Words
-
బండరాళ్ల కింద ముగ్గురు సజీవ సమాధి
సాక్షి ప్రతినిధి, విజయవాడ/కంచికచర్ల/జి.కొండూరు: ఎన్టీఆర్ జిల్లా కంచికచర్ల మండలం దొనబండ శివారులోని ఓ క్వారీలో పనిచేస్తున్న ముగ్గురు కార్మికులు సోమవారం ఉదయం డ్రిల్లింగ్ చేస్తుండగా బండరాళ్లు దొర్లిపడటంతో వాటికింద చిక్కుకుపోయి దుర్మరణం పాలయ్యారు. మృతుల్ని బత్తుల దుర్గారావు (19), సున్నా బీబీనాయక్ (40), బాగేల్ రాందేవ్ (36)గా గుర్తించారు. వివరాల్లోకి వెళితే.. టీడీపీ నాయకుడు చింతల రామ్మోహనరావుకు చెందిన పవన్ గ్రానైట్ మెటల్ వర్క్స్ రాతి క్వారీలో ఒడిశాకు చెందిన బీబీ నాయక్, బాగేల్ రాందేవ్, ఎన్టీఆర్ జిల్లా జి.కొండూరు మండలం చెరువు మాధవరం గ్రామానికి చెందిన బత్తుల దుర్గారావు బ్లాస్టింగ్ చేసిన బండరాళ్లను తొలగించేందుకు కొండపైకి ఎక్కారు.ఒడిశాకు చెందిన కుమారి బోలీ దిగువన ఉన్న బండరాళ్లను పగులకొట్టేందుకు డ్రిల్లింగ్ చేస్తున్నాడు. పైన ఉన్న రాళ్లను తొలగించే క్రమంలో ఒక్కసారిగా భారీ బండరాళ్లు ముగ్గురిపైనా పడటంతో విగతజీవులుగా పడి ఉన్నారు. బోలీ అనే యువకుడు సురక్షితంగానే ఉన్నాడు. మృతదేహాలను 5 గంటలపాటు శ్రమించి జేసీబీల సాయంతో వెలికితీశారు. క్వారీ యజమాని చింతల రామ్మోహనరావు నిర్లక్ష్యమే కార్మికుల పాటి మృత్యుపాశంగా మారింది. రెండు రోజులుగా వర్షాలు కురుస్తున్నా ఆపకుండా పని చేయించటం ముగ్గురు కార్మికులను మృత్యు ఒడికి చేర్చాయి.ఘటనా స్ధలాన్ని జిల్లా మైనింగ్ ఏడీ వీరాస్వామి, నందిగామ సబ్ డివిజన్ ఏసీపీ బి.రవికిరణ్, నందిగామ ఆర్డీఓ ఎ.రవీంద్రరావు, నందిగామ రూరల్ సీఐ పి.చంద్రశేఖర్, ఇంటెలిజెన్స్ సీఐ యువకుమార్, కంచికచర్ల, వీరులపాడు ఎస్ఐలు పీవీఎస్ సుబ్రహ్మణ్యం, హేమలత, తహసీల్దార్ సుస్వాగతం పరిశీలించారు.సేఫ్టీ నిబంధనలకు తిలోదకాలుప్రమాదం జరిగిన క్వారీలో మైనింగ్ సేఫ్టీ నిబంధనల్ని క్వారీ యజమాని తుంగలో తొక్కారు. ఇష్టారాజ్యంగా మైనింగ్ చేయడంతోనే అక్కడ ప్రమాదం జరిగినట్టు అధికారులు ప్రాథమికంగా గుర్తించారు. ముఖ్యంగా క్వారీ ప్రాంతంలో ప్రతి 6 మీటర్లకు బెంచ్ ఫార్మేషన్ చేసుకుని ఎప్పటికప్పుడు లూజును తీసివేయాల్సి ఉండగా.. అక్కడ బెంచ్ ఫార్మేషన్ చేయలేదని గుర్తించారు. మైనింగ్ సేఫ్టీకి సంబంధించి క్వారీలో ఓ మేనేజర్‌ను నియమించాల్సి ఉన్నా అలా చేయలేదు.రెండు రోజులుగా వర్షాలు కురుస్తున్నాయి. ఆ సమయంలో కొండ చరియలు విరగటంతోపాటు, అక్కడ ఉన్న లూజు జారి ప్రమాదం జరిగే అవకాశం ఉందని తెలిసినా బోల్డర్లను డ్రిల్లింగ్ చేయటమే ప్రమాదానికి కారణమని గుర్తించారు. కాగా.. క్వారీలపై మైనింగ్ అధికారుల పర్యవేక్షణ పూర్తిగా కొరవడిందనే విమర్శలు వినిపిస్తున్నాయి. 801 సర్వే నంబరులో 99 లీజులు ఉన్నప్పటికీ ఏ క్వారీ యజమాని నిబంధనలు పాటించటం లేదు. క్వారీ యజమానులకు అధికార పార్టీ అండదండలు ఉండటంతోపాటు, అధికారులు సైతం మామూళ్లు తీసుకొని, నామమాత్రపు తనిఖీలతో సరిపెడుతున్నారు. దీంతో మైనింగ్ మాఫియాకు అడ్డు అదుపూ లేకుండాపోయింది.మూడు కుటుంబాల్లో విషాదంమృతుల్లో ఒకరైన బీబీ నాయక్ 15 సంవత్సరాల క్రితం ఒడిశా నుంచి వలస వచ్చి జి.కొండూరు మండలం చెవుటూరు బాపూజీ కాలనీలో భార్య, కుమారుడు, కుమార్తెతో కలిసి నివాసం ఉంటున్నాడు. బాగేల్ రాందేవ్ సైతం ఒడిశా నుంచి 20 ఏళ్ల క్రితం వలస వచ్చి భార్య, కుమార్తెతో చెవు టూరు శివారులోని క్వారీ ప్రాంతంలో నివాసం ఉంటున్నాడు. పొట్ట కూటి కోసం క్వారీలలో పనులు చేసుకుంటూ జీవనం సాగిస్తున్నారు. రెండు కుటుంబాలకు పెద్ద దిక్కు కోల్పోవడంతో వారి జీవితాలు ప్రశ్నార్థకంగా మారాయి. ప్రమాదంలో మృతి చెందిన బత్తుల దుర్గారావు చిన్న వయసులోనే మృత్యువాత పడడంతో చెరువు మాధవరంలో విషాదఛాయలు అలుముకున్నాయి.క్వారీ యజమానిపై కేసు నమోదుక్వారీ యజమాని చింతల రామ్మోహనరావుపై కేసు నమోదు చేసినట్టు నందిగామ రూరల్ సీఐ పి.చంద్రశేఖర్ తెలిపారు. మృతుడు దుర్గారావు తండ్రి చంద్రం ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టినట్టు తెలిపారు. కాగా.. మృతుల కుటుంబాలకు ఒక్కొక్కరికీ రూ.8.50 లక్షల చొప్పున క్వారీ యజమాని అందజేశారు.నా కళ్లెదుటే మరణించారుబీబీ నాయక్, రాందేవ్, దుర్గారావు కొండపైకి వెళ్లి రాళ్లను తొలగించే క్రమంలో పైనుంచి భారీ బండరాళ్లు వారిపై పడ్డాయి. దీంతో రాళ్ల మధ్య ఇరుక్కుపోయారు. నా కళ్లెదుటే ముగ్గురూ మరణించారు. – కుమారి బోలీ, సహ కార్మికుడుభద్రతా చర్యలు చేపట్టకపోవడమే కారణంసర్వే నంబర్ 801లో రెండు హెక్టార్ల రాతి క్వారీని చింతల రామ్మోహనరావు పదేళ్లపాటు లీజుకు పొందారు. మైనింగ్ ప్లాన్, సేప్టీ మెజర్మెంట్స్ లేకపోవటం, బెంచీలు ఏర్పాటు చేయకపోవటం, సిస్టమాటిక్ మెజర్మెంట్స్ లేకపోవటం వల్లే ప్రమాదం జరిగింది. పూర్తిస్థాయిలో విచారణ చేపట్టి చట్టపరమైన చర్యలు తీసుకుంటాం.– వెంకటేశ్వర్లు, డిప్యూటీ డైరెక్టర్, మైనింగ్ -
తిట్లకు జామర్‌ను కనుగొనాల్సిన అవసరముంది!
‘‘డార్విన్ పరిణామ సిద్ధాంతమనేది రాజకీయాల్లో తిట్లక్కూడా వర్తిస్తుందేమో నాయనా’’ అంటూ విలక్షణమైన స్టేట్మెంట్ ఇచ్చారు స్వామీ ఎలక్షనానంద అలియాస్ స్వామీ సలక్షణానంద. ‘‘అదెలా స్వామీ?’’ అడిగాడు శిష్యుడు. ‘‘ఒకప్పుడు రాజకీయాల్లో విమర్శలుండేవి. తర్వాత అవి కువిమర్శలయ్యాయి, అటు తర్వాత తిట్లు, ఆపైన బూతులు..తాజాగా ఇప్పుడు బండబూతులు. అందుకే పరిణామ క్రమం ఒక్క జీవులకే కాదు... తిట్లకూ ఉందనిపిస్తోంది. అంతేనా..‘యథా తిట్లూ... తథా యాడ్స్’ అన్నట్టుగా కొన్ని పార్టీల ప్రకటనలైతే ఎదుటివాడిపై అరుస్తున్నట్టు..ప్రేక్షకుణ్ణి కరుస్తున్నట్టూ ఉన్నాయి నాయనా’’ ‘‘మొదట్లో అరే..ఒరే అని తిట్టుకుంటున్నవాళ్లు కాస్తా..ఈమధ్య అంతకంటే ఘోరంగా ముందుకెళ్తున్నారు. మొన్న కేటీఆర్ రేవంత్‌ను తిట్టాడనుకో. నిన్న మళ్లీ రేవంత్ కేసీఆర్‌ను తిడతాడు. ‘నీకంటే చాలా పెద్దవాడు కదా..కేసీఆర్‌ను అలా తిట్టడం సబబేనా?’ అని అడిగితే..‘మరి కేటీఆర్‌కూ నాకు మధ్య అంతే ఏజ్ గ్యాప్ ఉంది కదా. అప్పుడు నేను కేసీఆర్‌ను అనడం సమంజసమే కదా’ అంటూ జస్టిఫికేషన్లు ఇచ్చుకుంటూ మరీ తిట్టుకుంటున్నారు. ఇక మైనంపల్లి తిట్లయితే..తాజాగా తెగ వైరల్. పరిస్థితి చూస్తుంటే బాధగా ఉంది స్వామీ’’ అన్నాడు శిష్యుడు దిగులుగా. ‘‘అలనాడెప్పుడో ప్రఖ్యాత సినీ దర్శకుడు సింగీతం శ్రీనివాసరావు, తాను రాసిన ‘క–రాజు కథలు’ అనే అద్భుత కథాసంపుటిలోని ‘పలుకుబడి’ అనే కథలో ‘తిట్లు మంచివే’ అంటాడు. పైగా తిట్టేవాడెప్పుడూ (సమాజంలో) పై అంతస్తులో ఉంటాడట. తిట్టేవారికే అందరూ మద్దతు పలుకుతారట. అందుకే (విద్యార్థులు)అందరితోనూ తిట్లు తెగ ప్రాక్టీస్ చేయించాల్సిన అవసరముందనీ, ఎవరైతే తిట్లలో ప్రావీణ్యం సాధిస్తారో, వారి ‘పలుకుబడే’ రాజ్యంలో ఇంతింతై అన్నట్టుగా పెరుగుతుందని, దాదాపు పాతికేళ్ల కిందటే సెలవిచ్చారు. అదేదో యాడ్‌లో మరక మంచిదే అన్నట్టుగా... సింగీతం వారి సిద్ధాంతం ప్రకారం ‘తిట్లూ మంచివేనేమో’నంటూ సర్దుకుపోవాల్సిందే నాయనా’’ ‘‘అలా ఎలా అన్నారు సింగీతం వారు..తిట్లు మంచివెలా అవుతాయి స్వామీ?’’ ‘‘ఆ హాస్య కథల్లో వ్యంగ్యంగా అన్నమాట అది. ‘భాష రాకపోయినా సరే..బేరాలాడే సమయంలో సైగలతోనైనా సర్దుకుపోతారు ప్రజలు. కానీ బేరం కుదరక కోపం వచ్చిందనుకో..తిట్టుకుంటారూ, ఆపైన కొట్టుకుంటారు. ఇయ్యరమయ్యర కొట్టుకోవడం కంటే..పొట్టుపొట్టుగా తిట్టుకోవడం బెటరంటారు సింగీతం వారు. అలా తిట్టుకుని తాము సాధించిన ‘పై అంతస్తు’తో ఇగో చల్లారిపోయిందనుకో..దాంతో కొట్టుకోవడం ఆగిపోతే అది మంచిదేగా అని ఉద్బోధిస్తారు నాయనా. మనవాళ్లూ తెగ తిట్టుకుని అక్కడితో అలా ఆగిపోతున్నారుగా. కాబట్టి సింగీతం వారి సిద్ధాంతం ప్రకారం అది బెటరేగా’’ ‘‘అసలిలా ఇంతగా తిట్టుకోడానికి కారణం ఏమిటంటారు? ‘‘అదేదో సినిమా డైలాగ్ ఉంది కదా నాయనా. లాస్ట్ పంచ్ మనదైతే వచ్చే కిక్కే వేరని. దాని కోసమే ఇలా తిట్టుకుంటున్నట్టుంది. కానీ వీళ్లు గ్రహించాల్సిందేమిటంటే..ఎవడికి వాడు ఇదే లాస్ట్ పంచ్ అనుకుంటాడు తప్ప..ఆ లాస్ట్ అనేది ఎప్పటికీ రాదనీ, అదో చైన్ రియాక్షన్‌లా అలా సాగిపోతూనే ఉంటుందని ఎవరూ గ్రహించడం లేదు. అయినా పర్లేదులే ఇంకెంత..జస్ట్ రెండు రోజులేగా’’ ‘‘రెండ్రోజుల్లో ఈ అసెంబ్లీ ఎన్నికలు ముగుస్తాయి సరే..ముందుంది మొసళ్లపండగ అన్నట్టు..మున్ముందు ఎంపీ ఎలక్షన్లూ, ఆ పైన స్థానిక ఎన్నికలూ, అటు తర్వాత మున్సిపల్ ఎన్నికలూ..ఇలా ఎలక్షన్లూ, తిట్లూ ఎప్పటికీ ముగిసేవి కాదు స్వామీ. ఏం జరిగితే అవి ఆగుతాయో తెలియడం లేదు’’ బెంగగా అన్నాడు శిష్యుడు.‘‘అందుకే నాకనిపిస్తోంది నాయనా..బాంబులకు ఉన్నట్టే... బూతులకూ జామర్ కనుగొంటే బాగుండు’’ అంటూ తాను దిగులు పడ్డారు స్వామీ ఎలక్షనానంద. -
మాటకు కట్టుబడి...
మన తెలుగు రాజు హాలుడు సంస్కృతం నేర్చుకోవాలనుకున్నప్పుడు ఇద్దరు పండితులు వస్తారు నేర్పేందుకు. ఒకడు గుణాఢ్యుడు. రెండు శర్వవర్మ. ‘నేను మీకు సంస్కృతం నేర్పాలంటే 12 సంవత్సరాలు పడుతుంది’ అంటాడు గుణాఢ్యుడు. రాజుగారి అర్జెన్సీ గమనించిన శర్మవర్మ ‘నేను ఆరు నెలల్లో నేర్పుతాను’ అంటాడు. అది అసాధ్యం. కనుకనే గుణాఢ్యుడు ఆగ్రహంతో ‘అదే జరిగితే నాకు తెలిసిన సంస్కృత, ప్రాకృత, దేశ భాషలన్నింటినీ విడిచి పెట్టేస్తాను’ అంటాడు. శర్వవర్మ ఏవో తిప్పలు పడి కొత్త వ్యాకరణం రాసి ఆరు నెలల్లో రాజుగారికి సంస్కృతం వచ్చు అనిపిస్తాడు. ఇందుకు గుణాఢ్యుడు ఆశ్చర్యపోయి, మొత్తానికి సాధించావ్ అనేసి తన దోవన తాను పోతే ఎవరూ ఏమీ అనరు. తల తీసి మొలేయరు. కాని మాటకు విలువ ఇచ్చే కాలం అది. గుణాఢ్యుడు మహా పండితుడు. భాషే జీవంగా జీవించేవాడు. అలాంటివాడు తానిచ్చిన మాటకు విలువనిచ్చి తనకు తెలిసిన అన్ని భాషలను వదిలిపెట్టి, మౌనిగా మారి, అడవులకు వెళ్లిపోతాడు. అక్కడ అతను పైశాచి భాష నేర్చుకుని ‘బృహత్కథ’ రాయడం వేరే విషయం. కాని మాటకు కట్టుబడటం వల్లే కదా ఇన్ని వందల ఏళ్ల తర్వాత గుర్తు చేసుకుంటున్నాము. మనిషి గుంపు జీవనం మొదలెట్టే నాటికి లిపి లేదు. రాతకోతలు లేవు. నోటి మాటే శిలాశాసనం. మాట ఇవ్వడం అంటే ఒప్పందం చేసుకోవడమే. రాజ్యాలు ఏర్పడ్డాక ‘మాటకు కట్టుబడటం’ ఒక విలువగా, యుగ స్వభావంగా స్థాపన చేసేందుకు సత్య హరిశ్చంద్రుడి కథ విశేషంగా వ్యాప్తిలోకి వచ్చింది. హరిశ్చంద్రుడు విశ్వామిత్రునికి ఇచ్చింది కేవలం మాటే. హరిశ్చంద్రుడు పాలకుడు, రాజు. ఇచ్చిన మాట నెరవేర్చకపోతే ఎవరూ ఏమీ చేయరు. కాని మాట తప్పిన అపప్రథను శిరస్సున మోయడం కంటే రాజ్యాన్ని, భార్యను, కుమారుణ్ణి కూడా కోల్పోయేందుకు సిద్ధమవుతాడు. శ్రీరాముడు మరింత ఉదాత్తుడు. తన మాటకు కాదు, తండ్రి ఇచ్చిన మాటకు కట్టుబడి అడవులకు వెళ్లాడు. ‘నువ్వు మాటిస్తే నేనెందుకు వెళ్లాలి నాన్నా’ అనంటే దశరథుడు చేయగలిందేముంది? అందుకే రాముడు దేవుడు. గాంధీ గారు దక్షిణాఫ్రికా వెళుతూ తన తల్లికి ‘మద్యం, మగువ, మాంసం జోలికి వెళ్లను’ అని మాట ఇచ్చారు. అక్కడకు వెళ్లాక మద్యం ఎలాగూ అలవాటు లేదు. మగువకు లోబడలేని నిష్ఠ ఉంది. కాని మాంసం జోలికి వెళ్లకుండా, అక్కడ అదే దొరుకుతుంది కనుక, ఎలా ప్రాణాలు నిలబెట్టుకోవాలో ఆయనకు అర్థం కాలేదు. అయినా సరే, మాట తప్పలేదు– ఆకలికి తాళలేక పచ్చి బియ్యం బొక్కాడు తప్ప. నిజం. అలా ఉండేవారు జనులు, తల్లికి మాట ఇస్తే, గురువు మాట ఇస్తే్త, తమకు తాము మాట ఇచ్చుకుంటే జీవితాంతం కట్టుబడేవారు. ఉత్తరాదిలో ‘ప్రాణ్ జాయ్ పర్ వచన్ నా జాయ్’ అంటారు. మాట పోతే ప్రాణం పోయినట్టే! మరి కల్తీ సరుకు రాకుండా ఉంటుందా? ‘కన్యాశుల్కం’లో కరటక శాస్త్రి తన శిష్యుణ్ణి ఆడవేషం కట్టమని చెప్పి, ఆ వేషంలో లుబ్ధావధాన్లను పెళ్లి చేసుకోమని ‘నువ్వు నెగ్గుకొస్తే మా పిల్లన్నీకిచ్చి ఇల్లరికం వుంచుకుంటాను’ అంటాడు. ‘మాట తప్పితే భూమి తోడ్రా’ అనంటాడు. దానికి శిష్యుడు ‘మీరు యగేస్తే భూవేం చేస్తుందిలెండి?’ అనంటాడు. మాట ఇవ్వడాన్ని పాతకాలపు చాదస్తంగా, మాట తప్పడాన్ని కొత్త జీవన మంత్రంగా పసిగట్టి గురజాడ ‘కన్యాశుల్కం’లో ఆనవాలు వదిలాడు. నిజమే. మనుషులు కాగితాన్ని తప్ప మాటను నమ్మని పరిస్థితి వచ్చింది. ఎక్కడి మాట అక్కడే మర్చిపోవాలి అనే గిరీశాలు మూలకొకడు, మలుపుకొకడు తయారయ్యారు. ‘ఆడిన మాటలు తప్పిన గాడిద కొడకంచు తిట్టగా విని అయ్యో వీడా నాకొక కొడుకని గాడిద ఏడ్చెన్ గదన్నా ఘన సంపన్న’ అనే పద్యం వీరి ఎదుట చదివితే ‘తిట్టుకో తిట్టుకో... అలాగే అలాగే’ అని కాఫీ తాగి లేచ్చక్కా పోతుంటారు. కాని ఎంత అధ్వాన్న రోజుల్లోనైనా వడగడితే జారిపోని విలువలు ఎన్నోకొన్ని మనుషులు మిగుల్చుకునే ఉంటారు. మాట తప్పని స్వభావాన్ని వారు నేటికీ గౌరవిస్తూనే ఉన్నారు. ఈ భూమి, ఈ వనరులు, ఈ సంపద, ఈ గాలి, నీరు... వీటన్నింటికీ తాము సమాన హక్కుదార్లమని తెలిసినా, పోరాడి పొందగలిగే శక్తి ఉన్నా, పాలకులుగా... ఏలికలుగా సింహాసనాల్లో కూర్చున్నవారు తమకు నాలుగు మెతుకులుగా విదిల్చితే పొందాలేమోనన్న స్థితికి వారు నెట్టబడినా, ఇలాంటి స్థితిలో కూడా వారు ఎవరి మాట సత్తుదో, ఎవరి మాటలో సత్తువున్నదో సూక్ష్మంగా గమనిస్తూనే ఉంటారు. ఎన్నికలు వచ్చిన ప్రతిసారీ తమ ఇంగితజ్ఞానం అనే గీటురాయిని బయటకు తీస్తూనే ఉంటారు. నమ్మిన మాటను గెలిపిస్తారు. ఒకవేళ అది నమ్మించిన మాట మాత్రమే అని గ్రహిస్తే సందర్భం కోసం కాచుకుని ఉంటారు. ‘తప్పుడు వెధవ’ అనే తిట్టు ఉంది. అంటే తప్పు చేసినవాడు మాత్రమే కాదు మాట తప్పినవాడు కూడా! ప్రజల నుంచి తీసుకుని తిరిగి ప్రజలకు అందించడం అనే ఒక సరళ సూత్రంలో పాలకుడు వాహిక మాత్రమే. ప్రజలకు మంచి చేస్తాను అనే మాట మాత్రమే అతనికి శిరోధార్యం కావాలి. జనం చెవిలో పువ్వు పెట్టే నాలుగు మాటలు చెప్పి తమ మెడలో విజయహారాలు ధరిద్దామనుకుంటే అది గేమ్‌లో భాగమే కావచ్చు. కాని అలాంటి గేమ్‌లో ఠక్కున ఔటవడమే గాక మాటగా కూడా గుర్తురాని స్థితికి దిగజారి పోతారు. మాటలు వెదజల్లకండి. ఇవ్వగలిగిన మాట మాత్రమే ఇవ్వండి. మాట జాగ్రత్త! -
మాటలంటే మాటలా!
మాటలదేముంది మాటలే కదా అని తేలికగా తీసిపారేయలేము. మాటలు కేవలం మాటలే కావచ్చు గాని, మాటలంటే మాటలు కాదు. లోకంలో మాటలు నేర్చిన జీవులు మనుషులే! తాము నేర్చిన మాటలను ఊసుపోక శుక పికాదులకు నేర్పించిన ఘనత కూడా మనుషులకే దక్కుతుంది గాని, అది వేరే విషయం. మాటల మహిమను వర్ణించాలంటే మాటలు చాలవు. మాటకారులు ఎలాంటి పరిస్థితుల్లోనైనా ఇట్టే నెట్టుకొచ్చేయగలరు. అసాధ్యమనుకున్న పనులను చిటికెలో చక్కబెట్టగలరు. మాటకారులైన దౌత్యవేత్తలు మాటలతో యుద్ధాలను కూడా నివారించగలరు. మాటల మహత్తును ఒక పూర్వకవి ఇలా వర్ణించాడు: ‘మాటల చేత దేవతలు మన్నన జేసి వరంబు లిత్తురా/ మాటల చేత భూపతులు మన్నన జేసి పురంబు లిత్తురా/ మాటల చేత మానినులు మన్నన జేసి మనంబు లిత్తురా/ మాటలు నేర్వకున్న నవమానము, న్యూనము, మానభంగమున్’. చక్కగా మాట్లాడటం చేతనైతే దేవతలను; భూపతులను; మానినులను సైతం మెప్పించి, వారి ద్వారా కోరిన ప్రయోజనాలు పొందడం సాధ్యమవుతుంది. సక్రమంగా మాట్లాడటం చేతగాకుంటే చీవాట్లు, శిక్షలు తప్పకపోవచ్చు. నలుగురిలోనూ నవ్వుల పాలయ్యే పరిస్థితులు కూడా తప్పకపోవచ్చు. మాటకారితనానికి మారుపేరుగా వెలిగిన మహానుభావులు చరిత్రలో చాలామంది ఉన్నారు. అక్బర్ ఆస్థానంలోని బీర్బల్, శ్రీకృష్ణదేవరాయల వారి ఆస్థానంలోని తెనాలి రామకృష్ణుడు వంటి వారు ఆ కోవలోకే వస్తారు. వారి మాటకారితనాన్ని ఇప్పటికీ జనాలు కథలు కథలుగా చెప్పుకుంటూనే ఉన్నారు. కొందరు ముక్తసరిగా మాట్లాడతారు. కొందరు ఆచి తూచి తూకం వేసినట్లుగా మాట్లాడతారు. కొందరు గలగలా ధారాళంగా మాట్లాడతారు. కొందరు రసజ్ఞులు సరసంగా మాట్లాడతారు. రసజ్ఞత బొత్తిగాలేని కొందరు విరసంగా మాట్లాడతారు. కొందరు నిష్ఠురంగా మాట్లాడతారు. ‘నరుడు మదిలో దొంగ/ నాల్క బూతులబుంగ/ కడుగజాలదు గంగ’ అన్నారు ఆరుద్ర. అదేం కర్మమోగాని కొందరు నోరు తెరిస్తే చాలు, బూతులతో మోత మోయిస్తారు. ఇటీవలి రాజకీయాల్లో ఇలాంటివారి వాగ్ధాటి విపరీతంగా మార్మోగుతోంది. కొందరు మాటలతోనే కోటలు కట్టేస్తుంటారు కొందరి మాటలు కోటలు దాటేస్తుంటాయి. అలాంటివారు రాజకీయాల్లో అమోఘంగా రాణిస్తుంటారు. ‘ఏదైనా సభలో ఆశువుగా మాట్లాడటానికి ముందు నేను కనీసం మూడువారాల పాటు సాధన చేస్తాను’ అని చెప్పుకున్న మార్క్ ట్వేన్ మన రాజకీయ నాయక దిగ్గజాల ముందు ఎంతటి అర్భకుడో కదా పాపం! మన రాజకీయ నాయకులు అంత శ్రమ లేకుండానే, ఎంత పెద్ద బహిరంగ సభలోనైనా గంటల కొద్ది ఏకధాటిగా ప్రసంగించగలరు. రాజకీయరంగంలోనే కాదు, సాహితీ రంగంలోనూ, ఆధ్యాత్మిక ప్రవచన రంగంలోనూ ఇలాంటి అనర్గళ వాక్ప్రతిభాసంపన్నులు తారసపడుతుంటారు. మాటలు రకరకాలు. మనుషుల్లో ఎన్ని రకాలో మాటలు కూడా అన్ని రకాలు. హితవైన మాటలు, మధురమైన మాటలు, కల్లబొల్లి మాటలు, సరళమైన మాటలు, పరుషమైన మాటలు, దుందుడుకు మాటలు, ముతక మాటలు, నాజూకు మాటలు, చమత్కారం మాటలు, వెటకారం మాటలు– చెప్పుకుంటూ పోతే జాబితా చేంతాడంతవుతుంది. మనది ప్రజాస్వామ్యం. అందువల్ల మనకు మాట్లాడుకునే స్వేచ్ఛ ఉంది. మన రాజ్యాంగం ప్రకారం ‘వాక్స్వాతంత్య్రం’ మన ప్రాథమిక హక్కుల్లో ఒకటి. దురదృష్టవశాత్తు జనాలు అతిగా దుర్వినియోగం చేసుకునే హక్కు కూడా ఇదే! ‘ప్రజలు వాక్స్వాతంత్య్రాన్ని ఎందుకు కోరుకుంటారంటే, దాన్ని ఆలోచనా స్వాతంత్య్రానికి ప్రత్యామ్నాయంగా భావిస్తారు. ఆలోచనా స్వాతంత్య్రాన్ని దాదాపుగా వారు ఎప్పుడూ ఉపయోగించుకోరు’ అని డేనిష్ కవి, తత్త్వవేత్త సోరెన్ కీర్కెగార్డ్ వాక్స్వాతంత్య్రాభిలాష వెనుకనున్న మతలబును రెండు శతాబ్దాల కిందటే తేటతెల్లం చేసేశాడు. మాటలు నోటి ద్వారా వెలువడతాయి. అంతమాత్రాన మాట్లాడటానికి నోరు మాత్రమే ఉంటే సరిపోదు. మాట్లాడటానికి ఆలోచన అవసరం. అనాలోచితంగా మాట్లాడే మాటలు ఒక్కోసారి చిక్కుల్లోకి నెడతాయి. ‘వివేకవంతులు తమ మాటలను ఆలోచనలతో జల్లెడ పడతారు’ అన్నాడు బుద్ధుడు. కాకపోతే సమాజంలో వివేకవంతుల సంఖ్య ఎప్పుడూ పరిమితమే! అరకొర జ్ఞానంతో అల్లాడే వాక్శూరులు వినేవాళ్లను వెర్రిగొర్రెల్లా లెక్కగట్టి చేటభారతాలు చెప్పుకుంటూ పోతారు. వారి వాక్స్వాతంత్య్రాన్ని ఎవరూ హరించలేరు గాని, అమెరికా మాజీ ప్రధాన న్యాయమూర్తి వారెన్ ఇ బర్గర్ అన్నట్లుగా ‘వాక్‌స్వాతంత్య్రంలో శ్రవణ స్వాతంత్య్రం కూడా మిళితమై ఉంటుంది’ అనే వాస్తవాన్ని గుర్తెరగాలి. అప్పుడే వాక్స్వాతంత్య్రాన్ని సద్వినియోగం చేసుకోగలుగుతాం. మనకు బహుభాషా పరిజ్ఞానం ఉంటే ఉండవచ్చు; అపారమైన పదసంపద ఉండవచ్చు; అనర్గళ వాగ్ధార ఉండవచ్చు. అంతమాత్రాన అనాలోచితంగా నోటికి ఎంతొస్తే అంత మాట్లాడుతూ పోతే శృంగభంగం తప్పదు. అసలే ఇది మనోభావాల కాలం. ఏ మాట ఎలాంటి విపరిణామాలకు దారితీస్తుందో అనేదానిపై కనీసమైన అంచనా మాట్లాడే ముందే ఉండాలి. ఎంతటి భాషా వేత్తలయినా మాటలను ఆచి తూచి ఉపయోగించాలి. మాటల గురించి ఇన్ని మాటలు ఎందుకంటే, ‘ఆది నుంచి ఆకాశం మూగది/ అనాదిగా తల్లి ధరణి మూగది/ నడుమ వచ్చి ఉరుముతాయి మబ్బులు/ నడమంత్రపు మనుషులకే మాటలు– ఇన్ని మాటలు’ అని సెలవిచ్చారు వేటూరి. అదీ సంగతి. మరి మాటలంటే మాటలా! -
చంద్రయాన్‌పై కార్పొరేట్ల హర్షం.. ఎవరేమన్నారంటే..
చంద్రయాన్–3 విజయవంతం కావడంపై పలువురు కార్పొరేట్లు హర్షం వ్యక్తం చేశారు. చంద్రయాన్ టీమ్‌ను ప్రశంసించారు. గర్వకారణం... ఇది ప్రతి భారతీయుడు గర్వించదగ్గ క్షణం. భారత అంతరిక్ష, సాంకేతిక ప్రయాణంలో ఒక కీలక మైలురాయి. ప్రధాని నరేంద్ర మోదీకి, ఇస్రో బృందానికి శుభాభినందనలు. రాబోయే తరాలకు ఇది ఎంతో స్ఫూర్తిదాయకంగా నిలుస్తుంది. – ఎన్ చంద్రశేఖరన్, టాటా సన్స్ చైర్మన్ సామర్థ్యానికి నిదర్శనం ఇస్రో, భారత సైంటిస్టులు అందరికీ హృదయపూర్వక శుభాభినందనలు. అంతరిక్ష పరిశోధనలో భారతదేశ సామర్థ్యాలకు ఈ విజయం ఒక నిదర్శనం. ఈ అపూర్వ ఘట్టంలో భాగం కావడం మాకెంతో గర్వకారణం. – ఎస్ఎన్ సుబ్రమణ్యన్, ఎల్అండ్టీ సీఈవో జాబిల్లి చేతికి అందింది మానవ జాతి ఆరంభం నుంచి చంద్రుడిని చూస్తూ కలలు కంటూనే ఉంది. చందమామ తన మాయా జాలంతో మనల్ని స్వాప్నికులుగా మార్చింది. నేడు ఆ మాయ, సైన్స్ కలిసి జాబిల్లిని మన చేతికి అందించాయి. – ఆనంద్ మహీంద్రా, పారిశ్రామిక దిగ్గజం చారిత్రక క్షణం ఇస్రో బృందానికి అభినందనలు. మీరు దేశానికి గర్వకారణం. అంతరిక్ష పరిశోధనలను విజయవంతంగా అమలు చేయగలగడం దేశానికి తన సామర్థ్యాలపై గల నమ్మకానికి నిదర్శనం. ఇది 140 కోట్ల మంది భారతీయులకు చారిత్రక క్షణం. – గౌతమ్ అదానీ, అదానీ గ్రూప్ చైర్మన్ అద్భుత ఘట్టం భారత అంతరిక్ష పరిశోధనల చరిత్రలో ఇది మరో అద్భుత ఘట్టం.. మన అంతరిక్ష పరిశ్రమ సామర్థ్యాలకు నిదర్శనం. మూడు దశాబ్దాలుగా భారతీయ స్పేస్ ప్రోగ్రామ్‌తో అనుబంధం కలిగి ఉండటం మాకు గర్వకారణం. – పర్వత్ శ్రీనివాస్ రెడ్డి, ఎంటార్ టెక్నాలజీస్ ఎండీ ఇదీ చదవండి: చంద్రయాన్-3 విజయం: ఈ కంపెనీలకు భాగస్వామ్యం -
ఉల్లి ధర పెరుగుదల.. మంత్రి వివాదాస్పద వ్యాఖ్యలు..
ముంబయి: దేశంలో ప్రస్తుతం ఉల్లి ధరలు కాకరేపుతున్నాయి. క్వింటాల్ ధర రూ.2415కు పైగా అమ్ముడుపోతోంది. ఉల్లి ధరను కంట్రోల్ చేయడానికి కేంద్రం చర్యలు చేపట్టింది. ఎగుమతులపై 40 శాతం సుంకం విధించింది. అయినప్పటికీ ఉల్లికి ఉన్న డిమాండ్ ఏ మాత్రం తగ్గడం లేదు. ఈ నేపథ్యంలో మహారాష్ట్ర పబ్లిక్ వర్క్స్ డిపార్ట్మెంట్ మంత్రి దాదా భూసే వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. కొనలేనివారు కొన్నాళ్లు ఉల్లికి దూరంగా ఉంటే ఏ సమస్య ఉండదని అన్నారు. 'రూ.10 లక్షల కారు కొనగలిగినవారికి రిటైల్ ధర రూ.10 నుంచి 20 పెరిగితే సమస్య ఏమీ ఉండదు. కొనలేనివారు ఓ నాలుగు నెలలు ఉల్లికి దూరంగా ఉంటే సరిపోతుందని అన్నారు. ఒక్కసారి ఉల్లి ధర క్వింటాల్‌కు రూ.200 మాత్రమే ఉంటుంది. మరికొన్నిసార్లు రూ.2000 వరకు పెరుగుతుంది. ఎగుమతి సుంకాన్ని పెంచి ధరలను అదుపులో ఉంచడానికి ప్రయత్నాలు జరుగుతున్నాయి.' అని చెప్పారు. కేంద్రం ఉల్లి ధరలపై ఎగుమతి పన్నును 40 శాతానికి పెంచడంతో రైతులు ఆందోళన చేపట్టారు. మహారాష్ట్రలో అతి పెద్దదైన హోల్‌సెల్ మార్కెట్‌తో సహా ఉల్లి వేలాన్ని నిలిపివేశారు. కేంద్రం తన నిర్ణయాన్ని వెనక్కి తీసుకునే వరకు ఉద్యమిస్తామని నాసిక్ జిల్లా ఆనియన్ ట్రేడర్స్ అసోసియేషన్ పిలుపునిచ్చింది. ఇదీ చదవండి: గడ్డం తీయాలని వరుడు తండ్రి.. తీయొద్దని వధువు! -
ఆప్ X కాంగ్రెస్: మాటల యుద్ధం.. విపక్షాల కూటమిపై అనుమానాలు..?
రాయ్‌పూర్: ఆప్ చీఫ్ అరవింద్ కేజ్రీవాల్ ఛత్తీస్‌గఢ్‌లో కాంగ్రెస్ ప్రభుత్వంపై నిప్పులు చెరిగారు. రాష్ట్రంలో ప్రభుత్వ పాఠశాలల దుస్థితి దారుణంగా ఉందని అన్నారు. ఛత్తీస్‌గఢ్‌లో ఈ ఏడాది చివర్లో ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో ప్రచార కార్యక్రమంలో మాట్లాడారు. దేశ వ్యాప్తంగా బీజేపీకి వ్యతిరేకంగా ఇండియా కూటమి ఏర్పాటుపై ప్రణాళికలు జరుగుతున్న నేపథ్యంలో కేజ్రీవాల్ ఆరోపణలు ప్రతిపక్షాల ఐక్యమత్యంపై ప్రశ్నలను మిగిల్చుతున్నాయి. ప్రచార కార్యక్రమంలో మాట్లాడిన కేజ్రీవాల్.. ఢిల్లీలో విద్యా వ్యవస్థ ఎలా ఉండో చూడండని రాష్ట్ర ప్రజలను ఉద్దేశించి చెప్పారు. ఢిల్లీ స్కూళ్లలో వసతులు, ఛత్తీస్‌గఢ్ పాఠశాలల్లో పరిస్థితుల గురించి అడిగి తెలుసుకోండని అన్నారు. రాష్ట్రంలో ఆప్‌ను అధికారంలోకి తీసుకువస్తే.. ప్రతి ఇంటికి 300 యూనిట్ల విద్యుత్‌ను ఉచితంగా ఇస్తామని హామీ ఇచ్చారు. Why go to Raipur? Performance of our Chattisgarh govt will be compared with the previous Raman Singh govt. Let us choose a sector of your choice and compare the performance of Congress government in Delhi vs your govt here. Ready for a debate? रायपुर की उड़ान भरने से पहले… https://t.co/0wqOaOdOJO — Pawan Khera 🇮🇳 (@Pawankhera) August 19, 2023 ఛత్తీస్‌గఢ్ పాఠశాలల్లో పది తరగతులకు కలిపి ఒక్క టీచర్ ఉన్నారని అన్నారు. స్కూళ్లలో వసతులు దీనస్థితిలో ఉన్నాయని చెప్పారు. విద్యావ్యవస్థను అభివృద్ధి చేయడమే తమ ప్రభుత్వ ప్రధాన ధ్యేయమని అన్నారు. ఆప్ పార్టీ పేరులోనే సామాన్యుడనే అర్థం ఉంటుందని, సామాన్యుల కోసం పుట్టిన పార్టీ అని తెలిపారు. కేజ్రీవాల్ ఆరోపణలను కాంగ్రెస్ నాయకుడు పవన్ ఖేరా తిప్పికొట్టారు. కేజ్రీవాల్ దేశ రాజధానితో ఛత్తీస్‌గఢ్‌ను ఎందుకు పోల్చుతున్నారని మండిపడ్డారు. రాష్ట్రంలో గత ప్రభుత్వాల పనితీరుతో ప్రస్తుత కాంగ్రెస్ చేసిన అభివృద్ధిని చూడాలని అన్నారు. ఢిల్లీలో అంతా చక్కగా ఉంటే కేజ్రీవాల్‌కు రాయ్‌పూర్ రావాల్సిన అవసరం ఏంటని దుయ్యబట్టారు. ఇదీ చదవండి: బీజేపీకి ఎదురుదెబ్బ.. సింధియాను వీడి.. కాంగ్రెస్ చేరి.. -
ఇక నెహ్రూ కాదు.. కాంగ్రెస్, బీజేపీ మాటల యుద్ధం
ఢిల్లీ: నెహ్రూ మెమోరియల్ మ్యూజియం, లైబ్రరీ(ఎన్ఎమ్ఎమ్ఎల్) పేరు మార్పుపై కాంగ్రెస్, బీజేపీ మధ్య మాటల యుద్ధం నడిచింది. భారత చరిత్రలో తొలి ప్రధాని జవహర్ లాల్ నెహ్రూ వారసత్వాన్ని అంతం చేయడమే దీని ప్రధాన ఉద్దేశమని కాంగ్రెస్ మండిపడింది. కాంగ్రెస్ రాజరిక స్వభావంపై బీజేపీ ఎదురుదాడి చేసింది. ఢిల్లీలోని తీన్ మూర్తి మార్గ్‌లో ఉన్న నెహ్రూ మ్యూజియం, లైబ్రరీ సొసైటీ పేరు మార్చాలని ఈ ఏడాది జూన్‌లో నిర్ణయం తీసుకోగా.. నేడు అధికారికంగా అమలుపరిచారు. ఈ అంశంపై ట్విట్టర్ వేదికగా కాంగ్రెస్ నాయకుడు జైరాం రమేశ్ స్పందించారు. ప్రపంచ ప్రఖ్యాతి గాంచిన నెహ్రూ మ్యూజియం, లైబ్రరీ(NMML) పేరును ‘ప్రధానమంత్రి మెమోరియల్’(PMML)గా మార్చేశారు. నెహ్రూ పేరుతో ప్రధాని మోదీ అభద్రతా భావానికి గురయ్యారని.. నెహ్రూ వారసత్వాన్ని దెబ్బతీయాలని 'N' స్థానంలో 'P'ను పెట్టారని చెప్పారు. P అంటే కేవలం చిన్నతనం, దుఖం అనే భావమేనని అన్నారు. ఇదీ చదవండి: ఆ పని చేస్తే.. శరద్ పవార్‌కు కేంద్ర మంత్రి పదవి..? క్లారిటీ.. జైరాం రమేశ్ విమర్శలను ధీటుగా తిప్పకొట్టారు బీజేపీ నాయకుడు షెహజాద్ పూనావాలా. దేశ ప్రధానులందరి విజయాలను సూచించే నిర్మాణాలకు కేవలం ఒక్క కుటుంబానికి చెందిన వారి పేరు పెట్టడం ఏంటని ప్రశ్నించారు. ప్రధానులందరూ దేశం కోసం పనిచేశారని చెప్పారు. ఒక్క నిర్మాణానికి దేశ ప్రధానులందరి పేరు పెట్టినంత మాత్రాన నెహ్రూ వారసత్వం దెబ్బతింటుందా..? అని ప్రశ్నించారు. కాంగ్రెస్ భావజాలం ఏంటో అర్ధమవుతోందని అన్నారు From today, an iconic institution gets a new name. The world renowned Nehru Memorial Museum and Library (NMML) becomes PMML—Prime Ministers’ Memorial Museum and Library. Mr. Modi possesses a huge bundle of fears, complexes and insecurities, especially when it comes to our first… — Jairam Ramesh (@Jairam_Ramesh) August 16, 2023 బ్రిటీష్ వారి కాలంలో సైన్యానికి అధిపతి కమాండర్ ఇన్ ఛీప్‌కు నిలయంగా ఉండేది ప్రస్తుతం నెహ్రూ మ్యూజియం. స్వాతంత్య్రం తర్వాత అది ప్రధాని నెహ్రూ నివాసంగా మారింది. ఆయన మరణాంతరం మ్యూజియంగా మార్చారు. ప్రధాని మోదీ అధికారంలోకి రాగానే.. మ్యూజియం ప్రాంగణంలో దేశ ప్రధానులందరి(నెహ్రూ-మోదీ) విజయాలు ప్రతిబింబించేలా ప్రధానమంత్రి సంగ్రహాలయాన్ని నిర్మించారు. ఇదీ చదవండి: ఢిల్లీ చట్టంపై అసెంబ్లీ స్పెషల్ సెషన్..ఎల్జీ అభ్యంతరం -
సరి కొత్త ఫీచర్.. అక్షరాల పరిమితి లేకుండా ట్వీట్లు చేయొచ్చు!
ట్విటర్ బాస్ ఎలాన్ మస్క్ యూజర్లకు శుభవార్త చెప్పారు. ‘ఆర్టికల్స్’ పేరుతో ఓ కొత్త ఫీచర్‌ను అందించనున్నట్లు తెలిపారు. ఈ కొత్త టూల్ సాయంతో యూజర్లు పెద్ద పెద్ద వ్యాసాలను పోస్ట్ చేసుకోవచ్చు. అంటే బుక్‌లోని సమాచారం మొత్తం ట్వీట్ చేసే వెసలుబాటు కలగనుందని పలు నివేదికలు వెలుగులోకి వచ్చాయి. ప్రస్తుతం, ట్విటర్ బ్లూ సబ్‌స్కైబర్లు 10,000 వేల అక్షరాలతో ట్వీట్ చేయొచ్చు. సబ్స్క్రిప్షన్ తీసుకోని యూజర్లు 280 అక్షరాలకు లోబడి ట్వీట్ చేయాల్సి ఉంటుంది. అయితే తాజా ట్విటర్ తేనున్న ఆర్టికల్ ఫీచర్ యూజర్లు పెద్ద పెద్ద ఆర్టికల్స్‌ను సైతం ట్వీట్ చేసుకోవచ్చు. ఈ సరికొత్త ఫీచర్‌పై ‘అవును ట్విటర్ కొత్త ఫీచర్‌ను యూజర్లకు పరిచయం చేయనుంది. ఈ టూల్ సాయంతో పుస్తకంలో ఉన్న కంటెంట్ మొత్తాన్ని పోస్ట్ చేసేలా వీలు కల్పుస్తున్నామని వెల్లడించారు. మరి ఈ ఫీచర్‌ను ఎలాన్ మస్క్ ట్విటర్ బ్లూ సబ్స్క్రైబర్లకు మాత్రమే పరిమితం చేస్తారా? లేక సాధారణ యూజర్లకు సైతం అందుబాటులోకి తీసుకొస్తారా? అనేది తెలియాల్సివుంది. -
నేనేం కులాన్ని వాడుకోలేదు లేఖలోముద్రగడ్డ ఆవేదన
-
టంగ్ స్లిప్ అయిన బండి
-
మంచి మాట: మాటల పాఠాలు
ఉన్నాయి కదా అని మనం మాటల్ని వాడేస్తూండకూడదు. వినిపించాయి కదా అని మనం మాటల్ని మాత్రమే పట్టించుకుని బతుకును పాడు చేసుకోకూడదు. మాటలతో, మాటలలో మనల్ని మనం వృథా చేసుకోకూడదు. మాటలకు పరిమితులు ఉంటాయి, ఉన్నాయి. అనేటప్పుడూ, వినేటప్పుడూ మాటల్ని ఒకస్థాయి వరకే పరిగణించాలి. మాటలు అని దెబ్బతిన్న సందర్భాలూ, మాటలు విని దెబ్బతిన్న సందర్భాలూ అందరికీ ఉంటాయి. వాటిని పాఠాలుగా తీసుకోవాలి. అవసరం అయినంత వరకే మాటల్ని అనాలి, వినాలి. మాటలు ఎక్కడ అనవసరమో తెలుసుకోవాలి. మాటలు ఎక్కడ అనర్థమో గ్రహించగలగాలి. మాటను కంచె అని అన్నారు చైనా తాత్త్వికులు, కవి లావొచు (లావోట్జ్). లావొచు అంటే ‘సిద్ధ గురువు’ అని అర్థం. వీరి రచనలు తావొ – త – చింగ్ అధారంగా తావొ మతం రూపొందింది. కవిత్వం నుంచి మతం పుట్టిన సందర్భం ప్రపంచంలో ఇదొక్కటే. లావొచు రోజూ ఉదయం పూట ఒక స్నేహితుడితో కలిసి నడకకు వెళ్లే వారు. ఆ సమయంలో వారు ఏ మాటా మాట్లాడేవారు కాదు, తపస్సు చేస్తున్నట్టుగా మౌనంగా ఉండేవారు. ఒకరోజు ఉదయం నడుస్తూండగా లావొచు స్నేహితుడి స్నేహితుడు దారిలో ఎదురుపడి వాళ్లతో కలిసి నడవసాగాడు. వాళ్ల నడక కొనసాగుతున్నప్పుడు ఉదయాన్ని చూస్తూ ‘ఈ ఉదయం ఎంతో అందంగా ఉంది’ అని అన్నాడు లావొచు స్నేహితుడి స్నేహితుడు. ఆ మాట వినగానే లావొచు ఉన్నపళాన నడక మానేసి ఇంటికి తిరిగి వచ్చేశారు. అది జరిగాక లావొచు స్నేహితుడు లావొచును ‘ఏమైంది, చిన్నమాటే కదా అతడన్నది ఆ మాత్రం దానికి మీరు నడక మానేసి తిరిగి వచ్చేయాలా?’ అని అడిగాడు. బదులుగా లావొచు ఇలా అన్నారు: ‘ఉదయ సౌందర్యమంతా ఆ మాటతో చెదిరిపోయింది. అది శబ్దం లేని సౌందర్యం. దాన్ని మౌనంగా అనుభవించాలి. మాట పుట్టి ఆ సౌందర్యాన్ని వేరు చేసింది. మాట పుట్టడానికి ముందున్న సౌందర్యానుభవం బృహదాత్మకం. – రోచిష్మాన్ మాట పుట్టగానే ఆ బృహత్తుకు కంచె వేసినట్టు అవుతుంది.‘ఒకరోజు లావొచు అనుయాయులు ‘తెలుసుకున్నవాళ్లు మాట్లాడరు, మాట్లాడుతున్న వాళ్లు తెలుసుకున్నవాళ్లు కారు’ అని లావొచు చెప్పిన మాటల గురించి చర్చ చేస్తూ వాళ్ల గురువును ఆ మాటలకు అర్థవివరణను ఇమ్మని అడిగారు. గురువు ‘మీలో ఎవరికి గులాబీ పువ్వు పరిమళం తెలుసు?’ అని వాళ్లను ప్రశ్నించారు. అందరూ తమకు తెలుసని చెప్పారు. ‘మీకు తెలిసిన ఆ విషయాన్ని మాటల్లోకి తీసుకురండి’ అని అన్నాడు గురువు. ఆ పని చెయ్యడం చాతకాక శిష్యులు మౌనంగా ఉండిపోయారు. మాట సత్యానుభవాన్ని సరిగ్గా సమర్పించలేదు. అనుభవానికి పరిధులు ఉండవు. అది ఆకాశంలా అనంతం. మాట సంకుచితమైంది. మాటలలో కూరుకుపోతూంటే మనం అనుభవాన్ని ఆస్వాదించలేం. మనం మాటల్ని పట్టుకుని కూర్చోకూడదు. ఒకదశ తరువాత మనం మాటల్ని దాటుకుని ముందుకు సాగాలి. ఎందుకంటే మౌనంలోనే సౌందర్యం అనుభవంలోకి వస్తుంది. సౌందర్యానుభవం మాటల్లో చెదిరిపోతుంది. అనుభవాన్ని మాటలు అనువదించలేవు. మాటలతో సౌందర్యానుభవాన్ని పోగొట్టుకోకూడదు. మాటను కంచె అని లావొచు అనడాన్ని సరిగ్గానూ, సమగ్రంగానూ అవగతం చేసుకోవాలి. మాట కంచె అయి మన చుట్టూ ఉండకూడదు. మాట మనల్ని కట్టిపడెయ్యకూడదు. మాటకు అందని స్థితిలో ఉండే రుచిని ఆస్వాదించ గలగాలి. మాటకు అతీతంగా ఉండే అత్యుదాత్తతను మనం అనుభవంలోకి తెచ్చుకోవాలి. -
ఆయుధం: మాటతో మానసిక దాడి?!
‘కత్తికన్నా మాటకు పదునెక్కువ’ అంటారు. సన్నిహిత సంబంధాలలో ముఖ్యంగా భార్యాభర్తల బంధంలో ‘మాట’ను మించిన ఆయుధం లేదు. ఒక్క మాటతో తమకు తామే బంధం మధ్య ఇనుప గోడగా మారచ్చు. చట్టం గృహహింసను మాత్రమే నేరంగా పరిగణించినప్పటికీ మానసిక దాడి అంతకుమించిన పరిణామాలకే దారితీస్తుందని, బంధాల నడుమ ఇది అత్యంత ప్రమాదకరం అంటున్నారు మనస్తత్వ నిపుణులు. కోవిడ్ సమయం నుంచి కుటుంబ బంధాలలో పెరుగుతున్న మానసిక దాడి గురించి .. నియంత్రించుకోదగ్గ ఆవశ్యకతను నొక్కి చెబుతున్నారు నిపుణులు. ’ది రోల్ ఆఫ్ జెండర్ అండ్ ఏజŒ 2020æఅధ్యయనం ప్రకారం గృహహింసలో శారీరక దాడికి సమానమైన భావోద్వేగ దుర్వినియోగం తీవ్ర ప్రభావాన్ని కలిగిస్తుంది. ► జోక్ చేస్తున్నామా... భాగస్వామిని జోక్‌గా ఓ మాట అనాలనుకోవచ్చు. కానీ, జోక్స్ కూడా కొన్నిసార్లు చెడు పరిమాణాలకు దారి తీయవచ్చు. ఉదాహరణకు.. ‘ఎందుకంతగా తింటావు.. ఇప్పటికే ఏనుగులా అయ్యావు. ఇంకెంతవుతావు’ ఇలాంటి రకరకాల వ్యంగ్య వ్యాఖ్యలు సాధారణంగా భాగస్వామి ప్రవర్తనను నియంత్రించడానికి సంకేతంగా వాడుతారు. ► ప్రమాదకరమే శారీరక లేదా లైంగిక హింసను అనుభవించిన వారి కంటే మానసికంగా బాధింపబడిన వ్యక్తులు తీవ్ర నిరాశ, ఆందోళన, ఒత్తిడి, కించపరిచిన వ్యక్తిత్వానికి గురవుతున్నారని తెలిసింది. దీనివల్ల డిప్రెషన్ బారిన పడుతున్నవారి సంఖ్య కూడా పెరుగుతోందంటున్నారు మానసిక నిపుణులు. వయసు ప్రకారంగా చూస్తే బాల్యంలో మానసికంగా గాయపడిన వారిలో చాలా కాలం పాటు ఈ లక్షణాలు ఉంటాయని అధ్యయనం వెల్లడించింది. యవ్వనంలో చాలా మంది వ్యక్తుల ప్రవర్తనపై బాల్యం ముద్ర అలాగే ఉండిపోయింది. లైంగిక, శారీరక వేధింపుల లాగానే భావోద్వేగ దుర్వినియోగం కూడా అత్యంత హానికరం. ► ప్రేమగా అవమానం.. ప్రేమతో అయినా అతను/ఆమె ఆత్మగౌరవాన్ని కించపరిచేలా మాట్లాడటం ద్వారా భాగస్వామి తనను తాను ఆత్మస్థైర్యం కోల్పోయిన వ్యక్తిగా భావించడం ప్రారంభిస్తారు. తమ విశ్వాసం దెబ్బతింటుంది. ’నువ్వు ఇంత తెలివితక్కువ దానివి అనుకోలేదు...’ చాలా సర్వసాధారణంగా ఇళ్లలో వాడే మాట. ప్రపంచం ముందు తమను తాము గొప్పగా నిరూపణ చేసుకోవడానికి, తమ భాగస్వామిని మానసికంగా నియంత్రించడానికి, చాలా మంది వ్యక్తులు పెట్నేమ్స్తో అవమానకరంగా పిలుస్తుంటారు. ఆ మాటలు చాచి కొట్టినదానితో సమానంగా ఉంటాయి. ► జాప్యమూ లోపమేనా! భాగస్వామిని నియంత్రించడానికి చిన్న చిన్న విషయాలు లేదా వారి పనులను లక్ష్యంగా చేసుకుంటారు. ఉదాహరణకు.. ‘ఈ మాత్రం పని కూడా సరిగ్గా చేయడం చేతకాదా? ఎప్పుడూ లేటేనా..’ లాంటి మాటలు తరచూ అనేస్తుంటారు. ఇలాంటి వ్యక్తులు తమ భాగస్వామికి ఏదీ రాదని ఎదుటివారి ముందు నిరూపించాలనుకుంటారు. ► అరిస్తే వింటారా.. చిన్న విషయాలకే భాగస్వామిని కించపరచడం, పళ్లు కొరకడం, తప్పుడు ప్రమాణాలు చేయడం, వస్తువులు పగులకొట్టడం.. లాంటివి బంధాలు బీటలువారడానికి సంకేతాలుగా నిలుస్తాయి. ► తామే గొప్పని.. కొందరికి తమ గొప్పతనాన్ని ప్రతీసారి చాటుకోవాలనిపిస్తుంటుంది. ఉదాహరణకు.. భార్య ఉద్యోగం/వ్యాపారం లో ఏదైనా చిన్న విజయం సాధిస్తే ’నా వల్ల నీకు జాబ్ వచ్చింది. నేను కనికరిస్తే నువ్వు కాలు బయట పెట్టగలుగుతున్నావు. ఇదేమీ నీ గొప్పతనం కాదు’ వంటి మాటలు అనేస్తుంటారు. ఇటువంటి వ్యక్తులను అర్థం చేసుకోవడం అంత సులభం కాదు’ అంటారు మానసిక నిపుణులు. చిన్నమాటే.. కానీ, అది పదునుగా మనసుపై దాడి చేస్తుంది. సన్నిహితంగా ఉన్న వ్యక్తిని దూరంగా ఉంచేలా చేస్తుంది. ఒక్కో మాట పడుతున్నప్పుడు అది సమ్మెట దెబ్బలా బంధాన్ని చిధ్రం చేస్తూనే ఉంటుంది. అందుకే, హింస అంటే శారీరకమైనదే కాదు మానసికపరమైనది కూడా అని భావించి, ఎదుటివారిని నొప్పించేముందు ఒకటికి రెండుసార్లు ఆలోచించి జాగ్రత్త పడటం మంచిది. మాట్లాడే ముందే ఆలోచన శారీరక దాడికన్నా భావోద్వేగపరమైన దాడి చాలా తీవ్రమైనది. ఒక చిన్న పదం చాలా తీవ్ర పరిమాణాలు చూపవచ్చు. ‘నువ్వు ఎందుకూ పనికిరావు’ అనే మాట ఎదుటివారి ఆత్మస్థైర్యాన్ని తగ్గించేస్తుంది. దీని వల్ల ఇద్దరి మధ్య బాంధవ్యం పలచబడటం మొదలవుతుంది. మానసిక దాడి కారణంగా ఆందోళన, రక్తపోటు వంటి సమస్యలు పెరగడంతో పాటు చిన్న చిన్న విషయాలకు కూడా కోప్పడిపోయి డిప్రెషన్ బారినపడిన వ్యక్తులను చూస్తుంటాం. కోవిడ్టైమ్లో ఈ సమస్య చాలా ఎక్కువ గమనించాం. కుటుంబ సభ్యులు ఎక్కువ సమయం కలిసి ఒకే చోట ఉండేవారు. దీని వల్ల ఒకరినొకరు మాటలు అనుకోవడం కూడా పెరిగింది. ‘మానసిక దాడి’ భార్యభర్తలు, పిల్లలు–పెద్దలు మధ్య ఎక్కువయ్యింది. ఇది ఇంకా కంటిన్యూ అవుతూనే ఉంది. ఎవరికి వారు ఒక మాట అనే ముందు నియంత్రణ ఉండాలి. బంధాల మధ్య కమ్యూనికేషన్ సరిగా ఉండాలి. పెద్దలు ఒకరికొకరు కించపరిచేలా మాట్లాడుకుంటే ఆ ప్రభావం పిల్లల మీద పడుతుంది. మాట జారిన తర్వాత వెనక్కి తీసుకోవడం సాధ్యం కాదు కాబట్టి మాట్లాడే ముందే ఆలోచించాలి. ‘ముందు మన మైండ్‌లో నన్నెవరైనా ఇలాగే అంటే ఎలా అనిపిస్తుంది’ అనే ఆలోచన చేయాలి. కోపం వచ్చినప్పుడు 100 నుంచి 1 వరకు కౌంట్ చేయడం, ఆ ఆలోచనకు అక్కడ కట్ చేసి, మరో విషయంవైపు మైండ్‌ను డైవర్ట్ చేయడం, సహనాన్ని అలవర్చుకోవడం.. వంటివి పాటించాలి. – ప్రొఫెసర్ జ్యోతి రాజ, సైకాలజిస్ట్ట్, లైఫ్‌స్కిల్స్ ట్రైనర్ – నిర్మలారెడ్డి -
పేదవాడి కడుపు నింపుతున్న దేవుడు సీఎం జగన్
-
తెలుగుదేశం పార్టీ పతనానికి పరాకాష్ట
అధికారానికి దూరంగా ఉన్నంత మాత్రాన... ఒక రాజకీయ పార్టీ ఇంతలా పతనమైపోవటమన్నది ఆంధ్రప్రదేశ్ చరిత్రలో ఎన్నడూ లేదు. తెలుగుదేశం పార్టీ కేంద్ర కార్యాలయంలో అధికార ప్రతినిధిని కూర్చోబెట్టి... గజ్జి సోకిన గ్రామ సింహంలా మొరిగించిన వైనంపై రాష్ట్రంలో తీవ్ర స్థాయి ఆగ్రహావేశాలు వ్యక్తమయ్యాయి. అఖండ ప్రజాదరణతో సీఎం పీఠంపై కూర్చున్న నాయకుడిని ఉద్దేశించి ‘లం****’ (బోసిడీకే) అని పదేపదే బూతులు తిట్టించడంతో సీఎంను అభిమానించేవారు... వైఎస్సార్ సీపీ మద్దతుదారులు గట్టిగా ప్రతిస్పందించారు. ఎక్కడికక్కడ నిరసనలకు దిగారు. ఇంత జరిగినా... పశ్చాత్తాప పడని టీడీపీ అధ్యక్షుడు... దీన్ని రాజకీయంగా ఉపయోగించుకోవటానికి మరో ఎత్తుగడకు దిగారు. బుధవారం రాష్ట్ర బంద్‌కు పిలుపునిచ్చారు. ఉల్టా చోర్ కొత్వాల్ కో డాంటే... రీతిన ఆయనిచ్చిన పిలుపు ఒక బడ్డీ కొట్టును.. ఆఖరికి ఆయన హెరిటేజ్ దుకాణాల్ని కూడా మూయించలేకపోయింది. ఇప్పుడాయన 36 గంటల దీక్ష.. వరస లేఖలు.. కేంద్ర హోం మంత్రితో సమావేశమంటూ రకరకాల ఎత్తుగడలకు దిగుతున్నారు. పవిత్రమైన నిరాహారదీక్ష ఆయుధాన్ని పచ్చి బూతులకు మద్దతుగా ప్రయోగిస్తున్నారు. పరిధి దాటిన పట్టాభి సాక్షి, అమరావతి: రాష్ట్రంలో ఉద్రిక్తతలు, అల్లర్లు సృష్టించేందుకు టీడీపీ అధికార ప్రతినిధి కొమ్మారెడ్డి పట్టాభి అన్ని పరిధులు అతిక్రమించారని, ఆయన దుర్భాషల తరువాతే కొన్ని చోట్ల ఘర్షణలు తలెత్తాయని డీజీపీ గౌతమ్ సవాంగ్ పేర్కొన్నారు. ‘రాజ్యాంగబద్ధ పదవిలో ఉన్న ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డిని ఉద్దేశించి పట్టాభి దారుణమైన భాషలో మాట్లాడారు. టీడీపీ కార్యాలయం నుంచే ఆయన ముఖ్యమంత్రిని దుర్భాషలాడారు. అదేదో ఆవేశంలో నోరుజారి మాట్లాడింది కూడా కాదు. ఉద్దేశపూర్వకంగానే పదేపదే దారుణంగా దూషించారు’ అని డీజీపీ స్పష్టం చేశారు. మంగళగిరిలోని రాష్ట్ర పోలీసు ప్రధాన కార్యాలయంలో డీజీపీ సవాంగ్ బుధవారం మీడియాతో మాట్లాడారు. ఈ కుట్ర చంద్రబాబుదే నెల రోజులుగా పథకం ప్రకారం.. రాజ్యాంగబద్ధమైన పదవుల్లో ఉన్న రాష్ట్రపతి, ప్రధానమంత్రి, ముఖ్యమంత్రి లాంటి వారిని ఉద్దేశించి దుర్భాషలాడటం తీవ్రమైన నేరమని, ఇలాంటి వాటిని ఎట్టి పరిస్థితుల్లోనూ ఉపేక్షించబోమని, తప్పకుండా కఠిన చర్యలు తీసుకుంటామని డీజీపీ స్పష్టం చేశారు. రాజకీయాల్లో, ప్రజాజీవితంలో ఇంతటి దారుణమైన భాష ఎట్టి పరిస్థితుల్లోనూ ఆమోదయోగ్యం కాదన్నారు. రాజకీయ పార్టీలు నైతిక విలువలకు కట్టుబడి హుందాగా వ్యవహరించాలని సూచించారు. ప్రభుత్వాన్ని అప్రతిష్ట పాల్జేసేందుకు నెల రోజులుగా ఓ పథకం ప్రకారం మాట్లాడుతున్న మాటలు, చేస్తున్న అసత్య ఆరోపణలు, దూషణలు అన్నింటినీ సమగ్రంగా పరిశీలిస్తున్నామని చెప్పారు. పట్టాభి దుర్భాషలు, తదనంతర పరిణామాలపైనా దర్యాప్తు జరుపుతున్నామన్నారు. దుర్భాషలపై జనాగ్రహం దశాబ్దాల సమస్య రాష్ట్రంలో గంజాయి అక్రమ రవాణా దశాబ్దాలుగా ఉన్న సమస్య అని చెప్పారు. ఆంధ్ర–ఒడిశా సరిహద్దుల్లో మావోయిస్టుల ప్రాబల్యం ఉండటంతో దశాబ్దాలుగా గంజాయి సాగు సాగుతోందన్నారు. గత రెండేళ్లుగా అక్రమ రవాణాను అరికట్టేందుకు ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకుంటోందని, ప్రత్యేకంగా స్పెషల్ ఎన్ఫోర్స్మెంట్ బ్యూరోను ఏర్పాటు చేసిందని గుర్తు చేశారు. గతంలో కంటే పోలీసులు విస్తృతంగా దాడులు నిర్వహిస్తూ పెద్ద ఎత్తున కేసులు నమోదు చేస్తున్నారని చెప్పారు. రెండేళ్ల క్రితం వరకు గంజాయి స్మగ్లింగ్‌పై కఠిన చర్యలు ఉండేవి కావన్నారు. గంజాయి అక్రమ రవాణాపై 2018లో రాష్ట్రంలో 579 కేసులు నమోదు చేసి 2,174 కేజీల గంజాయిని స్వాధీనం చేసుకోగా 2021లో ఇప్పటికే 1,456 కేసులు నమోదు చేసి 4,059 కేజీల గంజాయిని స్వాధీనం చేసుకున్నట్లు వివరించారు. అక్రమ రవాణాపై ప్రభుత్వం, పోలీసు శాఖ కఠినంగా వ్యవహరిస్తోందనడానికి ఈ గణాంకాలే నిదర్శనమని చెప్పారు. టీడీపీ బంద్‌ను పట్టించుకోని ప్రజలు స్పందించలేదనడం సరికాదు.. ప్రతిపక్ష నేత చంద్రబాబు ఫోన్ చేస్తే తాను స్పందించలేదన్న ఆరోపణలను డీజీపీ ఖండించారు. మంగళవారం సాయంత్రం 5 గంటల ప్రాంతంలో తాను పోలీస్ పరేడ్ పర్యవేక్షిస్తుండగా ఓ నంబర్ నుంచి వాట్సాప్ కాల్ వచ్చిందన్నారు. పరేడ్ జరుగుతుండటంతో ఎవరు మాట్లాడుతున్నారో సరిగా వినిపించలేదన్నారు. ఘర్షణ విషయంపై జిల్లా ఎస్పీతో మాట్లాడాలని సూచించినట్లు చెప్పారు. టీడీపీ నేతలు ఫోన్ చేస్తే గుంటూరు ఎస్పీ, మంగళగిరి రూరల్ పోలీసులు స్పందించి తగిన చర్యలు తీసుకున్నారని తెలిపారు. పోలీసులు స్పందించలేదని టీడీపీ నేతలు విమర్శలు చేయడం సహేతుకం కాదన్నారు. పట్టాభి చేసింది తప్పే.. -
పదిహేను రోజుల నుంచి ఫోన్లో తిడుతున్న వ్యక్తి.. దీంతో..
సాక్షి, నిజాంపేట(మెదక్): నిజాంపేట మండల కేంద్రానికి చెందిన ఒక వ్యక్తిపై ఎస్సీ, ఎస్టీ అట్రాసిటి కేసు నమోదు చేసిన్నట్లు బుదవారం స్థానిక ఎస్సై ప్రకాశ్‌గౌడ్ పేర్కొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఫోన్లో తిడుతున్నాడు. కాగా, నిజాంపేట గ్రామానికి చెందిన ఉప సర్పంచ్ కోమ్మట బాబును గత పదిహేను రోజుల నుంచి గ్రామానికి చెందిన అబ్దుల్ పాషా అనే వ్యక్తి బాబుపై కులం పేరుతో వ్యక్తిగత కక్షతో ఫోన్ ద్వారా బాబును ఉద్దేశించి దూషిస్తూ, బూతులు తిట్టుతూ బెదిరింపులకు గురిచేస్తున్నాడని ఫిర్యాదు ఇవ్వగా అబ్ధుల్ పాషాపై ఎస్సీ, ఎస్టీ అట్రాసిటి కేసు నమోదు చేసుకున్నట్లు ఎస్ఐ ప్రకాశ్‌గౌడ్ తెలిపారు. -
ఇప్పుడు అంతా వెతుకుతున్న కొత్త పదాలు
కరోనా ఇప్పుడు ప్రపంచ దేశాలన్నింటిని గడగడలాడిస్తున్న పేరు ఇది. మనం ఏ విషయం గురించి మాట్లాడాలన్న కరోనాకి ముందు కరోనాకి తరువాత అన్నట్లుగా ప్రస్తుత పరిస్థితులు మారిపోయాయి. కరోనా వల్ల కేవలం ఆర్ధిక పరంగా, మార్కెట్ల పరంగా మాత్రమే కాదు, మనుషులు వాడే పదాల్లో కూడా చాలా మార్పులు వచ్చాయి. కరోనా కారణంగా చాలా పదాలు ఇప్పుడు డిక్షనరీలో చేరాయి. 2020 సంవత్సరంలో ఎక్కువ మంది ఉపయోగిస్తున్న పదాలు ఏంటి? గూగుల్‌లో ఎక్కువ మంది ఏ పదాలను వెతుకుతున్నారో చూద్దాం. వైద్య పరిభాషకి సంబంధించి మాస్క్‌లు, పీపీఈ కిట్లు లాంటి పదాలను ఎక్కువగా వెతుకుతున్నారు. అలాగే ఎక్కువగా ఉపయోగిస్తున్న పదాల విషయానికి వస్తే (టిక్‌టాక్‌కు షాకివ్వనున్న మ్యూజిక్ కంపెనీలు!) సోషల్ డిస్టెన్సింగ్ (సామాజిక దూరం): మనకి చిన్నప్పుడు స్కూల్లో అసెంబ్లీ జరిగే సమయంలో ప్రతి ఒక్కరు చేయి అంత దూరంలో ఉండాలి అని చెబుతూ ఉంటారు. ఇప్పుడు కేవలం అసెంబ్లీ సమయంలో మాత్రమే కాకుండా ప్రతి చోట దానినే తప్పనిసరిగా అనుసరించాల్సిన అవసరం ఏర్పడింది. కరోనా మహమ్మారి కట్టడికి మాస్క్‌లు ధరించడం, సామాజిక దూరం పాటించడం చాలా అవసరం. (వ్యాక్సిన్ లేకుండానే కరోనా కట్టడి.. ప్రయోగం సక్సెస్!) గ్లోబల్ పండమిక్ (మహమ్మారి): ఒక వ్యాధి ప్రపంచమంతా వ్యాపిస్తూ, అనుకున్నదాని కన్నా దాని తీవ్రత ఎక్కువగా ఉండి ఊహించనదాని కన్నా ఎక్కువ మంది ఆ వ్యాధి బారిన పడుతుంటే దానిని మహమ్మారిగా వ్యవహరిస్తారు. ఈ వైరస్ వ్యాప్తి నేపథ్యంలో ప్రపంచ ఆరోగ్య సంస్థ దీనిని మహమ్మారిగా ప్రకటించిన విషయం తెలిసిందే. ప్లాటన్ ది కర్వ్ : ఈ పదాన్ని వ్యాధిని వేగంగా విస్తరించిన తరువాత వ్యాధిని నియంత్రణకు కట్టుదిట్టమైన చర్యలు చేపట్టి, వ్యాధిన పడిన వారి సంఖ్య రోజు రోజు తగ్గించడం, మెరుగైన వైద్యం అందిస్తూ వ్యాధి తీవ్రతను తగ్గించడానికి ఈ పదాన్ని ఉపయోగిస్తాము. ఇన్ఫోడెమిక్: ఒక విషయానికి సంబంధించి అధికంగా సమాచారం లభించడాన్ని ఇన్ఫోడెమిక్ అంటాం. ఇప్పుడు మనం సోషల్ మీడియాలో, వాట్సప్‌లో అన్నింటిలో కరోనాకు సంబంధించిన సమాచారాన్నే ఎక్కువగా చూస్తున్నాం. దీనికి సంబంధించిన ఫేక్ న్యూస్‌లు కూడా ఎక్కువగానే పుట్టుకొస్తున్నాయి. ఇలాంటి సందర్భాల్లో ఈ పదాన్ని ఉపయోగిస్తాము. డబ్ల్యూఎఫ్‌హెచ్: వర్క్ ఫ్రం హోం (ఇంటి నుంచి పని చేయడం) ఇప్పుడు ఈ పదం విపరీతంగా వాడుకలోకి వచ్చింది. లాక్డౌన్ కారణంగా అన్ని కంపెనీలు తమ ఉద్యోగులకు ఇంటి నుంచి పని చేసే వెసులుబాటును కల్పించాయి. అందుకే ఇప్పుడు ఈ పదం బాగా ప్రాచుర్యం పొందింది. లాక్డౌన్: ఈ పదానికి సంబంధించి ప్రత్యేకంగా చెప్పుకోవలసిని అవసరం లేదు. కరోనాను కట్టడి చేయడానికి అన్ని దేశాలు లాక్‌డౌన్‌ను విధించాయి. ఆయా దేశాల్లోని చట్టాలకు అనుగుణంగా లాక్డౌన్ అమలు చేస్తున్నాయి. దీంతో అన్ని కార్యకలాపాలతో పాటు ప్రజలు ఎక్కడ వారక్కడే స్ధంబించిపోయారు. ఈ కరోనా కాలంలో మొదటి నుంచి వినిపిస్తూ ప్రజలని భయపెడుతున్న పదం లాక్డౌన్. క్వారంటైన్ అండ్ చిల్: దీని అర్ధం కరోనా సమయంలో విధించిన అన్ని నిబంధనలను అనుసరిస్తూ ఇంట్లో సౌకర్యవంతంగా ఉండటం. లాక్డౌన్ కారణంగా చాలా మందికి విశ్రాంతి దొరికింది. వారందరికి తమ తమ కుటుంబాలతో గడపడానికి ఒక అవకాశం లభించింది. -
నరేంద్ర మోదీ ‘పద క్రీడ’
సాక్షి, న్యూఢిల్లీ : దేశంలో కొందరు రాజకీయ నాయకులు ఉపయోగించిన పదాలు చరిత్రలో ఎల్లకాలం మిగిలిపోతాయి. మాజీ ప్రధాని ఇందిరా గాంధీ ఇచ్చిన ‘గరీబీ హఠావో (దారిద్య్రాన్ని నిర్మూలించండి)’ ప్రస్తుత ప్రధాని నరేంద్ర మోదీ చెప్పిన ‘అచ్చేదిన్ (మంచి రోజులు)’ అలాంటి పదాలే. 2014లో జరిగిన సార్వత్రిక ఎన్నికల సందర్భంగా నరేంద్ర మోదీ ‘అచ్చే దిన్ ఆనా వాలే హై (మంచి రోజులు రానున్నాయి)’ అంటూ పదే పదే చెబుతూ వచ్చారు. ఆయన చెప్పిన అచ్చేదిన్ వచ్చాయా ? అంటే బాలీవుడ్లో ఎంతో ప్రాచుర్యం పొందిన ‘కోయి లౌటా దే మెరే బీతే హుహే దిన్’ పాట గుర్తుకు వస్తుంది. గతించిన రోజులను ఎవరైన తీసుకరాగలరా ? నరేంద్ర మోదీ రాజకీయ పరిభాషలో ఉపయోగించిన ఎన్నో హిందీ, ఇంగ్లీషు పదాలు ఎన్నో ప్రాచుర్యంలోకి వచ్చాయి. 2016లో భారత వైమానిక దళాలు పాకిస్థాన్ భూభాగంలోకి చొచ్చుకుపోయి టెర్రరిస్టు స్థావరాలపై దాడులు నిర్వహించడాన్ని ఆయన తొలి ‘సర్జికల్ స్ట్రైక్స్’ అని వర్ణించారు. అదే సంవత్సరం నవంబర్‌లో నరేంద్ర మోదీ పెద్ద నోట్లను రద్దు చేసినప్పుడు ‘ఇది దేశంలోని నల్లడబ్బు, ఉగ్రవాదులకు అందే నిధులు, మాదకద్రవ్యాల డబ్బుపై ప్రధాని నరేంద్ర మోదీ చేసిన సర్జికల్ స్ట్రైక్స్’ అని అప్పటి కేంద్ర రక్షణ మంత్రి మనోహర్ పర్రీకర్ అభివర్ణించారు. పెద్ద నోట్ల రద్దు నిర్ణయం పూర్తిగా విఫలం అవడంతో ప్రతిపక్ష పార్టీలు ‘పేదలు, మధ్యతరగతి ప్రజల జీవితాలను చిన్నాభిన్నం చేసిన సర్జికల్ స్ట్రైక్స్’ అంటూ విమర్శించాయి. నరేంద్ర మోదీ ప్రజా సభల్లో ప్రసంగించినప్పుడల్లా ‘భాయియో ఔర్ బహెనో’ అని సంబోధించడం ఆయనకు అలవాటు. అయితే పాకిస్థాన్‌పై జరిపిన తొలి సర్జికల్ స్ట్రైక్స్ తర్వాత ఆయన ‘మిత్రో, మేరే ప్యారీ దేశీవాసీయోం’ అంటూ ప్రజలను సంబోధించడం ప్రారంభించారు. అవి కూడా ఎంతో ప్రాచుర్యంలోకి వచ్చాయి. స్వచ్ఛ్ (భారత్), గోరక్షక్, న్యూస్ ట్రేడర్, ప్రెస్టిట్యూట్ పదాలు కూడా ప్రాచుర్యంలోకి వచ్చాయి. ఇక రానున్న ఎన్నికలను దష్టిలో పెట్టుకొని మోదీ ప్రభుత్వం ‘నా మున్కిన్ అబ్ మున్కిన్ హై’ నినాదం పేరిట వాణిజ్య ప్రకటనలతో అదరగొట్టగా ‘మోడీ హైతో మున్కిన్ హై’ అంటూ బీజేపీ ప్రచారం చేస్తోంది. ఈ పదాల పటాటోపం ఏ మేరకు ఓట్లను కురిపిస్తుందో చూడాలి!. -
ఖుర్షీద్ వ్యాఖ్యలపై స్పందించిన మాజీ సీఎం
శ్రీనగర్: కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత మాజీ మంత్రి సల్మాన్ ఖుర్షీద్ ఇటివల చేసిన వివాదాస్పద వ్యాఖ్యలపై నేషనల్ కాన్ఫరెన్స్ ప్రెసిడెంట్, జమ్మూ కశ్మీర్ మాజీ సీఎం ఫరూక్ అబ్దుల్లా స్పందించారు. ఇటివల అలీగడ్ ముస్లిం యూనివర్సిటీలో సల్మాన్ ఖుర్షీద్ మాట్లాడుతూ.. ‘కాంగ్రెస్ చేతులకు ముస్లింల రక్తపు మరకలు’ అని చేసిన వ్యాఖ్యలను స్వాగతిస్తున్నట్లు ఫరూక్ అబ్దుల్లా తెలిపారు. ఈ విషయాన్ని అన్ని రాజకీయ పార్టీల నేతలు గమనించాలని, ఇకనైన కనువిప్పు కలగాలని ఆయన కోరారు. ‘ఖుర్షీద్ వ్యాఖ్యలను స్వాగతిస్తున్నా.. ఇలాంటి పరిస్థితిని తిరిగి రానివ్వకూడదు. గతంలో చేసిన తప్పుల్ని నేతలు మళ్లీ జరగకుండా చుసుకోవాలి. రాజకీయ నాయకత్వం, రాజకీయ పక్షపాతాన్ని పక్కనపెట్టి, కశ్మీర్‌కు జరిగిన అన్యాయాన్ని, కశ్మీర్ ఎదుర్కొంటున్న సమస్యలను పరిష్కరించడానికి కృషి చేయాలి. ఇంత వరకూ చేసిన తప్పుల్ని ఒప్పుకుని ప్రజలను క్షమాపణలు కోరాలి ’ అని అన్నారు. దేశంలోని ముస్లింలు నిస్వార్థంతో పనిచేస్తున్నారు. వారికి శాంతి, సామరస్యం తప్ప మరొకటి తెలియదని ఫరూక్ అన్నారు. ముస్లింల గతమంతా అన్యాయం, అసమానత్వం, దురభిప్రాయం వంటి అంశాలతోనే ముడిపడి ఉంది. ప్రస్తుతం ముస్లింలు గౌరవంగా బతుకుతున్నారని అబ్దుల్లా పేర్కొన్నారు. -
ఈ పెన్ పదాలను లెక్కిస్తుంది..
సాక్షి, శ్రీనగర్ : కంప్యూటర్లో, మొబైల్ ఫోన్లలో మనం ఎన్ని పదాలు టైప్ చేశామో తెలుస్తుంది.. కానీ పేపర్‌పై మాత్రం ఎన్ని పదాలు రాశామో తెలుసుకోవడం కష్టమే.. కానీ ఓ తొమ్మిదేళ్ల బాలుడు తయారుచేసిన కౌంటింగ్ పెన్ దీనికి పరిష్కారం చూపింది. రాసే పెన్నుతోనే ఎన్ని పదాలు రాస్తున్నామో తెలిసుకునేలా దీనిని రూపొందించాడు. ఈ పెన్నుని తయారుచేసిన జమ్మూకాశ్మీర్‌కు చెందిన ముజఫర్ అహ్మద్ ఖాన్ని పలువురు ప్రశంసిస్తున్నారు. ఈ పెన్ ద్వారా ఎన్ని పదాలు రాస్తున్నామో వాటి సంఖ్య పెన్ను పైభాగంలో గల చిన్న ఎల్సీడీ స్ర్కీన్‌పై కనిపించడంతో పాటు మొబైల్‌కు కూడా మెసేజ్ వస్తుంది. ‘పరీక్షలో తక్కువ పదాలు రాసినందుకు తక్కువ మార్కులు వచ్చాయి. దీంతో ఎంతో కుంగిపోయాను. ఆ తర్వాత పరీక్షలో టైమ్ ఎలా సద్వినియోగం చేసుకోవాలనే దానిపై దృష్టి సాధించాను. ఆ ఆలోచనల్లో నుంచి తయారయిందే ఈ కౌంటింగ్ పెన్’ అని అహ్మద్ తెలిపాడు. డిపార్ట్మెంట్ ఆఫ్ సైన్స్ అండ్ టెక్నాలజీ ఆధ్వర్యంలో రాష్ట్రపతి భవన్లో ఏర్పాటు చేసిన ఓ ఇన్నోవేషన్ కార్యక్రమంలో ఈ పెన్నుని ప్రదర్శించగా.. రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ అహ్మద్‌ను ప్రశంసించడంతో పాటు రివార్డును అందజేశారు. నేషనల్ ఇన్నోవేషన్ పౌండేషన్ కౌంటింగ్ పెన్ని ప్రజలకు అందుబాటులోకి తీసుకురావడానికి నిర్ణయించుకుంది. మే నుంచి ఈ పెన్ను మార్కెట్లోకి రానుంది. -
స్టీఫెన్ హాకింగ్స్ చెప్పిన జీవిత సత్యాలు..
స్టీఫెన్ హాకింగ్స్ భౌతికంగా మన మధ్యలేకపోయినా ఆయన తన మనుసుతో పలికిన ప్రతిభావం చిరస్మరణీయం. ఆయన పుస్తకం మనకు మార్గదర్శకం. హాకింగ్స్ తన జీవితంలో కేవలం సృష్టిని వివరించడమే కాదు మనిషి ఎలా ఉండాలి, మనసును ఎలా ఉంచుకోవాలి అన్న విషయాలను భావి తరాలకు అందించారు. ఆయన చెప్పిన కొన్ని జీవిత సత్యాలు ప్రతి మనిషికి వర్తించడమే కాదు ఎలా ప్రవర్తించాలో చెబుతాయి. ‘‘పని మీ జీవితానికో అర్థాన్ని, ప్రయోజనాన్ని ఇస్తుంది..అది లేకుండా మీ జీవితం శూన్యం’’ ఇది 2010 సంవత్సరంలో ఏబీసీ వరల్డ్ న్యూస్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆయన చెప్పిన మాట. ఈ వ్యాఖ్య గురించి ఆక్స్ఫర్డ్ యూనివర్శిటీకి చెందిన సైకాలజీ ప్రొఫెసర్ సాలీ మైట్లిస్ వివరిస్తూ.. ‘‘ఈ వ్యాఖ్య ప్రతి జీవితానికీ వర్తిస్తుంది. పని కేవలం మన కడుపునింపే ఓ అవసరం మాత్రమే కాదు మన ఆత్మ సంతృప్తినిచ్చే చక్కటి ఔషధం కూడా. మనం చేసే పనిని ప్రేమిస్తే ఆ పని ఎంత కష్టమైనా, ఎన్ని కష్టాలొచ్చినా అందులో నీకు నువ్వు చేయాల్సిన పని తప్ప కష్టం కనిపించదు. ఇది నీకు మాత్రమే కాదు నువ్వు పని చేసే సంస్థ ఉన్నతికి కూడా ఉపయోగపడుతుంది.’’ అంటారామె. ‘మీరు కెరీర్‌ను ఎంచుకోవడం ద్వారా మీ జీవితంలో కచ్చితంగా సానుకూల ప్రభావాలను కలిగి ఉంటారు.’ ఈ విషయాన్ని చాలా మంది గొప్పవాళ్లు, తత్వ శాస్త్ర నిపుణులు అంగీకరించారు. మన జీవితంలో ఒక వృత్తిని ఎంచుకోవడం ద్వారా సగం విజయం సాధించినట్టేనని వారు తెలిపారు. అది మన జీవితంలో చోటుచేసుకోబోయే మంచి పరిణామాలకు మార్గమన్నారు. -
సీఎం వ్యాఖ్యలు దారుణం: పెంటపాటి
ఏలూరు: సిఎం చంద్రబాబుకు సామాజికవేత్త డాక్టర్ పెంటపాటి పుల్లారావు ఓ ప్రకటనలో కౌంటర్ ఇచ్చారు. పోలవరం ప్రాజెక్టును ఆపడానికి తాను ప్రధానమంత్రిని కలిశానని సిఎం చంద్రబాబు వ్యాఖ్యానించడం దారుణమన్నారు. పోలవరం ప్రాజెక్టులో ఐదు లక్షల మంది నిర్వాసితుల సమస్య ఉందన్నారు. ఆంద్రప్రదేశ్ ప్రభుత్వం నిర్వాసితుల సమస్యలను పట్టించుకోకపోవడం వల్లే ప్రధానిని కలిసి సమస్యలను పరిష్కరించాలని కోరానని తెలిపారు. నిర్వాసితులకు అందాల్సిన సొమ్ము కేంద్ర చట్టాల ప్రకారం రావాల్సిందేనని స్పష్టం చేశారు. కాగా, సామాన్యులు కోర్టుకు వెళ్లడాన్ని తప్పుపడుతున్న చంద్రబాబు విభజన హామీలపై కోర్టును ఆశ్రయిస్తామని ఎలా అంటారని ఆయన ప్రశ్నించారు. -
ప్రియంగా మాట్లాడాలి!
ఆత్మీయం కొందరికి ఎదుటి వాళ్లకి ఏమాత్రం ఇష్టంలేని మాటలు మాట్లాడటం సరదా. మన మాటలు వినలేక చెవులు మూసుకుంటుంటే చూడాలనుకుంటారు. మన మాటలు ప్రియం కలిగించినా లేకపోయినా... అప్రియం మాత్రం కలిగించకూడదు. అందుకే చావు కబురు కూడా చల్లగా చెప్పాలన్నారు పెద్దలు. మధురంగా మాట్లాడటం ఒక కళ. మధురంగా మాట్లాడలేకపోయినా ఫరవాలేదు కానీ, చెడ్డగా మాత్రం మాట్లాడకూడదు. చక్కగా, ఆహ్లాదకరంగా ఉన్న వాతావరణంలో నలుగురూ కూర్చుని కబుర్లు చెప్పుకుంటూ ఉంటారు. ఇంతలో ఉన్నట్టుండి ఒకడు ‘‘అమ్మో! ఇప్పుడు వర్షం పడిందంటే మన పని గోవిందా’’ అనో, ఈ ఏసీ గదికి కనక పొరపాటున నిప్పంటుకుందనుకోండి, మనలో ఒక్కడు కూడా మిగలడు’’ అనో అంటాడు. అంతే! వాతావరణం ఉన్నట్టుండి గంభీరంగా మారిపోతుంది. మనం మాట్లాడేది సత్యమే అయినప్పటికీ, అది హితవుగా ఉండాలి. కఠినంగా అనిపించకూడదు. మన కళ్లు ఎప్పుడూ మంచి దృశ్యాలనే చూడాలి, చెవులు ఎల్లప్పుడూ మంచి మాటలనే వినాలి. చేతులు ఎప్పుడూ మంచి పనులే చేయాలి, నాలుక ఎప్పుడూ మధురంగానే మాట్లాడాలి... అని కోరుకునేవారు పెద్దలు. మనం మంచి మాటలు వినాలంటే, మంచి మాటలనే పలకాలి. ‘అబ్బే! నాకు మెరమెచ్చు మాటలు చెప్పడం చేతకాదండీ, ముక్కుసూటిగా... ఉన్నది ఉన్నట్టుగా కుండబద్దలు కొట్టినట్టుగా మాట్లాడటం నా నైజం’ అని గొప్పలు చెప్పుకునేముందు అవతలి వారు కూడా అలాగే మాట్లాడితే మన మనసుకు ఎలా అనిపిస్తుందో ఆలోచించాలి. చిలకలా ముద్దు మాటలు మాట్లాడలేకపోయినా, కోకిలలా పాటలు పాడలేకపోయినా, కాకిలా కర్ణకఠోరంగా మాత్రం మాట్లాడకూడదు. -
రెవెన్యూ భాష తెలుసుకుందాం..!
⇒రెవెన్యూ లాంగ్వేజ్‌లో ప్రతీ పదానికి ఓ లెక్క ⇒కొన్ని మొఘల్ చక్రవర్తుల నాటివి ⇒మరికొన్ని నైజాం ఫర్మానాలోవి ⇒ఇప్పటికీ వాడుకలో అవే పదాలు రెవెన్యూ భాషంటే...గ్రామంలో వీఆర్ఏ.. వీఆర్వోలు, గిర్ధావర్.. తహసీల్దార్లు మాట్లాడే పదాలు. ఈ పదాలు వినగానే అన్నీ తెలిసిన పదాల మాదిరిగానే ఉంటాయి. అయితే వాటికి అర్థం మాత్రం చాలా మందికి తెలియదు. ముఖ్యంగా వీఆర్వోలు రోజువారీగా ఉపయోగించే పుస్తకాల్లో ఈ భాషే ఎక్కువగా ఉంటుంది. ప్రసుతం మిగతా ప్రభుత్వ శాఖలు దాదాపు ఆంగ్ల పదాలు ఉపయోగిస్తూ మార్పుచెందినా కీలకమైన రెవెన్యూశాఖ మాత్రం అధికారికంగా ఆ పదాలే ఇప్పటికీ వాడుతోంది. ఎందుకంటే రెవెన్యూ శాఖలో భూముల రికార్డులకు సంబంధించి ‘కాస్రా’ పహాణీ వంటివి శాఖకు ఒక గ్రంథం లాంటిది. దీంట్లో ఈ భాషలోనే పదాలు ఉంటాయి. అందుకే ప్రస్తుతం కొత్తగా ఉద్యోగంలోకి వచ్చిన వారు కూడా ఆ పదాలు నేర్చుకోక తప్పదు. ఈ పదాల్లో కొన్ని మొఘల్ చక్రవర్తుల కాలం నుంచి వాడుకలో ఉన్నవి కాగా... ఎక్కువ మాత్రం నైజాం కాలం నాటివి. రెవెన్యూ రికార్డుల్లో ఉండే పదాలు... దానికి అర్థాలు ఏమిటో తెలుసుకుందాం.... – హన్మకొండ అర్బన్ అడంగల్/పహాణీ.. గ్రామంలోసాగు భూమి వివరాలను నమోదు చేసే రిజిస్టర్. దీనిని ఆంధ్రా ప్రాంతంలో అడంగల్, తెలంగాణ ప్రాంతంలో పహాణీ అని పిలుస్తారు. ఈ రిజిస్టర్నే గ్రామ లెక్కల నంబర్–3 రిజిస్టర్ అని కూడా అంటారు. ఈ రిజిస్టర్లో గ్రామంలోని అన్ని భూముల వివరాలు ప్రతి సంవత్సరం నమోదుచేస్తారు. పంచరాయి.. గ్రామంలో పశువుల మేతకోసం కేటాయించబడిన ప్రబుత్వ భూమిని పంచరాయి అంటారు. గ్రామానికి దూరంగా అందరి పశువులకు మేతకోసం ఉపయోగించుకుంటారు. ఇది పూర్తిగా ప్రభుత్వ భూమి దీనిపై ఎవరికీ అధికారాలు ఉండవు. హోమ్‌స్టడ్.. హోమ్‌స్టడ్ అంటే గ్రామంలోకానీ, పట్టణంలోకానీ భూమిలేని కూలీలు, వృత్తిపనుల వారు... ఇతరులకు సంబంధించిన భూములపై 14–08–1975 నాటకి నివాసం ఏర్పచుకున్న స్థలాన్ని హోమ్‌స్టడ్ అంటారు. అలాంటి భూముల్లో నివాసం ఉన్నవారికి తాత్కాలికంగా స్థానిక అధికారులు అనుమతులు ఇస్తారు. భూమిలేని నిరుపేద.. రెండున్నర ఎకరాల పల్లం లేదా ఐదెకరాల మెట్టభూమి కంటే తక్కువ భూమి ఉండి, సంవత్సర ఆదాయం రూ.11వేలకన్నా తక్కువగా ఉన్నవారు భూమిలేని నిరుపేదలు. వీరు మాత్రమే ప్రభుత్వ భూమిని పొందడానికి అర్హులు. బందోబస్తు.. : వ్యవసాయ భూముల సర్వే, వర్గీ కరణ. బంజరు భూమి : ఖాళీగా, వ్యర్థంగా ఉన్న ప్రభుత్వం భూమి. బీఘా.. : బీఘా అంటే 30గంటల భూమి. 36.30 చదరపు గజాలతో సమానం.. బిల్ మక్తా.. : సాధారణ శిస్తుకంటే తక్కువ శిస్తు నిర్ణయించిన భూమి, లేదా గ్రామాన్ని బిల్ మక్తా అంటారు. చలానా.. ఇర్సాలు నామా అంటే గ్రామం లెక్క నంబర్–7. దీనినే చలానా అంటారు. దీనిద్వారా ప్రభుత్వానికి చెల్లించిన భూమి శిస్తు, వగైరాలను వసూలు చేసి నిర్ణీత తేదీల్లో ప్రభుత్వ ఖజానాకు జమ చేస్తారు. ఎండార్స్మెంట్ : గ్రామంలో ప్రజలు....ప్రభుత్వ అధికారులకు ఏదైనా దరఖాస్తు చేసుకుంటే దానిపై నిర్ణయం తీసుకుని ఆ నిర్ణయాన్ని తెలియ చేసేవిధానం. ఇజారా : ప్రభుత్వానికి చెందిన భంజరు భూములను వ్యవసాయానికి కానీ, నివాసం ఉండటానికానీ కొంత నిర్థిష్టమైన పన్ను చెల్లించే పద్ధతిపై లీజుకు ఇవ్వడాన్ని ‘ఇజారా’అంటారు. ఫసలీ : ప్రతి సంవత్సరం జులై,1 తరువాత నుంచి తరవాత సంవత్సరం జూన్30 వరకు ఉన్న 12నెల్ల కాలాన్ని ‘ఫసలీ’ అంటారు. ఈ పదం మొఘళ్ల్ల కాలం నుంచి వాడుకలో ఉంది. ఎఫ్ఎంబీ టిప్పన్ : ఇది గ్రామ రెవెన్యూ రికార్డుల్లో ఒకటి. గ్రా మంలోని అన్ని సర్వే నెంబర్ల ప టాలు ఇందులో ఉంటాయి. వా టి కొలతలు కూడా ఉంటాయి. చల్కా.. మట్టిలో ఎక్కువ భాగం ఇసుకతో కూడుకున్నది. సాధారణంగా ఈ భూముల్లో నీరు తక్కువగా అవసరం ఉండే పంట లు పండిస్తుంటారు. బోర్డు స్టాండింగ్ అర్డర్లు.. : రెవెన్యూ పాలనలో విధివిధానాలు సూచిస్తూ అప్పటిæ బోర్డ్ ఆఫ్ రెవెన్యూ జారీ చేసిన ఉత్తర్వులు. అయితే ఇప్పటికీ అవే అమల్లో ఉన్నాయి. గట్ నంబర్ : సాగుభూమిని నిరుపయోగంగా వదిలేయడాన్ని గట్ నంబర్ అంటారు. దీనిని బీడు భూమి అనికూడా అంటారు. జమాబందీ : జమా బందీ అం టే ప్రభుత్వానికి రావాల్సిన భూ మి పన్నులు, నీటి పన్ను, ఇతరబకాయిలు, సక్రమంగా లెక్కకట్టుట. రెవెన్యూ లెక్కల్లోకి తీసుకురాబడినవా లేదా అని నిర్ధారించుకుటకు గ్రామ, మండల రెవెన్యూ లెక్కల విస్తృత తని ఖీలను జమాబందీ అంటారు. గిరిజనులకు ఏజన్సీ : గిరిజనులు నివసించే ప్రాతాలను షెడ్యూల్డ్ ప్రాంతాలుగా ప్రకటించే అధికారం రాష్ట్రపతికి ఉంటుంది. ప్రస్తుతం షెడ్యూల్డ్ ప్రాంతాలుగా పిలువబడే ప్రాంతాలను ఏజన్సీ ప్రాంతాలు అంటారు. ఎకరం.. ఎకరం అన్నది భూమి విస్తీర్ణానికి కొలమానం. ఒక ఎకరం అంటే 4,840 చదరపు జగముల స్థలం. లేదా 100సెంట్లు లేదా 40గంటలు. గుంట(కుంట).. : కుంట అంటే 121చదరపు గజాల స్థలం. 40కుంటలు కలిస్తే ఒక ఎకరం. అగ్రహారం.. బ్రాహ్మణులకు శిస్తు లేకుండా, తక్కువ శిస్తుతో గ్రాంటుగా ఇచ్చిన గ్రామం.. లేదా గ్రామంలోని కొంత భాగం. ఆజమాయిషీ.. సరిగా ఉన్నది లేనిది తెలియజేయడం. భూమికి సంబం« దించి గ్రామ రెవెన్యూ అధికారి నిర్వహించే గ్రామ లెక్కల ను తనిఖీ చేయడాన్ని ఆజమాయిషీ అంటారు. ఎంఆర్ ఐ, వీఆర్వో రాసిన లెక్కల్లోని వివరాలు సంబంధిత తహసీల్దార్, డీటీ తనిఖీ చేయాలి. అలా తనిఖీ చేసి వివరాలు గ్రామ లెక్కల నెంబర్–3లో నమోదు చేయాల్సి ఉంటుం ది. ఈ విధానంగా ఆజమాయిషీ ప్రతి సంవత్సరం నిర్వహించాలి. బీ–మెమో : ప్రభుత్వ భూమిని ఆక్రమించుకుని సాగు చే సుకుంటున్న వ్యక్తికి శిస్తు చెల్లించమని ఆదేశిస్తూ ఇచ్చే నోటీసు. చిట్టా.. చిట్టా అంటే రోజువారీ వసూళ్లు తెలిపే రిజిస్టర్. దీనినే గ్రామ లెక్క నెంబర్–6అంటారు. ప్రభుత్వానికి చెల్లించాల్సిన నీటిపన్ను, భూమిశిస్తు వగైరా సామి వారీగా వసూలు చేసి ఈ రిజిస్టర్లో నమోదు చేస్తారు. చౌపస్లా.. : ఇది పట్టాదారులకు ఉన్న భూము ల వివరాలు తెలిపే రిజిస్టర్ . ఇందులో భూమి వర్గీకరణ, విస్తీర్ణం, పట్టాదారు పేరు తదితర వివరాలు ఉంటాయి. దస్తావేజు : భూమికి సంబంధించి కొనుగో లు, అమ్మకాలు, ఇతర లావాదేవీలను తెలియజేసే పత్రం. భూ బదలాయింపు జరిగి నప్పు డు ఈ దస్తా వేజులను చట్టపరంగా తప్పక రిజిస్ట్రేషన్ చేయించుకోవాలి. డైగ్లాట్ రాష్ట్రంలోని ప్రతి గ్రామంలో సర్వే సెటిల్మెంట్ కార్యకలాపాలు పూర్తి చేసి ప్రతి గ్రా మంలో భూముల వివరాలు నమో దు చేస్తా రు. ఇందులో అన్ని రకాల భూ ముల సర్వే నెంబర్లు ,విస్తీర్ణం, అవి సర్కారా, ఇనాం భూములా, మాగా ణియా, మెట్టా, వాటి వర్గాకరణ, శిస్తు, మొదలగు వివరాలు ఉం టాయి. ఈ రిజి స్టర్‌ను ఇంగ్లిష్‌లో, తెలుగులో రాస్తారు. అందకే దీనికి ‘డైగ్లాట్’ అంటారు. దీనినే శాశ్వత ‘ఏ’ రిజిస్టర్‌గా పరిగణిస్తారు. ఈ రిజిస్టర్ మిగతా గ్రామ రెవెన్యూ రికార్డులన్నింటికీ మూలస్తంభం లాంటిది. అబ్సెంటీ ల్యాండ్ లార్డు.. పరోక్ష భూస్వామిని అబ్సెంటీ ల్యాండ్ లార్డు అంటారు. ఒక గ్రామంలో భూమి ఉండి.. వేరొక గ్రామంలో నివాసం ఉంటూ .. ఆ భూమిని సొంతంగా సాగు చేయని భూ జయమానిని అబ్సెంటీ ల్యాండ్ లార్డు అంటారు. అసామి షిక్మీ.. భూ యజమానికి పన్ను చెల్లించే నిబంధనపై భూమిని కౌలుకు తీసుకుని చేసుకుంటున్న వ్యక్తి. అసైన్డ్ భూమి.. భూమిలేని నిరుపేదలకు సాగు చేసుకోవడానికి, ఇళ్లు నిర్మించుకోవడానికి ప్రభుత్వం మంజూరు చేసిన, కేటాయించిన భూమిని అసైన్డ్ భూమి అంటారు. ఈ భూమిని వారసత్వంగా అనుభవించాలి. ఇతరులకు అమ్మడం, బదిలీ చేయడం చేయకూడదు. ఏడబ్ల్యూడీ భూములు.. శిస్తును నిర్ధారించిన ప్రభుత్వ భూములు. లేదా అసైన్డ్ వేస్ట్ ల్యాండ్ అంటారు. ఏడబ్ల్యూడీ భూములు మెట్టభూములైతే ఢ్రై ల్యాండ్స్ అంటారు. వీటిని భూమిలేని నిరుపేదలకు అసైన్డ్ చేయవచ్చు ఆబాదీ/గ్రామ కంఠం.. గ్రామంలో ప్రజలు నివసించడానికి నిర్ధేశించిన భూమిని గ్రామకంఠం అంటారు. ఇది గ్రామానికి చెందిన ఉమ్మడి స్థలం. ఇక్కడ ప్రభుత్వ సభలు, సమావేశాలు నిర్వహించుకోవచ్చు. -
మహిళ పట్ల అశోక్‌బాబు వ్యాఖ్యలు తగవు
ఏపీ హంస రాష్ట్ర అధ్యక్షుడు యోగేశ్వరరెడ్డి విజయవాడ(పటమట): ఏఎన్ఎంల సేవలు ఎనలేనివని ఏపీ హంస రాష్ట్ర అధ్యక్షుడు కె.యోగేశ్వరరెడ్డి అన్నారు. శుక్రవారం ఏఎన్ఎం, పీహెచ్ఎన్, ïసీహెచ్‌వో అసోసియేషన్ జిల్లా కార్యవర్గ సమావేశం నగరంలోని మలేరియా క్యాంపు కార్యాలయంలో జరిగింది. హాజరైన ఆయన మాట్లాడుతూ కష్టాలు విన్నవించుకోవటానికి వచ్చిన మహిళల పట్ల రాష్ట్ర ఉద్యోగుల సంఘం అధ్యక్షుడు అశోక్‌బాబు వ్యవహారశైలి దారుణంగా ఉందన్నారు. వారిపై అనుచిత వ్యాఖ్యలు చేయటం తగదని హితవు పలికారు. అనంతరం జిల్లా నూతన కమిటీని ఎన్నుకున్నారు. కమిటీ జిల్లా అధ్యక్షుడిగా బి.మణికుమారి, కార్యదర్శిగా చింతపల్లి ఝాన్సీ, కోశాధికారిగా బి.సత్యవతిలను ఎన్నుకున్నారు. సమావేశంలో ఏపీ హంస రాష్ట్ర ఆర్గనైజింగ్ కార్యదర్శి కొండపల్లి శ్రీనివాసరావు, ఏఎన్ఎం అసోసియేషన్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సులోచనమ్మ తదితరులు పాల్గొన్నారు.