tamil nadu cm jayalalithaa
-
అమ్మ పూర్తిగా కోలుకున్నారు
చెన్నై: తమిళనాడు ముఖ్యమంత్రి, అన్నాడీఎంకే అధినేత్రి జయలలిత పూర్తిగా కోలుకున్నారని ఎయిమ్స్ వైద్య నిపుణులు నిర్ధారించారని ఆ పార్టీ నేతలు చెప్పారు. త్వరలో జయలలిత డిశ్చార్జి అయి ఇంటికి వెళతారని తెలిపారు. ‘ఎయిమ్స్ వైద్యులు శనివారం చెన్నై అపోలో ఆస్పత్రిని సందర్శించి జయలలిత ఆరోగ్య పరిస్థితిని పరిశీలించారు. అమ్మ పూర్తిగా కోలుకున్నట్టు వైద్యులు నిర్ధారించారు. ఈ సంతోషకరమైన విషయాన్ని అమ్మకు తెలిపారు’ అని అన్నాడీఎంకే ప్రతినిధి సీ పొన్నియన్ చెప్పారు. సెప్టెంబర్ 22 నుంచి అపోలో ఆస్పత్రిలో జయలలిత చికిత్స పొందుతున్న సంగతి తెలిసిందే. -
అమ్మ కుడిచేతికి ఏమైంది?
చెన్నై: తమిళనాడులోని మధుర జిల్లా తిరుపారంగుండ్రం అసెంబ్లీ స్థానానికి నవంబర్ 9న ఉపఎన్నిక జరగనుంది. అధికార ఏఐడీఎంకే తరఫున ఏకే బోస్ అనే అభ్యర్థి పోటీ చేయనున్నారు. అయితే ఆమేరకు సంబంధిత పత్రాలపై పార్టీ అధినేత్రి, సీఎం జయలలిత సంతకం తప్పనిసరైంది. దీంతో వైద్యులు.. సీఎం చేత సంతకానికి బదులు వేలిముద్రలు తీసుకున్నారు. అనంతరం పార్టీ పెద్దలు అమ్మ వేలిముద్ర వేసిన పత్రాలను మీడియాకు సైతం చూపించారు. ఇంతకీ అమ్మ చేతికి ఏమైనట్లు? ఉపదాదాపు 40 రోజులుగా ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న తమిళనాడు ముఖ్యమంత్రి జయలలితకు సంబంధించి వారం కిందట చివరి హెల్త్ బులిటెన్ వెల్లడించిన వైద్యులు.. ఆమె కోలుకుంటున్నదని చెప్పారు. ట్రెకియోటెమి విధానంలో జయ కుడిచేతి గుండా కృత్రిమ నాళాలను వేసినందువల్లే ఆమె సంతకం చేయలేకపోయారని, ఎడమచేతి వేలిముద్రలు తీసుకున్నామని అధికారులు ఎలక్షన్ కమిషన్ కు తెలిపారు. వేలిముద్రలు జయలలితవేనని మద్రాస్ మెడికల్ కాలేజీ నిపుణులు కూడా నిర్ధారించడంతో ఈసీ.. వేలిముద్రలున్న ఏకే బోస్ నామినేషన్ పత్రాలను స్వీకరించింది. కాగా, గతంలో వార్తలు వెలువడ్డట్టు దీపావళిలోపే అమ్మ డిశ్చార్జి అయ్యే అవకాశాలు లేవు. మరికొన్ని రోజులు ఆమె ఆసుపత్రిలోనే ఉంటారని తెలుస్తోంది. -
పేర్లు చెప్పకుండా రూ.1.6 కోట్లు సమర్పించుకున్నారు
-
పేర్లు చెప్పకుండా రూ.1.6 కోట్లు సమర్పించుకున్నారు
మైసూర్: 'అమ్మను మించి దైవం ఉన్నదా?'అనేది తెలుగు పాటే అయినా, తమిళుల కోసమే రాశారేమో అనిపించక మానదు. ఆ రాష్ట్ర ప్రస్తుత ముఖ్యమంత్రి జయలలితను అక్కడ చాలామంది దైవం కంటే మిన్నగా భావిస్తారు. ఆమె పాలన వర్ధిల్లాలని ప్రార్థనలు చేస్తారు. అయితే అనారోగ్యం కారణంగా రోజులుగా ఆస్పత్రికే పరిమితమైపోయిన ఆ అమ్మ.. త్వరగా కోలుకోవాలని ముక్కోటి దేవతలను వేడుకుంటున్నారు ఆమె అభిమానులు. ఆ క్రమంలోనే కర్ణాటకలోని మైసూర్ లో చోటుచేసుకున్న ఘటన చర్చనీయాంశమైంది. 'కోదండ ఎస్టేట్' అని మాత్రమే చెప్పి తమ పేర్లను వెల్లడించని తమిళ భక్త బృందం.. అమ్మపేరు మీద రూ.1.6కోట్ల విలువైన ఆభరణాలకు మైసూర్ లోని ఆలయానికి సమర్పించుకున్నారు. మైసూర్ శివారులోని చాముండీ హిల్స్ పైగల గణపతి, ఆంజనేయస్వామి ఆలయాలకు వచ్చిన జయలలిత అభిమానులు.. స్వామివార్ల విగ్రహాలకు భారీ స్థాయిలో ఆభరణాలను ఇచ్చి వెళ్లారు. ఇంత భారీ మొత్తంలో ఆభరణాలు ఇచ్చిన వారు కనీసం పేరైనా చెప్పలేదని, తమిళనాడు సీఎం జయలలిత త్వరగా కోలుకోవాలని తామీ పని చేస్తున్నామని అన్నట్లు ఆలయ కమిటీ ప్రతినిధులు మీడియాకు చెప్పారు. వారి మొక్కులు ఫలించి, ఆస్పత్రి వర్గాలు ప్రకటించినట్లు దీపావళిలోపే జయలలిత కోలుకోవాలని కోరుకుందామా.. -
కొనసాగుతున్న చికిత్స ప్రక్రియ
సాక్షి ప్రతినిధి, చెన్నై:అన్నాడీఎంకే అధినేత్రి, తమిళనాడు ముఖ్యమంత్రి జయలలితకు మంగళవారం కూడా యథావిధిగా చికిత్స కొనసాగుతోంది. అమ్మకు జరుగుతున్న చికిత్స గురించి తెలుసుకునేందుకు పలువురు ప్రముఖులు అపోలోకు వచ్చి వెళ్లారు. వదంతుల నేపథ్యంలో రాష్ట్రంలో సాగుతున్న అరెస్టులను మాజీ న్యాయమూర్తి మార్కం డేయ కట్జు తీవ్రంగా ఖండించడంతోపాటు అరెస్టులు ఆపకుంటే రాష్ట్రంలో రాష్ట్రపతి పాలన విధించేలా పోరాడుతానని హెచ్చరించారు. చికిత్స నిమిత్తం గత నెల 22వ తేదీ అర్ధరాత్రి అపోలోకు చేరుకున్న సీఎం జయలలిత పూర్తిస్థాయిలో కోలుకునేందుకు వైద్యపరంగా అన్నికోణాల్లో కృషి జరుగుతోంది. లండన్ వైద్యులు డాక్టర్ రిచర్డ్, ఎయిమ్స్ వైద్యులు, సింగపూరు నుంచి వచ్చిన మహిళా ఫిజియోథెరపిస్టుల నిరంతర పర్యవేక్షణలో చికిత్స కొనసాగుతోంది. ఫిజియోథెరపీపైనే ప్రస్తుతం పూర్తిస్థాయిలో కేంద్రీకరించినట్లు తెలుస్తోంది. రోజు రోజుకూ అమ్మ కోలుకుంటున్నట్లు విశ్వసనీయ వర్గాల ద్వారా సమాచారం వస్తున్నా ఈనెల 9వ తేదీ నుంచి అపోలో నుంచి హెల్త్బులెటిన్లు మాత్రం విడుదల కావడం లేదు. సీఎంను పరామర్శించేందుకు ప్రధాని నరేంద్రమోదీ వస్తారని ఆశిస్తుండగా, అపోలో ఆసుపత్రిలో ప్రధాని, జయ సంభాషిస్తున్న ఫొటోను, బులెటిన్‌ను విడుదల చేసే అవకాశం ఉందని ఊహాగానాలు సాగుతున్నాయి. ఇదిలా ఉండగా, సీఎంకు జరుగుతున్న చికిత్సపై ప్రజలు మాట్లాడుకుంటే అరెస్ట్ చేయడం అప్రజాస్వామికమని మాజీ న్యాయమూర్తి మార్కండేకట్జు ఫేస్బుక్లో విమర్శలు చేశారు. మంత్రి పన్నీర్‌సెల్వం, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి, డీజీపీ ఇతర పోలీసు ఉన్నతాధికారులను ఆయన తప్పుపట్టారు. అరెస్టులు ఆపకుంటే రాష్ట్రంలో శాంతిభద్రతలు నశించాయని కారణం చూపి రాష్ట్రపతి పాలన విధించేలా రాష్ట్రపతిని కోరుతానని, అంతేగాక అరెస్టులకు పాల్పడిన వారిని శిక్షకు గురిచేస్తానని హెచ్చరించారు. కాగా ప్రముఖ పారిశ్రామికవేత్త అదానీ కుమారుడు కరణ్ అదానీ, సినీనటుడు రాధారవి అపోలోకు వచ్చి జయ క్షేమ సమాచారాలు తెలుసుకున్నారు. అమ్మ కోసం ద్రవిడ దేశం ప్రార్థనలు: సీఎం జయలలిత త్వరిత గతిన కోలుకుని సంపూర్ణ ఆరోగ్యంతో ఇంటికి చేరుకోవాలని మంగళవారం సైతం రాష్ట్రవ్యాప్తంగా పలుచోట్ల ప్రార్థనలు సాగాయి. సీఎం జయ త్వరగా కోలుకుని పూర్వస్థాయిలో మరలా ముఖ్యమంత్రి బాధ్యతలు నిర్వర్తించాలని ఆకాంక్షిస్తూ తిరువత్తియూరు వడవుడి అమ్మన్ ఆలయంలో ద్రవిడ దేశం అధ్యక్షులు వీ కృష్ణారావు విశేషపూజలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో రాష్ట్రవ్యవసాయ శాఖా మంత్రి దురైకన్ను, అంబత్తూరు ఎమ్మెల్యే అలెగ్జాండరు, తిరువత్తియూరు మాజీ శాసనసభ్యులు కే కుప్పన్ పలువురు పార్టీ ప్రముఖులు పాల్గొన్నారు. చెన్నై దక్షిణంలో పార్టీ లీగల్‌సెల్ అధ్వర్యంలో 200 మందికిపైగా మహిళలు సాయిబాబా ఆలయంలో పాలాభిషేకం, అన్నదానం నిర్వహించారు. మైలాపూరు కపాలీశ్వరర్ ఆలయంలో బంగారురథాన్ని లాగారు. నక్కీరర్ నగర్‌లోని అన్నై ఆరోగ్యమాత ఆలయంలో క్యాండిళ్లు వెలిగించి ప్రార్థనలు చేశారు. కౌన్సిలర్ ఎమ్ఏ మూర్తి నేతృత్వంలో వేలాచ్చేరీ సెల్లియమ్మన్ ఆలయంలో పాలాభిషేకం జరిగింది. కొడంగయ్యూరు ముత్తమిళ్ నగర్లో ఎమ్మెల్యే వెట్రివేల్ అధ్వర్యంలో 2008 మంది మహిళలు పాలకళశాలతో ఊరేగింపు జరిపారు. విరుగంబాక్కం గాంధీనగర్‌లోని ముత్తుమారియమ్మన్ ఆలయంలో మాజీ మంత్రి వలర్మతి, పలువురు ఎమ్మెల్యేలు దీపాలు వెలిగించి ప్రార్థనలు చేశారు. నుంగబాక్కం అగస్తీశ్వరన్ ఆలయంలో మాజీ ఎమ్మెల్యే కలైరాజన్ పూజలు నిర్వహించారు. మధురై మీనాక్షి ఆలయంలో మంత్రి సెల్లూరు రాజా దీపాలు చేతబూని ప్రార్థనలు చేశారు. కారైపాక్కం గంగైయమ్మన్ ఆలయంలో మూడువేల నేతిదీపాలు వెలిగించి పూజలు చేశారు. కరైపాక్కంలో 3వేల మహాదీపాలను వెలిగించి అన్నదానం చేశారు. తిరువత్తియూరు సాత్తుమా నగర్‌లోని శక్తివినాయక ఆలయంలో ప్రార్దనలు నిర్వహించారు. మంత్రి బెంజిమెన్ అధ్వర్యంలో సుఖజీవ జెప కూటంలో ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించారు. మాజీ మంత్రి గోకుల ఇందిర పలువురు మహిళా కార్యకర్తలతో కలిసి మహాశివునికి అపోలో ఆసుపత్రి ముందు పూజలు చేశారు. ఎంజీఆర్ మన్ర ం అధ్వర్యంలో వంద మంది పురుష, మహిళా కార్యకర్తలు నెత్తిపై కుండలు వాటిలో మంటలతో అపోలో ఆసుపత్రి ముందు ఊరేగింపు చేస్తూ ప్రార్థనలు జరిపారు. -
ఆస్తుల సంపాదన నేరం కాదు
అక్రమంగా సమకూరితేనే నేరం జయలలిత కేసులో సుప్రీంకోర్టు న్యూఢిల్లీ: ఆస్తులు సంపాదించడం నేరం కాదని, అవి అక్రమ సంపాదన ద్వారా సమకూరితేనే అది నేరం కిందికి వస్తుందని సుప్రీంకోర్టు వ్యాఖ్యానించింది. తమిళనాడు సీఎం జయలలిత ఆదాయానికి మించిన ఆస్తుల కేసు విచారణ సందర్బంగా ఈ వ్యాఖ్యలు చేసింది. జయను నిర్దోషిగా ప్రకటిస్తూ కర్ణాటక హైకోర్టు ఇచ్చిన తీర్పుపై ఆ రాష్ట్ర ప్రభుత్వం సుప్రీంకోర్టులో సవాల్ చేయడం తెలిసిందే. దీనిపై వేసవి సెలవుల్లో అసాధారణ రీతిలో జస్టిస్ పీసీ ఘోస్, జస్టిస్ అమితవ రాయ్‌ల వెకేషన్ బెంచ్ బుధవారం విచారణ జరిపింది. వెకేషన్లో అత్యవసర అంశాలను మాత్రమే విచారణకు స్వీకరించే సుప్రీం. వేసవి సెలవుల్లో తుది వాదనలను వినాలని నిర్ణయించింది. ఈ కేసు పరిష్కారానికి మూడు మార్గాలు కనిపిస్తున్నాయని పేర్కొంది. హైకోర్టు తీర్పును సమర్థించడం లేదా తిరస్కరించడం, కేసును తాజాగా విచారించడం లేదామళ్లీ మొదటి నుంచి విచారణ చేపట్టాలని హైకోర్టును ఆదేశించడం అనే మార్గాలున్నాయంది. న్యాయవాది దుష్యంత్ దవే కర్ణాటక ప్రభుత్వవాదనలు వినిపిస్తూ.. హైకోర్టుతీర్పు హేతుబద్ధంగా లేదన్నారు. గిఫ్ట్‌లను ఇచ్చే సంప్రదాయం తమిళనాడులో ఉందని హైకోర్టు చెప్పిన వ్యాఖ్యలను దవే ఖండించారు. రూ.66.65 కోట్ల అక్రమాస్తుల కేసులో ప్రత్యేక కోర్టు జయలలితను దోషిగా తేల్చి నాలుగేళ్ల శిక్ష విధించడంతోపాటు రూ.100 కోట్ల జరిమానా విధించగా, దీన్ని హైకోర్టు కొట్టివేసిన సంగతి తెలిసిందే. -
వర్షబీభత్సంలో చిక్కుకుపోయిన సీఎం కాన్వాయ్!
చెన్నై: తమిళనాడులో ఎడతెరిపిలేకుండా కురుస్తున్న వర్షాలతో సామాన్య ప్రజలే కాదు ముఖ్యమంత్రి జయలలిత కూడా ఇబ్బందులు ఎదుర్కొన్నారు. వర్షాల కారణంగా ఏర్పడిన ట్రాఫిక్ జామ్‌లో సోమవారం ఆమె కాన్వాయ్ కాసేపు చిక్కుకుంది. వర్షాలతో అతలకుతలమైన తన నియోజకవర్గం డాక్టర్ రాధాకృష్ణ నగర్లో పర్యటించేందుకు వెళ్లే సమయంలో సీఎం కాన్వాయ్ ట్రాఫిక్ జామ్‌లో ఇరుక్కుపోయింది. చెన్నైతోపాటు తమిళనాడు అంతటా కురుస్తున్న వర్షాలతో సామాన్య ప్రజలు అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఈ వర్షబీభత్సంలో ఇప్పటికే 71మంది మరణించారు. దీంతో రాష్ట్రమంతా వర్షబీభత్సం కొనసాగుతుండగా.. ప్రజలకు సహాయ చర్యలు చేపట్టడంలో ప్రభుత్వం ఘోరంగా విఫలమైందని ప్రతిపక్షాలు ధ్వజమెత్తుతున్నాయి. ఈ నేపథ్యంలో తమిళనాడు సీఎం జయలలిత బాధిత ప్రజలకు అండగా ఉంటానని భరోసా కల్పించారు. 'ప్రజలు ఎవరూ ఆందోళన చెందవద్దు. మిమ్మల్ని ఆదుకోవడానికి నేను ఉన్నాను' అని ఆమె ప్రజలకు భరోసా ఇచ్చినట్టు అన్నాడీఎంకే ట్విట్టర్లో తెలిపింది. వర్షబీభత్సంలో బాధిత ప్రజలను ఆదుకునేందుకు పూర్తిస్థాయిలో సహాయక బృందాలను రంగంలోకి దింపినట్టు ఆమె చెప్పారు. మరోవైపు వర్షాలతో అతలాకుతలమవుతున్న తమిళనాడును ఆదుకునేందుకు కేంద్రం ముందుకువచ్చింది. సహాయక చర్యల కోసం జాతీయ విపత్తు స్పందన దళం (ఎన్డీఆర్ఎఫ్) నుంచి 400 మంది సిబ్బందితో కూడిన 11 బృందాలను తమిళనాడుకు పంపించింది. -
‘అమ్మ’ ఆరోగ్యంపై ప్రశ్నిస్తే.. నాలుక కోస్తా!
రాశిపురం: తమిళనాడు సీఎం జయలలిత ఆరోగ్యం గురించి ఎవరైనా ప్రశ్నిస్తే వారి నాలుక కోస్తానని హెచ్చరించి అన్నాడీఎంకే ఎంపీ పీఆర్ సుందరం దుమారం రేపారు. రాశిపురంలో ఆదివారం ఓ సభలో ఆయన మాట్లాడుతూ, జయ ఆరోగ్యం గురించి ప్రశ్నిస్తూ, ఆమె ఇక విశ్రాంతి తీసుకోవాలంటూ వ్యాఖ్యానించిన డీఎంకే అధినేత కరుణానిధిపై మండిపడ్డారు. ‘అమ్మ(జయ) ఆరోగ్యం గురించి ఎవరు ప్రశ్నించినా, వారి నాలుక కోస్తా’ అన్నారు. -
జయ టీం ఇదే
1. జయలలిత - (ముఖ్యమంత్రి), రాష్ట్ర పరిపాలన, హోంశాఖ 2. ఓ.పన్నీర్ సెల్వం - ఆర్థికశాఖ, ప్రజాపనుల శాఖ 3. నత్తం విశ్వనాథన్ - విద్యుత్, ప్రొహిబిషన్ శాఖ 4.వైద్యలింగం-వ్యవసాయశాఖ,పట్టణాభివృద్ధి,గ్రామీణగృహనిర్మాణ శాఖ 5. ఎడపాటి పళణిస్వామి-రహదారుల శాఖ, చిన్న ఓడరేవులు, అటవీశాఖ 6. మోహన్ - కార్మిక సంక్షేమం, గ్రామీణ పరిశ్రమ శాఖ 7. వలర్మతి - సాంఘిక సంక్షేమం, పౌష్టికాహార శాఖ 8. పళనియప్పన్- ఉన్నత విద్యాశాఖ 9. సెల్లూర్ కె.రాజు - సహకార శాఖ 10. ఆర్.కామరాజ్ - ఆహారం, హిందూ దేవాదాయశాఖ 11. తంగమణి - కార్మికశాఖ 12. సెంథిల్ బాలాజీ - రవాణాశాఖ 13. ఎం.సి.సంపత్ - వాణిజ్యపన్నులు, రిజిస్ట్రేషన్‌శాఖ 14. టీకేఎం చిన్నయ్య - పశుసంవర్ధకశాఖ 15. గోకుల ఇందిర - చేనేత, నూలు పరిశ్రమ శాఖ 16.ఎస్.పి.వేలుమణి-మునిసిపల్నిర్వహణ,గ్రామీణాభివృద్ధి న్యాయశాఖ 17. సుందర్రాజ్ - యువజన సంక్షేమం, క్రీడాశాఖ 18. ఎస్.పి.షణ్ముగనాథన్ - పర్యాటకశాఖ 19.ఎన్.సుబ్రమణియన్-ఆది ద్రావిడ, షెడ్యూల్ కులాల సంక్షేమ శాఖ 20. జయపాల్ - మత్స్యశాఖ 21. ముక్కూరు ఎన్.సుబ్రమణియన్ - సమాచారసాంకేతిక శాఖ 22. ఆర్.పి.ఉదయకుమార్ - రెవెన్యూ శాఖ 23. రాజేంద్ర బాలాజి - ఇన్ఫర్మేషన్, బ్రాడ్‌కాస్టింగ్ శాఖ 24. బి.వి.రమణ - పాడి పరిశ్రమల అభివృద్ధి శాఖ 25. కె.సి.వీరమణి - పాఠశాల విద్యాశాఖ 26. తోపు వెంకటాచలం - పర్యావరణశాఖ 27. పూనాక్షి - ఖాదీ గ్రామోద్యోగ శాఖ 28. అబ్దుల్ రహీం-వెనుకబడిన తరగతుల శాఖ, మైనారిటీ సంక్షేమశాఖ 29. భాస్కర్ - ప్రజా ఆరోగ్యశాఖ -
వారసుడొచ్చాడు
సాక్షి, చెన్నై: అన్నాడీఎంకే సర్కారుకు వారసుడొచ్చాడు. నమ్మకానికి, విశ్వాసానికి పాత్రుడిగా ఉన్న ఓ పన్నీరు సెల్వంకు మళ్లీ పట్టం కడుతూ అన్నాడీఎంకే అధినేత్రి జయలలిత నిర్ణయం తీసుకున్నారు. రెండో సారి ముఖ్యమంత్రి పగ్గాలు చేపట్టేందుకు పన్నీరు సెల్వం సిద్ధమయ్యారు. అన్నాడీఎంకే అధినేత్రి, సీఎం జయలలితకు ఆదాయానికి మించిన ఆస్తుల కేసులో జైలు శిక్ష పడటం ఆ పార్టీ వర్గాల్ని కలవరంలో పడేసింది. జైలు శిక్షను ఎదుర్కొంటున్న జయలలిత తన ఎమ్మెల్యే, సీఎం పదవిని వదులుకోవాల్సిన పరిస్థితి అనివార్యమైంది. దీంతో జయలలిత వారసుడిగా సీఎం పగ్గాలు చేపట్టేదెవరోనన్న చర్చ రాష్ర్టంలో బయలు దేరింది. పలువురి పేర్లు తెర మీదకు వచ్చినా, చివరకు నమ్మకం, విశ్వాసానికి పాత్రుడిగా ఉన్న ఓ పన్నీరు సెల్వంకు తన బాధ్యతల్ని అప్పగించేందుకు జయలలిత సిద్ధమయ్యారు. ఉదయాన్నే ఓ పన్నీరు సెల్వం నేతృత్వంలో నలుగురు మంత్రులు పరప్పన అగ్రహారం చెరలో ఉన్న జయలలితతో భేటీ అయ్యారు. అక్కడి నుంచి ఆగమేఘాలపై చెన్నైకు చేరుకున్న ఈ మంత్రుల బృందం పార్టీ శాసన సభా పక్ష సమావేశానికి పిలుపునిచ్చింది. ముందుగానే చెన్నైకు చేరుకున్న ఎమ్మెల్యేలందరూ పార్టీ కార్యాలయానికి పరుగులు తీశారు. వారసుడొచ్చాడు: జయలలిత వారసుడిగా పలువురి పేర్లు తెర మీదకు రావడంతో కాబోయే సీఎం ఎవరన్న ఉత్కంఠ అన్నాడీఎంకే ఎమ్మెల్యేల్లోను నెలకొంది. జయలలిత సూచించే వ్యక్తే తమ సీఎం అని స్పష్టం చేసిన ఎమ్మెల్యేలు, చివరకు జయలలితకు విశ్వాస పాత్రుడైన, పార్టీ కోశాధికారి, ఆర్థిక మంత్రి ఓ పన్నీరు సెల్వంకు పట్టం కట్టడానికి ఏకగ్రీవంగా అంగీకరించారు. జయలలిత ఆదేశాల మేరకు పార్టీ శాసన సభాపక్ష నేతగా తనను ఏకగ్రీవంగా ఎన్నుకోవడంతో పార్టీ కార్యాలయం నుంచి పన్నీరు సెల్వం బయటకు వచ్చారు. అక్కడి నుంచి నత్తం విశ్వనాథన్, ఎడపాడి పళని స్వామి, వైద్య లింగంలతో కలసి జయలలిత నివాసం పోయేస్ గార్డెన్‌కు బయలు దేరారు. కాసేపు అక్కడ గడిపినానంతరం నేరుగా రాజ్ భవన్‌కు బయలు దేరారు. గవర్నర్‌తో భేటీ : సరిగ్గా సాయంత్రం ఆరు గంటలకు రాజ్ భవన్‌కు ఓ పన్నీరు సెల్వం చేరుకున్నారు. అన్నాడీఎంకే శాసన సభా పక్ష సమావేశంలో తీసుకున్న నిర్ణయాల్ని గవర్నర్‌కు వివరించారు. పార్టీ శాసన సభా పక్ష తీర్మానాలను ఆయన దృష్టికి తీసుకెళ్లారు. తనను శాసన సభా పక్ష నేతగా పార్టీ ఎన్నుకున్న దృష్ట్యా, తన నేతృత్వంలో మంత్రి వర్గం ఏర్పాటుకు అవకాశం కల్పించాలని విన్నవించారు. చివరకు పన్నీరు సెల్వం నేతృత్వంలో ప్రభుత్వం ఏర్పాటుకు ఆమోదం తెలియజేస్తూ రాష్ర్ట గవర్నర్ కొణిజేటి రోశయ్య ఆహ్వానం పలికారు. నమ్మకానికి ప్రతీక ఓపీ: అన్నాడీఎంకేలో ఎందరో నేతలు ఉన్నా, ఓ పన్నీరు సెల్వంకు మాత్రం ప్రత్యేక స్థానం ఉంది. రైతుగా, అన్నాడీఎంకేలో కార్యకర్తగా ఎదిగిన ఓ పన్నీరు సెల్వంకు రాజకీయ పయనంలో తిరుగు లేదని చెప్పవచ్చు. ఎంజీయార్ మరణానంతరం ఆయన సతీమణి జానకి గ్రూపులో చేరినా, చివరకు ఆమె విధానాలు నచ్చక బయటకు వచ్చారు. జయలలితకు అప్పట్లో అండగా నిలబడ్డ నాయకుల్లో అత్యంత విశ్వాస పాత్రుడిగా పన్నీరు సెల్వం పేరు గడించారు. 1996లో పెరియకుళం మునిసిపాలిటీ చైర్మన్‌గా బాధ్యతలు చేపట్టాక వెను తిరిగి చూసుకోలేదు. 2001లో తొలి సారిగా తాను పుట్టిన గడ్డ పెరియకుళం నియోజకవర్గం నుంచి ఎన్నికల బరిలో అసెంబ్లీ మెట్లు ఎక్కారు. తొలి సారిగా అసెంబ్లీలో అడుగు పెట్టిన ఆయనకు జయలలిత మంత్రి వర్గంలో చోటు ద క్కడం గమనార్హం. అదే సమయంలో టాన్సీ కేసులో జయలలిత జైలుకు వెళ్లాల్సి రావడంతో విశ్వాస పాత్రుడి అరుున పన్నీర్ సెల్వంను సీఎం పదవి వరించింది. 2001 సెప్టెంబరు నుంచి 2002 మార్చి వరకు తనకు జయలలిత అప్పగించిన బాధ్యతల్ని, తన మీద ఉంచిన నమ్మకాన్ని వమ్ము చేయకుండా సీఎంగా పన్నీరు సెల్వం విధుల్ని నిర్వర్తించారు. ఈ నమ్మకం పన్నీరు సెల్వం ఉన్నతికి మరింతగా దోహద పడింది. 2006లో అధికారాన్ని కోల్పోయిన సమయంలో తన ప్రతినిధిగా అసెంబ్లీలో ప్రధాన ప్రతి పక్ష నేతగా పన్నీరు సెల్వంను జయలలిత కూర్చోబెట్టారు. మూడో సారిగా ముఖ్యమంత్రి పగ్గాలు చేపట్టాక, ప్రభుత్వంలో ఆర్థిక మంత్రి పదవికి అప్పగించడంతో పాటుగా పార్టీ పరంగా కోశాధికారిని చేశారు. పార్టీ పరంగా, ప్రభుత్వ పరంగా ఏ నిర్ణయం తీసుకున్నా, పన్నీరు సెల్వంతో జయలలిత చర్చిస్తుంటారు. అయితే, ఆ వివరాలు ఏ మాత్రం బయటకు పొక్కేవి కాదు. అందుకే ఆ నమ్మకం మళ్లీ సీఎం పీఠంపై పన్నీరు సెల్వంను కూర్చోబెట్టనుందని చెప్పవచ్చు. -
మౌన దీక్ష
సాక్షి, చెన్నై: ఆదాయానికి మించిన ఆస్తుల కేసులో తమ అధినేత్రి జయలలితకు శిక్ష ఖరారు కావడంతో అన్నాడీఎంకే వర్గాల్లో ఆగ్రహం కట్టలు తెంచుకున్న విషయం తెలిసిందే. తీర్పును జీర్ణించుకోలేని పార్టీ వర్గాలు విధ్వంసాలకు దిగాయి. గవర్నర్ రోశయ్య రంగంలోకి దిగడంతో అధికార యంత్రాంగం కదిలింది. ఆందోళన కారులపై లాఠీలు ఝుళిపించారు. దీంతో పరిస్థితి సద్దుమణిగింది. అయితే, అర్ధరాత్రి వేళ ఎలాంటి విధ్వంసాలకు పాల్పడతారోనన్న ఉత్కంఠ నెలకొంది. దీంతో రాత్రంతా భద్రతను కట్టుదిట్టం చేసి అప్రమత్తంగా పోలీసు యంత్రాంగం వ్యవహరించింది. అయితే, అధికారంలో ఉన్నది తమ ప్రభుత్వమేగా...తామే విధ్వంసాలకు పాల్పడితే చెడ్డ పేరు తప్పదన్న విషయాన్ని అన్నాడీఎంకే వర్గాలు గ్రహించి, శాంతియుత మార్గానికి సిద్ధమయ్యూయి. మౌన ప్రదర్శన : ఆదివారం ఉదయాన్నే రాష్ట్రంలో కొన్ని చోట్ల పార్టీ కార్యాలయాల వద్ద నల్ల బ్యాడ్జీలను ధరించి, నల్ల రిబ్బన్లు నోటికి కట్టుకుని మౌనంగా నిరసన తెలియజేశారు. మరి కొన్ని చోట్ల ప్రదర్శనలు, రాస్తారోకోలు నిర్వహించారు. చెన్నైలో అయితే, వందలాది మంది మహిళలు, కార్యకర్తలు ఉదయాన్నే మెరీనా తీరానికి చేరుకున్నారు. దివంగత నేత, పార్టీ వ్యవస్థాపకుడు ఎంజీయార్ సమాధి వద్ద బైఠాయించారు. తరలి వచ్చిన మహిళలు రోదిస్తూ ఆవేదన వ్యక్తం చేశారు. అమ్మ(జయలలిత)ను నిర్బంధిచడంపై కన్నీటి పర్యంతమయ్యారు. జయలలిత చిత్ర పటాలను చేత బట్టి మౌన దీక్షలో సాయంత్రం వరకు కూర్చున్నారు. శనివారం తీర్పు వెలువడటంతో నిర్మానుష్యంగా మారిన అన్నాడీఎంకే కార్యాలయంలో ఆదివారం ఉద్వేగ భరిత వాతావరణం నెలకొంది. ఆయా ప్రాంతాల నుంచి తరలి వచ్చిన నాయకులు బోరును విలపించారు. ఓ దశలో కార్యాలయం వెలుపలకు తరలి వచ్చిన కార్యకర్తలు రోడ్డుపై బైఠాయించి, డీఎంకే అధినేత ఎం కరుణానిధి, కోశాధికారి ఎంకే స్టాలిన్‌కు వ్యతిరేకంగా నినాదాల్ని హోరెత్తించారు. దీంతో పోలీసులు జోక్యం చేసుకుని ఆందోళనకారుల్ని శాంతింప చేశారు. దుకాణాల మూత: విధ్వంసాన్ని వీడి, శాంతియుత మార్గంలో నిరస బాటకు అన్నాడీఎంకే వర్గాలు సిద్ధమైనా, రాష్ట్రంలో అనేక నగరాలు, జిల్లా కేంద్రాల్లో అక్కడక్కడ దుకాణాలు మూతపడ్డారుు. ఆదివారం సెలవు దినం అయినా, సాధారణంగా తెరచి ఉండే దుకాణాలను స్వచ్ఛందంగా మూసివేశారు. అయితే, జన జీవనానికి ఎలాంటి ఆటంకం కలగలేదు. దక్షిణాది జిల్లాల్లో అనేక నగరాల్లో, జిల్లా కేంద్రాల్లోని రోడ్లు నిర్మానుష్యంగా మారాయి. వాణిజ్య కేంద్రాల పరిసరాల్లో పాక్షికంగా బంద్ వాతావరణం నెలకొంది. చెన్నైలో అక్కడక్కడ దుకాణాలు మూతబడ్డాయి. నిత్యం రద్దీతో పద్మవ్యూహాన్ని తలపించే కొన్ని మార్గాలు నిర్మానుష్యంగా దర్శనిమిచ్చాయి. బస్సు సేవలు అంతంత మాత్రం కొనసాగారుు. ఇదే పరిస్థితి అన్ని జిల్లా కేంద్రాల్లోనూ నెలకొంది. మారుమూల గ్రామాలకు వెళ్లాల్సిన బస్సులు షెడ్లకే పరిమితమయ్యాయి. ఇక రాష్ట్రం నుంచి కర్ణాటకకు బస్సు సేవలు పూర్తిగా ఆగిపోయూరుు. అదుపులో పరిస్థితి - జార్జ్ : రాజధాని నగరంలో భద్రతను కట్టుదిట్టం చేయడంతో పరిస్థితి అదుపులో ఉందని కమిషనర్ జార్జ్ తెలిపారు. మీడియాతో ఆయన మాట్లాడుతూ, నగరంలో ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటు చేసుకోకుండా పకడ్బందీగా వ్యవహరిస్తున్నామన్నారు. జన సంచారం అత్యధికంగా ఉండే ప్రాంతాల్లో భద్రతను పెంచామని తెలిపారు. ఇతర పార్టీల నాయకుల ఇళ్లు, ఆ మార్గాల్ని భద్రతా వలయంలోకి తెచ్చామని వివరించారు. అన్నాడీఎంకే వర్గాలు అత్యధికంగా ఉండే ప్రాంతాల్లో భద్రతను పెంచామని తెలిపారు. జాలర్ల నిరసన : జయలలితకు శిక్ష ఖరారు కావడంతో జాలర్లలో ఆగ్రహం రేగింది. ఉదయాన్నే నాగపట్నం, వేదారణ్యం జాలర్లు చేపల వేటను బహిష్కరించారు. పడవలను ఒడ్డుకు పరిమితం చేసి, రోడ్డెక్కారు. జయలలితను విడుదల చేయాలని డిమాండ్ చేస్తూ రాస్తారోకో చేపట్టడంతో వాహనాలు ఎక్కడికక్కడ ఆగాయి. పోలీసులు రంగంలోకి దిగి బుజ్జగించినా, జాలర్లు మాత్రం తగ్గలేదు. చివరకు ఉన్నతాధికారుల జోక్యంతో రాస్తారోకో వీడి, నిరసన దీక్ష నిర్వహించారు. నాగై టోల్ గేట్ కూతవేటు దూరంలో గుర్తు తెలియని వ్యక్తులు ఓ వాహనానికి నిప్పు పెట్టడంతో ఉద్రిక్తత చోటుచేసుకుంది. బస్సుకు నిప్పుతో కలకలం : శాంతియుతంగా నిరసనలు సాగుతున్న వేళ విరుదునగర్‌లో ఓ బస్సుకు నిప్పంటించడం కలకలం రేపింది. అయితే, ఇది తమ పని కాదంటూ అక్కడి అన్నాడీఎంకే వర్గాలు పేర్కొనడంతో పోలీసులు విచారణ వేగవంతం చేశారు. విరుదునగర్ సమీపంలోని నడికుడి బస్టాండ్‌లో గుర్తు తెలియని వ్యక్తులు బస్సులోని కొందరు ప్రయాణికుల్ని దించేసి నిప్పు పెట్టారు. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది సకాలంలో స్పందించి మంటల్ని అదుపు చేయడంతో బస్సు పాక్షికంగా కాలింది. అయితే, తమకు ఎలాంటి సంబంధం లేదంటూ అన్నాడీఎంకే వర్గాలు ప్రకటించడంతో ఈ బస్సుకు నిప్పు అంటించిన వారి భరతం పట్టేందుకు విరుదునగర్ పోలీసులు సిద్ధం అయ్యారు.