Shooting a gun
-
కోర్టులో జడ్జిని కాల్చి చంపిన పోలీసు
ఫ్రాంక్ఫర్ట్: అమెరికాలో తుపాకీ సంస్కృతికి మరొకరు ప్రాణాలు కోల్పోయారు. గతంలో జరిగిన ఘటనల్లో సాధారణ పౌరులు ప్రాణాలు కోల్పోగా ఈసారి ఏకంగా న్యాయమూర్తి బలయ్యారు. న్యాయమూర్తి పైకి ఆ ప్రాంత పోలీసు ఉన్నతాధికారి బులñ æ్లట్ల వర్షం కురిపించడం గమనార్హం. గురువారం కెంటకీ రాష్ట్రంలోని లెట్చర్ కౌంటీలోని వైట్స్‌బర్గ్ జిల్లా కోర్టులో విధులు నిర్వర్తిస్తున్న 54 ఏళ్ల జిల్లా జడ్జి కెవిన్ ములిన్స్‌ను ఆయన ఛాంబర్‌లోనే లెట్చర్ కౌంటీ షరీఫ్ షాన్ ఎం.స్టైన్స్ కాలి్చచంపారు. విషయం తెల్సి పోలీసులు పక్కనే ఉన్న పాఠశాలలోని విద్యార్థులను వెంటనే ఇళ్లకు పంపించేశారు. కాల్పులు జరిగినప్పుడు కోర్టులో దాదాపు 50 మంది ఉన్నారు. అసలేం జరిగిందంటే? గత ఎనిమిదేళ్లుగా అదే కౌంటీలో షరీఫ్‌గా పనిచేస్తున్న షాన్ గురువారం మధ్యాహ్నం 3 గంటల ప్రాంతంలో వైట్స్‌బర్గ్ కోర్టు భవనానికి వచ్చి జడ్జి ములిన్స్‌తో విడిగా అత్యవసరంగా మాట్లాడాలని అనుమతి కోరాడు. దీంతో జడ్జి ఆయనను తన ఛాంబర్‌కు తీసుకెళ్లి గది తలుపులు మూసేశారు. చాలాసేపు వాళ్లిద్దరి మధ్య వాగ్వాదం జరిగిందని బయట వరండాలో వేచి ఉన్న వ్యక్తులు చెప్పారు. అయితే ఒక్కసారిగా కాల్పుల శబ్దం వినిపించిందని, తర్వాత షరీఫ్ షాన్ చేతులు పైకెత్తి బయటికొచ్చి లొంగిపోయాడని పోలీసులు తెలిపారు. ఛాంబర్ లోపలికి వెళ్లి చూస్తే బుల్లెట్ల గాయాలతో రక్తమోడి జడ్జి నిర్జీవంగా పడి ఉన్నారని కెంటకీ రాష్ట్ర పోలీసు అధికార ప్రతినిధి మ్యాట్ గేహార్ట్ శుక్రవారం వెల్లడించారు. జడ్జిని షరీఫ్ ఎందుకు చంపారనే కారణం ఇంకా తెలియరాలేదు. ఏ విషయం మీద జడ్జి, షరీఫ్‌ల మధ్య తీవ్ర వాగ్వాదం జరిగిందన్న విషయం ఇంకా వెల్లడికాలేదు. షరీఫ్‌ను అరెస్ట్ చేసి పోలీసులు హత్యానేరం కింద దర్యాప్తు మొదలుపెట్టారు. -
ట్రంప్‌పై దాడి.. ముందే హింట్ ఇచ్చిన క్రూక్స్!
న్యూయార్క్: అమెరికా అధ్యక్ష ఎన్నికల ప్రచార ర్యాలీలో పాల్గొన్న మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌పై ఇటీవల కాల్పులు చోటుచేసుకున్నాయి. ఈ కాల్పుల్లో ఆయన తృటిలో ప్రాణాపాయం నుంచి తప్పించుకున్నారు. 20 ఏళ్ల థామస్ మాథ్యూ క్రూక్స్ ట్రంప్‌పై కాల్పులు జరపగా.. ఆయన చెవిని తాకుతూ బుట్లెట్ పక్కకు దూసుకువెళ్లింది. వెంటనే ఆప్రమత్తమైన సిక్రెట్ సర్వీస్ ఎజెంట్లు ఆయన ఆస్పత్రి తీసుకెళ్లారు. అనంతరం వారి జరిపిన కాల్పుల్లో నిందితుడు క్రూక్స్ మృతి చెందాడు. అయితే ఈ ఘటనపై ఎఫ్‌బీఐ దర్యాప్తు చేస్తోంది. తాజాగా క్రూక్స్‌కు సంబంధించిన ఓ విషయాన్ని ఎఫ్‌బీఐ అధికారులు వెల్లడించారు. ట్రంప్‌పై హత్యాయత్నానికి ముందు సోషల్ మీడియాలో ప్లాట్ఫామ్లో సందేశం ద్వారా కాల్పులు జరపనున్నట్లు సంకేతం ఇచ్చినట్లు తెలిపారు. ‘జూలై 13 నాకు చాలా ముఖ్యమైంది. ఆ రోజు ఏం జరుగుతుందో చూడండి’అని క్రూక్స్ సోషల్‌మీడియా పోస్ట్ చేశాడని తెలిపారు. అదేవిధంగా దర్యాప్తు అధికారులు అతడు షూట్ చేడానికి వాడిన గన్ టెక్నాలజీ, వాడిన మొబైల్, లాప్‌టాప్‌పై పరిశీలిస్తున్నారు.క్రూక్స్ మొబైల్లో డొనాల్డ్ ట్రంప్, ప్రెజిడెంట్ బైడెన్ ఫోటోలు, డొమెక్రటిక్ నేషనల్ కన్వేషన్ షెడ్యూల్, ట్రంప్ పెన్సిల్వేనియా ప్రచార ర్యాలీకి సంబంధించి సమాచారం ఉన్నట్లు ఎఫ్‌బీఐ అధికారులు గుర్తించినట్లు తెలుస్తోంది. క్రూక్స్ రెండు మొబైల్స్ కలిగి ఉన్నాడని ఒకటి కాల్పుల ఘటనాస్థలిలో స్వాధీనం చేసుకోగా.. మరోఫోన్ అతని ఇంట్లో స్వాధీనం చేసుకున్నట్లు దర్యాప్తు తెలిపారు. అందులో కేవలం 27 కాంటక్ట్ నెంబర్లు మాత్రమే ఉన్నట్లుగా గుర్తించారు. ఈ ఘటనపై దర్యాప్తు కొనసాగిస్తున్నట్లు ఎఫ్‌బీఐ పేర్కొంది. -
అమెరికాలో మళ్లీ కాల్పులు
తంపా (యూఎస్): అమెరికాలో మరోసారి కాల్పులు జరిగాయి. ఫ్లోరిడాలో స్థానిక కాలమానం ప్రకారం ఆదివారం తెల్లవారుజామున రెండు గ్యాంగుల మధ్య పోరాటం కాల్పుల దాకా వెళ్లడంతో ఇద్దరు మరణించారు. 18 మంది దాకా గాయపడి ఆస్పత్రి పాలయ్యారని పోలీసులు తెలిపారు. ఆ ప్రాంతమంతా బార్లు, క్లబ్బులతో, లేట్ నైట్ కార్యకలాపాలతో నిండి ఉంటుంది. అనుమానితుల్లో ఒకరు ఇప్పటికే పోలీసులకు లొంగిపోయారు. మిగతావారి కోసం గాలింపు జరుగుతున్నట్టు పోలీసులు తెలిపారు. మరో ఘటన... జార్జియా యూనివర్సిటీ అట్లాంటా క్యాంపస్‌లో జరిగిన కాల్పుల ఘటనలో ఇద్దరు విద్యార్థులు సహా నలుగురు గాయపడ్డారు. క్షతగాత్రుల్లో ఒకరి పరిస్థితి విషమంగా ఉందని పోలీసులు తెలిపారు. -
చేసేదే దొంగ పని.. అందులోనూ వైరం.. కాల్పులు జరపటంతో.. !
పాట్నా: ఇసుక అక్రమ రవాణాలో రెండు ముఠాల మధ్య తలెత్తిన వివాదం కాల్పుల వరకు వెళ్లింది. ఇరు వర్గాలు ఒకరిపై ఒకరు కాల్పులు జరపటంతో మొత్తం నలుగురు ప్రాణాలు కోల్పోయారు. ఈ సంఘటన బిహార్‌లోని బిహ్తా నగరంలో గురువారం జరిగింది. సన్ రివర్ నుంచి అక్రమంగా ఇసుక తరలించటంలో రెండు గ్రూపులు నిమగ్నమయ్యాయి. ఈ విషయంపైనే మాటా మాటా పెరిగి దాడులు చేసుకున్నాయి. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని దర్యాప్తు చేపట్టారు. తూటాలు తగిలి నలుగురు అక్కడికక్కడే మరణించినట్లు చెప్పారు. సెప్టెంబర్ 13న బిహార్‌లోని బెగుసరాయ్‌లో జాతీయ రహదారులు 28, 31పై బైక్‌పై వచ్చి కాల్పులు జరిపిన ఘటన కలకలం సృష్టించింది. ఈ ఘటనల్లో ఒకరు మృతి చెందగా తొమ్మిది మంది గాయపడ్డారు. కొద్ది రోజుల్లోనే ఇలా రెండు ముఠాలు కాల్పులు జరపటం గమనార్హం. ఇదీ చదవండి: డ్రగ్స్ ముఠాలపై సీబీఐ ‘ఆపరేషన్ గరుడ’.. 175 మంది అరెస్ట్ -
ఆరేళ్ల బాలుడి కాల్పులు.. ఐదేళ్ల చెల్లి మృతి!
వాషింగ్టన్: అమెరికాలో కాల్పుల సంఘటనలు కలకలం రేపుతున్నాయి. ఇండియానాపొలిస్ నగరం సమీపంలోని మున్సీ పట్టణంలో ఘోరంగా జరిగింది. ఆరేళ్ల బాలుడు ఇంట్లో ఐదేళ్ల తన చెల్లిని తుపాకీతో కాల్చాడు. తీవ్రంగా గాయపడిన బాలిక కన్నుమూసింది. ఈ ఘటనలో బాలుడి తల్లిదండ్రులను పోలీసులు అరెస్టు చేశారు. మంగళవారం తెల్లవారుజామున జరిగినట్లు అధికారులు తెలిపారు. బాలిక తలలో తూటా దిగినట్లు చెప్పారు. ఆమెను స్థానిక ఐయూ హెల్త్ బాల్ మెమోరియల్ ఆసుపత్రికి తరలించగా.. అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు తెలిపారని పేర్కొన్నారు. సురక్షిత ప్రాంతంలో పెట్టిన రెండు హ్యాండ్ గన్స్‌లో నుంచి ఒకదానిని తన ఆరేళ్ల బాలుడు తీసుకున్నట్లు చెప్పారు అరెస్టయిన జాకబ్ గ్రేసన్. తన చెల్లిన కాల్చినట్లు చెప్పారు. నిరక్ష్యంగా వ్యవహరించినందుకు జాకబ్‌తో పాటు ఆయన భార్య కింబెర్లి గ్రేసన్‌ను అరెస్ట్ చేశారు. ఇదీ చదవండి: రాబోయే పదేళ్లలో కొత్త ముప్పు.. ప్రాణాలు హరించే.. -
America Celebrates Independence Day: అమెరికాలో మళ్లీ కాల్పులు... ఆరుగురు దుర్మరణం
షికాగో: అమెరికాలో మళ్లీ తుపాకుల మోత మోగింది. దేశ స్వాతంత్య్ర దినం సందర్భంగా సోమవారం ఉదయం షికాగో నగర శివారులోని ఐలండ్ పార్కు వద్ద జరుగుతున్న ఇండిపెండెన్స్ డే పరేడ్‌పై ఓ దుండగుడు విచక్షణారహితంగా కాల్పులకు దిగాడు. వీటిలో కనీసం ఆరుగురు మరణించగా 30 మందికి పైగా గాయపడ్డట్టు సమాచారం. కాల్పుల సమయంలో పరేడ్‌ను చూసేందుకు జనం భారీగా వచ్చిన నేపథ్యంలో క్షతగాత్రుల సంఖ్య ఇంకా పెరగవచ్చంటున్నారు. కాల్పులతో భయాందోళన లోనై వారంతా ఒక్కసారిగా పరుగులు తీశారు. దుండగుడు పరారీలో ఉన్నాడు. అతను కాల్పులు జరిపిన తుపాకీ దొరికినట్టు పోలీసులు చెప్పారు. కాల్పుల్లో ఎవరూ మరణించలేదని తొలుత అధికారులు చెప్పినా, రక్తం మడుగులో పడున్న మూడు మృతదేహాలను చూశామని ప్రత్యక్ష సాక్షులు తెలిపారు. నైట్‌క్లబ్‌లో కాల్పుల్లో మరొకరు అమెరికాలో శాక్రిమాంటో నగరంలో సోమవారం తెల్లవారుజామున ఓ నైట్‌క్లబ్‌లో జరిగిన కాల్పుల్లో ఒకరు మరణించగా నలుగురు గాయపడ్డారు. డెన్మార్క్‌లో ముగ్గురు... కోపెన్‌హాగెన్: డెన్మార్క్ రాజధాని కోపెన్‌హాగన్‌లోని షాపింగ్ మాల్లో ఆదివారం రాత్రి ఓ వ్యక్తి విచ్చలవిడిగా జరిపిన కాల్పుల్లో ముగ్గురు మృతి చెందగా మరో ముగ్గురు తీవ్రంగా గాయపడ్డారు. -
అమెరికాలో కాల్పులు.. ఒకరి మృతి
బ్లాక్స్బర్గ్: అమెరికాలోని వర్జీనియాలో ఓ హుక్కా లాంజ్‌లో కాల్పులు జరిగాయి. ఈ ఘటనలో ఒకరు మరణించారు, మరో నలుగురు గాయపడ్డారని అధికారులు ప్రకటించారు. బ్లాక్‌బర్గ్ డౌన్‌టౌన్‌లోని మెలోడీ హుక్కా లాంజ్‌లో శుక్రవారం అర్ధరాత్రి ఈ సంఘటన చోటుచేసుకున్నట్లు తెలిపారు. ఈ కాల్పులు జరిపింది ఎవరు? అందుకు గల కారణాలు ఏమిటన్నది ఇంకా తెలియరాలేదు. -
రక్షణ శాఖ ప్రధాన కార్యాలయం సమీపంలో కాల్పుల కలకలం
వాషింగ్టన్: అమెరికా రక్షణ శాఖ ప్రధాన కార్యాలయం సమీపంలో కాల్పులు కలకలం సృష్టించాయి. పెంటగాన్ భవనం బయట ఉన్న మెట్రో బస్ ప్లాట్‌ఫామ్‌పై దుండగులు కాల్పులకు తెగపడ్డారు. పెంటగాన్ లోపలకు వచ్చే మార్గం కావడంతో అధికారులు అప్రమత్తమయ్యారు. దీంతో ముందస్తు జాగ్రత్తగా పెంటగాన్‌ను అధికారులు మూసివేశారు. ప్రజలెవరూ పెంటగాన్ సమీపంలోకి రావొద్దని అధికారులు సూచిస్తున్నారు. కాగా, అమెరికా అధ్యక్షుడిగా ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత బైడెన్ తొలిసారిగా దేశంలోని తుపాకీల సంస్కృతికి చరమగీతం పాడటంపై దృష్టి సారించిన సంగతి తెలిసిందే. దేశంలో గన్స్ అతి వాడకాన్ని నియంత్రిస్తూ బైడెన్ ప్రభుత్వం కొన్ని చర్యలు తీసుకున్నట్టుగా వైట్‌హౌస్ వర్గాలు వెల్లడించినప్పటికీ లాభం లేకుండా పోయింది. ఈరోజు అమెరికా సైన్యం వద్ద కంటే ప్రైవేట్ వ్యక్తుల చేతుల్లో ఏఆర్, ఏకే రైఫిల్స్ ఎక్కువగా కనిపిస్తున్నాయి. పైగా రైఫిల్స్ కంటే హ్యాండ్ గన్స్ వల్లే ఎక్కువగా నేరాలు, హత్యలు జరుగుతున్నాయి. -
కొరియాల మధ్య కొత్త వివాదం
సియోల్: దక్షిణ కొరియా ఉద్యోగి ఒకరిని ఉత్తర కొరియా దళాలు కాల్చి చంపి, మృతదేహాన్ని తగలబెట్టాయి. సరిహద్దు దాటేందుకు ప్రయత్నించినందుకు ఈ పని చేసి ఉండొచ్చని దక్షిణ కొరియా పేర్కొంది. ఆ వ్యక్తిని ఇరుదేశాల మధ్య వివాదాస్పద సరిహద్దులోని జలాల్లో ఒక చిన్న తెప్పలాంటి దానిపై ప్రయాణిస్తుండగా, గుర్తించి అదుపులోకి తీసుకుని చంపేశాయని గురువారం వెల్లడించింది. దక్షిణ కొరియా రక్షణ మంత్రి వెల్లడించిన సమాచారం మేరకు.. అక్రమ చేపల వేటను నిరోధించేందుకు ఉద్దేశించిన ఒక ప్రభుత్వ నౌక నుంచి ఆ ఉద్యోగి కనిపించకుండాపోయారు. ఆ తరువాత వివాదాస్పద జలాల్లో కనిపించిన ఆ వ్యక్తి ఎవరో తెలుసుకునేందుకు మొదట నార్త్ కొరియా అధికారులు వెళ్లారు. ఆ తరువాత, కాసేపటికి నౌకాదళ సభ్యులు ఆ ప్రాంతానికి వెళ్లి ఆ వ్యక్తిని కాల్చేశాయి. అనంతరం, ఆ ఉద్యోగిని తగలపెట్టాయి. ఆ ఉద్యోగి ఉత్తర కొరియాలోకి వెళ్లేందుకు ప్రయత్నిస్తున్న క్రమంలో ఈ ఘటన చోటు చేసుకున్నట్లు పేరు చెప్పడానికి ఇష్టపడని దక్షిణ కొరియా రక్షణ శాఖ ఉద్యోగి ఒకరు వెల్లడించారు. కరోనా వైరస్ వ్యాప్తిని అడ్డుకునే లక్ష్యంతో అక్రమంగా సరిహద్దులు దాటేవారిని కనిపిస్తే కాల్చివేయాలని ఉత్తర కొరియా ఇప్పటికే ఆదేశాలు జారీ చేసింది. తమ దేశంలో కరోనా ఇంకా అడుగుపెట్టలేదని ఉత్తర కొరియా చెబుతోంది. నార్త్ కొరియా దుశ్చర్యను తీవ్రంగా ఖండిస్తున్నామని, బాధ్యులను శిక్షించాలని ఆ దేశాన్ని డిమాండ్ చేస్తున్నామని దక్షిణ కొరియా సీనియర్ మిలటరీ అధికారి ఆన్ యంగ్ హో పేర్కొన్నారు. -
అమెరికాలో కాల్పులు ఆరుగురు మృతి
జెర్సీ సిటీ: అమెరికా న్యూజెర్సీ నగరంలో తుపాకీ విష సంస్కృతి మరోసారి చెలరేగింది. మంగళవారం రాత్రి నగర వీధుల్లో జరిగిన కాల్పుల్లో ఆరుగురు మృతిచెందారు. వీరిలో ముగ్గురు సాధారణ పౌరులు కాగా, ఒక పోలీసు అధికారి, కాల్పులకు తెగబడిన ఇద్దరు దుండగులు ఉన్నారు. దుండగులు యూదులకు చెందిన కొషర్ సూపర్ మార్కెట్‌ని లక్ష్యంగా చేసుకున్నట్టు నగర మేయర్ స్టీవెన్ చెప్పారు. ఇది ఉగ్రవాదుల దాడి కాదని, కేవలం యూదుల్ని లక్ష్యంగా చేసుకొని కాల్పులకు దిగారని, పోలీసులు వారిని హతం చేశారని ట్వీట్ చేశారు. -
కాలిఫోర్నియా పబ్‌లో కాల్పులు: 12 మంది మృతి
న్యూయార్క్ : అమెరికాలోని కాలిఫోర్నియా నగరానికి చెందిన థౌజండ్ ఓక్స్ ప్రాంతంలోని ఓ బార్లో గురువారం ఉదయం ఓ వ్యక్తి కాల్పులు జరపడంతో పోలీస్ అధికారి, గన్‌మెన్ సహా 12 మంది మరణించారు. ఘటనలో పలువురికి గాయాలయ్యాయి. ఈరోజు తెల్లవారుజామున పబ్‌లోకి చొచ్చుకువచ్చిన దుండగుడు తొలుత హ్యాండ్‌గన్‌తో పలుమార్లు కాల్పులు జరిపిన తర్వాత పొగబాంబులు విసిరి మరోసారి కాల్పులకు తెగబడ్డాడని ప్రత్యక్ష సాక్షులు తెలిపినట్టు ఏబీసీ న్యూస్ ఛానెల్ వెల్లడించింది. నిందితుడు 30 సార్లు కాల్పులు జరిపాడని, బార్ నుంచి అందరూ చెల్లాచెదురైన తర్వాత సైతం తనకు కాల్పుల శబ్ధం వినిపించిందని మరో ప్రత్యక్ష సాక్షి వెల్లడించారు. కాలిఫోర్నియాలోని బోర్డర్‌లైన్ బార్ అండ్ గ్రిల్ అనే పబ్‌లో కాల్పులు జరిగాయని స్ధానిక సమాచార వెబ్సైట్ వెంచురా కంట్రీ స్టార్ పేర్కొంది. కాగా దుండగుడి కాల్పుల ఘటనపై స్ధానిక అగ్నిమాపక విభాగం ట్వీట్ చేసింది. ఘటనా ప్రదేశానికి ప్రజలు దూరంగా ఉండాలని, పలువురికి తీవ్రగాయాలయ్యాయని, పెద్దసంఖ్యలో అంబులెన్స్‌లు అవసరమని పేర్కొంది. కాల్పుల కలకలం చోటుచేసుకున్న సమయంలో బోర్డర్‌లైన్ బార్లో పెద్దసంఖ్యలో యువకులున్నారని, ఘటన నేపథ్యంలో ఒకరిని ఒకరు గుర్తించిన అనంతరం హగ్ చేసుకుంటూ కనిపించిన వీడియోను వెంచురా కంట్రీ స్టార్ రిపోర్టర్ పోస్ట్ చేశారు. కాల్పుల ఘటనకు సంబంధించి పూర్తి వివరాలు తెలియరావాల్సి ఉంది. కాగా, అమెరికాలో స్కూళ్లు, పబ్‌లు, రెస్టారెంట్లు సహా బహిరంగ ప్రదేశాల్లో దుండగులు కాల్పులతో విరుచుకుపడుతున్న ఘటనలు పలుమార్లు చోటుచేసుకుంటున్న సంగతి తెలిసిందే. -
నెల్లూరులో కాల్పుల కలకలం
నెల్లూరు(క్రైమ్): దుండగుల కాల్పులతో బొల్లినేని ఆస్పత్రిలో మృతిచెందిన మహేంద్రసింగ్ మృతదేహాన్ని, సంఘటన స్థలిని శనివారం అర్ధరాత్రి జిల్లా ఎస్పీ ఐశ్వర్య రస్తోగి పరిశీలించారు. సంఘటన జరిగిన తీరును సిబ్బందిని అడిగి తెలుసుకున్నారు. మృతునికి వ్యాపార లావాదేవీల్లో లేదా వ్యక్తిగతంగా ఎవరితోనైనా విభేదాలున్నాయా అనే వివరాల గురించి ఆరా తీశారు. కుటుంబ సభ్యులను విచారించగా ఎవరితోనూ విభేదాలులేవని వారు వెల్లడించినట్లు సమాచారం. అయితే దుండగులు ఎందుకు హత్యచేయాల్సి వచ్చిందనే విషయం పోలీసులకు చిక్కు ప్రశ్నలామారింది. ముమ్మరంగా తనిఖీలు వ్యాపారిపై దుండగులు కాల్పులకు తెగబడిన నేపథ్యం యంత్రాంగం అప్రమత్తమైంది. నగర డీఎస్పీ మురళీకృష్ణతోపాటు నెల్లూరు రూరల్, సీసీఎస్, ట్రాఫిక్ డీఎస్పీలు రాఘవరెడ్డి,బాల సుందరరావు, మల్లికార్జున నగరంలో ముమ్మరంగా తనిఖీలు చేపట్టారు. అనుమానాస్పద వ్యక్తులను అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. మహేంద్రసింగ్ శరీరంలో మూడు బుల్లెట్లు ఉన్నాయని వైద్యులు వెల్లడించారు. చిన్నబజారు పోలీసులు హత్యఘటనపై కేసు నమోదు చేశారు. వరుస సంఘటనల నేపథ్యంలో సిబ్బంది పనితీరుపై ఎస్పీ తీవ్ర అసహనం వ్యక్తం చేసినట్లు తెలిసింది. హత్యకు దారితీసిన పరిస్థితులను తెలుసుకునేందుకు పోలీసులు విభిన్న కోణాల్లో దర్యాప్తు చేపట్టారు. తెలిసినవారి పనే.. మహేంద్రసింగ్‌పై కాల్పులు జరిపిన వారు తెలిసివారే అయి ఉండవచ్చని పోలీసులు భావిస్తున్నారు. ఆర్టీసీ బస్టాండు నుంచి వచ్చిన దుండగులు తొలుత మహేంద్రసింగ్‌తో మాట్లాడుతూ రెండు రౌండ్లు కాల్పులు జరిపారు. మహేంద్రసింగ్ తప్పించుకునేందుకు ప్రయత్నించాడు. ఈ నేప«థ్యంలో మరో రెండు రౌండ్లు కాల్పులు జరిపినట్లు సమాచారం. -
అమెరికాలో మాజీ సైనికుడి కాల్పులు.. పోలీసు మృతి
ఫ్లోరెన్స్: సౌత్ కరోలినా రాష్ట్రం ఫ్లోరెన్స్ పట్టణంలో బుధవారం చోటుచేసుకున్న కాల్పుల ఘటన తీవ్ర కలకలం రేపింది. మాజీ సైనికాధికారి జరిపిన కాల్పుల్లో ఒక పోలీసు అధికారి చనిపోగా ఆరుగురు తీవ్రంగా గాయపడ్డారు. పట్టణంలోని వింటేజ్ ప్లేస్ ప్రాంతానికి చెందిన మాజీ సైనికుడు ఫ్రెడరిక్ హాప్కిన్స్(74)పై లైంగిక వేధింపుల ఆరోపణలున్నాయి. అందుకు సంబంధించిన వారెంట్ అందజేసేందుకు బుధవారం సాయంత్రం ఏడుగురు పోలీసు అధికారులు అతడి ఇంటికి వెళ్లారు. వారిని దూరం నుంచి చూసిన హాప్కిన్స్ తన తుపాకీతో విచక్షణారహితంగా కాల్పులు జరిపాడు. దీంతో ఏడుగురు పోలీసులూ తీవ్రంగా గాయపడ్డారు. అంతటితో ఆగకుండా ఇంట్లో ఉన్న చిన్నారులను బందీలుగా చేసుకున్నాడు. దీంతో రెండు గంటలపా టు తీవ్ర ఉత్కంఠ కొనసాగింది. పెద్ద సంఖ్యలో ఆ ప్రాంతాన్ని చుట్టుముట్టిన పోలీసులు హాప్కిన్స్పై కాల్పులు జరిపి అదుపులోకి తీసుకున్నారు. క్షతగాత్రులను ఆస్పత్రికి తరలించగా పోలీసు అధికారి టెరెన్స్ కరావే(52) అప్పటికే చనిపోయినట్లు వైద్యులు ధ్రువీకరించారు. -
అమెరికాలో సిక్కు డ్రైవర్ మృతి
న్యూయార్క్: అమెరికాలో భారత సంతతికి చెందిన ఓ సిక్కు ట్రక్ డ్రైవర్ మరణించాడు. ఈ నెల 12న ఒహయోలో జస్ప్రీత్ సింగ్(32) అనే ట్రక్కు డ్రైవర్‌పై బ్రోడరిక్ మలిక్ జోన్స్ రాబర్ట్స్(20) కాల్పులు జరిపాడు. తీవ్రంగా గాయపడిన జస్ప్రీత్.. ఆస్పత్రిలో చికిత్స పొందుతూ ఈ నెల 21న కన్నుమూశాడు. జస్ప్రీత్ ట్రక్‌లో ఉండగా దోపిడీకి ప్రయత్నించిన రాబర్ట్స్.. అతను ప్రతిఘటించడంతో కాల్పులకు తెగబడినట్లు పోలీసులు తెలిపారు. నిందితుడిపై హత్యా నేరం కింద అభియోగాలు నమోదు చేయనున్నారు. -
కక్షగట్టి కాల్పులు..
వాషింగ్టన్: అమెరికా మరోసారి తుపాకీ మోతకు ఉలిక్కిపడింది. 19 ఏళ్ల మాజీ విద్యార్థి తాను చదివిన పాఠశాలలోనే విచ్చలవిడిగా కాల్పులకు దిగి 17 మందిని పొట్టనబెట్టుకున్నాడు. ఓ భారతీయ విద్యార్థి సహా మరో 15 మందిని గాయపరిచాడు. ఫ్లోరిడా రాష్ట్రంలో పార్క్‌లాండ్ నగరంలోని మేజరీ స్టోన్‌మన్ డగ్లస్ హైస్కూల్లో బుధవారం ఈ దారుణం జరిగింది. నిందితుడు నికోలస్ క్రూజ్‌ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఈ ఏడాది అమెరికాలోని ఓ పాఠశాలలో కాల్పులు జరగడం ఇది 18వ సారి కావడం గమనార్హం. క్రమశిక్షణారాహిత్యానికి గతేడాది స్కూల్ నుంచి బహిష్కరణకు గురైన క్రూజ్ కక్షగట్టి మరీ ఈ ఘాతుకానికి ఒడిగట్టినట్లు తెలుస్తోంది. అతని సోషల్ మీడియా అకౌంట్లలో హింసను ప్రేరేపించే చిత్రాలున్నాయని దర్యాప్తు అధికారులు వెల్లడించారు. ఎఫ్‌బీఐ అధికారుల సాయంతో స్థానిక పోలీసులు విచారణను ముమ్మరం చేశారు. అలారం లాగి..అలజడి సృష్టించి..: గ్యాస్ ముసుగు, స్మోక్ గ్రెనేడ్లు ధరించి, ఏఆర్–15 తుపాకీని వెంట తెచ్చుకున్న క్రూజ్ ముందుగా ఫైర్ అలారంను లాగి పాఠశాలలో అలజడి సృష్టించాడు. భయంతో విద్యార్థులు, సిబ్బంది బయటకు పరుగులు పెడుతుండగా విచక్షణారహితంగా కాల్పులు జరిపాడు. దీంతో 12 మంది అక్కడికక్కడే చనిపోయారు. మృతుల్లో విద్యార్థులు ఎందరు ఉన్నారన్నది తెలియరాలేదు. ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న 15 మందిలో ముగ్గురి పరిస్థితి విషమంగా ఉందని అధికారులు తెలిపారు. ఆ స్కూల్లో ఇండో–అమెరికన్ విద్యార్థుల సంఖ్య ఎక్కువే అని తెలిసింది. షూటింగ్‌కు పాల్పడే ముందు క్రూజ్ తన సామాజిక మాధ్యమాల అకౌంట్లలో రెచ్చగొట్టే సందేశాలు అప్లోడ్ చేశాడని దర్యాప్తు అధికారులు వెల్లడించారు. అతని వద్ద చాలా తుపాకీ మేగజీన్లు కూడా ఉన్నాయని తెలిపారు. కాల్పులు ముగిసిన వెంటనే అతన్ని అదుపులోకి తీసుకుని చికిత్స కోసం ఆసుపత్రికి తరలించారు. తన మాజీ ప్రియురాలి కొత్త బాయ్‌ఫ్రెండ్‌తో గొడవకు దిగినందుకు క్రూజ్‌ను స్కూల్ నుంచి బహిష్కరించినట్లు మీడియాలో వార్తలొచ్చాయి. అభద్రంగా ఉన్నామని భావించొద్దు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ పాఠశాలలో కాల్పుల ఘటనపై విస్మయం వ్యక్తం చేశారు. బాధిత కుటుంబాలకు సంతాపం తెలిపిన ట్రంప్..పిల్లలు, ఉపాధ్యాయులెవరూ కూడా అమెరికా పాఠశాలలో అభద్రంగా ఉన్నామని భావించొద్దని అన్నారు. నిందితుడి మానసిక ఆరోగ్యంపై సందేహం వ్యక్తం చేశారు. ‘ఇది అమెరికాలో విషాదకర దినం. బాధితుల కోసం ఇండో–అమెరికన్లందరం ప్రార్థిస్తున్నాం’ అని కాల్పుల్లో గాయపడిన భారత విద్యార్థి తండ్రి స్నేహితుడు శేఖర్ రెడ్డి అన్నారు. 31 వేల జనాభా ఉన్న పార్క్లాండ్కు 2016లో అత్యంత సురక్షితమైన పట్టణంగా గుర్తింపు దక్కడం గమనార్హం. -
బెంగళూరు నగరంలో కాల్పుల మోత
దద్దరిల్లిన ఉద్యాననగరి {పత్యర్థిపై తూటాల వర్షం కురిపించిన ఓ వర్గం ఒకరి మృతి అదుపులోకి తీసుకుంటుండగా కత్తితో దాడి చేసిన నిందితుల హెడ్ కానిస్టేబుల్‌కు గాయాలు ఎదురు కాల్పులు జరిపిన పోలీసులు తూటాలు దూసుకెళ్లి ఇద్దరు నిందితులకు గాయాలు నిందితుల నుంచి దేశీయ తుపాకీ, తూటాలు, డ్రాగన్, బైకు, సెల్ఫోన్లు స్వాధీనం తుపాకీ కాల్పుల మోతతో ఉద్యాన నగరి దద్దరిల్లింది. ఈ శబ్ధాలతో ప్రజలు అరచేతిలో ప్రాణాలు పెట్టుకొని బిక్కుబిక్ముంటూ గడిపారు. మంగళవారం రాత్రి పొద్దుపోయిన తర్వాత ఓ వర్గానికి చెందిన వ్యకిత జరిపిన కాల్పుల్లో ప్రత్యర్థి వర్గం నాయకుడు హతమయ్యాడు. మరోవైపు కాల్పులకు తెగబడ్డ వర్గాన్ని అదుపులోకి తీసుకునే క్రమంలో పోలీసులు కాల్పులు జరపాల్సి వచ్చింది. ఈ ఘటనలో ఇద్దరు నిందితులు గాయపడ్డారు. ఇలా మంగళవారం రాత్రి నుంచి బుధవారం తెల్లవారుజాము మధ్య నగరంలో రెండు చోట్ల జరగిన కాల్పులతో నగరవాసులు భయభ్రాంతులకు గురయ్యారు. -సాక్షి, బెంగళూరు/బనశంకరి బెంగళూరు/బనశంకరి:బెంగళూరులో సంఘ విద్రోహులు మంగళవారం రాత్రి పొద్దుపోయిన తర్వాత జరిపిన కాల్పుల్లో ఒక వర్గం నాయకుడు హతమయ్యాడు. కాల్పులకు తెగబడ్డ వర్గాన్ని అదుపులోకి తీసుకునే క్రమంలో పోలీసులు కాల్పులు జరపాల్సి వచ్చింది. ఈ కాల్పుల్లో ఇద్దరు నిందితులు గాయపడ్డారు. ఇలా మంగళవారం రాత్రి నుంచి బుధవారం తెల్లవారుజాము మధ్య నగరంలో రెండు చోట్ల జరగిన కాల్పులతో నగరవాసులు భయభ్రాంతులకు గురయ్యారు. సంఘ విద్రోహచర్యలకు పాల్పడే హెగ్డేనగర్కు చెందిన పర్వేజ్ (45)కు అండదండలు అందించేందుకు స్థానికంగా ఉంటున్న ఇద్రీస్ ప్రతి నెల రూ.10 వేలు వసూలు చేసేవాడు. (సంఘవిద్రోహ పరిభాషలో ఇలా వసూలు చేసే సొమ్మును ‘హప్త’ అంటారు.) అయితే రెండు నెలల క్రితం ఇద్రీస్ హత్యకు గురైన తర్వాత అతని స్థానానికి వచ్చి షబ్బీర్ కూడా పర్వేజ్‌ను హప్తా కోరాడు. ఇందుకు పర్వేజ్ ఒప్పుకోలేదు. ఈ నేపథ్యంలోనే మూడు రోజుల ముందు తనకు రూ.5 లక్షలు ఇవ్వాలని షబ్బీర్ మరోమారు డిమాండ్ చేయగా పర్వేజ్ ససేమిరా అన్నాడు. దీంతో పర్వేజ్‌పై కక్ష పెంచుకున్న షబ్బీర్ సమయం కోసం వేచి చూశాడు. ఈ క్రమంలో రంజాన్ సందర్భంగా శివాజీనగర్‌లో జరగుతున్న ఇప్తార్‌కు పర్వేజ్ హాజరయ్యాడని తెలుసుకున్న షబ్బీర్ మంగళవారం రాత్రి మరో నలుగురు అనుచరులతో కలిసి మారణాయుదాలు, దేశీయ తుపాకులతో ఘటన స్థలానికి చేరుకున్నాడు. ఇఫ్తార్ అనంతరం ఓ టీ స్టాల్ వద్ద ఉన్న పర్వేజ్, అతని అనుచరులైన ఖాసీమ్, వాజీద్‌తో పిచ్చాపాటి మట్లాడుకుంటున్నాడు. అక్కడే ఉన్న షబ్బీర్ మరోసారి డబ్బులు డిమాండ్ చేయగా ఫర్వేజ్ అంగీకరించలేదు. దీంతో తన అనుచరులతో కలిసి పర్వేజ్‌పై కాల్పులు జరిపి పారిపోయారు. ఈ ఘటనలో పర్వేజ్ పొట్ట, తొడ భాగంలోకి తూటాలు దూసుకుపోయాయి. ఈ ఘటనలో ఖాసీమ్, వాజీద్‌లు కూడా తీవ్రంగా గాయపడ్డారు. క్షతగాత్రులను స్థానికులు బౌరింగ్ ఆసుపత్రికి చేర్చారు. అయితే పర్వేజ్ మార్గం మధ్యలోనే చనిపోగా ఖాసీమ్, వాజీద్‌లు ఐసీయూలో చికిత్స పొందుతున్నారు. నిందితులకూ తూటా దెబ్బలు సంఘటన వివరాలు తెలుసుకున్న పోలీసులు నగరంలో పలు చోట్ల నాకాబంది నిర్వహించి అనుమానం వచ్చిన ప్రతి వాహనాన్ని, వ్యక్తిని తనిఖీ చేయడం ప్రారంభించారు. ఈ క్రమంలో బుధవారం తెల్లవారుజాము 3 గంగటల సమయంలో తన అనుచరుడైన భర్కత్తో కలిసి వెలుతున్న షబ్బీర్.. హెచ్బీఆర్ లేఅవుట్ వద్ద గస్తీ నిర్వహిస్తున్న కే.జీ హళ్లి స్టేషన్ పోలీసులకు తారసపడ్డారు. తనిఖీలో భాగంగా వారిని ప్రశ్నించడానికి సిద్ధమైన హెడ్‌కానిస్టేబుల్ పద్మనాభ, కానిస్టేబుల్ శాజు ఆంథోనిలను నిందితులిద్దరూ తుపాకీతో బెదిరించారు. దీంతో పద్మనాభ... షబ్బీర్‌ను గట్టిగా పట్టుకోవడానికి ప్రయత్నించారు. ఈ క్రమంలో తన వద్ద ఉన్న డ్రాగర్‌తో షబ్బీర్ పద్మనాభ పై దాడికి పాల్పడ్డారు. అక్కడే ఉన్న సీఐ శ్రీనివాస్ అప్రమత్తమై షబ్బీర్, భర్కత్ కాళ్ల పై కాల్పులు జరిపారు. దీంతో నిందితులిద్దరూ సంఘటన స్థలంలోనే కుప్పకూలిపోయారు. వెంటనే సిబ్బంది హెడ్‌కానిస్టేబుల్ పద్మనాభతో పాటు నిందితులిద్దరినీ బౌరింగ్ ఆసుపత్రిలో చేర్పించారు. ముగ్గురూ ప్రస్తుతం కోలుకుంటున్నారు.అదనపు కమిషనర్ హరిశేఖరన్ సంఘటనా స్థలానికి చేరుకుని పరిస్థితిని సమీక్షించారు. ఆయన మాట్లాడుతూ పర్వేజ్ పై దాడికి పాల్పడిన ఐదు మందిలో ఇప్పటికే ఇద్దరు పోలీసుల అదుపులో ఉన్నారన్నారు. మిగిలిన ముగ్గురి ఆచూకీ తెలిసిందని, త్వరలో వారిని కూడా పట్టుకుంటామని తెలిపారు. ఇక నిందితుల నుంచి దేశీయ తుపాకి, తూటాలు, డ్రాగన్, బైకు, మూడు ముబైల్స్‌ను స్వాధీనం చేసుకున్నట్లు హరిశేఖరన్ పేర్కొన్నారు. ఇదిలా ఉండగా పర్వేజ్ పై దాడికి ముందు నిందితులు ఐదు మంది సిద్దాపురలో నివాసముంటున్న సినిమా డెరైక్టర్ మాహిన్ అనే వ్యక్తి ఇంట్లోకి చొరబడి బెదిరించారు. అనంతరం ఆడుగోడి వెళ్లి నూర్ అనే వ్యక్తి తలపై మరణాయుధంతో దాడిచేశారు. ఈ రెండు ఘటనలపై వేర్వేరు కేసులు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు. -
మానుకోటలో పేలిన తూటా
నకిలీ నక్సలైట్ల హల్చల్ దాడిని ప్రతిఘటించి, పోలీసులకు పట్టించినగొర్రెల కాపరులు బెదిరింపు కాల్స్‌తో ఆందోళన చెందుతున్న వ్యాపారులకు ఉపశమనం చాకచక్యంగా వ్యవహరించిన పోలీసులు మహబూబాబాద్/మహబూబాబాద్‌టౌన్ : మానుకోట పట్టణంలో గురువారం రాత్రి నకిలీ నక్సలైట్ల తుపాకీ కాల్పులు కలకలం సృష్టించారుు. అమాయకులైన గొర్రెల కాపరులపై తమ ప్రతాపం చూపించబోగా.. చివరికి వారు ప్రతిఘటించడంతో పోలీసులకు చిక్కారు. కాల్పుల ఘటన సమాచారం దావానలంలా పట్టణంలో వ్యాపించడంతో ప్రజలు తీవ్ర భయాందోళనకు గురయ్యారు. గొర్రెల కాపరుల కథనం ప్రకారం.. మహబూబ్‌నగర్ జిల్లా నారాయణపేట మండలం అప్పిరెడ్డిపల్లి, దామర్లగిద్ద మండలం మద్దర్లబీడు గ్రామానికి చెందిన 20 మంది యాదవులు సుమారు 2 వేల గొర్రెలను మేపుతూ గురువారం రాత్రి మానుకోట శివారు నర్సంపేట రోడ్డులోని ఏటిగడ్డతండ శివారు క్రషర్ మిల్లు సమీపానికి చేరుకున్నారు. అక్కడే వంట చేసుకున్నారు. వారున్న సమీప ప్రాంతంలో వారికి ప్లాస్టిక్ కవర్లు, వాటర్ బాటిళ్లు, ఇతర సామగ్రి కనిపించారుు. కొన్ని గంటల తర్వాత గుర్తుతెలియని ఇద్దరు వ్యక్తులు గొర్రెల మందకు వచ్చి ఆ జీవాల యజమాని ఎవరు ? ఎక్కడ నుంచి వచ్చారని బెదిరించారు. దీంతో ఆ గొర్రెల కాపరులు వచ్చినవారు దొంగలు అనుకుని ఒకరిపై చేయి జేసుకున్నారు. దీంతో దుండగుల్లో ఒకడు వెనక్కి వెళ్లి మరో నలుగురిని మంద దగ్గరికి తీసుకొచ్చాడు. వారంతా కలిసి ఆ గొర్రెల కాపరులపై దాడికి పాల్పడ్డారు. అకారణంగా చితకబాదడంతో గొర్రెల కాపరులంతా అనవసరంగా కొడుతున్నారంటూ ఎదురు తిరిగి వారిపై చేయిజేసుకున్నారు. పరిస్థితిని గమనించిన స్థానికులు పోలీసులకు సమాచారమిచ్చారు. ఆ ఆరుగురు సభ్యుల్లోని ఇద్దరు తమ వద్ద ఉన్న తపంచాలతో నేలపై కాల్పులు జరపగా ఒక తపంచాకు సంబంధించిన తూటా పేలగా మరో తపంచా తూటా పేలలేదు. అదే సమయంలో ఎస్సై ప్రసాదరావుకు సమాచారమివ్వడంతో ఆయన ట్రాఫిక్ ఎస్సై మధూకర్‌కు చెప్పారు. దీంతో ఆయన ఏఆర్ కానిస్టేబుల్ సంపత్, హోంగార్డు సంపత్తో కలిసి అక్కడికి చేరుకున్నారు. పోలీసుల రాకను గమనించిన ఆరుగురిలో నలుగురు పారిపోగా ఇద్దరిని మాత్రం గొర్రెల కాపరులు పట్టుకోగలిగారు. వారి దగ్గరే రెండు తపంచాలు లభించాయి. అదే సమయంలో సాలార్‌తండా వద్ద నాకాబందీ నిర్వహిస్తున్న సీఐ నందిరామ్‌నాయక్ పారిపోతున్న మరొకరిని పట్టుకున్నారు. అతడి వద్ద తపంచా, తూటాలను స్వాధీనం చేసుకున్నారు. అనంతరం పోలీసులు వారిని విచారించగా వారు నకిలీ నక్సలైట్లుగా తేలింది. గతంలో జిల్లాలో కార్యకలాపాలు నిర్వహించి కనుమరుగైపోరుున సీపీయూఎస్ఐ పేరిట వారు కొన్ని నెలలుగా దందాలకు పాల్పడతున్నారని వెల్లడైంది. సంఘటన స్థలాన్ని రూరల్ ఎస్పీ అంబర్ కిషోర్ ఝా, మానుకోట డీఎస్పీ నాగరాజు పరిశీలించారు. గొర్రెల కాపరులు, స్థానికులతో మాట్లాడి వివరాలు సేకరించారు. నకిలీ నక్సలైట్ల చర్యలతో పట్టణ ప్రజలు భయాందోళనకు గురయ్యారు. కాగా గత కొద్ది రోజులుగా నక్సలైట్ల పేరుతో వస్తున్న బెదిరింపు కాల్స్‌తో భయపడుతున్న వ్యాపారులకు మాత్రం ఉపశమనం లభించినట్లయింది.