save andhra pradesh
-
పథకాలు రూపొందించేటప్పుడే దోపిడీకి ప్లాన్
సాక్షి ప్రతినిధి, కాకినాడ: ‘‘రాష్ట్రంలో అవినీతి సంస్థాగతంగా మారిపోయింది. అవినీతిలో రాష్ట్ర ప్రభుత్వం గిన్నిస్ బుక్ రికార్డు సృష్టించేలా ఉంది. స్కీమ్‌లు తయారు చేసినప్పుడే ఏ విధంగా దోచుకోవచ్చో ఆలోచిస్తున్నారు. ఇరిగేషన్, ఆర్అండ్బీ పనుల అంచనాలను పెంచేసి, సీఎం దగ్గరి నుంచి నాయకులు, ఉద్యోగుల వరకూ పర్సంటేజీలు పంచుకుంటున్నారు. ఇసుక, మట్టిని కూడా పెద్ద ఎత్తున దోచుకుంటున్నారు’’ అని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ మాజీ ప్రధాన కార్యదర్శి(సీఎస్) అజేయ కల్లాం ఆరోపించారు. తూర్పు గోదావరి జిల్లా రాజమహేంద్రవరంలో జన చైతన్య వేదిక ఆధ్వర్యంలో ఆదివారం ‘సేవ్ ఆంధ్రప్రదేశ్–సేవ్ డెమోక్రసీ’ సదస్సు నిర్వహించారు. పలువురు ప్రముఖులు, మేధావులు, ఉద్యోగులు, మాజీ ఉద్యోగులు, ఇతర పెద్దలు పాల్గొన్న ఈ సదస్సులో అజేయ కల్లాం ప్రసంగించారు. గత ప్రభుత్వంలో ఇరిగేషన్ పరంగా 2014 జూలై నాటికి పోలవరం మనిహా మిగిలిన 23 ప్రాజెక్టులకు రూ.17 వేల కోట్లు ఖర్చవుతుందని అంచనా చేశారని, ప్రస్తుతం రూ.51 వేల కోట్లు ఖర్చు చేశామని ప్రభుత్వం చెబుతోందని, మూడు రెట్లు అధికంగా ఖర్చు పెట్టినా ప్రాజెక్టులు ఎందుకు పూర్తి కాలేదని ప్రశ్నించారు. హౌసింగ్‌లో అవినీతికి అంతేలేకుండా పోతోందని విమర్శించారు. పక్క రాష్ట్రం కంటే మన రాష్ట్రంలో చదరపు అడుగుకు అదనంగా రూ.1,000 వరకూ ఖర్చు చేస్తున్నారని చెప్పారు. 10 లక్షల ఇళ్లకు గాను అదనంగా రూ.36,500 కోట్లు ఖర్చు చూపించి, రూ.18,250 కోట్ల దోపిడీకి పాల్పడుతున్నారని ధ్వజమెత్తారు. అజేయ కల్లాం ఇంకా ఏం చెప్పారంటే... దిగజారిన రాష్ట్ర ఆర్ధిక పరిస్థితి ‘‘ఏపీ విభజనకు ముందు రాష్ట్ర స్థూల ఉత్పత్తి(జీడీపీ)లో వ్యవసాయ రంగం వాటా కేవలం 23 శాతం. విభజన వల్ల 2014 జూలై నాటికి అది 30.2 శాతానికి పెరిగింది. 2017–18 నాటికి ఈ వాటా 34.4 శాతంగా నమోదైనట్లు శ్వేతపత్రంలో ప్రభుత్వం పేర్కొంది. కానీ, పరిశ్రమల రంగం వాటా 22.5 శాతం నుంచి 22.1 శాతానికి దిగజారిపోయింది. సేవా రంగం వాటా కూడా 44.6 శాతం నుంచి 43.5 శాతానికి పడిపోయింది. అభివృద్ధి సూత్రం ఏమిటంటే జీడీపీలో వ్యవసాయ రంగం వాటా తగ్గుతూ పోవాలి. పరిశ్రమలు, సేవా రంగం వాటా పెరగాలి. వాస్తవ లెక్కలు ఇలా ఉంటే గుజరాత్ రాష్ట్రం మన రాష్ట్రాన్ని చూసి అసూయ పడుతోందని, అందుకే ప్రత్యేక హోదా ఇవ్వడం లేదని చెబుతుంటే నవ్వాలో ఏడవాలో తెలియడం లేదు. రాష్ట్రాన్ని అప్పుల ఊబిలోకి నెట్టేశారు రాష్ట్ర విభజనకు ముందు రాష్ట్ర స్థూల ఉత్పత్తిలో అప్పులు కేవలం 20.28 శాతం ఉండగా, గత ఏడాది 28.2 శాతంగా ఉందని ప్రభుత్వం విడుదల చేసిన శ్వేతపత్రంలో పేర్కొనగా, ప్రస్తుతం 29 శాతం వరకు ఉండవచ్చు. అంతకు ముందు 1995–2004 వరకు ముఖ్యమంత్రిగా చంద్రబాబు ఉన్న సమయంలో అప్పుల శాతాన్ని స్థూల ఉత్పత్తిలో 29.5 శాతానికి పెంచారు. 2004లో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత 29.5 శాతం ఉన్న అప్పులను 20.28గా తగ్గించింది. 28 శాతం ఉంటే రెడ్అలెర్ట్. కానీ, ప్రస్తుతం అప్పులను 29 శాతానికి తీసుకువెళ్లి, రాష్ట్రాన్ని అప్పుల ఊబిలోకి నెట్టిన ఘనత చంద్రబాబుకే దక్కుతుంది. ఆర్బీఐ అనుమతి లేకుండా, కేంద్ర ప్రభుత్వానికి తెలియకుండా బ్యాంకుల నుంచి అధిక వడ్డీలకు అప్పులు తీసుకొస్తున్నారు. ఈ విధంగా నాలుగేళ్లలో బ్యాంకుల ద్వారా తీసుకున్న అప్పు రూ.35 వేల కోట్లుండగా, ప్రస్తుతం మరో రూ.15 వేల కోట్ల అప్పులు చేయడానికి కేబినెట్ నిర్ణయం తీసుకుంది. ఆర్బీఐ అనుమతి లేకుండా, కేంద్రానికి తెలియకుండా తెస్తున్న అప్పులు రూ.50 వేల కోట్లకు చేరనున్నాయి. ముందు చెప్పిన విధంగా 29 శాతానికి ఇది అదనం. దీన్ని కూడా కలుపుకుంటే రాష్ట్రం తీర్చాల్సిన అప్పు స్థూల ఉత్పత్తిలో 34 శాతం దాటుతుంది. దీన్నుంచి బయటపడాలంటే ఏ రాష్ట్రానికైనా కనీసం రెండు దశాబ్దాలు పడుతుంది. చేనేత రంగంలోనూ అదేతీరు చేనేత రంగం పరిస్థితి ప్రస్తుతం చాలా దయనీయంగా ఉంది. ఒక్క వైఎస్సార్ జిల్లాలో 120 చేనేత సొసైటీలున్నాయి. ఆరు వేల మంది సభ్యులు ఉన్నారు. ఆప్కో చైర్మన్‌గా ఓ వ్యక్తి ఉన్నారు. ఆయన తాలూకు వ్యక్తులతో 80 బోగస్ సొసైటీలు పెట్టి, వాటి ద్వారా బట్ట తయారైనట్టు, 2015–16లో రూ.262.75 కోట్ల విలువైన క్లాత్‌ను ఆప్కోకు సరఫరా చేసినట్టుగా చూపారు. 11 కంపెనీల నుంచి మీటరు రూ.30కి కొని, రూ.50కి సొసైటీల ద్వారా అమ్ముకుంటున్నారు. 2015 ఏప్రిల్ 1 నుంచి 2018 మార్చి 31 వరకు రూ.75.95 కోట్ల విలువైన బట్ట బోగస్‌గా సరఫరా చేశారు. వాస్తవంగా రూ.29.63 కోట్ల విలువైన బట్ట మాత్రమే సరఫరా చేశారు. మిగిలినదంతా బయటి నుంచి కొనుగోలు చేసి తెచ్చిన బట్ట’’ అని అజేయ కల్లాం పేర్కొన్నారు. దోపిడీపై ప్రశ్నిస్తే బురద జల్లుతారా?: విజయ్‌బాబు చంద్రబాబు ప్రభుత్వం గోబెల్స్ ప్రచారానికి దిగుతోందని సమాచార హక్కు చట్టం మాజీ కమిషనర్ విజయబాబు అన్నారు. ప్రపంచంలో మాకియవెల్లీ ఇజం అనేది ఒకటుందని, దీనిప్రకారం పదవి కోసం ఏ నీచానికైనా దిగజారుతారని, అవసరమైతే వెన్నుపోటు పొడుస్తారని, సీఎం చంద్రబాబు కూడా ఆ బాటలోనే నడుస్తున్నారని విమర్శించారు. దోపిడీపై ప్రశ్నించిన వారిపై ప్రభుత్వం బురద జల్లుతోందని మండిపడ్డారు. పోలవరంపై ప్రజలను ఏమారుస్తున్నారు: ఉండవల్లి అరుణ్‌కుమార్ ‘‘పోలవరం సందర్శన అంటూ లక్షకు పైగా జనాన్ని తరలించి భోజనాలు కూడా పెడుతున్నారు. ఒక్కసారైనా నేను నా సొంత ఖర్చులతో వచ్చి చూస్తాను. ప్రభుత్వం తరపున ఒక్క అధికారి వచ్చి నేను అడిగిన సమాధానాలకు చెప్పండి అని అడుగుతున్నా స్పందించడం లేదు’’ అని మాజీ ఎంపీ ఉండవల్లి అరుణ్‌కుమార్ అన్నారు. పోలవరం ప్రాజెక్టు నిర్మాణంలో నచ్చిన వ్యక్తులకు పోస్టింగ్‌లు ఇచ్చి, ప్రజలను ఏమారుస్తున్నారని దుయ్యబట్టారు. 15 శాతం బోగస్ ఓట్లు: వి.లక్ష్మణరెడ్డి అవినీతి చేయడం తప్పు కాదనే భావజాలాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లి, ఒక్కో ఎమ్మెల్యే రూ.100 కోట్ల నుంచి రూ.1,000 కోట్లు వరకూ సంపాదించారని జనచైతన్య వేదిక రాష్ట్ర అధ్యక్షుడు వి.లక్ష్మణరెడ్డి ఆరోపించారు. రాష్ట్రంలో ఒక్కో నియోజకవర్గంలో 25 కోట్లకు పైగా ఖర్చు చేసేందుకు వెనుకాడడం లేదని, నంద్యాల మోడల్ ఎన్నికలు నిర్వహించాలని చూస్తున్నారని అన్నారు. రాష్ట్రంలోని 3.6 కోట్ల ఓట్లల్లో 15 శాతం (60 లక్షల ఓట్లు) బోగస్ ఓట్లు కొనసాగుతున్నాయని, ఆ బోగస్ ఓట్లు అభ్యర్థుల గెలుపు ఓటములను నిర్దేశిస్తాయని చెప్పారు. దీనిపై ఎన్నికల సంఘం దృష్టి సారించాలని కోరారు. రాష్ట్రంలో అవినీతి శివతాండవం మాజీ సీఎస్ అజేయ కల్లాం పోడూరు: ఆంధ్రప్రదేశ్‌లో ప్రస్తుతం ఎక్కడ చూసినా అవినీతి శివతాండవం చేస్తోందని ప్రభుత్వ మాజీ ప్రధాన కార్యదర్శి’సీఎస్) అజేయ కల్లాం ఆందోళన వ్యక్తం చేశారు. పశ్చిమ గోదావరి జిల్లా పెనుమంట్ర మండలం మార్టేరులో ‘మనకోసం మనం’ ఆధ్వర్యంలో ఆదివారం నిర్వహించిన ప్రజాస్వామ్య పరిరక్షణ సదస్సులో ఆయన మాట్లాడారు. నిర్మాణంలో ఉన్న సాగునీటి ప్రాజెక్టుల అంచనా వ్యయాలను దోపిడీ కోసమే భారీగా పెంచుతున్నారని ధ్వజమెత్తారు. ప్రతి అభివృద్ధి పనిలోనూ 30 శాతం నుంచి 40 శాతం కమీషన్లు, లంచాలు రూపంలో దోపిడీ జరుగుతోందని చెప్పారు. ప్రజాస్వామ్య వ్యవస్థకు విరుద్ధంగా జరుగుతున్న ఈ పరిస్థితులన్నింటినీ చక్కదిద్దాల్సిన బాధ్యత ప్రజలందరిపై ఉందని పిలుపునిచ్చారు. -
పేదల ఇళ్ల నిర్మాణంలో వందల కోట్ల అవినీతి
సాక్షి, విశాఖపట్నం: జన్మభూమి కమిటీలు డబ్బు సంపాదన కోసమే ఏర్పాటయ్యాయని ఏపీ ప్రభుత్వ మాజీ ప్రధాన కార్యదర్శి(సీఎస్) అజయ్ కల్లం ఆరోపించారు. డబ్బు కోసం టీడీపీ ప్రభుత్వం అవినీతిని ప్రోత్సహిస్తోందని ఆయన మండిపడ్డారు. శుక్రవారం విశాఖలో సేవ్ ఆంధ్రప్రదేశ్- సేవ్ డెమోక్రసీ పేరిట సదస్సు నిర్వహించారు. ఈ సమావేశానికి అజయ్ కల్లం, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నేతలు, కార్మిక, ప్రజాసంఘాల నేతలు, తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా అజయ్ కల్లం మాట్లాడుతూ.. అవినీతి సంస్థాగతంగా వ్యవస్థీకృతమైందని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రధానంగా అవినీతికి ఎమ్మెల్యేలే మూలకారణమని అభిప్రాయపడ్డారు. పేదల ఇళ్ల నిర్మాణంలో వందల కోట్ల అవినీతి జరుగుతోందని ఆయన విమర్శించారు. ఏపీలో ఇసుక దోపిడి కోట్లల్లో సాగుతోందని ధ్వజమెత్తారు. టీడీపీ ప్రభుత్వం పోలవరం ప్రాజెక్ట్ అంచనా వ్యయాన్ని మూడు రెట్లు పెంచిందన్నారు. సీఎంతో సహా పదవుల్లో ఉన్న వారికి ప్రాజెక్టుల్లో ఆరు శాతం వాటాను కాంట్రాక్టర్లు ఇస్తున్నారని తెలిపారు. అలా సంపాదించిన డబ్బును ఎన్నికల్లో ఖర్చు చేయాలని ప్రభుత్వం చూస్తోందని అజయకల్లం దుయ్యబట్టారు. -
స్కీముల పేరుతో దోపిడి చేస్తున్నారు
-
రాష్ట్రం విడిపోదు : అశోక్‌బాబు
* రాహుల్, కేసీఆర్ తుగ్లక్‌లు: అశోక్‌బాబు * ఉద్వేగంతో కంటతడి పెట్టిన లగడపాటి * సోనియాకూ ఇందిరా, రాజీవ్ గతే: మోదుగుల * ముందు కేంద్రం క్షమాపణ చెప్పాలి: ఉండవల్లి * నేడు చివరి రోజు.. జాతీయ నేతల హాజరు న్యూఢిల్లీ నుండి సాక్షి ప్రత్యేక ప్రతినిధి: విభజన జరగదని, ఆపడానికి దేవుడు ఏదొక రూపంలో వస్తాడని సమైక్యాంధ్ర నేతలు ఆశాభావం వ్యక్తం చేశారు. ‘సేవ్ ఆంధ్రప్రదేశ్’ నినాదంతో ఢిల్లీలోని రామ్‌లీలా మైదానంలో ఏపీ ఎన్జీవో తలపెట్టిన రెండు రోజుల ధర్నా సోమవారం ప్రారంభమైంది. ఈ ధర్నాలో మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు, వివిధ జేఏసీల ప్రతినిధులు పాల్గొన్నారు. పార్లమెంటులో ఎలాంటి చర్చ లేకుండా మూజువాణి ఓటుతో రాష్ట్రాన్ని విభజించాలని కేంద్రం కుట్ర చేస్తోందని ఏపీ ఎన్జీవో అధ్యక్షుడు, సమైక్య రాష్ట్ర పరిరక్షణ వేదిక చైర్మన్ అశోక్‌బాబు ధ్వజమెత్తారు. ప్రజాస్వామికంగానే విభజనను అడ్డుకుని తీరతామన్నారు. మంగళవారం జాతీయ నేతలు ధర్నాలో పాల్గొంటారన్నారు. ‘రాహుల్, కేసీఆర్ తుగ్లక్‌లు. అందుకే తుగ్లక్ రోడ్డులోనే ఉంటున్నారు’ అని వ్యాఖ్యానించారు. పౌరుషం చూపితే పారిపోయారు: లగడపాటి ‘‘విభజన సమయానికి కచ్చితంగా పార్లమెంటులో అడుగుపెట్టి తీరుతా. నన్ను ఏ శక్తీ ఆపలేదు. తెలుగువాడి సత్తా ఏమిటో ఈ నెల 13న పార్లమెంటులో చూశారు. పౌరుషం చూపిస్తే అన్ని ప్రాంతాల ఎంపీలూ పార్లమెంటును విడిచిపెట్టి పారిపోయారు. విభజనను ఆపి తీరతాం. దానికి మన వ్యూహాలు మనకున్నాయి’’ అని ఎంపీ లగడపాటి రాజగోపాల్ చెప్పారు. ఈ సందర్భంగా ఆయన కంటతడి పెట్టారు. అడ్డగోలు విభజనకు పూనుకుంటున్న కేంద్రమే ముందుగా క్షమాపణ చెప్పాలని ఎంపీ ఉండవల్లి అరుణ్‌కుమార్ డిమాండ్ చేశారు. ‘‘అబల లాంటి ఆంధ్రాను కేంద్రం రేప్ చేయజూసినందుకే పెప్పర్ స్ప్రేను ఉపయోగించారు. అదేమీ తప్పు కాదు. ఆత్మరక్షణ చేసుకోవాలని ప్రభుత్వమే చెప్పింది. స్ప్రే వాడే పరిస్థితులు తెచ్చినందుకు కేంద్ర పాలకులు సిగ్గుపడాలి’’ అన్నారు. విభజనకు వ్యతిరేకంగా కేంద్ర మంత్రులంతా ఉద్యమించాలని మంత్రి టీజీ వెంకటేశ్ అన్నారు. కొత్త జంటను విడదీస్తే ఎంత పాపమో, విభజన కూడా అంతే పాపమని మరో మంత్రి కాసు కృష్ణారెడ్డి వ్యాఖ్యానించారు. విభజించడానికి వీళ్లెవరని మంత్రి గంటా శ్రీనివాసరావు ప్రశ్నించారు. విభజనను అడ్డుకోవడానికి దేవుడే వస్తాడని టీడీపీ ఎంపీలు శివప్రసాద్, మోదుగుల వేణుగోపాల్‌రెడ్డి అన్నారు. సిక్కుల మధ్య చిచ్చు పెట్టినందుకు ఇందిరాగాంధీకి, తమిళుల మధ్య చిచ్చు పెట్టినందుకు రాజీవ్‌గాంధీకి పట్టిన గతే ఇప్పుడు తెలుగువారి మధ్య చిచ్చు పెడుతున్న సోనియాకు కూడా పడుతుందని మోదుగుల హెచ్చరించారు. అన్నదమ్ములను విడదీసేది ఇలాగేనా అని టీడీపీ ఎంపీ నిమ్మల కిష్టప్ప ప్రశ్నించారు. ఎంపీ సబ్బంహరి, టీడీపీ నేతలు దేవినేని ఉమ, ధూళిపాళ్ల నరేంద్ర, సమైక్యాంధ్ర పరిరక్షణ వేదిక నేత చంద్రశేఖర్‌రెడ్డి, చలసాని శ్రీనివాస్ తదితరులు మాట్లాడారు. తుదిశ్వాస వరకు ‘సమైక్య’ పోరులో... సాక్షి, న్యూఢిల్లీ/నెల్లూరు: నెల్లూరు జిల్లాకు చెందిన ఏపీ ఎన్జీవో నేత చిరమన దామోదర జోషి గుండెపోటుతో మృతి చెందారు. రామ్‌లీలా మైదానంలో ఉదయం ధర్నా మొదలవుతున్న సమయంలో ఆయన గుండెపోటుకు గురయ్యారు. లోక్‌నాయక్ జయప్రకాశ్ ఆసుపత్రికి తీసుకెళ్తుండగా మార్గమధ్యలోనే కన్నుమూశారు. దీనిపై వక్తలంతా సంతాపం తెలిపారు. జోషి కుటుంబసభ్యులకు ఎంపీలు సుజనా చౌదరి రూ. 3 లక్షలు, కేవీపీ రామచంద్రరావు రూ. 2 లక్షల పరిహారం ప్రకటించారు. టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు ఒక ప్రకటనలో విచారం వ్యక్తం చేశారు. జోషి కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలిపారు. మునుబోలు ఎంపీడీవో కార్యాలయం సూపరింటెండెంట్‌గా పనిచేస్తున్న జోషి నెల్లూరు జ్యోతినగర్‌లో భార్య, ఇద్దరు పిల్లలతో నివాసం ఉంటున్నారు. ఏపీ పంచాయతీరాజ్ మినిస్టీరియల్ స్టాఫ్ అసోసియేషన్ రాష్ట్ర ఉపాధ్యక్షుడిగా, ఏపీ ఎన్జీవో సంఘం జిల్లా ఉపాధ్యక్షుడిగా కీలక బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. సకల జనుల సమ్మె విజయవంతమవడంలో కీలకపాత్ర పోషించారు. విభజనకు వ్యతిరేకంగా ఢిల్లీలో తలపెట్టిన ధర్నాకు సంబంధించి నెల్లూరు జిల్లా నుంచి ఏర్పాట్లన్నీ జోషియే దగ్గరుండి చూసుకున్నారు. రైల్లో ఢిల్లీ వెళ్లిన ఆయన చివరకు సమైక్య పోరులోనే అసువులుబాశారు. జోషి భార్య నెల్లూరులోని మున్సిపల్ పాఠశాలలో టీచర్‌గా పనిచేస్తున్నారు. -
3వ రోజూఅదే సీన్..
* స్తంభించిన పార్లమెంటు ఉభయ సభలు * సమైక్యాంధ్ర నినాదాలతో హోరెత్తిన లోక్‌సభ * వైఎస్సార్సీపీ సహా 3 అవిశ్వాస తీర్మానం నోటీసులు * రాజ్యసభలోనూ సేమ్ సీన్ సాక్షి, న్యూఢిల్లీ: పార్లమెంటు ఉభయ సభలూ వరుసగా మూడోరోజు కూడా సమైక్యాంధ్ర, సేవ్ ఆంధ్రప్రదేశ్ నినాదాలతో దద్దరిల్లాయి. సీమాంధ్ర ప్రాంతానికి చెందిన ఎంపీలు సభలను స్తంభింపజేశారు. దీంతో పొడిగించిన శీతాకాల సమావేశాల మొదటివారం ఎలాంటి కార్యక్రమాలు చేపట్టకుండా పూర్తిగా తుడిచిపెట్టుకు పోయినట్టయింది. శుక్రవారం లోక్‌సభలో వైఎస్సార్సీపీ యూపీఏ ప్రభుత్వంపై అవిశ్వాస తీర్మానం నోటీసు ఇవ్వడంతోపాటు, దీనిపై చర్చ కోరుతూ వాయిదా తీర్మానం కూడా ఇచ్చింది. పార్టీ ఎంపీ మేకపాటి రాజమోహన్‌రెడ్డితో పాటు కాంగ్రెస్ ఎంపీ జి.వి.హర్షకుమార్, టీడీపీ ఎంపీ మోదుగుల వేణుగోపాల్‌రెడ్డి కూడా ప్రభుత్వంపై అవిశ్వాస తీర్మానం నోటీసులు ఇచ్చారు. * ఉదయం 11 గంటలకు స్పీకర్ మీరాకుమార్ ప్రశ్నోత్తరాల సమయాన్ని ప్రారంభించగానే సభలో సమైక్యాంధ్ర నినాదాలు హోరెత్తాయి. ఇదే సమయంలో మంత్రి చిరంజీవి తన శాఖకు చెందిన నివేదికను ప్రవేశపెట్టారు. * వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎంపీలు వై.ఎస్.జగన్మోహన్రెడ్డి, మేకపాటి రాజమోహన్‌రెడ్డి, ఎస్పీవెరైడ్డిలు వెల్‌లోకి దూసుకువెళ్లి సమైక్య నినాదాలు చేశారు. కాంగ్రెస్ ఎంపీ లగడపాటి రాజగోపాల్, టీడీపీ ఎంపీ నిమ్మల కిష్టప్ప తదితరులు కూడా నినాదాలు చేశారు. * ఇతర రాష్ట్రాలకు చెందిన పలువురు ఎంపీలు తమ ప్రాంత సమస్యలపై వెల్‌లో ఆందోళనకు దిగారు. ఈ గందరగోళం మధ్యే స్పీకర్ ప్రశ్నోత్తరాల సమయాన్ని కొనసాగించారు. * నినాదాలు కొనసాగుతూ సభ అదుపులోకి రాకపోవడంతో తొలుత మధ్యాహ్నం 12 గంటల వరకు సభ వారుుదా పడింది. తిరిగి సమావేశమైన తర్వాత కూడా వెల్‌లో వైఎస్సార్సీపీ సభ్యులు సమైక్యాంధ్ర నినాదాలు హోరెత్తించగా మరోవైపు తెలంగాణ ఎంపీ పొన్నం ప్రభాకర్ తదితరులు తెలంగాణ నినాదాలు చేశారు. * ఈ సమయంలోనే స్పీకర్ అవిశ్వాస తీర్మానం నోటీసులు ప్రస్తావించారు. సభ అదుపులో లేకపోవడంతో వాటిని పరిశీలించలేక పోతున్నానని ప్రకటించారు. ఆ తర్వాత కూడా పరిస్థితిలో మార్పు లేకపోవడంతో లోక్‌సభను సోమవారానికి వాయిదా వేశారు. * రాజ్యసభలో కూడా ఇదే పరిస్థితి నెలకొంది. చైర్మన్ హమీద్ అన్సారీ మాట్లాడుతూ ‘రోజూ సభ్యులు వెల్‌లోకి వచ్చి నినాదాలు చేస్తుండడంతో సభాకార్యక్రమాలకు అంతరాయం కలుగుతోంది. సభ కొనసాగేందుకు సహకరించాలి’ అని విజ్ఞప్తి చేశారు. సభ్యులు విన్పించుకోకుండా నినాదాలు కొనసాగిస్తుండటంతో తొలుత 2.30 గంటల వరకు, తర్వాత సోమవారానికి రాజ్యసభ వారుుదా పడింది. * తమిళ జాలర్లపై శ్రీలంక నౌకాదళ వేధింపుల అంశం కూడా పార్లమెంటు ఉభయ సభల్లోనూ గందరగోళానికి కారణమయింది. జాతీయ నేతలతో జగన్ భేటీ వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు, ఎంపీ వై.ఎస్.జగన్మోహన్రెడ్డి శుక్రవారం పార్లమెంటులో పలువురు జాతీయ పార్టీల నేతలను కలసి సమైక్యాంధ్రకు మద్దతు ఇవ్వాలని కోరారు. జేడీయూ నేత శరద్ యాదవ్, ఎన్సీపీ నేత శరద్‌పవార్, బీజేడీ ఎంపీ జయ్ పండాలను విడివిడిగా కలసి మద్దతు కోరారు. -
మూడన్నర గంటల ముచ్చట !
-
మూడన్నర గంటల ముచ్చట !
హస్తినలో సీఎం కిరణ్‌కుమార్‌రెడ్డి దీక్ష 12.45 ప్రారంభం.. 4.15 ముగింపు పీసీసీ చీఫ్ బొత్స, సీమాంధ్ర మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు, నేతల హాజరు జాడలేని మంత్రులు కన్నా, పితాని, డొక్కా న్యూఢిల్లీ నుంచి సాక్షి ప్రత్యేక ప్రతినిధి:‘‘ప్రజాస్వామ్యాన్ని కాపాడండి.. ఆంధ్రప్రదేశ్‌ను రక్షించండి’’ నినాదంతో ముఖ్యమంత్రి ఎన్.కిరణ్‌కుమార్‌రెడ్డి బుధవారం ఢిల్లీలో దీక్ష నిర్వహించారు. మధ్యాహ్నం 12.45 గంటలకు ప్రారంభమైన దీక్ష సాయంత్రం 4.15 గంటలకల్లా ముగిసింది. రాష్ట్ర ఉభయ సభలు తిరస్కరించిన ఆంధ్రప్రదేశ్ పునర్వ్యవస్థీకరణ బిల్లు-2013ను పార్లమెంటులో ప్రవేశపెట్టొద్దని కోరుతూ జంతర్‌మంతర్ వద్ద చేపట్టిన ఈ దీక్షకు సీమాంధ్ర ప్రాంత మంత్రులు, ప్రజాప్రతినిధులు పెద్ద సంఖ్యలో తరలివచ్చారు. 16 మంది మంత్రులు, 50 మందికిపైగా ఎమ్మెల్యేలు, 20 మందికిపైగా ఎమ్మెల్సీలు, ఇతర నాయకులతో వేదిక నిండిపోయింది. కాంగ్రెస్ పాలిత రాష్ట్ర ముఖ్యమంత్రి కేంద్రానికి వ్యతిరేకంగా ధర్నా చేస్తున్నారనే సమాచారంతో జాతీయ, రాష్ట్ర మీడియా జంతర్‌మంతర్ వద్ద మోహరించింది. పీసీసీ అధ్యక్షుడు బొత్స సత్యనారాయణ, కేంద్ర మంత్రులు పళ్లంరాజు, చిరంజీవి, కోట్ల సూర్యప్రకాశ్‌రెడ్డి, కావూరి సాంబశివరావు, పురందేశ్వరి, ఎంపీలు లగడపాటి రాజగోపాల్, మాగుంట శ్రీనివాసులరెడ్డి, అనంత వెంకట్రామిరెడ్డి, ఉండవల్లి అరుణ్‌కుమార్, రాయపాటి సాంబశివరావు, హర్షకుమార్, కేవీపీ రామచంద్రరావు, టి.సుబ్బిరామిరెడ్డి, సాయిప్రతాప్, మంత్రులు పార్థసారథి, శైలజానాథ్, ఆనం రామనారాయణరెడ్డి, అహ్మదుల్లా, తోట నర్సిం హులు, మహీధర్‌రెడ్డి, టీజీ వెంకటేశ్, కాసు కృష్ణారెడ్డి, గంటా శ్రీనివాసరావు, ఏరాసు ప్రతాప్‌రెడ్డి, గల్లా అరుణ, బాలరాజు, వట్టి వసంత్‌కుమార్, కోండ్రు ము రళి, శత్రుచర్ల విజయరామరాజు, పలువురు ఎమ్మెల్యే లు, ఎమ్మెల్సీలు దీక్షలో పాల్గొన్నారు. మంత్రులు కన్నా లక్ష్మీనారాయణ, పితాని సత్యనారాయణ, డొక్కా మాణిక్యవరప్రసాద్ మాత్రం ఎక్కడా కానరాలేదు. రాజ్‌ఘాట్ వద్ద నివాళి.. జంతర్‌మంతర్ దీక్షకు బయలుదేరేముందు సీమాంధ్ర ప్రాంత మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలతో ముఖ్యమంత్రి ఏపీభవన్‌లో ప్రత్యేక మంతనాలు జరిపారు. దీక్ష అనంతరం రాష్ట్రపతి దృష్టికి తీసుకెళ్లాల్సిన అంశాలపై చర్చించారు. అక్కడే ప్రణబ్‌కు అందించేందుకు నాలుగు పేజీల లేఖను సిద్ధం చేశారు. మధ్యాహ్నం 12.20 గంటల సమయంలో రాజ్‌ఘాట్ వద్ద మహాత్మునికి నేతలతో కలిసి సీఎం నివాళులర్పించారు. చిరంజీవి, పురందేశ్వరిలు రాజ్‌ఘాట్‌కు వచ్చి కిరణ్‌తో కొద్దిసేపు ముచ్చటించారు. -
లోక్‌సభలో జగన్ సేవ్ ఆంధ్రప్రదేశ్ నినాదాలు
-
లోక్‌సభలో జగన్ సేవ్ ఆంధ్రప్రదేశ్ నినాదాలు
న్యూఢిల్లీ : వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి సమైక్యాంధ్రకు మద్దతుగా మరోసారి గళమెత్తారు. దాంతో సేవ్ ఆంధ్రప్రదేశ్... జై సమైక్యాంధ్ర నినాదాల మధ్య... లోక్‌సభ రేపటికి వాయిదా పడింది. రాష్ట్రాన్ని సమైక్యంగా ఉంచాలని డిమాండ్ చేస్తూ వైఎస్ జగన్ మోహన్ రెడ్డి, ఎంపీలు మేకపాటి రాజమోహన్ రెడ్డి, ఎస్పీవై రెడ్డి మంగళవారం సభలో ప్లకార్డులు ప్రదర్శించారు. స్పీకర్ పోడియం ముందు నిరసన నినాదాలు చేశారు. సేవ్ ఆంధ్రప్రదేశ్ అంటూ జగన్‌తో పాటు ఎంపీలు నినదించారు. ఈ గందరగోళం మధ్యే మంత్రులు, వివిధ కమిటీల సభ్యులు నివేదికలను సభకు సమర్పించారు. దాదాపు 15 నిమిషాల సేపు నివేదికల సమర్పణ కార్యక్రమం కొనసాగింది. అవిశ్వాస తీర్మానాలపై 50 మంది సభ్యుల్ని లెక్కించేందుకు సహకరించాలని ఆందోళన చేస్తున్న సభ్యులను స్పీకర్ కోరారు. అయితే వారెవరూ పట్టించుకోకపోవడంతో సభను రేపటికి వాయిదా వేశారు. అటు రాజ్యసభలో లోక్‌పాల్ బిల్లుపై చర్చ ప్రారంభమైంది. బిల్లును తీవ్రంగా వ్యతిరేకిస్తున్న సమాజ్‌వాదీ పార్టీ సభ్యులు తమ అభిప్రాయాన్ని సభకు తెలిపారు. అంతకు ముందు ప్రధాని మన్మోహన్ సింగ్... సమాజ్‌వాదీ పార్టీ అధ్యక్షుడు ములాయం సింగ్ యాదవ్‌తో సమావేశమయ్యారు. లోక్‌పాల్ బిల్లు ఆమోదం పొందేందుకు సహకరించాలని విజ్ఞప్తి చేశారు. ఈ సమావేశంలో కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియా గాంధీ, కేంద్ర హోం మంత్రి సుశీల్ కుమార్ షిండే కూడా పాల్గొన్నారు. -
సీమాంధ్ర ఎంపీలు అమ్ముడుపోయారు..
= ఏపీ ఎన్జీవో అధ్యక్షుడు అశోక్‌బాబు ఆగ్రహం = ఎంపీలు ప్యాకేజీల పాఠం వల్లించడంపై మండిపాటు = మూడు గంటలపాటు సేవ్ ఆంధ్రప్రదేశ్ సభ సాక్షి, విజయవాడ/ ఉయ్యూరు : సీమాంధ్ర ఎంపీలు ప్యాకేజీలకు అమ్ముడుపోయారని ఏపీ ఎన్జీవో అధ్యక్షుడు పి.అశోక్‌బాబు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇలాంటి రాజకీయ నాయకులను తన జీవితంలో ఎప్పుడూ చూడలేదని మండిపడ్డారు. ఉయ్యూరులో ఆదివారం జరిగిన ‘సేవ్ ఆంధ్రప్రదేశ్’ సభకు ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు. కేసీపీ చక్కెర కర్మాగారం ఉద్యోగులు సహా విద్యార్థులు, వివిధ వర్గాల ప్రజలు తరలివచ్చిన ఈ సభ మూడు గంటలపాటు జరిగింది. సభలో అశోక్‌బాబు ఉద్వేగంగా మాట్లాడారు. కేంద్రంలో కాంగ్రెస్‌కు తగు బలం లేని కారణంగా ఎన్నికల వరకు విభజన జరగదని, ఎన్నికల తర్వాత సమైక్యంగా ఉంచడం ప్రధాన కర్తవ్యమని చెప్పారు. వచ్చే ఎన్నికలు కీలకమైనవని పదేపదే తెలిపారు. వచ్చే ఎన్నికల్లో ఆచితూచి వ్యవహరించాలని హితవు పలికారు. కులం, వర్గం, పార్టీలను బట్టి కాకుండా సమైక్యానికి ఎవరు ముందుంటారో వారిని ఎన్నుకోవాలని సూచించారు. పలుమార్లు ఆయన వచ్చే ఎన్నికలను ప్రస్తావించడం... ఓటును తూటాల్లా వాడాలని చెప్పడం సభలో చర్చనీయాంశమైంది. రాజకీయ నాయకులను ఆయన ఎక్కువగా టార్గెట్ చేసుకొని ప్రసంగించారు. వారి స్వార్థాన్ని ఎండగట్టే ప్రయత్నం చేశారు. ఉయ్యూరు సభను విజయవంతం చేసేందుకు ఉద్యోగులు, వివిధ వర్గాల ప్రజలు కృషిచేశారు. రాజకీయ సమాధి కట్టాలి... తెలుగు జాతికి వెన్ను పోటు పోడుస్తున్న నాయకులకు రాజకీయ భవిష్యత్ లేకుండా చేయాలని మేధావుల వేదిక రాష్ట్ర కన్వీనర్ చలసాని శ్రీనివాస్ సూచించారు. మనవేలితో మనకన్నే పొడిచేందుకు ప్యాకేజీలతో మీ ముందుకు వస్తున్నారు మోసపోవద్దు అని హితవు పలికారు. ‘సమైక్య ఉద్యమాన్ని చంపేయాలన్న దుర్మార్గాలు పన్నుతున్న కేంద్ర మంత్రులు, ఎంపీలను తిరగనివ్వకండి.. ప్యాకేజీలకు తలొగ్గి పార్లమెంట్, అసెంబ్లీలో బిల్లుకు అనుకూలంగా ఓటు వేసి విదేశాలకు వెళ్లి తలదాచుకునే దొంగలు ఉన్నారు.. వీరందరికీ పౌరసన్మానం చేసి వారి ఇళ్లను ముట్టడించండి’ అంటూ పిలుపునిచ్చారు. కేంద్ర మంత్రులు పనబాక లక్ష్మి, పురందేశ్వరి సమైక్యాంధ్రకు ద్రోహం తలపెట్టారని విమర్శించారు. ‘తన ఇంటి పక్కన వ్యక్తికి రేషన్‌కార్డు, తన ఊళ్లో 50 పడకల ఆస్పత్రిని ఏర్పాటు చేసుకోలేని పనబాక సీమాంధ్రను మరో సింగపూర్ చేస్తుందట.. వీరి మాటలు నమ్మితే భవితరాలు మనల్ని క్షమించరు.. ఇది యుద్ధ సమయం.. సకల జనులు మరో స్వాతంత్రోద్యమానికి సన్నద్ధం కావాలి’ అని సూచించారు. ఉద్యమానికి తూట్లు పొడవటం దుర్మార్గం.. తెలుగువారి ఆత్మగౌరవ నినాదంతో ఎన్టీఆర్ స్థాపించిన టీడీపీకి అధ్యక్షుడిగా వ్యవహరిస్తున్న చంద్రబాబు నాయుడు రాష్ట్ర విభజనకు లేఖ ఇవ్వటం, ఎన్టీఆర్ తనయ పురందేశ్వరి ప్యాకేజీలు కావాలంటూ సమైక్య ఉద్యమానికి తూట్లు పొడిచే విధంగా వ్యవహరించటం దుర్మార్గమని వ్యవసాయ శాఖ రాష్ట్ర మాజీ మంత్రి వడ్డే శోభనాద్రీశ్వరరావు మండిపడ్డారు. సీమాంధ్ర ఎంపీలు డ్రామాలు కట్టిపట్టి రాజీనామాలు చేస్తే విభజన ఆగిపోతుందని స్పష్టంచేశారు. విభజన కోసమే రాష్ట్రాన్ని విభజించటం సరికాదని మొదటి ఎస్సారీలో స్పష్టంగా పేర్కొన్నారని చెప్పారు. ప్రాంతీయ కమిటీ వేసి తెలంగాణ అభివృద్ధికి కృషి చేయాలని శ్రీకృష్ణకమిటీ తన నివేదికలో స్పష్టంగా సూచించిందన్నారు. రాష్ట్రాన్ని సమైక్యంగానే ఉంచాలని, ఇరు ప్రాంతాల ప్రజల ఆమోదం లేకుండా విభజన ప్రక్రియ ప్రారంభిస్తే సమస్యలు ఉత్పన్నమవుతాయని కమిటీ నివేదికలో పొందుపరిచారని వివరించారు. కమిటీ నివేదికను కేంద్రం పక్కనపెట్టి విభజన చర్యలు ప్రారంభించిందని మండిపడ్డారు. రాష్ట్రం ముక్కలైతే నీటి యుద్ధాలు జరుగుతాయని, చుక్కనీరు కూడా డెల్టాకు వచ్చే అవకాశం లేదని, రైతులంతా రోడ్డెక్కి ఉద్యమించాలని పిలుపునిచ్చారు. రెవెన్యూ సర్వీసెస్ రాష్ట్ర అధ్యక్షుడు కొప్పరాజు వెంకటేశ్వరరావు మాట్లాడుతూ ప్రజాప్రతినిధులను నిలదీసి ఉద్యమాన్ని తీవ్రతరం చేయాలన్నారు. ఆర్టీసీ ఉద్యోగుల జోనల్ కార్యదర్శి వైవీ రావు మాట్లాడుతూ విభజిస్తే ఆర్టీసీకి సంబంధించి విద్యార్థులు రాయితీలు కోల్పోతారన్నారు. ఏపీ ఎన్జీవోల సంఘం జిల్లా అధ్యక్షుడు ఎ.విద్యాసాగర్ మాట్లాడుతూ ప్రజా ఉద్యమంతోనే సమైక్యాంధ్ర సాధించుకోగలుగుతామని స్పష్టం చేశారు. సభలో ఏపీ ఎన్జీవోల సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి చంద్రశేఖర్‌రెడ్డి, కేసీపీ సీవోవో జి.వెంకటేశ్వరరావు, అడ్వకేట్ జేఏసీ నేత నరహరిశెట్టి శ్రీహరి తదితరులు ప్రసంగించారు. కార్యక్రమాన్ని ఉయ్యూరు జేఏసీ కన్వీనర్ పరుచూరి శ్రీనివాసరావు పర్యవేక్షించారు. దాడులకు పాల్పడితే ఖబడ్దార్... ఉయ్యూరు : సమైక్యవాదులపై, ఉద్యోగులు, విద్యాసంస్థలపై దాడులకు పాల్పడితే సహించేది లేదని సమైక్యాంధ్ర పరిరక్షణవేదిక రాష్ట్ర అధ్యక్షుడు పర్చూరి అశోక్‌బాబు హెచ్చరించారు. మంత్రులైనా, ఎమ్మెల్యేలైనా సరే పరిధి మించి వ్యవహరిస్తే తాము అదే స్థాయిలో ప్రతిఘటించాల్సి వస్తుందని స్పష్టం చేశారు. జిల్లాలో సమైక్యాంధ్ర ఉద్యమానికి అండగా నిలుస్తున్న విద్యాసంస్థలు, ఉద్యమంలో చురుగ్గా వ్యవహరిస్తున్న ఉద్యోగులపై దాడులు, బెదిరింపులకు ప్రజాప్రతినిధులు పాల్పడుతున్నారని సభలో కొందరు అశోక్‌బాబు దృష్టికి తీసుకొచ్చారు. ఇటీవలే నూజివీడులో అక్కడి జేఏసీ కన్వీనర్ కుమార్ విషయంలో పోలీసులు అనుచితంగా వ్యవహరించారని, అతని విద్యాసంస్థలపై దాడులు చేసి బెదిరిస్తున్నారని ఆవేదన వ్యక్తంచేశారు. దీనిపై అశోక్‌బాబు స్పందిస్తూ తీవ్రస్థాయిలో వ్యాఖ్యలు చేశారు. విద్యాసంస్థలపై, ఉద్యోగులపై దాడులకు పాల్పడితే తీవ్ర పరిణామాలు ఎదుర్కోవాల్సి వస్తుందని అన్నారు. మంత్రులనైనా, ఎమ్మెల్యేలైనా సరే వదిలే ప్రసక్తే లేదన్నారు. సమైక్యాంధ్ర ద్రోహులుగా వ్యవహరించే ఏ ఒక్కరినీ వదలబోమని స్పష్టం చేశారు. నూజివీడులో ఇటీవల చోటుచేసుకున్న ఘటనను తీవ్రంగా ఖండిస్తున్నట్లు చెప్పారు. -
22న అమలాపురంలో సేవ్ ఆంధ్రప్రదేశ్ సభ
అమలాపురం, న్యూస్‌లైన్ : సమైక్యాంధ్ర ఉద్యమంలో భాగంగా అమలాపురంలో ఈనెల 22న సేవ్ ఆంధ్రప్రదేశ్ సభను నిర్వహించాలని కోనసీమ జేఏసీ నిర్ణయించింది. ఆదివారం రాత్రి జిల్లా జేఏసీ అధ్యక్షుడు బూరిగ ఆశీర్వాదం, కార్యదర్శి పితాని త్రినాధరావు ఆధ్వర్యంలో అమలాపురం కాటన్ అతిథిగృహంలో కోనసీమ జేఏసీ అధ్యక్షుడు వి.ఎస్.దివాకర్ అధ్యక్షతన కోనసీమ జేఏసీ ముఖ్యనేతల సమావేశం జరిగింది. అమలాపురం బాలయోగి ఘాట్‌లో ఈనెల 22న మధ్యాహ్నం రెండు గంటల నుంచి సాయంత్రం ఆరింటి వరకు సభ నిర్వహించాలని సమావేశం నిర్ణయించింది. లక్షమందికి పైగా జనాన్ని సమీకరించేందుకు కమిటీలు ఏర్పాటు చేయనున్నారు. ఏపీఎన్జీఓల సంఘ అధ్యక్షుడు అశోక్‌బాబును ఈ సభకు ఆహ్వానించారు. -
గర్జించిన సమైక్య ఉద్యమం
=గుడివాడలో సేవ్ ఆంధ్రప్రదేశ్ సభ విజయవంతం =చల్లపల్లిలో సకల జనుల గర్జన =నూజివీడులో విద్యార్థి గర్జన =వైఎస్సార్సీపీ ఆధ్వర్యంలో సమైక్య ప్రతిజ్ఞలు =పంచాయతీల్లో తీర్మానాలు రాష్ట్ర అవతరణ దినోత్సవం రోజున సమైక్య ఉద్యమం హోరెత్తింది. ఎన్జీవోల ఆధ్వర్యంలో గుడివాడలో జరిగిన సేవ్ ఆంధ్రప్రదేశ్ సభకు ఆ సంఘ రాష్ట్ర అధ్యక్షుడు పి.అశోక్‌బాబు హాజరయ్యారు. చల్లపల్లిలో సకలజనుల గర్జన, నూజివీడులో విద్యార్థి గర్జన మిన్నంటాయి. వైఎస్సార్సీపీ ఆధ్వర్యంలో సమైక్య ప్రతిజ్ఞలు, పాలాభిషేకాలు నిర్వహించారు. విభజనాసురుల దిష్టిబొమ్మలు దహనం చేశారు. వైఎస్సార్సీపీ పిలుపుమేరకు సమైక్యాంధ్రకు మద్దతుగా పలు పంచాయతీలు తీర్మానం చేశాయి. సాక్షి, గుడివాడ/ విజయవాడ : ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అవతరణ దినోత్సవం నాడు సమైక్యాంధ్ర ఆకాంక్ష మరోసారి ఆకాశాన్నంటింది. జిల్లా అంతటా సమైక్యాంధ్రకు మద్దతుగా ఆందోళనలు హోరెత్తాయి. గుడివాడ గుండె ఘోష గుడివాడ గుండె సమైక్య సింహనాదంతో ఘోషించింది. పట్టణ నడిబొడ్డున ఉన్న ఎన్టీఆర్ స్టేడియం జనసంద్రమైంది. అమరజీవి పొట్టి శ్రీరాములు ప్రాంగణం నూతనోత్తేజంతో ఉప్పొంగింది. జాతీయపతాక రూపశిల్పి, ఈ జిల్లావాసి పింగళి వెంకయ్య సభావేదిక సమైక్య ఉద్యమానికి బహుముఖ వ్యూహంతో కార్యాచరణను ఖరారు చేసింది. ఉవ్వెత్తున ఎగసిపడిన ఉద్యోగుల సమ్మె అనంతరం తొలిసారి గుడివాడలో జరిగిన సేవ్ ఆంధ్రప్రదేశ్ మహాసభ సమైక్య ఉద్యమాన్ని హోరెత్తించింది. ఉద్యోగుల సమ్మె విరమణతో ఉద్యమం ఆగిపోయిందన్న ప్రచారానికి చెక్ పెడుతూ ఈ సభ స్పష్టతనిచ్చింది. తమ సమ్మె విరమణ తాత్కాలికమేనని, ఇది విశ్రాంతి మాత్రమేనని మరోమారు బహుముఖ వ్యూహంతో సమ్మెను కొనసాగిస్తామంటూ ఏపీ ఎన్జీఓ రాష్ట్ర అధ్యక్షుడు, ఆంధ్రప్రదేశ్ పరిరక్షణ సమితి అధ్యక్షుడు పరుచూరి అశోక్‌బాబు సమక్షంలో ఉద్యోగ సంఘాల నాయకులు ప్రతినబూనారు. గుడివాడ సమైక్య ఉద్యమ జేఏసీ ఆధ్వర్యంలో నిర్వహించిన సభ విజయవంతం కావడంతో పాటు పలువురు సంఘాల నాయకులు ఉద్యమానికి దిశానిర్దేశం చేశారు. జిల్లాలో రానున్న కాలంలో ఉద్యమాన్ని మరింత తీవ్రతరం చేసేలా కార్యాచరణ రూపొందించారు. ఈ నవంబరు, డిసెంబరు మాసాల్లో గ్రామగ్రామాన ఉద్యమనేతలు పర్యటించి రైతులు, ఉద్యోగులతో సమన్వయ కమిటీలను ఏర్పాటు చేయాలని సూచించారు. రైతులు, ఉద్యోగులు కలిస్తే రాజకీయనేతల గతినే మార్చేస్తారని, రానున్న కాలంలో సమైక్యవాదంతో నిలిచే పార్టీలకే మద్దతు తెలిపేలా ప్రజలను సమాయత్తం చేయాలని మహాసభ సూచించింది. రాష్ట్ర విభజన వలన కలిగే నష్టాన్ని తొలిదశ ఉద్యమంతోనే ప్రజలకు వివరించగలిగామని, మలిదశ ఉద్యమంతో సమైక్యవాదం కాపాడుకునేలా కార్యాచరణ ఉండాలని మహాసభ తీర్మానించింది. ఇప్పటివరకు గాంధీమార్గంలో జరిగిన ఉద్యమ తీవ్రతను రానున్న కాలంలో ఢిల్లీ గద్దెను గడగడలాడించేలా బహుముఖ రూపాల్లో కొనసాగించాలని మహాసభ నిర్ణయించింది. గుడివాడ మహాసభ ఇంత విజయవంతంగా నిర్వహించడం ఈ జిల్లావాడిగా గర్విస్తున్నానని, తాను గుడివాడలోనే ఓనమాలు దిద్దామని అశోక్‌బాబు అన్నారు. మహాసభలో మాట్లాడిన ఉద్యోగ, కార్మిక, కర్షక, మేధావుల, నిపుణులు మాట్లాడుతూ రాష్ట్ర విభజనతో ఆయా రంగాల్లో సీమాంధ్రకు జరిగే నష్టాన్ని వివరించారు. తూర్పు కృష్ణా జేఏసీ చైర్మన్ ఉల్లి కృష్ణ అధ్యక్షతన జరిగిన మహాసభలో ఏపీ ఎన్జీఓ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఎం.చంద్రశేఖరరెడ్డి, వెస్ట్ కృష్ణా అధ్యక్షుడు ఎ.విద్యాసాగర్, రాష్ట్ర రెవెన్యూ అసోసియేషన్ జేఏసీ కన్వీనర్ బొప్పరాజు వెంకటేశ్వర్లు, ఆంధ్ర మేధావుల ఫోరం కన్వీనర్ చలసాని శ్రీనివాస్, రాష్ట్ర మాలమహానాడు అధ్యక్షుడు కారెం శివాజీ, ఎమ్మార్పీఎస్ రాష్ట్ర నాయకుడు పి.వెంకటేశ్వరరావు మాదిగ, మున్సిపల్ అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షుడు ఎస్.కృష్ణమోహన్, రైతాంగ సమాఖ్య రాష్ట్ర అధ్యక్షుడు ఎర్నేని నాగేంద్రనాధ్, చలసాని ఆంజనేయులు, జలవనరుల నిపుణుడు పి.ఎ.రామకృష్ణంరాజు, జిల్లా జేఏసీ కోకన్వీనర్ మండలి హనుమంతరావు, గుడివాడ జేఏసీ చైర్మన్ యార్లగడ్డ వెంకటేశ్వరప్రసాద్, ఎన్జీఓస్ డివిజన్ అధ్యక్ష, కార్యదర్శులు షేక్ ఫరీద్‌బాషా, జి.రాజేంద్రప్రసాద్, డి.శ్రీనివాస్, పొట్లూరి గంగాధరరావు, ఎం.ప్రసాద్, వై.వి.రావు, కె.సత్యానందం, బి.అన్నపూర్ణ, ఎండీ ఇక్బాల్, నరహరశెట్టి శ్రీహరి, వరలక్ష్మి తదితరులు మాట్లాడారు. -
గతం మరచిన తెలంగాణ నేతలు
సాక్షి, అనంతపురం : తెలంగాణ వాసులు గతం మరచి మాట్లాడుతున్నారని ఎపీ ఎన్జీఓ రాష్ట్ర అధ్యక్షుడు పరుచూరి అశోక్‌బాబు మండిపడ్డారు. సోమవారం అనంతపురం జిల్లా హిందూపురం ఎంజీఎం మైదానంలో ‘సేవ్ ఆంధ్రప్రదేశ్ పేరిట జరిగిన లేపాక్షి బసవన్న రంకె’ బహిరంగసభకు ఆయన హాజరై మాట్లాడారు. 1956కు ముందు తెలంగాణ వాసులు నిజాం నిరంకుశ పాలనలో నలిగిపోయారని, ఆప్పట్లో అందరూ కూలీలే తప్ప సెంటు భూమి ఉన్న రైతులు లేరని అన్నారు. తెలంగాణ సాయుధ పోరాటంలో రాయలసీమ వాసులు కూడా పాల్గొని నిజాం పాలనను అంతమొందించి.. వారికి విముక్తి కల్పించారన్నారు. అప్పటి నుంచి సీమాంధ్ర ప్రాంత వాసులు ఇక్కడ సంపాదించి అక్కడ పెట్టుబడులు పెట్టడంతోనే హైదరాబాద్, దాని చుట్టూ ఉన్న జిల్లాలు అన్ని విధాలా అభివృద్ధి చెందాయన్నారు. వాస్తవానికి తెలంగాణలో ఒక్క అదిలాబాద్ తప్ప మిగిలిన 9 జిల్లాలు అభివృద్ధి చెందాయన్నారు. అయితే దేశంలోనే అనంతపురం జిల్లా అత్యంత వెనకబడిన ప్రాంతమన్నారు. గతంలో సీమాంధ్ర ప్రాంతంలో గంజి కేంద్రాలు ఏర్పాటు చేసిన చరిత్ర కూడా ఉందన్నారు. ఇలాంటి సందర్భాలు తెలంగాణలో ఏనాడు తలెత్తలేదన్నారు. హైదరాబాద్ అందరికి సంబంధించినదే తప్ప.. తెలంగాణ వారి సొత్తేం కాదన్నారు. భాగ్యనగరాన్ని కేంద్రపాలిత రాష్ట్రంగా చేయడానికి గానీ, ఉమ్మడి రాజధానిగా చేయడానికి కానీ, తెలంగాణకు అప్పగించడానికి కానీ ఒప్పుకునే ప్రసక్తే లేదన్నారు. తమకు కావాల్సింది.. 23 జిల్లాలతో కూడిన సమైక్య రాష్ట్రమేనన్నారు. రాష్ట్రాన్ని విభజించడానికి కుట్రపన్నిన ప్రభుత్వాలకు, పార్టీలకు రాయలసీమ పౌరుషాన్ని ఒక సారి రుచి చూపిద్దామని పిలుపునిచ్చారు. తమ మాటలు మెత్తగా ఉంటాయని, అంత మాత్రాన తాము చేతకాని వారం కాదన్నారు. తమలో కూడా ఒక అల్లూరి సీతారామరాజు, సుభాష్‌చంద్ర బోస్ దాగి ఉన్నారని, మాటలు మాని.. చేతల్లోకి వస్తే.. తెలంగాణవాదులు తట్టుకోలేరని, మాడి మసైపోతారని అన్నారు. ఇటీవల హైదరాబాద్‌లో జరిగిన సేవ్ ఆంధ్రప్రదేశ్ సభకు వెళ్లిన సీమాంధ్ర ప్రాంత ఉద్యోగులకు అడుగడుగునా అవమానాలు, దాడులు జరిగినా ఈ ప్రాంతానికి చెడ్డపేరు రాకూడదనే కారణంతోనే సంయమనం పాటించామని, ఇకపై అలాంటి పరిస్థితి ఉండబోదన్నారు. గోదావరి తెలంగాణ ప్రాంతంలో ప్రవహిస్తున్నా.. ఆ నదీ జలాల నుంచి కనీసం సీమాంధ్రులు 100 టీఎంసీల నీటిని కూడా వాడుకోవడం లేదన్నారు. కొత్తగూడెంలోని బీటీవీఎస్కు తెలంగాణ ప్రాంతం నుంచి బొగ్గు రావడం లేదని, అది ఒరిస్సా నుంచి వస్తున్న విషయం సీమాంధ్రులు గుర్తించాలన్నారు. రాష్ట్రం విడిపోతే తెలంగాణకు కరెంటు ఉండదన్నారు. కృష్ణా నీటిని హైదరాబాద్‌కు 25 టీఎంసీల మేరకు ఇస్తున్నారని, ఆ నీటిని నిలిపివేస్తే.. భాగ్యనగరం పరిస్థితి ఏమిటన్నారు. జగ్గారెడ్డికి సలాం.. తెలంగాణలో ఉన్నా.. రాష్ట్రం సమైక్యంగానే ఉండాలని బహిరంగంగా ప్రకటిస్తున్న సంగారెడ్డి ఎమ్మెల్యే తూర్పు జయప్రకాష్‌రెడ్డికి తాను సలాం చేస్తున్నానని అశోక్‌బాబు అన్నారు. సీమాంధ్రలో 175 మంది ఎమ్మెల్యేలు ఉన్నా.. జగ్గారెడ్డి లాంటి వారు ఐదుగురు లేరన్నారు. వచ్చే ఎన్నికల్లో ఎవరికి పడితే వారికి ఓటు వేయకూడదని, రాష్ట్రాన్ని విభజించడానికి తయారు చేసిన బిల్లుకు వ్యతిరేకంగా ఓటు వేస్తామని బహిరంగంగా ప్రమాణం చేసిన వారినే గెలిపించాలని ప్రజలకు ఆయన విజ్ఞప్తి చేశారు. తెలంగాణ ఎమ్మెల్యేలనూ కలుస్తాం.. సమైక్య రాష్ట్రం కోసం తెలంగాణ ప్రాంత ఎమ్మెల్యేలను కలసి విన్నవిస్తామని, అంతకన్నా ముందు సీమాంధ్ర ఎమ్మెల్యేలను సమైక్య రాష్ట్రానికి కట్టుబడి ఉండేలా ప్రమాణం చేయిస్తామని అశోక్‌బాబు తెలిపారు. తాను రాజకీయాల్లోకి ఎట్టి పరిస్థితుల్లోనూ రానని చెప్పారు. ప్రజలు నీతిమంతులైన నాయకులనే గెలిపించి చట్టసభలకు పంపాలన్నారు. 2014 ఎన్నికల్లో దేశంలో తప్పకుండా మార్పు ఉంటుందన్నారు. రాష్ట్రం సమైక్యంగా ఉంటుందని ప్రకటన వచ్చే వరకు ఉద్యమం ఆగదన్నారు. 2014లో సాధారణ ఎన్నికలు పూర్తయినా.. ప్రత్యేక వాదం సమసిపోయే వరకు ఉద్యమం చేస్తూనే ఉంటామన్నారు. తెలంగాణ ఉద్యోగాలను సీమాంధ్రులు లాక్కోలేదని, వారి ఉద్యోగాలు వారే అనుభవిస్తున్నారన్నారు. సమైక్య రాష్ట్రం కోసం ప్రజలు హిందూపురంలో మండుటెండను సైతం లెక్కచేయలేదన్నారు. ఏపీఎస్ ఆర్టీసీ జేఏసీ రాష్ట్ర నాయకుడు చంద్రశేఖర్‌రెడ్డి మాట్లాడుతూ రాష్ట్రం విడిపోతే సీమాంధ్రలో జరుగుతున్న ప్రాజెక్టుల నిర్మాణాలు నిలిచిపోతాయన్నారు. రాయలసీమకు నీళ్లు రావాలంటే గోదావరి జలాలను కృష్ణా బేసిన్‌కు మళ్లించడం ఒక్కటే మార్గమన్నారు. రెవెన్యూ శాఖ రాష్ట్ర జేఏసీ నాయకుడు కొమ్మరాజు వెంకటేశ్వర్లు మాట్లాడుతూ రాష్ట్రం విడిపోతే ఉత్తరాఖండ్, జార్ఖండ్, చత్తీస్ఘడ్ రాష్ట్రాల కన్నా దారుణ పరిస్థితులు చూడాల్సి వస్తుందన్నారు. ఏపీఎన్జీఓ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి చంద్రశేఖర్‌రెడ్డి మాట్లాడుతూ తమకు కావాల్సింది సమైక్యాంధ్రే కానీ.. సీఎం కుర్చీ కాదన్నారు. సీఎం కుర్చీ తెలంగాణ వారే తీసుకుని.. రాష్ట్రాన్ని సమైక్యంగా ఉంచితే చాలన్నారు. రాష్ట్రం విడిపోతే వందేళ్లయినా.. హైదరాబాద్ లాంటి నగరాన్ని సీమాంధ్రలో నిర్మించలేమన్నారు. అశోక్‌బాబును ప్రశ్నించే ముందు.. అసలు నీవు ఎవరన్నది తెలుసుకోవాలని మందకృష్ణ మాదిగను ప్రశ్నించారు. మునిసిపల్ శాఖ రాష్ట్ర జేఏసీ నాయకుడు కృష్ణమోహన్ మాట్లాడుతూ రాష్ట్రం విడిపోతే పురపాలక సంఘాలు నిర్వీర్యమై పోతాయన్నారు. ఉద్యమానికి పుట్టినిల్లు ‘అనంత’.. రాష్ట్ర విభజన ప్రకటన వెలువడిన మరుసటి రోజే సమైక్య ఉద్యమం అనంతపురంలోని సప్తగిరి సర్కిల్లో పుట్టిందని, ఇక్కడ ఎగిసిన ఆగ్రహ జ్వాలలు రాష్ట్రమంతా వ్యాపించడానికి కారణమైందని ఏపీఎన్జీఓ అధ్యక్షుడు అశోక్‌బాబు అన్నారు. జులై 30న దిగ్విజయ్ సింగ్ ప్రకటనను సీమాంధ్రలో పెద్దగా పట్టించుకున్న దాఖలాలు లేవని, అయితే అనంతపురం నుండే సమైక్య ఉద్యమం ప్రారంభమైందన్నారు. అనంతలో ప్రారంభమైన ఉద్యమం రెండు రోజులకే తారస్థాయికి చేరుకోవడంతో మిగతా జిల్లాలు మేల్కొన్నాయని చెప్పడానికి గర్వంగా ఉందని అన్నారు. -
మంత్రులతో చర్చలకు హాజరవుతాం: అశోక్ బాబు
మంత్రివర్గ ఉప సంఘంతో ఆదివారం ఉదయం 11 గంటలకు జరిగే చర్చలకు తాము హాజరు కానున్నట్లు సమైక్యాంధ్ర పరిరక్షణ సమితి చైర్మన్, ఏపీ ఎన్జీవో అధ్యక్షుడు అశోక్ బాబు తెలిపారు. సీమాంధ్ర జిల్లాల్లో ఈ నెల 24న రహదారుల దిగ్బంధం జరుగుతుందని ఆయన వెల్లడించారు. 23 నుంచి 30వ తేదీ వరకు.. అంటే వారం రోజుల పాటు మొత్తం సీమాంధ్ర 13 జిల్లాల్లో ఉన్న ప్రైవేట్ విద్యాసంస్థలన్నీ బంద్ చేస్తామని తెలిపారు. హైదరాబాద్‌లో మరోమారు సద్భావన సదస్సు నిర్వహిస్తామని అశోక్‌బాబు చెప్పారు. గతంలో హైదరాబాద్‌లోను, శుక్రవారం నాడు విజయవాడలోను నిర్వహించిన 'సేవ్ ఆంధ్రప్రదేశ్' సభలు విజయవంతమైన తీరును బట్టే ప్రజలు సమైక్యాంధ్రకు ఎంతగా మద్దతు తెలుపుతున్నారో అర్థం చేసుకోవాలని సూచించారు. కేంద్రంపై ఒత్తిడి తెచ్చేందుకే కేంద్ర ప్రభుత్వ కార్యాలయాలను ముట్టడిస్తున్నామని ఆయన అన్నారు. శనివారం సాయంత్రం 6-8 గంటల వరకు సీమాంధ్రజిల్లాల్లో కరెంట్ కోత విధిస్తామని, 24న సీమాంధ్ర జిల్లాల్లో రాస్తారోకో , ధర్నాలు చేయాలని నిర్ణయించామని అన్నారు. 23 నుంచి 30 వరకు సీమాంద్ర జిల్లాలో ప్రైవేట్ స్కూల్ యాజామాన్యాన్ని కోరారు. 27, 28 న హైదరాబాద్‌తో పాటు సీమాంద్ర జిల్లాల్లో కేంద్రప్రభుత్వ కార్యాలయాలను ముట్టడించనున్నట్లు చెప్పారు. -
సమైక్య సభలో అదరగొట్టిన అంధ ఉపాధ్యాయుడు
విజయవాడలో నిర్వహించిన సేవ్ ఆంధ్రప్రదేశ్ సభలో కృష్ణా జిల్లా మైలవరం నుంచి వచ్చిన అంధ ఉపాధ్యాయుడు గంగాధర్ సమైక్యాంధ్ర గీతాలు ఆలపించి సభికులను ఆకట్టుకున్నారు. ముందుగా ఆయన ప్రధాని మన్మోహన్ సింగ్, రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ, ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి, దివంగత ముఖ్యమంత్రులు ఎన్టీ రామారావు, వైఎస్ రాజశేఖరరెడ్డిల గొంతును అనుకరిస్తూ.. సమైక్యాంధ్ర ఆవశ్యకతను వారి గొంతుతో వివరించారు. అలాగే, సమైక్య ఉద్యమానికి స్పందించి రాష్ట్రాన్ని సమైక్యంగానే ఉంచాలని తాము నిర్ణయించుకున్నట్లుగా మన్మోహన్, ప్రణబ్ ప్రకటించారన్నారు. ‘జై సమైక్యాంధ్ర.. జైజై సమైక్యాంధ్ర.. విభజించేదెవ్వరూ.. విడిపోయే దెవ్వరూ...’ అంటూ ఆయన పాడిన పాటకు సభికులు నృత్యం చేశారు. వన్స్‌మోర్.. అంటూ కేకలు వేయటంతో నిర్వాహకులు తిరిగి ఆయనతో మరో పాట పాడించారు. వేదికపైన స్టెప్పులు వేస్తూ సమైక్యాంధ్ర ఉద్యమకారుల్లో ఆయన సమరోత్సాహాన్ని నింపారు. ‘అశోక్‌బాబు చేస్తున్న ఉద్యమం గొప్పది, అది నా మనసును సైతం మార్చింది. నేను సమైక్యవాదిగా మారిపోయా..’ అని ప్రధాని మన్మోహన్సింగ్ గొంతును అనుకరించి హిందీలో మాట్లాడటంతో సభికులు కరతాళ ధ్వనులతో ఆయనను అభినందించారు. తన భార్య అంధురాలని, సమైక్యాంధ్ర కోసం రెండు రోజులపాటు నిరాహార దీక్ష చేశారని తెలిపారు. గంగాధర్ అనుకరణలలో ఆయా నాయకులు చెప్పిన విషయాలు.. ''ప్రజాభిప్రాయాన్ని గనక మన్నించకపోతే ప్రభుత్వాలకు ప్రజలు సెలవులచ్చిన సందర్భాలున్నాయి" - ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి ''అశోక్ బాబు నాయకత్వంలో నడుస్తున్న ఉద్యమానికి స్పందించి. ఆంటోనీ కమిటీ, దిగ్విజయ్ సింగ్‌ల కమిటీలను రద్దు చేస్తున్నా'' -ప్రధాని మన్మోహన్ సింగ్ ''తెలంగాణ బిల్లును తిరస్కరిస్తూ, సమైక్యాంధ్రనే కొనసాగిస్తున్నా. ఉద్యమానికి స్పందిస్తున్నా జై సమైక్యంధ్ర'' - రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ ''తెలుగుజాతి శౌర్యాన్ని చూసి.. స్వర్గలోకంలో ఉన్న నేనే ఈ సభకు వచ్చి, దీన్ని దిగ్విజయం చేయాలనుకుంటున్నాను'' -ఎన్టీరామారావు ''రామారావు గారే కాదు.. నేను కూడా సమైక్యాంధ్రకే మద్దతిస్తున్నా. ప్రజలందరికీ తెలుసు. నా అక్కలకీ చెల్లెళ్లకీ అందరికీ చెబుతున్నా.. జై సమైక్యాంధ్ర'' - వైఎస్ రాజశేఖరరెడ్డి -
సమైక్య సభలో అదరగొట్టిన అంధ ఉపాధ్యాయుడు
-
సేవ్ ఆంధ్రప్రదేశ్’ సభకు తరలిరండి
ఏలూరు అర్బన్, న్యూస్‌లైన్ : రాష్ట్ర విభజనను వ్యతిరేకిస్తూ సమైక్య రాష్ట్ర పరిరక్షణ వేదిక ఆధ్వర్యంలో శుక్రవారం విజయవాడలో తలపెట్టిన ’సేవ్ ఆంధ్రప్రదేశ్’ బహిరంగ సభకు సమైక్యవాదులు పెద్దెత్తున తరలిరావాలని సమైక్య రాష్ట్ర పరిరక్షణ వేదిక జిల్లా నాయకత్వం పిలుపునిచ్చింది. సమైక్యవేదిక రాష్ట్ర చైర్మన్ పరుచూరి అశోక్‌బాబు అధ్యక్షతన జరిగే ఈ సభకు సమైక్యవాదులంతా స్వచ్ఛందంగా ఎవరికి వారు హాజరుకావాలని విజ్ఞప్తి చేసింది. ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేసి సీమాంధ్ర ప్రజల సమైక్యవాదనను కేంద్రానికి బలంగా వినిపించాలని నాయకులు కోరారు -
నేడు ‘సేవ్ ఏపీ’ సభ
సాక్షి, విజయవాడ : ‘ప్రతి గడపకు ఒక్కరు’ అనే నినాదంతో విజయవాడలో శుక్రవారం నిర్వహించనున్న ‘సేవ్ ఆంధ్రప్రదేశ్’ సభ ద్వారా ఎన్జీవోలు సమైక్య సమరశంఖం పూరించనున్నారు. హైదరాబాద్‌లో ఈ నెల ఏడో తేదీన జరిగిన సభను తలదన్నేలా దీన్ని నిర్వహించేందుకు ఏర్పాట్లు చేశారు. సీమాంధ్ర నడిబొడ్డున జరుగుతున్న సభ కావడంతో దీని ప్రకంపనలు ఢిల్లీ పీఠానికి వినిపించేలా సమైక్యవాదులు కదలివస్తారని నిర్వాహకులు ఆశిస్తున్నారు. మరోవైపు ఇప్పటికే ఎన్జీవోల సమ్మెపై హైకోర్టు వ్యాఖ్యలు చేయడంతో రాష్ట్ర ప్రభుత్వం స్పందించింది. విజయవాడలో శుక్రవారం సాయంత్రం నాలుగు గంటలకు సేవ్ ఆంధ్రప్రదేశ్ సభ జరిగే సమయానికే చర్చలకు రావాలని ఎన్జీవో అసోసియేషన్‌కు ప్రభుత్వం నుంచి పిలుపువచ్చింది. అయితే విజయవాడ, విశాఖపట్నాల్లో జరిగే సభల తర్వాతే ప్రభుత్వంతో చర్చలకు వెళ్లాలని ఎన్జీవో నాయకులు భావిస్తున్నారు. హైదరాబాద్ సభకు ఉద్యోగులు మాత్రమే హాజరయ్యారు. ఈ సభకు ఉద్యోగులతోపాటు కార్మికులు, విద్యార్థులు, వివిధ జేఏసీలు, రైతులు, కూలీలు, అంగన్వాడీ కార్యకర్తలు, వివిధ శాఖల సిబ్బంది, సాధారణ ప్రజలు హాజరయ్యే అవకాశం ఉంది. అందువల్ల ఈ సభ ప్రధాన లక్ష్యం రాష్ట్ర విభజన వల్ల ఎదురయ్యే సమస్యలను వివరించడమేనని నిర్వాహకులు పేర్కొంటున్నారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని ఎందుకు రక్షించుకోవాలి, విభజన జరిగితే ఎదురయ్యే సమస్యలు, నష్టాల గురించి వక్తలు సవివరంగా ప్రసంగిస్తారు. ఈ సభకు సమైక్యాంధ్ర పరిరక్షణ వేదిక రాష్ట్ర అధ్యక్షుడు పి. అశోక్‌బాబు, మేధావుల ఫోరం నుంచి చలసాని శ్రీనివాస్, నల్లమోతు చక్రవర్తి తదితరులు మాట్లాడతారు. ఈ సభకు రాజకీయ నాయకులకు ఆహ్వానం పంపలేదు. ఒకవేళ వారు హాజరైతే సముచిత స్థానం కల్పించాలని ఎన్జీవో నేతలు భావిస్తున్నారు. అయితే ప్రజాప్రతినిధులు హాజరైతే సభకు వచ్చిన వారి నుంచి వ్యతిరేకత వచ్చే అవకాశం ఉంది. ఇప్పటికే ఎంపీ లగడపాటి ఢిల్లీలో మకాం వేసి ఉండగా, జిల్లామంత్రి పార్థసారథి తనకు సేవ్ ఆంధ్రప్రదేశ్ సమావేశం కన్నా కేబినేట్ భేటీ ముఖ్యమని ప్రకటించారు. సాయంత్రం నాలుగు గంటలకు సభ స్వరాజ్ మైదానంలో శుక్రవారం సాయంత్రం 4 గంటలకు సేవ్ఆంధ్రప్రదేశ్ సభ ప్రారంభమవుతుంది. దీని కోసం ఏర్పాట్లు వేగవంతం చేశారు. ఉదయానికల్లా ఏర్పాట్లు పూర్తి చేయాలని నిర్ణయించారు. వర్షం పడకపోతే లక్షమందికి తగ్గకుండా ఈ సభకు వస్తారని నిర్వాహకులు భావిస్తున్నారు. ఇప్పటికే సభ నిర్వాహణకు 10 కమిటీలను ఏర్పాటు చేసి పనులు చురుగ్గా చేస్తున్నారు. విశాలమైన వేదికతో పాటు, బారికేడ్లు, లైటింగ్ ఏర్పాటు చేస్తున్నారు. సభా వేదిక వద్ద బాంబుస్వ్కాడ్ తనిఖీలు నిర్వహించింది. సభ వేదిక కు కమ్యూనిస్టు యోధుడు పుచ్చలపల్లి సుందరయ్య పేరు, సభా ప్రాంగణానికి బూర్గుల రామకృష్ణారావు పేరు పెట్టారు. 35 వేల మంది వరకూ కూర్చునే విధంగా కుర్చీలు ఏర్పాటు చేస్తున్నారు. సభకు హాజరైన వారికి అసౌకర్యం కలుగకుండా అన్ని ఏర్పాటు చేస్తున్నారు. ముఖ్యంగా మహిళల కోసం ప్రత్యేక గ్యాలరీ ఏర్పాటు చేస్తున్నారు. తాగునీటి ఇబ్బందులు తలెత్తకుండా సుమారు నాలుగు లక్షల వాటర్ ప్యాకెట్లు సిద్ధం చేస్తున్నారు. ఆర్టీసీ కూడా సమ్మెలోఉన్న నేపథ్యంలో జిల్లా నలుమూలల నుంచి సభకు జనాన్ని తీసుకువచ్చేందుకు సుమారు 600 బస్సులు పెడుతున్నారు. సాంస్కృతిక కార్యక్రమాలు... సభకు ముందు సమైక్యాంధ్ర ఉద్దేశాన్ని చాటిచెప్పేలా సాంస్కృతిక కార్యక్రమాలు ఏర్పాటు చేస్తున్నారు. వంగపండు బృందంతో ప్రత్యేక కార్యక్రమం, కూచిపూడి, జానపద నృత్య ప్రదర్శనలు, ఉంగుటూరు వారి డప్పువాయిద్యాలు ఏర్పాటు చేశారు. బందరు రోడ్డులో ట్రాఫిక్ మళ్లింపు విజయవాడ సిటీ : ‘సేవ్ ఆంధ్రప్రదేశ్’ బహిరంగ సభ దృష్ట్యా బందరు రోడ్డులో ట్రాఫిక్ నియంత్రణకు పలు చర్యలు చేపట్టినట్లు నగర పోలీసు కమిషనర్ బి. శ్రీనివాసులు ఓ ప్రకటనలో తెలిపారు. సభకు వచ్చేవారి వాహనాల పార్కింగ్‌కు కొన్ని ప్రదేశాలు కేటాయించినట్లు వెల్లడించారు. ట్రాఫిక్ మళ్లింపు ఇలా.. బంద రు రోడ్డులో ఆర్టీసీ డిపో సెంటర్, ఆర్.జి.స్ట్రీట్, రాఘవయ్య పార్కు, ఆర్టీఏ కూడలి, వెటర్నరీ ఆస్పత్రి కూడలి వద్ద ట్రాఫిక్‌ను మళ్లిస్తారు. వాహనాల పార్కింగ్.. గుడివాడ, మచిలీపట్నం, అవనిగడ్డ, ఉయ్యూరు వైపు నుంచి వచ్చే బస్సులు, నాలుగు చక్రాల మోటారు వాహనాలు ఇందిరాగాంధీ మున్సిపల్ స్టేడియంలో నిలుపుకోవాలి. నందిగామ, జగ్గయ్యపేట, మైలవరం, ఇబ్రహీంపట్నం, గొల్లపూడి మీదుగా వచ్చే, గుంటూరు వైపు నుంచి వచ్చే వాహనాలను పండిట్ నెహ్రూ బస్‌స్టేషన్‌లో నిలపాలి. ఏలూరు, గన్నవరం, రామవరప్పాడు మీదుగా వచ్చే వాహనాలు బిషప్ అజరయ్య స్కూల్ ఆవరణలో నిలపాలి. సభకు హాజరయ్యేవారు తమ ద్విచక్ర వాహనాలను ఆర్టీఏ కార్యాలయం ఎదుటనున్న ఖాళీ స్థలంలో, సీఎస్ఐ చర్చి ఆవరణలో, ఇరిగేషన్ కార్యాలయం ఆవరణలో పార్క్ చేసుకోవాలి. -
సమైక్యశక్తి
సమైక్య ఉద్యమ సెగలు మిన్నంటుతున్నాయి. రోజురోజుకూ ఉద్యమానికి మద్దతు పెరుగుతుండటంతో సమైక్యశక్తి బలీయమవుతోంది. విజయవాడలో మలయాళీలు ఉద్యమానికి మద్దతుగా ఓనం వేడుకలు రద్దు చేస్తున్నట్లు ప్రకటించారు. మానవహారాలు, వినూత్న నిరసనలు ఆదివారమూ కొనసాగాయి. సాక్షి, విజయవాడ : సమైక్యాంధ్ర పరిరక్షణ కోసం జిల్లాలో జరుగుతున్న ఉద్యమం మరింత బలపడుతోంది. ఉద్యమం ప్రారంభించి ఆదివారానికి 48 రోజులకు చేరినా జోరు తగ్గలేదు. సమైక్యాంధ్రను కాపాడుకోవడానికి మరింత ఉధృతంగా ఉద్యమం కొనసాగించేందుకు సమైక్యవాదులు సన్నద్ధమవుతున్నారు. అందులో భాగంగా ఈ నెల 17న ప్రైవేటు ఆస్పత్రులు బంద్ పాటిస్తుండగా, 18న సేవ్ ఆంధ్రప్రదేశ్ సభ విజయవంతం కోసం ర్యాలీలు, 20న సేవ్ ఆంధ్రప్రదేశ్ సభ, 21న హనుమాన్‌జంక్షన్‌లో రైతుగర్జన నిర్వహించాలని నిర్ణయించారు. పెరుగుతున్న మద్దతు.. సమైక్యాంధ్రకు తెలుగువారే కాకుండా ఈ ప్రాంతంలో స్థిరపడిన వివిధ రాష్ట్రాలకు చెందినవారు కూడా తమ వంతు మద్దతు తెలుపుతున్నారు. దశాబ్దాలుగా విజయవాడ నగరంలో స్థిరపడిన మలయాళీలు ఏటా ఎంతో ఘనంగా నిర్వహించుకునే ఓనం వేడుకలను సమైక్యాంధ్ర ఉద్యమానికి మద్దతుగా రద్దు చేస్తున్నట్లు ప్రకటించారు. దుర్గగుడికి వచ్చిన కాకినాడ శ్రీపీఠానికి చెందిన శ్రీ పరిపూర్ణానందస్వామి రాష్ట్రాన్ని విభజించాలన్న నిర్ణయం వల్ల రాష్ట్రంలో అశాంతి నెలకొని ఉందని, దీని కోసం శాంతి కమిటీని వేయాలని సూచించారు. మరోవైపు ఆదివారం కూడా ఉద్యోగులు, విద్యార్థులు రోడ్లపైకి వచ్చి ఆందోళనలు నిర్వహించారు. విజయవాడలో ఐసీడీఎస్ సభ్యులు కొవ్వొత్తుల ర్యాలీ నిర్వహించారు. సీమాంధ్రకు చెందిన కేంద్ర మంత్రులు రాజీనామాలు చేయాలని కోరుతూ న్యూ రాజరాజేశ్వరీపేటలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకులు నిరసన ప్రదర్శన జరిపారు. కేంద్రమంత్రుల ఫొటోలతో కూడిన ఫ్లెక్సీ ఎదుట మంత్రుల రాజీనామాలు కోరుతూ 108 కొబ్బరికాయలు కొట్టారు. మాజీ మంత్రి సుభాష్‌చంద్రబోస్ మద్దతు.. నందివాడ మండలం జనార్థనపురం శివారు టెలిఫోన్ నగర్ కాలనీలో మండల ఉపాధ్యాయ జేఏసీ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న రిలే దీక్షలు 15వ రోజుకు చేరాయి. వైఎస్సార్సీపీ రాష్ట్ర కిసాన్ సెల్ కన్వీనర్ ఎంవీఎస్ నాగిరెడ్డితో కలసి మాజీ మంత్రి పిల్లి సుభాష్ చంద్రబోస్ శిబిరంలో దీక్ష చేస్తున్న తుమ్మలపల్లి రైతులకు సంఘీభావం తెలిపారు. సీట్ల కోసం రాష్ట్రాన్ని ముక్కలు చేస్తే సీమాంధ్ర, తెలంగాణ ప్రాంతాలు ఎడారిగా మారటం ఖాయమని ఈ సందర్భంగా బోస్ అన్నారు. తొలుత ఉపాధ్యాయులు ఎంఎన్కే రహదారిపై సమైక్యాంధ్రకు మద్దతుగా చెవిలో పూలతో భజన కార్యక్రమం నిర్వహించారు. పునాదిపాడు-కంకిపాడు సెంటరు వరకు రోడ్ రోలర్స్ అసోసియేషన్, సమైక్యాంధ్ర జేఏసీ ఆధ్వర్యంలో రోడ్డు రోలర్స్ ర్యాలీ నిర్వహించారు. గన్నవరం రోడ్డు కూడలిలో మానవహారం నిర్మించారు. పామర్రు నాలుగురోడ్ల కూడలిలో రిమ్మనపూడి పంచాయతీ పాలకవర్గ సభ్యులు రిలేదీక్షల్లో కూర్చున్నారు. గుడివాడ నెహ్రూచౌక్ సెంటర్లో జేఏసీ ఆధ్వర్యంలో, మున్సిపల్ కార్యాలయం వద్ద ఉద్యోగులు, ఉపాధ్యాయుల ఆధ్వర్యంలో రిలేదీక్షలు కొనసాగుతున్నాయి. నెహ్రూచౌక్‌లో టైలర్స్ ఆధ్వర్యంలో వంటావార్పు నిర్వహించారు. గుడ్లవల్లేరులో పాలిటెక్నిక్ విద్యార్థులు రిలేదీక్షలకు కూర్చున్నారు. తిరువూరు మండలంలోని పలు గ్రామపంచాయతీ సర్పంచులను కలిసిన జేఏసీ నాయకులు సమైక్యాంధ్ర కోసం పంచాయతీ తీర్మానాలు చేయాల్సిందిగా విజ్ఞప్తి చేశారు. అసెంబ్లీలో తెలంగాణ బిల్లు వస్తే అధిష్టానాన్ని ధిక్కరించి సమైక్యాంధ్రకు అనుకూలంగా ఓటు వేస్తానని తిరువూరు ఎమ్మెల్యే దిరిశం పద్మజ్యోతి ప్రకటించారు. తాళ్లతో బస్సులు లాగి నిరసన.. విస్సన్నపేట మండల జేఏసీ నాయకులు ఆర్టీసీ అద్దె బస్సులను తాళ్లతో లాగి నిరసన తెలిపారు. రాష్ట్రం విడిపోతే ఆర్టీసీ పరిస్థితి కుదేలవుతుందని, బస్సుల్ని నడపలేక, కార్మికులకు జీతాలివ్వలేక తీవ్ర ఇబ్బందికర స్థితిలోకి ఆర్టీసీ దిగజారుతుందని జేఏసీ నాయకులు ఆవేదన వ్యక్తం చేశారు. పామర్రులోని ఆర్యవైశ్య యువజన సంఘం, జేఏసీ నాయకుల ఆధ్వర్యంలో లక్ష్మీ గణపతి సుదర్శన హోమం నిర్వహించారు. జగ్గయ్యపేట జేఏసీ ఆధ్వర్యంలో పేట నుంచి తిరుమలగిరి వరకు పాదయాత్ర నిర్వహించారు. పాదయాత్రలో వైఎస్సార్ సీపీ జిల్లా కన్వీనర్ సామినేని ఉదయభాను, శాసనసభ్యుడు శ్రీరాం రాజగోపాల్‌లు పాల్గొని సంఘీభావం తెలిపారు. కైకలూరులో వైఎస్సార్ సీపీ కార్యాలయం వద్ద సమన్వయకర్త దూలం నాగేశ్వరరావు ఆధ్వర్యంలో కొనసాగుతున్న రిలే దీక్షలు 40వ రోజుకు చేరాయి. ఎన్జీవో సంఘం ఆధ్వర్యంలో అవనిగడ్డ నియోజకవర్గంలోని ఆరు మండలాల్లో మోటార్‌సైకిల్ ర్యాలీ నిర్వహించారు. మోపిదేవిలో డ్వాక్రా మహిళలు దీక్ష చేశారు. గన్నవరంలో సమైక్యాంధ్ర పరిరక్షణ సమితి నేతృత్వంలో జరుగుతున్న రిలే దీక్షలు 33వ రోజుకు చేరాయి. కైకలూరులో ముస్లిం చిన్నారుల ఆందోళన... కైకలూరు పట్టణంలో ముస్లిం చిన్నారులు జేఏసీ ఆధ్వర్యంలో పామర్రు-కత్తిపూడి 214 జాతీయ రహదారిపై బైఠాయించి దువా (ప్రార్థన) చేసిన అనంతరం సమైక్యాంధ్రకు మద్దతుగా నినాదాలు చేశారు. గుర్వాయిపాలెం సెంటరులో యూత్ ఆధ్వర్యంలో సోనియా దిష్టిబొమ్మను దహనం చేసి రాస్తారోకో చేశారు. మచిలీపట్నంలో మునిసిపల్ ఉద్యోగులు చేపట్టిన నిరవధిక సమ్మె 33వ రోజుకు చేరింది. కంచికచర్ల మండల పరిషత్ కార్యాలయం ఎదురుగా జాతీయ రహదారి పక్కన ఇందిరాగాంధీ బొమ్మ సెంటర్లో రిలేదీక్షలో ఆర్టీసీ ఉద్యోగులు పాల్గొన్నారు. -
కాంగ్రెస్ చేతగాని తనం వల్లే: మైసూరా
-
కాంగ్రెస్ చేతగాని తనం వల్లే: మైసూరా
ప్రభుత్వ ఉద్యోగులపై దాడులు అమానుషమని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేత ఎం.వి.మైసూరారెడ్డి అభిప్రాయపడ్డారు. 'సేవ్ ఆంధ్రప్రదేశ్' సభకు హాజరై తిరిగి స్వస్థలానికి బస్సులో పయనమై హయత్‌నగర్ వద్ద అంగతకులు జరిపిన రాళ్ల దాడిలో గాయపడి ఆపోలో ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న సత్యనారాయణను మంగళవారం ఆయన పరామర్శించారు. అనంతరం మైసూరా రెడ్డి ప్రసంగిస్తూ... దేశంలో ఎవరు ఎక్కడైనా సమావేశాలు నిర్వమించుకోవచ్చని ఆన్నారు. ఏపీఎన్జీవో నేత సత్యనారాయణపై దాడిని ఆయన సందర్భంగా ఖండించారు. కాంగ్రెస్ ప్రభుత్వ చేతకానితనం వల్లే ఈ దుస్థితి ఏర్పడిందని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. చంద్రబాబు ఇప్పటికైనా రాష్ట్ర విభజనకు అనుకూలంగా ఇచ్చిన లేఖను వెనక్కి తీసుకోవాలని మైసూరారెడ్డి ఈ సందర్భంగా డిమాండ్ చేశారు. ఆయనతోపాటు పలువురు ఆ పార్టీకి చెందిన ఎమ్మెల్యేలు సత్యనారాయణను పరామర్శించారు. ఆయన ఆరోగ్య పరిస్థితిపై వైద్యులను అడిగి తెలుసుకున్నారు. సమైక్యాంధ్ర మద్దతుగా సెప్టెంబర్ 7న ఏపీఎన్జీవోలు హైదరాబాద్ నగరంలో సేవ్ ఆంధ్రప్రదేశ్ సభను నిర్వహించారు. ఆ సభను సీమాంధ్ర ప్రాంతం నుంచి వేలాది మంది హైదరాబాద్ తిరిగి వచ్చారు. ఆ సభ ముగిసిన తరువాత శనివారం రాత్రి ఏపీఎన్జీవోలు బస్సుల్లో స్వస్థలాలకు బయలుదేరారు. అయితే నగర శివారు ప్రాంతమైన హయత్ నగర్ వద్ద సీమాంధ్రులు ప్రయాణిస్తున్న బస్సులపై ఆగంతకులు రాళ్ల వర్షం కురింపించారు. ఆ ఘటనలో సత్యనారాయణ తీవ్రంగా గాయపడ్డారు. స్థానికులు వెంటనే ఆయన్ని హయత్ నగర్‌లోని సన్రైస్ ఆసుపత్రికి తరలించారు. అయితే మెరుగైన వైద్య చికిత్స కోసం సత్యనారాయణను నగరంలోని ఆపోలో ఆసుపత్రికి తరలించిన సంగతి తెలిసిందే. సత్యనారాయణ కాకినాడలోని వాణిజ్యపన్నుల శాఖలో ఉద్యోగిగా విధులు నిర్వర్తిస్తున్నారు. -
సమైక్య సెగ!
మానవపాడు, న్యూస్‌లైన్: ‘సేవ్ ఆంధ్రప్రదేశ్’ సభకు హైదరాబాద్‌కు తరలివెల్లిన సీమాంధ్ర ఉద్యోగులు కొందరు తిరుగు ప్రయాణంలో మండలంలోని పుల్లూరు టోల్‌ప్లాజాపై దాడికి పూనుకున్నారు. టోల్‌చార్జీలు ఇవ్వబోమని కౌంటర్లు, కుర్చీలను ధ్వంసంచేశారు. ఈ ఘటన శనివారం అర్ధరాత్రి దాటిన తరువాత జరిగింది. టోల్గేట్ సిబ్బంది కథనం మేరకు.. శుక్రవారం అర్ధరాత్రి వరకు సీమాంధ్రుల ఉద్యోగులు హైదరాబాద్‌లో జరుగుతున్న సేవ్ ఆంధ్రప్రదేశ్ సభకు పుల్లూరు టోల్‌ప్లాజా నుంచి భారీసంఖ్యలో వాహనాల్లో తరలివెళ్లారు. హైదరాబాద్‌కు వెళ్తున్న సమయంలో టోల్‌చార్జీలు చెల్లించమని కొందరు ఉద్యోగులు సిబ్బందితో వాదనకు దిగారు. తెలంగాణ ప్రాంతంలో ఉన్న టోల్ప్లాజాలకుటోల్చార్జీలు ఎక్కడా చెల్లించమని, తమకు అన్యాయం చేశారని దురుసుగా ప్రవర్తించారు. ‘ జై సమైక్యాంధ్ర’ అని నినాదాలు చేస్తూ ఘర్షణకు దిగారు. గంటపాటు ట్రాఫిక్ నిలిచిపోవడంతో టోల్‌ప్లాజా యాజమాన్యం వారి వాహనాలను వదిలేసింది. ఇదిలాఉండగా.. తిరుగు ప్రయాణంలో కూడా శనివారం అర్ధరాత్రి తరువాత మరోసారి కొందరు గుర్తుతెలియని వ్యక్తులు (ఏపీ 02 టీఆర్ 2299 మునిరత్నం ఎన్ఎంఆర్ ఓల్వో సెమీస్లీపర్)బస్సులో పుల్లూరు టోల్‌ప్లాజాకు చేరుకున్నారు. టోల్‌చార్జీలు ఇవ్వబోమని మళ్లీ వాదనకు దిగారు. దీంతో రెండు గంటలపాటు ట్రాఫిక్‌కు తీవ్ర అంతరాయం కలిగింది. ఇంతలో కొందరు ‘జై సమైక్యాంధ్ర’ నినాదాలు చేస్తూ కౌంటర్లోకి దూసుకెళ్లారు. అందులో ఉన్న సీసీ కెమెరాలను లాక్కెళ్తూనే.. 8వ నెంబర్ కౌంటర్‌ను ధ్వంసం చేశారు. అక్కడే ఉన్న కంప్యూర్ ఆపరేటర్‌కు సమైక్యాంధ్ర జెండా చూపుతూ బెదిరించి వెళ్లిపోయారు. టోల్‌ప్లాజా స్టాఫ్గేట్ను, కుర్చీలను విరగొట్టి బస్సును పోనిచ్చారు. ఈ సంఘటన మొత్తం టోల్‌ప్లాజాలో ఏర్పాటు చేసిన సీసీ కెమెరాలో కూడా రికార్డు అయింది. పట్టించుకోని పోలీసులు: శనివారం అర్ధరాత్రి కళ్లముందే టోల్‌ప్లాజా కౌంటర్లను ధ్వంసంచేసిన పోలీసులు పట్టించుకోలేదు. దాదాపు 200 మంది పోలీస్ బలగాలు టోల్‌ప్లాజా చుట్టూ మోహరించినా లాభం లేకపోయింది. సీమాంధ్ర ఉద్యోగులు రెచ్చగొట్టే విధంగా నినాదాలు చేస్తూ పోలీసుల ముందే టోల్‌ప్లాజాను ధ్వంసంచేసినా ఎవరిని వారించలేకపోయారు. కనీసం వారు ఎవరో కూడా తెలియదని చెప్పుకొచ్చారు. ఈ ఘటనపై తెలంగాణ వాదులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. -
సమైక్యపోరుకు 40 రోజులు
తిరుపతి, న్యూస్‌లైన్: జిల్లాలో సమైక్యాంధ్ర ఉద్యమం 40వ రోజుకు చేరుకుంది. పల్లెలు, పట్టణాలు తేడా లేకుండా ప్రజలు స్వచ్ఛందంగా ఉద్యమంలో పాల్గొంటున్నారు. ప్రభుత్వోద్యోగులు, కార్మికులు, కర్షకులు, విద్యార్థులు, డాక్టర్లు, న్యాయవాదులు, వ్యాపారులు, కూలీలు, మహిళలు ఉద్యమంలో పాలు పంచుకుంటున్నారు. సోమవారం వినాయకచవితి పండుగ ఉండడంతో ఒక వైపు పండుగ ఏర్పాట్లు చేసుకుంటూనే ఆదివారం యథావిధిగా ఉద్యమం కొనసాగించారు. హైదరాబాద్‌లో శనివారం ఏపీఎన్జీవోలు నిర్వహించిన సమైక్య గర్జన (సేవ్ ఆంధ్రప్రదేశ్) సభ విజయవంతమైన నేపథ్యంలో పలు పట్టణాలలో హైదరాబాద్ నుంచి తిరిగి వచ్చిన జేఏసీ నాయకులకు ప్రజలు నీరాజనాలు పట్టారు. కొన్నిచోట్ల వినాయక విగ్రహాలకు వినతిపత్రాలు సమర్పించి సమైక్యాంధ్రకు అనుకూలంగా కాంగ్రెస్ పార్టీ మనసు మారేలా చూడాలని మొక్కుకున్నారు. తిరుపతిలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో రిలే దీక్షలు కొనసాగాయి. ఆర్టీసీ కార్మికులు, ఏపీఎన్జీవోలు, విద్యార్థి జేఏసీ నాయకులు దీక్షలు యథావిధిగా కొనసాగించారు. అన్నమాచార్య ప్రాజెక్ట్ కళాకారులు నడిరోడ్డుపై షామియానా వేసి భక్తి సంగీత విభావరి నిర్వహించి, వినూత్న రీతిలో నిరసన తెలిపారు. ఎన్జీవో జేఏసీ నాయకులకు పలమనేరులో అభినందనసభ నిర్వహించారు. జేఏసీ ఆధ్వర్యంలో రిలే దీక్షలు కొనసాగాయి. బెరైడ్డిపల్లెలో ఉపాధ్యాయ జేఏసీ ఆధ్వర్యంలో వినాయకునికి వినతిపత్ర ం సమర్పించారు. వి.కోటలో జేఏసీ నాయకులు రిలే దీక్షలో పాల్గొన్నారు. పుంగనూరులో ఉపాధ్యాయులు ర్యాలీ నిర్వహించి ఎంబీటీ సర్కిల్లో రోడ్డుపై బైఠాయించారు. మోకాళ్లపై నడిచి నిరసన తెలిపారు. ఏపీఎన్జీవో నాయకులకు తిలకం దిద్ది, సమైక్యాంధ్ర కేక్ కట్ చేసి అందరికీ పంచిపెట్టారు. రిలే దీక్షలు యథావిధిగా కొనసాగాయి. పట్టణంలోని రెండు థియేటర్లలో తుఫాన్ సినిమా ప్రదర్శనను నిరసన కారులు అడ్డుకున్నారు. పోస్టర్లను చించేశారు. మదనపల్లెలో ఎన్జీవో జేఏసీ ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించారు. రిలే దీక్షలు కొనసాగాయి. సాయంత్రం గోల్డన్ వ్యాలీ విద్యార్థులు కాగడాల ప్రదర్శన నిర్వహించారు. చంద్రగిరిలో జేఏసీ దీక్షలు 30వ రోజుకు చేరుకున్నాయి. సమైక్యవాదులు రోడ్డుపై యోగాసనాలు వేసి నిరసన తెలిపారు. శ్రీకాళహస్తిలో ఉపాధ్యాయులు వినాయకుడి గుడిలో పూజలు నిర్వహించి రాష్ట్రం సమైక్యంగా ఉండేలా చూడాలని మొక్కుకున్నారు. పుత్తూరులో ఎమ్మెల్యే గాలి ముద్దుకృష్ణమనాయుడు ఆధ్వర్యంలో మానవహారం ఏర్పాటు చేశారు. పీలేరులో సమైక్య ఉద్యమం 32వ రోజుకు చేరింది. నిరసనకారులు క్రాస్‌రోడ్‌లో మోకాళ్లపై నిలబడి వెనక్కు నడిచి నిరసన తెలిపారు. చిత్తూరులో క్రైస్తవ సోదరులు మానవహారం ఏర్పాటు చేశారు. విద్యార్థులు, విద్యుత్ ఉద్యోగులు, న్యాయవాదులు, వివిధ ప్రజాసంఘాల ఆధ్వర్యంలో నిరసన ర్యాలీలు, మానవహారం ఏర్పాటు చేశారు. -
సభపై 7 కేసులు నమోదు
గజల్ శ్రీనివాస్‌ను లోపలికి అనుమతించటంపై ఫిర్యాదు దర్యాప్తు బాధ్యతలు స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీమ్‌కు నిందితుల గుర్తింపునకు వీడియో ఫుటేజ్‌ల పరిశీలన సాక్షి, హైదరాబాద్: ఏపీ ఎన్జీఓలు శనివారం ఎల్బీ స్టేడియంలో నిర్వహించినృ ‘సేవ్ ఆంధ్రప్రదేశ్’ సభకు సంబంధించి స్థానిక సైఫాబాద్ పోలీస్‌స్టేషన్‌లో శని, ఆదివారాల్లో ఏడు కేసులు నమోదయ్యాయి. రెచ్చగొట్టేలా ప్రవర్తించటం, బెదిరించటం, తీవ్రంగా దాడి చేయటం, హత్యాయత్నం తదితర సెక్షన్ల కింద వీటిని నమోదు చేశారు. ఉద్యోగి కాని గజల్ శ్రీనివాస్‌ను సభకు అనుమతించటం, సభలో ఆయన ప్రసంగించడంపై అందిన ఫిర్యాదును జనరల్ డైరీలో నమోదు చేసిన పోలీసులు కేసు నమోదుపై త్వరలో నిర్ణయం తీసుకోనున్నారు. 7 కేసులను దర్యాప్తు నిమిత్తం హైదరాబాద్ సెంట్రల్ క్రైమ్ స్టేషన్(సీసీఎస్) అధీనంలోని ప్రత్యేక దర్యాప్తు బృందం(సిట్)కు బదిలీ చేశారు. సభలో పాల్గొనేందుకు బషీర్‌బాగ్ చౌరస్తా వైపు నుంచి నిజాం కాలేజీ హాస్టల్ మీదుగా స్టేడియం ‘జీ’ గేట్ వద్దకు వచ్చిన ఓ వ్యక్తి చేష్టలు వివాదాస్పదమయ్యాయి. నినాదాలు చేస్తున్న హాస్టల్ విద్యార్థులను ఉద్దేశించి అతడు రెచ్చగొట్టే సంజ్ఞ చేయడంతో విద్యార్థులు భగ్గుమన్నారు. ఆ తరవాత ఒక్కసారిగా హాస్టల్ లోపల నుంచి రాళ్ల వర్షం కురిపించడంతో సభకు వెళ్తున్న పలువురు గాయపడ్డారు. దీనికి సంబంధించి అందిన ఫిర్యాదుతో వివాదాస్పదంగా సంజ్ఞలు చేసిన గుర్తు తెలియని వ్యక్తిపై కేసు నమోదు చేశారు. సభ ప్రారంభమైన తరవాత వేదిక సమీపంలో ‘జై తెలంగాణ’ నినాదాలు చేసిన తమపై కొందరు దాడి చేశారంటూ ఏఆర్ కానిస్టేబుళ్లు కయ్యాడ శ్రీనివాస్, శ్రీశైలం ఇచ్చిన ఫిర్యాదులతో మరో రెండు కేసుల్ని నమోదు చేశారు. అంబేద్కర్ విగ్రహం చౌరస్తాలో ఆందోళన చేస్తున్న ఎమ్మార్పీఎస్ కార్యకర్తల అరెస్టు సందర్భంగా నిరసనకారులు ఓ పోలీసు వాహనాన్ని ధ్వంసం చేశారు. అసెంబ్లీ ఎదురుగా తెలంగాణ న్యాయవాదుల్ని అరెస్టు చేస్తున్నప్పుడు నాలుగు పోలీసు వాహనాలు ధ్వంసమయ్యాయి. ఈ రెండు ఘటనలకు సంబంధించి సైఫాబాద్ పోలీసులు కేసులు నమోదు చేశారు. తమపై గుర్తు తెలియని వ్యక్తులు దాడి చేశారంటూ తెలంగాణ జర్నలిస్ట్ ఫోరం ఇచ్చిన ఫిర్యాదుతోపాటు సభకు వచ్చిన కొందరు తనపై దాడి చేశారంటూ ఓయూ జేఏసీ నేత కన్వీనర్ బాలరాజు యాదవ్ ఫిర్యాదు మేరకు మరో రెండు కేసులు రిజిస్టర్ చేశారు. ఈ ఏడు కేసుల్లో నిందితుల్ని గుర్తించడం కోసం స్టేడియం పరిసర ప్రాంతాల్లో చిత్రీకరించిన వీడియో టేపులను పరిశీలిస్తున్నారు. వీటిని విశ్లేషించిన తరువాత చర్యలు తీసుకోవాలని నిర్ణయించారు. గజల్ శ్రీనివాస్ సభలోకి ప్రవేశించిన తీరును కూడా వీడియో ఫుటేజ్‌ల ద్వారా గుర్తించాలని నిర్ణయించారు. కాగా సేవ్ ఆంధ్రప్రదేశ్ సభను ఎల్బీస్టేడియంలో నిర్వహించిన ఏపీఏన్జీవో నాయకులపై తెలంగాణ విద్యార్థి, ఓయూ విద్యార్థి జేఏసీ నాయకులు హైదరాబాద్‌లోని పలు పోలీస్ స్టేషన్లలో ఫిర్యాదు చేశారు. సీమాంధ్రుల బస్సులపై దాడి ఘటనలో 13 మంది అరెస్ట్! ఇదిలా ఉండగా సేవ్ ఆంధ్రప్రదేశ్ సభకు హాజరై హైదరాబాద్ నుంచి తిరిగి వెళుతున్న సీమాంధ్రుల బస్సులపై దాడి ఘటనలో 13 మంది అనుమానితుల్ని అదుపులో తీసుకున్నట్టు తెలిసింది. ఈ ఘటనపై హయత్‌నగర్ పోలీసులు కేసు నమోదు చేశారు. -
తెలంగాణలో నిరసనల హోరు
న్యూస్‌లైన్ నెట్వర్క్ : హైదరాబాద్‌లో నిర్వహించిన ‘సేవ్ ఆంధ్రప్రదేశ్’ సభ, ఓయూలో పోలీసుల తీరు, నిజాం కాలేజీలో విద్యార్థుల అరెస్టు వంటి సంఘటనలు నిరసిస్తూ ఆదివారం తెలంగాణలో నిరసనలు వెల్లువెత్తాయి. నిజామాబాద్ జిల్లాలో ఇందూరు బ్రాహ్మణ సేవా సంఘం తెలంగాణ సాధన యజ్ఞం నిర్వహించింది. పీడీఎస్‌యూ జిల్లా కమిటీ రాస్తారోకో చేపట్టింది. ఆదిలాబాద్ జిల్లా మంచిర్యాలలో టీఆర్ఎస్వీ, శ్రీరాంపూర్‌లో ఏఐవైఎఫ్ ఆధ్వర్యంలో అర్ధనగ్న ప్రదర్శనలు నిర్వహించారు. కాగజ్‌నగర్, రెబ్బెనలో జేఏసీలు సమైక్యవాదుల, సీఎం దిష్టిబొమ్మలను దగ్ధం చేశారు. నల్లగొండ జిల్లా కేంద్రంలో బీడీఎస్ఎఫ్, పీడీఎస్‌యూ, తెలంగాణ విద్యావంతుల వేదికలు రాస్తారోకో చేసి.. సీఎం, డీజీపీల దిష్టిబొమ్మలను దహనం చేశారు. మహబూబ్‌నగర్ జిల్లాలోని కొత్తకోట, వనపర్తి, మహబూబ్‌నగర్, దేవరకద్ర, నారాయణపేట, కల్వకుర్తి, అచ్చంపేట నియోజకవర్గ కేంద్రాల్లో సీఎం కిరణ్, డీజీపీ దినేష్‌రెడ్డి దిష్టిబొమ్మలను దహనం చేశారు. కరీంనగర్ జిల్లా కేంద్రంలోని తెలంగాణ చౌక్‌లో బీజేపీ మహిళా మోర్చా ఆధ్వర్యంలో సీఎం, డీజీపీల దిష్టిబొమ్మలకు నిప్పంటించారు. ఏపీ ఎన్జీవోల సభలో కానిస్టేబుల్‌పై దాడికి నిరసనగా మెదక్ జిల్లాలోని దుబ్బాక మండలం చిట్టాపూర్‌లో టీఆర్ఎస్ ఆధ్వర్యంలో రాస్తారోకో చేశారు. వరంగల్ జిల్లా హన్మకొండ చౌరస్తాలో టీఆర్ఎస్ యూత్ విభాగం ఆధ్వర్యంలో, విద్యారణ్యపురిలో తెలంగాణవాదులు సీఎం దిష్టిబొమ్మను దహనం చేశారు. రంగారెడ్డి జిల్లా వ్యాప్తంగా ఆందోళనలు, నిరసన కార్యక్రమాలు జరిగాయి. మరోవైపు శనివారం హైదరాబాద్‌లో సీమాంధ్ర ఉద్యోగులు నిర్వహించిన ‘సేవ్ ఆంధ్రప్రదేశ్’ సభలో జాతీయ గీతాన్ని తప్పుగా ఆలపించారని ఆరోపిస్తూ గజల్ శ్రీనివాస్‌పై పలుచోట్ల పోలీసులకు ఫిర్యాదు చేశారు. నల్లగొండ జిల్లా సూర్యాపేట, కరీంనగర్ జిల్లా వేములవాడ, రంగారెడ్డి జిల్లా వికారాబాద్, వరంగల్ జిల్లా కేంద్రంలోని ఠాణాల్లో ఫిర్యాదు చేశారు. -
ఉక్రోషంతో దాడులు
తణుకు అర్బన్, న్యూస్‌లైన్ : హైదరాబాద్‌లో ‘సేవ్ ఆంధ్రప్రదేశ్’ సభకు హాజరైన ‘పశ్చిమ’ ఏపీఎన్జీవోలు ఆదివారం జిల్లాకు చేరుకున్నారు. హైదరాబాద్ వెళ్లేటప్పుడు, తిరుగు ప్రయాణంలోనూ అడుగడుగునా తెలంగాణవాదులు ఎన్ని అడ్డంకులు సృష్టించినా సీమాంధ్ర భవిష్యత్ కోసం ప్రాణాలకు తెగించి ముందుకు సాగినట్లు ఉద్యోగులు తెలిపారు. సభ పూర్తిస్థాయిలో సక్సెస్ కావడంతో తెలంగాణవాదులు ఉక్రోషాన్ని ఆపుకోలేక దాడులకు పాల్పడ్డారని పేర్కొన్నారు. ఈ సభకు తణుకు నుంచి 5 బస్సులో ఏపీఎన్జీవోలు వెళ్లారు. హైదారాబాద్ నుంచి తిరిగివస్తుండగా చౌటుప్పల్ వద్ద తెలంగాణవాదులు చేసిన దాడిలో పలువురు గాయపడ్డారు. బస్సులపై జరిగిన రాళ్ల దాడిలో వైవీ సత్యనారాయణమూర్తి, కొమరవరం వీఆర్వో ఏజేబీవీ నారాయణ, ఎస్ ఇల్లింద్రపర్రు వీఆర్వో వి.ముత్యాలరావు, బస్సు డ్రైవర్ వీరింకి ఏడుకొండలు గాయపడ్డారు. నారాయణకు నుదుటిపై తీవ్ర గాయం కావడంతో ఏడు కుట్లు, ముత్యాలరావుకు చెవికి గాయమై ఐదు కుట్లు పడినట్లు ఎన్జీవోలు చెప్పారు. ఎన్జీవోలు వైవీ సత్యనారాయణమూర్తి, పితాని వెంకటరమణ మాట్లాడుతూ సభను అడ్డుకునేందుకు తెలంగాణలో బంద్ ప్రకటించిన కోదండరాం, కేసీఆర్, హరీష్‌రావులే ఈ దాడులకు కారణమని ఆరోపించారు. చౌటుప్పల్ పోలీస్ స్టేషన్ ప్రాంతంలో దాడులకు పాల్పడినవారిని ఎన్జీవోల నాయకులు తెలంగాణ పోలీసులకు చూపించినా పట్టించుకోలేదన్నారు. 80 కిలోమీటర్ల వేగంతో వెళ్తున్న బస్సుపై అకస్మాత్తుగా జరిగిన రాళ్లదాడిలో బస్సు డ్రైవర్ వీరంకి ఏడుకొండలు గాయపడినా చాకచక్యంగా బస్సును నిలువరించడంతో బస్సులో ఉన్న 40 మంది ఎన్జీవోలు సురక్షితంగా బయటపడ్డామని చెప్పారు. ఎన్జీవోలకు పలువురి పరామర్శ గాయపడిన ఎన్జీవోలను వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ తణుకు నియోజకవర్గ సమన్వయకర్త చీర్ల రాధయ్య పరామర్శించారు. పైడిపర్రు ఆర్వోబీ ప్రాంతంలో బస్సులను ఆపి గాయాలైన వారి ఆరోగ్య పరిస్థితి అడిగి తెలుసుకున్నారు. సభ సక్సెస్‌పై అభినందనలు తెలిపారు. తహసిల్దార్ ఎం.హరిహర బ్రహ్మాజీ, జేఏసీ నాయకులు ఎన్జీవోలను పరామర్శించారు. ఊపిరి పీల్పుకున్న కుటుంబ సభ్యులు చింతలపూడి: ‘సేవ్ ఆంధ్రప్రదేశ్’ సభకు వెళ్లిన చింతలపూడి ఏపీ ఎన్జీవోలు ఆదివారం సురక్షితంగా తమ ప్రాంతానికి చేరడంతో వారి కుటుంబ సభ్యులు ఊపీరి పీల్చుకున్నారు. శుక్రవారం రాత్రి చింతలపూడి నుంచి ఉద్యోగులతో బయలుదేరిన బస్సుపై ఖమ్మం జిల్లా మండాలపాడు గ్రామం వద్ద రాళ్ల దాడి జరిగిన సంగతి తెలిసిందే. సభ జరగకూడదని తెలంగాణవాదులు తమపై దాడులు చేసి భయభ్రాంతులకు గురి చేసినా సీమాంధ్ర భవిష్యత్ కోసం ముందుకే వెళ్లాలని నిర్ణయించుకున్నామని ఉద్యోగులు తెలిపారు. సదస్సులో సీమాంధ్ర ప్రజలకు జరుగుతున్న అన్యాయాలను మేథావుల ప్రసంగాల ద్వారా తెలుసుకునే వీలు కలిగిందని చెప్పారు. -
వారంలో కేబినేట్ నోట్.. త్వరలో అసెంబ్లీలో తీర్మానం: షబ్బీర్ ఆలీ
'సేవ్ ఆంధ్రప్రదేశ్' కార్యక్రమాన్ని నిర్వహించిన ఏపీఎన్జీఓలపై మాజీ మంత్రి షబ్బీర్ ఆలీ మండిపడ్డారు. సభా వేదికపై పలువురు నాయకులు ఫోటోలు పెట్టుకున్నవారు హైదరాబాద్ నగరానికి పునాది వేసిన నాయకులను ఎలా విస్మరిస్తారని ఆయన ప్రశ్నించారు. నిజాం, కుతుబ్ షాహీలను ఏపీఎన్జీఓలు ఎలా మరిచిపోతారని నిలదీశారు. ఏపీఎన్జీఓ నాయకులు ఎంత రెచ్చగొట్టినా.. తెలంగాణవాదులు రెచ్చిపోనందుకు నా సలాం అని షబ్బీర్ అలీ అన్నారు. హైదరాబాద్ లో రక్షణ లేనిది సీమాంధ్రలుకు కాదు.. తెలంగాణ వాదులకేనని ఆయన అన్నారు. ఎపీఎన్జీఓలు ఎంత రెచ్చగొట్టినా.. తెలంగాణప్రాంత ప్రజలు సంయమనంతో వ్యవహరించినందుకు సలాం అని అన్నారు. హైదరాబాద్ లో సభలెన్ని పెట్టుకున్నా తెలంగాణ ఏర్పాటును అడ్డుకోలేరని షబ్బీర్ తెలిపారు. వారం రోజుల్లో కేబినేట్ నోట్ ప్రవేశపెడుతారని..త్వరలోనే రాష్ట్ర అసెంబ్లీలో తీర్మానం చేస్తామన్నారు. రాష్ట్ర విభజన అనంతరం సీమాంధ్ర ఉద్యోగుల సమస్యలను పరిష్కారించాలని కేంద్రానికి తాము సూచించామని మీడియా సమావేశంలో వెల్లడించారు. -
కేబినేట్ నోట్ ను ఎలా ప్రవేశపెడుతారు: లగడపాటి
హైదరాబాద్: ఉద్యోగులు సభ పెట్టుకుంటే బెదిరిపోయే వాళ్లు ఉద్యమాలు ఏం చేస్తారని విజయవాడ ఎంపీ లగడపాటి రాజగోపాల్ ఎద్దేవా చేశారు. హైదరాబాద్ లో మీడియా సమావేశాన్ని నిర్వహించిన లగడపాటి.. టీఆర్ఎస్ నేతలు, జేఏసీ నేతలపై నిప్పులు చెరిగారు. పలు ఆంక్షలు పెట్టినా.. అడ్డుకున్నా ఎపీఎన్జీఓల సభ విజయవంతమైంది అని ఆయన అన్నారు. సభ ద్వారా సమైక్యవాదం వినిపిస్తారనే భయం టీఆర్ఎస్ నేతల్లో నెలకొని ఉందని అన్నారు. సభ పెట్టుకున్న ఎపీఎన్జీఓలకు పూలు పండ్లు ఇస్తానన్నవారు.. తిరిగి వెళ్తున్నవారిపై దాడుల చేయడం సమంజసమా లగడపాటి అని ప్రశ్నించారు. విభజన ప్రక్రియ పూర్తికాకుండా కేబినేట్ నోట్ ను ఎలా ప్రవేశపెడుతారని అన్నారు. ఏపీఎన్జీఓల సభను ఆసరా చేసుకుని కొంతమంది విద్వేషాలు రగిల్చేందుకు ప్రయత్నించారు. అయినా ఏపీఎన్జీఓలు సోదరభావంతో శాంతియుతంగా సభను నిర్వహించారు. ఏపీఎన్జీఓలు సభ పెట్టిన రోజే శాంతి ర్యాలీ, బంద్ లు ప్రకటించడం కోదండరాం సంకుచితభావానికి నిదర్శనమని లగడపాటి అన్నారు. నిజాం కాలేజిలో టీఆర్ఎస్సీవీ నాయకులకు ఏమి పని అని ఆయన నిలదీశారు. ఎప్పుడు ఎన్నికలు జరిగినా.. సమైక్యవాదులకు 240పైగా సీట్లు వస్తాయన్నారు. పిట్టపోరు పిట్టపోరు పిల్ల తీర్చినట్టు హైదరాబాద్ ను కేంద్రం తన్నుకుపోయే ప్రమాదం ఉందని ఆయన హెచ్చరించారు. -
సీమాంధ్రలో 40వ రోజుకు సమైక్యాంధ్ర ఉద్యమం!
రాష్ట్ర విభజనపై కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ తీసుకున్న నిర్ణయానికి నిరసనగా కోస్తాంధ్ర, రాయలసీమ ప్రాంతాల్లో ఆందోళనలు కొనసాగుతునే ఉన్నాయి. సీమాంధ్ర ప్రాంతంలో ఆందోళలు ఆదివారానికి 40వ రోజుకు చేరుకున్నాయి. సీమాంధ్రలో జరుగుతున్న సమైక్య ఉద్యమానికి వివిధ సంస్థలు, నేతలు, విద్యార్థులు రాస్తారోకోలతోపాటు, మానవహారాలు నిర్మిస్తూ 13 జిల్లాలో నిరసన తెలుపుతున్నారు. ఉద్యమం ప్రారంభించి.. నెలరోజులు పూర్తవుతున్నా..ఉద్యమ ప్రభావం తగ్గకపోగా.. మరింత ఉధృతమవుతోంది. సమైక్యాంధ్రకు మద్దతుగా కర్నూలు, అనంతపురం, తూర్పు గోదావరి, ఇతర జిల్లాలో ర్యాలీలు భారీ ఎత్తున కొనసాగుతున్నాయి. ఆదివారం రోజున గుంటూరు జిల్లాలో పెద్ద ఎత్తున్న మానవహారాన్ని నిర్మించారు. విజయనగరంలో పలు పార్టీలకు చెందిన నేతలు రోడ్లు ఊడ్చి నిరసన తెలిపారు. ఇతర జిల్లాలో సాంస్కృతిక కార్యక్రమాలతో రోడ్లపై ఆందోళన కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు. తూర్పు గోదావరి జిల్లాలో కాకినాడ-రాజమండ్రి రహదారిపై మహిళలు రాస్తారోకో కార్యక్రమాన్ని చేపట్టారు. హైదరాబాద్ లో శనివారం నిర్వహించిన 'సేవ్ ఆంధ్రప్రదేశ్' సభలో పాల్గొన్న ఎపీఎన్జీఓ ఉద్యోగులపై జరిపిన దాడులపై నిరసన వ్యక్తం చేశారు. -
ఏపీఎన్జీవోలు మిలీనియం మార్చ్ అవసరం లేదు: గీతారెడ్డి
తెలంగాణ ప్రజలు శాంతియుతంగా ఉండడం వల్లే సేవ్ ఆంధ్రప్రదేశ్ సభ విజయవంతమైందని రాష్ట్ర మంత్రి గీతారెడ్డి అభిప్రాయపడ్డారు. ఆదివారం కరీంనగర్ విచ్చేసిన ఆమె విలేకర్ల సమావేశంలో మాట్లాడారు. సభ వద్ద విధుల్లో ఉన్న కానిస్టేబుల్‌పై దాడి చేసిన ఘటన దురదృష్టకరమని ఆమె వ్యాఖ్యానించారు. గాయపడిని కానిస్టేబుల్‌ను టి.మంత్రులు పరామర్శిస్తామని తెలిపారు. అయితే నిజాం కాలేజీలో పోలీసుల లాఠీచార్జీ ఘటన బాధ కలిగించిందని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు. దీనిపై కాంగ్రెస్ పార్టీ అధిష్టానానికి ఫిర్యాదు చేస్తామన్నారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విభజనపై సీడబ్ల్యూసీలో తీసుకున్న నిర్ణయానికి యూపీఏ అధ్యక్షురాలు సోనియా కట్టుబడి ఉన్నారని గీతారెడ్డి ఈ సందర్భంగా గుర్తు చేశారు. త్వరలో తెలంగాణపై కేబినెట్ నోట్ తయారవుతుందని తెలిపారు. ఏపీఎన్జీవోలు నిర్వహించిన సేవ్ ఆంధ్రప్రదేవ్ సభ విజయవంతమైందని సంబర పడుతూ మరో సభ పెట్టాలని చూడటం సరైన చర్య కాదని గీతారెడ్డి వ్యాఖ్యానించారు. రాష్ట్ర విభజనపై తీసుకున్న నిర్ణయాన్ని కేంద్రం వెనక్కి తీసుకోకుంటే ఏపీఎన్జీవో అధ్యక్షుడు అశోక్ బాబు మిలీనియం మార్చ్ నిర్వహిస్తామని ప్రకటించారు. ఆ నేపథ్యంలో గీతారెడ్డిపై విధంగా స్పందించారు. -
ప్రభుత్వ డైరెక్షన్లోనే 'సేవ్ ఆంధ్రప్రదేశ్': బలరాం నాయక్
రాష్ట్ర ప్రభుత్వం డైరెక్షన్లోనే ఏపీఎన్జీవోలు నిన్న నిర్వహించిన 'సేవ్ ఆంధ్రప్రదేశ్' సభ జరిగిందని కేంద్ర మంత్రి పి.బలరాం నాయక్ అభిప్రాయపడ్డారు. ఆదివారం వరంగల్ జిల్లాలోని మహబూబాబాద్‌లో జరిగిన చేసిన ప్రత్యేక కార్యక్రమంలో వికలాంగులకు ఆయన మూడు చక్రాల సైకిళ్లను పంపిణీ చేశారు. అనంతరం ఆయన ప్రసంగిస్తూ... సీమాంధ్రులతో కలిసి ఉండలేమని నిన్నటి సభతో స్పష్టమైందని ఆయన పేర్కొన్నారు. జై తెలంగాణ అంటేనే దాడులు చేస్తున్న మీతో ఎందుకు కలిసి ఉండాలని ఆయన సీమాంధ్రులను ఉద్దేశించి ప్రశ్నించారు. తెలంగాణ ప్రాంత ప్రజలపై నిన్న దాడి జరిగిన టీ మంత్రులు ఎందుకు స్పందించడం లేదంటూ ఆయన వారిపై ఆగ్రహాం వ్యక్తం చేశారు. మీరు అనుసరిస్తున్న వైఖరి వల్లనే గతంలో కూడా మద్రాస్ నుంచి వెళ్లగొట్టారని, ఆ సంగతిని గుర్తుంచుకోవాలని సీమాంధ్రులకు ఈసందర్బంగా పి.బలరాం నాయక్ హితవు పలికారు. -
టీజీ నివాసంలో సీమాంధ్ర మంత్రులు భేటీ
రాష్ట్ర మంత్రి టీ.జీ.వెంకటేష్ నివాసంలో ఆదివారం ఉదయం సీమాంధ్రకు చెందిన మంత్రులు సమావేశమైయ్యారు. సమైక్యాంధ్రకు మద్దతుగా ఏపీఎన్జీవోల సంఘం శనివారం హైదరాబాద్‌లో నిర్వహించిన సేవ్ ఆంధ్రప్రదేశ్ సభకు వచ్చిన అపూర్వ స్పందనపై వారు ఈ సందర్భంగా చర్చించారు. అలాగే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని సమైక్యంగా ఉంచేందుకు చేపట్టవలసిన విధి విధానలపై వారి మధ్య చర్చకు వచ్చినట్లు సమాచారం. అందులోభాగంగా భవిష్యత్తు కార్యచరణపై చేపట్టవలసిన అంశాలపై సీమాంధ్ర ప్రాంతానికి చెందిన మంత్రులు చర్చించారు. సీమాంధ్ర మంత్రులు కాసు వెంకట కృష్ణారెడ్డి, వట్టి వసంత కుమార్, అనం రామనారాయణ రెడ్డి,ఏరాసు ప్రతాప రెడ్డి తదితరులు పాల్లొన్నారు. -
తెలంగాణలో ఆగని బలిదానాలు: ముగ్గురి మృతి.. ఒకరి ఆత్మహత్యాయత్నం
ప్రత్యేక రాష్ట్రం కోసం తెలంగాణలో ఆత్మబలిదానాలు కొనసాగుతున్నాయి. సీమాంధ్ర ఉద్యోగులు హైదరాబాద్‌లో నిర్వహించిన సభ తెలంగాణ ఏర్పాటుకు ఆటంకం కలిగిస్తుందని ఆందోళన చెంది మెదక్, కరీంనగర్ జిల్లాల్లో ఇద్దరు బలవన్మరణానికి పాల్పడగా, మరొకరు గుండెపోటుతో మరణించారు. రంగారెడ్డి జిల్లాలో మరో వ్యక్తి ఆత్మహత్యకు యత్నించాడు. కరీంనగర్ జిల్లా ఎల్లారెడ్డిపేట మండలం అడవిపదిర గ్రామానికి చెందిన ప్రశాంత్‌రెడ్డి(18) శనివారం ఏపీఎన్జీవోల సభకు సంబంధించిన దృశ్యాలను టీవీలో చూస్తూ కలత చెంది, మధ్యాహ్నం గ్రామ శివారులోని బావిలో దూకి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. అలాగే, బోయిన్పల్లి మండలం దేశాయిపల్లి గ్రామానికి చెందిన కొంకటి పర్శరాములు(45) శనివారం ఏపీఎన్జీవోల సభకు సంబంధించిన దృశ్యాలను టీవీలో చూస్తూ ఉద్వేగానికి లోనై కుర్చీలోనే కుప్పకూలిపోయి మరణించాడు. మెదక్ జిల్లా బాచేపల్లి పంచాయతీ బల్కంచెల్క తండాకు చెందిన మూడ్ సంగ్రాం (23) కూడా సేవ్ ఆంధ్రప్రదేశ్ వార్తలను టీవీలో చూస్తూ పురుగుల మందు తాగాడు. కుటుంబ సభ్యులు ఆస్పత్రికి తరలిస్తుండగానే తుదిశ్వాస విడిచాడు. మరో ఘటనలో... రంగారెడ్డి జిల్లా మొయినాబాద్ మండలం కనకమామిడికి చెందిన కట్టె మిషన్ రాజు (25) కూడా సమైక్య సభ విశేషాలను టీవీలో చూస్తూ తీవ్ర మనస్తాపానికి గురై, పురుగు మందు తాగి ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు. -
సర్కారు కార్యాలయాలు వెల వెల
‘సేవ్ ఆంధ్రప్రదేశ్’ సభకు తరలిన సీమాంధ్ర సిబ్బంది బంద్ వల్ల తెలంగాణ ఉద్యోగుల్లో కొందరే విధులకు హాజరు సచివాలయంలోనూ సెలవు వాతావరణం జారీ అయిన జీవోలు 28 మాత్రమే సాక్షి, హైదరాబాద్: సచివాలయంతో సహా రాజధానిలోని ప్రభుత్వ కార్యాలయాలన్నీ ఉద్యోగులు, సందర్శకులు లేక శనివారం వెల వెల బోయాయి. సీమాంధ్ర ఉద్యోగులందరూ నగరంలో జరిగిన ‘సేవ్ ఆంధ్రప్రదేశ్’ సభకు హాజరు కాగా, బంద్ కారణంగా తెలంగాణ ఉద్యోగుల్లో కొందరే విధులకు హాజరు కాగలిగారు. ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డితో సహా మంత్రులెవరూ సచివాలయానికి రాలేదు. దీంతో ముఖ్యమంత్రి విధులు నిర్వహించే సీ బ్లాక్‌తో సహా అన్ని బ్లాక్‌లూ బోసిపోయాయి. సాధారణ పరిపాలన శాఖ, ముఖ్యమంత్రి కార్యాలయంలో పనిచేసే సీమాంధ్ర ఉద్యోగులందరూ సభకు తరలి వెళ్లిపోవడం విశేషం. దీంతో సీఎం కార్యాలయ అధికారుల పేషీలు సిబ్బంది లేక నిర్మానుష్యంగా మారాయి. సందర్శకులు కూడా శనివారం సచివాలయం వైపు కన్నెత్తి చూడలేదు. దీంతో అరకొరగా హాజరైన తెలంగాణకు చెందిన ఉద్యోగులతో సచివాలయం సెలవు వాతావరణాన్ని తలపించింది. సచివాలయం నుంచి రోజుకు 300 వరకూ జీవోలు జారీ అవుతుంటాయి. విభజన ప్రకటన తరువాత వీటి సంఖ్య 150 నుంచి 200కు పడిపోయింది. శనివారం నాడు 28 జీవోలు మాత్రమే జారీ అయ్యాయి. రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి మహంతి మాత్రం సచివాలయం నుంచి శాంతిభద్రతల పరిస్థితిని సమీక్షించారు. రాజధానిలోని పాఠశాల విద్య డెరైక్టరేట్, రాష్ట్ర విద్యా పరిశోధన, శిక్షణ మండలి, ఉన్నత విద్యా మండలి, ఇంటర్మీడియట్ బోర్డులలో సీమాంధ్ర ఉద్యోగులతోపాటు, డీజీపీ కార్యాలయంలోని మినిస్టీరియల్ సిబ్బంది కూడా సభకు తరలివెళ్లడంతో, ఆయా కార్యాలయాలు కూడా బోసిపోయాయి. వివిధ శాఖల డెరైక్టరేట్లు, కమిషనరేట్లలోనూ సెలవు వాతావరణం నెలకొంది. ఆరో రోజూ సచివాలయ సీమాంధ్ర ఉద్యోగుల సమ్మె సమైక్యాంధ్ర కోరుతూ సచివాలయ సీమాంధ్ర ఉద్యోగులు ఆరో రోజూ సమ్మె కొనసాగించారు. శనివారం ఉదయమే సచివాలయం చేరుకున్న ఉద్యోగులు కాసేపు నిరసన తెలిపారు. అనంతరం సచివాలయం నుంచి ఏపీఎన్జీవోల ‘సేవ్ ఆంధ్రప్రదేశ్’ సభ జరిగే ఎల్బీ స్టేడియానికి ర్యాలీగా సాగారు. సచివాలయ సీమాంధ్ర ఫోరం అధ్యక్షుడు యు. మురళీకృష్ణ, కార్యదర్శి కె. వి కృష్ణయ్య నేతృత్వంలో వందలాది మంది సచివాలయ సీమాంధ్ర ఉద్యోగులు సభలో పాల్గొన్నారు. -
సమైక్య సందడి
సమైక్య నాదం మిన్నంటింది. ఏపీ ఎన్జీవోల సదస్సుకు అనూహ్య స్పందన లభించింది. నగరవ్యాప్తంగా కూకట్పల్లి, లింగంపల్లి, చందానగర్, భరత్‌నగర్, మూసాపేట్, మాదాపూర్, జూబ్లీహిల్స్, మాసబ్‌ట్యాంక్, మెహిదీపట్నం, సికింద్రాబాద్, ముషీరాబాద్, దిల్సుఖ్నగర్, ఎల్బీనగర్, నాగోలు, ఈసీఐఎల్, తార్నాక తదితర ప్రాంతాల్లో నివసించే రాష్ట్ర, కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు తమతో పాటు కుటుంబ సభ్యులను సభాప్రాంగణానికి తీసుకువచ్చారు. గుర్తింపు కార్డులున్న ప్రభుత్వ ఉద్యోగులను మాత్రమే పోలీసులు అనుమతించడంతో.. వేలాది మంది జనం ప్రాంగణం వెలుపలే ఉండిపోయారు. స్టేడియం బయట ఏర్పాటు చేసిన బిగ్స్క్రీన్ల ద్వారా వక్తల ప్రసంగాలను ఆసక్తిగా ఆలకించారు. పోలీసులతో పాటు నగరవాసుల్నీ తీవ్ర ఉత్కంఠకు గురిచేసిన ఏపీఎన్జీఓల సభ ప్రశాంతంగా ముగియడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు. ఈ సందర్భంగా అక్కడక్కడా చెదురుమదురు ఘటనలు మినహా ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటుచేసుకోలేదు. సిటీ మొత్తం పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేసిన నగర పోలీసులు ఎల్బీ స్టేడియం, ఓయూ పరిసరాలపై ప్రత్యేక దృష్టి సారించారు. ఈ సందర్భంగా 366 మందిని అరెస్టు చేసి విడుదల చేశారు. ఇవీ విశేషాలు... ఉదయం 6 గంటల నుంచే ఏపీ ఎన్జీవోస్ ఎల్బీ స్టేడియం వద్ద బారులు తీరారు. సికింద్రాబాద్, కాచిగూడ రైల్వేస్టేషన్లకు వచ్చిన సీమాంధ్ర ఉద్యోగులు సభాప్రాంగణానికి చేరుకునేందుకు బస్సులు లేక అవస్థలు పడ్డారు. సభ కోసం గన్‌ఫౌండ్రీ, సుజాతా స్కూల్, బషీర్‌బాగ్, అసెంబ్లీ ఎదురుగా నాంపల్లి ప్రాంతాల్లో బారికేడ్లను ఏర్పాటు చేయడంతో ప్రజలు పలు అవస్థలకు గురయ్యారు. సచివాలయ సీమాంధ్ర ఉద్యోగుల ఫోరం ఆధ్వర్యంలో సుమారు 1500 మంది ఉద్యోగులు భారీ ర్యాలీగా సభకు హాజరయ్యారు. సభకు పెద్ద ఎత్తున తరలివచ్చిన మహిళలు సమైక్య నినాదాలు, నృత్యాలతో కదం తొక్కారు. శనివారం తెల్లవారుజామున ఉద్యోగులతో వస్తున్న ఏపీ 09 టీఏ 3969 నంబరు గల ప్రైవేటు బస్‌ను అనుసరిస్తూ బైక్‌పై వచ్చిన ఇద్దరు గుర్తుతెలియని యువకులు చైతన్యపురి పుష్పాగార్డెన్ సమీపంలో రాళ్లు విసిరారు. దీంతో బస్ ముందు అద్దం పగిలింది. ఎవరికీ గాయాలు కాలేదు. బషీర్‌బాగ్ చౌరస్తా వైపు నుంచి నిజాం హాస్టల్ మీదుగా స్టేడియం ఁజీరూ. గేట్ వద్దకు వస్తున్న ఓ వ్యక్తి వివాదాస్పదంగా వ్యవహరించడంతో హాస్టల్ విద్యార్థులు భగ్గుమన్నారు. ఒక్కసారిగా హాస్టల్ నుంచి రాళ్ల వర్షం కురిపించడంతో సభకు వెళ్తున్న అనేకమంది గాయపడ్డారు. ఓ పోలీసు వాహనం అద్దాలు ధ్వంసమయ్యాయి. రంగంలోకి దిగిన పోలీసులు హాస్టల్లో గాలించి టీఆర్ఎస్వీ నేత బాలుక సుమన్‌తో పాటు మరికొందరిని అరెస్టు చేశారు. కేఎల్కే ఎస్టేట్ వైపు ఉన్న ఔటర్గేట్ వద్ద ఓయూ జేఏసీ నేత బాలరాజ్ యాదవ్‌తోపాటు మరో ముగ్గురు అక్కడ ఉన్న ఏపీఎన్జీఓల మధ్యకు వెళ్లి నల్లజెండాలు చూపుతూ జై తెలంగాణ నినాదాలు చేశారు. ఏపీఎన్జీఓలూ జై సమైక్యాంధ్ర నినాదాలు ప్రారంభించడంతో పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. కొందరు గుర్తుతెలియని వ్యక్తులు బాలరాజ్తోపాటు మిగిలిన వారి పైనా దాడి చేశారు. నిజాం హాస్టల్లో ఉంటున్న కల్వకుర్తికి చెందిన శేఖర్ అనే విద్యార్థి భవనంపై నుంచి పడి తీవ్రంగా గాయపడటంతో ఉస్మానియా ఆస్పత్రిలో చికిత్స చేశారు. సభా ప్రాంగణంలోకి వెళ్లేందుకు బషీర్‌బాగ్ ప్రెస్‌క్లబ్ వద్ద ఉన్న కొందరు న్యాయవాదుల పైనా గుర్తుతెలియని వ్యక్తులు దాడి చేశారు. అసెంబ్లీ మీదుగా వెళ్తున్న ప్రొటోకాల్ విభాగం కాన్వాయ్ వాహనంపై దాడి చేసిన గుర్తుతెలియని వ్యక్తులు ఓ స్కార్పియో అద్దాలు ధ్వంసం చేశారు. ఓ దశలో పీసీఆర్ చౌరస్తాలో ఏపీఎన్జీఓలు, తెలంగాణవాదులు ఎదురు కావడంతో పోలీసులు స్వల్ప లాఠీచార్జ్ చేశారు. ఐడీ కార్డు లేనందున గజల్ శ్రీనివాస్, వంగపండు ప్రసాద్‌లకు స్టేడియంలోకి అనుమతి నిరాకరించారు. దీంతో వంగపండు రోడ్డుపై భైటాయించి నిరసన వ్యక్తంచేశారు. మధ్యాహ్నం 1.30 ప్రాంతంలో గజల్ శ్రీనివాస్‌ను స్టేడియంలోకి అనుమతించారు. ఎల్బీస్టేడియం బయట ప్రజాగాయకుడు వంగపండు ఆధ్వర్యంలో శ్రీకృష్ణ దేవరాయ యూనివర్శిటీ విద్యార్థులు భజనలు చేస్తూ పెద్ద ఎత్తున పాటలు పాడి అలరించారు. ఎంజీబీఎస్‌లో ఉదయం నుంచే బస్సులు రాకపోకలు పూర్తిగా నిలిచిపోవడంతో ఎంజీబీఎస్‌కు వచ్చిన ప్రయాణికులు అవస్థలు పడ్డారు. సాయంత్రం నిజాం హాస్టల్ ఎదురుగా ఓ పోలీసు వాహనాన్ని గుర్తుతెలియని వ్యక్తులు ధ్వంసం చేశారు. స్టేడియంలోకి ప్రవేశించిన తెలంగాణవాది చంద్రశేఖర్, విధుల్లో ఉన్న కానిస్టేబుల్ శ్రీనివాస్ జై తెలంగాణ నినాదాలు చేయడం వివాదాస్పదమైంది. సీమాంధ్ర ప్రాంతానికి చెందినవారు తమపై దాడి చేశారంటూ తెలంగాణ జర్నలిస్టులు నిజాం హాస్టల్ వద్ద ధర్నా చేసి, వారిపై చర్యలు తీసుకోవాల్సిందిగా నగర పోలీసు కమిషనర్‌కు ఫిర్యాదు చేశారు. స్టేడియం లోపలకు అనుమతించక పోవడంతో అనేక మంది ఐడీ కార్డులు లేని ఏపీఎన్జీఓలు, ప్రైవేట్ ఉద్యోగులు గేట్ల వద్దే ఆగిపోయారు. వివిధ విడతల్లో ఆరుగురు వ్యక్తులు వీరి మధ్యకు వచ్చి జై తెలంగాణ నినాదాలు చేయడంతో పోలీసులు చెదరగొట్టారు. సభ ముగిసిన తరవాత సీమాంధ్ర వైపు తిరిగి వెళ్తున్న వాహనాలపై మలక్‌పేట, అబ్దుల్లాపూర్‌మెట్ ప్రాంతాల్లో రాళ్ల దాడులు జరిగాయి. నగరవాసుల ఆతిథ్యం సీమాంధ్ర జిల్లాల నుంచి తాము వస్తున్నట్లు ముందుగా సమాచారం ఇచ్చిన వారికి నగరవాసులు ప్రత్యేకమైన ఏర్పాట్లు చేశారు. అబిడ్స్, దిల్సుఖ్నగర్, కూకట్పల్లి, మాదాపూర్.. తదితర ప్రాంతాల్లోని ఫంక్షన్ హాల్స్ బుక్‌చేసి ఆతిథ్యం ఇచ్చారు. దూరప్రాంతాల నుంచి నగరానికి అర్ధరాత్రి, వేకువ జామున బస్సుల్లో అలిసి వచ్చిన పలువురు ఉద్యోగులు సేదతీరారు. ఇదిలా ఉంటే.. సేవ్ ఆంధ్రప్రదేశ్ సభా ప్రాంగణంలో కూడా సభికులకు అవసర మైన మేరకు మంచినీటి ప్యాకెట్లు, పులిహోర పొట్లాలు, బిస్కట్ ప్యాకెట్లను పంపిణీ చేశారు. వాలంటీర్ల ద్వారా మంచినీరు, అల్పాహారం స్టేడియంలోని వేలాది మందికీ చేరేలా నిర్వాహకులు చర్యలు తీసుకున్నారు. 366 మంది ముందస్తు అరెస్టు: అనురాగ్ శర్మ, కొత్వాల్ ఏపీఎన్జీఓల సభ, బంద్ నేపథ్యంలో నగర వ్యాప్తంగా 366 మందిని ముందస్తు అరెస్టు చేసి విడిచిపెట్టినట్లు నగర పోలీసు కమిషనర్ అనురాగ్ శర్మ వెల్లడించారు. వీరిలో మధ్య మండలంలో 147, తూర్పు మండలంలో 94, పశ్చిమ మండలంలో 39, ఉత్తర మండలంలో 86 మంది ఉన్నారన్నారు. మరోపక్క సిటీలో శనివారం ఎనిమిది ర్యాలీలు, 19 చోట్ల బలవంతంగా దుకాణాలు మూయించే ప్రయత్నాలు, ఆరు దిష్టిబొమ్మల ద హనాలు, నాలుగు ధర్నాలు, 12 నిరసన ప్రదర్శనలు, ఒకచోట రాస్తారోకో, మరోచోట రాళ్ల దాడి జరిగాయని వివరించారు. -
నిజాం హాస్టల్లో టెన్షన్.. టెన్షన్!
సాక్షి, హైదరాబాద్: ఏపీఎన్జీవోల ‘సేవ్ ఆంధ్రప్రదేశ్’ సభ నేపథ్యంలో శనివారం ఉదయం నుంచి సాయంత్రం దాకా నిజాం కాలేజీ హాస్టల్లో తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు ఏర్పడ్డాయి. బయటి విద్యార్థులను (ఔటర్స్) హాస్టల్ నుంచి పంపించేందుకు పోలీసులు ప్రయత్నించడంతో ఇరువర్గాల మధ్య తోపులాట, వాగ్వాదం చోటుచేసుకుంది. పోలీసులు హాస్టల్లోకి రావడాన్ని నిరసిస్తూ విద్యార్థులు హాస్టల్ భవనంపైకి ఎక్కి నిరసన తెలిపారు. వారిని కిందకు దింపేందుకు పోలీసులు వెళ్లడంతో విద్యార్థులు అడ్డుకున్నారు. దీంతో పోలీసులు లాఠీలను ఝళిపించడంతో పలువురు విద్యార్థులు గాయాలపాలయ్యారు. విద్యార్థులపై లాఠీచార్జిని ఓయూ జేఏసీ, టీఎస్ జాక్ తీవ్రంగా ఖండించాయి. ఇక ఏపీఎన్జీవోల సభలో ‘జై తెలంగాణ’ నినాదాలు కలకలం సృష్టించాయి. ఉస్మానియా విశ్వవిద్యాలయ విద్యార్థి జేఏసీ నేత దూదిమెట్ల బాలరాజు యాదవ్ పోలీసుల కన్నుగప్పి సభలోకి వెళ్లి తెలంగాణ నినాదాలు చేశారు. అలాగే ఇదే సభలో ప్రసంగాలు సాగుతుండగా వేదిక సమీపంలో విధుల్లో ఉన్న సిద్దిపేట సాయుధ రిజర్వ్ పోలీస్ కానిస్టేబుల్ శ్రీనివాస్ జై తెలంగాణ అంటూ నినదించారు. దీంతో వీరిద్దరిపై సభకు వచ్చిన వారిలో పలువురు దాడికి పాల్పడ్డారు. -
టీజేఏసీ నేతల అరెస్ట్
హైదరాబాద్, న్యూస్‌లైన్: ఏపీ ఎన్జీవోలు శనివారం హైదరాబాద్‌లో నిర్వహించిన ‘సేవ్ ఆంధ్రప్రదేశ్’ సభ సందర్భంగా పోలీసులు అరెస్ట్ చేసిన నిజాం కళాశాల విద్యార్థులను పరామర్శించేందుకు వచ్చిన టీజేఏసీ చైర్మన్ ఫ్రొఫెసర్ కోదండరాం, టీఎన్జీవోల అధ్యక్షుడు దేవీప్రసాద్, తెలంగాణ గెజిటెడ్ అధికారుల సంఘం అధ్యక్షుడు శ్రీనివాస్‌గౌడ్, తెలంగాణ మాలమహానాడు అధ్యక్షుడు అద్దంకి దయాకర్, ప్రగతిశీల మహిళా సంఘం అధ్యక్షురాలు సంధ్య, తెలంగాణ ఉద్యోగుల సంఘం అధ్యక్షుడు విఠల్ తదితరులను అరెస్ట్ చేసినట్లు పోలీసు అధికారులు ప్రకటించటంపై తెలంగాణవాదులు తీవ్ర నిరసన వ్యక్తం చేశారు. అరెస్ట్ చేసిన నేతలను వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేస్తూ పెద్దఎత్తున నినాదాలు చేయడంతో గోషామహల్ స్టేడియం వద్ద ఉద్రిక్తత నెలకొంది. అనంతరం టీజేఏసీ నాయకులు పోలీసుల అనుమతితో స్టేడియం గేటు బయటకు వచ్చి మీడియాతో మాట్లాడారు... అక్రమ కేసులు పెడతారేమో?: దేవీప్రసాద్ తెలంగాణ విద్యార్థులను అరెస్ట్ చేసిన పోలీసులు సాయంత్రం వరకు విడుదల చేయకపోవడం చూస్తుంటే అక్రమంగా కేసులు పెట్టాలని కుట్ర పన్నినట్లు భావిస్తున్నాం. ముఖ్యమంత్రి కార్యాలయానికి చెందిన అధికారులంతా సీమాంధ్ర సభలో పాల్గొన్నారు. ఈ సభను ప్రభుత్వమే నిర్వహించిందనేందుకు అనేక ఆధారాలున్నాయి. తెలంగాణా ప్రజలపై ఆధిపత్యం చెలాయించేందుకే సభ నిర్వహించారు. ఏపీఎన్జీవోల అధ్యక్షుడు అశోక్‌బాబు లేవనెత్తిన అంశాలన్నీ చర్చించుకుంటే పరిష్కారమయ్యేవే. జాతీయ గీతాన్ని అవమానించారు: శ్రీనివాస్‌గౌడ్ సేవ్ ఆంధ్రప్రదేశ్ సభలో గజల్ శ్రీనివాస్ జాతీయగీతాన్ని తప్పుగా ఆలపించి అవమానించారు. దీనిపై అక్కడే ఉన్న సచివాలయ ఉన్నతాధికారులు ఏం చర్యలు తీసుకుంటారో చూస్తాం. మేం సభలు పెడితే బారికేడ్లు పెట్టి రాకుండా అడ్డుకుంటారు. సీమాంధ్రుల సభకూ బారికేడ్లు పెట్టి మమ్మల్ని ఎటూ వెళ్లకుండా దిగ్బంధించారు. ఇది ప్రజాస్వామ్యమా? నిరంకుశమా? జై తెలంగాణా అన్న కానిస్టేబుల్‌ను చితకబాదారు. తెలంగాణ పదం నిషేధితమా? సీమాంధ్రలో పోటీ సభ నిర్వహిస్తాం: మంద కృష్ణమాదిగ ఒక్కసారి తెలంగాణ అని నినదించినందుకే కానిస్టేబుల్ అని కూడా చూడకుండా చితకబాదారు. కలిసి ఉందామంటూనే దాడులకు పాల్పడటం అమానుషం. నగరంలో సీమాంధ్రుల సభకు అనుమతించి రక్షణ కల్పించిన సీఎం కిరణ్ మాకు అనుమతిస్తే సీమాంధ్రలోనే పోటీ సభ నిర్వహిస్తాం. సీమాంధ్ర సభకు జనాలను బస్సుల్లో పోలీసు వాహనాల రక్షణతో తరలించినట్లు మా సభకు తరలించాల్సిన అవసరం లేదు. కేవలం సభకు అనుమతించి రక్షణ కలిస్తే చాలు. సభ ఎప్పుడు, ఎక్కడ? అనే వివరాలను ఆదివారం వెల్లడిస్తాం. చంపేందుకే కలిసుందామంటున్నారు: విఠల్ సభలో 30 శాతం కూడా ఉద్యోగులు లేరు. గజల్ శ్రీనివాస్, విద్యార్థి నేతలు, పీఆర్పీ మాజీ నేత డాక్టర్ మిత్ర వీరంతా ఉద్యోగులేనా? పోలీసులు వారిని లోపలికి ఎలా అనుమతించారో వివరణ ఇవ్వాలి. -
దాడులు చేసినా మా లక్ష్యం ఆగదు...
తిరుపతి(కార్పొరేషన్),న్యూస్‌లైన్: హైదరాబాద్‌కు రాకూడదని వితండవాదంతో సీమాంధ్రులపై దాడులు చేస్తే చూస్తూ ఊరుకునేది లేదని వేర్పాటువాదులను సాప్స్ తిరుపతి జేఏసీ కన్వీనర్ డాక్టర్ రాళ్లపల్లి సుధారాణి తీవ్రస్థాయిలో హెచ్చరించారు. శనివారం సేవ్ ఆంధ్రప్రదేశ్ సభకు వెళుతున్న సీమాంధ్ర ఉద్యోగులపై తెలంగాణవాదుల దాడులను నిరసిస్తూ సాప్స్ నాయకులు శనివారం ఆందోళనకు దిగారు. తొలుత ర్యాలీగా తెలుగుతల్లి విగ్రహం వద్దకు చేరుకుని పాలాభిషేకం చేశారు. ఈసందర్భంగా శ్రీవికాస్ కాలేజ్ ఆఫ్ నర్సింగ్ విద్యార్థులు తెలుగుతల్లి విగ్రహం వద్ద సమైక్యాంధ్రకు మద్దతుగా నినాదాలు చేశారు. ‘గుండె నొప్పికి మందులు వేసే మేము గుండెలేని నిన్ను మా ర్చురీకి పంపిస్తాం, అందరికీ ప్రాణాలుపోసే నర్సులం మేము మీకు మాత్రం ప్రాణాలు తీసే నర్సులం, కష్టాలు మాకు కాసులు మీకా, ఇటలీ సోనియా దేశం నుంచి వెళ్లిపోవాలి, నవభారతం రావాలి’ అంటూ దిక్కులు పిక్కటిల్లేలా నినాదాలు చేస్తూ వేర్పాటు వా దులపై ఆగ్రహం వ్యక్తం చేశారు. తుమ్మల విజయకుమార్ ఆధ్వర్యంలో వందలాది మంది విద్యార్థులు రోడ్డుపై బైఠాయించారు. వాహనాలను అడ్డుకుని సమైక్యాంధ్రకు మద్దతుగా నినాదాలు చేశారు. దాడులు చేసినా మా లక్ష్యం ఆగదు... శాంతియుతంగా ఉద్యమం చేస్తున్న సీమాంధ్రులపై కక్షతో దాడులు చేసినా సమైక్య ఉద్యమ లక్ష్యం మాత్రం ఆగదని డాక్టర్ సుధారాణి అన్నారు. విలేకరులతో ఆమె మాట్లాడుతూ త్యాగానికి, శాంతికి మారుపేరుగా సీమాంధ్రులు ఉద్యమం చేస్తుంటే తెలంగాణవాదులు వితండవాదంతో దాడులకు దిగుతున్నారని మండిపడ్డారు. ఈ పరిణామాలు వారి బుద్ధితక్కువ తనానికి నిదర్శనమని తెలిపారు. హైదరాబాద్‌లో సీమాంధ్రులపై జరుగుతున్న దాడులను గమనిస్తున్నామని, ఎంతరెచ్చగొట్టినా సమైక్య లక్ష్యం మాత్రం ఆగదన్నారు. తాము చేస్తున్న ఉద్యమం తెలంగాణవాదులకు వ్యతిరేకం కాదని, రాష్ట్ర విభజనకు చిచ్చు పెట్టిన రాజకీయ వేర్పాటు వాదులపై మాత్రమేనని స్పష్టం చేశారు. సాప్స్ రాష్ట్ర అధ్యక్షుడు డాక్టర్ కోడూరు బాలసుబ్రమణ్యం మాట్లాడుతూ సభకు వెళుతున్న సీమాంధ్రులపై దాడులకు పాల్పడడం అవివేకమన్నారు. వారు అడ్డుకున్నా సేవ్ ఆంధ్రప్రదేశ్ సభ విజయవంతం కావడమే ఇందుకు నిదర్శనమన్నారు. దీన్ని బట్టి హైదరాబాద్‌లోనూ సమైక్యవాదం కోరుకునే వారు అధికంగా ఉన్నారన్న వాస్తవాన్ని తెలుసుకోవాలని సూచించారు. రాజకీయ సంక్షోభం సృష్టిం చైనా సమైక్యాంధ్రను సాధించుకుని తీరుతామని ఆయన స్పష్టం చేశారు. సమైక్యవాదులు శ్రీనివాసచౌదరి, వివేక్, రెడ్డెయ్యరెడ్డి, జీవీ.కుమార్, శివశంకర్, ద్వారకనాథ్, హరి, దనంజయ, రాజు పాల్గొన్నారు. -
హైవే దిగ్బంధం
రావులపాలెం, న్యూస్‌లైన్: హైదరాబాద్‌లో సేవ్ ఆంధ్రప్రదేశ్ సభకు వెళ్లొస్తున్న రావులపాలెం ఉద్యోగుల బస్సుపై తెలంగాణవాదులు దాడి చేసిన సంఘటనపై స్థానిక సమైక్యాంధ్ర జేఏసీ మండిపడింది. దాడి సమాచారాన్ని ఫోన్ ద్వారా తెలుసుకున్న రావులపాలెం సమైక్యాంధ్ర జేఏసీ సభ్యులు ఆందోళన చేపట్టారు. దాడిలో గాయపడ్డ ఉద్యోగులకు న్యాయం జరిగే వరకు కదిలేది లేదంటూ శనివారం రాత్రి రోడ్డుపై బైఠాయించారు. స్థానిక కళా వెంకట్రావు సెంటరులో జాతీయ రహదారిపై ట్రాఫిక్‌ను స్తంభింపజేశారు. తెలంగాణవాదుల జులుం నశించాలంటూ నినాదాలు చేశారు. ట్రాఫిక్ స్తంభించడంతో ఎస్సై ఆర్.గోవిందరాజు ఆందోళనకారులతో చర్చించారు. జేఏసీ చైర్మన్ కర్రి శ్యామ్‌సుందరరెడ్డి హైదారాబాద్‌లో ఉన్న ఉద్యోగులతో ఫోన్లో మాట్లాడారు. అనంతరం ఆయన మాట్లాడుతూ సభ నుంచి తిరిగొస్తున్న ఇక్కడి ఉద్యోగుల బస్సు హైదరాబాద్ మలక్‌పేట వద్దకు వచ్చేసరికి తెలంగాణవాదులు రాళ్లతో దాడి చేశారన్నారు. దీంతో బస్సు అద్దాలు పగిలి కొందరికి గాయాలయ్యాయని, దీంతో వారు అక్కడ ఆందోళన చేపడితే.. అక్కడి పోలీసులు చర్యలు తీసుకోలేదన్నారు. డబ్బులిపిస్తామని, వెళ్లిపొమ్మన్నారని ఇక్కడకు సమాచారమిచ్చారన్నారు. వారికి మద్దతుగా దోషులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తూ జాతీయ రహదారి దిగ్బంధించామన్నారు. సీఐ సీహెచ్‌వీ రామారావు సంఘటన స్థలానికి చేరుకుని, విషయాన్ని జిల్లా ఎస్పీ శివశంకర్ రెడ్డి దృష్టికి తీసుకెళ్లారు. ఆయన హైదరాబాద్‌లో పోలీసు ఉన్నతాధికారులను సంప్రదించారు. వారి ఆదేశాలతో మలక్‌పేట పోలీసులు కేసు నమోదు చేశారు. దాని ఎఫ్ఐఆర్ నంబరును ఉద్యోగులు ఇక్కడ జేఏసీ ప్రతినిధులకు ఫోన్లో చెప్పడంతో ఆందోళన విరమించారు. కార్యక్రమంలో జేఏసీ సభ్యులు పీవీఎస్ సూర్యకుమార్, ఉప సర్పంచ్ కొవ్వూరి జగన్నాథరెడ్డి, పోతంశెట్టి కనికిరెడ్డి, కర్రి సుబ్బారెడ్డి, మన్యం పర్వతవర్ధనరావు పాల్గొన్నారు. -
తిరిగి వెళ్తున్న బస్సులపై రాళ్ల దాడులు
ఎల్బీ స్టేడియంలో ‘సేవ్ ఆంధ్రప్రదేశ్’ సదస్సు అనంతరం సీమాంధ్రకు తిరిగి వెళ్తున్న ఐదు బస్సులపై శనివారం రాత్రి గుర్తు తెలియని వ్యక్తులు పలుచోట్ల రాళ్ల దాడులకు పాల్పడ్డారు. విజయవాడ వైపు వెళ్లే జాతీయ రహదారిలోని హయత్‌నగర్, అబ్దుల్లాపూర్‌మెట్ మధ్య ఈ దాడులు చోటుచేసుకున్నాయి. హయత్‌నగర్‌లోని సన్రైస్ ఆసుపత్రి సమీపంలో ఒక బస్సు, రేడియో స్టేషన్ సమీపంలో ఒక బస్సు, లక్ష్మారెడ్డిపాలెంలో రెండు బస్సులు, అబ్దుల్లాపూర్‌మెట్ వద్ద ఒక బస్సుపై రాళ్లు విసిరారు. దీంతో ఆ బస్సుల అద్దాలు ధ్వంసమయ్యాయి. తూర్పు గోదావరి జిల్లా కాకినాడ కమర్షియల్ టాక్స్ ఉద్యోగి కట్టా సత్యనారాయణ, డ్రైవర్ విఘ్నేష్ గాయపడ్డారు. సత్యనారాయణను చికిత్స నిమిత్తం సన్‌రైజ్ ఆసుపత్రిలో చేర్పించారు. దాడి అనంతరం బస్సులో వెళ్తున్న వారంతా లక్ష్మారెడ్డిపాలెం వద్ద ఆందోళన నిర్వహించారు. తెలంగాణలో మాకు రక్షణ లేదని, పోలీసులు రక్షణ కల్పించడంలో విఫలమయ్యారని ఆగ్రహం వ్యక్తం చేశారు. సుమారు అరగంట సేపు ఆందోళన నిర్వహించగా కిలో మీటరు మేర ట్రాఫిక్ స్తంభించిపోయింది. ఎల్బీనగర్ డీసీపీ రవివర్మ, వనస్థలిపురం ఏసీపీ ఆనంద్భాస్కర్లు సంఘటనా స్థలానికి చేరుకుని వారికి సర్దిచెప్పారు. అనంతరం బస్సులను పోలీసు ఎస్కార్ట్ సహాయంతో పంపించారు. అబ్దుల్లాపూర్‌మెట్ వద్ద జరిగిన దాడి ఘటనలో.. బస్సులోంచి దిగిన ఉద్యోగులు రామోజీ ఫిలింసిటీ చౌరస్తా వద్ద రోడ్డుపై ధర్నాకు దిగారు. తెలంగాణవాదులు కూడా అక్కడకు చేరుకోవడంతో ఇరువర్గాల నినాదాలతో ఆ ప్రాంతం దద్దరిల్లింది. దీంతో అక్కడికి చేరుకున్న హయత్‌నగర్ సీఐ శ్రీనివాస్‌కుమార్ వారిని శాంతింపజేసి బస్సును ఎస్కార్ట్ సాయంతో ముందుకు పంపారు. -
‘సమైక్యత’ చాటిన సాంస్కృతిక కార్యక్రమాలు
‘ఇప్పటి దాకా కలసి ఉన్నాం... ఇకపైనా కలిసేఉందాం...’ అంటూ సమైక్య వాదాన్ని వివిధ జిల్లాలకు చెందిన కళాకారులు తమ సాంస్కృతిక కార్యక్రమాల ద్వారా వినిపించారు. హైదరాబాద్‌లోని లాల్‌బహదూర్ స్టేడియంలో శనివారం జరిగిన ‘సేవ్ ఆంధ్రప్రదేశ్’ సభావేదికపై ఈ కార్యక్రమాలు ఉర్రూతలూగించాయి. కడప జిల్లా కళాకారులు ఉర్దూ గజల్స్‌తో ఆకట్టుకున్నారు. ఎల్బీ శ్రీరాంను అనుకరిస్తూ ఉత్తరాంధ్రకు చెందిన ఓ కళాకారిణి చేసిన మిమిక్రీ ఆద్యంతం నవ్వులు పూయించింది. అలాగే చంద్రబాబు, బాలకృష్ణలకు కొన్ని ప్రశ్నలు సంధిస్తూ చేసిన హాస్య కార్యక్రమంతో సభకు విచ్చేసినవారి ముఖాల్లో చిరునవ్వులు వెల్లివిరిశాయి. చేయెత్తి జైకొట్టు తెలుగోడా... అంటూ సచివాలయ ఉద్యోగిని సత్యసులోచన బృందం ఆలపించిన పాటలు ఉత్సాహపరిచాయి. ఈ కార్యక్రమంలో సీమాంధ్ర విద్యుత్ ఉద్యోగుల బృందం వినిపించిన ‘వెయ్యి నినాదాల సహస్రోత్తరం’తో సభలో సమైక్యాంధ్ర నినాదాలు మార్మోగాయి. ‘మాకొద్దు మాకొద్దు మీ నజరానా... హైదరాబాద్ అందరి ఖజానా’ అంటూ తమ గానంతో అనంతపురం ఉద్యోగుల జేఏసీ మహిళలు సమైక్యవాదాన్ని చాటారు. ప్రత్యేకంగా శ్రీనివాస్ గజల్స్ ప్రముఖ గాయకుడు శ్రీనివాస్ వినిపించిన గజల్స్‌తో సమైక్యవాదుల గుండెలు ఉప్పొంగాయి. విభజనతో నష్టాలు, కలసిఉంటే కలిగే సుఖసంతోషాలను మధ్యమధ్యలో ఆయన వివరించడం ఆకట్టుకుంది. ఇది ఆత్మీయ సదస్సు కాదు, తెలుగుతల్లి కోసం చేస్తున్న తపస్సు అని ఆయన పేర్కొన్నారు. సమైక్య ఉద్యమంపై శ్రీనివాస్ గజల్స్‌తో రూపొందించిన సీడీలను సభావేదికపై ఆవిష్కరించారు. సాంస్కృతిక వేదికపైకి రావాల్సిన ఉత్తరాంధ్ర కళాకారుడు ‘వంగపండు’ బృందాన్ని పోలీసులు సభలోకి అనుమతించకపోవడంతో ఉద్యోగులు కొంత నిరాశ చెందారు. -
సైఫాబాద్ ఠాణాలో ఫిర్యాదులు
సేవ్ ఆంధ్రప్రదేశ్ పేరుతో ఏపీఎన్జీఓలు ఎల్బీ స్టేడియంలో నిర్వహించిన సభ, సంబంధిత పరిణామాలపై సైఫాబాద్ పోలీస్‌స్టేషన్‌కు శనివారం పలు ఫిర్యాదులు అందాయి. సభా వేదిక సమీపంలో జై తెలంగాణ నినాదాలు చేసిన ఏఆర్ కానిస్టేబుల్ కయ్యాడ శ్రీనివాస్‌గౌడ్ (పీసీ నం.2442)పై ఏఆర్ ఎస్సై మసూద్ పాషా ఫిర్యాదు చేశారు. మెదక్ జిల్లా ప్రాకారానికి చెందిన శ్రీనివాస్ సిద్దిపేట ఏఆర్ సబ్ హెడ్ క్వార్టర్స్ కానిస్టేబుల్‌గా పని చేస్తున్నారు. ఇతడితో పాటు అదే ప్రాంతానికి చెందిన మరో కానిస్టేబుల్ శ్రీశైలం (పీసీ నం- 2275) కూడా సభ బందోబస్తులో పాల్గొన్నారు. సభ కొనసాగుతుండగా ఉన్నట్టుండి శ్రీనివాస్ జై తెలంగాణ నినాదాలు చేయడంతో అతడిపై కొందరు పోలీసులు దాడి చేశారు. వారిని ఆపడానికి ప్రయత్నించిన శ్రీశైలం కూడా గాయపడ్డారు. ఈ ఇద్దరు కానిస్టేబుళ్లకు రవీంద్రభారతి చౌరస్తా వద్ద డ్యూటీ వేస్తే అక్కడికి కాకుండా ఎల్బీ స్టేడియంలో సభా ప్రాంగణం వద్దకు వెళ్ళారని, అక్కడ వారు విధుల్లోనే లేరని ఎస్సై పాషా ఫిర్యాదు చేశారు. జై తెలంగాణ అని నినాదాలు చేసినందుకు కానిస్టేబుల్‌పై దాడి చేశారంటూ టీఆర్ఎస్ నేతలు హరీష్‌రావు, జూపల్లి క్రిష్ణారావు, వినయ్‌భాస్కర్, సుధాకర్‌రెడ్డి, వివేక్, కేశవరావులు ఫిర్యాదు చేశారు. సైఫాబాద్ ఏసీపీ జగన్నాథరెడ్డి ప్రోద్బలంతోనే ఏఆర్ ఎస్సై ఇద్దరు కానిస్టేబుళ్లపై ఫిర్యాదు చేశారని హరీష్‌రావు ఆరోపించారు. మరోపక్క విధి నిర్వహణలో ఉన్న తమపై సీమాంధ్ర ప్రాంతంవారు అకారణంగా దాడి చేశారని, వారిపై చట్ట ప్రకారం చ ర్యలు తీసుకోవాలని కానిస్టేబుళ్లు శ్రీనివాస్, శ్రీశైలం వేర్వేరుగా ఫిర్యాదులు ఇచ్చారు. ఇలావుండగా జాతీయగీతాన్ని తప్పుగా ఆలపించారని పేర్కొంటూ న్యాయవాది బద్దం నర్సింహారెడ్డి గజల్ శ్రీనివాస్‌పై ఫిర్యాదు చేశారు. ఐజీ పీఎస్ఆర్ ఆంజనేయులు ఉద్యోగి కాని గజల్ శ్రీనివాస్‌ను సభా ప్రాంగణంలోకి స్వయంగా తీసుకువెళ్ళడం గమనిస్తే చట్టాన్ని పరిరక్షించాల్సిన పోలీసులే నిబంధనలను తుంగలో తొక్కుతున్నారని స్పష్టమైందని హరీష్‌రావు అన్నారు. -
‘సేవ్ ఆంధ్రప్రదేశ్ సభ’ విజయవంతం
హైదరాబాద్‌లో కదం తొక్కిన ఉద్యోగులు హైదరాబాద్: రాష్ట్ర రాజధాని వేదికగా ఉద్యోగుల సమైక్య నినాదం మారుమోగింది. రాష్ట్రాన్ని సమైక్యంగానే కొనసాగించాలంటూ శనివారం హైదరాబాద్‌లోని లాల్‌బహదూర్ స్టేడియంలో ఏపీఎన్జీవోలు నిర్వహించిన ‘సేవ్ ఆంధ్రప్రదేశ్ అవగాహన సదస్సు’ అనూహ్య విజయం సాధించింది. సీమాంధ్రలోని పదమూడు జిల్లాలతో పాటు.. హైదరాబాద్ నగరం నుంచి కూడా సమైక్యవాదులు సభకు పోటెత్తారు. విభజన వద్దు.. సమైక్యమే ముద్దు.. అంటూ ఎలుగెత్తి నినదించారు. రాష్ట్ర విభజనను ఎట్టి పరిస్థితుల్లోనూ అంగీకరించే ప్రసక్తే లేదని తేల్చిచెప్పారు. రాష్ట్రం విడిపోతే విద్యార్థులు, ఆర్టీసీ కార్మికులు, ఉద్యోగులు తీవ్రంగా నష్టపోతారని.. అన్ని రంగాల్లోనూ దెబ్బతింటామని ఆందోళన వ్యక్తంచేశారు. విభజనపై వెనక్కితగ్గే వరకు ఉద్యోగుల సమ్మె కొనసాగుతుందని స్పష్టంచేశారు. విభజన ప్రక్రియపై ముందుకెళితే హైదరాబాద్‌లో మిలియన్ మార్చ్ నిర్వహిస్తామని ప్రకటించారు. ఒకవైపు తెలంగాణ జేఏసీ పిలుపుతో తెలంగాణతో పాటు హైదరాబాద్ నగరంలోనూ బంద్ పాటించటం.. మరోవైపు ఉస్మానియా యూనివర్సిటీ విద్యార్థులు సమైక్య సభను అడ్డుకునేందుకు ర్యాలీగా వచ్చేందుకు చేసిన ప్రయత్నాన్ని పోలీసులు నిలువరించటంతో ఓయూలో ఉద్రిక్తత తలెత్తటం.. ఇంకోవైపు సభకు తరలివస్తున్న ఉద్యోగులతో నిజాం కాలేజీ వద్ద కొందరు విద్యార్థులు ఘర్షణకు దిగటం వంటి ఘటనలు చోటుచేసుకున్నప్పటికీ.. ఉద్యోగులు పెద్ద సంఖ్యలో సభకు హాజరయ్యారు. రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులు, విద్యుత్, మునిసిపాలిటీ, రెవెన్యూ సిబ్బంది, ఆర్టీసీ కార్మికులు, ఉపాధ్యాయులు భారీగా తరలివచ్చారు. శుక్రవారమే కొందరు ఉద్యోగులు నగరానికి చేరుకోగా.. శనివారం ఉదయానికి రైళ్లు, బస్సుల్లో పెద్ద సంఖ్యలో వచ్చారు. సభకు వస్తున్న ఉద్యోగులను ఉదయం ఎల్బీ నగర్ వద్ద ఆందోళనకారులు అడ్డుకోవటంతో కొంత ఉద్రిక్తత చోటుచేసుకుంది. ఎల్బీ స్టేడియంలోని సభా ప్రాంగణానికి ఉదయం 9 గంటల నుంచే ఉద్యోగుల రాక ప్రారంభమైంది. పోలీసులు గుర్తింపుకార్డులను పరిశీలించిన తర్వాతే ఉద్యోగులను స్టేడియం లోపలికి అనుమతించారు. ఉద్యోగులతో ఎల్బీ స్టేడియం పూర్తిగా నిండిపోగా ఇంకా ఎంతో మంది స్టేడియం వెలుపలే నిలిచిపోయారు. సభ ప్రారంభానికి ముందు ‘ఇప్పటి దాకా కలసి ఉన్నాం... ఇకపైనా క లిసేఉందాం...’, ‘మాకొద్దు మాకొద్దు మీ నజరానా... హైదరాబాద్ అందరి ఖజానా...’ అంటూ వివిధ జిల్లాలకు చెందిన కళాకారులు సాంస్కృతిక కార్యక్రమాల ద్వారా సమైక్యవాదం వినిపించారు. మధ్యాహ్నం 2 గంటలకు సభ ప్రారంభమైంది. సభకు అంతరాయం కలిగించటానికి ఒక వ్యక్తి వేదికపైకి చెప్పు విసరటం, ఒక పోలీస్ కానిస్టేబుల్ జై తెలంగాణ నినాదాలు చేయటం మినహా.. స్టేడియంలో సభ ప్రశాంతంగా సాగింది. ఓట్లేసి ఎన్నుకునేది విభజించటానికి కాదు... రాష్ట్ర విభజన వల్ల ఎదురయ్యే కష్టనష్టాలు, సమైక్యంగా కొనసాగటం వల్ల ఒనగూడే ప్రయోజనాలను వివరిస్తూ వక్తల ప్రసంగాలు సాగాయి. విభజన జరిగితే విద్యార్థులు, ఆర్టీసీ కార్మికులు, ఉద్యోగులే ఎక్కువగా నష్టపోతారని.. వారి కోసమే ఈ సభను నిర్వహించాం తప్ప ఎవరికో వ్యతిరేకంగానో, రాజకీయ లబ్ధి కోసమో కాదని ఏపీఎన్జీవోల సంఘం అధ్యక్షుడు పరుచూరి అశోక్‌బాబు స్పష్టంచేశారు. రాజకీయ పార్టీలను, నాయకులను ఓట్లేసి ఎన్నుకునేది ప్రజలను పాలించడానికి కానీ, విభజించడానికి కాదని వ్యాఖ్యానించారు. ప్రజల ఆమోదం లేనిదే విభజనపై కేంద్రం వెనక్కు వెళ్లలేకపోయినా.. ముందుకు మాత్రం వెళ్లలేదని స్పష్టంచేశారు. విభజనపై ముందుకు వెళితే సికింద్రాబాద్ పెరేడ్ గ్రౌండ్స్‌లో మిలియన్ మార్చ్ నిర్వహిస్తామని ప్రకటించారు. ఉద్యోగులు చేస్తున్న సమ్మె ఎప్పుడు ఆగిపోతుందో, ఎటు వెళుతుందనే దానిపై ఇప్పుడే చెప్పలేమని.. ఈ నెల 16 తర్వాత దీనిపై ఒక నిర్ణయం తీసుకుంటామని చెప్పారు. ఇప్పటికే ఐదున్నర వేల కోట్ల రూపాయల అప్పుల్లో ఉన్న ఆర్టీసీ.. రాష్ట్ర విభజన జరిగిన మరుక్షణం మూతపడుతుందని, సీమాంధ్ర 13 జిల్లాల్లోని 70 వేలకు పైగా ఉద్యోగులు రోడ్డున పడుతారని ఎంప్లాయీస్ యూనియన్ అధ్యక్షుడు చంద్రశేఖరరెడ్డి ఆందోళన వ్యక్తం చేశారు. రాష్ట్ర విభజన దిశగా కేంద్రం ముందుకు వె ళ్తే విద్యుత్ విషయంలో రాష్ట్రం అంధకారమవుతుందని సీమాంధ్ర విద్యుత్ ఉద్యోగుల జేఏసీ నాయకుడు శ్రీనివాసరావు పేర్కొన్నారు. సీమాంధ్రలో విద్యుత్ ఉత్పత్తి చేసి.. 54 శాతం విద్యుత్ తెలంగాణలో, 46 శాతం సీమాంధ్రలో వినియోగిస్తున్నారని, వ్యవసాయానికి 80 శాతం ఉచిత విద్యుత్ తెలంగాణలోనే ఇస్తున్నట్లు చెప్పారు. కేంద్ర మంత్రులు, ఎంపీలు రాజీనామా చేస్తే తెలంగాణ ప్రక్రియ ఆగిపోతుందని డాక్టర్ మిత్ర పేర్కొన్నారు. ఊరు తగులబడుతుంటే ఎన్నికల్లో ఓట్ల కోసం చరిత్ర చెబుతూ బస్సు యాత్ర చేయడం ఏమిటని.. రాష్ట్ర విభజనకు పొరపాటుగా లేఖ ఇచ్చి ఉంటే ఆ లేఖను వెనక్కి తీసుకోవాలని పరోక్షంగా చంద్రబాబును ఉద్దేశించి ఆయన వ్యాఖ్యానించారు. మెడపై కత్తిపెట్టి జై తెలంగాణ అనాలంటూ ఒత్తిడి తెస్తున్నారని, అనకపోతే విద్రోహులు అంటూ ముద్ర వేస్తున్నారని హిందూవాహిని నాయకురాలు సత్యవాణి ధ్వజమెత్తారు. సభ ఆఖరులో సమైక్య గీతాల సీడీని, సమైక్య శంఖారావం పుస్తకాన్ని ఆవిష్కరించారు. దాదాపు 3:20 గంటల పాటు సాగిన సభ.. సాయంత్రం 5:20 గంటలకు జాతీయ గీతాలాపనతో ముగిసింది. సాయంత్రం సభ ముగించుకుని తిరిగివెళ్తున్న ఉద్యోగుల బస్సులపై ఎల్బీనగర్, చింతల్‌కుంట, హస్తినాపురం, హయత్‌నగర్, అబ్దుల్లాపూర్‌మెట్ శివారు ప్రాంతాల్లో గుర్తు తెలియని వ్యక్తులు రాళ్లతో దాడిచేశారు. ఈ ఘటనలో పలు బస్సుల అద్దాలు పగలగా ఇద్దరు డ్రైవర్లకు స్వల్ప గాయాలయ్యాయి. ‘కొమరం భీం’ ప్రవేశద్వారం ‘సేవ్ ఆంధ్రప్రదేశ్ అవగాహన’ సభా ప్రాంగణానికి పొట్టి శ్రీరాములు పేరుపెట్టారు. విశాల వేదికకు రెండు పేర్లు పెట్టారు. ఒకవైపు గురజాడ అప్పారావు సాంస్కృతిక వేదిక అని, మరోవైపు బూర్గుల రామకృష్ణారావు వేదిక అని నామకరణం చేశారు. ఆ ఇద్దరి చిత్రాలతో కూడిన హోర్డింగ్‌ను వేదికకు నేపథ్యంగా ఏర్పాటు చేశారు. సభా ప్రాంగణం ప్రవేశద్వారాలకు కొమరం భీం, బెజవాడ గోపాలరెడ్డి పేర్లు పెట్టారు. సభికులు కూర్చునే వేదికలకు శ్రీకృష్ణ దేవరాయలు, సురవరం ప్రతాపరెడ్డి, అల్లూరి సీతారామరాజు పేర్లు పెట్టారు. సీఎం పేరు ప్రస్తావనపై సభికుల్లో విస్మయం సేవ్ ఆంధ్రప్రదేశ్ సభలో కొందరు వక్తలు ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి ప్రస్తావన తీసుకురావటంపై సభికుల్లో విస్మయం వ్యక్తమైంది. కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ (సీడబ్ల్యూసీ) తెలంగాణకు అనుకూలంగా తీర్మానం చేసినా కిమ్మనని ముఖ్యమంత్రి రాష్ట్రాన్ని సమైక్యంగా ఉంచేందుకు ఎలా ప్రయత్నిస్తున్నారో అర్థంకావటం లేదని సభకు వచ్చిన వారు బహిరంగంగా మాట్లాడుకోవటం కనిపించింది. తెలంగాణ తీర్మానం చేసిననాడే పదవికి రాజీనామా చేయకుండా.. పదవిని పట్టుకుని వేలాడుతున్న వ్యక్తిని పొగిడేలా మాట్లాడటం చూస్తుంటే అనుమానం కలుగుతోందని వారు వ్యాఖ్యానించటం గమనార్హం. ఓ వైపు తెలంగాణ రాష్ట్రం కోసం కేబినెట్ నోట్ తయారవుతుందంటూ సాక్షాత్తు కేంద్ర హోంమంత్రి షిండే స్పష్టం చేసినా నోరు మెదపని ముఖ్యమంత్రిని వెనకేసుకురావటం చూస్తే కచ్చితంగా ఏదో జరుగుతోందన్న అనుమానాన్ని వారు వ్యక్తంచేశారు. వేదికపై ఎవరెవరున్నారంటే.. పి. అశోక్‌బాబు (ఏపీఎన్జీవో అధ్యక్షుడు), ఎన్.చంద్రశేఖర్‌రెడ్డి (ప్రధాన కార్యదర్శి), సి.హెచ్.చంద్రశేఖర్‌రెడ్డి (ఆర్టీసీ, ఈయూ), పి.దామోదర్‌రావు (ఆర్టీసీ, ఈయూ), ఆర్.వి.వి.ఎస్.డి ప్రసాదరావు (ఆర్టీసీ, ఎన్ఎంయూ), పి.ఎన్. రమణారెడ్డి (ఆర్టీసీ, ఎన్ఎంయూ), కమలాకర్ (టీచర్స్ జేఏసీ), ప్రొఫెసర్ శ్రీకాంత్‌రెడ్డి (ఎస్వీ యూనివర్సిటీ), బి. వెంకటేశ్వరరావు (రెవెన్యూ), ఎ. వెంకటేశ్వరావు (పారిశ్రామికవేత్తల సంఘం), పి. మధుసూదన్‌రెడ్డి (సినీ నిర్మాత), మురళీకృష్ణ, వెంకట్రామిరెడ్డి, కృష్ణయ్య (సచివాలయ సీమాంధ్ర ఉద్యోగుల ఫోరం), ఎం. వంశీకృష్ణ (జర్నలిస్టు), డాక్టర్. కె. రాజేంద్ర (డాక్టర్ల జేఏసీ), కె.శ్రీనివాసరెడ్డి (విశాలాంధ్ర మహాసభ), ఎం.జయకర్ (న్యాయవాది), ఎ.విజయ్‌కుమార్ (ఫ్యాప్సియా), కె. విజయ్‌కుమార్ (దళిత్ ఫోరం), కె. చిరంజీవిరెడ్డి (ప్రైవేటు ఇంజనీరింగ్ కళాశాలల సంఘం), పి.శ్రీనివాసరావు, ఎం. సత్యానందం (విద్యుత్ జేఏసీ), హరిప్రసాద్ (ఏపీజెన్కో), కుమార్‌చౌదరియాదవ్, ఎన్. శ్రీహరి (సమైక్య ఏపీ సంరక్షక పార్టీ), డేవిడ్ (సాఫ్ట్వేర్ ఇంజనీర్ల జేఏసీ), దినకర్ (సీఏ అసోసియేషన్), హేమలత (ఆలిండియా మహిళా సంఘం), కృష్ణయాదవ్ (విద్యార్థి జేఏసీ), కారెం శివాజీ (మాలమహానాడు), చలసాని శ్రీనివాసరావు (ఆంధ్ర మేధావుల సంఘం), కె.నాగరాజు (ఎక్స్‌సర్వీస్‌మెన్ అసోసియేషన్), జంధ్యాల రవిశంకర్ (న్యాయవాది), సత్యవాణి (హిందూవాహిని), ప్రొఫెసర్ నర్సింహారావు (నాగార్జున యూనివర్సిటీ), ప్రొఫెసర్ శామ్యూల్ (పొలిటికల్ జేఏసీ), కృష్ణమోహన్ (మున్సిపల్ ఉద్యోగుల సంఘం), డాక్టర్ మిత్రా, పి.వి.వి. సత్యనారాయణ (ఏపీఎన్జీవో హైదరాబాద్ అధ్యక్షుడు), గజల్ శ్రీనివాస్ (గాయకుడు), బాబూరావు (డిప్యూటీకలెక్టర్ల సంఘం), లక్ష్మణరెడ్డి (జనచైతన్య వేదిక), మణికుమార్ (గెజిటెడ్ అధికారుల సంఘం). -
తిరిగి వెళ్తున్న సీమాంధ్ర ఉద్యోగుల బస్సుపై రాళ్లదాడి
'సేవ్ ఆంధ్రప్రదేశ్' సభలో పాల్గొని తిరిగి వెళ్తున్న సీమాంధ్ర ఉద్యోగుల బస్సుపై రాళ్లదాడి జరిగింది. తూర్పుగోదావరి జిల్లాకు చెందిన ఉద్యోగులు సభలో పాల్గొని తిరిగి వెళ్తుండగా హైదరాబాద్ శివార్లలోని హయత్‌నగర్ సమీపంలో సన్‌రైజ్ ఆస్పత్రి సమీపంలో బస్సుపై కొంతమంది యువకులు రాళ్లతో దాడి చేశారు. కొంత దూరం నుంచి తమ బస్సు వెనకాలే బైకుపై వస్తున్న ముగ్గురు యువకులు దాదాపు మూడు కిలోల రాయి తీసుకుని డ్రైవర్ వెనకాలే ఉన్న అద్దాన్ని పగలగొట్టారని ట్రెజరీ శాఖలో పనిచేస్తున్న వంశీ అనే ఉద్యోగి తెలిపారు. ఎస్కార్టు వాహనం వెనకాల ఉన్న మొదటి బస్సు తమదేనని, అయినా కూడా బస్సుపై దాడి చేశారని ఆయన చెప్పారు. దీంతో అద్దాలు పగిలి కొంతమందికి కంట్లో అద్దం పెంకులు గుచ్చుకున్నాయి. కమర్షియల్ టాక్స్ ఉద్యోగి కట్టా సత్యనారాయణ (50)కు ముఖం మీద తీవ్ర గాయాలయ్యాయి. ఈ బస్సు వెనక ఉన్న బస్సులను పటిష్ఠ బందోబస్తుతో తీసుకెళ్లారు. క్షతగాత్రులకు హయత్‌నగర్‌లోని సన్‌రైజ్ ఆస్పత్రిలో చికిత్స అందిస్తున్నారు. -
విజయవంతంగా ముగిసిన 'సేవ్ ఆంధ్రప్రదేశ్' సభ
-
APNGOs "సేవ్ ఆంధ్రప్రదేశ్"లో సత్యవాణి ప్రసంగం
-
APNGOs "సేవ్ ఆంధ్రప్రదేశ్" బహిరంగ సమావేశం Part - 6
-
APNGOs "సేవ్ ఆంధ్రప్రదేశ్" బహిరంగ సమావేశం Part - 5
-
APNGOs "సేవ్ ఆంధ్రప్రదేశ్" బహిరంగ సమావేశం Part - 4
-
పునరాలోచన చేయకుంటే మిలియన్ మార్చ్:అశోక్‌బాబు
-
'ఆర్టీసీ మూతపడుతుంది.. సీమాంధ్ర ఎడారి అవుతుంది'
-
APNGOs "సేవ్ ఆంధ్రప్రదేశ్" బహిరంగ సమావేశం Part - 3
-
APNGOs "సేవ్ ఆంధ్రప్రదేశ్"లో మిత్రా ప్రసంగం
-
'ఆర్టీసీ మూతపడుతుంది.. సీమాంధ్ర ఎడారి అవుతుంది'
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విభజన జరిగితే అనేక సమస్యలు ఉత్పన్నమవుతాయని ఆర్టీసీ కార్మిక సంఘం నేత చంద్రశేఖరరెడ్డి అన్నారు. ఎల్బీ స్టేడియంలో జరుగుతున్న సమైక్యాంధ్ర సభలో చంద్రశేఖరరెడ్డి మాట్లాడుతూ..విభజన జరిగితే వెంటనే ఆర్టీసి మూత పడుతుంది అని అన్నారు. చిన్న రాష్ట్రాలలో ఆర్టీసిని నడపడం కష్టం అవుతుంది. అందువల్లనే స్వతంత్రంగా కాకుండా ప్రభుత్వంలో భాగంగానే నడపవలసి వస్తుంది. అని ఆయన అన్నారు. రాయలసీమ నుంచి కర్నూలును త్యాగం చేయబట్టే హైదరాబాద్ రాజధానిగా వెలుగుతోందని తెలిపారు. వేల కోట్ల రూపాయలను రాయలసీమ వాసులు నష్టపోయారని, రాజధాని వదులుకోవడమంటే మాటలు కాదని.. సమైక్య రాష్ట్ర కోసం రాయలసీమ వాసులు రాజధానిని వదులుకున్నారని..బళ్లారిని కూడా కోల్పోయామని, తుంగభద్రను వదలుకున్నామని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. రాష్ట్ర విభజన నిర్ణయం జరిగిపోయిందని.. సీమాంధ్ర ప్రజలు ఏమి కోరుకుంటున్నారో చెప్పాలని కాంగ్రెస్ పెద్దలు చెప్పడాన్ని తప్పు పట్టారు. ఏమి కావాలో కోరుకోండని అంటున్న నేతలు కర్నూలు రాజధాని ఇస్తారా, అత్యంత విలువైన వనరులున్న బళ్లారి ప్రాంతాన్ని ఇస్తారా అని నిలదీశారు. హైదరాబాద్ ను కూడా కోల్పోతే అరవై ఏళ్ల తర్వాత కట్టుబట్టలతో బయటకు పోవాలా అని ప్రజలు నేతలను నిలదీస్తున్నారని. హైదరాబాద్ లో తప్పిస్తే..పదమూడు జిల్లాలలో ఎక్కడైనా అబివృద్ది జరిగిందా? ఒక పరిశ్రమ ఉందా అని ప్రశ్నించారు. రాష్ట్రం విడిపోతే సీమాంధ్ర ప్రాంతమంతా ఏడారి అవుతుందని ఆయన హెచ్చరించారు. -
APNGOs "సేవ్ ఆంధ్రప్రదేశ్" బహిరంగ సమావేశం Part - 2
-
APNGOs "సేవ్ ఆంధ్రప్రదేశ్" బహిరంగ సమావేశం Part - 1
-
సేవ్ ఆంధ్రప్రదేశ్ సభకోసం తరలివస్తున్న APNGOS Part - 2
-
రాజధానికి దండుగట్టారు
సుదీర్ఘ తెలంగాణ ఉద్యమ చరిత్రలో తెలంగాణ నడిబొడ్డు హైదరాబాద్‌లో మొట్టమొదటి సారి ‘సమైక్య సభ’ జరుగుతోంది. ‘సిర్ఫ్ హైదరాబాద్ హమారా’ అంటూ తెలంగాణవాదులు ఇంతకాలంగా రాజధాని నగరంలో సమైక్యవాదాన్ని వినిపించకుండా జాగ్రత్తపడినా.... రాష్ట్ర విభజన ప్రకటన తర్వాత హైదరాబాద్‌లో స్థిరపడిన తమ పరిస్థితి ఏంటని సచివాలయంలోని సీమాంధ్ర ఉద్యోగుల నుంచి పుట్టిన గళం నెల రోజులుగా వేళ్లునూకుని నేడు ‘సమైక్యాంధ్ర పరిరక్షణ’ వేదికగా హైదరాబాద్‌లో సేవ్ ఆంధ్రప్రదేశ్ సభ జరపుకునే వరకూ వచ్చింది. తెలంగాణ గడ్డమీద తొలిసారిగా తమకు సమైక్యవాదాన్ని వినిపించేందుకు వచ్చిన అవకాశాన్ని సీమాంధ్ర ప్రజలు ప్రతిష్ఠాకరంగా తీసుకొని రాజధానికి దండుకట్టారు. సీమాంధ్ర జిల్లాల నుంచి భారీగా ఉద్యోగులు భాగ్య నగరానికి తరలి వచ్చారు. ఎల్బీ స్టేడియంతో పాటు స్టేడియం పరిసర ప్రాంతాలు జన సందోహమయ్యాయి. సమైక్య నినాదాలు మిన్నంటాయి. వేలాదిగా తరలి వచ్చిన ఏపీ ఎన్జోవోలతో ఆ ప్రాంతం కిక్కిరిసి పోయింది. శనివారం ఉదయం నుంచే ఉద్యోగులు తమ గళం విప్పేందుకు ఎల్బీ స్టేడియంకు చేరుకున్నారు. సభ ప్రారంభం అవటానికి ముందే గ్యాలరీలతో పాటు మైదానం కూడా కిక్కిరిసి పోయింది. మరోవైపు వేలాది మంది ఉద్యోగులు లోపలికి వెళ్లేందుకు ....స్టేడియం బయట వేచి ఉండే పరస్థితి నెలకొంది. దాంతో పోలీసులు ఐడీ కార్డులు ఉన్నవారిని మాత్రమే లోపలకి అనుమతి ఇస్తున్నారు. మరోవైపు హైదరాబాద్‌లో ఉన్న సీమాంధ్రులు సేవ్ ఆంధ్రప్రదేశ్ సభకు తరలి వచ్చారు. సమైక్య సభ జరగడానికి ముందు రోజే హైకోర్టులో తెలంగాణ, సీమాంధ్ర న్యాయవాదుల మధ్య జరిగిన శుక్రవారం జరిగిన ఘర్షణ మరింత వేడి పుట్టించింది. సేవ్ ఆంధ్రప్రదేశ్ సభకు అనుమతించవద్దని కొంతమంది తెలంగాణవాదులు చివరి ప్రయత్నంగా హైకోర్టును ఆశ్రయించినా, ఫలితం లేకపోయింది. న్యాయస్థానం కూడా సభ జరుపుకోవడానికి అనుమతించడంతో తెలంగాణవాదుల ప్రయత్నం ఫలించలేదు. దాంతో 24 గంటల బంద్‌కు పిలుపునిచ్చి రవాణా వ్యవస్థను స్తంభింప చేసినా అవేమీ..... సభకు తరలి వచ్చేవారిపై ప్రభావం చూపలేదు. అడ్డుకునేందుకు అడుగడుగునా ప్రయత్నించినా ఫలితం లేకపోయింది. ఓ పక్క బంద్ .... మరో పక్క బచావ్... మధ్య ఏం జరగబోతుందో అన్న ఉత్కంఠ రాజధాని వాసుల్లోనే కాకుండా రాజకీయ వర్గాల్లోనూ నెలకొంది. కేంద్ర ప్రభుత్వం కూడా హైదరాబాద్‌లో జరగనున్న సభను నిశితంగా గమనిస్తోంది. తీవ్ర ఇరకాటంలో తెలంగాణవాదులు ఇక హైదరాబాద్‌లో తొలిసారిగా నిర్వహిస్తోన్న సమైక్య సభ తెలంగాణవాదులను తీవ్ర ఇరకాటంలో పడేసింది. తెలంగాణ నడిబొడ్డు హైదరాబాద్‌లో సమైక్యసభ విజయవంతమైతే తెలంగాణవాదానికి నష్టం జరుగుతుందని తెలంగాణవాదులు జంకుతున్నారు. అలాగనీ ఒకవేళ సభను అడ్డుకునే ప్రయత్నం చేస్తే ఇంతకాలంగా సీమాంధ్ర ప్రజలు తమకు హైదరాబాద్‌లో రక్షణలేదనే వాదన బలపడే ప్రమాదం ఉందని ఆందోళన చెందుతున్నారు. సమైక్య సభ విజయవంతమైనా, విఫలమైనా తెలంగాణ రాష్ట్రం ఏర్పాటుకు ఏమైనా ప్రతిబంధకంగా మారుతుందా? అన్న భయోందోళనలు తెలంగాణవాదుల్లో నెలకొన్నాయి. ఏవిధంగా చూసినా హైదరాబాద్‌లో జరగబోయే సమైక్యసభ తెలంగాణవాదులకు ముందు నుయ్యి, వెనుక గొయ్యిగా మారింది. -
సేవ్ ఆంధ్రప్రదేశ్ సభకోసం తరలివస్తున్న APNGOS
-
వారికి రాచ మర్యాదలు ...మాకు అవమానాలా?
హైదరాబాద్ : టీఆర్ఎస్ సభ్యులను శాసనసభ ప్రాంగణంలోకి పోలీసులు అనుమతి నిరాకరించటాన్ని ఆపార్టీ నేతలు తీవ్రంగా ఖండించారు. పోలీసుల చర్య శాసనసభ్యుల హక్కులను కాలరాసిన చీకటి సందర్భమని టీఆర్ఎస్ ఎమ్మెల్యే ఈటెల రాజేందర్ అన్నారు. సొంత గడ్డపై తమకు నిరసన తెలిపే హక్కు కూడా లేదా అని ఆయన ప్రశ్నించారు. సీమాంధ్రల సభకు అనుమతి ఇచ్చిన... ప్రభుత్వం ...ర్యాలీకి అనుమతించకపోవటం దారుణమన్నారు. వారికి రాచ మర్యాదలు... మాకు అవమానాలా అంటూ ఈటెల మండిపడ్డారు. కాగా రాష్ట్ర ప్రభుత్వ వైఖరికి నిరసనగా అసెంబ్లీ ప్రాంగణంలో దీక్ష చేపట్టేందుకు టీఆర్ఎస్ నేతలు ప్రయత్నించారు. అయితే వారిని పోలీసులు అడ్డుకోగా, దీక్షకు అసెంబ్లీ అధికారులు అనుమతించలేదు. దాంతో వారు రోడ్డుపై బైఠాయించి నిరసనలు తెలిపారు. ఈ సందర్భంగా హరీష్ రావు మాట్లాడుతూ ఏపీ ఎన్జీవోల సభ సీమాంధ్ర రాజకీయ నేతల కనుసన్నల్లోనే జరుగుతోందని ఆరోపించారు. ఉద్యోగుల సభకు ఏర్పాటు చేసిన ప్రత్యేక రైళ్లకు నిధులెక్కడవని ఆయన ప్రశ్నించారు. పోలీసుల చర్యలపై శాసనసభ స్పీకర్రు ఫిర్యాదు చేస్తామని హరీష్ రావుత తెలిపారు. -
సచివాలయం నుంచి సీమాంధ్ర ఉద్యోగుల ర్యాలీ
హైదరాబాద్ : రాష్ట్రాన్ని సమైక్యంగా ఉంచాలనే నినాదంతో 'సేవ్ ఆంధ్రప్రదేశ్' సభకు మద్దతుగా సచివాలయ సీమాంధ్ర ఉద్యోగులు మేము సైతం అంటూ ర్యాలీగా కదిలారు. సచివాలయం నుంచి బయల్దేరిన ఈ ర్యాలీలో సుమారు ఆరు వందల మంది పాల్గొన్నారు. ర్యాలీకి మహిళా ఉద్యోగులు ప్రముఖ పాత్ర వహిస్తున్నారు. మరోవైపు సేవ్ ఆంధ్రప్రదేశ్ సభకు సీమాంధ్ర జిల్లాల నుంచి ఏపీ ఎన్జీవోల ఉద్యోగులు భారీగా తరలి వస్తున్నారు. వారందరినీ పోలీసులు తనిఖీలు చేసి గేట్ వన్ నుంచి లోనికి పంపిస్తున్నారు. స్టేడియంలోని స్టాండ్స్ నిండిపోవటంతో మైదానంలోనే ఉద్యోగులు కూర్చుంటున్నారు. సీమాంద్ర ఉద్యోగులతో ఎల్బీ స్టేడియం ప్రాంగణం కిటకిటలాడుతోంది. మరోవైపు సాంస్కృతిక కార్యక్రమాలు మొదలయ్యాయి. -
ఎల్బీ స్టేడియంకు చేరుకుంటున్న ఉద్యోగులు
-
పోలీసులపై ఓయూ విద్యార్థుల రాళ్లదాడి
హైదరాబాద్ : ఉస్మానియా యూనివర్శిటీలో మళ్లీ ఉద్రిక్త వాతావరణం నెలకొంది. అనుమతి లేకున్నా పోలీసులను ఏమాత్రం లెక్కచేయని విద్యార్థులు శనివారం ఉస్మానియా యూనివర్సిటి ఆర్ట్స్ కాలేజీ నుంచి నిజాం కాలేజీకు బయల్దేరారు. అయితే వారిని పోలీసులు ఎన్సీసీ గేటు వద్ద అడ్డుకున్నారు. దాంతో పోలీసులపై విద్యార్థులు రాళ్లదాడికి దిగారు. ఈ సందర్భంగా పలువురు గాయపడ్డారు. ఎన్సీసీ గేటు వద్ద భారీగా పోలీసులు మోహరించారు. రోడ్డుపైనే విద్యార్థులు బైఠాయించి నిరసనలు తెలుపుతున్నారు. మరోవైపు హైదరాబాద్‌లోని నిజాం కాలేజ్ హాస్టల్ రణరంగంగా మారింది. సేవ్ ఆంధ్రప్రదేశ్ సభ కోసం వస్తున్న ఏపీఎన్జీవో ఉద్యోగులపై నిజాం కాలేజ్ విద్యార్థులు....నాన్‌బోర్డర్స్ రాళ్లతో దాడి చేశారు. రాళ్ల దాడిలో పలువురు ఉద్యోగులకు గాయాలయ్యాయి. ప్రాణభయంతో వాళ్లు పరుగులు తీశారు. రాళ్ల దాడి చేసిన నిజాం కాలేజ్ స్టూడెంట్స్‌ను, నాన్‌బోర్డర్స్‌ను పోలీసులు బలవంతంగా అదుపులోకి తీసుకున్నారు. కాగా ఫతేమైదాన్ వద్ద పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. రెండువర్గాల మధ్య దాడి జరగటంతో పలువురు గాయపడ్డారు. అనంతరం అక్కడకు చేరుకున్న పోలీసులు పరిస్థితిని అదుపులోకి తెచ్చారు. -
'మీడియా గొంతు నొక్కడం ఏం న్యాయం'
-
'మీడియా గొంతు నొక్కడం ఏం న్యాయం'
హైదరాబాద్ : సేవ్ ఆంధ్రప్రదేశ్ సభను మీడియా లైవ్ ప్రసారం చేయకూడదని పోలీసులు ఉత్తర్వులు జారీ చేయడం బాధాకరమని ఏపీఎన్జీవోల అధ్యక్షుడు అశోక్‌బాబు ఆవేదన వ్యక్తం చేశారు. ప్రజాస్వామ్య దేశంలో మీడియా గొంతు కూడా నొక్కడం ఏం న్యాయమని ఆయన ప్రశ్నించారు. సీమాంధ్ర ప్రజల మనోభావాలు పట్టించుకోకుండా కాంగ్రెస్ పెద్దలు పార్లమెంట్లో తెలంగాణ బిల్లు పెడితే తమ ఉద్యమం మరింత ఉద్ధృతమవుతుందని అశోక్‌బాబు చెప్పారు. పరేడ్ గ్రౌండ్స్‌లో మిలియన్ మార్చ్ నిర్వహించే ఆలోచన ఉందని ఆయన స్పష్టం చేశారు. -
ప్రయాణీకులను రక్షణ కల్పిస్తాం: కౌముది
ఇతర ప్రాంతాల నుంచి నగరానికి వచ్చే ప్రయాణీకులను రక్షణ కల్పిస్తామని అడిషనల్ డీజీ కౌముది శనివారం హైదరాబాద్‌లో వెల్లడించారు. అలా వచ్చిన ప్రయాణికులకు హైదరాబాద్‌లో ఎవరైన ఇబ్బందులు కలిగిస్తే కఠిన చర్యలు తప్పవని ఆయన హెచ్చరించారు. అలాగే రైల్వే ప్రయాణికులకు భద్రత కల్పిస్తామని రైల్వే ఎస్పీ తెలిపారు. రైల్వే ఆస్తులకు ఎవరైన భంగపరిచిన వారిపై క్రిమినల్ కేసులు నమోదు చేస్తామన్నారు. హైదరాబాద్ నగరంతోపాటు వివిధ ప్రాంతాల్లోని అన్ని రైల్వే స్టేషన్లల్లో భద్రత బలగాను మోహరించినట్లు చెప్పారు. అయితే నగరంలో నేడు ఏపీఎన్జీవోలు ఎల్బీ స్టేడియంలో సేవ్ ఆంధ్రప్రదేశ్ సభను నిర్వహించనున్నారు. ఆ సభలో పాల్గొనేందుకు ఇప్పటికే సీమాంధ్రలోని వివిధ ప్రాంతాలను నుంచి అసంఖ్యాకంగా ఏపీఎన్జీవోలు ఇప్పటికే హైదరాబాద్ చేరుకున్నారు. ఈ నేపథ్యంలో ఎల్బీస్టేడియం పరిసర ప్రాంతాల్లో పోలీసులు పటిష్టమైన భద్రత చర్యలు చేపట్టారు. ఆ స్టేడియం చుట్టూ పక్కల రోడ్లను మూసివేశారు. స్థానికంగా ఉన్న పరిస్థితులను బట్టి ట్రాఫిక్‌ను ఇతర మార్గాల ద్వారా మళ్లిస్తామని పోలీసులు తెలిపారు. హైదరాబాద్, సైబరాబాద్ పరిసర ప్రాంతాల్లో బారికేడ్లును ఏర్పాటు చేశారు. అలాగే ఎల్బీ స్టేడియం పరిసర ప్రాంతాల్లో 40 చెక్‌పోస్ట్‌లను ఏర్పాటు చేశారు. ఆ సభలో పాల్గొనేందుకు విజయవాడ నుంచి వచ్చే వాహనాలను ఎగ్జిబిషన్ గ్రౌండ్స్, కర్నూలు నుంచి వచ్చే వాహనాలు పబ్లిక్ గార్డెన్స్, అలాగే వివిధ ప్రాంతాల నుంచి వచ్చే వాహనాలను మహబుబా కాలేజీలో పార్కింగ్ చేసుకునే విధంగా ఏర్పాటు చేసినట్లు పోలీసు ఉన్నతాధికారులు వివరించారు. అలాగే అబ్ధుల్లాపూర్‌మెట్, శంషాబాద్ పరిసర ప్రాంతాల్లో పోలీసులు తనిఖీలను ముమ్మరం చేశారు. ప్రతి వాహనాన్ని పోలీసులు తనిఖీలు నిర్వహిస్తున్నారు. -
నేడే ‘సమైక్య’ సభ
-
‘అనంత’ టు హైదరాబాద్
అనంతపురం ఎడ్యుకేషన్, న్యూస్‌లైన్ : రాష్ట్రాన్ని సమైక్యాంగానే ఉంచాలని, విభజన ప్రకటన వెనక్కు తీసుకోవాలని డిమాండ్‌తో ఏపీ ఎన్జీఓ సంఘం ఆధ్వర్యంలో శనివారం హైదరాబాద్‌లో తలపెట్టిన ‘సేవ్ ఆంధ్రప్రదేశ్’ కార్యక్రమంలో పాల్గొనేందుకు ‘అనంత’ ఉద్యోగ, ఉపాధ్యాయులు కదం తొక్కారు. తెలంగాణ జేఏసీ నాయకులు 24 గంటల బంద్‌కు పిలుపునిచ్చినా, ప్రభుత్వం ఆంక్షలు విధించినా జిల్లాలోని ఉద్యోగులు ఏమాత్రం లెక్క చేయలేదు. గురువారం రాత్రి, శుక్రవారం ఉదయం నుంచి రాజధానికి తరలివెళ్లారు. గెజిటెడ్ ఉద్యోగులు, రెవెన్యూ, వైద్య, ఎస్సీ, ఎస్టీ, బీసీ సంక్షేమ శాఖ, హెచ్ఎల్సీ, రోడ్లు భవనాల శాఖ, విద్యుత్, జేఎన్టీయూ, ఎస్కేయూ ఉద్యోగులు, ఉపాధ్యాయులు, ఆర్టీసీ కార్మికులు 20 వేలమంది బస్సులు, రైళ్లు, ఇతర వాహనాలలో వెళ్లారు. అనంతపురంతో పాటు హిందూపురం, కదిరి, ధర్మవరం, తాడిపత్రి, కళ్యాణదుర్గం, గుంతకల్లు, గుత్తి, పుట్టపర్తి, మడకశిర, పెనుకొండ, రాయదుర్గం, ఉరవకొండ నుంచి ఉద్యోగ, ఉపాధ్యాయ, కార్మికులు తరలివెళ్లారు. వాహనాలకు బ్యానర్లు కట్టుకున్నారు. ‘విభజన వద్దు-సమైక్యాంధ్ర ముద్దు’, ‘జై సమక్యాంధ్ర -జైజై సమైక్యాంధ్ర’ అంటూ నినాదాలు చేస్తూ వెళ్లారు. ప్రాణాలైనా అడ్డేస్తాం రాష్ర్టం విడిపోకండా సమైక్యాంగా ఉండేందుకు ఎందాకైనా పోరాడుతాం. అవసరమైతే ప్రాణాలన ఫణంగా పెట్టేందుకు సిద్ధం. ‘సేవ్ ఆంధ్రప్రదేశ్’ కార్యక్రమ నిర్వమణకు తెలంగాణ జేఏసీ అడ్డుంకులృ సష్టించడం సరికాదు. అలాంటి బెదిరింపులకు భయపడం. సేవ్ ఆంధ్రప్రదేశ్ విజయవంతం చేసి తీరుతాం. - నరసింహులు, విద్యా సంబంధ జేఏసీ కన్వీనర్ వారిది దురహంకారమే ‘సేవ్ ఆంధ్రప్రదేశ్’కు అటు ప్రభుత్వం, ఇటు హైకోర్టు అనుమతి ఇచ్చినా... అడ్డుకుంటామని తెలంగాణవాదులు చెప్పవడం వారి దురహంకారానికి నిదర్శనం. వారి బెదిరింపులకు భయపడే ప్రసక్తేలేదు. పోయేదారిలో ఎన్ని అడ్డంకులృ సష్టించినా ఎదుర్కొని సభావేదికకు చేరుకుంటాం. కార్యక్రమాన్ని విజయంతం చేసి తిరిగి వస్తాం. - రమణారెడ్డి, ఉపాధ్యాయ జేఏసీ కన్వీనర్ -
టెన్షన్.. టెన్షన్!
మహబూబ్‌నగర్, సాక్షి ప్రతినిధి/మానవపాడు : రాష్ట్రాన్ని విభజించవద్దు.. సమైక్యంగా ఉంచాలనే డిమాండ్‌తో ఏపీ ఎన్జీఓలు హైదరాబాద్‌లో శనివారం నిర్వహించతలపెట్టిన ‘సేవ్ ఆంధ్రప్రదేశ్’ సభకు సీమాంధ్ర ప్రాంతాల నుంచి వచ్చే వారిని అడ్డుకుంటామని టీజేఏసీ నాయకులు ప్రకటించిన నేపథ్యంలో జిల్లాలో ఉద్రిక్తత వాతావరణం నెలకొంది. పార్లమెంట్లో తెలంగాణ బిల్లు పెట్టి వెంటనే ఆమోదించాలని డిమాండ్ చేస్తూ శుక్రవారం మహబూబ్‌నగర్‌తో పాటు జడ్చర్ల, వనపర్తి, షాద్‌నగర్, నారాయణపేట తదితర ప్రాంతాల్లో పెద్దఎత్తున శాంతిర్యాలీలు నిర్వహించారు. అంతేకాకుండా బంద్‌కు సంపూర్ణ మద్దతు ప్రకటించారు. 44వ నెంబర్ జాతీయ రహదారిపై వచ్చే వాహనాలను అడ్డుకునేందుకు టీజేఏసీ నేతలు సిద్ధమవుతున్నారు. దీంతో ఎలాంటి సంఘటనలు తలెత్తకుండా భారీగా పోలీసు బలగాలను రంగంలోకి దింపారు. ముఖ్యంగా కర్నూలు జిల్లా సరిహద్దు అలంపూర్ టోల్గేట్ వద్ద గద్వాల డీఎస్పీ గోవింద్‌రెడ్డి ఆధ్వర్యంలో భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. అనుమానితులను ప్రశ్నిస్తూ అక్కడి నుంచి తరిమేస్తున్నారు. షాద్‌నగర్ వరకు ఉన్న జాతీయ రహదారిపై విసృ్తతంగా పెట్రోలింగ్ నిర్వహిస్తున్నారు. దీంతో పాటు అక్కడక్కడ పోలీస్ పికెట్ ఏర్పాటుచేశారు. బంద్‌ను శాంతియుతంగా నిర్వహించాలని, ఎవరైనా అతిక్రమిస్తే చర్యలు తీసుకుంటామని పోలీసులు హెచ్చరిస్తున్నారు. బందోబస్తు కోసం మూడు ప్లటూన్ల దళాలను రంగంలోకి దింపారు. తెలంగాణ ప్రాంతం వారు సభలు నిర్వహించినప్పుడు అనుమతులు ఇవ్వకుండా అడ్డుపడిన ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి, డీజీపీ దినేష్‌రెడ్డిలు సమైక్యసభ నిర్వహించుకునేందుకు నాలుగు రోజుల ముందే అనుమతి ఎలా ఇస్తార ని టీజేఏసీ నాయకులు ప్రశ్నిస్తున్నారు. నాయకుల కదలికలపై నిఘా తెలంగాణలో సీమాంధ్ర పెత్తనం సాగనివ్వమని మహబూబ్‌నగర్ బార్ అసోసియేషన్ అధ్యక్షుడు వీరబ్రహ్మచారి హెచ్చరించారు. టీజేఏసీ పిలుపునిచ్చిన బంద్‌కు టీఆర్ఎస్ కూడా మద్దతు ప్రకటించడంతో అక్కడక్కడ గొడవలు జరిగే అవకాశం ఉందని పోలీసులు భావిస్తున్నారు. ఇందులో భాగంగానే ప్రతి పోలీస్‌స్టేషన్ పరిధిలో కూడా నాయకుల కదలికలపై నిఘా ఉంచాలని అధికారులు స్పష్టమైన ఆదేశాలు జారీచేశారు. ఇదిలాఉండగా తెలంగాణ ప్రజలపై శత్రుదేశం మాదిరిగా సీమాంధ్ర ప్రజలు దండయాత్ర చేసేందుకే ఏపీఎన్జీఓలు సభ నిర్వహిస్తున్నారని కొల్లాపూర్ టీఆర్ఎస్ ఎమ్మెల్యే జూపల్లి కృష్ణారావు ఆరోపించారు. ‘సేవ్ ఆంధ్రప్రదేశ్’ సభను సక్సెస్ చేసేందుకు సీఎం కిరణ్‌కుమార్‌రెడ్డి, డీజీపీ దినేష్‌రెడ్డి దగ్గరుండి కార్యక్రమాలు నడిపిస్తున్నారన్నారు. బంద్ ద్వారా వీరి ఆగడాలను తిప్పికొట్టాలని పిలుపునిచ్చారు. అయితే బంద్‌కు కాంగ్రెస్‌తోపాటు టీడీపీ, బీజేపీలు మద్దతు ప్రకటించకపోవడంతో గొడవలు జరిగే అవకాశం ఉందని పోలీసులు భావిస్తున్నారు. ఇదిలాఉండగా గతంలో నిర్వహించిన సడక్‌బంద్ విజయవంతం కాకుండా వ్యూహాత్మకంగా అడ్డుకోగలిగామని అదే స్ఫూర్తితో పనిచేసి జాతీయ రహదారిపై ఎలాంటి ఇబ్బందులు కలుగకుండా గట్టిచర్యలు తీసుకోవాలని పోలీసులకు ఆదేశాలు ఉన్నాయి. -
బందోమస్తు
హైకోర్టులో శుక్రవారం ఉద్రిక్తత.. శనివారం ఇటు ఎల్బీ స్టేడియంలో సమైక్యాంధ్ర ఉద్యోగుల ‘సేవ్ ఆంధ్రప్రదేశ్’.. అటు అడ్డుకుంటామంటూ హెచ్చరికలు.. తెలంగాణ బంద్.. ఈ నేపథ్యంలో పోలీసులు గట్టి భద్రత చర్యలు చేపట్టారు. శివార్ల చుట్టూ చెక్‌పోస్టులు.. బందోబస్తు గుప్పిట నగరం నడిబొడ్డు ప్రాంతం.. అంతటా ఉత్కంఠ, ఉద్విగ్నత నెలకొన్నాయి. సాక్షి, సిటీబ్యూరో: మహా నగరంలో ఉత్కంఠ.. శుక్రవారం రాష్ట్ర హైకోర్టులో ఉద్రిక్తత.. శనివారం ఏపీఎన్జీఓల ‘సేవ్ ఆంధ్రప్రదేశ్’..అడ్డుకుంటామనే హెచ్చరికలు.. తెలంగాణ బంద్.. ఈ పరిణామాల నేపథ్యంలో నగర పోలీసులు అప్రమత్తమయ్యారు. నగరమంతటా ఉత్కంఠ నెలకొంది. సభా వేదిక ఎల్బీ స్టేడియం ఉన్న మధ్య మండలంతో పాటు రాజధాని మొత్తాన్ని పోలీసులు అష్టదిగ్బంధం చేశారు. నగర పోలీసులు, రాష్ట్ర, కేంద్ర బలగాలతో కలిపి 13 వేల మందికి పైగా సిబ్బందిని శనివారం తెల్లవారుజాము నుంచే నగరవ్యాప్తంగా మోహరించనున్నారు. స్టేడియం పరిసరాల్లోనే 3 వేల మంది ఉంటారు. లోపలకు దారితీసే కీలక మార్గాలతో పాటు స్టేడియం మొత్తాన్నీ కేంద్ర బలగాలకు అప్పగించారు. నగరంలోని ఒక్కో జోన్‌కు ఒక్కో సీనియర్ ఐపీఎస్ అధికారి ఇన్చార్జిగా ఉంటారు. మరోపక్క స్టేడియం చుట్టూ ఉన్న రహదారుల్లో ఒక్కో రూట్‌కు ఒకో ఐపీఎస్ అధికారిని ఏర్పాటు చేస్తున్నారు. నగర వ్యాప్తంగా పకడ్బందీ నిఘా, పెట్రోలింగ్ కోసం ప్రత్యేక బృందాలను రంగంలోకి దింపారు. సభను అడ్డుకోవాలని, గందరగోళం సృష్టించాలనే ఉద్దేశంతో ఇప్పటికే అనేక ప్రాంతాల్లో షెల్టర్ తీసుకున్న ఆందోళనకారుల కోసం లాడ్జిలతో పాటు అనేక ప్రాంతాల్లో శుక్రవారం రాత్రి నుంచే గాలింపు చేపట్టారు. స్టేడియం చుట్టపక్కల ఉన్న నాలుగు మార్గాలను పూర్తిగా మూసేశారు. 40 ప్రాంతాల్లో బారికేడ్లు, కంచె ఏర్పాటు చేశారు. స్టేడియం చుట్టూ రెండు కిలోమీటర్ల పరిధిలో నిఘా బృందాలు డేగకన్నేసి ఉంచుతాయి. కమిషనరేట్‌లోని సిబ్బంది అంతా కచ్చితంగా విధుల్లో ఉండేలా ఆదేశించారు. కూడళ్లపై నిఘాకు ట్రాఫిక్ కెమెరాల వినియోగం ట్రాఫిక్ స్థితిగతుల పరిశీలనకు నగరంలోని 95 ప్రాంతాల్లో ఉన్న సర్వైయ్లెన్స్ కెమెరాలను శనివారం నిఘా కోసమూ వినియోగిస్తారు. వీటన్నింటినీ బషీర్‌బాగ్ పోలీసు కమిషనరేట్‌లో ఉన్న కమాండ్ అండ్ కంట్రోల్ సెంటర్ (సీసీసీ)తో అనుసంధానించారు. ఈ కెమెరాల ద్వారా ఇతర ప్రాంతాలతో పాటు నగరంలోని వివిధ ప్రాంతాల మధ్య రాకపోకలు సాగించే వాహనాలపై కన్నేసి ఉంచుతారు. కూడళ్లలో కదలికలను కనిపెడతారు. ఇందుకు సీసీసీలో ప్రత్యేక సిబ్బందిని నియమించారు. వీరు అటు ప్రధాన కంట్రోల్ రూమ్‌తో పాటు క్షేత్రస్థాయి సిబ్బందితో సంప్రదింపులు జరుపుతుంటారు. నగరంలోని ప్రతి చెక్‌పాయింట్ వద్దా వీడియో కెమెరాలు ఏర్పాటు చేస్తున్నారు. అత్యవసర సమయాల్లో వినియోగానికి స్ట్రైకింగ్ ఫోర్స్ బృందాలను, అనుమానితుల కదలికలను కనిపెట్టటానికి షాడో పార్టీలు ఏర్పాటు చేశారు. మూడంచెల కార్డన్ ఏరియా... సరైన అనుమతులు లేకుండా, పోలీసుల కన్నుగప్పి ఎల్బీ స్టేడియం సమీపంలోకి దూసుకువెళ్లాలని ప్రయత్నించే వారిని కట్టడి చేయడానికి మూడంచెల కార్డన్ (నియంత్రణ) ఏరియాలు ఏర్పాటు చేశారు. స్టేడియానికి మూడు కిలోమీటర్ల పరిధిలో ఉన్న ప్రాంతాన్ని మూడు భాగాలుగా విభజించారు. 35 చెక్‌పోస్టుల్లో ప్రత్యేక సిబ్బందిని నియమించారు. వీరిలో ట్రాఫిక్ విభాగం అధికారులూ ఉన్నారు. ముందజాగ్రత్తగా స్టేడియం చుట్టపక్కల పరిసరాల్లో ట్రాఫిక్‌ను పూర్తిగా నిషేధించారు. ఈ ప్రాంతాల మీదుగా వెళ్లే వాటిని మళ్లిస్తారు. ఎల్బీ స్టేడియానికి దారితీసే ఖైరతాబాద్, నారాయణగూడ, బషీర్‌బాగ్, తెలుగుతల్లి, మాసబ్‌ట్యాంక్ ఫ్లైఓవర్లపై రాకపోకల్నీ నిషేధించాలని భావిస్తున్నారు. శుక్రవారం రాత్రి 12 గంటల నుంచే బారికేడ్లు, బందోబస్తు ఏర్పాట్లు ముమ్మరమయ్యాయి. నగరానికి రైళ్లు, బస్సుల ద్వారా వచ్చే ఏపీఎన్జీఓలకు ఇబ్బందులు లేకుండా నాంపల్లి, కాచిగూడ, సికింద్రాబాద్‌ల్లోని రైల్వేస్టేషన్లు, ఎంజీబీఎస్, దిల్సుఖ్నగర్ తదితర బస్టాండ్లతో పాటు వీటి నుంచి స్టేడియం వరకు ఉన్న రూట్లపైనా నిఘా ఉంచి బందోబస్తు ఏర్పాట్లు చేస్తున్నారు. -
నేడే ‘సమైక్య’ సభ
సమైక్యవాదం వినిపించటానికి సీమాంధ్ర ఉద్యోగులు శనివారం ఎల్బీ స్టేడియంలో నిర్వహించతలపెట్టిన ‘సేవ్ ఆంధ్రప్రదేశ్’ సభకు.. ఉద్రిక్త వాతావరణం మధ్య భారీ భద్రతతో సహా ఏర్పాట్లు పూర్తయ్యాయి. మధ్యాహ్నం 2 గంటలకు ప్రారంభం కానున్న సభను సాయంత్రం ఐదు గంటల కల్లా ముగించాలని పోలీసులు గడువు విధించారు. గడువులోగా సభను ముగించటానికి ప్రయత్నించాలని.. సాధ్యం కాకుంటే గడువు పొడిగించేందుకు అప్పటికప్పుడు పోలీసులకు విజ్ఞప్తి చేయాలని ‘సమైక్య రాష్ట్ర పరిరక్షణ వేదిక’ సమన్వయ కమిటీ నిర్ణయించింది. సభను కేవలం ఉద్యోగులకే పరిమితం చేశారు. ఉద్యోగులు తమ గుర్తింపు కార్డుతో పాటు నిర్వాహకులు ఇచ్చిన ప్రత్యేక కార్డు చూపించిన తర్వాతే పోలీసులు సభా ప్రాంగణంలోనికి అనుమతిస్తారు. సభా ప్రాంగణంలోకి వెళ్లటానికి రెండు గేట్లు ఉన్నాయి. సగం జిల్లాలను ఒక గేట్ నుంచి, మిగతా జిల్లాలను మరో గేట్ నుంచి ఉద్యోగులు ప్రవేశించాలని జేఏసీ నేతలు ఆయా జిల్లాల నేతలకు సూచించారు. రాజకీయ నాయకులు, ప్రజాప్రతినిధులను కూడా సభకు అనుమతించరు. సమన్వయ కమిటీలో ఉన్న ఉద్యోగ, కార్మిక సంఘాల నేతలతో పాటు.. ‘విభజన’ వల్ల జరిగే నష్టాలను వివరించేందుకు కొంతమంది వివిధ రంగాల నిపుణులకు కూడా సభలో ప్రసంగించే అవకాశం ఇస్తారు. లక్ష మంది ఉద్యోగులు సభకు హాజరవుతారని నిర్వాహకులు అంచనా వేస్తున్నారు. ఉద్యోగులు కాని వారు స్టేడియం వెలువల నిలబడి సంఘీభావం తెలిపే అవకాశముంది. ఉదయం 11 గంటల నుంచే ఉద్యోగులను స్టేడియం లోనికి అనుమతిస్తారు. బ్యాగులు, నీళ్ల సీసాలు లోనికి తీసుకెళ్లడానికి వీలుండదు. స్టేడియంలోనే భోజనం, మంచినీరు ఏర్పాట్లు చేస్తున్నారు. సభా ప్రాంగణానికి పొట్టిశ్రీరాములు, సభా వేదికకు బూర్గుల రామకృష్ణారావు, స్టేడియం ద్వారాలకు కొమరం భీమ్, బెజవాడ గోపాలరెడ్డి, శ్రీకృష్ణదేవరాయ, సురవరం ప్రతాపరెడ్డి, అల్లూరి సీతారామరాజు, సాంస్కృతిక వేదికకు గురజాడ అప్పారావు పేర్లు పెట్టారు. పారామిలటరీ పహారాలో స్టేడియం: ఏపీఎన్జీవోల సభకు పోలీసులు పటిష్ట భద్రతాచర్యలు చేపట్టారు. ఎల్బీ స్టేడియం లోపలికి ఉద్యోగులు మినహా ఇతరులెవరూ అడుగుపెట్టకుండా పూర్తిగా పారా మిలటరీ పహారా ఏర్పాటుచేస్తున్నారు. స్టేడియానికి వెళ్లే నాలుగు మార్గాలనూ పోలీసులు ఆధీనంలోకి తీసుకున్నారు. స్టేడియానికి రెండు కిలోమీటర్ల పరిధి నుంచే ఇనుప కంచెలు, బారికేడ్లను ఏర్పాటుచేస్తున్నారు. సభకు వచ్చే ఉద్యోగులు ర్యాలీలుగా రాకూడదని, రోడ్ల వెంట నినాదాలు చేయకూడదని పోలీసుశాఖ ఇప్పటికే సూచించింది. ఏపీఎన్జీవో సభకు ఆటంకం కలిగించేందుకు తెలంగాణవాదులెవరూ స్టేడియం వరకూ చేరుకోకుండా పోలీసులు అంచెలవారీగా భద్రత ఏర్పాటుచేశారు. ఆందోళనకారులెవరైనా ఈ వలయాన్ని దాటి స్టేడియం సరిహద్దులోకి చేరుకుని నిరసన తెలిపిన పక్షంలో తక్షణమే అరెస్టుచేసి తరలించేందుకు పోలీసు పార్టీలను ఏర్పాటుచేస్తున్నారు. మొబైల్ కెమెరాలను కూడా ఏర్పాటుచేసి నిరంతర నిఘా పెడుతున్నారు. కొందరు పోలీసులు సాధారణ దుస్తుల్లో కూడా స్టేడియం లోపల ఉండే ఏర్పాట్లుచేశారు. అవగాహనాసదస్సు మాత్రమే: అశోక్‌బాబు ఒక ఉద్యమం వల్ల మరో ఉద్యమం పలచబడే అవకాశమే లేదని, సమైక్యవాదం వల్ల తెలంగాణ ఉద్యమం బలహీనపడుతుందని అనుకోవటం పొరపాటని ఏపీఎన్జీవో సంఘం అధ్యక్షుడు, ‘సేవ్ ఆంధ్రప్రదేశ్’ సభ సమన్వయ కమిటీ చైర్మన్ అశోక్‌బాబు పేర్కొన్నారు. ఆయన శుక్రవారం ఎల్బీ స్టేడియంలో విలేకరులతో మాట్లాడుతూ.. ఎవరినో కించపరచటానికో, రెచ్చగొట్టటానికో ఈ సభ నిర్వహించటంలేదని స్పష్టం చేశారు. తమది కేవలం అవగాహనా సదస్సు మాత్రమేనని, తమ వాదనను వినిపించటానికే పరిమితమని చెప్పారు. సభను అడ్డుకుంటామంటూ వివిధ సంఘాలు, పార్టీలు చేసిన ప్రకటనలను ఉపసంహరించుకోవాలని విజ్ఞప్తి చేశారు. సభకు వచ్చే ఉద్యోగులను కొన్ని శక్తులు రెచ్చగొట్టే అవకాశం ఉందని, ఎవరు ఎన్ని ప్రయత్నాలు చేసినా ప్రతి స్పందించకుండా సంయమనం పాటించాలని అశోక్‌బాబు సూచించారు. సభ సజావుగా సాగటానికి సహకరించాలని మీడియాకు విజ్ఞప్తి చేశారు. సభ అనుమతి కోసం దరఖాస్తు చేసినప్పుడు 15 వేల మంది హాజరవుతారని అంచనా వేశామని, ఇప్పుడు లక్ష మంది వచ్చే అవకాశం ఉందంటే స్పందన ఎంతగా ఉందో అర్థమవుతుందని పేర్కొన్నారు. సీమాం ధ్ర న్యాయవాదులపై తెలంగాణ న్యాయవాదులు దాడి చేయటాన్ని ఖండిస్తున్నామన్నారు. ఇదీ నాలుగంచెల భద్రత... సీమాంధ్ర జిల్లాల నుంచి వచ్చే ఉద్యోగుల వాహనాలు, రైళ్లను తెలంగాణవాదులు అడ్డుకోకుండా మొబైల్ పోలీసులతో పెట్రోలింగ్. హైవేల్లో, రైల్వేస్టేషన్ల వద్ద నిరంతర పెట్రోలింగ్. తెలంగాణ ప్రాంత జిల్లాల నుంచి నగరంలోకి భారీగా తరలిరాకుండా తనిఖీలు. ఎల్బీ స్టేడియానికి రెండు కిలోమీటర్ల పరిధిలో పారా మిలటరీ బలగాలు. ఆందోళనకారులను గుర్తించేందుకు మొబైల్ వాహనాల్లో నిఘా కెమెరాలు. స్టేడియం చుట్టూ లోపలికి వెళ్లే మార్గాల్లో తనిఖీలకు ఏపీఎస్పీ, ఏఆర్ సాయుధ పోలీసులు. స్టేడియం లోపలికి వెళ్లే ప్రధాన ద్వారాల వద్ద క్షుణ్ణంగా సాయుధ పోలీసులతో తనిఖీ. -
సీమాంధ్ర ఉద్యోగుల బస్సుపై రాళ్లదాడి
'సేవ్ ఆంధ్రప్రదేశ్' సభకు వస్తున్న సీమాంధ్ర ఉద్యోగుల బస్సులపై గుర్తు తెలియని వ్యక్తులు రాళ్లతో దాడి చేసినట్టు ఖమ్మం జిల్లా పెనుమల్లి పీఎస్‌లో ఉద్యోగులు ఫిర్యాదు చేశారు. ఈ ఘటన ఖమ్మం జిల్లా పెనుమల్లి మండలం మండలపాడు వద్ద జరిగింది. రాళ్లదాడిలో చింతలపూడి ఈవోకు స్వల్పగాయాలైనట్టు తెలిసింది. ఈ ఘటనపై పెనుమల్లి పీఎస్‌లో సీమాంధ్ర ఉద్యోగులు ఫిర్యాదు చేశారు. ఇదిలాఉండగా, నల్గొండ జిల్లాలో భారీ భద్రతను ఏర్పాటు చేశారు. హైదరాబాద్‌లో శనివారం జరిగేసభకు తెలంగాణవాదులు అడ్డుతగలకుండా చర్యలు తీసుకున్నారు. జాతీయరహదారులపై 10-15 కి.మి చొప్పున చెక్‌పోస్టులు ఏర్పాటు చేసి పరిస్థితిని సమీక్షిస్తున్నారు. జిల్లాలో 30 పోలీస్ యాక్ట్ అమలులో ఉందని డీఐజీ నవీన్‌చంద్ తెలిపారు. -
ఏం చెబితే అది జరగాలనుకోవడం తగదు
ఇరుప్రాంతాల నేతల ఏకాభిప్రాయంతోనే తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం సాధ్యమని గుర్తించాలని రాజమండ్రి ఎంపీ ఉండవల్లి అరుణ్‌కుమార్ అభిప్రాయపడ్డారు.శుక్రవారం న్యూఢిల్లీలోని పార్లమెంట్ ఎదుట ఏర్పాటు చేసిన విలేకర్ల సమావేశంలో ఆయన మాట్లాడారు.రెచ్చగొట్టే వ్యాఖ్యలతో సాధించేదేమీ లేదని ఆయన ఈసందర్భంగా తెలంగాణ ప్రాంతానికి చెందిన నేతలను ఉద్దేశించి వ్యాఖ్యానించారు. అలాగే మేం ఏం చెబితే అది జరగాలనుకోవడం కూడా తగదని ఆ ప్రాంత నేతలకు సూచించారు. హైదరాబాద్‌లో రేపు ఏపీఎన్జీవో సంఘం నిర్వహించనున్న సేవ్ ఆంధ్రప్రదేశ్ సభను అడ్డుకోవద్దని తెలంగాణ వాదులకు హితవు పలికారు.అటు సీమాంధ్ర,ఇటూ తెలంగాణ ప్రాంత ప్రజలతో చర్చిస్తే సమస్యకు పరిష్కారం దొరుకుతుందని ఉండవల్లి అరుణ్‌కుమార్ ఆశాభావం వ్యక్తం చేశారు. గతంలో ఏన్నిక ప్రచారంలో భాగంగా యూపీఏ అధ్యక్షురాలు సోనియా గాంధీ కరీంనగర్లో జరిగిన సమావేశంలో ఆమె ప్రసంగించిన కొన్ని అంశాలను ఉండవల్లి ఈ సందర్బంగా గుర్తు చేశారు.ప్రజల మధ్య వైషమ్యాలు సృష్టిస్తే దేశ సమగ్రతకు భంగం వాటిల్లే ప్రమాదం ఉందని ఆయన ఈ సందర్భంగా ఆందోళన వ్యక్తం చేశారు. సీమాంధ్ర ప్రాంతంలో ఉప్పెనలా ఎగసి పడుతున్న సమైక్య ఉద్యమంపై లోక్‌సభలో ప్రసంగిస్తున్న తనను తెలంగాణ ప్రాంత ఎంపీలు అడ్డుకోవడం సరైన చర్య కాదని ఉండవల్లి అరుణ్‌కుమార్ పేర్కొన్నారు. -
ఏం జరిగినా ఏపీఎన్జీవోల సభా నిర్వాహకులదే బాధ్యత: అనురాగ్‌శర్మ
హైదరాబాద్ ఎల్బీ స్టేడియంలో ఏపీఎన్జీవోలు సభ నిర్వహించుకోవటానికి అనేక కోణాల్లో పరిశీలించిన మీదటే 19 షరతులతో అనుమతిచ్చామని.. సభ నేపథ్యంలో ఎలాంటి అవాంఛనీయ ఘటన జరిగినా నిర్వాహకులదే బాధ్యతని హైదరాబాద్ పోలీస్ కమిషనర్ అనురాగ్‌శర్మ స్పష్టం చేశారు. మిగిలినవారు తమ ర్యాలీ తేదీ మార్చుకుంటే పరిశీలించి అనుమతిస్తామని పేర్కొన్నారు. ఏపీఎన్జీవో సభకు అనుమతి ఇవ్వటం వెనుక ముఖ్యమంత్రి, ఉన్నతాధికారుల ప్రమేయం ఉందన్న విమర్శల్లో వాస్తవం లేదన్నారు. ఎవరికైనా ప్రజాస్వామ్యబద్ధంగా తమ ఆవేదన, నిరసన వ్యక్తం చేయటానికి హక్కు ఉందని, రాజధానిలో వారి గళం వినిపిస్తామంటే అంగీకరించాలని సీపీ పేర్కొన్నారు. అనురాగ్‌శర్మ గురువారం తన కార్యాలయంలో విలేకరుల సమావేశంలో మాట్లాడారు. ఎల్బీ స్టేడియంలో ఈ నెల 7న సభ ఏర్పాటు చేసుకునేందుకు అనుమతి కోరుతూ ఏపీఎన్జీవోలు గత నెల 28న దరఖాస్తు చేసుకున్నారని, మధ్య మండల డీసీపీ అనేక కోణాల్లో పరిశీలించిన తర్వాతే అనుమతి ఇచ్చారని చెప్పారు. ‘ఇప్పుడు మరికొంత మంది శనివారమే వేర్వేరు కార్యక్రమాల నిర్వహణకు అనుమతి కోరుతూ దరఖాస్తులు ఇచ్చారు. కానీ శాంతిభద్రతలను పరిగణనలోకి తీసుకుని, తొలుత దరఖాస్తు చేసుకున్న వారికి తొలి ప్రాధాన్యం లెక్కన ఏపీఎన్జీవోలకు అనుమతి ఇచ్చాం’ అని వివరించారు. ప్రస్తుత పరిస్థితుల్లో నగరంలో ఎటువంటి ర్యాలీలకూ అనుమతి ఇవ్వట్లేదని సీపీ తెలిపారు. ఏపీఎన్జీవోలకు కూడా సభ నిర్వహణకే 19 షరతులతో అనుమతిచ్చామని స్పష్టంచేశారు. ‘ఈ సభను అడ్డుకుంటామని, జరగనివ్వబోమని అనేక ప్రకటనలు వెలుడుతున్నాయి. వారిని మీడియా ద్వారా కోరేది ఒక్కటే... ఎవ్వరూ చట్టాన్ని తమ చేతుల్లోకి తీసుకోవద్దు’ అని ఆయన పేర్కొన్నారు. ఇతరులు ఏవైనా కార్యక్రమాలు నిర్వహించుకోవాలంటే 8వ తేదీ తర్వాత ఎప్పుడైనా, ఎక్కడైనా అనుమతి కోరవచ్చని.. పరిశీలించి అనుమతిస్తామని చెప్పారు. ‘ఈ నెల 6న ఎల్బీ స్టేడియంలో సభకు అనుమతించాలంటూ మంద కృష్ణ గత నెల 31న దరఖాస్తు చేసుకున్నారు. అయితే ఆ తర్వాతి రోజు ఏపీఎన్జీవోల సభ అంటే ముందు రోజునే అనేక ఏర్పాట్లు చేయాల్సి ఉంటుంది. ఈ నేపథ్యంలోనే 6న సభకు అనుమతి ఇవ్వలేదు. తేదీ మార్చుకుంటే మాకు అభ్యంతరం లేదు’ అని సీపీ పేర్కొన్నారు. ఏపీఎన్జీవోల సభకు పటిష్ట బందోబస్తు ఏర్పాట్లు చేస్తున్నట్లు వివరించారు. ‘ఇప్పటికే నగర పోలీసులతో పాటు 11 కంపెనీల పారా మిలటరీ బలగాలు, 45 ప్లటూన్ల ఏపీఎస్పీ, ఏఆర్ సిబ్బంది అందుబాటులో ఉన్నారు. ఏదైనా పరిణా మం జరిగితే దాని తీవ్రతను బట్టి చర్యలు తీసుకుంటాం’ అని చెప్పారు. న్యాయస్థానం ఆదేశాల మేరకు ఆయా సినిమా ప్రదర్శనలకూ పటిష్ట బందోబస్తు కల్పిస్తామన్నారు. కొన్ని సభలకు ముందు, మరికొన్ని సభలకు ఆలస్యంగా అనుమతి ఇచ్చామనటం సరికాదన్న సీపీ గతంలో జరిగిన కార్యక్రమాలు, అనుమతిచ్చిన తేదీల్ని వెల్లడించారు. -
సమైక్య సభను అడ్డుకుంటే.. తెలంగాణను అడ్డుకుంటాం: అశోక్‌బాబు
సీమాంధ్ర ప్రజల సహకారం లేకుండా తెలంగాణ ఏర్పాటు సాధ్యం కాదని, హైదరాబాద్‌లో సమైక్య సభను అడ్డుకుంటే ఢిల్లీలో తాము తెలంగాణను అడ్డుకుంటామని ఏపీఎన్జీవో సంఘం అధ్యక్షుడు అశోక్‌బాబు హెచ్చరించారు. గురువారమిక్కడ ఆయన మీడియాతో మాట్లాడుతూ.. తమ వాదాన్ని వినిపించడానికే సభ ఏర్పాటు చేస్తున్నామని, ఎవరికీ వ్యతిరేకంగా కాదని పలుమార్లు చెప్పిన విషయాన్ని గుర్తు చేశారు. సభను అడ్డుకుంటామంటూ కొంత మంది నాయకులు మాట్లాడడం సరికాదన్నారు. ప్రత్యేకవాదంలో బలముంటే.. తమ సభ నిర్వహణకు ఎలాంటి ఆటంకాలు సృష్టించవద్దని చెప్పారు. సభ సజావుగా సాగడానికి అందరూ సహకరించాలని విజ్ఞప్తి చేశారు. ‘సేవ్ ఆంధ్రప్రదేశ్’ సభకు ఉద్యోగులకు మాత్రమే అనుమతి లభించిందన్నారు. ‘గుర్తింపు కార్డులతో పాటు మేం జారీ చేసిన ప్రత్యేక కార్డులు ఉన్న ఉద్యోగులను మాత్రమే లోపలికి అనుమతిస్తారు. రాజకీయ పార్టీల నాయకులు పోలీసుల అనుమతితో స్టేడియంలోకి వస్తారు. అయితే, వారికి వేదికపై ప్రసంగించే అవకాశం ఉండదు’ అని తెలిపారు. రాజకీయ నేతలు తమ సభకు వస్తే తప్పేముందని విలేకరులు అడిగిన ఒక ప్రశ్నకు సమాధానంగా చెప్పారు. సభ నిర్వహణకు పోలీసులు అనుమతించినా ఎల్బీ స్టేడియం అధికారులు సహకరించడం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రతిచోటా సభ నిర్వహణ ఏర్పాట్లకు అవరోధం కల్పిస్తున్న స్టేడియం అధికారుల తీరును తప్పుపట్టారు. ఎల్బీ స్టేడియంలో సభకు ఏవైనా ఆటంకాలు తలపెడితే స్టేడియం బయటే సభను నిర్వహిస్తామని స్పష్టం చేశారు. ఏపీఎన్జీవో నగర శాఖ అధ్యక్షుడు పి.వి.వి.సత్యనారాయణ మాట్లాడుతూ.. హైదరాబాద్ నుంచి పెద్ద ఎత్తున సమైక్యవాదులు తరలిరావాలని పిలుపునిచ్చారు. సమైక్య రాష్ట్ర పరిరక్షణ వేదికలో ప్రతి ఒక్కర్నీ భాగస్వాములను చేసే శాశ్వత కార్యాచరణను త్వరలో రూపొందించనున్నట్లు జన చైతన్య వేదిక రాష్ట్ర అధ్యక్షుడు వి.లక్ష్మణ్ రెడ్డి తెలిపారు. తర్వాతి దశలో హైదరాబాద్‌లో భారీ మానవహారం, సమైక్య ఆవశ్యకతను తెలియజేసేలా అన్ని కాలనీలలో సమావేశాలు నిర్వహణతో పాటు నగరంలో భారీ బహిరంగ సభను ఏర్పాటు చేసే యోచనలో ఉన్నట్లు తెలిపారు. సభా ప్రాంగణానికి బూర్గుల రామకృష్ణారావు, సాంస్కృతిక కళావేదికకు గురజాడ అప్పారావు పేరిట నామకరణం చేశారు. ముఖద్వార వేదికకు కాకతీయ ద్వారం అని, వీఐపీ ద్వారానికి డాక్టర్ బీఆర్ అంబేద్కర్ ద్వారం అని పేరు పెట్టారు. సభ ప్రాంగణంలో తెలంగాణ, ఆంధ్రా ప్రాంతాల్లోని పోరాట యోధుల చిత్రపటాల ప్రదర్శన ఏర్పాటు చేయనున్నారు. నవంబర్‌లో భారీ సభ.. సేవ్ ఆంధ్రప్రదేశ్ పేరిట నిర్వహిస్తున్న సభను ఉద్యోగ వర్గాలకే పరిమితం చేయాలని నిర్వాహకులు భావిస్తున్నారు. భారీ స్థాయిలో జన సమీకరణ అవసరం లేదని, 50-60 వేల మంది ఉద్యోగులతో సభ జరిపితే విజయవంతమయినట్లుగానే భావిస్తామని ఉద్యోగ సంఘాల నేతలు చెబుతున్నారు. సీసీఎం, ఎంఐఎం పార్టీలనే సభకు ఆహ్వానించారు. రాజకీయ నాయకులను సభకు తీసుకురావడానికి పెద్దగా ప్రయత్నించకూడదనే నిర్ణయానికి వచ్చారు. సమైక్యవాదాన్ని నమ్ముతున్న అన్ని వర్గాల ప్రజలు, విభజనను వ్యతిరేకిస్తున్న అన్ని పార్టీలను కలిసి, నవంబర్‌లో హైదరాబాద్‌లో భారీ బహిరంగ సభను ఏర్పాటు చేసే దిశగా ఉద్యోగ, కార్మిక సంఘాలు ప్రయత్నిస్తున్నాయి. -
'బంద్ లో ప్రతి ఒక్కరూ పాల్గొనండి'
ఢిల్లీ: టీ.జేఏసీ తలపెట్టనున్న బంద్ లో ప్రతి ఒక్కరూ పాల్గొనాలని టీఆర్ఎస్ అధ్యక్షుడు కేసీఆర్ పిలుపునిచ్చారు. బంద్ ను విజయవంతం చేయాలని తెలంగాణ ప్రజలకు ఆయన విజ్ఞప్తి చేశారు. సెప్టెంబర్ 7 వ తేదీన టీ.జేఏసీ బంద్ కు పిలుపు నిచ్చిన నేపథ్యంలో తన మద్దతు ప్రకటిస్తున్నట్లు కేసీఆర్ తెలిపారు. ఈ సందర్భంగా గురువారం సాయంత్రం మీడియాతో మాట్లాడిన కేసీఆర్ బంద్ ను విజయవంత చేయాలని తెలంగాణ ప్రజలను కోరారు. సేవ్ ఆంధ్రప్రదేశ్ పేరుతో అదే రోజున హైదరాబాద్ నగరంలో ఏపీఎన్జీవోలు సభ ఏర్పాటుకు ముందుకు వెళుతున్న తరుణంలో టీ.జేఏసీ బంద్ కు పిలుపునిచ్చింది. శుక్రవారం రాత్రి నుంచి శనివారం రాత్రి వరకు 24 గంటలపాటు బంద్‌కు పిలుపు ఇస్తున్నట్లు కోదండరామ్ తెలిపారు. ఈ నెల 7వ తేదీన హైదరాబాద్‌లో చేయతలపెట్టిన శాంతి ర్యాలీని రద్దు చేసినట్లు చెప్పారు. శాంతి ర్యాలీకీ బదులుగానే బంద్ అని, సీమాంధ్ర సభకు వ్యతిరేకంగా బంద్ కాదని స్పష్టం చేశారు. ప్రభుత్వం తెలంగాణకు వ్యతిరేకంగా వ్యవహరిస్తోందని, అందుకు నిరసనగానే బంద్‌కు పిలుపు ఇచ్చినట్లు తెలిపారు. మొత్తం వ్యవస్థను నిలిపివేస్తామని హెచ్చరించారు. ఎక్కడికక్కడే శాంతి ర్యాలీలు, ఊరేగింపులు నిర్వహిస్తామని చెప్పారు. విభజనకు సహకరిస్తే ఏపీఎన్జీవోల సభను తామే విజయవంతం చేస్తామన్నారు. -
సభకు రాజకీయ నేతలొస్తే తప్పేంటి?: ఆశోక్‌బాబు
-
సభకొచ్చేవారికి పాసులు
సాక్షి, హైదరాబాద్: ‘సేవ్ ఆంధ్రప్రదేశ్’ పేరిట సీమాంధ్ర ఉద్యోగులు శనివారం ఎల్బీ స్టేడియంలో నిర్వహిస్తున్న సభను విజయవంతం చేయడానికి ఉద్యోగ, కార్మిక సంఘాల నేతలు ప్రయత్నాలు ముమ్మరం చేశారు. ఈ సభకు జంటనగరాల్లోని ప్రజలు, ఐటీ, ప్రైవేటు ఉద్యోగులను కూడా ఆహ్వానించారు. సభకు వచ్చే వారికి ప్రత్యేకంగా రూపొందించిన గుర్తింపు కార్డులు ఇవ్వనున్నారు. అయితే, ఉద్యోగులనే సభకు అనుమతిస్తామని పోలీసులు షరతు విధించారు. దీంతో.. సభ ఉద్యోగుల అంశాలకే పరిమితం కాదని, అన్ని వర్గాల ప్రజలను అనుమతించాలని పోలీసులను కోరాలని సమైక్య రాష్ట్ర పరిరక్షణ వేదిక సమన్వయ సంఘం నిర్ణయించింది. ఇందుకోసం సంఘం ప్రతినిధులు గురువారం పోలీస్ కమిషనర్‌ను కలిసే అవకాశముంది. ఏపీఎన్జీవో అధ్యక్షుడు అశోక్‌బాబు నేతృత్వంలోని ప్రతినిధి బృందం బుధవారం ఎల్బీ స్టేడియానికి వెళ్లి స్టేడియం వైశాల్యం, సామర్థ్యం, ఇతర అంశాలను పరిశీలించింది. క్రికెట్ మ్యాచ్‌లకు వీఐపీ టిక్కెట్లు కాకుండా 39 వేల టిక్కెట్లు విక్రయిస్తామని స్టేడియం నిర్వాహకులు చెప్పారు. బహిరంగ సభ అయితే 50 వేల మందికిపైగానే పడతారని అంచనా వేశారు. ఏపీఎన్జీవో నగర శాఖ అధ్యక్షుడు సత్యనారాయణ, ఇతర నేతలు నగరంలోని సాఫ్ట్వేర్ ఉద్యోగులతో బుధవారం సమావేశమయ్యారు. సభకు వీలైనంత ఎక్కువ మంది వచ్చేలా ఫేస్బుక్, ట్విట్టర్, ఇతర సామాజిక మీడియా ద్వారా ప్రచారం చేయాలని కోరారు. అశోక్‌బాబుతో గజ్జెల కాంతం భేటీ తెలంగాణ ప్రజా సంఘాల జేఏసీ చైర్మన్ గజ్జెల కాంతం బుధవారం ఏపీఎన్జీవో అధ్యక్షుడు అశోక్‌బాబుతో భేటీ అయ్యారు. అనంతరం అశోక్‌బాబుతో కలిసి కాంతం విలేకరులతో మాట్లాడుతూ.. శుక్రవారం నిర్వహించనున్న ఇరు ప్రాంతాల ఉద్యోగుల రౌండ్ టేబుల్ సమావేశానికి ఏపీఎన్జీవోలను ఆహ్వానించడానికి వచ్చానని తెలిపారు. సేవ్ ఆంధ్రప్రదేశ్ సభకు తనను పిలిస్తే హాజరవుతానని విలేకరుల ప్రశ్నకు సమాధానంగా చెప్పారు. దీనికి అశోక్‌బాబు స్పందిస్తూ.. ‘తప్పకుండా ఆహ్వానిస్తాం. ఆయన వ్యక్తిగా కాకుండా వ్యవస్థ ప్రతినిధిగా హాజరుకావొచ్చు’ అని అన్నారు. తెలంగాణ రాష్ర్టం ఏర్పాటైనా ఇక్కడ పనిచేసే విద్యార్థులు, ఉద్యోగులతో కలిసే ఉంటామని కాంతం చెప్పారు. ప్రజాస్వామ్యంలో సభలు నిర్వహించుకునే హక్కు అందరికీ ఉందని, ఏ ఉద్యమాన్నీ కించపరచవద్దని అన్నారు. సమస్యలుంటే సామరస్యపూరిత వాతావరణంలో చర్చించుకుని పరిష్కరించుకోవాలని, శాంతియుతంగా ఉండాలన్న ఆలోచనతోనే రౌండ్ టేబుల్ సమావేశానికి సమైక్యాంధ్ర ఉద్యోగ సంఘాలను కూడా ఆహ్వానిస్తున్నామని తెలిపారు. మాకు సహకరిస్తేనే...: అశోక్‌బాబు సభకు ఆటంకం కలిగించవద్దని తెలంగాణవాదులను అశోక్‌బాబు కోరారు. ఈ సభకు వారు సహకరిస్తే వారికి సహరించే ఆలోచన తమకు కలుగుతుందన్నారు. సమైక్యవాదాన్ని బలపరిచే వారు ఎవరైనా ఈ సభకు ఆహ్వానితులేనన్నారు. సభకు ఆటంకం కలుగకుండా జాగ్రత్తలు తీసుకుంటున్నట్లు తెలిపారు. సమైక్యాంద్ర విషయంలో అన్ని పార్టీలు ద్వంద్వ వైఖరులు అవలంభిస్తున్నందున ఈ సభకు సీపీఎం, ఎంఐఎం పార్టీలనే ఆహ్వానించినట్లు తెలిపారు. -
రెండో రోజూ సీమాంధ్ర ఉద్యోగుల సమ్మె
సాక్షి, హైదరాబాద్: సచివాలయంలో సీమాంధ్ర ఉద్యోగులు రెండో రోజూ సమ్మె కొనసాగించారు. అన్ని శాఖల్లో ఉద్యోగులు విధులు బహిష్కరించి నిరసనల్లో పాల్గొన్నారు. 92శాతం మంది సీమాంధ్ర ఉద్యోగులు సమ్మెలో పాల్గొన్నట్టు సచివాలయ సీమాంధ్ర ఉద్యోగుల ఫోరం తెలిపింది. అదనపు కార్యదర్శులు, సహాయ కార్యదర్శులు వంటి ఉన్నతాధికారులు సైతం నిరసనల్లో పాలుపంచుకున్నారని ఫోరం కార్యదర్శి కేవీ కృష్ణయ్య చెప్పారు. మరోవైపు సచివాలయంలో ఉద్యోగుల నిరసనలు కొనసాగుతున్నాయి. సీమాంధ్ర, తెలంగాణ ఉద్యోగులు బుధవారం సచివాలయంలోని వేరు, వేరు ప్రాంతాల్లో శాంతియుత నిరసనలు తెలిపారు. ర్యాలీలు చేయరాదన్న సీఎస్ ఆదేశాల మేరకు నిర్దిష్ట ప్రాంతంలోనే కూర్చుని నిరసన వ్యక్తం చేశారు. కె బ్లాకు వద్ద తెలంగాణ ఉద్యోగులు, ఓల్డ్ మెయిన్ గేట్ వద్ద సీమాంధ్ర ఉద్యోగులు బైఠాయించారు. తెలంగాణ ఏర్పాటు నిర్ణయాన్ని కేంద్ర ప్రభుత్వం వెంటనే వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేస్తూ సీమాంధ్ర ఉద్యోగులు వెనక్కి నడిచారు. హైదరాబాద్ రాష్ట్రం తెలుగువారందరిదని నినదించారు. 7 తేదీ హైదరాబాద్‌లో జరగనున్న ‘సేవ్ ఆంధ్రప్రదేశ్’ బహిరంగ సభను జయప్రదం చేసేందుకు సమాయత్తం కావాలని పిలుపునిచ్చారు. గతంలో తెలంగాణవాదుల సభలు, సాగరహారం కార్యక్రమానికి ప్రభుత్వంతో మాట్లాడి మరీ అనుమతి ఇప్పించిన మంత్రి జానారెడ్డి సమైక్యవాదుల సభకు వ్యతిరేకంగా మాట్లాడడం ఎంతవరకు సమంజసమో ఆయనే ఆత్మపరిశీలన చేసుకోవాలని సూచించారు. తెలంగాణ ఉద్యోగుల ఆందోళన విరమణ తెలంగాణ ఏర్పాటు ప్రక్రియను వేగవంతం చేయాలంటూ కొన్ని రోజులుగా సచివాలయంలో నిరసనలు తెలుపుతున్న తెలంగాణ ఉద్యోగులు తమ ఆందోళనలు విరమిస్తున్నట్టు ప్రకటించారు. సీమాంధ్ర ఉద్యోగులు సమ్మెలో ఉన్న నేపథ్యంలో తెలంగాణ ఉద్యోగులందరూ అధిక గంటలు పనిచేసి ప్రభుత్వ పథకాలు, కార్యకలాపాలు సజావుగా సాగేలా చేస్తామని సచివాలయ తెలంగాణ సమన్వయ సంఘం కన్వీనర్ నరేందర్‌రావు తెలిపారు. సీమాంధ్ర ఉన్నతోద్యోగులు ఉద్యోగుల రిజిస్టర్లను తమ వద్ద ఉంచుకుని విధుల్లో పాల్గొనే వారిని బలవంతంగా సమ్మెలోకి దించుతున్నారని ఆరోపించారు. -
గుడివాడ బంద్ సక్సెస్
గుండె మండిన జనం కన్నెర్ర చేశారు.. నిరసనాగ్రహం జ్వాలలై ఎగసింది.. సమ్మె అస్త్రంతో సకల జనులు ధిక్కార స్వరమై నినదించారు.. సమైక్యతే ఏకైక జెండా..అజెండాగా కదంతొక్కారు.. దీక్షలు, బంద్‌లు, రాస్తారోకోలు, అర్ధనగ్న ప్రదర్శనలతో ఆందోళన పతాకస్థాయికి చేరింది.. బందరులో రైళ్లకు సేవ్ ఆంధ్రప్రదేశ్ స్టిక్కర్లంటించి ఉద్యమ తీవ్రతను చాటగా.. బెజవాడలో అష్ట దిగ్బంధంతో సమైక్య గర్జన ప్రతిధ్వనించింది. సాక్షి, విజయవాడ : సమైక్య సెగ మిన్నంటుతోంది. జిల్లా అంతటా నిరసన జ్వాలలు ఎగసిపడుతున్నాయి. మచిలీపట్నంలో మున్సిపల్ ఉద్యోగులు ‘ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని ముక్కలు చేయొద్దు.. సేవ్ ఆంధ్రప్రదేశ్’ అనే నినాదంతో కూడిన స్టిక్కర్లను బుధవారం స్థానిక రైల్వేస్టేషన్లో పలు రైళ్లకు అంటించారు. మునిసిపల్ ఉద్యోగుల, ఆఫీసర్స్ జేఏసీ ఆధ్వర్యాన మునిసిపల్ కమిషనర్ ఎస్.శివరామకృష్ణ నేతృత్వంలో ఇంజినీర్లు, ఉద్యోగులు రైల్వేస్టేషన్ మేనేజర్ అనుమతితో ఈ కార్యక్రమం నిర్వహించారు. బందరులో న్యాయవాద జేఏసీ ఆధ్వర్యంలో న్యాయవాదులు, న్యాయశాఖ ఉద్యోగులు, న్యాయవాద గుమాస్తాలు, జిల్లా కోర్టు మెయిన్‌గేటు వద్ద చీపుళ్లతో రోడ్డును ఊడుస్తూ నిరసన వ్యక్తం చేశారు. జిల్లా కోర్టు సెంటరులోని పొట్టిశ్రీరాములు విగ్రహం వద్ద అరగంట సేపు రాస్తారోకో నిర్వహించారు. నందిగామ రైతుపేటలోని ఓ పెట్రోల్ బంక్‌లో వాహనాలకు న్యాయవాదులు పెట్రోల్ కొట్టి నిరసన తెలిపారు. పామర్రు నాలుగురోడ్ల కూడలిలో విద్యార్థులు మానవహారం నిర్వహించి ధర్నా చేశారు. కురుమద్దాలి పంచాయతీ సిబ్బంది, సర్పంచ్ ఆధ్వర్యంలో నాలుగురోడ్ల కూడలిలో జరుగుతున్న దీక్షలలో పాల్గొన్నారు. గుడివాడలో జలదీక్ష.. ఆర్ఎంపీ వైద్యుల ఆధ్వర్యంలో గుడివాడ పెద్దకాల్వలో జలదీక్ష చేపట్టారు. గుడివాడలో 72 గంటల బంద్ విజయవంతమైంది. జేఏసీ ఆధ్వర్యంలో జరుగుతున్న రిలేదీక్షలు కొనసాగుతున్నాయి. నందివాడ మండలం టెలిఫోన్ నగర్లో సమైక్యాంధ్రకు మద్దతుగా ఉపాధ్యాయులు రిలేదీక్షలు చేస్తున్నారు. గుడ్లవల్లేరులో సమైక్యాంధ్రకు మద్దతుగా బుధవారం రిటైర్డు టీచర్లు రిలేదీక్షలకు కూర్చున్నారు. ప్రైవేట్ విద్యాసంస్థల ఆధ్వర్యంలో నందిగామ గాంధీ సెంటర్లో ఏర్పాటుచేసిన రిలే దీక్షా శిబిరం బుధవారం కూడా కొనసాగింది. మైలవరంలో ఎన్టీటీపీఎస్ గేటు వద్ద రిలేదీక్షలు కొనసాగాయి. పెనుగంచిప్రోలులో జేఏసీ ఆధ్వర్యంలో ఏర్పాటుచేసిన శిబిరంలో రెవెన్యూ ఉద్యోగులు కూర్చున్నారు. కైకలూరు వైఎస్సార్ సీపీ కార్యాలయం వద్ద పార్టీ నియోజకవర్గ సమన్వయకర్త దూలం నాగేశ్వరరావు ఆధ్వర్యంలో కొనసాగుతున్న దీక్షలు 29వ రోజుకు చేరాయి. వారికి మద్దతుగా ఆర్ఎంపీలు రిలే దీక్షలు చేశారు. ఉపాధ్యాయ జేఏసీ నేతలు బైక్‌ర్యాలీ జరిపారు. జంక్షన్లో 48 గంటల బంద్.. హనుమాన్‌జంక్షన్‌లో నాన్ పొలిటికల్ జేఏసీ ఆధ్వర్యంలో 48 గంటల బంద్ చేపట్టారు. ప్రైవేట్ విద్యాసంస్థల ఆధ్వర్యంలో నందిగామ గాంధీసెంటర్‌లో ఏర్పాటుచేసిన రిలే దీక్షా శిబిరం బుధవారం కూడా కొనసాగింది. తిరువూరులో విజయవాడ-జగదల్పూర్ జాతీయ రహదారిపై జేఏసీ నాయకులు బైఠాయించి ట్రాఫిక్‌కు అంతరాయం కలిగించారు. విస్సన్నపేటలో పశుసంవర్ధక శాఖ ఉద్యోగులు, ఉపాధ్యాయులు రిలేదీక్షలు చేయగా, శ్రీశ్రీ విద్యాసంస్థల విద్యార్థులు రోడ్డుపై యూనిట్ పరీక్షలు రాశారు. కంచికచర్లలో ఉపాధ్యాయులు పరిటాల 65వ నంబర్ జాతీయ రహదారిపై రాస్తారోకో చేశారు. విద్యాసంస్థల ఐక్యకార్యాచరణ సమితి ఆధ్వర్యంలో కొండపల్లి బి-కాలనీ సెంటర్లో నడిరోడ్డుపై విద్యార్థులకు విద్యాబోధన చేసి వినూత్న రీతిలో నిరసన తెలిపారు. కంభంపాడు వైఎస్సార్సీపీ రిలేదీక్ష.. వత్సవాయి మండలం కంభంపాడు గ్రామంలో వైఎస్సార్ సీపీ ఆధ్వర్యంలో రిలే నిరాహార దీక్షా శిబిరం ప్రారంభమైంది. మొదటి రోజు మహిళలు మాత్రమే దీక్షలో పాల్గొన్నారు. జగ్గయ్యపేటలో ఉపాధ్యాయ ఉద్యోగ సంఘాల జేఏసీ ఆధ్వర్యంలో అర్ధనగ్న ప్రదర్శన నిర్వహించారు. ఎన్జీవో జేఏసీ నేతలు తమ కళ్లకు గంతలు కట్టుకుని నిరసన వ్యక్తం చేశారు. విజయవాడలో రోడ్ల దిగ్బంధం.. ఏపీ ఎన్జీవోలు సమైక్య రాష్ట్ర పరిరక్షణ వేదిక ఆధ్వర్యంలో రహదారుల అష్ట దిగ్బంధం నిర్వహించారు. దీంతో విజయవాడలో ఉదయం 9 గంటల నుంచి 12 గంటల వరకు ట్రాఫిక్ స్తంభించింది. సమైక్యాంధ్రకు మద్దతుగా గురువారం సార్వత్రిక బంద్ నిర్వహిస్తున్నట్లు సీమాంధ్ర విద్యావేత్తల జేఏసీ ప్రకటించింది. గురుపూజోత్సవాన్ని బహిష్కరిస్తున్నట్లు తెలిపింది. సీమాంధ్రలోని 13 జిల్లాల్లోని ప్రభుత్వ, ప్రైవేటు, ఎయిడెడ్ కళాశాలలు, పాలిటెక్నిక్, ఇంజనీరింగ్, ఐటీఐ కళాశాలల్లో తరగతులు బహిష్కరిస్తున్నట్లు ప్రకటించారు. ఉద్యమకారుడికి గాయాలు విజయవాడ లిక్కర్ మర్చంట్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో భారీ లిక్కర్ సీసా బొమ్మ తయారు చేసి కేసీఆర్ బొమ్మ అతికించి దాన్ని రాళ్లతో కొట్టి నిరసన తెలిపారు. అనంతరం సబ్‌కలెక్టర్ కార్యాలయం వద్ద దహనం చేశారు. ఈ సమయంలో ఒక ఉద్యమకారుడికి నిప్పంటుకుని స్వల్ప గాయాలయ్యాయి.