మహిళ పట్ల అశోక్‌బాబు వ్యాఖ్యలు తగవు
Published Fri, Jan 20 2017 11:10 PM | Last Updated on Tue, Sep 5 2017 1:42 AM
ఏపీ హంస రాష్ట్ర అధ్యక్షుడు యోగేశ్వరరెడ్డి
విజయవాడ(పటమట): ఏఎన్‌ఎంల సేవలు ఎనలేనివని ఏపీ హంస రాష్ట్ర అధ్యక్షుడు కె.యోగేశ్వరరెడ్డి అన్నారు. శుక్రవారం ఏఎన్‌ఎం, పీహెచ్‌ఎన్, ïసీహెచ్‌వో అసోసియేషన్ జిల్లా కార్యవర్గ సమావేశం నగరంలోని మలేరియా క్యాంపు కార్యాలయంలో జరిగింది. హాజరైన ఆయన మాట్లాడుతూ కష్టాలు విన్నవించుకోవటానికి వచ్చిన మహిళల పట్ల రాష్ట్ర ఉద్యోగుల సంఘం అధ్యక్షుడు అశోక్‌బాబు వ్యవహారశైలి దారుణంగా ఉందన్నారు. వారిపై అనుచిత వ్యాఖ్యలు చేయటం తగదని హితవు పలికారు. అనంతరం జిల్లా నూతన కమిటీని ఎన్నుకున్నారు. కమిటీ జిల్లా అధ్యక్షుడిగా బి.మణికుమారి, కార్యదర్శిగా చింతపల్లి ఝాన్సీ, కోశాధికారిగా బి.సత్యవతిలను ఎన్నుకున్నారు. సమావేశంలో ఏపీ హంస రాష్ట్ర ఆర్గనైజింగ్ కార్యదర్శి కొండపల్లి శ్రీనివాసరావు, ఏఎన్‌ఎం అసోసియేషన్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సులోచనమ్మ తదితరులు పాల్గొన్నారు.
Advertisement
Advertisement