besiege
-
బడ్జెట్ వేళ.. అసెంబ్లీ ముట్టడికి యత్నం
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ అసెంబ్లీ ముట్టడి యత్నాన్ని పోలీసులు భగ్నం చేశారు. విద్యార్థి విభాగం పీడీఎస్‌యూ ఆధ్వర్యంలో కొందరు అసెంబ్లీ ముట్టడికి సోమవారం యత్నించారు. దీంతో అసెంబ్లీ ఆవరణలో, నాంపల్లి చుట్టుపక్కల ఉద్రిక్త వాతావరణం నెలకొంది. పెండింగ్ స్కాలర్షిప్లు ఇవ్వాలని, బడ్జెట్లో విద్యాశాఖకు 30 శాతం నిధులు కేటాయించాలనే డిమాండ్‌తో వాళ్లు ఆందోళనకు దిగారు. ఈ తరుణంలో.. అప్రమత్తమైన పోలీసులు ఆందోళనకారులను అదుపులోకి తీసుకున్నారు. పరిస్ధితిని అదుపులోకి తెచ్చారు. ఇదిలా ఉంటే.. పీడీఎస్‌యూ బయట ఆందోళన చేపట్టిన సమయంలోనే లోపల ఆర్థిక మంత్రి హరీష్ రావు బడ్జెట్ ప్రవేశపెట్టి.. ప్రసంగించారు. ఈ బడ్జెట్లో విద్యా రంగానికి రూ. 19 వేల కోట్ల కేటాయించింది తెలంగాణ సర్కార్. -
కంటోన్మెంట్‌ను ముట్టడిస్తాం
కంటోన్మెంట్ (హైదరాబాద్): కంటోన్మెంట్లో బీ–3, బీ–4 స్థలాలను క్రమబద్ధీకరించాలని, ఆర్మీ చెల్లించాల్సిన సర్వీసు చార్జీల బకాయిల విడుదల కోసం త్వరలోనే కంటోన్మెంట్ బోర్డును ముట్టడిస్తామని మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ అన్నారు. శుక్రవారం సిఖ్‌విలేజ్‌లో డబుల్ బెడ్రూమ్ ఇళ్లను ప్రారంభించిన ఆయన..అనంతరం నిర్వహించిన సభలో మాట్లాడారు. కంటోన్మెంట్ పరిధిలోని బీ–3, బీ–4 స్థలాల్లో నివసిస్తున్న వారికి ఆయా స్థలాలను క్రమబద్ధీకరించాలన్నారు. ఈ స్థలాల్లో డబుల్ బెడ్రూమ్ ఇళ్లు నిర్మించి ఇస్తామన్నారు. సిఖ్‌విలేజ్ శ్రీరామ్‌నగర్, గాంధీనగర్‌లో ప్రారంభించిన డబుల్ బెడ్రూమ్ ఇళ్లకు వారం రోజుల్లోగా మంచినీటి సదుపాయం కల్పించాలని సీఈఓ అజిత్‌రెడ్డికి సూచించారు. -
మంత్రి ఈటల ఇంటిని ముట్టడించిన ఏఎన్ఎంలు
కరీంనగర్: తమ ఉద్యోగాలను క్రమబద్దీకరించాలని కోరుతూ 34 రోజులుగా సమ్మె చేస్తున్న రెండవ ఏఎన్ఎంలు శనివారం కరీంనగర్‌లోని ఆర్థిక, పౌరసరఫరాల శాఖ మంత్రి ఈటల రాజేందర్ ఇంటిని ముట్టడించారు. స్థానిక కోర్టు చౌరస్తా నుంచి మంత్రి ఇంటి వరకు ర్యాలీగా వెళ్లి ఆయన నివాసం వద్ద బైఠాయించారు. అప్పటికే మంత్రి ఇంటివద్ద బందోబస్తు ఏర్పాటు చేసిన పోలీసులు ఎన్‌ఎంలను అడ్డుకున్నారు. లోనికి వెళ్లేందుకు ప్రయత్నించడంతో వారిని అరెస్టు చేసి పోలీస్‌స్టేషన్‌కు తరలించారు. ఈ సందర్భంగా ఏఎన్ఎంలు మాట్లాడుతూ... తమ సమస్యలు పరిష్కరించాలని శాంతియుతంగా ఆందోళన చేస్తుంటే.. ప్రభుత్వం పట్టించుకోకపోవడం బాధాకరమన్నారు. నెల రోజులు దాటినా కనీసం చర్చలకు కూడా పిలువలేదని విమర్శించారు. పదేళ్లుగా పది వేల వేతనానికి పనిచేస్తున్నామని, పెరుగుతున్న ధరలతో జీవించడం చాలా కష్టంగా మారిందని ఆవేదన వ్యక్తం చేశారు. తమకు 10వ పీఆర్సీ ప్రకారం వేతనాలు చెల్లించాలని, హమీ ప్రకారం ఉద్యోగాలను క్రమబద్దీకరించాలని డిమాండ్ చేశారు.