భారీగా పోస్టల్ బ్యాలెట్ల తిరస్కరణ | postal ballots rejected in nellore, guntur districts | Sakshi
Sakshi News home page

భారీగా పోస్టల్ బ్యాలెట్ల తిరస్కరణ

Published Tue, May 13 2014 9:59 AM | Last Updated on Tue, Aug 14 2018 4:24 PM

postal ballots rejected in nellore, guntur districts

ఉద్యోగులు.. ఎంచక్కా చదువుకున్నవాళ్లకు మాత్రమే పోస్టల్ బ్యాలెట్లు వెళ్తాయి. కానీ, అలాంటి వాళ్లు కూడా పోస్టల్ బ్యాలెట్లలో ఓట్లు వేయడంలో పొరపాట్లు చేశారు. ఇవి ఆయా అభ్యర్థుల పాలిట గ్రహపాటుగా మారాయి. పలు జిల్లాల్లో వివిధ కారణాల వల్ల పోస్టల్ బ్యాలెట్లను అధికారులు తిరస్కరించారు.

నెల్లూరు జిల్లా వింజమూరులో డిక్లరేషన్ ఇవ్వకపోవడంతో 158 పోస్టల్ బ్యాలెట్లను అధికారులు తిరస్కరించారు. అలాగే, గుంటూరు జిల్లా సత్తెనపల్లి మండలం ముప్పాళ్లలో 9, పొన్నూరులో 32 పోస్టల్‌ ఓట్లను తిరస్కరించారు. వీటన్నింటి మీద ఉద్యోగుల సంతకాలు లేకపోవడం వల్లనే ఈ బ్యాలెట్లను తిరస్కరించినట్లు అధికారులు తెలిపారు. విజయనగరం జిల్లా గుర్ల జడ్పీటీసీ స్థానానికి సంబంధించి డిక్లరేషన్ లేక 34 పోస్టల్‌ బ్యాలెట్ ఓట్లను తిరస్కరించారు. అలాగే, శ్రీకాకుళం జిల్లా కొత్తూరు, హిర, ఎల్‌ఎన్‌ పేట, పాతపట్నంలో 165 పోస్టల్‌ బ్యాలెట్‌ ఓట్లకు గాను 163 చెల్లని ఓట్లను గుర్తించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement