హైదరాబాద్ : ఉస్మానియా యూనివర్శిటీలో మళ్లీ ఉద్రిక్త వాతావరణం నెలకొంది. అనుమతి లేకున్నా పోలీసులను ఏమాత్రం లెక్కచేయని విద్యార్థులు శనివారం ఉస్మానియా యూనివర్సిటి ఆర్ట్స్ కాలేజీ నుంచి నిజాం కాలేజీకు బయల్దేరారు. అయితే వారిని పోలీసులు ఎన్సీసీ గేటు వద్ద అడ్డుకున్నారు. దాంతో పోలీసులపై విద్యార్థులు రాళ్లదాడికి దిగారు. ఈ సందర్భంగా పలువురు గాయపడ్డారు. ఎన్సీసీ గేటు వద్ద భారీగా పోలీసులు మోహరించారు. రోడ్డుపైనే విద్యార్థులు బైఠాయించి నిరసనలు తెలుపుతున్నారు.
మరోవైపు హైదరాబాద్‌లోని నిజాం కాలేజ్ హాస్టల్ రణరంగంగా మారింది. సేవ్ ఆంధ్రప్రదేశ్ సభ కోసం వస్తున్న ఏపీఎన్జీవో ఉద్యోగులపై నిజాం కాలేజ్ విద్యార్థులు....నాన్‌బోర్డర్స్ రాళ్లతో దాడి చేశారు. రాళ్ల దాడిలో పలువురు ఉద్యోగులకు గాయాలయ్యాయి. ప్రాణభయంతో వాళ్లు పరుగులు తీశారు. రాళ్ల దాడి చేసిన నిజాం కాలేజ్ స్టూడెంట్స్‌ను, నాన్‌బోర్డర్స్‌ను పోలీసులు బలవంతంగా అదుపులోకి తీసుకున్నారు. కాగా ఫతేమైదాన్ వద్ద పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. రెండువర్గాల మధ్య దాడి జరగటంతో పలువురు గాయపడ్డారు. అనంతరం అక్కడకు చేరుకున్న పోలీసులు పరిస్థితిని అదుపులోకి తెచ్చారు.
పోలీసులపై ఓయూ విద్యార్థుల రాళ్లదాడి
Published Sat, Sep 7 2013 11:04 AM | Last Updated on Sat, Mar 23 2019 9:03 PM
Advertisement