పాలకొల్లు అర్బన్, న్యూస్‌లైన్ : ప్రాదేశిక ఎన్నికల ఫలితాల్లో రెండు చోట్ల పోస్టల్ బ్యాలెట్ ఓట్లు ఫలితాలను తారుమారు చేశాయి. ఈ పోస్టల్ బ్యాలెట్లు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులకు విజయాన్ని అందించాయి. ఆగర్రు ఎంపీటీసీ స్థానం నుంచి వైఎస్సార్ సీపీ తరపున పోటీ చేసిన పొనుకుమట్ల వీరాస్వామికి కేవలం ఒక పోస్టల్ బ్యాలెట్ ఓటుతో విజయలక్ష్మి వరించింది. ఓట్ల లెక్కింపులో వీరాస్వామికి 779 ఓట్లు లభించగా టీడీపీ అభ్యర్థి కలిదిండి శ్రీనివాసరాజుకు 784 ఓట్లు లభించాయి. ఈ దశలో టీడీపీ అభ్యర్థి 5 ఓట్ల మెజార్టీతో నిలిచారు. అయితే పోస్టల్ బ్యాలెట్లు 6 పోలవ్వగా ఆరు కూడా వీరాస్వామికే లభించాయి. దీంతో ఒక ఓటు తేడాతో వీరాస్వామి గెలుపొందినట్లు ఆర్వో సూర్యనారాయణ ప్రకటించారు.
5 ఓట్ల మెజార్టీతో కొండబాబు గెలుపు
పాలకొల్లు రూరల్-2 నుంచి వైఎస్సార్ సీపీ తరఫున చిట్టూరి ఏడుకొండలు (కొండబాబు) 5 ఓట్లు మెజార్టీతో గెలుపొందారు. ఆయనకు పోస్టల్ బ్యాలెట్‌తో కలుపుకుని 826ఓట్లు లభించగా టీడీపీ అభ్యర్థి పెచ్చెట్టి నాగరాజుకు 819 ఓట్లు లభించాయి. అయితే చెల్లని ఓట్లు తిరిగి లెక్కించడంతో నాగరాజుకు మరో 2 ఓట్లు లభించాయి. దీంతో కొండబాబు కేవలం 5 ఓట్ల తేడాతో గెలిచినట్లయ్యింది.
పోస్టల్ బ్యాలెట్ ఓటుతో వరించిన విజయలక్ష్మి
Published Wed, May 14 2014 2:06 AM | Last Updated on Tue, Sep 18 2018 8:23 PM
Advertisement