జిల్లాలోని రెండు పార్లమెంట్, 12 అసెంబ్లీ స్థానాలకు ఉదయం 8గంటలకు ఓట్ల లెక్కింపు ప్రారంభమవుతుంది. ముందుగా పోస్టల్ బ్యాలెట్లను జిల్లా ఎన్నికల అధికారి సమక్షంలో లెక్కిస్తారు. అనంతరం ఈవీఎంలలో ఉన్న ఓట్లను నియోజకవర్గాల వారీగా ఏర్పాటు చేసిన టేబుళ్లపై లెక్కిస్తారు. మొత్తం 18 నుంచి 20 రౌండ్లలో లెక్కింపు పూర్త వుతుంది. మధ్యాహ్నం 3గంటల వరకు పూర్తిస్థాయి ఫలితాలు వెలువడే అవకాశం ఉంది.
కౌంటింగ్ జరిగే ప్రదేశాలు
నల్లగొండ పార్లమెంట్ నియోజకవర్గం :
భారత ప్రభుత్వ ఆహార సంస్థ (ఎఫ్‌సీఐ),
గొల్లగూడ, నల్లగొండ
భువనగిరి :
రాష్ట్ర గిడ్డంగుల సంస్థ, దుప్పలపల్లి, నల్లగొండ.
ఎవరో ఆ అదృష్టవంతులు :
నల్లగొండ పార్లమెంట్ : 9మంది అభ్యర్థులు
భువనగిరి పార్లమెంట్ : 13మంది అభ్యర్థులు
12 నియోజకవర్గాల్లో : 161మంది అభ్యర్థులు
కౌంటింగ్ జరిగే స్థానాల సంఖ్య
నల్లగొండ పార్లమెంట్ పరిధి : 7 అసెంబ్లీ నియోజకవర్గాలు
భువనగిరి పార్లమెంట్ పరిధి : 5 అసెంబ్లీ నియోజకవర్గాలు
జిల్లాలోని రెండు పార్లమెంట్, 12 అసెంబ్లీ నియోజకవర్గాలకు సంబంధించిన ఎన్నికలు ఏప్రిల్ 30వ తేదీన జరిగాయి. ఈ ఎన్నికల్లో ప్రధాన పార్టీలతో పాటు చిన్నాచితకా పార్టీలు, స్వతంత్రులతో కలిపి మొత్తం 19 రాజకీయపార్టీలకు చెందిన 161 మంది అభ్యర్థులు పోటీ చేశారు. ఎలాగైనా గెలుపొందాలన్న ఉద్దేశంతో అభ్యర్థులు ప్రచారాన్ని హోరాహోరీగా నిర్వహించారు. కాగా కోదాడ, మునుగోడు నియోజకవర్గాల్లో మాత్రం 17 మంది చొప్పున అభ్యర్థులు బరిలో నిలిచారు. నల్లగొండ పార్లమెంట్ స్థానానికి 9 మంది, భువనగిరి పార్లమెంట్ స్థానానికి పోటీ చేసిన 13 మంది అభ్యర్థులు భవితవ్యం మరి కొద్ది గంటల్లో తేలనుంది.
కౌంటింగ్ ఏర్పాట్లు..
సార్వత్రిక ఎన్నికలకు సంబంధించిన ఓట్ల కౌంటింగ్ నిర్వహణకు గాను జిల్లాలోని ఒక్కో నియోజక వర్గానికి 24 టేబుళ్ల చొప్పున అధికారులు ఏర్పాటు చేశారు. దీంట్లో ఎమ్మెల్యే అభ్యర్థుల కోసం 12, ఎంపీ అభ్యర్థుల కోసం 12 టేబుళ్లు ఉంటాయి. ఒక్కో టేబుల్‌కు కౌంటింగ్ సూపర్ వైజర్, కౌంటింగ్ అసిస్టెంట్, ఒక మైక్రో అబ్జర్వర్, అభ్యర్థి తరఫున ఒక ఏజెంట్ ఉంటారు. మొత్తం ఓట్ల లెక్కింపు కోసం 288 టేబుళ్లు, ఇక ఓట్లను లెక్కించడానికి గాను 1152 మంది సిబ్బందిని అధికారులు నియమించారు.
భారీ బందోబస్తు...
కౌంటింగ్ కేంద్రాల వద్ద ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ఉండేందుకు పోలీస్ శాఖ భారీ బందోబస్తును ఏర్పాటు చేసింది. సాధారణ పోలీసులతో పాటు, ప్రత్యేక పోలీస్ విభాగాల సిబ్బందిని కూడా నియమించారు. అదనపు ఎస్పీ, డీఎస్పీలు 5, సీఐలు 28, ఎస్‌ఐలు 79, ఏఎస్‌ఐలు 194, కానిస్టేబుళ్లు 482, హోంగార్డులు 306 మందిని నియమించారు. వీరితో పాటు అదనంగా పారా మిలటరీ బలగాలను కూడా ఏర్పాటు చేశారు.
ఎన్నికల ఓట్ల లెక్కింపు సందర్భంగా ఎన్నికల కమిషన్ నిబంధనలకు లోబడి శనివారం ఉదయం 10గంటల వరకు జిల్లా వ్యాప్తంగా ఉన్న మద్యం దుకాణాలు మూసివేయనున్నారు. అదే విధంగా ఎన్నికల ఫలితాలు వెల్లడించిన తర్వాత అభ్యర్థులు ఎలాంటి గెలుపు సంబరాలు నిర్వహించడానికి అనుమతిలేదు. ఎన్నికల కోడ్ అమల్లో ఉన్నందున అధికారులు వీటి పై నిషేధం విధించారు.
ఫలితాలు ఇలా...
Published Fri, May 16 2014 3:31 AM | Last Updated on Tue, Sep 18 2018 8:23 PM
Advertisement