
అహ్మదాబాద్: ఉగ్రవాదుల ఐఈడీ (ఆధునీకరించిన పేలుడు పరికరం) కన్నా ఓటర్ ఐడీ (గుర్తింపు కార్డు) శక్తిమంతమైనదని మోదీ అన్నారు. అహ్మదాబాద్‌లో మోదీ తన ఓటు హక్కును వినియోగించుకున్నారు. ‘ఒకవైపు ఐఈడీ ఉగ్రవాదుల ఆయుధమైతే , మరోవైపు ఓటరు ఐడీ ప్రజాస్వామ్య ఆయుధం. ఐఈడీ కన్నా ఓటరు ఐడీ శక్తిమంతమైనదని విశ్వసిస్తున్నా’ అని అన్నారు. బీజేపీ అధ్యక్షుడు అమిత్ షా మోదీకి తోడుగా పోలింగ్ బూత్ వరకు వచ్చారు. మోదీ గాంధీనగర్‌లోని రాజ్‌భవన్‌లో సోమవారం బసచేసి, ఉదయం ఓటు వేయడానికి ముందు ఇంటికెళ్లి తల్లిని కలిశారు. తల్లి హీరాబా నుంచి శాలువా, కొబ్బరికాయ, స్వీట్లు స్వీకరించారు. తల్లి పాదాలకు నమస్కరించి, ఆశీర్వాదం తీసుకుని ఓటు వేసేందుకు వచ్చారు. అనంతరం హీరాబా కూడా గాంధీనగర్ సమీపలోని రైసన్ గ్రామంలో ఓటు వేశారు. గుజరాత్‌లో మొత్తం 26 లోక్‌సభ స్థానాలుండగా, అన్ని చోట్లా మంగళవారం పోలింగ్ ముగిసింది.
పీఎం పదవినే మమత కొనేవారు
పీఎం పదవికి వేలం కానీ నిర్వహించేలా ఉండుంటే పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ ఆ పదవిని నారద, Ô >రద కుంభకోణాల్లో సంపాదించిన డబ్బుతో కొనేవారని మోదీ ఎద్దేవా చేశారు. ఆ డబ్బులతో మమత పీఎం పదవి కొనలేకపోయినందుకు తాను ఆమెపై జాలి పడుతున్నానన్నారు. బెంగాల్లో బలవంతపు వసూళ్లకు మమత పాల్పడుతున్నారని ఆరోపిస్తూ, ఆమె ప్రధాని అయితే దేశం మొత్తాన్నీ వదలరని అన్నారు. బెంగాల్‌లోని అసన్‌సోల్‌లో మోదీ మంగళవారం ప్రచారం చేశారు.