నల్లగొండ : వరంగల్, ఖమ్మం, నల్లగొండ పట్టభధ్రుల నియోజకవర్గ ఎమ్మెల్సీ ఓట్ల లెక్కింపునకు ఏర్పాట్లు చురుకుగా సాగుతున్నాయి. డీఆర్వోలు బ్యాలెట్ బాక్సులను కట్టుదిట్టమైన భద్రత మధ్య క్లోజ్‌డ్ వాహనాల్లో నల్లగొండకు తీసుకొచ్చి ఎన్‌జీ కాలేజీలో భద్రపరిచారు. బుధవారం ఉదయం 8 గంటల నుంచి ఓట్ల లెక్కింపు ప్రారంభంకానుంది. ఓట్ల లెక్కింపునకు 20 టేబుళ్లు ఏర్పాటు చేయనున్నారు. 18 నుంచి 20 రౌండ్లలో ఓట్ల లెక్కింపు పూర్తికానుంది. తొలుత పోస్టల్ బ్యాలెట్ ఓట్లను లెక్కించనున్నారు. మూడు జిల్లాలో 400 పోలింగ్ కేంద్రాలు కాగా, ఒక్కోటేబుల్‌పై 20 పో లింగ్ బాక్సులను పెట్టనున్నారు.
బ్యాలెట్ బాక్సులను తెరిచి ఓట్లన్ని ట్రేలో వేసి, 50 ఓట్లకు ఒక బండిల్ చొప్పున కట్టనున్నారు. వాటిన్నింటినీ అన్ని డ్రమ్ముల్లో కలిపేసి మళ్లీ ఒక్కో టేబుల్‌కు 500 ఓట్లు చొప్పున పంపిణీ చేసి లెక్కింపు ప్రారంభిస్తారు. మొత్తం 1,53,548 మంది ఓటు హక్కు వినియోగించుకున్న నేపథ్యంలో 18 రౌండ్లకు వస్తాయి. ఓట్ల లెక్కింపును పకడ్బందీగా నిర్వహించేందుకు మూడు జిల్లాలకు చెందిన ఆర్డీఓలు, ఎంపీడీఓలు, తహసీల్దార్లు, డిప్యూటీ తహసీల్దార్లను నియమించారు. ప్రతి రెండు టేబుళ్లకు ఒక సూపర్‌వైజర్, కౌంటింగ్ సూపర్‌వైజర్లుగా తహసీల్దారు లేదా ఎంపీడీఓ, కౌంటింగ్ అసిస్టెంట్లుగా డిప్యూటీ తహసీల్దారు, సహాయ గణాంక అధికారి, ఒక్కో టేబుల్‌కు ఒక్కో సూక్ష్మ పరిశీలనుకుడిని నియమించారు.
పట్ట‘భద్దకస్తులు’
శాసన మండలి ఎన్నిక లకు ఓటర్లు అంతగా ఆసక్తి చూపలేదు. 2009 ఎన్నికలతో పోలిస్తే ఈ ఎన్నికల్లో కొత్త ఓటర్లు భారీగానే పెరిగారు. మూడు జిల్లాల్లో మొత్తం ఓటర్లు 2,81,138 మంది ఉన్నారు. వీరిలో 1,53,548 మంది ఓటర్లు మాత్రమే తమ ఓటు హక్కు వినియోగించుకున్నారు. మిగిలిన 1,27,590 మంది ఓటర్లు పోలింగ్‌కు దూరంగా ఉన్నారు. లక్ష పైచిలుకు ఓటర్లు పోలింగ్‌కు దూరంగా ఉన్నారంటే ఈ ప్రభావం అభ్యర్థుల జయాపజయాలపై తీవ్ర ప్రభావం చూపనుంది.
రేపు ఎమ్మెల్సీ ఓట్ల కౌంటింగ్
Published Tue, Mar 24 2015 12:33 AM | Last Updated on Mon, Aug 20 2018 8:20 PM
Advertisement