tongue
-
'ఇ-నాలుక'..రుచిని కోల్పోయిన వాళ్లకు వరం..!
సాంకేతిక సాయంతో ఎన్నో కొంగొత్త ఆవిష్కరణలతో సవాళ్లకు సమాధానమిస్తుంటారు శాస్త్రవేత్తలు. అలానే తాజాగా పరిశోధకులు సరికొత్త ప్రయోగంతో ఓ గొప్ప ఆవిష్కరణకు నాంది పలికారు. ఇంతవరకు జ్ఞానేంద్రియాలకు సంబంధించి క్లిష్టతరమైన ప్రయోగాల్లో ఎదురవ్వుతున్న సమస్యకు చెక్‌పెట్టేలా ముందడుగు శారు. ఈసారి ఏకంగా రుచిని గుర్తించే ఇ-నాలుక(E-Tongue)ను అభివృద్ధి చేశారు. రుచిని కోల్పోయిన వ్యక్తులకు ఈ ఆవిష్కరణ ఒక వరంగా ఉంటుందని చెబుతున్నారు కూడా. మరీ ఆ ఆవిష్కరణ విశేషాలేంటో చూద్దామా..!.యిజెన్ జియా నేతృత్వంలోని ఒహియో స్టేట్ యూనివర్సిటీ పరిశోధకులు ఇ-టేస్ట్(E-Tongue) అనే నాలుక వ్యవస్థను అభివృద్ధి చేశారు. ఆహార నమూనాలను విశ్లేషించడం తోపాటు రుచులను పాక్షికంగా గుర్తించలేనివారికి ఇది ఉపయోగాపడేలా రూపొందించారు. ఈ సాంకేతికత ప్రాథమిక అభిరుచికి అనుగుణంగా ఐదు కీలక రుచులను సులభంగా గుర్తిస్తుంది. సోడియం క్లోరైడ్ (ఉప్పు), సిట్రిక్ ఆమ్లం (పుల్లని), గ్లూకోజ్ (తీపి), మెగ్నీషియం క్లోరైడ్ (చేదు), గ్లూటామేట్ (ఉమామి). ఈ ఐదు రుచులు మన రోజువారీ ఆహారంలో తప్పనిసరి ఉండేవే అని పరిశోధకుడు జియా చెబుతున్నారు. ఈ సరికొత్త ఎలక్ట్రానిక్ నాలుక ఇ టంగ్ కేక్, ఫిష్ సూప్ వంటి రుచులను గుర్తించగలదు. అయితే వాసనను ప్రభావితం చేసే రుచిని మాత్రం గుర్తించలేదు. ఇది ఇంకా వాసన ఆధారంగా రుచిని ఐడెంటిఫై చేయలేదని పరిశోధకులు తెలిపారు. ఎలా వర్క్ చేస్తుందంటే..ఆహారంలో రుచి భాగాల సాంద్రత గుర్తించడానికి ఇ-టేస్ట్ సెన్సార్లను ఉపయోగిస్తుంది. డేటాను డిజిటల్ సిగ్నల్లుగా మారుస్తుంది. ఒక పంపు సాయంతో ఒక వ్యక్తి నాలుక కింద ఉన్న గొట్టం ద్వారా ఫ్లేవర్డ్ హైడ్రోజెల్‌లను కచ్చితమైన మొత్తంలో పంపిణీ చేస్తుంది. ముందుగా ఈ వ్యవస్థ ఎలా పనిచేస్తుందో టెస్ట్ చేయడానికి మొదట ఇది రుచులను ఎలా పునరుత్పత్తి చేస్తుందో అంచనా వేశారు. ఆ తర్వాత పది మంది వ్యక్తుల్లో దీని సామర్థ్యాన్ని పరీక్షించగా.. కృత్రిమ రుచి ఒరిజనల్ రుచికి సమానంగా ఉందని చెప్పారు. ఆ తర్వాత నిమ్మరసం, కేక్, వేయించిన గుడ్డు, చేపల సూప్, కాఫీతో సహా సంక్లిష్ట రుచులను గుర్తించగలదో లేదో అని పరీక్షించారు. అయితే పరిశోధకులు ఆహారం ఫ్లేవర్ కంటే దాని రుచే ప్రధానమని చెబుతున్నారు. వాసన, రంగువంటి ఇంద్రియ అంశాలు ఆహారాన్నిఎలా గ్రహిస్తామనే దానిపై కీలక పాత్ర పోషిస్తాయని అన్నారు. ఎందుకంటే ముక్కు, కళ్లు మూసుకుంటే స్ట్రాబెర్రీలు పుల్లగా అనిపిస్తాయట, అదే చూసి తింటే వాటి ఎరుపుదనం వల్ల తీపిదనంతో కూడిన అనుభూతి కలుగుతుందట. అందువల్ల తాము రూపొందించిన ఈ ఇ టేస్ట్ పులుపు, తీపి వంటి రుచులను చూడగలిగినా..మానవ నాలుకలా రుచిని పూర్తిగి ఆస్వాదింప చేయలేదని వెల్లడించారు పరిశోధకులు.(చదవండి: పనిప్రదేశాల్లో పాలివ్వడాన్ని అవమానంగా చూడొద్దు: సుప్రీం కోర్టు) -
టంగ్ కంగు తినడానికి కాదు!
ఫేస్ ఈజ్ ఇండెక్స్ ఆఫ్ మైండ్ అంటారు కదా. అలాగే టంగ్ ఈజ్ ద ఇండెక్స్ ఆఫ్ హెల్త్ అనుకోవచ్చు. అంటే... నాలుక అన్నది ఆరోగ్యానికి మంచి సూచిక అని అర్థం. అందుకే డాక్టర్ల దగ్గరికి వెళ్లగానే నాలుక చూపించమని అడుగుతుంటారు. దాన్నిచూసిన వెంటనే డాక్టర్లకు బాధితుల ఆరోగ్య విషయాలు ఎన్నో తెలుస్తుంటాయి. తల్లో నాలుకల వ్యవహరిస్తూ అనేక నములు తున్నప్పుడు రుచి తెలియజేయడం, పంటి కిందికి ఆహారాన్ని తోయడం వంటి అనేక పనులు చేసే నాలుక గురించి మాత్రం మనందరిలోనూ పెద్దగా తెలుసుకున్న దాఖలాలు ఉండవు. నాలుక చేసే కీలకమైన పనులు, దానికి వచ్చే కొన్ని సమస్యలపై అవగాహన కోసం ఈ కథనం.సాధారణంగా నాలుక పింక్ రంగులో ఉంటే అది ఆరోగ్యానికి ఓ మంచి సూచన. ఒకవేళ అలా లేదంటే అది ఏదైనా అనారోగ్యానికి సూచన కావచ్చు. అందుకే డాక్టర్ల దగ్గరికి వెళ్లినప్పుడు వారు నాలుక చూపించమంటారు. అలా వ్యక్తుల ఆరోగ్యాన్ని గురించి తెలుసుకుంటారు.నాలుక కింది భాగం ఓ కండరంతో నోటిలోని కింది భాగానికి అతుక్కుపోయి... బయటకు అది చాలా చిన్నగా కనిపించినప్పటికీ, దాదాపు పది సెంటీమీటర్ల పొడవుంటుంది. దాదాపు 60 గ్రాముల బరువుంటుంది.జీర్ణ ప్రక్రియలో తొలి అంకం నాలుక దగ్గర్నుంచే... ఆహారాన్ని జీర్ణం చేసే పనిలో నాలుక భూమిక ఎంతో కీలకం. ఆహారాన్ని పళ్ల కిందికి తోసేందుకు మనమంతా మనకు తెలియకుండానే నాలుకను వాడుతుంటాం. అలా మనం తీసుకున్న ఆహారం చిన్న చిన్న ముక్కలుగా (పార్టికిల్స్గా) మారేందుకు ఉపయోగ పడుతుంది. అంటే ఆహారం జీర్ణం కావడంలో తొలి అంకం ఇక్కణ్ణుంచే మొదలవుతుంది. ఆ తర్వాత మింగడం అనే ప్రక్రియ కూడా కేవలం నాలుక వల్లనే సాధ్యమవుతుంది. నాలుక వెనుక భాగం నమిలిన ఆహారాన్ని గొంతు ద్వారా కడుపులోకి నెడుతుంది. నాలుక దిగువన ఉండే చిన్న తీగ వంటి భాగంతోనే అది నోటి అడుగుభాగానికి అతుక్కు΄ోయి ఉంటుంది. ఈ తీగ పొడవు ఉండాల్సిన దాని కంటే బాగా తక్కువగా ఉంటే, మాట్లాడటంలో సమస్యలు వస్తాయి. నత్తి వంటి చాలా ఇబ్బందులు వస్తాయి. ఒకప్పుడు ఈ తరహా ఇబ్బందులకు పరిష్కారం అంతగా ఉండేది కాదు గానీ... ఇప్పుడు ఇలాంటి సమస్యను శస్త్రచికిత్సతో సరిచేసి, సరిగా మాట్లాడేలా చేసే అవకాశముంది.రుచితోనూ ఆరోగ్యం గురించి... అనారోగ్యం కలిగిన కొన్నిసార్లు రుచి తెలియదు. ఉదాహరణకు తీవ్రమైన జ్వరం వచ్చిన సందర్భాల్లోనూ, అలాగే జలుబు చేసినప్పుడు ముక్కుకు వాసనలూ, నాలుకకు రుచులూ తెలియని పరిస్థితి వస్తుంది. తాజాగా కరోనా వైరస్ సోకినప్పుడు కూడా ఇదే ప్రక్రియ వల్ల బాధితులకు రుచి తెలియకుండా΄ోయి, తమకు కరోనా వచ్చిన సంగతి తెలిసింది.నాలుకకు వచ్చే కొన్ని అనారోగ్యాలు... అన్ని అవయవాల లాగే నాలుకకూ ఇన్ఫెక్షన్ వచ్చే అవకాశాలుంటాయి. నాలుకకు వచ్చే ఇన్ఫెక్షన్ను గ్లాసైటిస్ అంటారు. కొన్ని యాంటీబయాటిక్స్ ఉపయోగించడం ద్వారా ఇన్ఫెక్షన్ను తేలిగ్గా తగ్గించవచ్చు. ఐరన్‌లోపంతో వచ్చే రక్తహీనత (అనీమియా) ఉన్నవారిలో నాలుక ఆరోగ్యకరమైన పింక్ రంగుకు బదులుగా ఎర్రగా ఉండి, ముట్టుకుంటే బాధకలిగించే టెండర్‌గా మారుతుంది పచ్చకామెర్లు (జాండీస్) సోకినవారిలో పసుపురంగులోకి మారి కనిపిస్తుంటుంది.కొన్ని ఫంగస్‌లు సోకినప్పుడు నాలుకపై నల్లని మచ్చలు కనిపిస్తాయి. యాంటీఫంగల్ మందులు వాడటం ద్వారా దీన్ని తేలిగ్గా అధిగమించవచ్చు జింక్ లోపం వల్ల తలెత్తే ‘డిస్గ్యూసియా’ అనే సమస్య వచ్చిన వారిలో చక్కెర చేదుగానూ, చాక్లెట్ ఉప్పగానూ అనిపించవచ్చు. సాధారణంగా ఫ్లూ వంటి వ్యాధులు సోకిన తర్వాత ఇలాంటి పరిస్థితి తలెత్తుతూ ఉంటుంది. జింక్ పుష్కలంగా ఉండే పోషకాహారం తీసుకుంటే, కొద్ది రోజుల్లోనే నాలుక మళ్లీ సాధారణ స్థితికి వచ్చేస్తుంది అరుదుగా వచ్చే ‘హై΄ోగ్యూసియా’ అనే సమస్యలో నాలుక రుచులను గుర్తించే సామర్థ్యాన్ని దాదాపుగా కోల్పోతుంది. వారు ఏది తిన్నా రుచీపచీ ఉండదు విటమిన్ (చాలావరకు విటమిన్ బి కాంప్లెక్స్) లోపాల వల్ల నాలుక పగుళ్లుబారినట్లు అనిపించడం, నాలుక మీద పొక్కులు రావడం మామూలే. సాధారణంగా ‘బి–కాంప్లెక్స్’ మందులతో ఈ సమస్యను తేలిగ్గా అధిగమించవచ్చు పొగతాగేవారిలో నాలుక మీద ఉండే రుచిమొగ్గలు తమ సామర్థ్యాన్ని కోల్పోతాయి. అందుకే పొగతాగేవారికి రుచులు అంత స్పష్టంగా తెలియవు. అంతేకాదు... పొగతాగడం వల్ల హెడ్ అండ్ నెక్ క్యాన్సర్లతో పాటు నాలుక క్యాన్సర్ కూడా రావచ్చు. ఇది ప్రమాదకరమైన పరిణామం అందుకే పొగతాగడం, ఆల్కహాల్ వంటి అలవాట్లకు దూరంగా ఉండాలి. -
అమ్మవారికి నాలుక సమర్పించిన భక్తుడు
భింద్: దేశవ్యాప్తంగా నవరాత్రి వేడుకలు అత్యంత వైభవంగా జరుగుతున్నాయి. ఈ నేపధ్యంలో భక్తులు అమ్మవారికి కానుకలు చెల్లించుకోవడంతో పాటు, తమ మొక్కులు తీర్చుకుంటున్నారు. అయితే ఒక భక్తుడు అమ్మవారికి తన నాలుకను సమర్పించి, తన భక్తిని చాటుకున్నాడు.మధ్యప్రదేశ్‌లోని భింద్ జిల్లాలో గల రతన్‌గఢ్ దేవి ఆలయానికి వచ్చిన ఒక భక్తుడు తన నాలుకను కోసుకుని, దానిని అమ్మవారి సమర్పించాడు. ఈ విషయం తెలియగానే స్థానికులు ఆలయానికి తండోపతండాలుగా తరలివచ్చారు. రతన్గర్ దేవి ఆలయం భిండ్‌లోని లాహర్ నగర్లో ఉంది. ఈ ఆలయాన్ని 2015లో నిర్మించారు.నవరాత్రుల సందర్భంగా ఆలయానికి వచ్చిన రామ్‌శరణ్ భగత్ తన నాలుకను తెగ్గోసుకుని, అమ్మవారికి సమర్పించాడు. తరువాత ఆ రక్తాన్ని ఆలయం వెలుపల ఉంచిన పాత్రలో పోశాడు. దీనిని చూసిన అక్కడివారంతా తెగ ఆశ్చర్యపోయారు. నాలుకను సమర్పించాక ఆ భక్తుడు ఆలయంలోనే కాసేపు నిద్రించాడు. ఇది కూడా చదవండి: బలి తంతు లేకుండా జరిగే 'పూల తల్లి ఆరాధన'..! ఇక్కడ దసరా.. -
నోరు.. నాలుక... నిప్పురవ్వ
‘‘నోటిని, నాలుకను అదుపు చేసుకొనువాడు శ్రమల నుండి తన ప్రాణమును కాపాడుకొనును’’ (సామెతలు 21: 23)కొందరు అనవసర మాటల వల్ల తొందరపడి తప్పులు చేస్తున్నారు.. చిక్కుల్లో పడుతున్నారు. అవతలివారికి చిక్కి, జగడమాడుతున్నారు. అదుపులేని మాటలు, అసభ్యకర మాటలను పెద్దలు వింటున్నారని కూడా విచక్షణ లేకుండా మాట్లాడుతున్నారు. ఎదుటివారికి కోపం వస్తుందని, వారి మనసుకు గాయమవుతుందని గ్రహించలేకపోతున్నారు. జంతువులు కేకలు వేస్తాయి, అరుపులు అరుస్తాయి. కానీ దేవుడు మనకు వాక్శక్తి అనుగ్రహించాడు. ఎంతమంది నాలుకను అదుపులో పెట్టుకుంటున్నారు... సద్వినియోగపర్చుకుంటున్నారు! నోటికొచ్చినట్టు వాగ్దానాలు చేస్తున్నారు కొందరు. కానీ ఎన్ని వాగ్దానాలు అమలు చేస్తున్నారో తెలియదు. ఈ విషయంలో ఏసుక్రీస్తు శిష్యుడైన యాకోబు తాను రాసిన పత్రిక 3 :2 లో ఏమని రాశారో గమనిద్దాం. అనేక విషయాలలో మనమందరం తప్పి΄ోతున్నామని, ఎవరైనా మాట తప్పిన యెడల అట్టివాడు లోపం లేనివాడై, తన మొత్తం శరీరాన్ని కాపాడుకోగల శక్తి గలవాడవుతాడని గుర్రాలను, మనుషులు లోబరచుకోవడానికి నోటికి కళ్లెం పెట్టి త్రిప్పుతున్నారు కదా! ఓడలను కూడా చూడండి. అవి ఎంతో గొప్పవై పెనుగాలికి కొట్టుకొనిపొయినా ఓడ నడుపువాని ఉద్దేశం చొప్పున చాలా చిన్నదైన చుక్కాని చేత తిప్పబడుతుందికదా! ఆలాగున నాలుక కూడా చిన్ని అవయవమైనా బహుగా అదిరిపడుతుంది.ఎంతో చిన్నదైన నిప్పురవ్వ బహు విస్తారమైన అడవిని కూడా తగులబెడ్తుంది కదా! నాలుక కూడా అగ్ని వంటిదే. నాలుక కూడా చిన్నదైనను బహుగా అదిరిపడును. సర్వశరీరమును మాలిన్యం కలుగజేస్తుందని వాక్యం సెలవిస్తుంది. అంతేకాదు అది ప్రకృతి చక్రాన్నే తిప్పును. నరకంలోకి తీసుకొనిపోవును. మృగ, పక్షి, సర్ప, జలచరములలో ప్రతి జాతీ నరులకు సాధు కాజాలును కానీ మానవుడు నాలుకను సాధు చేసుకోలేక ΄ోతున్నాడు. మాటలు తక్కువగా మాట్లాడాలి. సక్రమంగా మాట్లాడాలి. ఇతరులను కించపరచకూడదు.దేహమును శిక్షకు లోనగునంత నోటివలన చేయకుము, అది ΄పాటున జరిగెనని దూతల యెదుటను చెప్పకూడదు. నీ నోటి మాటల వల్ల దేవునికి కోపము పుట్టింపనేల అని సెలవిచ్చాడు. మహరాజైన దావీదు నోటికి చిక్కము పెట్టుకుంటానన్నాడు. పంచాయితీలోను, ప్రజలలోను, సభలలోను అనాలోచితంగా మాట్లాడక ఆలోచించి యుక్తముగా మాట్లాడాలి. యేసుప్రభువు కూడా పిలాతు మాట్లామమన్నా మాట్లాడలేదు. పిలాతు యేసుక్రీస్తు వారితో నేను సహాయము చేసి శిక్షను పడకుండా చేస్తానన్నా ప్రభువు ఆయన నోటిని అదుపులో పెట్టుకొన్నాడు. మారుమాట పలకలేదు. కావున మానవమాత్రులమైన మనం నోటిని అదుపులో పెట్టుకొని మన ప్రాణాలను కాపాడుకోవాలి. సమాజంలో ఒక గొప్ప స్థానాన్ని పోందాలి.– కోట బిపిన్ చంద్రపాల్ -
'ఉమామి దినోత్సవం': ఆరు రుచులు కాకుండా మరో టేస్ట్ గురించి విన్నారా?
దశాబ్దాలుగా మన నాలుకపై ఉండే రుచి మొగ్గలు ఉప్పు, పులుపు, చేదు, వగరు, కారం, తీపి వంటి షడ్రుచులను గుర్తిస్తుందని తెలుసు. అవి కాకుండా ఉన్న మరో ఏడో రుచి గురించి విన్నారా..?. అదే 'ఉమామి' టేస్ట్. దీని కోసం ఓ రోజుని ఏర్పాటు చేసి మరీ ఈ ఏడో రుచి గురించి చెబుతున్నారు. ప్రతి ఏటా జూలై 25న ఈ ఉమామి దినోత్సవాన్ని ఘనంగా జరుపుకుంటున్నారు. ఆ రోజును ఈ టేస్ట్‌కి సంబంధించిన వంటకాలతో సెలబ్రేట్ చేసుకుంటారు. అసలు ఏంటీ ఉమామి..? ఎవరూ కనిపెట్టారు? ఎలా ఉంటుంది ఈ రుచి..? అంటే..'ఉమామి' అంటే జపనీస్ భాషలో "ఆహ్లాదకరమైన రుచి". 1980లలో అధికారికంగా ప్రత్యేక రుచిగా ఈ పేరు పెట్టడం జరిగింది. ఉమామి అనేది ఒక డిష్‌ని ఎలివేట్ చేసేలా రిచ్‌నెస్, ఫుల్నెస్ కూడిన ఒక విధమైన రుచి. మాంసం, చేపలు, పుట్టగొడుగుల కూరల్లోని గ్రేవీకి తీపి, పులుపుతో కూడిన రుచినే ఈ ఉమామి. ఇది మనసుకు ఓదార్పుని, ఊరటనిచ్చే ఆహ్లాదకరమైన రుచి అని చెప్పొచ్చు. అనేక ఆహారాల్లో ఉండే గ్లూటామేట్, అమైనో ఆమ్లం మన నాలుకపై ఉండే రుచి గ్రాహకాలను ప్రేరేపిస్తుంది. ఇదే ఉమామి రుచి. ఎక్కువగా మాంసం, సముద్రపు ఆహారంలో ఈ ఉమామి టేస్ట్ అనుభవానికి వస్తుందని చెబుతున్నారు ఆహార నిపుణులు. రుచి ఎలా ఉంటుందంటే...ఇది ఒక సంక్లిష్టమైన రుచి. ఒక డిష్ మొత్తం రుచిని, గొప్పతనాన్ని తెలియజేసేలా ఉంటుంది. మాంసాహారం, కూరగాయాలు గంటలు తరబడి ఉడకబెట్టిన పులుసులో ఈ రుచి తెలుస్తుంది. అంతేగాదు తల్లి పాలల్లో కూడా ఈ రుచి ఉంటుందట. ఏఏ వంటకాల్లో ఉంటుందంటే..చైనా: పులియబెట్టిన సోయాబీన్ పేస్ట్ (డౌబంజియాంగ్, ఓస్టెర్ సాస్ లెక్కలేనన్ని చైనీస్ వంటకాల్లో ఇది కనిపిస్తుంది. ఉమామి డెప్త్‌ను జోడిస్తాయి.భారతదేశం: నెయ్యి, స్పష్టమైన వెన్న, భారతీయ కూరలు, పప్పుతో కూడిన రెసిపీల్లో ఇది కనిపిస్తుంది. ఆగ్నేయాసియా: ఫిష్ సాస్, థాయ్ వంటకాలైనా స్టైర్-ఫ్రైస్, సూప్‌లలో ఈ ఉమామి టేస్ట్ ఉంటుంది. ఆరోగ్యానికి మంచిదేనా..?'ఉమామి' మన రుచి మొగ్గలను మాత్రమే కాకుండా, ఆరోగ్య ప్రయోజనాలను కూడా అందిస్తుంది. ఉమామి సంతృప్తతను పెంచుతుందని అధ్యయనాలు సూచిస్తున్నాయి. ఇది కడుపునిండుగా ఉన్న అనుభూతిని కలిగించి, అతిగా తినడాన్ని నియంత్రిస్తుంది. ఉమామి అధికంగా ఉండే ఆహారాలు గ్లుటామేట్, అమైనో ఆమ్లాల మూలం. కాబట్టి ఇది మెదడు పనితీరు, న్యూరోట్రాన్స్మిటర్ ఉత్పత్తికి మంచిది. (చదవండి: పౌల్ట్రీ వ్యర్థాలతో బెడ్షీట్లు,జాకెట్లు,కాగితాలు! సరికొత్త వస్త్ర పరిశ్రమ..) -
మోదీని మళ్లీ ముఖ్యమంత్రిని చేయాలి: సీఎం నితీష్
నేతల ఉత్సాహ పూరిత ప్రసంగాల్లో అప్పుడప్పుడు పొరపాట్లు దొర్లుతుంటాయి. తాజాగా బీహార్ సీఎం నితీష్ కుమార్ పొరపాటుగా ఒక వ్యాఖ్యానం చేసి, నలుగురిలో నవ్వులపాలయ్యారు.సీఎం నితీశ్ కుమార్ ఎన్నికల ప్రసంగాల్లో జనాన్ని ఉత్సాహపరిచేందుకు రకరకాల వ్యాఖ్యానాలు చేస్తుంటారు. ఈ నేపధ్యంలో ఒక్కోసారి తడబటడం, నోరు జారడం లాంటివి జరుగుతుంటాయి. తాజాగా ఆదివారం జరిగిన ఎన్నికల బహిరంగ సభలో సీఎం నితీష్ టంగ్ స్లిప్ అయ్యారు. ప్రధాని నరేంద్ర మోదీని ముఖ్యమంత్రిని చేయాలని ప్రజలను కోరారు.బీహార్‌లోని పట్నా సాహిబ్ లోక్‌సభ నియోజకవర్గంలోని దానియావాన్‌లో బీజేపీ నేత, ఎన్డీఏ అభ్యర్థి రవిశంకర్ ప్రసాద్‌కు మద్దతుగా బహిరంగ సభ నిర్వహించారు. ఈ సందర్భంగా వేదికపై ముఖ్యమంత్రి నితీశ్‌కుమార్ ప్రసంగిస్తూ, లోక్‌సభలో బీజేపీ 400కు పైగా సీట్లను గెలుచుకుంటుందని, ప్రజలంతా మరోసారి ప్రధాని నరేంద్ర మోదీని ముఖ్యమంత్రిని చేయాలని కోరారు. నితీష్ నోటివెంట ఈ మాట రాగానే అక్కడున్నవారంతా షాక్ అయ్యారు. అయితే వేదికపై ఉన్న ఇతర నేతలు జరిగిన పొరపాటును సీఎంకు గుర్తు చేశారు. దీంతో ఆయన.. ప్రధాని మోదీ మరోసారి దేశానికి ప్రధాని అవుతారని సర్దిచెప్పారు.గతంలోనూ సీఎం నితీష్ కుమార్ ఇలా పలుమార్లు నోరు జారారు. వైశాలిలో జరిగిన ఎన్నికల ప్రచారంలో ఆయన లోక్ జనశక్తి పార్టీ అభ్యర్థి వీణా దేవికి మద్దతుగా ప్రసంగిస్తూ, బీహార్‌లోని 40 స్థానాల్లో ఎన్డీఏ గెలవాలని కోరుకుంటున్నానని, మన కూటమి దేశం మొత్తం మీద నాలుగు వేల సీట్లు గెలవాలని అభిలషిస్తున్నానని అన్నారు. -
వైద్యుడి నిర్లక్ష్యం..నాలుగేళ్ల చిన్నారి గొంతు మూగబోయింది!
ఓ వైద్యుడి నిర్లక్ష్యం కారణంగా నాలుగేళ్ల చిన్నారికి మాట్లాడలేని పరిస్థితి ఎదురయ్యింది. ఆ చిన్నారి వేలుకి సర్జరీ చేయించుకోవడానికి వస్తే ఏకంగా ఎలాంటి సమస్యలేని నాలుకకి సర్జరీ చేశాడు ఓ వైద్యుడు. దీంతో ఆ చిన్నారి కుటుంబం నివ్వెరపోయింది. ఈ షాకింగ్ ఘటనతో ఆస్పత్రి వర్గాలు సదరు వైద్యుడుని తక్షణమే విధుల నుంచి తొలగించారు. ఈ దిగ్బ్రాంతికర ఘటన ఎక్కడ జరిగిందంటే..కేరళలోని కోజికోడ్ మెడికల్ కాలేజ్‌కి చెందిన ఒక వైద్యుడు నాలుగేళ్ల చిన్నారికి వేలికి బదులుగా నాలుకకి శస్త్ర చికిత్స చేశాడు. నిజానికి ఆమె చేతికి ఉన్న ఆరోవేలుని తొలగించుకునేందుకు ఆస్పత్రికి వచ్చింది. ఆపరేషన్ థియేటర్ నుంచి వచ్చిన తమ చిన్నారిని చూసి తల్లిదండ్రులు ఒక్కసారిగా షాక్‌కి గురయ్యారు. ఆగ్రహంతో ఏం జరిగిందని ప్రశ్నించగా..బాలిక నాలుకపై తిత్తి ఉందని అందువల్తొల నాలుకను తొలగించినట్లు చెప్పాడు వైద్యుడు. అసలు అమెకు నాలుకకు సంబంధించి ఎలాంటి సమస్యలు లేవని తెలిపారు. ఒకేరోజు రెండు సర్జరీలు జరగడంతో ఈ పొరపాటు జరిగిందని ఆస్పత్రి వర్గాలు చెప్పడంతో ఒక్కసారిగా ఆగ్రహానికి గురైన కుటుంబ సభ్యులు చైల్డ్ హెల్త్ డిపార్ట్మెంట్కి ఫిర్యాదు చేశారు. దీంతో ఈ ఘటనపై డైరెక్టర్ ఆఫ్ మెడికల్ ఎడ్యుకేషన్ సమగ్ర విచారణ జరిపి నివేదిక అందిచడంతో కేరళ రాష్ట్ర ఆరోగ్యగమంత్రి వీణా జార్జ్ అసోసీయేట్ ప్రొఫెసర్ డాక్టర్ బిజోన్ జాన్సన్‌ను సస్పెండ్ చేశారు. ఏదీఏమైనా..దీని కారణంగా ముద్దుముద్దు మాటాలతో తల్లిదండ్రులను మైమరిపించే చిన్నారి గొంతు మూగబోయింది. కొద్దిపాటి నిర్లక్ష్య వైఖరి ఎంతటి ప్రమాదానికి దారితీస్తుందే ఈ ఉదంతమే ఉదాహరణ.(చదవండి: ఘోస్ట్ మ్యారేజ్లు గురించి విన్నారా! ఏకంగా మ్యాట్రిమోనియల్ సైట్లో) -
బ్లూ వేల్స్ నాలుక అంత బరువా? ఈ నిజాలు తెలిస్తే షాక్ అవుతారు
బ్లూ వేల్ గ్రహం మీద అతిపెద్ద జంతువు. అంతరించిపోతున్న వాటిల్లో అతి పురాతన జీవుల్లో ఇది కూడా ఒకటి. ఇది ప్రపంచంలోని అన్ని మహాసముద్రాలలో చూడవచ్చు. సాధారణంగా వేసవి కాలంలో ఆర్కిటిక్ నీటిలో ఉంటుంది. శీతాకాలంలో దక్షిణ (వెచ్చని) జలాలకు వలసపోతాయి. బ్లూవేల్స్కు సంబంధించిన కొన్ని ఆసక్తికర విషయాలు. ♦ బ్లూ వేల్ గ్రహం మీద అతిపెద్ద జంతువు . దీని బరువు 30 పెద్ద ఏనుగుల బరువుకు అంటే దాదాపు 100-150 టన్నుల సమానం. ♦ బ్లూ వేల్స్ 100 అడుగుల కంటే ఎక్కువ పొడవు పెరుగుతాయి. ♦ బ్లూ వేల్ నాలుక బరువు ఆఫ్రికా ఆడ ఏనుగు బరువు సుమారు 2.7 టన్నులు ఉంటుంది. ♦ నీలి తిమింగలం నోటిలో దాదాపు 100 మంది వ్యక్తులు సరిపోతారు. ♦ నీలి తిమింగలం గుండె మినీ కూపర్ (కారు) పరిమాణంలో ఉంటుంది. ♦ తిమింగలం పొడవు రెండు పాఠశాల బస్సుల పొడవుకు సమానం మరియు వాటి బరువు 30 పెద్ద ఏనుగుల బరువుకు సమానం ♦ ఇది గ్రహం మీద అతి చిన్న జంతువులలో ఒకదానిని క్రిల్ (రొయ్యల లాంటిది) తింటుంది ♦ బ్లూ వేల్ ప్రతిరోజూ 4 నుండి 6 టన్నుల క్రిల్ తింటుంది. ఫీడింగ్ సీజన్లో, బ్లూ వేల్ ప్రతిరోజూ 3600 చేపలను తింటుంది. ♦ గర్భం దాల్చిన ఒక సంవత్సరం తర్వాత బిడ్డకు జన్మనిస్తుంది. ఈ బుల్లి వేల్ దాదాపు 3 టన్నుల బరువు ఉంటుంది. ♦ ఈ బేబీ వేల్ ప్రతిరోజూ 100 గ్యాలన్ల పాలు తాగుతుంది, ప్రతి గంటకు 9 పౌండ్లు (రోజుకు 200 పౌండ్లు) పెరుగుతుంది. ♦ ఇవి ఈత కొడుతూ నిద్రపోతాయి. తిమింగలాలు నిద్రపోతున్నప్పుడు మెదడులో సగం మాత్రమే ఉపయోగిస్తాయట. -
‘ఆ ఎమ్మెల్యే నాలుక తెగ్గోస్తే రూ. 10 లక్షలు’
హిందూ దేవుళ్లపై ఆర్జేడీ ఎమ్మెల్యే ఫతే బహదూర్ సింగ్ చేసిన వివాదాస్పద వ్యాఖ్యలు బీహార్‌లో కలకలం రేపాయి. ఈ నేపధ్యంలో శివ భవానీ సేన అనే హిందూ సంస్థ సదరు ఆర్జేడీ ఎమ్మెల్యే నాలుక తెగ్గోస్తే రూ. 10 లక్షల రివార్డును అందజేస్తామంటూ పోస్టర్లను అతికించింది. పాట్నాలోని బీహార్ శాసనసభ సభ్యుల ఫ్లాట్ల దగ్గర ‘శివ భవానీ సేన’ ఆర్జేడీ ఎమ్మెల్యేకు సంబంధించిన పోస్టర్‌ను అతికించింది. అందులో ఈ రివార్డ్ ప్రకటించారు. దీనిపై స్పందించిన ఎమ్మెల్యే బహదూర్ సింగ్ స్పందిస్తూ ‘శివ భవానీ సేన’పై పోలీసులకు ఫిర్యాదు చేశానని పేర్కొన్నారు. ఇటువంటి ప్రకటన చేసిన వారిపై వెంటనే కఠిన చర్యలు తీసుకోవాలని కోరుతూ బీహార్ డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్‌కు లేఖ రాశానని తెలిపారు. కొద్దిరోజుల క్రితం ఆర్జేడీ ఎమ్మెల్యే ఫతే బహదూర్ సింగ్ పేరుతో పలు గోడలపై కొన్ని చోట్ల పోస్టర్లు ప్రత్యక్షమయ్యాయి. వాటిలో సంఘ సంస్కర్త సావిత్రిబాయి ఫూలేను చెప్పిన మాటను ఉదహరిస్తూ.. ‘ఆలయం అంటే మానసిక బానిసత్వానికి మార్గం, పాఠశాల అంటే జీవితంలో వెలుగుల మార్గం’ అని రాసివుంది. ఇది గుడి గంట మోగిస్తే మనం మూఢనమ్మకాలు, మూర్ఖత్వం, అజ్ఞానం వైపు పయనిస్తున్నామని, బడి గంట మోగిస్తే హేతుబద్ధమైన జ్ఞానం, శాస్త్రీయత, వెలుగుల వైపు పయనిస్తున్నామనే సందేశం ఇస్తుంది. ఇప్పుడు మీరు ఏ దిశలో వెళ్లాలో నిర్ణయించుకోండి’ అని దానిలో రాసివుంది. కాగా ఆ పోస్టర్లో ఆర్జేడీ వ్యవస్థాపకుడు లాలూ ప్రసాద్, ఆయన భార్య, మాజీ ముఖ్యమంత్రి రబ్రీ దేవి ఫొటోలు ఉన్నాయి. అయితే ఈ పోస్టర్ గురించి పార్టీ ఎటువంటి అధికారిక ప్రకటన చేయలేదు. అయితే హిందూ శివ భవానీ సేన ఈ ప్రకటనను తప్పుబట్టింది. ఆ సంస్థ అధ్యక్షుడు లవ్ కుమార్ సింగ్ విలేకరులతో మాట్లాడుతూ.. హిందువులకు వ్యతిరేకంగా ఎమ్మెల్యే ఫతే బహదూర్ సింగ్ వ్యాఖ్యలు చేశారని, అతని నాలుకను తెగ్గోసినవారికి రూ. 10 లక్షలు బహుమానంగా అందిస్తామని ప్రకటించారు. ఫతే బహదూర్ సింగ్ ఉద్దేశపూర్వకంగా హిందువుల మనోభావాలను దెబ్బతీశారని ఆరోపించారు. -
అమెరికాలో వేగంగా విస్తరిస్తున్న కొత్త కరోనా: ఈ లక్షణాలుంటే..!
యావత్ ప్రపంచాన్ని గడగడలాడించిన కరోనా మహమ్మారి అమెరికాలో మరోసారి వేగంగా విస్తరిస్తోంది. అత్యంత ప్రమాదకరమైన కరోనా వైరస్ కొత్త వేరియంట్ హెచ్వీ.1 అమెరికన్లను భయపెడుతోంది. యూఎస్ సెంటర్స్ ఫర్ డిసీజ్ కంట్రోల్ అండ్ ప్రివెన్షన్ నుండి వచ్చిన డేటా ప్రకారం అక్టోబర్ 28తో ముగిసిన రెండు వారాల వ్యవధిలో కొత్తగా నిర్ధారణ అయిన కేసుల్లో 25.2 శాతం ఈ వేరియంట్ కారణమని తేల్చింది. గతంలో ప్రపంచవ్యాప్తంగా వేగంగా విస్తరించిన ఈజీ.5 అకా ఎరిస్ వేరియంట్ల కంటే ఈ హెచ్వీ.1 వేరియంట్ ఎక్కువ డామినెంట్ వేరియంట్ అని, ఇటీవల నమోదైన కేసుల్లో నాలుగో వంతు కంటే మించి హెచ్వీ.1 వేరియంట్ కేసులేనని గుర్తించారు. అమెరికా సెంటర్స్ ఫర్ డిసీజ్ కంట్రోల్ అండ్ ప్రివెన్షన్ తాజా గణాంకాల ప్రకారం జూలైలో 0.5 శాతంగా ఉన్న ఈ వేరియంట్ కేసులు సెప్టెంబర్ నాటికి అవి 12.5 శాతానికి పెరిగాయి. దీన్ని ఒమిక్రాన్ గ్రాండ్ చైల్డ్‌గా వాండర్బిల్ట్ యూనివర్శిటీ మెడికల్ సెంటర్లోని ఇన్ఫెక్షియస్ డిసీజెస్ ప్రొఫెసర్ డా. విలియం షాఫ్నర్ పేర్కొన్నారు. అలాగే పిలోరా జేఎన్.1 వేరియంట్‌ను ఐస్లాండ్, పోర్చుగల్, స్పెయిన్‌తో సహా 12 దేశాలలో కనుగొన్నారు. కోవిడ్ టంగ్ ఈ వేరియంట్ సోకిన వారిలో గొంతు నొప్పి, జలుబు, దగ్గు, తలనొప్పి, అలసట, కండరాల నొప్పి, చలి లాంటివి కోవిడ్‌లో కీలక లక్షణాలు. అయితే, ఈ కొత్త వేరియంట్ సోకిన వారి నోటిలో కోవిడ్ టంగ్ లక్షణం కనిపిస్తోందని ఆరోగ్య నిపుణుల అభిప్రాయాన్ని ఉటంకిస్తూ టైమ్స్ ఆఫ్ ఇండియా నివేదించింది. దీని ప్రకారం ఒమిక్రాన్ హెచ్వీ.1, పిరోలా జాతి జేఎన్.1 వేరియంట్స్ బారిన పడిన వారిలో నాలుక వాపు లేదా మంట ముఖ్య లక్షణంగా ఉంటోంది. కొంతమంది రోగుల నాలుకపై సాధారణం కంటే తెల్లని మందపాటి పొర ఏర్పడుతోంది. దీంతోపాటు నాలుక బాగా ఎర్రగా మారడం, మంట, రుచి కోల్పోవడం, కొద్దిగా తిమ్మిరి కనిపించాయట. కొన్నిసార్లు నాలుకపై గడ్డలు , అల్సర్లు ఏర్పడినట్టు తాజా రిపోర్టుల ద్వారా తెలుస్తోంది. అయిదే మన శరీరంలోని ఇమ్యూన్ సిస్టం వైరస్‌తో పోరాడుతున్నదానికి సంకేతం కావచ్చని, కొంతమందికి, కొన్ని రోజుల తర్వాత వాపు దానంతట అదే తగ్గిపోతుందని తెలిపారు. మరికొంతమందికి మందులు వాడాల్సి ఉంటుందన్నారు.ఈ నేపథ్యంలో ఇలాంటి లక్షణాలుంటే వెంటనే వైద్యుణిని సంప్రదించాలని చెప్పారు. ఈ వేరియంట్ చాలా త్వరగా వ్యాప్తి చెందుతున్నప్పటికీ, శాస్త్రవేత్తలు హెచ్వీ.1 లాంటి వేరియంట్ కొత్త వేరియంట్ల గురించి పెద్దగా ఆందోళన చెందడం లేదని ఎన్బీసీ న్యూస్ రిపోర్ట్ చేసింది.ఎక్కువ మ్యుటేషన్ అయ్యే వేరియంట్లు తక్కువ హాని కలిగిస్తాయని వీరు పేర్కొన్నారు. -
పార్లమెంట్ సాక్షిగా ట్రూడో చిల్లర చేష్టలు
ఒట్టావా: కెనడా పార్లమెంట్ సాక్షిగా ప్రధాని జస్టిన్ ట్రూడో చేష్టలపై నెటిజన్లు ఫైరవుతున్నారు. దేశ ప్రధాని స్థానంలో ఉన్న వ్యక్తి ప్రదర్శించాల్సిన తీరుకాదని విమర్శలు గుప్పిస్తున్నారు. మంగళవారం కెనడా పార్లమెంట్లో నూతన స్పీకర్ కొలువుదీరిన నేపథ్యంలో జస్టిన్ ట్రూడో నాలుకతో సంజ్ఞలు చేస్తూ.. కన్నుగీటారు. ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయింది. కెనడా పార్లమెంట్లో నూతన స్పీకర్ గ్రెగ్ ఫెర్గస్.. ప్రధాని జస్టిన్ ట్రూడోను సభకు పరిచయం చేస్తూ..'గౌరవనీయులైన ప్రధాని' అని సంబోధించారు. ఇంతలోనే ట్రూడో మధ్యలో కలగజేసుకుని 'చాలా గౌరవనీయులైన ప్రధాని' అని సరిచేశారు. ఈ క్రమంలోనే స్పీకర్ గ్రెగ్ వైపు చూస్తూ నాలుకతో సంజ్ఞలు చేస్తూ.. కన్నుగీటారు. The rig is in. Canadian Prime Minister Justin Trudeau gives a wink and bites his tongue at new Speaker of the House of Commons, Greg Fergus. What is going on in Canada? Fergus, who is a liberal, was elected after the previous speaker was forced to resign for praising a Nazi on… pic.twitter.com/WjuaaVuLIu — illuminatibot (@iluminatibot) October 4, 2023 ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ప్రధాని స్థానంలో ఉండి ట్రూడో వైకరి చిన్నపిల్లల వలె ప్రవర్తిస్తున్నారని మండిపడ్డారు. కన్నగీటడం, నాలుకతో సంజ్ఞలు సాధారణ పౌరులకే ఇబ్బందికరంగా ఉంటాయి. అలాంటిది పార్లమెంట్ సాక్షిగా ఇలా ప్రవర్తించడం దారుణమని కామెంట్లు పెట్టారు. ఈ వ్యవహారంపై ప్రతిపక్షనాయకులు విమర్శలు సందించారు. నాజీ సైన్యంలో పనిచేసిన ప్రముఖునికి పార్లమెంట్లో గౌరవసన్మానం చేసిన వ్యవహారంలో మాజీ స్పీకర్ ఆంటోని రోటా తన పదవికి రాజీనామా చేశారు.ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కీ పర్యటన సందర్భంగా ఈ ఘటన జరిగింది. యూదులను ఊచకోత కోసిన హిట్లర్ తరుపున యుద్ధంలో పాల్గొన్న వ్యక్తికి సన్మానం చేయడం వివాదాస్పదంగా మారింది. దీంతో మాజీ స్పీకర్ రాజీనామా చేయడంతో కొత్త స్పీకర్‌ను నియమించాల్సిన అవసరం ఏర్పడింది. ఇదీ చదవండి: మోదీ చాలా తెలివైన వ్యక్తి: పుతిన్ -
ఎంతపనైపాయే! పొరపాటున నాలుక కరుచుకుంది..అంతే ఊపిరాడక..
మాట్లాడుతూ లేదా భోజనం చేస్తూ నాలుక కరుచుకోవడం అనేది సర్వసాధారణం. కరచుకున్న వెంటనే బాధగా ఉంటుంది. ఆ తర్వాత కాసేపటికి లేదా మరుసటి రోజుకి తగ్గిపోతుంది. అంత సీరియస్ అయిన ఘటనలు ఇంతవరకు జరగలేదు కూడా. కానీ ఇక్కడొక మహిళకు ఎదురైన విపత్కర స్థితిని చూస్తే మాత్రం వామ్మో!నాలిక కరచుకుంటే ఇంతలా జరుగుతుందా? అని ఆశ్చర్యపోవడం ఖాయం. ఆ మహిళ భోజనం చేస్తూనే అనుకోకుండా నాలిక కరుచుకుంది. అదే ఏకంగా ఆమె ప్రాణాలను కోల్పోయే స్థితికి దారితీసింది. ఈ అనుహ్య ఘటన ఆస్ట్రేలియాలో చోటు చేసుకుంది. వివరాల్లోకెళ్తే..27 ఏళ్ల ఆస్ట్రేలియన్ మహిళ కైట్లిన్ అల్సోప్ తన స్నేహితులతో కలిసి భోజనం చేస్తుండగా నాలుక కరుచుకుంది. ఆ టైంలో ఆమెకు కాస్త నొప్పిగా అసౌకర్యంగా అనిపించింది. సర్వసాధారణంగా జరిగేదే కదా అని తేలిగ్గా తీసుకుంది. అంతే కొన్ని గంటలకే ఊపిరి ఆడటం, శ్వాస తీసుకోవటం కష్టమై అపస్మారక స్థితిలోకి వెళ్లిపోయింది. ఒక్కసారిగా స్నేహితులంతా ఆమె పరిస్థితిని చూసి కంగుతిన్నారు. వెంటనే ఆమెను హుటాహుటినా ఆస్పత్రికి తరలించి ఎమర్జెన్సీ కేసు అంటూ టెస్ట్‌లు చేయడం ప్రారంభించారు వైద్యులు. ఆమె ఒక విధమైన అనాఫిలాక్సిస్ అనే ఎలర్జీకి గురయ్యిందని చెప్పారు. తక్షణమే కొన్ని మందులు ఇచ్చి పరిస్థితి నార్మల్‌కి వచ్చేలా యత్నించారు వైద్యులు. ఐతే అనూహ్యంగా ఆమె పరిస్థితి విషమంగా మారడం ప్రారంభమైంది. చూస్తుండగానే చర్మం ఎరుపు నుంచి నీలం రంగులోకి వచ్చేసింది. ఆమె నాలుకు నల్లగా అయిపోవడం జరిగింది. ఇక ఆమె నాలుకను తీసేయాల్సి వస్తుందని భావించి వెంటనే అప్రమత్తమయ్యి వివిధ వైద్య పరీక్షలు నిర్వహించారు వైద్యులు. చివరికి ఆమె అరుదైన లుడ్విగ్స్ ఆంజినా అనే ప్రాణాంతక ఇన్ఫెక్షన్తో బాధపడుతున్నట్లు వైద్యులు గుర్తించారు. ఇది నోరు, మెడ వరుకు ఉన్న మృదుకణజాలంపై ప్రభావం చూపే ప్రాణాంతక సెల్యూటైటిస్గా పేర్కొన్నారు. ఈ ఇన్ఫెక్షన్ ఆమె నోటిలో ఉండే జ్ఞాన దంతాల కారణంగా వచ్చిందని, ఇది ఆమె నోటిలోకి వేగంగా వ్యాపించడం ప్రారంభించిందని అన్నారు. ఇదికాస్త సెప్సిస్‌కి గురయ్యి అవయవాన్ని తీసేయాల్సిన ప్రమాదం ఏర్పడే అవకాశం ఉందన్నారు వైద్యలు. తక్షణమే చికిత్స అందించేందుకు ఆమెకు మత్తు ఇచ్చి ట్రీట్మెంట్ చేయడం ప్రారంభించారు. ఆక్సిజన్ సరఫరా తక్కువగా ఉన్నందున్న ఇతర అవయవాలు మూసుకుపోకుండా చూసుకోవాల్సి ఉందని ఇది చాలా క్రిటికల్ ఆపరేషన్ అని చెప్పారు. సూమారు గంటపాటు వైద్యలు శ్రమించి కొద్దిపాటి శస్త్ర చికిత్స చేశారు. ఇప్పుడిప్పుడే క్లైటిన్ కోలుకుంటోంది. లుడ్విగ్ ఆంజినా అంటే.. ఇటీవల జరిగిన గాయం ఇన్ఫెక్షన్కి గురయ్యినా లేదా మధుమేహం, మద్యపానం, పోషకాహారలోపం తదితరాల కారణంగా గాయలైతే అది లుడ్విగ్ ఆంజినా అనే ఎలర్జీకి గురయ్యి రోగి పరిస్థితిని దిగజారస్తుంది. ఇది సాధారణంగా దంతాల ఇన్ఫెక్షన్ వల్ల వస్తుందట. దాదాపు 10 నుంచి 9 కేసుల్లో దవడలోని రెండవ లేదా మూడవ దంతాల నుంచి మొదలవుతుందని వైద్యులు చెబుతున్నారు. దీని లక్షణాలు మాట్లాడటం కష్టం అధిక జ్వరం, చలి దవడలో నొప్పి మెడ నొప్పి వాపు వాచిపోయిన నాలుక నోరు సున్నితత్వం మారడం తీవ్రమైన పంటి నొప్పి నివారణ: లుడ్విగ్ ఆంజినాను నివారించాలంటే నోటి పరిశుభ్రత పాటించాలని చెబుతున్నారు వైద్యులు. దంతాలు పుచ్చిపోకుండా చూసుకోవాలని చెప్పారు. దంతాల ఇన్ఫెక్షన్ కారణంగానే వస్తుందని అన్నారు. ఒక రకంగా చెప్పాలంటే ఇది దంతాలు ఇన్ఫెక్ట్ కాకుండా ఉండేలా చేస్తుందని కూడా చెప్పొచ్చు అంటున్నారు వైద్యులు. (చదవండి: ఆ వ్యాధి క్యాన్సర్ కంటే ప్రాణాంతకం! చికిత్స కూడా లేదు!) -
పెదాలపై ముద్దుపెట్టిన దలైలామా.. వీడియో వైరల్.. నెటిజన్ల ఫైర్..
న్యూఢిల్లీ: టిబెట్ బౌద్ధమత గురువు, ఆధ్యాత్మికవేత్త దలైలామాకు సంబంధించిన ఓ వీడియోపై నెటిజన్లు తీవ్ర స్థాయిలో మండిపడుతున్నారు. తన వద్దకు ఆశీర్వాదం కోసం వెళ్లిన ఓ బాలుడి పెదాలపై ఆయన ముద్దుపెట్టారు. అంతేకాదు తన నాలుకను ముద్దు పెట్టమని ఆ బాలుడ్ని కోరాడు. ఈ దృశ్యాలు చూసిన నెటిజన్లకు చిర్రెత్తుకొచ్చింది. ఓ మత గురువు అయిన మీరు ఏం చేస్తున్నారో అర్థమవుతుందా? పిల్లలతో ఇలాగేనా ప్రవర్తించేది అంటూ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ దృశ్యాలు అసహ్యంగా ఉన్నాయని విమర్శలు గుప్పించారు. అయితే దలైలామా బాలుడికి ముద్దుపెట్టే సమయంలో అక్కడున్నవారంతా కేరింతలతో చప్పట్లు కొట్టారు. వీరంతా ఇలా చేయడంపై పులువురు నెటిజన్లు ఆశ్చర్యం వ్యక్తం చేశారు. దలైలామా బాలుడితో అసభ్యంగా ప్రవర్తిస్తుంటే మీరంతా ప్రోత్సహించడమేంటని ఫైర్ అయ్యారు. So the Dalai Lama is kissing an Indian boy at a Buddhist event and he even tries to touch his tongue. He actually says "suck my tongue" Now why would he do that? 🤔 pic.twitter.com/TjDizaDHZp — Richard (@ricwe123) April 8, 2023 మరికొందరు నెటిజన్లు మాత్రం దలైలామా ముద్దుపెడుతున్నప్పుడు ఆ బాలుడు చాలా ఇబ్బందిగా ఫీల్ అయ్యాడని అన్నారు. చిన్నారిని పెదాలపై కిస్ చేయడమేంటి? ఇదేం సంప్రదాయం? నాలుకను ముద్దుపెట్టమని అడగడమేంటి అని ప్రశ్నించారు. అయితే ఓ నెటిజన్ మాత్రం వీరి విమర్శలకు సమాధానం చెప్పాడు. పెదాలు, నాలుకపై ముద్దుపెట్టడం టిబెట్ సంప్రదాయంలో ఓ భాగమని చెప్పుకొచ్చాడు. టిబెట్‌లో ఒకరి నాలుకను బయటకు తీయడం ఒక ఆచార పద్ధతి అని పేర్కొన్నాడు. ఈ సంప్రదాయం 9వ శతాబ్దానికి చెందిందని, లాంగ్ ధర్మా అనే అపఖ్యాతి పాలైన రాజు పాలన నుంచి ఇది కొనసాగుతోందన్నాడు. చదవండి: హెల్మెట్ లేకుండా స్కూటీపై మహిళా పోలీసులు.. ‘ఏంటి సర్.. ఇదే తప్పు మేం చేస్తే!’ -
బడ్జెట్లో టంగ్ స్లిప్ అయిన నిర్మలమ్మ..ఓహ్ !సారీ అంటూ...
లోక్‌సభలో 2023-24 బడ్జెట్ ప్రసంగం చేస్తూ.. ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ఆసక్తికరమైన పొరపాటు చేశారు. ఆమె అనుకోకుండా టంగ్ స్లిప్ అయ్యి అన్న మాటతో అక్కడ ఒక్కసారిగా లోక్‌సభలో నవ్వులు విరబూశాయి. వెహికల్ రీప్లేస్మెంట్ గురించి మాట్లాడుతూ ఆమే ఓల్డ్ పొల్యూషన్ వెహికల్స్ బదులుగా ఓల్డ్ పాలిటిక్స్ అన్నారు. దీంతో అక్కడ అర్థమే మారిపోయిందంటే పాత రాజకీయాలను తొలగించటం అన్నట్లు అర్థం వచ్చింది. దీంతో బీజేపీ నేతృత్వంలోని ఎన్డీఏ సభ్యుల ముఖాలు నవ్వులతో వెలిగిపోయాయి. అయితే ప్రతి పక్షాల సభ్యుల ముఖాలు ఎలాంలి భావాన్ని వ్యక్తం చేయాలేదు. ఐదే ఈ తప్పిదాన్ని నిర్మలమ్మ వెంటనే గమనించి చిరునవ్వుతో..ఓహ్ సారీ అంటూ సరైన వివరణ ఇచ్చారు. పర్యావరణ పరిరక్షణ విధానంలో భాగంగా పాత కాలుష్య వాహనాలను మార్చడం అని పలుమార్లు తప్పిదాన్ని సరిచేస్తూ చెప్పారు. అంతేగాదు పాత కాలుష్య వాహనాలను మార్చడం మన ఆర్థిక వ్యవవస్థను పచ్చగా మార్చడంలో ముఖ్యమైన భాగం అని నిర్మలమ్మ చెప్పారు. అలాగే బడ్జెట్ 2021-22లో పేర్కొన్న వెహికల్ స్క్రాపింగ్ పాలసీని కొనసాగించడంలో రాష్ల్రాలకు కూడా మద్దతు ఉంటుందని నిర్మలా సీతారామన్ అన్నారు. (చదవండి: పీఎం విశ్వ కర్మ కౌశల్ సమ్మాన్: బడ్జెట్ చరిత్రలో.. తొలిసారిగా వాళ్ల కోసం ప్యాకేజీ) -
యూపీలో దేవతకు నాలుక సమర్పణ
లక్నో: ఉత్తరప్రదేశ్‌లో భక్తి పారవశ్యంలో మునిగిన ఓ భక్తుడు ఏకంగా నాలుక తెగ్గోసుకున్నాడు! కౌషాంబికి చెందిన 38 ఏళ్ల సంపత్.. మెహందీగంజ్లోని మాతా శీతలాదేవి మందిరానికి భార్యతో కలిసి వెళ్లాడు. ఆలయదర్శనానికి ముందు గంగానదిలో పుణ్యస్నానం చేశాడు. తర్వాత బ్లేడుతో తన నాలికను కత్తిరించుకుని ఆలయ ద్వారం వద్ద సమర్పించాడు. నాలుక తెగడంతో కొద్దిసేపటికే సంపత్ పరిస్థితి దారుణంగా తయారైంది. వెంటనే అతడిని జిల్లా ఆస్పత్రికి తరలించారు. ప్రస్తుతం అతని ఆరోగ్య పరిస్థితి విషమంగా ఉందని కరా ధామ్ పోలీస్‌స్టేషన్ స్టేషన్ ఆఫీసర్ అభిలాష్ తివారీ చెప్పారు. ఇంత పని చేస్తాడనుకోలేదంటూ భార్య వాపోతోంది. చదవండి: అదర్ పూనావాలా పేరిట రూ.కోటి టోపీ -
వైరల్ వీడియో.. ఒకేసారి రెండింటిని రుచి చూడగలదు..
కొంతమంది ఏదైనా తిని లేదా తాగి తటపటాయించకుండా దాని రుచి ఎలా ఉందో ఠక్కున చెప్పేస్తారు. అయితే, ఒకసారి ఒకదాన్నే రుచి చూసి చెప్పగలరు. అదేంటి ఎవరైనా ఒకసారి ఒకదాన్నే రుచి చూడగలరు అంటారా? కానీ బ్రియన్నా మేరీ షిహాడే మాత్రం ఒకేసారి రెండింటిని రుచి చూడగలదు. ఆమె నాలుక అలాంటిది మరి! అమెరికాలోని కాలిఫోర్నియాకు చెందిన షిహాడేకు బాడీ మోడిఫికేషన్.. అదేనండి శరీరంలో మార్పులు చేసుకోవడమంటే మహా సరదా. సర్జరీ ద్వారా ఆమె తన నాలుకను రెండుగా స్ప్లిట్ చేయించుకుంది. ఇటీవల ఆమె ఒక గ్లాస్లో స్ప్రైట్ కూల్‌డ్రింక్, మరోగ్లాస్లో మంచినీళ్లు పెట్టుకుని రెండింటిని ఒకేసారి తాగి తన స్ప్లిట్ నాలుకతో రెండింటి రుచులు చెప్పేసింది. దీనికి సంబంధించిన వీడియోను సోషల్ మీడియాలో పెట్టగా పిచ్చపిచ్చగా లైక్స్ వచ్చాయి. ఆమెకు ఇన్‌స్టాగ్రామ్‌లో 2,28,000 మంది ఫాలోయర్లు ఉన్నారు. అయితే, ఈ స్ప్లిట్ టంగ్ అనేది చాలా ప్రమాదకరమని వైద్యులు అంటున్నారు. చదవండి: చేనులో చేపలే పంట! View this post on Instagram A post shared by 🌼Flower🌼 (@flower.friendly) -
ష్యాషన్ కోసం నాలుకను రెండుగా విడగొట్టింది...ఆ తర్వాత
Woman With Split Tongue Tastes 2 Drinks At: చాలామంది యువత ఫ్యాషన్ మాయలో పడి విచిత్రమైన విధంగా తమ శరీరం సౌష్టవాన్ని మార్చుకుంటుంటారు. అంతేందుకు కొంతమంది మగవాళ్లు చెవులకు రింగులు పెట్టుకోవడాలు, టాటులు వేయించుకోవడం వంటి విచిత్రమైన పనులు చేస్తుంటారు. ఆడవాళ్లు కూడా ఫ్యాషన్ విషయంలో తక్కువేం కాదనే చెప్పాలి. ఎందుకంటే వాళ్లు చెవులకు రింగులు కుట్టించుకుంటే వీళ్లు నాలుకకి, నోటికి రింగులు పెట్టుకుంటున్నారు. పైగా జుట్టుకు కూడా విచిత్రమైన రంగురంగుల డైలు వేసుకుని దెయ్యాన్ని తలపించేలా రెడీ అవుతున్నారు. ఇందంతా ఎందుకు చెబుతున్నానంటే ఇక్కడొక ఆమె ఫ్యాషన్ కోసమో లేక మరేందుకో గానీ నాలుకను రెండుగా విడగొట్టుకుంది. పైగా ఇప్పుడు తాను ఒకేసారి రెండు రకాల పదార్థాలను టేస్ట్ చేయగలనని మరీ చెబుతోంది. వివరాల్లోకెళ్తే.... కాలిఫోర్నియాలో నివసిస్తున్న బ్రియానా మేరీ షిహదేహ్ ఆమె తన శరీరాన్ని రకరకాలు మార్చుకోవడం ఆమెకు ఇష్టం. ఈ మక్కువతోనే తన నాలుకను శస్త్ర చికిత్స ద్వారా రెండుగా విడదీసింది. అంతేగాదు మీరెప్పుడైన రెండు రకాల ఆహార పదార్ధాలను ఒకేసారి టెస్ట్ చేయగలిగారా అని ఎదురు ప్రశ్నిస్తోంది. ఆమె రెండు రకాల ఆహార పదర్థాలను ఎలా టేస్ట్ చేయగలదో కూడా చూపించింది. అందుకు సంబంధించిన వీడియో నెట్టింట తెగ వైరల్ అవుతోంది. మీరు కూడా ఓ లుక్కేయండి. View this post on Instagram A post shared by 🌼Flower🌼 (@flower.friendly) (చదవండి: వెడ్డింగ్ రిసెప్షన్లో వధూవరుల 'ఫైర్ స్టంట్'.. షాకైన అతిథులు...) -
ఆశ్చర్యం: మనిషి నాలుకపై వెంట్రుకలు.. ఎందుకలా!
Man Starts Growing Thick Black Hair: ఇంతవరకు మన చాలా అరుదైన వ్యాధులు గురించి విన్నాం. పైగా వాటిలో చాలా మటుకు జన్యు సంబంధ సమస్యల వల్ల సంభవించినవి. అయితే కొన్ని రకాలైన వ్యాధులు వ్యక్తిగత అపరిశుభ్రత వల్లనో లేక మరేదైన కారణం వల్లనో తెలయదు గానీ చాలా విచిత్రంగా వస్తుంటాయి. అవి కాస్త డాక్టర్ వద్ద చెప్పడానికి ఇబ్బందిగా కూడా ఉంటుంది. అచ్చం అలానే ఇక్కడొక వ్యక్తి అరుదైన విచిత్రమైన వ్యాధితోనే బాధడపడుతున్నాడు. వివరాల్లోకెళ్లే..50 ఏళ్ల వ్యక్తికి నాలుక పై దట్టమైన జుట్టు పెరడం ప్రారంభించింది. దీంతో అతను వైద్యులను సంప్రదించాడు. వైద్యులు అతనికి లింగువా విల్లోసా నిగ్రా లేదా నల్లటి వెంట్రుకల నాలుక అనే అసాధారణ వ్యాధితో బాధపడుతున్నట్లు గుర్తించారు. ఈ వ్యాధికి ముందు అతను పక్షవాతానికి గురయ్యాడు. అతని సంరక్షకులు ఆ సమయంలో అతని నాలుక పై నల్లటి మచ్చలు రావడం గమినించామని చెప్పారు. కానీ అవి కాస్త దట్టంగా వచ్చేంత వరకు అది జుట్టు అని వాళ్లు గుర్తించలేకపోయారు. దీంతో వాళ్ల చర్మవ్యాధి నిపుణిడిని సంప్రదించారు. అప్పడే ఈ విషయం వెలుగులోకి వచ్చింది. దీంతో వైద్యులు ఎందువల్ల ఈ వ్యాధి వచ్చిందనే దానిపై పరిశోధించడం మొదలుపెట్టారు. ఈ మేరకు బ్యాక్టీరియా లేదా శిలీంధ్రాల పెరుగుదలను తనిఖీ చేసే నిమిత్తం అతని నోటి నుంచి శ్లేష్మ నమూనాలను తీసుకున్నారు. అవన్నీ ప్రతికూత ఫలితాలనిచ్చాయి. దీంతో అతను ఒక అరుదైన నల్లని వెంట్రుకల నాలుక(బీహెచ్‌టీ) అనే వ్యాధితో బాధపడుతున్నట్లు తెలుసుకున్నారు. నాలుక ఉపరితలంపై చిన్న, కోన్-ఆకారపు గడ్డలు, ఫిలిఫార్మ్ పాపిల్లే అని పిలవబడేవి, షెడ్, లేనప్పుడు ఈ వెంట్రుకలు వస్తాయిని చెప్పారు. నిజానికి మనం బ్రెష్ చేసినప్పుడు ఈ పాపిల్లే అని పిలవబడే షెడ్ క్లీన్ అయ్యి అవి కొంచెంగా పెరుగుతుంటాయి. అదిగాక నాలుక సాధారణ రాపిడికి గురి కానప్పుడూ ఇలాంటి సమస్య తలెత్తుందని చెప్పారు. అంతేకాదు సాధారణ నోటి పరిశుభ్రత పద్ధతులతో మనిషి నల్లటి వెంట్రుకల నాలుక త్వరగా క్లియర్ అవుతుందని చెప్పారు. వైద్యులు సూచనతో ఆ వ్యక్తి ఈ సమస్య నుంచి ఇప్పుడిప్పుడే నెమ్మదిగా నెమ్మదిగా రికవరి అవుతున్నాడు. నోటి అపరిశుభ్రత వల్లే ఇలాంటి వ్యాధులు వస్తాయని వైద్యులు చెబుతున్నారు. (చదవండి: సింహాన్ని ఎత్తి పడేసిందిగా...దెబ్బకు పరుగు లంకించింది -
రెండు వేల ఏళ్లనాటి సమాధుల్లో... బంగారపు నాలుక!!
ఇంతవరకు ఈజిప్టులో పిరమిడ్ రూపంలో మమ్మీలుగా పిలిచే సమాధులు ఉన్నాయని మనం విన్నాం. అంతేగాక ఆ సమాధులు రాజ వంశానికి చెందిన వారివి అని, పైగా వారు వాడిన వస్తువులు అన్నింటిని ఆ సమాధిలో భద్రపరిచేవారని విన్నాం. కానీ ఈజిప్టులో ఇంకా కొన్ని సమాధులపై పురావస్తు శాఖ తవ్వకాలు జరుపుతూ....పరిశోధనలు చేస్తూనే ఉంది. అయితే ఆ క్రమంలోనే ఈజిప్టు పురావస్తు శాఖ ప్రస్తుతం ఒక రాజవంశానికి చెందిన రెండు సమాధులు పక్కపక్కనే ఉన్నట్లు గుర్తించడమే కాక బంగారపు అవశేషాలు ఉన్నట్లు గుర్తించింది. (చదవండి: వామ్మో! ఆ దేశం కేవలం పూల వ్యాపారంతోనే.... రూ.180 కోట్ల ఆదాయాన్ని ఆర్జిస్తుందటా!!) అసలు విషయంలోకెళ్లితే....కైరోలోని పర్యాటక పురాతన వస్తువుల మంత్రిత్వ శాఖ ఈజిప్టులోని మిన్యా గవర్నరేట్‌లో రెండు వేల ఏళ్ల క్రితం నాటి సైటే రాజవంశానికి చెందిన రెండు సమాధులు పక్కపక్కనే ఉన్నట్లు గుర్తించినట్లు ప్రకటించింది. పైగా ఈ సమాధులను స్పానిష్ పురావస్తు మిషన్ ద్వారా కనుగొన్నట్లు తెలిపింది. అంతేకాదు బార్సిలోనా విశ్వవిద్యాలయం నుండి వచ్చిన మిషన్ సమాధులలో ఒకదానిలో బంగారు నాలుకలతో ఉన్న ఇద్దరు అపరిచిత వ్యక్తుల అవశేషాలను కనుగొన్నట్లు సుప్రీమ్ కౌన్సిల్ ఆఫ్ యాంటిక్విటీస్ సెక్రటరీ జనరల్ మోస్తఫా వాజిరి వెల్లడించారు. పైగా సమాధి లోపల ఒక మహిళ ఆకారంలో కవర్‌తో కూడిన సున్నపురాయి శవపేటికను గుర్తించినట్లు చెప్పారు. అయితే సమాధి యొక్క ప్రాథమిక అధ్యయనాల్లో ఇది గతంలో పురాతన కాలంలో తెరివడబడినట్లు వాజీరి పేర్కొన్నాడు. ఈ క్రమంలో రెండోవ సమాధి మాత్రం త్రవ్వకాల సమయంలో మిషన్ సాయంతో దానిని మొదటిసారిగా తెరిచినట్లు చెప్పుకొచ్చారు. ఈ మేరకు కానోపిక్ కుండలను కలిగి ఉన్న రెండు శవపేటికలతో పాటు, మానవ ముఖంతో ఉన్న సున్నపురాయి శవపేటిక ఏ మాత్రం చెక్కు చెదరకుండా మంచి స్థితిలో రెండవ సమాధిలో ఉన్నట్లు మిషన్ త్రవ్వకాలను పర్యవేక్షించే హసన్ అమెర్ చెప్పారు. అయితే ఒక కుండలో ఫైయన్స్‌తో చేసిన సుమారు 402 ఉషబ్తి బొమ్మలు, చిన్న తాయెత్తులు, ఆకుపచ్చ పూసలు ఉన్నాయని హసన్ చెప్పారు. ఈ మేరకు హసన్ ఇటీవల కాలంలో ఈజిప్టులో ఫారోనిక్ సమాధులు, విగ్రహాలు, శవపేటికలు, మమ్మీలతో సహా అనేక పురావస్తు ఆవిష్కరణలు జరిగాయని అన్నారు. (చదవండి: దేశంలో డ్రైవింగ్ లైసెన్స్ పొందిన తొలి మరుగుజ్జు వ్యక్తి మనోడే!) -
బాప్రే!... రెండు తలలు ఉన్న బల్లిని చూశారా!!
రెండు తలల పాములను చూసి ఉంటాం. అంతేందుకు అవిభక్త కవలలు అంటూ మనుషులను కూడా చూసి ఉంటారు. అయితే రెండు తలలు బల్లులను ఎప్పుడైన చూశారా. అంతేకాదు అవి ఉంటాయని కూడా అనుకోరు. అసలు విషయంలోకెళ్లితే...ఇక్కడొక రెండు తలలతో చాలా వింతగా కూడా ఉంది. పైగా దాని నాలుక నీలి రంగులో ఉంటుందట. చాలా ఆశ్చర్యంగా అనిపిస్తుంది కదూ!. అయితే దీనికి సంబంధిన వీడియో ఒకటి నెట్టింట తెగ హల్చల్ చేస్తుంది. లక్షల్లో వ్యూస్, లైక్‌లు వస్తున్నాయి. మీరు కూడా ఓ లుక్ వేయండి. (చదవండి: గతేడాది చనిపోతే!... ఇప్పుడు మృత దేహాలను ఇచ్చారు!!) View this post on Instagram A post shared by Jay Brewer (@jayprehistoricpets) -
తేనెను జుర్రేసే ప్రత్యేక పురుగు.. దీని నాలుక ఎంత పెద్దదో తెలుసా?
తేనెటీగలు, తుమ్మెదలు, ఇంకా కొన్నిరకాల పురుగులు పూలలో తేనెను జుర్రేస్తూ మజా చేస్తుంటాయి. పూల లోపలికి నాలుక (గొట్టం వంటి ప్రత్యేక నిర్మాణం) చాపి తేనెను పీల్చేస్తాయి. మరి బాగా పెద్దవో, పొడుగ్గానో ఉండే పూలు అయితే ఎలా? అలాంటి పూల నుంచీ తేనెను జుర్రేసే ప్రత్యేకమైన పురుగే.. డార్విన్స్ మోత్ (చిమ్మట). ఆఫ్రికా ఖండం తీరానికి సమీపంలోని మడగాస్కర్ దీవుల్లో ఉండే ఈ పురుగు నాలుక ఎంత పెద్దదో తెలుసా.. ఏకంగా 11.2 అంగుళాలు. ఇంచుమించు ఒక అడుగు పొడవు అన్నమాట. ఆ పురుగు సైజు మాత్రం రెండు, మూడు అంగుళాలే ఉంటుంది. డార్విన్స్ మోత్ ప్రత్యేకతలపై ఇటీవల పరిశోధన చేసిన లండన్ నేచురల్ హిస్టరీ మ్యూజియం శాస్త్రవేత్తలు.. దాని నాలుక పొడవును కొలిచి రికార్డు చేశారు. చదవండి: మా నాన్న క్రేజీ.. పొద్దున మాత్రం లేజీ’.. ఐదేళ్ల చిన్నారి ఫన్నీ కవిత వైరల్ చూడక ముందే ఊహించి.. జీవ పరిణామ సిద్ధాంతాన్ని రూపొందించిన ప్రఖ్యాత శాస్త్రవేత్త చార్లెస్ డార్విన్‌కు ఈ చిమ్మట పురుగుకు ప్రత్యేక సంబంధం ఉంది. మడగాస్కర్‌లో చెట్లు, మొక్కలను పరిశీలిస్తున్న క్రమంలో డార్విన్‌కు ‘అంగ్రాకమ్ సెస్కీపెడబుల్’గా పిలిచే ఒకరకం ఆర్కిడ్ పూల మొక్క కనబడింది. దాని పూల కాడలు చాలా పొడవుగా ఉండి.. కిందివైపున తేనె (నెక్టార్) ఉన్నట్టు గుర్తించారు. చదవండి: గోల చేయని భార్య! ప్చ్.. నాలుగు రోజులకే విడాకులు ఇలాంటి పూల నుంచి తేనె పీల్చే సామర్థ్యమున్న పురుగులు ఉండి ఉంటాయని, వాటి నాలుక చాలా పొడవుగా ఉంటుందని 1862వ సంవత్సరంలోనే డార్విన్ అంచనా వేశారు. కానీ తర్వాత 40 ఏళ్ల వరకు కూడా ఎవరూ ఆ పురుగులను గుర్తించలేకపోయారు. 1903వ సంవత్సరంలో కొందరు శాస్త్రవేత్తలకు ఈ పురుగు కంటబడింది. దానిని ముందే ఊహించిన డార్విన్ పేరిటే దీనికి ‘డార్విన్స్ మోత్’ అని నామకరణం చేశారు. –సాక్షి సెంట్రల్ డెస్క్ -
వింత వ్యాధి కలకలం.. పసుపు పచ్చగా మారిన బాలుడి నాలుక
ఈ భూమి ఓ వింత ప్రపంచం. అలాగే ఇక్కడ పుట్టే వింత జబ్బులు మనుషులను బెంబేలెత్తిస్తూనే ఉన్నాయి. వందేళ్లకు ఓ సారి పుట్టుకొచ్చే జబ్బుల గురించి చెప్పక్కర్లేదు. ఒకప్పుడు గ్రామాలకు గ్రామాలు తుడుచుకు పెట్టుకుపోతే.. ఇప్పుడు కరోనా ప్రపంచ దేశాలకే ప్రమాద ఘంటికలు మోగిస్తోంది. ఎప్పుడు ఏ వేరియంట్ వస్తుందో.. ఏ కొత్త రకం వ్యాధి పుట్టుకొస్తుందో.. తెలియక ప్రపంచ జనులు హడలి చస్తున్నారు. ఒట్టావా: కెనడాకు చెందిన ఓ 12 ఏళ్ల బాలుడు కోల్డ్ అగ్లుటినిన్ అనే వ్యాధితో బాధపడుతున్నాడు. ఇదో అరుదైన ఆటో ఇమ్యూన్ డిజార్డర్ అని వైద్యులు పేర్కొంటున్నారు. దీంతో అతని ఎర్ర రక్త కణాలపై రోగనిరోధక శక్తి దాడి చేసి వాటిని నాశనం చేస్తుందని డాక్లర్లు సూచిస్తున్నారు. ది న్యూ ఇంగ్లాండ్ జర్నల్ ఆఫ్ మెడిసిన్‌లో ప్రచురితమైన ఒక నివేదిక ప్రకారం.. బాలుడు గొంతు నొప్పి, మూత్రంలో సమస్య, కడుపు నొప్పి, చర్మంలో తేడా రావడంతో ఆస్పత్రికి వెళ్ళాడు. కొన్ని పరీక్షలు నిర్వహించిన తరువాత బాలుడుకి రక్తహీనత ఉందని, ఎప్సీన్ బార్ వైరస్ బారిన పడినట్లు వైద్యులు గుర్తించారు. అంతేకాకుండా బాలుడు కోల్డ్ అగ్లుటినిన్ వ్యాధితో బాధపడుతున్నాడని, ఇది ఓ అరుదైన ఆటో ఇమ్యూన్ డిజార్డర్ అని తెలిపారు. ఇది అతని ఎర్ర రక్త కణాలపై రోగనిరోధక శక్తి దాడి చేసి వాటిని నాశనం చేస్తుందని వెల్లడించారు. కాగా యూఎస్‌లోని నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ హెల్త్ ప్రకారం.. కోల్డ్ అగ్లుటినిన్ వ్యాధి వల్ల రక్తహీనత, ఎర్ర రక్త కణాలు వేగంగా విచ్ఛిన్నం కావడం, కామెర్లను కలిగిస్తుంది. అయితే బాలుడికి చికిత్సలో రక్త మార్పిడి, రోగనిరోధక వ్యవస్థ కార్యకలాపాలను తగ్గించడానికి ఏడు వారాల పాటు స్టెరాయిడ్లను ఉపయోగించారు. దీంతో బాలుడు కోలుకుని ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్ అయ్యాడు. నాలుక రంగు క్రమంగా సాధారణ స్థితికి చేరుకుందని జర్నల్ ఆఫ్ మెడిసిన్ నివేదికలో పేర్కొంది. -
గాఢమైన ముద్దు.. నాలుక కట్, ట్విస్టు ఏంటంటే!
లండన్: బ్రిటన్‌లో ఆశ్చర్యకరమైన సంఘటన చోటుచేసుకుంది. ఓ మహిళ తనతో వాగ్వాదానికి దిగిన వ్యక్తి నాలుకను కొరికింది. దీంతో తెగిపడిన నాలుక ముక్కను పక్షి ఎత్తుకుపోయిన వింత సంఘటన స్కాంట్లాండ్లో జరిగింది. 2019లో జరిగిన ఈ సంఘటనలో మహిళకు ఇటీవల కోర్టు జరిమాన విధించింది. వివరాలు... ఎడిన్‌బర్గ్‌కు చెందిన బెథానీ ర్యాన్ అనే మహిళకు జేమ్స్ మెకెంజీలు అనే వ్యక్తికి మధ్య చిన్న వాగ్వాదం చోటుచేసుకుంది. దీంతో వారిద్దరు రోడ్డుపైనే గొడవకు దిగారు. ఈ క్రమంలో మెకెంజీ పడికిలి బిగించి ర్యాన్‌పై దాడి చేసేందుకు వెళ్లడంతో ఆమె ఊహించని రీతిలో అతడికి ముద్దు పెట్టింది. అక్కడితో ఆగకుండా మెకెంజీ నాలుక చివరి భాగాన్ని గట్టిగా కొరకడంతో రెండు ఇంచుల మేర అతడి నాలుక తెగి కింద పడిపోయింది. అయితే అది గమనించుకోకుండా వారిద్దరూ గొడవ పడుతూనే ఉన్నారు. ఇక తెగిపడిన ఆ నాలుక భాగం చెట్టుపై ఉన్న సిగుల్ పక్షి కంట పడింది. దీంతో ఆ నాలుక భాగాన్ని దాని ముక్కుతో కరుచుకుని సిగూల్ పక్షిఎగిరిపోయింది. కాసేపటికి అతడి నాలుక తెగిపోయిన విషయం గమనించిన స్థానికులు మెకెంజీని ఆస్పత్రికి తరలించారు. వైద్యులు పరిక్షించి అతడికి సర్జరీ చేయాలని సూచించారు. అందుకు తెగిన నాలుక భాగం కావాలని చెప్పారు. అయితే జరిగిన విషయాన్ని డాక్టర్లకు చెప్పడంతో అది లేకపోతే ఆపరేషన్ చేయడం కుదరదని స్పష్టం చేశారు. కాగా, ర్యాన్‌పై అతడు స్థానిక పోలీసు స్టేషన్లో ఫిర్యాదు చేయడంతో పోలీసులు కేసు నమోదు చేశారు. గత వారం ఈ కేసు విచారణ చేపట్టిన ఎడిన్బర్గ్ ఫరీఫ్ కోర్టులో ర్యాన్ తను చేసిన తప్పిదానికి క్షమాపణలు కోరింది. అయితే ఆమెకు శిక్ష విధించకుండా కోర్టు జరిమాన విధించింది. చదవండి: డివిలియర్స్‌పై మనసుపడ్డ షాహిద్ భార్య! రామ్‌దేవ్ బాబాను అరెస్టు చేస్తారా? -
2వేల ఏళ్ల నాటి మమ్మీ: నోట్లో బంగారు నాలుక
కైరో: ఈజిప్టులో జరుపుతున్న పురావస్తు తవ్వకాల్లో 2వేల ఏళ్ల నాటి మమ్మి బయటపడింది. ఈజిప్టులో మమ్మీలు బయటపడటం సహజమే కదా ఇందులో వింతేముంది అనుకుంటున్నారా. కానీ ఈసారి బయటపడిన మమ్మీ బంగారు నాలుకతో ఉంది. అది చూసి అధికారులు అవాక్కయ్యారు. దీంతో మమ్మీ ఫొటోలను సోషల్ మీడియాలో షేర్ చేయడంతో వైరల్‌గా మారాయి. వివరాలు.. ఈజిప్టులోని తపోరిస్ మగ్నా ప్రాంతంలో పురావస్తు పర్యాటక శాఖ అధికారులు తవ్వకాలు జరుపుతున్నారు. ఈ క్రమంలో ఓ మమ్మీ బయటపడింది. అయితే దాని నోటిలో బంగారు నాలుక ఉండటంతో శాస్త్రవేత్తలు దానిపై పరిశోధన జరపగా ఇది 2వేల ఏళ్ల నాటిదిగా తేలింది. అయితే ఈ వ్యక్తి చనిపోయినప్పుడు అతడిని మమ్మీగా మార్చేందుకు ఈ బంగారు నాలుకను నోటీ మీద ఉంచి ఉంటారని, కాలక్రమేణా అది నోట్లోకి జారి ఉంటుందని అధికారులు అభిప్రాయపడుతున్నారు. అయితే ‘ఈజిప్టులో మరణం తర్వాత వారు ఖచ్చితంగా మళ్లీ పుడతారని అక్కడి వారి నమ్మకం. బహుశా ఆ నమ్మకంతోనే మరో జన్మలో కూడా ఈ వ్యక్తి మాట్లాడాలనే ఉద్దేశంతో బంగారు నాలుకను పెట్టడం అక్కడి సంప్రాదాయమని’ అధికారులు ప్రకటనలో పేర్కొన్నారు. -
కోడలి కోసం నాలుక కోసుకున్న అత్త
రాంచీ : ఆధునిక సాంకేతిక పరిజ్ఞానం ఎంత పెరిగినా కొంత మంది ప్రజలు మాత్రం ఇంకా మూఢనమ్మకాలు నమ్ముతున్నారు. కలియుగం నుంచి కంప్యూటర్ యుగం వరకు మానవుడు ఎంతగానో వైజ్ఞానిక అభివృద్ధి సాధించినా.. సమాజంలో పాతుకుపోయిన మూఢనమ్మకాలను తొలగించలేకపోతున్నారు. మూఢనమ్మకంతో తాజాగా ఓ మహిళ తన నాలుకనే కోసుకుంది. తప్పిపోయిన కోడలు సురక్షితంగా తిరిగి రావాలంటూ శివుడికి నాలుకను సమర్పించింది. ఈ ఘటన జార్ఖండ్‌లోని సెరైకెలా-ఖర్సావన్ జిల్లాలోని ఎన్ఐటీ క్యాంపస్‌లో ఆదివారం చోటు చేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. ఎన్ఐటీ క్యాంపస్‌కు చెందిన లక్ష్మీ నిరాలా కోడలు జ్యోతి ఆగస్ట్ 14న తన బిడ్డతో కలిసి తప్పిపోయింది. అప్పటి నుంచి లక్ష్మీ శివుడి గుడి ముందు కూర్చొని ప్రార్థిస్తూ ఉంది. తన కోడలు సురక్షితం తిరిగి ఇంటికి రావాలని తన నాలుకను కత్తిరించుకుంది. శివుడికి నాలుకను సమర్పిస్తే కోడలు తిరిగి వస్తుందని ఎవరో చెప్పుడంతో ఆమె అలా చేసిందని లక్ష్మి భర్త నందూలాల్ నిరాల చెప్పారు. నాలుక కత్తిరించుకున్న అనంతరం రక్తస్రావం అవుతున్నప్పటికీ ఆమె ఆస్పత్రికి వెళ్లడానికి నిరాకరించారు. ఇరుగుపొరుగు వాళ్లు నచ్చజెప్పి ఆమెను ఆస్పత్రిలో చేర్చారు. ప్రస్తుతం ఆమె ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉందని, నాలుక పూర్తిగా తెగడంతో మాట్లాడలేకపోతున్నారని వైద్యులు పేర్కొన్నారు. అలాగే తప్పిపోయిన జ్యోతి ఆచూకి కోసం గాలింపు చర్యలు చేపట్టినట్లు పోలీసులు పేర్కొన్నారు. -
నాలుక మంటతో ఏమీ తినలేకపోతున్నాను...
నా వయసు 36 ఏళ్లు. నెలలో రెండు మూడు సార్లు ఆల్కహాల్ తీసుకుంటుంటాను. కొన్నాళ్ల కిందట నా నాలుకపై కుడివైపు ఉన్న మ్యూకస్ మెంబ్రేన్ కరిగిపోయింది. దీనివల్ల భోజనం తినేటప్పుడు మంటగా ఉంటోంది. డాక్టరును సంప్రదిస్తే బీ–కాంప్లెక్స్ టాబ్లెట్స్ రాసిచ్చారు. మొదట్లో కాస్త ఉపశమనం అనిపించినా ఆ తర్వాత అదే సమస్య తిరగబెట్టింది. ఇప్పుడు నాలుకకు ఎడమవైపున కూడా ఇదే సమస్య వచ్చింది. ఏమీ తినలేకపోతున్నాను. దయచేసి నా సమస్యకు తగిన పరిష్కారం సూచించండి. మీరు చెప్పిన లక్షణాలు గ్లాసైటిస్ అనే కండిషన్‌ను సూచిస్తున్నాయి. ఈ సమస్య వచ్చిన వారిలో నాలుక మీద ఉన్న పొర మీద ఇన్ఫ్లమేషన్ వస్తుంది. ఈ సమస్యకు బీ కాంప్లెక్స్ లోపం మొదలుకొని ఆల్కహాల్ మితిమీరి తీసుకోవడం, పొగతాగడం, డయాబెటిస్ వంటి అనేక అంశాలు కారణం కావచ్చు. గ్లాసైటిస్కు కారణమైన అంశాలను గుర్తించి వాటిని అదుపులో పెట్టుకోవడం ద్వారా ఈ సమస్య నుంచి దూరం కావచ్చు. అలాగే మీరు వైద్యుల సలహా మేరకు ప్రో–బయాటిక్స్ అనే పదార్థాలను తీసుకోవాల్సి ఉంటుంది. ప్రో–బయాటిక్స్ అంటే మజ్జిగ, పెరుగు వంటి పదార్థాల్లో సాధారణంగా ఎక్కువగా కనిపించే లాక్టోబ్యాసిల్లై అనే మనకు మేలు చేసే బ్యాక్టీరియా అన్నమాట. ఈ పదార్థాలను ఎక్కువగా తీసుకుంటే ఈ గ్లాసైటిస్ అనే సమస్యనుంచి కొంతవరకు ఉపశమనం పొందవచ్చు. మీరు మరోసారి జనరల్ ఫిజీషియన్కు చూపించుకొని ఆయన సూచనల మేరకు చికిత్స తీసుకోండి. ఒంటి మీదంతా చిన్న చిన్న గడ్డలు వస్తున్నాయి నా వయస్సు 30 ఏళ్లు. నా చేతులు, పొట్ట మీద చిన్న చిన్న గడ్డలు ఉన్నాయి. చాలా రోజుల నుంచి నా ఒంటిపైన ఇవి వస్తున్నాయి. డాక్టర్‌కు చూపించాను. వాటి వల్ల ఎలాంటి హానీ ఉండదు అంటున్నారు. ఇందులో కొన్ని కాస్త నొప్పిగానూ, మరికొన్ని అంతగా నొప్పి లేకుండా ఉన్నాయి. ఇవి ఏమైనా క్యాన్సర్‌కు దారితీసే ప్రమాదం ఉందా? వీటికి ఎవరికి చూపించాలి? మీరు చెప్పినదాన్ని బట్టి చూస్తే మీకు ఉన్న గడ్డలు బహుశా కొవ్వు కణుతులు (లైపోమా)గానీ లేదా న్యూరోఫైబ్రోమాగాని అయి ఉండవచ్చు. మీ డాక్టర్‌కు చూపించి ఆయన సలహా తీసుకున్నారు కాబట్టి నిశ్చింతగా ఉండండి. ఆయన పరీక్షించే చెప్పి ఉంటారు కాబట్టి వాటి వల్ల ఏలాంటి ప్రమాదకరమైన పరిస్థితి ఏర్పడదు. మీరు చెప్పినట్లుగా హానికరం కాని ఈ గడ్డలు బాగా పెద్దవైనా, నొప్పి ఉన్నా వైద్య నిపుణులను సంప్రదించి శస్త్రచికిత్స ద్వారా తొలగింపజేసుకోవడం ఒక మార్గం. ఒకవేళ ఇవి క్యాన్సర్‌కు సంబంధించిన గడ్డలేమో అనే మీ అనుమానాన్ని నివృత్తి చేసుకోవాలనుకుంటే నీడిల్ బయాప్సీ చేయించుకుని నిశ్చింతగా ఉండండి. మీరు మొదట ఒకసారి జనరల్ ఫిజీషియన్‌ను కలిసి వారి సలహా/చికిత్స తీసుకోండి. డాక్టర్ జి. నవోదయ, కన్సల్టెంట్, జనరల్ మెడిసన్, కేర్ హాస్పిటల్స్, బంజారాహిల్స్, హైదరాబాద్ -
నిజం చెప్పే నాలుక
ఫుడ్ బాగుందో లేదో ఎలా తెలుస్తుంది.. నాలుకతో రుచి చూస్తేనే.. అదే విధంగా రసాయనాలను రుచి చూసేద్దామంటే మాత్రం అది దాదాపు అసాధ్యమే.. కానీ కొన్నిచోట్ల వాటి రుచి తెలిస్తే తప్ప పనులు జరగవు. మరి వీటి రుచిని చూసేదెలా.. అందుకోసం కృత్రిమ నాలుక తయారుచేస్తే పోలే అనుకున్నారు స్కాట్లాండ్లోని గ్లాస్గో వర్సిటీకి చెందిన స్కూల్ ఆఫ్ ఇంజనీరింగ్ పరిశోధకులు. ముఖ్యంగా దీన్ని ఆల్కహాల్లో కల్తీని నిరోధించడానికి తయారుచేశారట. కల్తీని ఇది ఇట్టే పసిగట్టేస్తుందని.. చిన్నచిన్న తేడాలను గుర్తిస్తుందని, 99 శాతం కచ్చితత్వంతో చెబుతుందని అంటున్నారు. అంతేకాదు 12 ఏళ్లు, 15 ఏళ్లు, 18 ఏళ్ల కిందటి ఆల్కహాల్‌ల మధ్య తేడాను కూడా ఇట్టే కనిపెట్టేస్తుందట. అల్యూమినియం, బంగారం లోహాలను ఉపయోగించి దీనిని తయారు చేశారు. ‘ఈ కృత్రిమ నాలుక అచ్చు మన నాలుకలాగే పనిచేస్తుంది. కాకపోతే సంక్షిష్టమైన రసాయనాల మధ్య తేడాను గుర్తించడానికి ఉపయోగపడుతుంది’అని పరిశోధకులు అలస్డేర్ క్లార్క్ వివరించారు. కృత్రిమ నాలుకను ఇప్పటికే చాలా మంది అభివృద్ధి చేశారని, అయితే రెండు వేర్వేరు రకాల నానోస్కేల్ మెటల్ రుచి గ్రాహికలను ఉపయోగించి ఒకే నాలుక పనిచేసేలా తయారు చేయడం ఇదే తొలిసారని చెప్పారు. ముందుగా ఆల్కహాల్ తేడాలను గుర్తించేందుకు వినియోగించామని, ఈ నాలుక ఏ రకమైన రసాయనాల మధ్య తేడానైనా గుర్తిస్తుందని చెప్పారు. ఎలా పనిచేస్తుంది.. - బంగారం, అల్యూమినియం లోహాలతో తయారుచేసిన నానోస్కేల్ రుచి గ్రాహికలను శాస్త్రవేత్తలు తయారు చేశారు. - విస్కీ నమూనాలను ఈ రుచిగ్రాహికలపై పోశారు. ఈ రుచిగ్రాహికలు మన నాలుకలోని రుచిగ్రాహికల కన్నా 500 రెట్లు చిన్నవి. - ఆ తర్వాత ద్రవంలో మునుగుతున్న కొద్దీ ఆ గ్రాహికలు కాంతిని ఎలా శోషించుకుంటున్నాయో పరిశోధకులు విశ్లేషించారు. - అవి కాంతిని శోషణం చేసుకునే తీవ్రతను బట్టి నమూనాల మధ్య తేడాలను అర్థం చేసుకోవచ్చు. ఈ పరిణామాన్ని ‘ప్లాస్మోనిక్ రెసోనెన్స్’అని పిలుస్తారు. -
నాలుక పట్టేసి మాట ముద్దగా వస్తోంది...
న్యూరాలజీ కౌన్సెలింగ్ మా పెద్దనాన్నగారి వయసు 48 ఏళ్లు. ఆర్నెల్ల క్రితం నుంచి ఆయనకు నాలుక పట్టేసినట్లుగా ఉండి, మాట ముద్దముద్దగా వస్తోంది. కుడివైపు భాగమంతా చచ్చుబడినట్లుగా మారుతోంది. చికిత్స తీసుకున్నా ప్రయోజనం లేదంటున్నారు. ఇలా ఎందుకు జరుగుతోంది? దయచేసి పరిష్కారం చెప్పండి. – ఎల్. వెంకటేశ్వరరావు, నల్లగొండ మాట సరిగా రాకపోవడం, చూపులో తేడా రావడం, శరీరంలోని ఒకవైపు భాగం బలహీనపడటం, నడుస్తున్నప్పుడు బ్యాలెన్స్ లేకపోవడం... వంటి అకస్మాత్తుగా కనిపించే లక్షణాలన్నీ పక్షవాత సూచనలుగా పరిగణించాలి. అయితే దీన్ని నిర్ధారణ చేయడానికి సీటీ/ఎమ్మారై స్కాన్ పరీక్ష అవసరం. సాధారణంగా తొలిసారి కొద్దిపాటి పక్షవాతం వచ్చిన 30 శాతం మందిలో, ఏడాదిలో రెండోసారి తీవ్రంగా వచ్చేందుకు అవకాశం ఉంది. ప్రత్యేకంగా దీనికోసం రక్తాన్ని పలుచబార్చే మందులైన యాస్పిరిన్, క్లోపిడోగ్రెల్, స్టాటిన్స్ వంటివి తీసుకోని వారిలో ఇది తీవ్రంగా రావచ్చు. దీనితో పాటు పక్షవాతానికి ఆస్కారమిచ్చే రిస్క్ ఫ్యాక్టర్లు అయిన బీపీ, షుగర్, కొలెస్ట్రాల్, గుండెజబ్బులు, హోమోసిస్టిన్ లేదా గురక వంటివి రోగికి ఉండి, వాటిని నియంత్రించకపోతే పక్షవాతం వచ్చే అవకాశాలు మరింత ఎక్కువ. అందుకే మీ బంధువుకు వెంటనే అన్ని రకాల పరీక్షలు చేయించి, వ్యాధి విషయంలో తగిన నిర్వహణ చర్యలు (మేనేజ్మెంట్ ఆఫ్ డిసీజ్) తీసుకోవాల్సిన అవసరం ఉంది. మీ బంధువుకు మళ్లీ పక్షవాతం (స్ట్రోక్) వస్తే అది వైకల్యాన్ని తెస్తుంది. కాబట్టి మీరు వెంటనే మీ దగ్గర్లోని న్యూరాలజిస్ట్‌ను సంప్రదించండి. రెండోసారి స్ట్రోక్‌ను నివారించేందుకు తగిన మందులు క్రమం తప్పకుండా వాడండి. కాళ్లలో మంటలూ – తిమ్మిర్లు... ఎందుకిలా? నా వయసు 53 ఏళ్లు. రెండేళ్ల నుంచి నా కాళ్లలో మంటలు, పోట్లు, తిమ్మిర్లు చాలా బాధపెడుతున్నాయి. నాకు బీపీ, షుగర్ వ్యాధులు లేవు. ఎటువంటి చెడు అలవాట్లు కూడా లేవు. అయినా నాకు ఎందుకీ సమస్య. నాకు తగిన పరిష్కారం చూపగలరు. – ఎమ్. రామ్మోహన్రావు, నెమ్మికల్ కాళ్లలో మంటలు, పోట్లు, తిమ్మిర్లు, కాలి చివర మొద్దుబారడం వంటి లక్షణాలు నరాల నుంచి వెన్నుపాము వరకు వచ్చే సమస్యలకు ఒక సూచన. ఈ సమస్య పెరుగుతూ పోతే చేతులకు కూడా వస్తుంది. అలాగే నడకలో మార్పు, మలమూత్ర విసర్జనపై నియంత్రణ కోల్పోవడం, అంగస్తంభనలో కూడా ఇబ్బందులు ఉండవచ్చు. వీటినే పెరిఫెరల్ న్యూరోపతి అంటారు. డయాబెటిస్, విటమిన్ బి12, బి1, ఫోలిక్ యాసిడ్, ప్యాంటథెనిక్ యాసిడ్ లోపాలు ఈ సమస్యకు ప్రధాన కారణాలు. కొన్నిసార్లు లెప్రసీ, హెచ్ఐవీ, హెపటైటిస్–బి అండ్ హెపటైటిస్ సి వైరస్ ల వంటివి కూడా ఈ సమస్యకు దారితీయవచ్చు. సాధారణంగా 30 శాతం మందిలో ఏ కారణం లేకుండా కూడా ఈ సమస్య వస్తుంది. ఇలాంటివారిలో డయాబెటిస్ వచ్చే అవకాశాలు ఎక్కువ. పై లక్షణాలను నియంత్రించడానికి గాబాపెంటిన్, ప్రీగాబాలిన్, అమీట్రిప్టిలిన్, డ్యూలోక్సెటిన్ మందులతో పాటు, మీ కండిషన్‌కు ఏ అంశం కారణమో దానికి కూడా వైద్యం చేయడం వల్ల మంచి ఉపశమనం కలుగుతుంది. అంటే ఉదాహరణకు బీ12 లోపం వల్ల ఈ కండిషన్ ఏర్పడిందనుకోండి. అప్పుడు దాన్ని భర్తీ చేయడం కోసం ఆ విటమిన్‌ను సమకూర్చాలన్నమాట. మీరు చెబుతున్న లక్షణాలున్నప్పుడు అరికాళ్లను జాగ్రత్తగా కాపాడుకోవాలి. లేదంటే చిన్న పుండ్లు కూడా తీవ్రంగా ఇబ్బంది పెడతాయి. కొన్నిసార్లు రక్తప్రసరణలో ఇబ్బందులు, వెన్నుపాము జబ్బులు కూడా ఇలాంటి లక్షణాలను కలిగించవచ్చు. మీరు ఒకసారి మీకు దగ్గర్లోని న్యూరాలజిస్ట్‌ను సంప్రదించండి. నా తలనొప్పే వంశపారంపర్యంగా మా అబ్బాయికీ వస్తోందా? నా వయసు 36 ఏళ్లు. గత రెండు దశాబ్దాలుగా నాకు ప్రతినెలా తలనొప్పి వస్తోంది. అలా నెలలో నాలుగైదుసార్లు వస్తోంది. ఈ తలనొప్పితో నేను నా రోజువారీ పనులేవీ చేసుకోలేకపోతున్నాను. ఇప్పుడు మా అబ్బాయిని కూడా అదే సమస్య వేధిస్తోంది. ఇప్పుడు వాడి వయసు ఎనిమిదేళ్లు. నా సమస్య వంశపారంపర్యంగా వాడికి సంక్రమించిందా? దయచేసి మా సమస్యను వివరించండి. – డి. కామేశ్వరి, కాకినాడ మీ చెబుతున్న లక్షణాలను బట్టి మీరు మైగ్రేన్‌తో బాధపడుతున్నట్లు తెలుస్తోంది. తరచూ తలనొప్పి రావడం, దాంతోపాటు వాంతులు, వెలుగును చూడటంలో ఇబ్బంది పడటం, పెద్ద శబ్దాలను తట్టుకోలేకపోవడం, చీకటి గదిలో కాసేపు నిద్రపోయాక తలనొప్పి ఉపశమించడం లాంటి లక్షణాలు ఉంటే అది మైగ్రేన్ కావచ్చు. మీకు మైగ్రేన్ తలనొప్పిని ప్రేరేపించే అంశం ఏమిటో చూడండి. అంటే... సూర్యకాంతికి ఎక్స్పోజ్ కావడం, ఘాటైన వాసనలు, పర్ఫ్యూమ్స్ లేదా సుగంధద్రవ్యాల వాసన, సమయానికి భోజనం చేయకపోవడం, నిద్రలేమి, మీరు తీసుకునే ఆహారపదార్థాలలో నిర్దిష్టంగా ఏదైనా సరిపడక వెంటనే తలనొప్పి రావడం (ఉదాహరణకు చీజ్, ఆరెంజ్, అరటిపండ్లు, అజినమోటో వంటి చైనా ఉప్పు, చాక్లెట్లు వంటివి) జరుగుతుంటే వెంటనే దాన్ని తీసుకోవడం ఆపేయండి. దాంతో తలనొప్పిని నివారించవచ్చు. మీకు వచ్చే తలనొప్పిని నివారించే టోపిరమేట్, డైవల్‌ప్రోయేట్, ఫ్లునరిజిన్, ప్రొపనలాల్ వంటి మందులు ఇప్పుడు అందుబాటులో ఉన్నాయి. వాటిని తీసుకుంటే 70 శాతం వరకు మళ్లీ వచ్చే అవకాశం నివారితమవుతుంది. మీరు చెప్పినట్టే మైగ్రేన్ కుటుంబసభ్యుల్లో వంశపారంపర్యంగా రావచ్చు. అయితే మీ అబ్బాయిలో కనిపించే లక్షణాలు కంటి చూపునకు సంబంధించినవా లేక మెదడుకు సంబంధించినవా అని పరీక్షించాల్సిన అవసరం ఉంది. ఒకసారి మీరు న్యూరాలజిస్ట్‌ను సంప్రదించండి. కళ్లు తిరిగి పడిపోతున్నట్లుగా ఉంది... కారణం ఏమిటి? నా వయసు 47 ఏళ్లు. నాకు గత రెండేళ్ల నుంచి అప్పుడప్పుడూ కళ్లు తిరుగుతున్నాయి. మందులు వాడినప్పుడు తగ్గి మళ్లీ మళ్లీ ఈ సమస్య వస్తోంది. అలా అవుతున్నప్పుడు నాకు భయమేస్తోంది. దీనికి పూర్తిగా పరిష్కారం లేదా? – కె. రాధాకుమారి, శ్రీకాకుళం మీరు చెబుతున్న లక్షణాలను బట్టి మీ సమస్య ‘వర్టిగో’ అని చెప్పవచ్చు. మనల్ని సరిగ్గా అంటే బ్యాలెన్స్డ్గా నిలబెట్టే ప్రధాన భాగం చిన్నమెదడు, చెవిలోపల ఉన్న ‘వెస్టిబ్యులార్ నరం’. చిన్నమెదడుకు వచ్చే జబ్బుల వల్ల మీరు పేర్కొన్న వర్టిగో లక్షణాలతో పాటు ఇతర లక్షణాలు కూడా ఉండవచ్చు. అంటే చూపులో, మాటలో, నడకలో, స్పర్శలో, బలంలో మార్పులు ఉంటే తక్షణం న్యూరాలజిస్ట్‌ను సంప్రదించాలి. అలాగే కళ్లు తిరగడం అనేది తల తిప్పినప్పుడు కొద్ది క్షణాల పాటు ఉండి, వెంటనే తగ్గిపోవడం, వినికిడి తగ్గడం, చెవిలో హోరు శబ్దం రావడం... ఇవి చెవి నరానికి సంబంధించిన జబ్బు తాలూకు లక్షణాలు. దీనికి తక్షణ ఉపశమనానికి బీటాహిస్టిన్, సిన్నరజిన్ లాంటి మందులు ఉపయోపడతాయి. కొన్నిసార్లు ఇది మళ్లీ మళ్లీ వస్తుంది. అలా తరచుగా వచ్చేవారికి వెస్టిబ్యులార్ ఎక్సర్సైజెస్, ఎప్లేస్ మెథడ్ ద్వారా చికిత్స అవసరం. అప్పటికీ ఫలితం కనిపించకపోతే చెవి నరానికి కొన్ని ఇంజెక్షన్లు ఇవ్వడం ద్వారా దీన్ని నియంత్రించవచ్చు. వర్టిగో అనేది కాస్త ఇబ్బంది పెడుతుంది గానీ ఏమాత్రం ప్రమాదకరం కాదు. కాబట్టి మీరు అనవసరంగా ఆందోళన పడకండి. – డాక్టర్ బి. చంద్రశేఖర్‌రెడ్డి, చీఫ్ న్యూరోఫిజీషియన్, సిటీ న్యూరో సెంటర్, రోడ్ నెం. 12, బంజారాహిల్స్, హైదరాబాద్ -
భక్తురాలి సాహసం
భోపాల్ : తమ కోరికలు తీరడానికి, మొక్కుబడులు చెల్లించుకోవడానికి దేవుళ్లకు భక్తులు జంతు బలులు ఇస్తూంటారు. కానీ మధ్యప్రదేశ్‌కు చెందిన ఓ మహిళ మాత్రం ఇందుకు భిన్నమైన పని చేసింది. తాను నిత్యం కొలిచే దేవున్ని తృప్తి పరచడానికి తన నాలుకనే కోసుకుంది. వినడానికి వింతగా ఉన్న ఈ సంఘటన మధ్యప్రదేశ్, మొరేనా జిల్లాలోని తర్సామా గ్రామంలో చోటు చేసుకుంది. గ్రామానికి చెందిన ఓ మహిళ స్థానిక బిజసాన్ మాతా ఆలయంలో రోజు పూజలు చేసేది. తన కోరికలను తీర్చిన దేవతకు మొక్కుబడి చెల్లించడం కోసం నాలుకను కోసుకుంది. నోటి నుంచి విపరీతంగా రక్తస్రావం అవుతుండటం గమనించిన చుట్టుపక్కల వారు ఆమెను సమీప ఆస్పత్రికి తరలించారు. ‘తను అలా నాలుక కోసుకున్న సంగతి మాకు తెలియదు. తనీ పని ఆలయానికి వెళ్లినప్పుడు చేసింది. తనను ఆస్పత్రిలో చేర్చిన తరువాత మాకు సమాచారం ఇచ్చాకే ఈ విషయం తెలిసింద’ని కుటుంబ సభ్యులు అన్నారు. -
నాలుక మీద పొర కరిగిపోయింది
జనరల్ హెల్త్ కౌన్సెలింగ్స్ నా వయసు 37. నెలలో రెండు మూడు సార్లు ఆల్కహాల్ తీసుకునే అలవాటు ఉంది. గత ఏడాది తినేటప్పుడు బాగా మంటగా ఉంటే డాక్టరును సంప్రదించాను. నాలుకపై కుడివైపు ఉన్న మ్యూకస్ మెంబ్రేన్ కరిగిపోయిందని చెప్పి, బీ–కాంప్లెక్స్ టాబ్లెట్స్ రాసిచ్చారు. మొదట్లో కాస్త ఉపశమనం అనిపించినా ఆ తర్వాత అదే సమస్య తిరగబెట్టింది. ఇప్పుడు మళ్లీ నాలుకకు ఎడమవైపున కూడా ఇదే సమస్య వచ్చింది. ఏమీ తినలేకపోతున్నాను. దయచేసి నా సమస్యకు తగిన పరిష్కారం చెప్పండి. – రామచంద్రయ్య, కర్నూలు మీరు చెప్పిన లక్షణాలు గ్లాసైటిస్ అనే కండిషన్‌ను సూచిస్తున్నాయి. అంటే గ్లాసైటిస్ సమస్యలో నాలుక మీద ఉన్న పొర ఇన్‌ఫ్లేమ్ కావడం జరుగుతుంది. ఈ సమస్యకు బీ కాంప్లెక్స్ లోపం మొదలుకొని ఆల్కహాల్ మితిమీరి తీసుకోవడం, పొగతాగడం, డయాబెటిస్ వంటి అనేక అంశాలు కారణం కావచ్చు. గ్లాసైటిస్ అదుపులోకి రావడానికి అందుకు కారణమైన అంశాలను అదుపులో పెట్టుకోవాలి. దాంతోపాటు ప్రో–బయాటిక్స్ అనే పదార్థాలను వైద్యులు దాదాపు ఒక నెల నుంచి రెండు నెలల వరకు ప్రిస్క్రయిబ్ చేస్తూ ఉంటారు. ప్రో–బయాటిక్స్ అంటే మజ్జిగ, పెరుగు వంటి పదార్థాల్లో సాధారణంగా ఎక్కువగా కనిపించే లాక్టోబ్యాసిల్లై అనే మనకు మేలు చేసే బ్యాక్టీరియా అన్నమాట. ఈ పదార్థాలను ఎక్కువగా తీసుకుంటే ఈ గ్లాసైటిస్ అనే సమస్య కొంతవరకు మెరుగవుతుంది. మీరు ఇకసారి మెడికల్ స్పెషలిస్ట్‌కు చూపించి ఆయన సూచనల మేరకు చికిత్స తీసుకోండి. రాత్రిళ్లు కాళ్లు తిమ్మిరెక్కుతున్నాయి... నాకు రోజు రాత్రివేళల్లో అదీ నిద్రలో కాళ్లు తిమ్మిరెక్కుతాయి. పడుకున్న కాసేపటికే కాలు తిమ్మిరెక్కిపోయి బాధగా లేచి కూర్చుంటాను. తిమ్మిరెక్కిన సవుయంలో కాలు కిందపెట్టనివ్వదు. నొప్పి, బాధతో విలవిల్లాడిపోతాను. ఇది చాలా బాధాకరంగా ఉంటోంది. దయచేసి నాకు సరిౖయెన సలహా ఇవ్వగలరు. – శ్రీహరిప్రసాద్, నల్లగొండ మీరు చెబుతున్న లక్షణాలను బట్టి చూస్తే మీ సవుస్య పెరిఫెరల్ న్యూరోపతి కావచ్చని అనిపిస్తోంది. దీనికి అనేక కారణాలు ఉన్నాయి. వుుఖ్యంగా డయాబెటిస్, క్రానిక్ ఆల్కహాలిజం సమస్యలు ఉన్నవారిలో ఇది చాలా సాధారణం. మీ సమస్యకు అసలు కారణాన్ని నిర్ధారణ చేయడానికి బ్లడ్‌టెస్ట్ వంటి కొన్ని పరీక్షలు చేయించాల్సి ఉంటుంది. కారణాన్ని బట్టి సవుస్యకు తగిన వుందులను మెడికల్ కన్సల్టెంట్ పర్యవేక్షణలో కనీసం రెండు, వుూడు నెలలైనా వాడాల్సి ఉంటుంది. చికిత్స తర్వాత క్షయ మళ్లీ తిరగబెట్టవచ్చా...? నా వయస్సు 42 ఏళ్లు. రెండేళ్ల క్రితం క్షయ వ్యాధి పాజిటివ్ వచ్చింది. హెచ్ఐవీ పరీక్ష కూడా చేయించాను. అది నెగెటివ్ వచ్చింది. ఆర్నెల్ల పాటు ట్రీట్మెంట్ తీసుకున్నాను. చికిత్స తర్వాత పరీక్ష చేయించుకుంటే నెగెటివ్ వచ్చింది. ఒకసారి క్షయ వచ్చాక అది తగ్గేవరకు మందులు తీసుకొని నెగెటివ్ అని వచ్చాక కూడా మళ్లీ అది తిరగబెట్టే అవకాశం ఉందా? నేను ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి? – ప్రసాదమూర్తి, అనకాపల్లి పూర్తిగా చికిత్స తీసుకున్న తర్వాత క్షయవ్యాధి తిరగబెట్టడానికి అవకాశాలు కాస్త అరుదే. అయితే అరుదుగానైనా ఈ సమస్య మళ్లీ వచ్చేందుకు అవకాశం లేకపోలేదు. ఇలా వ్యాధి తిరగబెట్టడం అన్నది చికిత్స పొందిన వ్యక్తి వ్యాధి నిరోధకశక్తిపై ఆధారపడి ఉంటుంది. ఎప్పుడైనా వారిలో ఇతర కారణాల వల్ల (ఉదా: డయాబెటిస్, వయస్సుపైబడటం, హెచ్ఐవీ వంటివి) వ్యాధినిరోధకశక్తి తగ్గి క్షయ మళ్లీ తిరగబెట్టే అవకాశాలు ఉండవచ్చు. దీన్నే ‘రీ యాక్టివేషన్’ అంటారు. ఇలా వ్యాధి తిరగబెట్టకుండా ఉండాలంటే మంచి సమతుల పౌష్టికాహారం తీసుకోవడం, క్రమం తప్పకుండా వ్యాయామం చేయడం, సరైన నిద్ర, డయాబెటిస్ లాంటి సమస్యలు ఉంటే వాటిని పూర్తిగా నియంత్రణలో పెట్టుకోవడం వంటి జాగ్రత్తలు తీసుకోవాలి. పెయిన్ కిల్లర్స్ వాడినప్పటి నుంచి కడుపులో మంట! నా వయసు 47 ఏళ్లు. నాకు మొదటి నుంచి అసిడిటీ సమస్య ఉంది. ఇటీవల తీవ్రమైన మెడ నొప్పి రావడంతో డాక్టర్‌ను సంప్రదించి మందులు వాడుతున్నాను. ఒకటి రెండు సార్లు పెయిన్‌కిల్లర్స్ వాడాను. అవి వాడినప్పటి నుంచి కడుపులో మంట మరింతగా పెరుగుతోంది. నాకు పరిష్కారాన్ని సూచించండి. – నాగరాజు, గుంటూరు కొన్ని నొప్పి నివారణ మందుల వల్ల... ముఖ్యంగా ఎన్ఎస్ఏఐడి గ్రూపునకు చెందిన బ్రూఫెన్, డైక్లోఫెనాక్, నాప్రోక్సెన్ వంటి వాటివల్ల అసిడిటీ, గుండెలో మంట వంటి లక్షణాలు కనిపిస్తాయి. అయితే ఇలాంటి సైడ్ఎఫెక్ట్స్ లేని మందులు కూడా ఇప్పుడు అందుబాటులో ఉన్నాయి. మీరు ఒకసారి మీ డాక్టర్‌ను సంప్రదించి మీకు మందులతో వస్తున్న సైడ్ఎఫెక్ట్స్ గురించి వివరించండి. డాక్టర్ మందులు మార్చి ఇస్తే మీ సమస్య తీరుతుంది. ముక్కులు బిగదీసుకుపోతున్నాయి... పరిష్కారం చెప్పండి నా వయస్సు 33. ఈ వయసులోనూ రోజూ ఉదయం వేళ చాలా సేపు వుుక్కు కారుతుండటంతో నేను చాలా ఇబ్బందిగా ఫీలవుతుంటాను. ఇక స్వీట్స్, అరటిపళ్లు, పెరుగు, పులుసు కూరలు తిన్నప్పుడు ఆ రాత్రంతా వుుక్కులు బిగదీసుకుపోతాయి. ఊపిరి సరిగా అందక బాధపడుతుంటాను. ముక్కు రంధ్రాల్లో ఏదో ఒకటి ఎప్పుడూ మూసుకుపోయి ఉంటుంది. మాకు దగ్గర్లోని డాక్టర్‌కు చూపిస్తే ఇజ్నోఫిలియా అని సిట్రజిన్ ఇచ్చారు. నా సమస్యకు తగిన పరిష్కారం చూపించండి. – డి. పార్థసారథి, నరసరావుపేట మీరు రాసిన వివరాల ప్రకారం మీ సవుస్య అలర్జిక్ సైనోరైనైటిస్ కావచ్చు. అంటే... అలర్జీ కారణంగా ముఖం ఎముకల్లో ఉండే ఖాళీ ప్రదేశాలైన సైనస్లలో, ముక్కులో ఉండే లైనింగ్ పొరల్లో కొంత వాపు వచ్చి అవి ముక్కు రంధ్రాలను బ్లాక్ చేయడం వల్ల ఇలాంటి సమస్య కనిపిస్తుంటుందన్న మాట. మీరు మీ డాక్టర్ చెప్పిన మందులతో పాటు కొన్ని నేసల్ స్ప్రేస్ (డీ–కంజెస్టెంట్స్) వాడటం వల్ల ఉపశమనం ఉంటుంది. ఒకసారి మీరు మెడికల్ స్పెషలిస్ట్‌ను కలిసి తగిన చికిత్స తీసుకోండి. డాక్టర్ ఎమ్. గోవర్ధన్, సీనియర్ ఫిజీషియన్, కేర్ హాస్పిటల్స్, నాంపల్లి, హైదరాబాద్ -
వామ్మో.. రెండు నాలుకల అమ్మాయి
-
వామ్మో.. రెండు నాలుకల అమ్మాయి
నీది రెండు నాల్కల ధోరణి అనే మాట రోజూ మనకు వినిపిస్తూనే ఉంటుంది. సాధారణంగా రాజకీయ నాయకులు ప్రత్యర్థులపై విమర్శలు చేసేటపుడు ఈ మాట ఎక్కువగా వినబడుతుంది. నిజానికి నిజజీవితంలో రెండు నాలుకలతో పుట్టిన వాళ్లు ఎక్కడా కనిపించరు. కేవలం హర్రర్ సినిమాల్లో భయం పుట్టేలా దయ్యం చేత నాలుకను బయటపెట్టించి పలు రకాలుగా చూపిస్తారు. అయితే, ఓ అందమైన అమ్మాయి తన రెండు నాలుకలతో కనిపించడమే కాదు, ఏకంగా వాటితో లయబద్ధంగా నాట్యం కూడా చేయించింది. ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో హల్చల్ చేస్తోంది. -
ప్రేయసి కోసం నాలుక, మర్మాంగం కోసుకున్నాడు
కృష్ణరాజపుర(కర్ణాటక) : గుర్తు తెలియని వ్యక్తులు ఒరిస్సా యువకుడి నాలుక, మర్మంగాన్ని కోసేసిన ఘటనకు సంబంధించి కొత్తకోణం వెలుగుచూసింది. ప్రేమించిన అమ్మాయిని వశం చేసుకోవడానికి అమ్మవారికి మొక్కుకున్న ప్రకారం నాలుక, మర్మంగాన్ని తానే కోసుకున్నట్లు యువకుడు బిజుకుమార్ పోలీసుల విచారణలో అంగీకరించాడు. వివరాలు.. ఒరిస్సా రాష్ట్రానికి చెందిన బిజుకుమార్ తమ సొంత గ్రామంలో ఓ యువతిని ప్రేమించాడు. అయితే యువతి బిజుకుమార్ ప్రేమను తిరస్కరించడంతో మద్యానికి బానిసైన బిజుకుమార్‌ను తల్లితండ్రులు బెంగళూరులోని తమ సంబధీకుడి వద్దకు పంపించారు. కొద్ది రోజుల క్రితం నగరంలోని ఇమ్మడిహళ్లిలో తన మామయ్య వద్దకు వచ్చిన బిజుకుమార్కు స్థానికంగా నివాసముండే పశ్చిమబెంగాల్‌కు చెందిన యువకులతో పరిచయమైంది. తన గతం గురించి స్నేహితులకు చెప్పడంతో అమ్మవారికి నాలుకను,మర్మంగాన్ని కానుకగా సమర్పిస్తే వశీకరణ శక్తులు సిద్ధిస్తాయని తద్వార ప్రేమించిన అమ్మాయిని వశం చేసుకోవచ్చంటూ సూచించారు. ఇది నమ్మిన బిజుకుమార్ చాకుతో నాలుకను, మర్మాంగాన్ని కోసుకున్నాడు.అయితే ఎటువంటి వశీకరణ శక్తులు సిద్ధించకపోవడంతో తప్పు తెలుసుకున్న బిజుకుమార్ విషయం మామయ్యకు తెలియకూడదనే ఉద్దేశంతో ఎవరో తనను అపహరించి నాలుక, మర్మాంగాన్ని కోసినట్లు కట్టుకథ వినిపించాడు. కానీ బిజుకుమార్ మామయ్య బిజుకుమార్‌ను ఆసుపత్రిలో చేర్పించి పోలీసులకు ఫిర్యాదు చేశాడు. కేసు నమోదు చేసుకొని విచారణ జరిపిన పోలీసులు బిజుకుమార్ చెప్పిన విధంగా ఎటువంటి ఆధారాలు లభించకపోవడంతో బిజుకుమార్పై అనుమానంతో నిజం చెప్పాలని లేదంటే తమదైన శైలిలో విచారణ చేస్తామనేసరికి బిజుకుమార్ ఆదివారం నిజం అంగీకరించాడు. -
దురదే!
తింటే దురదే! కందతో వండిన ఏ పదార్థమైనా ఒక్కసారి తింటే... మళ్ళీ మళ్ళీ తినాలనిపిస్తుంది. నాలుకకు కంద దురద ... అలా పట్టుకుంటుంది. కమాన్ ఎంజాయ్ సాటర్ డే! కంద తినడానికి వంద దురదలు అందులో కొన్ని ఇవి. నోట్: కందను కట్ చేసేటప్పుడు చేతులకు దురద వస్తుంది. అందుకని రెండుమూడు సార్లు నూనె రాసుకుంటూ, కట్ చేయాలి. మిగతా కూరగాయలకన్నా కందను కొద్దిగా ఎక్కువసేపు ఉడికించాల్సి ఉంటుంది. కంద గారెలు కావల్సినవి: కంద ముక్కలు – 3 కప్పులు (కందపై తొక్క తీసి, చిన్న చిన్న ముక్కలు కోసి, ఉడికించి, వడకట్టి పక్కనుంచాలి), పసుపు – పావు టీ స్పూన్ చింతపండు – నిమ్మకాయ పరిమాణం అల్లం, వెల్లుల్లి పేస్ట్ – 1 1/2 టీ స్పూన్ కారం – టీ స్పూన్ గరం మసాలా – అర టీ స్పూన్ కార్న్‌ఫ్లోర్ – 2 టేబుల్‌స్పూన్లు కొబ్బరి తురుము – టేబుల్‌స్పూన్ బ్రెడ్ స్లైసులు – 4, పుట్నాల పప్పు – 1 1/2 టేబుల్ స్పూన్, కొత్తిమీర తరుగు – 2 టేబుల్ స్పూన్లు, ఉప్పు – తగినంత, నూనె – వేయించడానికి తగినంత తయారీ: ∙పసుపు, ఉప్పు, చింతపండు, కందముక్కలు వేసి ఉడికించాలి. చల్లారాక కంద ముక్కలను పప్పుగుత్తితో మెదపాలి. నూనె మినహా మిగతాపదార్థాలన్నీ ఇందులో వేసి కలపాలి. మిశ్రమం గట్టిగా అవుతుంది. మిశ్రమం లూజ్‌గా ఉంటే బ్రెడ్ స్లైసులు వేసి బాగా కలపాలి. కొద్ది కొద్దిగా ఈ మిశ్రమం తీసుకొని, ఉండలు చేయాలి. గారెల షేప్ వచ్చేలా వత్తి, ఫ్రిజ్‌లో పది నిమిషాలు ఉంచాలి. పొయ్యిమీద కడాయి పెట్టి, నూనె పోసి కాగనివ్వాలి. మంట తగ్గించి, సిద్ధం చేసుకున్న గారెలను వేసి, అన్ని వైపులా గోధుమరంగు వచ్చే వరకు వేయించాలి. అదనపు నూనె పీల్చుకోవడానికి గారెలను పేపర్ టవల్మీద వేయాలి. వేడి వేడిగా టొమాటో కెచప్ లేదా చట్నీతో వడ్డించాలి. కంద దోసె కావల్సినవి: బియ్యం – ముప్పావు కప్పు పెసలు – ముప్పావు కప్పు కంద (సన్నని ముక్కలు) – అర కప్పు పచ్చిమిర్చి – 1–2, అల్లం – చిన్న ముక్క జీలకర్ర – పావు టీ స్పూన్, పసుపు – చిటికెడు ఉప్పు – తగినంత, నీళ్లు – తగినన్ని; నూనె – తగినంత. తయారీ: ∙బియ్యం, పెసలు కడిగి, కనీసం 3 గంటల సేపు నానబెట్టాలి. తర్వాత నీళ్లు వడకట్టాలి. కంద పై తొక్క తీసి, శుభ్రం చేయాలి. మిక్సర్జార్లో వడకట్టిన బియ్యం, పెసలు, కందముక్కలు, అల్లం, పచ్చిమిర్చి, పసుపు, ఉప్పు వేసి రుబ్బాలి. దీనికి తగినన్ని నీళ్లు చేర్చి మెత్తగా రుబ్బాలి. పిండిని గిన్నెలోకి తీసుకొని, మూత పెట్టి, ఓ గంటసేపు ఉంచాలి. పొయ్యి మీద పెనం పెట్టి వేడయ్యాక కొద్దిగా నీళ్లు చల్లి క్లాత్‌తో తుడిచేయాలి. సిద్ధం చేసుకున్న పిండిని గరిటెతో పెనం మీద వేసి, అదే గరిటెతో వలయాకారంగా పిండిని పలచని అట్టులా చేయాలి. స్పూన్‌తో నూనె తీసుకొని, దోసె చుట్టూ వేయాలి. కొద్దిగా మంటను పెంచి, బంగారు రంగు వచ్చేవరకు ఉంచి, రెండోవైపు తిప్పాలి. మరో నిమిషం సేపు ఉంచి, ప్లేట్లోకి తీసుకోవాలి. ఈ దోసెను పల్లీ పొడి, లేదా ఏదైనా చట్నీతో వడ్డించాలి. నోట్: దోసె కరకరలాడుతూ రావాలంటే పెసరపప్పుకు బదులు మినప్పప్పును వాడుకోవచ్చు. కంద పోహ కావల్సినవి: అటుకులు – 2 కప్పులు, కంద తరుగు – 3 టేబుల్ స్పూన్లు, నూనె – 2 టేబుల్ స్పూన్లు, ఆవాలు – టీ స్పూన్, పల్లీలు – టేబుల్ స్పూన్, పచ్చిమిర్చి తరుగు – టేబుల్ స్పూన్, కరివేపాకు – 2 రెమ్మలు ఉల్లిపాయలు – 3 (సన్నగా కట్ చేయాలి) ఉప్పు – తగినంత, పంచదార – చిటికెడు పసుపు – అర టీ స్పూన్ కొత్తిమీర తరుగు – 2 టేబుల్ స్పూన్లు నిమ్మరసం – 2 టీ స్పూన్లు తయారీ: ∙అటుకులను ఒక గిన్నెలో వేసి, అవి మునిగేలా నీళ్లు పోసి అటూ ఇటుగా కలపాలి. నీళ్ల నుంచి అటుకులను తీసి జల్లిలో వేసి, ఐదు నుంచి పది నిమిషాలు నీళ్లన్నీ పోయేదాకా ఉంచాలి. నీళ్లన్నీ పోవాలని తడి అటుకులను గట్టిగా పిండకూడదు. ∙పొయ్యి మీద కడాయి పెట్టి, నూనె వేసి కాగనివ్వాలి. దీంట్లో ఆవాలు, పల్లీలు వేసి వేయించాలి. తర్వాత పచ్చిమిర్చి, కరివేపాకు, ఉల్లిపాయలు, కంద వేసి కలపాలి. ఇవి బాగా వేగనివ్వాలి. తర్వాత ఉప్పు, పంచదార, పసుపు, వేసి కలిపి దీంట్లో ఆరిన అటుకులను వేసి కలపాలి. పైన కొత్తిమీర వేసి నిమ్మరసం పిండి నిమిషం సేపు ఉంచి, మంట తీసేయాలి. కంద మటన్ కావల్సినవి: మటన్ – 300 గ్రాములు కంద ముక్కలు – 250 గ్రాములు (ఇంచు పరిమాణం), ఉల్లిపాయ – 1 (కట్ చేసి, మెత్తగా రుబ్బాలి), టొమాటో – 1 (పేస్ట్ చేయాలి), జీడిపప్పు – పావు కప్పు, పచ్చిమిర్చి – 4, కారం – టీ స్పూన్, పసుపు – పావు టీ స్పూన్, కొత్తిమీర – అర టీ స్పూన్, మిరియాల పొడి – టీ స్పూన్, అల్లం, వెల్లుల్లి పేస్ట్ – 2 టీ స్పూన్లు, మసాలా – టీ స్పూన్ (సోంపు – అర టీ స్పూన్, ఇలాచీ – 1, దాల్చిన చెక్క – చిన్నముక్క కలిపి పొడి చేయాలి), చిక్కటి కొబ్బరిపాలు – కప్పు, పల్చటి కొబ్బరి పాలు – 2 కప్పులు, బిర్యానీ ఆకు – 1 , కొత్తిమీర+ పుదీనా – గుప్పెడు, నూనె – టేబుల్ స్పూన్ తయారీ: ∙పొయ్యి మీద ప్రెషర్కుకర్ పెట్టి, నూనె వేసి, వేడయ్యాక ముక్కలు చేసిన బిర్యానీ ఆకు, ఉల్లిపాయ పేస్ట్, అల్లం– వెల్లుల్లి, టొమాటో పేస్ట్ వేసి వేయించాలి. దీంట్లో మటన్ ముక్కలు, కారం, మిరియాల పొడి, పసుపు, జీలకర్ర పొడి, మసాలా, పుదీనా, కొత్తిమీర, టీ స్పూన్ ఉప్పు వేసి కలిపి 5 నిమిషాలు ఉడికించాలి. తర్వాత ఒకసారి కలపాలి. దీంట్లో పచ్చిమిర్చి, కందముక్కలు, జీడిపప్పులు, ధనియాలపొడి, రెండు రకాల కొబ్బరిపాలు పోసి, మూత పెట్టాలి. 5 విజిల్స్ వచ్చేవరకు ఉంచి, మంట తీసేయాలి. పదినిమిషాల తర్వాత కుకర్ మూత తీసి పావు టీ స్పూన్ ఉప్పు, కొద్దిగా నీళ్లు కలిపి మరో 5 నిమిషాలు పొయ్యిమీద పెట్టి ఉడికించి, దించాలి. ఈ కంద మటన్ కూరను జీరారైస్, పులావ్, వెజిటబుల్ బిర్యానీలోకి వడ్డించాలి. కంద పులుసు కావల్సినవి: కంద ముక్కలు – 1 1/2 కప్పులు, ఉల్లిపాయలు – 3 పచ్చిమిర్చి – 1 ఉల్లికాడ – 1, కారం – టీస్పూన్ పసుపు – పావు టీ స్పూన్ ఉప్పు – తగినంత, బెల్లం – తగినంత చింతపండు – నిమ్మకాయ పరిమాణం ధనియాల పొడి – 3/4 టీ స్పూన్ జీలకర్ర పొడి – పావు టీ స్పూన్ ఆవాలు – అర టీ స్పూన్ జీలకర్ర – అర టీ స్పూన్ మెంతిపొడి – పావు టీ స్పూన్ నూనె – 2 టేబుల్ స్పూన్లు తయారీ: ∙చింతపండులో కొద్దిగా వేడి నీళ్లు పోసి నానబెట్టాలి. కందముక్కలను ఉడికించి, నీళ్లు వడకట్టి పక్కనుంచాలి. కడాయి పొయ్యి మీద పెట్టి నూనె వేసి కాగనివ్వాలి. దీంట్లో ఆవాలు, జీలకర్ర, మెంతులు వేసి వేయించాలి. తర్వాత కరివేపాకు, పచ్చిమిర్చి, ఉల్లిపాయలు వేగనివ్వాలి. దీంట్లో కందముక్కలు, కారం, ధనియాలపొడి, జీలకర్ర పొడి, పసుపు, బెల్లం, ఉప్పు వేసి మరో 2 నిమిషాలు ఉడకనివ్వాలి. తర్వాత దీంట్లో చింతపండు రసం కలిపి 2–3 నిమిషాలు ఉడికించాలి. తర్వాత 2 కప్పుల నీళ్లు పోసి, సన్నని మంట మీద మరో 5 నిమిషాలు ఉడికించాలి. చివరగా కొత్తిమీర చల్లి, మూత పెట్టాలి. చపాతీ, అన్నంలోకి ఈ పులుసు రుచిగా ఉంటుంది. -
అయ్ బా....బో...య్!
విడ్డూరం పందొమ్మిది సంవత్సరాల కొబ్జారో చూడడానికి నోట్లో నాలిక లేని వ్యక్తిలా కనిపిస్తుంది. ఈ అమ్మడు చేసే సాహసాలు చూస్తే మాత్రం ‘అయ్ బాబోయ్’ అనిపిస్తాయి. మాస్కో మెట్రో రైళ్లపై ‘ట్రైయిన్ సర్ఫింగ్’ చేయడం ఆమె హాబీ. పదిహేను సంవత్సరాల వయసు నుంచే ట్రైన్లపై ఈ సాహసం చేస్తుంది. ట్రైయిన్ పైన బ్యాలెన్సింగ్‌గా ఉండడం ఆషామాషీ విషయం కాదు. గుండెలు నాన్‌స్టాప్‌గా గుభేలంటాయి. అయితే ఈ టీనేజ్ డేర్డెవిల్కు మాత్రం అలాంటి భయాలేమీ లేవు. ‘జీవితం విలువైనది. ఇలాంటి సాహసాలకు పూనుకోవడం తగునా?’ అని ఆమెకు ఎవరైనా సలహా ఇస్తే... ‘సాహసంలేని జీవితం ఒక జీవితమేనా?’ అని ఎదురు ప్రశ్న వేస్తుంది. రక్తం గడ్డ కట్టే చలికాలాల్లోనూ... ట్రైన్ సర్ఫింగ్ చేయడం కొబ్జారో ప్రత్యేకత. ఎవరైనా కొత్తవాళ్లు హఠాత్తుగా ట్రైన్ పైన కొబ్జారోని చూస్తే... ‘అదిగో... బ్యాట్ వుమెన్’ అని అరవడం ఖాయం. చాలా సందర్భాల్లో ఆమె బ్యాట్‌మెన్ వేషంలో ఈ సాహసం చేస్తుంటుంది మరి! మరి ఈ దుస్సాహసాన్ని పోలీసులు ఎలా సహిస్తున్నారు? చాలా సందర్భాల్లో ఆమెకు పెనాల్టీ విధించారు. అయినా కొబ్జారో ధోరణిలో మార్పు రావడం లేదు. కొబ్జారోను ఆమె తల్లిదండ్రులు చిన్నప్పుడు ‘సాహసం’ అనే పదానికి చాలా దూరంగా, అతి జాగ్రత్తగా పెంచారు. పెద్దయ్యాక మాత్రం... తన ధోరణి ‘సాహసమే నా ఊపిరి’లా తయారైంది. ‘హద్దులను చెరిపేసేవాళ్లు, తమవైన కొత్త నియమాలు రూపొందించుకునేవాళ్లు అంటే ఇష్టం’ అంటున్న కొబ్జారో బ్రిటన్‌లో చదువుకుంది. ‘ట్రైన్ రైడింగ్ చేస్తున్నప్పుడు ఒక విశాల ప్రపంచంలోకి వెళుతున్నట్లు అనిపిస్తుంది’ అంటుంది కొబ్జారో. అంతేనా... ‘ఈ ప్రపంచాన్ని భిన్నమైన కోణం నుంచి చూడడానికి ట్రైయిన్ సర్ఫింగ్ ఎంతో ఉపయోగపడుతుంది’ అని కూడా అంటుంది. మాటలకేంగానీ, కాస్త జాగ్రత్త తల్లి!! -
మాతృభాషను మరువొద్దు
హన్మకొండ కల్చరల్ : సామాజిక చైతన్యానికి ఓరుగల్లు కేంద్రంగా నిల్చిందని వరంగల్ పోలీస్ కమిషనర్ సుధీర్‌బాబు అన్నారు. వరంగల్ పోలీస్ కమిషనరేట్ సౌజన్యంతో మి త్రమండలి, సహృదయ సాహిత్య సాం స్కృతిక సంస్థ, వరల్డ్ పీస్ ఫెస్టివల్ సొసై టీ ఇంటర్నేషనల్ ఆధ్వర్యంలో హన్మకొండలోని హోటల్ అశోకాలో ‘ఓరుగల్లు సాహిత్యం సంస్కృతి’ అనే అంశంపై ఆదివారం సదస్సు నిర్వహించారు. దీనికి కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డుగ్రహీత డా.అంపశయ్య నవీన్ అధ్యక్షత వహించ గా, సీపీ సుధీర్‌బాబు ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. ఆంగ్లం మాట్లాడటంలో తప్పులేదని, కానీ మాతృభాషను మరువకూడదని సీపీ అన్నారు. ఇకపై ప్రతి ఆదివారం ఇలాంటి సదస్సులు నిర్వహించాలని ఉందన్నారు. అలా వీలుకాని పక్షంలో నెలలో ఏదైనా ఓ ఆది వారం సాహిత్య సమావేశాలు నిర్వహిం చనున్నట్లు తెలిపారు. సదస్సులో సమర్పించిన పత్రాలను పుస్తక రూపంలోకి తేనున్నామని వెల్లడించారు. అనంతరం రచయిత అంపశయ్య నవీన్ మాట్లాడుతూ వరంగల్ చరిత్రలో తొలిసారిగా పోలీసుల ఆధ్వర్యంలో సాహిత్య సమావేశం జరగడం అభినందనీయమన్నారు. ఇటువంటి కార్యక్రమాలు మరిన్ని జరగాలన్నారు. రెండో సమావేశానికి అధ్యక్షత వహించిన సహృదయ సాహితీ, సాం స్కృతిక సంస్థ ప్రధాన కార్యదర్శి గిరిజా మనోహర్‌బాబు మాట్లాడుతూ ప్రతి సా హిత్య ప్రక్రియకు సంబంధించిన ప్రయోగాలు ఓరుగల్లు నుంచే ప్రారంభమయ్యాయన్నారు. ఈసందర్భంగా డా.వేలూరి శ్రీదేవి, డా.వీరాచారి, వాసిరెడ్డి కృష్ణారెడ్డి, డా.ఎన్వీఎన్.చారి, గిరిజా మనోహర్‌బాబు పత్ర సమర్పణ(పేపర్ ప్రజెంటేషన్ చేశారు. కార్యక్రమ అతిథులుగా ప్రముఖ కవి వి.ఆర్. విద్యార్థి, సిరాజుద్దీన్, డా.అనీస్సిద్దిఖీ, కె. కృష్ణమూర్తి హాజరయ్యారు. సమావేశంలో హన్మకొండ ఏసీపీ శోభన్‌కుమార్, క్రైం ఏసీపీ ఈశ్వర్రావు, ఇన్స్పెక్టర్ సంపత్‌కుమార్, ఎస్సైలు వెంకటేశ్వర్లు, శ్రీనివాస్, సాహితీవేత్తలు డా.జి.వి.రత్నం, వరిగొండ కాంతారావు, బాసిరి సాంబశివరావు తదితరులు పాల్గొన్నారు. -
నేను.. మీ పాంక్రియాస్‌ని!
నేను గ్రే అండ్ పింక్ కలర్లో ఉంటాను. అచ్చం నోటి నుంచి బయటకు చాపిన నాలుక ఆకృతిలో సుమారు 15 సెంటీమీటర్ల పొడవుంటాను. దాదాపు 85 గ్రాముల బరువుంటాను. నేను కడుపులో ఉంటాను. వెన్నెముకకు కాస్త లోపల కాలేయం, కిడ్నీలు, పెద్ద పేగుకు దగ్గర్లో ఉంటాను. ఆనంద్ తిన్న గుట్టల కొద్దీ ఆహారాన్ని జీర్ణం చేసే ప్రక్రియలో నేనూ పాలుపంచుకుంటూ ఉంటాను. నేను ఆనంద్ క్లోమ గ్రంథి (ప్యాక్రియాస్)ని. నేను చాలా బిజీగా పనిచేస్తుంటాను. నా నుంచి స్రవించే హార్మోన్లు లేకపోతే ఆనంద్ తిన్నది జీర్ణం కాదు. ఆనంద్ ఎప్పుడూ ఆహారం అందని వ్యక్తిలా ఎండిపోయినట్లుగా అవుతాడు. ఆనంద్ కనురెప్ప కొట్టినప్పుడల్లా, ఆనంద్ గుండె కొట్టుకున్నప్పుడల్లా... ఆ కణాల మాదిరిగానే అతడిలోని కణాలన్నింటికీ శక్తి కావాలి. ఆ శక్తిని సరఫరా చేయడంలో నేను తోడ్పడుతుంటాను. ఇదే కాదు, మరో కీలకమైన పని కూడా చేస్తుంటాను. నిజానికి నేను ఒకే ఒక గ్రంథిని కాదు. ఒకే ప్యాకింగ్‌లో లభ్యమయ్యే రెండు గ్రంథులం మేము. రెండు స్రావాలను ఆనంద్ రక్తంలోకి పంపుతూ ఉంటాం. నాలోని ఒక స్రావం ఆనంద్‌లోని ఆహారం నుంచి శక్తిని పుట్టించేందుకు దోహదం చేస్తుంటుంది. ఇక మరో స్రావం అయిన ఇన్సులిన్ శక్తి అందే పని పూర్తయ్యాక ఆ ప్రక్రియను అడ్డగిస్తుంది. ఇలా అనుక్షణం ఆనంద్ రక్తంలోని గ్లూకోజ్ పరిమాణాన్ని ఎప్పుడూ ఒకేలా ఉంచడానికి నేను ప్రయత్నిస్తుంటాను. ఇదే జరగకపోతే ఇప్పుడు చాలామందిలో వచ్చే డయాబెటిస్ సమస్య ఆనంద్‌కు వస్తుంది. జీర్ణ ప్రక్రియ కోసం నా పని... ఆహారం జీర్ణం చేసే ప్రక్రియలో భాగంగా నేను దగ్గరదగ్గర రోజుకు ఒక లీటరుకు పైగా జీర్ణరసాలను ఉత్పత్తి చేస్తుంటాను. విచిత్రం చూడండి... నా బరువు 85 గ్రాములే గానీ... నా నుంచి రోజూ లీటరుకు పైగానే స్రావాలు వస్తుంటాయన్నమాట. అన్నవాహిక లోంచి కిందికి పోయే క్రమంలో ఆహారం మెత్తగా దాదాపు ద్రవరూపంలో ఉండే ప్రవాహంలా ఉండి, అసిడిక్‌గా ఉంటుంది. మీరు ‘అసిడిటీ, అసిడిటీ’ అంటూ పొట్టలో ఊరే యాసిడ్‌ను నిందిస్తుంటారుగానీ... ఆహారం... అందునా ప్రత్యేకంగా ప్రొటీన్లు జీర్ణం కావాలంటే ఆ యాసిడ్ ఊరక తప్పదు. అదే యాసిడ్ ప్రవాహం పేగుల్లోకి వెళ్తే అది వాటిని కాల్చేస్తుంది. అందుకే ఇక్కడ తప్పకుండా దాన్ని తటస్థం (న్యూట్రలైజ్) చేసే క్షారం (ఆల్కలైన్) ఊరాల్సిందే. ఆనంద్ భోజనానికి కూర్చోగానీ అతడి నరాల నుంచి నాలోని (ప్యాంక్రియాస్‌లోని) చిన్న చిన్న సంచుల్లాంటి తిత్తులకు క్షారాన్ని ఉత్పత్తి చేయమంటూ సిగ్నల్స్ అందుతాయి. అలా సిగ్నల్స్ అందే గుచ్ఛాలంటి ఆ కణాలను ‘అసిని’ అంటారు. అప్పుడు నేను ఆ కణాల ద్వారా క్షారంతో కూడిన స్రావాలను పేగుల్లోకి పంపుతాను. అయితే ప్రవహించేంత మెత్తగా అయిన జీర్ణాహారం‘కైమ్’ వచ్చాక... కడుపులోంచి పేగుల ‘గేట్‌వే’ అయిన డియోడినమ్లోకి నేను నా స్రావాలను పంపకాన్ని వేగం చేస్తా. చిన్న పేగుల ప్రారంభంలో ఈ డియోడినమ్ 25 సెం.మీ. ఉంటుంది. ఈ డియోడినమ్‌లో ప్రవహించే ఒక రకం స్రావం రక్తంలో కలిసి మెదడుకు సిగ్నల్స్ పంపింపి, నాలోని ఆల్కలైనర్ (క్షారం) టాప్‌గేర్‌లో ప్రవహించేలా చేస్తుంది. నేనిలా కడుపులో యాసిడ్‌తో ముక్కలైన ఆహారంలోకి క్షారాన్ని ప్రవహింపజేసి, దాన్ని న్యూట్రలైజ్ చేయడం అన్నది పెద్ద ప్రధానమైన సంగతి కాదు. ఇంకా ఇంతకంటే అద్భుతాలు చేస్తా. మూడు అద్భుతమైన ఎంజైములను నేను ప్రవహించేలా చేస్తాను. అందులో ట్రిప్సిన్ అనేది ప్రోటీన్లను అమైనో యాసిడ్స్‌గా మార్చుతుంది. వీటినే రక్తప్రవాహం అందుకొని ఆనంద్ కండరాలు బాగా పెరిగేలా చేస్తుంది. అమలైజ్ అనే మరో ఎంజైమ్ సహాయంతో పిండి పదార్థాలను చక్కెరగా మారుస్తా. ఇక మూడోదైన లైపేజ్తో కొవ్వులను ఫ్యాటీ యాసిడ్స్‌గా మార్చేస్తా. ఈ మొత్తం ప్రక్రియలకు అవసరమైన మొత్తం స్రావాలను స్రవించడానికి నాలోని సగం ‘అసినీ’ కణాలు చాలు. ఒకవేళ నేను పూర్తిగా నాశనం అయిపోయినా... అతడి లాలాజలం, అతడి పేగులు మాత్రమే స్రవించే జీర్ణరసాలు చాలు... ఆనంద్ బతికి బట్టకట్టడానికి. అంత అద్భుతంగా ఆనంద్ మనగడ కోసం ఏర్పాటు చేసింది ప్రకృతి. ఐలెట్స్ అనే కణాలన్నీ అనునిత్యం మండే ఫర్నెస్‌లు నాలో చెదిరిపోయినట్లుగా కనిపించే కనీసం పదిలక్షలకు పైగా ఐలెట్స్ అనే ప్రధానమైన కణాలు ఉన్నాయి. ఆ ఒక్కొక్క కణం... ఒక్కో కెమికల్ ఫ్యాక్టరీ లాంటిది. మీకు వినడానికి 10 లక్షల కణాలు అనే సంఖ్య పెద్దగా అనిపిస్తున్నా... నా 85 గ్రాముల బరువులో వాటి వాటా కేవలం 15 శాతం మాత్రమే. అవన్నీ ఒక్కొక్కటీ ఒక్కో బట్టీలా (ఫర్నెస్లా) మండుతూ ఉంటాయి. ఆ బట్టీలో ఆనంద్‌లోని గ్లూకోజ్‌ను నిత్యం మండిస్తూ శక్తిని ఉత్పత్తి చేస్తుంటాయి. అవన్నీ అలా నిత్యం మండుతూ గ్లూకోజ్‌ను మండిస్తూ... ఆనంద్ రక్తప్రవాహంలోని గ్లూకోజ్ ఎప్పుడూ 4.4 గ్రాములకు మించి ఉండకుండా చూస్తుంటాయి. ఒకవేళ నాలోని ‘ఐలెట్’ కణాలు అకస్మాత్తుగా మెరుపుసమ్మె చేశాయనుకోండి. అప్పుడు ఆనంద్లోకి గ్లూకోజ్‌కు బదులు మిగతా కణాలు ఈ మంటలు కొనసాగేలా చూడటం కోసం వేరే ఇంధనాలను మండిస్తుంటాయి. దాంతో ఆనంద్‌లోని కొవ్వులు మండిపోతాయి. అతడిలోని ప్రోటీన్లు కండరాలకు అందకుండానే భస్మం అయిపోతాయి. దాంతో ఆనంద్ ఒక బతికి ఉన్న శవంలా మిగిలిపోతాడు. ఎప్పుడూ ఆకలీ... దాహం అంటూ అల్లాడతాడు. చక్కెర మండదు. దాంతో మూత్రంలో చక్కెర పోతుంటుంది. ఒక్కోసారి అలా బయటకు పోయే చక్కెర నాలుగు కిలోల వరకు ఉంటుంది. అలాంటి కండిషన్‌నే డయాబెటిస్ అంటారు. అది రాకుండా పాంక్రియాస్నైన నేను కాపాడుతుంటాను. కప్బోర్డ్ లాంటి కాలేయం నాలోని ఇన్సులిన్ అనేది ఆనంద్ కాలేయాన్ని లక్ష్యంగా చేసుకొని పనిచేస్తుంటుంది. నిజానికి ఆనంద్ కాలేయం ఒక కప్బోర్డులాంటిది. ఆనంద్‌కు అవసరమైన శక్తి ఉత్పత్తి అయ్యాక మిగతా గ్లూకోజ్‌ను అతడు కాలేయం అనే కప్‌బోర్డులో దాచేస్తాడు. ఈ గ్లూకోజ్‌ను గ్లైకోజెన్ అనే పదార్థంగా మార్చి కాలేయం తనలో దాచేసుకుంటుంది. మళ్లీ ఆనంద్‌కు ఎప్పుడైనా శక్తి అవసరమైనప్పుడు ఆ గ్లైకోజెన్‌ను బయటకు తీసి మళ్లీ గ్లూకోజ్‌గా మార్చుకొని వాడుకుంటూ ఉంటాడు. ఈ ప్రక్రియ నా సహాయంతో జరుగుతుంది. ఇది సరిగా జరగకపోతే... అప్పుడు ఆనంద్‌కు డయాబెటిస్ వచ్చిందని చెప్పవచ్చు. నా వల్ల వచ్చే జబ్బు డయాబెటిసే అయినా దాన్ని కనుగొనడానికి ఫిజీషియన్లు కనుబొమలు ముడిపడేసేటంతగా ఇతర లక్షణాలు కనిపిస్తుంటాయి. ఒకవేళ నన్ను సరిచేయడానికి సర్జన్ నన్ను చేరదామన్నా... అతడికి అందనంత లోతుగా ఉంటాన్నేను. ఇతర అవయవాలు కొన్నింటిని కోయకుండా సర్జన్ నన్ను చేరడం అసాధ్యం అన్నంత సంక్లిష్టమైన లోతుల్లో ఉంటాన్నేను. ఒకప్పుడు నన్ను తొలగించడం అంటే... అది మృత్యువుకు చేరువకావడమే. కానీ ఇప్పుడు పరిస్థితి అలా లేదు. ఒకవేళ నేను సరిగా పనిచేయకపోతే ఇన్సులిన్ బయట నుంచి ఇచ్చి ఆనంద్ ప్రాణాలను పదిలంగా కాపాడవచ్చు. నాకు ఏదైనా సమస్య వస్తే కడుపు పైభాగంలో నొప్పి వస్తుంది. పొట్ట పైభాగంలో పుట్టిన ఇది వీపు వైపు వెళ్తున్నట్లుగా అనిపిస్తుంటుంది. నా ఒక్క సమస్యలోనే కాదు... ఆనంద్‌కు అల్సర్, హార్ట్ ఎటాక్, గాల్‌బ్లాడర్ సమస్యలు, పేగుల్లో ఏదైనా అడ్డుపడటం (ఇంటస్టినల్ అబ్స్ట్రక్షన్)... ఇలా ఏం జరిగినా ఆనంద్ ఇవే లక్షణాలు కనిపిస్తాయి. కాబట్టి ఫిజీషియన్కు అది ఏ సమస్య అన్నది నిర్ధారణ చేయడానికి పైన చెప్పినట్లు కనుబొమలు ముడిపడతాయి. ఇక ఆ లక్షణాలతో పాటు నీళ్లవిరేచనాలు, బరువు తగ్గిపోవడం, అలసట, తీవ్రమైన నిస్సత్తువ, కామెర్లు వంటి లక్షణాలూ కనిపిస్తుంటాయి. మరికొన్ని సమస్యలివే... నాకు వచ్చే మరో సాధారణ సమస్య ‘అక్యూట్ పాంక్రియాటైటిస్’. పాంక్రియాస్‌కు వచ్చే ఇన్ఫెక్షన్ పేరే పాంక్రియాటైటిస్. నా పక్క అవయవానికి శస్త్రచికిత్స చేసే సమయంలో నాకు చిన్న దెబ్బతగిలినా, చీరుకుపోయినా లేదా నాకు ఎవైనా పుండ్లు పడినా, నాలో ఇన్ఫ్లమేషన్ వచ్చినా. ఆనంద్ అదేపనిగా ఆల్కహాల్ తాగుతూ ఉన్నా నాకు ‘అక్యూట్ పాంక్రియాటైటిస్’ రావచ్చు. అన్నట్టు కాలేయంతో పాటు గాల్ బ్లాడర్ నుంచీ, నా నుంచి స్రావాలు చిన్న పేగుల్లోని భాగమైన డియోడినమ్లోకి వెళ్లడానికి ఒకే గొట్టం ఉంటుంది. ఈ పైప్ సరిగా పనిచేయక ప్లంబింగ్ సమస్య వచ్చిందనుకోండి. గాల్‌బ్లాడర్ నుంచి ముందుకు వెళ్లాల్సిన స్రావాలు వెనక్కు తన్నాయనుకోండి . అలా జరిగితే ఆ స్రావాలు నన్ను దెబ్బతీస్తాయి. ఒక్కోసారి ఆ పరిస్థితి నన్ను పూర్తిగా నాశనం చేయవచ్చు. ఒక్కోసారి గాల్‌స్టోన్ ఏర్పడి నేను స్రవించిన స్రావాలకు అడ్డుపవచ్చు. అలా జరిగితే నేను స్రవించే జీర్ణస్రావాలు వెనకకు వచ్చి నన్నే జీర్ణం చేసేయవచ్చు. ఇదే జరిగితే అనంద్‌కు అది సాధారణంగా అందరూ ఊహించేదానికంటే పెద్ద మెడికల్ ఎమర్జెన్సీ అవుతుంది. క్యాన్సర్లలో అతి చెడ్డదైన రకాలలో ఒకటైన అడినోమా అనేది ఒక రకం క్యాన్సర్ ట్యూమర్. ఇది ఉంటే నాలోని ఇన్సులిన్ స్రావాలు ఎక్కువగా స్రవిస్తుండవచ్చు. ఇలా జరిగిందంటే ఒకసారి పరీక్ష చేయించుకోవాలి. ఇప్పటివరకూ నేను ఎలాంటి ఇబ్బందీ తెచ్చిపెట్టకుండా ఆనంద్‌లో పనిచేశా. కాకపోతే ఇంతకుముందులా కాకుండా ఈమధ్య వయసుకు తగినట్లుగా ఆనంద్ కాస్త ఎక్కువ తింటే కడుపు ఉబ్బరం వంటివి వస్తున్నాయనుకోండి. అయితే ఇంతకు ముందులాగే ఆనంద్ అదేపనిగా ప్లేట్లు ప్లేట్లు లాగించడం, అదే పనిగా మద్యం గ్లాసులు గ్లాసులు తాగడం చేశాడనుకోండి. నేను ఇంతకు ముందులాగే చూసిచూడనట్టుగా పోయే రకాన్ని కాదు. గ్లూకోజ్‌ను గ్లైకోజెన్ అనే పదార్థంగా మార్చి కాలేయం తనలో దాచేసుకుంటుంది. ఎప్పుడైనా శక్తి అవసరమైనప్పుడు ఆ గ్లైకోజెన్‌ను బయటకు తీసి మళ్లీ గ్లూకోజ్‌గా మార్చుకొని శరీరం వాడుకుంటూ ఉంటుంది.. ఈ ప్రక్రియ ప్యాంక్రియాస్ సహాయంతో జరుగుతుంది. ఇది సరిగా జరగకపోతే... డయాబెటిస్ వచ్చిందని చెప్పవచ్చు. నేను సరిగా పనిచేయకపోతే డయాబెటిస్ తప్పదు... నేను జీర్ణప్రక్రియలో పనిచేయడం కంటే ఇన్సులిన్ స్రవించడం అన్నది నేను నిర్వహించే విధుల్లోకెల్లా ప్రత్యేకమైనది. ఒకవేళ నేను ఈ పనిని సక్రమంగా చేయలేకపోతే ఈ ప్రపంచంలోని అనేక మందిలా ఆనంద్ డయాబెటిస్ పాలవుతాడు. డా॥డి.నాగేశ్వర్‌రెడ్డి ఛైర్మన్ అండ్ చీఫ్ ఆఫ్ గ్యాస్ట్రో ఎంటరాలజీ ఏషియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ గ్యాస్ట్రో ఎంటరాలజీ, హైదరాబాద్ -
నాలుకలుక
సమ్మర్ స్పెషల్ వీటిని ఇంగ్లిష్‌లో టంగ్ ట్విస్టర్స్ అంటారు. నాలుక ఎన్ని రకాలుగా తిరుగుతుందంటే ముడులు పడే ప్రమాదం ఉంది. సమ్మర్‌కి సరదాగా మూడ్‌కి సరిగా ఉంటుందనుకుని ఈ ముళ్లు మీ కోసం... మేకతోకకు మేక తోకమేకకు మేక మేక తోకకు తోక తోకమేక మేక తోకకు మేక తోకమేకకు మేక మేకతోకకు తోక తోకమేక మేక తోకకు మేక తోకమేకకు మేక మేకతోకకు తోక తోకమేక మేక తోకకు మేక తోకమేకకు మేక మేక తోకకు తోక తోకమేక మేక తొకతోక తొకతోక తోకమేక మేక తొకతోక తొకతోక తోకమేక మేక తొకతోక తొకతోక తోకమేక మేక తొకతోక తొకతోక తోకమేక వికటకవి తెనాలి రామకృష్ణుడి పద్యం ఇది. ఒక పండితుడిని ఆటపట్టించడానికి ఈ పద్యం చదివాడని ప్రతీతి. మేక, తోక అనే రెండు పదాలతోనే చెప్పిన ఈ పద్యంలో ఎలాంటి అర్థం లేదు. అయితే, ఇలాంటి పద్యాన్ని వడివడిగా చదవడం నాలుకకు సవాలే! నరసింహ కృష్ణరాయని కర మరుదగు కీర్తియొప్పె గరిభిద్గిరిభి త్కరి కరిభిద్గిరి గిరిభి త్కరి భిద్గిరిభిత్తురంగ కమనీయంబై ఇది కూడా వికటకవిగారి పద్యమే. కృష్ణదేవరాయలి కీర్తిని పొగుడుతూ చెప్పాడు ఈ పద్యాన్ని. కృష్ణరాయల కరానికి... అంటే చేతికి అరుదైన కీర్తి అబ్బిందట. ఆ కీర్తి ఎలాంటి మచ్చలేని ధవళకాంతితో ప్రకాశిస్తోందట. ఆ ధవళ కాంతి ఎలాంటిదంటే... కరిభిత్- అంటే ఏనుగును (గజాసురుడిని) చంపిన వాడు శివుడు. శివుడి మేనిఛాయ తెలుపు. గిరిభిత్ కరి- అంటే పర్వతాలను పిండి పిండి చేసిన ఏనుగు (ఇంద్రుడి వాహనమైన ఐరావతం). ఐరావతం రంగు తెలుపు. ఇక గిరిభిత్- పర్వతాలను భేదించిన ఇంద్రుడి వజ్రాయుధం కూడా తెలుపే. కరిభిత్ గిరి- అంటే మంచుతో కప్పబడిన కైలాస పర్వతం. ఇది హిమ ధవళకాంతితోనే ఉంటుంది. కరిభిత్ తురంగ- శివుడి వాహనమైన నంది, గిరిభిత్ తురంగ అంటే.. ఇంద్రుడి అశ్వమైన ఉచ్ఛైశ్రవం తెల్లగానే ఉంటాయి. కృష్ణదేవరాయల కీర్తి వన్నె వీటికి సాటి వస్తుందని కవిహృదయం. నాలుగు నల్ల లారీలు ఆరు ఎర్ర లారీలు కాకీక కాకికి కాక కేకికా? నానీ నా నూనె నీ నూనెని నేనన్నానా? నా నూనె నా నూనే నీ నూనె నీ నూనే లక్ష భక్ష్యములు భక్షించు లక్ష్మయ్యకు ఒక్క భక్షము లక్ష్యమా! గాదెలోన కందిపప్పు గాదె కింద పందికొక్కు అక్షరంబు వలయు కుక్షి జీవనులకు నక్షరంబు జిహ్వకిక్షురసము అక్షరంబు తన్ను రక్షించుగావున నక్షరంబు లోక రక్షితంబు అక్షరం అనే పదాన్ని చదువు అనే అర్థంలో వాడాడు కవి. ఈ కవి ఎవరో తెలియదు. మనుషులందరికీ చదువు కావాలి. చదువు నాలుకకు చెరకురసం లాంటిది. చదువే మనకు శ్రీరామరక్ష. అందుకని చదువును మనం రక్షించుకోవాలి అంటూ చెప్పిన ఈ పద్యం నాలుకకు మంచి వ్యాయామాన్నే ఇస్తుంది. నడవకయె నడచి వచ్చితి నడచిన నే నడచి రాను నడచెడునటులన్ నడిపింప నడవనేరను నడవడికలు చూచి నన్ను నడిపింపరయా ఈ పద్యం చెప్పిన కవి ఎవరో తెలియదు. ఆయన పేదరికంలో మగ్గుతూ ఉండేవాడని ఈ పద్యమే చెబుతోంది. కుటుంబ పోషణ నడవకపోవడం వల్లనే కాలినడకన వచ్చాడట. కుటుంబ పోషణ సజావుగా ఉంటే, అంత దూరం నడిచి వచ్చేవాడు కాడట. తన నడవడికను గమనించి, తన కుటుంబాన్ని నడిపించే శక్తి కలిగేలా తనను ఆదుకోవాలంటూ వేడుకున్నాడు ఆ కవి. హిందీ చందు కె చాచా నె చందు కి చాచీ కో చాందినీ చౌక్ మే చాందీ కి చమ్మక్ సే చట్నీ చకాయీ. -
నేను మీ నాలుకను
రుచులు తెలిసేది నా వల్లనే ఆనంద్ తినేటప్పుడు రకరకాల రుచులను ఆస్వాదిస్తుంటాడు. అతడికి అవన్నీ తెలిసేది నా వల్లనే. చిన్న చిన్న కండరాలు, చాలా నరాలతో కూడి ఉంటాన్నేను. నా పైవైపు ఉపరితలం మీద చిన్న చిన్న బుడిపెల్లా కనిపించే కండరాలపై రుచి మొగ్గలు (టేస్ట్‌బడ్స్) ఉంటాయి. ఇవి రుచులను గ్రహించి, ఆ సమాచారాన్ని మెదడుకు చేరవేస్తాయి. అలాగని రుచిమొగ్గలు నా వరకే పరిమితం కాదు. అవి ఆనంద్ నోట్లోని మిగిలిన భాగాల్లోనూ ఉంటాయి. అయితే, ఏదైనా ఆహారం అసలు రుచి తెలియాలంటే, అది ద్రవరూపం సంతరించుకోవాల్సిందే. లాలాజలంతో కలిసి ఆహారం ద్రవరూపం సంతరించుకున్నప్పుడు నా రుచిమొగ్గల్లో జరిగే సూక్ష్మ విద్యుత్ రసాయనిక చర్య ఫలితంగా రుచుల సంకేతం మెదడుకు చేరుతుంది. అప్పుడు ఆ రుచులు బాగున్నదీ, లేనిదీ మెదడు తీర్పునిస్తుంది. ఉదాహరణకు ఐస్‌క్రీమ్ రుచి అద్భుతంగా ఉందనో, కాకరకాయ కూర రుచి మరీ చేదుగా ఉందనో... అలాగని అందరికీ అన్ని రుచులు ఒకేలా ఉండవు. రుచుల పట్ల ఒక్కొక్కరి స్పందన ఒక్కోలా ఉంటుంది. ఉదాహరణకు సోడియం బెంజోయేట్ కొందరికి తీపిగా అనిపించవచ్చు. ఇంకొందరికి అదే పదార్థం పుల్లగా అనిపించవచ్చు. ఆనంద్‌కు ఏమీ తోచనప్పుడు ఒక్కోసారి నన్ను బయటకు తీసి, అద్దంలో చూసుకుంటూ ఉంటాడు. తను దేని కోసం నన్ను చూస్తున్నాడో తనకే సరిగా తెలీదు. ఒకవేళ నాలో ఏదైనా తేడా కనిపిస్తే తన ఆరోగ్యానికి ఏదో జరిగిపోతోందని రకరకాల కారణాలు ఊహించుకుంటాడు. అయితే, అతడు ఊహించే కారణాలేవీ సరైనవి కావు. ఆనంద్ నోట్లో ఉండే నేను సుమారు పది సెంటీమీటర్ల పొడవు ఉంటాను. నా బరువు కాస్త అటూ ఇటుగా అరవై గ్రాములు ఉంటుంది. నేను ఆనంద్ నాలుకను. అతడి శరీరంలో నేనే బలమైన కండరాన్ని. నాపైనే ఒత్తిడి ఎక్కువ ఆనంద్ కళ్లు, చెవులతో పోలిస్తే, నేను భరించే ఒత్తిడే ఎక్కువ. అయినా, పంచేంద్రియాల జాబితాలో నా స్థానం చిట్టచివరే ఉంటుంది. ఇది అన్యాయం అంటాన్నేను. నేను లేకుండా ఆనంద్‌ని బతకమనండి చూద్దాం! పోనీ... అంతొద్దు. నన్ను నోటి బయటకు చాచి, పళ్ల మధ్య కాస్త కరిచిపట్టి ఆనంద్‌ని మాట్లాడమనండి చూద్దాం! అప్పుడు అతడి మాటలు ఎవరికైనా అర్థమవుతాయా? మాట్లాడటం, తినడం అనే ప్రక్రియల్లో నాది ప్రధాన పాత్ర. ఆహారాన్ని దంతాలు నములుతాయి గానీ, వాటి కింద సమానంగా నలిగేలా ఆహారాన్ని పంపేది నేనే. శుభ్రంగా నమిలిన ఆహారాన్ని తేలికగా జీర్ణమయ్యే స్థితిలో గొంతు ద్వారా కడుపులోకి చేరవేసేది కూడా నేనే. మింగాలంటే నేనుండాల్సిందే ముఖ్యంగా ఆహారాన్ని మింగే ప్రక్రియ నా సహకారం లేనిదే సాధ్యం కాదు. ఈ ప్రక్రియలో నా ముందు భాగం నోటి పైగోడను ఒత్తుతుంది. అప్పుడు నా వెనుక భాగం రంగంలోకి దిగి, నమిలిన ఆహారాన్ని గొంతు ద్వారా కడుపులోకి నెడుతుంది. ఇదంతా చాలా సులువైన ప్రక్రియలా అనిపిస్తుంది. నరాలు, కండరాలు ఒక క్రమపద్ధతిలో వెనువెంటనే చేసే చర్యల సమాహారమే ఈ ప్రక్రియ. నిజానికి ఆనంద్‌కు మింగడం అనే ప్రక్రియ పుట్టుకకు ముందు నుంచే తెలుసు. అంటే, బతకడానికి మింగడం ఎంత కీలకమో అర్థమవుతుంది కదా! ఆరోగ్య సమస్యలను ప్రతిఫలిస్తాను నన్ను చూస్తే ఆరోగ్య పరిస్థితిని అంచనా వేయవచ్చు. ఉదాహరణకు ఆనంద్ ఎనీమియాతో బాధపడుతున్నాడనుకోండి... నేను ఎర్రగా, మరీ మృదువుగా మారిపోతాను. జాండీస్ సోకిందనుకోండి... పసుపురంగులోకి మారుతాను. ఆరోగ్యంగా ఉన్నప్పుడు నేను సాధారణంగా ఎర్రగా ఉంటాను. కొన్ని రకాల ఫంగస్ సోకితే నాపై నల్లని మచ్చలు ఏర్పడతాయి. ఇవన్నీ చిన్న చిన్న సమస్యలే. నన్ను పెద్దగా ఇబ్బంది పెట్టవు. అయితే, జింక్ లోపం వల్ల తలెత్తే ‘డిస్గ్యూసియా’ మాత్రం నన్ను తెగ ఇబ్బందిపెడుతుంది. ఇది సోకితే, చక్కెర చేదుగా అనిపించవచ్చు. చాక్లెట్ ఉప్పగా అనిపించవచ్చు. సాధారణంగా ఫ్లూ వంటి వ్యాధులు సోకిన తర్వాత ఇలాంటి పరిస్థితి తలెత్తుతూ ఉంటుంది. జింక్ పుష్కలంగా ఉండే పోషకాహారం తీసుకుంటే, కొద్ది రోజుల్లోనే నేను మళ్లీ సాధారణ స్థితికి వస్తాను. అరుదుగా నేను ఎదుర్కొనే మరో ఇబ్బంది ‘హైపోగ్యూసియా’. ఇది సోకితే, రుచులను గుర్తించే సామర్థ్యం బాగా తగ్గిపోతుంది. ఏది తిన్నా రుచీపచీ లేని చప్పిడి తిండి తిన్నట్లే ఉంటుంది. మరీ అరుదైన కేసుల్లోనైతే రుచిచూసే సామర్థ్యం పూర్తిగా నశిస్తుంది. రుచిమొగ్గల తీరుతెన్నుల్లో మార్పులు వంటి చాలా కారణాలు ఈ సమస్యకు దారితీస్తాయి. ఈ సమస్య తలెత్తితే జీవితమే రుచిరహితంగా మారుతుంది. ఆనంద్ తరచుగా నన్ను అద్దంలో చూసుకుంటూ ఉంటాడు గానీ, అతడి ఆరోగ్యానికి నేనే అద్దాన్ని. మాట్లాడటం ఒక విన్యాసం ఇప్పుడంటే ఆనంద్ అనర్గళంగా మాట్లాడేస్తున్నాడు గానీ, పుట్టినప్పుడు అతనికి ఏ మాటలూ రావు. రెండేళ్ల వయసు వరకు క్రమంగా రకరకాల ధ్వనులను అనుకరించేవాడు. చిన్న చిన్న మాటలు ముద్దు ముద్దుగా పలికేవాడు. ఆ తర్వాత చిన్న చిన్న వాక్యాలు మాట్లాడేవాడు. క్రమంగా నాతో రకరకాల విన్యాసాలు చేయించడం ద్వారా క్లిష్టమైన మాటలను కూడా పలకడం నేర్చుకున్నాడు. మాట్లాడేటప్పుడు నేనో జిమ్నాస్ట్‌లా పనిచేస్తాను. ఒక్కోసారి ఆనంద్ తనకు ఆలోచన వచ్చిందే తడవుగా ఎదుటివారితో మాట్లాడేస్తూ ఉంటాడు. అలాంటప్పుడు అతడు నా కదలికలను గమనిస్తే అర్థమవుతుంది... నేనెంతటి విన్యాసాలు చేస్తూ ఉంటానో. అంతేకాదు, నేను నా బద్ధశత్రువులైన దంతాలతో సహజీవనం చేస్తుంటాను. అయినా, వాటి నుంచి నన్ను నేను ఎప్పటికప్పుడు అప్రమత్తంగా కాపాడుకుంటూనే ఉంటాను. వాటి మధ్య చిక్కుకుని, నేను నలిగిపోయిన సందర్భాలు చాలా అరుదు. ఇక నా దిగువ భాగంలో చిన్న తీగ నోటి అడుగు భాగాన్ని అతుక్కుని ఉంటుంది. నా కదలికలన్నింటికీ ఈ తీగే ఆధారం. ఒకవేళ ఈ తీగ పొడవు ఉండాల్సిన దాని కంటే బాగా తక్కువగా ఉంటే, మాట్లాడటంలో నత్తి వంటి చాలా ఇబ్బందులు వస్తాయి. ఒకప్పుడు ఇలాంటి ఇబ్బందులకు పరిష్కారం ఉండేది కాదు. ఇప్పుడైతే ఇలాంటి సమస్యను శస్త్రచికిత్సతో సరిచేయడానికి వీలవుతోంది. -
ఒవైసీ నాలుక కోస్తే రివార్డ్
లక్నో: గొంతు మీద కత్తి పెట్టినా భారతమాతాకి జై అననన్న ఎంఐఎం అధినేత, హైదరాబాద్ ఎంపీ అసదుద్దీన్ ఒవైసీ వ్యాఖ్యలపై దుమారం రేగుతోంది. తాజాగా ఈ వివాదానికి ఉత్తరప్రదేశ్ వేదికైంది. ఒవైసీ నాలుక కట్ చేసినవారికి రూ. 21 వేల రివార్డు ఇస్తానని మీరట్ కాలేజీ ఏబీవీపీ విద్యార్థి నేత ఒకరు ప్రకటించి అగ్గి రాజేశారు. ఒవైసీ వ్యాఖ్యలకు నిరసనగా ఏబీవీపీ మంగళవారం ఆయన దిష్టిబొమ్మను దహనం చేసింది. ఈ సందర్భంగా కాలేజీ విద్యార్థి సంఘం మాజీనేత దుష్యంత్ తోమర్ విద్యార్థులనుద్దేశించి మాట్లాడుతూ సంచలన వ్యాఖ్యలు చేశారు. భరతమాతను గౌరవించడానికి నిరాకరించిన ఒవైసీ నాలుక తెగ్గోస్తే రూ. 21వేల బహుమతి ఇస్తానని ప్రకటించారు. ఒవైసీ దేశానికి వ్యతిరేకంగా వ్యాఖ్యానించడమే కాకుండా.. తాను దేశభక్తుడు కాదని నిరూపించుకున్నారంటూ విద్యార్థి నేత ఆగ్రహం వ్యక్తం చేశారు. ఒవైసీ లోక్‌సభ సభ్యత్వం రద్దు చేయాలని డిమాండ్ చేశారు. తన పీకమీద కత్తి పెట్టినా భారత్ మాతాకీ జై అనను అన్న ఒవైసీ వ్యాఖ్యలు పెద్ద దుమారాన్ని రాజేశాయి. కొత్తతరానికి భారతమాతను కీర్తిస్తూ నినాదాలు చేయడం నేర్పాలని ఆర్ఎస్ఎస్ నాయకుడు మోహన్ భగవత్ సూచించిన నేపథ్యంలో ఈ వ్యాఖ్యలు చేసిన సంగతి తెలిసిందే. ఇప్పటికే కేంద్రమంత్రి వెంకయ్యనాయుడు ఒవైసీపై మండిపడ్డారు. దీంతోపాటు ఒవైసీ దేశం విడిచిపోవాలనే విమర్శలు చెలరేగిన సంగతి తెలిసిందే. -
కన్హయ్య నాలుక కోస్తే..అయిదు లక్షలిస్తా..
న్యూఢిల్లీ: ఢిల్లీ జవహర్ లాల్ యూనివర్శిటీ వివాదం కొద్ది కొద్దిగా సద్దుమణుగుతున్న సందర్భంలో బీజీపీ యువజన విభాగం నేత వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. జెఎన్యూ యూనివర్శిటీ విద్యార్థి నేత కన్హయ్య కుమార్ నాలుక తెగ్గోస్తే.. అయిదు లక్షలు బహుమతిగా ఇస్తానంటూ కులదీప్ వార్ష్నే వ్యాఖ్యానించి తాజాగా వివాదానికి తెరలేపారు. భారతీయ జనతా యువమోర్చా బదౌన్ జిల్లా నేత కులదీప్ వార్ష్నే ఈ సంచలన వ్యాఖ్యాలు చేశారు. అఫ్జల్ గురు లాంటి తీవ్రవాదికి మద్దతుగా జాతి వ్యతిరేక నినాదాలు చేస్తూ, ప్రధానమంత్రి నరేంద్ర మోదీకి వ్యతిరేకంగా మాట్లాడుతున్న కన్హయ్య కుమార్ నాలుకను ఎవరైనా కత్తిరించాలని కోరారు. అలా చేసిన వారికి 5 లక్షల రూపాయలను కానుకగా ఇస్తానని చెప్పారు. గురువారం జైలు నుంచి విడుదలైనప్పటినుంచి బీజేపీ వ్యతిరేకంగా మాట్లాడుతున్నాడని, అందుకే ఎవరైనా ఈ చర్యకు పూనుకోవాలన్నారు. కాగా కన్హయా దేశద్రోహం ఆరోపణలపై ఫిబ్రవరి 12 న అరెస్టు చేయగా, ఢిల్లీ హైకోర్టు అతనికి మధ్యంతర బెయిల్ మంజూరు చేయడంతో ఈనెల 3న తీహార్ జైలు నుంచి విడుదలయ్యాడు. అనంతరం విద్యార్థులనుద్దేశించి రాజద్రోహానికి, ప్రభుత్వ వ్యతిరేక కార్యక్రమాలకు మధ్య తేడాను వివరిస్తూ అతడు ఉత్తేజపూరిత ప్రసంగంతో పలువురిని ఆకట్టుకున్న సంగతి తెలిసిందే. -
కిస్ చేస్తూ ప్రియుడి నాలుకను కొరికేసింది!
హార్ట్ఫోర్డ్: గాఢమైన చుంబనంలో విచక్షణను కోల్పోయిన ఓ మహిళ ప్రియుడి నాలుకను కొరికేసింది. హఠాత్పరిణామంతో బిత్తరపోయిన ప్రియుడు తెగిపోయిన నాలుక ముక్కను చేతబట్టుకొని హుటాహుటిన ఆసుపత్రికి పరిగెత్తిన ఘటన స్థానికంగా కలకలం సృష్టించింది. అమెరికాలోని కనెక్టికట్‌లో హార్ట్ఫోర్డ్ సిటీలో చోటు చేసుకున్న ఈ ఘటన వివరాల్లోకి వెళ్తే.. షకియా లాంగ్(37) అనే మహిళ తన ప్రియుడు డ్వేన్ విలియమ్స్(41)తో కలిసి సహజీవనం చేస్తోంది. ఈ క్రమంలో ఇద్దరూ కలిసి ఇంట్లో మత్తు పదార్థాలను మోతాదుకు మించి తీసుకున్న అనంతరం విలియమ్స్‌ను కిస్ చేస్తూ.. షకియా లాంగ్ అతని నాలుకను కొరికేసింది. ఒక్కసారిగా నాలుక తెగిపోవడంతో బయటకు పరిగెత్తిన విలియమ్స్ అటుగా వెళ్తున్న పోలీసు సహాయంతో ఆసుపత్రికి చేరినట్లు స్థానిక పత్రిక వెల్లడించింది. ఈ ఘటనకు సంబంధించి పోలీసులు షకియాపై కేసునమోదు చేశారు. తెగిపడిన నాలుకకు వైద్యులు అతికష్టం మీద అతికించారు. ఘటన జరిగిన సమయంలో చాలా రక్తం పోయిందని విలియమ్స్ పోలీసులకు తెలిపాడు. మార్చ్ 31న ఈ కేసుకు సంబంధించి షకియా కోర్టుకు హాజరుకానుంది. అయితే ఆసమయంలో విలియమ్స్ గాయపడిన సంగతే తనకు తెలియదని షకియా చెబుతుండటం విశేషం. -
తిక్క లెక్క జిహ్వబలుడు
చూడటానికి ఇతగాడు బక్కపలచగా కనిపిస్తున్నాడు గానీ మహాబలశాలి. మామూలుగా పది కిలోల బరువెత్తాలంటేనే రెండుచేతులూ ఉపయోగించి ఆపసోపాలు పడతాం. అలాంటిది ఇతగాడు ఏకంగా నాలుకతో బరువులను ఎత్తి పడేస్తాడు. బ్రిటన్‌లో ఉండే ఈ జిహ్వబలుడి పేరు థామస్ బ్లాక్‌థోర్న్. మెక్సికో రాజధాని మెక్సికో సిటీలో ఏడేళ్ల కిందట జరిగిన ప్రదర్శనలో ఇతగాడు ఏకంగా నాలుకతో పన్నెండున్నర కిలోల బరువును అవలీలగా ఎత్తిపడేసి గిన్నెస్ బుక్‌లోకి ఎక్కాడు. జిహ్వబలప్రదర్శనలో ఇతగాడిది ట్వంటీ ఇయర్స్ ఇండస్ట్రీ మరి! -
జియోగ్రాఫిక్ టంగ్!
మెడి క్షనరీ ప్రపంచపటం అంతా నాలుకమీదే ఉంటుందనుకొని పొరపాటు పడకండి. దేశాలు, రాజధానుల పేర్లు నోట్లో ఆడుతుంటాయని అపోహ చెందకండి. ‘జియోగ్రఫిక్ టంగ్’ అనేది నాలుకకు వచ్చే ఒక రకమైన జబ్బు. దీన్నే వాండరింగ్ ర్యాష్ ఆఫ్ టంగ్ అనికూడా పిలుస్తారు. అంటే నాలుకమీద వచ్చే ర్యాష్... జిహ్వ మీద అటూ ఇటూ సంచరిస్తూ ఉంటుందని అర్థం. నాలుక మీద ఉండే పాపిల్లే అనే నాలుక పైపొర చివరలకు ఇన్ఫ్లమేషన్ వచ్చి... అది ఎర్రబారుతుంది. అంతేకాదు... ప్రపంచపటంలోని ద్వీప సమూహాల షేపుల్లో రూపు సంతరించుకుంటూ ఉంటాయి. వాటి రూపు మారిపోతూ కూడా ఉంటుంది. ఈ కండిషన్ హానికరం కాదు. తరచూ రూపుమార్చుకునే ద్వీపసమూహాల్లా మారిపోతుండటం వల్ల దీన్ని ‘బినైన్ మైగ్రేటరీ గ్లాసైటిస్’ అని కూడా అంటారు. -
లాలాజలంతోనే రుచి!
మెడి క్షనరీ ఏదైనా పదార్థాన్ని నాలుకపై పెట్టగానే టేస్ట్బడ్స్తో రుచి తెలిసిపోతుందని మీరు అనుకుంటున్నారా? అది ఒక అపోహ మాత్రమే. నిజానికి మనకు రుచి తెలిసేది లాలాజలం వల్లనే. ఒక పదార్థం లాలాజలంలో కరిగిన తర్వాతే, మన నాలుకపై ఉండే రుచిమొగ్గలు (టేస్ట్‌బడ్స్) వాటిని గ్రహించగలుగుతాయి. మనకు తెలియకుండానే ప్రతి రోజూ ఒక లీటర్ నుంచి 1.6 లీటర్ల వరకు లాలాజలం స్రవిస్తూ ఉంటుంది. వాంతి కావడానికి ముందుగా లాలాజలం ఎక్కువగా స్రవిస్తుంది. అంటే... లాలాజలం నుంచే జీర్ణప్రక్రియ మొదలవుతుంది కాబట్టి జీర్ణప్రక్రియను వేగవంతం చేసేందుకు అలా ఎక్కువగా లాలాజలం ఊరుతుంది. ఒకవేళ ఆ ప్రక్రియ సఫలం కానప్పుడు వాంతి (వామిటింగ్) అనే ప్రక్రియ ద్వారా జీర్ణం చేయలేని పదార్థాన్ని శరీరం బయటకు పంపేస్తుందన్నమాట. -
దీర్ఘజిహ్వుడు
తిక్క లెక్క మామూలు మానవులకు నాలుక పొడవు ఎంత ఉంటుంది..? ఎంత బలంగా ముందుకు చాపినా రెండు మూడంగుళాలకు మించి ఉండదు. అయితే, నిక్ స్టోబెర్ల్ అనే కాలిఫోర్నియా కుర్రోడి నాలుక మాత్రం తెగబారెడు పొడవు ఉంటుంది. చుబుకానికి దిగువ దాకా నాలుకచాపి చిత్ర విచిత్రాలు చేస్తుంటాడితడు. అతగాడి నాలుక పొడవు కింది పెదవి నుంచి కొలిచి చూస్తే, ఏకంగా 5.75 అంగుళాలు ఉండటంతో, గిన్నిస్‌బుక్ వారు కూడా ఈ ఘనతను గుర్తించి, అతడి పేరును తమ పుస్తకంలోకి ఎక్కించారు. -
బీరకాయ బదులు...
పిట్ట గోడ వనజ: పిన్నిగారూ, మా ఆయనకి బీరకాయ కూరంటే చాలా ఇష్టం. పిన్నిగారు: అదికాదే అమ్మాయ్, అల్లుళ్లకి గుత్తి వంకాయ కూరంటే ఇష్టముండాలికానీ, ఈ బీరకాయ కూర గొడవేంటి..? వనజ: అది కాదు పిన్నిగారూ, బీరకాయ కూరలో దండిగా ఉల్లిపాయలు తరిగి వేస్తే నాలుకకి బీరకాయ, పంటికి ఉల్లిపాయ తగిలి భేషుగ్గా ఉంటుందని ఆయనంటూ ఉంటారు. పిన్నిగారు: ఇక్కడేదో తేడా కొడుతోందే అమ్మాయ్! ఆ తర్వాత ఏం జరిగిందో చెప్పు! వనజ: మా వారు సహృదయులు. ‘ఎందుకులే వనజా! వెధవది, బీరకాయ ఊరికే దొరుకుతుంది కానీ, ఉల్లిపాయల ధర మండిపోతోంది. మరీ ఉల్లిపాయ లేకుండా బీరకాయ ఏం తింటాం... అందుకే ఇవాళ్టికి బీరకాయ బదులు బీరు కాయతో సర్దుకుపోదాం’ అంటూ అలా బజారులోకి వెళ్లారు. -
‘అమ్మ’ ఆరోగ్యంపై ప్రశ్నిస్తే.. నాలుక కోస్తా!
రాశిపురం: తమిళనాడు సీఎం జయలలిత ఆరోగ్యం గురించి ఎవరైనా ప్రశ్నిస్తే వారి నాలుక కోస్తానని హెచ్చరించి అన్నాడీఎంకే ఎంపీ పీఆర్ సుందరం దుమారం రేపారు. రాశిపురంలో ఆదివారం ఓ సభలో ఆయన మాట్లాడుతూ, జయ ఆరోగ్యం గురించి ప్రశ్నిస్తూ, ఆమె ఇక విశ్రాంతి తీసుకోవాలంటూ వ్యాఖ్యానించిన డీఎంకే అధినేత కరుణానిధిపై మండిపడ్డారు. ‘అమ్మ(జయ) ఆరోగ్యం గురించి ఎవరు ప్రశ్నించినా, వారి నాలుక కోస్తా’ అన్నారు. -
మన జిహ్వకు అనేక రుచులు!
ట్రివియా నాలుక ఒక విలక్షణ కండరం. శరీరంలోని ఏ కండరాలైనా అలసిపోతాయి గానీ, నాలుక మాత్రం అలసిపోదు. అస్థిపంజరానికి అనుసంధానం కాకుండా పనిచేసే ఏకైక కండరం నాలుకే! మానవ శరీరంలో అత్యంత దృఢమైన కండరం, అతి సున్నితమైన కండరం కూడా నాలుకే! నానా రకాల రుచులను గ్రహించేవి నాలుకపై ఉండే రుచి మొగ్గలే (టేస్ట్‌బడ్స్). ఇవి కంటికి కనిపించవు. నాలుకపై చిన్న బొడిపెల్లా కనిపించే భాగాలు రుచిమొగ్గలు కావు. కంటికి కనిపించే ఈ బొడిపెలను ‘పాపిలే’ అంటారు. రుచిమొగ్గలు అత్యంత సూక్ష్మంగా ఉంటాయి. నాలుకపైనే కాకుండా, బుగ్గల లోపల, పెదవులపైన కూడా ఉంటాయి. నోట్లో దాదాపు పదివేల రుచిమొగ్గలు ఉంటే, వాటిలో అత్యధికంగా దాదాపు ఎనిమిదివేల రుచిమొగ్గలు నాలుకపైనే ఉంటాయి.నాలుక లాలాజలంతో తడిగా ఉన్నప్పుడు మాత్రమే రుచులను గ్రహించగలుగుతుంది. నాలుక రంగు మన ఆరోగ్యానికి సంకేతంగా నిలుస్తుంది. ఆరోగ్యకరమైన నాలుక చక్కని గులాబీ రంగులో కనిపిస్తుంది. నాలుకపై తెల్లమచ్చలు ఉన్నట్లయితే ఫంగల్ ఇన్ఫెక్షన్ సోకినట్లు భావించాలి. పసుపుగా ఉంటే కడుపులో సమస్యలు ఉన్నట్లు గుర్తించాలి. విటమిన్ లోపాల వల్ల నాలుక పూసినప్పుడు కాస్త ఎర్రబడటం సహజమే అయినా, నాలుక బాగా ఎర్రగా మారిపోయి, నొప్పి గొంతు వరకు వ్యాపించి జ్వరం సోకినట్లయితే తీవ్ర అనారోగ్య లక్షణంగా గుర్తించాలి. అలాంటప్పుడు నిర్లక్ష్యం చేయకుండా, తప్పనిసరిగా డాక్టర్‌కు చూపించు కోవాల్సిందే. -
నాలుకల రికార్డు
న్యూయార్క్: వీళ్లిద్దరేంటి ఇలా నాలుక బయటపెట్టి ఫొటోకు పోజిస్తున్నారనుకుంటున్నారా..! మరి ఆ నాలుకతోనే వీళ్లు సెలబ్రిటీలు అయ్యారు.. అమెరికాలోని న్యూయార్క్‌లో ఉండే ఈ తండ్రీ కూతుళ్లకు ప్రపంచంలో అతి వెడల్పయిన నాలుక ఉంది. అందుకే వీరి పేర్లు గిన్నిస్ రికార్డులోకెక్కాయి. బైరన్ ష్లీన్కర్ అనే ఈ పెద్దాయన 8.6 సెంటీమీటర్ల వెడల్పు నాలుకతో పురుషుల విభాగంలో గిన్నిస్ రికార్డు నెలకొల్పాడు. ఆయన 14 ఏళ్ల కూతురు ఎమిలీ కూడా 7.3 సెం.మీ వెడల్పు నాలుకతో మహిళల విభాగంలో గిన్నిస్ బుక్‌లోకి ఎక్కింది. -
‘మాతృభాష’ను మురిపిస్తాం
సెంట్రల్ యూనివర్సిటీ: సెంట్రల్ యూనివర్సిటీ అనగానే ఇంగ్లిష్ వ్యవహారంతో కూడిన చదువులు గుర్తొస్తుంటాయి. ఉద్యోగ అవకాశాలుంటాయని నేటి యువత కూడా వాటివైపే ఆసక్తి చూపిస్తుంటారు. మాతృభాషపై మమకారం చంపుకొక మరికొందరు లింగ్విస్టిక్ కోర్సులను ఎంచుకుంటున్నారు. ఇదే కోవలో మన సిటీ విద్యార్థులు కనుమరుగవుతున్న తెలుగు, ఉర్దూ భాషలకు జీవం పోసేందుకు పీహెచ్‌డీలు చేస్తున్నారు. మరికొందరు పీజీలో తెలుగు, ఉర్దూ భాషలను ఎంచుకొని కన్వకేషన్ పొందుతున్నారు. మిగతా రాష్ట్రాల్లో మాదిరిగా ఇక్కడి ప్రభుత్వాలు తెలుగు, ఉర్దూకు ప్రాధాన్యమిచ్చి మన భాషను భావితరాలకు అందించాలని విద్యార్థులు కోరుతున్నారు. ఉద్యోగవకాశాలు లేకున్నా మాతృభాష కోర్సులను ఎంచుకున్నామంటున్నారు. గచ్చిబౌలిలోని బ్రహ్మ కుమారిస్ శాంతి సరోవర్ గ్లోబల్ పీస్ ఆడిటోరియంలో జరిగిన 16వ స్నాతకోత్సవంలో తెలుగు, ఉర్దూ భాషల్లో పట్టాలు అందుకున్న విద్యార్థులతో ‘సాక్షి’ ముచ్చటించింది. మీడియా చొరవ చూపాలి ‘మాది మహబూబ్‌నగర్. నిరుపేద కుటుంబం. చిన్నప్పటి నుంచే తెలుగంటే ఇష్టం. అనేక కష్టనష్టాలు ఒర్చుకొని ఎంఏ తెలుగు చేశా. ఈ రోజు పీహెచ్‌డీలో హెచ్‌సీయూ నుంచి పట్టా అందుకున్నా. ‘పాలమూరు జిల్లా క్షేత్ర మహత్య పద్య కావ్యాలు అనుశీలన’పై చేసిన పరిశోధనకు ఈ గౌరవం దక్కింది. హెచ్‌సీయూలోనే తెలుగు ప్రాచీన అధ్యయన కేంద్రంలో రీసెర్చ్ అసిస్టెంట్‌గా పనిచేస్తున్న నేను మాతృభాష అభివృధ్ధి కోసం కృషి చేస్తా. కనమరుగువుతున్న తెలుగును బతికించాలంటే ప్రభుత్వంతో పాటు మీడియా కూడా చొరవ తీసుకోవల్సిన అవసరముందని వికలాంగుడైన శ్యామ్ సుందర్ తెలిపారు. తెలుగంటే ప్రాణం ‘మాది తూర్పుగోదావరి జిల్లా. చిన్నప్పటి నుంచి తెలుగు మీడియంలోనే చదువుకున్నా. అమ్మనాన్నల మద్దతుతో ఈ రోజు పీహెచ్డీ పట్టా సాధించగలిగా. తెలుగు నిఘంటువుల ఆరోపాల అధ్యయనం చేశా. బాసర ఐఐఐటీలో తెలుగు ఉపాధ్యాయురాలిగా పనిచేస్తున్న నేను మాతృభాష అభివృద్ధి కోసం కృషి చేస్తా. తెలుగును బతికించేందుకు అందరం కృషి చేయాలని దోమలగూడలో ఉంటున్న కొమండూరి విజయభాను తెలిపారు. ఉర్దూ భాష గొప్పతనం చెబుతా రోజు ఉర్దూ భాషలో పీహెచ్డీ పట్టా పొందానంటే అందుకు మా కుటుంబసభ్యుల సహకారం ఉంది. రోజురోజుకు కనమరుగువుతన్న ఈ భాషను మళ్లీ గాడిలో పెట్టేందుకు నా వంతు కృషి చేస్తా. పిల్లలకు ఉర్దూ భాష గొప్పతనాన్ని వివరిస్తా. ఇందుకోసం ప్రతి పాఠశాలలో సెమినార్లు నిర్వహిస్తానని ఎల్బీ నగర్లో ఉంటున్న గృహిణి జరీన్‌ఖాన్ తెలిపారు. సిటీలో ఆదరణ ఉంది ‘సిటీలో ఉర్దూకు మంచి ఆదరణ ఉంది. భారీ సంఖ్యలో మైనారిటీలున్నా ఆ భాషకు తగిన ప్రాచుర్యం లేదు. ఉద్యోగవకాశాలు తక్కువగా ఉండడం కూడా ఈ భాషపై యువతకు నిరాసక్తత కలిగించేలా చేస్తోంది. అయితే యువతకు ఉర్దూ భాష గొప్పతనాన్ని వివరించే ప్రయత్నం నా వంతుగా చేస్తా. ప్రభుత్వం కూడా చొరవ తీసుకుంటే బాగుంటుంద’ని ఉర్దూ భాషలో పీహెచ్డీ పట్టా పొందిన సిటీకి చెందిన గౌసియా భాను తెలిపారు. -
నాలిక.. చాంతాడంత..
పాము నాలికలా ఎంతుందో చూశారా? ఇంత పొడవుంది కాబట్టే.. ప్రపంచంలోనే అత్యంత పొడవైన నాలిక రికార్డు అమెరికాలోని కాలిఫోర్నియాకు చెందిన నిక్ స్టోబెర్ల్(24)కు సొంతమైంది. 2015 గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్‌లో చోటు దక్కింది. ఇతడి నాలిక పొడవు 3.97 అంగుళాలు (నాలిక అంచు నుంచి పెదాల వరకు). -
కాళిదాసు ఏ దేశం వాడు?
గ్రంథపు చెక్క కాళిదా సేదేశం వాడు? ఏ జాతివాడు? అంటే, అతని మాతృభాష యేమిటి? అతని వంశవృత్తాంతం యెలాంటిది? అతనేం చదివాడు? ఆ చదివింది యెవరి దగ్గర చదివాడు? అతను తన గ్రంథాలు, ఏయే తేదీల్లో ప్రారంభించి ఏయే తేదీల్లో పూర్తి చేశాడు? ఇవేమీ అక్కర్లేదు లోకానికి. రసికుల కసలే అక్కర్లేదు. అతనేమేమి రచించాడన్నదే వారి ఆకాంక్ష. అతని రచన లెలాంటి వన్నదే వారి జిజ్ఞాస. అవి తమ కానందం కలిగిస్తున్నాయా లేదా- ఇదే వారి క్కావలసింది. పాశ్చాత్యులు మాత్రం ఆ వివరాలకున్నూ ప్రాముఖ్యం యిచ్చారు. మనవారి కాదృష్టే లేకపోయింది. అయితే, యెవరి దృక్పథం మంచిదీ? ఈ చర్చ యిక్కడ కాదు. పోతే, కవి రచన వొక్కొక్కచోట ఆహా అనిపిస్తుంది రసికులకు. ఒక్కొక్క చోట ఆనందముగ్ధులను చేస్తుంది, వారిని. ఒక్కొక్కచోట మార్గదర్శి అవుతుంది, వారికి. ఉత్తమ కావ్యాల వల్ల కలగవలిసిన ప్రయోజనా లివే, యెవరికయినా. కవి జీవిత వివరాలంత అగత్యాలు కావు. అంచాతే కాళిదాను సంగతి మన కక్కరలే దనడం. అతని రచనే కావాలి మనకి. కనకనే అతనూ చెప్పుకోలే దిది. అంచేతనే కవికుల గురువైనా డతను. కనుకనే అతనే మిగిలాడు లోకంలో. శతాబ్దులు గడిచాయి, అయినా అత నున్నాడు. యుగాలు గడిచిపోతాయి, అప్పుడూ వుంటాడతను. ఏమంటే? అతని వాక్కు అజరామరం అయిపోయింది. అది రసమయం కావడం దాని క్కారణం. అతని శరీరం పంచభూతాల్లోనూ కలిసిపోతే, అతని చైతన్యం అతని రచనల్లో మిళితం అయిపోయింది. కనుకనే వాటికా జీవకళ. కవి అయినవాడు సాధించుకోవలసిన ప్రాప్యం యిదీ. కాళిదాసు కిది బాగా తెలుసు. -శ్రీపాద సుబ్రహ్మణ్యశాస్త్రి ‘అనుభవాలూ-జ్ఞాపకాలూను’ నుంచి. -
నాలుకకు మెదడు రక్షణ..
మనం తినే ఆహారం రుచి చెప్పడమే కాకుండా.. ఆ ఆహారాన్ని నోట్లో ఒక పక్క నుంచి మరో పక్కకు మారుస్తూ నాలుక కీలకమైన పాత్ర పోషిస్తుందన్న విషయం మనకు తెలిసిందే. మనం నములుతున్నపుడు మన దృష్టి ఆహారం పైనే ఉంటుంది తప్ప నాలుక ఎలా కదులుతోందో గుర్తించం. అయితే ఆహారం నములుతున్నపుడు పదునైన పళ్ల మధ్య నలిగి పోకుండా నాలుక చాకచక్యంగా ఎలా తప్పించుకుంటుంది? ఈ విషయంపై అమెరికాలోని డ్యూక్ యూనివర్సిటీ స్కూల్ ఆఫ్ మెడిసిన్‌కు చెందిన శాస్త్రవేత్తలు నాలుకను రక్షించేదెవరో కనుగొన్నారు. మెదడులో పరస్పర అనుసంధానితమైన నాడీకణాలు దవడ, నాలుక కదలికలను నియంత్రిస్తున్నాయని చెప్పారు. ఆ నాడీకణాల సమన్వయంతోనే నాలుక గాయపడకుండా తప్పించుకోగలుగుతోందన్నారు. ‘‘మీరు నములుతున్నపుడు నాలుకపై నుంచి దృష్టిని ఎప్పుడు మరల్చారో అప్పుడు మెదడులోని అనుసంధానిత నాడీకణాలు రంగంలోకి దిగుతాయి’’ అని డ్యూక్ వర్సిటీకి చెందిన ఎడ్వర్డ్ స్టానెక్ చెప్పారు. గత పరిశోధనల్లో నాలుక రక్షణకు దవడ, నాలుక కండరాల్లోని మోటో నాడీకణాలు, వాటిని నియంత్రించే మరో జత ప్రీ మోటార్ నాడీకణాలు తోడ్పడతాయని తేలింది. -
అనుకున్నవన్నీ జరగకపోవటమూ అదృష్టమే!
మన పురాణాల్లో ఉన్న సువర్ణష్ఠీవి కథ పాశ్చాత్యదేశాల్లో ప్రాచుర్యంలో ఉన్న మిడాస్ కథ అందరికీ తెలిసిందే కదా! వారికి లభించిన అపురూపమైన సిద్ధి వారికే దుఃఖకరంగా పరిణమించింది. భస్మాసురుడి వృత్తాంతం కూడా అంతే! మనం అనుకున్నది జరిగితే సంతోషిస్తాం. అదంతా మన ఘనత అని విర్రవీగుతాం. జరగకపోతే బాధపడుతూ ఉంటాం. అదేదో దేవుడి తప్పు, ద్రోహం చేశాడని నెపం దేవుడి మీద వేస్తూ ఉంటాం. కాని ఎన్నో సందర్భాలలో ‘అలా జరగకపోవటం వలన మంచే జరిగింది’ అని కొంతకాలం పోయిన తరువాత అర్థం అవుతుంది. ఎన్నోసార్లు కోపంతోనో, అనాలోచితంగానో ఏవేవో అనుకుంటూ ఉంటాం. అవన్నీ నిజమైతే..? ఉదాహరణకి తమకి నచ్చనిది చూడవలసి వచ్చినా, వినవలసి వచ్చినా చూడలేక లేదా వినలేక చచ్చిపోతున్నాం అనటం చాలామందికి అలవాటు, అది నిజమైతే..? ప్రతివారు ఏదో ఒక సందర్భంలో ఈ బతుకు బతికే కన్నా చావటం నయం అనుకుంటారు. అటువంటప్పుడు అనుకున్నది సిద్ధిస్తే..? ‘ఎందుకు రాలేదు?’ అని అడిగితే, చాలామంది ఒంట్లో బాగుండలేదు, తలనొప్పిగా ఉంది. జ్వరం కూడా ఉన్నట్లు అనిపిస్తోంది.... ఇటువంటి వెయ్యి కారణాలుంటాయి చెప్పటానికి. వీటిలో ఏ ఒక్కటి నిజమైనా మనిషి తట్టుకోగలడా? మనిషిలో ఉన్న మనో చాంచల్యం నాలుకని అదుపులో పెట్టుకోలేకపోవటం, తెలివితక్కువతనం, దూరాలోచన లేకపోవటం, ఉద్రేకపూరిత స్వభావం మొదలైన గుణాలు తెలిసిన భగవంతుడు... మానవులు ఏది అనుకుంటే అది నిజం కాకుండా వరం ఇచ్చాడు. ఎండవేడిమికి తట్టుకోలేక అలసిపోయిన బాటసారి ఒకడు, దారిపక్కన ఉన్న చెట్టుకింద నిలబడ్డాడు. అది కల్పవృక్షమని అతడికి తెలియదు. ఆవేదనపడుతూ దాహంతో నాలుక పిడచకట్టుకుపోతోంది. ఇక్కడ కాసిన్ని మంచినీళ్లు దొరికితే బాగుండును... అనుకున్నాడు. దాహం తీరటంతో ఆకలి గుర్తుకు వచ్చింది. వెంటనే కావలసిన ఆహారం ప్రత్యక్షమయ్యింది. కడుపునిండి కళ్లు మూత లు పడుతున్నాయి. కాసేపు విశ్రాంతిగా పడుకుంటే బలం పుంజుకుని తరువాత ప్రయాణం తేలికగా చేయవచ్చుననుకున్నాడు. హంసతూలికా తల్పం కంటి ముందు కనపడింది. ఈ అడవిలో ఒక్కణ్ణీ ఉండే కన్నా ఎవరైనా తోడుగా ఉంటే బాగుండుననుకున్నాడు. వెంటనే అప్సరసలాగ ఉన్న సుందరి పక్కన కూర్చుని మధురంగా నవ్వుతూ పలకరించింది. అవసరాలు తీరటంతో ఆలోచన వచ్చింది. ‘నా మనసులో అనుకున్నవన్నీ ఈ అడవిలో ప్రత్యక్షమవుతున్నాయి. ఏ దెయ్యమో నన్ను తినేయటానికి ఇదంతా చేయటం లేదు కదా’ అనుకున్నాడు. ఆలోచన రావటమేమిటి? అనుకున్నంతా క్షణాల్లో జరిగిపోయింది. అంటే సదాలోచనలు, సద్భావాలు లేనప్పుడు విచక్షణాశక్తి, మనోనిగ్రహం లోపించినప్పుడు ఇటువంటి శక్తి ఉంటే ప్రమాదకారకమే అవుతుంది. కనుక అనుకున్నవన్నీ జరగకపోవటమే మంచిది. ఈ సందర్భంలో అనుకున్నది అనుకున్నట్టు జరగటానికి కారణం బాహ్యమైనది. అటువంటిది ఆ శక్తి మనిషికి ఉంటే..? ప్రతిక్షణం తన మనస్సులో మంచి ఆలోచనలు మాత్రమే వచ్చేటట్టు మనస్సుకి శిక్షణ ఇవ్వాలి. లేకపోతే అది అతడికే ప్రమాదకారి అవుతుంది. సద్వినియోగం చెయ్యగలిగినవారి వద్ద మాత్రమే ఏ శక్తి అయినా, ఏ సిద్ధి అయినా ఉంటే ప్రయోజనం. దాని విలువ, వినియోగం రెండూ తెలియని వారి దగ్గర ఉంటే, ప్రమాదం- ఇతరులకే కాదు తమకు కూడా. మన పురాణాల్లో ఉన్న సువర్ణష్ఠీవి కథ పాశ్చాత్యదేశాల్లో ప్రాచుర్యం ఉన్న మిడాస్ కథ అందరికీ తెలిసిందే కదా! వారికి లభించిన అపురూపమైన సిద్ధి వారికే దుఃఖకరంగా పరిణమించింది. భస్మాసురుడి వృత్తాంతం కూడా అంతే. అందుకే మనం అనుకున్నవన్నీ జరగవు. జరగకూడదు. నిజానికి అనుకున్నవి అనుకున్నట్టు జరిగితే జీవితంలో థ్రిల్ ఉండదు. అయినా మనిషి తెలివి, సామర్థ్యం ఏ పాటివి? అందుకే అనుకున్నవన్నీ జరగకపోవటం అదృష్టం కదూ! - డా.ఎన్. అనంతలక్ష్మి