
న్యూఢిల్లీ: మహాత్మాగాంధీ తర్వాత భారత సమాజం, ప్రజల అంతరంగం లోతుగా తెలిసిన ఏకైక నేత ప్రధాని మోదీయేనని రక్షణ మంత్రి రాజ్‌నాథ్ పొగడ్తల వర్షం కురిపించారు. సవాళ్లను ఆయన ఎలా అధిగమించారో చూస్తే సమాజంపై ఆయనకు ఎంతటి అవగాహన ఉందో తెలుస్తుందని చెప్పారు. ప్రభుత్వాధినేతగా నరేంద్రమోదీ రెండు దశాబ్దాల పాలన అంశంపై జరిగిన జాతీయ కాన్ఫరెన్స్‌లో ఆయన శుక్రవారం మాట్లాడారు.
మేనేజ్‌మెంట్ కాలేజీల్లో విద్యార్థులకు ‘సమర్థ నాయకత్వం, సమర్థవ పాలన‘ అంశంపై రెండు దశాబ్దాల మోదీ రాజకీయ ప్రస్థానాన్ని పాఠ్యాంశంగా చేయాలన్నారు. 20 ఏళ్ల పాలనాకాలంలో ఆయనపై ఎటువంటి అవినీతి మరక పడలేదన్నారు. ప్రధాని మోదీని 24 క్యారెట్ల బంగారం అంటూ ఆకాశానికి ఎత్తేశారు. 100 ఏళ్ల క్రితం గాంధీజీ స్వదేశీ ఉద్యమాన్ని ప్రారంభించగా, ప్రస్తుతం ప్రధాని మోదీ స్వదేశీ 4.0కు కొత్త నిర్వచనం చెప్పారన్నారు. 2001–2014 సంవత్సరాల్లో మోదీ గుజరాత్ సీఎంగా, 2014 నుంచి దేశ ప్రధానిగా కొనసాగుతున్నారు.
Comments
Please login to add a commentAdd a comment