![Talasani Srinivas Yadav Compliments on KCR - Sakshi](/styles/webp/s3/article_images/2021/03/24/tala.jpg.webp?itok=1Zo8BRiD)
సాక్షి, హైదరాబాద్: గతంలో పశుసంవర్థక శాఖను బలవంతంగా అంటగట్టేవారంటూ మంత్రి తలసాని శ్రీనివాస్‌యాదవ్ అసెంబ్లీలో ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. పద్దులపై చర్చకు ఆయన సమాధానాలు ఇచ్చే సందర్భంగా మాట్లాడుతూ.. ‘నేను 25 ఏళ్లుగా ఎమ్మెల్యేగా, సుదీర్ఘకాలం మంత్రిగా పనిచేశాను. ఎవరికో ఒకరికి ఓ మంత్రిత్వ శాఖ ఇవ్వాలి కాబట్టి ఇచ్చేవారు. అందులో కనీసం నిధులు కూడా ఉండేవి కావు. కానీ కేసీఆర్ సీఎం అయ్యాక దాని రూపురేఖలే మారిపోయాయి. భారీగా నిధులు ఇస్తున్నారు. ఇప్పుడు అది ప్రధాన శాఖగా మారింది’ అని తలసాని పేర్కొన్నారు.
దేశానికి 1947లో స్వాతంత్య్రం వచ్చినా.. తెలంగాణ బడుగు బలహీన వర్గాలకు మాత్రం కేసీఆర్ సీఎం అయ్యాకే స్వాతంత్య్రం వచ్చినట్లని శ్రీనివాస్ యాదవ్ పేర్కొన్నారు. జీవాలకు ప్రత్యేకంగా అంబులెన్సులు ఏర్పాటు చేసిన ఘనత కేసీఆర్‌కే దక్కుతుందన్నారు. గతంలో ప్రభుత్వాలు విజయ డెయిరీని దివాలా తీయిస్తే ఇప్పుడు దాన్ని పటిష్టం చేసి ఆదాయాన్ని పెంచినట్లు చెప్పారు.
Comments
Please login to add a commentAdd a comment