టోరంటో: కెనడా యువ ప్రధాని జస్టిన్ ట్రూడో తాజాగా దేశీ అవతారమెత్తారు. హిందూ సంప్రదాయ దుస్తులు కుర్తాపైజామా ధరించి ఆయన టోరంటోలోని బాప్స్ శ్రీ స్వామినారాయణ్ మందిరాన్ని దర్శించుకున్నారు. శ్రీస్వామి నారాయణ్ ఆలయం పది సంవత్సరాలు పూర్తిచేసుకున్న సందర్భంగా ఆలయంలో నిర్వహించిన ప్రత్యేక పూజల్లో ఆయన పాల్గొన్నారు. మెడలో పూలదండ వేసుకొని పూజారులతో కలిసి అభిషేకంలో పాల్గొన్నారు. కమ్యూనిటీ ఆధ్యాత్మిక సేవలకు ఈ ఆలయం గొప్ప నెలవని ఆయన కీర్తించారు.
ఈ వేడుకల్లో విదేశాంగ శాఖ మాజీ అధికార ప్రతినిధి, ప్రస్తుత కెనడాలోని భారత రాయబారి వికాస్ స్వరూప్ పాల్గొన్నారు. ఆలయ వార్షికోత్సవం సందర్భంగా టోరంటో నగర మేయర్ జాన్ టోరీని ఆలయ ప్రధాన స్వామిజీ మహంత్ స్వామి మహారాజ్ సత్కరించారు.
The BAPS Mandir is more than an architectural masterpiece – It’s truly a place for community. Happy 10th anniversary! #bapstoronto10 pic.twitter.com/kh5S1T3oIE
— Justin Trudeau (@JustinTrudeau) 23 July 2017