ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఓటు హక్కును ఎలా వినియోగించుకోవాలో వివరిస్తూ రిటర్నింగ్ అధికారిగా వ్యవహరిస్తున్న శాసనసభ
హైదరాబాద్: ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఓటు హక్కును ఎలా వినియోగించుకోవాలో వివరిస్తూ రిటర్నింగ్ అధికారిగా వ్యవహరిస్తున్న శాసనసభ కార్యదర్శి రాజా సదారాం ఎమ్మెల్యేలకు పలు సూచనలు చేశారు. ఈ మేరకు వివరాలతో కూడిన పత్రాలను గురువారం ఎమ్మెల్యేలకు పంపిణీ చేశారు. బ్యాలెట్ పేపర్‌లో ఊదా రంగు స్కెచ్ పెన్నునే వాడాలని, అభ్యర్థి పేరు ఎదుట ప్రాధాన్య సంఖ్య వేయాలని స్పష్టం చేశారు.
సంతకాలు చేయకూడదని, వేలిముద్రలు వేయకూడదని, ఎటువంటి గుర్తులు పెట్టకూడదని పేర్కొన్నారు. నోటా అవకాశాన్ని వినియోగించుకోవచ్చని తెలిపారు. ప్రతి ఎమ్మెల్యే తమ గుర్తింపు కార్డులను వెంట తెచ్చుకోవాలని సూచించారు.