హాలీవుడ్ హీరో కాదు.. ఫేమస్ బిజినెస్ మ్యాన్ - గుర్తుపట్టారా? | Ola CEO Bhavish Aggarwal New Look Goes Viral | Sakshi
Sakshi News home page

హాలీవుడ్ హీరో కాదు.. ఫేమస్ బిజినెస్ మ్యాన్ - గుర్తుపట్టారా?

Published Mon, Feb 19 2024 8:15 AM | Last Updated on Mon, Feb 19 2024 12:07 PM

Ola CEO Bhavish Aggarwal New Look Goes Viral - Sakshi

పైన ఫోటోలో చూడగానే పిలక పెట్టుకుని, కళ్ళజోడుతో స్టైల్‌గా కనిపిస్తున్న వ్యక్తి ఏ హాలీవుడ్ హీరో అనుకుంటే మీరు పొరబడినట్లే.. ఎందుకంటే ఈయన ఇండియాలో ఓ ప్రముఖ బిజినెస్ మ్యాన్. బిజినెస్ మ్యాన్ అయితే ఎందుకు ఈ అవతారమెత్తారు అనే అనుమానం మీలో రావచ్చు? దాని గురించే ఇక్కడ తెలుసుకుందాం..

ఓలా ఎలక్ట్రిక్ కంపెనీ స్థాపించి, ఎలక్ట్రిక్ స్కూటర్లను లాంచ్ చేసి అతి తక్కువ కాలంలోనే గొప్ప అమ్మకాలను పొందుతూ దూసుకెళ్తున్న ఈయనే ఓలా సీఈఓ 'భవిష్ అగర్వాల్'. ఈ పేరు వినగానే ఇప్పుడు గుర్తోచేసి ఉంటుంది, ఈయనే భవిష్ అగర్వాల్ అని..

ఇక ఈ అవతారమెందుకు ఎత్తరనుకుంటున్నారా.. భవిష్ అగర్వాల్ ఆదివారం అబుదాబిలో ఇటీవల ప్రారంభించిన 'బోచసన్వాసి అక్షర్ పురుషోత్తం స్వామినారాయణ సంస్థకు చెందిన హిందూ మందిర్‌'ను సందర్శించారు. ఆ సమయంలో ఇలా కనిపించారు.

ఇదీ చదవండి: హ్యాండ్‌సమ్‌గా కనిపిస్తున్న ఈ కుర్రాడే.. నేడు భారత్ గర్వించదగ్గ వ్యక్తి

భవిష్ అగర్వాల్ ఈ టెంపుల్ సందర్శించిన సందర్భంగా.. ఇది నా జీవిత జ్ఞాపకం అని తన ఎక్స్ (ట్విటర్) ఖాతాలో ట్వీట్ చేస్తూ ఫోటోలు షేర్ చేశారు. ప్రస్తుతం ఈ ఫోటోలు నెట్టింట్లో తెగ వైరల్ అవుతున్నాయి. ఇప్పటికే వేలసంఖ్యలో లైక్స్ పొందిన ఈ ఫోటోలకు నెటిజన్ల నుంచి కామెంట్స్ కూడా వస్తున్నాయి.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement