ఎరుపెక్కిన విద్యావనం | 19th PDSU state Conferences in Osmania University | Sakshi
Sakshi News home page

ఎరుపెక్కిన విద్యావనం

Published Wed, Jan 29 2014 12:52 AM | Last Updated on Sat, Sep 2 2017 3:06 AM

ఎరుపెక్కిన విద్యావనం

ఎరుపెక్కిన విద్యావనం

ఓయూలో పీడీఎస్‌యూ మహాసభలు ప్రారంభం
హైదరాబాద్, న్యూస్‌లైన్: సీపీఐఎంఎల్ (న్యూడెమోక్రసీ) అనుబంధ విద్యార్థి సంఘం పీడీఎస్‌యూ 19వ రాష్ట్ర మహాసభలు ఉస్మానియా యూనివర్సిటీ (ఓయూ)లో మంగళవారం ప్రారంభమయ్యాయి. తొలుత విద్యానగర్‌లోని ఎస్వీఎస్ కళాశాల మైదానంలో పీడీఎస్‌యూ వ్యవస్థాపకులు జార్జిరెడ్డి, జంపాల చంద్రశేఖర్‌ప్రసాద్, శ్రీపాద శ్రీహరి, కోలా శంకర్, రంగవల్లి, చేరాలు, స్నేహలత తదితర అమరులకు జోహార్లు అర్పించారు.
 
 అనంతరం అక్కడి నుంచి రాష్ట్రం నలుమూలల నుంచి వచ్చిన వేలాది మంది విద్యార్థులతో ఓయూ ఆర్ట్స్ కళాశాల వరకు ర్యాలీ నిర్వహించారు. పెండింగ్ స్కాలర్‌షిప్‌లు విడుదల చేయాలని, హాస్టళ్ల సమస్యలు పరిష్కరించాలని విద్యార్థులు డిమాండ్ చేశారు. కార్యక్రమంలో సంఘం రాష్ట్ర అధ్యక్షులు అశోక్, ప్రధాన కార్యదర్శి జేఎల్ గౌతంప్రసాద్, నగర అధ్యక్షురాలు సత్య, ఓయూ అధ్యక్షులు నాగేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement