మోర్తాడ్, న్యూస్‌లైన్ : పోస్టల్ బ్యాలెట్ ద్వారా ఓటు హక్కును వినియోగించుకునేందుకు గడువు సమీపిస్తున్నా సాధారణ ఎన్నికల్లో విధులు నిర్వహిం చిన వాలంటీర్లకు మా త్రం ఇంకా పోస్టల్ బ్యాలెట్లు అందలేవు. ఇటీవల ముగిసిన సాధారణ ఎన్నికల్లో సుమారు ఏడు వందల మంది ఎన్‌సీసీ, ఎన్‌ఎస్‌ఎస్ వాలంటీర్లు సేవలందించారు. జిల్లా వ్యాప్తంగా తొమ్మిది నియోజకవర్గాల్లోని 2054 పోలింగ్ బూత్‌లలో ఓటర్లు, పోలిం గ్ సిబ్బందికి మధ్య వారధిగా పని చేశారు. ఓటు వేయడానికి వచ్చే వృద్ధులు, వికలాంగులకు ఓటు వేయడానికి వాలంటీర్లు సహకరించారు. పోలీసులు భద్రత చర్యలు చేపడితే, వాలంటీర్లు ఓటర్లకు సహాయసహ కారాలు అందించారు.
వాలంటీర్లు డిగ్రీ చదువుతున్నవారు కావడంతో అందరికి ఓటు హక్కు ఉంది. పోలింగ్ విధులు నిర్వహించిన ఉద్యోగులకు పోస్టల్ బ్యాలెట్ సౌకర్యం ఉండటంతో వారు తమ ఓటు హక్కును పోస్టల్ ద్వారానే వినియోగించుకుంటున్నారు. అయితే ఈ సారి తొలిసారిగా ఎన్‌సీసీ, ఎన్‌ఎస్‌ఎస్ వాలంటీర్లను ఎన్నికల విధులకు వినియోగించుకున్నారు. పోలింగ్ విధులను నిర్వహించిన వాలంటీర్లకు కూడా పోస్టల్ బ్యాలెట్ సౌకర్యాన్ని కల్పిస్తామని అధికారులు ప్రకటించారు. దీంతో గడచిన నెలలోనే వాలంటీర్లు పోస్టల్ బ్యాలెట్‌ల కోసం దరఖాస్తు చేసుకున్నారు. ఉద్యోగులకు మాత్రం పోస్టల్ బ్యాలెట్లు తపాల శాఖ ద్వారా అందాయి. వారు సంబంధిత తహ శీల్దార్ కార్యాలయంలోని బ్యాలెట్ బాక్సులో తమ ఓట్లు వేశారు. ఈనెల 16వ తేదీన కౌంటింగ్ నిర్వహించనున్న దృష్ట్యా అంతకు ఒక రోజు ముందుగా పోస్టల్ బ్యాలెట్‌ను వినియోగించుకునే వీలు ఉంది. ఇప్పటివరకు వాలంటీర్లు, కొందరు ఉద్యోగులకు ఇంకా పోస్టల్ బ్యాలెట్లు అందలేవు. గడువు సమీపిస్తున్నా పోస్టల్ బ్యాలెట్లు అందక పోవడంతో ఓటు హక్కును వినియోగించుకుంటామా లేదా అనేది సంశయంగా మారింది. ఇప్పటికైనా అధికారులు స్పందించి పోస్టల్ బ్యాలెట్లను తొందరగా సరఫరా చేయాలని వాలంటీర్లు కోరుతున్నారు.
ఎల్లారెడ్డి రూరల్ : సిబ్బంది నిర్లక్ష్యం వల్ల పలువురు ఉద్యోగుల పోస్టల్ బ్యాలెట్‌లు తిరిగి ఆర్‌వో కార్యాలయానికి చేరాయి. మండలంలోని పలువురు ప్రభుత్వ ఉద్యోగులు పోస్టల్ బ్యాలెట్ కోసం దరఖాస్తు చేసుకున్నారు. విధులు నిర్వహిస్తున్న వారిలో 1451 మంది పోస్టల్ బ్యాలెట్ కోసం దరఖాస్తు చేసుకున్నారు. వీరిలో 750 మంది తమ ఓటు హక్కును ఇప్పటికే వినియోగించుకున్నారు. మిగతా వారు ఈనెల 16వ తేదీ ఉదయం 8 గంటల వరకు తమ ఓటు హక్కును ప్రభుత్వ ఉద్యోగులు వినియోగించుకునే అవకాశం ఉంది.
కాగా పలువురు ప్రభుత్వ ఉద్యోగుల చిరునామాలు కంప్యూటర్‌లో తప్పుగా నమోదు చేయడంతో వారికి పోస్టల్ బ్యాలెట్‌లు అందలేదని సమాచారం. మండలంలోని 30, 40 మంది ప్రభుత్వ ఉద్యోగుల పోస్టల్ బ్యాలెట్‌లు తిరిగి ఆర్‌వో కార్యాలయానికి చేరినట్లు తెలిసింది. మండలంలోని ఓ ప్రభుత్వ ఉద్యోగి అల్మాజీపూర్ చిరునామా ఇవ్వగా సిబ్బంది ఆజామ్‌పూర్ గ్రామంగా కంప్యూటర్‌లో నమోదు చేశారు. అలాగే తిమ్మారెడ్డి గ్రామానికి గానూ తిమ్మారెడ్డిపూర్‌గా నమోదైంది. దీంతో పోస్టల్ సిబ్బంది చిరునామా తప్పుగా ఉందని, తిరిగి వాటిని ఆర్‌వో కార్యాలయానికి పంపించివేసినట్లు సమాచారం.
వాలంటీర్లకు అందని పోస్టల్ బ్యాలెట్లు
Published Wed, May 7 2014 4:27 AM | Last Updated on Sat, Sep 2 2017 7:00 AM
Advertisement