
కొంతమంది ఏదైనా తిని లేదా తాగి తటపటాయించకుండా దాని రుచి ఎలా ఉందో ఠక్కున చెప్పేస్తారు. అయితే, ఒకసారి ఒకదాన్నే రుచి చూసి చెప్పగలరు. అదేంటి ఎవరైనా ఒకసారి ఒకదాన్నే రుచి చూడగలరు అంటారా? కానీ బ్రియన్నా మేరీ షిహాడే మాత్రం ఒకేసారి రెండింటిని రుచి చూడగలదు. ఆమె నాలుక అలాంటిది మరి! అమెరికాలోని కాలిఫోర్నియాకు చెందిన షిహాడేకు బాడీ మోడిఫికేషన్.. అదేనండి శరీరంలో మార్పులు చేసుకోవడమంటే మహా సరదా.
సర్జరీ ద్వారా ఆమె తన నాలుకను రెండుగా స్ప్లిట్ చేయించుకుంది. ఇటీవల ఆమె ఒక గ్లాస్‌లో స్ప్రైట్ కూల్‌డ్రింక్, మరోగ్లాస్‌లో మంచినీళ్లు పెట్టుకుని రెండింటిని ఒకేసారి తాగి తన స్ప్లిట్ నాలుకతో రెండింటి రుచులు చెప్పేసింది. దీనికి సంబంధించిన వీడియోను సోషల్ మీడియాలో పెట్టగా పిచ్చపిచ్చగా లైక్స్ వచ్చాయి. ఆమెకు ఇన్‌స్టాగ్రామ్‌లో 2,28,000 మంది ఫాలోయర్లు ఉన్నారు. అయితే, ఈ స్ప్లిట్ టంగ్ అనేది చాలా ప్రమాదకరమని వైద్యులు అంటున్నారు.
చదవండి: చేనులో చేపలే పంట!
Comments
Please login to add a commentAdd a comment