talasani sreenivas yadav
-
17న సభకు లక్షలాదిగా ప్రజలు
కవాడిగూడ: తెలంగాణ జాతీయ సమైక్యతా వజ్రోత్స వాల సందర్భంగా ఈనెల 17న ఎన్టీఆర్ స్టేడియంలో నిర్వహించే భారీ బహిరంగసభకు సర్వసన్నద్ధమైందని మంత్రులు తలసాని శ్రీనివాస్‌యాదవ్, సత్యవతి రాథోడ్ వెల్లడించారు. వేడుకలకు రాష్ట్రంలోని 33 జిల్లాల నుంచి లక్షలాదిగా ప్రజలు తరలి రానున్నారన్నారు. బహిరంగసభ నిర్వహించే ఎన్టీఆర్ స్టేడియాన్ని మంత్రులు, సీఎస్ సోమేశ్, ఎమ్మెల్సీ సురభి వాణీదేవి, ఎమ్మెల్యేలు ముఠా గోపాల్, కాలేరు వెంకటేష్‌తో కలిసి ఏర్పాట్లను గురువారం పరిశీలించారు. వజ్రోత్సవాల వేడుకల షెడ్యూల్ ► సెప్టెంబర్ 16 – రాష్ట్రంలోని అన్ని అసెంబ్లీ నియోజకవర్గ కేంద్రాల్లో విద్యార్థులు, యువతీ యువకులు, మహిళలతో భారీ ర్యాలీలు ► సెప్టెంబర్ 17 – తెలంగాణ జాతీయ సమైక్యతా దినోత్సవం సందర్భంగా హైదరాబాద్‌లోని పబ్లిక్ గార్డెన్స్‌లో జాతీయ పతాకాన్ని ఆవిష్కరించనున్న సీఎం కేసీఆర్. అదేరోజు అన్ని జిల్లా కేంద్రాల్లో జాతీయ జెండాను ఆవిష్కరించనున్న మంత్రులు, ప్రముఖులు ∙అన్ని ప్రభుత్వ కార్యాలయాలు, పట్టణ స్థానిక సంస్థలు, గ్రామ పంచాయతీ కార్యాలయాలపై జాతీయ పతాకావిష్కరణ ► హైదరాబాద్‌లో నిర్మించిన కొమురం భీం ఆదివాసీ ఆత్మగౌరవభవనం, సేవాలాల్ బంజారా ఆత్మగౌరవ భవనాలు సీఎం చేతుల మీదుగా ప్రారంభం ∙హైదరాబాద్‌లో నెక్లెస్‌రోడ్డు నుంచి అంబేడ్కర్ విగ్రహం మీదుగా ఎన్టీఆర్ స్టేడియం వరకు ఆది వాసీ, గిరిజన కళారూపాలతో ఊరేగింపు, సభ ► సెప్టెంబర్ 18 – జిల్లా కేంద్రాల్లో స్వాతంత్య్ర సమరయోధులు, కవులు, కళాకారులకు సన్మానాలు.. ∙జాతీయ సమైక్యత, సమగ్రతను చాటేలా సాంస్కృతిక కార్యక్రమాలు ఇదీ చదవండి: చరిత్రలో ఈ నరమేధ గాథ ఎక్కడ? -
దేవుళ్లను రాజకీయాల్లోకి లాగొద్దు: మంత్రి తలసాని
హిమాయత్‌నగర్ (హైదరాబాద్): పండుగలు, దేవుళ్లను రాజకీయాలకు వాడుకోవడం తగదని, ఈ నెల 9న గణేశ్ నిమజ్జనానికి అన్ని ఏర్పాట్లూ ప్రభుత్వమే ఘనంగా చేస్తుందని మంత్రి తలసాని శ్రీనివాస్‌యాదవ్ అన్నారు. నిమజ్జనాలకు ప్రభుత్వం ఏర్పాట్లు చేయడంలేదని, చేతకాకపోతే తామే నిర్వహిస్తామని.. భాగ్యనగర్ గణేశ్ ఉత్సవసమితి నేతలు చేసిన వ్యాఖ్యలను ఆయన ఖండించారు. సోమవారం ఆదర్శ్‌నగర్ ఎమ్మెల్యే క్వార్టర్స్‌లో ఆయన మీడియాతో మాట్లాడుతూ, వేలసంఖ్యలో పోలీసులు, జీహెచ్ఎంసీ, వాటర్‌బోర్డు, రవా ణా, ఆర్అండ్బీ తదితర ప్రభుత్వ విభాగాలన్నీ కలసి చేసే కార్యక్రమం వారి వల్ల సాధ్యమవుతుందా? అని ప్రశ్నించారు. ఉత్సవసమితి నాయకులు బాధ్యతారహితంగా వ్యవహరించడం తగదన్నారు. నిమజ్జనానికి ఏర్పాట్లన్నీ జరుగుతాయని, ఎవరూ ఆందోళన పడాల్సిన అవసరం లేదని ఆయన స్పష్టంచేశారు. ట్యాంక్‌బండ్‌లో గణేశ్ నిమజ్జనం చేయనివ్వకపోతే ప్రగతిభవన్‌లో నిమజ్జనం చేస్తామంటూ బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ చేసిన వ్యాఖ్యలపై మంత్రి స్పందిస్తూ.. ‘ఇటువంటి వ్యాఖ్యలు నేను చెడ్డీలు వేసుకున్నప్పటి నుంచి వింటున్నా’ అని (నవ్వుతూ) అన్నారు. కాగా, ఒకరి పండుగలు ఘనంగా నిర్వహిస్తున్నారని, హిందువుల పండుగలు జరిపించడంలేదనే పిచ్చి మాటల నుంచి కొందరు వ్యక్తులు బయటకు రావాలని మంత్రి సూచించారు. ప్రభుత్వానికి అన్ని పండుగలూ సమానమేనన్నారు. ఇదీ చదవండి: 2024: ఢిల్లీ ‘పవర్’ మనదే.. దేశమంతా ఫ్రీ పవరే! -
తలసానిని సత్కరించిన ఎన్నారై తెరాస నాయకులు
లండన్: వ్యక్తిగత పర్యటన నిమిత్తం లండన్ వచ్చిన తెలంగాణ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్‌ను ఎన్నారై తెరాస యూకే ముఖ్య నాయకులు మర్యాద పూర్వకంగా కలిసి సత్కరించారు. ఈ సమావేశంలో ఎన్నారై తెరాస యూకే దాదాపు 12 సంవత్సరాలుగా లండన్ గడ్డపై చేస్తున్న కార్యక్రమాల గురించి మంత్రి తలసానికి ఎన్నారై తెరాస యూకే అధ్యక్షుడు అశోక్ గౌడ్ దూసరి వివరించారు. ముఖ్యంగా ఎమ్మెల్యే ఎన్నికల్లో, ఎంపీ ఎన్నికల్లో అటు తలసాని శ్రీనివాస్, తలసాని సాయి గెలుపు కోసం ఎన్నారై తెరాస క్షేత్రస్థాయిలో ప్రచారం చేసిన విషయాలని గుర్తు చేశారు. దశాబ్ద కాలంగా యూకేలో అటు తెలంగాణ సాంస్కృతిక సామాజిక సేవ కార్యక్రమాలే కాక ముఖమంత్రి కేసీఆర్ నాయకత్వాన్ని ఖండాంతరాల్లో బలపరుస్తూ తెరాస పార్టీకి ఎంతో సేవ చేస్తున్నారని, మీ స్ఫూర్తి చాలా గొప్పదని అశోక్ మరియు రత్నాకర్ బృందాన్ని మంత్రి తలసాని అభినందించారు. సోషల్ మీడియా వేదికగా ఎన్నారై తెరాస యూకే చేస్తున్న సేవ పార్టీకి ఎంతో ఉపయోగపడుతుందని , త్వరలో మళ్ళీ యూకేకి వస్తానని అప్పుడు ఎన్నారై తెరాస ఆధ్వర్యంలో గొప్ప ఆత్మీయ సమావేశం ఏర్పాటు చేసుకుందామని తెలిపారు. అదే పర్యటనలో ఉన్న తలసాని సాయి కూడా ఎన్నారై తెరాస నాయకులు కలిశారు. ఈ సమావేశంలో అశోక్ గౌడ్ దుసారి, రత్నాకర్ కడుదుల, హరిగౌడ్ నవాపేట్, మల్లారెడ్డి బీరం, సతీష్ బండ, మట్టారెడ్డి, నవీన్ భువనగిరి, అబు జాఫ్, సేరు సంజయ్, మదు, గణేష్ కుప్పలా తదితరులు పాల్గొన్నారు. -
101 మంది పేద కళాకారులకు ఉచితంగా రూ. 6 కోట్ల భూమి..
V Vijay Kumar Gives 101 Plots To Poor Artist: టెలివిజన్‌లోని 24 క్రాఫ్ట్స్ లో ఉండే వెనుకబడిన పేద కళాకారులకు 101 ఫ్లాట్స్‌ను విజన్ వి.విజయ్ కుమార్ ఉచితంగా అందించారు. ఈ కార్యక్రమం హైదరాబాద్ ఫిల్మ్ ఛాంబర్ ఆవరణలో ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమానికి తలసాని శ్రీనివాస్ యాదవ్, ఎమ్మెల్యే గోపీనాథ్ జ్యోతి ప్రజ్వలన చేశారు. అనంతరం విజన్ వి. విజయ్ కుమార్ ఇచ్చిన మాట ప్రకారం 101 మంది నిరుపేద టీవీ కళాకారులకు ఉచితంగా ఇళ్ల స్థలాలు పత్రాలను తలసాని శ్రీనివాస్ యాదవ్, ప్రభుత్వ ముఖ్య సలహాదారు కె.వి.రమణాచారి చేతుల మీదుగా అందజేశారు. విజయ్ కుమార్ మాట్లాడుతూ 'చాలా మంది కోట్ల విలువజేసే భూమిని ఎందుకు ఇవ్వడం అన్నారు. అయితే నా దృష్టిలో మన పిల్లలకు మనం కోట్ల ఆస్తిని ఇవ్వడం ముఖ్యం కాదు. మన చుట్టూ ఉన్న పేద కార్మికులకు సహాయం చేస్తే మనకంటూ ఒక దైవ శక్తి వస్తుంది. ఆ దైవ శక్తి ఉంటే మనం ఏదైనా సాధించవచ్చు. అదే విధంగా మన పిల్లకు మంచి నాలెడ్జ్, ఆలోచనలు ఇస్తే వారు కూడా సమాజానికి ఉపయోగపడే మంచి పనులు చేస్తారనేది నా అభిప్రాయం.' అని తెలిపారు. చదవండి: పెళ్లి కాకుండానే బిడ్డకు జన్మనిచ్చిన హీరోయిన్.. ఇప్పుడు మరో నటుడితో ప్రేమాయణం తలసాని శ్రీనివాస్ యాదవ్ మాట్లాడుతూ.. 'టెలివిజన్‌లోని ఒక్కొక్క క్రాఫ్ట్ నుంచి ఐదుగురు కళాకారులను సెలెక్ట్ చేసుకొని విజయ్ కుమార్ 101 ఫ్లాట్స్ ఇవ్వడం మంచి విషయం. సుమారు రూ. 6 కోట్ల విలువ చేసే భూమిని ఇవ్వడం గొప్ప విషయం. పేదవాడి ఆశీర్వాదాలు మనకు జీవితకాలం తోడుగా ఉంటాయి. విజయ్‌కు వారి ఆశీర్వాదాలు ఎల్లప్పుడూ ఉంటూ వారి బిజినెస్ దినదినాభివృద్ధి చెందాలని మనస్ఫూర్తిగా కోరుతున్నాను.' అని పేర్కొన్నారు. -
అలా కేసీఆర్ చేస్తే తప్పేంటి?: తలసాని
సాక్షి, హైదరాబాద్: ‘సీఎం కేసీఆర్ కుటుంబానికే ఉద్యోగాలు వచ్చాయని కొందరంటున్నారు. వారిని ఎవరైనా నామినేట్ చేశారా? ప్రజలు ఎన్నుకుంటే గెలిచారు. సీఎం అనే గౌరవం లేకుండా కొందరు ఏకవచనంతో సంబోధిస్తున్నారు, కేటీఆర్ కుమారుడిని కూడా దూషించే నీచస్థాయికి దిగజారారు’అని మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ అన్నారు. ‘మాకు కూడా తిట్టడం తెలుసు. నోరుంది కదా అని మీరు ఏది పడితే అది మాట్లాడితే ప్రజలు సరైనరీతిలో బుద్ధి చెప్తారు’అని హెచ్చరించారు. టీఆర్ఎస్ ఎమ్మెల్యేలు ముఠా గోపాల్, కాలేరు వెంకటేశ్‌తో కలసి శనివారం టీఆర్ఎస్ఎల్పీ కార్యాయలయంలో మీడియాతో మాట్లాడారు. ‘బాధ్యతాయుత పదవిలో ఉంటూ రేవంత్‌రెడ్డి అసభ్య పదజాలం వాడుతున్నారు. కేసీఆర్ వరి పండిస్తే తప్పేంటి, ఆయన పండించిన ధాన్యాన్ని ప్రభుత్వం కొనుగోలు చేస్తే ప్రశ్నించాలి. ధాన్యం కొనుగోలుపై ఢిల్లీలో టీఆర్ఎస్ ఎంపీలు పోరాడినప్పుడు కాంగ్రెస్, బీజేపీ రాష్ట్ర ఎంపీలు ఎక్కడ ఉన్నారు’అని విమర్శించారు. తెలంగాణకు నిధులివ్వని కేంద్రం అవార్డులు మాత్రం ప్రకటిస్తోందని ఎద్దేవా చేశారు. రాష్ట్రంలో కొన్ని పార్టీలకు పబ్లిసిటీ పిచ్చి ఎక్కువైందని తలసాని అన్నారు. బీజేపీ ఇన్చార్జి తరుణ్‌చుగ్ సొంత రాష్ట్రం పంజాబ్‌లోనే ఆ పార్టీకి దిక్కులేదని ఎద్దేవా చేశారు. -
కేవలం ఓట్లు, సానుభూతి కోసం ఈటల చీఫ్ ట్రిక్స్..
సాక్షి, హుజూరాబాద్(కరీంనగర్): ఆత్మగౌరవం అంటూ పదే పదే మాట్లాడుతున్న మాజీ మంత్రి ఈటల రాజేందర్‌కు ఏడేళ్లుగా ఆత్మగౌరవం గుర్తుకు రాలేదా? అని రాష్ట్ర పశుసంవర్థకశాఖ మంత్రి తలసాని శ్రీనివాస్‌యాద్ ప్రశ్నించారు. గురువారం మండలంలోని సింగాపూర్‌లో రాష్ట్ర మంత్రులు గంగుల కమలాకర్, కొప్పుల ఈశ్వర్‌లతో కలిసి ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మాట్లాడారు. ఐదేళ్ల నుంచే సీఎం కేసీఆర్‌తో విబేధాలు ఉన్నాయన్న ఈటల ఇన్నేళ్లు మంత్రిగా, పార్టీలో ఎందుకు ఉన్నారన్నారు. గొర్రెల పంపిణీ, దళితబంధు పథకాలు ఒక్క హుజూరాబాద్‌కు సంబందించినవి కాదని, రాష్ట్ర వ్యాప్తంగా అమలు చేస్తున్న పథకాలని తెలిపారు. ప్రభుత్వం చేపడుతున్న ప్రతీ దానిని హుజూరాబాద్‌తో లింకు పెట్టడం సరికాదన్నారు. భూస్వాములకు రైతుబంధు వద్దన్న ఈటల తన ఖాతాలో జమైన డబ్బులను ప్రభుత్వానికి తిరిగి ఎందుకు ఇవ్వలేదని ప్రశ్నించారు. గొర్రెల యూనిట్ ధరను హుజూరాబాద్ ఎన్నికల కోసం పెంచలేదని, ప్రస్తుతం పెరిగిన ధరలను దృష్టిలో పెట్టుకొని నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు. తెలంగాణ రాష్ట్రాన్ని సీఎం కేసీఆర్ అన్ని రంగాల్లో అభివృద్ధి చేస్తున్నారని మంత్రిగా ఉన్నప్పుడు చెప్పిన ఈటలకు ఇప్పుడు తప్పులు కనిపిస్తున్నాయా? అని ఎద్దేవా చేశారు. ఈటల రాజేందర్ గెలిస్తే బీజేపీలో రెండు పోయి ముగ్గురు ఎమ్మెల్యేలు అవుతారే తప్పా, ప్రజలకు ఏం మేలు జరుగదన్నారు. పదవి పోగానే గౌరవం మర్చిపోయి మాట్లాడుతున్నారని, ఏడేళ్లు మంత్రిగా ఉన్నప్పుడు నియోజకవర్గాన్ని అభివృద్ధి చేస్తే సీఎం నీకు అడ్డు వచ్చాడా? అని, ఇప్పుడు పాదయాత్ర ఎందుకు చేస్తున్నావని ప్రశ్నించారు. కేవలం ఓట్లు, సానుభూతి కోసం ఈటల చీఫ్ ట్రిక్స్ చేస్తున్నారని ఇక నుంచైనా మానుకోవాలని హితవు పలికారు. ఈటలను ప్రభుత్వం బయటకు పంపలేదని, ఆశలు పెరిగి పోయి చేసుకున్నారని, అది నీ కర్మ అన్నారు. హుజూరాబాద్ ప్రజలు అమ్ముడుపోరని చెప్పిన ఈటల గడియారాలు, కుక్కర్లు ఎందుకు ఇస్తున్నావని ప్రశ్నించారు. ఈ సమావేశంలో ఎమ్మెల్యేలు వొడితల సతీశ్‌కుమార్, సుంకె రవిశంకర్, ఎమ్మెల్సీలు యెగ్గె మల్లేశంయాదవ్, బస్వరాజు సారయ్య, జెడ్పీ చైర్పర్సన్ కనుమల్ల విజయ, టీఆర్ఎస్ రాష్ట్ర సహాయ కార్యదర్శి బండ శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు. -
‘ఆ శాఖను బలవంతంగా రుద్దేవారు’
సాక్షి, హైదరాబాద్: గతంలో పశుసంవర్థక శాఖను బలవంతంగా అంటగట్టేవారంటూ మంత్రి తలసాని శ్రీనివాస్‌యాదవ్ అసెంబ్లీలో ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. పద్దులపై చర్చకు ఆయన సమాధానాలు ఇచ్చే సందర్భంగా మాట్లాడుతూ.. ‘నేను 25 ఏళ్లుగా ఎమ్మెల్యేగా, సుదీర్ఘకాలం మంత్రిగా పనిచేశాను. ఎవరికో ఒకరికి ఓ మంత్రిత్వ శాఖ ఇవ్వాలి కాబట్టి ఇచ్చేవారు. అందులో కనీసం నిధులు కూడా ఉండేవి కావు. కానీ కేసీఆర్ సీఎం అయ్యాక దాని రూపురేఖలే మారిపోయాయి. భారీగా నిధులు ఇస్తున్నారు. ఇప్పుడు అది ప్రధాన శాఖగా మారింది’ అని తలసాని పేర్కొన్నారు. దేశానికి 1947లో స్వాతంత్య్రం వచ్చినా.. తెలంగాణ బడుగు బలహీన వర్గాలకు మాత్రం కేసీఆర్ సీఎం అయ్యాకే స్వాతంత్య్రం వచ్చినట్లని శ్రీనివాస్ యాదవ్ పేర్కొన్నారు. జీవాలకు ప్రత్యేకంగా అంబులెన్సులు ఏర్పాటు చేసిన ఘనత కేసీఆర్‌కే దక్కుతుందన్నారు. గతంలో ప్రభుత్వాలు విజయ డెయిరీని దివాలా తీయిస్తే ఇప్పుడు దాన్ని పటిష్టం చేసి ఆదాయాన్ని పెంచినట్లు చెప్పారు. -
కంటోన్మెంట్‌ను ముట్టడిస్తాం
కంటోన్మెంట్ (హైదరాబాద్): కంటోన్మెంట్లో బీ–3, బీ–4 స్థలాలను క్రమబద్ధీకరించాలని, ఆర్మీ చెల్లించాల్సిన సర్వీసు చార్జీల బకాయిల విడుదల కోసం త్వరలోనే కంటోన్మెంట్ బోర్డును ముట్టడిస్తామని మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ అన్నారు. శుక్రవారం సిఖ్‌విలేజ్‌లో డబుల్ బెడ్రూమ్ ఇళ్లను ప్రారంభించిన ఆయన..అనంతరం నిర్వహించిన సభలో మాట్లాడారు. కంటోన్మెంట్ పరిధిలోని బీ–3, బీ–4 స్థలాల్లో నివసిస్తున్న వారికి ఆయా స్థలాలను క్రమబద్ధీకరించాలన్నారు. ఈ స్థలాల్లో డబుల్ బెడ్రూమ్ ఇళ్లు నిర్మించి ఇస్తామన్నారు. సిఖ్‌విలేజ్ శ్రీరామ్‌నగర్, గాంధీనగర్‌లో ప్రారంభించిన డబుల్ బెడ్రూమ్ ఇళ్లకు వారం రోజుల్లోగా మంచినీటి సదుపాయం కల్పించాలని సీఈఓ అజిత్‌రెడ్డికి సూచించారు. -
వచ్చే ఏడాది 20 వేల పోస్టుల భర్తీ
సాక్షి, కంటోన్మెంట్: తెలంగాణ పోలీసు శాఖలో వచ్చే ఏడాది 20 వేల పోస్టులు భర్తీ చేయనున్నట్లు హోంశాఖ మంత్రి మహమూద్ అలీ అన్నారు. నార్త్‌జోన్ పరిధిలోని కార్ఖానా పోలీసుస్టేషన్ నూతన భవనాన్ని ఆయన బుధవారం ప్రారంభించారు. ఈ సందర్భంగా మహమూద్ అలీ మాట్లాడుతూ.. రాష్ట్రంలో గడిచిన ఆరేళ్లలో 27 వేల మంది పోలీసు పోస్టులు భర్తీ చేశామన్నారు. మహిళల భద్రతకు కీలక ప్రాధాన్యం ఇస్తూ షీటీమ్స్, భరోసా కేంద్రాలు ఏర్పాటు చేశామని, వీటి సంఖ్యను పెంచుతున్నామని హోం మంత్రి వెల్లడించారు. మంత్రి మల్లారెడ్డి మాట్లాడుతూ బోయిన్‌పల్లిలో ఆగిపోయిన నూతన పోలీసుస్టేషన్ భవన నిర్మాణాన్ని పూర్తి చేయడానికి చర్యలు తీసుకోవాలని ఉన్నతాధికారులకు సూచించారు. రాష్ట్రంలో నేరాల నిరోధానికే ప్రాధాన్యమిస్తున్నామని డీజీపీ ఎం.మహేందర్ రెడ్డి అన్నారు. మంత్రి తలసాని శ్రీనివాస్, నగర కమిషనర్ అంజనీకుమార్, కంటోన్మెంట్ ఎమ్మెల్యే సాయన్న, పోలీసు హౌసింగ్ కార్పొరేషన్ చైర్మన్ ఓలేటి దామోదర్, కంటోన్మెంట్ బోర్డు ఉపాధ్యక్షుడు రామకృష్ణ పాల్గొన్నారు. -
డెయిరీ రంగంలోకి ‘కైన్’
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: డెయిరీ రంగంలోకి కొత్త బ్రాండ్ ‘కైన్’ రంగ ప్రవేశం చేసింది. ఉమెనోవా డెయిరీ ప్రమోట్ చేస్తున్న ఈ బ్రాండ్‌లో ప్రస్తుతం టెట్రా ప్యాక్‌లో పోషకాలతో కూడిన పాలను విక్రయిస్తున్నారు. కొద్ది రోజుల్లో కుర్కుమిన్, హనీ వేరియంట్లను అందుబాటులోకి తెస్తారు. 2021 జూన్ నాటికి నెయ్యి, పెరుగు, వెన్న, పనీర్ వంటి 15 రకాల ఉత్పత్తులను ప్రవేశపెట్టాలని కంపెనీ నిర్ణయించింది. ప్రస్తుతం తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌తోపాటు ఉత్తరాదిన మూడు రాష్ట్రాల్లో కంపెనీ టెట్రా ప్యాక్ పాలను విక్రయిస్తోంది. లీటరు ప్యాక్ ధర రూ.65 ఉంది. ఉమెనోవా డెయిరీకి చైర్‌పర్సన్‌గా పడిగల లీలావతి వ్యవహరిస్తున్నారు. తెలంగాణ రాష్ట్ర మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ కైన్ ఉత్పత్తులను గురువారం ఆవిష్కరించారు. అత్యాధునిక మిషనరీతో.. ఉమెనోవా డెయిరీ మాతృ సంస్థ ఉమెనోవా అగ్రో ఫుడ్ పార్క్ వికారాబాద్ జిల్లాలో 16.5 ఎకరాల్లో ప్లాంటును నిర్మిస్తోంది. డెన్మార్క్, యూఎస్ నుంచి తీసుకొచ్చిన అత్యాధునిక మెషినరీని వాడుతున్నారు. మొత్తం సుమారు రూ.200 కోట్ల పెట్టుబడి పెడుతున్నట్టు సంస్థ సీఈవో రంగయ్య వి శెట్లం సాక్షి బిజినెస్ బ్యూరోకు తెలిపారు. ‘2021 జూన్ నాటికి ప్లాంటు పూర్తిగా సిద్ధం కానుంది. రోజుకు లక్ష లీటర్ల పాలను ప్రాసెస్ చేయగలదు. సుమారు 200 మందికి ఉపాధి లభిస్తుంది’ అని వివరించారు. పేపర్ ప్యాకింగ్‌లో..: భారత్‌లో తొలిసారిగా గేబుల్ టాప్ ప్యాకింగ్‌లో తాజా పాలను తేనున్నట్టు రంగయ్య వెల్లడించారు. ‘పూర్తిగా పేపర్‌తో ప్యాకింగ్ ఉంటుంది. ఏడు రోజులపాటు పాలు నిల్వ చేయవచ్చు. ప్రస్తుతం మార్కెట్లో ఉన్న పాల మాదిరిగానే ధర ఉంటుంది. యూఎస్, జర్మనీ మెషినరీని తెప్పిస్తున్నాం’ అని తెలిపారు. ఒమన్‌లో 25 ఏళ్లుగా డెయిరీ, బెవరేజెస్ రంగంలో జాకీ ఫుడ్స్ పేరుతో కంపెనీని నిర్వహిస్తున్నట్టు చెప్పారు. -
తప్పు జరిగింది.. సరిదిద్దుకుంటాం: మంత్రి
సాక్షి, హైదరాబాద్: నాంపల్లి, కార్వాన్ ప్రాంతాలకు సంబంధించిన డబుల్ బెడ్ రూమ్ ఇళ్లను భోజగుట్టలో కడుతున్నామని మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ తెలిపారు. అయితే కోర్టులో కాంగ్రెస్ కేసులు వేస్తూ డబుల్ బెడ్ రూమ్ ఇళ్ళ నిర్మాణం ఆపుతుందని ఆగ్రహం వ్యక్తం చేశారు. మధిరలో రైతు బంధు, రైతు బీమా, కళ్యాణ లక్ష్మీ చెక్కులు భట్టి విక్రమార్క పంపిణీ చేస్తారని తెలిపారు. ఓపెన్ నాళాలపై క్యాపింగ్ లేకపోవడం బాధాకరమని మంత్రి తెలిపారు. అధికారుల పొరపాటుతో తప్పు జరిగిందని, సరిదిద్దుకుంటామన్నారు. (మంత్రి కేటీఆర్, మేయర్‌పై సుమేధ తల్లి ఫిర్యాదు) హైదరాబాద్ అబివృద్దిలో కేటీఆర్ కీలక పాత్ర పోషిస్తున్నారని, కేటీఆర్ పనితనం గురించి తెలంగాణ ప్రజలకు తెలుసన్నారు. కాంగ్రెస్ సబ్యులు లొకేషన్ తెలుసుకొని వెళ్ళాలని, లక్ష బెడ్ రూమ్ ఇళ్ల జాబితాలో అప్జల్ సాగర్ లేదని స్పష్టం చేశారు. కాంగ్రెస్ నవ్వుల పాలు అవుతారన్న మంత్రి కాంగ్రెస్ నేతలకు ఓట్లు ఎవరు వేస్తారని ఎద్దేవా చేశారు.150 డివిజన్లలో కాంగ్రెస్ పార్టీకి అభ్యర్థులు దొరకరకరని విమర్శించారు. జీవిత కాలంలో కాంగ్రెస్ అధికారంలోకి రాదని, కాంగ్రెస్ నేతలు చేసే డ్రామాలు ఆపాలని సూచించారు. (నాలుగు స్థానాలు గులాబీ ఖాతాలోకే..!) -
‘కొండపోచమ్మ’లో చేప పిల్లలు వదిలిన మంత్రులు
సాక్షి, సిద్దిపేట : మర్కుక్ మండల కేంద్రంలోని కొండపోచమ్మ రిజర్వాయర్‌లో మంత్రులు శ్రీనివాస్ యాదవ్, హరీష్ రావు, జిల్లా కలెక్టర్ వెంకట్రామిరెడ్డి, జిల్లా పరిషత్ చైర్మన్ రోజా శర్మ, రాష్ట్ర అటవీ అభివృద్ధి సంస్థ చైర్మన్ వంటేరు ప్రతాపరెడ్డిలు చేప పిల్లలు వదిలారు. వర్గల్ మండలం గౌరారంలో ఉచిత పశు కృత్రిమ గర్భధారణ శిబిరాన్ని మంత్రులు శ్రీనివాస్ యాదవ్, హరీష్ రావు ప్రారంభించారు. (వారికిచ్చిన భూములు రద్దు చేస్తాం : కేటీఆర్) మానవులకు ఎంత విలువ ఉంటుందో జీవాలకు అంత విలువ ఉండాలని తలసాని అన్నారు. గోపాల మిత్రల సహకారం 3వేల నుండి 8వేల రూపాయలకు పెంచామని చెప్పారు. కరోనా కష్ట కాలంలో సైతం గోపాల మిత్రలకు జీతాలను అందించామని పేర్కొన్నారు. గొర్లకాపర్ల ఉపాధి పెరగడంతో, వారు ఎంతో సంతోషంగా ఉన్నారని తెలిపారు. రైతాంగానికి అనుసంధానంగా ఉన్న పాడి పరిశ్రమ అభివృద్ధికి ప్రభుత్వం కృషి చేస్తోందన్నారు. (సెప్టెంబర్ 1 నుంచి విద్యా సంవత్సరం ప్రారంభం) కొండ పోచమ్మ సాగర్ రిజర్వాయర్ నిర్మాణం చేపట్టడం, చేపలు విడుదల చేయడం ఈ ప్రాంత ప్రజల అదృష్టమని మంత్రి హరీష్ రావు అన్నారు. ఈ ఏడాది కొండ పోచమ్మ సాగర్ రిజర్వాయర్‌లో 7.5 టీఎంసీల నీటిని నింపుతామని తెలిపారు. కొండ పోచమ్మ సాగర్ రిజర్వాయర్‌లో 14లక్షల చేప పిల్లలను విడుదల చేస్తామని తెలిపారు. కాళేశ్వరం ప్రాజెక్టు, సమృద్ధిగా కురిసిన వర్షాలతో తెలంగాణ పల్లెలు కోనసీమను తలపిస్తున్నాయన్నారు. ప్రతి చెరువు, చెక్ డ్యాం, రిజర్వాయర్లలో ఉచితంగా చేప పిల్లలను విడుదల చేస్తున్న ఏకైక రాష్ట్రం తెలంగాణ అని పేర్కొన్నారు. -
డబుల్ బెడ్ రూమ్ ఇళ్లపై మంత్రుల సమీక్ష
సాక్షి, హైదరాబాద్ : నగరంలో చేపట్టిన డబుల్ బెడ్ రూం ఇళ్ల నిర్మాణ పనుల పురోగతిపై మంత్రులు మహమూద్ అలీ, తలసాని శ్రీనివాస్ యాదవ్‌లు సమీక్షా సమావేశం నిర్వహించారు. మాసాబ్ ట్యాంక్‌లోని తలసాని ఛాంబర్లో నిర్వహించిన ఈ సమావేశానికి కలెక్టర్ శ్వేతా మహంతి, జీహెచ్ఎంసీ కమిషనర్ లోకేష్ కుమార్ సహా పలువురు అధికారులు పాల్గొన్నారు. ఇళ్ల నిర్మాణ పనులు త్వరితగితన పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు. -
సినీ కార్మికులకు నిత్యావసరాల పంపిణీ
సాక్షి, హైదరాబాద్ : లాక్డౌన్ కారణంగా షూటింగ్‌లు నిలిచిపోవడంతో ఇబ్బందులు పడుతున్న సినీ కార్మికులను ఆదుకునేందుకు తెలంగాణ సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ ముందుకొచ్చారు. అన్నపూర్ణ స్టూడియోస్‌లో తలసాని ట్రస్ట్ ఆధ్వర్యంలో తలసాని శ్రీనివాస్ యాదవ్, తలసాని సాయి కిరణ్ యాదవ్, సినీ ప్రముఖులు కలిసి 14 వేల మంది సినీ కార్మికులకు నిత్యావసర సరుకులను పంపిణీ చేశారు. రెండు నెలల నుంచి తీవ్ర ఇబ్బందులు పడుతున్న 14 వేల మంది సినీ కార్మికులు, సినీ, టీవీ ఆర్టిస్టులకు నిత్యావసర సరుకులు కలిగిన కిట్స్ పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో హీరో నాగార్జున, దర్శకులు రాజమౌళి, త్రివిక్రమ్, శంకర్, కొరటాల శివ, నిర్మాతలు సీ. కళ్యాణ్, దిల్ రాజులు పాల్గొన్నారు. -
ఆ తర్వాతే షూటింగ్‌లకు అనుమతి: తలసాని
సాక్షి, హైదరాబాద్ : తెలంగాణ రాష్ట్ర సినిమాటోగ్రఫీ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్‌తో టాలీవుడ్సినీ ప్రముఖులు భేటీ అయ్యారు. మాసాబ్ ట్యాంక్‌లోని పశుసంవర్ధక శాఖ డైరెక్టర్ కార్యాలయ ఆవరణలోని కాన్ఫరెన్స్ హాల్లో సమావేశమయ్యారు. నిర్మాతలు సీ.కళ్యాణ్, దిల్ రాజు, డైరెక్టర్ ఎన్.శంకర్, మా అధ్యక్షుడు నరేష్, ఎఫ్డీసీ మాజీ ఛైర్మన్ రాంమోహన్ రావు, జీవిత, పలువురు నిర్మాతలు, ఎగ్జిబిటర్స్ పాల్గొన్నారు. సినీ రంగాన్ని ఆదుకునేందుకు ప్రభుత్వం అన్నిచర్యలు తీసుకుంటుందని తలసాని అన్నారు. సినీ పరిశ్రమకు బెస్ట్ పాలసీని తీసుకొచ్చేందుకు ప్రణాళికలు సిద్ధం చేస్తున్నామని తెలిపారు. అన్ని పరిశీలించిన తర్వాతే షూటింగ్‌లకు అనుమతిస్తామని పేర్కొన్నారు. ‘సినీరంగం పట్ల ప్రభుత్వం ఎప్పుడు సానుకూల ధోరణితో వ్యవహరిస్తుంది. లాక్ డౌన్‌తో సినిమా, టీవీ సీరియళ్ల షూటింగ్‌లు నిలిచిపోయి ఈ రంగాలపై ఆధారపడి జీవిస్తున్న లక్షలాది మంది తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. సినీ రంగాన్ని ఆదుకునేందుకు ప్రభుత్వం అన్ని రకాల చర్యలను తీసుకుంటుంది. పోస్ట్ ప్రొడక్షన్ చేసుకునేందుకు సంబంధించి ఇప్పటికే ఆదేశాలు ఇవ్వడం జరిగింది. ముఖ్యమంత్రి వద్ద సినీ ప్రముఖులతో ఇప్పటికే సమావేశంలో పలు అంశాలను చర్చించడం జరిగింది’ అని తలసాని అన్నారు. షూటింగ్‌లకు అనుమతిపై రేపు మరోసారి సమావేశమవుతామన్నారు. (భర్తను రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకుని..) -
చెయ్యి కడుక్కోవే శీనన్నా...
సాక్షి, బంజారాహిల్స్: లాక్డౌన్ నేపథ్యంలో ప్రజలకు నిత్యావసర సరకులు ఎలా అందుతున్నాయో పరిశీలించేందుకు మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ నిన్న (గురువారం) ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్‌తో కలిసి బంజారాహిల్స్ పరిధిలో పర్యటించారు. ఈ సందర్భంగా దానం ఇంటికి వచ్చిన శ్రీనివాస్ యాదవ్‌కు శానిటైజర్‌తో చేతులు కడిగించారు. ప్రజలకు మరింత అవగాహన పెంచే దిశలో నాగేందర్ గత పది రోజుల నుంచి తన ఇంటి వద్ద ప్రత్యేకంగా శానిటైజర్లు ఏర్పాటు చేసి ప్రతి ఒక్కరికీ తానే దగ్గరుండి చేతులు శుభ్రం చేసుకునేలా అవగాహన కలిగిస్తున్నారు. (కరోనా కథ.. ఇల్లే సురక్షితం) కాగా కరోనా వైరస్ వేగంగా వ్యాప్తి చెందుతున్న నేపథ్యంలో అవసరమైన జాగ్రత్తలు పాటించాలని మంత్రి తలసాని అన్నారు. నిన్న ఆయన బేగంబజార్‌లోని మిట్టికా షేర్ హోల్‌సేల్ మార్కెట్లో వ్యాపారులతో సమావేశం అయ్యారు. మార్కెట్లో సుమారు 300 దుకాణాలు ఉన్నాయని, రోజుకు 40 దుకాణాల చొప్పున ఉదయం 11 నుంచి మధ్యాహ్నం 3 గంటల విక్రయాలు జరుపుకోవాలని సూచించారు. (బ్రేక్ 'కరోనా') నిత్యావసరాలపై నిఘా అవినాష్ మహంతి నేతృత్వంలో స్పెషల్ టాస్క్ ఫోర్స్ రెండు రోజుల్లో 20 వేలకు పైగా పాసులు జారీ లాక్డౌన్ నేపథ్యంలో సామాన్య ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు రాకుండా పోలీసులు పటిష్ట ఏర్పాట్లు చేస్తున్నారు. నిత్యావసర వస్తువుల్ని రవాణా చేసే వాహనాల కదలికల్ని సమీక్షించడానికి, పర్యవేక్షించడానికి, ఆయా విభాగాలతో సమన్వయానికి స్పెషల్ టాస్క్ ఫోర్స్ ఏర్పాటు చేస్తూ కొత్వాల్ అంజనీకుమార్ నిర్ణయం తీసుకున్నారు. నగర నేర పరిశోధన విభాగం (సీసీఎస్) సంయుక్త పోలీసు కమిషనర్ అవినాష్ మహంతి దీనికి నేతృత్వం వహిస్తున్నారు. మొత్తం 25 మంది అధికారులతో ఉండే ఈ బృందం 24 గంటలూ మూడు షిఫ్టుల్లో నిర్విరామంగా సేవలు అందిస్తుంది. ఇతర రాష్ట్రాల నుంచి నిత్యావసర వస్తువులు తీసుకువచ్చే లారీలు, నగరంలో వాటిని డిస్ట్రిబ్యూట్ చేసే వాహనాల కదలికలకు ఆటంకం లేకుండా సాగేలా ఈ టీమ్ ఆద్యంతం పర్యవేక్షించనుంది. అలాగే మూడు కమిషనరేట్లకు చెందిన అధికారులు అత్యవసర సేవలు అందించే వ్యక్తులు, వాహనాలకు బుధవారం నుంచి ప్రత్యేక పాస్‌లు జారీ చేస్తున్నారు. దీనికోసం ఎవరికి వారు హెల్ప్‌డెస్క్ ఏర్పాటు చేశారు. నిత్యావసర వస్తువుల్ని ఇళ్లకు సరఫరా చేసే ఈ–కామర్స్ వాహనాలు, వ్యక్తులు, కోళ్లు, కోడిగుడ్లు, ఆవులు, గేదెలు రవాణా చేసే వాహనాలు, కూరగాయలు తరలించే లారీలు, హాస్పిటల్స్‌లోని వివిధ విభాగాల్లో పని చేసే ఉద్యోగులు, వివిధ స్టార్ హోటళ్లు, లాడ్జిలలో పనిచేసే ఉద్యోగులకు, మండీలు, మార్కెట్లలో పని చేసే హమాలీలు, ఇతర ఉద్యోగులు చేపలు, మాంసం, వంటనూనె,పంచదార రవాణా చేసే వాహనాలు, కేబుల్ టీవీ, ఇంటర్నెట్ సేవల టెక్నీషియన్లకు కొన్ని స్వచ్ఛంద సంస్థల కార్యకర్తలకు పాస్‌లు ఇస్తున్నారు. గురువారం రాత్రికి జారీ చేసిన పాసుల సంఖ్య 20 వేలు దాటింది. ఈ పాసులను ఎవరైనా దుర్వినియోగం చేస్తే కఠిన చర్యలు తీసుకుంటామని పోలీసులుని స్పష్టం చేస్తున్నారు -
చిరంజీవి, నాగార్జునతో మంత్రి తలసాని భేటీ
సాక్షి, హైదరాబాద్: ప్రముఖ సినీనటులు చిరంజీవి, నాగార్జునతో రాష్ట్ర సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి తలసాని శ్రీనివాస్‌యాదవ్ మంగళవారం సమావేశమయ్యారు. జూబ్లీహిల్స్‌లోని చిరంజీవి నివాసంలో ఈ భేటీ జరిగింది. సినిమారంగం అభివృద్ధి, సినీ కళాకారులకు ప్రభుత్వ సంక్షేమ పథకాల అమలుపై ఈ సందర్భంగా మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ చిరంజీవి, నాగార్జునలతో చర్చించారు. -
సమ్మెపై మంత్రి ఆగ్రహం.. కుట్రవారిదే!
సాక్షి, సంగారెడ్డి: దసర పండుగ ముందు ఆర్టీసీ కార్మికులు సమ్మెకు దిగడాన్ని మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ తీవ్రంగా తప్పుపట్టారు. ఇలాంటి సమయంలో సమ్మె చేయడం సరైనది కాదని కార్మికులపై అసహనం వ్యక్తం చేశారు. శనివారం సంగారెడ్డి జిల్లా నారాయణ్‌ఖేడ్‌లో పర్యటించిన మంత్రి మీడియాతో మాట్లాడారు. దేశంలో ఆర్టీసీ కార్మికులకు అత్యధిక జీతాలు ఇచ్చేది తామేనని పేర్కొన్నారు. ఎక్కడాలేని విధంగా ఆర్టీసీ కార్మికులకు 44 శాతం ఫిట్మెంట్ ఇచ్చామని, 16 శాతం ఐఆర్ కూడా ఇచ్చామని మంత్రి గుర్తుచేశారు. ప్రజలకు మెరుగైన సౌకర్యాలు కల్పించాల్సింది పోయి.. బతుకమ్మ, దసరా పండుగలోస్తే సమ్మె చెస్తామంటే ఎలా అని మంత్రి ప్రశ్నించారు. ఇప్పటికే ఐదు వేల కోట్ల నష్టాల్లో ఆర్టీసీ ఉందని.. ఏటా 11 వందల కోట్ల రూపాయల నష్టం జరుగుతున్నా ప్రభుత్వమే భరిస్తోందని తెలిపారు. కార్మికులు రోజుకో డిమాండ్ చేయాటాన్ని మంత్రి తప్పుపట్టారు. కార్మికులు ఎలాంటి ఇబ్బందులు లేవని, యూనియన్ లీడర్లే కుట్రపూరితంగా ఈ సమ్మె చేయిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. -
‘ఆయన ట్రాప్‌లో పడ్డ కొన్ని మీడియా సంస్థలు’..
-
‘ఆయన ట్రాప్‌లో మీడియా సంస్థలు’..
సాక్షి, హైదరాబాద్ : ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తిమ్మిని బమ్మిని చేయగలరని, ఆయన ట్రాప్‌లో పడిన కొన్ని మీడియా సంస్థలు కూడా తిమ్మిని బమ్మిని చేయాలనుకుంటున్నాయని మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ మండిపడ్డారు. ఐటీ గ్రిడ్‌కు సంబంధించిన వాస్తవాలు ప్రజల దృష్టికి తేవాలని మీడియా మిత్రులకు విజ్ఞప్తి చేశారు. గురువారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. ఐటీ గ్రిడ్ కేసును రెండు రాష్ట్రాల వివాదంగా కొందరు తెలిసీ, తెలియక చిత్రీకరిస్తున్నారన్నారు. ఏపీ మంత్రులు పోలీస్ స్టేషన్‌కు వెళ్లి, తెలంగాణ ప్రభుత్వంపై ఫిర్యాదు చేయటం దౌర్భాగ్యమన్నారు. కొన్ని మీడియా సంస్థలు తెలంగాణ ప్రభుత్వాన్ని బద్నామ్ చేయడానికి కంకణం కట్టుకున్నాయని ఆగ్రహం వ్యక్తం చేశారు. టీఆర్ఎస్ కూడా 24 లక్షల ఓట్లను తొలగించి గెలిచిందని కొందరు తప్పుడు ప్రచారం చేస్తున్నారని చెప్పారు. చంద్రబాబు.. దొంగే దొంగ అన్నట్టుగా వ్యవహరిస్తున్నారని ఎద్దేవా చేశారు. కొన్ని సార్లు తమ డేటా చోరీ అయిందని, కొన్ని సార్లు కాలేదని టీడీపీ నేతలు పూటకో వైఖరితో ముందుకు సాగుతున్నారని పేర్కొన్నారు. జర్నలిస్టు సంఘాలు ఒక కమిటీ వేసుకుని ఐటీ గ్రిడ్‌పై నిష్పాక్షికంగా విచారణ చేసి ప్రజలకు వాస్తవాలు చెబితే మంచిదని సూచించారు. ఏపీ ప్రభుత్వం అక్కడి అధికారులను బలి చేయాలని చూస్తోందన్నారు. డేటా టీడీపీ సభ్యత్వానికి సంబంధించింది కాదని, అది ఏపీ ప్రజల డేటా అని లోకమంతటికి తెలుసునన్నారు. కొన్ని మీడియా సంస్థలు తప్పు చేసిన వారిని ఒప్పు చేసిన వారిగా చిత్రీకరిస్తున్నాయన్నారు. ఏపీలో ఎమ్మెల్యేలను, మంత్రులను, వ్యవస్థలను చంద్రబాబు ముంచేస్తారన్నారు. బాధ్యత లేకుండా వ్యవహరించడం ఎవరికీ మంచిది కాదని సూచించారు. -
బాబును ఏపీ ప్రజలు తరిమికొడతారు
సాక్షి, హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్‌లో అవినీతి ప్రభుత్వంపై ప్రజలు ఆగ్రహంతో ఉన్నారని మాజీ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ అన్నారు. చంద్రబాబు మాకొద్దు అనే నినాదంతో మూడు నెలల్లో ప్రజలు బాబును తరిమికొడతారని చెప్పారు. పూటకో మాట మాట్లాడే చంద్రబాబును చూసి ఊసరవెల్లి కూడా సిగ్గుపడుతోందని అన్నారు. గురువారం ఆయన ఇక్కడ అసెంబ్లీ మీడియా పాయింట్లో మాట్లాడుతూ.. ‘సంక్రాంతి ఉత్సవాల్లో పాల్గొనేందుకు ఆంధ్రప్రదేశ్‌కు వెళ్లి వచ్చా. నేను మీలా దేవాలయాల దగ్గర రాజకీయం చేయను. మాకు బంధాలు, బంధుత్వాల గురించి తెలుసు. బంధాలు, బంధుత్వాల గురించి మాట్లాడే నైతిక హక్కు చంద్రబాబుకు లేదు. మీలా మేము శవరాజకీయాలు చేయం. ఆంధ్రప్రదేశ్‌లో ఒక్క యాదవ సంఘానికే కాదు వెనుకబడిన వాళ్లకి కూడా మద్దతు ఇస్తాం. చంద్రబాబులా మా సీఎం దొంగ రాజకీయాలు చేయరు. ఫెడరల్ ఫ్రంట్ లేదంటోన్న బాబుకు.. అదేంటో త్వరలోనే తెలుస్తుంది. చంద్రబాబులా మోసపూరిత జీవితం మాది కాదు. చంద్రబాబు ప్రతి విషయాన్ని రాజకీయ కోణంలో చూస్తారు. చిల్లర రాజకీయాలు చేస్తే.. మా సమాధానాలు చాలా దీటుగా ఉంటాయి. మీరు తెలంగాణలో రాజకీయాలు చేస్తే సంసారం. మేము ఏపీలో రాజకీయాలు చేస్తే వ్యభిచారమా? 15 రోజుల్లో మా సీఎం కేసీఆర్ ఏపీకి వస్తారు. దమ్ముంటే అప్పుడు నీ ప్రతాపం చూపించు. చంద్రబాబు ఏపీ ప్రజల సొమ్మును ప్రకటనల పేరుతో వృథా చేస్తున్నారు. కులాల మధ్య గొడవలు పెడుతున్నారు. మీరు సీఎంగా ఉన్నప్పుడు తెలంగాణలో కరెంట్, నీళ్లు కూడా లేవు. మా సీఎం కేసీఆర్ వచ్చాకే అన్నీ ఒక్కొక్కటిగా తీర్చాము. మీ అందమైన మొహాన్ని చూస్తేనే అందరికీ మీరంటే ఏంటో తెలుస్తుంది. నీతి, జాతి లేని మాటలు మీవి. ఆంధ్రప్రదేశ్ దద్దమ్మ మంత్రులు ఫెడరల్ ఫ్రంట్‌పై అనవసర, అర్థరహిత ఆరోపణలు చేస్తున్నారు. చంద్రబాబు తాటాకు చప్పుళ్లకు ఎవరూ భయపడరు. ఏపీ ప్రజల హక్కుల కోసం మా ప్రభుత్వం వంద శాతం సహకరిస్తుంది. చంద్రబాబుది అవినీతి ప్రభుత్వం. టీఆర్ఎస్ ఎప్పటికీ బీజేపీ, కాంగ్రెసేతరే పార్టీనే. నేను ఏపీకి వెళ్తేనే అద్భుతమైన స్పందన వచ్చింది. ఇక మా సీఎం కేసీఆర్ వెళ్తే ఎలా ఉంటుందో మీరే ఆలోచించుకోండి’అని అన్నారు. తనను కలిసిన తన బంధువులు (టీడీపీ నేతలపై) చర్యలు తీసుకోవాల్సి ఉంటుందని చంద్రబాబు చేసిన హెచ్చరికను ఓ విలేకరి ప్రస్తావించగా ‘వారిపై చర్యలు తీసుకోవడమేమిటి? సమయం వచ్చినప్పుడే వారే నిన్ను బహిష్కరిస్తారు’అని తలసాని మండిపడ్డారు. -
ఏపీ రాజకీయాల్లో కేసీఆర్ కీలక పాత్ర: మాజీ మంత్రి
తిరుపతి: వచ్చే నాలుగు నెలల్లో దేశ రాజకీయ ముఖచిత్రం మారబోతుందని టీఆర్ఎస్ ఎమ్మెల్యే, మాజీ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ అన్నారు. సోమవారం తిరుమల తిరుపతి స్వామి దర్శనం చేసుకున్న తలసాని అనంతరం మీడియాతో మాట్లాడారు. తెలంగాణ సీఎం కేసీఆర్ నేతృత్వంలోని ఫెడరల్ ఫ్రెంట్ దేశ రాజకీయాల్లో కీలక పాత్ర పోషిస్తుందని జోస్యం చెప్పారు. నూతనంగా ఏర్పడిన ఏపీలో ప్రభుత్వ పాలన సక్రమంగా లేదని, అధికార పార్టీ అభివృద్ధి పనులు చెయ్యకుండా ప్రతిపక్షం తరహాలో దీక్షలు చేస్తోందని విమర్శించారు. ఎన్టీఆర్ స్థాపించిన తెలుగుదేశం పార్టీ సిద్ధాంతాలు పక్కనపెట్టి చంద్రబాబు నాయుడు కాంగ్రెస్ వెంట పడుతున్నారని అన్నారు. చంద్రబాబు కేవలం పబ్లిసిటీ కోసం మాత్రమే పనిచేస్తున్నారని పేర్కొన్నారు. తెలుగు ప్రజలెప్పుడూ సంతోషంగా ఉండాలని కేసీఆర్ కోరుకుంటారని, ఆంధ్రా రాజకీయాల్లో ఆయన కీలక పాత్ర పోషిస్తారని తెలియజేశారు. -
బీసీలకు టీఆర్ఎస్ శ్రీరామరక్ష
సాక్షి, హైదరాబాద్: సుప్రీంకోర్టు, హైకోర్టు ఆదేశాల ప్రకారమే పంచాయతీ ఎన్నికల్లో ప్రభుత్వం వ్యవహరిస్తోందని మాజీ మంత్రి తలసాని శ్రీనివాస్‌యాదవ్ అన్నారు. టీఆర్ఎస్ పార్టీ బీసీలకు శ్రీరామరక్షగా నిలుస్తోందని చెప్పారు. తెలంగాణ భవన్లో శుక్రవారం తలసాని విలేకరులతో మాట్లాడారు. ‘ఎన్నికల ఫలితాల తర్వాత ప్రతిపక్ష పార్టీల నేతలు నోటికొచ్చినట్లు మాట్లాడుతున్నారు. బీసీలకు అన్యాయం చేసిన పార్టీలు ఇప్పుడు గొంతు చించుకుంటున్నాయి. బీసీల రిజర్వేషన్లపై హైకోర్టు, సుప్రీంకోర్టు ఆదేశాలకు అనుగుణంగా ప్రభుత్వం వ్యవహరించింది. బీసీలను ఉద్ధరించినట్లుగా కొందరు మాట్లాడుతున్నారు. బీసీలకు, సబ్బండ వర్గాలకు టీఆర్ఎస్ శ్రీరామరక్ష. టీఆర్ఎస్ రెండు రాజ్యసభ సీట్లను బీసీలకు కేటాయించింది. శాసనసభ, శాసనమండలి అధ్యక్ష పదవులను బీసీలకు ఇచ్చింది. బీసీల గురించి మాట్లాడే నైతిక హక్కు కాంగ్రెస్‌కు లేదు. ఆర్.కృష్ణయ్య ఎమ్మెల్యేగా పోటీచేసి ఓడిపోయి బీసీ నేత ముసుగులో టీఆర్ఎస్ను విమర్శిస్తున్నారు. బీసీ సంఘాలకు కోట్లాది రూపాయల విలువైన భూములను కేటాయించిన ఘనత కేసీఆర్‌దే. కాంగ్రెస్, టీడీపీలు ఇక ఏ ఎన్నికలు జరిగినా నిండా మునగడం ఖాయం..’అని వ్యాఖ్యానించారు. చంద్రబాబువి చిల్లర రాజకీయాలు.. ఏపీ సీఎం చంద్రబాబు తెలంగాణ ఫలితాలపై మాట్లాడకుండా ఉత్తరాది రాష్ట్రాల్లో కాంగ్రెస్ విజయానికి తానే కారణమన్నట్టుగా చెప్పుకుంటున్నారని తలసాని విమర్శించారు. ‘చంద్రబాబు తిరిగిన సెగ్మెంట్లలో టీఆర్ఎస్కు మెజారిటీ వస్తుందని ఎన్నికల ముందే చెప్పాను. అదే జరిగింది. చంద్రబాబువి చిల్లర రాజకీయాలు. దమ్ముంటే ఏపీలో టీడీపీలో చేరిన వైసీపీ ఎమ్మెల్యేలతో చంద్రబాబు రాజీనామా చేయించాలి. గత ఎన్నికల్లో చెప్పినట్టు బాబు ఇంటికో ఉద్యోగం ఇప్పించాలి. ఏపీ ప్రజలు హామీలపై బాబును నిలదీయాలి. బాలకృష్ణకు మాట్లాడటం చేత కాకపోతే ఇంట్లో కూర్చోవాలి. ఏది పడితే అది మాట్లాడొద్దు. ఓ పెద్ద మనిషి తప్పుడు సర్వేతో ఏపీలో బెట్టింగ్తో కోట్లాది రూపాయలు కోల్పోయాడు. దీని వెనక బాబు కుట్ర ఉంది. నాలుగు నెలల తర్వాత చంద్రబాబు ఓడిపోయి ఇంటికి వెళ్లడం ఖాయం..’అని అన్నారు. -
కేసీఆర్‌తోనే బంగారు తెలంగాణ
సాక్షి, మహేశ్వరం: బంగారు తెలంగాణ కేసీఆర్‌తోనే సాధ్యమని ఆపద్ధర్మ మంత్రి తలసాని శ్రీనివాస్‌యాదవ్, ఎంపీ కొండా విశ్వేశ్వర్‌రెడ్డి పేర్కొన్నారు. ఆదివారం మండల కేంద్రంలో పోతర్ల బాబయ్య ఫంక్షన్ హాలులో టీఆర్ఎస్ పార్టీ విస్తృత స్థాయి కార్యకర్తల సమావేశంలో ఎంపీ, అనంతరం తుక్కుగూడలో నిర్వహించిన బైక్ ర్యాలీలో మంత్రి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఆ తర్వాత తుక్కుగూడలో రోడ్ షో నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. టీఆర్ఎస్ ప్రభుత్వం బడుగు, బలహీనవర్గాల అభివృద్ధి, సంక్షేమం కోసం నిరంతరం కృషి చేస్తోందని తెలిపారు. వృద్ధులు, వితంతువులు, ఒంటరి మహిళలు, వికలాంగులకు ఆసరా పథకం కింద పింఛన్లు అందజేస్తోందని పేర్కొన్నారు. రైతులకు పంట పెట్టుబడి కోసం ఎకరానికి రూ. 8 వేలతోపాటు రైతుకు బీమా అందజేస్తోందని పేర్కొన్నారు. రైతుల పక్షపాతిగా మారిన టీఆర్ఎస్ సర్కారు వారికి సబ్సిడీ ట్రాక్టర్లు, యంత్ర పరికరాలు అందజేసిందని తెలిపారు. పేదింటి యువతుల వివాహం కోసం కల్యాణలక్ష్మి, షాదీముబారక్ అందజేస్తున్నట్లు చెప్పారు. గ్రామాల్లో బీటీ రోడ్డు, మిషన్ కాకతీయ కింద చెరువులు, కాల్వల అభివృద్ధికి చర్యలు తీసుకుంటున్నట్లు వివరించారు. మిషన్ భగీరథ పథకంలో భాగంగా ఇంటింటికి తాగునీరు అందించేందుకు ప్రభుత్వం కృషి చేస్తోందని తెలియజేశారు. అభివృద్ధి, సంక్షేమ పథకాలు ఆగిపోకూడదంటే తిరిగి టీఆర్ఎస్కు పట్టం కట్టాల్సిన అవసరం ఉందని మంత్రి తలసాని పేర్కొన్నారు. కారు గుర్తుకు ఓటు వేసి టీఆర్ఎస్ అభ్యర్థి తీగల కృష్ణారెడ్డిని భారీ మెజారిటీతో గెలిపించాలని కోరారు. సబితను చిత్తుగా ఓడిస్తా: తీగల త్వరలో జరిగే ఎన్నికల్లో మహేశ్వరం నుంచి కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీ చేయనున్న సబితాఇంద్రారెడ్డిని చిత్తుగా ఓడించి గులాబీ జెండాను ఎగురవేస్తామని తాజా మాజీ ఎమ్మెల్యే, టీఆర్ఎస్ అభ్యర్థి తీగల కృష్ణారెడ్డి తెలిపారు. కాంగ్రెస్ అవినీతికి మారుపేరని తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. మాజీ హోంమంత్రి సబితాఇంద్రారెడ్డి, కాంగ్రెస్ పార్టీ హయాంలో మహేశ్వరం నియోజకవర్గాన్ని పట్టించుకోకపోవడంతో పూర్తిగా వెనుకబడి పోయిందని మండిపడ్డారు. శిలాఫలకాలు వేసి అభివృద్ధి చేయలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. నాలుగున్నరేళ్లుగా సబితాఇంద్రారెడ్డి ప్రజలకు దూరంగా ఉండి ఎన్నికలు దగ్గరకు రావడంతో తిరిగి గ్రామాలబాట పడుతున్నారని విమర్శించారు. నియోజకవర్గంలో సుమారు రూ. 700 కోట్ల నిధులతో తాము పలు అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టామని అన్నారు. మరోసారి తనను ఆశీర్వదిస్తే అభివృద్ధిని పరుగులు పెట్టిస్తామని తీగల పేర్కొన్నారు. అంతకు ముందు తుక్కుగూడ– శ్రీశైలం రహదారి నుండి మహేశ్వరం వరకు భారీ బైక్, కార్ ర్యాలీ నిర్వహించారు. మహిళలలు భారీ ఎత్తున హజరయ్యారు. కాగా, కార్యక్రమానికి మహేశ్వరం జెడ్పీటీసీ సభ్యుడు నేనావత్ ఈశ్వర్ నాయక్, టీఆర్ఎస్ నియోజకవర్గ ఉపాధ్యక్షుడు ఎడ్మ మోహన్‌రెడ్డి, రావిర్యాల మాజీ సర్పంచ్ జెల్లల లక్ష్మయ్య గైర్హాజరయ్యారు. సభ వేదికపైన యువకులు, మహిళలతో కలిసి తీగల బతుకమ్మ ఆడిపాడారు. కళాకారుడు సాయిచందర్ ఆటాపాటలు అలరించాయి. కార్యక్రమంలో డీసీసీబీ చైర్మన్ పెంటారెడ్డి, జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ కప్పాటి పాండురంగారెడ్డి, జిల్లా మహిళా నాయకురాలు తీగల అనితారెడ్డి, పార్టీ మండల అధ్యక్షుడు హన్మగళ్ల చంద్రయ్య, కందుకూరు మండల అధ్యక్షుడు భిక్షఫతి, మార్కెట్ కమిటీ చైర్మన్ జ్యోతిలక్ష్మీనర్సింహారెడ్డి, వైస్ చైర్మన్ శ్రీనివాస్, నాయకులు కరుణాకర్‌రెడ్డి, కూన యాదయ్య, అనంతలక్ష్మి, ఎంపీటీసీలు సురేష్, బాలమ్మ, శశిరేఖ, నర్సింహ, రాఘవేందర్‌రెడ్డి, మర్యాద రాఘవేందర్‌రెడ్డి తదితరులు హాజరయ్యారు. -
‘మన కూరగాయలు’ చాలా కాస్ట్ గురూ..!
సాక్షి, హైదరాబాద్ : రాష్ట్ర ప్రభుత్వ వ్యవసాయ మార్కెటింగ్ శాఖ ప్రవేశపెట్టిన ‘మనకూరగాయలు’ రిటైల్ విక్రయ కేంద్రాల్లో ధరలు హాట్ హాట్‌గా ఉన్నాయని వినియోగదారులు వాపోతున్నారు. శుక్రవారం మోండా డివిజన్ మారేడుపల్లి నెహ్రూపార్కులో ‘మన కూరగాయల’ రిటైల్ విక్రయ కేంద్రాన్ని సినిమాటోగ్రఫీ శాఖా మంత్రి తలసాని శ్రీనివాస్‌యాదవ్, మల్కాజిగిరి ఎంపి మల్లారెడ్డి, కంటోన్మెంట్ ఎమ్మెల్యే సాయన్న ప్రారంభించారు. తాజా కూరగాయలు తక్కువ ధరలో విక్రయించాలనే సంకల్పంతో ‘మన కూరగాయల’ రిటైల్ కేంద్రాలను వ్యవసాయ శాఖ ఆధ్వర్యంలో హైదరాబాద్‌లో ఏర్పాటుచేశారు. జన సంచారం ఎక్కువ ఉండే ప్రాంతాల్లో కేంద్రాన్ని ఏర్పాటుచేసి సేల్స్మెన్ల ద్వారా విక్రయాలు జరుపుతున్నారు. మన కూరగాయల రిటైల్ విక్రయ కేంద్రాన్ని ప్రత్యేక క్యాబిన్లో ఏర్పాటు చేశారు. కూరగాయలు తాజాగా ఉండేందుకు ఏసీని సైతం ఏర్పాటు చేశారు. అన్నిరకాల కూరగాయలతో పాటు పండ్లను ఈ కేంద్రంలో అమ్మకానికి పెట్టారు. అయితే మన కూరగాయలు విక్రయ కేంద్రంలో ధరలు చూసి వినియోగదారులు కళ్లు తేలేస్తున్నారు. బయట మార్కెట్ ధరల కంటే సుమారు కిలోకు రూ.5 నుంచి 10 వరకు వ్యత్యాసం కనిపిస్తోంది. సూపర్ మార్కెట్ల కంటే అదనంగా రేట్లు ఉండడంపై వినియోగదారులు మండిపడుతున్నారు. బయటి మార్కెట్ కం టే సూపర్మార్కెట్లో కొంతమేర అధిక ధరలు ఉన్నప్పటికీ అదే స్థాయిలో మనకూరగాయలు విక్రయ కేంద్రంలో ధరలు ఉండడంతో వినియోగదారులు అయోమయానికి గురవుతున్నారు. నేరుగా రైతు పండించిన కూరగాయలను వినియోగదారులకు అందించాలనే సంకల్పంతో వ్యవసాయ మార్కె టింగ్ శాఖ ప్రయత్నాలు చేస్తున్నప్పటికీ ధరల్లో వ్యత్యాసం మూలంగా వినియోగదారుల నుంచి మిశ్రమ స్పందన లభిస్తోంది. దళారీ వ్యవస్థ నిర్మూలనకు మన కూరగాయలు తాజా కూరగాయలను అందించడంతో పాటు తక్కువ ధరలో నాణ్యమైన కూరగాయాలను అందించే లక్ష్యంగా ‘మన కూరగాయలు’ విక్రయ కేంద్రాలను ఏర్పాటుచేస్తున్నట్లు మంత్రి శ్రీనివాస్‌యాదవ్ అన్నారు. మన కూరగాయల రిటైల్ విక్రయ కేంద్రం ద్వారా దళారుల వ్యవస్థను పూర్తిగా రూపుమాపవచ్చునని, దీంతో వినియోగదారులకు తక్కువ ధరల్లోనే కూరగాయలు లభిస్తాయన్నారు. కంటోన్మెంట్ నియోజకవర్గంలో మరికొన్ని మనకూరగాయల కేంద్రాలను ఏర్పాటు చేస్తామని ఎమ్మెల్యే సాయన్న తెలి పారు. డిప్యూటీ డైరెక్టర్ పద్మహర్ష, మార్కెట్ యార్డు ఉపాధ్యక్షుడు శ్రీనివాస్, మోండా మార్కెట్ కార్పొరేటర్ రూప, నగేశ్ ఉన్నారు.