దశాబ్దాలుగా మన నాలుకపై ఉండే రుచి మొగ్గలు ఉప్పు, పులుపు, చేదు, వగరు, కారం, తీపి వంటి షడ్రుచులను గుర్తిస్తుందని తెలుసు. అవి కాకుండా ఉన్న మరో ఏడో రుచి గురించి విన్నారా..?. అదే 'ఉమామి' టేస్ట్. దీని కోసం ఓ రోజుని ఏర్పాటు చేసి మరీ ఈ ఏడో రుచి గురించి చెబుతున్నారు. ప్రతి ఏటా జూలై 25న ఈ ఉమామి దినోత్సవాన్ని ఘనంగా జరుపుకుంటున్నారు. ఆ రోజును ఈ టేస్ట్‌కి సంబంధించిన వంటకాలతో సెలబ్రేట్ చేసుకుంటారు. అసలు ఏంటీ ఉమామి..? ఎవరూ కనిపెట్టారు? ఎలా ఉంటుంది ఈ రుచి..? అంటే..
'ఉమామి' అంటే జపనీస్ భాషలో "ఆహ్లాదకరమైన రుచి". 1980లలో అధికారికంగా ప్రత్యేక రుచిగా ఈ పేరు పెట్టడం జరిగింది. ఉమామి అనేది ఒక డిష్‌ని ఎలివేట్ చేసేలా రిచ్‌నెస్, ఫుల్‌నెస్ కూడిన ఒక విధమైన రుచి. మాంసం, చేపలు, పుట్టగొడుగుల కూరల్లోని గ్రేవీకి తీపి, పులుపుతో కూడిన రుచినే ఈ ఉమామి. ఇది మనసుకు ఓదార్పుని, ఊరటనిచ్చే ఆహ్లాదకరమైన రుచి అని చెప్పొచ్చు. అనేక ఆహారాల్లో ఉండే గ్లూటామేట్, అమైనో ఆమ్లం మన నాలుకపై ఉండే రుచి గ్రాహకాలను ప్రేరేపిస్తుంది. ఇదే ఉమామి రుచి. ఎక్కువగా మాంసం, సముద్రపు ఆహారంలో ఈ ఉమామి టేస్ట్ అనుభవానికి వస్తుందని చెబుతున్నారు ఆహార నిపుణులు.
రుచి ఎలా ఉంటుందంటే...
ఇది ఒక సంక్లిష్టమైన రుచి. ఒక డిష్ మొత్తం రుచిని, గొప్పతనాన్ని తెలియజేసేలా ఉంటుంది. మాంసాహారం, కూరగాయాలు గంటలు తరబడి ఉడకబెట్టిన పులుసులో ఈ రుచి తెలుస్తుంది. అంతేగాదు తల్లి పాలల్లో కూడా ఈ రుచి ఉంటుందట.
ఏఏ వంటకాల్లో ఉంటుందంటే..
చైనా: పులియబెట్టిన సోయాబీన్ పేస్ట్ (డౌబంజియాంగ్, ఓస్టెర్ సాస్ లెక్కలేనన్ని చైనీస్ వంటకాల్లో ఇది కనిపిస్తుంది. ఉమామి డెప్త్‌ను జోడిస్తాయి.
భారతదేశం: నెయ్యి, స్పష్టమైన వెన్న, భారతీయ కూరలు, పప్పుతో కూడిన రెసిపీల్లో ఇది కనిపిస్తుంది.
ఆగ్నేయాసియా: ఫిష్ సాస్, థాయ్ వంటకాలైనా స్టైర్-ఫ్రైస్, సూప్‌లలో ఈ ఉమామి టేస్ట్ ఉంటుంది.
ఆరోగ్యానికి మంచిదేనా..?
'ఉమామి' మన రుచి మొగ్గలను మాత్రమే కాకుండా, ఆరోగ్య ప్రయోజనాలను కూడా అందిస్తుంది. ఉమామి సంతృప్తతను పెంచుతుందని అధ్యయనాలు సూచిస్తున్నాయి. ఇది కడుపునిండుగా ఉన్న అనుభూతిని కలిగించి, అతిగా తినడాన్ని నియంత్రిస్తుంది. ఉమామి అధికంగా ఉండే ఆహారాలు గ్లుటామేట్, అమైనో ఆమ్లాల మూలం. కాబట్టి ఇది మెదడు పనితీరు, న్యూరోట్రాన్స్మిటర్ ఉత్పత్తికి మంచిది.
(చదవండి: పౌల్ట్రీ వ్యర్థాలతో బెడ్‌షీట్‌లు,జాకెట్లు,కాగితాలు! సరికొత్త వస్త్ర పరిశ్రమ..)
Comments
Please login to add a commentAdd a comment