BAPS mandir
-
మీ సేవలతో దేశానికే గుర్తింపు
అహ్మదాబాద్: బోచసన్వాసి అక్షర్ పురుషోత్తమ్ స్వామినారాయణ్ సంస్థ (బాప్స్) స్వచ్ఛంద సేవకుల సేవాగుణం, కృషి వల్ల భారత్ ప్రపంచవ్యాప్తంగా ప్రభావం చూపగలుగుతోందని ప్రధాని నరేంద్ర మోదీ ప్రశంసించారు. అహ్మదాబాద్‌లోని మోదీ మైదా నంలో శనివారం జరిగిన బాప్స్ వలంటీర్ల ‘కార్యకార్ సువర్ణ మహోత్సవ్’ను ఉద్దేశించి ఆయన వర్చువల్‌గా ప్రసంగించారు. ‘‘స్వా మి నారాయణ్ బోధలను బాప్స్ సేవకులు కోట్లాది మంది అణగారిన వర్గాలకు చేరువ చేసి వారి బతుకులను బాగుచేశారు. బాప్స్ సేవలు దేశానికీ శక్తినిచ్చాయి. సేవ పరమో ధర్మః అన్నది మన జీవన విధానం. కోవిడ్ సంక్షోభం, కేరళ, ఉత్తరాఖండ్‌లో ప్రకృతి విలయాల్లో బాప్స్ వలంటీర్లు వెంటనే రంగంలోకి దిగి ఆదుకున్నారు. ఉక్రెయిన్ నుంచి పోలండ్‌కు వస్తున్న భారతీయులకు సాయపడాలని అర్ధరాత్రి వేళ బాప్స్ గురువులను కోరా. తక్షణం యూరప్‌వ్యాప్తంగా ఉన్న వలంటీర్లను పోలండ్ రప్పించి సాయపడ్డారు’’ అని మోదీ గుర్తు చేసుకున్నారు. ‘‘బాప్స్ సేవకులు 28 దేశాల్లో 1,800కు పైగా స్వామి నారాయణ్ ఆలయాలు నిర్మించారు. 21,000కి పైగా ఆధ్యాతి్మక కేంద్రాలు నెలకొల్పారు. ఎన్నో రంగాల్లో సేవలందిస్తున్నారు’’ అని కొనియాడారు. -
హాలీవుడ్ హీరో కాదు.. ఫేమస్ బిజినెస్ మ్యాన్ - గుర్తుపట్టారా?
పైన ఫోటోలో చూడగానే పిలక పెట్టుకుని, కళ్ళజోడుతో స్టైల్‌గా కనిపిస్తున్న వ్యక్తి ఏ హాలీవుడ్ హీరో అనుకుంటే మీరు పొరబడినట్లే.. ఎందుకంటే ఈయన ఇండియాలో ఓ ప్రముఖ బిజినెస్ మ్యాన్. బిజినెస్ మ్యాన్ అయితే ఎందుకు ఈ అవతారమెత్తారు అనే అనుమానం మీలో రావచ్చు? దాని గురించే ఇక్కడ తెలుసుకుందాం.. ఓలా ఎలక్ట్రిక్ కంపెనీ స్థాపించి, ఎలక్ట్రిక్ స్కూటర్లను లాంచ్ చేసి అతి తక్కువ కాలంలోనే గొప్ప అమ్మకాలను పొందుతూ దూసుకెళ్తున్న ఈయనే ఓలా సీఈఓ 'భవిష్ అగర్వాల్'. ఈ పేరు వినగానే ఇప్పుడు గుర్తోచేసి ఉంటుంది, ఈయనే భవిష్ అగర్వాల్ అని.. ఇక ఈ అవతారమెందుకు ఎత్తరనుకుంటున్నారా.. భవిష్ అగర్వాల్ ఆదివారం అబుదాబిలో ఇటీవల ప్రారంభించిన 'బోచసన్వాసి అక్షర్ పురుషోత్తం స్వామినారాయణ సంస్థకు చెందిన హిందూ మందిర్'ను సందర్శించారు. ఆ సమయంలో ఇలా కనిపించారు. ఇదీ చదవండి: హ్యాండ్సమ్గా కనిపిస్తున్న ఈ కుర్రాడే.. నేడు భారత్ గర్వించదగ్గ వ్యక్తి భవిష్ అగర్వాల్ ఈ టెంపుల్ సందర్శించిన సందర్భంగా.. ఇది నా జీవిత జ్ఞాపకం అని తన ఎక్స్ (ట్విటర్) ఖాతాలో ట్వీట్ చేస్తూ ఫోటోలు షేర్ చేశారు. ప్రస్తుతం ఈ ఫోటోలు నెట్టింట్లో తెగ వైరల్ అవుతున్నాయి. ఇప్పటికే వేలసంఖ్యలో లైక్స్ పొందిన ఈ ఫోటోలకు నెటిజన్ల నుంచి కామెంట్స్ కూడా వస్తున్నాయి. Visiting and speaking at the @BAPS Hindu Mandir in Abu Dhabi was a life memory for me. It is such a historic moment of two civilisations coming together and thankful to be there to witness it🙏🏼 pic.twitter.com/rfHh8x4eJ3 — Bhavish Aggarwal (@bhash) February 18, 2024 -
BAPS temple: సువర్ణాధ్యాయం
అబుదాబి: యూఏఈ రాజధాని అబుదాబీలో రూపుదిద్దుకున్న హిందూ ఆలయాన్ని ప్రపంచ మానవాళి ఉమ్మడి వారసత్వ విలువలకు నూతన ప్రతీకగా ప్రధాని నరేంద్ర మోదీ అభివర్ణించారు. అంతర్జాతీయ స్థాయిలో మత సామరస్యానికి, ఐక్యతకు చిహ్నంగా అది విలసిల్లుతుందని ఆశాభావం వెలిబుచ్చారు. బోచాసన్వాసి అక్షర్ పురుషోత్తం సంస్థ (బాప్స్) ఆధ్వర్యంలో నిర్మితమైన ఈ స్వామి నారాయణ్ ఆలయాన్ని బుధవారం ఆయన లాంఛనంగా ప్రారంభించారు. సంప్రదాయ పద్ధతిలో లేత గులాబి రంగు ధోవతి, కుర్తా, స్లీవ్ లెస్ జాకెట్ ధరించి అర్చకులు, పురోహితులతో కలిసి పూజాదికాలు తదితరాల్లో పాల్గొన్నారు. దేవతా మూర్తులకు హారతులిచ్చారు. యూఏఈ మంత్రి షేక్ నహ్యాన్ బిన్ ముబారక్ అల్ నహ్యాన్, స్వామి నారాయణ్ సాంప్రదాయికులతో పాటు పలు మత సంప్రదాయాలకు చెందిన ఆధ్యాత్మిక పెద్దలు ప్రారంభోత్సవానికి హాజరయ్యారు. అనంతరం వేలాదిగా పాల్గొన్న భక్తులనుద్దేశించి మోదీ మాట్లాడారు. ‘‘ఈ ఆలయ నిర్మాణం ద్వారా మానవ చరిత్రలోనే సువర్ణాధ్యాయానికి యూఈఏ తెర తీసింది. 140 కోట్ల మంది భారతీయుల మది గెలుచుకుంది’’ అంటూ కొనియాడారు. భారతీయుల ఆకాంక్షలను సాకారం చేసినందుకు యూఏఈ అధ్యక్షుడు షేక్ మహ్మద్ బిన్ జాయేద్ అల్ నహ్యాన్‌కు కృతజ్ఞతలన్నారు. ఆలయ నిర్మాణానికి ఆయన అందించిన అండదండలు మరవలేనివని ప్రశంసించారు. ‘‘ఈ ఆలయంలో అడుగడుగునా మత వైవిధ్యం కొట్టొచ్చినట్టు కని్పస్తుంది. యూఏఈ అనగానే గుర్తొచ్చే బుర్జ్ ఖలీఫా, షేక్ జాయేద్ మసీదులకు ఇకపై స్వామి నారాయణ్ ఆలయం కూడా తోడవుతుంది. దీని సందర్శనకు మున్ముందు భారీగా భక్తులు తరలి వస్తారు’’ అని ఆశాభావం వెలిబుచ్చారు. ఇటీవలే అయోధ్యలో భవ్య రామ మందిరాన్ని ప్రారంభించుకున్నామంటూ గుర్తు చేసుకున్నారు. ఆ వెంటనే అబుదాబీలోనూ ఆలయాన్ని ప్రారంభించే అదృష్టం తనకు దక్కిందన్నారు. ఇది భారత్‌తో పాటు దేశ మత విశ్వాసానికి, సంస్కృతికి కూడా అమృత కాలమేనన్నారు. సుత్తి, ఉలి చేబట్టిన మోదీ... అంతకుముందు ఆలయ నిర్మాణంలో పాలుపంచుకున్న వారందరినీ మోదీ కలిసి కృతజ్ఞతలు తెలిపారు. సుత్తి, ఉలి చేబూని అక్కడి రాతిపై వసుధైవ కుటుంబకం అంటూ స్వయంగా చెక్కారు. ఆలయ నిర్మాణ విశేషాలను అడిగి తెలుసుకున్నారు. -
విదేశీ ప్రధాని.. దేశీ అవతార్!
టోరంటో: కెనడా యువ ప్రధాని జస్టిన్ ట్రూడో తాజాగా దేశీ అవతారమెత్తారు. హిందూ సంప్రదాయ దుస్తులు కుర్తాపైజామా ధరించి ఆయన టోరంటోలోని బాప్స్ శ్రీ స్వామినారాయణ్ మందిరాన్ని దర్శించుకున్నారు. శ్రీస్వామి నారాయణ్ ఆలయం పది సంవత్సరాలు పూర్తిచేసుకున్న సందర్భంగా ఆలయంలో నిర్వహించిన ప్రత్యేక పూజల్లో ఆయన పాల్గొన్నారు. మెడలో పూలదండ వేసుకొని పూజారులతో కలిసి అభిషేకంలో పాల్గొన్నారు. కమ్యూనిటీ ఆధ్యాత్మిక సేవలకు ఈ ఆలయం గొప్ప నెలవని ఆయన కీర్తించారు. ఈ వేడుకల్లో విదేశాంగ శాఖ మాజీ అధికార ప్రతినిధి, ప్రస్తుత కెనడాలోని భారత రాయబారి వికాస్ స్వరూప్ పాల్గొన్నారు. ఆలయ వార్షికోత్సవం సందర్భంగా టోరంటో నగర మేయర్ జాన్ టోరీని ఆలయ ప్రధాన స్వామిజీ మహంత్ స్వామి మహారాజ్ సత్కరించారు. The BAPS Mandir is more than an architectural masterpiece – It’s truly a place for community. Happy 10th anniversary! #bapstoronto10 pic.twitter.com/kh5S1T3oIE — Justin Trudeau (@JustinTrudeau) 23 July 2017