ప్రపంచానికి కెనడా హృదయపూర్వక ఆహ్వానం | Will welcome those fleeing terror, war: Canadian PM | Sakshi
Sakshi News home page

ప్రపంచానికి కెనడా హృదయపూర్వక ఆహ్వానం

Published Sun, Jan 29 2017 12:38 PM | Last Updated on Tue, Sep 5 2017 2:25 AM

ప్రపంచానికి కెనడా హృదయపూర్వక ఆహ్వానం

ప్రపంచానికి కెనడా హృదయపూర్వక ఆహ్వానం

ఒటావా: శరణార్థులు, ముస్లింలపై అమెరికా నిషేధం విధించిన వేళ.. ఆ అగ్రరా‍జ్యానికి పొరుగునే ఉన్న కెనడా మానవీయతను ప్రదర్శించింది. ‘మా దేశానికి రండి..’ అంటూ బాధితులకు హృదయపూర్వక ఆహ్వానం పలికింది. కెనడియన్‌ ప్రధాని జస్టిన్‌ ట్రుడీ ఈ మేరకు ఒక ప్రకటన చేశారు.

‘మతద్వేషానికి బాధితులైనవారుగానీ, ఉగ్రవాదం, యుద్ధోన్మాదం కారణంగా సర్వం కోల్పోయిన శరణార్థులుగానీ  నిరభ్యంతరంగా కెనడాకు రావచ్చు. మీకు హృదయపూర్వక ఆహ్వానం పలుకుతున్నాం..’అని ప్రధాని ట్రుడీ శనివారం ట్వీట్‌ చేశారు.

అమెరికాలోకి సిరియా శరణార్థుల వలసపై నిరవధిక నిషేధంతోపాటు ఇస్లామిక్‌ దేశాలైన ఇరాక్, సిరియా, ఇరాన్ , సూడాన్ , లిబియా, సోమాలియా, యెమెన్  పౌరులకు 90 రోజుల వరకు వీసాల జారీ నిలిపేస్తూ ట్రంప్‌ సర్కార్‌ ఉత్తర్వులు జారీచేసిన మరుసటిరోజే కెనడా భిన్నంగా స్పందిచడంతో ప్రపంచవ్యాప్తంగా ప్రశంసలు వెల్లువెత్తుతున్నాయి. ‘ట్రంప్‌ తెంపరితనానికి నిదర్శనంగా నిలిస్తే, నువ్వు మానవత్వాన్ని చాటుతున్నావ్‌..’అంటూ జస్టిన్‌ ట్రుడీని నెటిజన్లు ప్రశంసిస్తున్నారు.  (ట్రంప్‌కు టిట్‌ ఫర్‌ టాట్‌: ఇరాన్‌ సంచలన నిర్ణయం)

 

To those fleeing persecution, terror & war, Canadians will welcome you, regardless of your faith. Diversity is our strength #WelcomeToCanada

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement