osmaina university
-
విషాదం: ఓయూ మాజీ వీసీ నవనీత రావు కన్నుమూత
సాక్షి, హైదరాబాద్: ఉస్మానియా యూనివర్సిటీ మాజీ వైస్ ఛాన్స్లర్ (వీసీ) ప్రొఫెసర్ నవనీత రావు (95) తుదిశ్వాస విడిచారు. ఆయన మృతి తీరని లోటని పలువురు విద్యార్థులు, అధ్యాపకులు సంతాపం వ్యక్తం చేశారు. ఉస్మానియా యూనివర్సిటీ విద్యాభివృద్ధికి ఆయనెంతో కృషి చేశారని కొనియాడారు. అయితే, నవనీత రావు 1985 నుంచి 1991 వరకు ఉస్మానియా యూనివర్సిటీ వైస్ ఛాన్స్‌లర్‌గా ఆయన పని చేశారు. నవనీత రావు మృతితో జూబ్లీహిల్స్‌లోని ఆయన నివాసానికి పలువురు అధ్యాపకులు, విద్యార్థులు చేరుకుంటున్నారు. ఇక, ఆయన మృతిపై బీఆర్ఎస్ నేత దాసోజు శ్రవణ్ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. నవనీత రావు డైనమిక్ అడ్మినిస్ట్రేటర్ అని ఆయన కొనియాడారు. ఓయూ గౌరవాన్ని పెంచడమే కాకుండా, నిరుపేద విద్యార్థుల జీవితాలను కూడా తీర్చిదిద్దారని పేర్కొన్నారు. నవనీత రావు మృతిపై దాసోజు శ్రవణ్ ట్విట్టర్ వేదికగా స్పందించారు. ఈ సందర్భంగా ఉస్మానియా విశ్వవిద్యాలయం పరిపాలనలో రాజకీయ జోక్యాలకు తావు ఇవ్వకుండా, స్వయం ప్రతిపత్తిని కొనసాగించారని గుర్తు చేశారు. ఉస్మానియా విద్యార్థి నాయకుడిగా, ఆ తర్వాత ఐపీఈలో అసిస్టెంట్ ప్రొఫెసర్‌గా ఆయనతో సన్నిహితంగా పని చేయడం తనకు దక్కిందని శ్రవణ్ పేర్కొన్నారు. నవనీత రావు ఆత్మకు శాంతి చేకూరాలని శ్రవణ్ ప్రార్థించారు. Very saddened to know the unfortunate demise of Prof T Navaneeth Rao Garu, former Vice Chancellor of Osmania University @osmania1917 & former Director of @ipe_info Institute of Public Enterprise. He was a dynamic administrator with great professional values, dignity and… pic.twitter.com/PqRSH68PoY — Prof Dasoju Srravan (@sravandasoju) August 26, 2023 -
దళం కదలాలి.. దగా ఆపాలి
సాక్షి, హైదరాబాద్: కార్పొరేట్ కబంధ హస్తాల నుంచి విద్యారంగాన్ని కాపాడటమే తమ లక్ష్యమని, అలాగే బీజేపీ కాషాయీకరణ పంథా నుంచి విద్యారంగాన్ని రక్షించడమే ఎజెండా అని భారత విద్యార్థి సమాఖ్య (ఎస్ఎఫ్ఐ) స్పష్టం చేసింది. ఇందుకు అవసరమైన అస్త్ర, శస్త్రాలను సమకూర్చుకోవాలని నిర్ణయించింది. విద్యార్థి లోకాన్ని నిద్రలేపి, కలసి వచ్చే సంఘాలతో సమైక్య పోరుకు సిద్ధమని స్పష్టం చేసింది. హైదరాబాద్ వేదికగా నాలుగు రోజుల పాటు సాగిన ఎస్ఎఫ్ఐ 17వ మహాసభలు శుక్రవారంతో ముగిశాయి. 23 రాష్ట్రాలకు చెందిన 697 మంది ఆహ్వానితులు ఈ సభలకు హాజరయ్యారు. సభల ప్రారంభం రోజు విద్యార్థి గళాన్ని లోకానికి వినిపించేలా భారీ ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా జరిగిన బహిరంగ సభలో త్రిపుర మాజీ ముఖ్యమంత్రి మాణిక్ సర్కార్ కీలకోపన్యాసం చేశారు. పేదవాడికి విద్యారంగాన్ని దూరం చేస్తున్న పాలకుల విధానాలను ఎండగట్టారు. ఉస్మానియా యూనివర్సిటీ వేదికగా సాగిన తొలి రోజు సభలో మద్రాస్ హైకోర్టు మాజీ న్యాయమూర్తి జస్టిస్ చంద్రు ప్రసంగం అన్ని వర్గాలను కదిలించింది. నాలుగు రోజులపాటు 35 అంశాలపై ప్రతినిధులు సుదీర్ఘంగా చర్చించారు. ఎస్ఎఫ్ఐ జాతీయ అధ్యక్షుడు వీపీ సాను, ఉపాధ్యక్షురాలు దిప్సిత ధర్, ప్రధాన కార్యదర్శులు మయూక్ బిస్వాస్, రాష్ట్ర అధ్యక్ష, కార్యదర్శులు ఆర్ఎల్ మూర్తి, టి నాగరాజు తదితరులు పలు అంశాలపై ప్రతిపాదనలు చేశారు. ఈ సమావేశాల సందర్భంగా సభ జాతీయ కమిటీని ఎన్నుకుని, భవిష్యత్ కార్యాచరణ ప్రణాళికను రూపొందించారు. (చదవండి: ఎస్ఎఫ్ఐ జాతీయ అధ్యక్షుడిగా సాను ) -
హబ్సిగూడలో కారు బీభత్సం
సాక్షి, లాలాపేట: మద్యం మత్తులో ఓ కారు డ్రైవర్ హబ్సిగూడ ప్రధాన రహదారిలో బీభత్సం సృష్టించారు. నలుగురు ప్రయాణికులతో వెళ్తున్న ఓ ఆటోను, ఓ స్కూటీని ఢీకొట్టిన ఘటన ఉస్మానియా యూనివర్సిటీ పోలీసు స్టేషన్ పరిధిలో ఆదివారం ఉదయం చోటు చేసుకుంది. ఇన్స్పెక్టర్ రమేష్ నాయక్ తెలిపిన వివరాల మేరకు.. హబ్సిగూడలో ఫుడ్ పాయింట్ నిర్వహిస్తున్న మౌర్య తన స్నేహితులతో కలిసి అర్ధరాత్రి నుంచి ఉదయం వరకు పూటుగా మద్యం తాగారు. ఉదయం ఒక్కడే మౌర్య 8 గంటలకు హబ్సిగూడ స్ట్రీట్ నంబర్–8 నుంచి సికింద్రాబాద్‌కు కారులో బయలుదేరారు. కొద్ది సేపటికే మద్యం మత్తులో డ్రైవింగ్ చేస్తూ తన కారుతో రామంతాపూర్ వైపు వెళ్తున్న ఓ ఆటోను, ఓ ద్విచక్ర వాహనాన్ని ఢీ కొట్టింది. ఆటో, స్కూటీ నుజ్జునుజ్జయ్యాయి. ఆటోలో ప్రయాణిస్తున్న డ్రైవర్‌తో పాటు ఇద్దరు ప్యాసింజర్లు హరీష్, శ్రీనివాస్, ద్విచక్ర వాహనంపై వెళ్తున్న వ్యక్తి మొత్తం నలుగురు వ్యక్తులు గాయపడగా వారిని చికిత్స నిమిత్తం గాంధీ ఆస్పత్రికి తరలించారు. ఆటో డ్రైవర్ మల్లికార్జున్ పరిస్థితి విషమంగా ఉందన్నారు. కారు డ్రైవర్ మౌర్యను పోలీసులు అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. ఈ మేరకు కేసు దర్యాప్తులో ఉందని ఇన్స్పెక్టర్ రమేష్ నాయక్ తెలిపారు. (చదవండి: హాస్టల్లో ఉంటున్న కూతుర్ని చూసేందుకు వెళ్లి...అంతలోనే) -
ఓయూలో రాహుల్ గాంధీ సభకు నో పర్మిషన్!
ఉస్మానియా యూనివర్సిటీ (హైదరాబాద్): ఉస్మానియా యూనివర్సిటీలో మే 7న నిర్వహించ తలపెట్టిన ఏఐసీసీ అగ్రనేత రాహుల్‌గాంధీ సభకు ఓయూ వీసీ ప్రొఫెసర్ రవీందర్ అనుమతి నిరాకరించారు. రాహుల్ సభ కోసం విద్యార్థి సంఘాల నుంచి అందిన వినతిపత్రానికి సంబంధించి యూనివర్సిటీ ఎగ్జిక్యూటివ్ కౌన్సిల్ సమావేశంలో చర్చించిన మీదట వీసీ శనివారం ఈ మేరకు నిర్ణయం ప్రకటించారు. ఓయూలో సభలు సమావేశాలు, రాజకీయ సమ్మేళనాలకు అనుమతులు ఇవ్వకూడదని గతంలోనే నిర్ణయం తీసుకున్నామని తెలిపారు. ఆ నిర్ణయం మేరకే రాహుల్‌గాంధీ సభకు అనుమతిని నిరాకరిస్తున్నట్టు వివరించారు. రాహుల్ సభకే కాకుండా ఓయూలో ఎటువంటి సభలకు అనుమతి ఇచ్చేది లేదని స్పష్టం చేసిన అధికారులు.. క్యాంపస్‌లో కెమెరాలను కూడా నిషేధిస్తున్నట్టు ప్రకటించారు. కేసీఆర్ సర్కారుపై పోరులో భాగంగా తెలంగాణ కాంగ్రెస్ మే 6న వరంగల్‌లో రైతు సంఘర్షణ సభను నిర్వహించనుంది. ఆ మరుసటి రోజు ఓయూ ఆర్ట్స్ కాలేజీ వద్ద సభ నిర్వహించి, రాహుల్‌గాంధీతో విద్యార్థుల ముఖాముఖి ఏర్పాటు చేస్తామని పీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి గతంలో ప్రకటించారు. ఈ మేరకు వినతిపత్రం సమర్పించగా వీసీ అనుమతి నిరాకరించారు. వీసీపై విద్యార్థి నేతల ఆగ్రహం రాహుల్ సభకు అనుమతి నిరాకరించడం ఓయూలో స్వల్ప ఉద్రిక్తతకు దారితీసింది. వీసీని కలిసిన విద్యార్థి సంఘాల నాయకులు ఆయనపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆ తర్వాత ఆర్ట్స్ కళాశాల ముందు బైఠాయించి నిరసన వ్యక్తం చేశారు. ప్రభుత్వ దిష్టిబొమ్మ దగ్ధం చేసేందుకు ప్రయత్నించగా పోలీసులు అడ్డుకున్నారు. ఈ సందర్భంగా చనగాని దయాకర్‌గౌడ్, లోకేశ్‌యాదవ్, శ్రీధర్‌గౌడ్, కుర్వ విజయ్ తదితరులు మాట్లాడుతూ.. నియంతృత్వ పాలనను కొనసాగిస్తున్న టీఆర్ఎస్ ప్రభుత్వానికి వచ్చే ఎన్నికల్లో ప్రజలే బుద్ధి చెబుతారని హెచ్చరించారు. చదవండి: రాహుల్ సభ.. రైతుల కోసమే! -
‘ఉస్మానియా’ లోగోను ప్రభుత్వం మార్చలేదు
సాక్షి, హైదరాబాద్: ఉస్మానియా యూనివర్సిటీ లోగోను తమ ప్రభుత్వం మార్చలేదని రాష్ట్ర హోం మంత్రి మహమ్మద్ మహమూద్ అలీ సోమవారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. లోగోను టీఆర్ఎస్ ప్రభుత్వం మార్చిందని కొందరు నాయకులు దుష్ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు. ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావు సెక్యులర్ నాయకుడని, అన్ని మతాలను సమానంగా గౌరవించే వ్యక్తి అని పేర్కొన్నారు. లోగోపై నిగ్గు తేల్చే బాధ్యతలను ఉస్మానియా ఉర్దూ విభాగం అధిపతి ప్రొఫెసర్ ఎస్.ఎ.షుకూర్‌కు అప్పగించగా ఆయన పలు వివరాలు వెల్లడించారని తెలిపారు. 1951 సంవత్సరంలో లోగోలో కొంతమార్పు జరిగిందని, 1960లో లోగోను పూర్తిగా మార్చేశారని, ఐతే అప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వమే అధికారంలో ఉందని ఆయన పేర్కొన్నారు. 1960 సంవత్సరం తరువాత వర్సిటీ ధ్రువపత్రాలు ఉన్నవారు ‘లోగో’ను గమనించవచ్చని, నిరాధారమైన వార్తలను నమ్మవద్దని హోంమంత్రి ముహమ్మద్ మహమూద్ అలీ ప్రజలకు విజ్ఞప్తి చేశారు. -
‘పరీక్షా’ సమయం!
ఉస్మానియా యూనివర్సిటీ: ఓయూ పరిధిలో కరోనా కారణంగా వాయిదాపడిన అన్ని కోర్సుల పరీక్షలను నిర్వహించేందుకు రంగం సిద్ధమైంది. ఈ మేరకు గురువారం నుంచి ఓయూ పరీక్షలు ప్రారంభమవుతాయని కంట్రోలర్ ప్రొఫెసర్ శ్రీరామ్ వెంకటేశ్ తెలిపారు. కరోనా కారణంగా విద్యార్థుల ఆరోగ్యాన్ని దృష్టిలో పెట్టుకొని నిబంధనల ప్రకారం వారి కాలేజీల్లోనే పరీక్షా కేంద్రాలను ఏర్పాటు చేశారు. ఇంజనీరింగ్, బీఈడీ, బీపీఈడీ, బీసీఏ, ఫార్మసీ, హోటల్ మేనేజ్మెంట్ కోర్సుల చివరి సెమిస్టర్ పరీక్షలు 17వ తేదీ నుంచి వచ్చేనెల 14 వరకు జరుగుతాయి. ఎంబీఏ పరీక్షలు అక్టోబర్ 6 నుంచి 12 వరకు, బీఏ, బీకాం, బీఎస్సీ, బీబీఏ ఇతర డిగ్రీ కోర్సుల పరీక్షలు ఈ నెల 22 నుంచి వచ్చే నెల 13 వరకు జరుగుతాయని కంట్రోలర్ వివరించారు. పరీక్ష ఫీజు చెల్లించిన విద్యార్థులు పరీక్షలకు రెండు రోజుల ముందు నుంచి హాల్‌టికెట్లను డౌన్లోడ్ చేసుకోవచ్చని, పరీక్షల టైంటేబుల్, ఇతర వివరాలను ఉస్మానియా వెబ్సైట్లో విద్యార్థులకు అందుబాటులో ఉంచినట్లు చెప్పారు. కరోనా కారణంగా విద్యా సంవత్సరం ఆలస్యంగా ప్రారంభమవడంతో రాబోయే మూడు నెలలు వరుసగా పరీక్షలు నిర్వహిస్తున్నామని కంట్రోలర్ శ్రీరామ్ వెంకటేశ్ తెలిపారు. -
అవకాశాలను అందిపుచ్చుకోండి
ఉస్మానియా యూనివర్సిటీ: ‘కాలానుగుణంగా ప్రభుత్వాలు, పరిస్థితులు, వ్యవస్థలు, సాంకేతిక పరిజ్ఞానం, జీవన విధానం మారుతూనే ఉంటాయి. మనం తొందరపడి చేసే ఆందోళన కార్యక్రమాలతో తెల్లారేలోగా మార్పులు సంభవించవు. ప్రజాస్వామ్యంలో లోపాలుంటే వాటి పరిష్కారం కోసం శాంతియుత పద్ధతుల్లో నిరసనలు తెలపాలి. సమాజంలోని ప్రజల గురించి కూడా ఆలోచించాలి. నిబంధనలను ఉల్లంఘించి మరీ ఇతరులకు ఇబ్బంది కలిగేలా ఆందోళన కార్యక్రమాలు చేయకుండా ఉండటం మంచిది. పోలీసులకు ఎవరిపైనా కోపం ఉండదు. రాబోయే రోజుల్లో కాబోయే పాలకులు మీరే. సమయాన్ని వృథా చేయకుండా అవకాశాలను అందిపుచ్చు కోండి’అని నగర పోలీస్ కమిషనర్ అంజనీ కుమార్ విద్యార్థులకు సూచించారు. శనివారం ఉస్మానియా యూనివర్సిటీ ఆర్ట్స్ కాలేజీ వద్ద జరిగిన కార్యక్రమంలో ఓయూ విద్యార్థులు, విద్యార్థి నాయకులతో పోలీసు అధికారులు సమావేశం అయ్యారు. పలువురు విద్యార్థి నాయకులు అడిగిన ప్రశ్నలకు సీపీ సమాధా నం చెప్పారు. -
ఎనిమిది వర్సిటీలకు ఇంఛార్జ్ వీసీలు
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో 8 యూనివర్సిటీల వైస్ ఛాన్సలర్ల పదవీకాలం నేటితో ముగిసింది. ఈ నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం 8 మంది ఐఏఎస్ అధికారులు ఇంఛార్జ్ వీసీలుగా నియమిస్తూ ఉత్తర్వులు జారీచేసింది. కొత్త వీసీలను నియమించే వరకు ఇంఛార్జ్‌లే వీసీలుగా బాధ్యతలు నిర్వర్తించనున్నారు. ఇంఛార్జ్ వీసీల వివరాలు: ఉస్మానియా యూనివర్సిటీ- అరవింద్ కుమార్ ఐఏఎస్ జేఎన్ టీయూహెచ్ - జయేశ్ రంజన్, ఐఏఎస్ కాకతీయ యూనివర్సిటీ-డాక్టర్ బీ జనార్దన్ రెడ్డి, ఐఏఎస్ తెలంగాణ యూనివర్సిటీ-వీ అనిల్ కుమార్, ఐఏఎస్ పాలమూరు యూనివర్సిటీ-రాహుల్ బొజ్జా, ఐఏఎస్ మహాత్మాగాంధీ యూనివర్సిటీ-అరవింద్ కుమార్, ఐఏఎస్ పొట్టిశ్రీరాములు యూనివర్సిటీ-వీ అనిల్ కుమార్ ఐఏఎస్ డాక్టర్ బీఆర్ అంబేద్కర్ సార్వత్రిక విశ్వవిద్యాలయం-సి. పార్థసారథి, ఐఏఎస్ -
స్ట్రెచర్‌పై వైద్యవిద్య
సాక్షి, హైదరాబాద్: జాతీయ అర్హత ప్రవేశ పరీక్ష (నీట్)లో మంచి ర్యాంకు వచ్చిన విద్యార్థులంతా.. సహజంగా ప్రభుత్వ మెడికల్ కాలేజీల్లోనే ఎంబీబీఎస్‌లో చేరేందుకు ఆసక్తి చూపిస్తారు. ముఖ్యంగా గాంధీ, ఉస్మానియా, కాకతీయ తదితర ప్రభుత్వ మెడికల్ కాలేజీలపై ఎక్కువ శ్రద్ధ కనబరుస్తారు. వీటిలో చోటు దక్కకపోతేనే ప్రైవేటు కాలేజీలవైపు చూస్తారు. అంతటి ప్రతిష్టాత్మక సంస్థలవి. అలాగే పీజీ మెడికల్ విద్య విషయంలోనూ.. ప్రభుత్వ కాలేజీలకే మొదటి ప్రాధాన్యం ఇస్తారు. ప్రైవేటు మెడికల్ కాలేజీల్లో నాణ్య తపై ఉన్న సందేహాల కారణంగానే.. ప్రభుత్వ వైద్య విద్యే మెరుగన్న భావన విద్యార్థులు, వారి తల్లిదండ్రుల్లో నెలకొంది. గాంధీ, ఉస్మానియా, కాకతీయ మెడికల్ కాలేజీల్లో మెడికల్ పట్టభద్రులంటే ఓ గౌరవముంటుంది. అయితే ఇప్పుడు ప్రభుత్వ కాలేజీల్లో వైద్య విద్య నాణ్యత తగ్గిపోతోంది. దీనికి కారణం ఈ కాలేజీల్లో అధ్యాపకుల కొరత తీవ్రస్థాయిలో ఉండటమే. ఏడాదికేడాది ప్రొఫెసర్ల పదవీ విరమణ జరుగుతున్నప్పటికీ.. దానికి అనుగుణంగా ఖాళీలను భర్తీ చేసేందుకు ప్రభుత్వం నిరాసక్తత చూపడంతో.. ప్రభుత్వ మెడికల్ కాలేజీల్లో వైద్య విద్య నాణ్యతపై నీలినీడలు అలముకున్నాయి. ఎంబీబీఎస్, పీజీ విద్యార్థులకు నాణ్యమైన విద్య అందడం లేదన్న విమర్శలున్నాయి. దీంతోపాటు బోధనాసుపత్రులకు వచ్చే రోగులకు వైద్యం చేసేందుకు వైద్యులు కరువయ్యారు. 925 ఫ్యాకల్టీ పోస్టులు ఖాళీ... తెలంగాణలో ప్రస్తుతం ఏడు ప్రభుత్వ వైద్య కళాశాలలున్నాయి. హైదరాబాద్‌లో ఉస్మానియా, గాంధీ మెడికల్ కాలేజీలు, వరంగల్‌లో కాకతీయ మెడికల్ కాలేజీ ఉంది. ఆదిలాబాద్‌లో రిమ్స్ మెడికల్ కాలేజీ, నిజామాబాద్, మహబూబ్‌నగర్, సిద్దిపేటల్లోనూ మెడికల్ కాలేజీలు ప్రభుత్వ ఆధ్వర్యంలో పనిచేస్తున్నాయి. వీటన్నింటినీ కలుపుకుని మొత్తంగా 1,150 ఎంబీబీఎస్ సీట్లున్నాయి. అత్యధికంగా ఉస్మానియాలో 250, గాంధీ, కాకతీయ మెడికల్ కాలేజీల్లో 200 చొప్పున ఎంబీబీఎస్ సీట్లున్నాయి. ఏడు మెడికల్ కాలేజీల్లో 680 పీజీ మెడికల్ స్పెషాలిటీ సీట్లున్నాయి. వచ్చే ఏడాది నుంచి నల్లగొండ, సూర్యాపేటల్లోనూ మెడికల్ కాలేజీలు ఏర్పాటుకానున్నాయి. ఈ కాలేజీలన్నింటికీ అనుబంధంగా బోధనాసుపత్రులున్నాయి. నిత్యం ఆయా బోధనాసుపత్రులకు వేలాది మంది రోగులు వస్తుంటారు. గాంధీ, ఉస్మానియా, నీలోఫర్ ఆసుపత్రులకైతే జనం పోటెత్తుతారు. కానీ ప్రస్తుతం నడుస్తున్న కాలేజీల్లో అధ్యాపకుల కొరత వేధిస్తుంది. నల్లగొండ, సూర్యాపేట కాలేజీలతో మొదలుకొని మిగిలిన ఏడు కాలేజీల్లో ఉండాల్సిన అధ్యాపకులు, వైద్యుల సంఖ్య 2,359 కాగా, కాంట్రాక్టు పద్దతిని తీసుకున్న వారితో కలుపుకొని కేవలం 1,434 మంది మాత్రమే పనిచేస్తున్నారు. మొత్తంగా 925 ఖాళీలున్నాయి. ఉదాహరణకు 100 ఎంబీబీఎస్ సీట్లున్న ఆదిలాబాద్ రిమ్స్‌లో ఉండాల్సిన అధ్యాపకుల సంఖ్య 168 మంది కాగా, ప్రస్తుతం అక్కడి స్టాఫ్ 49మంది మాత్రమే. ఇంకా 119 పోస్టులు ఖాళీగా ఉన్నాయి. అలాగే 100 ఎంబీబీఎస్ సీట్లున్న నిజామాబాద్ మెడికల్ కాలేజీలో 210 మంది అధ్యాపకులు ఉండాలి. కానీ.. 102 మంది మాత్రమే విధుల్లో ఉన్నారు. ఇంకా 108 ఖాళీలున్నాయి. 150 ఎంబీబీఎస్ సీట్లున్న మహబూబ్‌నగర్ మెడికల్ కాలేజీలో 112 మంది అధ్యాపకులకు గానూ.. కేవలం 53 మంది స్టాఫ్ ఉన్నారు. ఇక్కడ 59 పోస్టులు ఖాళీగా ఉన్నాయి. అలాగే సిద్దిపేట మెడికల్ కాలేజీలో 104 ఖాళీలున్నాయి. ఇలా అన్ని మెడికల్ కాలేజీలు, వాటి అనుబంధ బోధనాసుపత్రుల్లో భారీ స్థాయిలో ఖాళీలుండటంతో రోగులు అల్లాడిపోతున్నారు. మెడికల్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా (ఎంసీఐ) తనిఖీలకు వచ్చినప్పుడు మాత్రం ఏవేవో సర్దుబాట్లు చేసి లెక్కలు చూపిస్తుంటారు. ఈ ఏడాది ఎంసీఐ నుంచి ఎలాగోలా గట్టెక్కేందుకు కొంత మందిని కాంట్రాక్టు పద్దతిలో నియమించారు. కానీ ప్రొఫెసర్ల కొరత మాత్రం తీర్చలేకపోయారు. ఈ పరిస్థితి వల్ల దేశంలో 100 ప్రముఖ మెడికల్ కాలేజీల్లో తెలంగాణ నుంచి ఒక్కటి కూడా పోటీలో లేకపోవడం విమర్శలకు తావిస్తోంది. ఏటా 50 మంది విరమణ... ప్రొఫెసర్లు, అసిస్టెంట్ ప్రొఫెసర్లు, అసోసియేట్ ప్రొఫెసర్ల కొరతతో రాష్ట్రంలో వైద్యవిద్య నాణ్యత తగ్గుతోంది. పైగా ఆయా బోధనాసుపత్రులకు వచ్చే రోగులకు సరైన వైద్య సేవలు అందడంలేదు. ప్రొఫెసర్లు, అసోసియేట్ ప్రొఫెసర్లు ఉద్యోగ విరమణ చేస్తుండటం, సకాలంలో పదోన్నతులు చేపట్టకపోవడం, నియామకాలు లేకపోవడం వల్లే అధ్యాపకుల కొరత వేధిస్తుంది. ప్రతీ ఏటా సరాసరి 50 మంది వరకు ప్రొఫెసర్లు, అసోసియేట్ ప్రొఫెసర్లు ఉద్యోగ విరమణ పొందుతున్నారు. గతేడాది 50 మంది విరమణ పొందగా, అందులో 34 మంది మెడికల్ ప్రొఫెసర్లు ఉన్నారు. దీంతో.. ఎంబీబీఎస్, పీజీ సీట్లలో బోధన చేసేవారే లేరు. ప్రొఫెసర్లు, అసోసియేట్ ప్రొఫెసర్లు రిటైర్ అయితే.. పీజీ సీట్లు తగ్గిపోయే ప్రమాదం ఉంటుంది. ఎంసీఐ నిబంధనల ప్రకారం ఒక ప్రొఫెసర్‌కు 3 పీజీ మెడికల్ సీట్లు, ఒక అసోసియేట్ ప్రొఫెసర్‌కు ఒక పీజీ సీటు కేటాయిస్తారు. ఆ ప్రకారం ఫ్యాకల్టీ లేకపోతే ఉన్న సీట్లలో నిస్సందేహంగా కోత విధిస్తారు. ఇలా ఫ్యాకల్టీ తగ్గిపోవడంతో గాంధీ, ఉస్మానియా వంటి మెడికల్ కాలేజీల్లోనూ సీట్లు కోల్పోవాల్సిన దుస్థితి. నాలుగైదేళ్లలో ఇలా పెద్దసంఖ్యలో సీట్లు కోల్పోవాల్సి వచ్చింది. అయితే.. ప్రభుత్వం కలుగజేసుకొని ఎంసీఐ వద్దకు వెళ్లి ఈ ఖాళీలను భర్తీ చేస్తామని బతిమాలుకుని.. మళ్లీ ఆ సీట్లు తెచ్చుకున్నప్పటికీ నియామకాలు మాత్రం జరపలేదు. ఈ ఏడాది 54 మంది ప్రొఫెసర్లు, అసోసియేట్ ప్రొఫెసర్లు ఉద్యోగ విరమణ పొందుతున్నారు. దీంతో దాదాపు 100కు పైగా పీజీ మెడికల్ సీట్లపై కత్తి వేలాడుతుండటం గమనార్హం. కీలకమైన 35 రకాల విభాగాలకు చెందిన ప్రొఫెసర్లు వెళ్లిపోతుండటంతో రాష్ట్రంలో వైద్యవిద్య ప్రమాదంలో పడింది. గాంధీ, ఉస్మానియా, నీలోఫర్, ఎంజీఎం వంటి బోధనాసుపత్రుల్లో రోగుల సమస్యలపైనా ఈ కొరత తీవ్ర ప్రభావం చూపుతోంది. విరమణ వయస్సు పెంపుపై జాప్యం రాష్ట్రంలో ఉద్యోగ విరమణ వయస్సు 58 ఏళ్లు. దీంతో వైద్య ప్రొఫెసర్లు 58 ఏళ్లు రాగానే.. రిటైర్ అయిపోతున్నారు. వారిని ప్రైవేటు మెడికల్ కాలేజీలు లక్షలకు లక్షలు జీతాలిచ్చి నియమించుకుంటున్నాయి. ప్రభుత్వ మెడికల్ కాలేజీలు మాత్రం సీనియర్లను వదిలేసుకొని కాంట్రాక్టు పద్దతిలో జూనియర్లను తీసుకుంటూ కాలం వెళ్లదీస్తున్నాయి. బోధనాసుపత్రుల్లోని అధ్యాపకుల విరమణ వయస్సును 65 ఏళ్లకు పొడిగించాలని గతేడాది రాష్ట్ర కేబినెట్ తీసుకున్న నిర్ణయం కేవలం కాగితాలకే పరిమితమైంది. దీంతో సత్తా ఉన్న వైద్య అధ్యాపకులంతా ప్రైవేటు ఆసుపత్రులకు వెళ్లిపోతున్నారు. ప్రతిష్టాత్మకమైన ఎయిమ్స్‌లో అధ్యాపకుల విరమణ వయస్సు 65ఏళ్లు కలిపి మరో ఐదేళ్లు పొడిగించారు. అంటే 70 ఏళ్ల వరకు కూడా సీనియర్ల సేవలను వినియోగించుకోనున్నారు. కానీ రాష్ట్రంలో మాత్రం 58 ఏళ్లకే రిటైర్మెంట్ కారణంగా వైద్యవిద్య ప్రమాదంలో పడింది. పైపెచ్చు సకాలంలో పదోన్నతులు లేకపోవడంతో.. ప్రొఫెసర్ కేడర్‌లోకి రాకుండానే విరమణ పొందుతున్నారు. వైద్య, ఆరోగ్యశాఖ అధికారులకు ముందు చూపు లేకపోవడంతోనే ఈసమస్య ఉత్పన్నమవుతోందనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. మన వైద్యులకు మధ్యప్రదేశ్ వల... ప్రభుత్వ బోధనాసుపత్రుల్లో పనిచేసే వైద్యులు, అధ్యాపకుల వేతనాలు చాలా తక్కువ ఉన్నాయన్న విమర్శలున్నాయి. దీంతో ప్రభుత్వ వైద్య సేవల వైపు డాక్టర్లు ఆసక్తి చూపించడంలేదు. ప్రభుత్వ బోధనాసుపత్రుల్లో ప్రొఫెసర్ వేతనం అన్నీ అలవెన్సులు కలుపుకొని లక్షన్నర రూపాయలుండగా.. కొన్ని ప్రైవేటు మెడికల్ కాలేజీలు, ఆసుపత్రులు అధ్యాపకుని సామర్థ్యం ఆధారంగా రూ.3 నుంచి రూ.5 లక్షల వరకు వేతనం ఇస్తున్నాయి. అసోసియేట్ ప్రొఫెసర్‌కు ప్రభుత్వం రూ.లక్ష వరకు ఇస్తే, బయట రూ.2 లక్షలు ఇస్తున్నారు. అసిస్టెంట్ ప్రొఫెసర్‌కు ప్రభుత్వం రూ.80, 90 వేలు ఇస్తే, బయట రూ.లక్ష నుంచి రూ.లక్షన్నర వరకు ఇస్తున్నారు. ఇదిలావుంటే మధ్యప్రదేశ్ ప్రభుత్వం ఈ ఏడాది నాలుగు మెడికల్ కాలేజీలను ప్రారంభించింది. ఆయా కాలేజీలకు అవసరమైన ప్రొఫెసర్లు, ఇతర అధ్యాపక సిబ్బంది కోసం ఇటీవల ఆ రాష్ట్రానికి చెందిన ఒక సీనియర్ ఐఏఎస్ అధికారి నేతృత్వంలో ఒక బృందం తెలంగాణకు వచ్చింది. సీనియర్ ప్రొఫెసర్లు, అసోసియేట్ ప్రొఫెసర్లు, డాక్టర్ల సంఘాలతోనూ సమావేశమైంది. తమ రాష్ట్రంలోని మెడికల్ కాలేజీల్లో పనిచేయడానికి ముందుకు వచ్చే వారికి భారీ వేతనాలు, ప్రోత్సాహకాలు ఇస్తామని ప్రకటించింది. అలాగే నివసించేందుకు మంచి క్వార్టర్లు ఇస్తామని, భార్యాభర్తల్లో ఎవరైనా అర్హత కలిగినవారు ఉంటే వారికి సరిపోయే ప్రభుత్వ ఉద్యోగం కల్పిస్తామని, ఒప్పుకుంటే తక్షణమే అపాయింట్మెంట్ ఆర్డర్లు ఇస్తామని ఆఫర్ ఇచ్చింది. అలా వివిధ రాష్ట్రాలు భారీ ప్రోత్సాహకాలు ఇస్తుంటే, తెలంగాణ ప్రభుత్వం సీనియర్లను పోగొట్టుకుంటుందని పలువురు అభిప్రాయపడుతున్నారు. -
సత్తుపల్లి: తెలంగాణ యాసతో మంగ్లీ
సాక్షి, సత్తుపల్లిటౌన్/సత్తుపల్లిరూరల్: రేలా.. రేలా.. రేలారే.. తెలంగాణ, ఉస్మానియా యూనివర్సిటీలో ఉదయించిన కిరణమా.. ఇలా పాటలు ఆలపిస్తూ తెలంగాణ యాసతో టీవీ యాంకర్ మంగ్లీ ఉర్రూతలూగించారు. సత్తుపల్లి జేవీఆర్ ప్రభుత్వ డిగ్రీ కళాశాల మైదానంలో జరిగిన ప్రజా ఆశీర్వాద సభకు ముందుగా యాంకరింగ్ చేయాల్సి ఉంది. కాని ట్రాఫిక్ జామ్‌తో ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రసంగించిన అనంతరం తళుక్కుమని స్టేజీ ఎక్కి.. అందరిని హలో.. హలో.. అక్కలు.. తమ్ముళ్లు.. అన్నలు.. సారీ.. లేటైంది.. అంటూ పలకరించారు. తెలంగాణ యాసతో అలరించింది. ఇంతలోనే జనం చేరుకోవటం.. స్టేజీ పైన కూడా నిండిపోవటంతో అసహనానికి లోనైంది. అనంతం పట్టణంలో టీఆర్ఎస్ అభ్యర్థి పిడమర్తి రవితో కలిసి ప్రచారం చేశారు. -
ఓయూలో రాహుల్ సదస్సుకు అనుమతి నిరాకరణ
-
పెళ్లి పేరుతో మోసం, ఓయూ అసిస్టెంట్ ప్రొఫెసర్ అరెస్ట్
సాక్షి, తార్నాక : మ్యారేజ్ బ్యూరో ద్వారా పెళ్లిచూపులకు వచ్చాడు. నచ్చానని చెప్పి స్నేహం చేశాడు....పదేళ్లుగా తనతో స్నేహం చేయడమేగాక రూ.25లక్షలు తీసుకుని పెళ్లిచేసుకోకుండా మోసం చేశాడని అరోపిస్తూ ఓ యువతి ఓయూ అసిస్టెంట్ ప్రొఫెసర్‌పై పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఓయూ ఇన్స్పెక్టర్ జగన్ కథనం మేరకు వివరాలిలా ఉన్నాయి. ఓయూ కెమిస్ట్రీ విభాగంలో పరిశోధనలు చేస్తున్న యువతి ఓ యూనివర్సిటీలో అసిస్టెంట్ ప్రొఫెసర్‌గానూ పని చేస్తోంది. ఉప్పల్‌కు చెందిన డాక్టర్ కిరణ్‌కుమార్ ఓయూ టెక్నాలజీ కళాశాలలో అసిస్టెంట్ ప్రొఫెసర్‌గా, ఓయూ పరీక్షల విభాగంలో అదనపు కంట్రోలర్‌గా పనిచేస్తున్నాడు. ఓ మ్యారేజ్ బ్యూరో ద్వారా డాక్టర్ కిరణ్‌కుమార్ సంబంధం వచ్చింది. ఇద్దరు ఇష్టపడటం తో పెళ్లి చేసుకునేందుకు నిశ్చయించుకున్నారు. పదేళ్లుగా స్నేహం కొనసాగిస్తున్న కిరణ్‌కుమార్ వివిధ అవసరాల పేరుతో సదరు యువతి నుంచి రూ.25లక్షలు తీసుకున్నాడు. ఇటీవల ఆమె తనను పెళ్లిచేసుకోవాలని ఒత్తిడి చేయడంతో చేయడంతో తన అక్కల వివాహం జరిగిన తరువాత పెళ్లి చేసుకుంటానని నమ్మించాడు. ఆ తరువాత తనపై వేధింపులకు పాల్పడమేగాక తనను మోసం చేసి మరో యువతిని పెళ్లి చేసుకున్నట్లు ఫిర్యాదులో పేర్కొంది. బాధితురాలి ఫిర్యాదు మేరకు డాక్టర్ కిరణ్‌కుమార్‌పై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు. నిర్భయ కేసు పెట్టాలి: బాధితురాలు... తనతో పదేళ్ల పాటు స్నేహం చేసి లైంగికంగా, మానసికంగా , శారీరకంగా వేధింపులకు గురిచేసిన కిరణ్‌కుమార్‌పై నిర్భయ కేసు పెట్టాలని బాధితురాలు డిమాండ్ చేసింది.పెళ్లి చేసుకుంటానని నమ్మించి రూ.25లక్షలు తీసుకున్నాడని, తీరా మరో యువతిని వివాహం చేసుకున్నట్లు తెలిసి నిలదీయండంతో దాడికి పాల్పడినట్లు తెలిపింది. అతడిపై కఠిన చర్యలు తీసుకోవాలని, ఉద్యోగం నుంచి తొలగించాలని కోరింది. -
కాళేశ్వరం అద్భుతం
రామగుండం/మంథని: నీళ్ల లొల్లి తెలంగాణ రాష్ట్ర సాధనకు దారితీసిందని తెలంగాణ రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్ చైర్మన్ గంటా చక్రపాణి అన్నారు. మంథని మండలం సిరిపురం వద్ద నిర్మిస్తున్న అన్నారం పంపుహౌస్, సుందిళ్ల బ్యారేజీ, అంతర్గాం మండలం గోలివాడ(సుందిళ్ల) పంపుహౌస్ నిర్మాణ పనులను ఆదివారం పరిశీలించారు. కాళేశ్వరం ప్రా జెక్టుకు ప్రపంచ గుర్తింపు వస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు. ఉస్మానియా యూనివర్సిటీ ప్రొఫెసర్ మల్లేశం మాట్లాడుతూ కాళేశ్వరం ప్రాజెక్టు ఓ అద్భుత మని, రివర్స్ పంపింగ్ ద్వారా 50 మీటర్ల లోతున్న నీటిని సాగు, తాగునీటి అవసరాలను తీర్చేలా ఉం దన్నారు. సోషియాలజీ ప్రొఫెసర్ రాఘవరెడ్డి మాట్లాడుతూ ఉద్యమ స్ఫూర్తితో అతి తక్కువ కాలంలోనే ప్రాజెక్టుల పనులు సాగుతుండడం అద్భుతమన్నారు. ఐఐటీ ఇంజినీర్ దొంగరి నిశాంత్ మాట్లాడుతూ రివర్స్‌లో నీటిని తీసుకెళ్లడమే అద్భుతమన్నారు. భూసేకరణ లేకుండానే లక్షలాది ఎకరాలకు సాగునీరు అందించాలనే ఆలోచన బాగుందన్నారు. ప్రొఫెసర్లు లింబాద్రి, సాయిలు మాట్లాడుతూ గోదావరిలో 140 కిలోమీటర్ల పొడవునా ఎల్లకాలం నీళ్లు ఉండేలా చూడడం ద్వారా ఎన్నో ఎకరా లు సాగులోకి వస్తాయన్నారు. ఉస్మానియా యూనివర్సిటీ ఫ్యాకల్టీ డీన్ లక్ష్మీనారాయణ మాట్లాడుతూ అవసరాల మేరకు అన్ని సమయాల్లో సమృద్ధిగా నీటి నిల్వలుండడం దీని ప్రత్యేకత అని కొనియాడారు. ప్రొఫెసర్ చెన్న బసవయ్య మాట్లాడుతూ సీఎం కేసీఆర్ సంకల్పంతోనే ఈ ప్రాజెక్టు పురుడుపోసుకుందని కొనియాడారు. కాకతీయ యూనివర్సిటీ సోషల్ వర్కర్ ప్రొఫెసర్ శ్రీనివాస్, ఎన్విరాన్మెంటల్ డాక్టర్ సి.శ్రీనివాస్, సీనియర్ జర్నలిస్టులు శ్రీనివాస్‌రెడ్డి, నరేందర్ పాల్గొన్నారు. వీరికి ఇరిగేషన్ ప్రాజెక్టు ఎగ్జిక్యూటివ్ ఇంజినీర్ బండ విష్ణుప్రసాద్, డీఈ నరేశ్, సత్యనారాయణరెడ్డి పాల్గొన్నారు. -
ఓయూ పీజీ సెమిస్టర్ పరీక్షలు వాయిదా
హైదరాబాద్: ఉస్మానియా యూనివర్సిటీ పీజీ సెమిస్టర్ పరీక్షలు వాయిదా పడ్డాయి. ఈ నెల 11 నుంచి ప్రారంభం కావలసిన వివిధ పీజీ కోర్సుల పరీక్షలను వచ్చే ఏడాది జనవరి 22 నుంచి నిర్వహించనున్నట్లు ఓయూ అధికారులు తెలిపారు. కాంట్రాక్టు ఉద్యోగుల సమ్మె, పార్ట్ టైం అధ్యాపకుల దీక్షలు, కాంట్రాక్టు అధ్యాపకుల పరీక్షల బహిష్కరణ కారణంగా పీజీ సెమిస్టర్ పరీక్షలు వాయిదా వేసినట్లు తెలుస్తోంది. 14 నుంచి డిగ్రీ పరీక్షలు యథాతథం హైదరాబాద్: ఉస్మానియా విశ్వవిద్యాలయం పరిధిలో 14 నుంచి జరిగే వివిధ డిగ్రీ కోర్సుల సెమిస్టర్ పరీక్షలు యథాతథంగా జరుగుతాయని అధికారులు ఓ ప్రకటనలో పేర్కొన్నారు. డిగ్రీ పరీక్షల వాయిదాపై వదంతులు నమ్మవద్దని ఓయూ అధికారులు పేర్కొన్నారు. ఆ పోస్టుల దరఖాస్తుల సవరణకు ఎడిట్ ఆప్షన్ సాక్షి, హైదరాబాద్: చైల్డ్ డెవలప్మెంట్ ప్రాజెక్టు ఆఫీసర్, అడిషనల్ చైల్డ్ డెవలప్మెంట్ ప్రాజెక్టు ఆఫీసర్ పోస్టులకు చేసుకున్న దరఖాస్తుల్లో పొరపాట్లను సవరించుకునేందుకు ఎడిట్ ఆప్షన్‌ను కల్పిస్తున్నట్లు టీఎస్పీఎస్సీ గురువారం ఓ ప్రకటనలో తెలిపింది. ఈ నెల 9 నుంచి 12వ తే దీ వరకు అభ్యర్థులు పొరపాట్లను స వరించుకోవాలని సూచించింది. ఈ పోస్టులకు వచ్చే నెల 4న ఉదయం, మధ్యాహ్నం కంప్యూటర్ ఆధారిత పరీక్ష ఉంటుందని తెలిపింది. ‘కాంట్రాక్టు లెక్చరర్ల వేతనాలు ఇవ్వండి’ సాక్షి, హైదరాబాద్: ప్రభుత్వ జూనియర్ కాలేజీల్లోని కాంట్రాక్టు లెక్చరర్ల వేతనాలను వెంటనే విడుదల చేయాలని తెలంగాణ ఆర్జేడీ అపాయింటెడ్ గవర్నమెంట్ కాంట్రాక్టు జూనియర్ లెక్చరర్స్ అసోసియేషన్ కోరింది. 4 నెలలుగా వారికి వేతనాలు రావడం లేదని గురువారం ఓ ప్రకటనలో పేర్కొంది. -
ఎరుపెక్కిన విద్యావనం
ఓయూలో పీడీఎస్‌యూ మహాసభలు ప్రారంభం హైదరాబాద్, న్యూస్‌లైన్: సీపీఐఎంఎల్ (న్యూడెమోక్రసీ) అనుబంధ విద్యార్థి సంఘం పీడీఎస్‌యూ 19వ రాష్ట్ర మహాసభలు ఉస్మానియా యూనివర్సిటీ (ఓయూ)లో మంగళవారం ప్రారంభమయ్యాయి. తొలుత విద్యానగర్‌లోని ఎస్వీఎస్ కళాశాల మైదానంలో పీడీఎస్‌యూ వ్యవస్థాపకులు జార్జిరెడ్డి, జంపాల చంద్రశేఖర్‌ప్రసాద్, శ్రీపాద శ్రీహరి, కోలా శంకర్, రంగవల్లి, చేరాలు, స్నేహలత తదితర అమరులకు జోహార్లు అర్పించారు. అనంతరం అక్కడి నుంచి రాష్ట్రం నలుమూలల నుంచి వచ్చిన వేలాది మంది విద్యార్థులతో ఓయూ ఆర్ట్స్ కళాశాల వరకు ర్యాలీ నిర్వహించారు. పెండింగ్ స్కాలర్షిప్లు విడుదల చేయాలని, హాస్టళ్ల సమస్యలు పరిష్కరించాలని విద్యార్థులు డిమాండ్ చేశారు. కార్యక్రమంలో సంఘం రాష్ట్ర అధ్యక్షులు అశోక్, ప్రధాన కార్యదర్శి జేఎల్ గౌతంప్రసాద్, నగర అధ్యక్షురాలు సత్య, ఓయూ అధ్యక్షులు నాగేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు. -
చైనా ఆదర్శంగా ప్రగతి సాధించాలి
ఆలంపల్లి, న్యూస్‌లైన్: ప్రపంచం ఆధునిక సాంకేతిక పరిజ్ఞానంతో ప్రగతి దిశగా పయనిస్తోందని, దీనికనుగుణంగానే విద్యార్థుల్లోని సృజనాత్మక శక్తికి పదునుపెట్టేందుకు ఉపాధ్యాయులు కృషి చేయాలని ఉస్మానియా విశ్వవిద్యాలయం ఉప కులపతి ప్రొఫెసర్ ఎస్. సత్యనారాయణ పేర్కొన్నారు. ఆదివారం వికారాబాద్ మండలం మద్గుల్ చిట్టంపల్లిలోని హైదరాబాద్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఎక్సలెన్స్ క్యాంపస్ పారంభోత్సవానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. సాంకేతిక రంగంలో ప్రపంచంలోనే అగ్రస్థానంలో ఉన్న చైనా అడుగుజాడలను అనుసరించి మరింత అభివృద్ధి చెందాల్సిన బాధ్య త మన అందరిపై ఉందన్నారు. ధనార్జనే ధ్యేయం కాకుండా సేవా దృక్పథంతో విద్యా వ్యవస్థల్ని ఏర్పాటు చేసి పేద విద్యార్థులను ఆదుకోవాలని సూచించారు. విద్యార్థులు, ఉపాధ్యాయులు దేశ ప్రగతి కోసం దృఢ సంకల్పంతో పాటుపడాలన్నారు. లక్ష్యసాధన దిశగా విద్యార్థులు క్రమశిక్షణతో చదువుకుంటేనే పాఠశాలకు, వారి తల్లిదండ్రులకు మంచి పేరు వస్తుందని పేర్కొన్నారు. చదువుకు పేదరికం అడ్డుకాదు .. చదువుకు పేదరికం ఎలాంటి ఆటంకం కాదని.. విద్యార్థుల్లోని నైపుణ్యాలను వెలికితీసి వారిని ఉన్నతులుగా తీర్చిదిద్దాల్సిన బాధ్యత ఉపాధ్యాయులదేనని ఏసీబీ డీజీ ఏకే ఖాన్ అన్నారు. విద్యార్థులు దేశ ప్రయోజనాల కోసం కృషి చేయాలని సూచించారు. పోలీస్ హౌసింగ్ కార్పొరేషన్ మేనేజింగ్ డెరైక్టర్ ఎస్.ఎ.హుడా మాట్లాడుతూ.. విద్యార్థి దశ నుంచే అవినీతికి వ్యతిరేకంగా పోరాడే బీజాలను పాఠశాలల్లో నాటాల్సిన అవసరం ఉందన్నారు. సబ్జెక్టుపై పట్టు వచ్చేంత వరకూ విద్యార్థులకు పాఠ్యాంశాలను బోధించాలన్నారు. హైదరాబాద్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఎక్సలెన్స్ సంస్థ చైర్మన్ గియాసుద్దీన్ బాబూఖాన్ మాట్లాడుతూ.. పేద కుటుంబాలకు చెందిన పిల్లల్లో ప్రతిభావంతులను ప్రోత్సహించి ఉన్నత శిఖరాలకు తీసుకెళ్లేందుకు కృషి చేస్తున్నామన్నారు. కార్యక్రమంలో ప్రధాన ఎన్నికల మాజీ కమిషనర్ జీఎం లింగ్డో, ఎడ్యుకేట్ ఇండియా ఫండ్ డెరైక్టర్ తస్నీంఉస్మానీ, హైదరాబాద్ జకత్ ట్రస్ట్ సభ్యులు, ఎయిర్ కమాండర్ నసీం అక్తర్, ఖలీల్ అహ్మద్, విద్యావేత్త అమరేందర్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు. -
ఇంటర్ యూనివర్సిటీ టోర్నీకి ఓయూ క్రికెట్ జట్టు
ఎల్బీ స్టేడియం, న్యూస్‌లైన్: సెంట్రల్ జోన్ ఇంటర్ యూనివర్సిటీ క్రికెట్ టోర్నమెంట్లో పాల్గొనే ఉస్మానియా యూనివర్సిటీ (ఓయూ) జట్టును ప్రకటించారు. ఈ పోటీలు ఈనెల 27 నుంచి 31 వరకు వరంగల్‌లోని కాకతీయ యూనివర్సిటీలో జరుగుతాయి. ఓయూ క్రికెట్ జట్టు జాబితాను ఓయూ ఇంటర్ యూనివర్సిటీ టోర్నీ కమిటీ సెక్రటరీ ప్రొఫెసర్ ఎల్.బి.లక్ష్మీకాంత్ రాథోడ్ ప్రకటించారు. ఎంపికైన క్రికెటర్లు ఓయూ ‘బి’ గ్రౌండ్స్‌లో క్రికెట్ కోచ్ ఎం.జయప్రకాష్‌కు రిపోర్ట్ చేయాలని ఆయన కోరారు. జట్టు: ఆకాష్ బండారి(కెప్టెన్), టి.రవితేజ, హిమాలయ్ అగర్వాల్, విశ్వజిత్ పట్నాయక్, రజిత్ రమేష్ (అరోరా డిగ్రీ కాలేజి), బి.యతిన్ రెడ్డి (ఇబ్రహీంపట్నం డిగ్రీ కాలేజి), జె.మల్లికార్జున్, పి.శరత్ కుమార్ (నిజాం కాలేజి), ఎం.దినేష్ (అవంతి కాలేజి), కె.శ్రీదరహాస్ రెడ్డి (వెస్లీ కాలేజి), ప్రతీక్ (భవాన్స్ కాలేజి), ఎస్.సాయి చరణ్ తేజ, పి.నిఖిల్ దీప్, ఆర్.అరుణ్ దేవ్, ఎ.ఆకాష్ (ఎస్పీ కాలేజి), అనురాగ్ హరిదాస్ (ఎం.జె.ఇంజనీరింగ్ కాలేజి), జయప్రకాష్ (కోచ్), ప్రొఫెసర్ ఎల్.బి.లక్ష్మీకాంత్ రాథోడ్ (మేనేజర్). -
పోలీసులపై ఓయూ విద్యార్థుల రాళ్లదాడి
హైదరాబాద్ : ఉస్మానియా యూనివర్శిటీలో మళ్లీ ఉద్రిక్త వాతావరణం నెలకొంది. అనుమతి లేకున్నా పోలీసులను ఏమాత్రం లెక్కచేయని విద్యార్థులు శనివారం ఉస్మానియా యూనివర్సిటి ఆర్ట్స్ కాలేజీ నుంచి నిజాం కాలేజీకు బయల్దేరారు. అయితే వారిని పోలీసులు ఎన్సీసీ గేటు వద్ద అడ్డుకున్నారు. దాంతో పోలీసులపై విద్యార్థులు రాళ్లదాడికి దిగారు. ఈ సందర్భంగా పలువురు గాయపడ్డారు. ఎన్సీసీ గేటు వద్ద భారీగా పోలీసులు మోహరించారు. రోడ్డుపైనే విద్యార్థులు బైఠాయించి నిరసనలు తెలుపుతున్నారు. మరోవైపు హైదరాబాద్‌లోని నిజాం కాలేజ్ హాస్టల్ రణరంగంగా మారింది. సేవ్ ఆంధ్రప్రదేశ్ సభ కోసం వస్తున్న ఏపీఎన్జీవో ఉద్యోగులపై నిజాం కాలేజ్ విద్యార్థులు....నాన్‌బోర్డర్స్ రాళ్లతో దాడి చేశారు. రాళ్ల దాడిలో పలువురు ఉద్యోగులకు గాయాలయ్యాయి. ప్రాణభయంతో వాళ్లు పరుగులు తీశారు. రాళ్ల దాడి చేసిన నిజాం కాలేజ్ స్టూడెంట్స్‌ను, నాన్‌బోర్డర్స్‌ను పోలీసులు బలవంతంగా అదుపులోకి తీసుకున్నారు. కాగా ఫతేమైదాన్ వద్ద పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. రెండువర్గాల మధ్య దాడి జరగటంతో పలువురు గాయపడ్డారు. అనంతరం అక్కడకు చేరుకున్న పోలీసులు పరిస్థితిని అదుపులోకి తెచ్చారు.