‘అమ్మ’ ఆరోగ్యంపై ప్రశ్నిస్తే.. నాలుక కోస్తా!
రాశిపురం: తమిళనాడు సీఎం జయలలిత ఆరోగ్యం గురించి ఎవరైనా ప్రశ్నిస్తే వారి నాలుక కోస్తానని హెచ్చరించి అన్నాడీఎంకే ఎంపీ పీఆర్ సుందరం దుమారం రేపారు. రాశిపురంలో ఆదివారం ఓ సభలో ఆయన మాట్లాడుతూ, జయ ఆరోగ్యం గురించి ప్రశ్నిస్తూ, ఆమె ఇక విశ్రాంతి తీసుకోవాలంటూ వ్యాఖ్యానించిన డీఎంకే అధినేత కరుణానిధిపై మండిపడ్డారు. ‘అమ్మ(జయ) ఆరోగ్యం గురించి ఎవరు ప్రశ్నించినా, వారి నాలుక కోస్తా’ అన్నారు.