సాక్షి, హన్మకొండ : చెదురుమదురు ఘటనలు మినహా... జిల్లావ్యాప్తంగా మునిసిపల్ ఎన్నికల పోలింగ్ ప్రశాంతంగా ముగిసింది. జిల్లాలోని మహబూబాబాద్, జనగామ మునిసిపాలిటీలతోపాటు భూపాలపల్లి, నర్సంపేట, పరకాల నగర పంచాయతీల్లో ఆదివారం పోలింగ్ ప్రక్రియ నిర్వహించారు. మొత్తంగా 78.69 శాతం ఓటర్లు ఓటు హక్కు వినియోగించుకున్నట్లు ఎన్నికల అధికారులు వెల్లడించారు.
అత్యధికంగా నర్సంపేటలో 85.52 శాతం
పోలింగ్ జరగగా... అత్యల్పంగా భూపాలపల్లిలో 70.55 శాతం నమోదైంది. జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ జి.కిషన్‌తోపాటు జాయింట్ కలెక్టర్ పాసుమిబసు, డీఐజీ కాంతారావు, రూరల్ ఎస్పీ కాళిదాసు పోలింగ్ సరళిని ప్రత్యక్షంగా పర్యవేక్షించారు. సాయంత్రం ఐదు గంటల తర్వాత కూడా ఓటర్లు బారులుదీరడంతో నర్సంపేటలో ఏడు గంటల వరకు... జనగామలో రాత్రి తొమ్మిది గంటల వరకు పోలింగ్ ప్రక్రియ కొనసాగింది.
ఆలస్యంగా ప్రారంభం
పోలింగ్ కేంద్రాల్లో ఎలక్ట్రానిక్ ఓటింగ్ మెషిన్ మొరాయించడంతో పరకాలలోని 19వ వార్డులో గంట ఆల స్యంగా ఓటింగ్ ప్రారంభమైంది. అదేవిధంగా... భూపాలపల్లి పదో వార్డులో 15 నిమిషాలపాటు ఆలస్యమైంది. జనగామలోని 18, 28వ వార్డుల్లో ఈవీఎం వినియోగంపై ఓటర్లకు అవగాహన లేక ఇబ్బంది పడ్డా రు. దీంతో అధికారులు మాక్‌పోలింగ్‌తో వారికి అవగాహన కల్పించారు. ఈ నేపథ్యంలో ఉదయం ఏడు గంట లకు ప్రారంభం కావాల్సిన పోలింగ్ అరగంట ఆలస్యం గా మొదలైంది.
మరోవైపు ఇదే పట్టణంలోని 21 వార్డులో పోలింగ్ ఏజెంట్ అభ్యంతరం చెప్పడంతో అధికారులు 61 మందిని ఓటేసేందుకు అనుమతించలేదు. వారు పోలింగ్ కేంద్రంలో ఆందోళనకు దిగడంతో అధికారులు మరోసారి రికార్డులు పరిశీలించారు. వారు అదే వార్డు ఓటర్లు అని తేలడంతో ఓటేసేందుకు అనుమతించగా... వివాదం సద్దుమణిగింది.
ఐదు గంటల తర్వాత కూడా క్యూ
వేసవి కావడంతో ఎక్కువ మంది ఓటర్లు సాయంత్రం మూడు గంటల తర్వాత పోలింగ్ కేంద్రాలకు తరలివచ్చారు. పోలింగ్ కేంద్రాల వద్ద సాయంత్రం ఐదు గం టల వరకు క్యూలో ఉన్న వారిని మాత్రమే ఓటేసేందు కు అనుమతించారు. జనగామ మునిసిపాలిటీ పరిధిలో పరిశీలిస్లే ఐదు వార్డుల్లో సాయంత్రం ఐదు గంటల త ర్వాత కూడా పోలింగ్ కొనసాగింది. 24, 28వ వార్డుల్లో సాయంత్రం 6:30 గంటల వరకు... 11, 12వ వార్డుల్లో రాత్రి ఎనిమిది గంటల వరకు... తొమ్మిదో వార్డులో తొమ్మిది గంటల వరకు పోలింగ్ జరిగింది.
1,400 మంది ఓటర్లు దాటిన పోలింగ్ బూత్‌లలో స్త్రీ, పురుషులకు వేర్వేరు ఈవీఎంలు ఏర్పాటు చేయకపోవడంతో ఓటింగ్ ప్రక్రియ ఆలస్యమైనట్లు తెలుస్తోంది. సాయంత్రం వేళ పలు పోలింగ్ కేంద్రాల్లో సరైన వెలుతురు లేకపోవడంతో ఓటర్లు ఇబ్బందులు పడ్డారు. పరకాల 12వ వార్డులో 5.30 గంటల వరకు, నర్సంపేట 4, 5, 13వ వార్డుల్లో ఏడు గంటల వరకు పోలింగ్ కొనసాగింది. మహబూబాబాద్, భూపాలపల్లిలో సాయంత్రం ఐదు గంటల వరకు పోలింగ్ ముగిసింది.
పరకాలలో కౌన్సిలర్ అభ్యర్థి ఆత్మహత్యాయత్నం
పరకాల నగర పంచాయతీ పరిధిలోని 20వ వార్డులో స్వతంత్ర అభ్యర్థిగా బరిలో ఉన్న మంద రాంచందర్‌కు ఎన్నికల అధికారులు మొదట గ్యాస్ పొయ్యి గుర్తు కేటాయించారు. పోలింగ్ బూత్ బయట డిస్‌ప్లేలో గ్యా స్‌పొయ్యికి బదులు సిలిండర్ గుర్తు ఉండడంతో ఆయ న అవాక్కయ్యారు. తనపై కుట్రతోనే గుర్తు మార్చారని అధికారులపై ఆగ్రహం వ్యక్తం చేశారు. న్యాయం చేయకపోతే.. ఇక్కడే చచ్చిపోతానని పురుగుల మందు డబ్బాతో పోలింగ్ కేంద్రానికి వచ్చారు. వెంటనే స్పం దించిన ఎన్నికల అధికారులు గ్యాస్ పొయ్యి గుర్తును ఏర్పాటు చేశారు.
మానుకోటలో వడదెబ్బతో వృద్ధురాలి మృతి
మహబూబాబాద్‌లో వేల్పుల సత్యంనగర్‌కు చెందిన వృద్ధురాలు పోతరాజు పిచ్చమ్మ (86) రెండో వార్డుకు సంబంధించి గుమ్ముడూరు ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలలో ఏర్పాటు చేసిన పోలింగ్ కేంద్రానికి ఓటేసేందుకు ఉదయం 11 గంటలకు వచ్చింది. ఓటేసిన తర్వాత తిరిగి ఇంటికి వెళ్లిన కాసేపటికే అస్వస్థతకు గురై మృతి చెందింది. వడదెబ్బ వల్లే మృతి చెందినట్లుగా కుటుం బీ కులు తెలిపారు. అదేవిధంగా పరకాల ఒకటో వార్డులో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా పోటీ చేసిన మడికొండ సంపత్‌కుమార్ తల్లి సంతోషమ్మ ఆదివారం తెల్లవారుజామున గుండెపోటుతో మృతిచెందింది. దీంతో ఈ వార్డు లో విషాదఛాయలు అలుముకున్నాయి.
పది మంది అరెస్ట్
పోలింగ్ సందర్భంగా ఓటర్లకు డబ్బులు పంచుతూ.. ప్రలోభాలకు గురిచేస్తున్న పదిమందిని పోలీసులు అ రెస్టు చేశారు. మహబూబాబాద్ 11వ వార్డులో వంగ సీతయ్య, నాలుగో వార్డులో బోడ సేవ్యా, ఐదో వార్డు లో రేణికుంట్ల శంకర్ డబ్బులు పంపిణీ చేస్తూ పోలీసులకు చిక్కారు.
నర్సంపేటలో స్వత్రంత అభ్యర్థి తరఫున డబ్బులు పంచుతున్న తిరుపతిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఇదే పట్టణంలో పోలింగ్‌బూత్ సమీపంలో ప్రచారం చేస్తున్న బండి ప్రవీణ్, రుద్ర ఓంప్రకాశ్, కె.శ్రీనివాస్‌ను అరెస్ట్ చేసినట్లు పోలీసులు తెలిపారు. పరకాలలో తమ అభ్యర్థికే ఓటు వేయాలని ఓటర్లకు డబ్బులు పంపిణీ చేస్తున్న పోరండ్ల సంతోష్, బొచ్చు వెంకట్, వి.సారయ్యను పోలీసులు అరెస్టు చేశారు. భూపాలపల్లిలో టీఆర్‌ఎస్ అభ్యర్థులకు బీ ఫారమ్‌లు జారీ చేసిన ఆ పార్టీ నేత మధుసూధనాచారికి నిబంధనలకు విరుద్ధంగా ఏజెంటు పాసు ఇచ్చారంటూ ప్రత్యర్థి పార్టీలు అభ్యంతరం వ్యక్తం చేశాయి. ఈ అంశంపై విచారణ జరిపిస్తామని ఆర్డీఓ హామీ ఇచ్చారు.
‘పుర’ పోరు ప్రశాంతం
Published Mon, Mar 31 2014 3:42 AM | Last Updated on Wed, Sep 26 2018 5:38 PM
Advertisement
Advertisement