split
-
కంపెనీల విడదీత.. లాభాల మోత!
వ్యాపారాలను విభజించిన కంపెనీల్లో ఇన్వెస్ట్ చేసిన వారి పంట పండుతోంది. ప్రత్యేక సంస్థలతో పాటు మాతృ సంస్థ ఉమ్మడి మార్కెట్ విలువలు రాకెట్లా దూసుకెళ్తూ దలాల్ స్ట్రీట్(Dalal Street)లో లాభాల మోత మోగిస్తున్నాయి. గత ఏడాది కాలంలో దాదాపు డజను కార్పొరేట్ సంస్థలు ఈ జాబితాలో చోటు దక్కించుకున్నాయి. తాజాగా ఐటీసీ(ITC) కూడా హోటళ్ల బిజినెస్‌ను విడదీసి ప్రత్యేక అనుబంధ సంస్థగా లిస్టింగ్ చేస్తోంది. అదేవిధంగా టాటా మోటార్స్ సైతం వాణిజ్య వాహన విభాగాన్ని విడదీసే పనిలో ఉంది.విభిన్న వ్యాపారాలను ఒకే గొడుగు కింద నిర్వహించడం చాలా క్లిష్టతరమైన వ్యవహారం. దీనివల్ల నిర్దిష్టంగా ఫోకస్ చేయడానికి వీలుండదు. వేరు చేయడం వల్ల నిర్వహణ పనితీరు మెరుగవుతుంది. – రవి సర్దానా, ఇన్వెస్ట్మెంట్ బ్యాంకర్వ్యాపారాల పునర్వ్యవస్థీకరణ, ఇన్వెస్టర్లకు మరింత విలువ చేకూర్చడం ఇలా కారణం ఏదైనా కానీ.. దేశీ కార్పొరేట్ కంపెనీలు విభజనతో కాసులు కురిపిస్తున్నాయి. ఇటీవలి కాలంలో ఇలా విడదీసిన కంపెనీల షేర్లు దండిగానే లాభాలు పంచాయి. గత ఏడాది వ్యవధిలో విభజన తర్వాత మాతృ సంస్థ, కొత్తగా ఏర్పాటు చేసిన కంపెనీల ఉమ్మడి మార్కెట్(Market) విలువ 14–487% స్థాయిలో ఎగబాకడం విశేషం. ఎడెల్వీజ్ ఫైనాన్షియల్ సర్వీసెస్ 2023 జూన్‌లో తన వెల్త్ బిజినెస్‌ను వేరు చేసి నువామా వెల్త్ మేనేజ్మెంట్ పేరుతో కొత్త కంపెనీని నెలకొల్పొంది. అప్పటి నుంచి ఈ రెండు సంస్థలూ బుల్లెట్లా దూసుకెళ్లాయి. ఉమ్మడి మార్కెట్ విలువ రూ.6,281 కోట్ల నుంచి తాజాగా రూ.36,900 కోట్లకు ఎగసింది. ఏకంగా 487 శాతం వృద్ధి చెందింది. నువామా గతేడాది సెపె్టంబర్లో లిస్టయింది. దీంతోపాటు షిప్పింగ్ కార్పొరేషన్, టీవీఎస్ హోల్డింగ్స్, ఎన్ఐఐటీ, జీహెచ్‌సీఎల్, ఫోర్బ్స్–కంపెనీ... ఈ సంస్థలు విభజన తర్వాత మార్కెట్ విలువను 50 శాతం పైగానే పెంచుకున్నాయి. రిలయన్స్ నుంచి జియో ఫైనాన్షియల్ విభజన తర్వాత ఇరు కంపెనీల మార్కెట్ విలువ ఒక దశలో 25 శాతం పైగా ఎగసింది.మెరుగైన నిర్వహణ...అధిక వృద్ధికి అవకాశం గల వ్యాపారాలను మాతృ సంస్థల నుంచి విడదీయడం వల్ల ఇన్వెస్టర్లకు కూడా మరింత విలువ చేకూరుతోంది. ‘విడదీసిన సంస్థల వ్యాపారాలు పుంజుకోవడం, స్వతంత్ర నిర్వహణ వల్ల ఆయా బిజినెస్‌లపై మరింత ఫోకస్ పెట్టేందుకు వీలవుతుంది. తగినంత నిధుల కేటాయింపు, పరిశ్రమ ట్రెండ్స్‌తో మెరుగ్గా అనుసంధానం కావడంతో భారీగా వృద్ధి చెందే అవకాశం ఉంటుంది’ అని అవెండస్ క్యాపిటల్‌లో ఈక్విటీ క్యాపిటల్ మార్కెట్స్ హెడ్ గౌరవ్ సూద్ పేర్కొన్నారు. దీనికి ప్రభుత్వ రంగ షిప్పింగ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా చక్కని ఉదాహరణ. ఈ కంపెనీకి చెందిన నాన్–కోర్ బిజినెస్‌లు, రియల్ ఎస్టేట్ ఆస్తులను విడదీసి ఎస్సీఐ ల్యాండ్ అండ్ అసెట్స్ అనే సంస్థను ఏర్పాటు చేసింది. గతేడాది మార్చిలో ఇది లిస్టయింది. ఈ రెండు కంపెనీల ఉమ్మడి మార్కెట్ విలువ రూ.4,379 కోట్ల నుంచి రూ.12,829 కోట్లకు దూసుకెళ్లింది. అంటే 192% జంప్ చేసింది. ఇక టీవీఎస్(TVS) హోల్డింగ్స్ నుంచి సుందరమ్ క్లేటాన్ విభజన, దీన్ని ప్రత్యేక కంపెనీగా లిస్ట్ చేయడం వల్ల ఈ రెండింటి మార్కెట్ విలువ ప్రస్తుతం 136 శాతం ఎగబాకింది.ఇదీ చదవండి: క్రెడిట్ కార్డు Vs ఛార్జ్ కార్డు.. ఏంటీ ఛార్జ్ కార్డు..క్యూలో మరిన్ని కంపెనీలు...ఐటీసీ, వేదాంత, హెచ్ఈజీ, అరవింద్, క్వెస్ కార్ప్ వంటి డజనకు పైగా కంపెనీలు ఇప్పటికే డీమెర్జర్లను ప్రకటించాయి. మరో 12–18 నెలల్లో ఈ ప్రక్రియ పూర్తయ్యి.. వేరు చేసిన కంపెనీలు లిస్టవుతాయి. దీంతో అటు ఇన్వెస్టర్లతో పాటు ఇటు ఆయా కంపెనీలకూ మరింత విలువ దక్కనుంది. ఐటీసీ హోటల్ వ్యాపారాన్ని విడదీస్తున్నట్లు గతేడాది ఆగస్ట్‌లో ప్రకటించడం తెలిపిందే. వాటాదారులకు ప్రతి 10 ఐటీసీ షేర్లకు 1 ఐటీసీ హోటల్స్ షేర్లు దక్కుతాయి. దీనికి రికార్డ్ తేదీ జనవరి 6 కాగా త్వరలో లిస్టింగ్ జరగనుంది. వేదాంత సైతం 5 కీలక వ్యాపారాలను (అల్యూమినియం, ఆయిల్–గ్యాస్ విద్యుత్, స్టీల్, ఫెర్రస్ మెటీరియల్స్) వేర్వేరు కంపెనీలుగా విడదీయనున్నట్లు 2023 సెప్టెంబర్‌లో తెలిపింది. కొత్తగా ఏర్పాటు చేసిన వ్యాపారాలు, జింక్ మాత్రం వేదాంత కింద ఉంటాయి. ఇక టాటా మోటార్స్ కూడా తన వాణిజ్య వాహన విభాగాన్ని విడదీసి ప్రత్యేక కంపెనీగా లిస్ట్ చేయనుంది. ప్యాసింజర్ వాహన విభాగం ఇప్పుడున్న లిస్టెడ్ కంపెనీ పేరుతోనే కొనసాగనుంది. -
లేటు వయసులో విడిపోతున్న జంటలు
భారతీయ సంప్రదాయం ప్రకారం పెళ్లంటే నూరేళ్ల పంట. అందుకే దంపతుల మధ్య అభిప్రాయభేదాలు, పొరపొచ్చాలు వచ్చినా సర్దుకుపొమ్మనే సలహా ఇస్తారు. చాలా జంటలు అలాగే సర్దుకుపోతుంటాయి. అలా కుదరని వాళ్లు విడాకులు తీసుకుని విడిపోతుంటారు. ఇది అందరికీ తెలిసిన విషయమే. కానీ, పరిస్థితులు మారాయి, మారుతున్నాయి. పాతికేళ్లు అన్యోన్యంగా కాపురం చేసినవాళ్లు, 50 ఏళ్ల తర్వాత విడాకులు తీసుకోవడమనేది ఇటీవల కనిపిస్తున్న ట్రెండ్. దీన్నే ‘గ్రే డివోర్స్’ అంటున్నారు. తాజాగా ఏఆర్ రెహమాన్–సైరాబాను విడాకులు గ్రే డివోర్స్‌పై విస్తృతమైన చర్చను రేకెత్తించాయి. అసలెందుకిలా జరుగుతోంది? లేటు వయసులో విడాకులు తీసుకోవాల్సిన అవసరం ఎందుకొస్తోంది? భారతీయ వైవాహిక వ్యవస్థ బీటలు వారుతోందా? ఈ ప్రశ్నలకు సమాధానం అన్వేషిద్దాం. గ్రే డివోర్స్ ఎందుకు జరుగుతాయి?సమాజంలో మారుతున్న విలువలు, పెరుగుతున్న జీవితకాలం, వ్యక్తిగత సంతోషానికి పెరుగుతున్న ప్రాధాన్యం దీనికి ప్రధాన కారణాలుగా చెప్పవచ్చు. 1. వ్యక్తిగత ఎదుగుదలలో అసంతృప్తికొంతమంది చిన్న వయసులో వివాహం చేసుకుంటారు. ఆ తర్వాత వ్యక్తిగత ఆశయాలకంటే సామాజిక బాధ్యతలకే ప్రాధాన్యం ఇస్తారు. కాలక్రమంలో, ఒకరు లేదా ఇద్దరూ తమ వ్యక్తిగత అభివృద్ధి కోసం ప్రయత్నిస్తారు. దానికి భాగస్వామిని అడ్డంకిగా భావించినప్పుడు విడాకులకు వెళ్తున్నారు. 2. ఎమ్టీ నెస్ట్ సిండ్రోమ్పిల్లలు పెద్దవారై ఇళ్ల నుంచి వెళ్లిపోయిన తర్వాత, దంపతుల బాధ్యతలు తగ్గుతాయి. అప్పటివరకు పిల్లల కోసం అడ్జస్ట్ అయినవారు స్వేచ్ఛ వచ్చినట్లుగా భావిస్తారు. భాగ స్వామితో గతంలో పరిష్కరిం చుకోని సమస్యలు పెరుగుతాయి. దాంతో వారిద్దరి మధ్య ఉన్న బంధం బలహీనపడి విడాకులకు దారితీస్తుంది. 3. ప్రేమ, సహవాసంపై మారుతున్న అభిప్రాయాలుప్రేమ, పెళ్లి, సహజీవనంపై కాలంతో పాటు అభిప్రాయాలు మారుతున్నాయి. పెళ్లంటే నూరేళ్ల పంట అనే భావన మాయమై, కలిసి ఉన్నన్నాళ్లు సంతోషంగా జీవించాలనే అభిప్రాయం పెరుగుతోంది. ఆధునిక వైద్యంతో జీవనకాలం పెరగడంతో ఏభైల తర్వాత కూడా నచ్చినవారితో జీవితం గడపాలనే భావన పెరుగుతోంది. 4. ఆర్థిక స్వాతంత్య్రంగతంలో భర్త పనిచేస్తుంటే భార్య ఇంటిపనులు చూసుకునేది. కానీ ఇప్పుడు మహిళలు ఆర్థికంగా స్వతంత్రులవుతున్నారు. దీంతో బాధాకరమైన సంబంధాలను ఏమాత్రం సహించడంలేదు. గృహహింసను భరించేకంటే వైవాహిక బంధం నుంచి బయటపడటమే మంచిదని భావిస్తున్నారు. 5. విడాకులపై సామాజిక స్వీకారంఒకప్పుడు విడాకుల పట్ల ఉన్న వ్యతిరేకత ఇప్పుడు మారిపోయింది. సెలబ్రిటీలు గ్రే డివోర్స్ తీసుకోవడం ఇతరులకు మార్గదర్శకం అవుతోంది. దాంతో సామాన్యులు కూడా గ్రే డివోర్స్ గురించి ఆలోచిస్తున్నారు. గ్రే డివోర్స్‌తో సమస్యలు.. గ్రే డివోర్స్.. విముక్తి కలిగిస్తున్నట్టు అనిపించినా, వాటి వెనుక కొన్ని సమస్యలు కూడా ఉన్నాయి. ⇒ అస్తిత్వ సంక్షోభం: అనేక సంవత్సరాలపాటు ఒక భాగస్వామిగా ఉన్న తర్వాత, ఒంటరిగా జీవించడం ఒక పెద్ద మార్పు. ‘నా జీవితంలో భాగస్వామి లేకుండా నేను ఎవరు?’ అనే ప్రశ్నలతో బాధపడతారు.⇒ ఒంటరితనం: జీవితం చివరిలో ఏకాకిగా ఉండటం ఒంటరితనాన్ని మరింత పెంచుతుంది.⇒ కుటుంబ సంబంధాలు: పెద్దయిన పిల్లలు తమ తల్లిదండ్రుల నిర్ణయాన్ని అంగీకరించలేకపోవచ్చు. కొన్నిసార్లు వారు తల్లిదండ్రులపై కోపంగా ఉండవచ్చు. ·గ్రే డివోర్స్ను తప్పించేందుకు సూచనలు1. ఏ బంధానికైనా సంభాషణ ముఖ్యం. అందుకే మీ భావాలు, అంచనాలు, ఆందోళనల గురించి భాగస్వామితో క్రమం తప్పకుండా చర్చించండి.2. వయసుతో పాటు భావోద్వేగ అవసరాలు కూడా మారుతాయి. ఆలోచనలు, కలలు, భయాలను పంచుకునే సమయాన్ని కేటాయించి బంధాన్ని బలోపేతం చేసుకోండి. 3. మీ ఇద్దరికీ ఇష్టమైన కార్యకలాపాలు లేదా అభిరుచులను గుర్తించి, వాటిని తిరిగి ప్రారంభించండి. 4. చేతులు పట్టుకోవడం, ఆలింగనం చేయడం వంటి స్పర్శతో ప్రేమను గుర్తు చేస్తూ ఉండండి. 5. వ్యక్తిగత అభిరుచులకు ప్రోత్సాహం ఇవ్వడం, కలిసి ఎదగడం ద్వారా సంబంధాన్ని సజీవంగా ఉంచండి. 6. నిందించడం తగ్గించి, శ్రద్ధగా వినండి. ఇద్దరి అవసరాలను గౌరవించే పరిష్కారాలను కనుక్కోండి. 7. మీ భాగస్వామి చేసిన కృషిని గుర్తించడం, థాంక్స్ చెప్పడం వంటి చిన్న పనులు బంధాన్ని బలపరుస్తాయి. 8. సమస్యలను పరిష్కరించడానికి, సంభాషణను మెరుగుపరచడానికి, బంధాన్ని బలపరచడానికి కౌన్సెలింగ్ కూడా సహాయపడుతుంది. -
జుట్టు వేగంగా పెరగాలంటే చివర్లు కట్ చేస్తే సరిపోతుందా?
జుట్టును సంరక్షించుకోవడం ఒక సమస్య. ఉన్న జుట్టును మరింత ఆరోగ్యంగా, వేగంగా పెంచుకోవడం మరో సమస్య. ఇందుకు హెయిర్ ప్యాక్ వేసుకోవడం, చుండ్రులేకుండా జాగ్రత్త పడటంతోపాటు, జుట్టు చివర్ల (స్ప్లిట్ ఎండ్స్)ను కట్ చేయడం లాంటివి చేయడం చాలా మంది పాటించే పద్ధతి. అయితే ఇలా చేయడం వల్ల నిజంగా జుట్టు పెరుగుతుందా? అసలు దీని వలన ఎలాంటి ప్రయోజనం ఉంటుందో తెలుసుకుందాం.నిజానికి జుట్టు చివర్లు కత్తిరించడం వల్ల అది వేగంగా పెరుగుతుందనే వాదనకు ఎలాంటి ఆధారం లేదు. ఎందుకంటు జుట్టు పెరుగుదల స్కాల్ప్ నుంచి మొదలవుతుంది. కుదుళ్లు బలంగా ఉంటే జుట్టు బలంగా ఉంటుంది. కాబట్టి చనిపోయిన చివర్లను కత్తిరించడం వల్ల అది వేగంగా పెరగదు. కానీ జుట్టు ఆరోగ్యంగా పెరిగేలా చేస్తుంది. స్ప్లిట్ చివర్లు , డ్యామేజ్ అయిన జుట్టును కత్తిరించడం వల్ల, క్రమం తప్పకుండా ట్రిమ్ చేయడం వల్ల జుట్టు, ఆరోగ్యంగా, ఒత్తుగా కనిపిస్తుంది.ఎన్ని రోజులకోసారి కట్ చేయాలి?సాధారణంగా ప్రతి 2-3 నెలలకు ఒకసారి అంగుళం మేర కత్తిరించుకోవాలి. ఎంత మేర ట్రిమ్ చేయాలి. ఎన్నిరోజులకు ఒకసారి చేయాలి అనేది ఇది జుట్టు పొడవు, చుండ్రు, జుట్టు చిట్లిపోవడం లాంటి సమస్య బట్టి ఉంటుంది. చాలా మందికి రోజుకు 50-100 వెంట్రుకలు రాలిపోతాయి. అయితే ఈ వెంట్రుకల స్థానంలో కొత్త వెంట్రుకలు వస్తాయి కాబట్టి పెద్దగా ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. ఊడిపోయిన వాటి స్థానంలో కొత్త జుట్టు రావాలంటే సరైన పోషణ అవసరం.జుట్టుకూ ఉండాలి పోషణఅందమైన మెరిసే జుట్టు కావాలంటే పోషణ అవసరం. వారానికి ఒకసారి అయినా కుదుళ్లకు తాకేలా నూనెతో మర్దనా ఉండాలి. తద్వారా హెయిర్ ఫోలికల్స్‌కి రక్త ప్రవాహం సక్రమంగా జరుగుతుంది. జుట్టు వేగంగా పెరుగుతుంది. రసాయన రహిత షాంపూలు, కండీషనర్లకు దూరంగా ఉండాలి. బ్లో డ్రైయింగ్ చేయడం, స్ట్రెటియినింగ్ చేయడం, కర్లింగ్ చేయడం లాంటివి తరచుగా చేయకుండా ఉండాలి. ఇవి జుట్టు సహజ మెరుపును, అందాన్ని పాడుచేస్తాయి. నాణ్యమైన హెయిర్ ప్రొడక్ట్స్ మాత్రమే వాడాలి. జుట్టు ఆరోగ్యం కోసం ఆహారం ఆరోగ్యకరమైన జుట్టు కోసం విటమిన్ ఈ చాలా కీలకం. ఇది బొప్పాయి, బాదం, హాజెల్ నట్స్, అవకాడోస్, దోసకాయ బచ్చలికూర వంటి అనేక పండ్లు , కూరగాయలలో సహజంగా లభిస్తుంది. సన్‌ఫ్లవర్ ఆయిల్ వంటి నూనెలు, సాల్మన్ ట్యూనాతో సహా అనేక రకాల చేపలు విటమిన్ ఇ-రిచ్ ఫుడ్స్. ప్రొటీన్ తగ్గడం వల్ల కూడా జుట్టు రాలే సమస్య వస్తుంది. జింక్, సెలేనియం, బయోటిన్ లభించే గుడ్లు తీసుకోవాలి. విటమిన్ ఏ, విటమిన్ సీ, ఐరన్ ,ఫోలేట్లు పుష్కలంగా ఉండే పాలకూరను ఆహారంలో భాగం చేసుకోవాలి. అలాగే ఐరన్ లోపం లేకుండా చేసుకోవాలి. అమెరికన్ అకాడమీ ఆఫ్ డెర్మటాలజీ ప్రకారం జిడ్డుగా ఉంటే జుట్టును తరచుగా శుభ్రం చేసుకోవాలి. క్లోరిన్ హానికరమైన ప్రభావాలకు దూరంగా ఉండాలి. ఈత కొట్టే స్యంలో జుట్టును కప్పుకోవాలి. ఇంటినుంచి బయటికి వెళ్లినపుడు కాలుష్యం యూవీ కిరణాలనుంచి కాపాడుకునేందుకు స్కార్ఫ్ కట్టుకోవడం, గొడుగు వాడటం ఉత్తమం. -
అందుకే విడిపోతున్నాం.. జీవీ ప్రకాష్-సైంధవిల ప్రకటన
సినీ ఇండస్ట్రీలో మరో జంట విడాకులు ప్రకటించింది. తమిళ సంగీత దర్శకుడు, నటుడు జీవీ ప్రకాష్ షాకింగ్ ప్రకటన చేశారు. తన భార్య.. సింగర్ సైంధవితో విడిపోతున్నట్లు సోషల్ మీడియా వేదికగా ప్రకటించారు. మరోవైపు సైంధవి కూడా తనవైపు నుంచి అధికారికంగా ప్రకటించారు.ఈ ఇద్దరూ విడిపోతున్నట్లు ఈ మధ్య కోలీవుడ్‌లో ప్రచారం జరిగింది. అయితే.. ఆ కథనాల్ని ధృవీకరిస్తూ.. 11 ఏళ్ల వైవాహిక బంధానికి వీడ్కోలు పలుకుతున్నట్లు పేర్కొన్నారు. ఈ మేరకు ఇద్దరూ సోషల్ మీడియాలో పోస్టు చేశారు. దీంతో వీళ్ల అభిమానులు విస్మయానికి గురి అయ్యారు. సైంధవి జీవీ ప్రకాష్‌కు బాల్య మిత్రురాలు. ఇద్దరూ 12 ఏళ్ల పాటు ప్రేమాయణం సాగించారు. 2013లో వీళ్లిద్దరూ వివాహం చేసుకోగా.. ఈ జంటకు ఓ పాప ఉంది.‘‘చాలా ఆలోచించిన తర్వాత ‘సైంధవి, నేను 11 ఏళ్ల వైవాహిక బంధానికి వీడ్కోలు చెప్పాలని నిర్ణయించుకున్నాం. మానసిక ప్రశాంతత, ఇద్దరి జీవితాల్లో మెరుగుకోసం ఒకరికొకరం పరస్పర గౌరవంతో ఈ నిర్ణయం తీసుకున్నాం. ఇలాంటి కీలక తరుణంలో మా గోప్యతకు భంగం కలిగించకుండా ఉండేందుకు మీడియా, స్నేహితులు, అభిమానులు మా నిర్ణయాన్ని అర్థం చేసుకోవాలని కోరుకుంటున్నాం. ఇక నుంచి మేము వేరవుతున్నట్లు అంగీకరిస్తున్నాం. ఈ నిర్ణయం ఇద్దరికీ ఉత్తమమని నమ్ముతున్నాం. ఈ క్లిష్ట సమయంలో మీ అవగాహన, మద్దతు చాలా అవసరం’’ అని జీవీ ప్రకాశ్ మీడియాను కోరారు. pic.twitter.com/73IbnNZfEf— G.V.Prakash Kumar (@gvprakash) May 13, 2024 pic.twitter.com/M6GDxgAFqn— Saindhavi (@singersaindhavi) May 13, 2024 మ్యూజిక్ దిగ్గజం ఏఆర్ రెహమాన్ మేనల్లుడు అయిన జీవీ ప్రకాష్.. కోలీవుడ్‌లో స్టార్ మ్యూజిక్ డైరెక్టర్‌గానే కాకుండా ఇప్పటిదాకా హీరోగానూ డజనుకు పైగా చిత్రాలతో అక్కడి ఆడియొన్స్‌ను అలరించారు. తెలుగులోనూ పలు చిత్రాలకు ఆయన మ్యూజిక్ అందించారు. ఇక 12వ ఏట టీవీ షో ద్వారా సింగర్‌గా గుర్తింపు దక్కించుకున్న సైంధవి.. విక్రమ్ అన్నియన్(అపరిచితుడు) చిత్రంతో సినీ కెరీర్ ప్రారంభించారు. తమిళ్, తెలుగు చిత్రాల ద్వారా ఆమె అలరిస్తూ వస్తున్నారు. -
నిట్టనిలువునా చీలిపోతున్న 127 ఏళ్ల కంపెనీ
గోద్రెజ్.. దేశంలో ఈ కంపెనీ పేరు విననివారు ఎవరూ ఉండరు. సబ్బులు, గృహోపకరణాల నుంచి రియల్ ఎస్టేట్ వరకు విస్తరించిన ఈ 127 ఏళ్ల కంపెనీ ఇప్పుడు నిట్టనిలువునా చీలిపోతోంది. గోద్రెజ్ గ్రూప్ వ్యవస్థాపక కుటుంబం తమ వ్యాపార సమ్మేళనాన్ని విభజించి పంచుకుంటోంది.ఆది గోద్రెజ్, అతని సోదరుడు నాదిర్ ఐదు లిస్టెడ్ కంపెనీలు ఉన్న గోద్రెజ్ ఇండస్ట్రీస్‌ను, జంషీద్, స్మిత అన్‌లిస్టెడ్ గోద్రెజ్, బోయ్స్, దాని అనుబంధ సంస్థలు అలాగే ముంబైలోని అత్యంత విలువైన ఆస్తులను, భూములను తీసుకునేందుకు అంగీకారం కుదిరింది.గోద్రెజ్ గ్రూప్ ప్రకటన ప్రకారం.. వ్యవస్థాపక కుటుంబంలోని ఆది గోద్రెజ్, ఆయన సోదరుడు నాదిర్ ఒక వైపుగా, వారి దాయాదులు జంషీద్ గోద్రెజ్, స్మితా గోద్రెజ్ కృష్ణ మరోవైపుగా రెండు శాఖల మధ్య వ్యాపారం సమూహం విడిపోతోంది.ఏరోస్పేస్, ఏవియేషన్‌లో రక్షణ, ఫర్నిచర్, ఐటీ సాఫ్ట్వేర్లలో విస్తరించిన గోద్రెజ్ & బోయ్స్, దాని అనుబంధ సంస్థలను కలిగి ఉన్న గోద్రెజ్ ఎంటర్ప్రైజెస్ గ్రూప్‌నకు జంషీద్ గోద్రెజ్ చైర్పర్సన్, మేనేజింగ్ డైరెక్టర్‌గా వ్యవహరిస్తారు. ఆయన సోదరి స్మిత కుమార్తె నైరికా హోల్కర్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్‌గా ఉంటారు. ముంబైలోని 3,400 ఎకరాల ప్రైమ్ ల్యాండ్‌తో సహా ల్యాండ్ బ్యాంక్‌ను కలిగి ఉండే ఈ విభాగాన్ని వీరి కుటుంబాలు నియంత్రిస్తాయి.ఇక గోద్రెజ్ ఇండస్ట్రీస్, గోద్రెజ్ కన్స్యూమర్ ప్రోడక్ట్స్, గోద్రెజ్ ప్రాపర్టీస్, గోద్రెజ్ అగ్రోవెట్, అస్టెక్ లైఫ్ సైన్సెస్ వంటి లిస్టెడ్ కంపెనీలను కలిగి ఉన్న గోద్రెజ్ ఇండస్ట్రీస్ గ్రూప్‌నకు నాదిర్ గోద్రెజ్ చైర్‌పర్సన్‌గా ఉంటారు. ఆది, నాదిర్, వారి కుటుంబ సభ్యుల నియంత్రణలో ఉంటుంది. ఆది కుమారుడు పిరోజ్షా గోద్రెజ్ గ్రూప్ ఎగ్జిక్యూటివ్ వైస్ చైర్‌పర్సన్‌గా ఉంటారని, 2026 ఆగస్టులో నాదిర్ ఛైర్‌పర్సన్‌గా బాధ్యతలు తీసుకుంటారని ప్రకటన తెలిపింది. ఈ విభజనను "యాజమాన్య పునర్వ్యవస్థీకరణ"గా గోద్రెజ్ కుటుంబం పేర్కొంది.లాయర్ నుంచి వ్యాపారవేత్తగా మారిన అర్దేషిర్ గోద్రెజ్, అతని సోదరుడు 1897లో గోద్రెజ్ కంపెనీని స్థాపించారు. అర్దేషీర్‌కు సంతానం లేకపోవడంతో ఆయన తమ్ముడు పిరోజ్షా సంతానానికి కంపెనీ వారసత్వంగా వచ్చింది. పిరోజ్షాకు నలుగురు పిల్లలు ఉన్నారు. వీరు సోహ్రాబ్, దోసా, బుర్జోర్, నావల్. సంవత్సరాలు గడిచిన తర్వాత గ్రూప్ అధికారం బుర్జోర్ సంతానం (ఆది, నాదిర్), నావల్ పిల్లలు (జంషీద్, స్మిత) వద్దకు వచ్చింది. మరోవైపు సోహ్రాబ్‌కు సంతానం లేదు. దోసాకు రిషద్ అని ఒకేఒకరు సంతానం ఉండగా ఈయనకు కూడా పిల్లలు లేరు. -
ఇద్దరు భార్యల ముద్దుల భర్త.. చెరో పదిహేను రోజులు..
భోపాల్:వివాహం అనేది మనిషి జీవితంలో ఎంతో ప్రత్యేకమైనది. సంతోషాలతో పాటు కష్టాలను కూడా తెచ్చిపెడుతుంది. దంపతుల మధ్య విభేదాలు రావడం, పరిష్కరించుకోవడం నిత్యం జరిగేపనే. అయితే.. మధ్యప్రదేశ్‌లోని ఉజ్జెయినిలో ఓ వ్యక్తికి కూడా వివాహ జీవితంలో ఓ క్లిష్టపరిస్థితి ఎదురైంది. మరి ఆ చిక్కుముడిని పరిష్కరించుకున్న తీరు చూస్తే ఆశ్చర్యపోతారు..! మొదటి భార్య ఉండగానే రెండో వివాహం చేసుకున్నాడో వ్యక్తి. రెండో పెళ్లి చేసుకున్నప్పటికీ మొదటి భార్యతో కలిసి జీవించడానికి ఆసక్తితో ఉన్నాడు. రెండు పెళ్లి చేసుకున్నప్పటికీ భర్తను విడిచి పెట్టడానికి మొదటి భార్య అంగీకరించలేదు. తన భర్తతోనే ఉంటానని కోరింది. కానీ ఈ విషయం రెండో భార్యకు నచ్చలేదు. మొదటి భార్యను పదిహేను ఏళ్ల క్రితం వివాహం చేసుకున్నాడు. వారి మధ్య నిరంతరం గొడవలు జరుగుతుండటంతో ఆమె ఉండగానే భర్త రెండో పెళ్లి చేసుకున్నాడు. రెండో పెళ్లి చేసుకున్న తర్వాత తన భర్తను విడిపోవడానికి మొదటి భార్య ఒప్పుకోలేదు. కానీ రెండో భార్య ఇందుకు ఇష్టపడలేదు. దీంతో ఆమె న్యాయపరమైన మార్గాన్ని అనుసరించింది. కేసు నమోదు చేయడంతో ఈ గొడవ పరామర్శ కేంద్రాన్ని చేరింది. వీరికి సమస్యకు ఏం పరిష్కారం ఇవ్వాలో తెలియక అధికారులు తికమకపడ్డారు. ఇక నెలరోజులను చెరో పదిహేను చొప్పున పంపకాలకు అందరూ అంగీకరించడంతో వివాదం ముగిసింది. మరి ఈ రకమైన జీవిత విధానానికి మీరేమంటారు...? ఇదీ చదవండి: తరగతి గదిలోకి చొరబడి.. విద్యార్థుల సాక్షిగా భార్యకు తీన్ తలాక్! -
Hair Care: ముఖం జిడ్డుకారుతుందని పదేపదే షాంపుతో తలస్నానం చేస్తే!
సరైన పోషణ, తగినంత శ్రద్ధ లేకపోతే జుట్టు పొడిబారి ఎండుగడ్డిలా బరకగా మారడమేగాక, చివర్లు చిట్లిపోయి మరింత నిర్జీవంగా కనిపిస్తుంటుంది. ఇలా కనిపించగానే వెంటనే చిట్లిన వెంట్రుకలను కత్తెరతో కత్తిరించేస్తుంటారు. చివర్లు తీసేసినప్పటికీ కొద్దిరోజుల్లో సమస్య మొదటికే వస్తుంది. చీటికి మాటికి జుట్టు కత్తిరించే ముందు ఈ చిట్కాలను పాటించి చూడండి జుట్టు పొడిబారడం, చిట్లడం కూడా తగ్గుతుంది. ఇలా చేయండి.. ►పదేపదే వెంట్రుకలు చిట్లిపోతుంటే గోరు వెచ్చని నూనెతో కుదుళ్ల నుంచి చివర్ల వరకు మర్దన చేయాలి. ►వారానికి కనీసం రెండు సార్లు మర్దన తప్పనిసరిగా చేయాలి. ►జుట్టుని ఆరబెట్టడానికి, స్ట్రెయిటనింగ్, రింగులుగా మార్చుకోవడానికి హెయిర్ డ్రయ్యర్‌ను తరచూ వినియోగించకూడదు. ►పదేపదే హెయిర్ డ్రయ్యర్ వాడడం వల్ల జుట్టు పొడిబారిపోయి, చిట్లిపోతుంది. తరచూ షాంపుతో తలస్నానం వద్దు! ►ముఖం జిడ్డుకారుతుందని పదేపదే షాంపుతో తలస్నానం చేస్తే.. మాడు నుంచి సహజసిద్ధంగా విడుదలయ్యే తైలాలు క్రమంగా తగ్గుముఖం పడతాయి. ►ఈ తైలాల విడుదల తగ్గితే వెంట్రుకలు పొడిబారి, చిట్లిపోతాయి. ►ఎప్పుడు తలస్నానం చేయాలనుకున్నా ముందుగా తలకు నూనె పట్టించి అరగంట తరువాతే తలస్నానం చేయాలి. గోరువెచ్చని నీటితోనే! ►మరీ ఎక్కువ వేడి... లేదా మరీ చల్లగా ఉన్న నీళ్లు కాకుండా గోరువెచ్చని నీటితోనే తలస్నానం చేయాలి. ►తలస్నానం చేసిన తరువాతే హెయిర్ కండీషనర్ రాసుకోవాలి. ►అప్పుడే వెంట్రుకలకు మంచి పోషణ అంది మెరుపుని సంతరించుకుంటాయి. ►కండీషనర్‌ను చివర్లకు పట్టించడం ద్వారా జుట్టుకు మంచి పోషణ అందుతుంది. చదవండి: Hair Care Tips: ఉల్లి రసాన్ని కొబ్బరి నూనెతో కలిపి జుట్టుకు పట్టిస్తే! Beauty Tips: బీట్రూట్ అలోవెరా జెల్‌తో ముఖం మీది మచ్చలు మాయం! అయితే.. -
యుద్ధానికి సై అంటున్న చైనా!... అమెరికాకు వార్నింగ్
Taiwan is China's Taiwan: తైవాన్ స్వయం పాలన, ప్రజాస్వామ్య దేశం. ఐతే చైనా ఈ తైవాన్‌ని తన భూభాగంగా భావించడమే కాకుండా ఏదో ఒక రోజు స్వాధీనం చేసుకుంటానని ప్రతిజ్ఞ చేసింది కూడా. ఈ మేరకు సింగపూర్‌లో జరిగిన మూఖముఖి సమావేశంలోయూఎస్ రక్షణాధికారి లాస్టిన్తో చైనా రక్షణమంత్రి వీ ఫెంఘే చైనాను తైవాన్ నుంచి విడదీస్తే ఊరుకునేది లేదని వార్నింగ్ ఇచ్చారు. ఒకవేళ ఎవరైన విడదీయడానికి ధైర్యం చేస్తే ఖర్చుతో నిమిత్తం లేకుండా యుద్ధం ప్రారంభించడానికీ చైనా వెనుకాడదని హెచ్చరించారు. అంతేకాదు తైవాన్ స్వాతంత్ర్యం కావాలని ప్రకటిస్తే బీజింగ్ తప్పక యుద్ధం ప్రారంభించడానికి వెనుకాడదు అని కూడా తేల్చి చెప్పారు. తైవాన్ చైనాకి సంబంధించినదేనని నొక్కి చెప్పారు. చైనాను నియంత్రించడానికి తైవాన్‌ని ఉపయోగించుకోవాలని చూడొద్దంటూ అమెరికాకు గట్టి వార్నింగ్ ఇచ్చారు. ఐతే ఆ సమావేశంలో అమెరికా రక్షణాధికారి ఆస్టిన్ తైవాన్‌ని ఇబ్బంది పెట్టే చర్యలకు చైనా చాలా దూరంగా ఉండాలంటూ ఆ దేశ రక్షణ మంత్రికి గట్టి కౌంటరిచ్చారు. (చదవండి: మరణ శిక్ష రద్దు చేసేందుకు సమ్మతించిన ప్రభుత్వం!) -
వైరల్ వీడియో.. ఒకేసారి రెండింటిని రుచి చూడగలదు..
కొంతమంది ఏదైనా తిని లేదా తాగి తటపటాయించకుండా దాని రుచి ఎలా ఉందో ఠక్కున చెప్పేస్తారు. అయితే, ఒకసారి ఒకదాన్నే రుచి చూసి చెప్పగలరు. అదేంటి ఎవరైనా ఒకసారి ఒకదాన్నే రుచి చూడగలరు అంటారా? కానీ బ్రియన్నా మేరీ షిహాడే మాత్రం ఒకేసారి రెండింటిని రుచి చూడగలదు. ఆమె నాలుక అలాంటిది మరి! అమెరికాలోని కాలిఫోర్నియాకు చెందిన షిహాడేకు బాడీ మోడిఫికేషన్.. అదేనండి శరీరంలో మార్పులు చేసుకోవడమంటే మహా సరదా. సర్జరీ ద్వారా ఆమె తన నాలుకను రెండుగా స్ప్లిట్ చేయించుకుంది. ఇటీవల ఆమె ఒక గ్లాస్లో స్ప్రైట్ కూల్‌డ్రింక్, మరోగ్లాస్లో మంచినీళ్లు పెట్టుకుని రెండింటిని ఒకేసారి తాగి తన స్ప్లిట్ నాలుకతో రెండింటి రుచులు చెప్పేసింది. దీనికి సంబంధించిన వీడియోను సోషల్ మీడియాలో పెట్టగా పిచ్చపిచ్చగా లైక్స్ వచ్చాయి. ఆమెకు ఇన్‌స్టాగ్రామ్‌లో 2,28,000 మంది ఫాలోయర్లు ఉన్నారు. అయితే, ఈ స్ప్లిట్ టంగ్ అనేది చాలా ప్రమాదకరమని వైద్యులు అంటున్నారు. చదవండి: చేనులో చేపలే పంట! View this post on Instagram A post shared by 🌼Flower🌼 (@flower.friendly) -
ష్యాషన్ కోసం నాలుకను రెండుగా విడగొట్టింది...ఆ తర్వాత
Woman With Split Tongue Tastes 2 Drinks At: చాలామంది యువత ఫ్యాషన్ మాయలో పడి విచిత్రమైన విధంగా తమ శరీరం సౌష్టవాన్ని మార్చుకుంటుంటారు. అంతేందుకు కొంతమంది మగవాళ్లు చెవులకు రింగులు పెట్టుకోవడాలు, టాటులు వేయించుకోవడం వంటి విచిత్రమైన పనులు చేస్తుంటారు. ఆడవాళ్లు కూడా ఫ్యాషన్ విషయంలో తక్కువేం కాదనే చెప్పాలి. ఎందుకంటే వాళ్లు చెవులకు రింగులు కుట్టించుకుంటే వీళ్లు నాలుకకి, నోటికి రింగులు పెట్టుకుంటున్నారు. పైగా జుట్టుకు కూడా విచిత్రమైన రంగురంగుల డైలు వేసుకుని దెయ్యాన్ని తలపించేలా రెడీ అవుతున్నారు. ఇందంతా ఎందుకు చెబుతున్నానంటే ఇక్కడొక ఆమె ఫ్యాషన్ కోసమో లేక మరేందుకో గానీ నాలుకను రెండుగా విడగొట్టుకుంది. పైగా ఇప్పుడు తాను ఒకేసారి రెండు రకాల పదార్థాలను టేస్ట్ చేయగలనని మరీ చెబుతోంది. వివరాల్లోకెళ్తే.... కాలిఫోర్నియాలో నివసిస్తున్న బ్రియానా మేరీ షిహదేహ్ ఆమె తన శరీరాన్ని రకరకాలు మార్చుకోవడం ఆమెకు ఇష్టం. ఈ మక్కువతోనే తన నాలుకను శస్త్ర చికిత్స ద్వారా రెండుగా విడదీసింది. అంతేగాదు మీరెప్పుడైన రెండు రకాల ఆహార పదార్ధాలను ఒకేసారి టెస్ట్ చేయగలిగారా అని ఎదురు ప్రశ్నిస్తోంది. ఆమె రెండు రకాల ఆహార పదర్థాలను ఎలా టేస్ట్ చేయగలదో కూడా చూపించింది. అందుకు సంబంధించిన వీడియో నెట్టింట తెగ వైరల్ అవుతోంది. మీరు కూడా ఓ లుక్కేయండి. View this post on Instagram A post shared by 🌼Flower🌼 (@flower.friendly) (చదవండి: వెడ్డింగ్ రిసెప్షన్లో వధూవరుల 'ఫైర్ స్టంట్'.. షాకైన అతిథులు...) -
Marital Rape: మారిటల్ రేప్‌పై భిన్న తీర్పులిచ్చిన జడ్జిలు
భార్యతో బలవంతంగా శృంగారంలో పాల్గొనడాన్ని (మారిటల్ రేప్).. నేరంగా పరిగణించాలంటూ దాఖలైన పిటిషన్లపై ఢిల్లీ హైకోర్టు సంచలన తీర్పు వెలువడింది. ఇద్దరు న్యాయమూర్తుల బెంచ్ వేర్వేరు అభిప్రాయాలను వెలువరించడంతో గందరగోళం నెలకొంది. అంతేకాదు ఈ గందరగోళం నడుమ.. తాము ఇచ్చిన తీర్పుపై సుప్రీం కోర్టులో పిటిషన్ దాఖలు చేసుకునేందుకు పిటిషర్లకు అనుమతి ఇచ్చింది బెంచ్. న్యూఢిల్లీ: దేశం మొత్తం ఆసక్తిగా ఎదురు చూస్తున్న తీర్పు ఇవాళ రానే వచ్చింది. అయితే మారిటల్ రేప్ (వైవాహిక అత్యాచారం)పై ఢిల్లీ హైకోర్టు న్యాయమూర్తులు ఇవాళ భిన్న తీర్పులు వెలువరించారు. వైవాహిక జీవితంలో భార్యతో బలవంతపు శృంగారం నేరమే అవుతుందని ఇద్దరు న్యాయమూర్తులతో కూడిన ధర్మాసనానికి నేతృత్వం వహిస్తున్న జస్టిస్ రాజీవ్ షక్దేహర్ ఆదేశాలు ఇచ్చారు. అయితే బెంచ్‌లోని మరో న్యాయమూర్తి జస్టిస్ సీ హరిశంకర్ మాత్రం ఆ ఆదేశాలతో విభేధించారు. రాజ్యాంగంలోని ఆర్టికల్స్ 14, 19, 21లను సెక్షన్ 375(మినహాయింపు 2) ధిక్కరిస్తుందనడానికి ఎలాంటి మద్ధతు కనిపించడం లేదని, కాబట్టి, భార్యపై బలవంతపు శృంగారం నేరం కిందకు రాదని అన్నారు. ఈమేరకు జస్టిస్ రాజీవ్ ఇచ్చిన ఆదేశాలను అంగీకరించడం లేదంటూ పేర్కొన్నారు. దీంతో భిన్నాభిప్రాయాల తీర్పు వెలువడినట్లయ్యింది. బుధవారం ఈ మేరకు ఢిల్లీ హైకోర్టు మారిటల్ రేప్‌పై ఈ తరహా తీర్పు వెలువరించింది. ఐపీసీలోని అత్యాచార సెక్షన్-375(మినహాయింపు 2) నుంచి మారిటల్ రేప్‌నకు మినహాయింపు ఇవ్వడంపై అభ్యంతరాలతో ఢిల్లీ హైకోర్టులో పిటిషన్లు దాఖలు అయ్యాయి. ఏడేళ్ల కిందట(2015లో) ఈ వ్యవహారంపై మొదటి పిటిషన్ దాఖలుకాగా, ఆ తర్వాత మరికొన్ని దాఖలు అయ్యాయి. ఈ పిటిషన్లకు కౌంటర్‌గా.. పురుష హక్కుల సంఘాలు కౌంటర్ పిటిషన్లు దాఖలు చేశాయి. మారిటల్ రేప్‌ను నేరంగా పరిగణించకూడదనే ఆ పిటిషన్లో కోరాయి పురుష హక్కుల సంఘాలు. అయితే ఈ పిటిషన్లపై ఈ ఏడాది జనవరి నుంచి రోజూవారీ వాదనలు జరిగాయి. చివరికి.. తీర్పును ఫిబ్రవరి 21వ తేదీన రిజర్వ్‌లో ఉంచింది కోర్టు. గతంలో మారిటల్ రేప్‌ను నేరంగా పరిగణించలేమంటూ కేంద్రం పేర్కొనగా.. ఢిల్లీ హైకోర్టు నోటీసుల నేపథ్యంలో తమ ప్రకటనను పరిశీలిస్తామంటూ డబుల్ గేమ్ ఆడింది. మరోవైపు మారిటల్ రేప్ నేరం కాదంటూ సుప్రీం కోర్టు సైతం కొన్ని కేసుల్లో తీర్పు ఇచ్చింది. ఈ నేపథ్యంలో ఢిల్లీ హైకోర్టు తాజా తీర్పుపై.. పిటిషనర్లు సుప్రీంకు వెళ్లేందుకు మార్గం సుగమం కావడం గమనార్హం. చదవండి: సెక్స్ బానిసగా భార్య.. కూతురి ముందే అసహజ శృంగారం! -
టాటా స్టీల్ షేర్ల విభజన!
న్యూఢిల్లీ: ప్రయివేట్ రంగ మెటల్ దిగ్గజం టాటా స్టీల్ షేర్ల ముఖ విలువను విభజించనుంది. వచ్చే నెల(మే) 3న నిర్వహించనున్న బోర్డు సమావేశంలో షేర్ల విభజన అంశాన్ని బోర్డు పరిశీలించనున్నట్లు టాటా స్టీల్ పేర్కొంది. గతేడాది(2021–22) చివరి త్రైమాసిక(జనవరి–మార్చి) ఆర్థిక ఫలితాలపై నిర్వహించనున్న సమావేశంలో బోర్డు రూ. 10 ముఖ విలువగల షేర్ల విభజనపై నిర్ణయాన్ని తీసుకోనున్నట్లు వివరించింది. అంతేకాకుండా గత ఆర్థిక సంవత్సరానికి సంబంధించి వాటాదారులకు డివిడెండును సైతం ప్రకటించే వీలున్నట్లు తెలియజేసింది. ఈ వార్తల నేపథ్యంలో టాటా స్టీల్ షేరు ఎన్ఎస్ఈలో 1.6 శాతం బలపడి రూ. 1,340 వద్ద ముగిసింది. తొలుత ఒక దశలో రూ. 1,358 వరకూ ఎగసింది. -
న్యూడెమోక్రసీలో చీలిక.. ప్రజాపంథా పార్టీ ఆవిర్భావం
సాక్షి, హైదరాబాద్/ఇల్లెందు: సీపీఐ (ఎంఎల్) న్యూడెమోక్రసీలో చీలిక ఏర్పడింది. సీపీఐ (ఎంఎల్) ప్రజాపంథాగా కొత్త పార్టీ ఆవిర్భవించిం ది. మంగళవారం హైదరాబాద్‌లో జరిగిన పార్టీ ఆవిర్భావ సమావేశంలో పార్టీ రాష్ట్ర కార్యదర్శిగా డి.వి.కృష్ణ, సహాయ కార్యదర్శిగా పోటు రంగారావును ఎన్నుకున్నారు. కొత్త పార్టీలోకి మాజీ ఎమ్మె ల్యే గుమ్మడి నర్సయ్య కూడా వచ్చారు. ఈ సందర్భంగా డి.వి. కృష్ణ, పోటు రంగారావు ఓ ప్రకటన విడుదల చేశారు. సీపీఐ (ఎంఎల్) న్యూడెమోక్రసీ కేంద్ర కమిటీ అనుసరిస్తున్న కరుడుగట్టిన విధానాలకు వ్యతిరేకంగా తెలంగాణ రాష్ట్ర కమిటీ పోరాడుతూ వచ్చిందని చెప్పారు. ప్రజల నుంచి పార్టీని దూరం చేసే కాలం తీరిన అతివాద విధానాలను మార్చుకోవడాన్ని కేంద్ర కమిటీ మొండిగా తిరస్కరించిందన్నారు. పైగా రాష్ట్ర కమిటీకి పోటీ కమిటీలను ఏర్పాటు చేసి, రాష్ట్ర కమిటీని దాని నాయకత్వంలోని ఉద్యమాన్ని విచ్ఛిన్నం చేయడానికి కుటిల ప్రయత్నాలు సాగించిందన్నారు. ఈ పరిస్థితుల్లో పార్టీని, ఉద్యమాన్ని కాపాడుకోవడానికి కేంద్ర కమిటీతో తెగతెంపులు చేసుకోవటం అనివార్యమైందన్నారు. పార్లమెంటరీ, పార్లమెంటేతర పోరాటాలను జోడించాలని భావిస్తున్నామన్నారు. పార్లమెంటు ద్వారానే అధికారాన్ని సాధించగలమనే పార్లమెంటరీ విధానాన్ని, పాలకవర్గాలతో ఫ్రంట్లు కట్టే విధానాన్ని తిరస్కరిస్తున్నట్లు తెలిపారు. అంతిమంగా సాయుధ పోరాటం ద్వారా విముక్తి సాధించగలమని విశ్వాసం వ్యక్తం చేశారు. పోరాటాలకు కలిసి వచ్చే శక్తులన్నింటితో పనిచేయడం తమ నిలకడైన విధానంగా ఉంటుందన్నారు. రాష్ట్ర కమిటీ సభ్యులు వీరే..: గుమ్మడి నర్సయ్య, కెచ్చెల రంగయ్య, కె.రమ, రాయల చంద్రశేఖర్, పాయం చిన్న చంద్రన్న, గోకినపల్లి వెంకటేశ్వరరావు, కె.సూర్యం, కె.జి.రాంచందర్, కర్నాటి యాదగిరి, చండ్ర అరుణ, వి.కృష్ణ, ఎస్ఎల్ పద్మ. 1967 నుంచి ఇప్పటివరకు చీలికలు ఇలా.. భారత విప్లవ పరిస్థితులకు రివిజనిజం పెను ప్రమాదమంటూ 1967లో సీపీఎం నుంచి బయటకు వచ్చి చండ్ర పుల్లారెడ్డి నాయకత్వంలో సీపీఐ (ఎంఎల్)ను స్థాపించారు. 1984లో సీపీఐ (ఎంఎల్)లో సిద్ధాంతపరమైన విభేదాలతో చీలిక వచ్చి చండ్ర పుల్లారెడ్డి, పైలా వాసుదేవరావు వర్గాలు ఏర్పడ్డాయి. కొంతకాలానికి పైలా వర్గం ప్రజాపంథాగా, చండ్ర పుల్లారెడ్డి వర్గం విమోచన గ్రూపుగా మారింది. ప్రజాపంథా పలు రాష్ట్రాల్లో కార్యకలాపాలను విస్తరించి దేశవ్యాప్తంగా రూపం తెచ్చేందుకు 1994లో న్యూడెమోక్రసీ (ఎన్డీ)గా అవతరించింది. ఎన్డీలోనూ 2013లో మరో చీలిక వచ్చి ఎన్డీ చంద్రన్న వర్గం, ఎన్డీ రాయల వర్గంగా ఆవిర్భవించాయి. అయితే 2013 నాటి చీలిక సమయం నుంచే ఎన్డీ రాయల వర్గంలో నేతలు రెండు వర్గాలుగా పనిచేస్తూ ప్రస్తుతం క్షీణ దశకు చేరాయి. ఈ క్రమంలోనే రాయల వర్గం నుంచి డి.వి.కృష్ణ, పోటు రంగారావు బయటకు వచ్చి ప్రజాపంథాగా అవతరించినట్లు ప్రకటించారు. వీరిద్దరూ రాయల వర్గంలో రాష్ట్ర కార్యదర్శి, సహాయ కార్యదర్శులుగా పని చేశారు. వీరు బయటకు రావడంతో ఆ వర్గానికి రాష్ట్ర కార్యదర్శిని ఎంపిక చేసేందుకు త్వరలోనే మహబూబాబాద్‌లో సమావేశం నిర్వహించనున్నారు. -
షాకింగ్: మాస్క్ అడగడంతో ఉమ్మేసి మహిళ పరుగు
లండన్: మహమ్మారి వైరస్ రాకుండా ముందస్తుగా ప్రపంచం మొత్తం మాస్క్ ధరిస్తున్నారు. కొందరు మాస్క్ ధరించడంలో నిర్లక్ష్యం వహిస్తుండడంతో ఇప్పుడు ప్రతిచోట ‘మాస్క్ ధరిస్తేనే అనుమతి’ అనే బోర్డులు విధించారు. మాస్క్ లేని వారిని అనుమతించడం లేదు. అయితే ఒక షాపింగ్‌మాల్ వద్ద మాస్క్ లేకుండా వచ్చిన మహిళ బీభత్సం సృష్టించింది. మాస్క్ లేదని అడిగిన సెక్యూరిటీ గార్డుపై ఉమ్మేసి పరుగులు పెట్టిన ఘటన వైరల్‌గా మారింది. ఈ సంఘటన యూకేలోని లండన్‌లో జరిగింది. లండన్‌లోని ఓ షాపింగ్‌మాల్‌కు ఇద్దరు మహిళలు వచ్చారు. అయితే వారు మాస్క్ ధరించకపోవడంతో వారిని సెక్యూరిటీ గార్డు నిలువరించాడు. మాస్క్ ధరించి రావాలని సూచించాడు. దీంతో ఆ మహిళలు సెక్యూరిటీ గార్డుతో గొడవకు దిగారు. ఆ చిన్న గొడవ కాస్త పెద్దగా మారింది. లోపలకు వెళ్లేందుకు ఆమె ప్రయత్నించగా సెక్యూరిటీ అడ్డుకోవడంతో అతడిని దుర్భాషలాడింది. ఇష్టమొచ్చిన మాటలతో తిట్టింది. అక్కడ పరిస్థితి ఆందోళనకరంగా మారింది. అయితే ఆ ఇద్దరిలోని ఓ మహిళ దూరంగా వచ్చినట్టు చేసి వెంటనే సెక్యూరిటీ గార్డు వద్దకు వెళ్లి ముఖంపై ఉమ్మేసి పరుగులు పెట్టింది. షాక్‌కు గురయిన సెక్యూరిటీ గార్డులు వెంటనే ఆమెను పట్టుకునేందుకు ఉరుకులు పెట్టారు. చివరకు ఆమె చిక్కింది. ఆమెపై స్థానిక పోలీసులు కేసు నమోదు చేశారు. మాస్క్ ధరించడం వదిలేసి తనకు తానే ఆమె ఇబ్బందులను కొని తెచ్చుకుంది. దీనికి సంబంధించి వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఆమె తీరుపై నెటిజన్లు విమర్శలు చేస్తున్నారు. మాస్క్ పెట్టుకోనిదే కాక సెక్యూరిటీ గార్డుపై ఉల్టా దాడి చేసుడు ఏందమ్మా? అని ప్రశ్నిస్తున్నారు. -
ఇన్స్టాగ్రామ్, వాట్సాప్ అమ్ముకోవాలా..?
వాషింగ్టన్: సామాజిక మాధ్యమం ఫేస్బుక్ మరోసారి చిక్కుల్లో పడింది. ఆ సంస్థ గుత్తాధి పత్యానికి వ్యతిరేకంగా అమెరికా ప్రభుత్వం, 48 రాష్ట్రాలు కోర్టుకెక్కాయి. మార్కెట్లో ఎలాంటి పోటీ లేకుండా చిన్న చిన్న సంస్థలన్నింటినీ ఆ సంస్థ కొనుగోలు చేస్తూ ఏకాఛత్రాధిపత్యంగా వ్యవహరిస్తోందంటూ అమెరికా ప్రభుత్వం కోర్టులో వేసిన దావాలో పేర్కొంది. దీంతో ఫేస్‌బుక్‌కి చెందిన ఇన్స్టాగ్రామ్, మొబైల్ మెసేజింగ్ యాప్ వాట్సాప్‌లను ఆ సంస్థ విక్రయించాల్సిన పరిస్థితులు ఎదురయ్యాయి. పక్కా ప్రణాళికతో గుత్తాధిపత్యం ఫేస్బుక్ పక్కా ప్రణాళికతో చిన్న సంస్థల్ని మింగేస్తూ మార్కెట్లో గుత్తాధిపత్య ధోరణుల్ని కనబరుస్తోందని న్యూయార్క్ అటార్నీ జనరల్ లెటీషియా జేమ్స్ విమర్శించారు. 2012లో ఇన్స్ట్రాగామ్ని, 2014లో వాట్సాప్‌ని కొనుగోలు చేసి పోటీ లేకుండా చేసుకుందని అన్నారు. వినియోగదారులకు మరో ఎంపిక లేకుండా చేస్తూ ఏ కంపెనీని ఎదగనివ్వడం లేదని ఫెడరల్ కమిషన్ తన పిటిషన్లో పేర్కొంది. ఫేస్‌బుక్‌పై దావా వార్త బయటకు రాగానే ఆ సంస్థ షేర్లు దారుణంగా పడిపోయాయి. నిబంధనలకు అనుగుణంగానే ఫేస్బుక్ సంస్థ తాను ఏమి చేసినా ప్రభుత్వ నిబంధనలకు లోబడే చేశామని వాదిస్తోంది. ఏవైనా రెండు కంపెనీలు కలిసిపోవడానికి అమెరికా ప్రభుత్వం అంగీకరించిందని, ఇప్పుడు అదే ప్రభుత్వం కోర్టుకెక్కడం ఏమిటని ఫేస్బుక్ ఉపాధ్యక్షుడు జెన్నిఫర్ న్యూస్టీడ్ అన్నారు. ఫెడరల్ ప్రభుత్వం ఉద్దేశపూర్వకంగానే ఇదంతా చేస్తోందని ఆరోపించారు. -
రెండు ముక్కలుకానున్న ఆఫ్రికా ఖండం..??
సాక్షి, వెబ్ డెస్క్ : ప్రపంచంలో రెండో అతిపెద్ద ఖండమైన ఆఫ్రికా రెండుగా చీలిపోనుందా..? ఆఫ్రికా వాసుల మెదళ్లను ప్రస్తుతం తొలుస్తున్న ప్రశ్న ఇదే. కెన్యా రాజధాని నైరోబికి చేరువలోని హైవేపై ఏర్పడిన పగులు ఈ ఆందోళనలకు కేంద్ర బిందువు అయింది. టెక్టోనిక్ ప్లేట్లలో నైరుబీ వద్ద వస్తున్న కదలికలు ఆఫ్రికా రెండుగా విడిపోతుందనే నమ్మకాన్ని బలపరుస్తున్నాయి. నైరుతీ కెన్యాలో గల రిఫ్ట్ వ్యాలీ వద్ద భారీ పగులు ఏర్పడింది. కొన్ని మైళ్ల పాటు విస్తరించిన ఈ పగులు కారణంగా నైరోబీ-నరోక్ హైవే కూడా దెబ్బతింది. అంతేకాదు కొన్ని ఇళ్లు సగానికి చీలిపోయాయి కూడా. ఈ పగులు కారణంగా భవిష్యత్‌లో ఆఫ్రికా రెండు ముక్కలు అవుంతుందని శాస్త్రవేత్తలు పేర్కొన్నారు. అయితే ఇందుకు కొన్ని లక్షల సంవత్సరాలు పడుతుందని చెప్పారు. నుబియన్ ప్లేట్ నుంచి సోమాలి టెక్టానిక్ ప్లేట్ విడిపోయే క్రమంలో ఈ చీలిక జరుగుతుందని నిపుణులు చెబుతున్నారు. అతి నెమ్మదిగా జరిగే ఈ ప్రక్రియ కొన్ని లక్షల సంవత్సరాల తర్వాత పూర్తవుతుందని వివరించారు. ప్రకృతి బద్దంగా జరిగే ఈ ప్రక్రియను అడ్డుకోవడం అసాధ్యమని పేర్కొన్నారు. విడిపోయే ముక్కలో ఉండే సోమాలియా, కెన్యా, ఇథియోపియాలు హిందూ మహాసముద్రంలో ద్వీపాలుగా మారుతాయని చెప్పారు. దీనివల్ల ఆఫ్రికా ఖండం చిన్నగా మారుతుందన్నారు. -
మిషన్ కశ్మీర్.. కేంద్రం వ్యూహం ఫలిస్తోందా?
శ్రీనగర్ : కశ్మీర్ అంశాన్ని ఓ కొలిక్కి తెచ్చే క్రమంలో కేంద్ర ప్రభుత్వ వ్యూహం ఫలిస్తున్నట్లే కనిపిస్తోంది. ప్రత్యేక ప్రతినిధి దినేశ్వర్ శర్మ చర్చలు వేర్పాటువాదుల్లో చీలిక తీసుకొస్తున్నాయి. తొలుత కొన్ని వేర్పాటువాద సంస్థలు ఆయనతో చర్చకు అంగీకరించని విషయం తెలిసిందే. అయితే ముస్లిం కాన్ఫరెన్స్ ప్రతినిధి అబ్దుల్ ఘని భట్ ఇప్పుడు దినేశ్వర్‌తో భేటీ కావటం చర్చనీయాంశంగా మారింది. ఒకప్పుడు హురియత్ కాన్ఫరెన్స్ పార్టీలో క్రియాశీలకంగా వ్యవహరించిన అబ్దుల్.. తర్వాత సొంతగా ముస్లిం కాన్ఫరెన్స్(ఎంసీ) సంస్థ ఏర్పాటు చేసుకుని కశ్మీర్లో వేర్పాటువాద ఉద్యమాన్ని నిర్వహిస్తున్నారు. అయితే ఇప్పుడు ఆయన ప్రత్యేక ప్రతినిధి తో రహస్య సమావేశం అయిన వార్తల నేపథ్యంలో ఎంసీ ముఖ్య నేతలంతా సమావేశమయ్యారు. అనంతరం అబ్దుల్‌ను సంస్థ నుంచి బహిష్కరిస్తున్నట్లు ముస్లిం కాన్ఫరెన్స్ ప్రకటించింది. ఇక మహ్మద్ సుల్తాన్‌ను కొత్త చీఫ్‌గా ఎంసీ ప్రకటించింది. తొలుత ఓ జాతీయ దిన పత్రికకు ఇచ్చిన ఇంటర్వ్యూలో భేటీ వార్తలను అంగీకరించిన అబ్దుల్.. వేటు తర్వాత అదంతా అబద్ధమని చెబుతున్నారు. కొందరు కక్ష్య కట్టి తనపై ఈ ఆరోపణలు చేస్తున్నారని ఆయన చెప్పారు. అబ్దుల్ ఘని భట్ ఫోటో ఇక కశ్మీర్ విషయంలో చర్చల కోసం కేంద్రం ఐబీ మాజీ చీఫ్ దినేశ్వర్ శర్మను నియమించిన రెండు నెలల్లోనే వేర్పాటు వాద సంస్థల్లో చీలికలు రావటం విశేషం. మోదీ ప్రభుత్వ నిర్ణయాన్ని కొన్ని సంస్థలు స్వాగతించగా.. పాక్ ప్రేరేపిత సంస్థల్లో మాత్రం విభేదాలతో చీలికలు వస్తుండటం గమనార్హం. -
అరుదైన ఆపరేషన్:వీణావాణి భవిష్యత్‌పై ఆశ
న్యూఢిల్లీ: భారతదేశంలో మొట్టమొదటిసారి ఢిల్లీలోని ఆల్ ఇండియా ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ (ఎయిమ్స్) అరుదైన శస్త్రచికిత్సను ప్రారంభించారు. తెలుగు ప్రజలందరికీ సుపరిచితమైన అవిభక్త కవలలు వీణావాణి మాదిరే తలలు అతుక్కుని పుట్టిన కవలలకు ఈ శస్త్రచికిత్సకు వైద్యులు శ్రీకారం చుట్టారు. ఒడిశా కంధమాల్ జిల్లాలో ఓ పేద రైతుకుటుంబంలో పుట్టిన జగన్నాథ్, బలియాలను వేరుచేసే హిస్టారికల్ ఆపరేషన్‌ను సోమవారం ప్రారంభించారు. ప్రస్తుతం వీరి వయసు రెండు సంవత్సరాల మూడు నెలలు. చాలా అరుదైన ఈ కవలలిద్దరీ కాపాడేందుకు శాయశక్తులా ప్రయత్నిస్తున్నామనీ, కనీసం ఒక్కరు బతికినా అది చారిత్రక ఘటనగా నిలిచిపోతుందని ఎయిమ్స్ వైద్యులు చెప్పారు. మెదడు నుండి గుండెకు రక్తాన్ని పంప్ చేసే సిరలను కవలలిద్దరూ పంచుకుని పుట్టడంతో ఈ ఆపరేషన్ చాలా క్లిష్టమైందని వైద్యులు చెప్పారు. దాదాపు 40మంది స్పెషలిస్టులు ఈ ఆపరేషన్‌లో పాలుపంచుకుంటున్నారు. మొత్తం 50 గంటలపాటు ఈ ఆపరేషన్ కొనసాగనుంది. మొదటి దశలో 6నుంచి 8 గంటలపాటు ఉంటుందని సమాచారం. పీడియాట్రిక్ న్యూరో సర్జన్లు, న్యూరో-అనస్థీషియా, ప్లాస్టిక్ సర్జరీ, కార్డియోవాస్క్యులర్ సైన్సెస్‌కు చెందిన నిపుణులు ఈ ప్రక్రియలో పాల్గొంటున్నారు. వీరికితోడు ఈ ప్రక్రియలో జపాన్ ఎక్స్పర్ట్ కూడా సహాయపడనున్నారు. పలుమార్లు ఎంఆర్ఐలు, యాంజియోగ్రాములు, ప్రపంచ వ్యాప్తంగా నిర్వహించిన ఇటువంటి శస్త్రచికిత్సలపై స్టడీ, అనేకమంది నిపుణులతో సంప్రదింపులు తరువాత కవలలో కనీసం ఒకరినైనా రక్షించాలని ఆశతో ఈ నిర్ణయానికి వచ్చామని ఎయిమ్స్ సర్జన్ ఒకరు చెప్పారు. మరోవైపు ఒడిశా ముఖ్యమంత్రి నవీన్ పట్నాయక్ ఎయిమ్స్ వైద్యులతో మాట్లాడారు. ఆపరేషన్ విజయంతం కావాలని ఆకాక్షించారు. ఇందుకుగాను రాష్ట్ర ప్రభుత్వం రూ. కోటి రూపాయల ఆర్థిక సహాయం సమకూర్చగా, కాంధమాల్ ఎడ్మినిస్ట్రేషన్ రూ.లక్ష అందించింది. అలాగే రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులు తమ ఒక రోజు జీతాన్ని విరాళంగా ఇవ్వాలని కాంధమాల్ కలెక్టర్ విజ్ఞప్తి చేశారు. వివిధ దశల్లో ఈ ఆపరేషన్ నిర్వహించనున్నారు. మొదటి దశలో మెదడునుండి సిర వేరు చేసి, ఒక ప్రత్యామ్నాయ సిర ఛానెల్ ఏర్పాటు చేస్తారు. అనంతరం పిల్లల ఆరోగ్య పరిస్థితిని పరిశీలిస్తూ.. పూర్తిగా మెదడును వేరుచేసి, చర్మాన్ని మూసివేయడంతో ఈ ప్రక్రియ ముగియనుంది. ఇది విజయవంతమైతే భవిష్యత్తు వైద్యశాస్త్రవిజ్ఞానానికి ఒక ఆశను ఇచ్చినట్టు అవుతుందని, తద్వారా మరిన్ని పరిశోధనలకు అవకాశం కలుగుతుందనే ఆశాభావాన్ని వైద్యులు వ్యక్తం చేశారు. కాగా ఒడిశా కంధమాల్ జిల్లా కు చెందిన భుయాన్, పుష్పాలకు వీరు జన్మించారు. గత నెలలో వీరిని ఎయిమ్స్‌కు తరలించారు. మరోవైపు పాట్నాకు చెందిన సిస్టర్స్ సబా ,ఫరా 20 ఏళ్ల వయస్సు. ప్రమాదాల కారణంగా వారు ఆపరేట్ చేయలేదు. అయితే ఇటీవలి కాలంలో న్యూయార్క్‌లోని ని మాంటెఫియోర్ ఆసుపత్రి సర్జన్లు 13 నెలల వయస్సున్న కవలలను విజయవంతమైన వేరు చేయడం విశేషం. తలలు కలిసి పుట్టే కవలలు చాలా అరుదు. 2.5 కోట్లమందిలో ఒక జననం సంభవిస్తుంది. భారతదేశంలో ప్రతి సంవత్సరం ఇలాంటి మొత్తం జననాల సుమారు సంఖ్య 10. అటువంటి కవలలలో నాలుగురు పుట్టినప్పుడే చనిపోగా, 24 గంటల్లో ముగ్గురు మరణించారు. 1952 నుంచి ప్రపంచవ్యాప్తంగా ఇటువంటి కవలలను వేరు చేయటానికి కేవలం 50 ప్రయత్నాలు మాత్రమే జరిగాయి. సక్సెస్ రేటు 25శాతం కన్నా తక్కువ. ఈ ఆపరేషన్ పూర్తి విజయంవంతం కావాలని కోరుకుందాం. ఈ నేపథ్యంలో మన వీణావాణి కష్టాలు కడతేరి, కొత్త జీవితాన్ని ప్రారంభించాలని మనం కూడా ప్రార్థిద్దాం! -
షాకింగ్: రోడ్డుపై రెండుగా చీలిపోయింది!
-
‘నా సినిమా జపాన్, బ్రెజిల్లో కూడా..’
లాస్ఎంజెల్స్: బ్రెజిల్, జపాన్ వెండితెరలపై తన చిత్ర ప్రీమియర్‌ను వీక్షించేందుకు ‘స్ప్లిట్’ను విడుదల చేసేందుకు తాను చాలా ఆతురతతో ఉన్నానని ప్రముఖ హాలీవుడ్ దర్శకుడు ఎం నైట్ శ్యామలన్ చెప్పారు. సైకలాజికల్ థ్రిల్లర్‌గా రూపొందించిన ఈ చిత్రాన్ని బ్రెజిల్, జపాన్‌లో త్వరలో ప్రదర్శించనున్నారు. ఈ విషయాన్ని ఆయనే స్వయంగా ట్విట్టర్ ద్వారా పంచుకున్నారు. త్వరలోనే తాను ఆ దేశాలను సందర్శిస్తున్నాను అని చెప్పారు. ‘స్ప్లిట్ చిత్ర ప్రదర్శనను ప్రారంబించేందుకు బ్రెజిల్, జపాన్‌కు ఎగిరిపోతున్నాను. నేనిక ఏమాత్రం ఎదురు చూడలేను’ అని చెప్పారు. జేమ్స్ మెక్ అవాయ్ ప్రధాన పాత్రలో నటించారు. స్ప్లిట్ పర్సనాలిటితో సాధారణంగా అపరిచితుడు చిత్రంలో మూడు కోణాల్లో విక్రమ్ నటించగా 23 రకాల భిన్నపార్శ్యాల్లో జేమ్స్ నటించాడు. సినిమా ప్రారంభం నుంచి ముగింపు వరకు టెన్షన్ టెన్షన్‌గా సైకలాజికల్ థ్రిల్లర్‌గా ఉంటుంది. -
తమిళ సంక్షోభం కాంగ్రెస్‌కు తగిలింది
చెన్నై: సుబ్బి పెళ్లి ఎంకి చావుకొచ్చిందన్నట్లు రాష్ట్ర ముఖ్యమంత్రి పదవి కోసం ఏఐఏడిఎంకేలో శశికళ, పన్నీర్ సెల్వం వర్గాల మధ్య ఏర్పడిన సంక్షోభం కాంగ్రెస్ పార్టీలో విభేదాలకు దారితీసింది. ఇరువురిలో ఎవరికి మద్దతివ్వాలన్న అంశంపై రాష్ట్ర అసెంబ్లీలో ఎనిమిది మంది సభ్యులు గల రాష్ట్ర కాంగ్రెస్‌లో ముసలం మొదలైంది. రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు తిరునవుక్కరసర్ బహిరంగంగా శశికళకు మద్దతు ప్రకటించడం పట్ల ఎమ్మెల్యేలు సహా పలువురు రాష్ట్ర కాంగ్రెస్ నాయకులు విభేదిస్తున్నారు.ముఖ్యమంత్రి ప్రమాణస్వీకారోత్సవానికి శశికళను ఆహ్వానించకుండా ఎందుకు తాత్సారం చేస్తున్నారంటూ రాష్ట్ర గవర్నర్ విద్యాసాగర్ రావును తిరునవుక్కరసర్ విమర్శించడంతో ఎనిమిది మంది కాంగ్రెస్ శాసన సభ్యుల్లో ఆరుగురు విభేదించినట్లు రాష్ట్రానికి చెందిన మాజీ కాంగ్రెస్ పార్టీ పార్లమెంట్ సభ్యుడొకరు తెలియజేశారు. రాష్ట్రంలో డీఎంకేతోని కాంగ్రెస్ పార్టీకి ఇప్పటికీ అనుబంధం ఉన్నప్పుడు ఏఐడీఎంకేలో ఓ పక్షానికి మద్దతు ఎలా ఇస్తామంటూ గురువారం జరిగిన రాష్ట్ర పార్టీ సమావేశంలో కొంత మంది ఎమ్మెల్యేలు ప్రశ్నించినట్లు తెల్సింది. పైగా శశికళను ప్రజలు వ్యతిరేకిస్తున్న విషయాన్ని కూడా వారు ప్రస్తావించారట. పన్నీర్ సెల్వం, శశికళ వర్గాలు రెండుగా చీలిపోయినప్పుడు ఒక పక్షం వహించక తప్పదన్న అభిప్రాయం ఆ సమావేశంలో వ్యక్తం అయినట్లు తెల్సింది. ఇరువురు మధ్య బలపరీక్ష జరిగినట్లయితే సభా విశ్వాసం కోసం 117 సభ్యుల మద్దతు అవసరం అవుతుంది. కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేల మధ్య విభేదాలు తలెత్తిన నేపథ్యంలో తమిళనాడు రాజకీయ పరిణామాలను రాహుల్ గాంధీతో చర్చించేందుకు తిరునవుక్కరసర్ శుక్రవారం బయల్దేరి ఢిల్లీ వెళ్లినట్లు తెల్సింది. ఆయన విద్యాసాగర్ రావును విమర్శించిన నేపథ్యంలోనే కేంద్ర కేంగ్రెస్ కమిటీ కూడా గవర్నర్ పాత్రను విమర్శించింది. కేంద్రంలోని బీజేపీ జోక్యం కారణంగానే తమిళనాడు ప్రభుత్వంలో సంక్షోభం ఏర్పడిందని కూడా ఆరోపించింది. ఆదాయానికి మించిన ఆస్తుల కేసులో సుప్రీం కోర్టు తీర్పు వెలువడే వరకు గవర్నర్ నిరీక్షించాలంటూ చిదంబరం విజ్ఞప్తి చేయడం ద్వారా భిన్నమైన వైఖరిని తీసుకున్నారు. 1987లో అప్పటి ముఖ్యమంత్రి ఎంజీ.రామచంద్రన్ చనిపోయినప్పుడు ఇలాంటి సంక్షోభమే ఏర్పడగా, అప్పడు ఏఐఏడిఎంకేలో ఉన్న తిరునవుక్కరసర్, జయలలిత పక్షం వహించారు. ఆ తర్వాత ఆయనకు జయలలితతో విభేదాలు రావడంతో ఆ పార్టీ నుంచి బయటకు వచ్చారు. క్షణక్షణం ఉత్కంఠ రేపుతున్న తమిళ రాజకీయాలపై రాహుల్‌తో చర్చించి ఆయన ఎలాంటి నిర్ణయం తీసుకుంటారో చూడాలి. పన్నీర్ సెల్వం, శశికళలలో గవర్నర్ ఎవరిని బలపరీక్షకు పిలిచినా విమర్శించే అవకాశం కాంగ్రెస్‌కు ఎలాగు ఉంటుంది. -
ఇక ఆమె అతడితో ఉండదట!
లాస్ ఎంజెల్స్: ప్రముఖ రియాల్టీ టీవీ స్టార్ కైలీ జెన్నర్(18).. ఆమె బాయ్ ఫ్రెండ్ ర్యాపర్ టిగా విడిపోతున్నట్లు తెలుస్తోంది. అతడు తన గర్ల్ ఫ్రెండ్‌కు విపరీతంగా అబద్ధాలు చెప్తుండటంతో విసుగు చెందిన ఆమె తనతో కలిసి ప్రయాణించకూడదని నిర్ణయించుకున్నట్లు సమాచారం. కైలీ గత రెండేళ్లుగా తనకంటే ఎనిమిదేళ్లు పెద్దవాడైన టిగా (26)తో డేటింగ్ చేస్తోంది. కానీ, కొద్ది వారాల కిందటే వారిద్దరి మధ్య అపనమ్మకాలు మొదలయ్యాయట. బాయ్ ఫ్రెండ్ అబద్ధం చెప్తుండటంతో చిర్రెత్తిపోయిన ఈ అమ్మడు అతడితో బందాన్ని తెగదెంపులు చేసుకోవాలని బలంగా నిర్ణయం తీసుకుందట. 'అతడు ఆమెకు వరుసగా అబద్ధాలు చెప్తున్నాడు. అందుకే ఇక ఆమె ఎంతో కాలం అతడితో సాగబోదు. అమె అతడి మాటలను ఇక నమ్మబోదు. గత కొద్ది నెలలుగా చాలా అంశాలపై వారు గొడవపడుతూనే ఉన్నారు. చివరకు ఆమె విడిపోవాలని నిర్ణయం తీసుకుంది' అని అక్కడి వార్తా సంస్థలు చెబుతున్నాయి. అయితే, అసలు విషయం మాత్రం అతడికి ఒక కొత్త గర్ల్ ఫ్రెండ్ దొరకడం వల్లే కైలీని నిర్లక్ష్యం చేస్తున్నాడని, ఆ విషయం తెలిసే ఆమె ఇక అతడితో ఉండకూడదని నిర్ణయించుకుందట. -
వాళ్లు ఇక చెరో బ్యాండ్ వాయించుకుంటారట
లండన్: ఇంగ్లిష్ రాక్‌స్టార్ బ్యాండ్ నోవా అండ్ వేల్ ఇప్పుడు విడిపోబోతున్నారు. తాము చెరొక బ్యాండ్‌ను స్థాపించబోతున్నామని, వ్యక్తిగత ప్రాజెక్టులు ప్రారంభించబోతున్నామని ప్రకటించారు. గత ఎనిమిదేళ్లుగా నోవా, వేల్ కలిసి బ్యాండ్ సేవలు అందిస్తున్నారు. ఈ విషయాన్ని ఆ సంస్థే స్వయంగా ఫేస్బుక్ ద్వారా ప్రకటించింది. తాము ఎనిమిదేళ్లుగా కలిసి పనిచేస్తూ అందరి అభిమానాలు పొందగలిగామని, ఇన్నాళ్లు తమను ఆధరించినట్లుగానే, ఇప్పుడు విడివిడిగా ప్రత్యేక బ్యాండ్ ఏర్పాటుచేసుకుంటున్న తమను కూడా ఆధారించాల్సిందిగా విజ్ఞప్తి చేశారు. అభిమానుల వల్లే తాము ఎన్నో కష్టాలను అధిగమించి వారి అంచనాలను అందుకున్నామని, వారిని అలరించామని పేర్కొన్నారు. ఇన్నాళ్లపాటు తమకు అభిమానులు అందించిన మద్ధతు మరువలేనిదంటూ ఆనందం వ్యక్తం చేశారు. నోవా, వేల్ బ్యాండ్ నాలుగు స్టూడియో ఆల్బమ్స్‌ను కూడా విడుదల చేసింది. అవి పీస్‌పుల్, ది వరల్డ్ లేస్ మి డౌన్ (2008), ది ఫస్ట్ డేస్ ఆఫ్ స్ప్రింగ్ (2009), లాస్ట్ నైట్ ఆన్ ఎర్త్ (2011), హార్ట్ ఆఫ్ నోహియర్(2013). -
నర్సాపూర్ ఫాస్ట్ ప్యాసింజర్‌కు తప్పిన ప్రమాదం
భీమవరం : నర్సాపురం-గుంటూరు ఫాస్ట్ ప్యాసింజర్‌కు మంగళవారం ఉదయం తృటిలో ప్రమాదం తప్పింది. ఉండి వద్ద రైలు పట్టా విరిగింది. ఈ విషయాన్ని గమనించిన డ్రైవర్ అప్రమత్తంగా వ్యవహరించటంతో ప్రమాదం తప్పింది. రైలును కొద్దిసేపు నిలిపివేశారు. రైల్వే సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకుని మరమ్మతులు చేపట్టారు. -
గోపీచంద్‌కు సైనా గుడ్‌బై!!
బ్యాడ్మింటన్‌లో అత్యంత విజయవంతమైన గురుశిష్యులు.. విడిపోతున్నారు. తన గురువు పుల్లెల గోపీచంద్ శిష్యరికంలో దేశానికి పలు పతకాలు సాధించిపెట్టిన సైనా నెహ్వాల్.. ఇప్పుడు ఆయనను వదిలిపెట్టి వేరే గురువు వద్దకు కోచింగ్ కోసం వెళ్తోంది. 2012 ఒలింపిక్స్‌లో కాంస్యపతకం సాధించిన సైనానెహ్వాల్‌కు దాదాపు 20 వరకు అంతర్జాతీయ టైటిళ్లు వచ్చాయి. ఇప్పుడు త్వరలో ఆసియా క్రీడలు జరగనున్న నేపథ్యంలో ఆమె భారతజట్టు మాజీ కోచ్ విమల్ కుమార్ వద్ద బెంగళూరులో కోచింగ్ తీసుకోవాలని నిర్ణయించుకుంది. ఇటీవల డెన్మార్క్‌లో జరిగిన ప్రపంచ ఛాంపియన్షిప్ సందర్భంగా గోపీచంద్‌కు ఈ విషయం చెప్పగా.. ఆయన కూడా సరేనన్నట్లు తెలిసింది. ఇటీవలి కాలంలో సైనా నెహ్వాల్ తన పాత ఫామ్‌ను కోల్పోవడం, పీవీ సింధు లాంటి క్రీడాకారిణులు ముందంజలోకి రావడంతో గోపీచంద్ విషయంలో ఆమె పునరాలోచన మొదలుపెట్టింది. ప్రపంచ ఛాంపియన్షిప్ నుంచి క్వార్టర్ ఫైనల్స్ దశలోనే వెనుదిరగాల్సి రావడంతో ఇక తన నిర్ణయాన్ని ఆమె స్థిరపరుచుకుంది. తాను బెంగళూరు వెళ్తున్నానని, విమల్ కుమార్ సర్ వద్ద కోచింగ్ తీసుకుంటానని స్పష్టం చేసింది. ఉబెర్ కప్ సమయంలో ఆయనిచ్చని సలహాలు చాలా ఉపయోగపడ్డాయని, అయితే ఆసియా క్రీడలు అయిపోయిన తర్వాత మళ్లీ హైదరాబాద్ వస్తానని సైనా తెలిపింది. వీళ్లిద్దరూ విడిపోవడం ఇది మొదటిసారి కాదు. 2011లో భాస్కర బాబు వద్ద కోచింగ్ తీసుకోవాలని సైనా భావించింది, కానీ మూడు నెలల తర్వాత మళ్లీ గోపీ వద్దకు వచ్చింది. ఇప్పుడు కేవలం 15 రోజుల శిక్షణ కోసమే బెంగళూరు వెళ్తున్నా.. అది దీర్ఘకాలికం అయ్యే అవకాశం కూడా లేకపోలేదని అంటున్నారు.