సాక్షి, హైదరాబాద్: తెలంగాణ అసెంబ్లీ ముట్టడి యత్నాన్ని పోలీసులు భగ్నం చేశారు. విద్యార్థి విభాగం పీడీఎస్‌యూ ఆధ్వర్యంలో కొందరు అసెంబ్లీ ముట్టడికి సోమవారం యత్నించారు. దీంతో అసెంబ్లీ ఆవరణలో, నాంపల్లి చుట్టుపక్కల ఉద్రిక్త వాతావరణం నెలకొంది.
పెండింగ్ స్కాలర్‌షిప్‌లు ఇవ్వాలని, బడ్జెట్‌లో విద్యాశాఖకు 30 శాతం నిధులు కేటాయించాలనే డిమాండ్‌తో వాళ్లు ఆందోళనకు దిగారు. ఈ తరుణంలో.. అప్రమత్తమైన పోలీసులు ఆందోళనకారులను అదుపులోకి తీసుకున్నారు. పరిస్ధితిని అదుపులోకి తెచ్చారు.
ఇదిలా ఉంటే.. పీడీఎస్‌యూ బయట ఆందోళన చేపట్టిన సమయంలోనే లోపల ఆర్థిక మంత్రి హరీష్ రావు బడ్జెట్ ప్రవేశపెట్టి.. ప్రసంగించారు. ఈ బడ్జెట్‌లో విద్యా రంగానికి రూ. 19 వేల కోట్ల కేటాయించింది తెలంగాణ సర్కార్.
Comments
Please login to add a commentAdd a comment