బాప్స్ నారాయణ్‌పై మోదీ ప్రశంసలు
అహ్మదాబాద్: బోచసన్వాసి అక్షర్ పురుషోత్తమ్ స్వామినారాయణ్ సంస్థ (బాప్స్) స్వచ్ఛంద సేవకుల సేవాగుణం, కృషి వల్ల భారత్ ప్రపంచవ్యాప్తంగా ప్రభావం చూపగలుగుతోందని ప్రధాని నరేంద్ర మోదీ ప్రశంసించారు. అహ్మదాబాద్‌లోని మోదీ మైదా నంలో శనివారం జరిగిన బాప్స్ వలంటీర్ల ‘కార్యకార్ సువర్ణ మహోత్సవ్’ను ఉద్దేశించి ఆయన వర్చువల్‌గా ప్రసంగించారు. ‘‘స్వా మి నారాయణ్ బోధలను బాప్స్ సేవకులు కోట్లాది మంది అణగారిన వర్గాలకు చేరువ చేసి వారి బతుకులను బాగుచేశారు. బాప్స్ సేవలు దేశానికీ శక్తినిచ్చాయి.
సేవ పరమో ధర్మః అన్నది మన జీవన విధానం. కోవిడ్ సంక్షోభం, కేరళ, ఉత్తరాఖండ్‌లో ప్రకృతి విలయాల్లో బాప్స్ వలంటీర్లు వెంటనే రంగంలోకి దిగి ఆదుకున్నారు. ఉక్రెయిన్ నుంచి పోలండ్‌కు వస్తున్న భారతీయులకు సాయపడాలని అర్ధరాత్రి వేళ బాప్స్ గురువులను కోరా. తక్షణం యూరప్‌వ్యాప్తంగా ఉన్న వలంటీర్లను పోలండ్ రప్పించి సాయపడ్డారు’’ అని మోదీ గుర్తు చేసుకున్నారు. ‘‘బాప్స్ సేవకులు 28 దేశాల్లో 1,800కు పైగా స్వామి నారాయణ్ ఆలయాలు నిర్మించారు. 21,000కి పైగా ఆధ్యాతి్మక కేంద్రాలు నెలకొల్పారు. ఎన్నో రంగాల్లో సేవలందిస్తున్నారు’’ అని కొనియాడారు.
Comments
Please login to add a commentAdd a comment