‘‘నోటిని, నాలుకను అదుపు చేసుకొనువాడు శ్రమల నుండి తన ప్రాణమును కాపాడుకొనును’’ (సామెతలు 21: 23)
కొందరు అనవసర మాటల వల్ల తొందరపడి తప్పులు చేస్తున్నారు.. చిక్కుల్లో పడుతున్నారు. అవతలివారికి చిక్కి, జగడమాడుతున్నారు. అదుపులేని మాటలు, అసభ్యకర మాటలను పెద్దలు వింటున్నారని కూడా విచక్షణ లేకుండా మాట్లాడుతున్నారు. ఎదుటివారికి కోపం వస్తుందని, వారి మనసుకు గాయమవుతుందని గ్రహించలేకపోతున్నారు. జంతువులు కేకలు వేస్తాయి, అరుపులు అరుస్తాయి. కానీ దేవుడు మనకు వాక్శక్తి అనుగ్రహించాడు. ఎంతమంది నాలుకను అదుపులో పెట్టుకుంటున్నారు... సద్వినియోగపర్చుకుంటున్నారు! నోటికొచ్చినట్టు వాగ్దానాలు చేస్తున్నారు కొందరు.
కానీ ఎన్ని వాగ్దానాలు అమలు చేస్తున్నారో తెలియదు. ఈ విషయంలో ఏసుక్రీస్తు శిష్యుడైన యాకోబు తాను రాసిన పత్రిక 3 :2 లో ఏమని రాశారో గమనిద్దాం. అనేక విషయాలలో మనమందరం తప్పి΄ోతున్నామని, ఎవరైనా మాట తప్పిన యెడల అట్టివాడు లోపం లేనివాడై, తన మొత్తం శరీరాన్ని కాపాడుకోగల శక్తి గలవాడవుతాడని గుర్రాలను, మనుషులు లోబరచుకోవడానికి నోటికి కళ్లెం పెట్టి త్రిప్పుతున్నారు కదా! ఓడలను కూడా చూడండి. అవి ఎంతో గొప్పవై పెనుగాలికి కొట్టుకొనిపొయినా ఓడ నడుపువాని ఉద్దేశం చొప్పున చాలా చిన్నదైన చుక్కాని చేత తిప్పబడుతుందికదా! ఆలాగున నాలుక కూడా చిన్ని అవయవమైనా బహుగా అదిరిపడుతుంది.
ఎంతో చిన్నదైన నిప్పురవ్వ బహు విస్తారమైన అడవిని కూడా తగులబెడ్తుంది కదా! నాలుక కూడా అగ్ని వంటిదే. నాలుక కూడా చిన్నదైనను బహుగా అదిరిపడును. సర్వశరీరమును మాలిన్యం కలుగజేస్తుందని వాక్యం సెలవిస్తుంది. అంతేకాదు అది ప్రకృతి చక్రాన్నే తిప్పును. నరకంలోకి తీసుకొనిపోవును. మృగ, పక్షి, సర్ప, జలచరములలో ప్రతి జాతీ నరులకు సాధు కాజాలును కానీ మానవుడు నాలుకను సాధు చేసుకోలేక ΄ోతున్నాడు. మాటలు తక్కువగా మాట్లాడాలి. సక్రమంగా మాట్లాడాలి. ఇతరులను కించపరచకూడదు.
దేహమును శిక్షకు లోనగునంత నోటివలన చేయకుము, అది ΄పాటున జరిగెనని దూతల యెదుటను చెప్పకూడదు. నీ నోటి మాటల వల్ల దేవునికి కోపము పుట్టింపనేల అని సెలవిచ్చాడు. మహరాజైన దావీదు నోటికి చిక్కము పెట్టుకుంటానన్నాడు. పంచాయితీలోను, ప్రజలలోను, సభలలోను అనాలోచితంగా మాట్లాడక ఆలోచించి యుక్తముగా మాట్లాడాలి. యేసుప్రభువు కూడా పిలాతు మాట్లామమన్నా మాట్లాడలేదు. పిలాతు యేసుక్రీస్తు వారితో నేను సహాయము చేసి శిక్షను పడకుండా చేస్తానన్నా ప్రభువు ఆయన నోటిని అదుపులో పెట్టుకొన్నాడు. మారుమాట పలకలేదు. కావున మానవమాత్రులమైన మనం నోటిని అదుపులో పెట్టుకొని మన ప్రాణాలను కాపాడుకోవాలి. సమాజంలో ఒక గొప్ప స్థానాన్ని పోందాలి.
– కోట బిపిన్ చంద్రపాల్
Comments
Please login to add a commentAdd a comment