
పీడీఎస్‌యూ రాష్ట్ర అధ్యక్షుడిగా ఎ.డి.రాము
సాక్షి, హైదరాబాద్: పీడీఎస్‌యూ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడిగా ఎ.డి.రాము, ప్రధాన కార్యదర్శిగా పసక నర్సయ్య ఎన్నికయ్యారు. ఈ నెల 6, 7, 8వ తేదీల్లో ఉస్మానియా యూనివర్సిటీ ఠాగూర్ ఆడిటోరియంలో రాష్ట్ర మహాసభ జరిగింది. మహాసభ ముగింపు రోజున నూతన కార్యవర్గాన్ని ఎన్నుకున్నారు. రాష్ట్ర ఉపాధ్యక్షులుగా బి.రవిచంద్ర, పరశురాం, శంకరి సత్యం, సహాయ కార్యదర్శులుగా విజయ్ కన్నా, పవన్, సాంబ, కోశాధికారిగా స్వప్న నియమితులయ్యారు.