలగించలేదంటే సాధారణ ప్రజలు ఎందరు ఓటర్ల జాబితాలో ఉన్నారేమోననే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. తూతూ మంత్రంగా సర్వే జరిగిందనడానికి ఈ ఒక్క ఉదాహరణ చాలేమో! ప్రస్తుత కమిషనర్ పేరు లేదు.. ప్రస్తుత నగర ప్స్తుపాలక సంస్థ కమిషనర్ సువర్ణ పండాదాస్ పేరు ఓటర్ల జాబితాలో లేదు. నాలుగు నెలల క్రి తం విధుల్లో చేరిన ఆయన నమోదు చేసుకోలేదా, దరఖాస్తు ఇచ్చినా నమోదు కాలేదా అనే విషయం తెలియరావడం లేదు. ఒకవేళ దరఖాస్తు ఇచ్చినా నమోదు చేయలేదంటే సిబ్బంది నిర్లక్ష్యమే కారణమని చెప్పాలి. మరో నాలుగు రోజుల్లో తుదిజాబితా ఇబ్బంది కానున్న నేపథ్యంలో.. సువర్ణ పండాదాస్ దరఖాస్తు చేసుకోలేదంటే కారణమేమిటో తెలియాల్సి ఉంది. -
ఓటరుకు తప్పని తిప్పలు
ఆలస్యంగా వచ్చిన బీఎల్ఓలు ఒకటి రెండుచోట్ల విధులకు గైర్హాజరు ఓటరు నమోదుకు ఫారం తెచ్చుకోవాల్సిందే ప్రత్యేక ఓటరు నమోదులో ప్రజల కష్టాలు ఒంగోలు కలెక్టరేట్, న్యూస్‌లైన్: ప్రత్యేక ఓటరు నమోదు కార్యక్రమంలోనూ బూత్ లెవల్ ఆఫీసర్లు ఓటరుకు చుక్కలు చూపించారు. అధికారులు అనేకమార్లు ఆదేశాలు జారీ చేసినా కొంతమంది బూత్ లెవల్ ఆఫీసర్ల పనితీరు మారడం లేదు. దీంతో ఓటు హక్కు కోసం వచ్చినవారి సహనాన్ని పరీక్షిస్తున్నారు. గత ఏడాది నిర్వహించిన ఓటర్ల నమోదుకు తీసిపోని విధంగా తాజాగా ఆదివారం నిర్వహించిన ప్రత్యేక ఓటరు నమోదులోనూ అదే నిర్లక్ష్య వైఖరి అవలంబించారు. జిల్లా కేంద్రమైన ఒంగోలులోనే అనేక పోలింగ్ కేంద్రాల్లో ఇలాంటి సంఘటనలు చోటు చేసుకున్నాయి. ఇక మారుమూల ప్రాంతాల్లో ఎలా జరిగి ఉంటుందో అర్థం చేసుకోవచ్చు. ప్రత్యేక ఓటర్ల నమోదు కార్యక్రమం సందర్భంగా బూత్ లెవల్ ఆఫీసర్లు తమకు కేటాయించిన పోలింగ్ కేంద్రాల్లో ఉదయం 10 నుంచి సాయంత్రం 5 గంటల వరకు ప్రజలకు అందుబాటులో ఉండాలని కేంద్ర ఎన్నికల సంఘం ఆదేశాలు జారీ చేసింది. అయితే కొన్ని పోలింగ్ కేంద్రాలకు సకాలంలో బూత్ లెవల్ ఆఫీసర్లు రాకపోవడంతో పక్కనే ఉన్న ఇతర సిబ్బందిపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఒంగోలులోని కృష్ణ మెమోరియల్ స్కూల్లో ఏర్పాటు చేసిన పోలింగ్ కేంద్రానికి ఒక బూత్ లెవల్ ఆఫీసర్ గైర్హాజరయ్యారు. అధికారులు ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేయకపోవడంతో ప్రజలు మండిపడ్డారు. ఓటు హక్కు కోసం ఇప్పటికే అనేకమార్లు దరఖాస్తు చేసుకున్నా ఇంతవరకు ఓటు హక్కు రాలేదని, చివరిసారిగా జరుగుతున్న ఓటర్ల నమోదులోనైనా న్యాయం జరుగుతుందని ఇక్కడకు వస్తే బూత్ లెవల్ ఆఫీసర్ ఆచూకీ లేకుండా పోయారని ఆగ్రహం వ్యక్తం చేశారు. దాంతో కొద్దిసేపు గందరగోళ పరిస్థితులు నెలకొన్నాయి. చివరకు పక్కనే ఉన్న సిబ్బంది ఈ విషయాన్ని అధికారుల దృష్టికి తీసుకువెళ్లడంతో హడావుడిగా మరొకరిని నియమించారు. ఒంగోలులోని మంగమూరుడొంక, కొప్పోలు వద్ద ఏర్పాటు చేసిన పోలింగ్ కేంద్రాల్లో కూడా ఇదే పరిస్థితి నెలకొంది. అక్కడ ఫుల్.. ఇక్కడ నిల్... ఇటీవల ప్రకటించిన ఓటర్ల జాబితాలో పేర్లు లేనివారు, గతంలో పేర్లు ఉండి తొలగించినవారు నూతనంగా ఓటు హక్కు కోసం దరఖాస్తు చేసుకోవాలని, పోలింగ్ కేంద్రాల వద్దనే ఓటు నమోదుకు సంబంధించిన ఫారం-6తో బూత్ లెవల్ ఆఫీసర్లు అందుబాటులో ఉంటారన్న జిల్లా అధికారుల ప్రకటనలు కాగితాలకే పరిమిత మయ్యాయి. ఒంగోలు నగరంలోని అన్ని పోలింగ్ కేంద్రాల్లో ఫారం-6 కొరత కొట్టొచ్చినట్లు కనిపించింది. తాజాగా విడుదల చేసిన ఓటర్ల జాబితాను చూసుకోవడం, అందులో తమ పేర్లు లేకపోవడంతో ఓటు హక్కు నమోదుకు ఫారాలు ఇవ్వాలని కోరితే బూత్ లెవల్ ఆఫీసర్లు చేతులెత్తేశారు. తమవద్ద ఒక్క ఫారం ఉందని, జిరాక్స్ తీయించుకొని రావాలంటూ ఉచిత సలహా ఇచ్చారు. ఒకవైపు సమయం గడిచిపోతుండటం, ఇంకోవైపు సమీప ప్రాంతాల్లో జిరాక్స్ సెంటర్లు లేకపోవడం, ఉన్నా అవి మూసివేయడంతో ప్రజలు జిరాక్స్ కాపీల కోసం పరుగులు పెట్టారు. ఫారం-6కు నిజంగా కొరత వచ్చిందనుకుంటే పొరబడినట్లే. కలెక్టరేట్లోని హెచ్-సెక్షన్ ముందు గుట్టలు గుట్టలుగా ఫారం-6 పడి ఉన్నాయి. వాటిని పూర్తి స్థాయిలో పోలింగ్ కేంద్రాలకు పంపిణీ చేయకపోవడం వల్లనే సమస్యలు తలెత్తాయి. గతంలో నిర్వహించిన ప్రత్యేక ఓటర్ల నమోదులో ఇదే పరిస్థితి నెలకొంది. అయినప్పటికీ అధికారుల తీరులో మార్పు రాకపోవడంతో ఓటరుగా చేరాలనుకునేవారికి తిప్పలు తప్పలేదు. ఒంగోలులోని మంగమూరుడొంకలో నివాసం ఉంటున్న తుళ్లూరు ఉదయలక్ష్మి అనే 70 ఏళ్ల బామ్మకు ఓటు లేకుండా చేశారు. అనేక ఎన్నికల్లో ఆమె ఓటు హక్కు వినియోగించుకున్నారు. ఇటీవల ప్రకటించిన ఓటర్ల జాబితాలో ఆమె పేరు తొలగించారు. ఓటు హక్కు పునరుద్ధరణకు కుమార్తె సాయంతో ఆ బామ్మ ఒంగోలులోని ఉమామహేశ్వర జూనియర్ కాలేజీలోని పోలింగ్ కేంద్రానికి వచ్చింది. ఓటు హక్కు కోసం ఉద్యోగస్తుడు ఎన్నిసార్లు తిరగాలని సాంబశివనగర్కు చెందిన రాచమళ్ల రామచంద్రారెడ్డి వాపోయాడు. పొగాకు బోర్డులో ఉద్యోగం చేస్తున్న ఆయన నాలుగేళ్ల క్రితం కందుకూరు నుంచి ఒంగోలుకు బదిలీ అయ్యారు. గత ఏడాది నవంబర్ 12వ తేదీ ఓటు కోసం భార్యాభర్తలిద్దరూ దరఖాస్తు చేసుకున్నారు. ఓటర్ల జాబితాలో పేర్లు లేకపోవడం తో ఈ ఏడాది ఫిబ్రవరి 10వ తేదీ జరిగిన ప్రజాదర్భార్‌లో కలెక్టర్‌ను కలిసి స్వయంగా ఫిర్యా దు చేశారు. అయినా ఇంతవరకు ఓటు హక్కు పొందలేదు. చివరి ప్రయత్నంగా మరోమారు భార్యాభర్తలిద్దరూ దరఖాస్తు చేసుకున్నారు. నా భార్య ఓటును తొలగించారు: హరిప్రసాదరావు, గద్దలగుంట, ఒంగోలు మా కుటుంబంలో మూడు ఓట్లున్నాయి. నా భార్య ఓటును జాబితా నుంచి తొలగించారు. బూత్ లెవల్ ఆఫీసర్లను అడిగితే తమకు తెలియదంటున్నారు. కేంద్ర ఎన్నికల సంఘం ఇచ్చిన నంబర్‌కు ఫోన్ చేస్తే ఆధారాలు ఇవ్వలేదని మెసేజ్ వచ్చింది. కొన్నేళ్ల నుంచి ఓటు హక్కు వినియోగించుకుంటున్న మాకు ఆధారాలతో ఏం సంబంధం. ఉప ఎన్నికలో ఓటు వేసినా జాబితాలో పేరులేదు: బాలాజీనాయక్, గద్దలగుంట, ఒంగోలు ఒంగోలు అసెంబ్లీ నియోజకవర్గానికి జరిగిన ఉప ఎన్నికల్లో ఓటు వేశాను. ఆ తరువాత ఇటీవల ప్రకటించిన ఓటర్ల జాబితాలో చూసుకుంటే పేరు తొలగించారు. మా కుటుంబంలో పదకొండు ఓట్లు ఉన్నాయి. అక్రమంగా నా ఓటు తొలగించారు. ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకున్నా విచారించలేదు. చదువుకున్న మమ్మల్నే ఇబ్బందిపెడితే నిరక్షరాస్యుల పరిస్థితి ఏమిటి. ఇరవై ఏళ్ల నుంచి ఓటు హక్కు కోసం తిరుగుతున్నా : ఆంజనేయులు, లాయరుపేట, ఒంగోలు ఓటు హక్కు కోసం ఇరవై ఏళ్ల నుంచి తిరుగుతున్నా. ఇంతవరకు ఓటరుగా గుర్తించలేదు. ఓటర్ల నమోదు కార్యక్రమం చేపట్టిన ప్రతిసారీ అన్నిరకాల గుర్తింపు కార్డులను తీసుకొస్తున్నా. ఓటర్ల జాబితాలో మాత్రం పేరు ఉండటం లేదు. ఓటు హక్కు అంటేనే విసుగొచ్చేలా చేశారు. చివరి ప్రయత్నంగా మరోమారు దరఖాస్తు చేసుకున్నా. వస్తుందో రాదో ఎదురు చూడాలి. అకనాలెడ్జ్మెంట్ ఉన్నా ఓటు హక్కులేదు: వెంకట్రావు, లాయరుపేట, ఒంగోలు రెండేళ్ల నుంచి ఓటు హక్కు కోసం మూడుసార్లు దరఖాస్తు చేసుకున్నా. అకనాలెడ్జ్మెంట్ ఇచ్చారుగానీ ఓటరు గుర్తింపు కార్డు అందలేదు. భార్యాభర్తలిద్దరికీ ఓటరు గుర్తింపు కార్డులు రాలేదు. దరఖాస్తు చేసుకున్న ప్రతిసారీ ఎలాంటి విచారణ చేయలేదు. విచారించకుండానే అనర్హులుగా తేల్చేస్తున్నారు. ఓటరు నమోదు ఫారానికి ఒక్కోదానికి ఐదు రూపాయలు వసూలు చేస్తున్నారు. -
లాస్ట్ చాన్స్
ఇప్పటివరకు ఓటు హక్కు పొందనివారు.. తాజా జాబితాల్లో చోటు దక్కనివారికి సదవకాశం. రాబోయే ఎన్నికల్లో అందరూ ఓటుహక్కు వినియోగించు కునేందుకు వీలుగా ఎన్నికల కమిషన్ మరోసారి ఓటు నమోదుకు అవకాశం కల్పించింది. ఈనెల తొమ్మిదో తేదీ ఆదివారం జిల్లాలోని అన్ని పోలింగ్ కేంద్రాల్లో ఓటు నమోదుకు జిల్లా అధికారులు ఏర్పాట్లు పూర్తిచేశారు. ఇంకెందుకాలస్యం.. రేపటి ఓటు నమోదుకు సిద్ధం కండి! ఓటర్ల నమోదుకు ఎన్నికల సంఘం మరో అవకాశం ఇచ్చింది. సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో ఇదే లాస్ట్ చాన్స్ అంటూ యువతను జిల్లా యంత్రాంగం సమాయత్తం చేస్తోంది. వరుస ఎన్నికల నేపథ్యంలో ఎన్నికల కమిషన్ ఇచ్చిన అవకాశాన్ని మిగిలిపోయిన వారంతా సద్వినియోగం చేసుకునేలా ఏర్పాట్లు చేస్తున్నారు. ఏకకాలంలో 3,521 పోలింగ్ కేంద్రాల్లో... ఈ నెల ఐదున కేంద్ర ఎన్నికల సంఘం 16వ సార్వత్రిక ఎన్నికల షెడ్యూల్ విడుదల చేసిన సంగతి తెలిసిందే. అదే సమయంలో ఇంకా ఓట్లు నమోదుకాని వారు ఉన్నారన్న సంగతిని గుర్తించింది. దీంతో దేశ వ్యాపితంగా కొత్త ఓట్ల నమోదు, మార్పులకు ఎన్నికలకు ముందే ఎలక్షన్ కమిషన్ చివరి అవకాశం ఇచ్చింది. ఈ నేపథ్యంలోనే కలెక్టర్, జిల్లా ఎన్నికల అధికారి ఎం.రఘునందన్‌రావు కొత్త ఓట్ల నమోదుకు సంబంధించి ఏర్పాట్లు పూర్తిచేశారు. జిల్లా వ్యాప్తంగా 3,521 పోలింగ్ కేంద్రాల్లోను ఏకకాలంలో ఓట్ల నమోదు చేపట్టేలా చర్యలు తీసుకున్నారు. ఈ నెల తొమ్మిదో తేదీ ఆదివారం ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు ఓటర్ల చేర్పులు, మార్పులు చేసుకోవచ్చు. వరుస ఎన్నికల్లో ఐదు ఓట్లు... జిల్లాలో 2014 జనవరి ఒకటి నాటికి 18 ఏళ్లు నిండిన ప్రతి ఒక్కరూ ఓటు హక్కు పొందేలా గత ఏడాది చివరిలో ప్రత్యేక కార్యక్రమాన్ని నిర్వహించిన సంగతి తెలిసిందే. దీంతో జిల్లాలో 69 వేలకు పైగా కొత్త ఓటర్లు నమోదయ్యారు. వారికి కొత్త జాబితాలో చోటు దక్కడంతో వరుస ఎన్నికల్లో ఓటు వేసేందుకు అవకాశం వచ్చింది. ఒకేసారి మున్సిపల్, అసెంబ్లీ, లోక్‌సభ ఎన్నికలతో పాటు మండల, జిల్లా పరిషత్ ఎన్నికలు సైతం వచ్చే అవకాశం ఉండటంతో ఓటు హక్కు పొందేలా యువత ఈ నెల తొమ్మిదిన అవకాశం ఉపయోగించుకోవాలని అధికారులు కోరుతున్నారు. ఓటు నమోదు ఇలా.. కేంద్ర ఎన్నికల కమిషన్ ఆదేశాల మేరకు నిర్వహించనున్న 2014 సాధారణ ఎన్నికలలో ఓటుహక్కు లేనివారు ఈ నెల తొమ్మిదిన దరఖాస్తు చేసుకోవచ్చు. -
కొత్తగా ఓటు వచ్చెనా..
ఓటు హక్కుపై యువతలో నవచైతన్యం వెల్లివిరుస్తోంది. యువతీ యువకులు, కళాశాల విద్యార్థులు ఈ ఏడాది అనూహ్యంగా అధిక సంఖ్యలో ఓటర్లుగా నమోదు చేసుకున్నారు. ఏటా 18-19 ఏళ్ల గ్రూపు వారు 30 నుంచి 33 శాతం మాత్రమే ఓటర్ల జాబితాలో పేర్లు నమోదు చేసుకుంటుంటారు. నిరుడు 31 శాతం మాత్రమే ఓటర్లుగా నమోదు చేసుకోగా.. ఈ ఏడు అది అనూహ్యంగా 88 శాతానికి పెరిగింది. ఓటు హక్కుపై విస్తృత ప్రచారం.. కళాశాలల్లో ఓటరు నమోదుకు ఏర్పాట్లు.. ఎన్నికల ఏడాది కావడం.. పార్టీలు కొత్త ఓటర్లను చేర్చడం.. తదితర కారణాల వల్ల యువత ఓటు హక్కు కోసం అధిక ఆసక్తిని ప్రదర్శించారు. సాక్షి, సిటీబ్యూరో: యువత ఓటర్ల నమోదు కార్యక్రమంలో అనూహ్యంగా పాల్గొంది. ఓటుపై ప్రచారం అధికంగా జరగడం.. ఢిల్లీలో ఆమ్ ఆద్మీ పార్టీ సాధించిన విజయం.. యువతలో, ముఖ్యంగా విద్యార్థుల్లో ఓటుహక్కుపై ఆసక్తి రేకెత్తించింది. వీటితోపాటు విద్యార్థులు సైతం రాజకీయాలపై ఆసక్తి చూపుతుండటం.. తమ ప్రజాప్రతినిధులను ఎన్నుకోవడంలో సత్తా చూపించాలనే అభిప్రాయం ఏర్పడటం ఓటరు జాబితాలో నమోదును పెంచిందని పరిశీలకులు అంచనా వేస్తున్నారు. నేడు జాతీయ ఓటర్ల దినోత్సవం జాతీయ ఓటర్ల దినోత్సవాన్ని పురస్కరించుకొని శనివారం హైదరాబాద్ జిల్లాలోని అన్ని పోలింగ్ కేంద్రాల్లో కొత్త ఓటర్ల అభినందన కార్యక్రమాలు నిర్వహించనున్నారు. కొత్తగా ఓటరుగా నమోదైన 18 -19 ఏళ్ల వారికి ‘ఓటరుగా గర్విస్తున్నాను.. ఓటు వేయడానికి సిద్ధంగా ఉన్నాను’ అనే నినాదంతో కూడిన బ్యాడ్జీని అందజేయనున్నారు. వీరిలో నలుగురైదుగురికి కలర్ ఎపిక్ కార్డులు అందజేయనున్నారు. మిగతావారికి ఫిబ్రవరిలో ఇంటింటికీ వెళ్లి ఓటరు కార్డులందజేయనున్నట్లు జిల్లా ఎన్నికల అధికారి, జీహెచ్ఎంసీ స్పెషల్ కమిషనర్ న వీన్మిట్టల్ పేర్కొన్నారు. వీటితోపాటు ఓటర్లతో ప్రతిజ్ఞ కార్యక్రమం తదితరమైనవి నిర్వహించనున్నారు. నగరంలో ఏడాది పొడవునా ఓటర్ల నమోదు ప్రక్రియ జరుగుతున్నప్పటికీ, ఇటీవల విస్తృత ప్రచారం నిర్వహించినప్పటికీ, ఇంకా పేర్లు నమోదు చేయించుకోని వారున్నారు. వారు తమ పేర్లను నమోదు చేయించుకోవచ్చు. తద్వారా భవిష్యత్‌లో పోలింగ్ రోజున ఇబ్బందులుండవు. అన్ని పోలింగ్ కేంద్రాల్లో ఓటరు నమోదు.. తప్పుల సవరణలకు దరఖాస్తుల స్వీకరణ, ఇతరత్రా కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. ఓటర్ల దినోత్సవం సందర్భంగా హైదరాబాద్ జిల్లాలోని 15 అసెంబ్లీ నియోజకవర్గాల పరిధిలోని 3091 పోలింగ్ కేంద్రాల్లో శనివారం ఉదయం 10 నుంచి మధ్యాహ్నం ఒంటిగంట వరకు ఓటరు దరఖాస్తులు స్వీకరిస్తారు. జాతీయ ఓటర్ల దినోత్సవ సందర్భంగా పోటీలు జాతీయ ఓటర్ల దినోత్సవంలో భాగంగా నగరంలోని సిటీ మేనేజర్స్ ట్రైనింగ్ సెంటర్లో శుక్రవారం నిర్వహించిన వక్తృత్వం, క్విజ్, డ్రాయింగ్ పోటీల్లో రాష్ట్రంలోని 23 జిల్లాల నుంచి 165 మంది విద్యార్థులు పాల్గొన్నట్లు హెదరాబాద్ జిల్లా ఎన్నికల అధికారి, జీహెచ్ఎంసీ స్పెషల్ కమిషనర్ నవీన్‌మిట్టల్ తెలిపారు. పోటీలో పాల్గొన్న విద్యార్థులు ఓటు హక్కు, ఓటు విలువ గురించి సృజనాత్మకంగా తమ ఆలోచనలను వె ల్లడించినట్లు తెలిపారు. విజేతలకు శ నివారం రవీంద్రభారతిలో జరిగే ఓటరు దినోత్సవ కార్యక్రమంలో బహుమతులు అందజేయనున్నట్లు తెలిపారు. పాటించాల్సినవి ఓటరు జాబితాలో పేరు నమోదు చేయించుకునేవారు నిబంధనలకనుగుణంగా పొరపాట్లు లేకుండా దరఖాస్తు ఫారాలు భర్తీ చేయాలి. అక్షరాలు స్పష్టంగా అర్థమయ్యేలా రాస్తే ఓటరు కార్డులోనూ తప్పులు దొర్లేందుకు అవకాశం ఉండదు. కొత్తగా దరఖాస్తు చేసుకోవాలనుకునేవారికి ఫారం-6, ఇతరత్రా మార్పుల కోసం సంబంధిత ఫారం-7, ఫారం-8, ఫారం-8ఎలను అందుబాటులో ఉంచుతారు. అక్కడి సిబ్బందిని సంప్రదించి కావాల్సిన ఫారాన్ని భర్తీ చేసి ఇవ్వవచ్చు. ఓటరు దరఖాస్తు ఫారంతోపాటు చిరునామా ధ్రువీకరణ పత్రం (రేషన్‌కార్డు, కరెంటు బిల్లు వంటి) జిరాక్స్ ప్రతి జత చేయాలి. దరఖాస్తు చేసుకున్నాక, బూత్‌లెవెల్ ఆఫీసర్ (బీఎల్వో) విచారణకు వచ్చినప్పుడు ఇంట్లో ఉండని పక్షంలో.. సదరు ఇంట్లోనే ఉంటున్నట్లు కనీసం సమాచారం ఇచ్చేవారు ఉండాలి. ఓటు పొందేందుకు ఆన్లైన్ ద్వారానూ దరఖాస్తు చేసుకోవచ్చు. ఓటరు కార్డును అడ్రస్‌ప్రూఫ్‌గా వినియోగించుకోవాలనుకుంటే ఇంటిపేరు కూడా పూర్తిగా రాయడం అవసరం. నిజాయితీపరులకే ఓటు వేస్తాను.. కొత్తగా ఓటు హక్కును పొందాను. వచ్చే ఎన్నికల్లో అవినీతికి వ్యతిరేకంగా, ప్రజా సమస్యలను పరిష్కరించే అభ్యర్థికి ఓటు వేస్తాను. నోట్లతో ఓట్లను కొనుక్కునే వారు గెలిచిన తర్వాత ప్రజా సమస్యలు విస్మరించి ఎన్నికల్లో పెట్టిన ఖర్చుకు రెండింతలు సంపాదించడానికి అవినీతికి పాల్పడుతారు. అలాంటి వారిని కాకుండా నీతి, నిజాయితీ గల అభ్యర్థులను ఎన్నుకుంటే దేశానికి మేలు. - కె.రఘురామ్, సివిల్ ఇంజినీర్ ఎలక్షన్ కమిషన్ ఆలోచన బాగుంది నేను తప్పకుండా దేశాభివృద్ధి కోసం పాటు పడే వారికే ఓటేస్తాను. ఈ దేశ పౌరురాలిగా నా బాధ్యతను నిర్వర్తించి అవినీతి రహిత ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేందుకు సహాయ పడతాను. అందరికీ సులభ పద్ధతిలో ఓటర్ ఐడీ వచ్చేలా చేయాలనుకున్న ఎలక్షన్ కమిషన్ ఆలోచన చాలా బాగుంది. ఎలక్షన్ కమిషన్ కొత్తగా తీసుకొచ్చిన సవరణలు కూడా బాగున్నాయి. - మానసారెడ్డి, ఇంజినీరింగ్ విద్యార్థిని