
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ ఇంటర్మీడియట్ పరీక్షల ప్రశ్నాపత్రాల్లో పదాల తప్పులు కనిపించాయి. మ్యాథ్స్, బోటని, పొలిటికల్ సైన్స్ పేపర్స్‌లో తప్పులు గుర్తించారు. పదాలను మార్చి చదివేలా పరీక్ష చీఫ్ సూపరింటెండెంట్‌లకు ఇంటర్ బోర్డు ఆదేశాలు జారీ చేసింది. విద్యార్థులకు ఇన్విజిలేటర్ల సహాయంతో మార్పు చేసి పదాలను అధికారులు వివరించారు.
తెలంగాణలో ఇంటర్మీడియట్ వార్షిక పరీక్షలు మార్చి 5 నుంచి ప్రారంభమయ్యాయి. 25 వరకు పరీక్షలు కొనసాగనున్నాయి. మొదటి, రెండో సంవత్సరం కలిపి రాష్ట్ర వ్యాప్తంగా 9,96,971 మంది విద్యార్థులు పరీక్షలకు హాజరయ్యారు.
ప్రథమ సంవత్సరం విద్యార్థులు 4 లక్షల 88 వేల 448 మంది కాగా.. రెండో సంవత్సరం విద్యార్థులు 5 లక్షల 8 వేల 523 మంది ఉన్నారు. తెలంగాణ వ్యాప్తంగా 1,532 పరీక్షా కేంద్రాలను ఇంటర్ బోర్డు ఏర్పాటు చేసింది. కాగా, పరీక్ష కేంద్రాల వద్ద 500 మీటర్ల పరిధిలో సెక్షన్ 163 అమలు చేస్తున్నారు. ప్రతి ఎగ్జామ్ సెంటర్లలోని సీసీ కెమెరాలు ఏర్పాటు చేశారు. కమాండ్ కంట్రోల్ సెంటర్‌కి అనుసంధానం చేశారు.
Comments
Please login to add a commentAdd a comment