
1:5 నిష్పత్తిలో విడదీతకు ఓకే
న్యూఢిల్లీ: ప్రైవేట్ రంగ దిగ్గజం అదానీ పవర్ షేర్ల విభజనకు వాటాదారులు అనుమతించారు. 1:5 నిష్పత్తిలో విడదీసేందుకు పోస్టల్ బ్యాలట్ ద్వారా మెజారిటీ సభ్యులు అంగీకారం తెలిపినట్లు కంపెనీ తాజాగా వెల్లడించింది. వెరసి రూ. 10 ముఖ విలువగల ఒక్కో షేరునీ రూ. 2 ముఖ విలువగల 5 షేర్లుగా విభజించనుంది. ఇందుకు సెప్టెంబర్ 22 రికార్డ్ డేట్‌గా ప్రకటించింది. రిటైల్, చిన్న ఇన్వెస్టర్లు సైతం కంపెనీ షేర్లలో లావాదేవీలు చేపట్టేందుకు వీలుగా షేర్ల ముఖ విలువను విభజించేందుకు కంపెనీ బోర్డు గ్రీన్‌సిగ్నల్ ఇచి్చనట్లు అదానీ పవర్ బోర్డు పేర్కొంది.
అదానీ పవర్ షేరు నామమాత్ర లాభంతో రూ. 610 వద్ద ముగిసింది.