హైదరాబాద్ : సేవ్ ఆంధ్రప్రదేశ్ సభను మీడియా లైవ్ ప్రసారం చేయకూడదని పోలీసులు ఉత్తర్వులు జారీ చేయడం బాధాకరమని ఏపీఎన్జీవోల అధ్యక్షుడు అశోక్‌బాబు ఆవేదన వ్యక్తం చేశారు. ప్రజాస్వామ్య దేశంలో మీడియా గొంతు కూడా నొక్కడం ఏం న్యాయమని ఆయన ప్రశ్నించారు. సీమాంధ్ర ప్రజల మనోభావాలు పట్టించుకోకుండా కాంగ్రెస్ పెద్దలు పార్లమెంట్‌లో తెలంగాణ బిల్లు పెడితే తమ ఉద్యమం మరింత ఉద్ధృతమవుతుందని అశోక్‌బాబు చెప్పారు. పరేడ్ గ్రౌండ్స్‌లో మిలియన్ మార్చ్ నిర్వహించే ఆలోచన ఉందని ఆయన స్పష్టం చేశారు.