
కంటోన్మెంట్ (హైదరాబాద్): కంటోన్మెంట్‌లో బీ–3, బీ–4 స్థలాలను క్రమబద్ధీకరించాలని, ఆర్మీ చెల్లించాల్సిన సర్వీసు చార్జీల బకాయిల విడుదల కోసం త్వరలోనే కంటోన్మెంట్ బోర్డును ముట్టడిస్తామని మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ అన్నారు. శుక్రవారం సిఖ్‌విలేజ్‌లో డబుల్ బెడ్‌రూమ్ ఇళ్లను ప్రారంభించిన ఆయన..అనంతరం నిర్వహించిన సభలో మాట్లాడారు. కంటోన్మెంట్ పరిధిలోని బీ–3, బీ–4 స్థలాల్లో నివసిస్తున్న వారికి ఆయా స్థలాలను క్రమబద్ధీకరించాలన్నారు. ఈ స్థలాల్లో డబుల్ బెడ్‌రూమ్ ఇళ్లు నిర్మించి ఇస్తామన్నారు. సిఖ్‌విలేజ్ శ్రీరామ్‌నగర్, గాంధీనగర్‌లో ప్రారంభించిన డబుల్ బెడ్‌రూమ్ ఇళ్లకు వారం రోజుల్లోగా మంచినీటి సదుపాయం కల్పించాలని సీఈఓ అజిత్‌రెడ్డికి సూచించారు.
Comments
Please login to add a commentAdd a comment