అధికారానికి దూరంగా ఉన్నంత మాత్రాన... ఒక రాజకీయ పార్టీ ఇంతలా పతనమైపోవటమన్నది ఆంధ్రప్రదేశ్ చరిత్రలో ఎన్నడూ లేదు. తెలుగుదేశం పార్టీ కేంద్ర కార్యాలయంలో అధికార ప్రతినిధిని కూర్చోబెట్టి... గజ్జి సోకిన గ్రామ సింహంలా మొరిగించిన వైనంపై రాష్ట్రంలో తీవ్ర స్థాయి ఆగ్రహావేశాలు వ్యక్తమయ్యాయి. అఖండ ప్రజాదరణతో సీఎం పీఠంపై కూర్చున్న నాయకుడిని ఉద్దేశించి ‘లం****’ (బోసిడీకే) అని పదేపదే బూతులు తిట్టించడంతో సీఎంను అభిమానించేవారు... వైఎస్సార్ సీపీ మద్దతుదారులు గట్టిగా ప్రతిస్పందించారు. ఎక్కడికక్కడ నిరసనలకు దిగారు. ఇంత జరిగినా... పశ్చాత్తాప పడని టీడీపీ అధ్యక్షుడు... దీన్ని రాజకీయంగా ఉపయోగించుకోవటానికి మరో ఎత్తుగడకు దిగారు. బుధవారం రాష్ట్ర బంద్‌కు పిలుపునిచ్చారు. ఉల్టా చోర్ కొత్వాల్ కో డాంటే... రీతిన ఆయనిచ్చిన పిలుపు ఒక బడ్డీ కొట్టును.. ఆఖరికి ఆయన హెరిటేజ్ దుకాణాల్ని కూడా మూయించలేకపోయింది. ఇప్పుడాయన 36 గంటల దీక్ష.. వరస లేఖలు.. కేంద్ర హోం మంత్రితో సమావేశమంటూ రకరకాల ఎత్తుగడలకు దిగుతున్నారు. పవిత్రమైన నిరాహారదీక్ష ఆయుధాన్ని పచ్చి బూతులకు మద్దతుగా ప్రయోగిస్తున్నారు.
పరిధి దాటిన పట్టాభి
సాక్షి, అమరావతి: రాష్ట్రంలో ఉద్రిక్తతలు, అల్లర్లు సృష్టించేందుకు టీడీపీ అధికార ప్రతినిధి కొమ్మారెడ్డి పట్టాభి అన్ని పరిధులు అతిక్రమించారని, ఆయన దుర్భాషల తరువాతే కొన్ని చోట్ల ఘర్షణలు తలెత్తాయని డీజీపీ గౌతమ్ సవాంగ్ పేర్కొన్నారు. ‘రాజ్యాంగబద్ధ పదవిలో ఉన్న ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డిని ఉద్దేశించి పట్టాభి దారుణమైన భాషలో మాట్లాడారు. టీడీపీ కార్యాలయం నుంచే ఆయన ముఖ్యమంత్రిని దుర్భాషలాడారు. అదేదో ఆవేశంలో నోరుజారి మాట్లాడింది కూడా కాదు. ఉద్దేశపూర్వకంగానే పదేపదే దారుణంగా దూషించారు’ అని డీజీపీ స్పష్టం చేశారు. మంగళగిరిలోని రాష్ట్ర పోలీసు ప్రధాన కార్యాలయంలో డీజీపీ సవాంగ్ బుధవారం మీడియాతో మాట్లాడారు. ఈ కుట్ర చంద్రబాబుదే
నెల రోజులుగా పథకం ప్రకారం..
రాజ్యాంగబద్ధమైన పదవుల్లో ఉన్న రాష్ట్రపతి, ప్రధానమంత్రి, ముఖ్యమంత్రి లాంటి వారిని ఉద్దేశించి దుర్భాషలాడటం తీవ్రమైన నేరమని, ఇలాంటి వాటిని ఎట్టి పరిస్థితుల్లోనూ ఉపేక్షించబోమని, తప్పకుండా కఠిన చర్యలు తీసుకుంటామని డీజీపీ స్పష్టం చేశారు. రాజకీయాల్లో, ప్రజాజీవితంలో ఇంతటి దారుణమైన భాష ఎట్టి పరిస్థితుల్లోనూ ఆమోదయోగ్యం కాదన్నారు. రాజకీయ పార్టీలు నైతిక విలువలకు కట్టుబడి హుందాగా వ్యవహరించాలని సూచించారు. ప్రభుత్వాన్ని అప్రతిష్ట పాల్జేసేందుకు నెల రోజులుగా ఓ పథకం ప్రకారం మాట్లాడుతున్న మాటలు, చేస్తున్న అసత్య ఆరోపణలు, దూషణలు అన్నింటినీ సమగ్రంగా పరిశీలిస్తున్నామని చెప్పారు. పట్టాభి దుర్భాషలు, తదనంతర పరిణామాలపైనా దర్యాప్తు జరుపుతున్నామన్నారు. దుర్భాషలపై జనాగ్రహం
దశాబ్దాల సమస్య
రాష్ట్రంలో గంజాయి అక్రమ రవాణా దశాబ్దాలుగా ఉన్న సమస్య అని చెప్పారు. ఆంధ్ర–ఒడిశా సరిహద్దుల్లో మావోయిస్టుల ప్రాబల్యం ఉండటంతో దశాబ్దాలుగా గంజాయి సాగు సాగుతోందన్నారు. గత రెండేళ్లుగా అక్రమ రవాణాను అరికట్టేందుకు ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకుంటోందని, ప్రత్యేకంగా స్పెషల్ ఎన్‌ఫోర్స్‌మెంట్ బ్యూరోను ఏర్పాటు చేసిందని గుర్తు చేశారు. గతంలో కంటే పోలీసులు విస్తృతంగా దాడులు నిర్వహిస్తూ పెద్ద ఎత్తున కేసులు నమోదు చేస్తున్నారని చెప్పారు. రెండేళ్ల క్రితం వరకు గంజాయి స్మగ్లింగ్‌పై కఠిన చర్యలు ఉండేవి కావన్నారు. గంజాయి అక్రమ రవాణాపై 2018లో రాష్ట్రంలో 579 కేసులు నమోదు చేసి 2,174 కేజీల గంజాయిని స్వాధీనం చేసుకోగా 2021లో ఇప్పటికే 1,456 కేసులు నమోదు చేసి 4,059 కేజీల గంజాయిని స్వాధీనం చేసుకున్నట్లు వివరించారు. అక్రమ రవాణాపై ప్రభుత్వం, పోలీసు శాఖ కఠినంగా వ్యవహరిస్తోందనడానికి ఈ గణాంకాలే నిదర్శనమని చెప్పారు. టీడీపీ బంద్‌ను పట్టించుకోని ప్రజలు
స్పందించలేదనడం సరికాదు..
ప్రతిపక్ష నేత చంద్రబాబు ఫోన్ చేస్తే తాను స్పందించలేదన్న ఆరోపణలను డీజీపీ ఖండించారు. మంగళవారం సాయంత్రం 5 గంటల ప్రాంతంలో తాను పోలీస్ పరేడ్ పర్యవేక్షిస్తుండగా ఓ నంబర్ నుంచి వాట్సాప్ కాల్ వచ్చిందన్నారు. పరేడ్ జరుగుతుండటంతో ఎవరు మాట్లాడుతున్నారో సరిగా వినిపించలేదన్నారు. ఘర్షణ విషయంపై జిల్లా ఎస్పీతో మాట్లాడాలని సూచించినట్లు చెప్పారు. టీడీపీ నేతలు ఫోన్ చేస్తే గుంటూరు ఎస్పీ, మంగళగిరి రూరల్ పోలీసులు స్పందించి తగిన చర్యలు తీసుకున్నారని తెలిపారు. పోలీసులు స్పందించలేదని టీడీపీ నేతలు విమర్శలు చేయడం సహేతుకం కాదన్నారు. పట్టాభి చేసింది తప్పే..
Comments
Please login to add a commentAdd a comment