లక్నో: ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి అఖిలేష్ యాదవ్ బీఎస్పీ నుంచి బయటికి వచ్చిన ఆపార్టీ ప్రతిపక్ష నేత స్వామిప్రసాద్ మౌర్యపై ప్రశంసల జల్లు కురిపించారు. ఆయన సరైన వ్యక్తి అని ఇన్నాళ్లూ తప్పుడు పార్టీలోఉన్నారని అన్నారు. కేబినెట్ భేటీ అనంతరం మీడియాతో మాట్లాడుతూ అఖిలేష్ ఈ వాఖ్యలు చేశారు. మౌర్య బలమైన నాయకుడని, ఆయనతో తనకు ముందు నుంచీ మంచి సంబంధాలున్నాయని అన్నారు.
సీఎం వ్యాఖ్యల నేపథ్యంలో ఈ నెల 27 న జరుగునున్న మంత్రి వర్గ విస్తరణలో మౌర్య చేరనున్నాడనే ఊహాగానాలకు బలం చేకూరుస్తున్నాయి. 2017 లో జరుగనున్న అసెంబ్లీ ఎన్నికల్లో ఇప్పటినుంచే మాయావతి టికెట్లు అమ్ముకుంటున్నారని, మాయావతి అసలు దళితురాలే కాదని ఆరోపిస్తూ మౌర్య బీఎస్పీ కి రాజీనామా చేసిన విషయం తెలిసిందే.
మౌర్యపై అఖిలేష్ ప్రశంసల జల్లు
Published Thu, Jun 23 2016 3:13 PM | Last Updated on Mon, Sep 4 2017 3:13 AM
Advertisement
Advertisement