‘హెలినా’ పరీక్ష విజయవంతం | 'Helena' test successful | Sakshi
Sakshi News home page

‘హెలినా’ పరీక్ష విజయవంతం

Published Tue, Jul 14 2015 2:04 AM | Last Updated on Sun, Sep 3 2017 5:26 AM

‘హెలినా’  పరీక్ష విజయవంతం

‘హెలినా’ పరీక్ష విజయవంతం

జోధ్‌పూర్: శత్రువు ల యుద్ధ ట్యాంకులను తుత్తునియలు చేసే ‘హెలినా’ క్షిపణి (‘నాగ్’ క్షిపణి హెలికాప్టర్ వెర్షన్)ను రక్షణశాఖ విజయవంతంగా పరీక్షించింది. రాజస్తాన్‌లో జైసల్మేర్‌లో చందన్ ఫైరింగ్ రేంజ్‌లో నిర్వహించిన ఈ ప్రయోగంలో..7 కి.మీ. దూరంలోని లక్ష్యాన్ని ‘హెలినా’ ఛేదించిందని రక్షణశాఖ వర్గాలు వెల్లడించాయి.

ఆదివారం మూడు సార్లు దీనిని ప్రయోగించగా ఒకసారి లక్ష్యానికి స్వల్ప దూరంలో పేలిందని తెలిపాయి. అయితే ప్రాథమికంగా క్షిపణి పరీక్ష సంతృప్తికర ఫలితాలను ఇచ్చిందన్నాయి. ఈ వెర్షన్‌కు సంబంధించి ఇంతకు ముందే పోఖ్రాన్‌లో ప్రయోగాత్మక పరీక్షలు జరిపామని, అవి కూడా విజయవంతం అయ్యాయని చెప్పాయి.
 
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement