ashoke babu
-
మహిళ పట్ల అశోక్‌బాబు వ్యాఖ్యలు తగవు
ఏపీ హంస రాష్ట్ర అధ్యక్షుడు యోగేశ్వరరెడ్డి విజయవాడ(పటమట): ఏఎన్ఎంల సేవలు ఎనలేనివని ఏపీ హంస రాష్ట్ర అధ్యక్షుడు కె.యోగేశ్వరరెడ్డి అన్నారు. శుక్రవారం ఏఎన్ఎం, పీహెచ్ఎన్, ïసీహెచ్‌వో అసోసియేషన్ జిల్లా కార్యవర్గ సమావేశం నగరంలోని మలేరియా క్యాంపు కార్యాలయంలో జరిగింది. హాజరైన ఆయన మాట్లాడుతూ కష్టాలు విన్నవించుకోవటానికి వచ్చిన మహిళల పట్ల రాష్ట్ర ఉద్యోగుల సంఘం అధ్యక్షుడు అశోక్‌బాబు వ్యవహారశైలి దారుణంగా ఉందన్నారు. వారిపై అనుచిత వ్యాఖ్యలు చేయటం తగదని హితవు పలికారు. అనంతరం జిల్లా నూతన కమిటీని ఎన్నుకున్నారు. కమిటీ జిల్లా అధ్యక్షుడిగా బి.మణికుమారి, కార్యదర్శిగా చింతపల్లి ఝాన్సీ, కోశాధికారిగా బి.సత్యవతిలను ఎన్నుకున్నారు. సమావేశంలో ఏపీ హంస రాష్ట్ర ఆర్గనైజింగ్ కార్యదర్శి కొండపల్లి శ్రీనివాసరావు, ఏఎన్ఎం అసోసియేషన్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సులోచనమ్మ తదితరులు పాల్గొన్నారు. -
అప్పుడు - ఇప్పుడు
-
నాలుకలు కోసినా... కాళ్లు విరగొట్టినా సమ్మె విరమించం
హైదరాబాద్ : నాలుకలు తెగ్గోసినా.. కాళ్లు, చేతులు విరగ్గొట్టినా.. తెగ నరికినా సరే తాము కొనసాగిస్తున్న సమ్మె విరమించేది లేదని ఏపీ ఎన్జీవోల సంఘం అధ్యక్షుడు అశోక్ బాబు అన్నారు. తెలంగాణ ప్రజలపై విద్వేషంతో తాము ఉద్యమం చేయటం లేదని ఆయన స్పష్టం చేశారు. సమైక్యాంధ్ర ఉద్యమంలో తమ ప్రసంగాలను వక్రీకరించటం భావ్యం కాదని అశోక్ బాబు బుధవారమిక్కడ అన్నారు. తాను ఎవర్నీ ఎప్పుడు కించపరిచేలా మాట్లాడలేదని...తమ ప్రసంగాల్లో తప్పులు దొర్లితే సరిదిద్దుకోవడానికి, చర్చల ద్వారా పరిష్కరించుకోవడానికి తాము సిద్ధంగా ఉన్నట్టు ఆయన తెలిపారు. కొంతమంది స్వార్థపరుల వేర్పాటు వాదం వల్లే తెలంగాణ ఉద్యమం వచ్చిందని అశోక్ బాబు అన్నారు. కేంద్రంలో ఎంపీలు రాజీనామాలు చేయటం ఎంత అవసరమో.... రాష్ట్రంలో ఎమ్మెల్యేలు రాజీనామా చేయకుండా ఉండటం అంతే అవసరం అన్నారు. ఒకవేళ అసెంబ్లీకి తెలంగాణపై తీర్మానం వస్తే దాన్ని ఓడించాల్సిన బాధ్యత సీమాంధ్ర ప్రాంతానికి చెందిన ప్రతి ఎమ్మెల్యేపై ఉందని అశోక్ బాబు అన్నారు. -
'మీడియా గొంతు నొక్కడం ఏం న్యాయం'
-
'మీడియా గొంతు నొక్కడం ఏం న్యాయం'
హైదరాబాద్ : సేవ్ ఆంధ్రప్రదేశ్ సభను మీడియా లైవ్ ప్రసారం చేయకూడదని పోలీసులు ఉత్తర్వులు జారీ చేయడం బాధాకరమని ఏపీఎన్జీవోల అధ్యక్షుడు అశోక్‌బాబు ఆవేదన వ్యక్తం చేశారు. ప్రజాస్వామ్య దేశంలో మీడియా గొంతు కూడా నొక్కడం ఏం న్యాయమని ఆయన ప్రశ్నించారు. సీమాంధ్ర ప్రజల మనోభావాలు పట్టించుకోకుండా కాంగ్రెస్ పెద్దలు పార్లమెంట్లో తెలంగాణ బిల్లు పెడితే తమ ఉద్యమం మరింత ఉద్ధృతమవుతుందని అశోక్‌బాబు చెప్పారు. పరేడ్ గ్రౌండ్స్‌లో మిలియన్ మార్చ్ నిర్వహించే ఆలోచన ఉందని ఆయన స్పష్టం చేశారు.