Compliments
-
ముఖ స్తుతి
పొగడ్తకి పొంగిపోని వాళ్ళు ఉండరు అంటే అతిశయోక్తి కాదు. మనుషులే కాదు దేవతలు కూడా పొగిడితే ఉబ్బి తబ్బిబ్బై పోతారు. పొగడ్త వినగానే డోపమైన్ అనే హార్మోను విడుదల అవుతుంది. అందుకే దైవాన్ని ఇష్టదైవాన్ని అష్టోత్తరాలు, సహస్రనామాలతో కీర్తిస్తూ ఉంటారు. మానవులు, దేవతలు మాత్రమే కాదు. జంతువులు కూడా పొగిడితే సంతోషిస్తాయి. పెంపుడు జంతువులున్నవారికి ఇది అనుభవమే. పొగడ్తలు మనిషిని ప్రోత్సహించే వరకు ఉపయోగ పడతాయి. నిజంగా ప్రతిభ ఉన్నవారికి చిన్న మెప్పుదల ఉత్సాహాన్ని ఇస్తుంది. తాము చేస్తున్నది మంచిదే అయినా సాటివారి ఆమోదముద్ర తమ పని మీద నమ్మకాన్ని కలిగిస్తుంది. ఆత్మవిశ్వాసాన్ని పెంపొందిస్తుంది. పొగడ్తలో కొంచెం అయినా నిజం ఉంటుంది. ముఖస్తుతిలో అంటే ఎదురుగా పొగడటంలో నిజం ఉండే అవకాశం తక్కువ. మెరమెచ్చుల కోసం లేనిపోనివి అపాదించి చెప్పటం ముఖస్తుతి. ఆ సంగతి అంటున్నవారికి, వింటున్నవారికి తెలుసు. అయినా ఇష్టం లేనట్టు ముఖం పెట్టి వింటూనే ఉంటారు. లోలోపల సంతోషంగానే ఉంటుంది. ఎటువంటి వారికైనా తమని మెచ్చుకుంటూ ఉంటే బాగానే ఉంటుంది. ‘‘మీ లాగా పొగడ్తలు ఇష్టపడని వారు చాల గొప్పవాళ్ళు. అందుకే మీరంటే నాకు ఎంతో అభిమానం.’’ అంటే బోల్తాపడరా? చిన్నపిల్లల దగ్గర నుండి, దేవతల వరకు. ముఖస్తుతిని ఆశించి, ఆనందించే వారు సాధారణంగా నష్టపోతూ ఉంటారు. తనకి అపాదించబడిన గుణాలు తనలో ఉన్నాయేమో నని భ్రమ పడుతూ ఉంటారు. ఆ భ్రమ వల్ల దానిని నిజం చేయాలనే తాపత్రయంలో ఎదురుదెబ్బలు తింటూ ఉంటారు. దాని వల్ల కలిగే దుష్ఫలితాలు ఏవిధంగా ఉంటాయో గమనించ వచ్చు. ఉదాహరణకి: మన్మథుడు, శల్యుడు. ఇంద్రుడు మన్మథుణ్ణి పిలిపించి అతడి సామర్థ్యాన్ని పొగుడుతాడు. అతడు ఉబ్బి తబ్బిబ్బు అయిపోయి ‘‘నేను ఎంతటి వారినైనా ప్రలోభపెట్ట గలను – శివుడైనా సరే!’’ అంటాడు. ఇంద్రుడికి కావలసింది అదే! అంతే! ఇరుక్కుపోయాడు. శరీరాన్ని కోల్పోయాడు. శల్యుణ్ణి దుర్యోధనాదులు పొగిడి కర్ణుడి రథసారథిగా ఒప్పించారు. ససేమిరా, నేను సారథ్యం చేయట మేమిటి? అని భీష్మించుకున్న శల్యుడు తనని కృష్ణుడితో సమానమని పోల్చగానే ఆ పొగడ్తల మాయాజాలంలో పడి రథసారథ్యం చేశాడు. ములగచెట్టు ఎక్కించటం అని చమత్కారంగా అంటూ ఉంటారు. ఆ కొమ్మ పుటుక్కున విరిగిపోతుంది. ముఖస్తుతి చేసే వారు ఎదుట పొగిడినా, వెనుక విమర్శిస్తూ ఉంటారు. పైగా పొగడ్తలకి పడిపోయారని చులకనగా మాట్లాడుతారు. ఈ ఆయుధం కొన్ని మారులు ఉపయోగకరంగా కూడా ఉంటుంది. ‘‘నా బంగారుకొండ మంచివాడు. చక్కగా అన్నం తిని నిద్రపోతాడు.’’ అంటుంది తల్లి. వాడు అన్నం తినటానికి పేచీ పెడతాడని ఒక పట్టాన నిద్రపోడని ఆ తల్లికి తెలుసు. వినగా, వినగా ఆ లక్షణాలు కొడుకులో పెంపొందుతాయేమోననే ఆశతో ఆ విధంగా పొగుడుతుంది. ఒక రాజుకి ఒక కన్ను లేదు. తన చిత్రాన్ని అందంగా వేసిన వారికి బహుమతి ప్రకటించాడు. ఒక చిత్రకారుడికి ఆ బహుమతి దక్కింది. రాజు విల్లు ఎక్కుపెట్టి లక్ష్యం వైపు చూడటానికి ఒక కన్ను మూసినట్టు వేశాడు. పొగడటానికి అబద్ధాలు చెప్పనక్కర లేదు. సాధారణంగా ఏదైనా ప్రయోజనాన్ని ఆశించి లేని సద్గుణాలని అపాదించి ఇంద్రుడు, చంద్రుడు అని కీర్తించేదే ముఖస్తుతి. పిల్లికి బిచ్చం పెట్టని వాణ్ణి దానకర్ణుడని, పొట్ట పొడిస్తే అక్షరం ముక్క లేని వాణ్ణి బృహస్పతి అని పొగడటం ముఖస్తుతి కాక మరేమిటి? ముఖస్తుతికి అలవాటు పడిన వారు విమర్శను అంగీకరించ లేరు. ఆత్మవిమర్శ అసలే ఉండదు. తాము చేసింది సరైనదే అనే మొండిపట్టు ఉంటుంది. పొరపాట్లని సరిదిద్దుకునే లక్షణం ఉండదు కనుక నాశాన్ని కొని తెచ్చుకున్నట్టు అవుతుంది. మహత్కార్యాలు చేయటానికి ఈ పొగడ్త ప్రేరకం అవుతుంది. ఉదాహరణకి హనుమ. – డా.ఎన్.అనంత లక్ష్మి -
ఇంటింటికి వెళ్లి వైద్య పరీక్షలు చేస్తున్న వైదులు
-
అప్పుడు పొగిడిన మీడియానే... నన్నిప్పుడు తిడుతోంది: రాహుల్
ఝలావార్: తాను రాజకీయాల్లోకి వచ్చిన మొదట్లో 2004–08 కాలంలో పొగడ్తలతో ముంచెత్తిన మీడియా ఇప్పుడు తనపై వ్యక్తిగత విమర్శలకు దిగుతోందని రాహుల్ గాంధీ అన్నారు. ఈ మేరకు ఆయన ఆదివారం ఒక వీడియో విడుదల చేశారు. ‘‘భూ సేకరణకు సంబంధించిన అంశాలపై మాట్లాడినందుకే మీడియా ఒక్కసారిగా రూటు మార్చి నాపై దాడికి దిగింది. పేదలకు భూమి దక్కాలన్నందుకు నాపై భగ్గుమంది. మోదీ సర్కారు ప్రజల నుంచి భూములను లాగేసుకుంటోంది. నా ప్రతిష్టను దెబ్బ తీసేందుకు బీజేపీ నేతలు వందల కోట్ల రూపాయలు ఖర్చుపెట్టారు. అయితే నిజాన్నెవరూ అణచలేరు, దాచలేరు. బీజేపీ కుటిల ప్రయత్నాలు నాకు బలాన్నిచ్చాయి. మంచి పని చేసిన ప్రతిసారీ నాపై వ్యక్తిగత దాడులు పెరుగుతున్నాయి. అయినా నా మార్గాన్ని వదలలేదు. పోరాటాన్ని ఆపలేదు. ముందుకు సాగుతున్నా’’ అన్నారు. రాజస్తాన్‌లోకి జోడో యాత్ర మధ్యప్రదేశ్‌లో 12 రోజులు సాగిన రాహుల్ భారత్ జోడో యాత్ర ఆదివారం కాంగ్రెస్ పాలిత రాజస్తాన్‌లోకి ప్రవేశించింది. సరిహద్దుల్లోని ఝాలావాడ్ జిల్లాలో సీఎం అశోక్ గెహ్లోట్, ఆయన ప్రత్యర్థి సచిల్ పైలట్ ఇద్దరూ రాహుల్‌కు ఘన స్వాగతం పలికారు. రాష్ట్రంలో 17 రోజులు, 500 కిలోమీటర్ల దూరం యాత్ర కొనసాగనుంది. యాత్రతో ఎంతో నేర్చుకున్నానని ఈ సందర్భంగా ఆయనన్నారు. -
మహాత్ముని తర్వాత మోదీయే: రాజ్‌నాథ్
న్యూఢిల్లీ: మహాత్మాగాంధీ తర్వాత భారత సమాజం, ప్రజల అంతరంగం లోతుగా తెలిసిన ఏకైక నేత ప్రధాని మోదీయేనని రక్షణ మంత్రి రాజ్‌నాథ్ పొగడ్తల వర్షం కురిపించారు. సవాళ్లను ఆయన ఎలా అధిగమించారో చూస్తే సమాజంపై ఆయనకు ఎంతటి అవగాహన ఉందో తెలుస్తుందని చెప్పారు. ప్రభుత్వాధినేతగా నరేంద్రమోదీ రెండు దశాబ్దాల పాలన అంశంపై జరిగిన జాతీయ కాన్ఫరెన్స్‌లో ఆయన శుక్రవారం మాట్లాడారు. మేనేజ్మెంట్ కాలేజీల్లో విద్యార్థులకు ‘సమర్థ నాయకత్వం, సమర్థవ పాలన‘ అంశంపై రెండు దశాబ్దాల మోదీ రాజకీయ ప్రస్థానాన్ని పాఠ్యాంశంగా చేయాలన్నారు. 20 ఏళ్ల పాలనాకాలంలో ఆయనపై ఎటువంటి అవినీతి మరక పడలేదన్నారు. ప్రధాని మోదీని 24 క్యారెట్ల బంగారం అంటూ ఆకాశానికి ఎత్తేశారు. 100 ఏళ్ల క్రితం గాంధీజీ స్వదేశీ ఉద్యమాన్ని ప్రారంభించగా, ప్రస్తుతం ప్రధాని మోదీ స్వదేశీ 4.0కు కొత్త నిర్వచనం చెప్పారన్నారు. 2001–2014 సంవత్సరాల్లో మోదీ గుజరాత్ సీఎంగా, 2014 నుంచి దేశ ప్రధానిగా కొనసాగుతున్నారు. -
రిజర్వాయర్‌లోకి ధైర్యంగా దూకిన ఎస్సై.. శభాష్ సైదులు
సాక్షి, యాదాద్రి : అధికారిగా ఆదేశాలిచ్చేకంటే తానే పనిలోకి దిగితే ఆదర్శవంతమైన ఫలితం ఉంటుందన్న అతని నమ్మకం సత్ఫలితాలనిచ్చింది.బాలుర మృతదేహాలను బయటకు తీయడానికి తానే ధైర్యంగా రిజర్వాయర్‌లోకి దిగిన భువనగిరి రూరల్ ఎస్ఐ సైదులుపై అభినందనలు వెళ్లువెత్తుతున్నాయి.కరోనా కాలంలోనూ అభాగ్యుల ఆకలితీర్చాడు. ప్రెండ్లీ పోలీసింగ్‌తో ప్రజలకు సేవలందిస్తున్న భువనగిరి రూరల్ ఎస్ఐ కె.సైదులుపై ప్రత్యేక కథనం రిజర్వాయర్‌లోకి ధైర్యంగా దూకి భువనగిరి కిసాన్‌నగర్‌కు చెందిన పవన్‌కుమార్‌రెడ్డి(14), హనుమాన్‌వాడకు చెందిన హేమంత్(15)సోమవారం సాయంత్రం భువనగిరి మండలం బస్వాపురం శివారులోని నృసింహ రిజ ర్వాయర్‌ను చూడటానికి వెళ్లి నీటిలో మునిగి పోయారు. సమాచారం అందుకున్న ఎస్ఐ సైదులు అక్కడకు చేరుకున్నాడు. పిల్లల చెప్పులను చూసి రిజర్వాయర్‌లో మునిగిపోయారని ధ్రువీకరించుకున్నాడు.ఎన్డీఆర్ఎఫ్, గజ ఈత గాళ్ల కోసం సమాచారం ఇచ్చారు. వారు వచ్చేసరికి ఆలస్యమవుతుందని భావించి తానే రంగంలోకి దిగాడు. 15 ఫీట్ల లోతున్న నీటిలోకి దిగి మూడు గంటలు గాలించి బాలుర మృతదేహా లను బయటకు తీశారు.ఎస్ఐని బ స్వాపు రానికి చెందిన నాయకులు సత్కరించారు. మతిస్థిమితం లేని కోటీశ్వరుడి గుర్తింపు హైదరాబాద్‌లోని బల్కంపేటకు చెందిన శ్రీ కాంత్ కోటీశ్వరుడు. 15 రోజుల క్రితం రాయగిరికి వచ్చాడు. రోడ్ల పక్కన తిరుగుతుండటంతో ఎస్ఐ గమనించి చేరదీశాడు. వివరాలు తెలుసుకోగా అతడు కోటీశ్వరుడని తేలింది. అతన్ని కుటుంబ సభ్యుల చెంతకు చేర్చాడు. లాక్డౌన్లో.. కరోనా ఫస్ట్, సెకండ్ వేవ్‌లోనూ ఎస్ఐ సైదులు అనేక సేవలందించాడు. వందలాది మంది అభాగ్యులకు సొంత ఖర్చుతో భోజనం అందిజేసి ఆకలి తీర్చాడు. నేనే ముందుంటా.. అధికారిగా తాను ముందుండి పనిచేయ డం ద్వారా మిగతావా రు కలిసి వస్తారు. బ స్వాపూర్ రిజర్వాయర్‌లో అదే చేశాను.గ్రామీణ నేపధ్యం నుంచి వచ్చాను కాబట్టి నా కు ఈత వచ్చు. ఎన్డీఆర్ఎఫ్, గజ ఈతగాళ్లకోసం ప్రయత్నించాం. కానీ,ఆలస్యం అవుతుందని భావించి నేనే రిజర్వాయర్‌లోకి ది గాను.ఇద్దరు పిల్లల మృతదేహాలను బయటకు తీశాను. రాచకొండ సీపీ మహేష్ భగవత్ ఆధ్వర్యంలో కరోనా సమయంలో వందలాది మంది ఆకలి తీర్చాను. –కె.సైదులు, ఎస్ఐ, భువనగిరి రూరల్ -
‘ఆ శాఖను బలవంతంగా రుద్దేవారు’
సాక్షి, హైదరాబాద్: గతంలో పశుసంవర్థక శాఖను బలవంతంగా అంటగట్టేవారంటూ మంత్రి తలసాని శ్రీనివాస్‌యాదవ్ అసెంబ్లీలో ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. పద్దులపై చర్చకు ఆయన సమాధానాలు ఇచ్చే సందర్భంగా మాట్లాడుతూ.. ‘నేను 25 ఏళ్లుగా ఎమ్మెల్యేగా, సుదీర్ఘకాలం మంత్రిగా పనిచేశాను. ఎవరికో ఒకరికి ఓ మంత్రిత్వ శాఖ ఇవ్వాలి కాబట్టి ఇచ్చేవారు. అందులో కనీసం నిధులు కూడా ఉండేవి కావు. కానీ కేసీఆర్ సీఎం అయ్యాక దాని రూపురేఖలే మారిపోయాయి. భారీగా నిధులు ఇస్తున్నారు. ఇప్పుడు అది ప్రధాన శాఖగా మారింది’ అని తలసాని పేర్కొన్నారు. దేశానికి 1947లో స్వాతంత్య్రం వచ్చినా.. తెలంగాణ బడుగు బలహీన వర్గాలకు మాత్రం కేసీఆర్ సీఎం అయ్యాకే స్వాతంత్య్రం వచ్చినట్లని శ్రీనివాస్ యాదవ్ పేర్కొన్నారు. జీవాలకు ప్రత్యేకంగా అంబులెన్సులు ఏర్పాటు చేసిన ఘనత కేసీఆర్‌కే దక్కుతుందన్నారు. గతంలో ప్రభుత్వాలు విజయ డెయిరీని దివాలా తీయిస్తే ఇప్పుడు దాన్ని పటిష్టం చేసి ఆదాయాన్ని పెంచినట్లు చెప్పారు. -
భారత జట్టుకువైఎస్ జగన్ అభినందనలు
సాక్షి, హైదరాబాద్: చారిత్రక 500వ టెస్టు మ్యాచ్‌లో విజయం సాధించిన భారత జట్టును వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు జగన్మోహన్రెడ్డి అభినందించారు. న్యూజిలాండ్‌తో మిగిలిన టెస్టుల్లోనూ కోహ్లిసేన విజయం సాధించాలని ఆకాంక్షించారు. -
మౌర్యపై అఖిలేష్ ప్రశంసల జల్లు
లక్నో: ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి అఖిలేష్ యాదవ్ బీఎస్పీ నుంచి బయటికి వచ్చిన ఆపార్టీ ప్రతిపక్ష నేత స్వామిప్రసాద్ మౌర్యపై ప్రశంసల జల్లు కురిపించారు. ఆయన సరైన వ్యక్తి అని ఇన్నాళ్లూ తప్పుడు పార్టీలోఉన్నారని అన్నారు. కేబినెట్ భేటీ అనంతరం మీడియాతో మాట్లాడుతూ అఖిలేష్ ఈ వాఖ్యలు చేశారు. మౌర్య బలమైన నాయకుడని, ఆయనతో తనకు ముందు నుంచీ మంచి సంబంధాలున్నాయని అన్నారు. సీఎం వ్యాఖ్యల నేపథ్యంలో ఈ నెల 27 న జరుగునున్న మంత్రి వర్గ విస్తరణలో మౌర్య చేరనున్నాడనే ఊహాగానాలకు బలం చేకూరుస్తున్నాయి. 2017 లో జరుగనున్న అసెంబ్లీ ఎన్నికల్లో ఇప్పటినుంచే మాయావతి టికెట్లు అమ్ముకుంటున్నారని, మాయావతి అసలు దళితురాలే కాదని ఆరోపిస్తూ మౌర్య బీఎస్పీ కి రాజీనామా చేసిన విషయం తెలిసిందే. -
ఆ పొగడ్తలు విన్న తరువాత...
ఆ పొగడ్తలు విన్న తరువాత ఇక ఆ సీటు మీద ఆశలు వదులుకోవాల్సిందేనని ఒక నిర్ధారణకు వచ్చారట తెలుగు తమ్ముళ్లు. శాసనమండలి చైర్మన్‌గా కాంగ్రెస్ సీనియర్ నేత ఎ.చక్రపాణి వ్యవహరిస్తున్నారు. శాసనసభ, మండలి సమావేశాల చివరి రోజున సీఎం చంద్రబాబు నాయుడు మండలికి హాజరయ్యారు. ఈ సందర్భంగా సభ్యులు పలు అంశాలపై ప్రసంగించారు. అందులో టీడీపీ నేతలు తమ అధినేతను ఆకాశానికెత్తారు. ఇదే సమయంలో నాకు కూడా మాట్లాడేందుకు అవకాశం ఇవ్వండి అని కోరిన చక్రపాణి సీఎం చంద్రబాబును పొగడ్తలతో ముంచెత్తారు. మీ అంత పరిపాలనాదక్షుడు లేడు అని మొదలుపెట్టి తాను ఏమేరకు పొగడగలరో ఆ మేరకు పొగిడారు. దీంతో సీఎం సహా టీడీపీ నేతలందరూ బ్రహ్మాండంగా పొగిడారంటూ అభినందించారు. చక్రపాణి పదవీకాలం వచ్చే ఏడాది ముగియనుంది. ఆయన పదవీ కాలం ముగిసిన వెంటనే చైర్మన్ కుర్చీలో తమలో ఎవరో ఒకరు కూర్చోవచ్చని టీడీపీ ఎమ్మెల్సీలందరూ ఆరాటపడ్డారు. సీఎం వద్ద తమకు చేతనైన రీతిలో పైరవీలు కూడా ప్రారంభించారు. చక్రపాణి పొగడ్తలు విన్న తరువాత ఇక ఆ కుర్చీ మీద ఆశలు వదులు కోవాల్సిందేనని వారు నిర్ణయించుకున్నారు. తాము పార్టీలో ఉన్నాం కాబట్టి అధినేతను పొగడక తప్పదని, మా చైర్మన్ కరుడుకట్టిన కాంగ్రెస్ వాది అయినా పార్టీ సిద్ధాంతాలు వైగైరా పక్కన పెట్టి చంద్రబాబును పొగిడిన తీరు చూస్తుంటే ఆయన పదవీకాలం పొడిగింపు ఖాయమని తేలిపోయిందని ఓ టీడీపీ ఎమ్మెల్సీ వ్యాఖ్యానించారు. గత సభలో కూడా సభ్యుడిగా ఉన్న కృష్ణా జిల్లాకు చెందిన ఓ ఎమ్మెల్సీ మాత్రం చక్రపాణి గారు వైఎస్ రాజశేఖరరెడ్డి, కె.రోశయ్య, ఎన్.కిరణ్‌కుమార్‌రెడ్డి సీఎంగా ఉన్నపుడు ఏ రకంగానైతే పొగడ్తల వర్షం కురిపించారో, ఇపుడు కూడా అదే తీరుగా వ్యవహరించారు. ఆయన పదవి కాపాడుకోవటానికి పొగిడారు, వాటికి ఎవరైనా పడిపోతే మనం ఏమీ చేయలేం అని నిట్టూర్చారు. -
ఇలాంటి సీఎం ఉండటం ప్రజల అదృష్టం
కేసీఆర్‌ను పొగడ్తలతో ముంచెత్తిన టీడీపీ ఎంపీ మల్లారెడ్డి హైదరాబాద్: ‘‘తెలంగాణ రాష్ట్రానికి కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావు ముఖ్యమంత్రి కావడం ప్రజల అదృష్టం. ఈ రోజు తెలంగాణలో ఎక్కడ చూసినా పండుగ వాతావరణమే కనిపిస్తోంది. ఎన్నో ఏళ్లుగా పట్టాలకు నోచుకోకుండా ఉన్న పేదలకు ఇళ్ల పట్టాలు వస్తున్నాయంటే.. వారికి నిజమైన స్వాతంత్య్రం వచ్చినట్లు లెక్క... వాళ్లంతా ఇప్పుడు ఆనందంగా ఉన్నారు. ఇదంతా సీఎం కేసీఆర్ ఘనతే. సీఎంకు జోహార్లు...’’ అంటూ మల్కాజిగిరి ఎంపీ, టీడీపీ నేత మల్లారెడ్డి సీఎం కేసీఆర్‌ను పొగడ్తలతో ముంచెత్తారు. తెలంగాణ రాష్ట్ర అవతరణ ఉత్సవాల్లో భాగంగా శుక్రవారం హైదరాబాద్‌లోని మల్కాజిగిరిలో చేపట్టిన ఇళ్ల పట్టాల పంపిణీ కార్యక్రమంలో సీఎం కేసీఆర్ పాల్గొన్నారు. అర్హులైన పేదలకు ఇళ్లపట్టాలు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సభలో ఆ నియోజకవర్గం ఎంపీ మల్లారెడ్డి మాట్లాడుతూ.. ‘మనకు మంచి సీఎం దొరికారు. కష్టపడి పనిచేస్తున్నారు. కానీ, ఒక్క ముఖ్యమంత్రి తోనే అభివృద్ధి సాధ్యం కాదు. అందరం కష్ట పడితేనే తెలంగాణ ప్రపంచంలోనే నంబర్ వన్ రాష్ట్రం అవుతుంది’ అని పేర్కొన్నారు. ఇప్పటికే సీఎం తన నియోజకవర్గానికి 4 సార్లు వచ్చారని, రూ.330 కోట్లతో అభివృద్ధి పనులకు శ్రీకారం చుట్టారని... ఇదంతా మల్కాజిగిరి ప్రజల అదృష్టంగా భావిస్తున్నట్లు చెప్పారు. -
కేసీఆర్‌కు అభినందనల వెల్లువ
హైదరాబాద్: తెలంగాణ రాష్ట్రానికి తొలి ముఖ్యమంత్రి కాబోతున్న టీఆర్ఎస్ అధినేత కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావుకు వివిధ ఉపాధ్యాయ, ఉద్యోగ సంఘాల నేతలు, ఎమ్మెల్సీలు అభినందనలు తెలియజేశారు. పీఆర్టీయూ, టీఆర్టీయూ, తెలంగాణ గ్రూపు-1 అధికారుల సంఘాల నేతలు ఆదివారం కేసీఆర్‌ను కలిశారు. టీఆర్ఎస్ లెజిస్లేచర్ పార్టీ నేతగా ఎన్నికైన సందర్భంగా అభినందనలు తెలియ జేశారు. తెలంగాణ పునర్నిర్మాణంలో భాగంగా రాష్ట్రాన్ని విద్యా పరంగా అభివృద్ధిలోకి తీసుకెళ్లడానికి తమ వంతు కృషి చేస్తామని పీఆర్టీయూ నేతలు పేర్కొన్నారు. అలాగే హరీష్‌రావుకు అభినందనలు తెలియజేశారు. కేసీఆర్‌ను కలిసిన వారిలో గ్రూపు-1 అధికారుల సంఘం అధ్యక్షుడు ఎం.చంద్రశేఖర్‌గౌడ్, ప్రధాన కార్యదర్శి హనుమంత్ నాయక్, పీఆర్టీయూ రాష్ట్ర అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు పి.వెంకట్‌రెడ్డి, సరోత్తంరెడ్డి, ఎమ్మెల్సీలు పూల రవీందర్, మాజీ ఎమ్మెల్సీలు బి.మోహన్‌రెడ్డి, మధుసూదన్‌రెడ్డి తదితరులు ఉన్నారు.