Defense
-
రక్షణ, భద్రతలపై ఫలవంతమైన చర్చలు
వాషింగ్టన్: అమెరికా జాతీయ భద్రతా సలహాదారు మైఖేల్ వాల్జ్(Michael Waltz)తో ప్రధాని మోదీ(Narendra Modi) గురువారం భేటీ అయ్యారు. రక్షణ, సాంకేతికత, భద్రత వంటి అంశాలపై వారు చర్చించారు. మైఖేల్ వాల్ట్జ్తో ఫలవంతమైన చర్చ జరిగిందని ‘ఎక్స్’లో మోదీ పేర్కొన్నారు. భారత్‌కు ఆయన గొప్ప స్నేహితుడు అని కొనియాడారు. భారత్– అమెరికా సంబంధాల్లో రక్షణ, సాంకేతికత, భద్రత.. అత్యంత ముఖ్యమైన కోణాలని, వీటిపై తమ మధ్య ఫలప్రదమైన చర్చ జరిగిందని మోదీ తెలిపారు. ఆర్టిఫిషియల్ ఇంటలిజెన్స్(Artificial Intelligence), సెమీకండక్టర్స్, అంతరిక్ష రంగంలో పరస్పర సహకారానికి ఎన్నో అవకాశాలున్నాయని పేర్కొన్నారు. ఈ భేటీలో భారత విదేశాంగ మంత్రి ఎస్.జైశంకర్, జాతీయ భద్రతా సలహాదారు అజిత్ దోవల్ సైతం పాల్గొన్నారు. ఫ్రాన్స్ పర్యటన ముగించుకున్న మోదీ స్థానిక కాలమానం ప్రకారం బుధవారం సాయంత్రం 5.30 గంటలకు అమెరికా రాజధాని వాషింగ్టన్ డి.సి.కి చేరుకున్నారు. ప్రవాస భారతీయులు ఆయనకు ఘన స్వాగతం పలికారు. భారత్ మాతాకీ జై, వందేమాతరం, మోదీ మోదీ అంటూ నినదించారు. చలి వణికిస్తున్నా, వర్షం పడుతున్నా లెక్కచేయకుండా మోదీకి స్వాగతం పలకడానికి తరలివచ్చారు. నగరం నడిబొడ్డున ఉన్న చరిత్రాత్మక బ్లెయిర్ హౌస్‌లో మోదీ బస చేశారు. రాజధానిలో అడుగుపెట్టిన తర్వాత మోదీ ‘ఎక్స్’లో పోస్టు చేశారు. భారత్–అమెరికా మధ్య సమగ్ర అంతర్జాతీయ వ్యూహాత్మక భాగస్వామ్యాన్ని బలోపేతం చేసుకోవడానికి అధ్యక్షుడు ట్రంప్‌తో సమావేశం కోసం ఆసక్తి ఎదురు చూస్తున్నానని పేర్కొన్నారు. భారత్, అమెరికా ప్రయోజనాలు కాపాడడంతోపాటు మన భూగోళానికి మంచి జరిగేలా పని చేస్తామన్నారు.భారత్–అమెరికా బంధానికి మద్దతుదారు తులసి డొనాల్డ్ ట్రంప్ ప్రభుత్వంలో ‘డైరెక్టర్ ఆఫ్ నేషనల్ ఇంటెలిజెన్స్’గా నియమితులైన హిందూ–అమెరికన్ తులసి గబార్డ్‌తో మోదీ సమావేశమయ్యారు. బ్లెయిర్ హౌస్‌లో ఈ భేటీ జరిగింది. భారత్–అమెరికా సంబంధాలపై వారు చర్చించారు. ఉగ్రవాద వ్యతిరేక పోరాటం, సైబర్ సెక్యూరిటీలో ఇంటెలిజెన్స్ సహకారం మరింత పెంపొందించుకోవాలని నిర్ణయించుకున్నారు. రెండు దేశాల మధ్య స్నేహం మరింత బలపడాలని తులసి గబార్డ్ కోరుకుంటున్నారని మోదీ చెప్పారు. భారత్–అమెరికా బంధానికి ఆమె గట్టి మద్దతుదారు అని పేర్కొన్నారు. ‘డైరెక్టర్ ఆఫ్ నేషనల్ ఇంటెలిజెన్స్’గా అత్యున్నత పదవి చేపట్టినందుకు తులసి గబార్డ్‌కు అభినందనలు తెలియజేశారు. ఈ మేరకు మోదీ ‘ఎక్స్’లో పోస్టుచేశారు. ప్రధాని మోదీ రెండు రోజులపాటు అమెరికాలో పర్యటిస్తారు. భారత కాలమానం ప్రకారం గురువారం అర్ధరాత్రి తర్వాత అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌తో ఆయన సమావేశమవుతారు. ద్వైపాక్షిక చర్చలు జరుపుతారు. ట్రంప్ ‘అమెరికా ఫస్టు’ అనే విధానంతో ముందుకెళ్తూ అక్రమ వలసలపై కఠినంగా వ్యవహరిస్తున్న నేపథ్యంలో ఈ భేటీపై ఆసక్తి నెలకొంది. ప్రధానంగా భారతీయ అక్రమ వలసదార్లపై కరుణ చూపేలా తన మిత్రుడైన ట్రంప్‌ను మోదీ ఒప్పిస్తారా? అనే చర్చ సాగుతోంది. భారత ఉత్పత్తులపై టారిఫ్‌లు పెంచక తప్పదని ట్రంప్ ఇప్పటికే సంకేతాలిచ్చారు. టారిఫ్‌ల మోత మోగించకుండా ఉపశమనం లభించేలా చూడడం ఇప్పుడు మోదీ ముందున్న కర్తవ్యం అని నిపుణులు చెబుతున్నారు.త్వరలో అమెరికా నుంచి మరో 487 మంది వలసదారులున్యూఢిల్లీ: మరో 487 మంది అక్రమ వలస దారులను అమెరికా ప్రభుత్వం వెనక్కి పంపించనుందని కేంద్రం శుక్రవారం వెల్లడించింది. ట్రంప్ ప్రభు త్వం చేపట్టిన వలసదారుల ఏరివేతలో భాగంగా మొదటి విడతగా ఈ నెల 5న 104 మంది అక్రమ వలసదారులతో కూడిన అమెరికా వైమానిక దళ ప్రత్యేక విమానం అమృతసర్‌కు రావడం తెలిసిందే. భారతీ యులుగా భావిస్తున్న మరో 487 మందిని గుర్తించిన అమెరికా అధికారులు వెనక్కి పంపేందుకు ఏర్పాట్లు చేస్తున్నారని విదేశాంగ శాఖ కార్యదర్శి విక్రమ్ మిస్రీ తెలిపారు. మరికొంతమందికి సంబంధించిన సమాచారం అమెరికా అధికారులు వెల్లడించనందున అక్రమ వలసదారుల సంఖ్య మరింత పెరిగే అవకాశా లున్నాయని ఆయన పేర్కొన్నారు. అమెరికా అధికారులు పంపించిన 487 మంది వలసదారుల పేర్లు, ఇతర వివరాల జాబితాను పరిశీలిస్తున్నామని చెప్పారు. మొదటి విడతలో పంపించిన 104 మందిలో పంజాబ్, హరియాణాలకు చెందిన వారు అత్యధికులుండటం తెలిసిందే. తమను వెనక్కి పంపే సమయంలో అమె రికా అధికారులు విమానంలో సుదీర్ఘ ప్రయాణ సమయంలో నేరస్తుల మాదిరిగా చేతులు, కాళ్లకు బేడీలు వేసి ఉంచారని ఆందోళన వ్యక్తం చేశారు. దీనిపై అమెరికా అమెరికాకు ఆందోళన తెలుపుతామన్నారు. -
పీట్ హెగ్సెత్కు మహిళలంటే గౌరవం లేదు
వాషింగ్టన్: అమెరికా అధ్యక్షుడిగా ఎన్నికైన డొనాల్డ్ ట్రంప్ తన సొంత టీమ్‌ను ఏర్పాటు చేసుకొనే పనిలో నిమగ్నమయ్యారు. కీలక శాఖలకు మంత్రులుగా ఇప్పటికే పలువురి పేర్లు ప్రకటించారు. అధ్యక్షుడిగా ట్రంప్ పదవీ బాధ్యతలు స్వీకరించిన తర్వాత వీరంతా మంత్రులుగా మారబోతున్నారు. కానీ, ట్రంప్ ఎంపికల పట్ల విమర్శలు వస్తున్నాయి. అవినీతి ఆరోపణలు ఎదుర్కొంటున్నవారిని, లైంగిక వేధింపుల కేసుల్లో ఇరుక్కున్నవారిని ట్రంప్ మంత్రులుగా ఎంపిక చేశారంటూ అసంతృప్త స్వరాలు గట్టిగానే వినిపిస్తున్నా యి. ఆయన వినిపించుకుంటున్న దాఖలాలు కనిపించడం లేదు. అమెరికా రక్షణ శాఖ మంత్రిగా ఎంపికైన పెటీ హెగ్సెత్(44)పై ఆయన సొంత తల్లి పెనెలోప్ హెగ్సెత్ ఆరోపణలు చేయడం సంచలనాత్మకంగా మారింది. తన కుమారుడికి మహిళలంటే ఏమాత్రం గౌరవం లేదని, చులకనగా చూస్తాడని ఆమె తప్పుపట్టారు. చాలాఏళ్లు మహిళలతో అతడు అభ్యంతకరంగా ప్రవర్తించాడని ఆక్షేపించారు. తన బిడ్డ ప్రవర్తన సరైంది కాదని పేర్కొన్నారు. ఈ మేరకు 2018లో తన కుమారుడికి పెనెలోప్ పంపించిన ఈ–మెయిల్‌ను న్యూయార్క్ టైమ్స్ పత్రిక బహిర్గతం చేసింది. ‘‘నువ్వు(పీట్ హెత్సెత్) మహిళలతో అనుచితంగా ప్రవర్తిస్తుంటారు. వారిని చాలా చులకనగా చూడడం నీకు అలవాటు. ఆడవాళ్ల గురించి నోటికొచ్చినట్లు అబద్ధాలు చెప్తుంటావు. తప్పుడు ప్రచారం చేయడం నీకు ఇష్టం. అందుకే నిన్ను నేను ఎప్పటికీ గౌరవించలేను. ఒక తల్లిగా నీ ప్రవర్తన పట్ల మౌనంగా ఉండాలని ప్రయత్నించా. కానీ, నీ భార్యను ఘోరంగా వేధించావు. ఆమె చాలా మంచి అమ్మాయి. ఆమె అనుభవించిన బాధ ను తెలుసుకొని సహించలేకపోయాను. నీ ప్ర వర్తన పట్ల మేమంతా విసుగెత్తిపోయాం’’అని ఈ–మెయిల్లో పెనెలోప్ తన ఆవేదన వ్యక్తం చేశారు. హెగ్సెత్ రక్షణ శాఖ మంత్రిగా ఎంపిక కావడంతో ప్రస్తుతం ఈ అంశం అమెరికాలో తీవ్ర చర్చనీయాంశంగా మారింది. ఈ నేపథ్యంలో పెనెలోప్ స్పందించారు. కోపం, ఆవేశంతో అప్పట్లో తన కుమారుడిపై ఆగ్ర హం వ్యక్తం చేస్తూ ఈ–మెయిల్ పంపించానని, ఆ తర్వాత అతడికి క్షమాపణ చెప్పానని వెల్లడించారు. ఇదిలా ఉండగా, పీట్ హెగ్సెత్కు వివాహేతర సంభంధాలు ఉన్నట్లు తెలుస్తోంది. ఇలాంటి సంబంధంతో ఓ బిడ్డకు కూడా జన్మనిచ్చినట్లు సమాచారం. -
రక్షణ శాఖ కార్యదర్శిగా రాజేశ్ కుమార్ సింగ్
సాక్షి, న్యూఢిల్లీ: రక్షణ కార్యదర్శిగా నియమితులైన రాజేశ్ కుమార్ సింగ్ ఢిల్లీ సౌత్ బ్లాకులో శుక్రవారం పదవీ బాధ్యతలను స్వీకరించారు. కేరళ కేడర్ 1989 బ్యాచ్‌కు చెందిన ఐఏఎస్ అధికారి అయిన ఆర్కే సింగ్ ఈ ఏడాది ఆగస్టు 20న రక్షణశాఖలో ఆఫీసర్ ఆన్ స్పెషల్ డ్యూటీ (రక్షణ కార్యదర్శి పదవిలో)గా బాధ్యతలు చేపట్టారు. కాగా శుక్రవారం బాధ్యతలు స్వీకరించే కంటే ముందు ఆర్కే సింగ్ నేషనల్ వార్ మెమోరియల్‌కు వెళ్లి, అమరులైన జవానులకు నివాళులు సమర్పించారు. ‘మాతృభూమికి సేవ చేయడంలో అత్యున్నత త్యాగానికి వెనుదీయని మన శూర జవానులకు ఈ దేశ ప్రజలు ఎప్పటికీ రుణపడి ఉంటారు. అమర జవానుల అసాధారణ ధైర్య సాహసాలు, వారి త్యాగాలు భారత్‌ను ఒక సురక్షిత, సమృద్ధ దేశంగా తీర్చిదిద్దడానికి మనకందరికీ శక్తిని, ప్రేరణను అందిస్తూనే ఉంటాయి’అని రాజేశ్ కుమార్ సింగ్ అన్నారు. అంతకు ముందు, ఆయన 2023 ఏప్రిల్ 24 నుంచి 2024 ఆగస్టు 20 మధ్య కాలంలో వాణిజ్య, పరిశ్రమ శాఖలోని అంతర్గత వాణిజ్యం–పరిశ్రమల ప్రోత్సాహక విభాగం కార్యదర్శిగా సేవలు అందించారు. కాగా రక్షణ కార్యదర్శిగా గురువారం పదవీ విరమణ చేసిన ఆంధ్రప్రదేశ్ కేడర్‌కు చెందిన 1988 బ్యాచ్ ఐఏఎస్ అధికారి గిరిధర్ అరమానే స్థానంలో ఆ పదవిని ఆర్కే సింగ్ చేపట్టారు. -
రక్షణ రంగంలో కొత్త అధ్యాయం
వడోడర: భారత ప్రైవేట్ రక్షణ విమానయాన రంగంలో కొత్త అధ్యాయం ఆరంభమైంది. భారత్‌లోనే తొలి ప్రైవేట్ సైనిక, సరకు రవాణా విమానం తయారీ పనులు ప్రారంభమయ్యాయి. ఇందుకు గుజరాత్‌లోని వడోదర పట్టణంలోని టాటా ఎయిర్‌క్రాఫ్ట్ కాంప్లెక్స్ వేదికైంది. స్పెయిన్ అధ్యక్షుడు పెడ్రో సాంచెజ్‌తో కలిసి భారత ప్రధాని మోదీ సోమవారం ఈ ప్లాంట్‌లో సీ295 రకం సైనిక రవాణా విమాన తయారీని ప్రారంభించారు. అక్కడి విడిభాగాల ఎగ్జిబిషన్‌ను ఇరునేతలు ఆసక్తిగా తిలకించారు. ఈ సందర్భంగా మోదీ మాట్లాడారు. ‘‘ భారత్, స్పెయిన్ భాగస్వామ్యం కొత్త మలుపులు తీసుకుంటోంది. ఇది రెండు దేశాల మధ్య సంబంధాలు పటిష్టంచేయడమే కాకుండా మేకిన్ ఇండియా, మేక్ ఫర్ వరల్డ్ లక్ష్యాన్ని సాకారం చేస్తుంది. కొత్త ఫ్యాక్టరీని అందుబాటులోకి తెచి్చన ఎయిర్‌బస్, టాటా బృందాలకు నా హృదయపూర్వక శుభాకాంక్షలు. భారత్‌లో విదేశీ సరకు రవాణా విమానం తయారీ కలను సాకారం చేసిన వ్యాపార జగజ్జేత రతన్ టాటాకు ఘన నివాళులు’’ అని అన్నారు. కొత్త పని సంస్కృతికి నిదర్శనం ‘‘ నూతన భారత దేశ కొత్తతరహా పని సంస్కృతికి సీ295 ఫ్యాక్టరీ ప్రతిబింబింగా నిలవనుంది. 2022 అక్టోబర్‌లో ప్రాజెక్టుకు శంకుస్థాపన చేసిన నాటినుంచి ఉత్పత్తిదాకా భారత వేగవంతమైన ఉత్పాదకతకు నిదర్శనం ఈ కర్మాగారం’’ అని మోదీ అన్నారు. ఈ సందర్భంగా ప్రఖ్యాత స్పానిష్ రచయిత ఆంటోనియో మకాడో కవితలోని ‘మనం లక్ష్యం సాధించేందుకు ముందుకెళ్తుంటే మార్గం దానంతట అదే ఏర్పడుతుంది’ అనే వాక్యాన్ని మోదీ గుర్తుచేశారు. ‘‘కొత్తగా మొదలైన టాటా–ఎయిర్‌బస్ ఫ్యాక్టరీ ద్వారా వేలాది మందికి ఉద్యోగాలు లభిస్తాయి. దేశీయంగా 18,000 విమాన విడిభాగాల తయారీని ఈ ఫ్యాక్టరీ సుసాధ్యం చేయనుంది. భవిష్యత్తులో భారత పౌరవిమానయాన రంగానికి అవసరమైన విమానాల తయారీకి ఈ ఫ్యాక్టరీ బాటలువేస్తోంది’’ అని మోదీ అన్నారు.స్పెయిన్‌లో యోగా, ఇండియాలో ఫుట్‌బాల్ ‘‘ఇరుదేశాల ప్రజల మధ్య బంధమే దేశాల మధ్య బంధాన్ని బలీయం చేస్తోంది. యోగా స్పెయిన్‌లో తెగ పాపులర్. ఇక స్పానిష్ ఫుట్‌బాల్‌ను భారతీయులూ బాగా ఇష్టపడతారు. ఆదివారం రియల్ మాడ్రిడ్‌తో మ్యాచ్ లో బార్సిలోనా బృందం సాధించిన ఘనవిజయం గురించి భారత్‌లోనూ తెగ చర్చ జరుగుతోంది. ఆహారం, సినిమా లు, ఫుట్‌బాల్.. ఇలా ప్రజల మధ్య బంధం దేశాల మధ్య పటిష్ట బంధానికి కారణం. 2026 ఏడాదిని ‘ఇండియా–స్పెయిన్ ఇయర్ ఆఫ్ కల్చర్, టూరిజం, ఏఐ’గా జరుపుకోవాలని నిర్ణయించుకోవడం సంతోషకరం’’ అని మోదీ అన్నారు.బంధం బలీయం: స్పెయిన్ అధ్యక్షుడు ‘‘1960లలోనే ప్రఖ్యాత స్పెయిన్ క్లాసిక్, జాజ్ సంగీత కళాకారుడు పాకో డిలూసియా, భారతీయ సంగీత దిగ్గజం పండిత్ రవిశంకర్ రెండు దేశాల సంగీత ప్రియులను ఒక్కటి చేశారు. పారిశ్రామిక అభివృద్ధి, స్నేహబంధాలకు ఈ ఫ్యాక్టరీ గుర్తుగా నిలుస్తుంది’ అని స్పెయిన్ అధ్యక్షుడు పెడ్రో సాంచెజ్ అన్నారు.40 విమానాల తయారీ ఇక్కడే ఎయిర్‌బస్ సీ295 రకం మధ్యశ్రేణి రవాణా విమానాన్ని తొలుత స్పెయిన్‌కు చెందిన సీఏఎస్ఏ ఏరోస్పేస్ సంస్థ డిజైన్చేసి తయారుచేసేది. ప్రస్తుతం ఇది యూరప్ బహుళజాతి ఎయిర్‌బస్ సంస్థలో భాగంగా ఉంది. యుద్ధంలో బాంబులతోపాటు అవసరమైన సందర్భాల్లో వైద్య పరికరాలు, విపత్తుల వేళ బాధితుల తరలింపునకు, తీరప్రాంతాల్లో గస్తీ, నిఘా కోసం సైతం పలురకాలుగా వినియోగించుకోవచ్చు. ఎయిర్‌బస్ సంస్థతో భారత ప్రభుత్వం కుదుర్చుకున్న ఒప్పందం ప్రకారం మొత్తంగా సీ295 రకం 56 విమానాలను సైన్యానికి అప్పగించనున్నారు. వీటిలో 16 విమానాలను స్పెయిన్‌లోని సవీలేలో తయారుచేసి ఎయిర్‌బస్ నేరుగా నాలుగేళ్లలోపు భారత్‌కు పంపనుంది. మిగిలిన 40 విమానాలను టాటా అడ్వాన్స్డ్ సిస్టమ్స్ వారి ఆధ్వర్యంలో వడోదరలోని తయారీయూనిట్లో తయారుచేస్తారు. -
పాక్ మనతో స్నేహంగా ఉంటే..
పొరుగుదేశం పాకిస్తాన్ ఆర్థిక ఇబ్బందులపై రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. పాక్ మనతో స్నేహ సంబంధాలు కొనసాగిస్తే అది ఐఎంఎఫ్‌ను కోరుతున్న సాయానికి మించిన బెయిలౌట్ ప్యాకేజీ ఇచ్చి ఉండేవాళ్లమని పేర్కొన్నారు. కశీ్మర్లోని బందిపొర జిల్లా గురెజ్‌లో ఆదివారం జరిగిన ఎన్నికల ర్యాలీలో ఆయన మాట్లాడారు. ‘జమ్మూకశీ్మర్ ఆర్థికాభివృద్ధి కోసం ప్రధాని నరేంద్ర మోదీ 2014–15లో ప్రకటించిన ప్యాకేజీ ఇప్పుడు రూ.90 వేల కోట్లకు చేరింది. ఇది ఐఎంఎఫ్‌ను పాక్ కోరుతున్న బెయిలౌట్ ప్యాకేజీ కంటే ఎంతో ఎక్కువ’’ అన్నారు. ‘‘పాక్ మిత్రులారా! ఇరుగుపొరుగు దేశాలైన మన మధ్య విభేదాలెందుకు? మన మధ్య సత్సంబంధాలుంటే మీకు ఐఎంఎఫ్ కంటే ఎక్కువే ఇచ్చి ఉండే వాళ్లం’’ అని మంత్రి రాజ్‌నాథ్ వ్యాఖ్యానించారు. ‘‘అంతర్జాతీయ సంస్థలు, ఇతర దేశాల నుంచి తెచ్చుకున్న అప్పులను పాక్ దురి్వనియోగం చేస్తోంది. ఉగ్రవాద ఫ్యాక్టరీని నడపటానికి వాడుతోంది. వారిని మనపైకి పంపుతోంది. అందుకే అంతర్జాతీయ వేదికలపై పాక్ ఒంటరైంది. మిత్ర దేశాలు సైతం దాన్ని దూరంగా పెట్టాయి’’ అని విమర్శించారు. – శ్రీనగర్ -
కిషిదా వారసుడిగా ఇషిబా
టోక్యో: జపాన్ నూతన ప్రధానమంత్రిగా షిగెరు ఇషిబా(67) బాధ్యతలు చేపట్టబోతున్నారు. ఫుమియో కిషిదా వారసుడిగా ఆయన ఎన్నికయ్యారు. రక్షణ శాఖ మాజీ మంత్రి అయిన ఇషిబాను జపాన్ అధికార లిబరల్ డెమొక్రటిక్ పార్టీ(ఎల్డీపీ) శుక్రవారం తమ అధ్యక్షుడిగా ఎన్నుకుంది. ప్రస్తుత ప్రధాని ఫుమియో కిషిదాపై అవినీతి ఆరోపణలు వెల్లువెత్తడంతో పార్టీ అధ్యక్ష బాధ్యతల నుంచి తప్పుకోవాల్సి వచి్చంది. పార్లమెంట్లో మెజార్టీ ఉన్న పార్టీ అధ్యక్షుడే ప్రధానమంత్రి కావడం ఆనవాయితీ. కిషిదా తప్పుకోవడంతో నూతన అధ్యక్షుడి ఎంపిక కోసం ఓటింగ్ నిర్వహించారు. ఎల్డీపీ పార్లమెంట్ సభ్యులతోపాటు దాదాపు 10 లక్షల మంది పార్టీ ప్రతినిధులు ఓటింగ్‌లో పాల్గొన్నారు. ప్రధానమంత్రి పదవి కోసం ఇద్దరు మహిళలు సహా మొత్తం 9 మంది ఎంపీలు పోటీపడ్డారు. ఇషిబాతోపాటు ఎకనామిక్ సెక్యూరిటీ మంత్రి సనాయే తకైచి చివరి వరకు బరిలో కొనసాగారు. కానీ, ఇషిబాను విజయం వరించింది. ఒకవేళ తకైచి గెలిచి ఉంటే జపాన్ మొట్టమొదటి మహిళా ప్రధానమంత్రిగా రికార్డు సృష్టించి ఉండేవారు. ఎంపీల ఓట్లు 368, స్థానిక ప్రభుత్వాల్లోని ఓట్లు 47 ఉన్నాయి. ఇషిబాకు అనుకూలంగా 215 ఓట్లు, తకైచి అనుకూలంగా 194 ఓట్లు వచ్చాయి. కొందరు ఎంపీలు ఓటింగ్‌కు గైర్హాజరయ్యారు. జపాన్ ప్రధాని కిషిదా, ఆయన కేబినెట్ మంత్రులు అక్టోబర్ 1న రాజీనామా చేయబోతున్నారు. అదే రోజు పార్లమెంటరీ ఓటింగ్‌లో ఇషిబాను ప్రధానిగా లాంఛనంగా ఎన్నుకుంటారు. తర్వాత అదే రోజు ప్రధానమంత్రిగా ఆయన బాధ్యతలు స్వీకరిస్తారు. నూతన మంత్రివర్గాన్ని ఏర్పాటు చేస్తారు. జపాన్ను సురక్షితమైన దేశంగా మారుస్తా: ఇషిబా ప్రజల పట్ల తనకు ఎనలేని విశ్వాసం ఉందని ఇషిబా చెప్పారు. ధైర్యం, నిజాయతీతో ఎల్లప్పుడూ నిజాలే మాట్లాడుతానని అన్నారు. ఎల్డీపీ అధ్యక్షుడిగా ఎన్నికైన అనంతరం ఇషిబా శుక్రవారం టోక్యోలో మీడియాతో మాట్లాడారు. జపాన్ను సురక్షితమైన, సౌభాగ్యవంతమైన దేశంగా తీర్చిదిద్దడానికి శక్తివంచన లేకుండా కృషి చేస్తానని ప్రకటించారు. ద్రవ్యోల్బణం, అధిక ధరల నుంచి ప్రజలకు విముక్తి కలి్పంచడమే తన లక్ష్యమని పేర్కొన్నారు. ప్రజల జీవన ప్రమాణాలు పెంచుతానని తెలిపారు. పునరుత్పాదక ఇంధన వనరులకు పెద్దపీట వేస్తానని వెల్లడించారు. అణు ఇంధనంపై ఆధారపడడాన్ని తగ్గించుకోవాల్సిన అవసరం ఉందన్నారు. ఆసియా ఖండంలో ‘నాటో’ తరహా కూటమి ఏర్పాటు కావాలని ఇషిబా ఆకాంక్షించారు. జపాన్‌లో పెళ్లయిన మహిళలకు ఏదో ఒక ఇంటిపేరు ఉండాలి. పుట్టింటివారు లేదా అత్తింటివారి ఇంటి పేరుతో కొనసాగవచ్చు. కానీ, రెండు ఇంటి పేర్లతో కొనసాగేలా చట్టం తీసుకురావాలని ఇషిబా నిర్ణయించినట్లు తెలుస్తోంది. ఇలాంటి చట్టం కావాలని ఆయన ఎప్పటినుంచో డిమాండ్ చేస్తున్నారు. అంతేకాదు స్వలింగ వివాహాల పట్ల సానుకూల వ్యక్తం చేస్తున్నారు. ఎవరీ ఇషిబా? షిగెరు ఇషిబా న్యాయ విద్య అభ్యసించారు. బ్యాంకింగ్ రంగంలో సేవలందించారు. తర్వాత రాజకీయాల్లో అడుగుపెట్టారు. 1986లో 29 ఏళ్ల వయసులో ఎల్డీపీ టికెట్‌పై తొలిసారిగా పార్లమెంట్ సభ్యుడిగా ఎన్నికయ్యారు. 38 ఏళ్ల రాజకీయ జీవితంలో ఎన్నో కీలక పదవులు చేపట్టారు. ఎల్డీపీ సెక్రెటరీ జనరల్‌గా వ్యవహరించారు. వ్యవసాయం, రక్షణ శాఖల మంత్రిగా పనిచేశారు. ప్రధానమంత్రి పదవిపై ఎప్పుటినుంచో కన్నేశారు. గతంలో నాలుగుసార్లు గట్టిగా ప్రయతి్నంచి భంగపడ్డారు. ఎట్టకేలకు ఐదో ప్రయత్నంలో విజయం సాధించారు. ఇషిబా తండ్రి సైతం రాజకీయ నాయకుడే. ఆయన కేబినెట్ మంత్రిగా పనిచేశారు. కిషిదాకు, ఇషిబాకు మధ్య భేదాభిప్రాయాలు ఉన్నాయి. ఎల్డీపీలో ఇషిబాకు తగిన ప్రాధాన్యం ఇవ్వకుండా ఉద్దేశపూర్వకంగా పక్కనపెట్టారన్న విమర్శలున్నాయి. ఎల్డీపీలో ఇషిబా పలు సందర్భాల్లో అసమ్మతి గళం వినిపించారు. -
హేమంత్ అవినీతి సీఎం: రాజ్‌నాథ్
ఇట్ఖోరి (జార్ఖండ్): జార్ఖండ్ ముఖ్యమంత్రి హేమంత్ సోరెన్‌ను అత్యంత అవినీతిపరుడైన సీఎంగా రక్షణమంత్రి రాజ్‌నాథ్ సింగ్ అభివర్ణించారు. ఉన్నతమైన ప్రజాస్వామ్య సంప్రదాయాలతో ఆడుకున్నారని విమర్శించారు. సోరెన్‌ను గద్దెదింపే సమయం ఆసన్నమైందని పేర్కొన్నారు. జార్ఖండ్‌లో ఈ ఏడాది చివర్లో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. బీజేపీ చేపట్టిన పరివర్తన్ యాత్రను ఇట్ఖోరిలో శనివారం రాజ్‌నాథ్ ప్రారంభించారు. హేమంత్ సోరెన్ అవినీతికి పాల్పడ్డాడని ఆరోపించారు. అవినీతి మరకలున్న వారిని భారత్ ఎప్పటికీ ఆమోదించబోదన్నారు. బీజేపీ సీఎంలు బాబూలాల్ మరాండి, అర్జున్ ముండా, రఘుబర్ దాస్‌లు ఎలాంటి అవినీతి ఆరోపణలు ఎదుర్కొనలేదన్నారు. అధికారిక కూటమిలోని జేఎంఎం, కాంగ్రెస్, ఆర్జేడీలను జార్ఖండ్ ప్రగతిని అడ్డుకుంటున్న స్పీడ్‌బ్రేకర్లుగా పేర్కొన్నారు. రాష్ట్ర ప్రభుత్వం బంగ్లాదేశ్, రొహింగ్యా చొరబాటుదారులకు కొమ్ముకాస్తోందని రాజ్‌నాథ్ ఆరోపించారు. -
పీఓకే ప్రజలారా.. భారత్‌లో కలవండి
జమ్మూ/బనిహాల్: జమ్మూకశ్మీర్ అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో భాగంగా ఆదివారం రామ్‌బాన్ నియోజకవర్గంలో రక్షణ మంత్రి రాజ్‌నాథ్ ఎన్నికల ర్యాలీలో మాట్లాడారు. ‘‘ ఆర్టికల్ 370 రద్దు తర్వాత జమ్మూకశ్మీర్‌లో భద్రతా పరిస్థితులు పూర్తిగా మారిపోయాయి. ఇక్కడి యువత పిస్టల్, రివాల్వర్ పట్టుకోవడం వదిలేసి ల్యాప్‌టాప్ పట్టుకుంటున్నారు. కంప్యూటర్లు వినియోగిస్తున్నారు. బీజేపీకి మద్దతు పలికితే తదుపరి ప్రభుత్వాన్ని ఏర్పాటుచేసి ఇక్కడ మరింత అభివృద్ధిని సాకారం చేస్తాం. ఇక్కడి అభివృద్ధిని చూసి పాక్ ఆక్రమిత కశ్మీర్(పీఓకే) ప్రజలు సైతం భారత్‌తో కలిసిపోతే బాగుంటుంది అని ఖచ్చితంగా అనుకుంటారు. నాదీ గ్యారెంటీ’’ అని వ్యాఖ్యానించారు. ఈ సందర్భంగా పాక్ ఆక్రమిత కశ్మీర్(పీఓకే) అంశాన్ని ప్రధానంగా ప్రస్తావించారు. పీఓకే ప్రజలను భారత్‌లో విలీనానికి పిలుపునిచ్చారు. ‘‘ పీఓకే ప్రజలకు నేను చెప్పేదొకటే. పాకిస్తాన్ మిమ్మల్ని విదేశీయుల్లా భావిస్తోంది. పాక్ ప్రభుత్వం స్వయంగా ఈ విషయం ఒప్పుకుందికూడా. ఇటీవల పాక్ అదనపు సొలిసిటర్ జనరల్ ఒక విషయంలో సమర్పించిన అఫిడవిట్లో పీఓకే అనేది ఎప్పటికీ పాక్‌కు విదేశీ భూభాగమే అని స్పష్టంగా పేర్కొన్నారు. మిమ్మల్ని భారత్ తన సొంత మనుషుల్లా చూసుకుంటుంది. అందుకే రండి. మాతో కలవండి’’ అని రాజ్‌నాథ్ పిలుపునిచ్చారు. ఉగ్రవాదం ఆపేస్తే చర్చలకు సిద్ధంజమ్మూకశ్మీర్లో పాక్ ఉగ్రవాదాన్ని ఎగదోయడం పూర్తిగా ఆపేస్తే ఆ దేశంతో చర్చలకు భారత్ సిద్ధమని రాజ్‌నాథ్ ప్రకటించారు. ‘‘ ఉగ్రవాదానికి మద్దతు పలకడం అనే చెడ్డపనిని పాక్ ఆపేయాలి. పొరుగు దేశాలతో సత్సంబంధాల మెరుగు కోసం ప్రతి దేశం ప్రయత్నిస్తుంది. ఎందుకంటే మనం మన మిత్రుడిని మార్చుకోగలంగానీ పొరుగు దేశాన్ని కాదుకదా. పాక్‌తో బంధం బలపడాలనే కోరుకుంటున్నాం. ముందుగా పాక్ ఉగ్రవాదాన్ని వీడాలి. ఉగ్రవాదాన్ని కశ్మీర్లో ఆపినప్పుడే చర్చలు పట్టాలెక్కుతాయి. ఇక్కడ ఉగ్రవాదం కోరల్లో చిక్కుకున్న వారిలో 85 శాతం మంది ముస్లింలే ఉన్నారు. ఉగ్రఘటనల్లో ముస్లింలే ఎక్కువగా ప్రాణాలు కోల్పోతున్నారు. అందుకే ఉగ్రవాదం బాటలో పయనించి ప్రాణాలు పోగొట్టుకోకండి’’ అని రాజ్‌నాథ్ హితవు పలికారు. -
కర్రసాము.. మార్షల్ ఆర్ట్స్.. ఇప్పుడు 'హర్ ఘర్ దుర్గ'!
కోల్‌కతాలో అభయ... హైదరాబాద్‌లో దిశ... ఢిల్లీలో నిర్భయ. చెప్పుకుంటూ పోవడమేనా? వేదన నింపుకోవడమేనా? లేడి కొమ్ములు దిగబడిన పులి కళ్లల్లో భయం కూడా సాధ్యమే. శిక్షణ తీసుకుంటే రక్షణాయుధాన్ని వాడితే దుర్మార్గం ఆగుతుంది. దుష్టుడు మన చేత చిక్కి కటకటాల పాలవుతాడు.ఆపద వస్తే ఎవరు సహాయం చేస్తారా అని నిస్సహాయంగా చూడడం కాదు, తనను తాను రక్షించుకోవడానికి ‘ఆమె’ను సమాయత్తం చేయాలి. మహారాష్ట్ర ప్రభుత్వం ఇప్పుడు ఆ పని చేస్తోంది. ‘హర్ ఘర్ దుర్గ’ (ప్రతి ఇంట్లో దుర్గ) అనే నినాదంతో మహిళలకు స్వీయరక్షణ ప్రచారం మొదలుపెట్టింది. అమ్మాయిలకు కరాటే, జూడోలలో శిక్షణ ఇవ్వాలని నిర్ణయించింది. రాష్ట్రంలోని ఐటీఐలన్నింటిలోనూ అమ్మాయిలకు ఆత్మరక్షణ కోసం కరాటే, జూడో క్లాసులు నిర్వహించనుంది. వారంలో కనీసం రెండు గంటల సమయం శారీరక వ్యాయామం, ఆత్మరక్షణ విద్యలకు కేటాయిస్తున్నారు. ఇందుకోసం స్వచ్ఛంద సంఘాల సహకారం తీసుకోనున్నట్లు తెలియచేశాయి అధికార వర్గాలు. మనదగ్గర ఈ పని ఐదేళ్ల్ల కిందటే మొదలైంది. తెలంగాణ, నాగర్ కర్నూల్ జిల్లాకు చెందిన తగుళ్ల స్వర్ణయాదవ్ అనే యువతి కర్రసాము నేర్చుకుని, హైదరాబాద్‌లో అకాడమీ స్థాపించి బాలికలకు నేర్పిస్తోంది.కర్రసాము... మార్షల్ ఆర్ట్స్స్వర్ణ యాదవ్ ఫోక్ సింగర్. పాటలు పాడడానికి ఒంటరిగా వెళ్లాల్సి వచ్చేది. ్రపోగ్రామ్ పూర్తయిన తర్వాత ఇంటికి చేరేసరికి రాత్రి పది దాటుతుంది. తనను తాను రక్షించుకోవడానికి మార్షల్ ఆర్ట్ నేర్చుకోవాలనుకుందామె. మన దగ్గర కర్రసాము ఉందిగాని నేర్పించేవారు లేరు. తమిళనాడులో సిలంబం (కర్రసాము) ఆర్ట్ బాగా విస్తరించి ఉంది. తమిళనాడు వెళ్లి రెండేళ్ల కోర్సు చేశారు స్వర్ణ. తాను నేర్చుకుంటే సరిపోదు, వీలయినంత ఎక్కువ మంది అమ్మాయిలకు నేర్పించాలని నిర్ణయించుకుంది. హైదరాబాద్‌కి తిరిగి వచ్చిన తర్వాత 2019 నుంచి స్కూళ్లలో నేర్పించడం మొదలు పెట్టింది. ‘స్వర్ణ ఆర్ట్స్ అకాడమీ’ని 2022లో రిజిస్టర్ చేసింది. మహిళా దినోత్సవం సందర్భంగా గవర్నర్ బంగ్లాలో ప్రదర్శన ఇచ్చి ప్రశంసలు అందుకుంది. పది మందికి శిక్షణ ఇచ్చి పూర్తి స్థాయిలో శిక్షకులుగా తయారు చేసి వారి సహాయంతో యూసుఫ్‌గూడ, ఉప్పల్, పటాన్చెరు, ఎల్బీనగర్, మాదాపూర్, కూకట్‌పల్లిలో ఫ్రీ క్యాంపులు నిర్వహించింది. స్కూళ్లలో కూడా ఉచితంగా నేర్పించింది.. హైదరాబాద్ నగరంలో శిక్షణ తర్వాత తమ సర్వీస్‌ని తెలంగాణ జిల్లాలకు విస్తరించాలనుకుంటున్నట్లు చెబుతోందామె.అబ్బాయిలకు కూడా!‘‘కర్రసాముతోపాటు మనదేశీయ యుద్ధకళలన్నింటినీ మా అకాడెమీలో పరిచయం చేయాలనేది భవిష్యత్తు ఆలోచన. రాబోయే వేసవికి పంజాబ్ మార్షల్ ఆర్ట్ ‘గట్కా’ను ప్రవేశపెడుతున్నాం. స్కూళ్లలో అమ్మాయిలతోపాటు అబ్బాయిలకు కూడా నేర్పిస్తున్నాం. ఎందుకంటే ఈ జనరేషన్ అబ్బాయిల్లో దేహదారుఢ్యం తగినంతగా ఉండడం లేదు. స్మార్ట్ ఫోన్లలో మునిగిపోయి ఊబకాయులవుతున్నారు. అమ్మాయిలకు ఆత్మరక్షణ ద్వారా వారిలో ఆత్మవిశ్వాసాన్ని పెంపొందించడానికి, అబ్బాయిల్లో ఫిట్నెస్ పెంపొందించడానికి ప్రయత్నం చేస్తున్నాం’ అన్నారు స్వర్ణ యాదవ్. – వాకా మంజులారెడ్డి, సాక్షి ఫీచర్స్ ప్రతినిధి -
రక్షణ కార్యదర్శిగా రాజేష్ సింగ్
ఢిల్లీ: కేంద్ర ప్రభుత్వం శుక్రవారం ఉన్నతస్థాయిలో పలువురు సీనియర్ బ్యూరోకాట్లను బదిలీ చేసి కొత్త స్థానాల్లో నియమించింది. రాజేష్ సింగ్ రక్షణశాఖ కార్యదర్శిగా నియమితులయ్యారు. ప్రస్తుతం పరిశ్రమలు, వాణిజ్య అభివృద్ధి శాఖ కార్యదర్శిగా ఉన్న రాజేష్ తొలుత రక్షణ మంత్రిత్వ శాఖలో ఆఫీసర్ ఆన్ స్పెషల్ డ్యూటీగా చేరతారు. ప్రస్తుత రక్షణశాఖ కార్యదర్శి అరమానే గిరిధర్ అక్టోబరు 31న పదవీ విరమణ చేయనున్నారు. అప్పుడు గిరిధర్ స్థానంలో రాజేష్‡ బాధ్యతలు స్వీకరిస్తారు. పున్యా సలీలా శ్రీవాస్తవ ఆరోగ్యశాఖ కార్యదర్శిగా నియమితులయ్యారు. పస్తుతం మైనారిటీ వ్యవహారాల కార్యదర్శిగా ఉన్న కటికిథల శ్రీనివాస్.. హౌసింగ్, పట్టణాభివృద్ధి వ్యవహారాల శాఖ కార్యదర్శిగా నియమితులయ్యారు. సీనియర్ బ్యూరోకాట్ దీప్తి ఉమాశంకర్‌ను రాష్ట్రపతి కార్యదర్శిగా నియమించారు. నాగరాజు మద్దిరాల ఆర్థిక సేవల కార్యదర్శిగా నియమితులయ్యారు. ప్రస్తుతం నాగరాజు బోగ్గుశాఖలో అదనపు కార్యదర్శిగా ఉన్నారు. -
వ్యభిచార గృహానికి రక్షణ కల్పించండి!!
చెన్నై: తమిళనాడులోని కన్యాకుమారి జిల్లాలో తాను నడుపుతున్న వ్యభిచార గృహానికి రక్షణ కల్పించాలని కోరుతూ ఓ న్యాయవాది పిటిషన్ వేయడంతో మద్రాస్ హైకోర్టు అవాక్కైంది. వయోజనుల మధ్య పరస్పర సమ్మతితో సెక్స్ సర్వీసులను, కౌన్సెలింగ్‌ను, ఆయిల్ బాత్‌లను తమ సంస్థ అందిస్తుందని న్యాయవాది రాజా మురుగన్ తన పిటిషన్లో పేర్కొన్నాడు. పోలీసు తనపై పెట్టిన కేసును కొట్టి వేయాలని, తన వ్యాపార కార్యకలాపాల జోలికి రాకుండా పోలీసులను కట్టడి చేస్తూ ఆదేశాలివ్వాలని కోరారు. అయితే ఈ పిటిషన్‌పై మద్రాస్ హైకోర్టు విస్మయం వ్యక్తం చేసింది. వయోజనుల మధ్య పరస్పర సమ్మతితో జరిగే సెక్స్ నేరం కాదని తన చట్టవిరుద్ధ కార్యకలాపాలను పిటిషనర్ సమర్థించుకోవడాన్ని జస్టిస్ బి.పుగలేంధి తీవ్రంగా ఆక్షేపించారు. పేరున్న లా కాలేజీల నుంచి పట్టభద్రులైన వారిని మాత్రమే న్యాయవాదులుగా నమోదు చేసుకోవాలని బార్ కౌన్సిల్‌కు సూచించారు. మురుగన్‌కు రూ. 10 వేల జరిమానాను విధించడమే కాకుండా.. లా డిగ్రీ సరి్టఫికెట్‌ను, బార్ అసోసియేషన్‌లో నమోదైన పత్రాన్ని సమర్పించాలని ఆదేశించింది. -
Trump: యూఎస్ సుప్రీం కోర్టులో బిగ్ రిలీఫ్
వాషింగ్టన్: అమెరికా మాజీ అధ్యక్షుడు, రిపబ్లికన్ పార్టీ తరఫున అధ్యక్ష బరిలో దిగిన డొనాల్డ్ ట్రంప్‌నకు ఊరట లభించింది. అధ్యక్షులకు న్యాయ విచారణ నుంచి కొంతమేరకు రక్షణ ఉంటుందని తొలిసారిగా అమెరికా సుప్రీంకోర్టు సోమవారం తీర్పునిచ్చింది. ‘రాజ్యాంగబద్ధమైన అధికార పరిధిలో తీసుకునే నిర్ణయాలకు మాజీ అధ్యక్షులకు క్రిమినల్ విచారణ నుంచి సంపూర్ణ రక్షణ ఉంటుంది. ఇది అధికారిక నిర్ణయాలకు మాత్రమే వరిస్తుంది. అనధికారిక చర్యలకు ఎలాంటి రక్షణ పొందలేరు’ అని చీఫ్ జస్టిస్ జాన్ రాబర్ట్స్ మెజారిటీ తీర్పు(6–3)లో పేర్కొన్నారు. 2020 అధ్యక్ష ఎన్నికల ఫలితాల్లో ఓటమిని అంగీకరించకుండా ఫలితాలను తారుమారు చేయడానికి కుట్ర పన్నారనే అభియోగాలపై డొనాల్డ్ ట్రంప్ క్రిమినల్ కేసును ఎదుర్కొంటున్నారు. సుప్రీంకోర్టు సోమవారం ఈ కేసును తిరిగి ట్రయల్ కోర్టుకు అప్పగించింది. ఫలితంగా అధ్యక్ష ఎన్నిక జరిగే నవంబర్ 5 లోగా ట్రంప్ విచారణను ఎదుర్కొనే అవకాశాలు లేనట్టే. ‘మాజీ అధ్యక్షులకు క్రిమినల్ విచారణ నుంచి మినహాయింపు అధ్యక్ష వ్యవస్థనే పునర్వవస్థీకరిస్తుంది. చట్టానికి ఎవరూ అతీతులు కాదనే రాజ్యాంగ సూత్రాలను, భూమికను, ప్రభుత్వ వ్యవస్థను అవహేళన చేయడమే’ అని జస్టిస్ సోనియా సొటోమేయర్ అన్నారు. సుప్రీం తీర్పుపై ట్రంప్ హర్షం వ్యక్తం చేయగా.. అధ్యక్షుడు బైడెన్ ఈ తీర్పుపై స్పందిస్తారని వైట్ హౌజ్ వర్గాలు వెల్లడించాయి. అట్లాంటా బిగ్ డిబేట్ తర్వాత మళ్లీ బైడెన్ మీడియా ముందుకు రావడం ఇదే ప్రథమం. -
Andrei Belousov: రష్యా నూతన రక్షణ మంత్రిగా ఆండ్రీ బెలౌసోవ్
మాస్కో: రష్యా నూతన రక్షణ మంత్రిగా ఆండ్రీ బెలౌసోవ్చేపట్టిన వ్లాదిమిర్ పుతిన్ మంత్రివర్గాన్ని పునర్ వ్యవస్థీకరించారు. రాజ్యాంగం ప్రకారం శనివారం మంత్రివర్గం మొత్తం రాజీనామా చేసింది. పాత కేబినెట్లో రక్షణ మంత్రి సెర్గీ షోయిగుకు మాత్రమే అవకాశమివ్వలేదు. రక్షణ శాఖ సహాయ మంత్రి తిమూర్ ఇవనోవ్ అవినీతి ఆరోపణలతో అరెస్ట్ కావడంతో షోయిగుకు పదవీ గండం తప్పదని కొన్ని రోజులుగా వస్తున్న వార్తలు నిజమయ్యాయి. ఆదివారం అధ్యక్షుడు పుతిన్ నూతన రక్షణ మంత్రిగా ఆండ్రీ బెలౌసోవ్(65)ను నియమిస్తున్నట్లు ప్రకటించారు. షోయిగుకు రష్యా సెక్యూరిటీ కౌన్సిల్ సెక్రటరీ బాధ్యతలను అప్పగించారు. ఆండ్రీ బెలౌసోవ్ 2020 నుంచి ఫస్ట్ డిప్యూటీ ప్రధానమంత్రిగా కొనసాగు తున్నారు. అంతకుముందు ఏడేళ్లపాటు పుతిన్ సలహాదారుగా ఉన్నారు. కొత్త ఆవిష్కరణలకు, నూతన ఆలోచనలకు అనుగుణంగా రక్షణ శాఖను తీర్చిదిద్దేందుకే బెలౌసోవ్‌ను నియమించినట్లు అధ్యక్ష భవనం తెలిపింది. -
Lok Sabha elections 2024: రాజ్‌నాథ్ సారథ్యంలో మేనిఫెస్టో కమిటీ
న్యూఢిల్లీ: వచ్చే లోక్‌సభ ఎన్నికలకు మేనిఫెస్టో రూపకల్పనకు గాను రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ సారథ్యంలో బీజేపీ 27 మంది సభ్యులతో కమిటీని ఏర్పాటు చేసింది. కమిటీకి ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ కన్వీనర్‌గా, కేంద్ర మంత్రి పీయూష్ గోయెల్ కో కన్వీనర్‌గా వ్యవహరిస్తారు. పార్టీ ఎన్నికల హామీలపై ఈ కమిటీ మేధో మథనం చేయడంతోపాటు దేశవ్యాప్తంగా ప్రజల నుంచి సూచనలను స్వీకరించనుంది. ఇందులో కేంద్ర మంత్రులు ధర్మేంద్ర ప్రధాన్, అశ్వినీ వైష్ణవ్, భూపేంద్ర యాదవ్, కిరెన్ రిజిజు, అర్జున్ ముండా, అర్జున్ రామ్ మేఘ్వాల్, స్మృతి ఇరానీ, రాజీవ్ చంద్ర శేఖర్ ఉన్నారు. బీజేపీ పాలిత గుజరాత్ సీఎం భూపేంద్ర పటేల్, అస్సాం సీఎం హిమాంత బిశ్వ శర్మ, మధ్యప్రదేశ్ సీఎం మోహన్ యాదవ్, ఛత్తీస్‌గఢ్ సీఎం విష్ణు డియో సాయి కూడా కమిటీలో ఉన్నారు. శివరాజ్ సింగ్ చౌహాన్, వసుంధరా రాజే వంటి సీనియర్ నేతలకు కూడా బీజేపీ అధిష్టానం స్థానం కల్పించింది. క్రైస్తవులు, ముస్లింలకు ఆంటోనీ, మన్సూర్‌లు ప్రాతినిధ్యం వహించనున్నారు. యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్, రాజస్తాన్ సీఎం భజన్‌లాల్ శర్మ పేర్లు కమిటీలో లేవు. -
భారత్, యూఎస్ రక్షణ బంధం మరింత బలోపేతం
సాక్షి, విశాఖపట్నం: భారత్, అమెరికా మధ్య రక్షణ విభాగ బంధం మరింత బలోపేతం కానుందని భారత్–యూఎస్ రాయబారి ఎరిక్ గార్సెట్టి స్పష్టం చేశారు. పసిఫిక్ సముద్రజలాల్లో అన్ని దేశాలూ స్వేచ్ఛాయుత వాణిజ్య కార్యకలాపాలు సాగించేలా చేయడమే తమ లక్ష్యమన్నారు. తూర్పు నౌకాదళ ప్రధాన కేంద్రం విశాఖపట్నంలో భారత్, యూఎస్ త్రివిధ దళాల ఆధ్వర్యంలో టైగర్ ట్రయాంఫ్ యుద్ధ విన్యాసాలు కొనసాగుతున్నాయి. ఇందులో భాగంగా.. ఐఎన్ఎస్ జలాశ్వా యుద్ధనౌక ఆన్‌బోర్డుపై ఇరుదేశాల ప్రతినిధులు మంగళవారం మీడియా సమావేశంలో మాట్లాడారు. ఎరిక్ మాట్లాడుతూ సాగర జలాల సరిహద్దుల్లో చొరబాట్లు, సముద్రపు దొంగల ఆట కట్టించేందుకు భారత్‌తో కలిసి వ్యూహాత్మకంగా అడుగులు వేస్తున్నామని తెలిపారు. యూఎస్ సెవెన్త్ ఫ్లీట్ రిజర్వ్ వైస్ కమాండర్ రియర్ అడ్మిరల్ జోక్విన్ జె మార్టినైజ్ మాట్లాడుతూ టైగర్ ట్రయాంఫ్ నిర్వహణతో భారత్, యూఎస్ మధ్య ఉన్న బంధాన్ని ప్రపంచానికి చాటిచెబుతున్నామన్నారు. తూర్పు నౌకాదళాధిపతి వైస్ అడ్మిరల్ రాజేష్ పెందార్కర్ మాట్లాడుతూ టైగర్ ట్రయాంఫ్ విన్యాసాల్లో భాగంగా హార్బర్ ఫేజ్‌లో విపత్తు, యుద్ధ సమయంలో రెండు దేశాల మధ్య పరస్పర సహకారాన్ని ఎలా అందిపుచ్చుకోవాలనే అంశాలతో పాటు ప్రీసెయిల్ చర్చలు, వృత్తిపరమైన విషయాలపై ఎక్స్పర్ట్స్ ఎక్స్చేంజిలు జరగనున్నాయని తెలిపారు. విన్యాసాల్లో భాగంగా ఈస్ట్రన్ నేవల్ కమాండ్ ప్రధాన కేంద్రంలో కమాండ్ కంట్రోల్ సెంటర్, జాయింట్ రిలీఫ్, మెడికల్ క్యాంపు ఏర్పాటు చేశామని వివరించారు. 29న కాకినాడలో మెడికల్ రిలీఫ్ క్యాంపుతో పాటు.. జాయింట్ ఎక్సర్సైజ్ నిర్వహించనున్నట్లు తెలిపారు. యూఎస్ఎస్ సోమర్సెట్ యుద్ధ నౌక కమాండింగ్ ఆఫీసర్ కెప్టెన్ మిచైల్ బ్రాండ్, ఈస్ట్రన్ ఫ్లీట్ ఫ్లాగ్ ఆఫీసర్ కమాండ్ రియర్ అడ్మిరల్ రాజేష్ ధన్కర్, ఐఎన్ఎస్ జలశ్వా కమాండింగ్ అధికారి కెప్టెన్ సందీప్ బిశ్వాల్‌తో పాటు ఇరు దేశాల త్రివిధ దళాల ప్రతినిధులు పాల్గొన్నారు. -
Union Cabinet: జన నాయకుడు మోదీ
న్యూఢిల్లీ: అయోధ్యలో రామాలయ ప్రారంభ కార్యక్రమాన్ని జయప్రదంగా నిర్వహించినందుకు ప్రధాని నరేంద్ర మోదీపై కేంద్ర కేబినెట్ ప్రశంసల వర్షం కురిపించింది. ఆ సందర్భంగా దేశ ప్రజలు మోదీపై కనబరచిన ప్రేమ, ఆప్యాయతలు ఆయన నిజమైన జన నాయకుడని మరోసారి నిరూపించాయని పేర్కొంది. ‘‘రామ మందిరం కోసం ప్రజలంతా కలసికట్టుగా ఉద్యమించిన తీరు కొత్త తరానికి తెర తీసింది. ఇదంతా మోదీ దార్శనికతతోనే సాధ్యపడింది’’ అని పేర్కొంది. భరత జాతి శతాబ్దాల కలను సాకారం చేసినందుకు మోదీకి కృతజ్ఞతలు తెలుపుతూ కేబినెట్ ఈ సందర్భంగా తీర్మానం చేసింది. తీర్మాన ప్రతిని బుధవారం జరిగిన కేబినెట్ భేటీలో రక్షణ మంత్రి రాజ్‌నాథ్‌సింగ్ చదివి విని్పంచారు. ‘‘1947లో దేశానికి భౌతికంగా మాత్రమే స్వాతంత్య్రం వచి్చంది. దాని ఆత్మకు మాత్రం ఇన్నేళ్ల తర్వాత 2024 జనవరి 22న రామ్ లల్లా విగ్ర ప్రతిష్టాపన ద్వారా ప్రాణప్రతిష్ట జరిగింది. ప్రజలు కనబరిచిన ప్రేమాభిమానాల ద్వారా మీరు జన నాయకునిగా సుప్రతిష్టితులయ్యారు. రామ మందిర ప్రతిష్టాపన ద్వారా కొత్త తరానికి తెర తీసిన దార్శనికుడయ్యారు’’ అంటూ మోదీపై తీర్మానం ప్రశంసలు కురిపించింది. ‘‘ప్రజల్లో ఇంతటి ఐక్యత గతంలో దేశంలో ఎమర్జెన్సీ విధించిన సందర్భంగా కని్పంచింది. అది ఒక నియంతను ఎదిరించేందుకు జరిగిన ఉద్యమం. ఇదేమో దేశంలో నూతన శకానికి అయోధ్య రాముని సాక్షిగా నాంది పలికిన చరిత్రాత్మక క్షణాలకు సాక్షిగా నిలిచిన ఐక్యత’’ అని పేర్కొంది. ఈ సందర్భంగా కేబినెట్ భేటీలో ఆసాంతం భావోద్వేగాలు ముప్పిరిగొన్నాయని ఒక మంత్రి తెలిపారు. రాముని ప్రాణప్రతిష్టకు సాక్షిగా నిలిచిన మంత్రివర్గంలో భాగస్వాములుగా ఉండటం గర్వకారణమని కేబినెట్ సభ్యులంతా అభిప్రాయపడ్డట్టు చెప్పారు. ఇది కొన్ని జన్మలకు ఒకసారి మాత్రమే లభించే అరుదైన అవకాశమన్నారు. ఆ ప్రాజెక్టులకు రూ.8,500 కోట్లు రసాయనాల ఉత్పత్తిని దేశీయంగా పెంచడం ద్వారా వాటి దిగుమతిని తగ్గించుకునే దిశగా కేంద్రం కీలక నిర్ణయం తీసుకుంది. బొగ్గు, లిగ్నైట్ గ్యాసిఫికేషన్ ప్రాజెక్టులకు రూ.8,500 కోట్ల ఆర్థిక సాయం అందజేయాలని నిర్ణయించింది. ప్రధాని నరేంద్ర మోదీ సారథ్యంలో బుధవారం జరిగిన కేంద్ర మంత్రి వర్గ సమావేశం ఈ ప్రతిపాదనలకు ఆమోదముద్ర వేసింది. అలాగే కోల్ ఇండియా, గెయిల్ భాగస్వామ్యంలో రూ.13,052 కోట్ల కోల్–ఎస్ఎన్జీ (సింథటిక్ నేచురల్ గ్యాస్), సీఐఎల్, బీహెచ్ఈఎల్ భాగస్వామ్యంలో రూ.11,782 కోట్ల కోల్–అమ్మోనియం నైట్రేట్ ప్రాజెక్టుల ఏర్పాటుకు కూడా ఆమోదం తెలిపింది. -
అమెరికా రక్షణ మంత్రికి అనారోగ్యం
వాషింగ్టన్: అమెరికా రక్షణ మంత్రి లాయిడ్ ఆస్టిన్(70) అనారోగ్యంతో గత సోమవారం నుంచి విధులకు దూరంగా ఉన్నట్లు సమాచారం. ఆయన వాల్టర్ రీడ్ నేషనల్ మిలటరీ మెడికల్ సెంటర్లో చికిత్స పొందుతున్నట్లు పెంటగాన్ తెలిపింది. స్వల్ప శస్త్ర చికిత్స చేయించుకున్న అనంతరం సమస్యలు తలెత్తడంతో సోమవారం ఆయన్ను మెడికల్ సెంటర్లో చేరి్పంచినట్లు పెంటగాన్ ప్రతినిధి ఎయిర్ ఫోర్స్ మేజర్ జనరల్ ప్యాట్ రైడర్ శుక్రవారం(స్థానిక కాలమానం ప్రకారం) చెప్పారు. ఆయన కోలుకుంటున్నారని, ఈ రోజే ఆయన విధుల్లో చేరే అవకాశాలున్నాయని తెలిపారు. వ్యక్తిగత గోప్యత, వైద్యపరమైన అంశాలను దృష్టిలో ఉంచుకుని మంత్రి ఆస్టిన్ ఆస్పత్రిలో చేరిన విషయాన్ని బయటకు వెల్లడించలేదని తెలిపారు. అవసరమైన పక్షంలో సహాయ మంత్రి కాథ్లీన్ హిక్స్ ఆయన స్థానంలో బాధ్యతలు కొనసాగించేందుకు సిద్ధంగా ఉన్నారని వివరించారు. -
వైట్‌హౌస్, పెంటగాన్, యుద్ధ నౌకలు...
సియోల్: అమెరికా అధ్యక్షుడి నివాసం వైట్‌హౌస్, రక్షణశాఖ కార్యాలయం పెంటగాన్, అమెరికా విమాన వాహక నౌకల స్పష్టమైన ఫొటోలను సోమవారం తమ నిఘా ఉపగ్రహం పంపించినట్లు ఉత్తరకొరియా ప్రకటించుకుంది. వీటిని తమ నేత కిమ్ జొంగ్ ఉన్ పరిశీలించారని తెలిపింది. మల్లిగియోంగ్–1 అనే నిఘా ఉపగ్రహం ప్రయోగాన్ని కిమ్ తిలకిస్తున్న ఫొటోలను గత మంగళవారం అధికార వార్తా సంస్థ కేసీఎన్ఏ విడుదల చేసింది. శాటిలైట్ విడుదల చేసిన చిత్రాల్లో అమెరికా నేవీ కేంద్రం, నౌకాశ్రయం, వర్జీనియాలోని వైమానిక కేంద్రం ఉన్నాయని తెలిపింది. -
సైనికులకు సిరిధాన్యాల ఆహారం
మైసూరు: దేశ రక్షణ కోసం సరిద్దుల్లో పనిచేస్తున్న సైనికుల ఆరోగ్యాన్ని పెంపొందించేలా సిరిధాన్యాలను వారి ఆహారంలో వినియోగిస్తామని కేంద్ర రక్షణ, పర్యాటక శాఖల సహాయ మంత్రి అజయ్ భట్ తెలిపారు. శనివారం మైసూరులోని కేంద్ర రక్షణ ఆహార పరిశోధనా ప్రయోగాలయం (డీఎఫ్ఆర్ఎల్)లో ‘మిలిటరీ రేషన్, పౌష్టికాంశాలతో కూడిన సిరిధాన్యాలు’అంశంపై రెండు రోజుల సదస్సును ఆయన ప్రారంభించారు. చిరుధాన్యాల నిపుణుడు, పద్మశ్రీ డాక్టర్ ఖాదర్ వలి కూడా పాల్గొన్నారు. మంత్రి మాట్లాడుతూ అత్యంత ఎత్తైన సియాచిన్ లాంటి ప్రాంతాల్లో గస్తీ విధులను నిర్వహిస్తుంటారని చెప్పారు. క్లిష్ట పరిస్థితుల్లో పనిచేసే సైనికుల ఆరోగ్యాన్ని కాపాడుకోవడం చాలా కష్టమైన పని అన్నారు. వారు ఆరోగ్యవంతులుగా ఉండేందుకు సిరిధాన్యాలతో కూడిన ఆహారాన్ని అధికంగా ఇస్తామని చెప్పారు. -
రక్షణ మంత్రిని తొలగించిన ఉక్రెయిన్ అధ్యక్షుడు
క్యివ్: రష్యాతో జరుగుతున్న యుద్ధం నేపధ్యంలో ఉక్రెయిన్ అధ్యక్షుడు వ్లాదిమిర్ జెలెన్స్కీ కీలక నిర్ణయం తీసుకున్నారు. క్యివ్ రక్షణ శాఖ మంత్రి బాధ్యతల నుండి ఒలెక్సి రెజ్నికోవ్ను తప్పిస్తున్నట్లు ఆదివారం ప్రకటించారు. ఆయన స్థానంలో రుస్తెం ఉమెరోవ్‌ను నూతన రక్షణశాఖ మంత్రిగా నియమిస్తున్నట్లు ప్రకటించి ఇది రక్షణశాఖలో సరికొత్త విధానాన్ని అమలుచేయాల్సిన అవసరం ఉందని అన్నారు. అధ్యక్షుడి నిర్ణయం ప్రకటించిన తర్వాత రెజ్నికోవ్ తన రాజీనామాను పార్లమెంటుకు సమర్పించారు. యధాప్రకారం సాయంత్రం జరిగే మీడియా సమావేశంలో వ్లాదిమిర్ జెలెన్స్కీ మాట్లాడుతూ.. ఒలెక్సి రెజ్నికోవ్ రష్యాతో యుద్ధం మొదలైన నాటి నుండి దాదాపు 550 రోజులు యుద్ధంలో కీలక పాత్ర పోషిస్తున్నారని కానీ ప్రస్తుతం రక్షణశాఖలో సరికొత్త విధానాన్ని అనుసరించాల్సిన అవసరముందని అందుకే క్రిమియా రాష్ట్ర సంపద నిధుల సంరక్షకుడిగా వ్యవహరిస్తున్న ఉమెరోవ్‌కు రక్షణశాఖ బాధ్యతలు అప్పచెబుతున్నామని అన్నారు. పార్లమెంట్ ఉమేరోవ్ అభ్యర్ధిత్వాన్ని ఆమోదిస్తుందని భావిస్తున్నామన్నారు. Zelenskyi's evening speech in which he talks about the replacement of Minister of Defense Oleksii Reznikov. He is replaced by Rustem Umerov. -- "Oleksii Reznikov went through these more than 550 days of full-scale war. I believe that the Ministry needs new approaches and other… pic.twitter.com/o7NCvszWoi — NOELREPORTS 🇪🇺 🇺🇦 (@NOELreports) September 3, 2023 ఉక్రెయిన్ అధ్యక్షుడు తీసుకున్న ఈ నిర్ణయం ఉక్రెయిన్ రక్షణశాఖలో ప్రకంపనలు సృష్టిస్తోంది. ఫిబ్రవరి 2022లో రష్యాతో యుద్ధం మొదలైన నాటి నుండి ఒలేక్సి రెజ్నికోవ్ పాశ్చాత్య దేశాల నుండి బిలియన్ డాలర్ల సహాయాన్ని పొందడంలో కీలక పాత్ర పోషించారు. కానీ రక్షణశాఖలో అంతర్గత ఆరోపణలు పెచ్చుమీరడంతో ఉక్రెయిన్ అధ్యక్షుడు ఈ నిర్ణయం తీసుకున్నారన్న అభిప్రాయాలు కూడా వ్యక్తమవుతున్నాయి. అధ్యక్షుడి నిర్ణయాన్ని పార్లమెంట్ ఆమోదిస్తుందనే వార్తలు వెలువడుతున్నాయి. కానీ రెజ్నికోవ్ను ఉన్నట్టుండి బాధ్యతల నుండి తప్పించడాన్నే మీడియా హైలైట్ చేస్తూ రెజ్నికోవ్కు వేరే బాధ్యతలు ఏమైనా అప్పగిస్తున్నారా అన్నది అధ్యక్షుడే తెలపాల్సి ఉంటుంది. రక్షణశాఖలో భారీగా జరుగుతున్న అవినీతి నేపధ్యంలోనే ఉక్రెయిన్ అధ్యక్షుడి ఈ నిర్ణయం తీసుకున్నారని ఆరోపణలు చేసే వారు కూడా లేకపోలేదు. అంతర్జాతీయ అవినీతి దేశాల జాబితాలో ఉక్రెయిన్ 180 దేశాల్లో 116 వ స్థానంలో ఉంది. అవినీతి విషయంలో ఒకప్పటితో పోలిస్తే ఉక్రెయిన్ ఇప్పుడు చాల మెరుగయ్యిందనే అభిప్రాయాలు కూడా వ్యక్తమవుతున్నాయి. I have submitted my letter of resignation to Ruslan Stefanchuk @r_stefanchuk, Chairman of the Parliament of Ukraine @verkhovna_rada It was an honor to serve the Ukrainian people and work for the #UAarmy for the last 22 months, the toughest period of Ukraine’s modern history. 🇺🇦 pic.twitter.com/x4rXXcrr7i — Oleksii Reznikov (@oleksiireznikov) September 4, 2023 ఇది కూడా చదవండి: జీ20 సదస్సుకు జిన్‌పింగ్ స్థానంలో చైనా ప్రీమియర్ -
ఎస్సీ, ఎస్టీలను మోసం చేసిన కేసీఆర్
సాక్షి, రంగారెడ్డి జిల్లా/ చేవెళ్ల/ మొయినాబాద్: బీఆర్ఎస్ పాలనలో తెలంగాణలో ఎస్సీ, ఎస్టీలకు రక్షణ లేకుండా పోయిందని.. పైగా వారిపై దాడులు మరింతగా పెరిగాయని పీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి విమర్శించారు. దళిత సీఎం అని చెప్పి, మూడెకరాల భూమి ఇస్తామని చెప్పి మోసం చేశారని.. గిరిజనులకు పోడు భూములు దక్కలేదని, వారిపై దాడులు జరుగుతున్నాయని ఆరోపించారు. రాష్ట్రంలో బీఆర్ఎస్ ఎమ్మెల్యేల అవినీతికి, అక్రమ సంపాదనకు అడ్డు, అదుపు లేకుండా పోయిందని.. తొమ్మిదిన్నర ఏళ్లలో రూ.లక్ష కోట్ల ఆస్తులను, రూ.పదివేల కోట్ల విలువ చేసే భూములను కొల్లగొట్టారని ఆరోపించారు. చేవెళ్ల వేదికగా శనివారం కాంగ్రెస్ పార్టీ నిర్వహించిన ప్రజాగర్జన సభలో ఆయన 12 అంశాలతో కూడిన ఎస్సీ, ఎస్టీ డిక్లరేషన్ ప్రకటించారు. అనంతరం మాట్లాడారు. మూడో విజయం తెలంగాణలోనే.. మల్లికార్జున ఖర్గే ఏఐసీసీ అధ్యక్షుడిగా బాధ్యతలు స్వీకరించాక కాంగ్రెస్ తొలి విజయం హిమాచల్‌ప్రదేశ్‌లో, రెండో విజయం కర్ణాటకలో సాధించిందని.. మూడో విజయం తెలంగాణలో సాధించబోతోందని రేవంత్ చెప్పారు. తమ ప్రభుత్వంలో స్వేచ్ఛతోపాటు సామాజిక న్యాయం, సమాన అభివృద్ధికి ప్రాధాన్యత లభిస్తుందన్నారు. తొమ్మిదేళ్ల కేసీఆర్ పాలనలో అన్ని రంగాల ప్రజలను మోసం చేశారని.. మంత్రి వర్గంలో బీసీలకు, ఎస్సీలకు ప్రాధాన్యత లేదని రేవంత్ విమర్శించారు. రాష్ట్రంలో 50శాతం జనాభా ఉన్న బీసీలకు మూడే మంత్రి పదవులతో సరిపెట్టార న్నారు. దేశంలోని మోదీ, తెలంగాణలోని కేసీఆర్, పాతబస్తీలోని అసదుద్దీన్ ముగ్గురూ ఒక్కటేనని.. వీరిలో ఎవరికి ఓటేసినా కేసీఆర్‌కు వేసినట్టేనని వ్యాఖ్యానించారు. బీఆర్ఎస్ పాలనలో అమర వీరుల కుటుంబాలకు, తెలంగాణ పోరాట యోధులకు, ఉస్మానియా విద్యార్థులకు, తెలంగాణ వాదులకు గుర్తింపు లేకుండా పోయిందని మండిపడ్డారు. ఈ అవినీతి, అణచివేత, కుటుంబ పాలనకు చరమగీతం పాడాల్సిందేనన్నారు. కాగా.. ప్రజా గర్జన సభలో కాంగ్రెస్ రాష్ట్ర వ్యవహారాల ఇన్చార్జి మాణిక్‌రావు ఠాక్రే, సీనియర్ నేతలు దామోదర రాజనర్సింహ, వీహెచ్, జానారెడ్డి, ఉత్తమ్‌కుమార్‌రెడ్డి, మధుయాష్కీ, శ్రీధర్‌బాబు, షబ్బీర్ అలీ, పొంగులేటి శ్రీనివాసరెడ్డి, అంజన్‌కుమార్ యాదవ్, షబ్బీర్ అలీ, పొన్నాల లక్ష్మయ్య, బలరాం నాయక్, గడ్డం ప్రసాద్‌కుమార్ తదితరులు పాల్గొన్నారు. కేసీఆర్‌పై ప్రజలు తిరగబడే రోజులు వచ్చాయి: దామోదర తెలంగాణలో భూమి కోసం, హక్కులకోసం పోరాటాలు చేసిన చరిత్ర ఉందని.. అది గుర్తించే సోనియాగాంధీ తెలంగాణ రాష్ట్రాన్ని ఇచ్చారని మాజీ ఉప ముఖ్యమంత్రి దామోదర రాజనర్సింహ చెప్పారు. ఇందిరాగాంధీ 25 లక్షల ఎకరాల భూములను పేదలకు పంచారన్నారు. కానీ బీఆర్ఎస్ కుటుంబ పాలనలో పేదల భూములను గుంజుకుని, రియల్ఎస్టేట్ వ్యాపారం చేసి కోట్లు దండుకుంటున్నారని ఆరోపించారు. తెలంగాణలో దొర అహంకారం మితిమీరిందని.. కేసీఆర్‌పై ప్రజలు తిరగబడే రోజులు వచ్చాయని పేర్కొన్నారు. రాజ్యాంగం కల్పించిన హక్కుల ద్వారానే పదవులు: సీతక్క తెలంగాణలో బీఆర్ఎస్ పార్టీ దళితులకు ఏదో చేసిందని గొప్పలు చెప్పుకుంటోందే తప్ప.. చేసిందేమీ లేదని ములుగు ఎమ్మెల్యే సీతక్క విమర్శించారు. వందల ఎకరాల భూములు, ఫాంహౌస్‌లు ఉన్న పెద్దలకే రైతుబంధు సొమ్ము ఎక్కువగా అందుతోందని.. భూమి లేని పేదలకు ఈ ప్రభుత్వం చేసిందేమిటో చెప్పాలని నిలదీశారు. కాంగ్రెస్ పార్టీతోనే ప్రజలకు ఆత్మగౌరవం, సమానత్వం లభిస్తాయన్నారు. ఎస్సీ ఎస్టీ డిక్లరేషన్ చరిత్రాత్మకం: భట్టి రాష్ట్ర సంపదలో అన్నివర్గాల ప్రజలను భాగస్వాములను చేయడానికి కాంగ్రెస్ ఎస్సీ, ఎస్టీ డిక్లరేషన్ ప్రకటించిందని.. ఇది చరిత్రాత్మక నిర్ణయమని సీఎల్పినేత భట్టి విక్రమార్క చెప్పారు. చేవెళ్ల నుంచి నాడు వైఎస్ రాజశేఖరరెడ్డి సీఎల్పీ నేతగా పాదయాత్ర చేపట్టి ఇందిరమ్మ రాజ్యాన్ని తీసుకొచ్చారని.. అదే సీఎల్పీ నేతగా తాను చేపట్టిన పాదయాత్రలో రాష్ట్ర ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలను గుర్తించానని వివరించారు. వాటిపై కాంగ్రెస్ పెద్దలంతా చర్చించి పేదలకు ఇంటి స్థలం, భూమి, ఆర్థిక సాయం అంశాలతో ఎస్సీ, ఎస్టీ డిక్లరేషన్ తీసుకొచ్చారని చెప్పారు. దళితులకు మూడెకరాల భూమి ఇస్తామన్న సీఎం కేసీఆర్.. ఆ హామీ నెరవేర్చకపోగా, పేదలకిచ్చిన లక్షల ఎకరాల భూములను వెనక్కి తీసుకుని రియల్ ఎస్టేట్ వ్యాపారం చేస్తున్నారని ఆరోపించారు. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి రాగానే పేదలకిచ్చిన భూములకు పూర్తి హక్కులు కల్పిస్తామని.. లాక్కున్న భూములను తిరిగి ఇస్తామని చెప్పారు. -
రక్షణ రంగానికి బ్రాండ్‌గా విశాఖ
సాక్షి, విశాఖపట్నం: రక్షణ రంగానికి ఒక బ్రాండ్‌గా మారేందుకు, నేవల్ ఎకో సిస్టమ్ అభివృద్ధికి విశాఖపట్నంలో పుష్కల అవకాశాలున్నాయని రక్షణ పరిశోధన అభివృద్ధి సంస్థ(డీఆర్డీవో) నేవల్ సిస్టమ్స్ అండ్ మెటీరియల్స్ డైరెక్టర్ జనరల్ డా.వై శ్రీనివాసరావు అన్నారు. నేవల్ సైన్స్ అండ్ టెక్నాలజీ ల్యాబొరేటరీ(ఎన్ఎస్టీఎల్)లో శనివారం జరిగిన 54వ ల్యాబ్ రైజింగ్ డే ఉత్సవాల్లో పాల్గొన్న అనంతరం ఆయన ‘సాక్షి’తో మాట్లాడారు. ‘విశాఖపట్నంలో నేవల్ ఎకో సిస్టమ్ మరింత అభివృద్ధి చెందితే అత్యవసర పరిస్థితుల్లో సహకారం అందించేందుకు అవసరమైన మానవ వనరులు, మెషినరీ అందుబాటులోకి వస్తాయి. నేవల్ డిఫెన్స్ అంటే విశాఖ గుర్తుకురావాలి. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు పారిశ్రామిక పార్కులు ఏర్పాటు చేస్తున్నాయి. హిందూస్తాన్ షిప్‌యార్డు, పోర్టులకు సంబంధించిన పరికరాలు, కమర్షియల్ నేవీ, ఇండియన్ నేవీకి ఏ పారిశ్రామిక సహకారం కావాలన్నా.. విశాఖ అత్యంత ముఖ్యమైన వనరు. రక్షణ రంగానికి సంబంధించిన పరిశ్రమలు ఏర్పాటు చేసేలా ప్రభుత్వాలు ప్రోత్సాహకాలు అందిస్తే.. విశాఖలో నేవల్ ఎకో సిస్టమ్ మరింత అభివృద్ధి చెందుతుంది. డాక్‌యార్డు, ఎన్ఎస్టీఎల్, నేవీ, షిప్‌యార్డుకు సహకారం అందించేలా బీఈఎల్ మాదిరిగా ఎల్అండ్టీ వంటి సంస్థలు వస్తే.. ఆ వెంటే ఎంఎస్ఎంఈలు కూడా ఏర్పాటవుతాయి. తద్వారా విశాఖ రక్షణ రంగానికి ఒక బ్రాండ్‌గా మారే అవకాశముంది. విశాఖ సమీప ప్రాంతాల్లో పోర్టులు, భోగాపురం ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్టు, రాజమండ్రి ఎయిర్‌పోర్టు, రైల్వే వ్యవస్థ కూడా ఉన్నందున.. అభివృద్ధి చెందేందుకు ఎక్కువ సమయం పట్టదు. సొంతంగా సబ్మెరైన్లు, టార్పెడోలు.. సముద్ర గర్భంలోనూ సత్తా చాటే దిశగా అడుగులు పడుతున్నాయి. వరుణాస్త్ర విజయవంతమైంది. హెవీ వెయిట్, లైట్ వెయిట్ టార్పెడో ప్రయోగాలు విజయవంతమయ్యాయి. బ్యాటరీ ప్రొపల్షన్ టార్పెడోలు ప్రస్తుతం కీలకంగా మారాయి. క్షణాల్లో టార్పెడోలు దూసుకుపోయేలా బ్యాటరీల రూపకల్పన జరుగుతోంది. త్వరలో ఇవి అందుబాటులోకి రానున్నాయి. టార్పెడోలను సమర్థంగా కంట్రోల్ చేసే వ్యవస్థ కూడా సిద్ధమవుతోంది. నౌకలు, సబ్మెరైన్ల మోడల్ టెస్టింగ్స్ కోసం ఒకప్పుడు ఇతర దేశాలపై ఆధారపడే వాళ్లం. ఇప్పుడు అన్ని షిప్‌యార్డులూ ఎన్ఎస్టీఎల్ వైపే చూస్తున్నాయి. ఇప్పుడు సబ్మెరైన్లను సొంతంగా తయారు చేసే దిశగా అడుగులు పడుతున్నాయి. అలాగే యుద్ధ విమానాలు, సబ్మెరైన్లు, యుద్ధ నౌకల ఉనికిని శత్రుదేశాలు పసిగట్టకుండా అడ్డుకునే స్టెల్త్ టెక్నాలజీ అందుబాటులోకి తెస్తున్నాం. శత్రుదేశాలు ఏ ఆయుధాన్ని ప్రయోగించినా.. దాని నుంచి తప్పించుకునేందుకు అవసరమైన టెక్నాలజీ రూపకల్పనకూ ప్రయోగాలు జరుగుతున్నాయి’ అని చెప్పారు -
టీడీపీ విధ్వంసాన్ని తీవ్రంగా పరిగణించాలి
సాక్షి, అమరావతి: అన్నమయ్య జిల్లా అంగళ్లు, చిత్తూరు జిల్లా పుంగనూరుల్లో తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్రబాబునాయుడు, ఇతర నేతల ప్రోద్బలంతో జరిగిన విధ్వంసాన్ని తీవ్రంగా పరిగణించాల్సిన అవసరం ఉందని పోలీసుల తరఫున అదనపు అడ్వొకేట్ జనరల్ (ఏఏజీ) పొన్నవోలు సుధాకర్‌రెడ్డి హైకోర్టుకు నివేదించారు. సమాజానికే ప్రమాదం కలిగించే ఇలాంటి ఘటనలను అడ్డుకోకుంటే విధ్వంసాన్ని ప్రోత్సహించినట్లవుతుందని అన్నారు. ఇలాంటి వ్యక్తులు, ఘటనల వల్ల సామాన్య ప్రజలకు రక్షణ లేకుండా పోతుందని తెలిపారు. అంతిమంగా ప్రజాస్వామ్యం మనుగడ ప్రశ్నార్థకం అవుతుందన్నారు. చట్టాన్ని చేతుల్లోకి తీసుకుని దౌర్జన్యం చేస్తామంటే ఊరుకునే ప్రసక్తే లేదని అన్నారు. అంగళ్లులో విధ్వంసం కేసులో ముందస్తు బెయిల్ కోరుతూ టీడీపీ సీనియర్ నేతలు నల్లారి కిషోర్ కుమార్‌రెడ్డి, దేవినేని ఉమామహేశ్వరరావు, పులివర్తి నాని దాఖలు చేసిన వ్యాజ్యాలపై న్యాయమూర్తి జస్టిస్ కంచిరెడ్డి సురేష్‌రెడ్డి గురువారం మరోసారి విచారణ జరిపారు. ఈ సందర్భంగా ఏఏజీ వాదనలు వినిపిస్తూ.. చట్ట ప్రకారం ఓ వ్యక్తిపై హత్యాయత్నం (ఐపీసీ సెక్షన్ 307) కేసు నమోదు చేయాలంటే అతను మరొకరిని గాయపరచాల్సిన అవసరం లేదని, చంపాలన్న ఉద్దేశం ఉంటే సరిపోతుందని వివరించారు. అంగళ్లులో చంద్రబాబు తరమండిరా.. చంపండిరా.. అంటూ తన పార్టీ కార్యకర్తలను అధికార పార్టీ నేతలపై, సామాన్యులపై ఉసిగొల్పారన్నారు. టీడీపీ కార్యకర్తల దాడిలో అధికార పార్టీకి చెందిన వారే కాక సామాన్యులు కూడా గాయపడ్డారన్నారు. అందుకే చంద్రబాబు, ఇతర నేతలపై పెట్టిన హత్యాయత్నం కేసు చెల్లుబాటవుతుందని వివరించారు. అన్నమయ్య జిల్లాలోని ప్రజలకు ఎంతో ముఖ్యమైన పిచ్చివాండ్లపల్లి ప్రాజెక్టుపై టీడీపీ నేతలు కొందరు స్టే తెచ్చారని, దీంతో ప్రాజెక్టును అడ్డుకోవద్దంటూ చంద్రబాబును అభ్యర్థించేందుకే అధికార పార్టీ నేతలు ప్రయత్నించారన్నారు. టీడీపీ నేతల విధ్వంసానికి స్పష్టమైన ఆధారాలున్నాయని చెప్పారు. విధ్వంస ఘటనల వీడియో ఉన్న పెన్‌డ్రైవ్‌ను ఆయన కోర్టుకు సమర్పించారు. పులివర్తి నానిపై 16 కేసులు ఉన్నాయన్నారు. ముందస్తు వ్యూహంలో భాగంగా యుద్ధభేరిలో పాల్గొన్న నేతలందరూ వారి నియోజకవర్గాల నుంచి మనుషులను తెచ్చుకుని, విధ్వంసం సృష్టించారన్నారు. అంగళ్లు నుంచి పుంగనూరు వరకు అప్రతిహతంగా విధ్వంసం కొనసాగించారని వివరించారు. ఈ సందర్భంగా పలువురు సాక్షుల వాంగ్మూలాలను చదివి వినిపించారు. పిటిషనర్లకు బెయిల్ ఇస్తే ఏదైనా చేసి బెయిల్ తెచ్చుకోవచ్చన్న భావన ప్రజల్లో ఏర్పడుతుందన్నారు. అందువల్ల బెయిల్ మంజూరు చేయవద్దని కోరారు. అనంతరం టీడీపీ నేత ఉమామహేశ్వరరావు తరఫున సీనియర్ న్యాయవాది పోసాని వెంకటేశ్వర్లు, కిషోర్ కుమార్‌రెడ్డి తరఫున న్యాయవాది ఎన్వీ సుమంత్ వాదనలు వినిపిస్తూ.. దర్యాప్తులో జోక్యం చేసుకోబోమని, విచారణ నుంచి పారిపోబోమని, ఏ షరతులు విధించినా లోబడి ఉంటామని తెలిపారు. ముందస్తు బెయిలు మంజూరు చేయాలని కోరారు. అంగళ్లు, పుంగనూరులో జరిగిన ఘటనలు వేర్వేరని, రెండింటినీ కలిపి పెద్దదిగా చిత్రీకరిస్తున్నారని వివరించారు. అధికార పార్టీ నేతలే చంద్రబాబు తదితరులపై రాళ్లు రువ్వారని చెప్పారు. వారి దాడిలో టీడీపీ నేతలు, కార్యకర్తలే గాయపడ్డారని తెలిపారు. పిచ్చివాండ్లపల్లి ప్రాజెక్టుపై హైకోర్టు ఎలాంటి స్టే ఇవ్వలేదన్నారు. ఇరుపక్షాల వాదనలు విన్న న్యాయమూర్తి జస్టిస్ సురేష్‌రెడ్డి తీర్పును వాయిదా వేశారు. తీర్పు వెలువరించేంత వరకు పిటిషనర్లను అరెస్ట్ చేయకుండా పోలీసులకు తగిన సూచనలు ఇవ్వాలని ఏఏజీకి స్పష్టం చేశారు. ఆయుధ చట్టం కింద నమోదు చేసిన కేసులో ముందస్తు బెయిల్ కోరుతూ నల్లారి కిషోర్ కుమార్‌రెడ్డి దాఖలు చేసిన వ్యాజ్యంలో కూడా న్యాయమూర్తి తీర్పును వాయిదా వేశారు. -
సైబర్ ఉగ్రవాదానికి ఇక చెక్
సాక్షి, అమరావతి: సైబర్ ఉగ్రవాదం ముప్పును ఎదుర్కొనేందుకు కేంద్ర హోం శాఖ పటిష్ట కార్యాచరణకు ఉపక్రమిస్తోంది. దేశంలో ఉగ్రవాద నిరోధక కార్యకలాపాలకు అడ్డుకట్ట వేయడంలో సమర్థంగా వ్యవహరిస్తున్న జాతీయ దర్యాప్తు సంస్థ (ఎన్ఐఏ) ఆధ్వర్వంలోనే ప్రత్యేక విభాగాన్ని ఏర్పాటు చేయాలని నిర్ణయించింది. ‘యాంటీ సైబర్ టెర్రరిజం యూనిట్ (ఏసీటీయూ) పేరిట ఈ ప్రత్యేక విభాగాన్ని నెలకొల్పనుంది. విదేశాలను కేంద్రంగా చేసుకుని దేశంలో ఉగ్రవాద కార్యకలాపాలు నిర్వహిస్తున్న ఉగ్రవాద సంస్థలు పదేళ్లుగా సైబర్ ఉగ్రవాదాన్ని ప్రేరేపిస్తున్నాయి. ప్రధానంగా దేశంలోని ప్రభుత్వ రంగ సంస్థలను లక్ష్యంగా చేసుకుని సైబర్ ఉగ్రవాదానికి పాల్పడుతున్నాయి. రక్షణ, పరిశోధన సంస్థలు, ఇస్రో, విద్యుత్ గ్రిడ్లు, టెలీ కమ్యూనికేషన్లు, బ్యాంకింగ్ తదితర రంగాలను దెబ్బతీయడమే లక్ష్యంగా పెట్టుకున్నాయి. ఆయా ప్రభుత్వ రంగ సంస్థలకు చెందిన సైబర్ నిపుణులు ఎంత అప్రమత్తంగా ఉంటున్నప్పటికీ పూర్తిస్థాయిలో సైబర్ దాడులను నిరోధించడంలో పూర్తిగా సఫలీకృతం కాలేకపోతున్నాయి. 2018లో దేశంలో ప్రభుత్వ రంగ సంస్థలపై 70,798 సైబర్ దాడులు జరిగాయి. కాగా.. 2023లో మొదటి 6 నెలల్లోనే ఏకంగా 1.12 లక్షల సైబర్ దాడులు జరగడం పరి స్థితి తీవ్రతకు నిదర్శనంగా నిలుస్తోంది. ఢిల్లీలోని ఆల్ ఇండియా ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ (ఎయిమ్స్) సమాచార వ్యవస్థపై సైబర్ దాడులతో కీలక వైద్య సేవలకు అంతరాయం ఏర్పడింది. విద్యుత్ గ్రిడ్స్పైనా ఉగ్రవాదం గురి లద్దాక్‌లోని విద్యుత్ గ్రిడ్లపై ఇటీవల జరిగిన సైబర్ దాడులతో చైనా సరిహద్దుల్లో విద్యుత్ మౌలిక సదుపాయాల వ్యవస్థకు ఉన్న ముప్పును గుర్తు చేసింది. కేరళ, గుజరాత్, తమిళనాడు, ఆంధ్రప్రదేశ్, తెలంగాణతోపాటు దేశంలోని వివిధ రాష్ట్రాల్లో ఉగ్రవాద కార్యకలాపాలు నిర్వహిస్తున్న నిషేధిత పాపులర్ ఫ్రంట్ ఆఫ్ ఇండియా (పీఎఫ్ఐ) సాఫ్ట్వేర్ శిక్షణ సంస్థల పేరుతో ఉగ్రవాద కార్యకలాపాలు ప్రోత్సహిస్తోందని ఎన్ఐఏ కేసులు నమోదు చేసింది. అనుమానితుల నివాసాల్లో సోదాలు నిర్వహించగా.. సైబర్ దాడులకు సంబంధించిన సమాచారం లభ్యమైనట్టు తెలుస్తోంది. ఇవన్నీ కూడా దేశం ఎదుర్కొంటున్న సైబర్ ఉగ్రవాద పెనుముప్పునకు సంకేతంగా నిలుస్తున్నాయి. అందుకే వెంటనే అప్రమత్తమైన కేంద్ర హోం శాఖ ఈ సమస్యకు శాశ్వత పరిష్కారంగానే ఎన్ఐఏలోనే అంతర్భాగంగా యాంటీ సైబర్ టెర్రరిజం యూనిట్(ఏసీటీయూ)ను నెలకొల్పాలని నిర్ణయించింది. రాష్ట్రాలతో అనుసంధానం.. విదేశాలతో సమన్వయం సైబర్ ఉగ్రవాదాన్ని నిరోధించేందుకు యాంటీ సైబర్ టెర్రరిజం యూనిట్ (ఏసీటీయూ) ఏర్పాటు తుది దశకు చేరుకుంది. భారీ స్థాయిలో పోలీస్ అధికారులు, సైబర్ భద్రతా నిపుణులు, ఇతర అధికారులు, సిబ్బందితోపాటు అధునాతన సాంకేతిక పరిజ్ఞానంతో ఏసీటీయూను రూపొందించే ప్రణాళికను కేంద్ర హోం శాఖ ఆమోదించింది. దీని పరిధిలో ఆర్థిక, ఐటీ, రక్షణ, టెలి కమ్యూనికేషన్లు, ఇతర రంగాలకు సంబంధించి సైబర్ సెల్స్ ఏర్పా టు చేస్తారు. దేశంలోని అన్ని పోలీసు శాఖల ఆధ్వర్యంలోని సైబర్ క్రైమ్స్ విభాగాలతోపాటు అన్ని ప్రభుత్వ రంగ సంస్థలు, పరిశోధన సంస్థల సైబర్ సెల్స్‌తో ఏసీటీయూను అనుసంధానిస్తారు. ఈ మేరకు ఇప్పటికే రాష్ట్ర సైబర్ క్రైమ్ విభాగాలకు కేంద్ర హోం శాఖ సమాచారం పంపింది. ఉగ్రవాద సంస్థలు విదేశాలను కేంద్ర స్థానంగా చేసుకునే సైబర్ దాడులకు పాల్పడుతున్నాయి. అందుకు ఏసీటీయూకు విదేశాలతో సమన్వయం చేసుకునేందుకు ఇంటర్ పోల్‌తోపాటు విదేశీ దర్యాప్తు సంస్థలతో సమన్వయం చేసుకునేందుకు అధికారాన్ని కలి్పస్తారు. విదేశాల్లోని దర్యాప్తు సంస్థలతో సమాచార మార్పిడి, ఇతర సహకారం కోసం ప్రత్యేకంగా ఒప్పందాలు చేసుకుంటారు. రెండు నెలల్లో ఏసీటీయూను అధికారికంగా ఏర్పాటు చేయాలని కేంద్ర హోం శాఖ భావిస్తోంది. అందుకోసం ఎన్ఐఏ తుది సన్నాహాలను వేగవంతం చేస్తోంది. -
ప్రాణ, ఆస్తి నష్టం సంభవించకుండా..ఏం చర్యలు తీసుకున్నారు?
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో వర్షాలు, వరదల కారణంగా ప్రాణ, ఆస్తి నష్టం సంభవించకుండా ఏం చర్యలు తీసుకున్నారో చెప్పాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని హైకోర్టు ఆదేశించింది. ‘రాష్ట్రంలో వరద కారణంగా ఇంతవరకు ఎంతమంది చనిపోయారు? డిజాస్టర్ చట్టం ప్రకారం ఎంతమందిని రక్షించారు? గోదావరి తీర ప్రాంత గ్రామాల రక్షణకు ఏం చర్యలు చేపట్టారు? బాధితులకు కనీస సౌకర్యాలు అందిస్తున్నారా? వరదలపై వార్‌రూమ్ ఎందుకు ఏర్పాటు చేయలేదు? ఎన్నికలప్పుడు ఏర్పాటు చేస్తారు కానీ.. వరదలు లాంటి అత్యవసర సమయంలో ఏర్పాటు చేయరా?..’అని ప్రశ్నించింది. పూర్తి వివరాలతో ఓ నివేదికను సోమవారం అందజేయాలని స్పష్టం చేసింది. రాష్ట్రంలో కొద్ది రోజులుగా వర్షాలు, వరదల నేపథ్యంలో ప్రభుత్వం ఏం చర్యలు తీసుకుందో వెల్లడించడం లేదని, రక్షణ చర్యలు తీసుకునేలా రాష్ట్ర సర్కారుకు ఆదేశాలు జారీ చేయాలని కోరుతూ హైకోర్టులో ఓ పిటిషన్ దాఖలైంది. దీనిపై ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ అలోక్ అరాధే, జస్టిస్ వినోద్‌కుమార్ ధర్మాసనం శుక్రవారం ప్రత్యేకంగా విచారణ చేపట్టింది. రాష్ట్ర ప్రభుత్వం ఏం చెప్పడం లేదు.. ‘వర్షాలు, వరదలపై రాష్ట్ర ప్రభుత్వాన్ని కేంద్రం హెచ్చరించింది. ప్రాణ, ఆస్తి నష్టం సంభవించకుండా చర్యలు తీసుకోవాలని సూచించింది. రాష్ట్రంలో వరదల కారణంగా 19 మంది మృతి చెందారని పత్రికల్లో వస్తున్న వార్తలు తెలియజేస్తున్నాయి. వరదలు ఇంకా కొనసాగే అవకాశం ఉందని కేంద్రం మరోసారి తెలియజేసింది. అయితే రాష్ట్ర ప్రభుత్వం మాత్రం వరదల నుంచి ప్రజలను రక్షించడానికి ఏం చర్యలు తీసుకున్నారు? ఎంత మంది మరణించారు? లాంటి వివరాలను వెల్లడించడం లేదు. కడెం ప్రాజెక్టు వద్ద తీవ్ర భయానక పరిస్థితి కొనసాగుతోంది. ప్రాజెక్టు తెగితే వందల గ్రామాలు నీట మునగడంతో పాటు లక్షల మంది నిరాశ్రయులుగా మారే అవకాశం ఉంది..’అంటూ న్యాయవాదులు చిక్కుడు ప్రభాకర్, పల్లె ప్రదీప్‌కుమార్ కోర్టు దృష్టికి తెచ్చారు. దీంతో ‘వరద బాధితులకు తక్షణమే కనీస సౌకర్యాలు అందేలా ఏర్పాట్లు చేయాలి. కడెం ప్రాజెక్టు లోతట్టు ప్రాంతాల్లో ఉన్న వారిని భద్రతా చట్ట ప్రకారం చర్యలు చేపట్టి వెంటనే రక్షించాలి. ఎలాంటి ప్రాణ నష్టం సంభవించకుండా చూడాలి..’అని ప్రభుత్వానికి హైకోర్టు సూచించింది. తదు పరి విచారణను ఈ నెల 31కి వాయిదా వేసింది. -
Kargil Vijay Diwas: ఘర్ మే ఘుస్ కే...
ద్రాస్ (లద్దాఖ్): భారత్ తన గౌరవ ప్రతిష్టలను కాపాడుకోవడానికి నియంత్రణ రేఖను దాటడానికి సిద్ధంగా ఉందని రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ అన్నారు. అలాంటి పరిస్థితి వస్తే సైనికులకు సహకారం అందించడానికి పౌరులందరూ సన్నద్ధంగా ఉండాలని పిలుపునిచ్చారు. కార్గిల్ యుద్ధంలో విజయం సాధించి 24 ఏళ్లు పూర్తయిన సందర్భంగా బుధవారం దేశమంతా విజయ్ దివస్ జరుపుకుంది. ద్రాస్‌లోని కార్గిల్ యుద్ధ స్మారకం వద్ద ఏర్పాటు చేసిన ఒక కార్యక్రమంలో రాజ్‌నాథ్ మాట్లాడుతూ రష్యా, ఉక్రెయిన్ మధ్య ఏడాది దాటినా ఇంకా యుద్ధం కొనసాగుతోందని అంటే పౌరులు భాగస్వాములు కావడం వల్లేనని అభిప్రాయపడ్డారు. పొరుగుదేశమైన పాకిస్తాన్ కవి్వంపు చర్యల్ని పరోక్షంగా ప్రస్తావించిన ఆయన మన దేశ గౌరవాన్ని, మర్యాదని కాపాడుకోవడానికి ఎంత తీవ్రమైన చర్యలకైనా దిగుతామని హెచ్చరించారు. పొరుగుదేశం రెచ్చగొట్టే చర్యలకి దిగితే నియంత్రణ రేఖ దాటుతామన్నారు. ‘‘మన దేశంలో యుద్ధం పరిస్థితులు వస్తే సైనిక బలగాలకు ప్రజలు ఎప్పుడూ అండగా ఉంటారు. పరోక్షంగా తమ సహకారాన్ని అందిస్తారు. ఈ సారి అవసరమైతే ప్రత్యక్షంగా యుద్ధభూమిలో పాల్గొనాలని, దానికి తగ్గట్టు మానసికంగా సంసిద్ధులు కావాలని కోరుతున్నాను’’ అని ప్రజలకు ఆయన పిలుపునిచ్చారు. దేశ ప్రయోజనాలను కాపాడుకునే అంశంలో మన సైన్యం వెనక్కి తగ్గే ప్రసక్తే లేదని కార్గిల్ యుద్ధం సమయంలో భారత ఆర్మీ పాకిస్తాన్కేకాక యావత్ ప్రపంచానికి సందేశం పంపించిందన్నారు. పాకిస్తాన్ మనకి వెన్నుపోటు పొడవడంతో కార్గిల్ యుద్ధం వచి్చందన్నారు. అంతకు ముందు కార్గిల్ యుద్ధంలో వీరమరణం పొందిన జవాన్ల సమాధుల్ని సందర్శించి పుష్ఫగుచ్ఛాలుంచి నివాళులరి్పంచారు. ప్రధాని నివాళులు కార్గిల్ యుద్ధంలో వీరమరణం పొందిన సైనికులకు రాష్టపతి ద్రౌపదీ ముర్ము, ప్రధాని నరేంద్ర మోదీ , కేంద్ర మంత్రులు, ఇతర నాయకులు నివాళులర్పించారు. విజయ్ దివస్ సందర్భంగా రాష్ట్రపతి ముర్ము ట్వీట్ చేశారు. ‘‘మన దేశ సైనికుల అపూర్వమైన విజయాన్ని దేశం గుర్తు చేసుకుంటోంది. దేశం కోసం ప్రాణాలు కోల్పోయిన అమరులందరికీ నివాళులరి్పస్తున్నాను. దేశం కోసం త్యాగం చేసిన వారి గాథలన్నీ తరతరాలకు స్ఫూర్తి దాయకం’’ అని ఆ ట్వీట్లో పేర్కొన్నారు. ప్రధాని మోదీ తన ట్వీట్లో కార్గిల్ విజయ్ దివస్ భారత వీరుల ధైర్య గాథల్ని గుర్తు చేస్తుందని, ప్రజలందరికీ వారు స్ఫూర్తిదాయకంగా నిలిచారని పేర్కొన్నారు. అమరులందరికీ హృదయపూర్వక నివాళులరి్పస్తున్నట్టుగా పేర్కొన్నారు. 1999లో కార్గిల్‌ను ఆక్రమించిన పాకిస్తాన్ సైన్యాన్ని తిప్పికొట్టి భారత్ విజయ దుందుభి మోగించింది. -
చంద్రయాన్–3లో తెలుగు రక్షణ కవచం!
సాక్షి, అమరావతి: జాబిలిపై అన్వేషణకు బయల్దేరిన చంద్రయాన్–3 ఉపగ్రహానికి రక్షణ కవచం తొడిగారు బెజవాడకు చెందిన ఇంజినీరు బొమ్మారెడ్డి నాగభూషణరెడ్డి (బీఎన్ రెడ్డి). ఉపగ్రహంలో గుండెకాయ వంటి అత్యంత కీలకమైన బ్యాటరీలను కాపాడే రక్షణ కవచాన్ని, మరికొన్ని విడిభాగాలను బీఎన్ రెడ్డి స్థాపించిన ‘నాగసాయి ప్రెసిషియన్ ఇంజినీర్స్ ప్రైవేట్ లిమిటెడ్’ కంపెనీనే అందించింది. ఉపగ్రహాల్లో బ్యాటరీలకు రక్షణ కవచాల తయారీలో ఈ సంస్ధ దేశంలోనే పేరెన్నికగన్నది. హైదరాబాద్ కేంద్రంగా పని చేసే ఈ కంపెనీ ఇప్పటివరకు 50 శాటిలైట్లకు విడి భాగాలను అందించింది. తాజాగా చంద్రయాన్–3లో రోవర్, ల్యాండర్, ప్రొపల్షన్ మాడ్యుల్స్లో బ్యాటరీలను అమర్చే అల్యూమినియం స్టాండ్స్, నాసిల్స్, స్లీవ్స్‌ను సమకూర్చింది. గతంలో చంద్రయాన్–1, చంద్రయాన్–2తో పాటు ఇస్రో నిర్వహించిన అనేక ప్రయోగాల్లో ఈ సంస్థ భాగస్వామి అయ్యింది. హిందుస్థాన్ ఏరోనాటిక్స్ లిమిటెడ్ (హెచ్ఏఎల్), భారత్ ఎల్రక్టానిక్స్ లిమిటెడ్ (బీఈఎల్)తో కలిసి పని చేయడంతో పాటు ఏరో స్పేస్, యుద్ధ విమానాల విడిభాగాలను కూడా వివిధ విమాన తయారీ సంస్థలకు సమకూరుస్తోంది. ఏరో స్పేస్ రంగంలో ఉజ్వల భవిష్యత్తును ఊహించి.. బీఎన్ రెడ్డి తండ్రి వెంకటరామిరెడ్డి విజయవాడ, గన్నవరంలో రైల్వే ఇంజినీరుగా పని చేసేవారు. ఈ క్రమంలోనే బీఎన్ రెడ్డి విద్యాభ్యాసం కేబీఎన్, సిద్థార్థ ఇంజినీరింగ్ కాలేజీల్లో సాగింది. 1982లో హైదరాబాద్ వెళ్లిన ఆయన ఓ చిన్న పరిశ్రమలో ఉద్యోగిగా చేరారు. అనంతరం జాతీయ స్థాయిలో ప్రతిష్టాత్మక సంస్థ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టూల్స్, డిజైనింగ్స్‌లో మెకానికల్ ఇంజినీరింగ్‌లో ఎంటెక్ పూర్తి చేశారు. తర్వాత అల్విన్ లిమిటెడ్‌లో ఉద్యోగంలో చేరారు. ఏరో స్పేస్ రంగంలో ఉజ్వల భవిష్యత్తు ఉంటుందని గ్రహించి 1994లో సొంతంగా ‘నాగసాయి ప్రెసిషియన్ ఇంజినీర్స్ ప్రైవేట్ లిమిటెడ్’ను స్థాపించారు. తొలినాళ్లలో లైట్ ఎయిర్‌క్రాఫ్ట్ పరికరాలను తయారు చేసేవారు. 1998 నుంచి ఇస్రో ప్రయోగాలకు అవసరమైన వివిధ ఉపకరణాలను అందించడంపై దృష్టి పెట్టారు. బీఎన్ రెడ్డి పనితీరు, నైపుణ్యాన్ని ఇస్రో ఉన్నతాధికారులు 6 నెలల పాటు పరీక్షించారు. పూర్తిగా సంతృప్తి చెందిన తర్వాత అవకాశం కల్పించారు. అల్యూమినియం ప్లాంటు ఏర్పాటుకు విశేష కృషి ఒకప్పుడు శాటిలైట్‌లో విడి భాగాల తయారీకి ఉపయోగించే ప్రత్యేక అల్యూమినియాన్ని ఇజ్రాయెల్ నుంచి దిగుమతి చేసుకోవాల్సి వచ్చేది. ఇది అధిక సమయం, ఖర్చుతో కూడుకున్నది. ఆ తర్వాత హైదరాబాద్‌లోనే నాణ్యమైన అల్యూమినియం ప్లాంటు ఏర్పాటు జరిగింది. ఈ ప్లాంటు ఏర్పాటుకు బీఎన్ రెడ్డి విశేష కృషి చేశారు. దీని ద్వారా ఖర్చు, సమయం ఆదా అవుతున్నాయి. ఇస్రో, నాసాతో భాగస్వామ్యమే లక్ష్యం ‘‘ఇస్రో, నాసాల శాటిలైట్ ప్రయోగాల్లో నా కంపెనీ భాగస్వామ్యం ఉండాలన్నదే నా లక్ష్యం. స్వదేశీ పరిజ్ఞానంతో పరికరాల తయారీ ద్వారా ప్రయోగాల ఖర్చు చాలా వరకు తగ్గుతుంది. ఇప్పుడు చంద్రయాన్–3ని కూడా తక్కువ ఖర్చుతోనే చేపట్టారు. ప్రయోగంలో శాటిలైట్ విజయవంతంగా కక్ష్యలోకి వెళ్లడం సంతోషంగా ఉంది’’ అని బీఎన్ రెడ్డి ‘సాక్షి’కి తెలిపారు. -
హాని చేయాలని చూస్తే బుద్ధి చెబుతాం
కాంకేర్(ఛత్తీస్‌గఢ్): భారత్‌కు ఎవరైనా హాని కలిగించాలని చూస్తే తగిన బుద్ధి చెబుతామని రక్షణమంత్రి రాజ్‌నాథ్ సింగ్ పొరుగుదేశాన్ని హెచ్చరించారు. ఛత్తీస్‌గఢ్‌లోని మావోయిస్ట్ ప్రభావిత కాంకేర్‌లో శనివారం జరిగిన ర్యాలీలో ఆయన మాట్లాడారు. తొమ్మిదేళ్లలో ప్రధాని మోదీ ప్రభుత్వం సాధించిన విజయాలను ఈ సందర్భంగా మంత్రి వివరించారు. పుల్వామా, ఉడి ఉగ్రదాడులకు ప్రతిగా 2016, 2019ల్లో చేపట్టిన సర్జికల్ స్ట్రైక్‌లను ఆయన ప్రస్తావించారు. ప్రధాని మోదీ నాయకత్వంలో దేశం శక్తివంతంగా మారింది, ఇప్పుడు బలహీన దేశం ఎంతమాత్రం కాదని చెప్పారు. కేంద్రం చేపట్టిన చర్యలతో వామపక్ష తీవ్రవాద సంబంధ ఘటనలు ఇప్పుడు కేవలం 10–12 జిల్లాలకు మాత్రమే పరిమితం అయ్యాయన్నారు. -
భారత్ వాణిని ప్రపంచం ఆసక్తిగా వింటోంది
జమ్మూ: ప్రధానమంత్రి నరేంద్ర మోదీ హయాంలో ప్రపంచ వేదికపై భారత్ పలుకుబడి, స్థాయి పెరిగిపోయాయని రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ పేర్కొన్నారు. భారత్ చెప్పే విషయాలను ప్రపంచ సమాజం ఇప్పుడు ఆసక్తిగా వింటోందని చెప్పారు. గతంలో అంతర్జాతీయ వేదికలపై భారత్ ఏ విషయమైనా చెబితే, అంత సీరియస్‌గా తీసుకునేవారు కారని తెలిపారు. మోదీ ప్రభుత్వం వచ్చాక 2014 తర్వాత అలాంటి పరిస్థితులు లేవని చెప్పారు. యూనివర్సిటీ ఆఫ్ జమ్మూలో జాతీయ భద్రతపై జరిగిన సదస్సులో సోమవారం ఆయన మాట్లాడారు. ప్రధాని మోదీ అమెరికా, ఈజిప్టుల్లో ఆరు రోజుల పర్యటన సందర్భంగా పలు చారిత్రక ఒప్పందాలపై సంతకాలు చేసిన నేపథ్యంలో రాజ్‌నాథ్ ఈ వ్యాఖ్యలు చేశారు. విదేశాల్లో ప్రధాని మోదీ పలుకుబడి పెరిగిందని చెప్పారు. ఆస్ట్రేలియా ప్రధాని ఆల్బనీస్ ‘బాస్’అంటూ మోదీని అభివరి్ణంచగా, అమెరికా అధ్యక్షుడు బైడెన్ ఆటోగ్రాఫ్ తీసుకునేంత ప్రజాదరణ కలిగిన నేతగా కొనియాడిన నేపథ్యంలో మంత్రి ఈ మాటలన్నారు. ప్రధాని మోదీ హయాంలో భారత్ మరింత శక్తివంతంగా మారిందన్న ఆయన..అవసరమైన పక్షంలో సరిహద్దుల వెలుపల కూడా దాడి చేయగలదంటూ పొరుగుదేశం పాకిస్తాన్‌ను హెచ్చరించారు. ఉగ్రవాదంపై మోదీ ప్రభుత్వం సమర్థవంతమైన చర్యలు తీసుకుందని చెప్పారు. ఉగ్రవాదంపై ‘జీరో టాలరెన్స్’విధానం అంటే అర్థం ఏమిటో దేశంతోపాటు ప్రపంచమే తెలుసుకుందని వ్యాఖ్యానించారు. 2016, 2019ల్లో జరిపిన సర్జికల్ స్ట్రైక్స్‌ను ఆయన ప్రస్తావిస్తూ..ఇందుకు సంబంధించిన నిర్ణయాలను ప్రధాని మోదీ కేవలం 10 నిమిషాల్లోనే తీసుకున్నారని, దీన్ని బట్టి ఆయన సామర్థ్యమేంటో తెలుస్తుందని రాజ్‌నాథ్ తెలిపారు. సరిహద్దుల లోపలే కాదు, వెలుపల కూడా ఉగ్రవాదుల నెట్‌వర్క్‌ను మన బలగాలు ధ్వంసం చేశాయన్నారు. ఉగ్రవాదాన్ని పెంచిపోíÙంచడమే ప్రభుత్వ విధానంగా మార్చుకున్న దేశాలు ఈ ఆటను ఎక్కువ సేపు ఆడలేవన్న విషయాన్ని గ్రహించాలని ఆయన పాక్‌నుద్దేశించి వ్యాఖ్యలు చేశారు. భారత్ కృషితో నేడు చాలా వరకు పెద్ద దేశాలు ఉగ్రవాదంపై కలిసికట్టుగా పోరాడుతున్నాయని చెప్పారు. కశీ్మర్లో ఉగ్రవాదాన్ని ప్రేరేపించడం ద్వారా ఏమీ సాధించలేమన్న విషయం పాక్ తెలుసుకోవాలన్నారు. పాక్ ముందుగా తన సొంతింటిని చక్కదిద్దుకోవాలని హితవుపలికారు. పాక్ ఆక్రమిత కశీ్మర్ కూడా భారత్‌దేనని చెప్పారు. దీనిపై పార్లమెంట్ ఇప్పటికే పలు తీర్మానాలు చేసిందని గుర్తు చేశారు. జమ్మూకశీ్మర్‌లో తామూ భాగమేనంటూ పీవోకే ప్రజలు డిమాండ్ చేసే రోజులు ఎంతో దూరంలో లేవని రాజ్‌నాథ్ వ్యాఖ్యానించారు. -
మాల్దీవులకు భారత్ గస్తీ నౌక, ల్యాండింగ్ క్రాఫ్ట్
న్యూఢిల్లీ: కీలకమైన మిత్రదేశమైన మాల్దీవులకు భారత్ గస్తీ నౌక, ల్యాండింగ్ క్రాఫ్ట్‌లను కానుకగా అందివ్వనుంది. మే ఒకటి నుంచి మూడో తేదీ వరకు రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ మాల్దీవుల్లో పర్యటించనున్నారు. ఈ సందర్భంగా వీటిని అందజేస్తారు. హిందూ మహాసముద్ర ప్రాంతంలో కొంతకాలంగా పెరుగుతున్న చైనా దూకుడుకు అడ్డుకట్ట వేసే దిశగా భారత్ తీసుకుంటున్న చర్యల్లో ఇది భాగమని చెబుతున్నారు. పర్యటనలో భాగంగా మాల్దీవుల అధ్యక్షుడు ఇబ్రహీం సోలిహ్, విదేశాంగ మంత్రి అబ్దుల్లా సాహిత్, రక్షణ మంత్రి మరియా దీదీతోనూ రాజ్‌నాథ్ చర్చలు జరుపుతారు. -
SCO Defence Ministers Meet: ఉగ్రవాదాన్ని పెకిలిద్దాం
న్యూఢిల్లీ: ప్రపంచానికి పెనుముప్పుగా పరిణమించిన ఉగ్రవాదాన్ని సమూలంగా పెకిలించి వేయాల్సిన అవసరం ఉందని రక్షణ శాఖ రాజ్‌నాథ్ సింగ్ చెప్పారు. ఈ విషయంలో షాంఘై కో–అపరేషన్ ఆర్గనైజేషన్(ఎస్సీఓ) సభ్యదేశాలు కలిసికట్టుగా పనిచేయాలని పిలుపునిచ్చారు. ఉగ్రభూతం ఏ రూపంలో ఉన్నా ప్రమాదకరమేనని, దాన్ని అంతం చేయాల్సిందేనని పేర్కొన్నారు. శుక్రవారం ఢిల్లీలో ఎస్సీఓ సభ్యదేశాల రక్షణ శాఖ మంత్రుల సదస్సులో ఆయన మాట్లాడారు. ఉగ్రవాదానికి అండదండలు అందించేవారి పీచమణచాలని చెప్పారు. కూటమిలోని సభ్యదేశాల సార్వభౌమత్వాన్ని, ప్రాదేశిక సమగ్రతను పరస్పరం గౌరవించుకొనేందుకు ఒక ఫ్రేమ్‌వర్క్ సిద్ధం చేయాలని అన్నారు. చైనా, పాకిస్తాన్ తీరును పరోక్షంగా ఆయన తప్పుపట్టారు. ఎస్సీఓ సదస్సుకు రాజ్‌నాథ్ సింగ్ అధ్యక్షత వహించారు. సభ్య దేశాల నడుమ విశ్వాసం, సహకారం మరింత బలోపేతం కావాలని తాము కోరుకుంటున్నట్లు స్పష్టం చేశారు. ఐక్యరాజ్యసమితి చార్టర్ ప్రకారం శాంతి, భద్రతకు ఊతం ఇవ్వాలన్నదే తమ ఆశయమని వివరించారు. ఎస్సీఓ సదస్సుకు చైనా, రష్యా తదితర సభ్య దేశాల రక్షణశాఖ మంత్రులు హాజరయ్యారు. పాకిస్తాన్ రక్షణ శాఖ మంత్రి హాజరు కాలేదు. ఆయన బదులుగా పాకిస్తాన్ ప్రధానమంత్రి ప్రత్యేక సహాయకుడు మాలిక్ అహ్మద్ ఖాన్ వర్చువల్‌గా పాల్గొన్నారు. షాంఘై సహకార కూటమి 2001లో షాంఘైలో ఏర్పాటయ్యింది. ఇందులో భారత్, రష్యా, చైనా, కిర్గిస్తాన్, కజకిస్తాన్, తజికిస్తాన్, ఉజ్బెకిస్తాన్ సభ్యదేశాలుగా ఉన్నాయి. 2017లో పాకిస్తాన్ శాశ్వత సభ్యదేశంగా మారింది. -
సరిహద్దుల్లో శాంతితోనే సత్సంబంధాలు
న్యూఢిల్లీ: భారత్–చైనా మధ్య సత్సంబంధాలు కొనసాగాలంటే సరిహద్దు సమస్యలన్నీ ద్వైపాక్షిక ఒప్పందాలకు లోబడి పరిష్కారం కావాల్సి ఉందని రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ కుండబద్దలు కొట్టారు. గురువారం ఆయన చైనా రక్షణ మంత్రి లి షంగ్ఫుతో చర్చలు జరిపారు. తూర్పు లద్దాఖ్‌లోని వాస్తవాధీన రేఖ వెంబడి(ఎల్ఏసీ) మూడేళ్లుగా కొనసాగుతున్న ఉద్రిక్తతలతో రెండు దేశాల మధ్య సంబంధాలు దెబ్బతిన్న నేపథ్యంలో జరిగిన ఈ సమావేశం ప్రాధాన్యం సంతరించుకుంది. శుక్రవారం జరిగే షాంఘై సహకార సంస్థ(ఎస్సీవో) దేశాల రక్షణ మంత్రుల సమావేశం కోసం లి గురువారం ఢిల్లీకి చేరుకున్నారు. ఈ సందర్భంగా రాజ్‌నాథ్, లి సుమారు 45 నిమిషాలసేపు చర్చలు జరిపారు. ఇరువురు మంత్రులు సరిహద్దు వివాదాలతోపాటు ద్వైపాక్షిక సంబంధాలపై ఎటువంటి దాపరికాలు లేకుండా చర్చలు జరిపినట్లు రక్షణ శాఖ ఒక ప్రకటనలో తెలిపింది. ఎల్ఏసీ వెంట నెలకొన్న వివాదాలు రెండు దేశాల మధ్య కుదిరిన ఒప్పందాలు, హామీలు, ఒడంబడికలకు లోబడి పరిష్కారం కావాలని రక్షణ మంత్రి రాజ్‌నాథ్ తెలిపారు. ‘సరిహద్దుల్లో శాంతియుత వాతావరణాన్ని బట్టే రెండు దేశాల మధ్య సంబంధాల కొనసాగింపు ఆధారపడి ఉంటుందని ఆయన స్పష్టం చేశారు. సరిహద్దు ఒప్పందాల ఉల్లంఘనలతో ద్వైపాక్షిక సంబంధాలు దెబ్బతింటాయని, ఉద్రిక్తతలు సడలిన తర్వాత మాత్రమే బలగాల ఉపసంహరణ ఉంటుందని తెలిపారు’అని రక్షణ శాఖ ఆ ప్రకటనలో వివరించింది. -
సైన్యానికి దన్నుగా స్వయ
సాక్షి, హైదరాబాద్: రక్షణరంగ అవసరాల కోసం దేశంలోనే తొలిసారిగా నాలుగు కాళ్ల రోబో, సైనికులు ధరించగల ఎక్సోస్కెలిటన్ నమూనాలు సిద్ధమయ్యాయి. డీఆర్డీవో అనుబంధ సంస్థలైన రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ ఎస్టాబ్లిష్మెంట్, డిఫెన్స్ బయో–ఇంజనీరింగ్ అండ్ ఎలక్ట్రో మెడికల్ లేబొరేటరీల సహాయ సహకారాలతో హైదరాబాద్‌కు చెందిన స్టార్టప్ సంస్థ స్వయ రొబోటిక్స్ వీటిని రూపొందించింది. ఈ నమూనాలను రక్షణశాఖ సలహాదారు, డీఆర్డీవో మాజీ చైర్మన్ డాక్టర్ జి.సతీశ్‌రెడ్డి సోమవారం ఆయన పరిశీలించారు. రక్షణ, డీఆర్డీవో వర్గాలతో కలసి రోబో తయారీ అభివృద్ధి పనులను సమీక్షించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రక్షణ రంగంలో రానున్న కాలంలో రోబోలదే కీలకపాత్రని స్పష్టం చేశారు. ప్రతికూల భౌగోళిక పరిస్థితులను అధిగమించి నిఘా పనులు చేసేందుకు, సైనికుల మోతబరువును తగ్గించడంలోనూ రోబోల సేవలు ఎంతగానో ఉపయోగపడతాయన్నారు. ‘‘అతితక్కువ కాలంలో స్వయ రోబోటిక్స్ వీటిని (రోబో, ఎక్సోస్కెలిటన్లను) రూపొందించడం హర్షణీయం. దేశ రొబోటిక్స్ రంగం పురోగతికి ఇలాంటి భాగస్వామ్యాలు ఎంతో ఉపయోగపడతాయి. క్షేత్ర పరీక్షలు వేగంగా పూర్తి చేసి అటు రక్షణ, ఇటు పరిశ్రమ వర్గాలకు ఉపయోగపడే ఈ రకమైన రోబోలను వేగంగా అభివృద్ధి చేయాలని అనుకుంటున్నాం’’అని సతీశ్‌రెడ్డి చెప్పారు. డీఆర్డీవో ‘మేకిన్ ఇండియా’కార్యక్రమంలో భాగంగా స్వయ రోబోటిక్స్ వంటి ప్రైవేటు సంస్థలతో రోబోలను తయారు చేయడం ఇదే మొదటిసారి. ప్రస్తుతం ఇలాంటి సైనిక రోబోలను అమెరికా, స్విట్జర్లాండ్ల నుంచి దిగుమతి చేసుకుంటుండగా లేహ్, లద్దాఖ్ లాంటి ప్రాంతాల్లో అవి పనిచేయలేవు. ఎందుకంటే వాటిని నిర్దిష్ట పరిసరాల్లోనే పనిచేసేలా రూపొందించారు. పైగా వాటిల్లో ఫీచర్లు కూడా తక్కువ. ఈ ఇబ్బందులను అధిగమించేందుకు స్వయ రోబోలు ఉపయోగపడతాయని అంచనా. రెండేళ్లలో మిలటరీకి: విజయ్ శీలం రక్షణ శాఖ అవసరాలకోసం సిద్ధం చేసిన రోబో నమూనా తొలి తరానిదని.. మరిన్ని ఫీచర్లు, సామర్థ్యాలను జోడించేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయని స్వయ రోబోటిక్స్ వ్యవస్థాపక మేనేజింగ్ డైరెక్టర్ విజయ్ ఆర్.శీలం తెలిపారు. అమెరికాలో బోస్టన్ డైనమిక్స్‌తో పాటు ఇతర దేశాల్లోని కొన్ని సంస్థలు కూడా ఇలాంటి రోబోలు తయారు చేస్తున్నా... మిలటరీ అవసరాల కోసం తామే తొలిసారి తయారు చేశామని ఆయన ‘సాక్షి’తో మాట్లాడుతూ చెప్పారు. సైనికులు వాడే ఆయుధాలు, సమాచార పరికరాలను ఈ రోబో సునాయాసంగా మోసుకెళ్లగలదని, ప్రమాదకర పరిస్థితుల్లోనూ శత్రు స్థావరాలను పరిశీలించి రాగలదని ఆయన తెలిపారు. జమ్మూకశ్మీర్ సరిహద్దులపై నిఘా ఉంచే రోబోలను ఇతర ప్రాంతాల నుంచి కూడా నియంత్రించొచ్చని వివరించారు. తొలితరం నమూనాలో నడక మాత్రమే సాధ్యమవుతుందని, సమీప భవిష్యత్తులోనే వాటికి చూపును కూడా అందించే ప్రయత్నం చేస్తున్నామన్నారు. అన్నీ సవ్యంగా సాగితే ఇంకో రెండేళ్లలో ఈ రోబో సైన్యానికి సేవలందించే అవకాశం ఉందన్నారు. పాదాల్లో ఏర్పాటు చేసిన సెన్స ర్లు, ఇతర పరికరాల ద్వారా ఈ రోబో నేల, కాంక్రీట్, రాయిల మధ్య తేడాలను గుర్తించి నడకను నియంత్రించుకోగలదని వివరించారు. -
లోకేష్ మెషీన్స్ కొత్త ప్లాంటు
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: సీఎన్సీ మెషీన్స్, వాహన విడిభాగాల తయారీలో ఉన్న లోకేష్ మెషీన్స్ రక్షణ, అంతరిక్ష రంగ ఉత్పత్తుల విభాగంలోకి ప్రవేశిస్తోంది. ఇందుకోసం హైదరాబాద్ సమీపంలోకి కాలకల్ వద్ద 11 ఎకరాల్లో ప్లాంటును నెలకొల్పుతోంది. తొలి దశలో రూ.100 కోట్ల వ్యయం చేయనుంది. 4–6 నెలల్లో ఉత్పత్తి ప్రారంభం అవుతుందని కంపెనీ డైరెక్టర్ ఎం.శ్రీనివాస్ సాక్షి బిజినెస్ బ్యూరోకు తెలిపారు. ‘భారత్‌తోపాటు అంతర్జాతీయ మార్కెట్ కోసం నూతన కేంద్రంలో చిన్న, మధ్యతరహా ఆయుధాలను తయారు చేస్తాం. ప్రత్యక్షంగా 200, పరోక్షంగా 800 మందికి ఉపాధి లభిస్తుంది. రెండవ దశలో మరో రూ.150 కోట్లు వెచ్చిస్తాం. ప్రతిపాదిత ఫెసిలిటీ పక్కన 3 ఎకరాల్లో వెండార్ పార్క్ ఏర్పాటు చేస్తాం. విడిభాగాల తయారీలో ఉన్న 8 యూనిట్లు ఈ పార్క్‌లో వచ్చే అవకాశం ఉంది. లోకేష్ మెషీన్స్ ఆర్డర్ బుక్ రూ.250 కోట్లుంది. 2021–22లో రూ.201 కోట్ల టర్నోవర్ సాధించాం. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో 25–30 శాతం వృద్ధి ఆశిస్తున్నాం’ అని వివరించారు. మేడ్చల్ కేంద్రంలో కంపెనీ కొత్త విభాగాన్ని లోకేష్ మెషీన్స్ ఎండీ ఎం.లోకేశ్వర రావు సమక్షంలో రక్షణ మంత్రి శాస్త్రీయ సలహాదారు జి.సతీష్ రెడ్డి శుక్రవారం ప్రారంభించారు. -
తైవాన్‌కి చుక్కలు చూపించేలా.. చైనా సైనిక విన్యాసాలు
చైనా మళ్లీ తైవాన్‌పై కయ్యానికి కాలుదువ్వే కవ్వింపు చర్యలకు దిగుతోంది. ఈ మేరకు తైవాన్‌కి సమీపంలోని జల, వాయు మార్గాల్లో చైనా సైనిక విన్యాసాలు నిర్వహించిందని తైవాన్ రక్షణ మంత్రిత్వశాఖ పేర్కొంది. దీన్ని చైనా చేస్తున్న అతిపెద్ద చొరబాటు ప్రయత్నంగా తైవాన్ చెబుతోంది. ఐతే చైనా మిలటరీ మాత్రం ఇది అమెరికా కవ్వింపు చర్యలకు ప్రతిగా ఈ సైనిక కసరత్తులని స్పష్టం చేసింది. యూఎస్ రెచ్చగొట్టు చర్యలకు ఇది గట్టి కౌంటర్ అని కూడా పేర్కొంది. అంతేగాదు యూఎస్ తన రక్షణ బడ్డెట్లో తైవాన్‌కు రూ. 82 వేల కోట్ల సహాయం అందించిందని, దీన్ని తాము ఎన్నటికీ సహించమని తెగేసి చెప్పింది చైనా. ఈ మేరకు చైనా తైవాన్ గగతలంలోకి పంపించిన విమానాల్లో 6ఎస్‌యూ30 ఫైటర్ జెట్లు, హెచ్6 బాంబర్లు, అణుదాడులు కలిగిన డ్రోన్లు ఉన్నాయని తైవాన్ మంత్రిత్వ శాఖ పేర్కొంది. చైనా తన యుద్ధ విమానాలతో 47 సార్లు తైవాన్ గగనతలంలోకి చొరబడినట్లు తెలపింది. తమ ప్రాంతంలోని శాంతికి విఘాతం కలిగించేలా ప్రజలను భయపెట్టడానికి చైనా ప్రయత్నిస్తోందంటూ తైవాన్ ఆరోపణలు చేసింది. మరోపక్క తైవాన్ విదేశాంగ మంత్రి తైవాన్‌లో చొరబడేందుకే చైనా ఇలా సాకులు వెతుకుతోందని మండిపడ్డారు. కాగా, రోజు రోజుకి తైవాన్ చైనా మధ్య పరిస్థితులు అధ్వాన్నంగా మారుతున్నాయి. చైనా పదే పదే చొరబడటంతో..ఏ క్షణం ఏం జరుగుతుందోనని తైవాన్ నిరంతరం ఆందోళన చెందుతోంది. (చదవండి: తక్షణమే ప్రజల ప్రాణాలను కాపాడండి..అధికారులకు జిన్‌పింగ్ ఆదేశాలు -
ముగిసిన భారత్–ఆస్ట్రేలియా యుద్ధ విన్యాసాలు
సాక్షి, విశాఖపట్నం: భారత్–ఆస్ట్రేలియా రక్షణ దళాల మధ్య నిర్వహించిన మారీటైమ్ విన్యాసాలు శనివారం ముగిశాయి. విశాఖ తూర్పు నౌకాదళ ప్రధాన కేంద్రం సమీపంలోని బంగాళాఖాతం తీరం ఈ విన్యాసాలకు వేదికైంది. ఇండో పసిఫిక్ ఎండీవర్(ఐపీఈ)–2022లో భాగంగా గత నెల 30న రాయల్ ఆస్ట్రేలియా రక్షణ దళాలు విశాఖ చేరుకున్నాయి. శనివారం నిర్వహించిన విన్యాసాల ముగింపు నేపథ్యంలో రాయల్ ఆస్ట్రేలియన్ నేవీకి చెందిన హెచ్ఎంఏఎస్ అడిలైడ్, హెచ్ఎంఏఎస్ అంజాక్ యుద్ధ నౌకలు, తూర్పు నౌకాదళానికి చెందిన ఐఎన్ఎస్ జలాశ్వ, ఐఎన్ఎస్ కవరత్తి యుద్ధ నౌకలతో పాటు హెలికాప్టర్లు విన్యాసాల్లో పాల్గొని సత్తా చాటాయి. చివరి రోజు విన్యాసాల్లో ఆస్ట్రేలియా, భారత్‌కు చెందిన త్రివిధదళాలు పాల్గొన్నాయి. ఈ సందర్భంగా భారత్‌కు చెందిన యుద్ధ నౌకల్ని ఆస్ట్రేలియా రక్షణ బృందం సందర్శించాయి. హార్బర్ ఫేజ్‌లో ఉమ్మడి రక్షణ ప్రణాళికలు, పరస్పర అవగాహన ఒప్పందాలు, రక్షణ వ్యవస్థలో సహకార చర్యలు మొదలైన అంశాలపై చర్చించినట్లు తూర్పు నౌకాదళ వర్గాలు వెల్లడించాయి. -
మంగోలియా, జపాన్లలో నేటి నుంచి రాజ్‌నాథ్ పర్యటన
న్యూఢిల్లీ: మంగోలియా, జపాన్లలో ఐదు రోజుల పర్యటనకు రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ సోమవారం బయలుదేరి వెళ్లారు. మారుతున్న ప్రపంచ రాజకీయ పరిణామాల నేపథ్యంలో ఈ రెండు దేశాలతో వ్యూహాత్మక, రక్షణ సంబంధాల బలోపేతమే లక్ష్యంగా పర్యటన సాగనుందని విదేశాంగ శాఖ వర్గాలు తెలిపాయి. 5 నుంచి 7 వరకు మంగోలియాలో ఆయన పర్యటన ఉంటుంది. భారత రక్షణ మంత్రి ఒకరు మంగోలియాలో పర్యటించడం ఇదే ప్రథమం. అనంతరం 8, 9 తేదీల్లో జపాన్ పర్యటన సందర్భంగా జరిగే 2+2 విదేశాంగ, రక్షణ మంత్రుల సమావేశాల్లో రాజ్‌నాథ్‌తోపాటు జై శంకర్ కూడా పాల్గొంటారు. -
కోర్టుల్లో 5 కోట్ల పెండింగ్ కేసులు
న్యూఢిల్లీ: దేశవ్యాప్తంగా న్యాయస్థానాల్లో పెండింగ్ కేసుల సంఖ్య 5 కోట్లకు చేరువలో ఉందని కేంద్ర న్యాయశాఖ మంత్రి కిరణ్ రిజిజు వెల్లడించారు. ఒక న్యాయమూర్తి 50 కేసుల్ని పరిష్కరిస్తే, కొత్తగా మరో 100 కేసులు నమోదవుతున్నాయని చెప్పారు. వివాదాల పరిష్కారానికి న్యాయస్థానాలను ఆశ్రయించాలన్న అవగాహన ప్రజల్లో బాగా పెరిగిందని అందుకే కొత్త కేసుల సంఖ్య పెరుగుతోందన్నారు. రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సమక్షంలో ఆర్మ్డ్ ఫోర్సెస్ ట్రబ్యునల్ పనితీరుపై శనివారం జరిగిన సెమినార్‌కు కిరణ్ హాజరయ్యారు. పెండింగ్ కేసుల పరిష్కారానికి ప్రభుత్వం సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగిస్తోందన్నారు. కింద కోర్టుల్లో 4 కోట్లకు పైగా, సుప్రీం కోర్టులో 72 వేల కేసులకు పైగా పెండింగ్‌లో ఉన్నాయని తెలిపారు. మధ్యవర్తిత్వం ద్వారా పరిష్కరించుకుంటే భారం తగ్గుతుందన్నారు. కేంద్రం ప్రతిపాదనలో ఉన్న మధ్యవర్తిత్వంపై చట్టాన్ని త్వరగా తీసుకువస్తే కోర్టులకి కొంత ఊరట లభిస్తుందని మంత్రి పేర్కొన్నారు. మరోవైపు సుప్రీం కోర్టు న్యాయమూర్తి జస్టిస్ డి.వై. చంద్రచూడ్ మరో కార్యక్రమంలో మాట్లాడుతూ కోర్టులో పెరిగిపోతున్న పెండింగ్ కేసులు మోయలేని భారంగా మారుతున్నాయని ఆందోళన వ్యక్తం చేశారు. మధ్యవర్తిత్వ వ్యవస్థే కేసుల భారాన్ని తగ్గిస్తుందని పేర్కొన్నారు. -
ఎయిర్‌ఫోర్స్‌తో ఎస్బీఐ, పీఎన్బీ, బీవోబీ ఒప్పందాలు
ముంబై: ప్రభుత్వరంగ ఎస్బీఐ, పీఎన్బీ, బీవోబీ భారత వాయుసేన (ఇండియన్ ఎయిర్‌ఫోర్స్)తో అవగాహన ఒప్పందం కుదుర్చుకున్నాయి. ఎయిర్‌ఫోర్స్‌తో ‘డిఫెన్స్ వేతన ప్యాకేజీ’ ఒప్పందం చేసుకున్నట్టు ఎస్బీఐ ప్రకటించింది. ఈ ఒప్పందం కింద ఎయిర్‌ఫోర్స్ ఉద్యోగులు, పదవీ విరమణ తీసుకున్న వారికి ఎస్బీఐ పలు ప్రయోజనాలు, ఫీచర్లతో ఉత్పత్తులను ఆఫర్ చేయనుంది. వ్యక్తిగత ప్రమాద బీమా, వాయు ప్రమాదం, విధుల్లో మరణిస్తే అదనపు పరిహారంతో బీమా రక్షణను అందించనున్నట్టు తెలిపింది. శాశ్వత/పాక్షిక అంగవైకల్య కవరేజీ కూడా అందుబాటులో ఉంటుందని పేర్కొంది. ‘‘మన జాతి, పౌరుల రక్షణ కోసం వైమానిక దళ ప్రయత్నాలకు మద్దతుగా నిలవాలని అనుకుంటున్నాం. డిఫెన్స్ శాలరీ స్కీమ్ కింద వారికంటూ ప్రత్యేకమైన పరిష్కారాలు అందించడాన్ని కొనసాగిస్తాం’’అని ఎస్బీఐ చైర్మన్ దినేష్ ఖరా ప్రకటించారు. ఈ ప్రయోజనాలు డిఫెన్స్ శాలరీ ప్యాకేజీ పరిధిలో ఉన్న ఖాతాదారులకు ఆటోమేటిగ్గా లభిస్తాయని ఎస్బీఐ తెలిపింది. -
‘బ్లాక్ గ్రూప్’ అగ్గి పెట్టింది!
సాక్షి, హైదరాబాద్/గాంధీ ఆస్పత్రి: సికింద్రాబాద్ రైల్వేస్టేషన్ విధ్వంసం ఘటనలో కొత్త అంశాలు బయటికి వస్తున్నాయి. అభ్యర్థులను ఆందోళనకు ఉసిగొల్పినది ప్రైవేటు డిఫెన్స్ అకాడమీల నిర్వాహకులు కాగా.. విధ్వంసానికి రెచ్చగొట్టినది కొందరు అభ్యర్థులేనని పోలీసులు దర్యాప్తులో గుర్తించారు. ‘సికింద్రాబాద్ రైల్వేస్టేషన్ బ్లాక్’ పేర ఓ వాట్సాప్ గ్రూపు, దానికి అనుబంధంగా మరో 3 గ్రూపులు ఏర్పాటు చేసుకుని.. తీవ్రస్థాయిలో ఆందోళనకు పక్కాగా పథకం రూపొందించుకుని, అమలు చేసినట్టు తేల్చారు. ఇక విధ్వంసం కేసులో అదుపు లోకి తీసుకున్నవారిలో 45 మందిని రైల్వే పోలీసులు అరెస్టు చేశారు. ఆదివారం న్యాయమూర్తి ఎదుట ప్రవేశపెట్టి రిమాండ్‌కు తరలించారు. ఇక పరారీలో ఉన్న నిందితులను పట్టుకోవడానికి ప్రత్యేక బృందాలు రాష్ట్రంతోపాటు పొరుగు రాష్ట్రా ల్లోనూ గాలిస్తున్నాయి. నిందితులను కస్టడీకి ఇవ్వాలని సికింద్రాబాద్ గవర్నమెంట్ రైల్వే పోలీసులు (జీఆర్పీ) సోమవారం పిటిషన్లు దాఖలు చేయనున్నారు. బిహార్ ఉదంతాలను చూసి ప్లాన్..: కేంద్ర ప్రభుత్వం అగ్నిపథ్ పథకాన్ని ప్రకటించాక మొదట్లో బిహార్, ఉత్తరప్రదేశ్ తదితర రాష్ట్రాల్లో విధ్వంసం ఘటనలు జరిగాయి. వాటిని చూసిన కరీంనగర్ ప్రాంతానికి చెందిన ఆర్మీ అభ్యర్థి శ్రీను ఈనెల 15న మధ్యాహ్నం 1.58 గంటలకు ‘సికింద్రాబాద్ రైల్వేస్టేషన్ బ్లాక్’ పేరుతో వాట్సాప్ గ్రూపును క్రియేట్ చేశాడు. దిల్‌సుఖ్‌నగర్‌లోని ఓ హాస్టల్లో ఉంటున్న అతను.. ఈ వాట్సాప్ గ్రూపునకు ఎనిమిది మంది అభ్యర్థులను అడ్మిన్లుగా చేశాడు. దీనికి అనుబంధంగా మరికొన్ని గ్రూపులు ఏర్పాటయ్యాయి. అడ్మిన్లు ‘సికింద్రాబాద్ రైల్వేస్టేషన్ బ్లాక్’ గ్రూప్‌లోకి దాదాపు 400 మందిని సభ్యులుగా చేర్చారు. తన పేరు బయటికి రాకూడదనే ఉద్దేశంతో శ్రీను ఆ గ్రూప్ నుంచి లెఫ్ట్ అయిపోయాడు. అయితే ఈ గ్రూపులో సభ్యులు బిహార్ మాదిరిగా హల్చల్ చేద్దామని చర్చించుకున్నారు. సికింద్రాబాద్ వచ్చిన అందరూ ఒకచోట ఉండొద్దని, వేర్వేరుగా బస చేయాలని సూచించుకున్నారు. ఆదిలాబాద్ నుంచి వచ్చి దిల్‌సుఖ్‌నగర్‌లోని హాస్టల్లో ఉంటున్న సాబేర్ అనే అభ్యర్థి జెండాలు, కర్రలు, రాళ్లు వంటివి తెచ్చే బాధ్యత తీసుకున్నాడు. శుక్రవారం ఉదయం అవన్నీ తీసుకుని సికింద్రాబాద్ రైల్వేస్టేషన్ వద్దకు వచ్చి అందరికీ అందించినట్టు పోలీసులు గుర్తించారు. ఈ మేరకు శ్రీను, సాబేర్లను అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. మరో పది మంది అనుమానితులను కూడా పట్టుకున్నారు. నిప్పుపెట్టిన వాళ్లూ చిక్కారు మల్కాజ్గిరి ప్రాంతానికి చెందిన అభ్యర్థి రాజా సురేంద్ర కుమార్ ‘సికింద్రాబాద్ రైల్వేస్టేషన్ బ్లాక్’ గ్రూపులో సభ్యులందరినీ రెచ్చగొట్టేలా పోస్టులు పెట్టాడు. ఆందోళనకు వచ్చే వారంతా పాత టైర్లు, వస్త్రాలు, రాడ్లు, పెట్రోల్ తీసుకుని రావాలని.. వాటిని వినియోగించి విధ్వంసం సృష్టిద్దామని సూచించాడు. శుక్రవారం ఉదయం ఆందోళనకారులు రైల్వేస్టేషన్‌లోకి ప్రవేశించే ముందు బస్టాండ్‌లో ఆర్టీసీ బస్సు అద్దాలను, ప్లాట్‌ఫామ్‌పై ఉన్న రైళ్ల ఏసీ బోగీల అద్దాలను పగలగొట్టింది అతడేనని పోలీసులు సీసీ కెమెరా ఫుటేజీల ద్వారా గుర్తించారు. ఇక రైలుబోగీల్లోకి ప్రవేశించి నిప్పుపెట్టిన వారిలో ఆదిలాబాద్‌కు చెందిన పృథ్వీరాజ్, కామారెడ్డికి చెందిన సంతోష్ కీలకంగా వ్యవహరించినట్టు తేల్చారు. ప్రత్యేక బృందాలు ఆదివారం రాత్రి ఈ ముగ్గురినీ అదుపులోకి తీసుకున్నాయి. బస్సు అద్దాల ధ్వంసంపై మరో కేసు ఆర్మీ అభ్యర్థులు శుక్రవారం ఉదయం సికింద్రాబాద్ స్టేషన్లోకి ప్రవేశించే ముందు రాజేంద్రనగర్, హయత్‌నగర్ డిపోలకు చెందిన మూడు ఆర్టీసీ బస్సుల అద్దాలను ధ్వంసం చేశారు. దీనికి సంబంధించి గోపాలపురం పోలీసులు కేసు నమోదు చేశారు. నిందితులను రైల్వే పోలీసులు అరెస్టు చేసి, రిమాండ్‌కు పంపాక.. పీటీ వారెంట్‌పై కస్టడీలోకి తీసుకోవాలని నిర్ణయించారు. మొత్తంగా రైల్వే స్టేషన్ ఘటనకు సంబంధించి శనివారం 45 మందిని రైల్వే పోలీసులు అరెస్టు చేశారు. వారిని ఆదివారం ఉదయం నాగోల్‌లోని రైల్వే కోర్టు న్యాయమూర్తి ఎదుట హాజరు పరిచారు. ఆయన ఆదేశాల మేరకు 14 రోజుల జ్యుడీషియల్ రిమాండ్ కోసం చంచల్‌గూడ జైలుకు తరలించారు. నిం దితులను ఆదివారం ఉదయం 8.15 గంటలకు జైలులోకి తీసుకున్నామని చంచల్‌గూడ అధికారులు చెప్పారు. ఛాతీలోంచి బుల్లెట్ దూసుకెళ్లి.. ఊపిరితిత్తులు ఛిద్రమై.. సికింద్రాబాద్ రైల్వేస్టేషన్లో శుక్రవారం జరిగిన కాల్పుల్లో వరంగల్ జిల్లా ఖానాపూర్ మండలం దబ్బీర్‌పేటకు చెందిన రాకేశ్ మృతి చెందిన విషయం తెలిసిందే. మృతదేహానికి పోస్టుమార్టం నిర్వహించిన గాంధీ ఆస్పత్రి ఫోరెన్సిక్ వైద్యులు.. రాకేశ్ మరణానికి తుపాకీ బుల్లెట్ కారణమని గుర్తించారు. ఛాతీపై కుడివైపు నుంచి శరీరంలోకి దూసుకెళ్లిన బుల్లెట్ ఊపిరితిత్తుల్ని ఛిద్రం చేస్తూ ఎడమ వైపు నుంచి బయటికి వెళ్లిందని తేల్చారు. ఊపిరితిత్తులు బాగా దెబ్బతినడంతో వెంటనే చనిపోయాడని.. పెల్లెట్ (రబ్బరు/ఇతర పదార్థాలతో కూడిన బుల్లెట్) అయితే ఇలా బయటికి దూసుకెళ్లదని పోస్టుమార్టం నివేదికలో పేర్కొన్నట్టు తెలిసింది. మిగతా ఐదుగురు క్షతగాత్రుల నుంచి ఏడు బుల్లెట్లను వెలికితీసి, పోలీసులకు అందజేసినట్టు సమాచారం. నేడు 8 మంది బాధితుల డిశ్చార్జి! రైల్వేస్టేషన్ ఘటనలో గాయపడిన 14 మందిలో ఒకరు మృతి చెందగా.. మిగతా 13 మందికి మెరుగైన వైద్యసేవలు అందిస్తున్నామని గాంధీ ఆస్పత్రి సూపరింటెండెంట్ రాజారావు తెలిపారు. ఇందులో కోలుకున్న ఎనిమిది మందిని సోమవారం డిశ్చార్జి చేసే అవకాశముందని వెల్లడించారు. -
Agnipath scheme: అగ్నివీరులకు మరో ఆఫర్
న్యూఢిల్లీ: నిరసనలను చల్లార్చేందుకు అగ్నిపథ్ పథకానికి కేంద్రం మార్పుచేర్పులు చేసింది. నాలుగేళ్ల సర్వీసు అనంతరం బయటికొచ్చే అగ్నివీరుల్లో అర్హులకు రక్షణ శాఖ ఖాళీల్లో 10 శాతం రిజర్వేషన్లు కల్పించాలని నిర్ణయించింది. ఈ ప్రతిపాదనకు రక్షణ మంత్రి రాజ్‌నాథ్‌సింగ్ శనివారం ఆమోదముద్ర వేశారు. ఇండియన్ కోస్ట్ గార్డ్, డిఫెన్స్ సివీలియన్ పోస్టులతో పాటు రక్షణ శాఖ పరిధిలోని 16 ప్రభుత్వ రంగ సంస్థల్లోనూ వారికి 10 శాతం రిజర్వేషన్లు అమలవుతాయి. అలాగే సెంట్రల్ ఆర్మ్డ్ పారా మిలటరీ ఫోర్స్ (సీఏపీఎఫ్), అసోం రైఫిల్స్‌లో కూడా అగ్నివీర్లకు 10 శాతం కోటా కల్పించే ప్రతిపాదనకు కేంద్ర హోం శాఖ కూడా ఆమోదముద్ర వేసింది. అంతేగాక వారికి గరిష్ట వయోపరిమితిని మూడేళ్లు పెంచింది. అగ్నిపథ్ నియామకాలకు ఈ ఏడాది గరిష్ట వయో పరిమితిని ఇప్పటికే రెండేళ్లు పెంచడం తెలిసిందే. ఆ లెక్కన తొలి బ్యాచ్ అగ్నివీర్లకు సీఏపీఎఫ్, అసోం రైఫిల్స్‌లో నియామకాలకు ఐదేళ్ల వయోపరిమితి సడలింపు వర్తిస్తుందంటూ హోం శాఖ ట్వీట్ చేసింది. వారికి మరిన్ని ఉపాధి కల్పన అవకాశాలు కల్పించడంలో భాగంగా ప్రభుత్వ బ్యాంకులు, ఆర్థిక సంస్థల చీఫ్‌లతో కేంద్ర ఆర్థిక శాఖ ఇప్పటికే చర్చలు జరిపింది. పెట్రోలియం శాఖలోనూ అవకాశాలు అగ్నివీరులను సర్వీసు అనంతరం హౌసింగ్, పెట్రోలియం శాఖల్లో తీసుకుంటామని ఆ శాఖల మంత్రి హరదీప్‌సింగ్ పురీ చెప్పారు. బీజేపీ పాలిత రాష్ట్రాలు ఇప్పటికే అగ్నివీరులకు పలు ఉద్యోగాల్లో రిజర్వేషన్లు ప్రకటించాయి. పోలీసు, సంబంధిత సర్వీసుల్లో వారికి ప్రాధాన్యమిస్తామని యూపీ, మధ్యప్రదేశ్, అసోం పేర్కొన్నాయి. అద్భుత పథకం: కేంద్రం మెడిసిన్, ఇంజనీరింగ్ విద్యార్థులకు ఉపాధి హామీ ఎక్కడుంది: రాజ్‌నాథ్ అగ్నిపథ్‌ను కేంద్రం గట్టిగా సమర్థించింది. మాజీ సైనికాధికారులు తదితరులతో రెండేళ్ల పాటు విస్తృతంగా సంప్రదింపులు జరిపిన అనంతరమే ఏకాభిప్రాయంతో పథకానికి రూపకల్పన చేసినట్టు రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ వివరించారు. పథకంపై దేశవ్యాప్త ఆందోళనల నేపథ్యంలో త్రివిధ దళాధిపతులతో శనివారం ఆయన సమీక్ష జరిపారు. ‘‘సైనిక నియామక ప్రక్రియలో అగ్నిపథ్ విప్లవాత్మక మార్పులు తెస్తుంది. రాజకీయ అవసరాల కోసం కొందరు దీనిపై అపోహలు వ్యాప్తి చేస్తున్నారు. దాంతో ప్రజల్లో అయోమయం నెలకొంది. నాలుగేళ్ల తర్వాత బయటికొచ్చాక ఉపాధి హామీ లేదనడం సరికాదు. లక్షలు పెట్టి మెడిసిన్, ఇంజనీరింగ్ చదువుతున్న యువతకు కూడా ఉపాధి హామీ లేదు కదా!’’ అన్నారు. వారికి సైనికోద్యోగాలు రావు హింసాత్మక నిరసనలకు పాల్పడే వారికి సైనికోద్యోగాలకు దారులు శాశ్వతంగా మూసుకుపోతాయని ఎయిర్ చీఫ్ మార్షల్ వీఆర్ చౌధరి అన్నారు. కేసుల్లో ఇరుక్కుంటే పోలీస్ క్లియరెన్సులు రావన్నారు. -
insurance: ప్రీమియం తక్కువ.. రక్షణ ఎక్కువ
రోజుకు ఒక దోశ కోసం చేసే ఖర్చు.. పావు లీటర్ పెట్రోల్‌కు అయ్యే వ్యయం.. 30–50 రూపాయలు నావి కావంటూ వచ్చిన ఆదాయం నుంచి పక్కన పెడితే కుటుంబానికి చక్కటి రక్షణ కల్పించుకోవచ్చు. కానీ, మనం సామాన్యులం. జీవితానికి రక్షణ ఇచ్చే బీమా విషయంలోనూ పిసినారి తనం ప్రదర్శిస్తుం టాం. అనుకోనిది జరిగితే.. విధి ఎదురు తిరిగితే అప్పుడు మన కుటుంబం పడే కష్టాలను చూడ్డానికి మనం ఉండం. నిండు మనసుతో ప్రేమించే మనవారి కోసం ఒక్క టర్మ్ ప్లాన్ రక్షణగా ఇవ్వలేమా? అది లేకుండా వారి పట్ల ఎంత ప్రేమ చూపించినా తామరాకుపై నీటిబొట్టు చందమే అవుతుంది..! టర్మ్ ఇన్సూరెన్స్ అన్నది స్వచ్ఛమైన, సూటైన బీమా ప్లాన్. ఇందులో ఎటువంటి గందరగోళం ఉండదు. అందుకే దీన్ని ప్రొటెక్షన్ ప్లాన్ అంటారు. జీవితానికి రక్షణ కల్పించేది. కుటుంబానికి ఆధారమైన ప్రతి వ్యక్తి ఈ ఒక్క బీమా ప్లాన్ తీసుకుంటే చాలు. పాలసీదారు వయసు, ఆరోగ్య చరిత్ర, ఎంచుకున్న కాలం (ఏ వయసు వరకు బీమా కావాలి) ఈ అంశాల ఆధారంగా ప్రీమియం ఏటా ఎంత కట్టాలన్నది బీమా కంపెనీ నిర్ణయిస్తుంది. ఏటా ఆ మేరకు చెల్లిస్తూ వెళ్లాలి. పాలసీ కాలవ్యవధి ముగిసేలోపు ఎప్పుడైనా పాలసీదారు ఏ కారణం వల్లనైనా మరణిస్తే.. అతని కుటుంబ సభ్యులు పరిహారం కోసం క్లెయిమ్ చేసుకోవాలి. అప్పుడు పరిశీలన అనంతరం బీమా సంస్థ పరిహారాన్ని నామినీకి లేదంటే వారసులకు చెల్లిస్తుంది. మరి పాలసీ కాలవ్యవధి ముగిసేవరకు నిక్షేపంగా జీవించి ఉంటే? ఉదాహరణకు 75 ఏళ్ల వయసు వచ్చే వరకు రక్షణను ఎంపిక చేసుకున్నారనుకోండి? అప్పటికీ పాలసీదారు జీవించి ఉన్నారనుకుందాం. టర్మ్ ప్లాన్ కనుక రూపాయి కూడా తిరిగి రాదు. పాలసీ ముగిసిపోతుంది. అన్నేళ్లపాటు వేల రూపాయలు కడితే రూపాయి తిరిగి రాదా..? కొందరికి ఇది అస్సలు నచ్చదు. అందుకే వారు మాకొద్దు టర్మ్ పాలసీ అంటుంటారు. ఇక్కడ కావాల్సింది కుటుంబానికి రక్షణ, రాబడి కాదు. రాబడుల కోసం వేరే మార్గాలున్నాయి. ఒకవేల కాలవ్యవధి ముగిసే వరకు జీవించి ఉంటే.. అప్పటి వరకు కట్టినదంతా మరణించిన కుటుంబాలకు పరిహారంగా వెళ్లిందనుకుంటే ఆ సంతృప్తి వేరు. కనుక బీమా రక్షణ కోరుకునే వారు ముందుగా తీసుకోవాల్సింది టర్మ్ ప్లాన్. దీనికంటే ముందు చూడాల్సిన ముఖ్యమైన అంశాలు కొన్ని ఉన్నాయి. ప్రీమియం ధరల పరిస్థితి ఇదీ... టర్మ్ ప్లాన్ల విషయంలో బీమా సంస్థల మధ్య ఆరోగ్యకర పోటీయే నడుస్తోంది. కరోనా రాకతో బీమా క్లెయిమ్‌లు పెద్ద ఎత్తున వచ్చి పడ్డాయి. చెల్లింపుల భారంతో రీఇన్సూరెన్స్ సంస్థలు (బీమా సంస్థల పాలసీలపై బీమా ఇచ్చేవి) ప్రీమియంను గత ఆరు నెలల్లో పెంచేశాయి. కొన్ని బీమా కంపెనీలు పెరిగిన రీఇన్సూరెన్స్ రేట్ల మేర తమ పాలసీలపైనా అమలు చేశాయి. కొన్ని కంపెనీలు మాత్రం మార్కెట్ పెంచుకునేందుకు పాత ప్రీమియం ధరలనే కొనసాగిస్తున్నాయి. పాలసీ ప్రీమియం రేటు అనేది దరఖాస్తుదారుల వయసు, హెల్త్ రిస్క్, ఎంపిక చేసుకున్న కవరేజీ, కాలవ్యవధి అంశాల ఆధారంగా మారిపోతుంటుంది. పాలసీ తీసుకోవడాన్ని వాయిదా వేస్తే.. వయసు పెరుగుదల ఫలితంగా ప్రీమియం కూడా అధికమవుతుందని గుర్తు పెట్టుకోవాలి. ఉదాహరణకు 30 ఏళ్ల వ్యక్తితో పోలిస్తే 35 ఏళ్ల వ్యక్తికి ఐసీఐసీఐ ప్రుడెన్షియల్ లైఫ్ ఇన్సూరెన్స్ సంస్థ 22 శాతం అధిక ప్రీమియం వసూలు చేస్తోంది. జీవనశైలి అలవాట్లు ప్రీమియం ధరలను ప్రభావితం చేసే అంశాల్లో కీలకమైనవి. ఉదాహరణకు పొగతాగడం, గుట్కా, జర్దా వంటి పొగాకు ఉత్పత్తుల వినియోగం, మద్యం సేవించడం ఇవి ప్రీమియంను భారీగా పెంచే అంశాలు. పొగతాగే అలవాటు ఉందని వెల్లడిస్తే ఆరోగ్యవంతులతో పోలిస్తే ప్రీమియం 20 అధికంగా చెల్లించాల్సి వస్తుంది. విద్యార్హతలు కూడా ప్రీమియంను 34 శాతం మేర ప్రభావితం చేస్తున్నాయి. అందుకునే ఇలాంటి అలవాట్లు, ఆరోగ్య సమస్యలు ఏవి ఉన్నా కానీ నిజాయితీగా వెల్లడించడమే మంచిది. ప్రీమియం పెరిగినా వెల్లడించడం మానొద్దు. ఎందుకంటే భవిష్యత్తులో క్లెయిమ్ తిరస్కరణకు గురి కాకూడదంటే వెల్లడించాలి. ఇక ప్రీమియం తక్కువగా ఉండాలంటే ఉన్న ఏకైక మార్గం చాలా చిన్న వయసులో తీసుకోవడమే. అప్పుడు ఎలాంటి ఆరోగ్య సమస్యలు ఉండవు. ఎంపిక చేసుకున్న కవరేజీ (బీమా రక్షణ రూపాయిల్లో) కూడా ప్రీమియం ధరలను నిర్ణయిస్తుంది. బీమా కవరేజీ అన్నది అన్ని వయసులకు ఒకటే కాకుండా.. మధ్య వయసు నుంచి బాధ్యతలు పెరిగి వృద్ధాప్యానికి చేరువ అయ్యే క్రమంలో తగ్గిపోతాయి. కనుక కవరేజీ కూడా ఏటేటా కొంత శాతం చొప్పున మొదటి 15–20 ఏళ్లు పెరుగుతూ వెళ్లి.. ఆ తర్వాత తగ్గుతూ ఉండేలా ఎంపిక చేసుకోవచ్చు. ఇవి కూడా ప్రీమియం ధరలను నిర్ణయిస్తాయి. పరిహారం ఏక మొత్తంలో కావాలా? లేక సగం పరిహారం చెల్లించి మిగిలినది ప్రతీ నెలా నిర్ణీత కాలం వరకు చెల్లించేలా ఎంపిక చేసుకోవాలా? ఇది కూడా ప్రీమియంపై ప్రభావం చూపిస్తుంది. ఉదాహరణకు ఇండియా ఫస్ట్ లైఫ్ రూ.కోటి కవరేజీని పాలసీ ముగింపు సమయానికి 2 కోట్లకు వెళ్లే ఆప్షన్ ఇస్తోంది. సాధారణ పాలసీతో పోలిస్తే ప్రీమియం 50 శాతం ఎక్కువ. 100 ఏళ్ల వయసు వచ్చే వరకు కవరేజీ ఎంపిక చేసుకున్నా.. ప్రీమియం ఎక్కువ చెల్లించాల్సి ఉంటుంది. కట్టిన ప్రీమియం కాలవ్యవధి ముగిసిన తర్వాత చెల్లించే టర్మ్ ప్లాన్లు కూడా ఉన్నాయి. వీటి ప్రీమియం కూడా 50–100 శాతం వరకు అధికంగా ఉంటోంది. కానీ, ప్రీమియం వెనక్కి వచ్చే టర్మ్ ప్లాన్ లాభసాటి కానేకాదు. దీన్ని ఎంపిక చేసుకోవద్దు. దీనికి బదులు సాధారణ పాలసీ ఎంపిక చేసుకుని ప్రీమియం ఆదా చేసుకోవచ్చు. ఆ మొత్తాన్ని మ్యూచువల్ ఫండ్స్‌లో ఇన్వెస్ట్ చేసుకోవడం మెరుగైన నిర్ణయం అవుతుంది. టర్మ్ ప్లాన్ అన్నది తమపై ఆధారపడిన వారి భవిష్యత్తు ఆర్థిక రక్షణ కోసమే. 70 ఏళ్లు వచ్చే సరికి ఈ బాధ్యతలు దాదాపుగా ముగిసిపోతాయి. కనుక 100 ఏళ్లకు టర్మ్ ప్లాన్ ఉపయోగం లేని ఆప్షనే. పాలసీకి అనుబంధాలు.. యాడ్ ఆన్స్ పేరుతో పలు రైడర్లు టర్మ్ పాలసీకి అనుబంధంగా తీసుకోవచ్చు. వీటితో కవరేజీ విస్తృతి పెరుగుతుంది అంతే. ఉదాహరణకు క్రిటికల్ ఇల్నెస్ కవరేజీ ఒకటి. తీవ్ర అనారోగ్యాల్లో ఏవైనా నిర్ధారణ అయితే ఏక మొత్తంలో ఈ కవరేజీ కింద పరిహారం లభిస్తుంది. ఉదాహరణకు రూ.5 లక్షల క్రిటికల్ ఇల్నెస్ కవర్ కోసం ఏటా రూ.2,000 ప్రీమియం చెల్లించాల్సి రావచ్చు. ఇలాంటి రైడర్లు అన్నవి పాలసీదారులు తమ అవసరాలను విశ్లేషించుకుని తీసుకోవచ్చు. క్రిటికల్ ఇల్‌నెస్‌లు ఏవన్నవి ప్రతి బీమా సంస్థ ఓ జాబితాను నిర్వహిస్తుంటుంది. అందులో ఉన్న వాటికే కవరేజీ వస్తుంది. ఇందులోనూ ఇండెమ్నిటీ, బెనిఫిట్ అని ఉన్నాయి. ఆస్పత్రిలో చేరితేనే పరిహారం ఇచ్చేవి ఇండెమ్నిటీ. బెనిఫిట్ ప్లాన్ అన్నది నిర్ధారణ అయిన వెంటనే ఏక మొత్తంలో చెల్లించేది. యాక్సిడెంటల్ డెత్ లేదా డిస్‌మెంబర్‌మెంట్ రైడర్ కూడా టర్మ్ ప్లాన్‌తో తీసుకోవచ్చు. ఒకవేళ ప్రమాదంలో మరణిస్తే బీమాకు అదనంగా, ఈ రైడర్లో ఎంపిక చేసుకున్న మేర అదనపు పరిహారాన్ని బీమా సంస్థ చెల్లిస్తుంది. ఒకవేళ ప్రమాదం కారణంగా వైకల్యం పాలైనా పరిహారం చెల్లిస్తుంది ఈ రైడర్. పాలసీ డాక్యుమెంట్లో వైకల్యాన్ని తెలిపే వివరాలు ఉంటాయి. ఈ యాడ్ ఆన్ ప్రీమియం రూ.2,000లోపే ఉంటుంది. హెచ్డీఎఫ్సీ లైఫ్ అయితే సమగ్ర ప్రమాద బీమా రూ.కోటి కవరేజీకి రూ.6,000 వరకు చార్జ్ చేస్తోంది. పిల్లలు, భార్య రక్షణకు సంబంధించి యాడ్ఆన్స్ కూడా ఉన్నాయి. పాలసీదారు మరణిస్తే వీటి కింద ప్రత్యేక పరిహారం మంజూరవుతుంది. అప్పుడు పిల్లల విద్య, జీవిత భాగస్వామి పోషణ అవసరాలకు పరిహారం వినియోగమవుతుంది. దంపతుల్లో భార్య కూడా ఉద్యోగం చేస్తున్నట్టయితే తమ అవసరాలకు అనుగుణంగా విడిగా టర్మ్ ప్లాన్ తీసుకోవచ్చు. ఒకవేళ గృహిణి అయితే టర్మ్ ప్లాన్ రాదు. అలాంటప్పుడు జాయింట్ టర్మ్ ప్లాన్ తీసుకోవడం మంచి ఆప్షన్ అవుతుంది. బజాజ్ అలియాంజ్, పీఎన్బీ మెట్‌లైఫ్, ఎడెల్వీజ్ టోకియో లైఫ్ తదితర సంస్థలు జాయింట్ టర్మ్ ప్లాన్ అందిస్తున్నాయి. క్రిటికల్ ఇల్నెస్, యాక్సిడెంటల్ డెత్ లేదా డిస్‌మెంబర్‌మెంట్ రైడర్లు హెల్త్ ప్లాన్ అనుబంధంగా కూడా లభిస్తాయి. బీమా సంస్థ పాలసీ కంటే ముందు చూసేది బీమా కంపెనీ గురించే. అవసరమైన సందర్భంలో పరిహారం చెల్లించాల్సిన బాధ్యత బీమా కంపెనీపై ఉంటుంది. ఆ బాధ్యతల్లో బీమా సంస్థ ఏ మేరకు నిజాయితీగా ఉంటుందన్నది చూడాలి. క్లెయిమ్ చేసుకోవాల్సి వచ్చినప్పుడు ఎటువంటి సమస్యల్లేకుండా సాఫీగా జరిగిపోవాలి. ఏ సంస్థ ఆర్థిక పరిస్థితి అయినా వచ్చే రెండు సంత్సరాల తర్వాతి కాలం గురించి విశ్లేషించడం అంత సులభం కాదని నిపుణులే అంటుంటారు. అందుకుని అప్పటి వరకు ఆ బీమా కంపెనీ పూర్వపు చరిత్రే ప్రామాణికం అవుతుంది. ఎల్ఐసీ ప్రభుత్వరంగ బీమా సంస్థ. అంతేకాదు ప్రభుత్వ హామీ కూడా ఉంటుంది. కనుక దీర్ఘకాలంలో ఎల్ఐసీకి వచ్చే ఇబ్బందులు ఏమీ ఉండకపోవచ్చు. ఇక ప్రభుత్వరంగ బ్యాంకుల ఆధ్వర్యంలో నడుస్తున్న ప్రైవేటు బీమా కంపెనీలు ఎస్బీఐ లైఫ్, పీఎన్బీ మెట్‌లైఫ్, ఇండియా ఫస్ట్ (బీవోబీ, యూనియన్ బ్యాంకు),కెనరా హెచ్ఎస్బీసీ ఓబీసీ (కెనరా బ్యాంకు) విషయంలోనూ దీర్ఘకాలానికి సంబంధించి అంత ఆందోళన అక్కర్లేదు. బ్యాంకింగ్ అనుభవంతో అవి అండర్‌రైటింగ్ నైపుణ్యాలు ప్రదర్శంచగలవు. ప్రముఖ ప్రైవేటు బీమా కంపెనీలు హెచ్డీఎఫ్సీ లైఫ్, ఐసీఐసీఐ ప్రుడెన్షియల్ లైఫ్, కోటక్ మహీంద్రా సైతం వాటి బ్యాంకింగ్ అనుభవాలపై ఆధారపడగలవు. దేశీ బీమా సంస్థల్లో ఎక్కువ కంపెనీలు విదేశీ భాగస్వామ్య సంస్థలతో కలసే బీమా వ్యాపారం నిర్వహిస్తున్నాయి. బీమా సంస్థ నిర్వహణలోని ఆస్తులు, విదేశీ భాగస్వామితో ఎంత కాలం నుంచి వ్యాపారం చేస్తోంది? సేవల నాణ్యత ఇలాంటి అంశాలన్నింటినీ తరచి చూడాలి. క్లెయిమ్ సెటిల్మెంట్ రేషియో పాలసీ నిబంధనలకు బీమా సంస్థ ఎంత నిజాయతీగా కట్టుబడి ఉంటుందన్న దానిపైనే బీమా పరిహారం చెల్లింపులన్నవి ఆధారపడి ఉంటాయి. దీనికి ప్రామాణిక కొలమానమే క్లెయిమ్ చెల్లింపుల రేషియో. ఒకవేళ ఎక్కువ క్లెయిమ్‌లను తిరస్కరించినట్టయితే ఆ సంస్థ అండర్‌రైటింగ్ ప్రమాణాల నాణ్యతను సందేహించాల్సిందే. ఎం దుకంటే పాలసీదారు రిస్క్‌ను బీమా సంస్థ ముందే సరిగ్గా అంచనా వేయడంలో విఫలమైనట్టుగానే చూడాలి. అందుకే క్లెయిమ్ చెల్లింపుల చరిత్ర బీమా సంస్థ నిజాయితీకి దర్పణం పడుతుంది. క్లెయిమ్‌ల పరిష్కార రేషియో అంటే.. మరణ పరిహారం కోరుతూ బీమా సంస్థకు వచ్చిన మొత్తం అభ్యర్థనల్లో ఎన్నింటిని ఆమోదించిందన్నది తెలిపే నిష్పత్తి. సాధారణంగా ఇది 94 శాతం నుంచి 98 శాతం మధ్యలో ఉంటోంది. ఎన్నింటిని తిరస్కరించింది? ఎన్నింటిని పెండింగ్‌లో పెట్టిందన్నది కూడా చూడాలి. వ్యక్తుల స్థాయిలో క్లెయిమ్ తిరస్కరణ రేటు గతంలో సగటున 0.6 శాతంగా ఉంటే, అది 5.5 శాతానికి పెరిగిపోయింది. గతంతో పోలిస్తే తిరస్కరణ రేటు పెరిగినట్టు తెలుస్తోంది. బీమా సంస్థల మధ్య ఇది భిన్నంగా ఉంటుంది. కరోనా సమయంలో క్లెయిమ్‌లకు సంబంధించి ప్రమాణాలను బీమా రంగ నియంత్రణ సంస్థ (ఐఆర్డీఏఐ) కఠినతరం చేసింది. దీంతో ఎల్ఐసీ సగటు చెల్లింపుల రేషియో 2018–19లో 97.8 శాతంగా ఉంటే, 2020–21 నాటికి 98.6 శాతానికి మెరుగుపడింది. ఇదే కాలంలో ప్రైవేటు బీమా సంస్థల సగటు చెల్లింపుల రేషియో 96.6 శాతం నుంచి 97 శాతానికి పుంజుకుంది. క్లెయిమ్‌ల ప్రాసెసింగ్ అన్నది ప్రీమియం ధరలపై ప్రభావం చూపించదు. పాలసీదారులు క్లెయిమ్‌ల పరిష్కార నిష్పత్తికి అదనంగా.. క్లెయిమ్‌ల పరిష్కార ప్రక్రియ ఎంత సులభంగా ఉందన్నది విచారించుకోవాలి. ఆన్లైన్లో ఇందుకు సంబంధించి యూజర్ల రివ్యూలు లభిస్తాయి. జీవితానికి విలువ కట్టగలమా..? బీమాకు సంబంధించి జీవిత విలువ అనేది ముఖ్యం. అప్పుడే ఎంత విలువకు బీమా కవరేజీ తీసుకోవాలన్నది నిర్ణయించుకోగలం. పాలసీ తీసుకునే వారి భవిష్యత్తు ఆదాయ సామర్థ్యాన్ని అంచనా వేసి, ఆ విలువకు సరిపడా బీమా రక్షణ (సమ్ అష్యూర్డ్) కల్పించుకోవాలి. బీమా సంస్థల ఆన్లైన్ పోర్టళ్లలో కొటేషన్ చూసుకునే సమయంలో మనం చెప్పిన ఆదాయాన్ని బట్టి అర్హత మేరకు గరిష్ట బీమా కవరేజీని చూపిస్తున్నాయి. కాకపోతే ఎవరికి వారు వారి వ్యక్తిగత అవసరాలు, లక్ష్యాలకు అనుగుణంగా దీన్ని నిర్ణయించుకోవాలి. వ్యక్తి వార్షిక జీవన అవసరాలు ఎంతో చూడాలి. అప్పటికే రుణ బాధ్యతలు (గృహ రుణం, వ్యక్తిగత రుణం, వ్యాపార రుణం, విద్యా రుణం ఇలా ఏవైనా) ఉంటే వాటిని కలుపుకోవాలి. ద్రవ్యోల్బణాన్ని విస్మరించకూడదు. ఇలా వచ్చిన మొత్తానికి కనీసం 6 శాతం ద్రవ్యోల్బణ ప్రభావాన్ని ముడి పెట్టి, సరైన కవరేజీపై నిర్ణయానికి రావాలి. అంతేకానీ, రూ.10 లక్షలు, రూ.50 లక్షలు, రూ.కోటి ఇలాంటి కవరేజీల్లో ప్రీమియంను బట్టి ఏదో ఒకటి ఎంపిక చేసుకోవడం సరైన రక్షణ అనిపించుకోదు. -
కమలా హారిస్ రక్షణ సలహాదారుగా శాంతి సేథి
వాషింగ్టన్: అమెరికా ఉపాధ్యక్షురాలు కమలా హారిస్ రక్షణ సలహాదారు, కార్యనిర్వాహక కార్యదర్శిగా శాంతి సేథి నియమితులయ్యారు. జాతీయ భద్రతా సలహాలకు సంబంధించిన డాక్యుమెంట్లను ఆమె సమన్వయం చేయనున్నారు. శాంతి 1993లో యూఎస్ నేవీలో చేరారు. యూఎస్ నౌకాదళంలో గైడెడ్ మిసైల్ డిస్ట్రాయర్ యూఎస్ డికేటర్ నౌక ఇన్చార్జ్గా పనిచేశారు. యూఎస్ యుద్ధ నౌక కమాండర్‌గా వ్యవహరించిన తొలి ఇండో అమెరికన్ ఆమే. భారత్‌కు వచ్చిన యూఎస్ నౌకకు తొలి మహిళా కమాండర్ కూడా. చదవండి: (ఏడాది కాలంలో దాదాపు 8 లక్షల వీసాల జారీ: డొనాల్డ్ హెఫ్లిన్) -
రక్షణ రంగంలో సాంకేతికత పెరగాలి
న్యూఢిల్లీ: ఉక్రెయిన్‌పై రష్యా దాడి అంతకంతకూ తీవ్రతరం అవుతున్న నేపథ్యంలో భారత్‌లో భద్రతా సన్నద్ధతపై ఆదివారం ప్రధానమంత్రి నరేంద్ర మోదీ సమీక్షా సమావేశం నిర్వహించారు. భద్రతపై ఆదివారం ఢిల్లీలో కేబినెట్ కమిటీతో సమావేశమై చర్చలు జరిపారు. త్రివిధ బలగాల్లో ఆధునిక సాంకేతిక పరిజ్ఞానంతో కూడిన ఆయుధాలను ప్రవేశపెట్టాలని, రక్షణ రంగంలో భారత్ స్వయంసమృద్ధి సాధించడానికి అవసరమైన చర్యలు చేపట్టే దిశగా చర్చలు సాగాయని ఆ తర్వాత ప్రధానమంత్రి కార్యాలయం వెల్లడించింది. రక్షణ రంగంలో మేకిన్ ఇండియా సాధిస్తే మన బలం పెరగడంతో పాటు ఆర్థిక రంగం కూడా పుంజుకుంటుందని సమావేశం ఒక అభిప్రాయానికి వచ్చింది. ప్రధాని మోదీ వివిధ దేశాలు రక్షణ రంగంలో వాడుతున్న టెక్నాలజీ, భారత్ పకడ్బందీగా ఎలా ముందుకెళుతోందో వివరించారు. ఖర్కీవ్‌లో రష్యా బాంబు దాడుల్లో మృతి చెందిన భారతీయ విద్యార్థి నవీన్ శేఖరప్ప మృతదేహాన్ని భారత్‌కు తిరిగి తేవడానికి అవసరమైన చర్యలన్నీ చేపట్టాలని ఆయన అధికారుల్ని ఆదేశించారు. రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్, ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్, విదేశాంగ మంత్రి జైశంకర్, జాతీయ భద్రతా సలహాదారు అజిత్ దోవల్ కార్యక్రమంలో పాల్గొన్నారు. -
భారత్, అమెరికా భాగస్వామ్యం ఉజ్వలం
సాక్షి, విశాఖపట్నం: నెట్వర్క్, సాంకేతిక భాగస్వామ్యం బలోపేతం అవుతుండటంతో భారత్, అమెరికా దేశాల మధ్య రక్షణ సంబంధాలు భవిష్యత్‌లో మరింత ఉజ్వలంగా మారతాయని యూఎస్ పసిఫిక్ ఫ్లీట్ కమాండర్ అడ్మిరల్ శామ్యూల్ జె పపారో వ్యాఖ్యానించారు. మిలాన్–2022 విన్యాసాల్లో భాగంగా విశాఖలో నిర్వహించిన మారిటైమ్ సదస్సులో ఆయన మాట్లాడుతూ.. భారత్, అమెరికా దళాలు నెట్వర్క్, సాంకేతికతలను ఇచ్చిపుచ్చుకోవడంలో పరస్పర సహకారాలు మెరుగు పర్చుకుంటున్నాయన్నారు. ఎంహెచ్–60 రోమియో చాపర్స్ వంటి అత్యాధునిక రక్షణ సాంకేతిక హెలికాప్టర్ల విషయంలోనూ బంధం బలోపేతమైందని తెలిపారు. మిలాన్‌లో పాల్గొనడం వల్ల అమెరికా, భారత్, ఆస్ట్రేలియా, జపాన్ మొదలైన క్వాడ్ దేశాల మధ్య మారిటైమ్ సహకారం మరింత దృఢంగా మారనుందన్నారు. ఈ కూటమిలో పొత్తులు ఒకదానికొకటి బాధ్యతలను కలిగి ఉంటాయనీ, క్వాడ్ దేశాలు పరస్పరం సహాయం చేసుకునేందుకు దేశాల భాగస్వామ్య విలువలు, కట్టుబాట్లను గమనిస్తున్నట్లు తెలిపారు. మిలాన్‌లో వియత్నాం పాల్గొనడం స్ఫూర్తిదాయకమన్నారు. సముద్ర జలాల విషయంలో వియత్నాం తరచూ దురాక్రమణలకు గురవుతుండటం దురదృష్టకరమని వ్యాఖ్యానించారు. మిలన్లో పాల్గొనడం ద్వారా ఒక కూటమిని ఏర్పరుచుకోవడంతో పాటు కొన్ని పెద్ద దేశాల నుంచి ఎదుర్కొంటున్న బెదిరింపులను చిన్న దేశాలు సమర్థంగా తిప్పికొట్టేందుకు సహకారాలు పొందుతాయన్నారు. -
పార్లమెంటును పక్కదారి పట్టించారు
న్యూఢిల్లీ: పెగసస్ స్పైవేర్‌ను కేంద్రంలోని నరేంద్ర మోదీ ప్రభుత్వమే ఇజ్రాయెల్ నుంచి 2017లో కొనుగోలు చేసిందని న్యూయార్క్ టైమ్స్ కథనాన్ని ప్రచురించిన నేపథ్యంలో సుప్రీంకోర్టులో తాజాగా మరో పిటిషన్ దాఖలైంది. గతంలో పెగసస్‌పై కోర్టుకెక్కిన ప్రధాన పిటిషన్‌దారుడైన అడ్వకేట్ ఎంఎల్ శర్మ మళ్లీ సుప్రీం తలుపు తట్టారు. రూ.15 వేల కోట్ల రక్షణ ఒప్పందంలో భాగంగానే పెగసస్‌ను భారత ప్రభుత్వం కొనుగోలు చేసినట్టుగా న్యూయార్క్ టైమ్స్ తమ కథనంలో పేర్కొందని ఆయన ఈసారి పిటిషన్లో ప్రస్తావించారు. ఈ నివేదిక ఆధారంగా ఇజ్రాయెల్‌తో జరిగిన రక్షణ ఒప్పందంపై విచారణ జరిపించాలని ఆయన కోరారు. ఆ రక్షణ ఒప్పందాన్ని పార్లమెంటు ఆమోదించలేదని, అందుకే దానిని రద్దు చేసి, ఆ డబ్బు మొత్తాన్ని తిరిగి వసూలు చేసేలా ఆదేశించాలని ఆ పిటిషన్లో కోరారు. ప్రజాధనాన్ని దుర్వినియోగం చేసి పెగసస్ స్పైవేర్‌ని కేంద్రమే కొనుగోలు చేసిందని వస్తున్న ఆరోపణలపై క్రిమినల్ కేసు నమోదు చేసి దర్యాప్తు నిర్వహించేలా ఆదేశాలు జారీ చేయాలని సుప్రీంని కోరారు. పెగసస్ స్పైవేర్‌ని వినియోగించి కాంగ్రెస్ పార్టీ నాయకుడు రాహుల్ గాంధీ సహా వివిధ రాజకీయ పార్టీల నాయకులు, జర్నలిస్టులు, హక్కుల సంఘాల కార్యకర్తలు 300 మందిపై కేంద్రం ఫోన్ ట్యాపింగ్ పెట్టిందని గత ఏడాది ఆరోపణలు వెల్లువెత్తిన విషయం తెలిసిందే. అప్పట్లోనే దీనిపై శర్మ, పాత్రికేయుడు ఎన్.రామ్ వంటివారు సుప్రీంకోర్టులో పిటిషన్ వేశారు. దానిని విచారించిన అత్యున్నత న్యాయస్థానం రిటైర్డ్ న్యాయమూర్తి జస్టిస్ రవీంద్రన్ నేతృత్వంలో ముగ్గురు సభ్యులతో కూడిన కమిటీని 2021 అక్టోబర్ 27న ఏర్పాటు చేసింది. ఆ కమిటీ ఏర్పాటై 13 వారాలు గడుస్తున్నా విచారణలో కాస్త కూడా పురోగతి లేదు. ఇప్పుడు కేంద్రమే దానిని కొనుగోలు చేసిందన్న నివేదికపైనా ప్రతిపక్షాలు విరుచుకుపడుతున్నాయి. ఇది దేశద్రోహమేనని తీవ్రంగా వ్యాఖ్యానిస్తున్నాయి. న్యూయార్క్ టైమ్స్ నివేదికను పరిశీలించండి పెగసస్ స్పైవేర్ దర్యాప్తులో న్యూయార్క్ టైమ్స్ కథనాన్ని కూడా ఆధారంగా తీసుకోవాలని దానిపై వి చారణ జరుపుతున్న సుప్రీం కోర్టు నియమిత జస్టిస్ ఆర్.వి.రవీంద్రన్ కమిటీని ఎడిటర్స్ గిల్డ్ కోరింది. దీనిపై బహిరంగ విచారణ చేపట్టాలని, అలా చేయడం వల్ల పారదర్శకత ఉండడంతో పాటు ప్రజలందరికీ నిజానిజాలు తెలుస్తాయని ఎడిటర్స్ గిల్డ్ ఆదివారం జస్టిస్ రవీంద్రన్ కమిటీకి లేఖ రాసింది. అవన్నీ కపట విమర్శలు పెగసస్ స్పైవేర్‌ను అప్రజాస్వామికంగా వ్యవహరించే దేశాలకు విక్రయిస్తున్నట్టుగా వస్తున్న ఆరోపణల్ని ఆ స్పైవేర్‌ను తయారు చేసే సైబర్ కంపెనీ ఎన్ఎస్ఓ గ్రూప్ తిప్పికొట్టింది. అవన్నీ కపట విమర్శలంటూ దుయ్యబట్టింది. ఇజ్రాయెల్ సహా ప్రపంచవ్యాప్తంగా ఆ స్పైవేర్‌ను దుర్వినియోగం చేశారంటూ న్యూయార్క్ టైమ్స్ కథనాన్ని ప్రచురించిన నేపథ్యంలో కంపెనీ సీఈఓ షలెవ్ హులియో స్థానిక మీడియాకి ఇంటర్వ్యూ ఇచ్చారు. దశాబ్దకాలంగా ఆ సాఫ్ట్‌వేర్‌ను అమ్ముతున్నామంటూ తమ కంపెనీ ఆపరేషన్లను గట్టిగా సమర్థించుకున్నారు. అయితే అక్కడక్కడ కొన్ని పొరపాట్లు జరిగి ఉండవచ్చునని ఆయన అంగీకరించారు. న్యూయార్క్ టైమ్స్ కథనంతో పెగసస్‌పై ప్రపంచవ్యాప్తంగా విమర్శలు వస్తున్న విషయాన్ని ప్రస్తావించగా ‘‘రాత్రి నేను గాఢంగా నిద్రపోయాను’’ అని సమాధామిచ్చి తాను అలాంటివేవి పట్టించుకోనని పరోక్షంగా చెప్పారు. ‘‘మేము ఏదో ఒక్క దేశానికి మా సాఫ్ట్వేర్ అమ్మలేదు. కదనరంగంలో వాడే ఆయుధాలు, ఎఫ్–35 ట్యాంకులు, డ్రోన్లు వంటివి అమ్మడం సరైన పని అయినప్పుడు ఇంటెలిజెన్స్ విభాగానికి సమాచార సేకరణలో ఉపయోగపడే సాఫ్ట్‌వేర్‌ను అమ్మితే తప్పేంటి’’ అని హులియో ప్రశ్నించారు. అమెరికా తమ సంస్థపై ఆగ్రహంతోనే బ్లాక్ లిస్ట్‌లో పెట్టిందని, త్వరలోనే దానిని ఎత్తేస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు. సభా హక్కుల ఉల్లంఘన తీర్మానం పెడతాం పెగసస్ అంశంపై లోక్‌సభను తప్పుదారి పట్టించారన్న ఆరోపణలకు సంబంధించి ఐటీ శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్‌పై సభాహక్కుల ఉల్లంఘన తీర్మానాన్ని ప్రవేశపెట్టాలని కాంగ్రెస్ డిమాండ్ చేసింది. ఈ మేరకు లోక్‌సభ స్పీకర్ ఓం బిర్లాకు సభలో ఆ పార్టీ నాయకుడు అధిర్ రంజన్ చౌధరి లేఖ రాశారు. పెగసస్ స్పైవేర్‌ను ఎప్పుడూ తాము తీసుకురాలేదని ఇన్నాళ్లూ కేంద్ర ప్రభుత్వం బుకాయిస్తూ వస్తోందని ఆయన ఆరోపించారు. ఇప్పుడు న్యూయార్క్ టైమ్స్ కథనంతో అసలు వాస్తవాలు బయటకు వచ్చాయన్నారు. మోదీ ప్రభుత్వం పార్లమెంటుని, సుప్రీంకోర్టుని, దేశ ప్రజలందరినీ తప్పుదారి పట్టించిందని ధ్వజమెత్తారు. హక్కుల ఉల్లంఘన నోటీసు ఐటీ శాఖ మంత్రికి జారీ చేయాలని ఆ లేఖలో పేర్కొన్నారు. -
పెగసస్ స్పైవేర్‌ని... కేంద్రమే కొనుగోలు చేసింది
న్యూయార్క్: దేశవ్యాప్తంగా గత ఏడాది ప్రకంపనలు సృష్టించిన పెగసస్ స్పైవేర్ వివాదం మరోసారి కేంద్రంలో మోదీ ప్రభుత్వాన్ని ఇరకాటంలోకి నెట్టేసింది. ఈ స్పైవేర్‌ను 2017లో ఇజ్రాయెల్ నుంచి స్వయంగా కేంద్ర ప్రభుత్వమే కొనుగోలు చేసిందని అమెరికాకు చెందిన న్యూయార్క్ టైమ్స్ పత్రిక సంచలన కథనాన్ని ప్రచురించింది. రక్షణ ఒప్పందంలో భాగంగా అత్యంత ఆధునిక ఆయుధాలు, క్షిపణి వ్యవస్థతో పాటు పెగసస్ స్పైవేర్‌ని భారత్ కొనుగోలు చేసిందని ఆ కథనం ఆరోపించింది. 200 కోట్ల డాలర్ల విలువైన ఒప్పందంలో (రూ.15 వేల కోట్లు) భాగంగా పెగసస్ స్పైవేర్ కూడా కొనుగోలు చేసినట్టు పేర్కొంది. ఏడాది పాటు పరిశోధన చేసి, ఎన్నో దేశాలకు చెందిన ప్రభుత్వ, ఇంటెలిజెన్స్ అధికారుల, సైబర్ నిపుణుల్ని ఇంటర్వ్యూలు చేసి ఈ విషయాన్ని రూఢి చేసుకున్నామని వెల్లడించింది. భారత్‌లో కాంగ్రెస్ నేత రాహుల్‌గాంధీ సహా విపక్ష నాయకులు, ప్రభుత్వ అధికారులు, జర్నలిస్టులు, మానవ హక్కుల సంఘాల నేతలు, సామాజిక కార్యకర్తలు, పారిశ్రామికవేత్తల ఫోన్లు ట్యాప్ చేయడానికి ఈ పెగసస్ స్పైవేర్‌ని కేంద్ర ప్రభుత్వం ప్రయోగించినట్టుగా గత ఏడాది జులైలో ఆరోపణలు వెల్లువెత్తిన విషయం తెలిసిందే. భారత్‌తో పాటు మరికొన్ని దేశ ప్రభుత్వాలు ఈ నిఘా వ్యవస్థని వాడినట్టుగా ఆరోపణలు రావడంతో సమాజంలో వివిధ వర్గాల గోప్యత ప్రశ్నార్థకంగా మారింది. ఔననక.. కాదనక! పెగసస్ స్పైవేర్ అంశం పార్లమెంటు వర్షాకాల సమావేశాలను దాదాపు తుడిచిపెట్టినపుడు కూడా కేంద్రంలోని మోదీ సర్కారు చాలా నర్మగర్భంగా సమాధానమిచ్చింది. ఏది జరిగినా... నిబంధనల ప్రకారమే, సంబంధిత చట్టాలకు లోబడి మాత్రమే జరిగిందని చెప్పుకొచ్చింది. సుప్రీంకోర్టు అడిగినపుడు కూడా ఇదే సమాధానం ఇచ్చింది. దేశ భద్రతతో ముడిపడి ఉన్న అంశం కాబట్టి ఇంతకంటే ఇంకేమీ చెప్పలేమని బదులిచ్చింది. పెగసస్ నిఘాపై స్వతంత్య్ర కమిటీతో విచారణ జరిపించి నేరుగా సుప్రీంకోర్టుకే నివేదిక సమర్పించేలా ఏర్పాట్లు చేస్తామని పేర్కొంది. అయితే సీజేఐ జస్టిస్ ఎన్వీ రమణ నేతృత్వంలోని ధర్మాసనం ఇందుకు అంగీకరించలేదు. గత ఏడాది అక్టోబరు 27న సుప్రీంకోర్టు రిటైర్డ్ జడ్జి ఆర్.వి.రవీంద్రన్ నేతృత్వంలో సాంకేతిక నిపుణులతో కూడిన కమిటీని ఏర్పాటు చేసిన విషయం తెలిసిందే. – నేషనల్ డెస్క్, సాక్షి -
అణ్వస్త్ర సత్తా చాటేందుకే బ్రహ్మోస్ తయారీ
లక్నో: ప్రపంచంలోని ఏ దేశమూ భారత్‌పై దాడికి దిగే సాహసం చేయకూడదనే బ్రహ్మోస్ అణ్వస్త్ర క్షిపణులను తయారుచేస్తున్నామని రక్షణ మంత్రి రాజ్‌నాథ్ స్పష్టంచేశారు. లక్నోలో రక్షణ సాంకేతికత, ప్రయోగ కేంద్రం, నూతన బ్రహ్మోస్ ఆయుధ కర్మాగారాలకు రాజ్‌నాథ్ శనివారం శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. ‘భారత్ బ్రహ్మోస్ సహా ఇతర ఆయుధాలను తయారుచేస్తోందంటే అర్ధం.. ఇతర దేశాలపై దాడికి సిద్ధమైందని కాదు. కయ్యానికి కాలు దువ్వేందుకు ప్రయత్నించే దేశాలకు భారత తన అణ్వస్త్ర సామర్థ్యాన్ని చాటిచెప్పేందుకే ఇలా క్షిపణులను తయారుచేస్తోంది. భారత్‌కు చెడు చేయాలని పొరుగుదేశం(పాక్) ఎందుకు అనుక్షణం పరితపిస్తోందో నాకైతే అర్ధంకాలేదు’ అని రాజ్‌నాథ్ అన్నారు. బ్రహ్మోస్ యూనిట్ కోసం అడిగిన వెంటనే 200 ఎకరాల స్థలం కేటాయించారని యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్‌ను రాజ్‌నాథ్ అభినందించారు. ఈ రెండు యూనిట్లను డీఆర్డీవో నెలకొల్పుతోంది. యూనిట్లో బ్రహ్మోస్ కొత్త తరం వేరియంట్ క్షిపణులను రూపొందిస్తారు. ఏడాదికి దాదాపు వంద క్షిపణులను తయారుచేస్తారు. -
భీమిలిలో డిఫెన్స్ ఎంఎస్ఎంఈ పార్కు
మధురవాడ(భీమిలి): భీమిలి నియోజకవర్గంలో డిఫెన్స్ ఎంఎస్ఎంఈ పార్కు ఏర్పాటు చేస్తామని రాష్ట్ర ఐటీ, నైపుణ్యాభివృద్ధి శాఖ మంత్రి మేకపాటి గౌతమ్‌రెడ్డి చెప్పారు. రుషికొండ సమీపంలోని రాడిసన్స్ బ్లూ హోటల్లో సోమవారం నిర్వహించిన ‘దేశీ–2021 ఆంధ్రప్రదేశ్’ వర్క్‌షాప్‌నకు రాష్ట్ర పర్యాటక శాఖ మంత్రి ముత్తంశెట్టి శ్రీనివాసరావుతో కలిసి హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ విశాఖ కేంద్రంగా డిఫెన్స్ మాన్యుఫ్యాక్చరింగ్ రంగంలో మంచి అవకాశాలు ఉన్నాయన్నారు. దేశ జీడీపీలో రాష్ట్రం వాటా 5 శాతంగా ఉందని, ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్‌లో ఏపీ అగ్రస్థానంలో ఉందని స్పష్టం చేశారు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి నాయకత్వంలో రాష్ట్ర ప్రభుత్వం విద్య, వైద్య రంగాల్లో సంస్కరణలు చేపట్టి సమర్ధవంతమైన పాలన అందిస్తోందన్నారు. కరోనా కాలంలోనూ రాయితీలు కరోనా కష్టకాలంలోనూ టెక్స్టైల్ రంగానికి రూ.600 కోట్ల ప్రోత్సాహకాలతోపాటు ఎంఎస్ఎంఈ పార్కులకు సంబంధించి..రూ.వెయ్యి కోట్ల గత ప్రభుత్వ బకాయిలు చెల్లించామని వెల్లడించారు. ఐటీ పరిశ్రమలకు సంబంధించిన బకాయిలు రూ.30 కోట్లు ఉన్నాయని వాటిని, ఈ ఏడాది చెల్లిస్తామని చెప్పారు. ఈ –గవర్నెన్స్, ఇంటర్నెట్ వంటి అంశాల్లో భవిష్యత్‌లో దేశంలోనే ఏపీ బెస్ట్ అనిపించుకుంటుందన్న ఆశాభావం వ్యక్తం చేశారు. 2 వేలకు పైగా ఉద్యోగాలు కల్పించే పరిశ్రమలకు.. ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం పరిశ్రమలకు కావాల్సిన సదుపాయాలన్నీ కల్పించిందని మంత్రి చెప్పారు. ముఖ్యమంత్రి జగన్మోహన్రెడ్డి ప్రతి నియోజకవర్గంలో ఒక ఎంఎస్ఎంఈ పార్కు ప్రారంభించాలని నిర్ణయించారని చెప్పారు. 2 వేలు పైబడి ఉద్యోగాలు కల్పించే పరిశ్రమలకు కస్టమ్స్ సహా పలు రాయితీలు ఇస్తామని హామీ ఇచ్చారు. ఏపీ ఇన్వెస్టర్ ఫ్రెండ్లీ రాష్ట్రంలో పరిశ్రమల స్థాపన, పెట్టుబడులను ఆహ్వానించే విషయంలో రాష్ట్రం ఇన్వెస్టర్ ఫ్రెండ్లీగా నిలుస్తోందని మంత్రి మేకపాటి తెలిపారు. కొత్త పరిశ్రమలు, సంస్థల ఏర్పాటుకు ఎటువంటి అవాంతరాలు ఉండకుండా అవసరమైన అన్ని చర్యలు తీసుకుంటున్నట్లు చెప్పారు. పెట్టుబడిదారుల అనుకూల విధానాలతో రాష్ట్రం ముందంజలో ఉందన్నారు. అనంతరం ఆంధ్రప్రదేశ్ ఇన్నోవేషన్స్ సొసైటీ(ఏపీఐఎస్).. అరŠాత్యన్ ప్రైవేట్ లిమిటెడ్, ఏపీఈఐటీఏ–నేషనల్ రీసెర్చ్ డిజైన్ కార్పొరేషన్ల మధ్య మంత్రుల సమక్షంలో అవగాహన ఒప్పందాలు జరిగాయి. ఐటీ శాఖ ముఖ్యకార్యదర్శి జయలక్ష్మి, వర్చువల్‌గా డీఆర్డీవో చైర్మన్ సతీష్‌రెడ్డి, వివిధ రంగాలకు చెందిన ప్రముఖులు పాల్గొన్నారు. -
8వేల కోట్ల ఆయుధాల కొనుగోలుకు ఓకే
న్యూఢిల్లీ: దాదాపు రూ.8 వేల కోట్ల విలువైన తేలికపాటి బహుళ ప్రయోజన హెలికాప్టర్లు, సైనిక సంబంధ ఆయుధాలు, పరికరాల కొనుగోలుకు కేంద్ర రక్షణ మంత్రిత్వ శాఖ మంగళవారం ఆమోదముద్ర వేసింది. ఆయుధాల సమీకరణకు సంబంధించిన ప్రతిపాదనలు ఢిల్లీలో జరిగిన రక్షణ ఆయుధాలు, ఉపకరణాల కొనుగోలు మండలి(డీఏసీ) సమావేశంలో ఆమోదం పొందాయని రక్షణ శాఖ ఒక ప్రకటనలో పేర్కొంది. సైన్యం అవసరాల కోసం హిందుస్తాన్ ఏరోనాటిక్స్ లిమిటెడ్ నుంచి 12 హెలికాప్టర్లను, నావికా దళం కోసం భారత్ ఎలక్ట్రానిక్స్ నుంచి లైనెక్స్ నావల్ గన్‌ఫైర్ నియంత్రణ వ్యవస్థను కొనుగోలుచేయనున్నారు. నావికాదళ గస్తీ విమానాలైన డార్నియర్ ఎయిర్క్రాప్ట్లను హిందుస్తాన్ ఏరోనాటిక్స్‌తో అప్‌గ్రేడ్ చేయించాలని డీఏసీ సమావేశంలో నిర్ణయించారు. ‘‘స్వావలంభనతోనే ఆయుధాల సమీకరణలో ‘ఆత్మనిర్భర్’ సాధించే దిశగా ముందడుగు వేయాలని నిర్ణయించారు. ఇందులోభాగంగానే విదేశాల నుంచి నావికాదళ గన్స్ కొనుగోళ్లను అర్ధంతరంగా ఆపేశారు. అందుకు ప్రత్యామ్నాయంగా భారత్ హెవీ ఎలక్ట్రికల్స్(భెల్) నుంచి అప్‌గ్రేడెడ్ సూపర్ ర్యాపిడ్ గన్ మౌంట్(ఎస్ఆర్జీఎం)లను తెప్పించాలని సమావేశంలో నిర్ణయించారు’’ అని రక్షణశాఖ ప్రకటనలో పేర్కొంది. యుద్ధనౌక ముందుభాగంలో ఠీవీగా కనబడే ఎస్ఆర్జీఎంతో ఎదురుగా ఉన్న లక్ష్యాలను అత్యంత ఖచ్చితత్వంతో చేధించవచ్చు. రూ.7,965 కోట్ల విలువైన ఆయుధసంపత్తి కొనుగోలు ప్రధానాంశంగా జరిగిన ఈ సమావేశానికి రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ అధ్యక్షత వహించారు. త్రివిధ దళాల అత్యవసరాలు, నిర్వహణ, ఆధునీకరణ, నిధుల కేటాయింపుల అంశాలను సమావేశంలో చర్చించారు. సైన్యం అవసరాల కోసం సమకూర్చుకోనున్న ఆయుధాలు, ఉపకరణాల డిజైన్, ఆధునికీకరణ, తయారీ మొత్తం ‘మేక్ ఇన్ ఇండియా’ స్ఫూర్తితో కొనసాగాలని సమావేశంలో నిర్ణయించారు. ఇటీవల కాలంలో తూర్పు లద్దాఖ్‌లో చైనా సైనికులతో ఘర్షణల తర్వాత భారత సైన్యం కోసం అధునాతన ఆయుధాల సమీకరణ జరిగింది. -
మహాత్ముని తర్వాత మోదీయే: రాజ్‌నాథ్
న్యూఢిల్లీ: మహాత్మాగాంధీ తర్వాత భారత సమాజం, ప్రజల అంతరంగం లోతుగా తెలిసిన ఏకైక నేత ప్రధాని మోదీయేనని రక్షణ మంత్రి రాజ్‌నాథ్ పొగడ్తల వర్షం కురిపించారు. సవాళ్లను ఆయన ఎలా అధిగమించారో చూస్తే సమాజంపై ఆయనకు ఎంతటి అవగాహన ఉందో తెలుస్తుందని చెప్పారు. ప్రభుత్వాధినేతగా నరేంద్రమోదీ రెండు దశాబ్దాల పాలన అంశంపై జరిగిన జాతీయ కాన్ఫరెన్స్‌లో ఆయన శుక్రవారం మాట్లాడారు. మేనేజ్మెంట్ కాలేజీల్లో విద్యార్థులకు ‘సమర్థ నాయకత్వం, సమర్థవ పాలన‘ అంశంపై రెండు దశాబ్దాల మోదీ రాజకీయ ప్రస్థానాన్ని పాఠ్యాంశంగా చేయాలన్నారు. 20 ఏళ్ల పాలనాకాలంలో ఆయనపై ఎటువంటి అవినీతి మరక పడలేదన్నారు. ప్రధాని మోదీని 24 క్యారెట్ల బంగారం అంటూ ఆకాశానికి ఎత్తేశారు. 100 ఏళ్ల క్రితం గాంధీజీ స్వదేశీ ఉద్యమాన్ని ప్రారంభించగా, ప్రస్తుతం ప్రధాని మోదీ స్వదేశీ 4.0కు కొత్త నిర్వచనం చెప్పారన్నారు. 2001–2014 సంవత్సరాల్లో మోదీ గుజరాత్ సీఎంగా, 2014 నుంచి దేశ ప్రధానిగా కొనసాగుతున్నారు. -
యాంటీ డ్రోన్ కొత్త టెక్నాలజీని అభివృద్ధి పరిచాం
జమ్మూ: తాము సొంతంగా అభివృద్ధి పరిచిన యాంటీ డ్రోన్ టెక్నాలజీని రక్షణ రంగ పరిశ్రమలకు అందజేసినట్లు రక్షణ పరిశోధన, అభివృద్ధి సంస్థ(డీఆర్డీవో) చీఫ్ జి.సతీశ్‌రెడ్డి వెల్లడించారు. కొత్త సాంకేతికత సాయంతో డ్రోన్లను ఎదుర్కొనే విధంగా రూపకల్పన చేసిన వ్యవస్థలను ఈ పరిశ్రమలు రక్షణ, భద్రతా సంస్థలకు అవసరమైన విధంగా తయారు చేసి అందజేస్తాయని ఆయన తెలిపారు. శత్రు డ్రోన్లపై నిఘా వేసి, గుర్తించి, వెంటాడేందుకు అవసరమైన అన్ని సాఫ్ట్వేర్, హార్డ్‌వేర్ వ్యవస్థలు ఈ టెక్నాలజీలో ఉన్నాయన్నారు. ఈ కొత్త వ్యవస్థలను పలుమార్లు విజయవంతంగా పరీక్షించినట్లు వెల్లడించారు. వాటిని స్వాతంత్య్ర దినోత్సవం, గణతంత్ర దినోత్సవాల సమయంలో మోహరించినట్లు వివరించారు. గురువారం జమ్మూలో సెంట్రల్ యూనివర్సిటీలో డీఆర్డీవో ఆధ్వర్యంలో ఏర్పాటు కానున్న కలాం సెంటర్ ఫర్ సైన్స్ అండ్ టెక్నాలజీ(కేసీఎస్‌టీ) శంకుస్థాపన చేసిన అనంతరం మీడియాతో మాట్లాడారు. -
సెంట్రల్ విస్టాపైనా విమర్శలా?
న్యూఢిల్లీ: ఢిల్లీలో కేంద్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్న సెంట్రల్ విస్టా ప్రాజెక్టుపై ప్రతిపక్షాలు అనవసర రాద్ధాంతం చేస్తున్నాయని ప్రధాని∙మోదీ విమర్శించారు. సెంట్రల్ విస్టా ప్రాజెక్టులో రక్షణ శాఖ కార్యాలయ భవనాలు భాగమేనని, ఈ విషయంలో ప్రతిపక్షాలు నోరెత్తడం లేదని పేర్కొన్నారు. సెంట్రల్ విస్టా ప్రాజెక్టులో భాగంగా కస్తూ ర్బాగాంధీ మార్గ్, ఆఫ్రికా అవెన్యూలో నిర్మించిన రెండు నూతన బహుళ అంతస్తుల రక్షణ శాఖ కార్యాలయ కాంప్లెక్స్‌లను మోదీ గురువారం ప్రారంభించారు. ఇక్కడ 7,000 మందికిపైగా రక్షణ శాఖ, సైనిక దళాల ఉద్యోగులు పని చేయనున్నారు. ఈ సందర్భంగా మోదీ మాట్లాడారు. కొత్త పార్లమెంట్ భవన నిర్మాణం నిర్దేశిత గడువులోగా పూర్తవుతుందన్న నమ్మకం ఉందన్నారు. భారత రక్షణ దళాలు మరింత సమర్థంగా, ప్రభావవంతంగా పని చేసేందుకు మనం కొనసాగిస్తున్న ప్రయత్నాలకు ఈ నూతన డిఫెన్స్ ఆఫీసు కాంప్లెక్స్‌లు బలం చేకూరుస్తాయని ఆశాభావం వ్యక్తం చేశారు. రాజధాని అంటే కేవలం నగరమేనా? రెండో ప్రపంచ యుద్ధ కాలంలో నిర్మించిన స్థావరాల నుంచే ఇప్పటిదాకా రక్షణ శాఖకు సంబంధించిన కార్యకలాపాలు సాగాయని, ఆధునిక అవసరాల దృష్ట్యా కొత్త భవనాలు నిర్మించినట్లు మోదీ వివరించారు. ఇకపై దేశ రక్షణకు సంబంధించి త్రివిధ దళాల కార్యకలపాలు ఇక్కడి నుంచి నడుస్తాయని అన్నారు. రాజధానిలో ఆధునిక రక్షణ వ్యవస్థను సృష్టించే యజ్ఞంలో ఇదొక భారీ ముందడుగు అని వ్యాఖ్యానించారు. డిఫెన్స్ ఆఫీసు కాంప్లెక్స్‌ల గురించి మాట్లాడితే ఆరోపణల్లోని డొల్లతనం బయటపడుతుందనే భయంతో దీనిపై నోరువిప్పడం లేదని ప్రతిపక్ష నేతలపై మోదీ ధ్వజమెత్తారు. రాజధాని అంటే కేవలం ఒక నగరం మాత్రమే కాదని, దేశ బలం, సంస్కృతి, ఆలోచనా శక్తి, అంకితభావానికి చిహ్నమని ఉద్ఘాటించారు. డిఫెన్స్ ఆఫీసు కాంప్లెక్స్‌లను కేంద్ర గృహనిర్మాణ, పట్టణ వ్యవహారాల శాఖ ఆధ్వర్యంలో నిర్మించారు. నిధులు, వనరులను రక్షణ శాఖ సమకూర్చింది. వీటితో 9.60 లక్షల చదరపు అడుగుల్లో ఆఫీసు స్పేస్ అందుబాటులోకి వచ్చింది. 14 కార్యాలయాలను కేజీ మార్గ్ కాంప్లెక్స్‌లోకి, 13 కార్యాలయాలను ఆఫ్రికా అవెన్యూ కాంప్లెక్స్‌లోకి తరలించనున్నట్లు అధికారులు ప్రకటించారు. ఆఫ్రికా అవెన్యూలోని డిఫెన్స్ ఆఫీసు కాంప్లెక్స్‌ను ప్రధాని మోదీ సందర్శించారు. త్రివిధ దళాల అధికారులతో సమావేశమయ్యారు. -
రక్షణ శాఖ ప్రధాన కార్యాలయం సమీపంలో కాల్పుల కలకలం
వాషింగ్టన్: అమెరికా రక్షణ శాఖ ప్రధాన కార్యాలయం సమీపంలో కాల్పులు కలకలం సృష్టించాయి. పెంటగాన్ భవనం బయట ఉన్న మెట్రో బస్ ప్లాట్‌ఫామ్‌పై దుండగులు కాల్పులకు తెగపడ్డారు. పెంటగాన్ లోపలకు వచ్చే మార్గం కావడంతో అధికారులు అప్రమత్తమయ్యారు. దీంతో ముందస్తు జాగ్రత్తగా పెంటగాన్‌ను అధికారులు మూసివేశారు. ప్రజలెవరూ పెంటగాన్ సమీపంలోకి రావొద్దని అధికారులు సూచిస్తున్నారు. కాగా, అమెరికా అధ్యక్షుడిగా ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత బైడెన్ తొలిసారిగా దేశంలోని తుపాకీల సంస్కృతికి చరమగీతం పాడటంపై దృష్టి సారించిన సంగతి తెలిసిందే. దేశంలో గన్స్ అతి వాడకాన్ని నియంత్రిస్తూ బైడెన్ ప్రభుత్వం కొన్ని చర్యలు తీసుకున్నట్టుగా వైట్‌హౌస్ వర్గాలు వెల్లడించినప్పటికీ లాభం లేకుండా పోయింది. ఈరోజు అమెరికా సైన్యం వద్ద కంటే ప్రైవేట్ వ్యక్తుల చేతుల్లో ఏఆర్, ఏకే రైఫిల్స్ ఎక్కువగా కనిపిస్తున్నాయి. పైగా రైఫిల్స్ కంటే హ్యాండ్ గన్స్ వల్లే ఎక్కువగా నేరాలు, హత్యలు జరుగుతున్నాయి. -
అభివృద్ధి పథంలో ఆర్మీ భూములు!
న్యూఢిల్లీ: రక్షణ శాఖ భూముల విధానంలో (డిఫెన్స్ ల్యాండ్ పాలసీ) కీలక సంస్కరణలకు కేంద్ర ప్రభుత్వం శ్రీకారం చుట్టనుంది. రక్షణ శాఖకు చెందిన భూములను ఇతర అవసరాలకు మళ్లించేందుకు సిద్ధమైంది. ప్రజా ప్రాజెక్టులు, సైనికేతర అవసరాల నిమిత్తం ఇకపై రక్షణ శాఖ భూములను సేకరించవచ్చు. ఇందుకు సంబంధించిన కొత్త నిబంధనలకు కేంద్రం ఆమోద ముద్ర వేసింది. అయితే, సేకరించిన భూమికి ప్రతిఫలంగా సైనిక దళాలకు అంతే విలువ కలిగిన భూమిని మరోచోట ఇవ్వాలి. ఈక్వల్ వాల్యూ ఇన్ఫ్రాస్ట్రక్చర్–ఈవీఐ లేదా మార్కెట్ ధర చెల్లించాల్సి ఉంటుంది. బ్రిటిషర్లు భారత్‌లో తొలిసారిగా 1765లో పశ్చిమ బెంగాల్‌లోని బారక్పూర్లో సైనిక కంటోన్మెంట్ ఏర్పాటు చేశారు. కంటోన్మెంట్ భూములను సైనికేతర అవసరాలకు ఉపయోగించకుండా అప్పటి నుంచి నిషేధం కొనసాగుతోంది. కంటోన్మెంట్లలోని బంగ్లాలు, క్వార్టర్లను సైన్యంతో సంబంధం లేని వారికి విక్రయించడం లేదా వారు ఆక్రమించడం చెల్లదంటూ 1801లో అప్పటి ఈస్టిండియా కంపెనీ ఒక ఉత్తర్వు జారీ చేసింది. ఆ తర్వాత దాదాపు 200 ఏళ్ల తర్వాత దేశంలో రక్షణ భూముల విధానంలో సంస్కరణలు తేవడం ఇదే మొదటిసారి. కంటోన్మెంట్ జోన్లలో అభివృద్ధే లక్ష్యంగా ప్రభుత్వం కంటోన్మెంట్ బిల్లు–2020ని తీసుకొచ్చింది. ఈ ఏడాది ఇందులో కొన్ని మార్పులు చేసింది. మెట్రో రైళ్లు, రోడ్లు, ఫ్లైఓవర్లు, రైల్వే వంటి పబ్లిక్ ప్రాజెక్టుల కోసం రక్షణ శాఖ నుంచి భూములను సేకరించవచ్చని రక్షణ శాఖ అధికారి ఒకరు చెప్పారు. అయితే, సేకరించిన భూమికి గాను సమాన విలువ కలిగిన భూమిని ఇవ్వడం గానీ లేదా మార్కెట్ ధర చెల్లించడం గానీ చేయాలని పేర్కొన్నారు. ఈ రెండింటిలో ఏదో ఒకటి పూర్తయిన తర్వాతే భూమిని బదలాయించడం సాధ్యమవుతుందని స్పష్టం చేశారు. కంటోన్మెంట్లలోని భూమి విలువను స్థానిక సైనిక ఆథారిటీ నేతృత్వంలోని కమిటీ నిర్ధారిస్తుంది. కంటోన్మెంట్ల వెలుపల గల భూమి విలువను జిల్లా మేజిస్ట్రేట్ (కలెక్టర్) ఖరారు చేస్తారు. దేశంలో ప్రధాన నగరాల్లో కీలకమైన ప్రాంతాల్లో రక్షణ శాఖ భూములున్నాయి. పబ్లిక్ ప్రాజెక్టులు, మౌలిక సదుపాయాల కల్పన కోసం ఆయా భూములు కావాలన్న డిమాండ్ పెరుగుతోంది. -
డిఫెన్స్ టెక్నాలజీలో రెగ్యులర్ ఎంటెక్ ప్రోగ్రామ్
న్యూఢిల్లీ: డిఫెన్స్ టెక్నాలజీలో కొత్తగా రెగ్యులర్ ఎంటెక్ ప్రోగ్రామ్‌ను డీఆర్డీఓ, ఏఐసీటీఈ సంయుక్తంగా ప్రారంభించాయి. డీఆర్డీఓ చైర్మన్ డాక్టర్ జి.సతీష్‌రెడ్డి, ఏఐసీటీఈ చైర్మన్ ప్రొఫెసర్ అనిల్ డి.సహస్రబుద్ధి గురువారం వర్చువల్‌గా ఈ ప్రోగ్రామ్‌కు శ్రీకారం చుట్టారు. రక్షణ సాంకేతిక రంగంలో అభ్యర్థుల ఉజ్వల భవిష్యత్తుకు ఈ కొత్త కోర్సు పునాది వేస్తుందని నిపుణులు సూచించారు. ఏఐసీటీఈ గుర్తింపు పొందిన విద్యాసంస్థలు, విశ్వవిద్యాలయాలు, ఐఐటీలు, ఎన్ఐటీలు, ప్రైవేట్ ఇంజనీరింగ్ కాలేజీల్లో ఈ కోర్సు అందుబాటులో ఉంటుంది. కోర్సు నిర్వహణకు ఇన్స్టిట్యూట్ ఆఫ్ డిఫెన్స్ సైంటిస్ట్స్ టెక్నాలజిస్ట్స్(ఐడీఎస్‌టీ) సహకారం అందించనుంది. ఆన్లైన్ లేదా ఆఫ్‌లైన్ విధానంలో అభ్యసించవచ్చు. ఇందులో కాంబాట్ టెక్నాలజీ, ఏరో టెక్నాలజీ, నావల్ టెక్నాలజీ, కమ్యూనికేషన్ సిస్టమ్స్ అండ్ సెన్సార్స్, డైరెక్టెడ్ ఎనర్జీ టెక్నాలజీ, హై ఎనర్జీ మెటీరియల్స్ టెక్నాలజీ అనే ఆరు విభాగాలు ఉంటాయి. -
ఉగ్రవాదులకు మూడిందే, గాల్లో తిరిగే ఏకే-47గన్స్ వచ్చేస్తున్నాయ్
విమానాలు, హెలికాప్టర్లలా గాలిలో ఎగర గలిగి, రిమోట్‌తో ఆపరేట్ చేసే వాహనాలే ‘మానవ రహిత విమానాలు (అన్మ్యాన్డ్ ఏరియల్ వెహికల్స్– యూఏవీలు)’. సింపుల్‌గా డ్రోన్లు అంటాం. అరచేతిలో పట్టే చిన్న డ్రోన్ల నుంచి చిన్నసైజు విమానాల వంటివి, హెలికాప్టర్లలా గాల్లో నిటారు గా ఎగిరేవి, విమానాల్లా రన్‌వేపై ప్రయాణించి ఎగిరేవి కూడా ఉంటాయి. ఇందులో విమానాల్లా ప్రయానించే మధ్యతరహా, భారీ డ్రోన్లు కిలోలకొద్దీ బరువును మోసుకుని, పదుల కిలోమీటర్ల దూరం ప్రయాణించగలవు. ఉగ్రవాద సంస్థలు ఇలాంటి డ్రోన్లను ఆయుధాలు, బాంబులు చేరవేయడానికి చాలాకాలంగా వాడుతున్నాయి. పలుచోట్ల దాడులూ చేస్తున్నాయి. ఇప్పుడు మనదేశంలోనూ తొలిసారిగా డ్రోన్లతో ఉగ్రవాద దాడి జరిగింది. ఎదుర్కొనేది ఎలా? విమానాల తరహాలో ప్రయాణించే డ్రోన్లు గంటకు 60–70 కిలోమీటర్ల కన్నా వేగంగా కూడా దూసు కెళ్తాయి. సైనికులు తుపాకులతో అలాంటి వాటిని నేలకూల్చడం కష్టం. వాటిని కూల్చేందుకు యాంటీ డ్రోన్ సిస్టమ్ ఉండాలని రక్షణ రంగ నిపుణులు స్పష్టం చేస్తున్నారు. అమెరికా, ఇజ్రాయెల్ దేశాలు ఎప్పటినుంచో ఆ వ్యవస్థలను వినియోగిస్తున్నాయి. యాంటీ డ్రోన్ వ్యవస్థలు, పరికరాలను ఇజ్రాయెల్ ఎక్కువగా ఉత్పత్తి చేస్తోంది. ఈ వ్యవస్థలు ఆయా ప్రాంతాల్లో రాడార్, ఆప్టికల్, థర్మల్ ఇమేజింగ్ ద్వారా నిఘా పెడతాయి. ఎటువంటి డ్రోన్ ఆచూకీ కనిపించినా వెంటనే హెచ్చరిస్తాయి. వాటిని గాల్లోనే పేల్చివేయగలిగే ఏర్పాటు ఉంటుంది. చదవండి : కరోనా వ్యాక్సిన్ బదులు కుక్క కాటు టీకా 2019 సెప్టెంబర్‌లో యెమెన్ తిరుగుబాటుదా రులు సౌదీలోని భారీ చమురు కేంద్రాలపై పది డ్రోన్లతో బాంబు దాడి చేశారు. ఆ దెబ్బతో కొద్ది రోజులు సౌదీలో చమురు ఉత్పత్తి సగానికి పడిపో యి, భారీ నష్టం వాటిల్లింది. అప్పటి నుంచి చాలా దేశాలు యాంటీ డ్రోన్ వ్యవస్థలు వాడుతున్నాయి. తాజాగా జమ్మూలో డ్రోన్ దాడి నేపథ్యంలో దేశవ్యాప్తంగా మిలటరీ ప్రాంతాల్లో ఇజ్రాయెల్ తయారీ ‘స్మాష్ 2000 ప్లస్’ యాంటీ డ్రోన్ పరికరాలను అందుబాటులోకి తేవాలని కేంద్రం భావిస్తున్నట్టు అధికార వర్గాలు చెప్తున్నాయి. ఏమిటీ ‘స్మాష్ 2000 ప్లస్’? సాధారణంగా తక్కువ ఎత్తులో ప్రయాణించే డ్రోన్లను రాడార్ వ్యవస్థలు గుర్తించలేవు. కాపలా ఉండేవారే డ్రోన్లను గుర్తించి నేలకూల్చాలి. ఇందుకు సాధారణ తుపాకులు, ఆయుధాలు పనికిరావు. ఈ నేపథ్యంలోనే ఇజ్రాయెల్ ‘స్మాష్ 2000 ప్లస్’ పరికరాలను అభివృద్ధి చేసింది. చిన్నగా ఉండే వీటిని ఏకే–47 వంటి తుపాకులకు అమర్చి వినియోగించవచ్చు. పగలు, రాత్రి ఎప్పుడైనా సరే ఆయా ప్రాంతాల్లో ఆకాశాన్ని జల్లెడ పడుతూ.. డ్రోన్లను గుర్తించి, అప్రమత్తం చేస్తాయి. వాటికి నేరుగా గురిపెట్టి, కచ్చితంగా నేల కూల్చేందుకు తోడ్పడుతాయి. వీటిని ఆటోమేటిగ్గా పనిచేసేలా, లేదా సైనికులు ఆపరేట్ చేసేలా మార్చుకోవచ్చు. ఆటోమేటిక్ మోడ్‌ను వినియోగించినప్పుడు.. తుపాకీని డ్రోన్ వైపు గురిపెడితే.. లక్ష్యానికి సూటిగా రాగానే దానంతట అదే బుల్లెట్స్‌ను ఫైర్ చేస్తుంది. మన నావికా దళం ఇప్పటికే స్మాష్ యాంటీ డ్రోన్ వ్యవస్థలకు ఆర్డర్ ఇచ్చింది. యాంటీ మిస్సైల్ వ్యవస్థలు ఉన్నా. ఇజ్రాయెల్‌కు చెందిన ఐరన్ డోమ్, మరికొన్ని యాంటీ మిస్సైల్ వ్యవస్థలు కూడా డ్రోన్లను గుర్తించి సెకన్లలోనే పేల్చివేయగలుగుతాయి. కానీ అవి భారీ సైజు, విపరీతమైన ఖర్చుతో కూడినవి. అన్నిచోట్ల మోహరించడం సాధ్యం కాదు. అందువల్లే రేడియో ఫ్రీక్వెన్సీ, థర్మల్ ఇమేజింగ్ పరికరాలపై ఆధారపడక తప్పదని నిపుణులు చెప్తున్నారు. ఈ రెండు విధానాల్లో కూడా డ్రోన్లను గుర్తించి, కూల్చేసేందుకు మనుషుల ప్రమేయం అవసరం ఉంటుందని స్పష్టం చేస్తున్నారు. పాకిస్తాన్ నుంచి తుపాకులు, బాంబులు జమ్మూ కశ్మీర్‌లోని ఉగ్రవాదులకు పాకిస్తాన్ వైపు నుంచి డ్రోన్ల ద్వారా ఆయుధాలు, బాంబులు సరఫరా చేస్తున్నారు. అలాంటి ఒక డ్రోన్‌ను గత ఏడాది జూన్ 20న బీఎస్ఎఫ్ గుర్తించి, నేల కూల్చింది. ఆ డ్రోన్ అమెరికా తయారీ గన్, భారీగా తూటాలు, ఏడు చైనా తయారీ గ్రనేడ్లను మోసుకొస్తున్నట్టు గుర్తించారు. ఇలాంటివి తరచూ జరుగుతున్నాయని.. కాపలా తక్కువగా ఉండే ప్రాంతాల్లో, అర్ధరాత్రి తర్వాత ఆయుధాలు చేరవేస్తున్నారని తేల్చారు. గత రెండేళ్లలో పాకిస్తాన్ వైపు నుంచి 300కుపైగా డ్రోన్లు సరిహద్దులు దాటివచ్చి చక్కర్లు కొట్టినట్టు ఆర్మీ లెక్కలు చెప్తున్నాయి. – సాక్షి సెంట్రల్ డెస్క్ డ్రోన్లు.. ఐదు కేటగిరీలు.. ‘డైరెక్టర్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్ (డీజీసీఏ)’ మార్గదర్శకాల ప్రకారం దేశంలో డ్రోన్లను ఐదు కేటగిరీలు. 250 గ్రాముల కంటే తక్కువ బరువు ఉండేవి నానో డ్రోన్లు. వీటి వినియోగానికి సంబంధించి పెద్దగా ఆంక్షలు ఏమీ లేవు. అయితే నిషేధిత ప్రాంతాల్లో మాత్రం ఎట్టి పరిస్థితుల్లో వాడొద్దు. 250 గ్రాముల నుంచి 2 కేజీల వరకు ఉండేవి మైక్రో కేటగిరీలోకి.. 2–25 కేజీల మధ్య ఉండేవి చిన్నతరహా.. 25–150 కిలోల మధ్య బరువుండే వి మధ్య తరహా.. 150 కిలోలకన్నా ఎక్కువ బరువున్నవి పెద్ద డ్రోన్ల కేటగిరీలోకి వస్తాయి. ► నానో, మైక్రో డ్రోన్లు హెలికాప్టర్ల తరహాలో రోటార్ బ్లేడ్లతో ఎగురుతాయి. మధ్యతరహా, భారీ డ్రోన్లలో చాలా వరకు విమానాల తరహాలో ప్రయాణించే ‘యూఏవీ’లు ఉంటాయి. చిన్నతరహా డ్రోన్లలో రెండు రకాలూ ఉంటాయి. ► ఏ డ్రోన్ అయినా 50 అడుగులకన్నా తక్కువ ఎత్తులో ఎగుర వేసేందుకు పెద్దగా ఆంక్షలు లేవు. అంతకన్నా ఎక్కువ ఎత్తు ఎగరవేయాలంటే డీజీసీఐ అనుమతి, డ్రోన్ రిజిస్ట్రేషన్ తప్పనిసరి. ► డీజీసీఐకి చెందిన డిజిటల్ స్కై యాప్ ద్వారా డ్రోన్ల రిజిస్ట్రేషన్, ఎగురవేసే అనుమతులు తీసుకోవచ్చు. -
భారత్ మాకు బలమైన భాగస్వామి
న్యూఢిల్లీ: ఇరు దేశాల మధ్య రక్షణ సంబంధాలను మరింత బలోపేతం చేసుకోవాలని భారత్, అమెరికా తీర్మానించుకున్నాయి. ఆధునిక అవసరాలకు తగ్గట్టుగా రక్షణ సంబంధాలను విస్తృతం చేసుకోవాల్సిన అవసరం ఉందని, పరస్పర సహకారంతోనే ఇది సాధ్యమని నిర్ణయానికొచ్చాయి. ఇండో–పసిఫిక్ ప్రాంతంలో భారత్ తమకు బలమైన భాగస్వామి అని అమెరికా ఉద్ఘాటించింది. భారత రక్షణ మంత్రి రాజ్‌నాథ్‌సింగ్, అమెరికా రక్షణ మంత్రి లాయిడ్ అస్టిన్ శనివారం పలు కీలక అంశాలపై చర్చలు జరిపారు. ఇండో–యూఎస్ రక్షణ భాగస్వామ్యానికి జో బైడెన్ ప్రభుత్వం అత్యధిక ప్రాధాన్యం ఇస్తోందని లాయిడ్ అస్టిన్ ఈ సందర్భంగా గుర్తుచేశారు. అంతర్జాతీయంగా పరిణామాలు వేగంగా మారిపోతున్న నేపథ్యంలో భారత్ తమకు ముఖ్యమైన భాగస్వామిగా మారుతోందని తెలిపారు. ఇండో–పసిఫిక్ రీజియన్‌లో అమెరికాకు ఇండియా ఒక మూలస్తంభం అని వ్యాఖ్యానించారు. ఇండియాతో సమగ్రమైన రక్షణ భాగస్వామ్యాన్ని కోరుకుంటున్నామని వివరించారు. తద్వారా జో బైడెన్ ప్రభుత్వ విదేశాంగ విధానంలోని ప్రాధాన్యతలపై అస్టిన్ స్పష్టమైన సంకేతాలిచ్చారు. చైనా ఆగడాలపై చర్చ అమెరికా రక్షణ శాఖ మంత్రి లాయిడ్ అస్టిన్‌తో చర్చలు సమగ్రంగా, ఫలవంతంగా జరిగాయని రాజ్‌నాథ్ సింగ్ వెల్లడించారు. భారత సైన్యం, అమెరికాకు చెందిన ఇండో–పసిఫిక్ కమాండ్, సెంట్రల్ కమాండ్, ఆఫ్రికా కమాండ్ మధ్య సహకారం పెంచుకోవాలని నిర్ణయించుకున్నట్లు తెలిపారు. ఇండియా–అమెరికా సమగ్ర వ్యూహాత్మక భాగస్వామ్యాన్ని దృష్టిలో పెట్టుకొని కలిసి పని చేసేందుకు ఇరు దేశాలు ఆసక్తిగా ఉన్నాయన్నారు. తూర్పు లద్దాఖ్‌లో చైనా సాగిస్తున్న ఆగడాలు కూడా తమ మధ్య చర్చకు వచ్చాయన్నారు. రక్షణ సహకారంపై ఇండియా–అమెరికా మధ్య గతంలో కొన్ని ఒప్పందాలు కుదిరాయని, వాటిని పూర్తిస్థాయిలో అమల్లోకి తీసుకురావడానికి ఎలాంటి చర్యలు తీసుకోవాలన్న దానిపైనా చర్చించామని పేర్కొన్నారు. భారత్–అమెరికా భాగస్వామ్యం 21వ శతాబ్దంలో నిర్ణయాత్మక భాగస్వామ్యాల్లో ఒకటిగా నిలిచిపోవాలని రాజ్‌నాథ్‌సింగ్ ఆకాంక్షించారు. త్రివిధ దళాల అవసరాల కోసం అమెరికా నుంచి 3 బిలియన్ డాలర్ల విలువైన 30 మల్టీ–మిషన్ ఆర్మ్డ్ ప్రిడేటర్ డ్రోన్లు కొనుగోలు చేయాలని భారత్ నిర్ణయించినట్లు తెలిసింది. దీనిపై రాజ్‌నాథ్ సింగ్, లాయిడ్ అస్టిన్ చర్చించినట్లు సమాచారం. మీడియం–ఆల్టిట్యూడ్ లాండ్ ఎండ్యురెన్స్ (ఎంఏఎల్‌ఈ) ప్రిడేటర్–బి డ్రోన్లుగా పిలిచే ఈ డ్రోన్లు ఏకంగా 35 గంటలపాటు గాలిలో సంచరించగలవు. భూమిపై, సముద్రంపై ఉన్న లక్ష్యాలను వేటాడే సామర్థ్యం వీటి సొంతం. రాజ్‌నాథ్‌తో చర్చల అనంతరం లాయిడ్ అస్టిన్ ఒక ప్రకటన విడుదల చేశారు. -
భారత్, మాల్దీవుల రక్షణ బంధం
మాలే: భారత్, మాల్దీవుల మధ్య రక్షణ బంధం మరింత బలోపేతమైంది. మాల్దీవుల నావికాదళ బలోపేతానికి తాము పూర్తి స్థాయిలో ప్రోత్సహిస్తామని భారత్ మరోసారి స్పష్టం చేసింది. రక్షణ రంగంలో ప్రాజెక్టుల కోసం ఇరు దేశాల మధ్య 5 కోట్ల డాలర్ల లైన్ ఆఫ్ క్రెడిట్ ఒప్పందం కుదిరింది. మాల్దీవుల ఆర్థిక మంత్రిత్వ శాఖ, భారత్‌కు చెందిన ఎక్స్పోర్ట్ ఇంపోర్ట్ బ్యాంకుల మ«ధ్య ఈ ఒప్పందం కుదిరింది. దీని ప్రకారం మాల్దీవులు తమ రక్షణ రంగ అవసరాల కోసం భారత్ బ్యాంకు నుంచి నిధుల్ని రుణాలుగా తీసుకుంటాయి. ప్రస్తుతం మాల్దీవుల పర్యటనలో ఉన్న భారత విదేశాంగ శాఖ మంత్రి జై శంకర్, మాల్దీవుల రక్షణ మంత్రి మారియా దీదీ, ఆర్థిక మంత్రి ఇబ్రహీంలతో చర్చించిన తర్వాత ఈ ఒప్పందాన్ని కుదుర్చుకున్నారు. మాల్దీవుల రక్షణకు కట్టుబడి ఉన్నామని ఎప్పుడైనా ఆ దేశానికి భారత్ విశ్వసనీయమైన నేస్తమని జై శంకర్ ట్విట్ చేశారు. 5 కోట్ల డాలర్ల రుణ ఒప్పందంతో పాలు మాల్దీవుల్లోని తీరప్రాంత రక్షణ, అభివృద్ధి, మౌలిక సదుపాయాల కల్పన కోసం జై శంకర్ మారియా దీదీలు పలు ఒప్పందాలపై సంతకాలు చేశారు. 2016లో కుదుర్చుకున్న రక్షణ కార్యాచరణ ప్రణాళిక మేరకు ఈ ఒప్పందాలు కుదిరాయి. మాల్దీవుల్లో రేవులు, డాక్‌యార్డ్‌ల నిర్మాణం, వాటిలో ఆధునిక సాంకేతిక పరిజ్ఞానం, రాడార్ సర్వీసులు, ఆ దేశ నావికాదళానికి శిక్షణ వంటి వాటిలో భారత్ సహకారం అందించనుంది. -
త్రివిధ దళాలకు డీఆర్డీఓ వ్యవస్థలు
న్యూఢిల్లీ: రక్షణ రంగ పరిశోధన సంస్థ డీఆర్డీఓ(డిఫెన్స్ రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ ఆర్గనైజేషన్) అభివృద్ధి చేసిన మూడు భద్రత వ్యవస్థలను రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ శుక్రవారం త్రివిధ దళాల అధిపతులకు అందజేశారు. ఇండియన్ మారిటైమ్ సిచ్యువేషనల్ అవేర్నెస్ సిస్టమ్(ఇమ్‌సాస్)ను నౌకాదళ ప్రధానాధికారి అడ్మిరల్ కరమ్‌బీర్ సింగ్‌కు, అస్త్ర ఎంకే –1 క్షిపణి వ్యవస్థను వైమానిక దళ చీఫ్ ఎయిర్ చీఫ్ మార్షల్ ఆర్కేఎస్ బధౌరియాకు, బోర్డర్ సర్వీలెన్స్ సిస్టమ్(బాస్)ను ఆర్మీ చీఫ్ జనరల్ ఎంఎం నరవణెకు రాజ్‌నాథ్ అందజేశారని రక్షణ శాఖ ఒక ప్రకటనలో తెలిపింది. కార్యక్రమంలో రక్షణ శా ఖ సహాయ మంత్రి శ్రీపాద నాయక్, చీఫ్ ఆఫ్ డిఫెన్స్ స్టాఫ్ బిపిన్ రావత్ కూడా పాల్గొన్నారు. క్షిపణుల కంటే సెల్ ఫోన్లే శక్తివంతం మారుతున్న కాలానికి అనుగుణంగా దేశ భద్రత విషయంలో కొత్త ముప్పు పొంచి ఉంటోందని, యుద్ధ రీతులు సైతం మారిపోతున్నాయని రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ అన్నారు. ఆయన శుక్రవారం చండీగఢ్‌లో జరిగిన మిలటరీ లిటరేచర్ ఫెస్టివల్లో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ప్రసంగించారు. దేశాల మధ్య ఘర్షణల విషయంలో సోషల్ మీడియా అధిక ప్రభావం చూపుతోందని గుర్తుచేశారు. క్షిపణుల కంటే మొబైల్ ఫోన్ల పరిధే ఎక్కువ అని తెలిపారు. శత్రువు సరిహద్దు దాటకుండానే మరో దేశంలోని ప్రజలను చేరుకొనే సాంకేతికత వచ్చిందని, అందుకే ప్రతి ఒక్కరూ సైనికుడి పాత్ర పోషించాలని పిలుపునిచ్చారు. -
పరాక్రమంతో తిప్పికొట్టాం
న్యూఢిల్లీ: తూర్పు లద్దాక్‌లోని వాస్తవాధీన రేఖవద్ద, భారత సైనిక దళాలు అత్యంత ధైర్యంతో, పరాక్రమంతో చైనా బలగాలను తిప్పికొట్టాయని భారత రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ అన్నారు. ‘‘ చరిత్రలో తనకోసం తాను పోరాడాల్సిన సందర్భం వచ్చినప్పుడు దేశం ఎవరితోనైనా పోరాడితీరుతుంది. మనుగడ కోసం ఎలాంటి సవాళ్ళనైనా ఎదుర్కోవడానికి సంసిద్ధం అవుతుంది’’అని ఎఫ్ఐసీసీఐ వార్షిక సమావేశం సందర్భంగా రాజ్‌నాథ్‌సింగ్ అన్నారు. దేశంలో రైతాంగం చేస్తున్న ఆందోళనలను గురించి వ్యాఖ్యానిస్తూ రాజ్‌నాథ్ సింగ్ వ్యవసాయం ఒక ‘‘మాతృ విభాగం’’ అని, వ్యవసాయరంగాన్ని తిరోగమన దిశలో పయనింపజేసే ఎటువంటి చర్యలను చేపట్టే సమస్యేలేదని ఆయన నొక్కి చెప్పారు. కవ్వింపులకు బదులిస్తాం:రావత్ కోల్‌కతా: చైనా వైపు నుంచి ఎలాంటి కవ్వింపులు ఎదురైనా గట్టిగా బదులు చెప్పేందుకు భారత సైనిక బలగాలు సిద్ధంగా ఉన్నాయని చీఫ్ ఆఫ్ డిఫెన్స్ స్టాఫ్(సీడీఎస్) జనరల్ బిపిన్ రావత్ చెప్పారు. చైనాకు చెందిన పీపుల్స్ లిబరేషన్ ఆర్మీ(పీఎల్ఏ) టిబెట్‌లో పలు అభివృద్ధి పనుల్లో నిమగ్నమైందని అన్నారు. దేశ భద్రత విషయంలో రాజీ లేదని అన్నారు. -
భారత్, అమెరికా మధ్య 2+2 చర్చలు
సాధారణంగా రెండు ప్లస్ రెండు నాలుగవుతుంది. కానీ ఇండో అమెరికా మాత్రం రెండు ప్లస్ రెండు ఈక్వల్టూ ఒకటి అంటున్నాయి. రెండు అతిపెద్ద ప్రజాస్వామ్యాల మధ్య జరిగే ఈ చర్చలు..ఇండో పసిఫిక్ ప్రాంతంలో చైనా దూకుడును నిలువరించేందుకు, దక్షిణాసియాలో ఇండియా స్థానాన్ని మరింత బలోపేతం చేసే లక్ష్యంతో సాగుతున్నాయి. పలు దేశాల పర్యటనలను వర్చువల్ పర్యటనలుగా మార్చుకున్న అమెరికా రక్షణ మంత్రి.. భారత్ పర్యటనకు స్వయంగా రావడం గమనిస్తే ప్రాధాన్యం అర్థమవుతుందని రక్షణ నిపుణులు భావిస్తున్నారు. మంగళవారం భారత్, అమెరికా మధ్య జరగాల్సిన 2+2 చర్చల కోసం అమెరికా విదేశాంగ మంత్రి మైక్ పాంపియో, రక్షణ మంత్రి మార్క్ ఎస్పర్ సోమవారం భారత్ వచ్చారు. ఇరుదేశాల మధ్య ద్వైపాక్షిక రక్షణ సంబంధాలను మరింత బలోపేతం చేయడం, ఇండో పసిఫిక్ ప్రాంతంలో రక్షణ సహకారాన్ని పెంచుకోవడం, చైనాకు చెక్ పెట్టడం ముఖ్య ఉద్దేశంగా 2+2 చర్చలు జరగనున్నాయి. కొన్ని రోజుల్లో అమెరికా అధ్యక్ష ఎన్నికలున్నా అమెరికా కీలక మంత్రులు ఈ పర్యటనకు స్వయంగా రావడం విశేషం. జాతీయ భద్రత సలహాదారు అజిత్ ధోవల్‌తో సైతం అమెరికా మంత్రులు సమావేశం కానున్నారు. ఇటీవల లద్దాఖ్‌లో చైనా నిర్వాకాలు, ఇండో పసిఫిక్ సముద్ర జలాల్లో చైనా దూకుడు.. తదితర అంశాలు ఈ చర్చల్లో కీలకం కావొచ్చని భావిస్తున్నారు. ఇండో పసిఫిక్ ప్రాంతంలో స్వేచ్ఛాయుత రవాణా ఉండాలని పలు ప్రపంచ దేశాలు భావిస్తున్నాయి. కానీ చైనా మాత్రం ఇవన్నీ తమ సొంత జలాలని వాదిస్తోంది. భారత్ నిర్ణయాత్మకం దక్షిణాసియా ప్రాంతంలోనే కాకుండా ప్రపంచంలోనే భారత్ నిర్ణయాత్మక శక్తిగా ఎదుగుతోందని అమెరికా ప్రశంసించింది. భారత్ ఎదుగుదలను స్వాగతిస్తున్నట్లు యూఎస్ రక్షణ, విదేశాంగ శాఖలు తెలిపాయి. 2021 జనవరి నుంచి ఆరంభమయ్యే ఐరాస భద్రతా మండలి టర్మ్‌లో భారత్‌తో కలిసి పనిచేసేందుకు ఆసక్తిగా ఉన్నామని తెలిపాయి. 2017లో ఇండియా, యూఎస్, జపాన్, ఆస్ట్రేలియాలు ఇండో పసిఫిక్ జలాలను స్వేచ్ఛగా ఉంచేందుకు ఉమ్మడిగా వ్యూహరచన చేయాలని భావించాయి. ఇందుకోసం నాలుగు దేశాలు కలిసి క్వాడ్ పేరిట ఒక బృందంగా ఏర్పడ్డాయి. ఇటీవలే ఈ 4 దేశాల మంత్రులు జపాన్‌లో సమావేశమయ్యారు. చైనా దుందుడుకు చేష్టలను ఆపేందుకు కలసికట్టుగా పనిచేయాలని నిర్ణయించారు. ఎకానమీ పరంగానూ భారత్ అత్యంత కీలకమని అమెరికా భావిస్తోంది. ఇప్పటివరకు ఇరుదేశాల మధ్య రక్షణ ఒప్పందాల విలువ 20 బిలియన్ డాలర్లకుపైనే ఉంది. 2+2 చర్చలు, బెకా అంటే.. ఒక దేశ రక్షణ, విదేశీ మంత్రులు మరో దేశ రక్షణ, విదేశీ మంత్రులతో జరిపే చర్చలను టు ప్లస్ టు చర్చలంటారు. ఒక దేశం తనకు అత్యంత కీలకమని భావించే మరో దేశంతో ఇలాంటి సమావేశాలు జరుపుతుంది. రెండు దేశాల మధ్య ఉన్నత స్థాయిలో నిర్ణయాలు తీసుకునేందుకు ఈ చర్చలు కీలకంగా ఉంటాయి. తాజా సమావేశాల్లో భారత్ బెకా(బేసిక్ ఎక్సే్చంజ్ అండ్ కోఆపరేషన్ అగ్రిమెంట్) కోసం ఎదురుచూస్తోంది. శాటిలైట్ సమాచార మార్పిడి ఈ బెకాలో కీలకం. ఈ ఒప్పందం కుదిరితే యూఎస్ జియో శాటిలైట్ ఇంటెలిజెన్స్ సమాచారాన్ని ఇండియా వాడుకునే వీలుంటుంది. 2002లో అమెరికాతో భారత్ జిఎస్‌ఓఎంఐఏ(జనరల్ సెక్యూరిటీ ఆఫ్ మిలటరీ ఇన్ఫర్మేషన్ అగ్రిమెంట్) కుదుర్చుకుంది. ఇందులో భాగంగా లాజిస్టికల్ ఎక్సే్చంజ్ మెమొరాండమ్ అగ్రిమెంట్(లెమొవా)ను 2016లో, కమ్యూనికేషన్, కంపాటబిలిటీ సెక్యూరిటీ అగ్రిమెంట్(కామ్కాసా)ను 2018లో పూర్తి చేసుకుంది. బెకా పూర్తయితే 2002 అగ్రిమెంట్ దశలన్నీ పూర్తయినట్లవుతుంది. -
నేడు అత్యంత కీలక రక్షణ ఒప్పందం
న్యూఢిల్లీ/వాషింగ్టన్: భారత్, అమెరికాల మధ్య నేడు ఒక కీలకమైన రక్షణ రంగ ఒప్పందం కుదరనుంది. అమెరికా నుంచి అత్యాధునిక మిలటరీ టెక్నాలజీ బదిలీ సహా ఇరుదేశాల సరఫరా వ్యవస్థ, భూభౌగోళిక చిత్రాల వినియోగానికి సంబంధించిన ఒప్పందం ఇది అని సంబంధిత వర్గాలు సోమవారం వెల్లడించాయి. భారత రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్, అమెరికా రక్షణ శాఖ మంత్రి మార్క్ టీ ఎస్పర్ మధ్య సోమవారం జరిగిన చర్చల సందర్భంగా దీనిపై ఒక అంగీకారం కుదిరినట్లు తెలిపాయి. ఇరుదేశాల మధ్య రక్షణ సహా వ్యూహాత్మక రంగాల్లో ద్వైపాక్షిక సంబంధాలను బలోపేతం చేసుకోవడం, రెండు దేశాల మధ్య సైన్యాల మధ్య సహకారం పెంపొందించుకోవడం మొదలైన అంశాలపై ఇరు దేశాల రక్షణ మంత్రులు చర్చలు జరిపారని, చైనాతో సరిహద్దు వివాదం అంశం కూడా వారిమధ్య చర్చకు వచ్చిందని వెల్లడించాయి. ఇరుదేశాల మధ్య ‘బేసిక్ ఎక్స్ఛేంజ్ అండ్ కోఆపరేషన్ అగ్రిమెంట్(బీఈసీఏ)’ ఒప్పందం కుదరడంపై రాజ్‌నాథ్, ఎస్పర్ సంతృప్తి వ్యక్తం చేశారని తెలిపాయి. మరోవైపు, భారత విదేశాంగ మంత్రి ఎస్ జైశంకర్, యూఎస్ విదేశాంగ మంత్రి మైక్ పాంపియొ సోమవారం పరస్పర విస్తృత ప్రయోజనకర అంశాలపై చర్చలు జరిపారు. ఈ చర్చల్లో పాల్గొన్న భారత ప్రతినిధి బృందంలో సీడీఎస్ జనరల్ బిపిన్ రావత్, త్రివిధ దళాధిపతులు జనరల్ ఎంఎం నరవణె(ఆర్మీ), అడ్మిరల్ కరమ్‌బీర్‌సింగ్(నేవీ), ఎయిర్ చీఫ్ మార్షల్ ఆర్కేఎస్ బధౌరియా(ఎయిర్‌ఫోర్స్), డీఆర్డీఓ చైర్మన్ సతీశ్ రెడ్డి తదితరులున్నారు. భారత్, అమెరికాల మధ్య నేడు(మంగళవారం) ప్రారంభం కానున్న 2+2 కీలక మంత్రిత్వ స్థాయి చర్చల కోసం మార్క్ ఎస్పర్, మైక్ పాంపియో సోమవారం ఢిల్లీ చేరుకున్నారు. ఈ 2+2 చర్చల్లో భారత రక్షణ, విదేశాంగ మంత్రులు రాజ్‌నాథ్, జైశంకర్ పాల్గొననున్నారు. ద్వైపాక్షిక సహకారంతో పాటు ఇండో పసిఫిక్ ప్రాంతం విషయంలో పరస్పర సహకారం అంశంపై కూడా వారు చర్చించనున్నారు. అమెరికా మంత్రులు పాంపియో, ఎస్పర్ ప్రధాన మంత్రి నరేంద్రమోదీని, జాతీయ భద్రత సలహాదారు అజిత్ ధోవల్‌ను కూడా కలవనున్నారు. యూఎస్ రక్షణ మంత్రి ఎస్పర్‌కు రైసినా హిల్స్‌లోని సౌత్ బ్లాక్ వద్ద త్రివిధ దళాలు గౌరవ వందనంతో ఘనంగా స్వాగతం పలికాయి. సరిహద్దు ఉద్రిక్తతల నేపథ్యంలో భార త్, చైనాల మధ్య సంబంధాలు పూర్తిగా దెబ్బతిన్న పరిస్థితుల్లో ఈ 2+2 చర్చలు జరుగుతుండటం గమనార్హం. భారత్‌తో సరిహద్దు ఘర్షణలు, దక్షిణ చైనా సముద్రంపై ఆధిపత్యానికి ప్రయత్నాలు, హాంకాంగ్‌లో ప్రభుత్వ వ్యతిరేక ఆందోళనలను ఎదుర్కొన్న తీరు.. తదితర అంశాలపై అమెరికా ఇప్పటికే పలుమార్లు చైనాను తీవ్రంగా ఆక్షేపించిన విషయం తెలిసిందే. రక్షణ, విదేశాంగ మంత్రుల భారత పర్యటనకు ముందు.. ‘ప్రాంతీయ, ప్రపం చ శక్తిగా భారత్ ఎదగడాన్ని అమెరికా స్వాగతిస్తోంది’ అని యూఎస్ విదేశాంగ శాఖ ప్రకటించింది. 2016లో అమెరికా భారత్‌ను ‘ప్రధాన రక్షణ రంగ భాగస్వామి’గా ప్రకటించి, రక్షణ రంగ సహకారంలో విశ్వసనీయ మిత్రదేశం హోదా కల్పించింది. ఎస్పర్‌కు స్వాగతం పలుకుతున్న రాజ్‌నాథ్ -
అమ్ముల పొదిలో నాగాస్త్రం
జైపూర్: మన దేశ రక్షణ రంగం మరింత బలోపేతమైంది. పూర్తిగా స్వదేశీ పరిజ్ఞానంతో తయారు చేసిన ట్యాంకు విధ్వంసక క్షిపణి నాగ్ తుది దశ ప్రయోగాలను రక్షణ అధ్యయన అభివృద్ధి సంస్థ (డీఆర్డీఓ) విజయవంతంగా పూర్తి చేసింది. రాజస్తాన్‌లోని పోఖ్రాన్లో గురువారం ఉదయం 6:45 గంటలకి నాగ్ క్షిపణి నిర్దేశిత లక్ష్యాలను కచ్చితంగా ఛేదించినట్టు డీఆర్డీఓ వెల్లడించింది. శత్రువుల యుద్ధ ట్యాంకులను ధ్వంసం చేయడానికి యాంటీ ట్యాంకు మిస్సైల్ గైడ్ (ఏటీజీఎం)ను డీఆర్డీఓ అభివృద్ధి చేసింది. నాగ్ క్షిపణి నాలుగు నుంచి ఏడు కిలోమీటర్ల లక్ష్యాలను ఛేదించగలదు. మూడో తరానికి చెందిన ఈ క్షిపణి రాత్రయినా, పగలైనా శత్రువుల యుద్ద ట్యాంకుల్ని, ఇతర సాయుధ వాహనాల్ని ధ్వంసం చేయగలదు. ఈ క్షిపణి క్యారియర్ని రష్యాకు చెందిన బీఎంపీ–2 పరిజ్ఞానంతో అభివృద్ధి చేశారు. ఈ తరహా పరిజ్ఞానం ‘లాక్ బిఫోర్ లాంచ్’ వ్యవస్థని కలిగి ఉంటుంది. అంటే క్షిపణిని ప్రయోగించడానికి ముందే లక్ష్యాలను గుర్తిస్తారు. భారత్, చైనా మధ్య ఉద్రిక్త పరిస్థితులు నెలకొని ఉండడంతో కేంద్రం క్షిపణి ప్రయోగాలను వేగవంతం చేసింది. తుది దశ ప్రయోగం విజయవంతం కావడం పగలు, రాత్రి కూడా క్షిపణి కచ్చితంగా లక్ష్యాలను ఛేదించడంతో ఈ క్షిపణి ఉత్పత్తి దశకు చేరుకుందని డీఆర్డీఓ చైర్మన్ సతీష్ రెడ్డి తెలిపారు. ప్రభుత్వ అధికారులు అందించిన సమాచారం ప్రకారం ఈ క్షిపణి ఇక భారత అమ్ముల పొదిలోకి చేరడానికి సిద్ధంగా ఉంది. తూర్పు లద్దాఖ్ ప్రాంతంలో నాగ్ క్షిపణిని మోహరించడానికి కేంద్ర ప్రభుత్వం సన్నాహాలు చేస్తోంది. పోఖ్రాన్లో నింగిలోకి దూసుకెళ్తున్న నాగ్ క్షిపణి -
నాలుగైదేళ్లలో సంపూర్ణ క్షిపణి వ్యవస్థ
న్యూఢిల్లీ: భారత దేశ రక్షణ కోసం పూర్తిస్థాయి క్షిపణి వ్యవస్థను సిద్ధం చేసేందుకు మరో నాలుగైదు ఏళ్లు పడుతుందని రక్షణ పరిశోధన, అభివృద్ధి సంస్థ (డీఆర్డీవో) అధ్యక్షుడు డాక్టర్ జి.సతీశ్ రెడ్డి తెలిపారు. డీఆర్డీవో రెండు నెలల్లో పూర్తి స్వదేశీ పరిజ్ఞానంతో అభివృద్ధి చేసిన పది క్షిపణులను విజయవంతంగా పరీక్షించిన నేపథ్యంలో సతీశ్‌రెడ్డి ‘ఏఎన్ఐ’ వార్తా సంస్థకు ప్రత్యేక ఇంటర్వ్యూ ఇచ్చారు. డీఆర్డీవో ప్రస్తుతం దేశ రక్షణ దళాలకు అవసరమైన ఏ రకమైన క్షిపణి వ్యవస్థనైనా తయారు చేసి ఇవ్వగల సత్తా కలిగి ఉందని ఆయన ఆ ఇంటర్వ్యూలో స్పష్టం చేశారు. ఒకవైపు చైనాతో లద్దాఖ్‌లో సరిహద్దు సమస్యలు కొనసాగుతున్న ఈ తరుణంలో డీఆర్డీవో అధ్యక్షుడి వ్యాఖ్యలకు ప్రాధాన్యమేర్పడింది. శత్రుదేశాల రాడార్లను గుర్తించి నాశనం చేయగల రుద్రం–1తోపాటు బ్రహ్మోస్, అతిధ్వని క్షిపణి ఆధారిత జలాంతర్గామి వ్యతిరేక వ్యవస్థ, ధ్వనికి ఏడు ఐదారు రెట్లు ఎక్కువ వేగంతో ప్రయాణించగల, అణ్వాయుధ సామర్థ్యమున్న శౌర్య తదితరాలను డీఆర్డీవో రెండు నెలల్లో పరీక్షించిన విషయం తెలిసిందే. ప్రధాని మోదీ ఇచ్చిన ఆత్మనిర్భర్ భారత్ నినాదంలో భాగంగా డీఆర్డీవో స్వదేశీ ఆయుధ వ్యవస్థల అభివృద్ధికి అధిక ప్రాధాన్యమిస్తున్న విషయం తెలిసిందే. అయితే తాము ఒకవైపు క్షిపణి వ్యవస్థలను అభివృద్ధి చేస్తూనే ఇంకోవైపు రక్షణ దళాలకు అవసరమైన అత్యాధునిక ఆయుధాలను కూడా అభివృద్ధి చేస్తున్నామని సతీశ్‌రెడ్డి తెలిపారు. కోవిడ్–19 పరిస్థితుల్లోనూ డీఆర్డీవో శాస్త్రవేత్తలు ఆయుధ వ్యవస్థల తయారీని కొనసాగిస్తున్నారని, ఒక్కో వ్యవస్థ సిద్ధమైన కొద్దీ వాటిని అప్పటికప్పుడు పరీక్షిస్తున్నామని, తద్వారా తయారీ ప్రక్రియను ముందుకు తీసుకు వెళుతున్నామని ఆయన వివరించారు. పారిశ్రామికవేత్తలకు సాయం రక్షణ రంగంలో స్వావలంబన సాధించేం దుకు డీఆర్డీవో చేస్తున్న కృషికి దేశీ పారిశ్రామిక వేత్తలూ తమవంతు సహకారం అందిస్తున్నారని సతీశ్‌రెడ్డి తెలిపారు. రక్షణ అవసరాలకు తగ్గట్టుగా వ్యవస్థలను డిజైన్ చేయడంతోపాటు అభివృద్ధి చేయగలుగుతున్నారని చెప్పారు. పారిశ్రామివేత్తలను ప్రోత్సహించేందుకు టెక్నాలజీ నిధి ఒకదాన్ని ఏర్పాటు చేయడంతోపాటు వారు పరీక్షలు జరిపేందుకు డీఆర్డీవో పరిశోధన శాలను వారి అందుబాటులో ఉంచామని వివరించారు. రక్షణ దళాల కోసం అత్యాధునిక ఆయుధ వ్యవస్థలను సిద్ధం చేసేందుకు డీఆర్డీవో చాలా కాలంగా ప్రయత్నిస్తోందని, ఇందులో భాగంగానే రెండు నెలల్లో అనేక క్షిపణి వ్యవస్థల పరీక్షలు జరిగాయని తెలిపారు. క్షిపణులు, రాడార్లు, ఎలక్ట్రానిక్స్ యుద్ధం, టొర్పెడోలు, తుపాకులు, సమాచార వ్యవస్థ తదితర అంశాల్లో భారతదేశం పూర్తిస్థాయి స్వావలంబన సాధించిందని చెప్పారు. -
దేశ రక్షణ సమాచారం చైనాకు?
న్యూఢిల్లీ: దేశ సరిహద్దు వ్యూహం, సైన్యం మోహరింపులు, ఆయుధ సేకరణ వంటి కీలక సమాచారాన్ని చైనా గూఢచార విభాగాలకు అందజేశారన్న ఆరోపణలపై రాజీవ్‌శర్మ అనే జర్నలిస్టును ఢిల్లీ పోలీసులు అరెస్ట్ చేశారు. ఈ జర్నలిస్టుకు భారీగా లంచం ముట్టజెప్పారన్న ఆరోపణలపై చైనా మహిళ, నేపాల్‌కు చెందిన ఆమె స్నేహితుడిని అరెస్టు చేసినట్లు స్పెషల్ సెల్ పోలీసులు తెలిపారు. ‘చైనా నిఘా సంస్థలకు దేశ సమాచారాన్ని చేరవేసినందుకు ఢిల్లీలోని పిటంపురకు చెందిన ఫ్రీలాన్స్ జర్నలిస్ట్ రాజీవ్‌ను 14న స్పెషల్ సెల్ అరెస్ట్‌చేసింది. బోగస్ సంస్థల ద్వారా అందిన సొమ్మును రాజీవ్‌కు అందజేసినందుకు చైనా జాతీయురాలితోపాటు నేపాల్ వాసిని అరెస్ట్ చేశాం’ అని ఢిల్లీ డిప్యూటీ కమిషనర్(స్పెషల్ సెల్) సంజీవ్æ తెలిపారు. వీరి నుంచి పెద్ద సంఖ్యలో సెల్ఫోన్లు, ల్యాప్‌టాప్‌లు, సున్నిత సమాచారమున్న పత్రాలను స్వాధీనం చేసుకున్నట్లు వెల్లడించారు.‘రాజీవ్ 2016 నుంచి మైకేల్ అనే చైనా నిఘా విభాగం అధికారితో సంబంధాలు కొనసాగిస్తున్నాడు. 2018 వరకు కీలక సమాచారాన్ని అతడికి చేరవేశాడు. 2019 నుంచి చైనాకే చెందిన జార్జి అనే మరో నిఘా అధికారికి శర్మ కీలక రక్షణ సమాచారాన్ని అందజేస్తూ వచ్చాడు. ఇందుకుగాను గత ఏడాదిన్నరలోనే రూ.45 లక్షల వరకు అందుకున్నాడు. సమాచారం అందజేసిన ప్రతిసారీ వెయ్యి డాలర్లు(సుమారు రూ.73 వేలు) ఇతడికి ముడుతుంటాయి’ అని ఆయన తెలిపారు. గతంలో వివిధ పత్రికల్లో పనిచేసి, భారత పత్రికలతోపాటు చైనాకు చెందిన గ్లోబల్ టైమ్స్ పత్రికకు వ్యాసాలు రాస్తున్నాడన్నారు. ప్రెస్ ఇన్ఫర్మేషన్ బ్యూరో(పీఐబీ) గుర్తింపు కూడా ఉన్న ఇతడికి అనేక మంత్రిత్వ శాఖల్లోకి సులువుగా వెళ్లగలిగే అవకాశం ఉందన్నారు. ఈ–మెయిల్ ఐడీ, సామాజిక మాధ్యమాల అకౌంట్ల ద్వారా ఇతడు ఎలాంటి సమాచారాన్ని చైనాకు అందజేశాడనే విషయమై దర్యాప్తు చేస్తున్నారు. -
కోవిడ్ ప్రొటోకాల్‌తో వేడుకలు
న్యూఢిల్లీ: దేశంలో కరోనా వైరస్ విజృంభిస్తూ ఉండడంతో ఢిల్లీ ఎర్రకోటలో ఇవాళ జరిగే 74వ స్వాతంత్య్ర దిన వేడుకలకు రక్షణ శాఖ ప్రత్యేకంగా ఏర్పాట్లు చేసింది. జాతీయ పతాకం ఎగుర వేయడం దగ్గర్నుంచి, ప్రధాని ప్రసంగం, జాతీయ గీతాలాపన వరకు ప్రతీ కార్యక్రమంలో భౌతిక దూరం పాటించడం, మాస్కులు, పీపీఈ కిట్లు ధరించేలా మార్గదర్శ కాలను రూపొందించింది. ఎర్రకోట పరిసరా ల శానిటైజేషన్ దగ్గర్నుంచి హాజరయ్యే అతిథుల పాటించే భౌతిక దూరం వరకు ప్రతీ అంశంలోనూ జాగ్రత్తలు తీసుకుంది. పోలీసు సిబ్బందితో వివిధ అంచెల్లో కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లను చేసింది. ప్రతీ ఏడాది జరిగే పంద్రాగస్టు వేడుకలకి, ఈసారి జరిగే వేడుకలు ఎలా భిన్నమో వివరిస్తూ శుక్రవారం ఒక ప్రకటన విడుదల చేసింది. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ వరసగా ఏడోసారి త్రివర్ణ పతాకాన్ని ఎగురవేయనున్నారు. ఎర్రకోట వేదికగా ఆయన శనివారం చేసే ప్రసంగంపై ఆసక్తి నెలకొంది. కోవిడ్ సంక్షోభం, చైనాతో ఉద్రిక్తతలు, ఆత్మనిర్భర్ భారత్ దిశగా అడుగులు వేస్తున్న నేపథ్యంలో మోదీ ఏం మాట్లాడతారని ఆసక్తిగా చూస్తున్నారు. ► ఈసారి వేడుకలకి దౌత్యప్రతినిధులు, అధికారులు, మీడియా ప్రతినిధులు కలిపి 4 వేల మందికి ఆహ్వా నం అందింది. ఏటా హాజరయ్యే వారిలో ఇది 20% మాత్రమే. ► పాఠశాల విద్యార్థులకు బదులుగా ఎన్సీసీ సిబ్బంది ఈసారి వేడుకల్లో పాల్గొంటారు ► ఇద్దరి అతిథుల మధ్య 6 అడుగుల దూరం ఉండేలా సీట్ల ఏర్పాటు. అతిథులందరూ తప్పనిసరిగా మాస్కులు ధరించాలి. ► ఎర్రకోట లోపలికి వచ్చే ప్రవేశ ద్వారాల వద్ద థర్మల్ స్క్రీనింగ్ ఏర్పాటు. కరోనా లక్షణాలున్న వారిని వెంటనే ఆస్పత్రికి తరలించేలా అంబులెన్స్‌లు సిద్ధం. ► భద్రత విధుల్లో పాల్గొనే పోలీసులందరికీ పీపీఈ కిట్లు. ► ఈసారి వేడుకల్ని చూసే అవకాశం కరోనా వైరస్‌తో పోరాడి విజేతలైన 1,500 మందికి కల్పించారు. వారిలో 500 మంది పోలీసు సిబ్బంది. -
సరిహద్దులపై నిఘాకు ఉపగ్రహాలు!
న్యూఢిల్లీ: చైనాతో సరిహద్దు వివాదం ఇప్పట్లో సమసే అవకాశం లేకపోవడంతో భారత్ దీర్ఘకాలిక పోరుకు సన్నాహాలు చేస్తోంది. ఒకవైపు సరిహద్దులపై నిత్యం నిఘా ఉంచేందుకు ఉపగ్రహాల సాయం తీసుకోవాలని నిర్ణయించడమే కాకుండా.. మొట్టమొదటిసారి చైనా దురాక్రమణకు పాల్పడిందని భారత్ అంగీకరిస్తోంది. చైనాతో సరిహద్దు వివాదాన్ని అతిక్రమణగా అభివర్ణించిన ఓ నివేదిక కొద్ది సమయంలోనే రక్షణ శాఖ వెబ్సైట్ నుంచి అదృశ్యమవడం గమనార్హం. భారత్, చైనాల మధ్య సరిహద్దు సుమారు నాలుగు వేల కిలోమీటర్లు ఉంటుంది. హద్దుల వెంబడి రోజంతా నిఘా పెట్టేందుకు కనీసం నాలుగు నుంచి ఆరు ఉపగ్రహాలు అవసరమవుతాయని భద్రత సంస్థలు అంచనా వేస్తున్నాయి. ఈ ఉపగ్రహాలు కేవలం సరిహద్దులపై నిఘాకు ఉపయోగిస్తారు. చైనా ఇటీవల జిన్జియాంగ్ ప్రాంతంలో మిలటరీ విన్యాసాల పేరుతో సుమారు 40 వేల మంది సైనికులు, ఆయుధాలు, యుద్ధ సామాగ్రిని అతితక్కువ కాలంలో తరలించగలిగింది. ఆ తరువాతే చైనా సైనికులు వాస్తవాధీన రేఖను దాటుకుని భారత్ భూభాగంలోకి చొరబడ్డారు. ఈ చొరబాట్లు కాస్తా లేహ్ ప్రాంతంలోని భారత్ సైనిక బలగాలను విస్మయానికి గురిచేశాయి. ఈ నేపథ్యంలోనే సరిహద్దుల్లో ఏ చిన్న కదలికనైనా గుర్తించి అప్రమత్తం చేసేందుకు ఉపగ్రహాలు అవసరమవుతాయని భద్రతా సంస్థలు భావిస్తున్నాయి. అత్యధిక రెజల్యూషన్ ఉన్న సెన్సర్లు, కెమెరాలతో వ్యక్తుల కదలికలను గుర్తించవచ్చునని వీరు భావిస్తున్నారు. వెనక్కు తగ్గేందుకు ససేమిరా... గల్వాన్ ప్రాంతంలో ఫింగర్స్‌గా పిలిచే శిఖరాలను ఆక్రమించిన చైనా వెనక్కు తగ్గేందుకు ససేమిరా అంటోంది. పాంగాంగ్ సో సరస్సు వద్ద కూడా భారత దళాలు వెనక్కు తగ్గితేనే తాము వెళతామని భీష్మించుకుంది. అంతేకాకుండా ఫింగర్ –5పై ఓ స్థావరాన్ని ఏర్పాటు చేయాలని చైనా భావిస్తున్నట్లు సమాచారం. భారత్ సరిహద్దుల వెంబడి మరింత మంది సైనికులను మోహరిస్తున్న విషయం తెలిసిందే. హిమాచల్ ప్రదేశ్, ఉత్తరాఖండ్, సిక్కిం, అరుణాచల్‌లోనూ వాస్తవాధీన రేఖ వెంబడి సైనికులను మోహరిస్తున్నట్లు సమాచారం. మే నెలలో ఈ దాడిని మొదలుపెట్టిన చైనా అక్కడి నుంచి వెనుదిరిగేందుకు నిరాకరిస్తున్న నేపథ్యంలో దీన్ని అతిక్రమణగానే చూడాలని రక్షణ శాఖకు చెందిన ఓ అధికారిక దస్తావేజు స్పష్టం చేసింది. అయితే రక్షణ శాఖ వెబ్సైట్లో ఈ దస్తావేజు కనిపించిన కొద్ది సమయానికి మాయమైపోవడం పలు అనుమానాలకు తావిస్తోంది. చైనాపై విరుచుకుపడ్డ భారత్ తమ అంతర్గత విషయాల్లో జోక్యం చేసుకునే హక్కుకు చైనాకు లేదని భారత్ గురువారం స్పష్టం చేసింది. కశ్మీర్ అంశాన్ని భద్రత మండలిలో లేవనెత్తేందుకు చైనా చేసిన ప్రయత్నాన్ని నిరసించడమే కాకుండా.. ఇతరుల జోక్యం సరికాదని స్పష్టం చేసింది. ఐక్యరాజ్య సమితి భద్రత మండలిలో బుధవారం కశ్మీర్ అంశంపై చర్చ జరగాలని పాకిస్తాన్ ప్రతిపాదించగా చైనా దానిని మద్దతు ఇచ్చింది. జమ్మూ కశ్మీర్‌కు స్వయం ప్రతిపత్తి కల్పించే ఆర్టికల్ 370 రద్దయి బుధవారానికి ఏడాదైన విషయం తెలిసిందే. చైనా ప్రయత్నాలు ఫలించలేదు. భారత్‌లో అంతర్భాగమైన జమ్మూకశ్మీర్ అంశాలను చైనా భద్రతా మండలిలలో ప్రస్తావించే ప్రయత్నం చేయడం ఇదే మొదటిసారి కాదని, గతంలో మాదిరిగానే దేశ అంతర్గత వ్యవహారాలపై చైనా జోక్యం చేసుకునే ప్రయత్నాలు విఫలమయ్యాయని విదేశీ వ్యవహారాల శాఖ ఒక ప్రకటనలో తెలిపింది. -
40 వేల మంది చైనా సైనికుల తిష్ట!
న్యూఢిల్లీ: చైనాతో సరిహద్దు వివాదం విషయంలో భారత వాయుసేన చురుకుగా వ్యవహరించి ప్రత్యర్థికి బలమైన సందేశాన్ని పంపిందని రక్షణ మంత్రి రాజ్‌నాథ్ కొనియాడారు. తూర్పు లద్దాఖ్ ప్రాంతంలో యుద్ధవిమానాలను వేగంగా మోహరించడం ద్వారా వాయుసేన తన యుద్ధ సన్నద్ధతను చాటిందని, తద్వారా పాకిస్థాన్‌పై భారత్ జరిపిన బాలాకోట్ దాడిని చైనాకు గుర్తు చేసిందని ఆయన బుధవారం ఢిల్లీలో మొదలైన వాయుసేస సదస్సులో అన్నారు. వాయుసేన ఉన్నతస్థాయి అధికారులు ఈ సదస్సులో పాల్గొన్నారు. సార్వభౌమత్వాన్ని కాపాడుకునే విషయంలో దేశ ప్రజలందరి నమ్మకం త్రివిధ దళాలపై ఉందని రాజ్‌నాథ్ అన్నారు. సరిహద్దులు దాటి మరీ బాలాకోట్‌పై వాయుసేన జరిపిన దాడిని గుర్తు చేస్తూ వాయుసేన ఈ విషయంలో అత్యంత నైపుణ్యంతో వ్యవహరించిందని అన్నారు. (చైనా వ్యాక్సిన్‌పై స్పందించిన ట్రంప్) తూర్పు లద్దాఖ్ ప్రాంతంలో వాయుసేన యుద్ధ విమానాల మోహరింపు ఇలాంటిదేనని మంత్రి పేర్కొన్నట్లు రక్షణ మంత్రిత్వ శాఖ ఓ ప్రకటన విడుదల చేసింది. వాస్తవాధీన రేఖ వెంబడి ఉద్రిక్తతలను తగ్గించేందుకు జరుగుతున్న ప్రయత్నాలను వివరించిన మంత్రి ఎలాంటి పరిస్థితిని ఎదుర్కొనేందుకైనా వాయుసేన సిద్ధంగా ఉండాలని కోరారు. శత్రువులను ఎదుర్కొనేందుకు వాయుసేన సన్నద్ధంగా ఉంటుందని సదస్సులో ఎయిర్ చీఫ్ మార్షల్ ఆర్కేఎస్ బధూరియా స్పష్టం చేశారు. 40 వేల మంది చైనా సైనికుల తిష్ట! తూర్పు లద్ధాఖ్ సెక్టార్లో భారత్–చైనా సరిహద్దు నుంచి తమ బలగాలను వెనక్కి మళ్లిస్తున్నామని పైకి చెబుతున్న చైనా ఆచరణలో మాత్రం అందుకు విరుద్ధంగా వ్యవహరిస్తోంది. బలగాల మళ్లింపుపై ఇరు దేశాల మధ్య కుదిరిన ఒప్పందాన్ని చైనా పీపుల్స్ రిబరేషన్ ఆర్మీ లెక్కచేయడం లేదు. ప్రస్తుతం అక్కడ దాదాపు 40,000 మంది చైనా సైనికులు తిష్ట వేసినట్లు ఓ వార్తా సంస్థ వెల్లడించింది. భారీ ఎత్తున ఆయుధ సామగ్రిని సైతం కలిగి ఉన్నట్లు తెలియజేసింది. భారత్–చైనా కమాండర్ల స్థాయి చర్చలు గత వారంలోనే జరిగాయి. సరిహద్దు ప్రాంతాల నుంచి బలగాలను వెనక్కి తీసుకోవాలని ఇరు దేశాల అధికారులు నిర్ణయించుకున్నారు. అయినా చైనా తన పంథా మార్చుకోవడం లేదు. (చైనా కాన్సులేట్‌లో పత్రాల కాల్చివేత) -
రాజ్‌నాథ్ @ అమర్నాథ్
శ్రీనగర్: జమ్మూకశ్మీర్ పర్యటనలో భాగంగా రక్షణ శాఖ మంత్రి రాజ్‌నాథ్‌సింగ్ రెండో రోజు శనివారం ప్రఖ్యాత అమర్నాథ్ క్షేత్రాన్ని దర్శించుకున్నారు. పవిత్ర గుహలో మంచు శివలింగానికి ప్రత్యేక పూజలు చేశారు. ఈ సందర్భంగా ఆయన వెంట చీఫ్ ఆఫ్ డిఫెన్స్ స్టాఫ్ జనరల్ బివిన్ రావత్, సైనిక దళాల ప్రధానాధికారి జనరల్ ఎం.ఎం.నరవణే తదితరులు ఉన్నారు. వారంతా దాదాపు గంట పాటు అమర్నాథ్ ఆలయ ప్రాంగణంలో గడిపారు. అమర్‌నాథుడిని ప్రార్థించడం గొప్ప అనుభూతి కలిగించిందంటూ రాజ్‌నాథ్‌సింగ్ ట్వీట్ చేశారు. నార్త్ హిల్ పోస్టును సందర్శించిన రాజ్‌నాథ్ జమ్మూకశ్మీర్ రాష్ట్రం కుప్వారా జిల్లా కెరాన్ సెక్టార్లో వాస్తవాధీన రేఖ(ఎల్ఏసీ) వెంట ఉన్న కీలకమైన నార్త్ హిల్ సైనిక పోస్టును రాజ్‌నాథ్‌సింగ్ శనివారం సందర్శించారు. అక్కడి ప్రస్తుత పరిస్థితిని సైనికాధికారులు రాజ్‌నాథ్‌కు వివరించారు. నార్త్ హిల్ పోస్టులో విధుల్లో ఉన్న జవాన్లతో మాట్లాడానని రాజ్‌నాథ్ పేర్కొన్నారు. ఈ మేరకు ఆయన ట్వీట్ చేశారు. వారు అసమాన ధైర్య సాహసాలతో మన దేశాన్ని ఎల్లవేళలా కంటికి రెప్పలా కాపాడుతున్నారని ప్రశంసించారు. -
అంగుళం భూమినీ ముట్టుకోలేరు
లద్దాఖ్: ప్రపంచంలోని ఏ శక్తి కూడా భారత్ నుంచి ఒక్క అంగుళం భూమిని కూడా లాక్కోలేదని, దేశం బలహీనమైంది కానేకాదని కేంద్ర రక్షణ శాఖ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ స్పష్టం చేశారు. చైనాతో ఘర్షణల నేపథ్యంలో శుక్రవారం లద్దాఖ్ లోని సరిహద్దు ప్రాంతాలను సందర్శించిన ఆయన లుకుంగ్‌లో ఆర్మీ, ఐటీబీపీ జవా న్లను ఉద్దేశించి ప్రసంగించారు. తూర్పు లద్దాఖ్ ప్రాంతంలో చైనాతో తలెత్తిన సరిహద్దు వివాదాలను పరిష్కరించేందుకు చర్చలు కొనసాగుతు న్నాయని చెప్పిన ఆయన అవి ఎంత మేరకు విజయవంత మవుతాయో మాత్రం కచ్చితంగా చెప్పలేమని వ్యాఖ్యానించడం గమనార్హం. జూన్ 15న గల్వాన్ లోయలో చైనా సైనికులతో జరిగిన ఘర్షణలో ప్రాణాలు కోల్పోయిన 20 మంది జవాన్ల త్యాగాలను వృథా కానివ్వమని ఆయన అన్నారు. చీఫ్ ఆఫ్ డిఫెన్స్ స్టాఫ్ జనరల్ బిపిన్ రావత్, ఆర్మీ చీఫ్ జనరల్ ఎం.ఎం.నరవాణేలతో కలిసి ఒక రోజు లేహ్ పర్యటనకు వచ్చిన రక్షణ మంత్రి పాంగాంగ్ సో సరస్సు తీరంలోని ఓ స్థావరంలో సైనికాధి కారులతో పరిస్థితిని సమీక్షించారు. సైనిక విన్యాసాలను తిలకించిన రాజ్‌నాథ్ లద్దాఖ్ ప్రాంతంలోని స్టాక్నా ప్రాంతంలో శుక్రవారం జరిగిన మిలటరీ సైనిక విన్యాసాలను రక్షణ మంత్రి రాజ్‌నాథ్ తిలకించారు. ఆర్మీ, వాయుసేనలకు సంబంధించిన ఆపాచీ, వీ5 యుద్ధ హెలికాప్టర్లు, రుద్ర, మిగ్–17 విమానాలతో పాటు ట్యాంకులు, పదాతిదళాలు ఈ విన్యాసాల్లో పాల్గొన్నాయి. తమ యుద్ధ సన్నద్ధతను చాటాయి. స్టాక్నా ప్రాంతంలో పారాట్రూపర్లు, జవాన్ల పాటవాన్ని ప్రత్యక్షంగా చూడగలిగానని ట్విట్టర్లో రాజ్నా«ద్ వ్యాఖ్యానించారు. శాంతి కోసం ఏమైనా చేస్తా భారత్ చైనా పరిస్థితిపై ట్రంప్ భారత్, చైనాల మధ్య శాంతి నెలకొనేందుకు సాధ్యమైన అన్ని చర్యలు తీసుకుంటానని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తెలిపినట్లు వైట్‌హౌస్ ప్రతినిధి ఒకరు ప్రకటించారు. వాస్తవాధీన రేఖ వద్ద ఇరుదేశాల మధ్య ఘర్షణ పూరిత వాతావరణం నెలకొన్న నేపథ్యంలో ట్రంప్ ఈ వ్యాఖ్యలు చేయడం గమనార్హం. ‘‘భారత్, చైనా ప్రజలంటే తనకిష్టమని ట్రంప్ తెలిపారు. ప్రజలకు శాంతిని అందించేందుకు అవసరమైన అన్ని చర్యలు చేపడతానని చెప్పారు’’అని వైట్‌హౌస్ అధికార ప్రతినిధి కేలీ మెక్ఎనానీ విలేకరులు అడిగిన ఒక ప్రశ్నకు సమాధానంగా చెప్పారు. ట్రంప్ వ్యాఖ్యను ట్రంప్ విక్టరీ ఇండియన్ అమెరికన్ ఫైనాన్స్ కమిటీ సహాధ్యక్షుడు అల్ మాసన్ స్వాగతించడమే కాకుండా.. గత అధ్యక్షుల మాదిరిగా కాకుండా ట్రంప్ బహిరంగంగా భారత్‌కు మద్దతు తెలిపారని వ్యాఖ్యానించారు. గతంలో అమెరికా అధ్యక్షులు చైనా ప్రయోజనాలు దెబ్బతింటాయేమో అని భారత్‌కు మద్దతుగా నిలిచేందుకు భయపడేవారని, భారత్ అంటే తనకిష్టమని చెప్పగలిగిన ధైర్యం ట్రంప్‌కు మాత్రమే ఉందన్నారు. -
సీఐఏ గూఢచారికి ఇరాన్ ఉరిశిక్ష
టెహ్రాన్: అమెరికాకు ఇరాన్ రహస్య సమాచారాన్ని చేరవేస్తున్న జలాల్ హాజీ జవెర్ అనే రక్షణశాఖ కాంట్రాక్టర్‌ను ఉరితీసినట్లు ఇరాన్ సైన్యం తెలిపింది. అమెరికా నిఘా సంస్థ సెంట్రల్ ఇంటెలిజెన్స్ ఏజెన్సీ(సీఐఏ) కోసం ఇతను పనిచేసేవాడని వెల్లడించింది. పక్కా సాక్ష్యాధారాలతో జలాల్‌ను పట్టుకున్నామనీ, అతని ఇంట్లో ఇరాన్ రక్షణశాఖకు సంబంధించి కీలక పత్రాలు, నిఘాపరికరాలను స్వాధీనం చేసుకున్నామని పేర్కొంది. జలాల్‌ను ఇరాన్ మిలటరీ కోర్టు దోషిగా తేల్చి ందనీ, ఆయనకు కరాజ్ నగరంలోని రాజయ్ షాహ్ర్ జైలులో మరణశిక్షను అమలుచేశామని చెప్పింది. జలాల్‌తో కలిసి గూఢచర్యానికి పాల్పడ్డ నేరానికి ఆయన మాజీ భార్యకు 15 ఏళ్ల జైలుశిక్ష పడిందన్నారు. అమెరికా–ఇరాన్ మధ్య ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్న నేపథ్యంలో తాజా ఘటన ఎటుదారితీస్తుందో అని ప్రపంచదేశాల్లో ఆందోళన నెలకొంది. -
జాతి భద్రతను ఆదాయంగా మార్చారు
చెన్నై: దేశభద్రతను, రక్షణ రంగాన్ని కాంగ్రెస్ నేతలు పంచింగ్ బ్యాగ్‌గానూ, ఆదాయవనరుగానూ మార్చుకున్నారని ప్రధాని మోదీ తీవ్రస్థాయిలో ఆరోపించారు. తమ ప్రయోజనాల కోసం భద్రతాబలగాల నైతికస్థైర్యాన్ని దెబ్బతీసే పనులు చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తంచేశారు. లోక్‌సభ ఎన్నికలు సమీపిస్తున్న వేళ వీడియో కాన్ఫరెన్స్‌లో తమిళనాడు బీజేపీ కార్యకర్తలతో మోదీ మాట్లాడారు. ‘కాంగ్రెస్ పార్టీ నేతలు ఓవైపు ఆర్మీ చీఫ్‌లను పేర్లతో పిలుస్తూ అవమానిస్తారు. సర్జికల్ స్ట్రైక్స్‌ను హేళన చేస్తారు. మరోవైపు 1940–50 దశకాల్లో జీపుల కుంభకోణం నుంచి 1980ల్లో బోఫోర్స్, తాజాగా అగస్టా ఇంకా చాలా కుంభకోణాలతో దేశ రక్షణరంగాన్ని దోచేశారు. కాంగ్రెస్ నేతలకు కావాల్సిందల్లా ప్రతీ ఒప్పందం నుంచి ఆదాయం పొందడమే’ అని దుయ్యబట్టారు. ‘సాయుధ బలగాలు చాలాకాలంగా కోరుతున్న ఒకే ర్యాంక్–ఒకే పెన్షన్(ఓఆర్ఓపీ) విధానాన్ని పూర్తిచేసిన ఘనత బీజేపీ నేతృత్వంలోని ఎన్డీయే ప్రభుత్వానిదే. ఈ డిమాండ్‌ను గత 40 సంవత్సరాలుగా మురగబెట్టారు. సాయుధబలగాలు, మాజీ సైనికులు గట్టిగా కోరడంతో యూపీఏ ప్రభుత్వం ఓఆర్ఓపీ కోసం రూ.500 కోట్లను విడుదల చేసి చేతులు దులుపుకుంది. ఇది సైనికుల సమస్యలపై క్రూరంగా నవ్వడంలాంటిదే’ అని అన్నారు. ‘తమిళనాడులో అధికారంలోకి వస్తే రాష్ట్ర ప్రజలకు ఎంత గొప్పగా సేవ చేయగలమో ఒక్కసారి ఆలోచించండి’ అని మోదీ చెప్పారు. మరోవైపు, మోదీ ఆదివారం ఉత్తరప్రదేశ్‌లో పర్యటించనున్నారు. సోనియా గాంధీ సొంత నియోజకవర్గం రాయ్‌బరేలీలో పలు కార్యక్రమాలు ప్రారంభిస్తారు. -
మంత్రి మేటిస్ వైదొలగొచ్చు: ట్రంప్
వాషింగ్టన్: రక్షణ మంత్రి జిమ్ మేటిస్ పదవి నుంచి వైదొలిగే అవకాశముందని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తెలిపారు. సీబీఎస్ టీవీ చానెల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆయన ఈ విషయం తెలిపారు. దీంతో మంత్రివర్గంలో మరికొన్ని మార్పులు సంభవించనున్నాయనే అంచనాలు ఊపందుకున్నాయి. ‘నిజం చెప్పాలంటే జనరల్ మేటిస్ ఒక విధమైన డెమోక్రాట్(ప్రతిపాక్ష పార్టీ వ్యక్తి) అని నేననుకుంటున్నాను. కానీ, ఆయన మంచి వాడు. మేం కలిసి బాగా పనిచేశాం. ఆయన వెళ్లిపోవచ్చు. అంటే, ఎప్పుడో ఒకప్పుడు, అందరి లాగానే’ అని అన్నారు. రక్షణ మంత్రిగా మేటిస్ మరికొద్ది రోజులపాటు మాత్రమే కొనసాగే అవకాశాలున్నాయంటూ వార్తలు వస్తున్న నేపథ్యంలో ట్రంప్ ఈ వ్యాఖ్యలు చేయడం గమనార్హం. ‘మనకు గొప్ప కేబినెట్ ఉంది. అందులోని కొందరితో నాకు సంతృప్తి లేదు. కొందరితో సంతోషం లేదు. మరికొందరి వల్ల అంచనాకు మించిన సంతృప్తి ఉంది’ అని తెలిపారు. అధ్యక్షుడు ట్రంప్‌తో నేరుగా వివాదం తలెత్తకుండా క్యాబినెట్లో స్వతంత్రంగా వ్యవహరించే వ్యక్తిగా మేటిస్కు పేరుంది. మిత్ర దేశాలతో ట్రంప్ తీవ్ర వైఖరికి అడ్డుకట్ట వేసి, సామరస్యంగా వ్యవహారం నెరుపుతారని భావిస్తుంటారు. -
ఎమ్ఎస్ఎస్ డీజీగా ఎమ్మెస్సార్ ప్రసాద్
సాక్షి, హైదరాబాద్: రక్షణరంగంలో కీలక విభాగమైన మిస్సైల్స్ అండ్ స్ట్రాటజిక్ సిస్టమ్స్ (ఎమ్ఎస్ఎస్)కు డైరెక్టర్ జనరల్ (డీజీ)గా ప్రముఖ శాస్త్రవేత్త ఎమ్మెస్సార్ ప్రసాద్ (57) నియమితులయ్యారు. ఆయన ఐఐటీ మద్రాస్‌లో బీటెక్, బాంబే ఐఐటీ నుంచి ఎరోనాటికల్ ఇంజనీరింగ్ విభాగంలో ఎంటెక్ పూర్తి చేశారు. అనంతరం 1984లో డీఆర్డీవోలో చేరి మిస్సైల్ టెక్నాలజీలో కీలక శాస్త్రవేత్తగా ఎదిగారు. జలాంతర్గాముల నుంచి ప్రయోగించే పలు క్షిపణుల తయారీలో ఆయన ప్రధాన భూమిక పోషించారు. ఆయన ఆవిష్కరణలకు గుర్తింపుగా 2003, 2007, 2011లో డీఆర్డీవో పలు అవార్డులతో సత్కరించింది. మిసైల్ స్ట్రాటజిక్ ప్రోగ్రామ్‌లో ఆయన చేసిన విశేష కృషికి 2014లో బెస్ట్ ఇన్నోవేటివ్ టెక్నాలజీ డెవలప్మెంట్ అవార్డు కూడా అందుకున్నారు. -
ఎయిర్పోర్ట్ 24/7కు లైన్‌క్లియర్
సాక్షి, విశాఖపట్నం: విశాఖ అంతర్జాతీయ విమానాశ్రయానికి ఆంక్షల బెడద తొలగిపోయింది. ఈ ఎయిర్‌పోర్టు ఇక 24 గంటలూ పౌర విమాన సర్వీసులు నడపడానికి రక్షణ మంత్రిత్వశాఖ గ్రీన్‌సిగ్నల్ ఇచ్చింది. రక్షణశాఖ అధీనంలో ఉన్న ఈ ఎయిర్‌పోర్టులోకి పౌర విమానాల రాకపోకలపై కొన్నాళ్ల క్రితం నేవీ ఆంక్షలు విధించింది. నేవీ యుద్ధ విమానాల రాకపోకలు, విన్యాసాలు, సిబ్బందికి శిక్షణ వంటి మిలట్రీ ఆపరేషన్ల కోసం నవంబర్ ఒకటో తేదీ నుంచి రోజూ ఉదయం 9.30 నుంచి 12.30, సాయంత్రం 3 నుంచి 5 గంటల వరకు ఐదు గంటల పాటు పౌర విమానాలపై నిషేధం విధించింది. మంగళ, గురువారాల్లో రాత్రి 7 నుంచి 9 గంటల వరకు కూడా పౌర విమానాలు రాకపోకలు సాగించరాదని ఆంక్షలు పెట్టింది. దీంతో ఈ ఆంక్షల వల్ల తమకు నష్టం వాటిల్లుతుందని కొన్ని పౌర విమానయాన సంస్థలు విశాఖకు తమ విమాన సర్వీసులను తగ్గిస్తున్నట్టు, మరికొన్ని సంస్థలు రద్దు చేసుకుంటున్నట్టు ప్రకటించాయి. రక్షణ శాఖ ఆంక్షల నిర్ణయంపై ప్రయాణికుల నుంచే కాక వ్యాపార, వాణిజ్య, పారిశ్రామిక, ఐటీ వర్గాలు, ఏపీ ఎయిర్ ట్రావెలర్స్ అసోసియేషన్(ఏపీఏటీఏ) నుంచి కూడా తీవ్ర వ్యతిరేకత వ్యక్తమయింది. అంతేకాదు.. ఆంక్షలను సడలించకపోతే ఆందోళనకు సైతం సమాయత్తమయ్యారు. పరిస్థితిని గమనించిన రక్షణశాఖ అధికారులు తొలుత ఐదు గంటల నిషేధాన్ని మూడు గంటలకు కుదిస్తామని దిగివచ్చినా అంగీకరించలేదు. శరవేగంగా అభివృద్ధి చెందుతున్న విశాఖపై నేవీ ఆంక్షల ప్రభావం ఎలా చూపుతుందో ఏపీఏటీఏ నేతృత్వంలో రక్షణమంత్రి నిర్మలా సీతారామన్‌కు వినతిపత్రాలు అందజేశారు. రాజ్యసభ సభ్యుడు, వైఎస్సార్సీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి వి.విజయసాయిరెడ్డి ఎయిర్‌పోర్టుపై నేవీ ఆంక్షల ఎత్తివేయాలని రక్షణమంత్రిని కోరారు. అనంతరం జులై 14న రక్షణశాఖ పౌర విమానాల సమయాలపై విధించిన ఆంక్షల నిర్ణయాన్ని ఉపసంహరించుకుంది. ఈ నేపథ్యంలో తాజాగా విశాఖ విమానాశ్రయంలో ఎలాంటి అంతరాయాలు లేకుండా 24 గంటలూ పౌర విమానాల రాకపోకలకు గ్రీన్ సిగ్నల్ ఇస్తున్నట్టు రక్షణమంత్రి నిర్మలా సీతారామన్ ట్విటర్లో వెల్లడించారు. దీంతో విశాఖ అంతర్జాతీయ విమానాశ్రయంపై పౌర విమానాల రాకపోకలపై నిషేధం అధికారికంగా తొలగినట్టయింది. కొత్త సర్వీసులకు అవకాశం విశాఖ విమానాశ్రయం పౌర విమానాల వేళలపై ఆంక్షలు ఎత్తివేయనున్నట్టు గతంలో నేవీ ప్రకటన నేపథ్యంలో ఈ ఎయిర్‌పోర్టుకు కొత్తగా ఒక అంతర్జాతీయ (థాయ్‌లాండ్‌కు), 8 డొమెస్టిక్ విమాన సర్వీసులు నడపడానికి ముందుకొచ్చాయి. వీటి షెడ్యూళ్లు వచ్చే నెలలో వెలువడనున్నాయి. ప్రస్తుతం ఈ విమానాశ్రయం నుంచి రోజూ 70 పౌర విమాన సర్వీసులు నడుస్తున్నాయి. ప్రస్తుతం ఉదయం నుంచి రాత్రి 11 గంటల వరకు ఈ విమానాశ్రయం నుంచి విమానాలు దేశ, విదేశాలకు రాకపోకలు జరుగుతున్నాయి. విశాఖ ఎయిర్‌పోర్టుపై ఆంక్షలు ఎత్తివేస్తున్నట్టు రక్షణ మంత్రి సాక్షాత్తూ ప్రకటించడంతో విమానయాన సంస్థల్లో నమ్మకాన్ని పెంచినట్టు అయిందని ఏపీఏటీఏ ఉపాధ్యక్షుడు డీఎస్ వర్మ, విశాఖ డెవలప్మెంట్ కౌన్సిల్ అధ్యక్షుడు ఓ.నరేష్‌కుమార్‌లు ‘సాక్షి’తో చెప్పారు. ఈ విమానాశ్రయానికి మరిన్ని కొత్త సర్వీసుల రాకతో దేశంలోని వివిధ ప్రాంతాలతో పాటు విదేశాలకు కనెక్టివిటీ మరింత పెరుగుతుందన్నారు. ఈ సందర్భంగా రక్షణమంత్రి నిర్మలా సీతారామన్‌కు వారు కృతజ్ఞతలు తెలిపారు. -
స్టార్టప్‌లకు రక్షణశాఖ 11 సవాళ్లు
బెంగళూరు: రక్షణ రంగ సాంకేతిక అవసరాలకు ఉత్తమ పరిష్కారాలు చూపే స్టార్టప్‌లకు రక్షణ మంత్రిత్వ శాఖ 11 రకాలైన సవాళ్లను విసిరింది. ఈ నూతన ఆలోచనలు, ఆవిష్కరణలను పరిరక్షించటంతోపాటు మార్కెట్ కల్పిస్తామని హామీ ఇచ్చింది. ఇందుకు సంబంధించిన ‘డిఫెన్స్ ఇండియా స్టార్టప్ చాలెంజ్’ను రక్షణ మంత్రి నిర్మలా సీతారామన్ బెంగళూరులో ప్రారంభించారు. చాలెంజ్లోని 11 సవాళ్లు ఇవీ..సెన్సర్లతో కూడిన వ్యక్తిగత రక్షణ వ్యవస్థలు, కార్బన్ ఫైబర్ వైండింగ్, యాక్టివ్ ప్రొటెక్షన్ సిస్టమ్, హార్డ్‌వేర్ బేస్డ్ ఆఫ్‌లైన్ ఎన్‌క్రిప్ట్ ఫర్ గ్రేడెడ్ సెక్యూరిటీ, 4జీ/ఎల్టీఈ ఆధారిత లోకల్ ఏరియా నెట్వర్క్ అభివృద్ధి, సీ త్రూ ఆర్మర్, ఆధునిక సాంకేతికతతో కూడిన నిర్లవణీకరణ వ్యవస్థ, నీరు, నూనెలను వేరు చేసే వ్యవస్థలు, రవాణారంగంలో వాడే కృత్రిమ మేథ, రిమోట్ ద్వారా నియంత్రించే విహంగాలు, లేజర్ ఆయుధ వ్యవస్థలు, నేలపైనా, నీటిలోనూ సంచరించే మానవ రహిత వాహనాలు. -
హైదరాబాద్‌లో డిఫెన్స్ ఇంక్యుబేటర్!
సాక్షి, హైదరాబాద్: డిఫెన్స్ ఇంక్యుబేటర్‌ను హైదరాబాద్‌లో ఏర్పాటుకు కేంద్రం నుంచి సానుకూల స్పందన వచ్చిందని ఐటీ మంత్రి కేటీ రామారావు తెలిపారు. నగరంలో ఉన్న రక్షణ ఎకో సిస్టమ్‌ను దృష్టిలో పెట్టుకుని ఇక్కడ డిఫెన్స్ ఇంక్యుబేటర్ ఏర్పాటు చేయాలని కేటీఆర్ గతంలో రక్షణ మంత్రి నిర్మలాసీతారామన్‌కు లేఖ రాశారు. దీనిపై కేంద్ర మంత్రి స్పందించారు. నగరంలోని టీహబ్ కేంద్రంగా డిఫెన్స్ ఇంక్యుబేటర్ ఏర్పాటు చేసేందుకు సానుకూలత తెలిపారు. కేంద్రం ప్రవేశపెట్టిన ఇన్నోవేషన్స్ ఫర్ డిఫెన్స్ ఎక్సలెన్స్ (ఐడెక్స్) పథకంలో భాగంగా డిఫెన్స్ ఇంక్యుబేటర్‌ను ఏర్పాటు చేసేందుకు సానుకూలంగా ఉన్నామని కేంద్ర మంత్రి కేటీఆర్‌కు తెలిపారు. ఇన్నోవేషన్స్ ఫర్ డిఫెన్స్ ఎక్సలెన్స్ పథకంలో రక్షణ, ఏరోస్పేస్ రంగంలోని పరిశోధనలను ప్రోత్సహించేందుకు, ఎంఎస్ఎంఈ, స్టార్టప్స్, ఆయా రంగాల్లో వ్యక్తిగత పరిశోధన చేసే వారికి, పరిశోధన సంస్థలకు, విద్యార్థులకు కేం ద్రం ప్రత్యేకంగా నిధులు సమకూర్చే అవకాశం ఉంటుందని నిర్మలాసీతారామన్ తెలిపారు. టీహబ్ కేంద్రంగా డిఫెన్స్ ఇంక్యుబేటర్‌ను ఏర్పాటు చేసేందుకు కేంద్రమంత్రి సానుకూల స్పం దనపై కేటీఆర్ హర్షం వ్యక్తం చేశారు. రాష్ట్ర ప్రభుత్వం ఏర్పడిన తర్వాత రక్షణ, ఏరోస్పేస్ రంగాలను ప్రాధాన్యత అంశాలుగా గుర్తించిందని, ఈ రంగంలో హైదరాబాద్‌కు కొత్త పెట్టుబడులను ఆకర్షించడంలో ప్రభుత్వం విజయవంతమయ్యిందన్నారు. నగరంలో డిఫెన్స్ ఇంక్యు బేటర్‌ను ఏర్పాటు చేస్తే ప్రస్తుతం ఉన్న ఎకో సిస్టం మరిం త బలోపేతమవుతుందని అన్నారు. దీని ఏర్పాటుకు రాష్ట్ర ప్రభుత్వం తరఫున పూర్తి సహాయ సహకారాలు అందిస్తా మని కేటీఆర్ తెలిపారు. టీహబ్ రెండో దశ భవనంలో డిఫెన్స్ ఇంక్యుబేటర్‌కు స్థలాన్ని కేటాయించనున్నట్లు వివరించారు. దీంతో రక్షణ రంగంలో పరిశోధనలకు ప్రోటోటైపింగ్, నైపుణ్య శిక్షణ సేవలను అందించేందుకు దోహదపడుతుందని మంత్రి తెలిపారు. -
ఎన్డీఏలో ఐదుగురు సిబ్బందిపై సీబీఐ కేసు
న్యూఢిల్లీ: మహారాష్ట్రలోని ఖడక్వాస్లాలో ఉన్న నేషనల్ డిఫెన్స్ అకాడమీ(ఎన్డీఏ) ప్రిన్సిపాల్‌తో పాటు నలుగురు బోధనా సిబ్బందిపై సీబీఐ బుధవారం కేసు నమోదుచేసింది. బోధనారంగంలో అనుభవం, పనీతీరుపై నకిలీ సర్టిఫికెట్లతో ఈ ఐదుగురు నిందితులు ఎన్డీఏలో ఉద్యోగాలు పొందారని అరోపించింది. కేసు నమోదుచేసిన అనంతరం సీబీఐ అధికారులు ఖడక్వాస్లాలోని ఎన్డీఏ ప్రాంగణంతో పాటు నిందితుల ఇళ్లపై దాడిచేసి కీలకపత్రాలను స్వాధీనం చేసుకున్నారు. ఈ విషయమై సీబీఐ అధికార ప్రతినిధి ఆర్కే గౌర్ స్పందిస్తూ.. పుణేలో ఉన్న ఎన్డీఏ–ఖడక్వాస్లా ప్రిన్సిపాల్ ఓంప్రకాశ్ శుక్లా, ప్రొఫెసర్ జగ్మోహన్ మెహెర్(పొలిటికల్ సైన్స్) అసోసియేట్ ప్రొఫెసర్లు వనీతా పూరి (కెమిస్ట్రీ), రాజీవ్ బన్సల్(గణితం), కెమిస్ట్రీ విభాగం హెచ్‌వోడీ మహేశ్వర్ రాయ్‌పై కేసు నమోదుచేశామని తెలిపారు. అలాగే యూపీఎస్సీ, ఇంటిగ్రేటెడ్ డిఫెన్స్ స్టాఫ్ ప్రధాన కార్యాలయానికి(హెచ్‌క్యూ–ఐడీఎస్) చెందిన గుర్తుతెలియని అధికా రిపైన కూడా కేసు నమోదుచేశామన్నారు. ఖడక్వాస్లాలోని ఎన్డీఏలో 13 మంది అర్హతలేని బోధనా సిబ్బంది అక్రమంగా ఉద్యోగాలు పొందారన్న ఆరోపణలపై గతేడాది ప్రాథమిక విచారణ ప్రారంభించినట్లు గౌర్ తెలిపారు. సాధారణంగా ఎన్డీఏలో బోధనా సిబ్బందిని యూపీఎస్సీ ఎంపిక చేస్తుందనీ, యూపీఎస్సీ సిఫార్సు ఆధారంగా రక్షణశాఖ నియామకాలు చేపడుతుందని పేర్కొన్నారు. యూపీఎస్సీతో పాటు హెచ్‌క్యూ–ఐడీఎస్‌లోని కొందరు అధికారుల సాయంతో ఈ ఐదుగురు నిందితులు 2007–08, 2012–13 మధ్యకాలంలో నకిలీ సర్టిఫికెట్లతో ఉద్యోగాల్లో చేరినట్లు విచారణలో తేలిందన్నారు. దీంతో కేసు నమోదుచేశామని వెల్లడించారు. -
భారత్ కోసం అమెరికా చరిత్రాత్మక నిర్ణయం
వాషింగ్టన్, అమెరికా : భారత్ అన్ని రంగాల్లో ప్రపంచ దేశాలతో పోటీ పడుతోంది. రక్షణ రంగంలో కూడా భారత్ పటిష్టమవుతోంది. తాజాగా పసిఫిక్ మహా సముద్రంలో భారత్‌కు పెరుగుతున్న ప్రాముఖ్యతను అమెరికా గుర్తించింది. అమెరికా ఆధ్వర్యంలో పసిఫిక్ సముద్రంలో ఉన్న ‘పసిఫిక్ కమాండ్’ పేరును ‘యూఎస్-ఇండో కమాండ్’ గా మారుస్తున్నట్లు అమెరికా అధికారులు బుధవారం వెల్లడించారు. పసిఫిక్ మహాసముద్ర ప్రాంతంలో భారత్‌కు అమెరికా ఇస్తున్నప్రాముఖ్యతకు ఈ పేరు దోహదం చేస్తుందని పెంటగాన్ అధికారులు తెలిపారు. "పసిఫిక్, హిందూ మహాసముద్ర ప్రాంతాల్లో భాగస్వామ్య దేశాలతో మరింత బలమైన బంధాన్ని కోరుకుంటున్నాం. ఈ పరిధిలోని దేశాల్లో మరింత స్థిరత్వం కోసం ఈ పేరు మార్పు దోహదపడుతుంది" అని అమెరికా రక్షణ శాఖ కార్యదర్శి జిమ్ మాటిస్ వెల్లడించారు. భారత్‌కు, పసిఫిక్ మహా సముద్రానికి కనెక్టివిటీ పెరుగుతున్న తరుణంలో తాము పేరు మార్పు నిర్ణయం తీసుకున్నట్టు ఆయన వెల్లడించారు. అత్యాధునిక విమాన వాహక నౌకలతో పాటు, యుద్ధ నౌకలు కలిగి ఉన్న3.75 లక్షల సైనిక బృందం, గ్రేటర్ పసిఫిక్ సముద్ర ప్రాంతంలో నిఘా కాస్తోంది. ఈ కమాండ్‌కు ఇప్పటివరకూ అడ్మిరల్ హ్యారీ హారిస్ నేతృత్వం వహించారు. ఇటీవల అమెరికా అధ్యక్షుడు ట్రంప్ హ్యారీ హారిస్ దక్షిణ కొరియా రాయాబారిగా నియమించారు. దీంతో అడ్మిరల్ ఫిలిప్ డేవిడ్ సన్ ఆ కమాండ్‌కు బాధ్యతలు వహించనున్నారు.