
వాషింగ్టన్: అమెరికా రక్షణ శాఖ ప్రధాన కార్యాలయం సమీపంలో కాల్పులు కలకలం సృష్టించాయి. పెంటగాన్ భవనం బయట ఉన్న మెట్రో బస్ ప్లాట్‌ఫామ్‌పై దుండగులు కాల్పులకు తెగపడ్డారు. పెంటగాన్ లోపలకు వచ్చే మార్గం కావడంతో అధికారులు అప్రమత్తమయ్యారు. దీంతో ముందస్తు జాగ్రత్తగా పెంటగాన్‌ను అధికారులు మూసివేశారు. ప్రజలెవరూ పెంటగాన్ సమీపంలోకి రావొద్దని అధికారులు సూచిస్తున్నారు.
కాగా, అమెరికా అధ్యక్షుడిగా ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత బైడెన్ తొలిసారిగా దేశంలోని తుపాకీల సంస్కృతికి చరమగీతం పాడటంపై దృష్టి సారించిన సంగతి తెలిసిందే. దేశంలో గన్స్ అతి వాడకాన్ని నియంత్రిస్తూ బైడెన్ ప్రభుత్వం కొన్ని చర్యలు తీసుకున్నట్టుగా వైట్‌హౌస్ వర్గాలు వెల్లడించినప్పటికీ లాభం లేకుండా పోయింది. ఈరోజు అమెరికా సైన్యం వద్ద కంటే ప్రైవేట్ వ్యక్తుల చేతుల్లో ఏఆర్, ఏకే రైఫిల్స్ ఎక్కువగా కనిపిస్తున్నాయి. పైగా రైఫిల్స్ కంటే హ్యాండ్ గన్స్ వల్లే ఎక్కువగా నేరాలు, హత్యలు జరుగుతున్నాయి.
Comments
Please login to add a commentAdd a comment