PM Justin Trudeau
-
విదేశీ ప్రధాని.. దేశీ అవతార్!
టోరంటో: కెనడా యువ ప్రధాని జస్టిన్ ట్రూడో తాజాగా దేశీ అవతారమెత్తారు. హిందూ సంప్రదాయ దుస్తులు కుర్తాపైజామా ధరించి ఆయన టోరంటోలోని బాప్స్ శ్రీ స్వామినారాయణ్ మందిరాన్ని దర్శించుకున్నారు. శ్రీస్వామి నారాయణ్ ఆలయం పది సంవత్సరాలు పూర్తిచేసుకున్న సందర్భంగా ఆలయంలో నిర్వహించిన ప్రత్యేక పూజల్లో ఆయన పాల్గొన్నారు. మెడలో పూలదండ వేసుకొని పూజారులతో కలిసి అభిషేకంలో పాల్గొన్నారు. కమ్యూనిటీ ఆధ్యాత్మిక సేవలకు ఈ ఆలయం గొప్ప నెలవని ఆయన కీర్తించారు. ఈ వేడుకల్లో విదేశాంగ శాఖ మాజీ అధికార ప్రతినిధి, ప్రస్తుత కెనడాలోని భారత రాయబారి వికాస్ స్వరూప్ పాల్గొన్నారు. ఆలయ వార్షికోత్సవం సందర్భంగా టోరంటో నగర మేయర్ జాన్ టోరీని ఆలయ ప్రధాన స్వామిజీ మహంత్ స్వామి మహారాజ్ సత్కరించారు. The BAPS Mandir is more than an architectural masterpiece – It’s truly a place for community. Happy 10th anniversary! #bapstoronto10 pic.twitter.com/kh5S1T3oIE — Justin Trudeau (@JustinTrudeau) 23 July 2017 -
జస్టిన్ ట్రూడో చేతిలో జస్టిన్ ట్రూడో.. వైరల్
ఒట్టావా: కెనడా ప్రధాని జస్టిన్ ట్రూడో ఉద్వేగానికి లోనయ్యారు. శనివారం ప్రధాని జస్టిన్ ట్రూడో ఓ చిన్ని జస్టిన్ ట్రూడోను అప్యాయంగా ఎత్తుకుని ముద్దాడిన సందర్బంలో ఆయన ఆనందం రెట్టింపయింది. ఇందుకు సంబంధించిన ఓ ఫొటో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. బుజ్జి జస్టిన్ ట్రూడోకు ఆయనకు ఏమాత్రం సంబంధం లేదు. అయితే జస్టిన్ ట్రూడో పేరేంటి అంటారా. ఆ వివరాలు.. సిరియాలోని డెమాస్కస్‌కు చెందిన మహ్మద్, ఆఫ్రా బిలాల్ అనే దంపతులు గతేడాది ఫిబ్రవరిలో శరణార్థులుగా కెనడాకు వలసొచ్చారు. ఇక్కడి ఆల్బర్టా అనే ప్రాంతంలో ఈ జంట నివాసం ఉంటోంది. కెనడాకు వచ్చిన కొన్ని రోజులకు వీరికి ఓ పండండి బాబు పుట్టగా.. శరణార్థులుగా తమకు ఎంతో దయగా దేశంలోకి అనుమతులిచ్చిన ప్రధాని జస్టిన్ ట్రూడో పేరునే బాబుకు పెట్టారు. జీవితంలో కనీసం ఒక్కసారైనా ప్రధానిని కలిసి తమ కుమారుడు జస్టిన్ ట్రూడోను చూపించాలని సిరియా దంపతులు భావించారు. అంత త్వరగా తమ కోరిక నెరవేరుతుందని మహ్మద్, ఆఫ్రా బిలాల్‌లు ఊహించలేదు. కాల్గరీలోని ఓ ఈవెంట్లో పాల్గొనేందుకు ప్రధాని జస్టిన్ ట్రూడో వచ్చారని చూసేందుకు ఈ భార్యాభర్తలు వెళ్లారు. వీలు దొరకడంతో ప్రధానిని సిరియా జంట కలిసింది. 'మా బాబుకి మీ పేరే పెట్టుకున్నాం. జస్టిస్ ట్రూడోను అందుకోండి' అంటూ తల్లి ఆఫ్రా బాబును ప్రధాని చేతిలో పెట్టారు. తమకు ఇక్కడ ఉండేందుకు ఛాన్స్ ఇచ్చినందుకు మీ పేరే బాబుకె పెట్టామని దంపతులు చెప్పారు. జస్టిన్ ట్రూడోను ప్రధాని జస్టిన్ ట్రూడో ఎత్తుకోగా ఫొటోగ్రాఫర్ అడమ్ స్కాటి ఫొటో తీసి ట్విట్టర్లో పోస్ట్ చేశాడు. ఇక అంతే.. జస్టిన్ ట్రూడోను ఎత్తుకున్న జస్టిన్ ట్రూడో అంటూ సోషల్ మీడియాలో ఆ ఫొటో వైరల్‌గా మారి విపరీతంగా లైక్స్, కామెంట్లతో దూసుకుపోతోంది. .@JustinTrudeau met Justin-Trudeau Adam Bilal in #Calgary today. Background: https://t.co/u91OQexycZ #cdnpoli pic.twitter.com/qA2kvBXeXn — Adam Scotti -
అది ఉగ్రవాద దాడే.. ప్రధాని ఖండన!
కెనడా: క్యుబెక్ నగరంలోని మసీదులో సాయుధులు కాల్పులకు తెగబడిన ఘటనలో మృతుల సంఖ్య ఆరుకు చేరింది. ఈ ఘటనను కెనడా ప్రధానమంత్రి జస్టిన్ ట్రుడో, క్యుబెక్ ప్రీమియర్ ఫిలిప్పె కోయిలార్డ్ తీవ్రంగా ఖండించారు. ఇది ఉగ్రవాద ఘటనేనని ట్రుడో స్పష్టం చేశారు. ఏడు ముస్లిం మెజారిటీ దేశాలపై అమెరికా అధ్యక్షుడు ట్రంప్ నిషేధం విధించిన నేపథ్యంలో కెనడాలో ఈ ఉగ్రవాద దాడి జరగడం గమనార్హం. 'ప్రార్థన మందిరంలో ముస్లింలపై జరిగిన ఈ ఉగ్రవాద దాడిని మేం ఖండిస్తున్నాం. అక్కడ మతిలేని హింసాత్మక ఘటన జరగడం గుండెల్ని పిండేస్తోంది. కెనడియన్లుగా భిన్నత్వమే మనం బలం. మత సహనం మన విలువ' అని ట్రుడో పేర్కొన్నారు. 'మన జాతి నిర్మాణంలో ముస్లిం-కెనడియన్లు ఒక కీలకమైన భాగం. మన కమ్యూనిటీలో, మన నగరాల్లో, దేశంలో ఇలాంటి మతిలేని దాడులకు తావులేదు' అని ఆయన అన్నారు. ఈ సాయుధ దాడికి పాల్పడిన వారిని పోలీసులు అరెస్టు చేసి శిక్షిస్తారని, బాధితులకు ప్రభుత్వం అండగా ఉంటుందని ఆయన తెలిపారు. ఆదివారం రాత్రి 8 గంటల సమయంలో సాయంత్రం ప్రార్థనలు నిర్వహిస్తుండగా మసీదులో చొరబడిన సాయుధులు విచక్షణారహితంగా కాల్పులు జరిపారు. సుమారు ముగ్గురు సాయుధ దుండగులు కాల్పులకు దిగినట్టు తెలుస్తోంది. కాల్పులు జరిగిన సమయంలో మసీదు ఉన్న భవనంలో దాదాపు 40 మంది ఉన్నారు. ఫాయ్ స్ట్రీట్‌లో ఉన్న క్యుబెక్ సిటీ ఇస్లామిక్ కల్చరల్ సెంటర్లో ఈ ఘటన జరిగింది. ఈ ఘటనతో అలర్ట్ అయిన కెనడా భద్రతా బలగాలు పెద్ద ఎత్తున చేరుకొని సంఘటనాస్థలిని తమ ఆధీనంలోకి తీసుకున్నాయి. కాల్పులకు తెగబడిన ఇద్దరు సాయుధులను పోలీసులు అదుపులోకి తీసుకున్నట్టు కెనడా రేడియో ప్రకటించింది. -
ప్రపంచానికి కెనడా హృదయపూర్వక ఆహ్వానం
ఒటావా: శరణార్థులు, ముస్లింలపై అమెరికా నిషేధం విధించిన వేళ.. ఆ అగ్రరాజ్యానికి పొరుగునే ఉన్న కెనడా మానవీయతను ప్రదర్శించింది. ‘మా దేశానికి రండి..’ అంటూ బాధితులకు హృదయపూర్వక ఆహ్వానం పలికింది. కెనడియన్ ప్రధాని జస్టిన్ ట్రుడీ ఈ మేరకు ఒక ప్రకటన చేశారు. ‘మతద్వేషానికి బాధితులైనవారుగానీ, ఉగ్రవాదం, యుద్ధోన్మాదం కారణంగా సర్వం కోల్పోయిన శరణార్థులుగానీ నిరభ్యంతరంగా కెనడాకు రావచ్చు. మీకు హృదయపూర్వక ఆహ్వానం పలుకుతున్నాం..’అని ప్రధాని ట్రుడీ శనివారం ట్వీట్ చేశారు. అమెరికాలోకి సిరియా శరణార్థుల వలసపై నిరవధిక నిషేధంతోపాటు ఇస్లామిక్ దేశాలైన ఇరాక్, సిరియా, ఇరాన్ , సూడాన్ , లిబియా, సోమాలియా, యెమెన్ పౌరులకు 90 రోజుల వరకు వీసాల జారీ నిలిపేస్తూ ట్రంప్ సర్కార్ ఉత్తర్వులు జారీచేసిన మరుసటిరోజే కెనడా భిన్నంగా స్పందిచడంతో ప్రపంచవ్యాప్తంగా ప్రశంసలు వెల్లువెత్తుతున్నాయి. ‘ట్రంప్ తెంపరితనానికి నిదర్శనంగా నిలిస్తే, నువ్వు మానవత్వాన్ని చాటుతున్నావ్..’అంటూ జస్టిన్ ట్రుడీని నెటిజన్లు ప్రశంసిస్తున్నారు. (ట్రంప్‌కు టిట్ ఫర్ టాట్: ఇరాన్ సంచలన నిర్ణయం) To those fleeing persecution, terror & war, Canadians will welcome you, regardless of your faith. Diversity is our strength #WelcomeToCanada — Justin Trudeau (@JustinTrudeau) 28 January 2017