Man Starts Growing Thick Black Hair: ఇంతవరకు మన చాలా అరుదైన వ్యాధులు గురించి విన్నాం. పైగా వాటిలో చాలా మటుకు జన్యు సంబంధ సమస్యల వల్ల సంభవించినవి. అయితే కొన్ని రకాలైన వ్యాధులు వ్యక్తిగత అపరిశుభ్రత వల్లనో లేక మరేదైన కారణం వల్లనో తెలయదు గానీ చాలా విచిత్రంగా వస్తుంటాయి. అవి కాస్త డాక్టర్ వద్ద చెప్పడానికి ఇబ్బందిగా కూడా ఉంటుంది. అచ్చం అలానే ఇక్కడొక వ్యక్తి అరుదైన విచిత్రమైన వ్యాధితోనే బాధడపడుతున్నాడు.
వివరాల్లోకెళ్లే..50 ఏళ్ల వ్యక్తికి నాలుక పై దట్టమైన జుట్టు పెరడం ప్రారంభించింది. దీంతో అతను వైద్యులను సంప్రదించాడు. వైద్యులు అతనికి లింగువా విల్లోసా నిగ్రా లేదా నల్లటి వెంట్రుకల నాలుక అనే అసాధారణ వ్యాధితో బాధపడుతున్నట్లు గుర్తించారు. ఈ వ్యాధికి ముందు అతను పక్షవాతానికి గురయ్యాడు. అతని సంరక్షకులు ఆ సమయంలో అతని నాలుక పై నల్లటి మచ్చలు రావడం గమినించామని చెప్పారు.
కానీ అవి కాస్త దట్టంగా వచ్చేంత వరకు అది జుట్టు అని వాళ్లు గుర్తించలేకపోయారు. దీంతో వాళ్ల చర్మవ్యాధి నిపుణిడిని సంప్రదించారు. అప్పడే ఈ విషయం వెలుగులోకి వచ్చింది. దీంతో వైద్యులు ఎందువల్ల ఈ వ్యాధి వచ్చిందనే దానిపై పరిశోధించడం మొదలుపెట్టారు. ఈ మేరకు బ్యాక్టీరియా లేదా శిలీంధ్రాల పెరుగుదలను తనిఖీ చేసే నిమిత్తం అతని నోటి నుంచి శ్లేష్మ నమూనాలను తీసుకున్నారు.
అవన్నీ ప్రతికూత ఫలితాలనిచ్చాయి. దీంతో అతను ఒక అరుదైన నల్లని వెంట్రుకల నాలుక(బీహెచ్‌టీ) అనే వ్యాధితో బాధపడుతున్నట్లు తెలుసుకున్నారు. నాలుక ఉపరితలంపై చిన్న, కోన్-ఆకారపు గడ్డలు, ఫిలిఫార్మ్ పాపిల్లే అని పిలవబడేవి, షెడ్, లేనప్పుడు ఈ వెంట్రుకలు వస్తాయిని చెప్పారు. నిజానికి మనం బ్రెష్ చేసినప్పుడు ఈ పాపిల్లే అని పిలవబడే షెడ్ క్లీన్ అయ్యి అవి కొంచెంగా పెరుగుతుంటాయి. అదిగాక నాలుక సాధారణ రాపిడికి గురి కానప్పుడూ ఇలాంటి సమస్య తలెత్తుందని చెప్పారు. అంతేకాదు సాధారణ నోటి పరిశుభ్రత పద్ధతులతో మనిషి నల్లటి వెంట్రుకల నాలుక త్వరగా క్లియర్ అవుతుందని చెప్పారు. వైద్యులు సూచనతో ఆ వ్యక్తి ఈ సమస్య నుంచి ఇప్పుడిప్పుడే నెమ్మదిగా నెమ్మదిగా రికవరి అవుతున్నాడు. నోటి అపరిశుభ్రత వల్లే ఇలాంటి వ్యాధులు వస్తాయని వైద్యులు చెబుతున్నారు.
(చదవండి: సింహాన్ని ఎత్తి పడేసిందిగా...దెబ్బకు పరుగు లంకించింది
Comments
Please login to add a commentAdd a comment