విజయవాడ సిటీ, న్యూస్‌లైన్ : విద్యార్థుల తల్లిదండ్రులు అందరూ ఓటు హక్కు వినియోగించుకుని ఓటింగ్ శాతం పెంచేలా సిస్టమేటిక్ ఓటర్ ఎడ్యుకేషన్ అండ్ ఎలక్ట్రోరల్ పార్టిసిపేషన్(స్వీప్) చేపడుతున్న కార్యక్రమానికి విద్యాశాఖ అధికారుల సహకారం అవసరమని కలెక్టర్ ఎం.రఘునందన్‌రావు సూచించారు. జిల్లాలోని డీవైఈవోలు, ఎంఈవోలతో మంగళవారం తన క్యాంపు కార్యాలయంలో కలెక్టర్ సమావేశం నిర్వహిం చారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గత ఎన్నికల్లో జిల్లా వ్యాప్తంగా 80 శాతం పోలింగ్ జరిగిందని, గ్రామీణ ప్రాంతాల్లో 85 శాతానికి పైగా, నగరం, పట్టణ ప్రాంతాల్లో 69 శాతం నమోదైందని వివరించారు. సాధారణ ఎన్నికలలో జిల్లాలో పోలింగ్ శాతాన్ని గణనీయంగా పెంచటానికి, ఓటర్లను చైతన్యపరచేందుకు 2010 నుంచి స్వీప్ ద్వారా పలు కార్యక్రమాలు నిర్వహిస్తున్నామన్నారు.
విద్యార్థులకు సంకల్ప పత్రాలను అందజేసి ఎన్నికల్లో ఎటువంటి ప్రలోభాలకు లొంగకుండా తప్పనిసరిగా ఓటు వేస్తామని వారి తల్లిదండ్రులతో వాటిపై సంతకాలు చేరుుంచి తిరిగి అధికారులకు అందజేసే విధంగా విద్యా శాఖ అధికారులు చర్యలు తీసుకోవాలని కలెక్టర్ ఆదేశించారు. ఈ సమావేశంలో ఆర్‌ఐవో వెంకటరామయ్య, డీఈవో డి.దేవానందరెడ్డి, స్వీప్ నోడల్ అధికారి టి.దామోదర్‌నాయుడు తదితరులు పాల్గొన్నారు.
మాస్టర్ ట్రైనర్లకు శిక్షణ
విజయవాడ సిటీ : ‘ప్రశ్నించండి.. వాటికి సమాధానాలు పొందండి.. సందేహాలతో శిక్షణ కార్యక్రమం నుంచి వెళ్లకండి..’ అని మాస్టర్ ట్రైనర్లకు జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ ఎం.రఘునందన్‌రావు సూచించారు. సార్వత్రిక ఎన్నికల నిర్వహణపై రిటర్నింగ్ అధికారులు, 112 మంది మాస్టర్ ట్రైనర్లకు మంగళవారం స్థానిక మున్సిపల్ కార్పొరేషన్ కార్యాలయంలో శిక్షణ ఇచ్చారు. కలెక్టర్ మాట్లాడుతూ మే 7న జరిగే సార్వత్రిక ఎన్నికల విధుల్లో పాల్గొనే పోలింగ్ సిబ్బందికి క్షేత్రస్థారుులో వచ్చే సందేహాలను నివృత్తి చేయడంలో మాస్టర్ ట్రైనర్లు కీలకపాత్ర వహించాల్సి ఉంటుందన్నారు.
పీవో డైరీ రూపొందించడం, ఫారం17సీ పూర్తి చేయడం, ఈవీఎంల సీలింగ్ విధానాలను వివరించారు. పోలింగ్ సమయాన్ని ఉదయం 7 నుంచి సాయంత్రం 6 గంటల వరకు పొడిగించారని తెలిపారు. అనంతరం మాస్టర్ ట్రైనర్ల సందేహాలను జారుుంట్ కలెక్టర్ జె.మురళి, నగరపాలక సంస్థ కమిషనర్ సి.హరికిరణ్, ఏజేసీ బి.ఎల్.చెన్నకేశవరావు నివృత్తి చేశారు. డ్వామా పీడీ అనిల్‌కుమార్, రాష్ట్ర మాస్టర్ ట్రైనింగ్ ఫెసిలిటేటర్ పి.మురళి, డీఈవో దేవానందరెడ్డి, ఆర్డీవోలు, రిటర్నింగ్ అధికారులు పాల్గొన్నారు.
ఓటింగ్ శాతం పెంచేందుకు సహకరించాలి
Published Wed, Apr 9 2014 2:10 AM | Last Updated on Sat, Sep 2 2017 5:45 AM
Advertisement
Advertisement